Information Technology
-
పాలనలోనూ కృత్రిమ మేధస్సు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, ప్రజాసేవల్లో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– ఏఐ)ను మేళవించి ప్రజలకు త్వరితగతిన, సమర్థవంగా సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సమాచార సాంకేతిక (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగంలో వేగంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంలో ప్రభుత్వ శాఖలు వెనుకంజలో ఉన్నాయనే విమర్శల నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.వివిధ ప్రభుత్వ శాఖల్లో కృత్రిమ మేధ వినియోగానికి ఉన్న అవకాశాలపై కసరత్తు చేస్తోంది. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగంతో కూడిన అప్లికేషన్లు (యాప్‌లు) ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ బాధ్యతను ఐటీ శాఖకు అనుబంధంగా ఉన్న ‘ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్’కు అప్పగించింది. 21 ప్రభుత్వ శాఖలతో వర్క్‌షాప్ సాంకేతికత వినియోగం ద్వారా పేదరిక నిర్మూలనకు అవసరమైన విధానాల రూపకల్పనలో పేరొందిన ‘జేపీఏఎల్’(జమీల్ పావర్టీ యాక్షన్ లాబ్) రాష్ట్ర పాలనలో ఏఐ వినియోగం విషయంలో ప్రభుత్వంతో జట్టుకట్టింది. ఇటీవల 21 ప్రభుత్వ శాఖలకు చెందిన ‘ఏఐ నోడల్ ఆఫీసర్ల’తో వర్క్‌షాప్ నిర్వహించింది. ఆయా ప్రభుత్వ విభాగాల పరిధిలోని సంక్లిష్ట అంశాలకు ఏఐ ద్వారా ఏ తరహాలో పరిష్కారాలు సాధ్యమనే కోణంలో లోతుగా మదింపు చేశారు. అంతర్జాతీయంగా పాలన, ప్రజాసేవలో ఏఐ ప్రభావం, వినియోగం, వివిధ దేశాలు, రాష్ట్రాలు ఏఐని వినియోగిస్తున్న తీరుపై ఈ వర్క్‌షాప్‌లో నోడల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా.. వివిధ ప్రభుత్వ శాఖల అవసరాలకు తగిన ఏఐ ఆధారిత యాప్‌లు, ఏ ప్రభుత్వ విభాగానికి ఏ తరహా యాప్‌లు అవసరమనే కోణంలో ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ కసరత్తు చేస్తోంది. ఆయా ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏఐ పాలనలో ఏఐ వినియోగంపై అవగాహన కల్పించి, నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ శాఖల్లో దశలవారీగా ఏఐ సాంకేతికత వినియోగాన్ని పెంచేలా ఒక రోడ్‌మ్యాప్ రూపొందించే అంశంపై జేపీఏఎల్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ కలసి పనిచేస్తున్నాయి. ఇప్పటికే పలు యాప్‌లు అందుబాటులోకి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ విజయోత్సవాల్లో భాగంగా రైతులు, యువత, మహిళలు లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 3 ఐటీ, ఏఐ ఆధారిత అప్లికేషన్లను విడుదల చేసింది. మరో అప్లికేషన్‌ను ప్రభుత్వమే వినియోగిస్తోంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు, అగ్రికల్చర్ డేటా ఎక్సే్ఛంజీ సంయుక్తంగా ఒక అప్లికేషన్ రూపొందించాయి. వేగంగా డేటా మారి్పడి, వ్యవసాయ ఆవిష్కరణలను ఈ యాప్ వేగవంతం చేస్తుంది. రైతులు రూ.లక్షలోపు రుణాలను గతంలో మాదిరిగా వారాల తరబడి కాకుండా రెండు రోజుల వ్యవధిలోనే పొందడం సాధ్యమవుతుంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ‘ది మిత్ర’పేరిట ఏఐ ఆధారిత యాప్‌ను రూపొందించింది. పిల్లల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని ప్రాథమిక స్థాయిలోనే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పసిగట్టేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. మాదక ద్రవ్య రహిత వాతావరణంలో పిల్లలు పెరిగేలా ఈ యాప్ తోడ్పడుతుంది. గ్రామీణ మహిళల్లో డిజిటల్ అక్షరాస్యత పెంపు కోసం ‘సన్మతి’యాప్ రూపొందించారు. ఏఐ వినియోగంపై సాధారణ పౌరుల్లో అవగాహన పెంచడంలోనూ ఈ యాప్ సాయపడుతుంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, పథకం అమలు కోసం రూపొందించిన ‘ఇందిరమ్మ యాప్’తో ప్రస్తుతం లబి్ధదారుల పరిశీలన జరుగుతోంది. భవిష్యత్తులో ఈ యాప్ ఇందిరమ్మ ఇళ్ల పథకం అమల్లో కీలకంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నాం జేపీఏఎల్ సహకారంతో ప్రభుత్వ శాఖల్లో ఏఐ వినియోగంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో అనేక ప్రతిపాదనలు అందాయి. ఏయే విభాగాల్లో ఏయే అంశాల్లో ఏఐ వినియోగం సాధ్యమవుతుందో పరిశీలిస్తున్నాం. 21 ప్రభుత్వ శాఖల నుంచి ప్రతిపాదనలు అందినా తొలిదశలో ఐదు శాఖలను ఎంపిక చేసి ఏఐ ఆధారిత అప్లికేషన్లు తయారు చేయాలని భావిస్తున్నాం. త్వరలో సంబంధిత శాఖల ముఖ్య కార్యదర్శులతో ఈ అంశంపై ప్రత్యేక సమావేశం జరుగుతుంది. – రమాదేవి లంకా, డైరెక్టర్, ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ -
టెకీ.. ఆరోగ్యం రిస్కీ..
ఎండ కన్నెరుగని శరీరాలు ఎండ్లెస్ సమస్యల చిరునామాలుగా మారుతున్నాయి. ఆరు అంకెల జీతాలు అందుకునే జీవితాలు అనారోగ్యాలకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులపై ఆందోళన పెరుగుతోంది. దీనికి పని ఒత్తిడి కారణం ఒకటైతే.. హైబ్రిడ్, వర్క్ ఫ్రమ్ హోం సైతం మరో కారణంగా పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఆదోళన నేపథ్యంలో పలు కంపెనీలు.. కార్యాలయ ఆవరణల్లో మార్పులకు కారణమవుతున్నాయి. నగరంలో దాదాపు తొమ్మిది లక్షల మంది పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారు. వీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడిపించే చోదకశక్తిగా మారినప్పటికీ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోలేకపోతున్నారు. తద్వారా రానున్న సంవత్సరాల్లో 30 ఏళ్లు 40 ఏళ్ల వయస్సు ఉద్యోగుల్లో నాన్–కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సిడి)లో భారీ పెరుగుదల కనిపించనుంది. నగరానికి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్) పరిశోధకులు మాదాపూర్‌లోని హైటెక్ సిటీలోని ఐటీ సెక్టార్లో ఇటీవల వర్క్‌ప్లేస్ వెల్నెస్ స్టడీ వెల్లడించిన విషయం ఇది. ఈ అధ్యయనం న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురితమైంది. అంతర్గత అధ్యయనాల్లోనూ.. ఇదే విధంగా పలు సంస్థలు నిర్వహిస్తున్న అంతర్గత అధ్యయనాల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తున్నాయి. ఎస్ఓఐ హెల్త్‌కేర్ అనే ఒక వెల్నెస్ సంస్థ జరిపిన అధ్యయనంలో అత్యధికంగా టెక్ ఉద్యోగులు మెడనొప్పి, హైపర్ టెన్షన్, లోయర్ బ్యాక్ పెయిన్, సరై్వకల్ స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారని తేల్చింది. అలాగే కార్పల్ టన్నెల్ సిండ్రోమ్.. అనే చేతులకు సంబంధించిన సమస్యతో, లోయర్ బ్యాక్‌కి కాళ్లకు కలిపి నొప్పులు అందించే సాక్రోలియక్ జాయింట్ డిస్ఫంక్షన్తో పలువురు ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేసింది. టెక్నోపార్క్ అంతర్గతంగా చేయించుకున్న అధ్యయనం ఇది. ఫలితం అంతంతే.. గత ఐదు సంవత్సరాల్లో, చురుకైన జీవితం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనాన్ని ప్రోత్సహించడంలో అనేక స్వచ్ఛంద సంస్థలు, కంపెనీల హెచ్ఆర్ విభాగాలతో కలిసి పాలుపంచుకుంటున్నాయి. అయినప్పటికీ కరోనా కారణంగా చాలా మంది ఉద్యోగులు మరింత నిశ్చల జీవనశైలికి అలవాటు పడ్డారని ఐటీ రంగ నిపుణులు అంటున్నారు. ‘చురుకైన జీవనశైలిని అలవర్చుకునే విషయంలో కొన్ని సంవత్సరాలుగా సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. జిమ్‌లో వర్కవుట్ చేయడం, రన్నింగ్, యోగా సెషన్లు, నడకలను ప్రోత్సహిస్తూ, ఆరోగ్యకరమైన జీవనంపై అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నాం. అయితే, ఇంకా చాలా పనులు చేయాల్సి ఉంది’ అని హైదరాబాద్ రన్నర్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేష్ వెచ్చా చెబుతున్నారు.ఒత్తిడి ఫుల్.. శ్రమ నిల్.. నగర ఐటీ రంగంలో నిమగ్నమైన ఉద్యోగుల్లో ఎక్కువ మంది నిశ్చల జీవనశైలి కావడంతో శారీరక శ్రమ తక్కువ. మరోవైపు తీవ్ర పని ఒత్తిడి. ఈ కారణంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం, పక్షవాతం, దీర్ఘకాలిక కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే 26 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసు్కల్లో మెటబాలిక్ సిండ్రోమ్ (ఎంఇటీఎస్)కు అంతిమంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్‌కు దారితీసే అవకాశం ఉందని అధ్యయనం హెచ్చరించింది. మగవారిలో 90 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ, మహిళల్లో 80 సెం.మీ లేదా అంతకంటే ఎక్కువ నడుము చుట్టుకొలత, ట్రైగ్లిజరైడ్స్ (టీజీ) స్థాయిలు 150 మి.గ్రా/డీఎల్ లేదా అంతకంటే ఎక్కువ, హై డెన్సిటీ లైపోప్రొటీన్ స్థాయి వంటివి ప్రమాద సంకేతాలుగా హెచ్చరించింది. ఆ అలవాట్లతో చేటు.. రోజుకు సగటున ఎనిమిది గంటలపైనే కూర్చుని ఉంటున్నారు. ఇదే కాకుండా తరచూ బయట, రెస్టారెంట్స్‌లో తినడం, వేళలు పాటించకపోవడం, తాజా పండ్లు, కూరగాయల వినియోగం స్వల్పంగా ఉండడం, పని ఒత్తిడితో తరచూ భోజనాన్ని మానేయడం, ఎయిర్ కండిషన్డ్ గదుల్లో ఉండడం.. వంటివి హానికరంగా మారుతున్నాయి. మొత్తం ఐటి ఉద్యోగుల్లో 20శాతం మంది మాత్రమే వారానికి 150 నిమిషాల పాటు శారీరక శ్రమ చేస్తున్నారు. మరోవైపు వర్చువల్ వర్క్ వారి పాలిట హానికరంగానే పరిణమిస్తోంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మానసిక, శారీరక ఆరోగ్యానికి సమస్య తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.వాటిలో కొన్ని.. 👉వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా సమస్యలు వస్తున్నప్పటికీ చాలా మంది దాన్నే ఎంచుకున్నారని ఈ పరిస్థితుల్లో పలు సంస్థలు ఉద్యోగిని బట్టి ఉద్యోగాన్ని, వర్క్‌ప్లేస్‌ని డిజైన్ చేసే ఎర్గోనామిక్స్‌ను పరిచయం చేస్తున్నాయి. 👉 ప్రతి 10 నిమిషాలకూ ఒకసారి కళ్లు బ్లింక్ చేయాలి లేదా సిస్టమ్ నుంచి బ్రేక్ తీసుకోవాలని టీసీఎస్ నోటిఫికేషన్స్ ఇస్తోంది. 👉 టెక్నోపార్క్ కంపెనీ.. తమ ప్రాంగణంలో వాక్ వే, యోగా సెంటర్స్.. వంటివి ఏర్పాటు చేసింది. అలాగే ఓపెన్ జిమ్, జాగింగ్ ట్రాక్, ఫుట్ బాల్ టర్ఫ్ వంటివి ప్లాన్ చేస్తోంది. 👉 కాలుష్యరహిత స్మార్ట్ బైక్స్‌ను ఇన్ఫోపార్క్ అందిస్తోంది. అలాగే వాటర్ ఫ్రంట్ వాక్ వే, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్ సైతం ప్లాన్ చేస్తోంది. 👉 జుంబా క్లాసెస్ నిర్వహిస్తున్న సైబర్ పార్క్.. త్వరలో ఫుట్ బాల్ టర్ఫ్ ఏర్పాటు చేయనుంది. -
ఐటీలో మేటి..
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో శరవేగంగా దూసుకుపోతోంది. ఐటీ ఉత్పత్తుల ఎగుమతుల్లో ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది రూ.57,258 కోట్లతో మొదలైన ఎగుమతులు.. 2023 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు ఎగబాకాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 30 ఏళ్లలో నమోదైన ఐటీ ఎగుమతుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. 2022–23లో దేశంలో ఐటీ ఎగుమతులు 9.36 శాతం వృద్ధి చెందగా.అదే ఏడాది తెలంగాణలో 31.44 శాతం పెరిగాయి. రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్ల కాలంలో (2014–23) రూ.11.85 లక్షల కోట్ల ఎగుమతులు సాధించగా.. 54.47 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. 5,82,319 మందికి ఉద్యోగ అవకాశాలు పెరిగాయి..: తెలంగాణ ఏర్పడక ముందు దేశవ్యాప్తంగా ఐటీలో 32.90 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83 శాతం. అంటే 3,23,396 ఉద్యోగులున్నారు. గత తొమ్మిదేళ్లలో దేశవ్యాప్తంగా కొత్తగా 21.10 లక్షల మంది ఉద్యోగులు చేరగా.. రాష్ట్రంలోనే కొత్తగా 5,82,319 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. బ్రాండ్ హైదరాబాద్!ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరులో ఒకదానితో ఒకటి పోటీపడుతుంటాయి. గతేడాది ఉద్యోగ కల్పనలో భాగ్యనగరం గార్డెన్ సిటీ బెంగళూరుని దాటేసింది. కొత్తగా దేశంలో 4.50 లక్షల ఉద్యోగాలు రాగా.. హైదరాబాద్‌లో 1.50 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయి. అదే బెంగళూరులో 1.46 లక్షల జాబ్స్ సృష్టించినట్లు నాస్కామ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక ఆఫీసు స్పేస్ వినియోగంలోనూ హైదరాబాద్ 2022 ఏప్రిల్–సెపె్టంబర్ మధ్యకాలంలో బెంగళూరును అధిగమించి ప్రథమ స్థానంలో నిలిచింది.ప్రపంచంలోనే ఐటీ దిగ్గజ కంపెనీలైన యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో నెలకొల్పాయి. ఇక వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ రంగాలకు హైదరాబాద్ చిరునామాగా మారింది. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెరి్నంగ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, డ్రోన్ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీని ప్రోత్సహించేందుకు గత ప్రభుత్వం అనేక నూతన పాలసీలకు రూపకల్పన చేసింది. ఐటీ రంగంలో ఆవిష్కరణలు, వాణిజ్యం ప్రోత్సహించే లక్ష్యంతో 2015లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ విజయం సాధించడంతో, మహిళల కోసం ప్రత్యేకంగా ‘వి హబ్’ఇంక్యుబేటర్‌ను ఏర్పాటు చేసింది.ద్వితీయ శ్రేణి పట్టణాలకూ ఐటీ.. జిల్లాల్లో ఐటీ టవర్లురాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధి హైదరాబాద్ పశ్చిమ ప్రాంతానికే పరిమితం కావడంతో నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించేలా గ్రిడ్ పాలసీని అమల్లోకి తెచ్చింది. ఈ పాలసీతో ఉప్పల్, పోచారం, కండ్లకోయ, శంషాబాద్ ప్రాంతాల్లోనూ కొత్త ఐటీ టవర్లు కార్యకలాపాలు ప్రారంభించాయి. మరోవైపు ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ యువతకు స్థానికంగానే ఐటీ ఉద్యోగ అవకాశాలు కలి్పంచాలనే లక్ష్యంగా గత ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లోనే ఐటీ టవర్లను నిర్మించింది.వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఐటీ టవర్లలో పదుల సంఖ్యలో ఐటీ సంస్థలు, స్టార్టప్‌లు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. 2019లో వరంగల్‌లో తొలి ఐటీ టవర్ ప్రారంభం కాగా.. ఇందులోని టెక్ మహీంద్రా, సైయంట్, క్వాడ్రంట్ వంటి 10 కంపెనీల్లో 2,500 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆరు నెలల క్రితం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ రంగం పురోగతి, ప్రోత్సాహానికి సంబంధించి ఇప్పటివరకు నిర్దిష్ట ప్రణాళికలేవీ ప్రకటించలేదు. రాష్ట్రంలో ఐటీ రంగం వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి విధానాలను ప్రకటిస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. -
లోకేశ్ ఐటీ.. రియల్ లూటీ
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో మాటల మరాఠి చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ పాలనను ప్రజలు ఛీకొట్టారు. అరచేతిలో స్వర్గం చూపిస్తే.. జనం తమ ఓటుతో అసలు వాస్తవం చూపించారు. మన మందళగిరి చినబాబు అయితే ఏకంగా ఐటీ పేరుతో మంగళగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తే.. గోబెల్స్‌కు రాజగురువు రామోజీ మాత్రం మంగళగిరిని ఏకంగా మాదాపూర్‌లా మార్చేయడానికి మా మాలోకం కష్టపడ్డాడని జాకీలతో పైకెత్తడానికి తెగ ఆరాటపడుతున్నారు. ‘మంగళగిరి ఐటీపై జగన్ వేటు’అంటూ ఈనాడులో విషపు రాతలు రాశారు. చంద్రబాబు హయాంలో మంగళగిరి సింగపూర్‌ను తలదన్నేలా బహుళ అంతస్తుల భవనాల ఐటీ కంపెనీలతో కళకళలాడేదట. కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు ఆకాశహర్మ్యాలతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌ను తలపించేదట. యువత ఆనందంతో ఉద్యోగాలు చేసుకునేవారట. జగన్ వచ్చాక ఇవన్నీ మాయమయ్యాయట. ఇదీ అసలు నిజం.. ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అంటూ చంద్రబాబు పుత్రరత్నం ఇక్కడ ఐటీ మంత్రిగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారు. ఐటీ పార్కుల పేరుతో బిల్డింగ్లు నిర్మించేసి.. ఐటీ కంపెనీలు రాకపోతే ఖాళీగా ఉన్న స్థలానికి ప్రభుత్వమే అద్దె చెల్లించేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కుల పేరుతో ప్రత్యేక పాలసీ రూపొందించారు. ఈ పాలసీ ముసుగులో బాబు అనుయాయులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భవనాలు నిర్మించి భారీ ఎత్తున ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఈ విధంగా నిరుపయోగంగా ఉన్న భవనాలకు భారీగా అద్దెను చెల్లించాల్సి వస్తుండటంతో ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. నిజంగా మంగళగిరిలో ఐటీ కంపెనీలు వచ్చి ఉంటే ఆ కంపెనీల పేర్లు రాయొచ్చు కదా రామోజీ..? ఒక్క కంపెనీ పేరు రాసే ధైర్యం లేదు. ఐటీ, ఎల్రక్టానిక్స్ రంగాల్లో మూడు లక్షల ఉద్యోగాలంటూ లోకేశ్ ప్రచారంలోని డొల్లతనం 2019 జనవరిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లోనే బయట పడింది. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 2018 అక్టోబర్ నాటికి కేవలం 8,768 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 47,908 మందికి ఐటీ రంగంలో ఉపాధి కల్పించినా అవేవీ మీకు పట్టవా రామోజీ? -
Nitish Rajput: వీడియో పెట్టు కోట్లు కొట్టు
వీడియోలు చేస్తే ఎంత వస్తుంది? యూట్యూబ్‌లో పెడితే ఎంత వస్తుంది? ఎంత టాలెంట్ ఉంటే అంత వస్తుంది. నితిష్ రాజ్‌పుట్‌కు నెలకు 25 లక్షలు సంవత్సరానికి ఎంత లేదన్నా 3 కోట్లు వస్తాయి. ‘నాలెడ్జ్ ఈజ్ పవర్’ అన్నారు. సామాజిక అంశాల పై విస్తృత సమాచారం అందిస్తూ అతడు చేసే వీడియోల వల్లే ఈ ఆదాయం. నితిష్ సక్సెస్ స్టోరీ. 2022లో మన దేశంలో పాన్‌మసాలా వ్యాపార లావాదేవీల మొత్తం ఎంతో తెలుసా? 43,410 కోట్లు. ఊహకు అందని భారీ వ్యాపారం. అందుకే పాన్‌మసాలా సంస్థలు తమ బ్రాండ్ పేరు జనం నాలికల మీద తద్వారా వారి పొగాకు ఉత్పత్తులు జనాల నోళ్ల లోపలకు వెళ్లాలంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలతో ఎలా యాడ్స్ చేయిస్తాయో నితిష్ రాజ్పుట్ తన 30 నిమిషాల వీడియోలో వివరిస్తాడు. ఎలాగైతే ఆల్కహాల్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రచారం కోసం మంచి నీళ్లు, మ్యూజిక్ సీడీలను తమ బ్రాండ్‌తో యాడ్స్ చేస్తాయో... పాన్ మసాలా కంపెనీలు కూడా అదే దారిలో సినిమా స్టార్స్‌ను పెట్టి లాఘవంగా ‘ఇలాచీ’, ‘గులాబ్’ అంటూ దొంగ యాడ్స్ చేస్తాయని వివరిస్తాడు. అమ్మేది మాత్రం పొగాకు ఉత్పత్తులనే అని తెలుపుతాడు. అంతేకాదు పొగాకు ఉత్పత్తుల్లో నేరుగా ప్రభుత్వం ఎలా భాగస్వామ్యం అయి ఉందో కూడా చెప్తాడు. ఇంత సవివరంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపుగా రాయదు. అందుకే నితిష్ రాజ్పుట్ వీడియోలకు అంత డిమాండ్. అన్ని వైపుల సమాచారం నితిష్ రాజ్పుట్ 2020లో తన పేరు మీద ‘నితిష్ రాజ్‌పూట్ యూట్యూబ్ చానెల్’ను మొదలుపెట్టాడు. అందులో తనే మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడతాడు? ఒరిస్సాలో ట్రైన్ యాక్సిడెంట్‌కు కారణాలేమిటి? మణిపూర్‌లో ఏం జరుగుతోంది? ఖలిస్తాన్ ఉద్యమంలో వాస్తవం ఎంత? తాలిబన్లంటే ఎవరు? క్రెడిట్ కార్డ్స్‌లో మోసం ఎలా జరుగుతుంది... ఇలాంటి అంశాలతో వీడియోలు చేస్తాడు. అయితే ఇవి పైపైన చేసే వీడియోలు కాదు. దాదాపు పరిశోధనాత్మక జర్నలిజం స్థాయిలో ఉంటాయి. తీసుకున్న అంశంలో ఏదో ఒక పక్షం వహించకుండా అన్ని పక్షాల వైపు నుంచి సమాచారాన్ని రాసి పోస్ట్ చేస్తాడు. అంతే కాదు చరిత్రలో జరిగిపోయిన కొన్ని ఘటనలను కూడా వివరిస్తాడు. ఉదాహరణకు ఇజ్రాయిల్– పాలస్తీనాల మధ్య గొడవ. ఇలా ఒకటనేముంది మ్యూచువల్ ఫండ్స్ దగ్గరి నుంచి స్టాక్ మార్కెట్ పాఠాల వరకూ అన్నీ చెబుతాడు. అందుకే రెండేళ్ల కాలంలోనే అనూహ్యమైన విజయం సాధించాడు. ఉత్తరప్రదేశ్ కుర్రాడు నితిష్ రాజ్పుట్ ఉత్తర ప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ అనే చిన్న ఊళ్లో పుట్టాడు. ఇప్పుడు అతనికి 33 ఏళ్లు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బి.టెక్. చేసి ఐ.టి. కంపెనీల్లో పని చేశాడు. కాని తనకంటూ ఒక సొంత అస్తిత్వం, ఆర్థిక అంతస్తు ఉండాలని ఆశించి 2020లో వీడియో చానల్ ప్రారంభించాడు. సగటు మనిషికి నిత్యం కనిపించే విషయాలే లోతుగా తెలియచేయడం అతడు ఎంచుకున్న ఫార్ములా. ఉదాహరణకు బిట్‌కాయిన్ కథా కమామిషు ఏమిటి అనే వీడియో చూస్తే దాని గురించి మనకు దాదాపుగా ఓ సమగ్ర అవగాహన వస్తుంది. ఎయిర్‌పోర్ట్‌లు ఎలా ఆదాయం గడిస్తాయి అనేది అతని మరో వీడియో. బాలీవుడ్లో భారీ సినిమాలు ఫ్లాప్ అయినా డబ్బులెందుకు వస్తున్నాయి అనేది మరో వీడియో. స్పష్టంగా, డేటా విజువల్స్‌తో మంచి ఎడిటింగ్‌తో అతను ధారగా చెప్పుకుపోతాడు. 50 లక్షల ఫాలోయెర్లు నితిష్ రాజ్పుట్ యూట్యూబ్ చానల్‌కు 35 లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టా ఇవన్నీ కలిపి మొత్తం 50 లక్షల మంది అతణ్ణి ఫాలో అవుతున్నారు. నితిష్ రాజ్పుట్ యూట్యూబ్‌లో ఇప్పటి వరకూ చేసిన వీడియోలకు 25 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోల్లో యాడ్స్ ప్లే అవుతాయి కనుక యూట్యూబ్ నుంచి అలాగే ప్రాడెక్ట్స్ ప్రమోషన్ వల్ల నెలకు అతడు 25 లక్షలు సంపాదిస్తున్నాడు. సంవత్సరానికి 3 కోట్ల ఆదాయం గడిస్తున్నాడు. రెండేళ్లల్లో సాధించిన విజయం అంటే ఆశ్చర్యమే. -
‘ఈఎంసీ’లకు రూ. 340 కోట్ల కేంద్ర సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ల (ఈఎంసీ)లో కామన్ ఫెసిలిటీల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైదరాబాద్ నాలెడ్జి సిటీలోని టీవర్క్స్‌లో ఏర్పాటు చేసే క్లస్టర్కయ్యే వ్యయం రూ. 104.63 కోట్లుకాగా అందులో రూ. 75 కోట్లను గ్రాంట్–ఇన్–ఎయిడ్‌గా అందించనున్నట్లు వెల్లడించింది. ఈ క్లస్టర్‌కు ఈ నెల 4న కేంద్రం అనుమతి మంజూరు చేసింది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లి వద్ద ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రం త్వరలో అనుమతిస్తుందని... క్లస్టర్ మంజూరు చేయాలని తాము సిఫారసు చేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రధాన సమాచార ప్రతినిధి స్పష్టం చేశారు. ఐటీఐఆర్, ఎల్రక్టానిక్ క్లస్టర్ల ఏర్పాటుకు సంబంధించి సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందనగా కేంద్రం ఈ వివరాలు ఇచ్చింది. దివిటిపల్లిలో రూ. 568.9 కోట్లతో ప్రతిపాదించిన ఈఎంసీకి రూ. 264.6 కోట్లను గ్రాంటుగా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ రెండింటిని ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ 2.0 కింద మంజూరు చేసినట్లు పేర్కొంది. ఐటీఐఆర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం తదుపరి ప్రతిపాదనలు పంపలేదు.. ఏపీ విభజన హామీగా తెలంగాణకు ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్)’ఏర్పాటు హామీని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. అయితే ఐటీఐఆర్‌పై 2016లో సమావేశం జరిగిందని... ఆ తరువాత తెలంగాణ ప్రభుత్వం మరిన్ని వివరాలు ఇవ్వలేదని ఆర్టీఐ కింద ఇచ్చిన సమాచారంలో కేంద్రం స్పష్టం చేసింది. 2013 నవంబర్ 13న ఐటీఐఆర్ క్లస్టర్‌ను నోటిఫై చేశారని, ఈ క్లస్టర్లో రైల్వే, ఉపరితల రవాణా, కేంద్ర పట్టణ మంత్రిత్వ శాఖ చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సవివర నివేదిక ఇవ్వాల్సి ఉందని, కానీ తదుపరి డీపీఆర్‌లు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఐటీఐఆర్‌పై 2016లో ఒకసారి, 2017లో మరోసారి సమావేశం జరిగినా తెలంగాణ ప్రభుత్వం నుంచి తదుపరి ఎలాంటి ప్రతిపాదనలు రాకపోవడంతో తాము ఆమోదించలేకపోయామని ఆ సమాధానంలో కేంద్రం స్పష్టం చేసింది. 2017లో ఐటీఐఆర్ పాలసీ, కేంద్ర పారిశ్రామిక అభివృద్ధి పాలసీపై సమీక్షించగా ఐటీఐఆర్‌లో ఉన్నవే కేంద్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఉన్నందున ఐటీఐఆర్‌లను పక్కనపెట్టినట్లు కేంద్రం తెలిపింది. ఐటీఐఆర్ ఇవ్వకపోయినా దానికి ప్రత్యామ్నాయంగా ఇవ్వాలని కోరుతూ అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి నుంచి 2021 జనవరి 7న లేఖ అందిందని, అప్పటికే హైదరాబాద్, మహేశ్వరంలో ఎల్రక్టానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లకు అనుమతిచ్చామని తెలియజేసినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్ పరిశ్రమల శాఖ పేర్కొంది. ఐటీఐఆర్‌తో సంబంధం లేకుండా ఈఎంసీ 2.0 కింద తాజాగా రెండు క్లస్టర్లను మంజూరు చేశామని ఆర్టీఐ కింద కోరిన సమాచారానికి స్పందిస్తూ బదులిచ్చింది. -
CM Jagan: ఏపీ ‘క్లిక్’ అయిందిలా..
సుమతి రోడ్డుమీద వెళుతుండగా ఆకతాయిలు ఫాలో అవుతున్నారు. భయం వేసింది. చేతిలోని ఫోన్లో ఓ బటన్ నొక్కింది. ఐదు నిమిషాలు గడవకముందే పోలీసులొచ్చారు. ఆకతాయిల్ని పట్టుకుని బుద్ధి చెప్పారు. ఇదంతా.. ‘దిశ’ టెక్నాలజీతోనే సాధ్యమయింది. సుమతి దిశ యాప్‌లోని బటన్‌ను ప్రెస్ చేయటంతో అది పోలీస్ కమాండ్ కంట్రోల్‌కు సమాచారం పంపింది. అక్కడి నుంచి దగ్గర్లోని పెట్రోలింగ్ బృందానికి మెసేజ్ వెళ్లింది. అంతా క్షణాల్లో జరిగిపోవటంతో.. సుమతికి ఆపద తప్పింది. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన దిశ యాప్‌ను.. 1.46 కోట్ల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకున్నారు. దీనిద్వారా అలెర్ట్ రావటంతో... 31,541 ఘటనల్లో పోలీసులు తక్షణం స్పందించి చర్యలు తీసుకున్నారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ!. ఐటీ. హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చింది తానేనంటారు చంద్రబాబు. ఈ క్లెయిమ్‌పై ఉన్న విభిన్న వాదనలనిక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మరి 2014 నుంచీ ఏపీ ముఖ్యమంత్రిగాఉన్నపుడు ఐటీని ఏం చేశారు? ప్రపంచమంతా కొత్త ఆవిష్కరణలతో పరుగులు తీస్తున్నపుడు ఇక్కడ మాత్రం అన్నీ మాటలే తప్ప చేతల్లో ఎందుకు కనిపించలేదు? ఐటీకి పితామహుడినని చెప్పారే తప్ప... కొత్తగా టెక్నాలజీని వినియోగించిందెక్కడ? సువిశాల తీరం ఉందని... దాన్నే అడ్వాంటేజ్‌గా తీసుకోవాలని పదే పదే చెప్పారు తప్ప ఒక్క పోర్టును గానీ, హార్బర్‌ను గానీ తేలేదెందుకు? మరి వైఎస్ జగన్ మాత్రం మాటలు చెప్పకుండా ప్రతి విభాగంలోనూ టెక్నాలజీని సమర్థంగా అమలు చేస్తున్నారు కదా? కొత్త పోర్టులు, హార్బర్లను తెచ్చారు కదా? మనకు కావాల్సింది హోరెత్తించే మాటలా..? కళ్లముందు కనిపించే నిజాలా?రాష్ట్రంలో గత ఖరీఫ్‌లో 93,29,128 ఎకరాల్లో పంటలు వేశారు. దీన్లో వరి 32,83,593 ఎకరాల్లోను... వేరు శనక 5,93166 ఎకరాల్లోను వేశారు. ఈ లెక్కల్లో ఒక్క ఎకరా కూడా తేడా లేదు. ఎందుకంటే ‘ఈ–క్రాప్’ టెక్నాలజీ ఉందిప్పుడు. ప్రతి రైతూ తన పంటను నమోదు చేసుకునే ఈ పటిష్ఠమైన డిజిటల్ వ్యవస్థతో... రాష్ట్రంలోని 27,800 గ్రామాల్లో ఉన్న ప్రతి ఎకరాకూ లెక్క ఉంది. అది బీమాకైనా... పంట నష్టానికైనా.. దిగుబడికైనా.ఈ ఉదాహరణలన్నీ చూస్తే... రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రంగంలోనూ టెక్నాలజీని ఎంత సమర్థంగా వినియోగిస్తోందో అర్థమవుతుంది. భారీ ఎత్తున ఐటీ కాంట్రాక్టులివ్వకుండా, ఉన్న వనరులను... నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సేవలను సమర్థంగా వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విభాగంలోనూ పూర్తిస్థాయిలో టెక్నాలజీని వాడుతోంది. అందుకనే... మునుపెన్నడూ చూడని పారదర్శకత, జవాబుదారీతనం ఇపుడు కనిపిస్తోంది. చేసిన పని పావలాదే అయినా... పదిరూపాయల ప్రచారం చేసుకోవటమనేది ఈ ప్రభుత్వ విధానం కాదు కాబట్టే.. పెద్దపెద్ద ఆరంభాలు, ఆర్భాటాలు లేకుండానే ప్రజలకు సమర్థమైన ఐటీ సేవలు అందుతున్నాయి.ఏఎన్ఎం యాప్‌లో 15 మాడ్యూల్స్...2020లో ప్రభుత్వం రూపొందించిన ఏఎన్ఎం యాప్ ద్వారా... క్షేత్ర స్థాయిలో ప్రతి కార్యక్రమాన్నీ వారు రిపోర్ట్ చేస్తుంటారు. ఎన్సీడీ–సీడీ సర్వే, ఫీవర్ సర్వే, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలు, పాఠశాల విద్యార్థుల హెల్త్ స్క్రీనింగ్, ఆరోగ్యశ్రీ ఫీడ్ బ్యాక్ ఇలా అన్నిటినీ నమోదు చేస్తారు. ఆశా వర్కర్లకు తెచ్చిన ‘ఈ–ఆశా’ యాప్ ద్వారా గర్భిణులు, చిన్నారుల ఆరోగ్యాన్ని వైద్యశాఖ నిరంతరం పర్యవేక్షిస్తుంది. పీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్‌లో పనిచేసే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లకూ యాప్‌లున్నాయి. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమై పనిచేస్తాయి.స్కూళ్లకు పక్కా సమాచార వ్యవస్థ...ఈ ప్రభుత్వం తెచ్చిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం(సిమ్స్)లో ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉన్న 82 లక్షల విద్యార్థుల వివరాలు అప్ టు డేట్‌గా ఉన్నాయి. విద్యార్థుల ఆధార్‌ను లింక్ చేస్తూ... ప్రత్యేక ఐడీ నెంబర్ కేటాయించారు. దీంతో స్టూడెంట్ హాజరు యాప్ ద్వారా ట్రాక్ చెయ్యటం... గ్రామ/వార్డు కార్యదర్శుల ద్వారా వారిని తిరిగి బడికి రప్పించటం సులువవుతోంది. ఇక టీచర్ల అటెండెన్స్కూ యాప్ ఉంది. జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌తో అనుసంధానించిన ఈ యాప్... టీచర్ తమ స్కూల్ పరిసరాలకు 10 మీటర్ల దూరంలో ఉంటేనే హాజరును తీసుకుంటుంది. జగనన్న గోరుముద్ద అమలును పర్యవేక్షించడానికి ‘ఇంటిగ్రేటెడ్ మోనిటరింగ్ సిస్టం ఫర్ మిడ్డే మీల్స్ అండ్ శానిటేషన్’ (ఐఎంఎంఎస్) వచ్చింది. వారంలో ఆరు రోజులు.. రోజుకు సగటున దాదాపు 37,63,698 మంది విద్యార్థులకు ఆహారం తీసుకుంటున్నారు. టీచర్ల ఫోన్లోని ఈ యాప్ ద్వారా... హాజరుతో పాటు ఎంతమంది పిల్లలు ఆహారం తీసుకుంటున్నారు? ఏరోజు ఏం వడ్డించారు, ఇచ్చిన సరుకు ఎంత? ఎంత స్టాక్ ఉంది? వంటి వివరాలన్నీ తెలుస్తాయి. ప్రతిరోజు టాయిలెట్ల పరిస్థితులూ అప్డేట్ అవుతాయి. ఎంప్లాయి ఇన్ఫర్మేషన్ సిస్టంలో టీచర్ల çహాజరుతో పాటు ఎన్ఓసీ, సెలవులు, మెడికల్ రీయింబర్స్మెంట్, గ్రీవెన్స్ సహా సర్వీసు రికార్డు మొత్తం ఉంటోంది.♦ చైల్డ్ ఇన్ఫో సిస్టంలో విద్యార్థులు ఏ స్కూల్ నుంచి ఏ స్కూల్‌కు మారారు. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు, బ్యాంకు ఖాతా లింకేజ్ వంటివన్నీ ఉంటాయి. ♦ జేవీకే యాప్ ద్వారా ప్రతి స్కూల్లో అవసరమైన జగనన్న విద్యాకానుక కిట్లు ఎన్ని? ఎన్ని అందించారు? ఎన్ని మిగిలాయి? వంటివన్నీ తెలుస్తాయి. పైపెచ్చు ఈ వ్యవస్థలను పర్యవేక్షించేందుకు జిల్లాకు ఇద్దరు అధికారుల చొప్పున నియమించి ఇబ్రహీంపట్నం, విశాఖపట్నంలో రెండు కమాండ్ కంట్రోల్ సెంటర్లున్నాయి. బడుల్లో టీచర్లు, పిల్లల అటెండెన్స్ వేశాక అది ఈ సెంటర్లకు వెళుతుంది.టెక్నాలజీతో రైతుకు దన్ను...‘ఈ–కర్షక్’ యాప్‌తో ఆర్బీకేలో రైతులు సీజన్లో తాము సాగు చేసే పంటల వివరాలను నమోదు చేసుకుంటారు. తర్వాత ఆర్బీకే సిబ్బంది పొలాలకు వెళ్లి స్వయంగా జియో కో ఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్ ద్వారా రైతుసాగు చేసే పంట పొలం విస్తీర్ణం, సర్వే నెంబర్‌తో పాటు పంట వివరాలనూ ధ్రువీకరిస్తారు. పొలం ఫోటో డిజిటైజ్ చేస్తారు. ♦ఆర్బీకేల్లోని వెటర్నరీ సహాయకుల పనితీరును పర్యవేక్షించడానికి ‘పశు సంరక్షక్’ యాప్ ఉంది. ♦రోజువారీ వ్యవసాయ పంటల హెచ్చుతగ్గులను పర్యవేక్షించడానికి మార్కెటింగ్ శాఖ ‘కంటిన్యూస్ మోనిటరింగ్ ఆఫ్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అండ్ పేమెంట్స్’ (సీఎంయాప్)ను తీసుకొచ్చింది. ♦‘ఈ–మత్స్యకార’ పోర్టల్‌ను వివిధ యాప్‌లతో అనుసంధానించారు. అప్సడా రిజిస్ట్రేషన్లు, ఆర్బీకే ఇన్పుట్ సప్లయి, ఈక్రాప్, మత్స్య సాగుబడి, కేసీసీ, పీఎంఎంఎస్వై వంటివన్నీ దీని ద్వారానే నిర్వహిస్తున్నారు. ♦‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ యాప్‌తో 55607 అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారు.అర చేతిలో ఆరోగ్యశ్రీ...ఆరోగ్య శ్రీ యాప్‌లో లాగిన్ అయితే... తాము గతంలో ఏ చికిత్స పొందామన్నది లబ్ధిదారులు తెలుసుకోవచ్చు. పథకం కింద ఏ ఆస్పత్రుల్లో ఏ వైద్య సేవలు అందుతాయి? దగ్గర్లో నెట్వర్క్ ఆసుపత్రులు ఏమేం ఉన్నాయి? తెలుసుకోవచ్చు. వాటి లొకేషన్‌నూ ట్రాక్ చేయొచ్చు. ‘ఈహెచ్‌ఆర్– డాక్టర్ కేర్’ ఆన్లైన్ వేదికతో యూపీహెచ్‌సీలు, పీహెచ్‌సీల్లో డిజిటల్ వైద్య సేవలందుతున్నాయి. ఈ పోర్టల్ నుంచి రోగులకు అందించిన వైద్యం వివరాలను వారి ఆయుష్మాన్ భారత హెల్త్ ఖాతాలో అప్లోడ్ చేస్తున్నారు. ల్యాబ్ టెస్ట్‌ల ఫలితాలు ఈహెచ్‌ఆర్ నుంచి నేరుగా రోగుల మొబైల్‌కే ఎస్సెమ్మెస్ ద్వారా వెళుతున్నాయి. క్రొంగొత్తగా... రిజిస్ట్రేషన్ల వ్యవస్థదేశంలో దస్తావేజులు రాయటానికి కొన్ని స్టార్టప్‌లు ఆన్లైన్ రైటర్లను అందుబాటులోకి తెచ్చాయి. ఇక్కడ ప్రభుత్వమే ఆ పనిచేసింది. ‘కార్డ్ ప్రైమ్’ విధానం ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖను పూర్తిగా డిజిటలైజ్ చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం... వినియోగదారులు ఎవరిపైనా ఆధారపడకుండా నేరుగా ఆన్లైన్లో డాక్యుమెంట్లు తయారు చేసుకునే వీలు కల్పించింది. ఆన్లైన్లోనే చలానాలు కట్టి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఆ టైమ్‌లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వెళితే అరగంటలో పని పూర్తవుతుంది. గతంలోలా డాక్యుమెంట్ల స్కానింగ్ అక్కర్లేదు కూడా. డిజిటల్ సిగ్నేచర్ ఒక్కటీ చాలు. ♦ఇక వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆటో మ్యుటేషన్ జరిగే కొత్త విధానాన్ని తెచ్చిందీ ప్రభుత్వం. గతంలో రిజిస్ట్రేషన్ అయ్యాక ఆ డాక్యుమెంట్లను రెవెన్యూ అధికారులకిస్తే వాళ్లు మ్యుటేషన్ చేసేవారు. దీనికి సమయం పట్టేది. ఇప్పుడా అవసరం లేదు. ♦స్టాంపు పేపర్ల స్థానంలో ఈ స్టాంపింగ్‌ను అందుబాటులోకి తెచ్చింది ప్రభుత్వం. గతంలో భౌతికంగా స్టాంపులు కొని, వాటి ద్వారా అగ్రిమెంట్లు చేసుకునేవారు. ఇప్పుడు స్టాంపు పేపర్లతో పని లేదు. కామన్ సర్వీస్ సెంటర్లు, మీ సేవా కేంద్రాలు, డాక్యుమెంట్ రైటర్ల వద్ద కూడా ఈ–స్టాంపింగ్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. స్టాంపు పేపర్ల అవకతవకలకు చెక్ పడింది.♦భూముల రీ సర్వే ద్వారా ఏ రాష్ట్రంలో లేని విధంగా డిజిటల్ రెవెన్యూ రికార్డులు తయారవుతున్నాయి. డ్రోన్లతో సర్వే చేసి శాటిలైట్ లింకు ద్వారా జియో కోఆర్డినేట్స్‌తో రైతుల భూముల హద్దులు నిర్ధారిస్తున్నారు. ప్రతి భూ కమతానికి ఆధార్ తరహాలో యునిక్ ఐడీ ఉంటోంది. -
ఏపీ విద్యాసంస్కరణలపై తెలంగాణ ఆసక్తి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలను అందిపుచ్చుకునేందుకు తెలంగాణ ఆసక్తి చూపుతోంది. గత నాలుగేళ్లుగా మన విద్యాశాఖలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించి అనేక విజయాలు సాధించారు. విద్యార్థి దినచర్యను పాఠశాల నుంచి రాష్ట్రస్థాయిలో ప్రిన్సిపల్ కార్యాదర్శి, ముఖ్యమంత్రి వరకు పరిశీలించేలా ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు బడిబయటి పిల్లలను ట్రాక్ చేయడంలో సాధించిన విజయాలు, మధ్యాహ్న భోజనం అమలు తీరును తెలంగాణ అధికారులు పరిశీలించారు. ఇటీవల ఏపీకి వచ్చిన తెలంగాణ సమగ్ర శిక్ష అధికారులు ఇక్కడి అధికారులతో సమావేశమై ఐటీ వినియోగంతో సాధించిన విజయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఉన్న 58,685 పాఠశాలలు, 70.64 లక్షలమంది విద్యార్థులు, మూడులక్షలకు పైగా ఉపాధ్యాయులను నూరుశాతం పర్యవేక్షిస్తున్న తీరుకు ఫిదా అయ్యారు. ముఖ్యంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం (సిమ్స్) ద్వారా పాఠశాలలు, విద్యార్థులు, ఉపాధ్యాయులను ఒక్కటి చేయడాన్ని అడిగి తెలుసుకున్నారు. యాప్స్ ద్వారా విద్యార్థుల హాజరు తీసుకోవడం, అదే సమయంలో మధ్యాహ్న భోజనం చేసేవారి సంఖ్యను లెక్కించడం, పాఠశాల ప్రాంగణంలోనే ఉపాధ్యాయుల హాజరును ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నమోదు చేయడాన్ని అభినందించారు. రాష్ట్రస్థాయిలో రియల్ టైమ్ గవర్నెన్స్ అమలును తమ రాష్ట్రంలోను ప్రవేశపెట్టేందుకు ఆసక్తి చూపించారు. సిమ్స్, యాప్స్ పనితీరును వివరించిన అధికారులు విద్యాశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కూల్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టం (సిమ్స్), దానికి అనుసంధానంగా కీలక విభాగాలకు మొబైల్ యాప్స్ రూపకల్పన ద్వారా విద్యార్థి ట్రాకింగ్‌ను ఏపీ సమగ్ర శిక్ష అధికారులు తెలంగాణ అధికారుల బృందానికి వివరించారు. ఇందులో ప్రధానంగా స్కూల్ ఇన్ఫర్మేషన్ విభాగంలో పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, మధ్యాహ్న భోజనం అమలు, చేస్తున్న మార్పులను నమోదు చేస్తారు. టీచర్స్ ప్రొఫైల్‌లో వారి హాజరు, ఎన్వోసీ, మెడికల్ రీయింబర్స్మెంట్, సెలవులు, గ్రీవెన్స్ వంటివి, విద్యార్థుల విభాగంలో ఆధార్ నంబరు ఆధారంగా విద్యార్థి పాఠశాలలో ఉన్నారా, బడిబయట ఉన్నారా అని ట్రాకింగ్ చేసి, గ్రామ, వార్డు కార్యదర్శుల ద్వారా వివరాలు సేకరించి వారిని తిరిగి బడిలో చేరుస్తున్నారు. ఇలా గత విద్యాసంవత్సరంలో సుమారు లక్షమంది పిల్లలను తిరిగి బడిలో చేర్చారు. ఐటీ సంస్కరణలతో తక్కువ కాలంలోనే వేగవంతమైన విజయాలు నమోదు చేయడాన్ని తెలంగాణ అధికారులు అభినందించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి పాఠశాలను, విద్యార్థిని ప్రతిరోజు పర్యవేక్షించడం, వారి పనితీరును తెలుసుకోవడాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీటిలో కొన్నింటిని తెలంగాణలోను అమలు చేయాలని నిర్ణయించారు. గతంలో మన రాష్ట్ర ప్రభుత్వం ‘మనబడి: నాడు–నేడు’ పథకాన్ని ప్రవేశపెట్టి సాధించిన విజయాన్ని పరిశీలించిన తెలంగాణ అధికారులు వారి రాష్ట్రంలో ‘మన ఊరు–మన బడి’ పేరుతో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. -
బెంగళూరు, ముంబైకి దీటుగా హైదరాబాద్.. తెలంగాణ కొత్త రికార్డులు
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఐటీ ఆధారిత సేవల రంగం ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో తెలంగాణ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.57 వేల కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు 2022–23 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరాయి. దీంతో ఐటీ రంగంలో భారత్‌లో అగ్రస్థానంలో ఉన్న కర్ణాటక, మహారాష్ట్రతో తెలంగాణ పోటీ పడుతున్నట్టయింది. తెలంగాణ రాష్ట్ర రెండో ఐసీటీ పాలసీ (2021–26)లో రూ.3 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన 2022–23 ఐటీ శాఖ ప్రగతి నివేదిక ప్రకారం.. తెలంగాణ ఈ లక్ష్యాన్ని రెండేళ్లు ముందుగానే అంటే 2024 నాటికే చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఐటీ, ఐటీ ఆధారిత సేవల రంగంలో ఎగుమతులు, ఉద్యోగాల కల్పనలో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు రాష్ట్ర ఐటీ శాఖ సన్నద్ధమవుతోంది. దేశంలో ఏ ఇతర రాష్ట్రం సాధించని రీతిలో 2022–23లో తెలంగాణ ఐటీ ఎగుమతుల్లో 31.44 శాతం వార్షిక వృద్ధిరేటు, ఉద్యోగాల కల్పనలో 16.2 శాతం రికార్డు వృద్ధి రేటును సాధించింది. దీంతో ఏడాది కాలంలోనే కొత్తగా 1.26 లక్షల ఉద్యోగాలు, ఎగుమతుల్లో రూ.57 వేల కోట్లకు పైగా వృద్ధిని ఐటీ రంగం సాధించింది. 17.31% సీఏజీఆర్‌తో పురోగమనం తెలంగాణ రాష్ట్ర అవతరణ నుంచి 17.31 శాతం సీఏజీఆర్ (సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు)తో వృద్ధి చెందడంతోనే ఐటీ రంగం శరవేగంగా పురోగమిస్తోంది. రాష్ట్ర అవతరణ నాటి పరిస్థితులతో పోలిస్తే ఐటీ ఎగుమతుల్లో నాలుగు రెట్లు, ఉద్యోగాల కల్పనలో మూడు రెట్లు పురోగతి సాధించగా, మరో మూడు రెట్లు పరోక్ష ఉద్యోగాలు వచ్చినట్లు అంచనా. 2022–23లో భారత్ ఐటీ ఎగుమతులు 9.36 శాతం ఉంటే, తెలంగాణలో మాత్రం 31.44 శాతం పెరిగాయి. 2014లో మొత్తం దేశ ఐటీ ఉద్యోగాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాటా 9.83% గా ఉంటే ప్రస్తుతం కొత్త ఉద్యోగాల కల్పనలో ఒక్క తెలంగాణ వాటా 27.6%గా ఉంది. భారత్ గణాంకాలతో పోలిస్తే దేశంలో ఐటీ రంగంలో వచ్చిన కొత్త ఉద్యోగాల్లో తెలంగాణ నుంచి 2021–22లో 33 శాతం వస్తే, 2022–23లో 44 శాతం వచ్చాయి. అంటే దేశంలో కొత్తగా వస్తున్న ప్రతి రెండు ఐటీ ఉద్యోగాల్లో ఒకటి తెలంగాణ నుంచే వస్తున్నట్లు భావించవచ్చు. ఉద్యోగాల్లో బెంగళూరు తర్వాత .. కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2021–22లో దేశం నుంచి రూ.3.95 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు జరగ్గా, ఇందులో మూడో వంతు కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుంచే జరుగుతున్నాయి. భారతీయ సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో కర్ణాటక నుంచి 34.2 శాతం, మహారాష్ట్ర నుంచి 20.4 శాతం, తెలంగాణ నుంచి 15.6 శాతం చొప్పున జరిగాయి. దేశ వ్యాప్తంగా సుమారు 50 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఐటీ శాఖ తాజా నివేదిక ప్రకారం తెలంగాణలోనే 9.05 లక్షల మంది పని చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో బెంగళూరు తర్వాత రెండో స్థానంలో ఉన్న హైదరాబాద్ ఐటీ ఎగుమతుల్లోనూ రెండో స్థానంలో నిలిచే దిశగా దూసుకుపోతోంది. పెట్టుబడులకు ప్రత్యేక ఆకర్షణగా బెంగళూరు, హైదరాబాద్ పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా ఐటీ రంగం వృద్ధిలో పోటీ పడుతున్నాయి. బెంగళూరుతో పోలిస్తే స్టార్టప్ వాతావరణం, ఐటీ రంగంలో మౌలిక వసతుల కల్పన హైదరాబాద్‌లో కొంత ఆలస్యంగా పుంజుకున్నా ప్రస్తుతం పెట్టుబడులకు హైదరాబాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దేశ ఐటీ రాజధానిగా బెంగళూరుకు పేరున్నా ఇటీవలి కాలంలో ఐటీ పార్కులు, ఎస్ఈజెడ్లు హైదరాబాద్‌లో శరవేగంగా ఏర్పాటవుతుండటంతో రెండు నగరాల మధ్య ఐటీ, ఐటీ ఆధారిత సేవల కంపెనీలను ఆకట్టుకోవడంలో పోటీ నెలకొంది. ఆఫీస్ స్పేస్ వినియోగంలో ముంబయి, బెంగళూరు నగరాలకు మించి హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. 2021లో ఆఫీస్ స్పేస్ వినియోగం 129 శాతం పెరగ్గా, ఐదు మెట్రో నగరాలతో పోలిస్తే 6 శాతం సగటు వృద్ధిరేటు నమోదైంది. బెంగళూరుతో పోలిస్తే జీవన వ్యయం కూడా తక్కువ కావడంతో ఐటీ నిపుణులు హైదరాబాద్ వైపు చూస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నివేదిక (2021–22) ప్రకారం భారత్‌లో ఐటీ ఉద్యోగుల సంఖ్య: సుమారు 50 లక్షలు బెంగళూరు 15 లక్షలు హైదరాబాద్ 7.78 లక్షలు తమిళనాడు 10 లక్షలు పుణె 4 లక్షలు -
దూసుకెళ్తున్న పారి‘శ్రామికం’
రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధి పరుగులు పెడుతోంది. సుదీర్ఘ తీరప్రాంతం, అపారమైన సహజ వనరులు, మానవ వనరులకు తోడు అన్ని విధాలుగా సహకరించే రాష్ట్ర ప్రభుత్వం.. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఉండటంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి కదలివస్తున్నాయి. ఈ నాలుగేళ్లలో అంబానీ, అదానీ, టాటా, బిర్లా, మిట్టల్, జిందాల్, భంగర్, భజాంకా, ఒబెరాయ్, దాల్మియా, సింఘ్వీ తదితర పారిశ్రామిక దిగ్గజాలు రాష్ట్రానికి స్వయంగా వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారు. సులభతర వాణిజ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అగ్రగామిగా ఉండటంతో పాటు పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకురావడం కూడా పారిశ్రామికవేత్తలను ఏపీవైపు వచ్చేలా చేస్తోంది. – సాక్షి, అమరావతి ఐటీలోనూ మేటి.. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో పలు ఐటీ సంస్థలు విశాఖపట్నానికి తరలివచ్చి.. తమ కార్యాలయాలను ప్రారంభిస్తున్నాయి. 2019కు ముందు ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178 ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 372కు చేరింది. ఈ నాలుగేళ్లలో ఇన్ఫోసిస్, అదానీ డేటా సెంటర్, కంట్రోల్ఎస్ డేటా సెంటర్, రాండ్‌శాండ్, బీఈఎల్, అమెజాన్ డెవలప్మెంట్ సెంటర్, టెక్ మహీంద్రా, డబ్ల్యూఎన్ఎస్, టెక్నోటాస్‌్క, టెక్‌బుల్ తదితర సంస్థలు రాష్ట్రంలో ఐటీ కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. వీటి ద్వారా 20,000 మందికి ఉపాధి లభిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే ఐటీ కంపెనీల కోసం విశాఖలో ఐస్పేస్ బిజినెస్ పార్క్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. మరోవైపు ఈ ఏడాది మార్చిలో విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో రూ.13,11,465 కోట్ల విలువైన 386 పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా 6.07 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. పోర్టులు, హార్బర్లు.. పారిశ్రామిక పార్కులు రూ.18,000 కోట్లతో ప్రభుత్వం కొత్తగా నాలుగు పోర్టులు(రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ వద్ద) నిరి్మస్తోంది. వీటి ద్వారా కనీసం లక్ష మందికి ఉపాధి లభించనుంది. మత్స్యకారులకు లబ్ధి చేకూర్చేలా రూ.3,700 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్లతో పాటు 6 ఫిషింగ్ ల్యాండ్లను అభివృద్ధి చేస్తోంది. రాష్ట్రం నుంచి వెళ్తున్న మూడు పారిశ్రామిక కారిడార్ల(విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు)లో రూ.11,753 కోట్లతో నక్కపల్లి, రాంబల్లి, కృష్ణపట్నం, కొప్పర్తి, చిత్తూరు సౌత్, ఓర్వకల్లు పారిశ్రామిక పార్కులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. కోవిడ్ సంక్షోభంలోనూ కొప్పర్తిలో వైఎస్సార్‌ఈఎంసీ, వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. విశాఖ, అనంతపురంతో పాటు కొప్పర్తి, ఓర్వకల్లు వద్ద లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తోంది. కొత్తగా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును అందుబాటులోకి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.. భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు రామాయపట్నం తెట్టు వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటు చేస్తోంది. లక్షలాది మందికి ఉపాధి.. సీఎం జగన్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.75,649.77 కోట్ల విలువైన పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. ఇందులో 111 భారీ, మెగా యూనిట్లు రూ.56,534.53 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా 73,876 మందికి ఉపాధి లభించింది. అంటే సగటున ఏడాదికి రూ.15,418 కోట్ల పెట్టుబడులతో ఉత్పత్తి మొదలయ్యింది. ఇందులో సీఎం జగన్ చేతుల మీదుగా రూ.13,766 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఆరు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమైంది. వీటి ద్వారా 15,040 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా రూ.7,305 కోట్ల విలువైన కియా పరిశ్రమ వాణిజ్యపరమైన ఉత్పత్తిని కూడా సీఎం జగన్ 2019 డిసెంబర్ 5న ప్రారంభించారు. వీటికి అదనంగా ఎంఎస్ఎంఈ రంగంలో 1,52,558 కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.19,115.24 కోట్ల పెట్టుబడులు రావడంతో 13,63,706 మందికి ఉపాధి లభించింది. ఇవికాకుండా మరో 86 ప్రాజెక్టులకు సంబంధించిన రూ.2,35,125.60 కోట్ల పెట్టుబడులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కూడా వాస్తవ రూపంలోకి వస్తే 2,36,806 మందికి ఉపాధి లభించనుంది. వీటిలో రూ.35,672.28 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఏడు భారీ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా 7,015 మందికి ఉపాధి లభిస్తుంది. -
ప్రైవేట్ చేతుల్లోకి ఆధార్ - ప్రజలు సమ్మతిస్తారా..?
ఆధార్ నెంబర్ల వెరిఫికేషన్‌ను ప్రైవేట్ సంస్థలకు అనుమతించాలన్న ప్రతిపాదనపై ప్రజల అభిప్రాయాల కోసం ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గడువుని ఇప్పుడు మరో 15 రోజుల పొడిగించింది. గతంలో ఈ గడువు 2023 మే 05 వరకు మాత్రమే ఉండేది, కాగా ఇప్పుడు ఇప్పుడు మే 20 వరకు పొడిగించారు. ఇప్పటికే ఆధార్‌ను ప్రామాణీకరించడానికి ప్రభుత్వేతర రాష్ట్ర సంస్థలను అనుమతించే ప్రతిపాదన కోసం ఒక ముసాయిదా విడుదలైన విషయం తెలిసిందే. దీనిపైన ప్రజల అభిప్రాయాలను తెలపాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రతిపాదిత సవరణ ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ఇతర సంస్థలు కొన్ని సందర్భాల్లో ఆధార్ ప్రామాణీకరణ కోసం అనుమతిని పొందవచ్చు. ఇది వినియోగదారులకు కూడా అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ఆధార్ ప్రామాణీకరణ కోసం కోరుతున్న ప్రతిపాదన ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదని సంబంధిత మంత్రిత్వ శాఖ లేదా ప్రభుత్వ శాఖ ఒప్పించినట్లయితే, అటువంటి ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. ఈ ప్రతిపాదనపై కొంత మంది నిపుణులు, న్యాయవాదులు గతంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది వినియోగదారులను మోసాలకు గురించి చేసే అవకాశం ఉందని వెల్లడించారు. (ఇదీ చదవండి: సినిమా హీరోలా ఉంటాడనుకున్నా, తీరా చూస్తే.. భర్తపై సుధా మూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు) రాష్ట్ర సంక్షేమం, నిజమైన గ్రహీతలను గుర్తించడానికి ఆధార్ నంబర్లను ఉపయోగించగలిగినప్పటికీ, ప్రైవేట్ సంస్థలు అలాంటి ధృవీకరణను నిర్వహించలేవని ఒక తీర్పులో పేర్కొంది. అయితే దీనిపైన ఇప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో త్వరలోనే తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
పెట్టుబడులకు లాజిస్టిక్స్ అద్భుత అవకాశం
భువనేశ్వర్: పెట్టుబడులు, పరిశ్రమగా రూపుదిద్దుకోవడం, భారీ ఉపాధి అవకాశాలతో రాబోయే సంవత్సరాల్లో యువతకు లాజిస్టిక్స్ పూర్తి అవకాశాలను కల్పించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఏప్రిల్ 27 నుండి 29 వరకు ఇక్కడ జరగనున్న మూడవ జీ– 20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ భేటీ నేపథ్యంలో ‘‘ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్ ఫర్ కోస్టల్ ఎకానమీస్‘ అనే అంశంపై జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సంవత్సరాల్లో లాజిస్టిక్స్ భారీగా పురోగమించే అవకాశం ఉందని అన్నారు. ఈ రంగానికి సంబంధించి సెమీకండక్టర్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి విభాగాల్లో భారీ పెట్టుబడులకు, వ్యవస్థాపకతకు, ఉపాధి అవకాశాలకు భారీ అవకాశాలు కనిపిస్తున్నాయని అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘ఇది ప్రపంచానికి సవాళ్లతో కూడిన ఆసక్తికరమైన సమయం. అవకాశాలతో పాటు సవాళ్లకు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సందర్భంలో, భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా అవతరించింది. భారత్‌ను ప్రపంచం చాలా గౌరవ ప్రదమైన దేశంగా చూస్తోంది‘ అని చంద్రశేఖర్ అన్నారు. సవాళ్లను తట్టుకునే ఎకానమీల దిశగా ప్రపంచం సవాళ్లను తట్టుకుని పురోగమించే లాజిస్టిక్స్, విశ్వసనీయ సప్లైచైన్ వైపు ప్రపంచం చూస్తోందని, రిస్క్ నుండి దూరంగా ఉంటూ సవాళ్లను ఎదుర్కొనే ఆర్థిక వ్యవస్థల వైపు పెట్టుబడులకు మొగ్గుచూపుతోందని మంత్రి పేర్కొన్నారు. ఒడిశా వంటి తీరప్రాంత రాష్ట్రాలలో లాజిస్టిక్స్‌పై దృష్టి, దీనిపై తగిన విధానాలు కీలకమైనవని పేర్కొన్నారు. లాజిస్టిక్స్ అనేది సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఒక భాగం. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వస్తువులు, సేవలు సరఫరాలు, నిల్వల నిర్వహణకు సంబంధించిన కీలక విభాగం. భారత్‌కు విషయంలో ప్రపంచ బ్యాంకు 2023 లాజిస్టిక్ ఇండెక్స్ (ఎల్పీఐ) ర్యాంక్ 2022కన్నా 2023లో ఆరు స్థానాలు మెరుగుపడింది. ప్రపంచంలోని 139 దేశాలను పరిగణనలోకి తీసుకున్న ఈ సూచీ– భారత్ ర్యాంక్ 38కి పెరిగింది. 2022లో ఈ సూచీ ర్యాంక్ 44. ఈ నేపథ్యంలో భారత్ పురోగతిపై ఇంకా కేంద్ర మంత్రి ఏమన్నారంటే.. మొబైల్ ఫోన్ల హబ్‌గా.. 2014లో భారతదేశంలో వినియోగించే మొబైల్ ఫోన్లలో 82 శాతం దిగుమతి అయ్యాయి. 2022లో భారతదేశంలో వినియోగించే దాదాపు 100 శాతం మొబైల్ ఫోన్లు భారతదేశంలోనే తయారయ్యాయి. 2014లో భారత్ నుంచి మొబైల్ ఫోన్ల ఎగుమతి దాదాపు లేనేలేదు. అయితే ఒక్క ఈ ఏడాదే భారత్ దాదాపు 11 బిలియన్ డాలర్ల విలువ చేసే యాపిల్, సామ్సంగ్ ఫోన్లను ఎగుమతి చేసింది. మారిన పరిస్థితులు భారతదేశంలో వ్యాపారం చేయడానికి తగిన మార్కెట్ లేదని, ఇది ఆచరణీయ మార్కెట్ కాదని, లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉన్నందున భారత్‌కు ప్రపంచ తయారీ కేంద్రంగా మారగల సామర్థ్యం అసలు లేదని చాలా దశాబ్దాలుగా ఒక వాదన ఉండేది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్‌లో సెమీకండక్టర్లు, ఎలక్ట్రానిక్స్, మొబైల్‌లు తదితర అనేక ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఎ గుమతులు, దేశంలోనే విక్రయాలు, దేశీయంగా పటి ష్టమైన లాజిస్టిక్స్ వ్యవస్థ వంటి ఎన్నో అంశాల్లో భా రత్ ఇప్పుడు మరింత సమర్థవంతంగా మారింది. నైపుణ్యాలు కీలకం యువత తమ ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలి. అంటే డిగ్రీలు అందుకున్నంత మాత్రాన నైపుణ్యాలను పొందలేము. ప్రత్యేకించి నైపుణ్యాల మెరుగుదలపై దృష్టి పెట్టాలి. మూడవ జీ–20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం అక్షరాస్యత, స్టాటిస్టిక్స్, టెక్–ఎనేబుల్డ్ లెర్నింగ్, ఫ్యూచర్ ఆఫ్ వర్క్, పరిశోధన, సహకారం వంటి పలు అంశాలపై దృష్టి సారిస్తుంది. తీరప్రాంత ఆర్థిక వ్యవస్థల పురోగతికి టెక్నాలజీ, ట్రాన్స్ఫార్మింగ్ లాజిస్టిక్స్, స్కిల్ ఆర్కిటెక్చర్, జీవితకాల అభ్యాసానికి సామర్థ్యాలను పెంపొందించడం వంటి అంశాలూ ఈ సమావేశంలో చర్చనీయాంశాలు కానున్నాయి. జీ20 ఎడ్యుకేషన్ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశం ఈ ఏడాది ప్రారంభంలో చెన్నైలో జరిగింది. ఆ తర్వాత గత నెలలో అమృత్‌సర్‌లో రెండవ సమావేశం జరిగింది. మూడవ సమావేశాలు ఈ నెల్లో భువనేశ్వర్‌లో జరుగుతున్నాయి. తదనంతరం ఆయా అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయ ప్రాతిపదికన విధాన నిర్ణయాలు రూపొందుతాయి. -
ఆధార్ కార్డ్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త! ఇంటి వద్ద నుంచే స్మార్ట్‌ఫోన్ ద్వారా
ఆధార్ కార్డ్ దారులకు ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. త్వరలో భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌లో టచ్‌లెస్ బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తేనుంది. ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తే ప్రజలు ఎక్కడున్నా, ఏ సమయంలోనైనా ఆధార్ కార్డ్ కోసం బయోమెట్రిక్ (ముఖ ఛాయాచిత్రం, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు) వేయొచ్చు. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ బాంబే)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎంఓయూలో భాగంగా ‘ఆధార్ సంస్థ - ఐఐటీ బాంబే’ సంయుక్తంగా ఫోన్ ద్వారా కేవైసీ వివరాలతో ఫింగర్‌ప్రింట్స్ తీసుకునేలా ‘మొబైల్ క్యాప్చర్ సిస్టమ్’ టెక్నాలజీపై రీసెర్చ్ చేయనున్నారు. మొబైల్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగంలోకి వస్తే టచ్‌లెస్ బయోమెట్రిక్ క్యాప్చర్ సిస్టమ్ సాయంతో ఇంటి వద్ద నుంచే ఆధార్ బేస్డ్ ఫింగర్ ప్రింట్ అథంటికేషన్‌ను (వేలిముద్రలు) అప్డేట్ చేయొచ్చు. నిజమైన ఆధార్ లబ్ధి దారుల్ని గుర్తించేలా ఫేస్ రికగ్నైజేషన్‌కు సమానంగా ఫింగర్ ప్రింట్ పద్దతి పనిచేస్తుంది. ఇది అమల్లోకి వచ్చిన తర్వాత ఆధార్ వ్యవస్థ మరింత మెరుగు పడనుంది. సిగ్నల్/ఇమేజ్ ప్రాసెసింగ్, మెషిన్ లెర్నింగ్/డీప్ లెర్నింగ్ వంటి టెక్నాలజీ కలయికతో పనిచేసే ఈ వ్యవస్థ ఆధార్ సంబంధిత సేవల్ని మొబైల్ ద్వారా అందించడలో మరింత సులభతరం చేస్తుంది. రోజుకు 70 మిలియన్ల మంది అధికారిక వర్గాల సమాచారం ప్రకారం..పేరు, చిరునామా, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, రిలేషన్షిప్ స్టేటస్, ఐరిస్, వేలిముద్ర, ఫోటో వంటి వివరాలను అప్డేట్ చేసుకునే (Aadhaar authentications) వారి సంఖ్య పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆధార్‌లో మార్పులు చేసుకునేందుకు గాను యూఐడీఏఐకి రోజుకు 70-80 మిలియన్ల మంది అప్లయ్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 2022 చివరి నాటికి వారి సంఖ్య 88.29 బిలియన్లను దాటింది. సగటున రోజుకు 70 మిలియన్ల మంది ఆధార్‌లో మార్పులు చేసుకుంటున్నట్లు యూఐడీఏఐ తెలిపింది. చదవండి👉 ఊహించని ఎదురు దెబ్బ..చిక్కుల్లో వీజీ సిద్ధార్థ సతీమణి మాళవిక హెగ్డే! -
భద్రం బ్రదర్.. సీవోడీనే బెటర్
మహేశ్వరి అనే మహిళ ఈ–కామర్స్ వెబ్సైట్లో ఆన్లైన్ షాపింగ్ ద్వారా ల్యాప్‌టాప్ కొనుగోలు చేసింది. డెలివరీ తీసుకున్న తరువాత తెరిచి చూస్తే ఆమె ఆర్డర్ పెట్టిన కంపెనీ ఆపరేటింగ్ సిస్టమ్ కాకుండా వేరే సాఫ్ట్‌వేర్‌తో ఉన్న నకిలీ ల్యాప్‌టాప్ వచ్చినట్టు గ్రహించింది. ఈ–కామర్స్ కంపెనీ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌కు ఫిర్యాదు చేస్తే ఏడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ.. పట్టించుకోలేదు. కంపెనీ కార్యాలయానికి వెళితే ఆమె ఫిర్యాదును పరిష్కరించే బాధ్యులెవరూ కనిపించలేదు. చేసేది లేక అదనంగా సొమ్ము చెల్లించి ఆ ల్యాప్‌టాప్‌లోనే తనకు కావాల్సిన సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయించుకోవాలని నిర్ణయించుకుంది. ఇలా ఎంతోమంది.. ఎన్నో విధాలుగా మోసపోతున్నారు. – సాక్షి, అమరావతి ఆన్లైన్ షాపింగ్ మారుమూల పల్లెలకూ అందుబాటులోకి వచ్చింది. ఆన్లైన్ షాపింగ్ చేస్తే కొన్ని సందర్భాల్లో తాము ఆర్డర్ చేసిన వస్తువుకు బదులుగా వేరొకటి రావడం.. వస్తువును రిఫండ్ చేస్తే డబ్బులు తిరిగి రాకపోవడం వంటి మోసాలు పెరుగుతున్నాయి. నగదు చెల్లించినా వస్తువు రాకపోవడం.. క్రెడిట్, డెబిట్ కార్డులను తస్కరించి వేరొకరు ఆన్లైన్ షాపింగ్ చేయడం వంటి మోసాలెన్నో జరుగుతున్నాయి. ఇలా మోసపోతున్న వారికి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. మన దేశంలో ఈ–కామర్స్ వ్యాపారంపై నిర్దిష్ట నిబంధనలు లేవు. కానీ.. వినియోగదారుల రక్షణ చట్టం–1986, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సవరణ చట్టం 2008, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మొదలైన నియంత్రణ సంస్థలచే నిర్దేశించిన విధానాలు ఈ–కామర్స్ సంస్థలకు కూడా వర్తిస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలంటే.. ఈ–కామర్స్ సంస్థల చేతిలో ఎవరైనా మోసపోతే.. ‘కన్సూమర్ కోర్ట్ ఆన్లైన్ ఇండియా’, కన్సూమర్ ఫోరమ్, కమిషన్లలో ఫిర్యాదు చేయొచ్చు. వీటికి వెబ్సైట్, యాప్, టీవీ షాపింగ్ షో ద్వారా ఆర్డర్ చేసి రిఫండ్ లేదా రీప్లేస్మెంట్ పొందకపోవడం, ఆలస్యంగా డెలివరీ చేయడం, తప్పుదారి పట్టించే ప్రమోషన్ల వంటి వాటిపై పైన పేర్కొన్న సంస్థలకు ఫిర్యాదు చేయవచ్చు. వినియోగదారుడు ఫిర్యాదు చేయడానికి ముందు ఈ–కామర్స్ కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేయాలి. ప్రతి ఈ–కామర్స్ కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిర్దేశించిన విధంగా ఫిర్యాదు అధికారిని అందుబాటులో ఉంచాలి. ఆ వివరాలు కంపెనీ వెబ్సైట్లో ఉండాలి. మీ ఫిర్యాదును సదరు అధికారికి తెలియజేయండి. కొన్ని ఈ–కామర్స్ కంపెనీలు మధ్యవర్తిత్వ విధానాన్ని అనుసరిస్తాయి. అది సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుంది. ఇలా చేసినా ప్రయోజనం లేకపోతే డీలర్, తయారీదారు, సర్వీస్ ప్రొవైడర్ పేర్లు, చిరునామాలను సేకరించండి. ఆ చిరునామాలకు సమస్యను రిజిస్టర్ పోస్ట్ ద్వారా రాసి పంపండి. గడువు ముగిసిన తర్వాత మీకు ఎలాంటి స్పందన రాకపోతే వినియోగదారుల ఫోరమ్, కమిషన్‌ను ఆశ్రయించండి. 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఈ–కామర్స్ వినియోగదారులు తమ సొంత నగరంలోని వినియోగదారుల ఫోరమ్‌లో ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు. ‘సైబర్’ భద్రత ఇలా.. ఇటీవల రోగ్ (నకిలీ) వెబ్సైట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడటం ద్వారా తప్పుడు వివరాలతో నకిలీ ఈ–కామర్స్ వెబ్సైట్లు వినియోగదారులను మోసగిస్తున్నాయి. వీటిని గుర్తించి నిషేధించినా మరో పేరుతో మళ్లీ వస్తున్నాయి. వాటిని తెరిస్తే మనకు తెలియకుండానే మన కార్డుల్లో నగదు ఖర్చవుతుంటుంది. ఇలాంటి నకిలీ, పైరసీ వంటి నేరాల బారినపడిన బాధితులు 24 గంటల్లోపు ‘నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్’లో ఫిర్యాదు చేయాలి. సంబంధిత అధికారులు ఐపీ చిరునామా ఆధారంగా సైబర్ మోసగాళ్లను కనిపెడతారు. నకిలీలను ప్రోత్సహించే డొమైన్‌పై నేషనల్ ఇంటర్నెట్ ఎక్సే్చంజ్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకుకు వెళ్లి అనధికార లావాదేవీలపై ఫిర్యాదు చేయడం ద్వారా కార్డును బ్లాక్ చేసి, నగదును తిరిగి పొందవచ్చు. అన్నిటికంటే ముందు ఈ–కామర్స్ సైట్ అడ్రస్‌ను ప్రభుత్వం అందిస్తున్న రిజస్ట్రీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో వెతికితే అది అసలైనదో, నకిలీదో తెలిసిపోతుంది. సురక్షిత ఆన్లైన్ షాపింగ్ కోసం.. ► తెలియని ఈ–కామర్స్ కంపెనీల నుంచి కొనుగోలు చేయడానికి ముందు వాటిని పరిశోధించండి. అనుమానం ఉంటే కొనుగోలును ఆపేయాలి. ► మొదటిసారి సైట్ నుంచి కొనుగోలు చేస్తుంటే క్యాష్ ఆన్ డెలివరీని ఎంచుకోండి. ► కొనుగోలు చేయడానికి ముందు నిబంధనలు, గోప్యతా విధానాన్ని చదవండి. ► డెబిట్, క్రెడిట్ కార్డ్ నంబర్ థర్డ్ పార్టీతో షేర్ చేస్తున్నారా లేదా అనే వివరాలు తెలుసుకోండి. ► ఆర్డర్ రద్దు, వాపసు విధానాలను, నియమాలను చదివి అర్థం చేసుకోండి. ► ఈ–కామర్స్ కంపెనీ చిరునామా, ఈ–మెయిల్, ఫోన్ నంబర్, హెల్ప్‌లైన్ వంటి కస్టమర్ కేర్ వివరాలు వాస్తవమో కాదో నిర్ధారించుకోండి. ► ఉత్పత్తి, వారంటీ వివరాలు తెలుసుకోవడానికి అవసరమైన మెటీరియల్ అందుబాటులో ఉందో లేదో తనిఖీ చేయండి. ► నగదు చెల్లించడానికి ముందు, ఆ వస్తువును కంపెనీ మీ పిన్‌కోడ్‌కు డెలివరీ చేస్తుందో లేదో చూసుకోండి. ► ఒకవేళ కంపెనీ ధర, వస్తువు వివరణను ఆర్డర్ చేసిన తర్వాత మార్చవచ్చు. కాబట్టి కొనుగోలు చేసిన వెంటనే ఆర్డర్ వివరాలు స్క్రీన్‌షాట్ తీసుకోండి. ► ఎక్స్చేంజ్ , రిఫండ్ వంటి క్లెయిమ్‌ల విషయంలో జాగ్రత్త వహించండి. వినియోగదారుల రక్షణ చట్టం ప్రకారం వస్తువు లోపభూయిష్టంగా ఉంటే కంపెనీలు ఎక్సే్చంజ్, రిఫండ్ చేయాలి. -
ఇన్ఫినిటీ వైజాగ్.. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఐటీ సమ్మిట్
సాక్షి,అమరావతి: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో విశాఖపట్నానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఇందుకోసం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్(ఐటాప్), సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ)తో కలిసి ‘ఇన్ఫినిటీ వైజాగ్’ పేరుతో విశాఖ వేదికగా 20, 21 తేదీల్లో సదస్సు నిర్వహిస్తోంది. ముఖ్యంగా విశాఖను ఇండస్ట్రీ 4 టెక్నాలజీ రంగం, స్టార్టప్స్ హబ్‌గా తీర్చిదిద్దేలా ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఐటాప్ ప్రెసిడెంట్ శ్రీధర్ కోసరాజు ‘సాక్షి’తో చెప్పారు. బీమా, లాజిస్టిక్స్, డేటా అనలిటిక్స్, వంటి రంగాల్లో పెట్టుబడులకు విశాఖ ఎంతటి అనువైన ప్రదేశమో ఈ సమ్మిట్ ద్వారా వివరిస్తామన్నారు. ఈ సదస్సు విజయవంతంపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రత్యేకంగా దృష్టిసారించినట్లు చెప్పారు. మైక్రోసాఫ్ట్, టెక్‌మహీంద్రా, జాన్సన్ అండ్ జాన్సన్, ఇండియన్ సొసైటీ ఫర్ అసెంబ్లీ టెక్నాలజీ(ఐశాట్), విప్రో, బోష్, సీమెన్స్ వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు, కేంద్ర ఐటీ శాఖ మంత్రి చంద్రశేఖరన్ ఈ సదస్సుకు హాజరవుతున్నారని శ్రీధర్ చెప్పారు. సదస్సు సందర్భంగా రాష్ట్రంలో ఐటీ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన కంపెనీలకు ఎస్టీపీఐ అవార్డులతో పాటు స్టార్టప్‌లకు అవార్డులు అందిస్తున్నట్టు వెల్లడించారు. -
రాష్ట్రంలోని అన్ని మూలలకూ ఐటీ రంగం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడం ద్వారా గ్రామీణ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తలపెట్టిన ఐటీ హబ్‌ల నిర్మాణ పురోగతిని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు శనివారం ట్విట్టర్ వేదికగా వివరించారు. డిజిటైజ్, డికార్బనైజ్, డి సెంట్రలైజ్ నినాదంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్‌లను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్ ఐటీ హబ్‌లు విజయవంతంగా నడుస్తున్నాయని, నిజామాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, సిద్ధిపేట, ఆదిలాబాద్‌లో ఐటీ హబ్‌లు త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ఫొటోలు షేర్ చేశారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక శ్రద్ధ పెడుతుండటంతో సిద్దిపేట ఐటీ హబ్ శరవేగంగా రూపుదిద్దుకుంటోందని, కొద్దినెలల్లో నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ హబ్‌లు కూడా ప్రారంభిస్తామని కేటీఆర్ వెల్లడించారు. నల్లగొండ ఐటీ హబ్ పనులు శరవేగంగా పూర్తి చేసి వచ్చే ఐదారు నెలల్లో ప్రారంభిస్తామన్నారు. రెండో ఐటీ కేంద్రంగా వరంగల్ వరంగల్ ఐటీ హబ్‌లో పేరొందిన కంపెనీలు తమ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా రెండో అతిపెద్ద ఐటీ కేంద్రంగా మారిందని కేటీఆర్ తెలిపారు. ఎన్ఐటీ (వరంగల్), ఆర్జీయూకేటీ (బాసర) వంటి పేరొందిన విద్యా సంస్థల్లో గ్రామీణ విద్యార్థులు చదువుతున్నారన్నారు. వారిని ఐటీ రంగం అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు టి– హబ్, టి –వర్క్స్, వి– హబ్ వంటి సంస్థల ద్వారా ఎంట్రప్రెన్యూర్లుగా మార్చేందుకు శిక్షణ ఇస్తున్నామన్నారు. -
Tirupati: వెంకన్న పాదాల చెంత ఎన్ఐఈఎల్ఐటీ..
తిరుపతి జిల్లా ఆధ్యాత్మిక రాజధానిగా అవతరిస్తోంది. ఇప్పటికే బహుళజాతి కంపెనీలు, పారిశ్రామిక వాడలు, ప్రముఖ విద్యాసంస్థలతో అలరారుతోంది. ఇప్పుడు సరికొత్తగా మానవ వనరుల అభివృద్ధికి సమయం ఆసన్నమైంది. నిరుద్యోగ సమస్య రూపుమాపడం, యువతకు విరివిగా ఉద్యోగావకాశాలు కల్పించడం, స్కిల్ డెవలప్మెంట్ మెరుగుపరచడం, ప్రపంచ స్థాయిలో రాణించేలా వివిధ కోర్సులు అందించడమే లక్ష్యంగా నైలెట్ సంస్థ ముందుకు వచ్చింది. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సాక్షి ప్రతినిధి, తిరుపతి: వెంకన్న పాదాల చెంత అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏర్పాటుకు అవసరమైన స్థల సేకరణకు ఎన్ఐఈఎల్ఐటీ బృందం తిరుపతి పరిసర ప్రాంతాల్లో పర్యటించింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో సోమవారం శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ, శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, రేణిగుంట విమానాశ్రయం వద్ద ఐఐడీటీ కేంద్రాన్ని బృందం పరిశీలించింది. తిరుపతిలో ఎన్ఐఈఎల్ఐటీ ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నట్లు కమిటీ చైర్మన్, సంస్థ డైరెక్టర్ స్పష్టం చేశారు. నైలెట్ అంటే ఏంటి? దాని ముఖ్యఉద్దేశాలు ► ఎన్ఐఈఎల్ఐటీ(నైలెట్) భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న స్వయం ప్రతిపత్తమైన శాస్త్రీయ సంఘం. ► ఎన్ఐఈఎల్ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మానవనరులు అభివృద్ధి, సంబంధిత కార్యకలాపాలు అందుకు ఉపయోగపడే కోర్సులు అందించడం ముఖ్య ఉద్దేశం. ► ప్రపంచస్థాయి విద్యాప్రమాణాలతో కూడిన శిక్షణ, గుర్తింపు సేవలను అందించడం ద్వారా ఇన్ఫర్మేషన్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ అనుబంధ రంగాలలో నాణ్యమైన మానవ వనరులను ఉత్పత్తి చేస్తుంది. ఎన్ఐఈఎల్ఐటీ అందిస్తున్న కోర్సులు ఫార్మల్ కోర్సుల్లో భాగంగా మూడేళ్ల బ్యాచిలర్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్, బీఎస్సీ హానర్స్ కంప్యూటర్ సైన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎలక్ట్రానిక్ డిజైన్ అండ్ టెక్నాలజీ, వి.ఎల్.ఎస్.ఐ డిజైన్, నాన్ ఫార్మల్ రంగంలో భాగంగా కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్లో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్, హార్డ్‌వేర్, సైబర్ చట్టం, సైబర్ భద్రతా, భౌగోళిక సమాచార వ్యవస్థ, క్లౌడ్ కంప్యూటరింగ్, ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్ – మ్యానుఫ్యాక్చరింగ్, ఇ–వ్యర్థాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, బ్లాక్ చైన్, డేటా అనలిటిక్స్, ఇ–గవర్నెన్స్ వంటి కోర్సులు అందిస్తుంది. దేశంలో అత్యుత్తమమైన యూనివర్సిటీలలో ప్రాచుర్యం పొందిన కోర్సులను ఉమ్మడి భాగస్వామ్యంలో అందుబాటులోకి తీసుకురావడం నైలెట్ ప్రత్యేకత. ఎన్ఐఈఎల్ఐటీ తిరుపతిలో నెలకొల్పడం ద్వారా వృత్తి విద్య కోర్సుల తోపాటు అనుదినం మారూతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం అందుకు అవసరమైన కోర్సులు నేర్చుకోనేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు వెళ్లాల్సిన పనిలేకుండా తగిన నైపుణ్యాన్ని ఈ విశ్వవిద్యాలయం అందిస్తుంది. కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు వారి అర్హతలను బట్టి అవకాశాలను కూడా కల్పిస్తుంది. తైవాన్, జపాన్, చైనా, కొరియా వంటి దేశాలతో అవగాహన ఒప్పందం కలిగి ఉండడంతో విదేశాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మానవ వనరుల అభివృద్ధే లక్ష్యం మానవ వనరుల అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారు. తిరుపతి జిల్లాలో త్వరలో ఐటీ కాన్సెప్ట్ సిటీ నెలకొల్పబోతున్నారు. తిరుపతి జిల్లాలో శ్రీసిటీ, రేణిగుంటలో ఈఎంసీ, మేనకూరు పారిశ్రామికవాడలో నెలకొల్పిన దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసేందుకు నైపుణ్యం కలిగిన మానవ వనరులను అభివృద్ధి చేయనున్నారు. స్థానికంగా ఉన్న యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ సమస్య కు పరిష్కారం లభిస్తుంది. – మద్దెల గురుమూర్తి, ఎంపీ, తిరుపతి -
ఐటీలో మేటి.. రైతుల సేవలో ఘనాపాటి
అనకాపల్లి: ఆధునిక పోకడలకు అనుగుణంగా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకొని జిల్లా ఏరువాక కేంద్రం అన్నదాతలకు వినూత్నమైన సేవలందిస్తోంది. రైతులు, వ్యవసాయ విస్తరణ విభాగాలకు మధ్య వారధిగా పనిచేస్తోంది. పంటల సాగులో తీసుకోవాల్సిన మెళకువలతోపాటు అత్యవసర సమయాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తోంది. అందరి చేతిలో ఇంటర్నెట్తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జిల్లా ఏరువాక కేంద్రం ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) యాప్‌ను రూపొందించింది. ఏడాది పొడవునా కావలసిన సమాచారాన్ని రైతులు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. యాప్ పనిచేస్తుందిలా.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏఎన్జీఆర్ఏయూఆర్బీకే (ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రైతు భరోసా కేంద్రం) యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లో వెబ్ లింకును నొక్కితే ఎఫ్‌ఏఆర్‌ఎం ఆర్ఏడీఐవో.ఇన్ కింద ఫార్మ్ రేడియో ఓపెన్ అవుతుంది. ఇందులో నాలుగు స్లాట్లు ఉంటాయి. వ్యవసాయం, కాయగూరలు పండ్లు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారం వస్తుంది. దేనిపై ప్రెస్ చేసినా మూడు నిమిషాల నిడివిగల వాయిస్ వినిపిస్తుంది. అదే సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ నెలకు సంబంధించిన ఆ సమాచారం ఫార్మ్ రేడియోలో వినిపిస్తుంది. రైతుల ముంగిటకే సమాచారం రైతుల వద్దకే సమాచారాన్ని పంపిస్తున్నాం. ఇంటర్నెట్ సదుపాయమున్న వారు వెబ్‌లింకు ద్వారా ఫార్మ్ రేడియోలో వ్యవసాయం, కాయగూరలు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను ఆయా నెలల్లో వినవచ్చు. జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో ఈ యాప్‌ను రూపొందించాం. – ప్రదీప్‌కుమార్, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త (చదవండి: -
యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్రం బారత్‌కి విరుద్ధంగా ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఇస్తున్న పాక్ ఆధారిత యూట్యూబ్ ఛానెళ్లను సుమారు 35 బ్లాక్ చేసింది. బ్లాక్ చేసిన ఛానెళ్ల కంటెంట్‌లో భారత సాయుధ బలగాలు, కాశ్మీర్, భారత్ విదేశీ సంబంధాలు, మాజీ సీడీఎస్ బిపిన్ రావత్ మరణం వంటి విషయాలకు సంబంధించి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉందని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం 35 యూట్యూబ్ ఛానెల్‌లు, రెండు ట్విట్టర్ ఖాతాలు, రెండు ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, రెండు వెబ్సైట్లు, ఒక ఫేస్బుక్ ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ విక్రమ్ సహాయ్ శుక్రవారం తెలిపారు. అయితే ఈ ఖాతాలన్నీ పాకిస్తాన్ నండి పనిచేస్తాయని, పైగా భారత్‌కి వ్యతిరేకంగా నకిలీ వార్తలను, కంటెంట్లను వ్యాప్తి చేయడమే ముఖ్యోద్దేశం అని పేర్కొన్నారు. అంతేకాదు బ్లాక్ చేసిన ఖాతాలకు సుమారు 130 కోట్ల వ్యూస్, దాదాపు 1.2 కోట్ల మంది సబ్ స్క్రైబర్లు ఉన్నారని విక్రమ్ సహాయ్ అన్నారు. ఈ మేరకు బ్లాక్ చేసిన ఖాతాలలో అప్నీ దునియా నెట్వర్క్ 14 యూట్యూబ్ ఛానెల్‌ళ్లను నిర్వహిస్తోందని, తల్హా ఫిల్మ్స్ నెట్వర్క్ 13 యూట్యూబ్ ఛానెళ్లను నిర్వహిస్తున్నాయని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 2021 నిబంధన16 ప్రకారం జారీ చేసిన ఆదేశాలను ఈ ఖాతాలు ఉల్లంఘించాయని పేర్కొంది. (చదవండి: ఎమర్జెన్సీ ల్యాడింగ్ తర్వాత ప్రయాణికులకు ఝలక్ ఇచ్చిన పైలెట్...) -
ఐటీ అ‘ద్వితీయం’
రాష్ట్రంలో ఐటీ ఉద్యోగమంటేనే కేరాఫ్ హైదరాబాద్.. బడా కంపెనీల్లో ఉద్యోగమంటే ఎవరైనా రాజధాని బాట పట్టాల్సిందే. కానీ ఇప్పుడా లెక్క మారుతోంది. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ హబ్‌ల ఏర్పాటుతో చదువుకున్న చోటికి, కుటుంబానికి దగ్గరగా ఉంటూనే ఐటీ ఉద్యోగం చేసే అవకాశం వస్తోంది. స్థానిక యువతలో నైపుణ్యాలకు గుర్తింపు, వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఐటీ హబ్‌లు జిల్లాల్లోని యువత కలలను నెరవేరుస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగాన్ని రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాలకు విస్తరించే వ్యూహాన్ని ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోంది. హైదరాబాద్‌లో కేంద్రీకృతమైన ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు విస్తరించడం ద్వారా.. వచ్చే రెండేళ్లలో 25 వేల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే వరంగల్, కరీంనగర్, ఖమ్మం పట్టణాల్లో ఐటీహబ్‌ల కార్యకలాపాలు మొదలయ్యాయి. నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ఐటీ టవర్ల నిర్మాణం ముగింపు దశకు చేరుకుంది. ఈ ఏడాది మార్చిలోగా ఈ రెండింటిని ప్రారంభించేందుకు ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇక సిద్దిపేటలో ఐటీహబ్ నిర్మాణ దశలో ఉండగా.. తాజాగా నల్లగొండ ఐటీ టవర్‌కు మంత్రి కె.తారక రామారావు శంకుస్థాపన చేశారు. త్వరలోనే తృతీయశ్రేణి పట్టణాలైన రామగుండం, వనపర్తిలలో ఐటీ హబ్‌ల నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఖమ్మంలోని ఐటీ హబ్ జిల్లాల్లోని ఐటీ హబ్‌లకు బడా కంపెనీలు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు దిగ్గజ ఐటీ కంపెనీలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. దీనితో పెద్ద కంపెనీలకు అవసరమైన ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 2016లో తొలిదశ కింద ఏర్పాటైన వరంగల్ ఐటీ హబ్‌లో టెక్ మహీంద్రా, సైయంట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ఐటీ కార్యకలపాలతోపాటు ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేశాయి. కరీంనగర్ ఐటీ హబ్‌లో ఐటీ కంపెనీలతో పాటు ‘టాస్క్’ రీజనల్ కార్యాలయం కూడా ఏర్పాటైంది. వీటితోపాటు ఖమ్మం ఐటీ హబ్‌లో కలిపి సుమారు 3వేల మంది ఉపాధి పొందుతుండగా.. సీటింగ్ కెపాసిటీకి మించి కంపెనీల నుంచి డిమాండ్ ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే రెండోదశ టవర్ల నిర్మాణం కోసం ఐటీశాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్ ఐటీ టవర్లతోపాటు నల్లగొండ ఐటీ టవర్ ప్రారంభమైతే మరో 4,200 సీటింగ్ కెపాసిటీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వరంగల్‌లోని ఐటీ హబ్‌లో టెక్ మహీంద్రా కార్యాలయం నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా.. ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఏర్పాటవుతున్న ఐటీ హబ్‌లను కేవలం ఉద్యోగ కల్పన కేంద్రాలుగానే కాకుండా.. నైపుణ్య శిక్షణ, ఆవిష్కరణల కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు ఐటీశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్థానిక యువతకు ‘టాస్క్’ ద్వారా నైపుణ్య శిక్షణ ఇస్తోంది. ఇప్పటికే గ్రామస్థాయిలో ఆవిష్కరణలను గుర్తించి ప్రోత్సహించేందుకు టీఎస్ఐఐసీ ద్వారా ఐటీశాఖ పలు కార్యక్రమాలు చేపట్టింది. మరోవైపు టీహబ్, వీహబ్ ద్వారా స్టార్టప్‌ల వాతావరణాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లేందుకు ఐటీ హబ్‌లను కేంద్రంగా చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. నిజామాబాద్‌లో నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ భవనం రాష్ట్రవ్యాప్తంగా ఐటీ ఉద్యోగావకాశాలు రాష్ట్రంలో ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లలో ఐటీ హబ్ లు ప్రారంభించాం. నిజామాబాద్, మహబూబ్‌నగర్ ఐటీ హబ్‌లు త్వరలోకి అందుబాటులోకి వస్తాయి. కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోని యువతకు కూడా ఐటీ రంగంలో అవకాశాలు అందుబాటులోకి రావాల్సిన అవసరాన్ని సీఎం కేసీఆర్ రాష్ట్ర అవతరణ సమయంలోనే నొక్కిచెప్పారు. ఆ దిశలోనే ఈ చర్యలు చేపడుతున్నాం. తెలంగాణ వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి రంగాల్లోనే కాదు పరిశ్రమలు, ఐటీ రంగాల్లోనూ అద్భుతంగా పురోగమిస్తోంది. – కె.తారక రామారావు, ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో ఐటీ అభివృద్ధి భవిష్యత్తులో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో గత ఏడాది 12శాతంగా నమోదైన ఐటీ రంగం వృద్ధి.. ఈసారి 16 శాతానికి చేరుకునే అవకాశముంది. కోవిడ్ పరిస్థితుల మూలంగా హైబ్రిడ్ పనివిధానంలో చాలా మంది ఉద్యోగులు తమ స్వస్థలాల నుంచి పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల నుంచే పనిచేసేందుకు ఉద్యోగులు మొగ్గు చూపే అవకాశం ఉన్నందున.. ఆయా చోట్ల ఐటీ హబ్‌లకు ఉజ్వల భవిష్యత్తు ఖాయం. – భరణి అరోల్, అధ్యక్షుడు, హైసియా ప్రభుత్వ చర్యలతో ఊతం రాష్ట్రంలోని సానుకూల వాతావరణం, ఐటీ విస్తరణకు ప్రభు త్వం చేపడుతున్న చర్యలు మా వంటి సంస్థలకు ఊతంగా నిలుస్తున్నాయి. కరీంనగర్ కేం ద్రంగా మేం ప్రారంభించిన సంస్థలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఐటీ హబ్‌లతోపాటు లాజిస్టిక్స్‌కు పెద్దపీట వేస్తుండటంతో ఎక్కడి నుంచైనా కార్యకలాపాలు నిర్వహించే వెసులుబాటు లభించింది. ఐటీని ద్వితీయశ్రేణి పట్టణాలకు విస్తరిం చడం ద్వారా స్థానికంగా నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అందుబాటులోకి రావడంతోపాటు తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి. – మనోజ్ శశిధర్, సహస్ర సాఫ్ట్వేర్ సర్వీసెస్, కరీంనగర్ సొంత జిల్లాలో ఐటీ ఉద్యోగం.. ఖమ్మంలో ఐటీ హబ్ ఏర్పాటుతో సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే అవకాశం దక్కింది. నేను చదువుకున్న కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఐటీ హబ్‌లో ఉద్యోగం సాధించాను. టెక్నోజన్ కంపెనీలో జావా ఫుల్‌స్టాక్ డెవలపర్‌గా పనిచేస్తున్నా. ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం వచ్చింది. కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉంటూ.. నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాను. – మారేపల్లి కౌశిక్ శర్మ, ఐటీ ఉద్యోగి, టెక్నోజన్, గార్ల, ఖమ్మం జిల్లా -
ఫేస్‌బుక్‌కు పిలుపు
న్యూఢిల్లీ: కొందరు బీజేపీ నాయకుల విద్వేషపూరిత పోస్టులను ఫేస్బుక్ చూసీచూడనట్లు వదిలేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో... సెప్టెంబర్ 2న తమముందు హాజరై వివరణ ఇవ్వాలని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీచేసింది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఫేస్బుక్ ప్రతినిధులతో చర్చించనుంది. పౌరుల హక్కులకు రక్షణ కల్పించడం, అంతర్జాలంలో మహిళల భద్రత అంశాలపై కూడా చర్చించే ఈ సమావేశానికి ఫేస్బుక్ ప్రతినిధులతో పాటు ఐటీ మంత్రిత్వశాఖ అధికారులను కూడా పిలిచింది. అలాగే ఇంటర్నెట్ నిలిపివేతలపై సెప్టెంబర్ ఒకటో తేదీన స్టాండింగ్ కమిటీ సమాచార ప్రసారశాఖ అధికారులు, హోంశాఖ అధికారులతో భేటీ కానుంది. బిహార్, జమ్మూకశ్మీర్, ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించింది. వచ్చేనెల ఒకటి, రెండో తేదీల్లో జరిగే ఐటీ స్టాండింగ్ కమిటీ సమావేశాల ఎజెండాను లోక్‌సభ సచివాలయం గురువారం ఒక నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. థరూర్‌ను తొలగించాలి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్‌ను, ఆ పదవి నుంచి తప్పించాలని, అదే కమిటీకి చెందిన సభ్యుడు, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకి రాసిన లేఖలో కోరారు. లోక్‌సభ నియమాలను అనుసరించి, ఆయన స్థానంలో మరో సభ్యుడిని చైర్మన్‌గా నియమించాలని కోరారు. శశిథరూర్ పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ అయినప్పటినుంచీ, కమిటీ వ్యవహారాలను పద్ధతి ప్రకారం నిర్వహించడంలేదని, తన వ్యక్తిగత ఎజెండాని ముందుకు తీసుకెళుతూ, పుకార్లు వ్యాప్తిచేస్తూ, తమ పార్టీపై బురదచల్లుతున్నారని దూబే ఆ లేఖలో పేర్కొన్నారు. ఫేస్బుక్ ప్రతినిధులను స్టాండింగ్ కమిటీ ముందుకు పిలిచే విషయాన్ని కమిటీ సభ్యులకు చెప్పకుండా శశిథరూర్ మొదట మీడియాకు వెల్లడించారని, ఇది హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని దూబే పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, గత ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు, సామాజిక మాధ్యమాల్లో విద్వేషాలను రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసినప్పటికీ, ఫేస్బుక్ అధికారులు చర్యలు చేపట్టలేదని శశిథరూర్ ఆరోపించారు. -
ఐటీ, వైద్య సేవల్లో జోరుగా హైరింగ్..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 ప్రభావంతో పలు రంగాల్లో నియామకాలు భారీగా పడిపోయినా ఐటీ, వైద్య సేవలు, మార్కెటింగ్ రంగాల్లో హైరింగ్ ఊపందుకుంది. డెలివరీ, ఐటీ మేనేజర్ల నియామకాలు కూడా ప్రోత్సాహకరంగా సాగాయి. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు ఉద్యోగులపై వేటు వేయడం, నియామకాలను నిలిపివేస్తున్న పరిస్థితుల్లోనూ భారత్‌లో హైరింగ్ ప్రక్రియ పెద్దగా దెబ్బతినలేదని ఓ నివేదిక వెల్లడించింది. మార్చి రెండో వారం వరకూ నియామకాలు గత ఏడాది తరహాలోనే సాగాయని, మార్చి ద్వితీయార్ధం నుంచి ఏప్రిల్, మే వరకూ లాక్డౌన్ల ప్రభావంతో మందగించాయని అంతర్జాతీయ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక తెలిపింది. జూన్‌లో ఇండీడ్ జాబ్ పోస్టింగ్స్ గత ఏడాదితో పోలిస్తే 51 శాతం తగ్గాయని, బ్రిటన్‌లో 60 శాతం, మెక్సికో, ఇతర యూరప్ దేశాల్లో 61 శాతం మేర తగ్గాయని నివేదిక పేర్కొంది. అయితే అమెరికాలో మాత్రం జాబ్ పోస్టింగ్స్ కేవలం 29 శాతం, సింగపూర్‌లో 32 శాతం, ఆస్ర్టేలియాలో 42 శాతం మేర తగ్గాయని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలపై కోవిడ్-19 ప్రభావం ప్రారంభమైన ఫిబ్రవరి నుంచి మే వరకూ ఇండీడ్ వేదికపై అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందింది. కోవిడ్-19 ప్రభావంతో అత్యధికంగా చైల్డ్‌కేర్, ఆహార తయారీ రంగాల్లో 78 శాతం మేర జాబ్ పోస్టింగ్స్ తగ్గాయని, టూరిజం, ఆతిథ్య రంగాల్లో 77 శాతం, శానిటేషన్‌లో 74 శాతం చొప్పున జాబ్ లిస్టింగ్స్ తగ్గాయని నివేదిక తెలిపింది. చదవండి : ‘మహమ్మారిని ఆ దేవుడే పంపాడు’ -
స్విగ్గీ, జొమాటో డ్రోన్ డెలివరీ..
ముంబై: ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు జొమాటో, స్విగ్గీ, డన్‌జోలు సరికొత్త రీతిలో వినియోగదారులను ఆకర్శించనున్నాయి. అందులో భాగంగానే త్వరలో డ్రోన్లను ఉపయోగించుకుంటు పుడ్ డెలివరీలు చేయనున్నాయి. దాదాపు 13 సంస్థల యాజమాన్యాలు డ్రోన్లను ఉపయోగించేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని తెలిపారు. డ్రోన్లను ఉపయోగించేందుకు భారత వైమానిక దళం గతంలోనే సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. కాగా జులై మొదటి వారంలోనే డ్రోన్లను ఉపయోగించడం ప్రారంభిస్తామని త్రొట్టల్ ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు నాగేందర్ కందస్వామి పేర్కొన్నారు. తాము ఉపయోగించే ముందు డ్రోన్లును పరీక్షించాలనుకున్నాం.. కానీ కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ఆలస్యం జరిగిందని అన్నారు. అయితే, పరిస్థితులు కుదుటపడిన వెంబడే డ్రోన్ల పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. డ్రోన్ల ద్వారా తక్కువ ఖర్చుతో ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని తెలిపారు. మరోవైపు డ్రోన్లను రూపొందించడానికి బిలియన్ డాలర్లు అవసరం ఉండదని ప్రభుత్వ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే సాఫ్ట్వేర్ సేవలను అందించడంలో భారత్ ముఖ్య పాత్ర పోషించిన విషయం తెలిసిందే. పవర్ జెనరేటర్స్, ఆయిల్ కంపెనీలలో సాఫ్టవేర్‌ను ఉపయోగించడంలో దేశీయ ఐటీ కీలక పాత్ర పోషిస్తుందని.. అలాగే డ్రోన్ల ఉపయోగించే క్రమంలో ఐటీ సేవల ద్వారా ఖర్చును తగ్గించవచ్చని సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. చదవండి: స్విగ్గీ గుడ్ న్యూస్ : 3 లక్షల ఉద్యోగాలు -
‘టీ వర్క్స్’ టెక్నాలజీతో ఎయిరోసోల్ బాక్సులు
సాక్షి, హైదరాబాద్: కరోనా రోగులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులకు రక్షణ కవచంలా పనిచేసే ఎయిరోసోల్ బాక్సులు, మాస్క్‌ల తయారీకి అవసరమైన సాంకేతికతను రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుబంధ సంస్థ ‘టీవర్క్స్’అందించింది. నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)తో పాటు బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ అనే సంస్థ కూడా ఎయిరోసోల్ బాక్సుల తయారీలో పాలుపంచుకుంది. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడే వారికి నోరు, శ్వాసనాళం ద్వారా ఎండో ట్రాకియల్ ట్యూబ్‌ను అమర్చేందుకు పారదర్శకంగా ఉండే ఈ ఎయిరోసోల్ బాక్సులు ఉపయోగపడతాయి. కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్సలో భాగంగా ట్యూబ్‌ను అమర్చే క్రమంలో వైద్యులు, సహాయ సిబ్బందికి ఈ బాక్సులు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఎయిరోసోల్ బాక్సుల అవసరాన్ని గుర్తించిన నిమ్స్ విద్యార్థుల కోసం ‘డూ ఇట్ యువర్ సెల్ఫ్ సైన్స్ కిట్లు’(డీఐయూ కిట్స్) తయారు చేసే బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ అనే సంస్థకు బాధ్యత అప్పగించింది. ఈ కిట్ల నమూనాపై ఆన్లైన్లో శోధించిన సదరు సంస్థకు తైవాన్‌కు చెందిన ఓ వైద్యుడు తయారు చేసిన ఎయిరోసోల్ బాక్స్ నమూనా దొరికింది. వీటిని స్థానికంగా ఉత్పత్తి చేయడంలో సాంకేతిక అవరోధాలు ఎదురవడంతో ‘టీ వర్క్స్’రంగంలోకి దిగి అవసరమైన సాంకేతికతను సమకూర్చింది. స్థానికంగా లభించే ముడివనరులు, సాంకేతికతతో ఎయిరోసోల్ కిట్లను తయారు చేసిన బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ సంస్థ మరిన్ని నమూనాలు రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించింది. వాడిన కిట్లను పడేయడం (డిస్పోజల్), ఒకసారి ఉపయోగించిన బాక్సులను మళ్లీ వాడటం (రీ యూజబుల్) డిజైన్లు తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఒక్కో ఎయిరోసోల్ బాక్సు ధర రూ.2వేలు నుంచి రూ.5వేల వరకు ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నిమ్స్‌కు పది కిట్లు సరఫరా చేసిన బటర్‌ఫ్లై ఎడ్యుఫీల్డ్ అవసరానికి అనుగుణంగా బాక్సుల సరఫరా చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. కాగా టీ వర్క్స్ పనితీరుపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపిస్తూ ‘అవసరాలే ఆవిష్కరణలకు మాతృక’అని వ్యాఖ్యానించారు. -
నకిలీ వార్తల ఏరివేతపై మీ వైఖరేంటి?
న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విట్టర్, గూగుల్ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలు, ద్వేషపూరిత ప్రసంగాలను తొలగించే అంశంపై తన వైఖరిని తెలియజేయాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి ఒక నోటీసు జారీ చేసింది. బుధవారం కేంద్ర హోం, ఆర్థిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆర్ఎస్ఎస్ మాజీ సిద్ధాంతకర్త కె.ఎన్.గోవిందాచార్య దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 14న జరగనుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం.. ట్విట్టర్, ఫేస్బుక్, గూగుల్‌లు భారత్‌లో తమ అధికార ప్రతినిధుల వివరాలను బహిర్గతపరిచేలా ఆయా సంస్థలను ఆదేశించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది విరాజ్ గుప్తా డిమాండ్ చేశారు. ద్వేషపూరిత ప్రసంగాలకు స్వర్గ ధామాలైపోయినా సామాజిక మాధ్యమాల్లో చట్టాలను అమలు చేసే వ్యవస్థ పోతోందని, అందుకు జవాబుదారీ అయిన అధికారులు ఎవరనేది తెలియకపోవడమూ ఇందుకు కారణమని పిటిషన్లో పేర్కొన్నారు. అలర్లకు, ఆస్తుల విధ్వంసానికి సామాజిక మాధ్యమాలు ఒక పనిముట్టుగా మారకూడదని, భావప్రకటన స్వేచ్ఛలో భాగమని చెప్పుకోవడమూ సరికాదని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛ అన్న భావనను ఈ సామాజిక మాధ్యమాలు దుర్వినియోగం చేస్తున్నాయని, భారతీయ చట్టాలను పాటించడం లేదని ఆరోపించారు. తగిన చర్యలేవీ లేని కారణంగానే రెచ్చగొట్టే ప్రసంగాలూ ఎక్కువ అవుతున్నాయని పిటిషనర్ ఆరోపించారు. -
పరిమితి దాటి అనుమతించొద్దు
సాక్షి, అమరావతి: ఆ కాలేజీలో 240 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులున్నారు.. కానీ కంప్యూటర్లు మాత్రం 50 లోపే! ఇదేకాదు.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర డిమాండ్ ఉన్న కోర్సుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కొన్ని కాలేజీలు విద్యార్థులు ఎక్కువగా చేరే కోర్సులకు అదనపు సెక్షన్లు ఏర్పాటు చేస్తున్నాయి. అయితే.. విద్యార్థుల చేరికలకు, సెక్షన్ల పెంపునకు అనుగుణంగా ల్యాబ్‌లు, కంప్యూటర్లు ఉండటం లేదు. 10 నుంచి 20 మంది విద్యార్థులకు ఓ కంప్యూటర్ను అమర్చి మమ అనిపిస్తున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్ల భర్తీకి అఖిల భారత సాంకేతిక విద్యామండలి నుంచి అనుమతులు తెచ్చుకుంటున్న కాలేజీలు ఆమేరకు సౌకర్యాలు మాత్రం కల్పించడం లేదు. అవన్నీ అంతో ఇంతో పేరున్న కాలేజీలు కావడంతో విద్యార్థులు వాటివైపు పరుగులు తీస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటున్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లకు రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాయి. మరోపక్క కన్వీనర్ కోటా కింద కూడా ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ భారీగా పొందుతున్నాయి. చివరకు అక్కడ చేరిన విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ప్రమాణాలూ పతనమవుతున్నాయి. డిమాండ్‌ను బట్టి అమ్మకానికి సీట్లు ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ ఇటీవల పలు కాలేజీల్లో తనిఖీలు నిర్వహించిన సందర్భంగా ఇలాంటి పలు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఏఐసీటీఈ, వర్సిటీల్లో పైరవీలు జరిపి కొన్ని యాజమాన్యాలు నెట్టుకొస్తున్నాయి. మరోవైపు ఇతర కాలేజీల్లో ఆయా కోర్సుల సీట్లు భర్తీ కావడం గగనంగా మారుతోంది. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మా కాలేజీల్లో 32 విభాగాలకు సంబంధించిన కోర్సులున్నాయి. వీటిలో 70 శాతం కన్వీనర్ కోటా కింద 1,06,203 సీట్లు ఉండగా 60,315 సీట్లు భర్తీ అయ్యాయి. 45,888 సీట్లు మిగిలాయి. భర్తీ అయిన సీట్లన్నీ సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ఈఈఈ సివిల్ వంటి ముఖ్యమైన విభాగాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ సీట్లను కూడా కొన్ని కాలేజీల్లోనే అదనపు సెక్షన్ల పేరిట భర్తీ చేస్తున్నారు. ఇక మేనేజ్మెంట్ కోటాలోని 30 శాతం సీట్లను కూడా డిమాండ్‌ను బట్టి అమ్మకానికి పెడుతున్నారు. దెబ్బతింటున్న ప్రమాణాలు.. సరైన ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు లేని కాలేజీల్లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో అదనపు సెక్షన్లకు అనుమతి ఇవ్వడం వల్ల ప్రమాణాలు దెబ్బతింటున్నాయని ఉన్నత విద్య పర్యవేక్షణ, నియంత్రణ కమిషన్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు మాత్రమే అదనపు సెక్షన్లకు అనుమతించాలని, పరిమితికి మించి మంజూరు చేయవద్దని ఏఐసీటీఈని కోరాలని కమిషన్ భావిస్తోంది. -
ప్లేస్‌మెంట్స్‌లో టెకీల హవా..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం ఇంజనీరింగ్ నైపుణ్యాలకు డిమాండ్‌ను ఎంతమాత్రం తగ్గించలేదు. నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (నిట్స్)ల్లో ఫైనల్ ప్లేస్‌మెంట్స్‌లో వెల్లడైన ట్రెండ్స్ ఐటీ నియామకాలపై స్లోడౌన్ ప్రభావం లేదనేందుకు అద్దం పట్టాయి. ఈ ఏడాది ఆగస్ట్‌తో ప్రారంభమైన ప్లేస్మెంట్ సీజన్లో గత ఏడాది కంటే మెరుగ్గా ఈ ఇంజనీరింగ్ కాలేజీలు తమ విద్యార్ధులకు అత్యధిక ఆఫర్లను దక్కించుకోవడమే కాకుండా మెరుగైన ప్యాకేజ్‌లను అందుకున్నాయి. ఈ ఏడాది ప్లేస్‌మెంట్స్‌కు ఆటోమొబైల్, కన్జూమర్ గూడ్స్ కంపెనీలు దూరమైనా టెక్నాలజీ, సేవల కంపెనీలు పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్కు దిగాయని పలు నిట్స్‌కు చెందిన ప్లేస్మెంట్ విభాగం అధికారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే సూరత్, వరంగల్, కాలికట్ సహా నిట్స్‌లో సగటు వేతనం 30 శాతం అధికమని అధికారులు వెల్లడించారు. నిట్ జలంధర్‌లో సగటు వార్షిక వేతనం 54 శాతం వరకూ పెరగడం విశేషం. తమ విద్యార్ధికి మైక్రోసాఫ్ట్ రూ 39.02 లక్షల వార్షిక వేతన ఆఫర్ ఇచ్చిందని నిట్ జలంధర్ ప్లేస్మెంట్ ఇన్చార్జ్ ప్రొఫెసర్ ఎస్ ఘోష్ తెలిపారు. తమ ఇనిస్టిట్యూట్‌లో సగటు వార్షిక వేతనం రూ 11 లక్షలుగా నమోదైందని చెప్పారు. గత ఏడాది కంటే అధిక వేతనంతో ఎక్కువమంది విద్యార్ధులను కంపెనీలు నియమించుకున్నాయని వెల్లడించారు. ఇక వచ్చే నెల నుంచి ఐఐటీల్లో ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభం కానుంది. ఐఐటీల్లో ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్లు గత ఏడాది కంటే 19-24 శాతం పెరగడం గమనార్హం. కోడింగ్, బిజినెస్ అనలిటిక్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విభాగాల్లో రిక్రూట్మెంట్కు అధిక డిమాండ్ ఉందని ప్లేస్మెంట్ నిపుణులు చెబుతున్నారు. -
ఐటీ పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఎంపీ ఎంవీవీ
సాక్షి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కమిటీ సభ్యుడిగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారా యణ నియమి తులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంవీవీకి స్థానం కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఉభయసభలకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చైర్మన్‌గా డాక్టర్ శశిథరూర్ వ్యవహరించనుండగా లోక్‌సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది సభ్యుల చొప్పున మొత్తం 31 మందికి స్థానం కల్పించారు. ఏపీ నుంచి ఎంవీవీకి స్థానం లభించింది. ఈ విషయంపై ఎంపీ స్పంది స్తూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆ రంగ పురోగాభివృద్ధి సాధించాల్సిన అవసరంపై దృష్టి సారిస్తానన్నారు. -
పోరుకు ‘సోషల్ మీడియా’ సై!
సోషల్ మీడియా వేదికగా ప్రచారమయ్యే దేశ సమగ్రతకూ, సార్వభౌమత్వానికీ నష్టం చేకూర్చే విషయాలను నిరోధించేందుకు కేంద్రం విధిస్తున్న ఆంక్షలను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజాలు సిద్ధమౌతున్నాయి. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్లలో ఉన్న చట్టవ్యతిరేక అంశాలను తొలగించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కొన్ని విధివిధానాలను రూపొందించింది. ఈ నిబంధనలను బట్టి సామాజిక మాధ్యమాల్లో ఉన్న విషయం చట్టవ్యతిరేకమైనదని ప్రతిపాదించిన 24 గంటల్లోపే సోషల్ మీడియా నుంచి ఆ సమాచారాన్ని తొలగించాల్సి ఉంటుంది. తామంతా దేశ సమగ్రతపై నిబద్ధతతో ఉన్నామని, అయితే సోషల్ మీడియాను ప్రభుత్వం నియంత్రించాలని చూస్తే కంపెనీలు ఊరుకోవని అంతర్జాతీయ సోషల్ మీడియా కంపెనీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా నియంత్రణపై భారతప్రభుత్వ ఆంక్షలను చట్టపరంగా ఎదుర్కొనేందుకు ఉన్న అన్ని అవకాశాలను ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా వేదికలు పరిశీలించి, తమ అభ్యంతరాలను ఇన్‌ర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ముందుంచేందుకు సిద్ధమవుతున్నారు. నిఘా ఎందుకు? భారత దేశంలో 50 కోట్ల మంది ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు. దేశంలో 30 కోట్ల మంది ఫేస్‌బుక్‌ని వాడుతున్నారు. లక్షలాది మంది ప్రజలు మన దేశంలో ట్విట్టర్‌ని ఉపయోగిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం తెస్తోన్న కొత్త నిబంధనలు ఇంటర్నెట్ వినియోగదారుల ప్రతి కదలికపై నిఘాఉంచడం వల్ల అది వ్యక్తిగత స్వేచ్ఛకు భంగకరంగా మారుతుందని భావిస్తున్నారు. ఆన్లైన్లో ఉన్న సమాజానికి నష్టం చేకూరుస్తున్న విషయాలను నియంత్రించడానికి ఇది సరైన మార్గం కాదనీ, ఈ విషయంలో భారత ప్రభుత్వ విధానాలు ‘‘గుడ్డిగానూ, అసమానంగానూ’’ఉన్నాయని, ఇది పౌరులపై మితిమీరిన నియంత్రణకూ, వ్యక్తుల భావప్రకటనా స్వేచ్ఛకూ విఘాతం కలిగిస్తుందని ఇంటర్నెట్ కంపెనీ దిగ్గజాలు భావిస్తున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛకు ఏమీ కాదు.. అయితే సోషల్ మీడియాను సురక్షితంగా ఉంచడమే ఈ నిబంధనల లక్ష్యమని, ఇది భావప్రకటనా స్వేచ్ఛను నియంత్రించడానికో, లేక వారిపై తమ అభిప్రాయాలను రుద్దడానికో ఉద్దేశించింది కాదని ఐటీ మంత్రిత్వ శాఖ సహకార్యదర్శి ఎస్.గోపాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. అయితే ట్విట్టర్ మాత్రం ఐటీ శాఖ ఆంక్షలతోనూ, అభిప్రాయాలతో ఏకీభవిస్తోందని ఆ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. టెక్నాలజీ కంపెనీల మెడపై వేలాడుతున్న కత్తి సోషల్ మీడియాపై ఆంక్షలని, టెక్నాలజీ న్యాయనిపుణులు నిఖిల్ నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. నియంత్రణలివీ.. సోషల్ మీడియా నియంత్రణలు అన్ని చోట్లా ఒకేరకంగా లేవు. సామాజిక మాధ్యమ కంపెనీలు స్థానికంగా కార్యాలయాలను ఏర్పాటు చేసి, డేటాని జాగ్రత్తపరచాలని వియత్నాం కోరింది. అలాగే గోప్యసమాచారాన్ని పోలీసులకు అందుబాటులో ఉంచాలని ఆస్ట్రేలియా పార్లమెంటులో బిల్లు ఆమోదించడం ద్వారా సోషల్ మీడియా కంపెనీలపై ఒత్తిడితెచ్చారు. జర్మనీలో అయితే 24 గంటలలోపు చట్టవ్యతిరేక సమాచారాన్ని తొలగించడానికీ, లేదంటే జరిమానా చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి. -
ఐటీలో 5 లక్షల కొలువులు
హైదరాబాద్: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసుల రంగం, స్టార్టప్‌లు వచ్చే ఏడాది భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నాయి. 2019లో దాదాపు 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ తెలియజేశారు. ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారాయన. దాదాపు ఏడేళ్ల పాటు స్థిరంగా ఉండిపోయిన ఎంట్రీ స్థాయి ఉద్యోగుల జీతభత్యాల ప్యాకేజీలు గతేడాది సుమారు 20 శాతం మేర పెరిగాయని తెలిపారు. 2018 సమీక్ష, 2019 అంచనాల మీద మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘2018లో హెచ్1బీ వీసాల నిబంధనలు కఠినతరమయ్యాయి. దీంతో భారత ఐటీ కంపెనీలు జపాన్, ఆగ్నేయాసియా దేశాలపై మరింత దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ సేవల రంగం మళ్లీ వృద్ధి బాట పడుతోంది. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ మంత్రి కేటీఆర్ మార్కెటింగ్ నైపుణ్యాలతో మరిన్ని కొత్త కంపెనీలు హైదరాబాద్‌కి వస్తున్నాయి. హైదరాబాద్ హాట్ డెస్టినేషన్‌గా మారింది‘ అని పాయ్ పేర్కొన్నారు. స్టార్టప్‌లలో 2 లక్షల ఉద్యోగాలు.. దేశీ స్టార్టప్ సంస్థలు వచ్చే ఏడాది సుమారు 2,00,000 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని పాయ్ తెలిపారు. స్టార్టప్స్ గతేడాది 1,50,000 మందిని నియమించుకున్నాయని.. ప్రస్తుతం వీటిల్లో ఉద్యోగుల సంఖ్య 6,00,000 పైచిలుకు ఉంటుందని ఆయన తెలిపారు. ఐటీ సర్వీసులు, స్టార్టప్స్ కలిస్తే 4.5 లక్షలు – 5 లక్షల దాకా నియామకాలు ఉండొచ్చన్నారు. 2018లో ఇవి రెండూ కలిపి సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది దాకా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నట్లు వివరించారు. ‘స్టార్టప్‌లు కూడా పెద్ద కంపెనీలుగా ఎదుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 39,000 పైచిలుకు స్టార్టప్స్ ఉన్నాయి. ప్రతీ సంవత్సరం కొత్తగా 5,000 ఏర్పడుతున్నాయి. ఇవి హైరింగ్ చేపట్టినప్పుడు ఇంజనీర్లే కాకుండా వివిధ రకాల ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ రకంగా వీటిల్లోనూ ఉద్యోగావకాశాలు గణనీయంగా ఉన్నాయి‘ అని పాయ్ తెలిపారు. ఎంట్రీ లెవల్లో రూ.5 లక్షలు? ఐటీ సేవల సంస్థల్లో ఉద్యోగులు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందుతుండటం రెట్టింపు స్థాయిలో జరుగుతోందని, ఐటీ కంపెనీల్లో డిజిటల్ విభాగాల ఆదాయాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతోందని పాయ్ చెప్పారు. ‘‘ఫ్రెషర్స్ జీతభత్యాల ప్యాకేజీ చాలా కాలం తర్వాత 20 శాతం మేర పెరగడం మంచి పరిణామం. మరింత సుశిక్షితులైన నిపుణులను ఆకర్షించేందుకు కంపెనీలు మరింత ఎక్కువ జీతభత్యాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్ ప్యాకేజీలు ప్రస్తుతం వార్షికంగా రూ. 4.5–5 లక్షల దాకా ఉంటున్నాయి. నిజానికి చాలా కాలం పాటు ఎంట్రీ లెవెల్లో జీతాలు పెరగకుండా స్థిరంగా ఉండిపోయాయి. దీంతో ఉద్యోగులు నిరాశలో మునిగారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పోలిస్తే పెద్ద నగరాల్లో డెలివరీ బాయ్స్ కూడా నెలకు రూ.50,000 సంపాదిస్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం‘ అని పాయ్ వ్యాఖ్యానించారు. -
ఐటీ సంస్థల చలో క్యాంపస్!
బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల్లో మళ్లీ ఫ్రెషర్స్ నియామకాలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్య స్థాయి కంపెనీలైన మైండ్‌ట్రీ, జెన్సర్, హెక్సావేర్ తదితర సంస్థలు క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌పై దృష్టి పెడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఒక్కో సంస్థ సుమారు వెయ్యి మంది దాకా ఫ్రెషర్స్‌ను తీసుకోనున్నాయి. మైండ్‌ట్రీ గత ఆర్థిక సంవత్సరంలో 1,285 మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంది. ఈ సారి సంఖ్య అంతకు మించి ఉండగలదని మైండ్‌ట్రీ వర్గాలు తెలిపాయి. మరోవైపు.. గతేడాది 1,000 మంది దాకా ఫ్రెషర్స్‌ను తీసుకున్న జెన్సర్.. ఈ ఏడాది అదే స్థాయిలో లేదా అంతకు మించి రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోంది. తామూ క్యాంపస్ నియామకాలను పెంచుకుంటున్నట్లు, ఇప్పటికే 500 మందిని రిక్రూట్ చేసుకున్నట్లు హెక్సావేర్ వర్గాలు తెలిపాయి. పెద్ద కంపెనీలు మాత్రం అంతగా క్యాంపస్ రిక్రూట్మెంట్స్ వైపు చూడటం లేదు. అవసరానికి తగ్గట్లుగా వివిధ విభాగాల్లో అల్లుకుపోగలిగే చిన్న, మధ్య స్థాయి ఐటీ కంపెనీలే ఫ్రెషర్స్‌పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. దీంతో గతంలో అంత కాకపోయినప్పటికీ చెప్పుకోతగ్గ స్థాయిలో మళ్లీ ఫ్రెషర్స్ నియామకాలు ఉంటున్నాయని మైండ్‌ట్రీ వైస్ ప్రెసిడెంట్ పంకజ్ ఖన్నా తెలిపారు. 2014–15 స్థాయితో పోలిస్తే 60–70% హైరింగ్ ఉంటోందని చెప్పారు. డిజిటల్ నైపుణ్యాలపై దృష్టి ... మధ్య స్థాయి ఐటీ కంపెనీల ఆదాయాల్లో సగటున 40 శాతం వాటా డిజిటల్ వ్యాపారం నుంచే ఉంటోంది. దీంతో అవిæప్రధానంగా డిజిటల్ నైపుణ్యాలపై దృష్టి పెడుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్, అనలిటిక్స్, మెషీన్ లెర్నింగ్ తదితర డిజిటల్ కోర్సుల్లో సర్టిఫికేషన్ ఉన్న విద్యార్థులను ఎంపిక చేసుకుంటున్నాయి. ఇది గుర్తించిన కాలే జీలు.. డిజిటల్ నైపుణ్యాలపై పట్టు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహిస్తున్నాయి. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నివేదిక ప్రకారం మధ్య స్థాయి ఐటీ సంస్థల్లో 33–35 శాతం సిబ్బంది డిజిటల్ నైపుణ్యాల్లో శిక్షణ పొందిన వారు ఉంటున్నారు. అదే చిన్న స్థాయి కంపెనీల్లోనైతే ఇది 38 శాతంగా ఉంటోంది. మరోవైపు, ఐటీ కంపెనీలు సిబ్బంది వినియోగ స్థాయిని కూడా క్రమంగా పెంచుకుంటున్నాయి. దీంతో బెంచ్ సిబ్బంది సంఖ్య 18 శాతానికి తగ్గింది. వనరుల వినియోగం అయిదు శాతం మేర పెరిగింది. దేశీ ఐటీ–బీపీఎం పరిశ్రమ విలువ 167 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 7–9 % వృద్ధి చెందగలదని అంచనా. ఇది 10–12% ఉంటుందని 2016–17లో నాస్కామ్ అంచనా వేసినప్పటికీ.. మారిన పరిస్థితుల నేపథ్యంలో వాటిని సవరించక తప్పలేదు. ఐటీ రంగంలో సుమారు 4,00,000 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. కొన్నాళ్లుగా ఉద్యోగాల కల్పన వృద్ధి మాత్రం మందగించింది. గతేడాది ఐటీ లో నికరంగా లక్ష మంది సిబ్బంది తోడైనట్లు అంచనా. -
ఉద్యోగాలే కాదు... స్థలాల్లోనూ కోతే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు ఉద్యోగులను తొలగించటం మాత్రమే కాకుండా... స్థలాల విషయంలోనూ కోతలు విధించాయి. 2017లో దేశంలోని మొత్తం కార్యాలయాల లావాదేవీల్లో ఐటీ రంగం వాటా తగ్గడమే ఇందుకు నిదర్శనం. 2016లో మొత్తం క్రయవిక్రయాలు జరిగిన కార్యాలయ స్థలాల్లో ఐటీ రంగం వాటా 49 శాతం కాగా... 2017లో ఇది 32 శాతానికి పడిపోయినట్లు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ సీబీఆర్ఈ తెలియజేసింది. ‘భారతదేశం: కార్యాలయాల స్థల లావాదేవీలు’ పేరిట కంపెనీ విడుదల చేసిన నివేదికలో పలు కీలకాంశాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... 2016లో 2 శాతంగా ఉన్న కో–వర్కింగ్ స్పేస్ (బిజినెస్ సెంటర్స్) రంగం అనూహ్యంగా 2017లో 6 శాతానికి పెరిగింది. 2017లో ఈ రంగం మొత్తం 2.6 మిలియన్ చ.అ. స్థలాన్ని ఆక్రమించింది. బీఎఫ్ఎస్ఐ రంగం 13 శాతం నుంచి 19 శాతానికి, ఇంజనీరింగ్ అండ్ తయారీ రంగం 14 శాతం నుంచి 17 శాతానికి పెరిగింది. కొత్త ఆఫీస్ స్పేస్ 18 శాతం డౌన్.. దేశంలో ఆఫీసు స్థలాల లావాదేవీలు వరుసగా మూడో ఏడాది 40 మిలియన్ చ.అ.లను దాటాయి. 2017లో మొత్తం 42 మిలియన్ల చ.అ. లావాదేవీలు జరగ్గా.. ఇందులో 50 శాతం వాటాను బెంగళూరు, ఢిల్లీ– ఎన్సీఆర్ నగరాలే ఆక్రమించేశాయి. అయితే కొత్త కార్యాలయాల సప్లయి మాత్రం 2016తో పోలిస్తే 18 శాతం తగ్గి 29 మిలియన్ చ.అ.లకు చేరింది. 2017లో జరిగిన మొత్తం లావాదేవీల్లో 50 వేల చ.అ.ల కంటే తక్కువ లావాదేవీలే 90 శాతం వాటాను ఆక్రమించాయి. -
దేశీ ఐటీపై పెరుగుతున్న వ్యయాలు
న్యూఢిల్లీ: డిజిటల్ సేవల వ్యాప్తి దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దేశీయంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై (ఐటీ) చేసే వ్యయాలు ఈ ఏడాది 11.6 శాతం పెరిగి రూ.2,33,273 కోట్లకు చేరనున్నట్టు ‘క్యూస్ ఏజ్’ కన్సల్టింగ్ సంçస్థ తన నివేదికలో తెలియజేసింది. 2017లో ఐటీ కోసం నిధుల వినియోగం 12.9 శాతం ఉంటుందని అనుకుంటే, దీనికంటే తక్కువగా 10.3 శాతమే సాధ్యమైంది. దీనికి పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ కారణాలుగా క్యూస్ ఏజ్ కన్సల్టింగ్ వ్యవస్థాపకుడు కపిల్‌దేవ్ సింగ్ పేర్కొన్నారు. 2018లో కంపెనీలు, ప్రభుత్వం ఐటీపై చేసే వ్యయాల్లో 25 శాతం డిజిటల్ టెక్నాలజీ కోసమే ఉంటాయని సంçస్థ అంచనా వేసింది. ఇందులో అనలిటిక్స్, మొబిలిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటాయని తెలియజేసింది. ఐటీ కంపెనీల అధిపతులు, సీఐవోల అభిప్రాయాల ఆధారంగా క్యూస్ ఏజ్ కన్సల్టింగ్ ఈ నివేదికను రూపొందించింది. 60 శాతానికి పైగా కంపెనీలు ఆధునిక డిజిటల్ టెక్నాలజీలైన బిగ్‌డేటా అనలిటిక్స్, ఆఫ్టిïషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), మెషిన్ లెర్నింగ్, రోబోలపై ఆసక్తిని ప్రదర్శించాయి. డిజిటల్లో తొలి విప్లవం సోషల్, మొబైల్, అనలైటిక్స్, క్లౌడ్ (ఎస్ఎంఏసీ) రూపంలో ఉందని, కంపెనీలు తమ వ్యాపార విభాగాల్లో వీటిని అమలు చేస్తున్నాయని సింగ్ పేర్కొన్నారు. 2018లో డిజిటల్లో రెండో విప్లవం బిగ్ డేటా అనలైటిక్స్, ఏఐ, ఐవోటీ, మెíషీన్ లెర్నింగ్, రోబోల రూపంలో ఉంటుందని, 18–24 నెలల్లో ఇది ప్రధాన విభాగంగా మారుతుందని కపిల్ వివరించారు. -
టెక్నాలజీతోనే అభివృద్ధి సాధ్యం
సాక్షి, అమరావతి: శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం వల్లే అభివృద్ధి, పారదర్శకత సాధ్యమని సీఎం ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. టెక్నాలజీ వినియోగానికి తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. మంగళగిరి ఆటోనగర్‌లో పదెక రాల విస్తీర్ణంలో రూ.600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన పై డేటా సెంటర్‌ను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మూడు దశాబ్దాలుగా తాను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో మమేకమయ్యానని చెప్పారు. ఆగస్టు 3న మంత్రివర్గ సమావేశం: రాష్ట్ర మంత్రివర్గం ఆగస్టు 3న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన తాత్కాలిక సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలపడంతో పాటు పలు సంస్థలకు భూముల కేటాయింపుపై నిర్ణయం తీసుకోనున్నారు. -
ఐటీ + ఐటీ= ఐటీ
రేపటి భారతానికి ప్రధాని సరికొత్త ఫార్ములా ► మైండ్ మారకపోతే మార్పు జరగదు ► అన్ని వర్గాలూ సాంకేతికతను అలవర్చుకోవాలి ► సుప్రీంకోర్టులో ‘సమగ్ర కేసు సమాచార నిర్వహణ’ ప్రారంభోత్సవంలో ప్రధాని ► సరికొత్త వ్యవస్థతో పారదర్శకత పెరుగుతుందన్న సీజేఐ న్యూఢిల్లీ: భవిష్యత్ భారతావనికి ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త నిర్వచనాన్నిచ్చారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఇండియన్ టాలెంట్ (ఐటీ) కలిస్తే ఇండియా టుమారో (ఐటీ) సాధ్యమవుతుందన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేసుల డిజిటల్ ఫైలింగ్ కోసం సుప్రీంకోర్టులో ‘సమగ్ర కేసు నిర్వహణ సమాచార వ్యవస్థ’ను బుధవారం ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భారతీయుల మేధస్సుకు సాంకేతికతను జోడించటం వల్ల భవిష్యత్ భారతాన్ని దర్శించొచ్చన్నారు. ‘సరికొత్త సాంకేతికతను కొంచెం కొంచెంగా కాకుండా ఒకేసారి అందిపుచ్చుకోవాల్సిన అవసరం దేశానికి ఉంది. సరైన సాంకేతిక లాభాలు కనిపించాలంటే.. సమాజంలోని అన్ని వర్గాలు సాంకేతికతను ఒంటబట్టించుకోవాలి. కొందరికే ఈ సాంకేతికత పరిమితమైతే లాభం ఉండదు’ అని మోదీ వెల్లడించారు. పని సంస్కృతికి అనుగుణంగా ఆలోచన మైండ్‌సెట్ సమస్యను కూడా మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘పాత మైండ్‌సెట్ మారాలి. సాంకేతికతను ప్రవేశపెట్టేందుకు ఎంత అటోమేషన్ తీసుకొచ్చినా.. మైండ్‌సెట్ మారకపోతే ఏమీ జరగదు’ అని మోదీ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో çపూల కుండీలు స్థానంలో కంప్యూటర్లు వచ్చాయని.. ఇప్పటికీ వీటిని షో పీసులుగానే వాడుతున్నారని మోదీ తెలిపారు. ‘ఇదీ మైండ్‌సెట్ సమస్య’ అన్నారు. దేశంలో మారుతున్న పనిసంస్కృతికి అనుగుణంగా మన ఆలోచన విధానం కూడా మారాల్సిన అవసరం ఉందన్నారు. వేసవిసెలవుల్లోనూ కేసులు విచారించేందుకు న్యాయవ్యవస్థ ముందుకు రావటం చాలా గొప్ప నిర్ణయమని మోదీ ప్రశంసించారు. న్యాయవ్యవస్థ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు అవసరమైన బలాన్ని అందిస్తుందన్నారు. సమగ్ర కేసు నిర్వహణ సమాచార వ్యవస్థ ద్వారా కక్షిదారులు కేసుకు సంబంధించిన వివరాలను పొందటంతోపాటు ఆన్లైన్లోనే కేసుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చని మోదీ తెలిపారు. దీని ద్వారా సుప్రీంకోర్టు కార్యకలాపాలు కాగితరహితంగా మారేందు కు ఒక అడుగు ముందుకు పడుతుందన్నారు. ఈ వ్యవస్థను సుప్రీం వెబ్సైట్లో మోదీ అప్లోడ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ట్యాగ్‌లైన్ అయిన ‘దేశ్ బదల్ రహాహై’ (దేశం మారుతోంది) పదాన్ని మోదీ గుర్తుచేశారు. ‘దేశం మారుతోంది. ఈ రోజు సెలవుంది (బుధవారం బుద్ధపౌర్ణమి). అయినా మేం పనిచేస్తున్నాం’ అని మోదీ అన్నారు. తన సూచన మేరకు చాలామంది గైనకాలజిస్టులు ప్రతినెలా 9న పేద గర్భిణులకు ఉచితవైద్యం అందిస్తున్నారని.. అలాగే న్యాయవాదులు కూడా పేదల కేసులను ఉచితంగా వాదించేందుకు ‘ప్రొ బోనో’ పథకంలో చేరాలని మోదీ కోరారు. సుప్రీంకోర్టులో వైఫై ఎందుకొద్దు?: అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌లో వైఫై ఉన్నప్పుడు భారత సుప్రీం కోర్టులో మాత్రం వైఫై సదుపాయం ఎందుకు ఉండకూడదని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ప్రశ్నించారు. ‘సుప్రీంకోర్టు ప్రాంగణంలో వైఫై సదుపాయం లేదు. వైఫై ఉంటే సుప్రీంకోర్టు భద్రతకు ముప్పువాటిల్లుతుందని, సమాచారం బయటకు పొక్కుతుందని ఎవరో మాజీ సీజేఐకి చెప్పారు’ అని చలమేశ్వర్ తెలిపారు. కేసుల ఫైలింగ్‌కు సంబంధించిన ఈ డిజిటైజ్డ్ వ్యవస్థ.. 20 ఏళ్ల క్రితం జరిగిన సుప్రీంకోర్టు కంప్యూటరీకరణ తర్వాత ఓ కీలకమైన పరిణామంగా పేర్కొన్నారు. పారదర్శకత కోసమే కేసుల డిజిటల్ ఫైలింగ్ ద్వారా పారదర్శకత పెరుగుతుందని సీజేఐ జస్టిస్ జేఎస్ ఖేహర్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఉన్న 24 హైకోర్టుల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత కిందికోర్టులోనూ ఈ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. ‘ఈ వ్యవస్థ ద్వారా కక్షిదారు తన జీవితంలో ఒక కేసు మాత్రమే వేసేందుకు వీలుంటుంది. ఈ వ్యవస్థను అతిక్రమించే అవకాశమే లేదు. ఇందులో అప్లోడ్ చేసిన దస్తావేజులను వక్రీకరించే అవకాశమే ఉండదు. ఈ రికార్డులను భద్రపరిచేందుకు నిబంధనల్లో మార్పులు చేయాల్సిన పనిలేదు. ఈ డిజిటైజేషన్ విధానంలో ఉభయ పక్షాల లిఖిత వాదనలు జరపాల్సిన అవసరం ఉండదు’ అని జస్టిస్ ఖేహర్ వెల్లడించారు. ఓ కేసు సుప్రీంకోర్టుకు బదిలీ అయితే.. కేసుకు సంబంధించి హైకోర్టు వద్దనున్న పెద్ద పుస్తకం సుప్రీంకోర్టుకు బదిలీ అవుతుందన్న జస్టిస్ ఖేహర్.. ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చాక కేవలం ఫైల్ చేస్తున్న కేసు నంబరును వేస్తే సరిపోతుందన్నారు. ప్రతి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగం.. ఏ కేసులో తమను భాగస్వామిని చేశారనే విషయం తెలిసిపోతుంది. కేసులను వీలైనంత త్వరగా విచారించేందుకు వేసవి సెలవుల్లో పనిచేయాల్సిందిగా హైకోర్టు న్యాయమూర్తులను కోరినట్లు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
కేసీఆర్‌ను కాపీ కొట్టిన చంద్రబాబు
అమరావతి: తెలంగాణ ముఖ్యమత్రి కె.చంద్రశేఖరరావును ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కాపీ కొట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్...తనయుడు కేటీఆర్‌కు ఏ శాఖలను అయితే కేటాయించారో...తాజాగా చంద్రబాబు కూడా అదే ఫాలో అయ్యారు. ఎమ్మెల్సీగా రాజకీయ రంగప్రవేశం చేసిన నారా లోకేశ్‌కు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ లో కొత్తగా తీసుకున్న మంత్రులకు సీఎం చంద్రబాబు సోమవారం శాఖలు కేటాయించారు. తెలంగాణలో కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తరహాలోనే నారా లోకేశ్‌కు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ కేటాయించారు. ఐటీ శాఖ తన చేతుల్లో ఉంటే తాను కూడా కేటీఆర్ లాగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు అనువుగా ఉంటుందని లోకేశ్...చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి మరీ ఆ శాఖను తీసుకున్నట్లు సమాచారం. ఐటీ శాఖ కారణంగానే తెలంగాణలో కేటీఆర్ ఇమేజీ పెంచుకుంటున్నారని, ఆ కారణంగానే లోకేశ్ సైతం ఐటీ శాఖను అప్పగించాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. కాగా గతంలో ఐటీ శాఖ నిర్వహించిన పల్లె రఘునాథరెడ్డిని కేబినెట్ నుంచి చంద్రబాబు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. దాంతో ఆ శాఖను తన కుమారుడికి కేటాయించారు. మరోవైపు కీలకమైన ఐటీ శాఖను లోకేశ్‌కు అప్పగిస్తే...దాన్ని సమర్థవంతంగా నిర్వహించకపోతే... రాష్ట్ర ఇమేజ్ దెబ్బతింటుందనే పలువురు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. -
ఎంఎస్ఎంఈలకు క్లౌడ్ కంప్యూటింగ్ సబ్సిడీ
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి కంపెనీ(ఎంఎస్ఎంఈ)లు క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ సేవలను అందిపుచ్చుకునేందుకు వీలుగా వాటికి రూ.లక్ష వరకు సబ్సిడీ ఇచ్చే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. క్లౌడ్ కంప్యూటింగ్‌లో భాగంగా ఎంఎస్ఎంఈలు ఇంటర్నెట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ తదితర అవసరాల కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు. రెండేళ్లపాటు ఈ సేవల యూజర్ చార్జీలపై సబ్సిడీ అందించాలన్నది ప్రభుత్వం ఆలోచన. తొలుత ఈ చార్జీలను ఎంఎస్ఎంఈలు తామే స్వయంగా చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి ఖాతాలకు ప్రభుత్వం జమ చేస్తుంది. ‘ఎంఎస్ఎంఈ రంగంలో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ప్రోత్సాహం’ అనే పథకానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం ఈ ప్రతిపాదనను పొందుపరిచింది. -
చెదిరిన ‘సిగ్నేచర్’
గ్లోబల్ టెండర్లకు స్పందన కరువు ఫలితం కొత్తగా మరో మిలీనియం టవర్ 2 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం విశాఖపట్నం : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అభివృద్ధిలో తనకు మించిన వారే లేరని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలను ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు విశ్వసించడం లేదు. ఆయన చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లేనన్న నమ్మకంతో ఐటీ పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. తెల్లారిలేస్తే భాగస్వామ్య సదస్సుల్లో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఊదరగొడ్తున్న సీఎం.. విశాఖలో ఏర్పాటు చేయబోయే సిగ్నేచర్ టవర్ నిర్మాణానికి పిలిచిన గ్లోబల్ టెండర్లకు స్పందనే లేదు. ఏళ్ల తరబడి ఎదురు చూసి, చూసి ఇక ఫలితం లేదని గ్రహించి తమ కలల సిగ్నేచర్ టవర్‌కు మంగళం పాడుతున్నారు. తాజాగా ఇప్పుడు మరో టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు...! చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ హైటెక్ సిటీ తరహాలో విశాఖలో ఐటీ జంట టవర్లను నిర్మించాలని నిర్ణయించారు. వీటికి మధురవాడ ఐటీ సెజ్ హిల్ నంబరు 3లో సుమారు 17 ఎకరాల స్థలాన్ని ప్రతిపాదించారు. వీటి నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. తొలిదశలో నిర్మించే టవర్‌కు సిగ్నేచర్ టవర్గా పేరు పెట్టారు. ఇందులో ఆతిథ్య, షాపింగ్, వినోద, ఆహ్లాద కేంద్రాలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. దీనికి రూ.291 కోట్లు వ్యయం అవుతుందని తేల్చింది. ఏపీఐఐసీతో బిల్ట్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీఎఫ్ఓటీ) విధానంలో దీనిని చేపట్టాలని నిర్ణయించి, అమెరికాకు చెందిన జేమ్స్ లాంగ్ లాసల్లే (జెఎల్ఎల్) అనే సంస్థను కన్సల్టెంట్‌గా నియమించింది. వీటి నిర్మాణానికి ప్రభుత్వం పలుమార్లు గ్లోబల్ టెండర్లను పిలిచినా స్పందన రాకపోవడంతో కంగుతిన్న యంత్రాంగం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ సిగ్నేచర్ టవర్ ఏర్పాటయితే అందులో ఎన్నో ఐటీ కంపెనీలు ఏర్పాటవుతాయని ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. కానీ ఆశాభంగమే ఎదురయింది. ఇక సిగ్నేచర్ టవర్ సాధ్యం కాదన్న నిర్ణయానికొచ్చిన ప్రభుత్వం సరికొత్తగా మరో టవర్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. మరో మిలీనియం టవర్ కోసం సిగ్నేచర్ టవర్‌కు మంగళం పాడేసిన ప్రభుత్వం తాజాగా మిలీనియం టవర్‌ను ఏర్పాటు చేయాలని తలపోస్తోంది. ఇప్పటికే రుషికొండ ఐటీ హిల్స్ మీద మూడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక మిలీనియం టవర్ 2016 నుంచి నిర్మాణంలో ఉంది. ఐదంతస్తులో నిర్మిస్తున్న దీని పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి ఇది పూర్తి కావలసి ఉన్నా కనీసం మరో ఏడెనిమిది నెలలయినా పట్టవచ్చని తెలుస్తోంది. ఈలోగా సిగ్నేచర్ టవర్ షాకివ్వడంతో మరో మిలీనియం టవర్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. రుషికొండ ఐటీ సెజ్‌లోని హిల్ నంబరు 3లో రెండు లక్షల చదరపు అడుగుల్లో దీనిని నిర్మించాలన్నది తాజా ప్రతిపాదన. దీనికి రూ.80 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొత్త మిలీనియం టవర్ ఎప్పటికి కార్యరూపం దాలుస్తుందో ఇప్పుడే చెప్పడం కష్టమని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
అంకెల్లో 2017
సంఖ్యాశాస్త్రం మరి కొద్దిగంటల్లో మనం అడుగుపెడుతున్న సంవత్సరం... 2017. సంఖ్యాశాస్త్ర ప్రకారం 2+0+1+7=10=1+0=1 అంటాం. 2017 సంఖ్య ‘1’ అన్నమాట. ప్రపంచం మొత్తం మీద దీని ప్రభావం ఉంటుంది. ఒకటి అనే అంకె... సూర్యుణ్ణి సూచిస్తుంది. సూర్యోదయంలో ఎలా జగతి జాగృతమై, కొత్త రోజుకు ఆహ్వానానికి సిద్ధమవుతుందో... అలాగే ఈ 2017వ సంవత్సరం సూర్యుని చిహ్నం కాబట్టి కొత్తదనానికి నాంది పలుకుతుంది. 2017లో అందరి మనసుల్లో కొత్త ఆలోచనలు, కొత్త ఊహలు వస్తాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానం, కొత్త సంబంధాలు, కొత్త వ్యాపారాలు, కొత్త కరెన్సీ, కొత్త స్ఫూర్తి, కొత్త స్నేహాలు వెల్లివిరుస్తాయి. ముగిసిపోతున్న 2016వ సంవత్సరంలో ఉన్న నిరుత్సాహాన్ని వదిలి నూతనోత్సాహాన్ని నింపుకొని, వినూత్న శకానికి 2017 నాంది పలుకుతోంది. అయితే ఈ మార్పులన్నీ ‘మంచికే’ అన్నది నిస్సందేహం. స్థూలంగా 2017 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫైనాన్స్, బయో టెక్నాలజీ, ఫార్మసీ రంగాలలో నూతన ఆవిష్కరణలు జరుగుతాయి. సాంప్రదాయ విధానాలను ప్రశ్నించడం జరుగుతుంది. పెద్ద సంస్థలు, వ్యాపారసంస్థలు అన్ని విధాలుగా సంస్కరణకు లోనవుతాయి. స్టాక్ మార్కెట్, ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు, సాధారణ ప్రజలు అధిక విశ్వాసం, స్ఫూర్తి కలిగి ఒకరికొకరు సహకరించుకుంటారు. ప్రముఖ వ్యక్తుల రహస్యాలు తెలిసి చర్చించుకుంటారు. నూతన ఆలోచనలు, రాజ్యాంగ సవరణలు తెర పైకి వస్తాయి. ముఖ్యంగా యువతకు మంచి జీవనోపాధి కలుగుతుంది. ఈ సంవత్సరం జననాల రేటు పెరుగుతుంది. మరణాల రేటు తగ్గుతుంది. వర్షాలు సమృద్ధిగా పడతాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. ముఖ్యంగా, కూరగాయల ఉత్పత్తి పెరుగుతుంది. నాయకులలో ధార్మికత పెరుగుతుంది. ప్రభుత్వం తరఫున యజ్ఞాలు, హోమాలు చేయిస్తారు. ఈ సంవత్సరంలో తాత్కాలికమైన అలజడులు, ‘శాంతి కోసం హింస’ జరిగే అవకాశం ఉంది. దేశాల మధ్య కొత్త సమీకరణాలు ఏర్పడతాయి. ఇది స్థూలంగా 2017 మొత్తం కలిపితే వచ్చే అంకె అయిన 1 గురించి! అలాగే 2017లో ఉన్న ప్రతి అంకె కూడా విశ్వం మీద తన ప్రభావం చూపుతుంది. ఈ సంవత్సరాన్ని మరో కోణంలో చూస్తే – ‘17’వ సంవత్సరం అని కూడా అంటారు. ‘17’ అనే సంఖ్య కూడితే ‘8’ వస్తుంది. ఇది శనిదేవునికి ప్రతీక. శనీశ్వరుడు ప్రొఫెషన్కీ, వ్యాపారానికీ, జీవన విధానానికీ, పురోగతికీ, శాస్త్ర సాంకేతికాలకీ కారకుడు. అందువల్ల ‘2017’లో వ్యక్తిగత వికాసానికీ, నూతన ఆలోచనలకీ, అభివృద్ధికీ బాసటగా ఉండడం వల్ల ఉద్యోగ, వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. ఇంతకు ముందే ఉన్న వ్యాపారాలు కొత్త సాంకేతికతతో విస్తరిస్తాయి. అంతేకాకుండా, ప్రతిభకు గుర్తింపు వస్తుంది. అందువల్ల – కష్టపడేవారికి ప్రమోషన్స్ వస్తాయి. శనీశ్వరుడు న్యాయానికీ, కష్టపడడానికీ ప్రతీక. కాబట్టి, ప్రజలు చాలావరకు ధర్మమార్గాన కష్టపడతారు. 2017లోని ‘17’ సంఖ్య దానంతట అదే ప్రజలలో ఈ మార్పునకు దోహదం చేస్తుంది. ఇక, ‘2017’లో ఉన్న అంకెలలో ప్రతిదానికీ ఓ ప్రత్యేకత ఉంది. 2017లో ఉన్న మొదటి అంకె ‘2’. ఇది చంద్రుణ్ణి సూచిస్తుంది. చంద్రుడు మనస్సుకు కారకుడు. కొత్త ఆలోచనలు, క్రియేటివిటీకి కారణం. అందువల్ల ఈ శతాబ్దం అంతా ‘నేను’ అనే కాన్సెప్ట్ పోయి, ‘మనము’ అనే కాన్సెప్ట్ ఉంటుంది. గ్రూపులుగా పనిచేయడం, ప్రజలలో అహం తగ్గడం, పరస్పరం శత్రుత్వాలు వదిలి స్నేహంతో, చెలిమితో సంయుక్త ఆవిష్కరణలకు ఇది నాందీప్రస్తావన అని సూచిస్తుంది. దీనివల్ల ఇతరుల పట్ల శ్రద్ధ, ఆదరణ కలిగించి, సార్వత్రిక సహజీవనంతో అభివృద్ధిలోకి పోయేలా చేస్తుంది. 2017లో మరో అంకె ‘0’. జీరో అనేది ప్లూటో గ్రహానికి సూచన. ఈ గ్రహం అదృశ్య, అగోచర అనంత శక్తికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణలకూ సూచన. ప్లూటో సృజనకు ఎంత నిదర్శనం అయినా, ఎంతగా సృజిస్తుందో, అంతగా నాశనం కూడా చేస్తుంది. ఆకస్మిక మరణాలు, కిడ్నాపింగ్‌లు, బలవంతాలు, వైరస్‌లను కూడా ప్రోత్సహిస్తుంది. రహస్యానికీ, గూఢచర్యానికీ... అంటే కంటికి కనపడని చర్యలకు ప్లూటో కేంద్రం. అంటే ప్లూటో ప్రభావం వల్ల నిత్యం మంచి చెడులకు నడుమ ఘర్షణ జరుగుతుంటుంది. అయితే ఈ 2017లో ఉన్న అంకెల ఆధారంగా విశ్లేషిస్తే, ప్లూటో నూతన లక్ష్యాలు, ఆశయాలు, పనులను తెలియజేస్తుంది. చాలా సంఘటనలు అనూహ్యంగా జరిగి, ప్రజలు తమ జీవితంలో కొత్త పుంతలు తొక్కేలా ప్రేరేపిస్తుంది. కొత్త మందులను కనుక్కుంటారు. 2017లోని ‘1’ అంకె మళ్ళీ సూర్యుణ్ణి సూచిస్తుంది. ఈ అంకె ప్రభావం వల్ల ప్రజలలో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాలు అధికమవుతాయి. ప్రతి వ్యక్తీ ఉన్నత స్థాయిని చేరుకోవాలన్న ఆలోచనలతో సత్ ప్రవర్తనను ప్రదర్శిస్తారు. ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పరచుకొని, వాటిని సాధించడం కోసం ఉత్తమమైన మార్గాలను అనుసరిస్తారు. యువత సివిల్ సర్వీసెస్ లాంటి ఉన్నత ఉద్యోగాల వైపు మొగ్గు చూపుతుంది. విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది. కంటి, గుండె జబ్బులు వస్తాయి. ‘ఆదిత్య హృదయం’ స్తోత్రం చదవడం, లేదంటే వినడం మంచిది. 2017లో ఉన్న ఇంకొక అంకె – ‘7’. ఇది కేతువును సూచిస్తుంది. కేతువు ఆధ్యాత్మిక వికాసం, ఆత్మ పరిశీలన, మోక్షసాధన కోసం దానాలు, వ్రతాలు, పూజలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేయడానికి ప్రతీక. దేవాలయాలకు ఆదరణ పెరుగుతుంది. జీర్ణావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరిస్తారు. తాత్కాలిక సుఖాల ప్రభావం నుండి శాశ్వత సత్యసాధన కోసం తపన పడతారు. యోగా, మెడిటేషన్ కేంద్రాలకు ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మికత ప్రజలలో పెరుగుతుంది. నూతన జీవన విధానాన్నీ, సాత్వికతనూ అలవాటు చేసుకుంటారు. దైవశక్తిని నమ్ముతారు. అలా ఈ కొత్త ఏడాది 2017 ఎన్నో శుభాలనిస్తుంది. డాక్టర్ మహమ్మద్ దావూద్, ఎం.ఏ, జ్యోతిషం -
కంపెనీ మారుతున్నారా...?
• పన్ను నుంచి పీఎఫ్ వరకూ చూడాల్సిందే • బోనస్, ఎల్‌టీఏ వంటివి కూడా పరిగణనలోకి • అన్నీ కొత్త కంపెనీకి తెలిస్తేనే మంచిది.. కాస్త వయసులో ఉన్నవారు తరచూ కంపెనీలు మారటం సహజమే. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో తరచూ ఉద్యోగాలు మారటం కూడా అసాధారణమేమీ కాదు. కాకపోతే కంపెనీలు మారేటపుడు పన్ను బాధ్యతల్ని మరిచిపోకూడదు. ఇలా జంప్ చేసేటప్పుడు పన్ను పరంగా సమస్యలు రాకుండా కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవడం అవసరం. అదే ఈ కథనం... కన్సాలిడేటెడ్ ఫామ్-16... వార్షికంగా ఓ ఉద్యోగికి చెల్లిస్తున్న వేతనం ఆధారంగా ఆ ఉద్యోగి చెల్లించాల్సిన పన్నును కంపెనీ లెక్కిస్తుంది. దాన్ని ప్రతినెలా వేతనంలో నిర్ణీత శాతం చొప్పున మినహాయిస్తుంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం మధ్యలో కంపెనీ మారితే... కొత్తగా చేరిన కంపెనీలో గత వేతనం గురించి తెలియజేయాలి. లేదంటే రిటర్నుల దాఖలు సమయంలో అదనపు పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఎందుకంటే రెండు కంపెనీల్లోనూ రూ.2.5 లక్షల బేసిక్ ఎగ్జంప్షన్కు తోడు రూ.1.5 లక్షలు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, పన్ను లెక్కించేటప్పుడు దిగువ స్థాయి ట్యాక్స్ స్లాబ్‌ను పరిశీలనలోకి తీసుకుంటారు. పాత కంపెనీలో వేతన సమాచారాన్ని కొత్త కంపెనీలో నిర్ణీత పత్రంలో తెలియజేస్తే నిబంధనల మేరకు పన్ను మినహాయిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగిశాక కొత్త కంపెనీ కన్సాలిడేటెడ్ ఫామ్-16ను జారీ చేస్తుంది. ఇందులో పాత కంపెనీ వేతన సమాచారంతోపాటు టీడీఎస్ వివరాలు కూడా ఉం టాయి. ఒకవేళ పాత కంపెనీ వేతన వివరాలను కొత్త కంపెనీలో ఇవ్వకుంటే రెండు కంపెనీల్లోనూ జారీ చేసిన ఫామ్-16లను పరిగణనలోకి తీసుకుని పన్ను రిటర్నులను స్వయంగా వేయాలి. ఆ మేరకు పన్ను కూడా కట్టాలి. ఒక ఆర్థిక సంవత్సరం మధ్యలో కంపెనీ మారినప్పటికీ మినహాయింపులను ఒక్కసారే క్లెయిమ్ చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా దగ్గర ఉంచుకుంటే భవిష్యత్తులో పన్ను అధికారులు అడిగితే చూపించడానికి ఉంటుంది. ఎల్‌టీఏ... నాలుగేళ్ల కాలంలో కుటుంబ సభ్యులతో కలసి రెండు సార్లు పర్యటనల కోసం చేసిన ఖర్చులను లీవ్ ట్రావెల్ అలవెన్స్ నిబంధనల కింద పన్ను క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్ని కంపెనీలు మారినా రెండు సార్లకే ఈ అవకాశం. జనవరిలోపు మారిపోతే హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లకున్న పన్ను మినహాయింపు సౌకర్యాన్ని పొందేందుకు ఏటా జనవరిలో ఉద్యోగం చేస్తున్న సంస్థకు ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జనవరిలోపే కంపెనీ మారిపోతే పన్ను మినహాయింపులు కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాత కంపెనీ ఈ మేరకు పన్నును ఐటీ శాఖకు జమ చేస్తుంది. ఒకవేళ ఇలా జరిగితే పన్ను రిటర్నుల సందర్భంగా క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. విదేశీ ఆదాయంపై పన్ను ఆర్థిక సంవత్సరం మధ్యలో అంటే అక్టోబర్‌లోపే విదేశీ జాబ్ కోసం వెళ్లిపోతే ఎన్ఆర్ఐగా పరిగణిస్తారు. కనుక ఇక్కడ పన్ను కట్టక్కర్లేదు. ఒకవేళ రెసిడెంట్ ఇండియన్ అని భావిస్తే విదేశీ ఆదాయంపై ఇక్కడే పన్ను చెల్లించాలి. ఇవి మర్చిపోవద్దు... ఆర్గనైజేషన్ మారుతున్నప్పుడు పే స్లిప్‌లు, ఫామ్ 16, ఫామ్ 10సీ (పీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి), ఫైనల్ సెటిల్మెంట్ స్టేట్మెంట్ మొదలైనవి తప్పకుండా తీసుకోవాలి. ప్రావిడెంట్ ఫండ్... కంపెనీ మారినప్పుడు పీఎఫ్ ఉపసంహరించుకుంటే పన్ను కట్టాల్సి వస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఐదేళ్లు పూర్తి కాకుండా పీఎఫ్ నిధులను వెనక్కి తీసుకుంటే నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలి. ఉపసంహరించుకున్న మొత్తాన్ని సాధారణ ఆదాయం కింద పరిగణించి పన్ను కట్టాలి. దీనికి బదులు నూతన కంపెనీకి పీఎఫ్ బదిలీ చేసుకోవడం ఉత్తమం. జాయినింగ్ బోనస్‌పై పన్ను: కొన్ని కంపెనీల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు జాయినింగ్ బోనస్ ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ బోనస్‌పై కంపెనీ పన్నును తగ్గించి ఇస్తుంది. అయితే, చేరిన 6 నెలల్లోనే ఆ కంపెనీకి గుడ్‌బై చెబితే తీసుకున్న బోనస్‌ను తిరిగిచ్చేయాలి. అందుకున్న నికర బోనస్‌తోపాటు కంపెనీ ఉపసంహరించుకున్న పన్నును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే పన్ను రూపంలో తీసుకున్న మొత్తాన్ని కంపెనీ ఐటీ శాఖకు జమ చేస్తుంది. ఉదాహరణకు శ్రీరామ్ ‘ఎ’ కంపెనీలో చేరిన సందర్భంగా కంపెనీ రూ.లక్ష బోనస్ ఇచ్చింది. 30% పన్నును ఉపసంహరించుకుని రూ.70వేలు చెల్లించింది. చేరిన ఆరు నెలల్లోనే శ్రీరామ్ కంపెనీకి రాజీనామా చేశాడు. దీంతో అతడు రూ.లక్షను కంపెనీకి కట్టాల్సి ఉంటుంది. రూ.30వేలను రిఫండ్ కోసం ఐటీ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. -
నెట్టింట్లో యూనివర్సిటీ..
కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలతో ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. ఇదే ఒరవడితో విద్యారంగంలోనూ ఆధునికత సంతరించుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చి.. దినదిన ప్రవర్థమానం అవుతోంది మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్). ఇంటర్నెట్ ఉంటే చాలు.. అంతర్జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లలో కోర్సులు అభ్యసించొచ్చు. తక్కువ ఖర్చుతో ఉన్నత ప్రమాణాలతో కూడిన కోర్సులు పూర్తిచేసుకోవడమే కాకుండా.. ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉండే సర్టిఫికెట్లు పొందేందుకు సరికొత్త మార్గంగా నిలుస్తున్న మూక్స్ వివరాల గురించి ఈరోజు తెలుసుకుందాం..! - సాక్షి,స్కూల్ ఎడిషన్ ► మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్.. విద్యారంగంలో సరికొత్త విప్లవం. ఒకరకంగా చెప్పాలంటే దూర విద్యావిధానంలో ఇదో వినూత్న విధానం. నిర్దిష్ట సర్వీస్ ప్రొవైడర్ ఒప్పందం కుదుర్చుకున్న ఇన్స్టిట్యూట్లలో కోర్సులను ఆన్లైన్లో అభ్యసించే పద్ధతి. ఫలితంగా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో విద్యనభ్యసించి సర్టిఫికెట్లు పొందొచ్చు. ఒకప్పుడు ఆన్లైన్ విధానంలో కేవలం ఇన్స్టిట్యూట్ల లెక్చర్స్‌కు అనుగుణంగా ఈ-లెర్నింగ్ సదుపాయం ఉండేది. ఇప్పుడు మూక్స్ విధానంలో కోర్సు మెటీరియల్‌తో పాటు వీడియో లెక్చర్స్, స్టూడెంట్స్- ప్రొఫెసర్స్ ఇంటరాక్టివ్ యూజర్ ఫోరమ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో కోర్సులను సైతం నామమాత్రపు ఫీజులతో నేరుగా మూక్స్ ద్వారా అభ్యసించొచ్చు. మన విద్యార్థులకు ఎంతో మేలు.. మూక్స్ విధానం భారతీయ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల నాణ్యతా ప్రమాణాలు, తదితర అంశాలు పరిగణలోకి తీసుకుంటే.. ఈ విధానం ఎంతో ఉపయుక్తమైంది. దేశంలో ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో టీచర్- స్టూడెంట్స్ నిష్పత్తి సగటున 1:40 గా ఉంటోంది. ఈ నేపథ్యంలో క్లాస్‌రూమ్‌లో అధ్యాపకులు చెప్పే అంశాలన్నింటినీ అవగతం చేసుకోవడం కష్టమే. అదేవిధంగా అటు అధ్యాపకుల కోణంలోనూ అంత మంది విద్యార్థులను పర్యవేక్షించడం కష్టసాధ్యం. ఈ సమస్యలకు కూడా మూక్స్ పరిష్కారం చూపుతోంది. అభారత్లో వృద్ధి.. మూక్స్ ప్రస్థానం అమెరికాలో మొదలైంది. అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ రోచస్టర్ వంటి ప్రముఖ సంస్థలు ఆన్లైన్ వెబ్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని వర్చువల్ క్లాస్ రూమ్ పేరుతో పలు కోర్సులను అందించడం ప్రారంభించాయి. ఈ విధానానికి భారత విద్యార్థులు బాగా ఆకర్షితులవుతున్నారు. దీనిలో ఎడెక్స్ కోర్సులకు 20 లక్షల మంది నమోదు చేసుకుంటే.. అందులో 2.5 లక్షల మంది మన విద్యార్థులే ఉన్నారు. మూక్స్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండటం విశేషం. తీరుతెన్నులు.. ఇందులో ఇన్స్టిట్యూట్లు అధికారికంగా సదరు సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం చేసుకుంటాయి. తద్వారా.. కోర్సు ఔత్సాహికులు ఏ సమయంలో అయినా సంబంధిత లెక్చరర్స్‌ను సంప్రదించే వీలుంటుంది. సరిహద్దులతో సంబంధం లేకుండా అభ్యర్థులు తమకు ఇష్టమైన సంస్థలో అందుబాటులో ఉన్న కోర్సును అభ్యసించొచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసిస్తున్న విద్యార్థి.. హార్వర్డ్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న మూక్స్ కోర్సుల్లో పేరు నమోదు చేసుకుని సర్టిఫికెట్ అందుకోవచ్చు. ఇలా విదేశీ విద్యను అభ్యసించాలనే కోరిక కూడా నెరవేరుతుంది. ముఖ్య విభాగాలు.. గత మూడేళ్లలో ప్రాథమిక దశలో ఉన్న మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్‌లో.. ప్రస్తుతం అధికశాతం సైన్స్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ వంటి కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ ఓరియెంటేషన్ కీలకంగా ఉండే.. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది. కావాల్సిన సదుపాయాలు.. ఈ విధానంలో కోర్సు అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రాథమికంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు.. ఇంటర్నెట్, జావా స్కిప్ట్ సాఫ్ట్వేర్, ఏవీ సాఫ్ట్వేర్స్, హెడ్‌ఫోన్స్. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని.. మరింత మంది విద్యార్థులను ఆకర్షించేందుకు మూక్స్ ప్రొవైడర్స్ ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో ‘కోర్స్ ఎరా’ సంస్థ మూక్స్ కోర్సుల్లో నమోదు, లెక్చర్స్ వీక్షించడం వంటి సదుపాయాలను మొబైల్ ఫోన్ ద్వారా పొందే విధంగా అప్లికేషన్స్ రూపొందించింది. గుర్తింపు పొందిన ప్రొవైడర్స్.. ప్రొవైడర్ : ఎడెక్స్ వెబ్సైట్: www.edx.org పాల్గొనే యూనివర్సిటీలు: మిట్, హార్వర్డ్, యూసీ బెర్కిలీ, క్యోటో, ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్. ప్రొవైడర్: కోర్స్ ఎరా వెబ్సైట్: www.coursera.org పాల్గొనే యూనివర్సిటీలు: స్టాన్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, వర్జీనియా. ప్రొవైడర్: ఐవర్సిటీ వెబ్సైట్: www.iversity.org పాల్గొనే వర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరెన్స్, యూనివర్సిటీ ఆఫ్ హాంబర్గ్ ప్రొవైడర్: ఫ్యూచర్ లెర్న్ వెబ్సైట్: www. futurelearn. com పాల్గొనే వర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, ఓపెన్ యూనివర్సిటీ, మొనాష్, ట్రినిటీ కాలేజ్, డబ్లిన్, వార్విక్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బాత్ ప్రొవైడర్: అకడెమిక్ ఎర్త్ వెబ్సైట్:www.academicearth.com పాల్గొనే వర్సిటీలు: యూసీ బెర్కిలీ, యూసీఎల్ఏ, మిచిగాన్, ఆక్స్ఫర్డ్. -
ఐటీ, పరిశ్రమలు అభివృద్దికి రెండు కళ్ళు
- రెండేళ్లలో రూ.35 వేల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు - గతేడాది రూ.68,258 కోట్ల మేర ఐటీ ఎగుమతులు - టీఎస్ ఐపాస్, ఐటీ పాలసీలతో పెట్టుబడులకు ఊపు - ప్రాథమిక దశలోనే నిమ్జ్, ఫార్మాసిటీ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. పారదర్శకత, సరళమైన, అవినీతి రహిత విధానాలకు పెద్దపీట వేస్తూ... నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన చేసింది. 2014 నవంబర్ 27న టీఎస్ఐపాస్కు చట్టబద్ధత కల్పించగా 2015 జూన్ 12న సీఎం కేసీఆర్ నూతన పాలసీని ఆవిష్కరించారు. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేలా ‘సింగిల్ విండో’ విధానాన్ని బలోపేతం చేస్తూ నూతన విధానాన్ని ప్రతిపాదించారు. పెట్టుబడులతో ముందుకొచ్చే వారికి ఎదురేగి స్వాగతం పలికి, పరిశ్రమల స్థాపనకు అనుమతులు, సౌకర్యాలు సమకూర్చేలా సీఎం కార్యాలయంలో ‘ఛేజింగ్ సెల్’ను ఏర్పాటు చేశారు. భారీగా పెట్టుబడులు ప్రపంచంలోనే అత్యుత్తమ విధానంగా ప్రభుత్వం చెబుతున్న టీఎస్ ఐపాస్ ద్వారా ఏడాది వ్యవధిలోనే రూ.35 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు పరిశ్రమల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో 396, జిల్లా స్థాయిలో 1,623 పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం... 1,20,169 మందికి కొత్తగా ఉపాధి దక్కుతుందని అంచనా వేస్తోంది. టీఎస్ఐపాస్ ఆవిష్కరణ రోజే రూ.8 వేల కోట్ల మేర పెట్టుబడులను పారిశ్రామికవేత్తలు ప్రకటించగా... తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశాయి. టీఎస్ ఐపాస్ ద్వారా మరో ఏడాదిలో రూ.50 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. పరిశ్రమల స్థాపనకు వీలుగా 1.45 లక్షల ఎకరాలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ టీఎస్ఐఐసీకి సర్కారు అప్పగించింది. మూతపడిన నిజాం షుగర్స్ రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమ నిజాం దక్కన్ షుగర్స్‌ను నష్టాలు సాకుగా చూపుతూ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్ మిల్స్ మూసివేసింది. దీంతో సుమారు 350 మంది ఉద్యోగులతో పాటు వేల మంది రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇక మె గా టెక్స్టైల్ పార్కు, చేనేత విధానం రూపకల్పన ప్రాథమిక దశలోనే ఉండగా.. రాష్ట్రంలో చేనేత వృత్తిపై ఆధారపడిన వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రెండేళ్లలో ముగ్గురు మంత్రులు రాష్ట్ర ఆవిర్భావం రోజున తొలి మంత్రివర్గంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా పరిశ్రమల శాఖ బాధ్యత చేపట్టారు. 2014 డిసెంబర్లో మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది జరిగిన మంత్రిత్వ శాఖల మార్పుల్లో కేటీఆర్‌కు పరిశ్రమల శాఖను అప్పగించారు. ఔత్సాహికులకు ప్రేరణ టీ-హబ్ వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ‘టీ-హబ్’ పేరిట 2015 నవంబర్‌లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఐఐటీ, ఐఎస్బీ, నల్సార్ వర్సిటీ సహకారం అందిస్తున్న టీ-హబ్ ద్వారా స్టార్టప్‌లకు ప్రేరణ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ఫైబర్ గ్రిడ్, రాష్ట్రవ్యాప్తంగా 4జీ సేవలు, ముఖ్య నగరాల్లో వైఫై సేవలు, ఈ-గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో కంప్యూటర్ విద్య తదితరాలకు పెద్దపీట వేస్తోంది. భూసేకరణ వివాదాల్లో నిమ్జ్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు తెచ్చేందుకు ప్రభుత్వం భారీ పారిశ్రామిక వాడల ఏర్పాటును ప్రతిపాదించింది. కొన్ని ప్రతిపాదనలకు భూసేకరణ ప్రధాన అవరోధంగా పరిణమించగా... మరికొన్ని ప్రతిపాదనలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్‌పార్కు స్థాపనకు కేంద్రం అనుమతివ్వగా ప్రతిపాదనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధమైనా సీఎం వద్ద పరిశీలన దశలోనే ఆగిపోయాయి. ► మెదక్ జిల్లా జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) స్థాపనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 12 వేల ఎకరాల్లో నిమ్జ్‌ను ప్రతిపాదించగా.. ఇప్పటివరకు 3,700 ఎకరాలను మాత్రమే సేకరించారు. నిర్ణీత గడువులోగా భూమి సేకరిస్తేనే నిమ్జ్‌కు తుది అనుమతులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ► రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ‘ఫార్మాసిటీ’ని 12,500 ఎకరాల్లో స్థాపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. నిమ్జ్ హోదా ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి డీపీఆర్ తయారీ ప్రాథమిక దశలోనే ఉండిపోయింది. భూసేకరణ కూడా నత్తనడకన సాగుతోంది. పరిహారం చెల్లింపు విషయంలో జహీరాబాద్, ముచ్చర్లలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఐటీకి ప్రత్యేక పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐటీ పరిశ్రమను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,300కుపైగా ఐటీ కంపెనీలుండగా.. ఐటీ ఉత్పత్తుల ఎగుమతి ద్వారా గతే ఏడాది రూ.68,258 కోట్లు ఆర్జించాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఐబీఎం వంటి అంతర్జాతీయ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి జాతీయ దిగ్గజ కంపెనీలకూ హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఆన్లైన్ వాణిజ్య సంస్థ అమెజాన్ భారత్‌లో తన కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించింది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో గ్రామీణ యువతను పట్టణ యువతతో సమానంగా ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో నూతన ఐటీ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నోవేషన్, గేమింగ్-యానిమేషన్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్, రూరల్ టెక్నాలజీ తదితర అనుబంధ పాలసీలూ తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు రాయితీలను ప్రకటించారు. ఈ విధానం ద్వారా రాష్ట్రం నుంచి రూ.1.36 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులతో పాటు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
ఓరుగల్లులో ఇన్ఫోసిస్ క్యాంపస్
♦ 19న సీఎం కేసీఆర్ శంకుస్థాపన ♦ చారిత్రక నగరానికి టెక్నాలజీ హంగు ♦ మైసూరు తరహాలో శిక్షణ కేంద్రం ♦ ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధికి ఊతం సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగానికి రాష్ట్రంలో కొత్త వేదిక ఏర్పాటవుతోంది. చారిత్రక వరంగల్ నగరంలో ప్రఖ్యాత ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ ట్రైనింగ్ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోని మడికొండలో ఈ క్యాంపస్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 19న శంకుస్థాపనచేయనున్నారు. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఐటీ సేవల సంస్థల్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఏటా వేలాది మందికి ఉద్యోగాలు కల్పించే ఈ సంస్థ... వారికి సంస్థ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందిస్తుంది. ఇందుకోసం కర్ణాటకలోని మైసూరులో పదేళ్ల క్రితం శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. 10 వేల మందికి శిక్షణ ఇచ్చేందుకు అనువుగా 350 ఎకరాల విస్తీర్ణంలో, అత్యాధునిక హంగులతో రెండు వేల గదులు, మల్టీఫ్లెక్స్ థియేటర్, స్విమ్మింగ్ పూల్, ఫుడ్‌కోర్టు వంటి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఇదే తరహాలో వరంగల్లోనూ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది. వరంగల్ ఎందుకంటే.. ఇన్ఫోసిస్ ప్రధాన కేంద్రం బెంగళూరులో ఉంది. అయితే బెంగళూరుకు దీటుగా ఐటీ రంగంలో విస్తరిస్తున్న హైదరాబాద్‌ను మరో వేదికగా మలుచుకునేందుకు ఇన్ఫోసిస్ సిద్ధమవుతోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఇన్ఫోసిస్ కేంద్రంలో 10వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పోచారం వద్ద 25 వేల మంది ఉద్యోగులు పనిచేసేలా మరో కార్యాలయాన్ని నిర్మిస్తోంది. దీంతో ఇన్ఫోసిస్‌కు హైదరాబాద్ సమీపంలోనూ శిక్షణ కేంద్రం ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పనిచేసే ఉద్యోగులకు గ్రేటర్ వరంగల్‌లో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్‌కు రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలం కింద ప్రతిపాదించింది. ఇన్ఫోసిస్ దానికి అంగీకరించి.. శిక్షణ కేంద్రం ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. వరంగల్ నగరం చెన్నై-న్యూఢిల్లీ రైలు మార్గంపై ఉండడం, ఆర్థికంగానూ తక్కువ ఖర్చు, ప్రకృతి విపత్తులపరంగా సురక్షితమైన నగరం కావడం కూడా ఇన్ఫోసిస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి తోడ్పడింది. ఐటీ రంగానికి ఊతం.. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వ రంగల్లో ఇప్పటికే ఐటీ ఇంక్యుబేషన్ కేంద్రం నిర్మాణాన్ని కూడా పూర్తిచేసింది. కాకతీయ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులో రెండేళ్లుగా 25 సార్టప్ కంపెనీలు పని చేస్తున్నాయి. తాజాగా ఇన్ఫోసిస్ శిక్షణా కేంద్రం వస్తుండడంతో... ఇక్కడ ఐటీ రంగం పుంజుకోనుంది. సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన ‘‘వరంగల్ నగరం ఐటీ రంగానికి కొత్త చిరునామాగా మారబోతోంది. ఇన్ఫోసిస్ శిక్షణ కేంద్రం దీనికి కీలక మలుపని భావించవచ్చు. సీఎం కేసీఆర్ ఈనెల 18న సాయంత్రం వరంగల్‌కు వస్తున్నారు. 19న ఉదయం మేడారం వెళ్లి వన దేవతలను దర్శించుకుంటారు. అనంతరం తిరిగి వరంగల్‌కు వచ్చి... ఇక్కడ ఇన్ఫోసిస్ ట్రైనింగ్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేస్తారు..’’ - వాకాటి కరుణ, వరంగల్ జిల్లా కలెక్టర్ -
శంకుస్థాపనకే నీలిట్ ప్రాజెక్టు పరిమితం
ఎచ్చెర్ల: నీలిట్ (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ప్రాజెక్టు 2013 ఏప్రిల్‌లో టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం తర్లికొండ ప్రాంతంలో ముఖ్యమంత్రి హాదాలో ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంతంలో స్థలం కొరత, మరో పక్క శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి దగ్గరగా లేకపోవడంతో మరో ప్రాంతం ఎంచు కోవాలని భావించారు. సరిగ్గా సాధారణ ఎన్నికలు నోటిఫికేషన్ ముందు 2014 ఫిబ్రవరి 28న కేంద్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి కిల్లి కృపారాణి శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నీలిట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. యూపీఏ ప్రభుత్వ సమయంలో ఈ రెండు శంకుస్థాపనలు జరిగాయి. అనంతరం ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. దీంతో నీలిట్ ప్రాజెక్టు తెరమరుగయ్యింది. ప్రస్తుతం శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో శిలాఫలకం వెక్కిరిస్తోంది. దేశంలో నీలిట్ ప్రాజెక్టులు 23 ఉన్నాయని, 24వ ప్రాజెక్టు నిర్మాణం జిల్లాకు గర్వకారణంగా అప్పట్లో నేతలు, అధికారులు చెప్పుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూ.50 కోట్లలో ఈ ప్రాజెక్టు నిర్మించనున్నట్టు అధికారులు ప్రకటించారు. 10వ తరగతి, ఆపై చదువులు చదివిన విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో శిక్షణ ఇచ్చి, అనంతరం ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పి ంచడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ ప్రాంతం ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగ పడడంతో పాటు, ఉపాధికి సైతం దోహద పడేది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిర్మాణం తెరమరుగయ్యింది. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందని అశించిన యువకులకు నిరాశే మిగిలింది. మరో పక్క ఉన్నత స్థాయి వ్యక్తులు శంకు స్థానలు చేశాక ప్రాజెక్టులు కూడా నిలిచిపోతాయా అన్న అంశం సైతం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వాలు మారినా ప్రాజెక్టులు శాశ్వితం కావా అన్నది మరికొందరి వాదన. -
ఇక ఐటీ బూమ్..
వరంగల్‌లో ఇన్ఫోసిస్ క్యాంపస్ ఫిబ్రవరిలో వెలువడనున్న ప్రకటన? మైసూర్ తరహాలో శిక్షణ కేంద్రం నగరంలో నెలకొల్పేలా ప్రభుత్వం కృషి హన్మకొండ : అధునాతన కార్యాలయాలు, ఆక ర్షణీయమైన వేతనాలు, అబ్బురపరిచే జీవన శైలికి ప్రతీకలుగా నిలిచే ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) రంగానికి హైదరాబాద్ తర్వాత మరో వేదికగా వరంగల్ నిలువబోతోంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలప్రదమైతే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఇన్ఫోసిస్ ట్రైనింగ్ క్యాంపస్ ఓరుగల్లులో ఏర్పాటు కానుంది. మైసూర్లో ట్రైనింగ్ క్యాంపస్.. ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ సంస్థ ఓ దిగ్గజంగా పేరుగాంచింది. ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో 1.80 లక్షల మంది ఉద్యోగులు ఈ సం స్థలో పని చేస్తున్నారు. దీని ప్రధాన కా ర్యాలయం బెంగళూరులో ఉంది. ప్రతి ఏటా కొత్తగా వేలాది మంది ఉద్యోగుల ను నియమించుకుంటోంది. కొత్తగా చేరి న వారికి సంస్థ అవసరాలకు అనుగుణంగా శిక్షణ ఇస్తుంది. ప్రధాన కార్యాల యం ఉన్న బెంగళూరులో గతంలో శిక్షణ ఇచ్చేది. అయితే నగరంలో స్థల లభ్యత, నిర్వహణ ఖర్చు తదితర అంశాలను బేరీజు వేసుకుని బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైసూర్లో సుమారు 350 ఎకరాల విస్తీర్ణంలో 10 వేల మందికి శిక్షణ ఇచ్చేలా పదేళ్ల క్రితం ట్రైనింగ్ క్యాంపస్ నెలకొల్పింది. ఈ క్యాంపస్‌లో ఫుల్ ఫర్నీచర్‌తో 2 వేల గదులు, స్విమ్మింగ్‌పూల్, ఫుడ్కోర్ట, థి యేటర్ తదితర సౌకర్యాలు ఉంటాయి. వివిధ కళాశాలల నుంచి క్యాంపస్ ఇంట ర్వ్యూల ద్వారా ఎంపికైన వారికి అక్కడ శిక్షణ ఇస్తుంది. సంస్థ ఉద్యోగులకూ నైపుణ్య శిక్షణను ఇక్కడే నిర్వహిస్తుంది. ఇక్కడ వరంగల్‌లో.. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ప్రధాన కార్యాల యంతో పాటు ఉద్యోగుల పరంగా బెం గళూరు ప్రథమస్థానంలో ఉంది. దేశం లో బెంగళూరుకు పోటీగా ఐటీ రంగం లో దూసుకుపోతున్న హైదరాబాద్‌లో గచ్చిబౌలి వద్ద 10 వేల మంది ఉద్యోగులతో ఇన్ఫోసిస్ సంస్థ పనిచేస్తోంది. దీ నికి తోడుగా పోచారం గ్రామం వద్ద 25 వేల మంది ఉద్యోగులు పని చేసే లా మ రో కార్యాలయం నిర్మిస్తోంది. దీంతో ఆ సంస్థకు సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్‌గా హైదరాబాద్ అవతరించనుంది. తదనుగుణంగా పెద్ద ఎ త్తున ఉద్యోగులను నియమించుకోవడంతో పాటు వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. బెంగళూరు-మైసూర్ ఫా ర్ములా తరహాలో హైదరాబాద్ క్యాంపస్‌కు అనుగుణంగా వరంగల్‌లో ఉద్యోగుల శిక్షణా కేంద్రం నిర్మించేందుకు గల అవకాశాలను పరిశీలించాలంటూ ఇన్ఫోసిస్ ప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించగా.. సానుకూలత తెలిపినట్లు సమాచారం. ఫిబ్రవరిలో ప్రకటన ? హైదరాబాద్‌లో పోచారం వద్ద నిర్మిం చిన క్యాంపస్‌ను 2016 ఫిబ్రవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ సమయంలోనే వరంగల్‌లో శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సంబంధిం చి ప్రకటన వచ్చేలా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రయత్నాలు ముమ్మ రం చేశారు. రైల్వే పరంగా చెన్నై-న్యూఢిల్లీ మార్గం వరంగల్ మీదుగా వెళ్తుం డటం, హైదరాబాద్-వరంగల్ మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మా ణం వంటి అంశాలు వరంగల్‌కు సానుకూలంగా మారనున్నాయి. భౌగోళికంగా వరంగల్ నగరం దేశానికి మ ధ్య ప్రాంతంలో ఉండడం కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. హైదరాబాద్ క్యాంపస్‌తో పాటు పుణే, ఢిల్లీ ఇన్ఫోసిస్ క్యాంపస్‌ల్లో ఉన్న ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేందుకు అనువుగా ఉం టుం ది. భూకంపాలు, తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కూడా వరంగల్‌కు తక్కువే. ఇవన్నీ అనుకూల అంశాలుగా పేర్కొనవచ్చు. ఇప్పటికే ఇంక్యూబేషన్ సెంటర్.. రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం క ల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాది న్నరగా సన్నాహాలు చేస్తోంది. అందు లో భాగంగా వరంగల్ మడికొండలో ఇప్పటికే ఐటీ ఇంక్యూబేషన్ సెంటర్ నిర్మాణం పూర్తయింది. అంతేకాక రెం డేళ్లుగా కాకతీయ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కలో 25 కంపెనీలు పని చేస్తున్నా యి. మొత్తంగా వరంగల్‌లో 100 లోపే ఐటీ నిపుణులు పనిచేస్తున్నారు. ప్రతి ష్టాత్మక ఇన్ఫోసిస్ ట్రైనింగ్ సెంటర్ వరంగల్ వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి లభిస్తుంది. -
సర్వేయర్ పోస్టుల భర్తీకి పచ్చజెండా
♦ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశం ♦ రాష్ట్రంలో ఖాళీగా 400 పోస్టులు ♦ త్వరలో తహసీల్దారు, వీఆర్వోల బదిలీలు ♦ సెక్రటేరియట్లో ప్రజా ఫిర్యాదుల విభాగం ఏర్పాటుకు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గత ఎనిమిదేళ్లుగా రిక్రూట్మెంట్ లేకపోవడంతో సర్వే విభాగంలో సుమారు 400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టుల భర్తీకి సంబంధించి విధివిధానాలను సిద్ధం చేయాలని రెవెన్యూ ఉన్నతాధికారులను ఉప ముఖ్యమంత్రి మహ మూద్ అలీ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలను ప్రజలకు చేరువ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ విభాగంపై ప్రజలకు విశ్వాసం కలిగేలా వినూత్న పద్ధతులను అవలంబించాలని సూచించారు. శాఖకు సంబంధించిన పలు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు రాహుల్ బొజ్జా, రఘునందన్‌రావు పాల్గొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలివీ.. ♦ ఎక్కువ కాలం ఒకేచోట పనిచేస్తున్న మండల తహసీల్దార్లు, గ్రామ రెవెన్యూ అధికారుల బదిలీలను వెంటనే చేపట్టాలి. ♦ రెవెన్యూ అంశాలు, కొత్త చట్టాలకు సంబంధించి తహసీల్దార్లు, ఆర్డీవోలకు తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్(టలిమ్)లో శిక్షణ ఇప్పించాలి. ♦ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా రెవెన్యూ శాఖలో వ్యవస్థాగతంగా అవసరమైన మార్పులను తీసుకురావాలి. ♦ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి మిగిలిన లబ్ధిదారులకు వెంటనే పట్టాలు అందజేయాలి. ♦ సచివాలయంలోని డిప్యూటీ సీఎం పేషీలో ప్రజా ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేయాలి. ఫిర్యాదుల స్వీకరణకు డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని నియమించాలి. ♦ ప్రజల నుంచి విజ్ఞప్తులను నేరుగా లేదా పోస్టు ద్వారా కూడా స్వీకరించాలి. ♦ రెవెన్యూ డివిజనల్ అధికారుల పనితీరును జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలి. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకునే విధంగా బాధ్యతలను అప్పగించాలి. ♦ నిర్దేశించిన జిల్లాల్లో భూభారతి కార్యక్రమాన్ని 15 రోజుల్లోగా పూర్తి చేయాలి. భూముల వివరాల నమోదు ప్రక్రియను ఐటీ నెట్‌వర్క్‌తో లింక్ చేయాలి. ♦ {పజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకునేందుకు త్వరలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో సమావేశం కావాలని డిప్యూటీ సీఎం నిర్ణయించారు. -
‘ఐటీ’ పెంపుతోనే చౌక సేవలు..
- బ్యాంకింగ్ రంగంలో ఐటీ వినియోగానికి మరింత అవకాశం - త్వరలోనే ఐటీకోసం ప్రత్యేక సబ్సిడరీ సంస్థ ఏర్పాటు - 11వ ఐడీఆర్‌బీటీ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ రాజన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగం ద్వారా బ్యాంకులు వ్యయ నియంత్రణ చేసుకొని ఖాతాదారులకు చౌకగా సేవలను అందించడానికి అపారమైన అవకాశాలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇప్పటికే బ్యాంకులు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగిస్తున్నా,.. దానికి తగ్గట్టుగా ఖాతాదారులకు చౌక సేవలు అందుబాటులోకి రాలేదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే ఇప్పటికీ దేశీయ బ్యాంకింగ్ రంగంలో ఐటీ వినియోగం చాలా తక్కువగా ఉందని, దీన్ని మరింత పెంచుకోవడానికి అపార అవకాశాలున్నాయన్నారు. సోషల్ నెట్వర్కింగ్, ఇతర మాధ్యమాల ద్వారా వచ్చే సమాచారాన్ని విశ్లేషించడం (బిగ్‌డేటా) ద్వారా ఖాతాదారుడికి అవసరమైన సేవలు, పథకాలను చౌకగా వారి ఇంటిముందునే అందించొచ్చన్నారు. ఐడీఆర్‌బీటీ 11వ బ్యాంకింగ్ టెక్నాలజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజన్ మాట్లాడుతూ బ్యాంకింగ్ రంగంలో సురక్షితమైన ఐటీ వినియోగాన్ని పెంచడానికి ప్రత్యేకంగా ఒక సబ్సిడరీని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న సమాచారాన్ని రోజూ విశ్లేషించి తదనుగుణంగా పథకాలను రూపొందించే వ్యవస్థ ఇంకా బ్యాంకుల వద్ద లేదన్నారు. బిగ్‌డేటా, డేటా ఎనలిటిక్స్‌తో చౌక సేవలను ఎలా అందించాలన్న దానిపై బ్యాంకులు దృష్టిపెట్టాలన్నారు. ఆధార్ కార్డుతో అనేక ప్రయోజనాలున్నాయని, వీటి వినియోగానికి సుప్రీం కోర్టు అనుమతిస్తుం దన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. దేశంలో స్మార్ట్ఫోన్ల వినియోగం పెరుగుతున్నా దానికి అనుగుణంగా బ్యాంకింగ్ లావాదేవీలు పెరగడం లేదన్నారు. ఇప్పటికీ చాలా బ్యాంకులు సంప్రదాయ విధానాలనే అనుసరిస్తున్నాయని, కొత్తగా వచ్చే పేమెంట్, చిన్న బ్యాంకుల నుంచి ఇవి సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఏడు విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనపర్చిన లార్జ్, మీడియం, స్మాల్ బ్యాంకులకు రాజన్ అవార్డులను అందచేశారు. కార్యక్రమంలో ఐడీఆర్‌బీటీ చైర్మన్, ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్, ఐడీఆర్‌బీటీ డెరైక్టర్ ఎ.ఎస్.శాస్త్రితో పాటు వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వరంగల్ ఇక స్మార్ట్
తొలిదశలో అమలు కష్టమే.. గ్రేటర్అధికారులపైనే భారం రూ.500 కోట్లతో అభివృద్ధి స్మార్ట్‌సిటీల జాబితాను వెల్లడించిన కేంద్ర మంత్రి హన్మకొండ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీ జాబితాలో వరంగల్ చోటు సాధించింది. దేశవ్యాప్తంగా 98 నగరాలు స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోగా.. తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు చోటు సంపాదించాయి. ఇక ప్రయోజనాలు చాలా ఉన్నారుు. పట్టణ, నగర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ నగర జీవనంలో నిత్యం తలెత్తే క్లిష్లమైన సమస్యలను సులభతరం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. నగర పరిపాలనను క్రమంగా ఈ గవర్నెన్స్ విధానంలోకి మార్చుతారు. నగరాల్లో 24 గంటలు నాణ్యమైన విద్యుత్, మంచినీటి సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. నగరంలో నిత్యం పోగయ్యే చెత్తతో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఘనపదార్థాల నిర్వహణ (సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్) పద్ధతిని తప్పనిసరి చేస్తారు. ప్రజలు, నగరపాలక సంస్థలకు మధ్య వారధిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. కార్పొరేషన్లో ఉన్న భూమి రికార్డులు, మ్యాపులు, లే అవుట్లు, పన్నుల వసూళ్లు, బకాయిలు అన్ని వివరాలు డిజిటలైజేషన్ చేస్తే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. నగరంలో పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా ప్రజా, వ్యక్తిగత రవాణాలో మార్పులు తీసుకొస్తారు. ఏకో ఫ్రెండ్లీ భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తారు. రూ.500 కోట్లు స్మార్ట్‌సిటీగా ఎంపికైన నగరాలకు రూ.500 కోట్లు మంజూరవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి తొలిదశలో ఏకమొత్తంలో రూ.200 కోట్లు, ఆ తర్వాత ఏడాదికి రూ.100 కోట్ల వంతున రాబోయే మూడేళ్లలో నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. దేశం 98 నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తొలిదశంలో కనిష్టంగా 5.. గరిష్టంగా 20 నగరాలలో స్మార్ట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం విధించిన నిబంధనలు పాటించే నగరాలకు స్కోర్‌ను కేటాయిస్తారు. ఈ స్కోరు ఆధారంగానే తర్వాత రెండో, మూడో దశలలో స్మార్ట్‌సిటీ పథకాన్ని అమలు చేస్తారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్, లోపాలు లేకుండా అకౌంట్స్ నిర్వాహణ, సమాచార సాంకేతికను ఉపయోగిస్తూ కార్పొరేషన్ ద్వారా అందుతున్న పౌర సేవలు సులభతరం చేయడం, ఈ లెటర్స్, కార్పొరేషన్‌తో సంబంధం ఉండే వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం తదితర అంశాల అమలును బట్టి స్కోరును కేటాయిస్తారు. తొలిదశలో కష్టమే.. స్మార్ట్‌సిటీ జాబితాలో మొదటి, రెండో దశ అమలులో స్థానం దక్కించుకునే నగరాలకే ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. అయితే తొలి రెండు దశల్లో చోటు దక్కించుకోవడం కోసం భారీ కసరత్తే చేయాలి. స్మార్ట్‌సిటీ నిబంధనలకు అనుగుణంగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి సమగ్ర నివేదికను అందివాలి. కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్థలాలు, ఇళ్లు, పన్నులు, మ్యాపులు, లేఅవుట్లు తదితర సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయాలి. పద్దులను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుంది. వరంగల్ నగరం విషయానికి వస్తే గడిచిన నాలుగేళ్లుగా అకౌంట్ ప్రక్రియ పూర్తి కాకపోవడం మొదటి అవరోధంగా మారనుంది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో డబుల్ అకౌంటింగ్ పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తుంది. తొలిదశ నగరాల జాబితాను ప్రకటించేందుకు మరో నాలుగు నెలల సమయం ఉంది. ఈలోగా కార్పొరేష న్ పాలన వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకురావాల్సి ఉంది. -
నాలెడ్జ్ హబ్‌గా ఏపీ
సీఐఐ సదస్సులో సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ‘‘రాష్ట్రాన్ని రెండేళ్లలో నాలెడ్జ్ హబ్‌గా మార్చాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అభివృద్ధికి దోహదపడే అంశాలను అందిపుచ్చుకోవాలి. యువ ఇంజనీర్లు, ఐటీ రంగంలోని అనుభవజ్ఞులు కొత్త అప్లికేషన్లతో ముందుకు రావాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. విజయవాడలో గురువారం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ) ప్రతినిధులు ఏర్పాటు చేసిన ఐటీ రంగ సదస్సులో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన సీఐఐ సదస్సులో కూడా సీఎం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. రాష్ట్రాభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానంతోపాటు సృజనాత్మక ఆలోచనలు కూడా ఎంతో అవసరమని చెప్పారు. విదేశాల్లో నివసించే సాఫ్ట్వేర్ నిపుణులు కొద్దిపాటి సమయాన్ని స్వరాష్ట్రం కోసం కేటాయిం చాలని సూచించారు. ‘కోడ్ ఫర్ ఏపీ’ గ్రూప్‌లో చేరాలని పిలుపునిచ్చారు. మొబైల్ రివల్యూషన్, క్లౌడ్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న ప్రస్తుత తరుణంలో యువ ఇంజనీర్లు సరికొత్త ఆలోచనలతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఈవ్‌టీజింగ్‌లపై ఆందోళన సరస్వతీ నిలయాలుగా భాసిల్లాల్సిన యూనివర్సిటీలు ఈవ్‌టీజింగ్, ర్యాగింగ్‌లకు నిలయాలుగా మారుతున్నాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి అనే విద్యార్థిని చనిపోవడం ఎంతో బాధ కలిగించిందన్నారు. విశ్వవిద్యాలయాల్లో బయటి వ్యక్తులు తిష్టవేసి కుల సంఘాలను నడుపుతున్నట్లు తెలిసిందని, వారిని బయటకు పంపిస్తామని చెప్పారు. వారం తర్వాతే..: పట్టిసీమపై సీఎం * రాష్ట్ర విభజనపై విధానపత్రం విడుదల సాక్షి, విజయవాడ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రజలకు అంకితం చేస్తామని, నీటి విడుదల మాత్రం వారం, పదిరోజుల తర్వాతే ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గురువారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మార్చి 29న ఈ పథకానికి శంకుస్థాపన చేసి ఆగస్టు 15 తుదిగడువు విధించామని, కానీ అధికారులు వారం, పదిరోజులు సమయం అడిగారని తెలిపారు. వర్షాలు పడడం, రక్షణ, నాణ్యతలను దృష్టిలో పెట్టుకుని అధికారులపై తాను ఒత్తిడి చేయలేదన్నారు. ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేయడం.. నదుల అనుసంధానం ద్వారా చరిత్ర సృష్టించనున్నట్లు తెలిపారు. తొలుత ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల తీరు- టీడీపీ పాత్ర’పై ఒక విధాన పత్రాన్ని ఆయన విడుదల చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అనుసరించిన విధానం, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, తదితర పరిణామాలను అందులో పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కావాలని గట్టిగానే అడుగుతామని, కానీ దానివల్లే అంతా అయిపోదని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి టీఆర్ఎస్ అనేక రకాల సమస్యలు, వివాదాలు సృష్టిస్తూనే ఉందన్నారు. శుక్రవారం మరోపత్రం విడుదల చేస్తానని చెప్పారు. -
పరిశ్రమల అవసరాలపై టాస్క్‌ఫోర్స్
* సాంకేతిక విద్యాసంస్థలపై అధ్యయనం * మూడు నెలల్లోగా ప్రభుత్వానికి నివేదిక సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన మానవ వనరులు అందించడంలో విద్యా సంస్థలు, పరిశ్రమల నడుమ అంతరాన్ని తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విద్యా సంస్థల్లో ప్రస్తుతమున్న సాంకేతిక విద్యా విధానంపై లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించింది. పనిలో పనిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉత్పత్తి రంగాలకు అవసరమైన మానవ వనరుల అవసరాలపై కూడా దృష్టి సారించనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 16 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐఐ, ఫిక్కీ, ఫ్టాప్సీ తదితర పారిశ్రామిక సంఘాలతో పాటు, టీ సీఎస్, మైక్రోసాఫ్ట్, మహీంద్రా అండ్ మహీంద్ర, హైసియా తదితర ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు ఈ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా వుంటారు. జేఎన్టీయూ మాజీ వైస్ చాన్స్లర్లు రామేశ్వర్రావు, డీఎన్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ జయప్రకాశ్‌రావు, సాంకేతిక విద్య, పరిశ్రమల శాఖ కమిషనర్ తదితరులు టాస్క్ఫోర్సులో సభ్యులుగా నియమితులయ్యారు. మూడు నెలల్లోగా టాస్క్‌ఫోర్స్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఉత్తర్వుల్లో నిర్దేశించారు. మానవ వనరుల కొరత తీర్చేందుకే ఇటీవల ప్రవేశ పెట్టిన నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ఐపాస్)లో భాగంగా పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్నారు. అయితే తాము మానవ వనరుల కొరతను ఎదుర్కొంటున్నామని పెట్టుబడిదారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గణనీయంగా వృత్తి విద్యా కాలేజీలున్నా ఉద్యోగాలు పొందుతున్న వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంటోంది. ఈ నేపథ్యంలో వృత్తి విద్యా సంస్థలు, పరిశ్రమల నడుమ అంతరాన్ని తొలగించడం లక్ష్యంగా ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ సాయంపై ఆధార పడి ప్రత్యక్షంగా, పరోక్షంగా పనిచేస్తున్న వృత్తి విద్యా సంస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం, పారిశ్రామిక వాడలు, పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా ఈ సంస్థల్లో శిక్షణ ఇవ్వడం తదితర అంశాల అధ్యయనంపై టాస్క్‌ఫోర్స్ దృష్టి సారిస్తుంది. వృత్తి విద్యా కోర్సులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంపై అధ్యయనం చేస్తుంది. -
కార్పొరేట్ రంగంలో..కొలువుల జోరు
కార్పొరేట్ రంగం... నేటి యువత కలల కెరీర్‌కు సరైన వేదికగా నిలుస్తోంది. గత ఆర్నెల్ల కాలంలో అన్ని పరిశ్రమల్లోనూ నియామకాల సరళి ఆశాజనకంగా ఉంది. మున్ముందు ఇదే ధోరణి కొనసాగేందుకు అనువైన వాతావరణం కనిపిస్తోంది. వ్యాపార వృద్ధి, విస్తృతి దిశగా కదులుతున్న అన్ని రంగాలూ భారీ నియామకాలు చేపట్టనున్నట్లు కంపెనీల ప్రతినిధులు, ప్లేస్మెంట్ ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఎండమావిగా మారిన నేటి పరిస్థితుల్లో విద్యార్థులకు అవకాశాలు అందించే ప్రైవేటు రంగంలో నియామకాలపై విశ్లేషణ... ఏఏ రంగాల్లో... వచ్చే ఆర్నెల్లలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్‌కేర్ అండ్ ఫార్మా, రిటైల్ రంగాలు నియామకాల పరంగా ముందంజలో ఉండనున్నాయి.టెలికం, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ (ఎఫ్ఎంసీజీ), ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్, ఈ-కామర్స్ రంగాలు కూడా భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.వివిధ సంస్థలు, రిక్రూటింగ్ కన్సల్టెన్సీల అభిప్రాయం ప్రకారం 2015-16 ద్వితీయార్ధంలో అన్ని రంగాల్లో కలిపి ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ జరగనుంది. వీటిలో అధిక శాతం ఐటీ, ఐటీఈఎస్, ఎఫ్ఎంసీజీ సంస్థలే ఎక్కువ. ఐటీదే హవా 2015లో నియామకాల పరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగం హవా కొనసాగనుంది. వాస్తవానికి గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే రిక్రూట్మెంట్స్లో 13 శాతం తగ్గుదల ఉన్నప్పటికీ, మొత్తంమీద 2.3 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు నాస్కామ్ అంచనా.ఇన్ఫోసిస్ సంస్థ 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదట్లోనే ప్రకటించింది. ఐటీ దిగ్గజాలుగా పేరొందిన టీసీఎస్, విప్రో తదితర సంస్థలు కూడా దాదాపు ఇదే స్థాయిలో రిక్రూట్మెంట్ జరపనున్నాయి. ఉత్పత్తి రంగంలో ఊపు ఉత్పత్తి రంగంలో 2015-16 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.2 లక్షల ఉద్యోగాల భర్తీ జరగనున్నట్లు అంచనా. వీటిలో ఇప్పటివరకు 30 శాతం నియామకాలు జరిగాయని, మిగిలిన వాటి భర్తీ చివరి ఆర్నెల్లలో ఉంటుందని రిక్రూటింగ్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.ఐటీ, ఐటీఈఎస్, బీఎఫ్ఎస్ఐ, టెలికం వంటి రంగాలే కాకుండా సూక్ష్మ, మధ్య, చిన్న తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) రంగంలోనూ ఈ ఏడాది లక్షల సంఖ్యలో నియామకాలు జరగనున్నాయి. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో దాదాపు పది లక్షల ఉద్యోగాలు లభించనున్నాయి.విభాగాలు, విధుల వారీగా వచ్చే ఆర్నెల్ల కాలంలో ప్రొడక్ట్/ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, న్యూ సోషల్ మీడియా మేనేజ్మెంట్, బిగ్ డేటా అనలిటిక్స్ ప్రొఫైల్స్‌లో మంచి అవకాశాలు లభించనున్నాయి. ప్రొడక్ట్ డిజైనింగ్ విభాగంలో నిష్ణాతులకు కంపెనీలు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. ఉద్యోగాల పరంగా గత ఆరు నెలల కాలంలో ఫ్రెషర్స్‌కు పెద్దపీట వేసినట్లు ఆయా సర్వేల గణాంకాలు తెలియజేస్తున్నాయి. మొత్తం నియామకాల్లో 0-3 ఏళ్ల పని అనుభవం ఉన్నవారి శాతం మే చివరి నాటికి 32 శాతంగా నిలిచింది. 4-7 ఏళ్ల పని అనుభవం ఉన్నవారి శాతం 38గా ఉంది. జీతభత్యాలు వివిధ రంగాల్లో వేతనాలు 12 శాతం నుంచి 25 శాతం మేర పెరిగాయి. ఫ్రెషర్స్‌కు వారు చదివిన సంస్థలనుబట్టి కనీస వేతనం రూ.4 లక్షలు, గరిష్ట వేతనం రూ.15 లక్షలు లభించాయి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్‌లో కోడ్ నేషన్ రూ.22 లక్షలు, అమెజాన్ రూ.29 లక్షలు, గూగుల్ రూ.24 లక్షల వార్షిక వేతనాలను ఆఫర్ చేశాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం టైర్-1 పట్టణాల్లో సగటున రూ.4 లక్షలు, టైర్-2 పట్టణాల్లో సగటున రూ.3 లక్షల కనీస వేతనం లభిస్తుంది. గరిష్ట వేతనాలు రూ.6లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఉండనున్నాయి. ఇప్పుడు టైర్-2 పట్టణాల్లో సైతం కంపెనీలు నియామక ప్రక్రియలు చేపడుతున్నాయి. ఏపీలో విశాఖపట్నం, హిందూపూర్ వంటి పట్టణాలకు సైతం కార్పొరేట్ సంస్థలు నియామకాల కోసం వెళ్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో పారిశ్రామిక విస్తరణ జరుగుతుండటమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కార్పొరేట్ కొలువులు అంటే టక్కున గుర్తొచ్చేది క్యాంపస్ రిక్రూట్మెంట్స్! ఇవి కూడా ఈ ఏడాది విద్యార్థులకు చక్కటి అవకాశాలు కల్పించనున్నాయి. జూలై రెండు లేదా మూడో వారం నుంచి ప్రారంభం కానున్న క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఇప్పటికే కంపెనీలు ఆయా ఇన్స్టిట్యూట్లకు ప్రతిపాదనలు పంపించాయి.‘క్యాంపస్’ కొలువులు చేజిక్కించుకునేందుకు ఐటీ రంగం ఔత్సాహికులు డేటా అనలిటిక్స్, డేటా విజువలైజేషన్, కోడింగ్, డీకోడింగ్ నైపుణ్యాలు పెంచుకోవాలి. టెలికం రంగం ఔత్సాహికులు ఆండ్రాయిడ్ టెక్నాలజీస్, ఐఓఎస్, మొబైల్ ఫ్రేమ్‌వర్క్స్ విభాగాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ఉత్పత్తి రంగం లక్ష్యమైతే 3-డి డిజైనింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో నైపుణ్యాలు అవసరం.కోర్ నాలెడ్జ్‌తోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం తప్పనిసరి. ఈ-కామర్స్ పైచేయి ఈ-కామర్స్ రంగం... ముఖ్యంగా డేటా మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్ ప్రొఫైల్స్‌లో ఉద్యోగాలు భారీగా లభించనున్నాయి. అందుకే పీహెచ్‌పీ, హెచ్‌టీఎంఎల్, వెబ్ఫ్రేమ్వర్క్స్ తదితర నైపుణ్యాలు ఉండటం లాభదాయకం. - టి.వి.దేవీప్రసాద్, ప్లేస్మెంట్ హెడ్, ట్రిపుల్ ఐటీ-హైదరాబాద్. జూనియర్ లెవల్లో ఎక్కువ వచ్చే అయిదు నెలల్లో అన్ని రంగాల్లో జూనియర్ (ఎంట్రీ) లెవల్లో ఎక్కువ అవకాశాలు ఉండనున్నాయి. గతేడాదితో పోల్చితే ఇది నాలుగు శాతం మేర పెరగనుంది. - కునాల్ సేన్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, టీమ్ లీజ్ సర్వీసెస్. ఆర్ అండ్ డీ రంగంలో... ఈ ఏడాది పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగంలో అవకాశాలు పెరగనున్నాయి. ముఖ్యంగా ఉత్పత్తి రంగంలో ఇవి ఎక్కువ. రక్షణలోనూ ఎఫ్‌డీఐలకు అనుమతుల నేపథ్యంలో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు పెరగనున్నాయి. - ప్రొఫెసర్ వెంకటేశం, ప్లేస్మెంట్ ఆఫీసర్, ఐఐటీ-హైదరాబాద్. సమస్య అదే... నియామకాలు ఆశాజనకంగా ఉన్నాయన్న అంచనాలు వాస్తవమే అయినా స్కిల్ గ్యాప్ సమస్యను ఐటీతో పాటు అన్ని విభాగాలూ ఎదుర్కొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, కోర్ అంశాల్లో ప్రాక్టికల్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. - బిపిన్ చంద్ర, వైస్ ప్రెసిడెంట్, సీఏ ఇండియా టెక్నాలజీ సెంటర్. -
మరణశయ్యపై తల్లీ బిడ్డలు
మాతా శిశు మరణాల్లో అగ్రస్థానంలో కర్ణాటక {V>Ò$× ప్రజల్లో అవగాహన లేమి, వసతుల కొరతే కారణమంటున్న వైద్యులు బెంగళూరు : సమాచార సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో దేశంలోని మి గిలిన రాష్ట్రాలతో పోలి స్తే అందనంత ఎత్తులో ఉన్న కర్ణాటక, మాతా శిశు సంరక్షణలో మా త్రం అథఃపాతాళంలో ఉంది. నిపుణులైన మానవ వనరులు లేకపోవడంతోపా టు అవసరమైన సాంకేతిక పరి జ్ఞానాన్ని సమకూర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇందుకు ప్రముఖ కారణమని తెలుస్తోంది. దీంతో కళ్లు తెరవక ముందే పసిమొగ్గలు రాలిపోతున్నాయి. అమ్మ పొత్తిళ్లలో వెచ్చగా పడుకోవలసిన పసికందులు, రోజులు గడవక ముందే తనువు చాలిస్తున్నారు. మరోవైపు మాతృత్వపు మ మకారాన్ని చవిచూడకుండానే ప్రసవిం చిన గంటల్లోపే తల్లులు మృత్యువాత పడుతున్నారు. దక్షిణాదిలో మొదటి స్థానంలో కర్ణాటక తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే మాతా శిశు మరణాలు కర్ణాటకలోనే ఎక్కువగా జరుగుతున్నాయి. అందులోనూ వెనుకబడిన ప్రాంతంగా గుర్తించబడిన హైదరాబాద్-కర్ణాటక ప్రాంతంలోని బెళగావి, కలబుర్గీ, యాదగిరి, కొప్పాల్, రాయచూర్, బళ్లారీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ హై-క ప్రాంతంలో చిన్నవయసులోనే పెళ్లిళ్లు కావడం వల్ల చాలా మంది 18 ఏళ్లలోపే గర్భం దాలుస్తున్నారు. దీంతో ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురై మాతా శిశుమరణాలు సంభవిస్తున్నాయి. మరోవైపు నిపుణులైన వైద్యులు అవసరమైన సంఖ్యలో అందుబాటులో లేకపోవడం, ఆసుపత్రిలోని నియోనేటనల్ ఇన్సెటివ్ కేర్ యూనిట్ (ఎన్ఐసీయూ)లో అవసరమైన పరికరాలు లేకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందనే వాదన కూడా వినిపిస్తోంది. కర్ణాటకలోని గ్రామీణ ప్రాంతాల నుంచి చివరి సమయంలోనే (క్రిటికల్ టైం) గర్భిణులు ఆస్పత్రులకు వస్తున్నారని దీంతో తల్లి, లేదా బిడ్డల్లో ఎవరో ఒకరిని మాత్రమే బతికించడానికి వీలవుతోందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలోని మాతా, నవజాత శిశుమరణాల పరిస్థితిని వివరిస్తూ రాజమల్లప్ప అనే సామాజిక వేత్త రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి శరణ్ ప్రకాశ్ పాటిల్‌తో పాటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. ‘‘ముఖ్యంగా ఉత్తర కర్ణాటకలోని కిమ్స్‌లో రోజుకు సగటున 30 ప్రసవాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మూడు రోజులకు రెండు మాత, నవజాత శిశుమరణాలు సంభవిస్తున్నాయి.’’ అని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. చాలా కాలంగా మాతా, శిశు మరణాలపై అధికారులకు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నా కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పులేదని ఆయన వాపోతున్నారు. -
హైదరాబాద్‌లో టెక్నోజెన్ ఐటీ సంస్థ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘రాజకీయ నాయకుడిగా పలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల ప్రారంభోత్సవంలో, సదస్సులు, సమావేశాల్లో పాల్గొన్నానే తప్ప.. నాకు ఏమాత్రం ఐటీ పరిజ్ఞానం లేదు. వయస్సు రీత్యా నేనీ కంపెనీ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్హుణ్ణి మాత్రమే’’నని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారమిక్కడ టెక్నోజెన్ ఐటీ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం సంస్థ సీఈఓ లాక్స్ చీపూరీ మాట్లాడుతూ.. 12 ఏళ్లుగా ఐటీ సేవలందిస్తున్న సిస్కో టెక్నాలజీ సంస్థే ఈ టెక్నోజెన్ అన్నారు. హెల్త్, మొబిలిటీ, గేమిఫికేషన్, డీడబ్ల్యూ/బీఐ, సీఎక్స్ఎం వంటి ఐటీ సేవలను హైదరాబాద్ కేంద్రంగా అందించేందుకు ఇక్కడ తమ కార్యకలాపాలను విస్తరించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రాజన్ నటరాజన్, సీఓఓ దీపక్ థాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ మరింత అభివృద్ధి చెందాలి
‘విజన్ సమ్మిట్’లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బెంగళూరు : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభిప్రాయపడ్డారు. ఇండియన్ ఎలక్ట్రానిక్స్ అండ్సెమీ కండక్టర్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో సోమవారమిక్కడ ఏర్పాటైన ‘విజన్ సమ్మిట్-2015’ను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఐటీ రంగంలో ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ లావాదేవీలు జరిపే నగరాల్లో బెంగళూరు రెండో స్థానంలో ఉందని అన్నారు. అంతేకాక ఎక్కువ విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్న నగరాల్లో మూడో స్థానంలో ఉందని తెలిపారు. దేశంలోని 819 పరిశోధనా కేంద్రాల్లో 400 కేంద్రాలు కర్ణాటకలోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 200 ఇంజనీరింగ్ కాలే జీలున్నాయని, ఏడాదికి దాదాపు లక్ష మంది ఇంజనీర్లు కళాశాలల నుంచి బయటకు వస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రతి ఒక్క వ్యాపారవేత్త ముందుకు రావాలని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను తమ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఇస్రో మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.రాధాకృష్ణ, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ఎస్.ఆర్.పాటిల్ పాల్గొన్నారు. -
అవకాశాల మేఘం.. క్లౌడ్ కంప్యూటింగ్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఐటీ అనుబంధ సంస్థల్లో కెరీర్స్ అంటే సాధారణంగా గుర్తొచ్చే విభాగాలు.. ప్రోగ్రామింగ్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, డేటా మైనింగ్, అప్లికేషన్స్. వీటితోపాటు ఐటీ రంగంలో ఇప్పుడు ఎమర్జింగ్ సెగ్మెంట్‌గా మారుతున్న విభాగం.. క్లౌడ్ కంప్యూటింగ్. తాజాగా ఐఐటీల క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఐటీ రంగ నియామకాల్లో 20 నుంచి 25 శాతం మేర క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొఫైల్స్‌కు చెందినవే. కంపెనీలు ఇతర మార్గాల ద్వారా భర్తీ చేస్తున్న వాటిల్లోనూ క్లౌడ్ కంప్యూటింగ్‌కు ప్రాధాన్యం లభిస్తోంది. భవిష్యత్‌లో క్లౌడ్ కంప్యూటింగ్‌లో లక్షల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. సాఫ్ట్వేర్ సేవలను సరళతరం చేస్తూ పుష్కల అవకాశాలకు దోహదం చేస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్‌పై విశ్లేషణ.. ‘ఆధునిక ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ రూపొందించి వినియోగదారుల ఆదరణ పొందాలి. ఇప్పుడు ఇందుకు సరైన సాధనం.. క్లౌడ్ కంప్యూటింగ్. యువ సాఫ్ట్వేర్ నిపుణులు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో రాణించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కొద్దిరోజుల క్రితం చేసిన వ్యాఖ్యలివి. సాఫ్ట్వేర్ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ ఆవశ్యకతను తెలిపే మాటలివి. దేశంలో అనేక సాఫ్ట్వేర్ సంస్థలు వినియోగదారులకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాయి. పోటీదారుల కంటే ముందుండేందుకు నిరంతరం కొత్త టెక్నాలజీపై దృష్టి పెడుతున్నాయి. ఈ క్రమంలోనే క్లౌడ్ కంప్యూటింగ్ ప్రాధాన్యం పెరుగుతోంది. క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఐటీ సంస్థలు తమ క్లయింట్ల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తుంటాయి. అందులో భాగంగా ఎన్నో ప్రోగ్రామ్స్, అప్లికేషన్ టూల్స్, నెట్వర్క్ ఛానెల్స్‌ను రూపొందిస్తుంటాయి. వీటన్నిటి స్టోరేజ్ కంపెనీలకు వ్యయభారంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా ఆవిష్కృతమైన సరికొత్త టెక్నాలజీ.. క్లౌడ్ కంప్యూటింగ్! భౌతికంగా ఎలాంటి డేటా స్టోరేజ్, లాన్ లేకుండానే ఇంటర్నెట్ ఆధారంగా ఈ-మెయిల్స్ ద్వారా నిర్దిష్ట సేవలను అవసరమైనప్పుడు అందించడమే.. క్లౌడ్ కంప్యూటింగ్. ఇది కంపెనీల వ్యయ భారాన్ని, సమయాన్ని ఆదా చేస్తుంది. సాఫ్ట్వేర్ సేవలను సదరు ప్రొవైడర్ నుంచి సులువుగా ఈ-మెయిల్ ద్వారా పొందొచ్చు. ఇప్పటివరకు ఏదైనా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినప్పుడు దానిపై అవగాహన వచ్చే వరకు ప్రొవైడింగ్ సంస్థల ప్రతినిధులు వినియోగదారుల వద్ద ఉండాల్సి వచ్చేది. క్లౌడ్ కంప్యూటింగ్‌తో ఈ-మెయిల్స్, ఇంటర్నెట్ ద్వారా ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోంది. ఉదాహరణకు: ఒక వినియోగదారుడి కంప్యూటర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌కే పరిమితమైంది. కానీ దానికి భిన్నంగా ఉండే మరో అప్లికేషన్(ఉదా: యాపిల్ మ్యాక్) పొందాల్సిన అవసరం ఏర్పడింది. అలాంటప్పుడు యాపిల్ మ్యాక్ ప్రొవైడర్స్ నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి, ఈ-మెయిల్ ద్వారా సొంతం చేసుకుని యాపిల్ మ్యాక్ అప్లికేషన్స్‌ను వినియోగించుకోవచ్చు. దీనికి ఆ ప్రొవైడర్స్ నిర్దేశించే మొత్తం చెల్లిస్తే సరిపోతుంది. అంటే.. స్థూలంగా ఇంటర్నెట్ ఆధారంగా ఎలాంటి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్/సర్వీసెస్‌ను అయినా అందించే, సొంతం చేసుకునే వెసులుబాటు కల్పించే విభాగం.. క్లౌడ్ కంప్యూటింగ్. పెరుగుతున్న డిమాండ్ పోటీ ప్రపంచంలో సంస్థలు, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాల్సి ఉంటుంది. అయితే సాఫ్ట్‌వేర్‌కు సంబంధించి ప్రతి రెండు, మూడేళ్లకు కొత్త కొత్త వెర్షన్లు ఆవిష్కృతమవుతున్నాయి. దాంతో అన్నిటినీ కొనుగోలు చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంతేకాకుండా కంపెనీలకు డేటా స్టోరేజ్ అనేది పెద్ద సమస్యగా మారుతోంది. క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ద్వారా అవసరమైన మేరకే సదరు సర్వీసెస్ పొందే అవకాశం లభిస్తుంది. అందుకే గత రెండుమూడేళ్లుగా క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతోంది. మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్, ఇన్ఫోసిస్.. ఇలా ఐటీ రంగంలో దాదాపు అన్ని కంపెనీలు ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ నైపుణ్యాలు ఉన్న వారి కోసం అన్వేషిస్తున్నాయి. లక్షల్లో అవకాశాలు ఐటీ రంగంలో క్లౌడ్ కంప్యూటింగ్ నియామకాల సంఖ్య లక్షల్లో నమోదు కానుంది. నాస్కామ్, సీఐఐ, ఐబీఎం వంటి సంస్థల సర్వేల ప్రకారం- క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఈ ఏడాది భారీగా రిక్రూట్మెంట్ జరుగనుంది. మరోవైపు 2015 చివరి నాటికి అంతర్జాతీయంగా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం 70 బిలియన్ డాలర్ల మేర కార్యకలాపాలు నమోదు చేసుకోనుంది. 26 శాతం వార్షిక వృద్ధి సాధిస్తున్న క్లౌడ్ కంప్యూటింగ్ ఈ ఏడాదిలోనే 15 లక్షలకుపైగా ఉద్యోగాలు కల్పించనుందని నిపుణుల అంచనా. వీటిలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో నిలవనుంది. భారత్ మూడు లక్షలకుపైగా ఉద్యోగావకాశాలతో మూడో స్థానం పొందనున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. అవసరమైన నైపుణ్యాలు క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో స్థిరపడాలనుకునేవారికి హెచ్‌టీఎంఎల్, వర్చువలైజేషన్ టెక్నాలజీస్, జావా, సీ++, డాట్ నెట్ వంటి ప్రోగ్రామింగ్ స్కిల్స్, డేటా మేనేజ్మెంట్, డేటా అనాలిసిస్, డేటా మైనింగ్ వంటి కోర్ నైపుణ్యాలు అవసరం. అదేవిధంగా వెబ్ డెవలప్మెంట్, నెట్వర్క్ సెక్యూరిటీ, అప్లికేషన్ డెవలప్మెంట్, బిజినెస్ అనాలిసిస్ తదితర యూజర్ రిలేటెడ్ స్కిల్స్ కూడా ఉద్యోగ సాధనకు ఉపకరించే అదనపు నైపుణ్యాలు. క్లౌడ్ కోర్సులు క్లౌడ్ కంప్యూటింగ్‌కు సంబంధించి ప్రస్తుతం అకడమిక్‌గా ఇన్స్టిట్యూట్ల స్థాయిలో పూర్తిస్థాయి కోర్సులు లేవు. దీంతో కంపెనీలు బీటెక్ స్థాయిలో ఈసీఈ, సీఎస్ఈ బ్రాంచ్‌ల విద్యార్థులను నియమించుకుని, సొంతంగా శిక్షణనిచ్చి క్లౌడ్ నైపుణ్యాలు నేర్పిస్త్తున్నాయి. జేఎన్టీయూ, ట్రిపుల్ఐటీ, సీ-డాక్ వంటి ఇన్స్టిట్యూట్లు ఆఫర్ చేసే సాఫ్ట్వేర్ కోర్సుల్లోనే క్లౌడ్ కంప్యూటింగ్ మాడ్యూల్స్‌ను అందిస్తున్నాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌కు గ్రాడ్యుయేషన్‌లో పూర్తి స్థాయి కోర్సులు లేకున్నా.. రీసెర్చ్ స్థాయిలో పలు ఇన్‌స్టిట్యూట్‌ల్లో అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ-బాంబే, ఐబీఎం-ఇండియా రీసెర్చ్ ల్యాబ్, టీసీఎస్ ఇన్నోవేషన్ ల్యాబ్, హెచ్‌పీ లేబొరేటరీల్లో క్లౌడ్ కంప్యూటింగ్‌లో ఆర్ అండ్ డీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇందుకోసం అవి ప్రత్యేక ప్రవేశ ప్రక్రియల ద్వారా ఔత్సాహికులను ఎంపిక చేస్తున్నాయి. సర్టిఫికేషన్స్ పూర్తి స్థాయిలో కోర్సులు లేని క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాల ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు పలు ఇన్స్టిట్యూట్లు సర్టిఫికేషన్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఐబీఎం, సిస్కో, హెచ్‌పీ టెక్నాలజీస్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. వీటితోపాటు క్లౌడ్ క్రెడెన్షియల్ కౌన్సిల్, ఈఎంసీ, వీఎంవేర్ వంటి ఇన్స్టిట్యూట్లు పలు సర్టిఫికేషన్‌స ఆఫర్ చేస్తున్నాయి. అవి.. ప్రొఫెషనల్ అడ్మినిస్ట్రేటర్, ప్రొఫెషనల్ క్లౌడ్ డెవలపర్, ప్రొఫెషనల్ క్లౌడ్ సెక్యూరిటీ మేనేజర్, సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్, వెండార్ అలైన్మెంట్, క్లౌడ్ ఆర్కిటెక్ట్, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సర్వీసెస్ సర్టిఫికేషన్, వర్చువలైజేషన్ ఆఫ్ డేటా సెంటర్ అండ్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్టిఫికేషన్ వంటివి. ఆకర్షణీయ వేతనాలు సర్టిఫికేషన్ కోర్సులు లేదా కంపెనీల సొంత శిక్షణ ద్వారా క్లౌడ్ కంప్యూటింగ్‌లో నైపుణ్యాలు పొందినవారికి.. ఈ విభాగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ప్రాజెక్ట్ మేనేజర్, బిజినెస్ అనలిస్ట్; నెట్వర్క్ ఆర్కిటెక్ట్/ప్లానర్; ప్రొడక్ట్ మేనేజర్; సేల్స్ ఎగ్జిక్యూటివ్; క్లౌడ్ డెవలపర్/ప్రోగ్రామర్, క్లౌడ్ కన్సల్టెంట్; క్లౌడ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేటర్, క్లౌడ్ సిస్టమ్స్ ఇంజనీర్ వంటి హోదాలు లభిస్తాయి. ఈ రంగంలో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్‌కు ఎంట్రీ లెవల్లోనే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మధ్యలో వార్షిక వేతనం లభిస్తుంది. మిడ్-లెవల్ ప్రొఫెషనల్స్‌కు దాదాపు రూ.15 లక్షలు; ఆరేడేళ్ల అనుభవం ఉన్న వారికి రూ.20 లక్షల మేర వార్షిక వేతనం ఖాయం. క్లౌడ్ సర్టిఫికేషన్స్- ముఖ్య వెబ్‌సైట్స్ ⇒ http://www-03.ibm.com/certify/certs/50001201.shtml ⇒ http://www8.hp.com/us/en/training/portfolio/cloud.html ⇒ education.emc.com ⇒ www.cloudschool.com ⇒ www.microsoft.com/learning ⇒ https://www.itpreneurs.com/it-training-products/cloud-computing/cloud/ l www.cdac.in l www.snia.org. ⇒ www.cloudcomputingtraining.co.in ⇒ www.cloudcredential.org సరికొత్త వేదిక ఐటీ రంగంలో రెగ్యులర్ జాబ్స్‌కు విభిన్నంగా విధులు నిర్వర్తించాలనుకునే వారికి సరికొత్త వేదిక.. క్లౌడ్ కంప్యూటింగ్. మారుతున్న పరిస్థితులు, క్లయింట్ల అవసరాలు, అన్ని స్థాయిల్లోని క్లయింట్లకు చేరుకొని ఎండ్ యూజర్స్ సంఖ్యను పెంచుకునేందుకు కంపెనీలు అనుసరిస్తున్న విధానం.. క్లౌడ్ కంప్యూటింగ్. దీన్ని విద్యార్థులు అందిపుచ్చుకుంటే కచ్చితంగా మంచి అవకాశాలు సొంతమవుతాయి. క్లౌడ్ కంప్యూటింగ్‌లో సుస్థిర భవిష్యత్తు కోరుకునే ఔత్సాహికులకు విషయ పరిజ్ఞానంతోపాటు, క్లయింట్స్‌తో సంప్రదింపులు సాగించే చాతుర్యం; మార్కెట్లో మారుతున్న పరిస్థితులపై అవగాహన; తమ క్లయింట్లకు చెందిన రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించే నైపుణ్యాలు అవసరం. - టి.కోమల్, జీఎం-(క్లౌడ్ వింగ్- ఐబీఎం) ఇద్దరికీ అనుకూలం.. అందుకే అవకాశాలు క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఇటు సర్వీస్ ప్రొవైడర్స్, అటు వినియోగదారులు.. ఇద్దరికీ అనువైన విధానంగా మారింది. దాంతో ఇప్పుడు ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థలన్నీ క్లౌడ్ కంప్యూటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. ఇదే క్రమంలో నిపుణులైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నాయి. ప్రస్తుతం పూర్తి స్థాయిలో కోర్సులు అందుబాటులో లేకపోయినా.. ఆన్లైన్, మూక్ విధానాల్లో లభించే కోర్సులు పూర్తి చేయడం ద్వారా అవగాహన పెంచుకోవచ్చు. అదేవిధంగా పీజీ స్థాయిలో సీఎస్ఈలో క్లౌడ్ కంప్యూటింగ్‌ను కొన్ని ఇన్స్టిట్యూట్ల కరిక్యులంలోనూ పొందుపరుస్తున్నారు. భవిష్యత్‌లో అకడమిక్‌గా పూర్తి స్థాయి కోర్సులు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. - ప్రొఫెసర్ వాసుదేవ వర్మ,డీన్, ఆర్ అండ్ డీ, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ స్టోరేజ్, మేనేజ్మెంట్ నైపుణ్యాలు క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా సేవలన్నీ దాదాపు ఆన్లైన్లోనే సాగుతాయి. కానీ ఒక ప్రొడక్ట్‌కు సంబంధించిన యూజర్ ఎప్పుడు కోరినా క్షణాల్లో పంపించే విధంగా డేటా స్టోరేజ్, మేనేజ్మెంట్ నైపుణ్యాలు క్లౌడ్ కంప్యూటింగ్‌లో కీలకం. యూజర్, సెగ్మెంట్లను పరిగణనలోకి తీసుకుంటూ.. ఒక ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ను రూపొందించేటప్పుడే భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరించే దూరదృష్టి ఉంటే ఈ విభాగంలో రాణించడం సులభమే. - ఎం. రాజేశ్,డెలివరీ మేనేజర్, క్లౌడ్ సపోర్ట్- శాప్ ల్యాబ్స్ -
హైద్రాబాద్‌లో ప్రపంచ ఐటీ సదస్సు
-
అ‘పూర్వ’ సమ్మేళనం
-
ఐటీకి పెద్ద పీట
రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయడమే లక్ష్యం దేవనహళ్లి వద్ద 10,500 ఎకరాల్లో ఐటీఐఆర్ ఐటీ, బీటీ పరిశ్రమల అభివృద్ధికి కృషి దేశ ఐటీ ఎగుమతుల్లో కర్ణాటక నుంచే 30 శాతం సిలికాన్‌వ్యాలీని మించేలా బెంగళూరును తీర్చిదిద్దుతాం ‘బెంగళూరు ఐటీ ఈ.బిజ్’ ప్రారంభోత్సవంలో సీఎం సిద్ధు బెంగళూరు : రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రగామిగా నిలిపే చర్యల్లో భాగంగా దేవనహళ్లి వద్ద 10,500 ఎకరాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. మొదటి దశలో 2,722 ఎకరాల భూ స్వాధీన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామన్నారు. నగర శివారులోని బెంగళూరు అంతర్జాతీయ ప్రదర్శన కేంద్రంలో మూడు రోజుల పాటు జరగనున్న ‘బెంగళూరు ఐటీ ఈ. బిజ్’ను సీఎం సిద్ధరామయ్య బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ....రాష్ట్రంలో ‘డాటా అనాలిసిస్ క్లౌండ్ కంప్యూటింగ్ మొబిలిటీ’ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎక్కువ అవకాశం ఉందన్నారు. ఐటీ, బీటీ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. మొత్తం దేశ ఐటీ ఎగుమతుల్లో ఒక్క కర్ణాటక నుంచే 30 శాతం వరకూ జరుగుతోందన్నారు. ఐటీ రంగంలో అమెరికాలోని సిలికాన్వ్యాలీను మించేలా బెంగళూరును తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా ఐటీ, బీటీ శాఖ మంత్రి ఎస్ఆర్ పాటిల్ మాట్లాడుతూ... రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో ఐటీ పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చే కంపెనీలకు ఉచితంగా భూమి, ఉద్యోగులకు రెండేళ్లపాటు ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ఎన్నో సౌకర్యాలు కల్పించబడుతుందని తెలిపారు. రాష్ట్రలో 2020కు ఐటీ సంబంధ వ్యాపార లావాదేవీలు నాలుగు లక్షల కోట్లకు చేరుతుందన్నారు. అదే సమయానికి రాష్ట్ర ఐటీ రంగంలో 20 లక్షల మందికి నేరుగా, 60 లక్షల మందికి పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయాని ఆశాభావం వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పోలీస్తే ఐటీ పెట్టుబడులకు కర్ణాటక అనువైన రాష్ట్రమని ఐటీ, బీటీ విభాగం కార్యదర్శి శ్రీవత్సకృష్ణ తెలిపారు. -
మొబైల్ ఫోన్లకూ నాణ్యతా ప్రమాణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్ల రంగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (డైటీ) కొత్త అధ్యాయానికి తెరతీసింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) రిజిస్ట్రేషన్ తప్పనిసరి జాబితాలో మొబైల్ ఫోన్లనూ చేర్చింది. దీని ప్రకారం బీఐఎస్ నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గట్టుగా కంపెనీలు నాణ్యమైన మోడళ్లను తయారు చేయాల్సిందే. భారత్‌లో విక్రయించాలనుకున్న ప్రతి మోడల్‌ను దేశ, విదేశీ కంపెనీలు బీఐఎస్ వద్ద నమోదు చేయించాలి. నాణ్యత ఉంటేనే విక్రయించుకునేందుకు బ్యూరో అనుమతిస్తుంది. డైటీ జాబితాలో మొబైల్స్‌తోపాటు పవర్ బ్యాంక్స్, చార్జర్లు, యూపీఎస్/ఇన్వర్టర్లు, ఆల్కలైన్ బ్యాటరీలు వంటి 15 ఉత్పత్తులు చేర్చారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్ వీడియో గేమ్స్, ల్యాప్‌టాప్, నోట్‌బుక్, ట్యాబ్లెట్ పీసీలు వంటి 15 రకాల ఉత్పత్తులు జాబితాకెక్కాయి. తాజాగా ప్రకటించిన ఉత్పత్తులకు ఆరు నెలల గడువిచ్చారు. ఈలోపు బీఐఎస్ ప్రమాణాలకు తగ్గట్టుగా కంపెనీలు తయారీ విధానాన్ని మార్చుకోవాల్సిందే. -
ప్రపంచ వృద్ధి కంపెనీల్లో 17 భారత సంస్థలకు చోటు..
డబ్ల్యూఈఎఫ్ రూపొందించిన ప్రపంచ వృద్ధి కంపెనీల జాబితాలో 17 భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయి. ఫ్లిప్‌కార్ట్, అవెస్థాజెన్, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫినోలెక్స్, 4జీ ఐడెంటిటీ సొల్యూషన్స్, ఏఎన్ఐ టెక్నాలజీస్, జస్ట్‌డయల్, మేక్మైట్రిప్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, రాడికల్ ఫుడ్స్, 4జీ ఐడెంటిటీ సొల్యూషన్స్ వంటివి ఇందులో కొన్ని. కాగా, భవిష్యత్తు ప్రపంచ దిగ్గజాలుగా ఎదిగే సామర్థ్యం ఉన్న కంపెనీలను తాము నామినేట్ చేసినట్లు డబ్ల్యూఈఎఫ్ పేర్కొంది. ఎంచుకున్న కంపెనీల్లో బ్యాం కింగ్, రిటైల్, ఈ-కామర్స్, ఐటీ, కెమికల్స్, ఎనర్జీ ఇలా విభిన్న రంగాలకు చోటు కల్పించినట్లు తెలిపింది. మొత్తం జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 370 కంపెనీలకు పైగా ఉన్నాయి. -
ఐటీలో హైదరాబాద్ ప్రాధాన్యత తగ్గదు
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినంత మాత్రాన ఐటీ రంగంలో హైదరాబాద్‌కు ఉన్న ప్రాధాన్యత, ప్రత్యేకత ఎక్కడికీ పోదని కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం న్యూఢిల్లీలో తన శాఖ 100 రోజుల పాలన ప్రగతి నివేదికను వివరిస్తూ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాతో మాట్లాడారు. ఇద్దరూ ఐటీపై అమితమైన ఆసక్తి కనబరిచారు. ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లను ఏర్పాటుచేయాలని కోరారు. వాటిపై దృష్టిపెడతాం..’ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాను బెదిరిస్తున్నారని, దీనిపై మీ స్పందనేమిటని ఓ విలేకరి ప్రశ్నించగా ‘పత్రికా స్వేచ్ఛకు కట్టుబడి ఉంటాం. అందరూ పత్రికా స్వేచ్ఛకు విలువనివ్వాలి’ అని పేర్కొన్నారు. -
ఐసీటీ బోధన పద్ధతులు అమలు చేయాలి
విజి మురళి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇప్పుడంతా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మయం. ఐటీ అన్ని రంగాల్లోకి చొచ్చుకుపోతోంది. ఐటీ ప్రమేయం లేని విభాగాన్ని ఊహించడం కష్టమే. అందుకే ప్రస్తుతం విద్యార్థి లోకంలో అత్యంత క్రేజీగా మారింది.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీ కోర్సులు చదివినంతనే అద్భుతాలు సాధ్యం కావని.. కెరీర్లో రాణించాలంటే నేటి యువత మరెన్నో నైపుణ్యాలు సొంతం చేసుకోవాలంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్.. చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ విజి మురళి. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీ నుంచి పీహెచ్డీ వరకు చదివిన మురళి.. కెరీర్లో అనూహ్యమైన మలుపుతో ఐటీ రంగంలో ప్రవేశించారు. ఇదే విభాగంలో ఉన్నతంగా ఎదుగుతూ ఐటీ వెటరన్‌గా పేరు సంపాదించుకున్న మురళి.. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా-డేవిస్‌కు సీఐఓగా నియమితులైన నేపథ్యంలో ప్రత్యేక ఇంటర్వ్యూ.. పనితీరుకు గుర్తింపు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీల్లో ఒకటిగా గుర్తింపు పొందిన యూసీ-డేవిస్‌కు సీఐఓగా ఎంపిక కావడం నా పనితీరుకు లభించిన గుర్తింపుగా భావిస్తున్నాను. ఇప్పటికే పలు యూనివర్సిటీల్లో ఐటీ విభాగంలో విధులు నిర్వర్తించాను. వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీలో సీఐఓగా చేస్తున్న సమయంలోనే తాజా నియామకం ఖరారైంది. ఈ స్థాయికి ఎదగడం ఎంతో ఆనందంగా ఉంది. కెమిస్ట్రీ నుంచి కంప్యూటర్ సైన్స్ వైపు ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ, ఆ తర్వాత అదే విభాగంలో 1981లో పీహెచ్డీ పూర్తి చేశాను. అదే సమయంలో వివాహం కావడంతో అమెరికా వచ్చాను. అప్పుడు.. కెమిస్ట్రీలో కొనసాగాలా? ఇతర రంగాలు ఎంచుకోవాలా? అని ఆలోచిస్తుండగా.. నాన్న ‘ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్’లో కాలు పెట్టావు. రానున్న రోజుల్లో కంప్యూటర్, ఐటీ రంగాలకు భవిష్యత్తు ఖాయం’ అని చెప్పి కంప్యూటర్ సైన్స్వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి త్రీ-డీ మూలకాల గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత, పజిల్స్ రూపకల్పన వెనుక దాగున్న అంశాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉండేది. వీటన్నిటికీ కంప్యూటర్ సైన్స్, ఐటీ నైపుణ్యం ద్వారా అవకాశం లభిస్తుందని భావించాను. దాంతో లోవా స్టేట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఆరిజోనాలో ఎంఎస్ పూర్తి చేశాను. అదే యూనివర్సిటీలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా కెరీర్ ప్రారంభించాను. టెక్నాలజీ-విద్యార్థి దృక్పథం టెక్నాలజీ.. అకడమిక్ అధ్యయనాలకు వేగవంతమైన చోదకంగా ఉంటుంది. అదే సమయంలో.. హార్డ్ వర్క్, ఆసక్తి కూడా చాలా అవసరం. ఏ డొమైన్ అయినా ఈ రెండూ ఉంటేనే సదరు సబ్జెక్ట్‌పై పట్టు లభిస్తుంది. ఆసక్తి ఉంటేనే కొత్త విషయాలు, అంశాలు తెలుసుకోవాలనే ఉత్సుకత మొదలవుతుంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ ఫలితంగా విద్యార్థులకు అకడమిక్ అధ్యయనం ఎంతో సులభంగా మారింది. మేం చదువుకునే రోజుల్లో లాగరిథమ్ టేబుల్స్, స్లైడ్ రూలర్స్ వంటివి పెన్, పేపర్ లేనిదే సాధ్యమయ్యేవి కావు. కానీ ఇప్పుడు క్షణాల్లో వాటిని రూపొందించొచ్చు. టెక్నాలజీని వినియోగించుకునే దృక్పథంపైనే విద్యార్థి సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు.. టెక్నాలజీ సహాయంతో క్షణాలు లేదా నిమిషాల్లో ఒక సమస్యను పూర్తి చేసేయొచ్చు. మిగతా సమయాన్ని కొత్త అంశాల అధ్యయనానికి కేటాయించుకోవచ్చు. ఇలా బ్రెయిన్ పవర్‌ను సద్వినియోగం చేసుకుంటే ఎన్నో అర్థవంతమైన ఫలితాలు, అద్భుతాలు సాధించొచ్చు. ఐటీతోపాటు మరెన్నో స్కిల్స్ కెరీర్లో విజయం సాధించాలంటే .. కేవలం ఐటీ డొమైన్ పరిజ్ఞానం ఒక్కటే సరిపోదు. దీనికి అదనంగా ఎన్నో స్కిల్స్ అవసరం. ప్రాబ్లమ్ సాల్వింగ్, టీం వర్క్, టెక్నాలజీ అప్డేషన్, కమ్యూనికేషన్ వంటి నైపుణ్యాలు జత కలిస్తేనే ఐటీ కెరీర్లో ఉన్నతంగా రాణించగలరు. ఐసీటీ బోధనతో మన దేశంలో ప్రధాన సమస్య గ్రామీణ ప్రాంతాలకు సైతం విద్యావకాశాలు అందించడం. దీనికి ఐటీతో పరిష్కారం కనుగొనొచ్చు. వైర్లెస్ కమ్యూనికేషన్ పద్ధతుల్లో గ్రామీణ ప్రాంత పాఠశాలలకు బోధన సదుపాయాలు కల్పించాలి. దీనివల్ల విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. చదువుకు దూరమవుతున్న విద్యార్థినులను దృష్టిలో పెట్టుకుంటే.. ఐసీటీ (ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) బోధన పద్ధతులు తప్పనిసరిగా అమలు చేయాలి. మరిన్ని ఆవిష్కరణలు ఒక్కసారి ‘వెబ్’ అనే యుగానికి ముందు.. ఇప్పుడు.. మన వ్యక్తిగత, సామాజిక జీవనశైలులను గమనించండి. ఎంతో తేడా కనిపిస్తోంది. ఔషధ ఉత్పత్తి, సైన్స్ ఆవిష్కరణలు, సామాజిక శాస్త్ర పరిశోధనల్లో సైతం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోంది. రోబోటిక్స్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, బయలాజికల్ ఆర్గాన్స్; ప్రోస్థెటిక్స్ వంటివి కొన్ని ఉదాహరణలు. ఈ.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని సరైన దిశలో.. సమర్థంగా వినియోగిస్తే మరిన్ని ఆవిష్కరణలు చేయొచ్చు. అమ్మాయిలు రాణించగలరు ముందుగా.. మహిళలు, పురుషులు అనే బేధభావాన్ని వీడాలి. పురుషులతో దీటుగా రాణించగలమనే ఆత్మవిశ్వాసంతో అమ్మాయిలు అడుగు ముందుకు వేయాలి. ఉన్నత స్థానాలకు చేరుకుని కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మహిళలను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఇక.. విద్యార్థులందరికీ నా సలహా.. అకడమిక్స్ ఎంపిక నుంచే జాగ్రత్తగా వ్యవహరించాలి. క్రేజ్ లేదా కెరీర్ ష్యూర్ అనే ఆలోచనలకంటే ఆసక్తికి అనుగుణంగా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు తగిన కోర్సుల్లో చేరాలి. ఒకసారి కోర్సులో చేరిన తర్వాత పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రాక్టికల్ అప్రోచ్‌కు ప్రాధాన్యమిస్తూ అధ్యయనం సాగించాలి. అప్పుడే.. ప్రతి ఒక్కరి లక్ష్యమైన జాబ్.. దానికి అవసరమైన స్కిల్స్ లభిస్తాయి!! -
2019 నాటికి.. ఐటీ హబ్‌గా ఆంధ్ర: మంత్రి పల్లె
తిరుపతి: 2019 నాటికి నవ్యాంధ్ర ప్రదేశ్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఏపీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. రూ. 30 వేల కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్, రూ. 12 వేల కోట్లతో ఐటీ పరిశ్రమ స్థాపించి.. ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. మంగళవారం తిరుపతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ప్రతినిధులు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా అధికారులతో కలిసి తిరుపతిలోని ఎస్‌టీపీఏ కార్యాలయంలో మంత్రి సమావేశం నిర్వహించారు. ఐదు వేల మందికి ఉపాధి కల్పించే ఐటీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమను ఏర్పాటు చేస్తే ఆ సంస్థకు కేటాయించే భూమి విలువలో ఉద్యోగిపై రూ. 60 వేల రాయితీ కల్పిస్తామన్నారు. -
హ్యాకర్లకు చెక్ పెట్టే.. ఐటీ సెక్యూరిటీ
అప్‌కమింగ్ కెరీర్ సమాచార సాంకేతిక (ఐటీ) పరిజ్ఞానం రాకతో అన్ని రంగాల్లో కంప్యూటర్ల వినియోగం తప్పనిసరిగా మారింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అన్లైన్లోనే అన్ని లావాదేవీలు జరుగు తున్నాయి. అదే సమయంలో సమాచార చోరు లు (హ్యాకర్లు) తమ హస్తలాఘవం చూపుతు న్నారు. కంప్యూటర్లలోని విలువైన డేటాను తస్కరిస్తున్నారు. దీనివల్ల కంపెనీలు నష్ట పోతున్నాయి. కోలుకోలేని విధంగా దెబ్బతింటు న్నాయి. కొన్నిసార్లు దేశభద్రతకు సంబంధించిన కీలక సమాచారం కూడా శత్రుదేశాలకు చేరి పోతోంది. ఇది ఆందోళనకరమైన పరిణామం. ఈ నేపథ్యంలో హ్యాకర్ల బారినుంచి కంప్యూటర్లను రక్షించేందుకు ఐటీ సెక్యూరిటీ నిపుణుల వినియో గం పెరిగింది. ఐటీ సెక్యూరిటీ ఉద్యోగాలకు, ఉపాధికి ఢోకా లేని కెరీర్‌గా మారింది. కార్పొరేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల్లోని కంప్యూటర్లు ఎక్కువగా హ్యాకర్ల బారిన పడుతున్నాయి. ఇటీవలి కాలంలో అన్ని రంగాల్లోనూ ఈ బెడద అధికమైంది. కేసుల విచారణలో సాయం: కంప్యూటర్లలోకి నకిలీ సాఫ్ట్వేర్లను, వైరస్‌లను పంపి, సమాచారాన్ని తస్కరించి, సొమ్ము చేసుకుంటున్న ముఠాలు ఉన్నాయి. ఏది ఎలాంటి సాఫ్ట్‌వేరో తెలియని పరిస్థితి. ఇదంతా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతోంది. హ్యాకర్ల పంజాకు గురైన ఎన్నో సంస్థలు ఐటీ సెక్యూరిటీ నిపుణులను నియమించుకుంటున్నాయి. ప్రమాద తీవ్రత అందరికీ తెలియడంతో అన్ని రంగాల్లో వీరి నియామకం జరుగుతోంది. ఐటీ సెక్యూరిటీ లో మూడు విభాగాలు ఉంటాయి. ఒకటి.. కంప్యూటర్ హ్యాకింగ్‌కు గురైతే అందుకు కారణాన్ని గుర్తించడం. రెండోది.. ఎక్కడి నుంచి హ్యాకింగ్ జరిగిందో గుర్తించడం. మూడోది.. నకిలీ సాఫ్ట్‌వేర్‌ను, వైరస్‌లను తొలగించి, మరోసారి హ్యాకింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం. ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ ఈ మూడు దశల్లో పనిచేయాల్సి ఉంటుంది. వీరి ప్రధాన బాధ్యత ఆన్లైన్ మోసాలను అరికట్టడం. అంతేకాకుండా సెక్యూరిటీ కంప్యూటర్ అప్లికేషన్లను రూపొందించాలి. ప్రస్తుతం ఆన్లైన్ మోసాలకు సంబంధించిన కేసుల విచారణకు దర్యాప్తు సంస్థలు ఐటీ సెక్యూరిటీ నిపుణుల సాయం తీసుకుంటున్నాయి. నేరస్థులను చట్టం ముందు నిలబెట్టేందుకు వీరి సేవలు అవసరమవుతున్నాయి. అర్హతలు: మనదేశంలో అండర్గ్రాడ్యుయేట్ స్థాయిలో ఐటీ సెక్యూరిటీపై ఎలాంటి కోర్సులు లేవు. అయితే, బీసీఏ, బీటెక్ కోర్సుల్లో భాగంగా ఐటీ సెక్యూరిటీని ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలంటే ఇది సరిపోదు. బీటెక్ పూర్తిచేసిన వారు ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ) కోర్సు చేస్తే మంచి అవకాశాలుంటాయి. వేతనాలు: ఐటీ సెక్యూరిటీ నిపుణులకు ప్రారంభంలో నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వేతనం అందుతుంది. నైపుణ్యాలను పెంచుకుంటే నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేలు పొందొచ్చు. ఎంసీఏ, బీటెక్ చేస్తే ఇంకా ఎక్కువ వేతనం లభిస్తుంది. ఐటీ సెక్టార్లో వన్నెతగ్గని కెరీర్ ‘‘ఐటీ రంగంలో వన్నెతగ్గని కోర్సుగా ఐటీ సెక్యూరిటీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆన్లైన్ మార్కెటింగ్, ఇంటర్నెట్ వినియోగం ఎంతగా వ్యాప్తిచెందితే.. ఈ రంగంలో అంతగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఐటీ దిగ్గజాల నుంచి సాధారణ వస్త్రదుకాణం వరకూ అంతటా కంప్యూటర్ వినియోగం పెరిగింది. ఆన్లైన్లో వ్యాపార లావాదేవీలు మరింత విస్తృతమవు తున్నాయి. ఈ నేపథ్యంలో నిపుణుల అవసరం నానాటికీ పెరుగుతుంది. టెక్నాలజీ పరంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటే అవకాశాలకు కొదవ ఉండదు. సాఫ్ట్వేర్ సంస్థలూ ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరుగుతున్న కొద్దీ నకిలీ కార్డులను అదుపు చేసేందుకు ఐటీ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ అవసరం పెరిగింది. మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న ఈ కోర్సుతో ఉపాధి, సంతృప్తి రెండూ లభిస్తాయి. వేతనం విషయానికొస్తే ప్రారంభంలో నెలకు రూ.15వేల వరకు అందుకోవచ్చు. అనుభవం, నైపుణ్యాలు పెంచుకుంటే అధిక వేతనాలు పొందొచ్చు. - శివకుమార్, జనరల్ మేనే జర్, జూమ్ టెక్నాలజీస్ -
కొలువునిచ్చే ఐటీ సర్టిఫికేషన్లు!
సమాచార సాంకేతిక(ఐటీ) రంగం అభివృద్ధితో ఎన్నెన్నో నూతన టెక్నాలజీలు ఆవిర్భవిస్తూ, సరికొత్త కొలువులను సృష్టిస్తున్నాయి. వీటిని అందుకోవాలంటే ఏ టెక్నాలజీకి డిమాండ్ ఉందో తెలుసుకొని, సంబంధిత పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో కొలువు కలలను సాకారం చేసే ఐటీ సర్టిఫికేషన్లపై నేటి యువత మొగ్గు చూపుతోంది. ఐటీ సర్టిఫికేషన్లు... అభ్యర్థులకు నైపుణ్యవంతులుగా గుర్తింపునిచ్చి, నచ్చిన కొలువును సొంతం చేసుకునేందుకు దోహదపడు తున్నాయి. ఉద్యోగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు నిచ్చెన వేస్తున్నాయి. కంపెనీలు సైతం సర్టిఫికేష న్లకు ప్రాధాన్యతనిస్తుండడంతో ఆయా కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఈ క్రమంలో విభిన్న సర్టిఫికే షన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో సిస్కో, మైక్రోసాఫ్ట్ అందించే ప్రముఖ కోర్సులు, మార్కెట్లో డిమాండ్ ఉన్న టాప్ సర్టిఫికేషన్ల సమాచారం... సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్ (సీసీఎన్ఏ) ఏ ఎంట్రీ లెవల్ నెట్వర్క్ ఇంజ నీర్‌గా కెరీర్ ప్రారంభించాలనుకునే వారు ఈ సర్టిఫికేషన్ కోర్సులో చేరుతు న్నారు. ఈ సర్టిఫికేషన్ పొందిన వారికి మంచి ఉద్యోగావకాశాలుండడమే కారణం. ఏ కోర్సులో విద్యార్థులు ప్రధానంగా నెట్వర్క్స్ ఆపరేషన్స్, ట్రబుల్ షూటింగ్‌పై చదువుతారు. లోకల్ ఏరియా నెట్వర్క్(లాన్), వైడ్ ఏరియా నెట్వర్క్(వాన్) డిజైన్‌కు సంబంధించిన అడ్వాన్స్డ్ అంశాల గురించి నేర్చుకుంటారు. ఏ ఐపీ అడ్రస్‌లు, రూటర్లు, వాటి ప్రక్రియలు, వీలాన్, డబ్ల్యూలాన్, నెట్వర్క్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ తదితర అంశాలపై నైపుణ్యాలు పొందుతారు. ఏ వివరాలకు వెబ్సైట్: http://www.cisco.com/web/ learning/certifications/associate/ccna/index.html మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సొల్యూషన్స్ అసోసియేట్ (ఎంసీఎస్‌ఏ): - నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్, ఆపరేషన్స్ అనాలిసిస్, టెక్నికల్ సపోర్ట్ తదితర విభాగాలతోపాటు విభిన్న ఐటీ ఉద్యోగాల్లో ఉన్నత స్థాయిలకు చేరుకోవాలనుకునేవారు ఈ సర్టిఫికెట్ కోర్సులో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. - 90 శాతానికి పైగా కంపెనీలు ఎంసీఎస్‌ఏ సర్టిఫికేషన్ పొందిన అభ్యర్థులను నియమించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. - అడ్వాన్స్డ్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ కోర్సులను అభ్యసించే ముందు ఈ కోర్సును నేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌ను అర్థం చేసుకోవడానికి, నిర్వహణ, ట్రబుల్ షూటింగ్ నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. - వివరాలకు వెబ్సైట్: https://www.microsoft.com/learning/en-in/mcsa-certification.aspx ఎంసీఎస్ఈ- షేర్‌పాయింట్: - సంస్థల వ్యాపార కార్యకలాపాలకు సహకరించే మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్లాట్‌ఫాం. దీన్ని ప్రొడక్ట్స్, టెక్నాలజీస్ సమ్మేళనంగా చెప్పొచ్చు. షేర్‌పాయింట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వెబ్సైట్లను రూపొందించవచ్చు. షేర్‌పాయింట్ ఇటు అప్లికేషన్ ప్లాట్‌ఫాంగానూ అటు డెవలప్మెంట్ ప్లాట్‌ఫాంగానూ సమర్థవంతమైంది. - షేర్‌పాయింట్ కోర్సు నేర్చుకోవాలనుకునే ఔత్సాహికులకు డాట్ నెట్ పరిజ్ఞానం అవసరం. కోర్సులో భాగంగా షేర్‌పాయింట్ విశ్లేషణ, మేనేజింగ్ సైట్ కలెక్షన్స్ అండ్ సైట్స్, బిజినెస్ కనెక్టివిటీ సర్వీసెస్, ఎంటర్ప్రైజ్ కంటెంట్ మేనేజ్మెంట్ తదితర అంశాలను అభ్యర్థులు నేర్చుకుంటారు. - షేర్‌పాయింట్ పరిజ్ఞానం సంపాదించిన వారికి జాబ్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. - వివరాలకు వెబ్సైట్: https://www.microsoft.com/learning/en-in/mcse-sharepoint-certification.aspx సీసీఎన్ఏ సెక్యూరిటీ: ఈ సర్టిఫికేషన్లు నెట్వర్క్ సెక్యూరిటీకి పునాది లాంటివి. ఐటీ సెక్యూరిటీ రంగంలో రాణించాలనుకునే వారు ఈ సర్టిఫికేషన్ కోర్సుల్లో చేరుతున్నారు. సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థ్రెట్స్‌ను గుర్తించడం, ఇన్స్టలేషన్, ట్రబుల్ షూటింగ్ తదితర అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. విభిన్న నెట్‌వర్క్‌లకు చెందిన ఐటీ సమస్యల అంచనా, అవగాహన, పరిష్కారానికి ఈ సర్టిఫికేషన్ దోహదపడుతుంది. వివరాలకు వెబ్సైట్: http://www.cisco.com/web/learning/certifications/associate/ccna_security/index.html సిస్కో సర్టిఫైడ్ ఎంట్రీ నెట్వర్కింగ్ టెక్నీషియన్(సీసీఈఎన్టీ): - సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్(సీసీఎన్ఏ) సర్టిఫికేషన్ పొందాలనుకునేవారు ముందుగా ఈ సర్టిఫికేషన్ పూర్తిచేయడానికి ఆసక్తి చూపుతారు. - చిన్న వ్యాపారాల్లో ఐటీ నెట్వర్క్స్తోపాటు ఐటీ ప్రొఫెషనల్స్‌కు ఈ సర్టిఫికేషన్ మరిన్ని అవకాశాలను అందిస్తోంది. - ఓఎస్ఐ మోడల్స్, డీఎన్ఎస్, ఎన్ఏటీ, రూటర్ కాన్ఫిగరేషన్, జనరల్ రూటింగ్ ప్రాథమిక అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఏ వివరాలకు వెబ్సైట్: http://www.cisco.com/ web/learning/certifications/entry/ccent/ index.html దరఖాస్తు: సర్టిఫికేషన్ల కోసం రాయాల్సిన దాదాపు అన్ని పరీక్షల నూ ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. నిర్ధారిత రుసుం చెల్లించి పరీక్షకు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్షలో అర్హత సాధిస్తే సర్టిఫైడ్ అసోసియేట్/ ప్రొఫెషనల్‌గా గుర్తింపు లభిస్తుంది. తద్వారా పుష్కలమైన అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. సర్టిఫికేషన్లతో ఉజ్వల భవిష్యత్తు ‘‘మార్కెట్లో సీసీఎన్ఏ, సీసీఎన్‌పీ తదితర సర్టిఫికేషన్‌స చేసిన వారికి విస్తృత అవకాశాలున్నాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులూ సర్టిఫికేషన్ రాయొచ్చు. ఈ సర్టిఫికేషన్లను రాయడానికి డిగ్రీ అర్హత కానప్పటికీ బ్యాచిలర్‌స డిగ్రీ కోర్సు కనీస అర్హతగా ఉండి ఏదో ఒక నెట్వర్కింగ్ సర్టిఫికేషన్ పూర్తి చేస్తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకో వచ్చు. అలాగే హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ సెంటర్లు ఆయా సర్టిఫికేషన్లలో శిక్షణనందిస్తున్నాయి. ఏదైనా సర్టిఫికేషన్ సాధించి, మంచి క మ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ కలిగి ఉంటే కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు’’ - అహ్మద్, నెట్మ్యాట్రిక్ సొల్యూషన్స్, మాసాబ్‌ట్యాంక్ -
వృద్ధి అస్త్రం.. ఐటీఐఆర్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ)కి కేరాఫ్ హైదరాబాద్. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలిలు ఐటీకి కేంద్రబిందువులు. ఇప్పుడు వీటిని తలదన్నే రీతిలో రంగారెడ్డిజిల్లా సరిహద్దు ప్రాంతాలైన మహేశ్వరం, ఆదిబట్ల, పోచారం, ఉప్పల్‌లకు ఐటీరంగ సంస్థలు రానున్నారుు. విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లో ఐటీ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనకు ఐటీఐఆర్ ప్రాజెక్టు చెక్ పెట్టనుంది. కేంద్రం ప్రకటించిన ఐటీఐఆర్ ప్రాజెక్ట్‌తో నగర శివారు ప్రాంతాల రూపురేఖలు మారనున్నారుు. - న్యూస్‌లైన్, ఇబ్రహీంపట్నం రూరల్ ఇబ్రహీంపట్నం రూరల్, న్యూస్‌లైన్: ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ప్రధాన కేంద్రం నగరం నుంచి శివారు ప్రాంతాలకు బదిలీ కానుంది. ముఖ్యంగా ఆదిబట్ల, మహేశ్వరంలో ఐటీ అనుబంధ కంపెనీలు రూపుదిద్దుకుంటున్నాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, బయోజెనిక్స్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్, లాకిడ్ మార్టిన్, ఏరోస్పేస్ అండ్ ప్రెసిషన్ ఇంజినీరింగ్ సెజ్ తదితర ఐటీ కార్యకలాపాలు సాగించే ప్రతిష్టాత్మక సంస్థలకు ఆదిబట్ల కేంద్రస్థానం కాబోతుంది. ఈ క్రమంలో ఆదిబట్ల పరిసర ప్రాంతా ల్లో మరిన్ని బహుళజాతి, ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నా యి. ఇటీవల పలు చిన్న, మధ్యస్థాయి ఐటీ కంపెనీలు సంయుక్తంగా సమూహ ఇంజినీరింగ్ ఇండస్ట్రీస్‌ను ఏర్పాటు చేశాయి. ఇటీవల స్థిరాస్థి వ్యాపారంలో స్తబ్ధత ఏర్పడినప్పటికీ ఐటీఐఆర్ వంటి ప్రాజెక్టులతో భవిష్యత్‌లో పుంజుకునే అవకాశాలు కల్పిస్తున్నాయి. కేసీఆర్ నోట.. ఐటీఐఆర్ మాట రాష్ట్ర ముఖ్యమంతి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తన ప్రమాణ స్వీకారం రోజున ముఖ్యంగా ఐటీఐఆర్ గురించి పదేపదే ప్రస్తావించారు. అద్భుతమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు వుంది కాబట్టి ఈ ప్రాంత ఐటీ, స్థిరాస్థి వ్యాపారానికి బెంగ అవసరం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఈ ప్రాజెక్టు కార్యాచరణపై చర్చించనున్నట్లు సీఎం ప్రకటించారు. ఆయన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఐటీఐఆర్ గురించి చర్చించే అవకాశాలున్నాయి. మరోవైపు ఐటీశాఖ మంత్రి తారకరామారావు ఇటీవల ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు ఈ ప్రాంతంలో చేపట్టబోయే ఐటీఐఆర్ ప్రాజెక్టుపై ప్రత్యేక ఆసక్తి కనబర్చినట్లు సవూచారం. ఇలాంటి ప్రాజెక్టులతో మరిన్ని పెట్టుబడుల్ని స్వాగతించి ఐటీ కి కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని కేటీఆర్ ప్రకటించారు. ఐటీఐఆర్.. గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐఆర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్) ప్రాజెక్ట్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసింది. రూ.2.19 లక్షల కోట్లతో 50వేల ఎకరాల్లో ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను ఏర్పాటు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ నగరం చుట్టూ మూడు క్లస్టర్లుగా ఐటీఐఆర్ ప్రాజెక్టులను ఏర్పాటు చే య నున్నారు. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ క్లస్టర్ పరిధిలో శంషాబాద్ విమానాశ్రయం, మామిడిపల్లి, మహేశ్వ రం, ఆదిబట్ల వున్నాయి. ఔటర్‌రింగ్‌రోడ్డు చుట్టూ అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రాంతాన్ని గుర్తించారు. సైబరాబాద్ డెవలప్మెంట్ ఏరియాలో మాదాపూర్, మణికొండ, గచ్చిబౌలి, కోకాపేట తది తర ప్రాంతాలు వున్నాయి. ఉప్పల్ క్లస్టర్ పరిధిలో పోచారం తదితర ప్రాంతాలున్నాయి. ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ క్లస్టర్లో భాగంగా ఆదిబట్ల, మహేశ్వరం, రావిర్యాల, మామిడిపల్లిలో 79.2 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ రీజియన్ ఏర్పాటవుతోంది. ఔటర్‌రింగ్‌రోడ్డు గ్రోత్‌కారిడార్-1కు 11.5 చ.కిమీ, కారిడార్-2కు 14.3చ.కిమీ కేటాయించి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బొంగ్లూర్ ఔటర్‌రింగ్‌రోడ్డు వరకు దీనిని అనుసంధానం చేస్తారు. రెండు దశల్లో.. ఐటీఐఆర్‌లో చిన్న, మధ్య తరహా సంస్థలను ఏర్పాటు చేస్తారు. మొదటిదశలో 2013 నుంచి 2018 వరకు ప్రాజెక్టు పనులను చేపడతారు. ఇందులో భాగంగా రూ.3,275 కోట్ల వ్యయంతో ఔటర్‌రింగ్‌రోడ్డుకు గల 3రేడియల్ రోడ్లను అభివృద్ధి చేస్తారు. రెండో దశలో 2018 నుంచి 2038 వరకు ఐటీఐఆర్ మౌలిక సదుపాయాలను రూపొందిస్తారు. కేంద్ర సాయం.. ఐటీఐఆర్‌లో రహదారులు, విమాన ప్రయాణ సదుపాయాల అభివృద్ధి కోసం అయ్యే ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించనుంది. మౌలిక వసతుల కల్పన వ్యయ అంచనాను రూ.4863 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. తొలిదశలో రూ.942 కోట్లు, మలిదశలో రూ.3921 కోట్లు కేటాయించనుంది. ఇవన్నీ ఏర్పాటైతే నగరశివారు ప్రాంతాలు దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వస్తాయి. ఉపాధి.. ఐటీఐఆర్‌తో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ పరిస్థితిని కొంతవరకు రూపుమాపొచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇరు ప్రభుత్వాలు కృషిచేయాల్సిన ఆవశ్యకత వుంది. దాదాపు 15లక్షల వుందికి ప్రత్యక్ష, 56లక్షల వుందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉన్నట్లు ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఐటీఐఆర్‌తో శేరిలింగంపల్లి, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, రామచంద్రాపురం, ఘట్కేసర్, ఉప్పల్, మహేశ్వరం, రాజేంద్రనగర్, సరూర్‌నగర్ మండలాలు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతాయుని స్థానికులు ఆశిస్తున్నారు. -
సిరిసిల్లకు మంత్రి యోగం
రాష్ట్ర ఐటీ, పీఆర్ మంత్రిగా కేటీఆర్ - సిరిసిల్ల చరిత్రలో తొలిసారి మంత్రి పదవి - 38 ఏళ్లకే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రి పదవి దక్కింది. ఇప్పటి వరకు ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు ప్రతిపక్షంలోనే కూర్చున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఎమ్మెల్యే కేటీఆర్ మంత్రిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మంత్రిగా కల్వకుంట్ల తారక రామారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయుడిగా నియోజకవర్గంలో అడుగిడిన కేటీఆర్ తిరుగులేని నేతగా ఎదిగారు. రాజకీయ విశ్లేషణలు, వాగ్ధాటితో తనదైన ముద్ర వేశారు. 2009లో తొలిసారిగా సిరిసిల్లలో మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2010 ఉప ఎన్నికలు, 2014 సాధారణ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీతో గెలుపొంది హ్యాట్రిక్ విజయాలు నమోదు చేశారు. ప్రస్తుత మంత్రివర్గంలో కేటీఆర్ పిన్నవయస్కుడు. 38 ఏళ్లకే రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదిగారు. నేరెళ్ల నియోజకవర్గం ఉండగా.. అక్కడ గెలిచిన పాటి రాజం, సుద్దాల దేవయ్య రాష్ట్ర మంత్రులుగా పని చేశారు. నేరెళ్ల నియోజకవర్గం ఆనవాయితీ.. సిరిసిల్లకు కలిసి వచ్చింది. కేటీఆర్ కీలకమైన రెండు మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సిరిసిల్ల అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశాలు మెరుగుపడ్డాయి. కీలక మంత్రిత్వ శాఖలు.. తెలంగాణ రాష్ట్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖలను కేటీఆర్ దక్కించుకున్నా రు. గ్రామీణాభివృద్ధిని పరుగు పెట్టించే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పగ్గాలు చేపట్టారు. ఐటీ రంగంలోని ఆయనకున్న అపార అనుభవంతో తెలంగాణలో ఐటీ పరిశ్రమల విస్తరణ జోరందుకునే అవకాశం ఉంది. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల రుణాన్ని అభివృద్ధి ఫలాలతోనే తీర్చుకుంటానంటూ.. కేటీఆర్ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో అభివృద్ధి మంత్రించినట్లేనని స్థానికుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
'ఆ విప్లవానికి కాంగ్రెస్ పార్టీ బలైంది'
దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీ పోస్ట్‌మార్టం చేసుకుంటుంది. అందులోభాగంగా ఆ పార్టీ సీనియర్ నేతలు, కేంద్ర మాజీ మంత్రులు ఒకొక్కరు తమ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలంటే సర్జరీ అనివార్యమని కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియా, అర్బన్ ఓటర్లు ముంచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్, సామాజిక అనుసంధాన వేదిక వంటివి ఉపయోగించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ పార్టీ... ఆ విప్లవానికే బలైందన్ని వ్యాఖ్యానించారు. సీడబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీ గెలుపుకోసం ఆర్ఎస్ఎస్ కేడర్ దేశవ్యాప్తంగా 24 గంటలు పని చేసిందన్నారు. ఇటీవల దేశ సార్వత్రిక ఎన్నికలల్లో కాంగ్రెస్ పార్టీ 59 లోక్‌సభ స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఎందుకు ఓడామన్న దానిపై పార్టీలో సమీక్ష నిర్వహిస్తుంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా సూడిగాలి పర్యటనలు చేయడమే కాకుండా, ట్విట్టర్, సామాజిక అనుంధాన వేదికలను తరచుగా ఉపయోగించిన సంగతి తెలిసిందే. బీజేపీ దేశవ్యాప్తంగా 282 స్థానాలను గెలుకున్న సంగతి తెలిసిందే. -
బ్రాండ్.. ఓరుగల్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్ : తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంటుందని కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విషయంలో ప్రస్తు తం హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని... ఈ రంగంలో రెండో పెద్ద నగరంగా వరంగల్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని వర్గాల ఆకాంక్ష మేరకు ఏర్పడుతున్న తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ బ్రాండ్ నగరంగా అభివృద్ధి చెందనుందన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండ శివారులోని మడికొండలో కాంగ్రెస్ శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ నేపథ్యంలో మొదటిసారిగా జిల్లాకు వచ్చిన రాహుల్‌గాంధీ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘ఇప్పుడు ఎక్కువగా కొనుగోళ్లు చేస్తోంది యువతీయువకులే. అంగీ, ప్యాంటు, మొబై ల్... ఇలా ఎన్నో కొంటున్నారు. ఇవన్నీ చైనాలో తయారైనవే. అంటే... ఇక్కడి యువత చెల్లిస్తున్న డబ్బులు చైనాకే పోతున్నారుు. తెలంగాణ ప్రజల సొమ్ము పక్కదేశానికి తరలుతోం ది. అలా కాదు...తెలంగాణలోనే అన్ని తయారు కావాలి. వరంగల్లోనూ ఇది జరగాలి. ఇక్కడి ప్రజలు ఉపాధి, అభివృద్ధి బాట పట్టాలి. మొత్తంగా తెలంగాణ ఒక బ్రాండ్‌గా ఉండాలి. వరంగల్ బ్రాండ్‌గా అభివృద్ధి చెందాలి. ఇక్కడ తయారైన గడియారాన్ని నా చేతికి పెట్టుకోవాలని ఆశిస్తు న్నా’ అని అన్నారు. ఇప్పటివరకు వరంగల్ జిల్లాను అభివృద్ధి చేశామని, వర్ధన్నపేట నియోజకవర్గంలో ఐటీ పార్క్ నెలకొల్పామని చెప్పారు. ఎంజీఎంను ఎయిమ్స్ స్థాయికి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధిలో అన్ని వర్గాలకు భాగస్వామ్యం ఉంటేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. స్వయం సమృద్ధి విషయంలో తెలంగాణ మహిళలు దేశానికి స్ఫూర్తిగా నిలిచారని కొనియూడారు. ఇంటిని చక్కదిద్దుకున్న మహిళలకు దేశానికి నడిపించే శక్తి ఉందని... వీరిలో ఒకరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూడాలనేది తన ఆకాంక్ష అని చెప్పారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తే రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని, లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు వచ్చే ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలను ప్రైవేట్ రంగంలో కల్పిస్తామన్నారు. తెలంగాణలో నాలుగు వేల మె గావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని, ఆకా శం కింద పడినా... ఇచ్చిన మాట తప్పబోమన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, సోనియాగాంధీని ఆదరించినట్లుగానే తననూ ఆదరించాలని జిల్లా ప్రజలను కోరా రు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్ర సంగం ఆరంభంలో రాహుల్‌గాంధీ బంజారాలకు రాంరాం అని అనడంతో సభలో ఒక్కసారిగా చప్పట్లు మార్మోగాయి. రాహుల్ హిందీ ప్రసంగాన్ని రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ తెలుగులోకి అనువదించారు. నేతల హడావుడి వేదికపై పొన్నాల లక్ష్మయ్య, కేంద్ర మంత్రి బలరాంనాయక్ రాహుల్‌గాంధీకి చెరో పక్కన కూర్చున్నారు. పొన్నాల, బలరాంనాయక్ ప్రసంగిస్తున్న సేపు రాహుల్ పక్కన బస్వరాజు సారయ్య కూర్చునున్నారు. రెండో వరుసలో గండ్ర వెంకటరమణారెడ్డి, సిరిసిల్ల రాజయ్య ఉన్నారు. వీరి వెనుక కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్, డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కొద్దిసేపు నిల్చున్నారు. తర్వాత కుర్చీలు తెప్పించుకుని కూర్చున్నారు. సభ మధ్యలో కాసేపు మాజీ మంత్రి రెడ్యానాయక్ వేదికపై కూర్చున్నారు. రాహుల్ సమక్షంలో పరిచయ కార్యక్రమం ఉంటుందని భావించి వేదిక ఎక్కిన లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు నిరుత్సాహపడ్డారు. పాలకుర్తి అభ్యర్థి దుగ్యాల శ్రీనివాసరావు, పరకాల అభ్యర్థి ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వరంగల్ పశ్చిమ అభ్యర్థి ఎర్రబెల్లి స్వర్ణ, మహబూబాబాద్ అభ్యర్థి ఎం.కవితను మాత్రమే పరిచయం చేసి రాహుల్ హడావుడిగా వెళ్లిపోయారు. డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా రూపొందించిన రాజీవ్‌గాంధీ విగ్రహంతో ఉన్న జ్ఞాపికను బహూకరించారు. పదనిసలు రాహుల్రాక ముందే హెలికాప్టర్ కన్పించడంతో ఒక్కసారిగా సభలోని జనం గొల్లుమన్నారు. హెలిపాడ్ వద్ద రాహుల్‌కు టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల, నాయిని రాజేందర్‌రెడ్డి, బస్వరాజు సారయ్య స్వాగతం పలికారు. హెలికాప్టర్ దిగగానే రాహుల్‌కు పలువురు జిల్లా నేతలను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దిగ్విజయ్‌సింగ్ పరిచయం చేశారు. ఓ మహిళ రాహుల్‌కు తిలకం దిద్ది స్వాగతం పలికారు. టీ పీసీసీ అధ్యక్షుడు సభ మధ్యాహ్నం 2.30 గంటలకని ప్రకటించారు. జనమొచ్చినా... రాహుల్ కోసం ఎదురుచూడాల్సి వచ్చింది. అప్పటివరకు కళాకారులు ఆటపాటలతో జనాన్ని అలరించారు. మండుటెండ, ఉక్కపోతలో కదిలితే అడ్డుకునే పోలీసుల మధ్య కనీసం మంచినీళ్లు పెట్టాలనే విషయూన్ని మరిచిపోయారు కాంగ్రెస్ నాయకులు. గుక్కెడు నీళ్ల కోసం ప్రజలు ఇబ్బంది పడ్డారు. వేదికపైకి రాహుల్‌కంటే ముందు పొన్నాల, కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య చేరుకున్నారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, జిల్లా అధ్యక్షడు నాయినిని తప్ప ఇతరులను వేదికపైకి ఎస్పీజీ అనుమతించలేదు. రాహుల్ అభివాదం చేయగానే సభలో కొత్త ఉత్సాహం కన్పించింది. సిరిసిల్ల రాజయ్య అభివాదం చేయగానే జనంలో నవ్వులు విరిశాయి. పొన్నాల సుదీర్ఘ ప్రసంగం చేస్తుండగా దిగ్విజయ్‌సింగ్ రెండుసార్లు దగ్గరకు వచ్చి సైగ చేయడంతో పొన్నాల ప్రసంగం ముగించారు. రాహుల్ ప్రసంగానికి ముందు దిగ్విజయ్‌సింగ్ రెండు, మూడు పర్యాయాలు ఆయన వద్దకు వచ్చి పలు సూచనలు చేశారు. రాహుల్ ప్రసంగం ప్రారంభించే సమయంలో రాం రాం అంటూ బంజారాలకు అభివాదం చేశారు. రాహుల్ ప్రసంగం ముగించి వెళ్లిపోతుండగా,ఒక నిమిషమని పొన్నాల అభ్యర్థించారు. అభ్యర్థుల పరిచయం ఉంటుందని పేర్లు చదువుతున్నారు. అందరు అభ్యర్థులు రాక ముందే రాహుల్‌తో వేదిక పై ఉన్న వారు అభివాదం చేశారు. ఆ సమయంలో పొన్నాల వారితో లేకుండా పోయారు. ఆ తర్వాత పోటీలో ఉన్న ఎంపీ అభ్యర్థులు బల రాంనాయక్, సిరిసిల్ల, ఎమ్మెల్యే అభ్యర్థులు బస్వరాజు సారయ్య, గండ్ర, రెడ్యా, మాలోతు కవిత, కొండేటి, పొదెం వీరయ్య, విజయరామారావు, దుగ్యాల శ్రీనివాసరావు, ఎర్రబెల్లి స్వర్ణ, కత్తి వెంకటస్వామిగౌడ్, ఇనుగాల వెంకట్రామిరెడ్డిని రాహుల్ పరిచయం చేశారు. ఈ సందర్భంగా కవిత ఫొటో తీసేందుకు యత్నించారు. -
మూక్స్.. ‘నెటి’టంట్లో యూనివర్సిటీ
డిస్టెన్స్ ఎడ్యుకేషన్.. మొన్నటి మాట! ఆన్లైన్ లెక్చర్స్.. ఈ-లెర్నింగ్.. నిన్నటి మాట!! మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్-MOOCs) నేటి మాట!!! కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలతో ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారింది. ఇదే ఒరవడితో విద్యారంగంలోనూ ఆధునికత సంతరించుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చి.. దినదినప్రవర్థమానం అవుతోంది మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్-MOOCs). ఇంటర్నెట్ ఉంటే చాలు.. ఇంటి నుంచే అంతర్జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లలో కోర్సులు అభ్యసించొచ్చు. తక్కువ ఖర్చుతో ఉన్నత ప్రమాణాలతో కూడిన కోర్సులు పూర్తిచేసుకోవడమే కాకుండా.. ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉండే సర్టిఫికెట్లు పొందేందుకు సరికొత్త మార్గంగా నిలుస్తున్న మూక్స్పై ఫోకస్.. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్.. విద్యారంగంలో సరికొత్త విప్లవం. ఒకరకంగా చెప్పాలంటే.. దూర విద్యావిధానంలో ఇదో వినూత్న విధానం. నిర్దిష్ట సర్వీస్ ప్రొవైడర్ ఒప్పందం కుదుర్చుకున్న ఇన్స్టిట్యూట్లలోకోర్సులను ఆన్లైన్లో అభ్యసించే పద్ధతి.. మూక్స్. ఫలితంగా విద్యార్థులు తమ ఇంటి నుంచే ఇంటర్నెట్ సహకారంతో కోర్సులను అభ్యసించి పేరున్న ఇన్స్టిట్యూట్ల నుంచి సర్టిఫికెట్లు పొందొచ్చు. ఒకప్పుడు ఆన్లైన్ విధానంలో కేవలం ఇన్స్టిట్యూట్ల లెక్చర్స్‌కు అనుగుణంగా ఈ-లెర్నింగ్ సదుపాయం ఉండేది. ఇప్పుడు మూక్స్ విధానంలో కోర్సు మెటీరియల్‌తోపాటు వీడియో లెక్చర్స్, విద్యార్థులు, ప్రొఫెసర్స్‌తో ఇంటరాక్టివ్ యూజర్ ఫోరమ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో టాప్ యూనివర్సిటీల కోర్సులను సైతం నామమాత్రపు ఫీజులతో ఇప్పుడు నేరుగా మూక్స్ ద్వారా అభ్యసించొచ్చు. అందుకే మూక్స్ కోర్సుల వైపు ఆకర్షితులవుతున్న విద్యార్థుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. మూక్స్ తీరుతెన్నులు మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్‌కు.. మూలం ఈ-లెర్నింగ్. ఇందులో నిర్దిష్ట సమయంలో మాత్రమే అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. అదే మూక్స్ విధానంలో.. ఆయా ఇన్స్టిట్యూట్లు అధికారికంగా సదరు సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం చేసుకుంటాయి. తద్వారా.. కోర్సు ఔత్సాహికులు ఏ సమయంలోనైనా సంబంధిత కరిక్యులంకు అనుగుణంగా లెక్చర్స్‌ను అందిపుచ్చుకునే వీలుంటుంది. సరిహద్దులతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా.. తమకు ఇష్టమైన ఇన్స్టిట్యూట్లలో అందుబాటులో ఉన్న కోర్సును అభ్యసించొచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసిస్తున్న విద్యార్థి.. హార్వర్డ్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న మూక్స్ కోర్సులకు నమోదు చేసుకుని సర్టిఫికెట్ అందుకోవచ్చు. ఇలా విదేశీవిద్యను అభ్యసించాలనే కోరిక కూడా నెరవేరుతుంది. భారత విద్యార్థులకు ఎంతో మేలు మూక్స్ విధానం భారతీయ విద్యార్థులకు ఎంతో మేలు చేసేదని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల నాణ్యత ప్రమాణాలు, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. మూక్స్ విధానం ఎంతో ఉపయుక్తమైనది. సామాజిక- ఆర్థిక- భౌగోళిక పరిస్థితుల కోణంలోనూ ఎంతో మేలు చేకూర్చే విధానం.. మూక్స్ రూపంలో కోర్సుల అభ్యసనం. దేశంలో ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో టీచర్-స్టూడెంట్ నిష్పత్తి సగటున 1:40గా ఉంటోంది. ఈ నేపథ్యంలో క్లాస్‌రూంలో అధ్యాపకులు చెప్పే అంశాలన్నింటినీ అవగతం చేసుకోవడం కష్టమైందే. అదేవిధంగా అటు అధ్యాపకుల కోణంలోనూ అంతమంది విద్యార్థులను పర్యవేక్షించడం కష్టసాధ్యం. ఈ సమస్యలకు కూడా మూక్స్ పరిష్కారం చూపుతున్నాయి. వీటి ద్వారా విద్యార్థులు సదరు కోర్సు కంటెంట్ ఆసాంతం స్వయంగా తెలుసుకోవడంతోపాటు.. సదరు వెబ్సైట్లో ఆన్లైన్లో నిరంతరం ప్రొఫెసర్లతో సంప్రదిస్తూ సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. విస్తృతంగా ఉండే కోర్సు కంటెంట్‌ను విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో కుదించి లైవ్ వీడియో లెక్చర్స్‌ను అందించడం, వర్చువల్ క్లాస్ రూం సదుపాయం కల్పించడం మూక్స్ మరో ప్రత్యేకత. అమెరికాలో మొదలై.. భారత్‌లో వృద్ధి సాధిస్తున్న మూక్స్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సుల ఆవిష్కరణ అమెరికాలో మొదలైంది. అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ రోచస్టర్ వంటి ప్రముఖ సంస్థలు ఆన్లైన్ వెబ్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని వర్చువల్ క్లాస్ రూం పేరుతో పలు కోర్సులను అందించడం ప్రారంభించాయి. ఈ విధానానికి భారత విద్యార్థులు బాగా ఆకర్షితులవుతున్నారు. మూక్స్ విధానంలో ప్రపంచవ్యాప్తంగా ఎడెక్స్ కోర్సులకు 20లక్షల మంది పేరు నమోదు చేసుకుంటే.. అందులో 2లక్షల 50వేల మంది మన విద్యార్థులే ఉండటం విశేషం. ప్రపంచలోనే మూక్స్ పద్ధతిలో అభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. దాంతో అమెరికాలోని మూక్స్ కోర్సుల ప్రొవైడర్స్ భారత్‌వైపు దృష్టి సారిస్తున్నారు. ఇక్కడి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లతో ఒప్పందం కుదుర్చుకుని కోర్సులందిస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియన్ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ.. కేవలం భారత విద్యార్థులు లక్ష్యంగా ఎడెక్స్ సహకారంతో ‘ఎంగేజింగ్ ఇండియా’ పేరిట ఇంగ్లిష్/హిందీ భాషల్లో 10 వారాల కోర్సుకు ఆవిష్కరణ చేసింది. ఓ మూక్స్ కోర్సును రెండు భాషల్లో ముఖ్యంగా హిందీలో అందించడం ఇదే తొలిసారి. ఐఐటీ-ముంబైతో మొదలు అంతర్జాతీయ మూక్స్ ప్రొవైడర్స్ భారత్‌లో ప్రవేశించడం ఐఐటీ-ముంబైతో మొదలైంది. మూక్స్ సర్వీస్ ప్రొవైడర్స్‌గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎడెక్స్.. ఐఐటీ-ముంబైలోని ఇంజనీరింగ్ విద్యార్థులకు కోర్సులు అందిస్తోంది. మరో మూక్స్ ప్రొవైడర్ ‘కోర్స్ ఎరా’.. ఐఐటీ-ఢిల్లీతో ఒప్పందం ద్వారా వెబ్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ డేటా కోర్సును అందిస్తోంది. వీటితోపాటు ఐఐటీ-కాన్పూర్, ఐఐటీ-చెన్నైలు కూడా మూక్స్ కోర్సులు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇదేబాటలో మరిన్ని మూక్స్ ప్రొవైడింగ్ ఆన్లైన్ సంస్థలు పయనిస్తున్నాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-బెంగళూరు, మరికొన్ని జాతీయ హోదా ఉన్న ప్రభుత్వ ఇన్స్టిట్యూట్లు కూడా మూక్స్ కోర్సులు అందించేందుకు.. తద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేందుకు ఉపక్రమిస్తున్నాయి. అకడెమిక్స్.. ఇండస్ట్రీ మూక్స్ విధానంలో కోర్సుల ద్వారా అకడెమిక్ నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాల మధ్య ఉన్న అంతరం కూడా తగ్గుతుందని నిపుణుల అభిప్రాయం. కారణం.. కొన్ని మూక్స్ ప్రొవైడింగ్ సంస్థలు ఆయా సంస్థల కరిక్యులం, పరిశ్రమ అవసరాలు రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటున్నాయి. వాటికనుగుణంగా సిలబస్ రూపకల్పన చేసి కొన్ని ప్రత్యేక విభాగాల్లో కోర్సులను అందిస్తున్నాయి. విద్యార్థులు ఇలాంటి తరహాలో మూక్స్ సర్టిఫికేట్స్ అందుకుని ఉద్యోగాలు పొందుతున్నారు. మూక్స్.. ముఖ్య విభాగాలు గత రెండు, మూడేళ్లలో ఆవిష్కృతమై ప్రాథమిక దశలో ఉన్న మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్‌లో.. ప్రస్తుతం అధిక శాతం సెన్సైస్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ వంటి కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ ఓరియెంటేషన్ కీలకంగా ఉండే.. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో వీటి సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది. కావాల్సిన మౌలిక సదుపాయాలు మూక్స్ విధానంలో కోర్సు అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రాథమికంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇంటర్నెట్, జావా స్క్రిప్ట్ సాఫ్ట్వేర్, ఏవీ సాఫ్ట్వేర్స్, హెడ్‌ఫోన్స్. ఇవి ఉంటే ఆన్లైన్ విధానంలో మూక్స్ కోర్సులను ఇంటి నుంచే అభ్యసించొచ్చు. ఈ మౌలిక సదుపాయాల విషయంలోనూ మూక్స్ ప్రొవైడర్స్ ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకుని.. మరింత మంది విద్యార్థులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ‘కోర్స్ ఎరా’ సంస్థ మూక్స్ కోర్సుల్లో నమోదు, లెక్చర్స్ వీక్షించడం వంటి సదుపాయాలను మొబైల్ ఫోన్ ద్వారా పొందే విధంగా మొబైల్ అప్లికేషన్స్‌ను రూపొందించింది. ఇలా.. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు.. మారుతున్న టెక్నాలజీతోపాటు తమ స్వరూపాన్ని, తీరుతెన్నులను కూడా మార్చుకుంటూ భవిష్యత్తులో ఉన్నత విద్య ఔత్సాహికులకు ప్రధాన ప్రత్యామ్నాయంగా నిలిచేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న మూక్స్ ప్రొవైడర్స్ ప్రొవైడర్: ఎడెక్స్ వెబ్సైట్: www.edx.org పాల్గొనే యూనివర్సిటీలు: మిట్, హార్వర్డ్ యూనివర్సిటీ, యూసీ బెర్కిలీ, క్యోటో వర్సిటీ, ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్. ప్రొవైడర్: కోర్స్ ఎరా; వెబ్సైట్: www.coursera.org పాల్గొనే యూనివర్సిటీలు: స్టాన్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, యూనివ ర్సిటీ ఆఫ్ వర్జీనియా ప్రొవైడర్: ఐవర్సిటీ; వెబ్సైట్: www.iversity.org పాల్గొనే యూనివర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరెన్స్, యూనివర్సిటీ ఆఫ్ హంబర్గ్. ప్రొవైడర్: ఫ్యూచర్ లెర్న్; వెబ్సైట్: www.futurelearn.com పాల్గొనే యూనివర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, ఓపెన్ యూనివర్సిటీ, మొనాష్, ట్రినిటీ కాలేజ్, డబ్లిన్, వార్విక్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బాత్. ప్రొవైడర్: అకడెమిక్ఎర్త్ http://academicearth.org పాల్గొనే యూనివర్సిటీలు: యూసీ బెర్కిలీ, యూసీఎల్ఏ, మిచిగాన్, ఆక్స్ఫర్డ్. ఇంకా.. ది ఓపెన్ యూనివర్సిటీ; వెబ్సైట్: www.open.ac.uk ఎలిసన్; వెబ్సైట్: www.alison.com ఓపెన్ లెర్నింగ్; వెబ్సైట్: www.openlearning.com యుడాసిటీ; వెబ్సైట్: www.udacity.com ఎడ్యుకార్ట్; వెబ్సైట్: www.edukart.com మూక్స్‌తో ప్రయోజనాలు మిట్, హార్వర్డ్, స్టాన్‌ఫర్డ్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్ల కోర్సులు చదువుకునే అవకాశం. గ్లోబల్ ఎడ్యుకేషన్‌కు ఆస్కారం. నిరంతర నమోదు అవకాశం నిరంతర అధ్యయనం అధ్యాపకులతో నేరుగా సంభాషించే అవకాశం నచ్చిన సమయంలో క్లాసులు వినే సౌలభ్యం తక్కువ ఖర్చుతో కోర్సు పూర్తి చేసుకునే అవకాశం మిడ్ కెరీర్ ప్రొఫెషనల్స్ కెరీర్ ఉన్నతికి తోడ్పాటు నైపుణ్యాల నగిషీలకు మార్గం మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు.. నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవడంలో ఎంతో ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఆయా కెరీర్స్‌లో స్థిరపడి ఉన్నత హోదాలు అందుకోవాలనుకునే వారికి కూడా సదరు రంగంలో అవసరమైన కోర్సులు తమకు నచ్చిన సమయంలో, నచ్చిన విధంగా అభ్యసించి సర్టిఫికెట్లు పొందేందుకు తోడ్పడుతున్నాయి. ఐటీ, మేనేజ్మెంట్ వంటి ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో మూక్స్కు ఆదరణ లభిస్తున్నప్పటికీ.. ఇతర కోర్సులు ముఖ్యంగా హ్యుమానిటీస్, ఆర్ట్స్ కోర్సుల విషయంలో విద్యార్థులు ఇంకా సంప్రదాయ తరహా బోధనకే పరిమితమవుతున్నారు. ఈ విభాగాల్లోనూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీల నుంచి కోర్సులు అభ్యసించే అవకాశం ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ మూక్స్ విధానంలో ఒక రోజు లెక్చర్ వినకపోయినా.. మరుసటి రోజు సంబంధిత లింక్ ఓపెన్ చేయడం ద్వారా అంతకుముందు లెక్చర్స్‌ను విని, నేర్చుకునే అవకాశం లభిస్తోంది. గ్లోబలైజేషన్ నేపథ్యంలో లెర్నింగ్ పరంగా మూక్స్ త్వరలోనే మరింత ప్రాచుర్యం పొందడం ఖాయం. - ఎన్.విశ్వనాథ్, సెంటర్ హెడ్, ఎడ్యుకార్ట్.కామ్, హైదరాబాద్ -
ప్రతిజిల్లా పరిశ్రమవ్వాలి: కె.నాగేశ్వర్
* అపార ఖనిజ సంపద తెలంగాణ సొంతం * పారిశ్రామిక ప్రగతి అన్ని జిల్లాలకూ విస్తరించాలి * విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చాలి * జిల్లాల్లోనూ విమానాశ్రయాలు నిర్మించాలి * అప్పుడే నవతెలంగాణ సాధ్యం ఆధునిక ఆర్థిక వ్యవస్థలకు పారిశ్రామిక రంగం.. ముఖ్యంగా వస్తూత్పత్తి రంగం ఆలంబన అవుతుంది. సమాచార సాంకేతికరంగం లాంటి సేవల రంగంలో హైదరాబాద్ విశిష్ట ప్రగతి సాధించింది. దేశంలోనే సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో నాలుగో స్థానంలో ఉంది. అయితే సేవల రంగం ఆధునిక ఉపాధి కల్పించినా అది పరిమితం. వస్తూత్పత్తి రంగమే ఉపాధి కల్పించి విస్తృత అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఔషధ పరిశ్రమలు మొదలుకొని ఎలక్ట్రానిక్స్, మెషీన్‌టూల్స్, ఏరోనాటిక్స్ రంగాలకు చెందిన భారీ పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయి. అయితే ఆయా రంగాల్లో మరింత ప్రగతి, ఆధునికత సాధించడంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా పారిశ్రామికీకరణ జరగాలి. ముడిపదార్థాలున్నా.. నిస్తేజంగా.. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో బొగ్గు గనులు, కొన్ని జిల్లాల్లో సిమెంట్ కర్మాగారాలు, మెదక్ జిల్లాలో మోటారు పరిశ్రమలు, నిజామాబాద్‌లో చక్కెర, బీడీ పరిశ్రమ, ఆదిలాబాద్‌లో జిన్నింగ్ మిల్లులు, నల్లగొండలో బియ్యం మిల్లులు మొదలుగునవి ఉన్నప్పటికీ, ఇతర అనేక పరిశ్రమల ఏర్పాటుకవసరమైన ముడి పదార్థాల లభ్యత తెలంగాణ ప్రత్యేకత. తెలంగాణ రాష్ట్రంలో వస్త్ర, కాగితం, పరిశ్రమల అభివృద్ధికి కూడా విస్తారమైన అవకాశాలున్నాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, నల్లగొండ జిల్లా పోచంపల్లి, మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ ప్రాంతాలు వస్త్ర పరిశ్రమకు అవకాశాలున్నా నిస్తేజంగా పడిఉన్నాయి. అద్భుత నైపుణ్యం ఉన్న నేతకారులు కళావిహీనులై నగరంలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేయడం నాగరికతకే తలవంపు. యువతను ఊరిస్తున్న ఐటీఐఆర్ ఆదిలాబాద్ జిల్లాలో మాంగనీస్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో సున్నపురాయి, నల్లమల అటవీసంపద వివిధ రకాల పరిశ్రమలకు అవకాశాలు ఇస్తున్నాయి. నిజామాబాద్‌లో పసుపు, నల్లగొండ, వరంగల్ తదితర జిల్లాల్లో మిర్చి, రంగారెడ్డిలో హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ఫ్లోరీ కల్చర్‌కు ఉన్న అవకాశాలు పారిశ్రామికాభివృద్ధికి బాటలు వేయగలవు. వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్ లాంటి జిల్లాల్లోని టైర్-2, టైర్-3 నగరాలకు సమాచార సాంకేతిక పరిశ్రమను విస్తరించేందుకు అవకాశాలున్నాయి. హైదరాబాద్‌లో ఏర్పాటు కానున్న సమాచార సాంకేతిక పెట్టుబడుల ప్రాంతం(ఐటీఐఆర్) నగర యువతను ఉవ్విళ్లూరిస్తోంది. మసిబారుతున్న యువత భవిత ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో విస్తరించి ఉన్న బొగ్గుగనులు వేలాది కుటుంబాలకు జీవనోపాధినిచ్చి జీవి తాలు మార్చాయి. కానీ ఈ గనుల్లో క్రమంగా ఉపాధి తగ్గి పోవడంతో స్థాని క యువత భవిత మసిబారుతోంది. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని గ్రానైట్ పరిశ్రమ గందరగోళంలో ఉంది. కాబట్టి సమగ్ర పారిశ్రామిక పునరుజ్జీవనాన్నీ, సరికొత్త పారిశ్రామికీకరణ కోసం నవతెలంగాణ ఎదురుచూస్తోంది. ఎన్నెన్నో అవకాశాలు తెలంగాణ ఖనిజాల గని. ఆదిలాబాద్ జిల్లాలో మాంగనీసు, ఖమ్మం, వరంగల్ జిల్లాల సరిహద్దులో ఇనుప ఖనిజం, ఉత్తర తెలంగాణలో బొగ్గు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలో బొగ్గు ఆధారిత మీథేన్(సీబీఎం) గ్యాస్ నిక్షేపాలున్నాయి. ఇంకా గణనీయ స్థాయిలో సున్నపురాయి నిక్షేపాలున్నాయి. ఇవికాక చైనా క్లే, గ్రానైట్, స్పటికం, మైకా మొదలుగు నిక్షేపాలు మెదక్, నల్లగొండ లాంటి ఇతర తెలగాణ జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ పారిశ్రామిక ముడి పదార్థాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో సుమారు 45శాతం అటవీ సంపద తెలంగాణలోనే ఉంది. దేశంలోని మొత్తం బొగ్గు నిక్షేపాలలో 20శాతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయని అంచనా. వ్యవసాయాధారిత, ఆహారోత్పత్తి పరిశ్రమలతో పాటు బయో టెక్నాలజీ లాంటి విజ్ఞాన ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు కూడా అవకాశాలు ఎన్నెన్నో. వెక్కిరిస్తున్న విద్యుత్ కొరత ముడి పదార్థాలున్నా, మురిపించే అవకాశాలున్నా ఆచరణలోకి రావాలంటే కావలసిందల్లా దార్శనికత గల రాజకీయ నాయకత్వమే. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామికీకరణకు అతిపెద్ద సవాల్ చాలినంత విద్యుత్ లేకపోవడమే. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మొత్తం విద్యుత్ సామర్థ్యం 16,500 మెగావాట్లు. ఇందులో 10,500 మెగావాట్లు సీమాంధ్ర ప్రాంతంలోనే. తెలంగాణ ప్రాంతంలో ఉన్న మిగిలిన విద్యుత్‌లో గణనీయమైన భాగం జలవిద్యుత్తే. దీని ఉత్పత్తికి నీటి వనరుల లభ్యత ఎప్పుడూ సమస్యే. విద్యుత్ కొరత పారిశ్రామికీకరణకు ఆటంకంగా మారక తప్పదు. అతి తక్కువ కాలంలో విద్యుత్ లోటునుంచి విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు అధికారంలోకి రానున్న రాజకీయ నాయకత్వం ప్రణాళికలు రచించి అమలు చేయాలి. సమగ్ర జల విధానాన్ని అమలు చేయడం ద్వారా భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించి, ఉపరితల జలాల వినియోగాన్ని పెంచి తద్వారా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించాలి. విమానయానం జిల్లాలకూ విస్తరించాలి హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఆధునిక పారిశ్రామికీకరణకు గొప్ప అవకాశాన్ని ఇస్తోంది. అయితే హైదరాబాద్‌తోపాటు తెలంగాణ రాష్ర్టంలో ఇతర నగరాలను కూడా పారిశ్రామిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలంటే విమానయానరంగం విస్తరించాలి. ఆదిలాబాద్, వరంగల్ లాంటి నగరాల్లో ఇప్పటికే విమానాశ్రయాల ఏర్పాటుకు అవకాశం ఉంది. తెలంగాణ జిల్లాల్లో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వేలైన్లు అభివృద్ధి కావాలి. అందుబాటులో ఉన్న ముడి పదార్థాలను ఉపయోగిస్తూ మానవ వనరులను అభివృద్ధి చేయాలి. మౌలిక వసతులు కల్పిస్తూ ఉపాధి అవకాశాలే లక్ష్యంగా నూతన పారిశ్రామిక యుగానికి నవ తెలంగాణలో నాంది పలకాలి. - ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ పొన్నాల లక్ష్మయ్య ఖిలాషాపురం, వరంగల్ గిది మీ ఊరే..! - సగం కూలిన ప్రాథమిక పాఠశాల భవనం.. ఆరుబయట చదువులు - విద్య, వైద్యం, మంచినీటికి ఇబ్బందులు - అద్దె ఇంట్లో ఆరోగ్య ఉపకేంద్రం - వ్యవసాయ పరికరాలు నిల్వచేసుకునే స్థలంగా గ్రంథాలయ భవనం - కంకరతేలి భయపెడుతున్న రోడ్లు - చెంతనే అశ్వరావుపల్లి రిజర్వాయర్ ఉన్నా తాగునీటికి ఇక్కట్లు - పర్యాటకంగా అభివృద్ధి చేయకపోవడంతో కూలుతున్న సర్దార్ సర్వాయి పాపన్న కోట - మాదారం-ఖిలాషాపురం మధ్య వాగులో వంతెన నిర్మించకపోవడంతో వర్షాకాలంలో వాగుపొంగి సమీప గ్రామాలతో ఖిలాషాపురానికి తెగిపోతున్న సంబంధాలు ఒక్కడే... అనావుకుడిగా వచ్చి... అసెంబ్లీలో పాగ అవి జనతాపార్టీ గాలి ఉధృతంగా వీచే రోజు లు. ఎమ్మెల్యే టిక్కెట్ ట్రై చేద్దావూ! అనుకున్నా రు... మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లోని ఓ ఆర్ఎంపీ జి.నర్సిములునాయుడు. అనుకు న్నదే తడవుగా జనతాపార్టీ టిక్కెట్ కోసం హైదరాబాద్‌లోని ఆ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. సాయంత్రం వరకు వేచిచూసి నిరాశగా వెనుదిరిగారు. ‘ఎలాగూ ఇంత దూరం వచ్చా కదా.. గాంధీభవన్‌ను చూసి వెళ్దాం’ అనుకుని అక్కడికి వెళ్లి ఎందుకైనా మంచిదనుకుని వెంట తెచ్చుకున్న దరఖాస్తును అక్కడ సమర్పించారు. అంతే ఆయున రొట్టె విరిగి నేతిలో పడింది. ‘ఇందిరా కాంగ్రెస్ టికెట్‌కు మీరొక్కరే దరఖాస్తు చేసుకున్నారు...టికెట్ మీకే వచ్చింది’అంటూ గాంధీభవన్ నుంచి అతనికి వర్తమానం వచ్చింది. దీంతో అనూహ్యంగా ఆయున కాంగ్రెస్ టికెట్‌పై బరిలో దిగి 1978లో మక్తల్ ఎమ్మెల్యే అయ్యారు. ఒక ఆర్ఎంపీ ఒక పార్టీకి దరఖాస్తు చేసేందుకు వెళ్లి మరోపార్టీకి దరఖాస్తు సమర్పించి ఏకంగా ఎమ్మెల్యే కావడం అప్పట్లో ఓ సంచలనం. -న్యూస్‌లైన్, నారాయణపేట సాకలోల్ల కట్టం తీరకచ్చె రాజులు బోవట్టే.. రాజ్యాలు బోవట్టే గని మా సాకలోల్ల బతుకుల సీమంత సుక మారకచ్చినై. మా తాతముత్తాతల కాడికెళ్లి గిదే బతుకు. పొద్దుగల్ల లేసి.. కారంబువ్వ దిని.. ఇళ్లిళ్లూ దిరిగి ఊళ్లె బట్టలన్నీ ముళ్లెగట్టుకుని చెరొడ్డుకు దీస్కచ్చి ఉతుకుడే దెలుసు. బట్టలకంటిన మైలైతే బోవట్టే గని మా బతుకు కట్టం తీరకచ్చె. ఇగ మా బతుకంతా చాకిరేవు కాడ్నే బోవట్టే. మాకు దెల్సింది గిదొక్కటే పని. గిది గుడ సక్కగ సేసుకోలేక పోతున్నం. బట్టల్ని ఉతుకుదమంటే నీళ్లుంట లేవు. చెరువుల, కుంటల కాడ ఉతకస్త లేదు. గా దోబిగాట్లు కట్టిపియుండ్రి సారూ.. అని పెద్దమనుషులందర్ని అడిగినం. ఇగ ఎలచ్చన్ల సంగతేందో.. గ లీడరుసాబుల ముచ్చటేందో. ఐదేండ్లకోపారి గిట్ల ఇంటిమొకాన అత్తరు. ఏమే అవ్వ మంచిగున్నాయే.. అని తియ్యగ మాట్లడతరు. ఈసారి గూడ నాకే ఓటు గుద్దే అవ్వ.. నీకు పించినిప్పిత్తా.. ఇళ్ల జాగ ఇప్పిత్తా అని జెప్తరు. ఓట్లేశేనాడు ఆటోల గూసుండ వెట్టి దీస్కపోతరు. తీస్కత్తరు. గంతే.. మల్ల ఒక్కనాడు సుక కన్పియ్యరు. మాకు పెద్దకోర్కెలు ఏముంటయ్ బిడ్డా.. కడుపుకింత తిండి, కట్టుకునతందుకు బట్ట, ఉండతందుకు ఇంత ఇల్లు సాలు. ఇగ గివి గూడ ఇయ్యకపోతే గౌర్నమెంటు ఎందుకు.. గీ లీడరుసాబులు ఎందుకు. - సాకలి లచ్చవ్వ, బూర్గుల్, నిజామాబాద్ -
ఐటీ రంగ వృద్ధికి మరిన్ని చర్యలు
తిరువనంతపురం: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దేశం అసాధారణ వృద్ధి సాధించిందని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. ఈ రంగం మరింత పురోగమించేందుకు సానుకూల పరిస్థితులు కల్పించేలా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. శనివారం తిరువనంతపురంలో ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గ్లోబల్ లెర్నింగ్ సెంటర్‌కి శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు చెప్పారు. గడిచిన ఇరవై ఏళ్లుగా భారత ప్రైవేట్‌రంగ కంపెనీలు సాధిస్తున్న విజయగాథలకు టీసీఎస్ చక్కని ఉదాహరణ అని మన్మోహన్ సింగ్ కితాబిచ్చారు. మరోవైపు పెట్రోనెట్ ఎల్ఎన్జీ సుమారు రూ. 4,500 కోట్లతో కేరళలోని పుథైవైపిలో నిర్మించిన ఎల్ఎన్జీ టెర్మినల్‌ను ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించారు. -
ఆదాయపన్ను వసూళ్లలో రాష్ట్రానిది ఐదో స్థానం
సాక్షి, హైదరాబాద్: ఆదాయం పన్ను(ఐటీ) వసూళ్లలో రాష్ట్రం దేశంలో ఐదవ స్థానంలో ఉంది. పారిశ్రామిక పురోగతి కారణంగా ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ నాల్గవ స్థానంలో ఉండవచ్చని 2009లో అంచనా వేశారు. కానీ ఆ తర్వాత కాలంలో రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం వల్ల ఈ లక్ష్యం నెరవేరలేదు. పెట్టుబడిదారులు వెనక్కు తగ్గడం, కొత్త పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేకపోవడంతో ఆదాయం అనుకున్న రీతిలో వృద్ధి చెందలేదు. బహుళజాతి కంపెనీలు సైతం తమ శాఖల విస్తరణకు ఇతర రాష్ట్రాలను ఎంపిక చేసుకున్నాయి. ప్రాజెక్టు నివేదికలు సిద్ధమైనప్పటికీ.. కొన్ని సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. భారీ ఆదాయం పన్ను చెల్లించే సంస్థలు కూడా గడచిన నాలుగేళ్లుగా వ్యాపార లావాదేవీల్లో వెనుకబడి ఉన్నాయి. ఇలాంటి కంపెనీలు దాదాపు 58 వరకూ ఉన్నాయని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. బ్యాంకుల విస్తరణ కూడా ముంబై, ఢిల్లీతోపాటు దక్షిణ భారతదేశంలో బెంగళూరు, చెన్నైకే పరిమితమయ్యాయి. ఫలితంగా రాష్ట్రంలో పారిశ్రామిక పురోగతి క్షీణించింది. కార్పొరేట్ ట్యాక్స్ గణనీయంగా తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రూ.36 వేల కోట్ల ఆదాయ పన్ను వసూలు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అది రూ.29 వేల కోట్లు దాటలేదు. ఈ విషయంలో పొరుగు రాష్ట్రమైన తమిళనాడు సైతం మనకన్నా ముందుండడం విశేషం. దేశంలో ఆదాయపన్ను వసూళ్లలో మహారాష్ట్ర (రూ. 1,74,980 కోట్లు) అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీ(రూ. 79,236 కోట్లు), కర్ణాటక(రూ. 49 వేల కోట్లు), తమిళనాడు(రూ. 35,266 కోట్లు) తరువాతి స్థానాల్లో నిలిచాయి. కానీ రాష్ట్రంలో రూ. 29,716 కోట్లు మాత్రమే ఆదాయపన్ను వసూలైంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) పరిశ్రమలకు కేంద్ర బిందువైన హైదరాబాద్‌లోనూ అనిశ్చితి కొనసాగుతుండడం ఇందుకు కారణం. సుస్థిరత దిశగా అడుగులు పడకపోతే భవిష్యత్‌లో ఆర్థిక పురోగతి మరింత క్షీణించే అవకాశముందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘నెట్’లో పడకండి
సైబర్ నేరగాళ్ల విజృంభణపై పోలీసుల హెచ్చరిక.. జాగ్రత్తలు సాక్షి, సిటీబ్యూరో: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వినియోగంతో లక్షల్లో కొల్లగొడుతున్న నేరాలు నగరంలో ఇటీవల గణనీయంగా పెరిగాయి. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) ఆధీనంలోని సైబర్‌క్రైమ్ పోలీసుస్టేషన్‌కు రోజూ గరిష్టంగా 10 ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో, ‘సైబర్ సేఫ్ సిటీ’ కోసం డిటెక్టివ్ శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. డిప్యూటీ పోలీసు కమిషనర్ లేళ్ల కాళిదాస్ వేంకట రంగారావు సోమవారం ఈ కార్యక్రవూన్ని ఆవిష్కరించారు. సైబర్ నేరాలు తీవ్రంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ‘నెట్ జనులు’ తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ.. ఆధునిక పంథాలో అకౌంట్ టేకోవర్... ఇటీవల ఎక్కువగా నమోదయ్యే నేరాలు అకౌంట్ టేకోవర్‌కు సంబంధించినవే. ఈ సైబర్ నేరగాళ్లు వ్యాపార లావాదేవీలు జరిపే వారి ఈ-మెరుుల్స్ను హ్యాక్ చేస్తారు. అన్ సెక్యూర్డ్ ఈ-మెరుుల్ ఐడీల లావాదేవీలను కొంతకాలం పరిశీలిస్తారు. అదును చూసుకుని.. నగదు చెల్లించాల్సిన వ్యక్తికి, నగదు తీసుకునే వ్యక్తిలా మెయిల్ పంపిస్తారు. బ్యాంక్ ఖాతా మారిందంటూ తమ ఖాతాను మెరుుల్లో పొందుపరుస్తారు. దీంతో చెల్లింపులు సైబర్ నేరగాడి ఖాతాలోకి వస్తారుు. అందుకే.. ఖాతాలు మారినట్టుగా సమాచారం వస్తే అవతలి వ్యక్తిని నేరుగా సంప్రదించి నిర్ధారించుకున్న తరవాతే డిపాజిట్ చేయుడం ఉత్తమం. ఆశపడ్డారో... అంతే సంగతులు...: సినివూ హాళ్లు, షాపింగ్ వూల్స్ వంటి చోట్ల ఏదో ఒక సర్వే చేస్తున్నావుని నవ్ముబలుకుతుంటారు. ఈ-మెరుుల్ ఐడీ, సెల్‌ఫోన్ నెంబరు రాసి డబ్బాలో వేస్తే డ్రా తీసి బహువుతి ఇస్తావుని కూడా ఆశపెడతారు. అలాంటి వారికి వివరాలిస్తే, ఇబ్బందే. వారి దగ్గరనుంచి, ఈ వివరాలను సైబర్ నేరగాళ్లు కొనేసి, తవు పని కానిస్తుంటారు. ఒక్క మెరుుల్తో ఖాతా ఖాళీ...: మేం ఫలానా బ్యాంకు నుంచి మెరుుల్ చేస్తున్నాం... భద్రతా చర్యల్లో భాగంగా అందరి వివరాలూ తనిఖీ చేస్తున్నాం. మీ అకౌంట్ నెంబర్, పాస్వర్డ్ చెప్తే ఎవరూ టాంపర్ చేయుకుండా చర్యలు తీసుకుంటాం... అంటూ వచ్చే ఈ-మెరుుల్కు స్పందించారో మీ ఖాతా ఖాళీ అరుుపోరుునట్లే. ప్రపంచ వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు రోజుకు ఇలా 98లక్షల ఫిషింగ్ మెరుుల్స్ పంపుతున్నట్లు అంచనా. ఇక ఎస్ఎమ్మెస్లో ఇలా వచ్చే సందేశాన్ని స్మిషింగ్ అంటారు. కీ లాగర్స్...: కంప్యూటర్ ద్వారా జరిపే ప్రతి లావాదేవీని తెలుసుకునేందుకు కీ లాగర్స్ అనే సాఫ్ట్వేర్ వాడుతున్నారు. కంప్యూటర్ను వినియోగించిన వారు ఏ సవూచారం టైప్ చేశారో ఈ సాఫ్ట్‌వేర్‌తో తెలుసుకోవచ్చు. నెట్ కేఫ్‌ల్లోని సిస్టమ్స్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. దీనితో కంప్యూటర్ను వాడుకున్న వారు టైప్ చేసిన సవూచారాన్ని తస్కరించి దుర్వినియోగం చేసే వాళ్లు పెరిగారు. క్రెడిట్ కార్డుతో జాగ్రత్త...: షాపు లేదా పెట్రోల్ బంక్ కు వెళ్లి, క్రెడిట్ కార్డుతో బిల్లు చెల్లించినపుడు కార్డు చెల్లింపు సవూచారానికి చెందిన ఒక కాపీ వారే ఉంచుకుంటారు. వారి దగ్గర ఉంచుకునే బిల్లు కాపీలో వున పేరు, కార్డు నెంబరు ఉంటారుు. కార్డు వెనుక ఉన్న సీవీవీ కోడ్‌ను అవతలి వ్యక్తులు నోట్ చేసుకుంటే.. నెట్లో మీ ఖాతాతో వారు షాపింగ్ చేసుకోవచ్చు. ఒక్కోసారి స్కివ్ముర్లను వినియోగించి కార్డు డేటాను దొంగిలించి, వురో కార్డు తయూరు చేసి జల్సా చేస్తున్నారు. భారీస్థారుులో అవగాహన: రంగారావు సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కోసం భారీస్థారుులో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీసీఎస్ డీసీపీ రంగారావు తెలిపారు. ఈ కేసుల్లో నిందితులను పట్టుకోవడం దాదాపు అసాధ్యం కాబట్టి, వీటిపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రవుం దోహదపడుతుందన్నారు. కార్యక్రవు వివరాలను ఆయున తెలిపారు. హోటళ్లు, కాలేజీలు, పెట్రోల్ బంకులు, మాల్స్ వంటి ప్రాంతాల్లో... సైబర్ నేరాలపై అవగాహనకు దాదాపు 50 వేల కరపత్రాలు, వాల్‌పోస్టర్లను ముద్రించారు. పోలీసుస్టేషన్ల వారీగా వాటిని పంపిణీ చేయిస్తారు. సోషల్‌మీడియాను వినియోగించే యుువతకు ఈ నేరాలపై ప్రస్తుతానికి ట్రాఫిక్ పోలీసు ఫేస్బుక్ ద్వారా అవగాహన కల్పిస్తారు. సీసీఎస్ ఆధీనంలో కొత్త ఫేస్బుక్ పేజ్ ద్వారా కూడా అవగాహన కల్పిస్తారు. ట్రాఫిక్ డిజిటల్ సైన్ బోర్డులలో కూడా సైబర్ క్రైమ్ అలెర్ట్స్‌ను ప్రసారం చేయునున్నారు. సైబర్ నేరాలపై అవగాహనకోసం సెల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా సెల్‌ఫోన్ వినియోగదారులకూ సంక్షిప్త సందేశాలు పంపనున్నారు. -
దాతృత్వం స్వతహాగా రావాలి: ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: దాతృత్వమనేది సహజసిద్ధంగా రావాలే తప్ప దీన్ని బలవంతంగా రుద్దడం కుదరదని ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. సమాజం అభివృద్ధి చెందడంలో మనమూ పాలుపంచుకోవాలని, అయితే ఈ భావన మనసులో నుంచే రావాల్సి ఉంటుందని ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 40వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీలు తమ లాభాల్లో కొంత మొత్తాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు(సీఎస్ఆర్) ఉపయోగించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో ప్రేమ్‌జీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లాభాల్లో 2 శాతాన్ని సీఎస్‌ఆర్‌పై వెచ్చించాలన్న నిబంధనను భవిష్యత్‌లో పన్ను కింద మార్చేయకూడదని ప్రేమ్‌జీ పేర్కొన్నారు. అందరూ పాలుపంచుకోవాలి.. సామాజిక బాధ్యత కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని, సమాజంలో మార్పు రావాలంటే మొత్తం వ్యవస్థ అంతా ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రేమ్‌జీ అన్నారు. అయితే, ఈ చర్యలేవైనా సరే అర్థవంతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 2010లో ప్రేమ్‌జీ విప్రోలో 8.7% వాటాలను స్వచ్ఛంద సేవా సంస్థ అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. -
'ఐటీ రంగానికి హైదరాబాదే బెస్ట్'
హైదరాబాద్: ఐటీ రంగానికి హైదరాబాద్ నగరమే అనుకూలమైన ప్రాంతమని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు అభిప్రాయపడ్డారు. ఈ రోజు జరిగిన టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో విస్ర్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐటీ రంగానికి హైదరాబాద్ నగఈ నెల 29వ తేదీన జరిగే సకల జనుల భేరీని విజయవంతం చేయాల్సిందిగా కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పెట్టుబడుల పెట్టేందుకు హైదరాబాద్ అనుకూలమైనదని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ను యూటీ అని కిరికిరి చేస్తే యుద్ధమేనని టీఆర్ఎస్ అధినేత శనివారం కేసీఆర్ ఓయూ జేఏసీ నేతలతో వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో విద్యార్థి గర్జన పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించాలనే ప్రతిపాదనతో ఓయూ జేఏసీ నేతలు తెలంగాణ భవన్లో కేసీఆర్‌ను కలిశారు. అయితే.. అక్టోబర్ మొదటి వారంలోనే తెలంగాణపై చర్యలు ఉండే అవకాశముందని, ఆ తరువాతే భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయించుకుందామని కేసీఆర్ సూచించారు. ‘ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ విదేశీ పర్యటన నుంచి వచ్చాకే తెలంగాణపై చర్యలు ఉండే అవకాశముంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం తర్వాతనే ఉద్యమ కార్యాచరణపై మాట్లాడుకుందాం. ఎవరెన్ని ప్రయత్నాలు, కుట్రలు చేసినా 10 జిల్లాలతోనే తెలంగాణ వస్తుందనుకుంటున్నా. -
సెన్సెక్స్ 18 పాయింట్లు ప్లస్
ఎట్టకేలకు 8 రోజుల నష్టాలకు అడ్డుకట్ట పడింది. సెన్సెక్స్ 18 పాయింట్లు కూడగట్టుకుని 19,182 వద్ద ముగిసింది. అయితే రోజు మొత్తం హెచ్చుతగ్గులకు లోనైంది. గరిష్టంగా 19,306, కనిష్టంగా 19,141 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. గత 8 రోజుల్లో 1,138 పాయింట్లను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇక నిఫ్టీ కూడా స్వల్పంగా 7 పాయింట్లు బలపడి 5,685 వద్ద నిలిచింది. కాగా, బీఎస్ఈలో క్యాపిటల్ గూడ్స్ అత్యధికంగా 3.6% పతనంకాగా, మెటల్ ఇండెక్స్ 2.7% పుంజుకుంది. ఎఫ్ఐఐలు కేవలం రూ. 33 కోట్లను ఇన్వెస్ట్ చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 303 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజీ(ఎన్ఎస్ఈఎల్)లో కాంట్రాక్ట్‌ల సమస్య పరిష్కారానికి స్వతంత్ర కమిటీని వేయనున్న వార్తలతో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ షేరు 31% దూసుకెళ్లింది. రూ. 198 వద్ద ముగిసింది. కొత్త కాంట్రాక్ట్‌లను నిలిపివేసిన వార్తలతో గత రెండు రోజుల్లో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లలో లేని విధంగా జూలై నెలలో ప్రైవేట్ రంగ కార్యకలాపాలు మందగించినట్లు హెచ్ఎస్బీసీ ఇండియా సర్వే పేర్కొనడంతో కొంతమేర సెంటిమెంట్ బలహీనపడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఏడాది కనిష్టానికి భెల్ శనివారం ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరుత్సాహపరచడంతో విద్యుత్‌రంగ దిగ్గజం భెల్ ఏకంగా 19% పతనమైంది. ఏడాది కనిష్టమైన రూ. 121 వద్ద ముగిసింది. నికర లాభం సగానికి పడిపోగా, ఆర్డర్‌బుక్ సైతం బలహీనపడటంతో ఈ కౌంటర్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. వెరసి కంపెనీ మార్కెట్ విలువలో రూ. 6,976 కోట్లు ఆవిరైంది. మార్కెట్ క్యాప్ రూ. 29,591 కోట్లకు పరిమితమైంది. ఇక మిగిలిన దిగ్గజాలలో భారతీ, టాటా మోటార్స్, ఎల్అండ్టీ 2% స్థాయిలో క్షీణించగా, జిందాల్ స్టీల్ అత్యధికంగా 7.7% జంప్ చేసింది. ఈ బాటలో స్టెరిలైట్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, హీరో మోటో, టాటా స్టీల్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ 4-2% మధ్య లాభపడ్డాయి.