పదకొండు వేలకే రెడ్‌మీ 9 పవర్ | Redmi 9 Power Launched in India With Big Battery | Sakshi
Sakshi News home page

పదకొండు వేలకే రెడ్‌మీ 9 పవర్.. ఫీచర్లు అదుర్స్!

Published Thu, Dec 17 2020 3:45 PM | Last Updated on Thu, Dec 17 2020 4:01 PM

Redmi 9 Power Launched in India With Big Battery - Sakshi

న్యూఢిల్లీ: షియోమీ సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా రెడ్‌మీ 9 పవర్‌ను భారత్‌లో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ క్వాడ్ రియర్ కెమెరా సెటప్, వాటర్‌డ్రాప్ డిస్ప్లే నాచ్‌తో వస్తుంది. రెడ్‌మి 9 పవర్లో‌ తాజా ఎంఐయుఐ 12 ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఉంది. ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్, స్టీరియో స్పీకర్లు, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. చైనాలో విడుదల చేసిన రెడ్‌మి నోట్ 9 4జీ రీబ్రాండ్ గా రెడ్‌మీ 9 పవర్ మొబైల్ తీసుకొచ్చారు. శామ్‌సంగ్ గెలాక్సీ ఎం11, వివో వై 20, ఒప్పో ఎ53లకు పోటీగా దీనిని తీసుకొచ్చింది.(చదవండి: ఒప్పో నుంచి మరో బడ్జెట్ మొబైల్)

రెడ్‌మీ 9 పవర్ ఫీచర్స్
డ్యూయల్ సిమ్ (నానో) రెడ్‌మీ 9 పవర్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12పై నడుస్తుంది. ఇందులో 6.53-అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ (1,080x2,340) పిక్సెల్‌ వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ డిస్ప్లే ఉంది. ఇది 19.5 : 9 రేషియో, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో లభిస్తుంది. ఈ ఫోన్‌ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్ కలిగి ఉంది, ఇది అడ్రినో 610 జీపీయు, 4జీబీ ఎల్ పీఢీడీఆర్4ఎక్స్ ర్యామ్ తో జత చేయబడింది. రెడ్‌మి 9 పవర్ లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ సెకండరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం రెడ్‌మి 9 పవర్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.ఈ కెమెరా సెన్సార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫేస్ అన్‌లాక్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. 

రెడ్‌మీ 9 పవర్ లో 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో ఎస్ డీ కార్డ్ ద్వారా 512జీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. కనెక్టివిటీ విషయానికి వస్తే 4జీ ఓఎల్టీఈ, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్ వి 5.0, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఇన్‌ఫ్రారెడ్ (ఐఆర్) బ్లాస్టర్, యుఎస్‌బి టైప్-సి మరియు 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫోన్ హై-రెస్ ఆడియో సర్టిఫికేట్ పొందిన స్టీరియో స్పీకర్లతో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్‌ఫ్లిక్స్ సహా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా హెచ్ డీ వెబ్ స్ట్రీమింగ్‌కు సపోర్ట్ కోసం వైడ్‌విన్ ఎల్ 1 ధృవీకరణ కూడా పొందింది. షియోమీ రెడ్‌మి 9 పవర్‌పై సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించింది. ఫోన్‌లో యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్, మాగ్నెటోమీటర్ మరియు సామీప్య సెన్సార్ కూడా ఉన్నాయి. ఫోన్ లో 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. దీని బరువు 198 గ్రాముల.

రెడ్‌మీ 9 పవర్ ధర
భారతదేశంలో రెడ్‌మీ 9 పవర్ ధర రూ.4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు 10,999 ఉండగా, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ధర రూ.11,999గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు రంగులలో లభిస్తుంది. అవి బ్లేజింగ్ బ్లూ, ఎలక్ట్రిక్ గ్రీన్, ఫైరీ రెడ్, మైటీ బ్లాక్. అమెజాన్, ఎంఐ.కాంల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన మొదటి సేల్ డిసెంబర్ 22వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. త్వరలో ఆఫ్ లైన్‌లో కూడా దీని సేల్ జరగనుంది.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement