smart phones
-
2025లో బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఇవే!.. ధరలు ఎలా ఉన్నాయంటే?
భారతీయ మార్కెట్లో లెక్కకు మించిన స్మార్ట్ఫోన్లు.. వివిధ ధరల వద్ద అందుబాటులో ఉన్నాయి. ఈ కథనంలో రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ఫోన్లు ఏవి? వాటి వివరాలు ఏంటనేది వివరంగా తెలుసుకుందాం.మోటరోలా ఎడ్జ్ 50 నియోమోటరోలా ఎడ్జ్ 50 నియో (Motorola Edge 50 Neo) ధర రూ. 20,000 నుంచి రూ. 23,000 మధ్య ఉంది. ఇది 256 జీబీ స్టోరేజితో ఒకే వేరియంట్ రూపంలో అందుబాటులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్, మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, లెదర్ బ్యాక్ ప్యానెల్ వంటివన్నీ ఇందులో ఉంటాయి. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ స్మార్ట్‌ఫోన్ ఐపీ68 రేటింగ్ పొందింది. కెమెరా సెటప్ కూడా అద్భుతంగా ఉంది.వన్‌ప్లస్ నార్డ్ 4వన్‌ప్లస్ నార్డ్ 4 (OnePlus Nord 4) ధర రూ. 29,999. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జెన్ 3, 120హెచ్‌జెడ్ అమోలెడ్ డిస్ప్లే, 256 జీబీ యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ వంటి వాటితో పాటు 5500 యాంపియర్ బ్యాటరీతో 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇవన్నీ కూడా వినియోగదారులకు ప్రీమియం అనుభూతిని అందిస్తాయి.వన్‌ప్లస్ నార్డ్ సీఈ4వన్‌ప్లస్ (OnePlus) కంపెనీకి చెందిన నార్డ్ సీఈ4 కూడా రూ. 30,000 కంటే తక్కువ ధర వద్ద లభించే ఓ బెస్ట్ స్మార్ట్‌ఫోన్. ఇది ఇప్పుడు రూ. 23,000 వద్ద అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్‌ను కలిగి.. 256 జీబీ వరకు స్టోరేజ్ కెపాసిటీ పొందుతుంది.ఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీఒప్పో ఎఫ్27 ప్రో ప్లస్ 5జీ మొబైల్ బేస్ వేరియంట్ ధర మార్కెట్లో రూ. 28,000 (8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్). ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7050 చిప్సెట్ కలిగి, 5000 యాంపియర్ బ్యాటరీ పొందుతుంది. ఇది 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన ఈ ఫోన్ లెదర్ ఫినిషింగ్ పొందుతుంది. కాబట్టి ఇది ప్రీమియం అనుభూతిని అందిస్తుంది. కాబట్టి ఇది ఇతర వేరియంట్ల కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది.నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్నథింగ్ ఫోన్ 2ఎ ప్లస్ మొబైల్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ.27,000 వద్ద అందుబాటులో ఉంది. ఇందులో మీడియాటెక్ డైమన్సిటీ 7350 ప్రో చిప్సెట్, డ్యూయెల్ 50 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 6.7 ఇంచెస్ అమోలెడ్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. మంచి డిజైన్ కలిగిన ఈ ఫోన్ ట్రాన్స్పరెంట్ బ్యాక్, గ్లిఫ్ లైటింగ్ ఇంటర్ఫేస్ కూడా పొందుతుంది.పైన చెప్పిన ఇది మొబైల్స్ మాత్రమే కాకుండా 30వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో గూగుల్ పిక్సెల్ 7ఏ, రెడ్మీ నోట్ 14 ప్రో 5జీ, ఇన్ఫినిక్స్ జీరో 40 5జీ, ఐకూ జెడ్9ఎస్ ప్రో 5జీ, హానర్ 200 వంటివి ఉన్నాయి.ఇదీ చదవండి: అకౌంట్లోకి రూ.5000.. క్లిక్ చేస్తే అంతా ఖాళీ!మొబైల్ ధరలు మీరు ఎంచుకునే వేరియంట్, కలర్ ఆప్షన్, స్టోరేజ్ ఆప్షన్ వంటి వాటిమీద మాత్రమే కాకుండా.. కొనుగోలు చేసే ప్లాట్‌ఫామ్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ధరలలో కొంత వ్యత్యాసం గమనించవచ్చు. అంతే కాకుండా ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీకు మరింత తగ్గింపులను కూడా పొందే అవకాశం ఉంటుంది. -
బెస్ట్ గేమింగ్ ఫోన్స్: ధర రూ.15000 కంటే తక్కువే..
భారతీయ మార్కెట్లో గేమింగ్ ఫోన్లకు డిమాండ్ బాగా పెరుగుతోంది. అయితే వీటి కోసం భారీ మొత్తంలో వెచ్చించాలంటే కొందరు తప్పకుండా వెనుకడుగు వేస్తారు. అయితే ఈ కథనంలో రూ. 15,000లోపు ధర వద్ద అందుబాటులో ఉన్న ఐదు బెస్ట్ ఫోన్లను గురించి వివరంగా తెలుసుకుందాం.సీఎంఎఫ్ ఫోన్ 1: సీఎంఎఫ్ అనేది నథింగ్ సబ్ బ్రాండ్. రూ.14,999 వద్ద లభించే ఈ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో 6జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాబట్టి ఎక్కువ సమయం గేమ్ ఆదుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.మోటో జీ64: మన జాబితాలో చెప్పుకోదగ్గ మరో గేమింగ్ ఫోన్ మోటో జీ64. దీని ధర కూడా రూ.14,999 మాత్రమే. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 7025తో పాటు 8జీబీ రామ్ పొందుతుంది. ఇందులో 6000 mAh కలిగిన ఈ ఫోన్.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. తక్కువ ధరలో గేమింగ్ ఫోన్ కోసం ఎదురు చూసేవారికి దీనిని పరిశీలించవచ్చు.పోకో ఎక్స్6 నియో: రూ.12,999 వద్ద లభిస్తున్న.. పోకో ఎక్స్6 నియో ఫోన్ కూడా తక్కువ ధరలో లభించే ఉత్తమ గేమింగ్ ఫోన్. ఇది 8 జీబీ రామ్, మీడియా టెక్ డైమెన్సిటీ 6080 చిప్ పొందుతుంది. 5000 mAh బ్యాటరీ కలిగిన ఈ ఫోన్.. సుదీర్ఘ గేమింగ్ సెషన్ల కోసం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌ను ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసింది.రెడ్మీ 13 5జీ: రెడ్మీ 13 5జీ ధర రూ.14,999. ఇది వినియోగదారులకు లేటెస్ట్ గేమింగ్ అనుభవాన్ని అందించడానికి పెద్ద డిస్ప్లే పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్తో 6 జీబీ రామ్ పొందుతుంది. అత్యుత్తమ పనితీరును అందించే ఈ ఫోన్ 5030 యాంపియర్ బ్యాటరీతో వస్తుంది.ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్: రూ. 15వేలు కంటే తక్కువ ధర వద్ద లభించే గేమింగ్ ఫోన్లలో ఇన్ఫినిక్స్ నోట్ 40ఎక్స్ ఒకటి. దీని ధర రూ. 13999. ఇది మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో 8జీబీ రామ్ పొందుతుంది. శక్తివంతమైన ఈ స్మార్ట్‌ఫోన్.. మంచి గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది. -
రూ.6000 వద్ద లభించే బెస్ట్ స్మార్ట్ఫోన్లు: ఇక్కడ చూడండి
ప్రస్తుతం మార్కెట్లో లక్ష రూపాయల కంటే ఎక్కువ ఖరీదైన స్మార్ట్ఫోన్ల దగ్గర నుంచి రూ. 6వేలు ధర వద్ద లభించే ఫోన్ల వరకు ఉన్నాయి. ఈ కథనంలో ఆరువేల రూపాయల ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం.ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8 (Infinix Smart 8)మార్కెట్లో అందుబాటులో ఉన్న 'ఇన్ఫినిక్స్ స్మార్ట్ 8' ధర కేవలం రూ.6,699 మాత్రమే. బ్యాంక్ కార్డులను ఉపయోగించి కొనుగోలు చేస్తే. ఇది రూ. 6వేలకు లభిస్తుంది. ఇందులో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.6 ఇంచెస్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, రెండు కెమెరాలు మొదలైనవి ఉంటాయి. ఇది ఆక్టా కోర్ యూనిసోక్ T606 ప్రాసెసర్ పొందుతుంది.ఐటెల్ ఆరా 05ఐ (Itel Aura 05i)రూ.6000 కంటే తక్కువ ధర వద్ద లభించే స్మార్ట్ఫోన్ల జాబితాలో ఐటెల్ ఆరా 05ఐ ఒకటి. ఇది 2 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. యూనిసోక్ SC9863A1 ప్రాసెసర్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 4000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. దీని ధర రూ. 5749 మాత్రమే. మల్టిపుల్ కెమెరా ఆప్షన్స్ ఇందులో చూడవచ్చు.రెడ్మీ ఏ2 (Redmi A2)రూ.5669 వద్ద లభించే రెడ్మీ ఏ2 కూడా ఆరు వేల రూపాయల కంటే తక్కువ ధర వద్ద లభిస్తున్న స్మార్ట్ఫోన్లలో ఒకటి. ఆక్టా కోర్ ప్రాసెసర్ కలిగిన ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పొందుతుంది. ఇది 2 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతుంది. 8 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌లో లభిస్తుంది. -
వ్యవసాయ కుటుంబాలు వెరీ స్మార్ట్!
దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర కుటుంబాలతో పోలిస్తే వ్యవసాయ కుటుంబాలకే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లున్నాయని నాబార్డు సర్వే వెల్లడించింది. గ్రామీణ కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, ఆయా కుటుంబాలకు గల గృహాపకరణాలు, వారి జీవన ప్రమాణాల స్థాయిని తెలియజేసేందుకు నాబార్డు 2021–2022 వ్యవసాయ సంవత్సరంలో సర్వే నిర్వహించింది. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కుటుంబాల్లో 98.3 శాతం వ్యవసాయ కుటుంబాల్లో స్మార్ట్ ఫోన్లుండగా.. వ్యవసాయేతర కుటుంబాల్లో 96.8 శాతమే స్మార్ట్ ఫోన్లున్నాయి. దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో టెలివిజన్ సౌకర్యం కూడా వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాలకే అత్యధికంగా ఉండటం గమనార్హం. స్కూటర్, మోటార్ సైకిళ్లు కూడా వ్యవసాయ కుటుంబాలకే అత్యధికంగా ఉన్నాయి. కార్లు మాత్రం వ్యవసాయేతర కుటుంబాల కన్నా వ్యవసాయ కుటుంబాలకు తక్కువగా ఉన్నాయని సర్వే తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలకు ఉన్న గృహోపకరణాలు వారి జీవన శైలిని మార్చేందుకు దోహదపడుతు న్నాయని సర్వే వెల్లడించింది. – సాక్షి, అమరావతి -
పాపం కంటిపాపలు
తల్లిదండ్రులకు కంటిపాపలైన చిన్నారుల్లో కంటిచూపు క్రమంగా క్షీణిస్తోంది. సగటున ప్రతి ముగ్గురు బాలల్లో ఒకరు హ్రస్వదృష్టి (దూరంలోని వస్తువులు సరిగా కని్పంచని) సమస్యతో బాధపడుతున్నట్టు అంతర్జాతీయ విశ్లేషణ ఒకటి హెచ్చరించింది. ఆసియాలోనైతే సమస్య మరీ దారుణంగా ఉంది. జపాన్‌లో ఏకంగా 85 శాతం, కొరియాలో 73 శాతం మంది బాలలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. బ్రిటిష్ జర్నల్ ఆఫ్ ఆఫ్తల్మాలజీలో తాజాగా ప్రచురితమైన అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆరు ఖండాల పరిధిలోని 50కి పైగా దేశాల్లో విస్తృతంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆందోళనకర గణాంకాలు వెలుగులోకి వచి్చనట్టు పేర్కొంది. అధ్యయనంలో భాగంగా 50 లక్షలమందికి పైగా బాలలు, టీనేజర్లను పరీక్షించారు. స్కూలు పుస్తకాలతో కుస్తీకి తోడు స్క్రీన్ సమయం విపరీతంగా పెరగడం, ఆరుబయట గడిపే సమయం తగ్గడం పిల్లలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే 2050 నాటికి కోట్లాది మంది పిల్లల కంటిచూపు బాగా ప్రభావితం అవుతుందని హెచ్చరించారు. హ్రస్వదృష్టి సాధారణంగా స్కూలుకు వెళ్లడం మొదలు పెట్టే దశలోనే మొదలవుతుంది. కళ్ల ఎదుగుదల ఆగిపోయేదాకా, అంటే 20 ఏళ్లొచ్చేదాకా సమస్య తీవ్రత పెరుగుతూనే ఉంటుంది. సగం యువతకు సమస్యే → ప్రపంచవ్యాప్తంగా 36 శాతం మంది బాలలు హ్రస్వదృష్టితో బాధపడుతున్నారు. → 1990 నుంచి 2023 మధ్యకాలంలోనే సమస్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది. → పిల్లల్లో హ్రస్వదృష్టి ఆసియా దేశాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల్లో ఏకంగా ఏడు రెట్లు తక్కువగా ఉండటం విశేషం. → ఉగాండాలో అతి తక్కువగా కేవలం ఒక్క శాతం మంది పిల్లల్లో మాత్రమే హ్రస్వదృష్టి నమోదైంది. → ఆఫ్రికా దేశాల్లో పాఠశాల విద్య ఆరు నుంచి ఎనిమిదేళ్ల వయస్సులో ప్రారంభమ తుంది. పైగా పిల్లలు ఆరుబయట ఎక్కువగా గడుపుతున్నారు. దాంతో అక్క డ బాలలు, యువకుల్లో సమస్య తక్కువగా ఉంది. → జపాన్‌లో ఏకంగా 85%, దక్షిణ కొరియాలో 73% పిల్లలకు హ్రస్వదృష్టి ఉంది. → చైనా, రష్యాల్లో 40 % కంటే ఎక్కువగా, యూకే, ఐర్లాండ్, అమెరికాల్లో 15 శాతానికి పైగా పిల్లల్లో సమస్య ఉంది. → మిగతా ఖండాలతో పోలిస్తే ఆసియాలో 2050 నాటికి ఏకంగా 69 శాతం మంది హ్రస్వదృష్టి బారిన పడతారు. → అప్పటికి ప్రపంచ యువతలో కనీసం సగానికి సగం ఈ సమస్యను ఎదుర్కొంటారు. → వర్ధమాన దేశాల్లో 2050 నాటికి 40% మంది దీని బారిన పడే అవకాశముంది. → పిల్లలను రెండేళ్ల వయసులోనే బడిబాట పట్టించే సింగపూర్, హాంకాంగ్ వంటిచోట్ల సమస్య విస్తరిస్తోంది. → కోవిడ్ లాక్డౌన్ సమయంలో బాలల్లో హ్రస్వదృష్టి సమస్య బాగా పెరిగింది. → కోట్లాది మంది ఇళ్లకే పరిమితమై స్మార్ట్ ఫోన్లు, టీవీలు విపరీతంగా చూడటం దీనికి ప్రధాన కారణం. అమ్మాయిల్లోనే ఎక్కువ అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిల్లోనే హ్రస్వదృష్టి ఎక్కువగా కని్పస్తున్నట్టు అధ్యయనం తేలి్చంది. ‘‘అబ్బాయిలతో పోలిస్తే ఎదిగేక్రమంలో వాళ్లు ఇంట్లో గానీ, స్కూల్లో గానీ ఆటలపై, ఆరుబయట, గడిపే సమయం తక్కువ. వీటికితోడు ఆహారపు అలవాట్లు తదితరాల వల్ల చాలా చిన్నవయసులోనే రజస్వల అవుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వారిలో చాలావరకు టీనేజ్లోనే హ్రస్వదృష్టి బారిన పడుతున్నారు’’ అని పరిశోధకులు పేర్కొన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ కెపాసిటీ అదుర్స్! (ఫొటోలు)
-
‘స్మార్ట్’గా దోపిడీ
దేశంలో సైబర్ మోసాలు వణుకు పుట్టిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ల ద్వారా పెరుగుతున్న ఆన్లైన్ లావాదేవీలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రూ.కోట్లు కొట్టేస్తున్నారు. కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ నిర్వహించే సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో ఏకంగా 7.40 లక్షల ఫిర్యాదులు నమోదవడం సైబర్ ముప్పు తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఫిర్యాదుల ప్రకారం రూ.1,750 కోట్లు సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురయ్యాయి.ఆన్లైన్ పెట్టుబడి మోసం, గేమింగ్ యాప్‌లు, అల్గారిథమ్ మానిప్యులేషన్లు, అక్రమ రుణ యాప్‌లు, అశ్లీల వీడియోలతో బెదిరింపులు, ఓటీపీ స్కామ్‌లలో అమాయకులు చిక్కుకుని ఆరి్థకంగా నష్టపోతున్నారు. సైబర్ నేరగాళ్లు కాల్ స్పూఫింగ్, ప్రభుత్వ, బ్యాంకు అధికారులుగా నటిస్తూ ఆర్థిక లావాదేవీల వివరాల సేకరణ, ఆన్లైన్ టాస్క్‌ల ద్వారా సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపిస్తూ దోపిడీకి పాల్పడుతున్నారు. ఫలితంగా 2019 నుంచి 2024 వరకు సైబర్ కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. –సాక్షి, అమరావతిమే నెలలో రోజుకు 7 వేల ఫిర్యాదులు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) నివేదిక ప్రకారం ఈ ఏడాది మే నెలలో రోజుకు సగటున 7 వేల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇది 2021–2023 మధ్య కాలంతో పోలిస్తే 113.7 శాతం అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఫిర్యాదుల్లో 85 శాతం ఆర్థిక ఆన్లైన్ మోసానికి సంబంధించినవి కావడం గమనార్హం. ఒక్క 2023లోనే ఐ4సీ డేటా ప్రకారం.. లక్షకుపైగా ఆన్లైన్లో పెట్టుబడి మోసాలను గుర్తించారు.ఇక డిజిటల్ అరెస్ట్‌ల (వీడియో కాల్స్ స్కామ్‌లు) ఫలితంగా 2024 తొలి నాలుగు నెలల్లోనే 4,599 కేసులు నమోదవగా.. బాధితులు రూ.120 కోట్ల మేర నష్టపోయారు. 20 వేలకు పైగా ట్రేడింగ్ స్కామ్‌లు నమోదవగా.. సైబర్ నేరగాళ్లు రూ.1,420 కోట్లు కాజేశారు. ఇక 62,687 ఆన్లైన్ పెట్టుబడి మోసాల కేసుల్లో రూ.222 కోట్లు, డేటింగ్ యాప్‌ల వలలో 1,725 కేసుల్లో రూ.13.23 కోట్లు సైబర్ మోసాలకు పాల్పడ్డారు.సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం ⇒ భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న చాలామంది సైబర్ నేరగాళ్లు ఆగ్నేయాసియా ప్రాంతాల నుంచి మోసాలకు పాల్పడుతున్నారు. పుర్సాట్, కోహ్‌కాంగ్, కంబోడియాలోని సిహనౌక్విల్లే, మయన్మార్‌లోని మైవాడ్డీ, థాయ్‌లాండ్ వంటి ప్రాంతాల నుంచి ఈ ముఠాలు పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ⇒ సైబర్ మోసాల కట్టడికి ఐ4సీ.. నాలుగు నెలల్లో దాదాపు 3.25 లక్షల మ్యూల్ బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేసింది. 5.30 లక్షల సిమ్ కార్డులను బ్లాక్ చేసింది. ⇒అదనంగా సైబర్ నేరగాళ్ల కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తూ 3,401 సోషల్ మీడియా ఖాతాలు, వాట్సాప్ గ్రూపులను డీయాక్టివేట్ చేసింది. ⇒గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే సందేశాలను నమ్మొద్దు. సులభంగా డబ్బు సంపాదన, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలంటూ ఇచ్చే అవకాశాలను విశ్వసించవద్దు. ⇒ అధికారిక చానల్స్ ద్వారా ఉద్యోగ ఆఫర్లు ప్రామాణికతలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి ⇒అవసరమైతే తప్ప సురక్షితమైన వెబ్సైట్లో మాత్రమే సున్నితమైన సమాచారాన్ని పంచుకోవాలి. ⇒ ఏదైనా అనుమానిత సైబర్ స్కామ్ గుర్తిస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోరి్టంగ్ పోర్టల్‌కు నివేదించాలి. తక్షణ సహాయం కోసం 1930కి కాల్ చేయాలి.సైబర్ ఫిర్యాదుల్లో పెరుగుదల ఇలా.. 2019 26,049 2020 2,57,777 2021 4,52,414 2022 9,66,790 2023 15,56,218 2024 7,40,957 (తొలి నాలుగు నెలల్లోనే) -
పబ్లిక్ ప్రాంతాల్లో చార్జింగ్ పోర్టులతో జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: ప్రయాణాల సమయంలో మొబైల్ చార్జింగ్ అయిపోయినా.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్ పోర్టులు.. వంటి బహిరంగ ప్రాంతాల్లోని మొబైల్ చార్జింగ్ పాయింట్లను వీలైనంత వరకూ వినియోగించొద్దని కేంద్ర హోంశాఖ ప్రజలను హెచ్చరించింది. ఈ పోర్టుల ద్వారా సైబర్ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్వేర్ చొప్పించి, డేటా తస్కరించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ తరహా జ్యూస్ జాకింగ్ స్కామ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జ్యూస్ జాకింగ్‌కు గురైనట్టు గుర్తిస్తే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు. అదేవిధంగా www.cybercrime. gov.in వెబ్సైట్లోనూ ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఏమిటీ జ్యూస్ జాకింగ్..? చార్జింగ్ పాయింట్లకు అనుసంధానమై ఉంటూ ఫోన్లలో మాల్వేర్, ఇతర ప్రమాదకర సాఫ్ట్వేర్లను యూజర్‌కు తెలియకుండా ఇన్స్టాల్ చేసి, డేటా దొంగిలించడమే జ్యూస్ జాకింగ్. స్మార్ట్ ఫోన్ వినియోగదారుల అవగాహనా రాహిత్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని కేంద్రం పేర్కొంది. బహిరంగ చార్జింగ్ పోర్టులను వాడే వారికి డేటా తస్కరణ ముప్పు ఎక్కువ అని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇలా డేటాను కొట్టేసిన తర్వాత సైబర్ నేరగాళ్లు ఆ సమాచారాన్ని అడ్డుపెట్టుకుని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు డిమాండ్ చేస్తున్న కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. జ్యూస్ జాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే ♦ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం కొన్ని కీలక సూచనలు చేసింది. ♦ చార్జింగ్ పాయింట్లకు బదులు సాధారణ విద్యుత్ పాయింట్ల ద్వారా చార్జింగ్ చేసుకోవాలి. ♦అవసరమైన సందర్భాల్లో వాడుకునేందుకు నిత్యం పవర్ బ్యాంక్, లేదా ఇతర చార్జింగ్ సాధనాలు వెంట పెట్టుకోవడం ఉత్తమం. ♦ మొబైల్ ఫోన్లకు స్క్రీన్‌లాక్ తప్పకుండా పెట్టుకోవాలి. ♦ వీలైనంత వరకు స్మార్ట్ ఫోన్‌ను ఆఫ్ చేశాకే చార్జింగ్ చేయాలి. -
షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్లెన్నో ఊహించగలరా?
‘బాలీవుడ్ బాద్షా’ షారుఖ్ ఖాన్ అంటే ఫ్యాన్స్‌కు పూనకాలే. బ్లాక్ బస్టర్మూవీలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు, ఖరీదైన బంగ్గాలు, లగ్జరీ కార్లు..అబ్బో.. ఇలా చెప్పుకుంటూపోతే ఈ లిస్ట్ పెద్దదే. 1980లలో తన కెరీర్‌ను ప్రారంభించింది మొదలు అత్యంత ప్రజాదరణతో వెండితెరను ఏలుతున్న స్టార్ హీరో. . పఠాన్, జవాన్ , డంకీ మూవీలతో ఈ క్రేజ్ మరింత పెరిగింది. ఇటీవలి బ్లాక్ బస్టర్‌మూవీ జవాన్‌లో షారుఖ్ ఖాన్ పట్టుకున్న ఫోను మొదలు తమ అభిమాన హీరోకున్న ఫోన్లు ఎన్ని అనేది చర్చకు దారితీసింది. షారుఖ్ ఖాన్ వద్ద 17 ఫోన్లు షారుఖ్ ఖాన్ మెయింటెయిన్ చేస్తున్న ఫోన్ల సంఖ్యను మీరు ఊహించగలరా? అక్షరాల 17 ఫోన్లు అట. షారూఖ్ కరీర్లో ప్రారంభంలో కీలక పాత్ర పోషించిన , వివేక్ వాస్వాని స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. సిద్ధార్థ్ కన్నన్‌తో ఒక ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను పంచుకున్నాడు. నాలుగేళ్ల క్రితం జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో తప్ప మళ్లీ తనని కలవలేకపోయాయని వివేక్ తెలిపారు. ‘‘ఎస్ఆర్కే దగ్గర 17ఫోన్లు, ఉన్నాయి. నా దగ్గర ఒకటే నంబరు ఉంది.. నేను ఫోన్ చేసినపుడు ఆయన దొరకడు. ఆయన ఫోన్ చేసినపుడు నేను మిస్ అవుతా.. ఆయనకు బాధ్యతలు ఎక్కువ. నిత్యం ప్రయాణిస్తూనే ఉంటాడు. వెండితెర సామ్రాజ్యాన్ని ఏలుతున్న అద్భుతమైన వ్యక్తి’’ అంటూ గుర్తు చేసుకున్నారు. కాగా రియల్మీ, ఒప్పో లాంటి బ్రాండ్లకు షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. అంతేకాదు బాలీవుడ్ హ్యాపియస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు షారుఖ్, గౌరీ ఖాన్ జంట . వీరి వివాహ బంధం మొదలై మూడు దశాబ్దాలుదాటింది. ఈ క్రమంలో తన భార్యకు రోజుకు 8-10 సార్లు ఫోన్ చేస్తాననీ, ఒక్కోసారి ఐదు నిమిషాలకోసారి ఫోన్ చేస్తానని చెప్పడం వైరల్ అయింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె గుర్తొచ్చినప్పుడల్లా కాల్ చేస్తా, నా భార్యతోనే కదా మాట్లాడేదని అని ఫన్నీగా చెప్పిన సంగతి తెలిసిందే. -
ఐఫోన్ 16 ఫోన్లు ఇలాగే ఉంటాయా?
కొత్త ఏడాదిలో యాపిల్ నుంచి రానున్న హై-ఎండ్ వేరియంట్లకు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. ఐఫోన్ 16 (iPhone 16), ప్రో, ప్రో మ్యాక్స్ మోడల్స్ లుక్, స్పెసిఫికేషన్లు ఇలాగే ఉంటాయంటూ వాటి ప్రోటోటైప్ లీక్ అయింది. యాపిల్ అంతర్గత డిజైన్ల ఆధారంగా మ్యాక్రూమర్స్ (MacRumors) అనే వెబ్సైట్ ఐఫోన్ 16, ప్రో, ప్రో మ్యాక్స్ వేరియంట్లు ఇలాగే ఉంటాయంటూ మాక్అప్లను రూపొందించింది. వీటి ప్రకారం.. యాపిల్ తదుపరి తరం వేరియంట్లు పెద్ద డిస్ప్లే, కెపాసిటివ్ క్యాప్చర్ బటన్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ఐఫోన్ 16 వేరియంట్ డిస్ప్లే 6.3 అంగుళాలు, ఐఫోన్ 16 ప్రో మాక్స్ డిస్ప్లే 6.9 అంగుళాలు ఉంటాయి. అంటే ఇది ఐఫోన్ 15 ప్రో లైనప్‌లో ఉన్న 6.1-అంగుళాలు, 6.7-అంగుళాల కంటే ఎక్కువ. ప్రో మోడల్‌లలో వస్తుందని భావిస్తున్న కొత్త టెలిఫోటో కెమెరా మాడ్యూల్ దీనికి కారణం కావచ్చు. గత సంవత్సరం వచ్చిన ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max)లో మాత్రమే టెలిఫోటో లెన్స్ ఉంది. కానీ రానున్న రెండు ప్రో మోడల్‌లలో టెలిఫోటో లెన్స్‌లను చూడొచ్చని భావిస్తున్నారు. డిజైన్ విషయంలో గతంలో వచ్చిన వేరియంట్ల కంటే పెద్దగా మార్పులు లేనప్పటికీ రానున్న కొత్త మోడల్స్‌లో కనీసం నాలుగు బటన్ కాన్ఫిగరేషన్లతో ప్రయోగాలు చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాదిరిగానే బటన్ ప్లేస్మెంట్ ఉంటుంది కానీ యాడెడ్ బటన్‌తో ఉంటుంది. కొత్త క్యాప్చర్ బటన్ ఫోర్స్-సెన్సార్ ఫంక్షనాలిటీతో కెపాసిటివ్గా ఉంటుందని భావిస్తున్నారు. బ్లూమ్‌బెర్గ్ నుంచి వచ్చిన నివేదికల ప్రకారం ఈ బటన్ వీడియో రికార్డింగ్ కోసమే ప్రత్యేకంగా ఉపయోగించేలా ఉంటుందని సమాచారం. -
బంపర్ డిస్కౌంట్.. ఐఫోన్ 15పై రూ.10,000 తగ్గింపు!
స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్రస్తుతం బాగా పెరిగిపోయింది. దాదాపు ప్రతిఒక్కరి దగ్గరా స్మార్ట్‌ఫోన్ ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. వీటిపై డిస్కౌంట్లు ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐఫోన్ 15పై భారీ తగ్గింపు సమాచారం ఇక్కడ ఇస్తున్నాం. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ రిటైల్ చైన్ విజయ్ సేల్స్ తమ ఇయర్ ఎండ్ యాపిల్ సేల్‌ను తాజాగా ప్రకటించింది. ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌తో సహా కొన్ని లేటెస్ట్ యాపిల్ ఉత్పత్తులను తగ్గింపు ధరలకు అందిస్తోంది. ఇందులోనూ ఐఫోన్ 15 సిరీస్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఐఫోన్ 15ప్రో 1టీబీ వేరియంట్‌ను డిస్కౌంట్‌పై రూ. 159,990కి కొనుగోలు చేయవచ్చు. ఇక ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ బేస్ 256జీబీ వేరియంట్‌ను బ్యాంక్ ఆఫర్లు లేకుండానే కేవలం రూ. 148,710లకే లిస్ట్ చేసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ వినియోగిస్తే రూ. 5,000 వరకు అదనపు తక్షణ తగ్గింపును పొందవచ్చు. విజయ్ సేల్స్ స్టోర్లలో రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఐఫోన్ 14 మోడల్‌లు కూడా ఆకర్షణీయమైన ధరలకు లభిస్తున్నాయి. కేవలం ఐఫోన్లే కాకుండా మ్యాక్‌బుక్స్, ఐప్యాడ్లు, యాపిల్ వాచీలు, ఇతర ఉపకరణాలపై కూడా రూ. 5,000 వరకు తగ్గింపును పొందవచ్చు. బేస్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎం2 (MacBook Air M2)ని డిస్కౌంట్‌తో రూ. 96,960కే కొనుగోలు చేయవచ్చు. ఐప్యాడ్ ఎయిర్ (iPad Air 5th Gen) ఆఫర్ల తర్వాత రూ. 50,680కి అందుబాటులో ఉంది. యాపిల్ సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ ప్రోని డిస్కౌంట్ తర్వాత కేవలం రూ. 18,990 లకే సొంతం చేసుకోవచ్చు. డిసెంబర్ 31 నుంచి జనవరి 7 వరకు వారం రోజుల పాటు ఈ సేల్ ఉంటుందని విజయ్ సేల్స్ తెలిపింది. -
పిల్లలు స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్నారా? హార్ట్ ఎటాక్ వచ్చే ఛాన్స్?
ప్రస్తుత కాలంలో ఎవరింట చూసినా పిల్లల చేతిలో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ఐపాడ్లు ఉండవలసిందే! స్మార్ట్ఫోన్లు అధికంగా వాడుతున్న పిల్లలు కదలకుండా ఒకేచోట కూర్చొని ఉంటారు. దీనివల్ల వారు చిన్న వయసులోనే ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. అంతేకాదు ఫోన్ లేదా టీవీ చూస్తూ ఉంటే కాస్త ఎక్కువే తినేస్తారు. దీనివల్ల భవిష్యత్తులో ఊబకాయం, మధుమేహం, కీళ్ల సమస్యలు, గుండె జబ్బులు వంటి వాటి బారిన పడే ప్రమాదం పెరిగిపోతుంది. వీటన్నింటి నుంచి రక్షించాలంటే పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడకుండా చేయాలి. అదెలాగో చూద్దాం. పిల్లల మనసు అద్దం లాంటిది. తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్న ఇతర పెద్దలు ఏం చేస్తున్నారో చూసి అదే అలవాటు చేసుకుంటారు. కాబట్టి ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు, ఇతర పెద్దలూ స్మార్ట్‌ఫోన్, లాప్టాప్ వంటివి చూడకూడదని గుర్తుంచుకోండి. పిల్లలకు ఫోన్ చూస్తూ తినే అలవాటు ఉంటే, వాళ్లకు ఆకలిగా ఉన్నప్పుడే అన్నం పెట్టండి. ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు అల్లరి చేయరు. మొబైల్ గురించి ఆలోచించరు. తిండిపైనే ధ్యాస పెడతారు. మొబైల్ లేకుండా ఐదు నిమిషాల పాటు వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. పేచీ పెట్టకుండా సరిగ్గా తింటే, ఈ సమయాన్ని పెంచవచ్చు. పిల్లలకు తినిపించేటప్పుడు వాళ్లతో మాట్లాడుతూ ఉండండి. వంటకాలు ఎలా ఉన్నాయో అడగండి. నవ్వుతూ... కబుర్లు చెబుతూ, జోకులేస్తూ, సరదాగా గడిపితే మొబైల్ ఫోన్ చూపించి తిండి పెట్టాల్సిన అవసరం ఉండదు. చిన్నప్పటినుంచి పిల్లలకు పుస్తక పఠనం అలవాటు చేయాలి. ముందు బొమ్మల పుస్తకాలతో మొదలు పెట్టండి. ఆ తర్వాత పజిల్స్ పూర్తి చేయడం, కథల పుస్తకాలు, వార్తా పత్రికలలో పిల్లలకోసం కేటాయించే కథనాలను చదవడం అలవాటు చేయడం వల్ల వారి దృష్టి స్మార్ట్‌ఫోన్ పైకి మళ్లదు. పిల్లలకు బాల్యం నుంచి చుట్టుపక్కల పిల్లలతో ఆటలు ఆడటం అలవాటు చేయాలి. వారి వయసు పిల్లలు లేకపోతే మీరే వారితో ఆడుకోండి. కాసేపు ఔట్‌డోర్ ఆటలు, కాసేపు చెస్, క్యారమ్స్ వంటివి ఆడటం అలవాటు చేస్తే స్మార్ట్‌ఫోన్ బారిన పడకుండా స్మార్ట్‌గా తయారవుతారు. -
గ్రహాంతరవాసులతో ఆ ఊరి వాళ్లకి సంబంధం ఏంటి? అడుగుపెట్టగానే..
ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్స్ లేకుండా జీవితాన్ని ఊహించుకోలేం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒకపూట భోజనం అయినా మానేస్తాం గానీ ఫోన్ లేకుండా ఉండలేం అనేంతగా అడిక్ట్ అయిపోతున్నాం. అయితే ఓ ఊళ్లో నివసించే ప్రజలు మాత్రం మొబైల్, టీవీ , రేడియో సహా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులేవీ ఉపయోగించరు. వినడానికి వింతగా ఉన్నా ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇదే నియమాన్ని పాటిస్తున్నారు. టెక్నాలజీకి దూరంగా ఉన్న ఆ ఊరు ఎక్కడుంది? సెల్‌ఫోన్స్ లేకుండా అక్కడివాళ్లు ఎలా కమ్యూనికేట్ చేసుకుంటారు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికా వెస్ట్ వర్జీనియాలోని పోకాహోంటాస్ కౌంటీలో ఉన్న గ్రీన్ బ్యాంక్ సిటీలోని ప్రజలు సాంకేతికతను ఉపయోగించరు. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్‌పై ఇక్కడ నిషేధం ఉండటంతో ఎవరూ స్మార్ట్‌ఫోన్స్, వైఫై వంటివేవీ ఉపయోగించడానికి వీల్లేదు. ఈ ఊళ్లు సెల్‌ఫోన్స్, వాటి సిగ్నల్ టవర్స్ ఎక్కడా కనిపించవు. గత యాభై ఏళ్లుగా ఇదే నిబంధన అమల్లో ఉంది. ఈ రూల్స్ పాటించేవాళ్లు ఊళ్లో ఉంటారు. అందుకు తగ్గట్లుగా ముందే రెంటల్ అగ్రిమెంట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఇష్టం లేకపోతే ఊరు ఖాళీ చేయొచ్చు కానీ రూల్స్ మాత్రం మార్చరు. నో సిగ్నల్స్.. కారణమిదే 2010 గణాంకాల ప్రకారం అక్కడి జనాభా 150 మంది కంటే తక్కువే.(ఆ తర్వాత అధికారులు డాటాను వెల్లడించలేదు) సోలార్ పవర్, పాడిపరిశ్రమే అక్కడి వారి జీవనాధారం. వారంతంలో పర్యాటకులు అక్కడికి వచ్చినా సెల్ఫోన్లు పనిచేయకుండా ప్రత్యేకంగా జామర్లు కూడా ఏర్పాటు చేశారు. గ్రీన్‌బ్యాంక్ సిటీలోని ప్రజలు టెక్నాలజీకి దూరంగా ఉండటానికి ఓ కారణం ఉంది. అదేంటంటే..ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద రేడియా టెలిస్కోప్ ఉంది. ఖగోళంలోని రహస్యాలను చేధించేందుకు సుమారు 100 మిలియన్ డాలర్ల ఖర్చుతో గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం పరిశోధనులు కొనసాగుతున్నాయి. ఈ టెలిస్కోప్ అంతరిక్షంలో 13 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సంకేతాలను కూడా పట్టుకోగలదు. అందుకే రేడియా టెలిస్కోప్కి ఎలాంటి డ్యామేజీ కాకూడదన్న ఉద్దేశంతో ఫ్రీక్వెన్సీతో పని చేసే ఎలక్ట్రానిక్ డివైజ్‌లను అనుమతించరు.అందుకే సిగ్నల్ ఆధారిత ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై ఇక్కడ నిషేధం ఉంది.మరి కమ్యూనికేషన్ ఎలా అంటారా?.. ఊరికి దూరంగా ప్రత్యేకంగా కొన్ని రేడియో సెంటర్లు, ఫోన్ బూత్‌లు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు. -
బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు!
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తృతం అవుతున్న నేపథ్యంలో చాలా మంది 5జీ ఫోన్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ధర కారణంగా కొనలేకపోతున్నారు. అలాంటి వారికి ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ (Flipkart Big Diwali Sale) ప్రారంభమైంది. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో 5జీ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్, ఐకూ, పోకో వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ. 15,000లోపు లభించే టాప్ మూడు 5జీ ఫోన్ డీల్స్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G), శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 (Samsung Galaxy F14) రెండూ ఒకే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తాయి. M సిరీస్ వెర్షన్లో అదనంగా 2-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. రెండెంటిలోనూ ఒకే విధమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండు ఫోన్లూ 6000 mAh బ్యాటరీతో వస్తాయి. అయితే వీటికి ఛార్జర్ రాదు. ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ రూ. 11,967కి అందుబాటులో ఉండగా, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ధర రూ.11,490 ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లతో కొటే అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఐకూ జెడ్6 లైట్ 5జీ ఐకూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్. దీని ధర రూ. 13,989. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్తో వచ్చే ఈ ఫోన్ రోజువారీ ఉపయోగం, సాధారణ గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. 120Hz స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది. పోకో ఎం6 ప్రో 5జీ రూ. 10 వేల లోపు సెగ్మెంట్లో వచ్చే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) రోజువారీ వినియోగం, సాధారణ గేమింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను ఆశించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో ఇది ధర రూ. 9,999లకే లభిస్తోంది. -
స్మార్ట్‌ఫోన్‌లో వేల కొద్ది బాక్టీరియా.. ఇలా క్లీన్ చేసుకోండి
నిత్యం మన చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్.. ఎన్నో వేల బ్యాక్టీరియా, వైరస్‌లకి ఆలవాలమనే సంగతి తెలిసిందే! దాన్ని పర్ఫెక్ట్గా శానిటైజ్ చేయాలంటే.. ఇలాంటి స్టెరిలైజర్ డిసిన్ఫెక్షన్ బాక్స్ ఉండాల్సిందే. ఇందులో 3 నిమిషాలు పెట్టి.. ఆన్ బటన్ నొక్కితే చాలు. 99.99 శాతం క్రిములు నాశనం అవుతాయి. ఫోన్ నీట్‌గా మారిపోతుంది. ఇక ఈ బాక్స్‌లో బండి తాళాలు, ఇంటి తాళాలు, మాస్కులతో పాటు.. కళ్లజోడు, బ్లూటూత్, పెన్నులు, నగలు వంటివెన్నో శుభ్రం చేసుకోవచ్చు. ఈ బాక్స్‌ని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. ముందుగానే చార్జింగ్ పెట్టుకుని, వైర్లెస్ మెషిన్లా వాడుకోవచ్చు. భలే ఉంది కదూ! -
చిన్నపిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా? టీనేజ్‌లో డిప్రెషన్‌తో..
ఆధునిక సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్ అన్ని రంగాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. స్మార్ట్ ఫోన్ లేనిదే రోజు గడవదంటే అతిశయోక్తికాదు. లేచినప్పటి నుంచి నిద్రకు ఉపక్రమించే వరకు పక్కన స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. సగం పనులు దీనితోనే అవున్నాయంటే మాటలు కాదు. ఒక వైపు స్మార్ట్ ఫోన్‌తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతకుమించి సమస్యలూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఫోన్ పెను ప్రభావం చూపుతోంది. జీవనశైలే మారిపోయింది ప్రస్తుతం 99 శాతం మంది చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఈ ఫోన్ల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 1995 తర్వాత పుట్టిన పిల్లలు తమ కౌమారమంతా స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్న మొదటి తరమని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్లు వచ్చాక మనిషి జీవన శైలే మారియిందని పేర్కొంటున్నాయి. 1995 తర్వాత పుట్టిన పిల్లలు ఎక్కువ సమయం ఆన్లైన్లోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు. కబుర్లు, సరదాలు, ఆట పాటలూ అన్నీ అందులోనే. పుస్తకాలు చదవడం, నిద్రపోవడం, స్నేహితులతో గడపడం, శారీరక ఆటలకు కేటాయిస్తున్న సమయం చాలా తక్కువ. ఈ జీవన శైలి వలన పిల్లల పెరుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందని వైద్యులూ హెచ్చరిస్తున్నారు. ముందు తరాలవారితో పోల్చుకుంటే జీవన నైపుణ్యాల్లో ఇప్పటి పిల్లలు వెనకబడిపోతున్నారని నిపుణులు చెప్తున్నారు. వీటికి అదనంగా ఒంటరితనంతోపాటు ఇతర మానసిక సమస్యలూ ఎక్కువవుతున్నాయని అధ్యయనాలు తేల్చాయి. స్మార్ట్ ఫోన్లు పిల్లలు, టీనేజర్ల మెదళ్లపై తీవ్ర ప్రభావం చూపి సృజనాత్మకతను చంపేస్తున్నాయని ఇప్పటికే ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. అమెరికా సైకాలజీ ప్రొఫెసర్ జీన్ అధ్యయనమూ ఇదే విషయాన్ని మరింత విడమరిచి చెప్పింది. టీనేజర్లు తీవ్ర నిరాశలోకి.. టీనేజర్ల ఆరోగ్యం, ప్రవనర్తన తాలూకు అంశాలపై అమెరికాలోని శాండియాగో స్టేట్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్, ఐజెన్ కన్సెల్టింగ్ వైద్యురాలు జీన్ త్వెంగే అధ్యయనం చేశారు. ఆమె తన బృందంతో కలిసి 13 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పది లక్షలకుపైగా పిల్లపై పరిశోధనలు చేశారు. టీనేజర్లు తమ సమయాన్ని ఎలా గడుపుతన్నారనేది మానసిక ఆరోగ్య కోణంలో ఓ ప్రాథమిక అంశమని ఆమె పేర్కొన్నారు. ఆమె 2011 నుంచి ఒంటరితనంతో బాధపడే టీనేజర్లు బాగా పెరగడం గుర్తించినట్టు చెప్పారు. జీవితం వృథా అనే భావనకు చాలామంది వస్తున్నట్టు తేలిందని పేర్కొన్నారు. ఇవన్నీ డిప్రెషన్ లక్షణాలని, ఐదేళ్లలో ఈ వ్యాధి లక్షణాలు 60 శాతం మేర పెరిగాయని వివరించారు. తమను తాము గాయపరుచుకునేంతగా అవి విజృంభిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బాలికల్లో ఈ ప్రమాదకర ధరోణి రెండు మూడింతలు పెరిగిందని పేర్కొన్నారు. కొన్నేళ్లలోనే టీనేజర్ల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని జీన్ తన అధ్యయనంలో వివరించారు. ఫోన్ వ్యసనంలా.. మన దేశంలోని కాలేజీ విద్యార్థులు రోజుకు 150 సార్లుకుపైగా తమ ఫోన్లు చెక్ చేసుకుంటున్నారట. ఫోన్ చూసుకోకపోతే ఏదో మిస్ అయిపోతామనే భావనలో ఉంటున్నారట. ఇదొక వ్యసనంలా మారిందని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడేం చేయాలి? ► రోజుకు రెండు గంటలు లేదా అంతకంటే తక్కువ సమయం డిజిటల్ మీడియాకు కేటాయించడం మంచిది. ఇది మానసిక ఆరోగ్యానికి ఆనందానికి దోహదపడుతుంది. ► అయితే డిజిటల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది కూడా విచారానికి కారణమవుతుంది. ► మన సమయం మన చేతిలోనే ఉంటుంది. ఉండాలి. ఈ విషయాన్ని తల్లిదండ్రులు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ► స్నేహితులతో టచ్‌లో ఉండేందుకు మాత్రమే సోషల్ మీడియాను వాడాలి. ఒకవేళ పిల్లలకు ఫోన్ చాలా అవసరమని భావిస్తే ఇంటర్నెట్ సౌకర్యం లేని ఫోన్ మాత్రమే ఇవ్వాలి. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మన పిల్లలను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. చిన్నపిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదు చిన్న పిల్లలకు స్మార్ట్ఫోన్లు ఇవ్వకూడదు. అది వారికి అలవాటు చేయడం వల్ల వారి పెరుగుదలతోపాటు మెదడుపై ప్రభావం చూపుతోంది. మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. పెద్దలు కూడా అవసరానికి మించి స్మార్ట్ఫోన్లు వాడకూడదు. దీనివల్ల మతిమరుపు నిద్రలేమి సమస్యలకు లోనవుతారు. మీపిల్లల ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చినట్లు అనుమానం ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. -
ఆన్లైన్లో ‘అగ్రి’ సెన్సెస్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: రైతుల జీవన స్థితిగతులు..సాగు కమతాల స్వరూప స్వభావాన్ని తేల్చే వ్యవసాయగణన (అగ్రికల్చర్ సెన్సెస్) ఇటీవల దేశవ్యాప్తంగా మొదలైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. భూకమతాల వారీగా రెవెన్యూ గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు. మొత్తం పది అంశాలపై మూడు దశల్లో వివరాలు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా కాగిత రహితంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్‌లు వినియోగించి ప్రత్యేక యాప్ ద్వారా డిజిటల్ విధానంలో ఏఈఓలు సర్వే చేస్తుండగా, మిగతా రాష్ట్రాల్లో మాన్యువల్‌గానే చేపడుతున్నారు. 2021–22 ప్రామాణికంగా 11వసారి దేశంలో వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు అభివృద్ధి ప్రణాళిక, సామాజిక ఆర్థిక విధాన రూపకల్పనకు కేంద్రం ఐదేళ్లకు ఒకసారి వ్యవసాయ గణన నిర్వహిస్తోంది. 1979లో వ్యవసాయగణన మొదలుకాగా, చివరగా పదోసారి 2015–16లో చేపట్టారు. 11వ వ్యవసాయ గణన 2021–22లో జరగాల్సి ఉండగా, కరోనా తదితర కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. 2021–22 ప్రామాణిక సంవత్సరంగా ఈ నెల నుంచి వ్యవసాయానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం కొద్దిరోజుల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. మూడు దశల్లో... వానాకాలం, యాసంగిలో ఆయా రైతుల వారీగా ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారో తెలుసుకునేందుకు రాష్ట్రంలో ఏటా వ్యవసాయశాఖ సర్వే చేస్తోంది. అయితే కేంద్రం మార్గదర్శకాల ప్రకారం మూడు విడతల్లో వ్యవసాయ గణన చేపట్టారు. ♦ మొదటి విడతలో రైతు పేరు, సామాజికస్థితి, సాగు విస్తీర్ణం, భూమి వినియోగం, పురుషులు, మహిళలు ఇలా అన్ని సేకరించి రెవెన్యూ గ్రామం వారీగా నమోదు చేస్తున్నారు. ♦ రెండో విడతలో ఎంపిక చేసిన 20 శాతం గ్రామాల్లో ప్రణాళిక శాఖ నిర్దేశించిన టీఆర్ఏఎస్ (ట్రైమ్ లీ రిపోర్టెడ్ అగ్రి స్టాటిస్టిక్స్)తో పాటు అదనంగా మరికొంత సమాచారం సేకరిస్తారు. ♦ మూడో దశలో ఏడు శాతం గ్రామాల్లో సాగు ఖర్చులు, యంత్రాల వినియోగం, ఎరువులు, విత్తనాలు, ప్రభుత్వ రాయితీలు తదితర వివరాలు సేకరిస్తారు. సాంకేతికతతో సర్వే... తాజాగా రాష్ట్రంలో చేపట్టిన వ్యవసాయ గణనలో అధికారులు వందశాతం సాంకేతికతను సది్వనియోగం చేసుకుంటున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌ల ద్వారా డిజిటల్ విధానంలో వ్యవసాయ కమతాలు, రైతుల వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే రైతుబంధు పథకానికి రైతుల నుంచి ఆధార్ కార్డులు, వ్యవసాయ భూముల విస్తీర్ణం, పంటల సాగు తదితర వివరాలు ఆన్లైన్లో పొందుపరచగా, వాటి ఆధారంగా వ్యవసాయగణనలో అదనపు సమాచారం తీసుకుంటున్నారు. ప్రణాళికకు వ్యవసాయ గణన కీలకం వ్యవసాయ స్థితిగతులు తెలుసుకోవడంతో పాటు ఆర్థిక విధాన రూపకల్పనకు వ్యవసాయ గణన ఎంతో ఉపయోగకరం. నిరీ్ణత లక్ష్యం మేరకు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లావ్యాప్తంగా వ్యవసాయశాఖ, ప్రణాళిక శాఖ అధికారులు, సిబ్బంది సర్వే నిర్వహిస్తున్నారు. – దశరథ్, మహబూబ్‌నగర్ జిల్లా ప్రణాళికశాఖ అధికారి ఈ నెల 31లోగా పూర్తి చేస్తాం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో వ్యవసాయ గణన చేయిస్తున్నాం. దీని వల్ల బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న పథకాలకు అనుగుణంగా ఈ పంటల వివరాల లెక్కల సేకరణ జరుగుతోంది. ఈ నెలాఖరులోపు సర్వే పూర్తి చేస్తాం. – బి.వెంకటేష్, మహబూబ్‌నగర్ జిల్లా వ్యవసాయ అధికారి -
మనవాళ్లు వారానికి 22గంటలు సోషల్ మీడియాలోనే.. ఆశ్చర్యపరుస్తున్న నిజాలు!
ఇండియా టెక్నాలజీ రంగంలో పరుగులు పెడుతున్న తరుణంలో భారతీయులు సగటున ప్రతి రోజు 194 నిముషాలు.. అంటే మూడు గంటల కంటే ఎక్కువ సమయం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గడుపుతున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, సగటున భారతీయులు 46 నిమిషాలు ఆన్లైన్ గేమ్‌లలోనూ, ఓవర్-ది-టాప్ (OTT) ప్లాట్‌ఫామ్‌లపై 44 నిమిషాలు ఇలా సమయం గడుపుతున్నట్లు తెలిసింది. ఈ డేటా 2.06 మిలియన్ల వినియోగదారుల నుంచి యాప్‌లోని డేటా ఆధారంగా విడుదల చేయడం జరిగింది. మొత్తం 100 శాతం సోషల్ మీడియా వినియోగం స్మార్ట్ఫోన్లు లేదా టాబ్లెట్ల ద్వారా జరిగినట్లు స్పష్టమైంది. OTT కంటెంట్ కోసం 68 శాతం మంది స్మార్ట్ఫోన్లు/టాబ్లెట్లను, 4 శాతం మంది ల్యాప్‌టాప్‌లు, పర్సనల్ కంప్యూటర్లను ఉపయోగించారు. ఇక 28 శాతం మంది టీవీ లేదా హోమ్ థియేటర్లను ఉపయోగించారు. ఇదీ చదవండి: వారికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి - అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా! ఇలా చేస్తే తగ్గే అవకాశం.. ఇంటర్నెట్లో సర్ఫింగ్ ఖర్చు విషయానికి వస్తే, సోషల్ మీడియా వినియోగదారులకు చాలా వరకు ఉచితం అని నివేదిక పేర్కొంది. కానీ వారు OTT కంటెంట్‌పై నెలకు రూ. 201 నుంచి రూ. 400, అదే విధంగా ఆన్లైన్ గేమింగ్‌పై నెలకు రూ. 100 కంటే తక్కువ చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఈ ప్లాట్‌ఫామ్ ధరలను 30 శాతం పెంచినట్లయితే.. 71 శాతం మంది గేమర్లు, 17 శాతం OTT ప్రేక్షకులు సమయాన్ని తగ్గించే అవకాశం ఉందని పరిశోధనలు వెల్లడించాయి. -
Best Camera Phones: ప్రపంచంలోని టాప్ 10 ఉత్తమ కెమెరా మొబైల్ ఫోన్స్
-
అత్యంత తేలికైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
‘స్కూళ్లలో స్మార్ట్ఫోన్లు నిషేధించండి!’
ప్యారిస్: ప్రపంచవ్యాప్తంగా.. పాఠశాలల్లో, పాఠశాల దశలో విద్యార్థులు స్మార్ట్ఫోన్లు వినియోగించడంపై నిషేధించాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి విభాగం యునెస్కో అభిప్రాయపడింది. ఈ మేరకు ఒక సమగ్ర నివేదికను రూపొందించింది. ఫోన్ ఎక్కువగా వాడడం వల్ల చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. అధిక స్థాయి స్క్రీన్ సమయం పిల్లల భావోద్వేగాలపై ప్రభావం పడుతోందని.. వీటికి శాస్త్రీయంగానూ రుజువులు ఉన్నాయని విషయాన్ని సైతం తన నివేదికలో యునెస్కో పొందుపరిచింది. ‘‘డిజిటల్ విప్లవం శక్తివంతమైందే కావొచ్చు. కానీ, ముఖాముఖి బోధన అనేది పిల్లలకు చాలా అవసరం. ఆ అవసరాన్ని స్మార్ట్‌ఫోన్.. డిజిటల్ టెక్నాలజీ.. చివరకు ఏఐ సాంకేతికత ఎప్పటికీ భర్తీ చేయలేవని ప్రభుత్వాలు కూడా గుర్తించాలి అని యునెస్కో సూచించింది. కరోనా టైంలో కోట్ల మంది డిజిటల్ ఎడ్యుకేషన్‌కి పరిమితం అయ్యారని తెలిసిందే. కానీ, అదే సమయంలో ఇంటర్నెట్కు దూరంగా ఉన్న లక్షల మంది పేద పిల్లలు పూర్తిగా చదువుకు దూరమయ్యారని యునెస్కో గుర్తు చేస్తోంది. అలాగే.. ఇప్పటికీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కొనసాగించడాన్ని యునెస్కో తీవ్రంగా తప్పుబట్టింది. విద్యాసంస్థల్లో సాంకేతికత వినియోగంపై చైనాను చూసి నేర్చుకోవాలని ప్రపంచానికి యునెస్కో సూచించింది. డిజిటల్ పరికరాలను బోధనా సాధనాలుగా ఉపయోగించడానికి చైనా సరిహద్దులను నిర్దేశించింది. మొత్తం బోధనా సమయంలో 30%కి పరిమితం చేసిందిని తెలిపింది. కరోనా టైంలో మాత్రమే చైనా ఆన్లైన్ విద్యను ప్రొత్సహించిందని.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాక తిరిగి విద్యాసంస్థలకే రప్పించుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా యునెస్కో ప్రత్యేకంగా ప్రస్తావించింది. -
బరువైన ఫోన్లతో విసిగిపోయారా? ఈ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్లు ట్రై చేయండి..
