సవాళ్ల మధ్య హైదరాబాద్ 'ఐటీ' | Searching for skills in line with new technologies | Sakshi
Sakshi News home page

సవాళ్ల మధ్య హైదరాబాద్ 'ఐటీ'

Published Fri, May 2 2025 4:42 AM | Last Updated on Fri, May 2 2025 4:42 AM

Searching for skills in line with new technologies

మాంద్యం పరిస్థితులు,స్థానిక ప్రతికూలతలతోఒత్తిడిలో కంపెనీలు

కొత్త టెక్నాలజీలకు అనుగుణంగానైపుణ్యం కోసం వెతుకులాట 

ఉద్యోగులు, కంపెనీల ఉత్పాదకతపై మౌలిక వసతుల లేమి ప్రభావం 

ప్రభుత్వ ప్రోత్సాహకాలు, పెట్టుబడులఆకర్షణ, విధానాలపై అస్పష్టత 

2023-24లోభారీగా తగ్గిన ఐటీ ఎగుమతులవృద్ధిరేటు  

2024-25లో తిరిగి కోలుకుంటుందని అంటున్న పరిశ్రమ వర్గాలు 

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం పరిస్థితులు, స్థానిక విధానాలు కలిసి తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ) పరిశ్రమకు సవాళ్లు విసురుతున్నాయి. అమెరికా, యూర‹ప్‌ మార్కెట్లలో ఐటీ సేవలకు డిమాండ్‌ తగ్గడం హైదరాబాద్‌లోని ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆర్థిక మందగమనం వల్ల ఐటీ సేవల వినియోగదారులు (క్లయింట్లు) ఖర్చును తగ్గించుకుంటూ, కొత్త ప్రాజెక్టులను వాయిదా వేసుకుంటున్నారు. దీంతో చిన్న, మధ్యస్థాయి ఐటీ కంపెనీలు ప్రాజెక్టులు లేక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.  

నైపుణ్యం, మౌలిక వసతుల లేమి 
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌ చెయిన్‌ వంటి కొత్త టెక్నాలజీల మూలంగా ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులకు డిమాండ్‌ పెరుగుతోంది. అయితే, స్థానికంగా నిపుణుల కొరత కంపెనీలకు సవాలుగా మారింది. బెంగళూరు, పుణె, చెన్నై వంటి ఇతర ఐటీ హబ్‌లు నైపుణ్యంగల మానవ వనరులు, మెరుగైన మౌలిక వసతులు, ఆకర్షణీయ ప్రభుత్వ విధానాలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. దీంతో హైదరాబాద్‌ నగరం తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది. 

టాలెంట్‌ పూల్‌కు గండి
ఐటీ ఉద్యోగులు అధిక వేతనాలు, మెరుగైన పని వాతావరణం, కెరీర్‌లో వృద్ధిని కోరుకుంటున్నారు. కానీ, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో కొన్ని కంపెనీలు వేతనాలు పెంచకుండా ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్నాయి. దీంతో మంచి నిపుణులుఇతర నగరాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఐటీ హబ్‌లు ఉన్న హైటెక్‌ సిటీ, గచి్చ»ౌలి, మాదాపూర్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ రద్దీ, విద్యుత్‌ సరఫరాలో సమస్యలు కూడా ఉద్యోగులు, కంపెనీల ఉత్పాదకతను ప్రభావితం చేస్తున్నాయి. 

ఐటీ రంగంలో చిన్న, మధ్య తరహా కంపెనీలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పాలసీలు అమలు కావడంలేదనే అసంతృప్తి కూడా పరిశ్రమ వర్గాల్లో కనిపిస్తోంది. పన్ను రాయితీలు, సబ్సిడీలపై ప్రభుత్వంనుంచి స్పష్టత కావాలనికోరుతున్నారు.  

ఐటీ ఎగుమతుల్లో మందగమనం 
ఐటీ ఎగుమతుల్లో 2023–24లో జాతీయ వృద్ధిరేటు 3.3 శాతం ఉండగా, తెలంగాణలో 11.28 శాతం ఉంది. 2024 జూన్‌ నాటికి రాష్ట్రం నుంచి ఐటీ ఎగుమతులు రూ.2.69 లక్షల కోట్లకు చేరినట్లు సమాచారం. అయితే, 2022–23లో ఐటీ ఎగుమతుల్లో రూ.57,706 కోట్ల వృద్ధి (31.44 శాతం) నమోదు కాగా, 2023–24లో రూ.26,948 కోట్ల మేర మాత్రమే వృద్ధి (11.28 శాతం) నమోదైంది. 

2022–23తో పోలిస్తే కొత్త ఉద్యోగాల సృష్టిలోనూ 2023–24లో తగ్గుదల నమోదైనట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో రేవంత్‌ సర్కారు ఐటీ హబ్‌లలో మౌలిక వసతుల కల్పన, నైపుణ్య శిక్షణ, విదేశీ సంస్థలతో నైపుణ్య శిక్షణ భాగస్వామ్య ఒప్పందాలపై దృష్టి పెట్టింది. ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, డేటా సైన్స్‌ టెక్నాలజీలను ప్రోత్సహించడంతో పాటు గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల ఏర్పాటును రెట్టింపు చేయాలని భావిస్తోంది. వచ్చే మూడేళ్లలో ఐటీ ఎగుమతుల్లో వృద్ధిని 25 శాతానికి పెంచేలా రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. 

స్థిరత్వం దిశగా.. 
2023–24లో చిన్న సంస్థల ప్రాజెక్టుల్లో ఆలస్యం, ఖర్చు తగ్గింపుతో మందగమనం కనిపించినా, ఇప్పు డు అన్నిరకాల కంపెనీలు ఏఐ, క్లౌడ్, సైబర్‌ సెక్యూరిటీ, డేటా ఎనలిటిక్స్‌పై వ్యూహాత్మక పెట్టుబడుల వైపు మళ్లాయి. నిపుణులకు డిమాండ్‌ పెరుగుతోంది. హైదరాబాద్‌ ఐటీ రంగం ప్రస్తుతం కోలుకునే దశ నుంచి దీర్ఘకాలిక స్థిరత్వం వైపు సాగుతోంది. – రాజశేఖర్‌ పాపోలు, మేనేజింగ్‌ డైరెక్టర్, బృహస్పతి టెక్నాలజీస్‌ లిమిటెడ్‌  

చిన్న కంపెనీల్లో సంక్షోభం తీవ్రం 
రెండేళ్లుగా మాంద్యం పరిస్థితులు కొనసాగుతుండటంతో కంపెనీలు నిర్ణయాల్లో వేగం తగ్గించాయి. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న కంపెనీలను ప్రోత్సహించడం లేదు. పెద్ద కంపెనీలతో పోటీపడి ప్రాజెక్టులను సాధించినా 18 శాతం జీఎస్టీ వల్ల చిన్న కంపెనీలపై పెనుభారం పడుతోంది. ఉద్యోగులను నిలుపుకోవడమే పెను సవాలుగా మారుతోంది.     – శాతంరాజు శ్రీవర్ధన్, సీఈఓ, ఐపాస్‌ సొల్యూషన్స్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement