అనకాపల్లి: ఆధునిక పోకడలకు అనుగుణంగా.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని వినియోగించుకొని జిల్లా ఏరువాక కేంద్రం అన్నదాతలకు వినూత్నమైన సేవలందిస్తోంది. రైతులు, వ్యవసాయ విస్తరణ విభాగాలకు మధ్య వారధిగా పనిచేస్తోంది. పంటల సాగులో తీసుకోవాల్సిన మెళకువలతోపాటు అత్యవసర సమయాల్లో చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తోంది. అందరి చేతిలో ఇంటర్నెట్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్న ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా జిల్లా ఏరువాక కేంద్రం ఐసీటీ (ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) యాప్‌ను రూపొందించింది. ఏడాది పొడవునా కావలసిన సమాచారాన్ని రైతులు ఈ యాప్ ద్వారా పొందవచ్చు.
యాప్ పనిచేస్తుందిలా..
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఏఎన్‌జీఆర్‌ఏయూఆర్‌బీకే (ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రైతు భరోసా కేంద్రం) యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఈ యాప్‌లో వెబ్ లింకును నొక్కితే ఎఫ్‌ఏఆర్‌ఎం ఆర్‌ఏడీఐవో.ఇన్ కింద ఫార్మ్ రేడియో ఓపెన్ అవుతుంది. ఇందులో నాలుగు స్లాట్లు ఉంటాయి. వ్యవసాయం, కాయగూరలు పండ్లు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారం వస్తుంది. దేనిపై ప్రెస్ చేసినా మూడు నిమిషాల నిడివిగల వాయిస్ వినిపిస్తుంది. అదే సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఆ నెలకు సంబంధించిన ఆ సమాచారం ఫార్మ్ రేడియోలో వినిపిస్తుంది.
రైతుల ముంగిటకే సమాచారం
రైతుల వద్దకే సమాచారాన్ని పంపిస్తున్నాం. ఇంటర్నెట్ సదుపాయమున్న వారు వెబ్‌లింకు ద్వారా ఫార్మ్ రేడియోలో వ్యవసాయం, కాయగూరలు, వెటర్నరీ, అత్యవసర సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలను ఆయా నెలల్లో వినవచ్చు. జిల్లా ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో ఈ యాప్‌ను రూపొందించాం.
– ప్రదీప్‌కుమార్, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment