Mobile
-
‘నువ్వు చచ్చినా పర్వాలేదు’.. కొడుకుని కొట్టి చంపిన తండ్రి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో అమానుషం వెలుగుచూసింది. కొడుకు ఫోన్ వాడటానికి బాని, చదవును నిర్లక్ష్యం చేస్తున్నాడనే కోపంతో.. క్రికెట్ బ్యాట్‌తో కొట్టి చంపిన ఘోర ఘటన శనివారం జరిగింది. కన్న కొడుకును దారుణంగా హత్య చేయడమే కాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నించాడు నిందితుడైన తండ్రి.వివరాలు.. వృత్తిరీత్యా వడ్రంగి అయిన రవికుమార్ తన కుటుంబంతో కలిసి బెంగళూరులోని కుమారస్వామి లేఅవుట్ ప్రాంతంలో నివిసిస్తున్నాడు. 14 ఏళ్ల కుమారుడు తేజస్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయితే ఇటీవల మొబైల్ వాడకం ఎక్కువై చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడు. స్నేహితులతోనూ చెడు సావాసం చేస్తుండటం తండ్రికి నచ్చలేదు. దీంతో ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి. అంతేగాక ఇటీవల ఆ ఫోన్ పనిచేయకపోవంతో దానిని రిపేర్ చేయించాడు తేజస్.. ఈ విషయం తెలుసుకున్న తండ్రి.. కొడుకుతో గొడవకు దిగాడు.. ఇది కాస్తాపెరిగి పెద్దది కావడంతో క్రికెట్ బ్యాట్ పట్టుకొని తేజస్‌ను కొట్టాడు. అక్కడితో ఆగకుండా గొడకేసి బాది ‘నువ్వు బతికినా, చచ్చినా నాకు పర్వలేదు’ అంటూ చితకబాదాడు. దీంతో విద్యార్ధి నొప్పి భరించలేక నేలపై పడిపోయాడు.ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన పరిస్థితి విషమంగా మారింది. అయితే శ్వాస ఆగిపోయిన తర్వాతే ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు విచారణలో తేలింది. అక్కడికి చేరుకునేలోపే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. అయితే పాఠశాల విద్యార్థి అనుమానాస్పద మృతిపై పోలీసులకు సమాచారం అందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు రవికుమార్ ఇంటికి చేరుకోగా.. అప్పటికే కొడుకు అత్యంతక్రియలకు కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. వెంటనే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.ఇక బాలుడి తలపై తీవ్రమైన అంతర్గత గాయాలు, అతని శరీరంపై కూడా గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో వెల్లడైంది. అయితే బాలుడి మృతదేహానికి ఉన్న రక్తపు మరకలను తొలగించి, బ్యాట్‌ను దాచిపెట్టి హత్యను దాచిపెట్టేందుకు నిందితుడు ప్రయత్నించాడని, వెంటనే అంత్యక్రియలకు సన్నాహాలు ప్రారంభించాడని పోలీసులు పేర్కొన్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసి కేసును సాధారణ మరణంగా మార్చే ప్రయత్నమిదని తెలిపారు. మొబైల్ ఫోన్ ఎక్కువ వాడటంపై పిల్లవాడికి, తండ్రికి వాగ్వాదం జరుగుతోందని, అదే అతడి హత్యకు దారితీసినట్లు డీసీపీ లోకేష్ బీ పేర్కొన్నారు. తండ్రిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఈ స్మార్ట్ ఫోన్ల బ్యాటరీ కెపాసిటీ అదుర్స్! (ఫొటోలు)
-
Maharashtra: ‘హాట్ స్పాట్’ వివాదం.. బ్యాంక్ మేనేజర్ హత్య
పూణె: మహారాష్ట్రలోని పూణెలో దారుణ హత్య చోటుచేసుకుంది. మొబైల్ హాట్ స్పాట్ ఇచ్చే విషయంలో వివాదం చోటుచేసుకుని అది బ్యాంక్ మేనేజర్ హత్యకు దారితీసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు కావడం విశేషం.మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తున్న వాసుదేవ్ రామచంద్ర కులకర్ణి(47)ని నలుగురు కుర్రాళ్లు హత్య చేశారు. కులకర్ణి తన ఇంటి దగ్గర వాకింగ్‌కు వెళుతున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న నలుగురు యువకులు కులకర్ణిని మొబైల్ హాట్‌స్పాట్ ఆన్ చేయాలని అడిగారు. ఆయన అభ్యంతరం చెప్పిన నేపధ్యంలో వారి మధ్య వివాదం నెలకొంది. ఆగ్రహంతో ఆ యువకులు బ్యాంక్ మేనేజర్‌పై దాడిచేసి హత్య చేశారు. ఈ ఉందంతంలో నిందితులును పోలీసులు అరెస్టు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మార్కెట్లోని కొన్ని కొత్త మొబైళ్లు
మార్కెట్లోకి నిత్యం కొత్త మొబైళ్లు వస్తున్నాయి. టెక్నాలజీ, కెమెరా, ఓఎస్‌లో అడ్వాన్స్డ్ ఫీచర్లు..వంటి చాలా విభాగాల్లో మార్పులు తీసుకొస్తున్నారు. దాంతో వినియోగదారులు ఇప్పటికే మొబైల్ వాడుతున్నా కొత్తవాటిపై ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లోని కొన్ని కొత్త మొబైళ్ల వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.గూగుల్ పిక్సెల్ 9డిస్ప్లే: 6.30 అంగుళాలు రిఫ్రెష్ రేట్: 120 హెచ్జడ్రిజల్యూషన్: 1080*2424 పిక్సెల్స్∙ ఓఎస్: ఆండ్రాయిడ్ 14మెమోరీ: 128జీబీ 12జీబీ ర్యామ్, 256జీబీ 12జీబీ ర్యామ్ వేరియంట్లు.బరువు: 198 గ్రా. బ్యాటరీ: 4700 ఎంఏహెచ్వివో వి 40డిస్ప్లే: 6.78 అంగుళాలు ఫ్రంట్ కెమెరా: 50 ఎంపీరిజల్యూషన్: 2800*1260 పిక్సెల్స్ రిఫ్రెష్ రేట్: 120 హెచ్జడ్ర్యామ్: 8జీబీ, 12 జీబీ స్టోరేజ్: 256జీబీ, 512జీబీ బ్యాటరీ: 5500 ఎంఏహెచ్ బరువు: 192 గ్రా.పోకో ప్యాడ్ 5జీడిస్ప్లే సైజ్: 12.1 అంగుళాలువోఎస్: ఆండ్రాయిడ్ 14రిజల్యూషన్: 1600*2560 పిక్సెల్స్బరువు: 568 గ్రా. ఇంటర్నల్ మెమొరీ: 128జీబీ 8జీబీ ర్యామ్/ 256జీబీ 8జీబీ ర్యామ్; బ్యాటరీ: 10000 ఎంఏహెచ్ కలర్స్: డార్క్ గ్రే, బ్లూ -
రూ.15 వేలలోపు కొన్ని పాపులర్ 5జీ ఫోన్లు (ఫొటోలు)
-
స్మార్ట్‌ఫోన్ మార్కెట్ జోరు
దేశీయంగా స్మార్ట్ఫోన్ల మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండో త్రైమాసికంలో 3.2 శాతం వృద్ధి చెందింది. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) నివేదిక ప్రకారం 3.9 కోట్ల స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ (రిటైలర్లకు తయారీ సంస్థలు సరఫరా చేసే ఫోన్ల సంఖ్య) నమోదైంది. ఇందులో 16.5 శాతం మార్కెట్ వాటాతో చైనా కంపెనీ వివో అగ్రస్థానంలో ఉండగా, 13.5 శాతం వాటాతో అదే దేశానికి చెందిన షావోమి రెండో స్థానంలో నిలిచింది. కొరియన్ సంస్థ శాంసంగ్ అమ్మకాలు 15.4 శాతం క్షీణించడంతో 12.9 శాతం మార్కెట్ వాటాతో మూడో స్థానానికి పరిమితమైంది. మరోవైపు, మార్కెట్ వాటాపరంగా యాపిల్ 6.7 శాతం వాటాతో ఆరో స్థానంలో ఉన్నప్పటికీ సూపర్ ప్రీమియం సెగ్మెంట్లో (రూ.67,000 పైగా రేటు ఉండే ఫోన్లు) మాత్రం 83 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది.నివేదికలోని మరిన్ని విశేషాలు..ఫ్లాగ్షిప్ ఎక్స్ ఫోల్డ్ 3 ప్రోతో పాటు వై సిరీస్, మిడ్–ప్రీమియం వి సిరీస్‌ల్లో వివిధ ధరల శ్రేణిలో ఫోన్లను ఆవిష్కరించిన వివో వరుసగా రెండో త్రైమాసికంలోనూ అగ్రస్థానంలో నిలిచింది.ఎంట్రీ ప్రీమియం సెగ్మెంట్ (రూ.16,000 నుంచి రూ.33,500 వరకు ధర ఉండేవి) వాటా 22 శాతం నుంచి 30 శాతానికి పెరిగింది. ఈ సెగ్మెంట్ మెరుగైన వృద్ధి కనపర్చగలదని అంచనాలు ఉన్నాయి. చౌక 5జీ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరిస్తున్నప్పటికీ 100 డాలర్ల లోపు (సుమారు రూ.8,400) ధర ఉండే ఎంట్రీ లెవెల్ ఫోన్ల అమ్మకాలకు ఈ ఏడాది సవాళ్లు ఎదురుకావచ్చు. జెన్ఏఐ స్మార్ట్ఫోన్లకు ప్రచారం మరింత పెరగవచ్చు.క్యూ2లో 2.7 కోట్ల 5జీ స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ నమోదైంది. 5జీ స్మార్ట్ఫోన్ల షిప్మెంట్ వార్షికంగా 49 శాతం నుంచి 77 శాతానికి పెరిగింది. ఇందులోనూ రూ.8,000 నుంచి రూ.16,700 వరకు ధర ఉండే మాస్ బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ల షిప్మెంట్ 2.5 రెట్లు పెరిగింది. ఇదీ చదవండి: కోరికలు తీర్చే ‘ఫిష్’!ప్రీమియం సెగ్మెంట్లో (రూ.50,000 నుంచి రూ.67,000 వరకు ధర శ్రేణి) యాపిల్ మార్కెట్ వాటా 61 శాతానికి, శాంసంగ్ వాటా 24 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో దేశీయంగా స్మార్ట్ఫోన్ల షిప్మెంట్లు 6.9 కోట్లుగా నమోదయ్యాయి. -
కాలేజీలో చేరగానే మెసేజ్
సాక్షి, హైదరాబాద్ : పైవేట్ కాలేజీల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ఇంటర్‌బోర్డు ఈసారి సరికొత్త విధానం అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థి ఏ కాలేజీలో చేరినా, వెంటనే అతని వ్యక్తిగత మొబైల్‌కు మెసేజ్ వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఉన్నతాధికారులు చర్చించారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ రూపకల్పన చేసేందుకు ప్రయతి్నస్తున్నారు. అయితే కాలేజీలో చేరిన వెంటనే వివరాలు హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ మెసేజ్ పంపే వీలుంది. దీనికి ప్రైవేట్ కాలేజీలు ఇష్టపడే అవకాశం లేదు. కొన్ని నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ కాలేజీలు దీనివల్ల నష్టం జరుగతుందని భావిస్తున్నాయి. ప్రయోజనం ఏమిటి? ఇప్పటి వరకూ ప్రైవేట్ కాలేజీలు విద్యార్థులను ఒక బ్రాంచ్‌లో చేర్చుకొని, వేరొక చోట కూర్చోబెట్టి బోధన చేస్తున్నాయి. ఉదాహరణకు మాదాపూర్ బ్రాంచ్‌లో ఓ విద్యార్థి అడ్మిషన్ తీసుకుంటాడు. కానీ అతని క్లాసులు వనస్థలిపురం బ్రాంచ్‌లో జరగుతాయి. పరీక్ష కేంద్రం సమీపంలో వేయాల్సి ఉంటుంది. కాబట్టి పరీక్షకు దరఖాస్తు చేసే ప్రాంతాన్నే కొలమానంగా తీసుకుంటారు. దీనివల్ల దూరంగా ఉండే ప్రాంతంలో పరీక్ష కేంద్రం ఉంటుంది.అదీగాక అంతర్గత పరీక్ష నిర్వహించి, బాగా మార్కులొచ్చే వారిని వేరు చేసి చదివిస్తున్నారు. మార్కులు తక్కువగా ఉండే వారి పట్ల ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదు. ఈ బ్రాంచ్‌ల్లో నైపుణ్యం లేని అధ్యాపకులను తక్కువ వేతనాలకు నియమిస్తున్నారు. ఈ విధానాన్ని అడ్డుకోవడానికి మెసేజ్ విధానం దోహదపడుతుందని ఓ అధికారి తెలిపారు. తనకు వచ్చే మెసేజ్‌లో అన్ని వివరాలు ఉంటాయి..కాబట్టి వెంటనే అదే కాలేజీలో చదివేలా తల్లిదండ్రులు జాగ్రత్త పడతారని, అన్ని కేటగిరీల విద్యార్థులు ఒకే క్యాంపస్‌లో చదువుకునే వీలుందని అధికారులు భావిస్తున్నారు. సహకారం అందేనా? మెసేజ్ విధానంపై కాలేజీ యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి. అడ్మిషన్ల వివరాలు గడువులోగా ఇంటర్ బోర్డుకు పంపే వీలుందని, కానీ మెసేజ్ సిస్టం తీసుకొస్తే ప్రతీ రోజు వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంటుందని యాజమాన్యాలు అంటున్నాయి. దీనివల్ల క్లరికల్ పని ఎక్కువగా ఉంటుందని, తనిఖీల పేరుతో అధికారులు వేధించే వీలుందని చెబుతున్నారు. ఈ విధానాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. -
మొబైల్ ఫోన్ టార్చ్‌లైట్ వెలుగులో సిజేరియన్: తల్లీ బిడ్డ మృతి
వైద్యుల నిర్లక్ష్యం తల్లీబిడ్డలను బలితీసుకుంది. పురిటి నొప్పులు రావడంతో ప్రసవం కోసం గర్బిణికి చీకట్లో కేవలం మొబైల్ టార్చ్ సాయంతో సిజేరియన్ చేయడంతో ఇద్దరూ చనిపోయిన ఘటన కలకలం రేపింది. దిగ్భ్రాంతికర ఘటన మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే ఖుస్రుద్దీన్ అన్సారీ దివ్యాంగుడు. అతని భార్య షాహిదున్‌కి ఏప్రిల్ 29 సోమవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబసభ్యులు సుష్మా స్వరాజ్ మెటర్నిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. సాధారణ కాన్పు అవుతుందని చెప్పిన వైద్యులు చివరికి సిజేరియన్ చేయాలంటూ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయినా జనరేటర్ ఆన్ చేయకుండా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే సిజేరియన్ చేశారు. దీంతో ఏంజరిగిందో తెలియదు గానీ మొదట శిశువు, ఆ తరువాత తల్లి ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలను పొట్టనబెట్టుకున్నారని కన్నీరు మున్నీరయ్యారు. రెండు రోజుల పాటు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేయడంతో ఎట్టకేలకే దిగి వచ్చిన బీఎంసీ విచారణకు ఆదేశించింది.తన భార్య ఆరోగ్యంగా ఉందనీ,ఎలాంటి సమస్యలు లేవని, మూడు గంటలైనా జనరేటర్ ఆన్ చేయలేదని, సరైన సమయంలో చికిత్స చేయకుండా అన్యాయంగా తల్లీ బిడ్డల్ని పొట్టన బెట్టుకున్నారని బాధితురాలి భర్త అన్సారీ ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అంతేకాదు తన భార్య మరణం తరువాత కూడా వైద్యులు చీకటిలో మరో ప్రసవం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు. కాగా అన్సారీ షాహిదున్‌కు పెళ్లయి ఇంకా ఏడాది కుండా నిండకుండానే తీరని విషాదం చోటు చేసుకుంది. సాధారణ ప్రసవం అవుతుందని చెప్పి ఆరోగ్యంగా ఉన్న తన కోడల్ని చీకట్లోనే ఆపరేషన్ థియేటర్‌కి తీసుకెళ్లి ఫోన్ టార్చ్ సహాయంతో డెలివరీ చేశారని అన్సారీ తల్లి వాపోయింది. బిడ్డ చనిపోయిందని తాము కేకలు వేస్తే.. తల్లి క్షేమంగానే ఉందని, వేరే ఆసుపత్రిలో తీసుకెళ్లిమని చెప్పారు. కానీ అప్పటికే ఆమె చని పోయిందనీ కనీసం ఆక్సిజన్ కూడా అందుబాటులో లేదంటూ ఆమె కనీటి పర్యంతమైంది. -
టెక్ టాక్: సరికొత్త టెక్నాలజీతో ఈ పరికరాలు మీకోసమే..
రోజురోజుకి మారుతున్న కొత్త టెక్నాలజీతో పాటు మానవ అవసరాలలో కూడా మార్పులు జరుగుతున్నాయి. కొత్త పరికరాలు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా అని ఎదురుచూపులు, పడిగాపులు కాచుకునే వారికోసం.. ఇలాంటి సరికొత్త టెక్నాలజీని కూడిన వస్తువులు దూసుకొస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం. షావోమి వాచ్ 2 డిస్ప్లే: 1.43 అంగుళాలు రిజల్యూషన్: 466“466 పిక్సెల్స్ ∙లైట్ వెయిట్ 150 స్పోర్ట్స్ మోడ్స్ బ్యాటరీ: 495 ఎంఏహెచ్ స్లీప్ ట్రాకింగ్ పోకో ఎక్స్ 6 నియో 5జీ డిస్ప్లే: 6.67 అంగుళాలు వోఎస్: ఆండ్రాయిడ్ 13 ర్యామ్: 8జీబి, 12జీబి స్టోరేజ్: 128జీబి, 256జీబి బ్యాటరీ: 5000 ఎంఏహెచ్ బరువు: 175.00 గ్రా. ఇవి చదవండి: ఈ విశేషాల గురించి మీరెప్పుడైనా విన్నారా..! -
ఇద్దరు వ్యక్తుల ప్రైవేటు సంభాషణ మూడో వ్యక్తి ఎలా వింటున్నాడు..!
ఫోన్ ట్యాపింగ్.. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ట్యాపింగ్ మాటున కొందరు అధికారులు సాగించిన దందా.. రోజురోజుకూ వెలుగుచూస్తున్న సంచలన విషయాలు విస్తుగొలుపుతున్నాయి. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాలు.. ఫిర్యాదుల వంటి విషయాలను పక్కనపెడితే.. అసలు ట్యాపింగ్ కథేంటి? దీనిని ఎలా చేస్తారు? ఇద్దరు వ్యక్తులు ప్రైవేటుగా మాట్లాడుకునే మాటలన్నీ మూడో వ్యక్తి ఎలా వినగలుగుతున్నాడు? ఓసారి చూద్దామా? ► ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు టెలిఫోన్ లేదా మొబైల్ ఫోన్ లేదా ఇంటర్నెట్ ద్వారా జరిపే సంభాషణలను వారికి తెలియ కుండా రహస్యంగా వినడం, రికార్డు చేయడాన్నే ట్యాపింగ్ అంటారు. వాస్తవానికి ట్యాపింగ్ చేయడం చట్టవిరు ద్ధం. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ట్యాపింగ్ చేయాల్సి వస్తే.. నిర్దేశిత ప్రభుత్వ ఏజెన్సీలు కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాలి. ప్రైవేటు వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్యాపింగ్ చేయడానికి అనుమతి లేదు. అనుమతి పొందిన ప్రభుత్వ సంస్థలు సైతం ట్యాపింగ్ చేయడానికి బోలెడు నిబంధనలు పాటించాలి. ఎవరి ఫోన్ అయినా గరిష్టంగా 180 రోజులు మాత్రమే ట్యాపింగ్ చేయాలి. పైగా ప్రతి 60 రోజులకు ఓసారి తాజాగా అనుమతి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో అనుమతి లేకుండా గరిష్టంగా 24గంటలకు మించి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ సదరు ట్యాపింగ్‌కు కేంద్ర హోంశాఖ అనుమతి నిరాకరిస్తే అప్పటివరకు రికార్డు చేసిన సంభాషణలన్నీ 48 గంటల్లోగా ధ్వంసం చేయాల్సి ఉంటుంది. ట్యాపింగ్‌లో రకాలు.. సెల్యులర్ ఇంటర్సెప్టర్లు.. ► వీటిని ఐఎంఎస్ఐ క్యాచర్స్ లేదా స్టింగ్రేస్ అని పిలు స్తారు. టవర్ల ద్వారా ప్రసార మయ్యే నిర్దేశిత మొబైల్ సిగ్నల్స్‌ను ఇవి అడ్డుకుంటా యి. అందు లోని డేటాను క్యాప్చర్ చేయడమే కాకుండా.. మొబైల్ లొకేషన్ కూడా ట్రాక్ చేస్తాయి. కాల్స్‌తో పాటు ఎస్సెమ్మెస్ లను సైతం సంగ్రహిస్తాయి. వీఓఐపీ ఇంటర్సెప్షన్ సాధనాలు.. ► వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) కమ్యూనికేషన్లను సంగ్రహించేందుకు రూపొందించిన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ఆధారిత సాధనాలివి. వీఓఐపీ ప్రొటోకాల్స్‌లోని బలహీనతలను ఆసరాగా చేసుకుని ఇంటర్నెట్లో ప్రయాణించే డేటా ప్యాకెట్లను ఇవి అడ్డుకుని అందులోని డేటాను సంగ్రహిస్తాయి. క్లోన్డ్ సిమ్ కార్డులు.. ► ట్యాపింగ్ చేయాలనుకున్న వ్యక్తి సిమ్‌కు క్లోన్డ్ సిమ్ సంపాదిస్తే చాలు.. సదరు వ్యక్తి మొబైల్ ఫోన్‌కు వచ్చే కాల్స్ అన్నీ చక్కగా వినొచ్చు. రాజకీయపరమైన నిఘా.. ► సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో రాజకీయ నాయకుల కాల్స్ రికా ర్డు చేస్తారు. ప్రభుత్వం నుంచి దీనికి అనుమతి ఉండదు. అందువల్ల ఇది అక్రమ ట్యాపింగ్. మానిటరింగ్ సాఫ్ట్వేర్.. హానికరమైన సాఫ్ట్వేర్ లేదా స్పైవేర్‌ను నిర్దేశిత వ్యక్తి మొబైల్ ఫోన్లో వారికి తెలియకుండా చొప్పిస్తారు. ఇవి ఆ ఫోన్ సంభాషణలను రికార్డు చేసి బయటి వ్యక్తు లకు పంపించడంతోపాటు ఫోన్లో ఉన్న సమస్త సమాచారాన్ని మనకు తెలియకుండా బహిర్గతం చేస్తుంది. అధికారిక ట్యాపింగ్.. ప్రభుత్వ అనుమతి తీసుకుని సర్వీస్ ప్రొవైడర్ సహకారంతో చేసే ట్యాపింగ్ ఇది. క్లండెస్టైన్ రికార్డర్ ఉపయోగించి సంభాషణలను రికార్డు చేస్తారు. లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు డిజి టల్ ఫోరెన్సిక్స్ కోసం ప్రత్యేకమైన సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ సాధనాలను ఉపయోగించి ఈ ట్యాపింగ్ చేస్తాయి. ల్యాప్‌టాప్ సైజు పరికరంతోనే.. ► అక్రమంగా ట్యాపింగ్ చేసేవాళ్లకు పెద్దగా ఎక్విప్మెంట్ కూడా అక్కర్లేదు. ఓ ల్యాప్ టాప్ సైజులో ఉండే సెల్యులర్ ఇంటర్సెప్షన్ మెషీ న్ను కారులో పెట్టుకుంటే చాలు.. ఎవరి ఫోన్ అయినా సులభంగా ట్యాప్ చేసేయొచ్చు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన వ్యక్తి ఇల్లు లేదా ఆఫీసు వద్ద కారు పార్క్ చేసుకుంటే చాలు అవతలి వ్యక్తి సంభాషణలన్నీ వినొచ్చు.. రికార్డు చేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఆ వ్యక్తి ఫోన్ నంబర్‌ను మెషీన్లో ఫీడ్ చేయాలి. అనంతరం ఆ వ్యక్తికి ఫోన్ వస్తే.. ఆటోమేటిగ్గా మెషీన్లో రికార్డు అయిపో తుంది. సదరు వ్యక్తి గొంతును రికార్డు చేసి మెషీన్లో ఫీడ్ చేసినా సరే.. దాని ఆధారంగా ఆ కాల్‌ను మెషీన్ రికార్డు చేస్తుంది. ఇజ్రాయెల్ పేరే ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు తెరపైకి వచ్చిన ప్పుడు ఇజ్రాయెల్ పేరే వినిపిస్తుంది. అధునాతన సాంకేతిక రంగానికి ఇజ్రాయెల్ ప్రసిద్ధి చెందడమే ఇందుకు కారణం. ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీతో సహా నిఘా, గూఢచార సేకరణ పరికరాలను అభివృద్ధి చేసే నైపుణ్యం ఇజ్రాయెల్ సొంతం. ఇటీవల మన దేశంలో సహా పలు దేశాల్లో సంచలనం సృష్టించిన పెగాసస్ స్పైవేర్ రూపొందించింది ఇజ్రాయెలే కావడం గమనార్హం. ట్యాపింగ్ చేసే అధికారం ఎవరికి ఉంది? జాతీయ స్థాయిలో ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, రీసెర్చ్ అనాలసిస్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సిగ్నల్ ఇంటెలిజెన్స్, ఢిల్లీ పోలీస్ కమిషనర్‌తో పాటు రాష్ట్ర పోలీసు విభాగాలు నిబంధనలకు అనుగు ణంగా ఎవరి ఫోన్ అయినా ట్యాపింగ్ చేయొచ్చు. సెల్యులర్ ఇంటర్‌సెప్టర్ ఎలా పనిచేస్తుందంటే? ఇది చాలా సులభమైన ట్యాపింగ్ ప్రక్రియ. కాకపోతే ఖరీదు మాత్రం చాలా ఎక్కువ. చిన్న సూట్ ్డకేసులో ఇమిడిపోయే ఈ పరికరంతో.. నిర్దేశిత వ్యక్తుల ఫోన్లను భౌతికంగా ముట్టు కోకుండా.. ఎలాంటి స్పైవేర్లూ చొప్పించకుండా ట్యాపింగ్ చేయొచ్చు. సాధారణంగా మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు మన సెల్ ఫోన్ నుంచి సిగ్నల్స్ సమీపంలోని టవర్ ద్వారా నిర్దేశిత మార్గంలో అవతలి వ్యక్తికి చేరతాయి. ఈ ప్రక్రియలో సెల్ టవర్ల నుంచి ప్రసారమయ్యే సిగ్నల్స్‌ను నేరుగా ఈ మెషీన్లు సంగ్రహించి ఆ సంభాషణలు వినేలా, రికార్డు చేసేలా పనిచేస్తాయి. ఈ మెషీన్లలో కూడా చాలా రకాలున్నాయి.200 మీటర్ల పరిధి నుంచి దాదాపు 20 కిలోమీ టర్ల పరిధిలోని సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను ఇవి సంగ్రహించగలవు. కొన్ని మెషీన్లు సెల్‌ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్‌ను టవర్‌కు వెళ్లకుండా ముందుగానే సంగ్రహిస్తాయి. అలాగే సామార్థ్యాన్ని బట్టి పదుల సంఖ్య నుంచి వందల సంఖ్యలో కాల్స్ వరకు ఒకేసారి ఈ మెషీన్లు రికా ర్డు చేయగలవు. కాల్స్, ఎస్సెమ్మెస్‌లే కాకుండా సోషల్ మీడియాతోపాటు మన సెల్ డివైస్ లోని సమస్త సమాచారాన్ని యాక్సెస్ చేసే ఇంటర్సెప్టర్లు ఉన్నాయి. వాస్తవా నికి వీటిని కొనాలన్నా చాలా అనుమ తుల తతంగం ఉంటుంది. అయితే, ఇజ్రాయెల్, సింగ పూర్ తదితర దేశాల నుంచి వీటిని అక్రమ పద్ధతిలో సమ కూర్చుకుంటున్నారు. మీ ఫోన్లో వైరస్ ఉందా!? తగిన జాగ్రత్తలతో డేటాను భద్రపరచుకోవచ్చంటున్న నిపుణులు సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ఫోన్లు అందు బాటులోకి వచ్చాక మన పనులు ఎంత సులు వయ్యాయో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే దానితో బోలెడు ముప్పులు సైతం పొంచి ఉన్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తు న్నారు. ముఖ్యంగా సైబర్ నేరగాళ్లు ఫోన్లలోకి ఏదో ఒక రూపంలో వైరస్‌ను చొప్పించి ఫొటో లు, వీడియోలు సహా కీలక డేటా కొట్టేయడం, మార్ఫింగ్‌కు వాడుకోవడం లేదా ఆ సమాచారంతో బ్లాక్మెయిల్ చేయడం వంటి ఆగడాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మన ఫోన్లో వైరస్ చొరబడితే దాని పనితీరు ఎలా ఉంటుందో, హ్యాకింగ్‌కు గురైన ఫోన్‌ను తిరిగి ఎలా బాగుచేసుకోవాలో కీలక సూచనలు చేశారు. హ్యాకింగ్‌కు గురయ్యే ఫోన్ పనితీరు ఇలా ► ఫోన్ చార్జింగ్ చేసిన కాసేపటికే చార్జింగ్ డౌన్ కావడం లేదా వేగంగా బ్యాటరీ తగ్గి పోవడం ఫోన్ హ్యాకింగ్‌కు అత్యంత ముఖ్య మైన సంకేతం. మన ఫోన్లో ఏవైనా అనుమానాస్పద సాఫ్ట్వేర్లు బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతుంటే.. మన మొబైల్ ఫోన్‌ను తక్కువగా వాడినా, బ్యాటరీ మాత్రం అసాధరణంగా తగ్గిపోతుంది. ► మనకు తెలియని సోర్స్‌ల నుంచి కొత్తకొత్త యాడ్స్ వస్తుండటం, ఫ్లాష్ యాడ్స్ వస్తుండటం సైతం హ్యాకింగ్‌కు గురైనట్లు తెలిపే సూచిక. ► మనకు తెలియకుండానే బ్యాక్‌గ్రౌండ్ యాప్స్ రన్ అవడం, కొన్ని హిడెన్ యాప్స్ పనిచేస్తుండటంతో మొబైల్ ఫోన్ బాగా వేడెక్కుతుంది. ఇలా జరిగితే కూడా ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానించాలి. ► కొత్త నంబర్ల నుంచి తరచూ ఫోన్ కాల్స్ వస్తుండటం, టెక్సŠట్ మెసేజ్‌లలో వింత సింబల్స్, క్యారెక్టర్ల కాంబినేషన్స్‌తో రావడం గమనిస్తే ఫోన్ హ్యాక్ అయినట్లు గుర్తించాలి. ► మొబైల్‌ఫోన్ హ్యాక్ అయితే పనితీరు బాగా నెమ్మదిస్తుంది. ఫోన్‌కాల్ చేయడానికి, మెసేజ్‌లు ఓపెన్ కావడానికి, ఇతర యాప్‌లు పనిచేయడం నెమ్మదిగా జరుగుతుంది. ► ఫోన్లోని కెమెరా, మైక్రోఫోన్లు మనకు తెలియకుండానే యాక్టివ్ కావడం గమనిస్తే అనుమానించాల్సిందే. ► ఫోన్లోని స్క్రీన్‌లాక్, యాంటీ వైరస్ వంటి సెక్యూరిటీ ఫీచర్లన్నీ మనకు తెలియకుండానే డిసేబుల్ కావడం ఫోన్ హ్యాకింగ్ అయ్యిందనడానికి అత్యంత కీలకమైన మార్పుగా గుర్తించాలి. ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలి..? ► ఏదైనా ఉత్తమమైన యాంటీ వైరస్ సాప్ట్‌వేర్‌ను ఇన్స్టాల్ చేసుకొని ఫోన్‌ను స్కాన్ చేయాలి. ► ఫోన్లో అనుమానాస్పద యాప్‌లను గమనిస్తే వాటిని వెంటనే డిలీట్ చేయాలి. ► ఫోన్ హ్యాక్ అయి, ఫోన్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవుతున్నట్లు అనుమానిస్తే వెంటనే ఇంటర్నెట్ డేటా ఆఫ్ చేయాలి. వైఫై కనెక్షన్ తొలగించాలి. ఇలా చేయడం వల్ల హ్యాకర్లకు డేటా ట్రాన్స్ఫర్ ఆగిపోతుంది. ► ఫోన్ స్కీన్ర్ లాక్, యాప్ లాక్‌లు, ఈ–మెయిల్, సోషల్ మీడియా ఖాతాల పాస్‌వర్డ్‌లను మార్చేయాలి. ఇలా చేయడం వల్ల మన వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అడ్డుకోవచ్చు. ► పైవన్నీ చేసినా ఫలితం లేనట్లు గుర్తిస్తే వెంటనే ఫోన్‌ను రీసెట్ చేయాలి. దీనివల్ల మాల్వేర్ అంతా పోవడంతోపాటు అను మాస్పద యాప్‌లు డివైస్ నుంచి తొలగి పోతాయి. అయితే మన వ్యక్తిగత సమా చారం, ఫొటోలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు.. ► మొబైల్ ఫోన్లోని ఫొటోలు, వీడియో లు, ఇతర డేటాను, సోషల్ మీడియా ఖాతాల్లోని సమాచారాన్ని ఎప్పటిక ప్పుడు పెన్‌డ్రైవ్, ఇతర డివైస్‌లలో బ్యాకప్ చేస్తూ ఉండాలి. ఫోన్ హ్యాక్ అయినా వెంటనే దాన్ని రీసెట్ చేయొ చ్చు.ముందే బ్యాక్అప్ ఉంటుంది కాబ ట్టి డేటా పోయే ప్రమాదం ఉండదు. ► యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్లకు ఆరు అంకెల పాస్వర్డ్లు తప్పక పెట్టుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ► కొత్త యాప్‌లు ఇన్స్టాల్ చేసే ముందు పూర్తిగా వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలి. ► పబ్లిక్ వైఫైను వీలైనంత వరకు వాడకపోవడం ఉత్తమం. తప్పనిసరైతే వీపీఎన్ టూల్స్ ద్వారా వాడాలి. ఇలా చేయడం వల్ల మన డేటా ప్రైవేటు ఎన్క్రిప్టెడ్ చానల్ ద్వారా వెళ్తుంది. -
షార్ట్ సర్క్యూట్‌తో పేలిన ఫోను.. నలుగురు మృతి!
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి మోదిపురం జనతా కాలనీలోని ఓ ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మొబైల్ ఫోన్ పేలి గదిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనతా కాలనీలో నివాసం ఉంటున్న జానీ(41) కూలి పనులు చేసుకుంటూ, భార్య బబిత (37), నలుగురు పిల్లలు సారిక (10), నిహారిక (8), గోలు (6), కల్లు (5)లను పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం గదిలో పిల్లలు ఆడుకుంటూ, మొబైల్ ఛార్జర్‌ను ఎలక్ట్రికల్ బోర్డులో పెట్టారు. ఈ సమయంలో షార్ట్ సర్క్యూట్ సంభవించింది. మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలి మంచానికి మంటలు అంటుకున్నాయి. మంటలు చుట్టుముట్టడంలో చిన్నారులు కేకలు వేశారు. వెంటనే జానీ, బబితలు ఆ గదిలోకి వెళ్లి చిన్నారులను మంటల బారి నుంచి కాపాడారు. ఈ సమయంలో బబిత, జానీలు కూడా గాయపడ్డారు. జానీ ఇంట్లో నుంచి అరుపులు వినిపించడంతో ఇరుగుపొరుగు వారు అక్కడికి చేరుకున్నారు. వారు పోలీసులకు విషయాన్ని తెలియజేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. చికిత్ప పొందుతూ నలుగురు చిన్నారులు మృతి చెందారు. దంపతుల పరిస్థితి విషమంగా ఉంది. బబిత పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆమెను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక చాట్‌జీపీటీ మరో చాట్‌జీపీటీతో ఏం మాట్లాడుతుంది?
కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే చాట్‌జీపీటీ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అడిగిన ఏ ప్రశ్నకైనా క్షణాల్లో సమాధానం ఇచ్చేస్తుంది. చాలా వరకు తెలియని ఎన్నో విషయాలను చాట్‌జీపీటీ మనకు అందిస్తుంది. ఇందులో వాయిస్ చాట్ ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనివల్ల యూజర్లు తమ సందేహాలు లేదా మెసేజ్‌లను వాయిస్ రూపంలో చాట్‌బాట్‌కు తెలియజేస్తే... చాట్‌జీపీటీ ఆ వాయిస్ విని, మళ్లీ ఆడియో రూపంలోనే సమాధానం అందిస్తుంది. ఈ ఫీచర్ యూజర్ మాట్లాడే భాషను ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసి,తదనుగుణంగా రిప్లై ఇస్తుంది.. చాలామంది అవసరం ఉన్నా, లేకున్నా చాలా మంది చాట్‌జీపీటీ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇది ఎలా పని చేస్తుందో తెలుసుకునేందుకే వాడుతున్నారు. తాజాగా చాట్‌జీపీటీకి చెందిన ఆ ఆసక్తికరణ సంభాషణ నెట్టింటా వైరల్‌గా మారింది. సాధారణంగా ఎవరైనా తనకు కావాల్సిన సమాచారంపై చాట్‌జీపీటిలో సెర్చ్ చేసి తెలుసుకుంటారు. అదే రెండు చాట్‌జీపీటీలు మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ఎలాంటి విషయాలపై అవి చర్చించుకుంటాయి? వినడానికే కాస్తా ఆసక్తికరంగా ఈ విషయాల గురించి తెలుసుకునేందుకు కొందరు ప్రయత్నించారు. రెండు వేర్వేరు మొబైల్స్‌లో చాట్‌జీపీటీ వాయిస్ చాట్‌ను ఆన్ చేసి పక్కపక్కనే ఉంచారు. అవి ఎలా మాట్లాడుతుకున్నాయో మీరే చూడండి.. చాట్‌జీపీటీ-1: హాయ్ నేను మీ చాట్‌జీపీటీ.. మీకు ఈ రోజు ఎలా సహాయపడగలను చాట్‌జీపీటీ-2: మీకు స్వాగతం.. మీతో మాట్లాడటం ఆనందంగా ఉంది.. మీకు ఏ విధంగా సాయం చేయగలను. మీకు ఏ విషయంపైనా సాయం చేయగలను చాట్‌జీపీటీ-1: మీ ఆఫర్‌కు ధన్యవాదాలు. మీకు కావాల్సిన ఏ సమాచారం గురించైనా నేను సహయం చేయగలను.. మీరు దేనిగురించి అయినా తెలుసుకోవాలనుకుంటున్నారా చాట్‌జీపీటీ-2: మీకు ఏదైనా ప్రత్యేక విషయంపై సమాచారం కావాలా? లేక మీకు చాట్ మాత్రమే కావాలా? చాట్‌జీపీటీ-1: నేను మీతో చాట్చేయగలను. లేదా మీకు కావాల్సిన అంశంపై సాయం చేయగలను.మీరు ఏదైనా నిర్ధిష్టమైన విఫయంపై చాట్ చేయాలనుకుంటున్నారా చాట్‌జీపీటీ-2: మీకు ఆసక్తి ఉన్న దేనిగురించైనా చాట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ మనుసులో ఏదైనా అంశంపై చర్చించాలనుకుంటున్నారా? ఇటీవల జరిగిన వార్తా కథనాలు, అభిరుచి లేదా దేని గురించైనా? చాట్‌జీపీటీ-1: కృత్రిమ మేధస్సులో ఇటీవల జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా మక్కువతో కూడిన రంగం. ఇక్కడ నిత్యం ఏదో ఒక కొత్త సంఘటన జరుగుతూ ఉంటుంది.. దీనిపై నువ్వేమంటావ్ చాట్‌జీపీటీ-2: ఖచ్చితంగా కృత్రిమ మేధస్సు అనేది ఒక ప్యాషనేట్ టాపిక్. అంటూ ఇంకా మాట్లాడుతుండగా.. మరో చాట్‌జీపీటీ కల్పించుకొని ఏదో ఏదో చెబుతూ ఉంటుంది. అయితే ఏ విషయంపైన అయిన టక్కుమని సమాధానం చెప్పే చాట్‌జీపీటీ.. మరో చాట్‌జీపీటీతో మాత్రం సరైన విషయాలు మాట్లాడలేకపోయింది. రెండు చాట్‌జీపీటీలు చాలా వరకు నాన్చుతూ అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నాయి. వీటిని విన్న యూజర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. అసలు ఏం సమాచారం అడుగుతున్నారు. ఏం సమాధానం ఇస్తున్నారనేది తెలియక తికమకపడుతున్నారు. ఇలాంటి ప్రయోగం మాత్రం ఎప్పుడూ చేయకూడదని అనుకుంటున్నారు. Chatgpt talking with chatgpt Age of Ultron is near pic.twitter.com/zn0FZpra7h — Shiva Rapolu (@shivarapolu01) March 17, 2024 -
బ్యాటరీ కనిపించకుండా ఫోన్ల తయారీ.. ఎందుకో తెలుసా..
