
రెడ్ మీ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ అందించింది. రెడ్ మీ 10 సీరీస్ త్వరలో మనదేశం లాంచ్ చేయనున్నట్లు తెలుస్తుంది. షియోమీ దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. రెడ్ మీ 9, రెడ్ మీ 9 ప్రైమ్, రెడ్ మీ 9 పవర్, రెడ్ మీ 9ఎ, రెడ్ మీ 9ఐ లకు వారసుడిగా రెడ్ మీ 10 సీరీస్ లను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. చైనా కంపెనీ నేరుగా రెడ్ మీ 10 సీరీస్ ను ప్రారంభిస్తున్నట్లు చెప్పనప్పటికి వచ్చే నెల ప్రారంభంలో సిరీస్ ను ఆవిష్కరించవచ్చని ట్వీట్ లో సూచించింది.
రెడ్ మీ ఇండియా ట్విట్టర్ లో "రెడ్ మీ రివల్యూషన్" అనే చిన్న క్లిప్ ను "#10on10" అనే హ్యాష్ ట్యాగ్ తో పంచుకుంది. రెడ్ మీ 10 సీరీస్ ను జూలై ప్రారంభంలో లాంచ్ చేయవచ్చు అని ఇది సూచిస్తుంది. ఈ సిరీస్ పై ఈ ట్వీట్ తప్ప ఇంకా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. రెడ్ మీ 9 సీరీస్ లో రెడ్ మీ 9 ప్రైమ్ మొబైల్ ను గత ఏడాది ఆగస్టు మొదటి వారంలో భారతదేశంలో తొలిసారిగా లాంఛ్ చేసింది. ఇలా వరుసగా ఒక్కో మొబైల్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
Brace yourselves for the #RedmiRevolution! 💫
— Redmi India - #RedmiNote10 Series (@RedmiIndia) June 28, 2021
Hitting your screens soon! ☄️
Watch this space for more #10on10 action. 🎥 pic.twitter.com/uFY6ri5SU2