స్మార్ట్ఫోన్లు మన దైనందిన జీవితంలో ముఖ్యమైన భాగంగా మారాయి. కస్టమర్లు తమ బడ్జెట్‌కు అనుగుణంగా ప్రీమియం, మిడ్-రేంజ్ లేదా లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. హార్డ్‌వేర్, ప్రీమియం గ్లాస్, అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ సామర్థ్యాలను మెరుగుపరచడంతో ఈ రోజుల్లో ఫోన్లు చాలా బరువుగా మారాయి. ప్రీమియమ్ బిల్డ్, పెద్ద బ్యాటరీలు ఉండటం మంచిదే అయినప్పటికీ కొంతమంది ఫోన్లు తేలికగా ఉండాలని కోరుకుంటారు. అటువంటి వారి కోసం మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని తేలికపాటి ఫోన్ల గురించి సమాచారం ఇక్కడ అందిస్తున్నాం. రియల్ మీ నార్జో ఎన్ 53 (Realme Narzo N53) బరువు 182 గ్రాములు. 6.74 అంగుళాల HD+ IPS LCD డిస్ప్లే ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ Unisoc T612 SoC ప్రాసెసర్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్, 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్, 12GB వరకు డైనమిక్ ర్యామ్ సపోర్ట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ LED ఫ్లాష్‌తో కూడిన 50MP ప్రైమరీ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా 4GB + 64GB వెర్షన్ ధర రూ. 8,999, 6GB + 128GB మోడల్ ధర రూ. 10,999. మోటో జీ13 (Moto G13) బరువు 184.25 గ్రా 6.5-అంగుళాల IPS LCD డిస్ప్లే MediaTek Helio G85 ప్రాసెసర్ 4GB LPDDR4X ర్యామ్ 64GB/128GB స్టోరేజీ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ 50MP ప్రైమరీ కెమెరా, 2MP డ్యూయల్ లెన్స్‌లు, 8MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ 4GB + 64GB మోడల్ రేటు రూ. 9,499, 4GB + 128GB వెర్షన్ ధర రూ. 9,999. వివో వై 02 (Vivo Y02) బరువు 186 గ్రాములు. 6.51-అంగుళాల HD+ డిస్ప్లే మీడియాటెక్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3GB ర్యామ్, 32GB స్టోరేజీ, 1TB వరకు విస్తరించవచ్చు Funtouch OS 12తో Android 12 Go ఎడిషన్ 8MP రియర్ కెమెరా 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ 2GB + 32GB మోడల్ ధర రూ. 8,999. రెడ్మీ 10ఎ (Redmi 10A) బరువు 194 గ్రాములు 6.53-అంగుళాల HD+ డిస్ప్లే MediaTek Helio G25 ప్రాసెసర్ 3GB/4GB LPDDR4x ర్యామ్, 32GB/ 64GB eMMC 5.1 స్టోరేజ్. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 13MP ప్రైమరీ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా 10W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ 3GB + 32GB మోడల్ ధర రూ. 8,499, 4GB + 64GB వెర్షన్ ధర రూ. 9,499. -
రియల్మీ నుంచి కొత్త సిరీస్.. ఫీచర్స్ అదుర్స్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్మీ 11 ప్రో సిరీస్ ప్రవేశపెట్టింది. వీటిలో 11 ప్రో ప్లస్ 5జీ, 11 ప్రో 5జీ ఉన్నాయి. ధర రూ.23,999 నుంచి ప్రారంభం. 8, 12 జీబీ వేరియంట్లలో లభిస్తుంది. 120 హెట్జ్ కర్వ్డ్ విజన్ డిస్ప్లే ఏర్పాటు ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 4గీ లాస్‌లెస్ జూమ్ 200 ఎంపీ కెమెరా, 100 వాట్స్ సూపర్‌వూక్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 11 ప్రో ప్లస్ 5జీ వేరియంట్ తయారైంది. 100 ఎంపీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ప్రోలైట్ కెమెరా, 67 వాట్ సూపర్‌వూక్ చార్జ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో 11 ప్రో 5జీ రూపుదిద్దుకుంది. ఇదీ చదవండి: శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ: లాంచింగ్ ఆఫర్ ముగుస్తోంది! -
ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు.. తాజాగా హైదరాబాద్‌లో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ శామ్సంగ్ ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఇనార్బిట్ మాల్లో 3,500 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణంలో ఇది నెలకొంది. ఇప్పటికే కంపెనీకి ఢిల్లీ, బెంగళూరులో ఇటువంటివి ఒక్కో కేంద్రం ఉంది. దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్‌కల్లా మొత్తం 15 ప్రీమియం ఎక్స్‌పీరియెన్స్ స్టోర్లను నెలకొల్పాలన్నది కంపెనీ లక్ష్యం. ఈ ఔట్లెట్లలో స్మార్ట్‌థింగ్స్, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, ఆడియో, గేమింగ్, లైఫ్‌స్టైల్ టెలివిజన్స్ ప్రదర్శిస్తారు. -
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి! కోరుతున్న సాక్షాత్తు కంపెనీ సీఈవో..
పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వొద్దని పలువురు నిపుణులు, వైద్యులు చెప్పడం విన్నాం. కానీ సాక్షాత్తు ఓ స్మార్ట్ ఫోన్ కంపెనీ మాజీ సీఈవోనే తల్లిదండ్రులను పిల్లలకు పోన్లు ఇవ్వొద్దని కోరుతున్నారు. చిన్న వయసులోనే స్మార్ట్ఫోన్లు ఇస్తే అది వారి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. అందువల్ల స్మార్ట్ ఫోన్ల విషయలో తల్లిదండ్రులను జాగ్రత్త వహించమని సూచిస్తున్నారు ప్రముఖ షియోమీ ఇండియా కంపెనీ మాజీ సీఈవో కుమార్ జైన్. స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు పిల్లల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపుతాయో వివరించారు. ఈ మేరకు ఆయన దీనికి సంబంధించి.. యూఎస్‌కు చెందిన ప్రముఖ లాభప్రేక్షలేని సంస్థ సపియన్ ల్యాబ్ అధ్యయనం చేసిందని చెప్పారు. ఆ ల్యాబ్ నుంచి ఒక స్నేహితుడు అందుకు సంబంధించిన విషయాలను తనతో షేర్ చేసుకున్నట్లు లింక్డ్ఇన్లో వెల్లడించారు. ఆ నివేదికలో.. చిన్నప్పుడే స్మార్ట్ఫోన్లకు అలవాటు పడే చిన్నారులు పెద్దయ్యాక మానసిక ఆరోగ్య రుగ్మతలతో బాధపడే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలిపారు. ఆ అధ్యయన ప్రకారం పదేళ్ల వయసులో స్మార్ట్ఫోన్లకు అలవాటు పడితే పెద్దయ్యాకు మహళలైతే 60%-70% మంది దాక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారని, అదే పురుషులైతే 45%-50% మంది దాక ఈ సమస్యలను ఎదుర్కొన్నట్లు నివేదిక వెల్లడించిందని కుమార్ జైన్ వెల్లడించారు. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రులపై ఉంది కావున దయచేసి వారిని వేరే యాక్టివిటీస్‌లో నిమగ్నమయ్యేలా చూడండని తల్లిదండ్రులకు విజ్ఞిప్తి చేశారు. అది ఏదైనా అభ్యాసం లేదా వారి అభిరుచికి సంబంధించిన వాటిల్లో ప్రోత్సహిస్తే గనుక మనం వారికి ఆరోగ్యకరమైన సమతుల్య వాతావరణాన్ని అందించగలిగిన వారమవుతాం అని చెప్పారు. చిన్న వయసులోనే ఎక్కువ సమయం స్క్రీన్‌పై గడిపితే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఏర్పడి పలు దుష్ప్రరిణామాలకు దారితీసే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. బాల్యం చాల విలువైనదని, ఆ సమయాన్ని వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదపడే అంశాల్లో కేంద్రీకరించేలా చేసి వారి భవిష్యత్తుకు మంచి పునాదిని ఏర్పరుచుకనేలా ప్రోత్సహించాల్సిన భాద్యత మనమిదే ఉందని చెప్పారు. అదేసమయంలో తాను స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లకి వ్యతిరేకిని కాదని, ఐతే చిన్న పిల్లలను మాత్రం స్మార్ట్ ఫోన్లకు సాధ్యమైనంత దూరంగా ఉంచేలా జాగ్రత్త వహించాలని తల్లిదండ్రులని కోరుతున్నట్లు లింక్డ్ఇన్లో చెప్పుకొచ్చారు. (చదవండి: ఓ తండ్రి దుశ్చర్య.. పొరపాటున తన కూతుర్ని ఢీ కొట్టాడని ఆ బుడ్డోడిని..)