షియోమీ రెడ్‌మీ 9 పవర్ మొబైల్ ని డిసెంబర్ 17 తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల చైనాలో విడుదల చేసిన రెడ్‌మి నోట్ 9 4జీకి రీబ్రాండెడ్ వెర్షన్‌గా దీనిని తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ కి సంబంధించి కొన్ని లీకైన ఫీచర్స్ నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. రెడ్‌మీ 9 పవర్ గూగుల్ ప్లే సపోర్టెడ్ డివైజెస్ పేజీలో మోడల్ నంబర్ M2010J19SIతో వచ్చింది. రెడ్‌మి 9 పవర్ మొబైల్ లో క్వాడ్ రియర్ కెమెరాను తీసుకొస్తున్నట్లు సమాచారం. రెడ్‌మి 9 పవర్‌లో రాబోయే నాల్గవ కెమెరా మెగాపిక్సెల్ గురుంచి ఇంకా సమాచారం లేదు. రెడ్‌మి నోట్ 9 4జీలో మాదిరిగానే రెడ్‌మీ 9 పవర్ ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఇప్పటికే ఉన్న మోడల్ ను స్వల్ప మార్పుల చేసి రీబ్రాండెడ్ ఫోన్‌లను తీసుకురావడం షియోమికి ఇది కొత్త కాదు. ఇటీవల ఇండియాలో విడుదలైన రెడ్‌మీ 9కి రీబ్రాండెడ్ గా రెడ్‌మీ 9సినీ తీసుకొచ్చింది. దీంట్లో 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటోంది.(చదవండి: అమెజాన్ లో మరో సేల్)
Comments
Please login to add a commentAdd a comment