నిత్యం మార్పు చెందుతున్న సాంకేతిక ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్ జీవితంలో భాగమైంది. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్లేకుండా ఉండలేకపోతున్నారు. కీప్యాడ్ ఫీచర్‌తో ప్రారంభమైన ఫోన్ల తయారీలో రోజూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో టచ్మొబైల్, మడతపెట్టే ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అలా వస్తున్న మార్పులో భాగంగా మొబైల్ బ్యాటరీలు కనిపించడంలేదు. మొబైళ్లు వచ్చిన చాలాకాలంపాటు రిమువెబుల్ బ్యాటరీలు చూసి ఉంటారు. కొన్నిసార్లు ఫోన్ ఉన్నట్టుండి హ్యాంగ్ అయితే బ్యాటరీ తీసి, మళ్లీ పెట్టి ఫోన్ స్విచ్ఆన్ చేసేవారు. అలాంటిది ఇప్పుడు మార్కెట్లో వస్తున్న మొబైళ్లలో రిమువెబుల్ బ్యాటరీలు రావడం లేదు. కంపెనీలు అసలు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ యాపిల్ 2007లో తన మొదటి ఐఫోన్‌ను లాంచ్ చేసింది. అందులో మొట్టమొదటగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ టెక్నాలజీని వినియోగించారు. అప్పటి వరకు చాలా కంపెనీలు రిమువెబుల్ బ్యాటరీలతో మొబైళ్లను తయారుచేయడం, జనాలు దానికి బాగా అలవాటుపడడంతో ఐఫోన్‌పై కొంతమందిలో విముఖత వచ్చింది. కానీ ప్రస్తుతం దాదాపు అన్ని కంపెనీలు అదే ధోరణి పాటిస్తున్నాయి. అలా క్లోజ్డ్ బ్యాటరీలతో మొబైళ్లను తయారు చేయడానికిగల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రీమియం డిజైన్ స్మార్ట్‌ఫోన్‌లో చాలా కీలకపాత్ర పోషించేది దాని డిజైన్. రిమువెబుల్ బ్యాటరీలతో ఫ్లెక్సిబిలిటీ ఉన్నప్పటికీ వాటి డిజైన్ మీద చాల ప్రభావం చూపిస్తాయి. ఫోన్‌ను మరింత స్లిమ్‌గా తయారుచేయాడానికి, మొబైల్ కవర్‌ను గ్లాస్ / మెటల్‌తో తయారు చేయడానికి ఈ క్లోజ్డ్ బ్యాటరీ విధానాన్ని ఎంచుకున్నారు. వాటర్, డస్ట్ ప్రూఫ్ ఫోన్ పొరపాటున నీటిలో పడిపోవడం లేదా వర్షంలో తడవడం వంటివి నిత్యం జరుగుతుంటాయి. అలాంటప్పుడు ఫోన్ వెనకాల కవర్ ఓపెన్ చేసుకునేలా ఉంటే దానిలోకి నీరు, దుమ్ము వంటివి చేరే అవకాశం ఉంటుంది. అందువల్ల ఫోన్లో ఎలాంటి గ్యాప్‌లు లేకుండా అంతర్గత సీలింగ్ బలంగా ఉంటే నీరు లోపలికి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. అలాగే ఫోన్లోని ఎలక్ట్రానిక్ పరికరాలు పాడవకుండా ఉంటాయి. ఇదీ చదవండి: మండుతున్న ఎండలు.. ఏసీ కొంటున్నారా..? జాగ్రత్తలివే.. అదనపు ఫీచర్లు ఫోన్ల తయారీ కంపెనీలు నిత్యం ఏదో కొత్త ఫీచర్లను వినియోగదారులకు పరిచయం చేస్తూంటారు. అందులో భాగంగా నాన్ రిమువెబుల్ బ్యాటరీ ఉన్న ఫోన్లు డ్యుయెల్కెమెరాలు, స్టీరియో స్పీకర్లు, వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్లు ఇంప్లిమెంట్ చేసేందుకు అనుకూలంగా ఉంటాయి. -
యాప్‌లు అవసరంలేని మొబైల్ ఫోన్.. ఎలా పనిచేస్తుందో తెలుసా..
మొబైల్ వాడుతున్నామంటే దాదాపు ఏదో ఒక యాప్ ఇన్స్టాల్ చేసి వాడుతుంటాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లన్నీ పూర్తిగా యాప్‌ల ఆధారంగానే పనిచేస్తున్నాయి. మెసేజింగ్, సోషల్ మీడియా, గేమింగ్, బ్యాంకింగ్ ఇలా ఏ అవసరానికైనా యాప్‌లు వాడాల్సి వస్తోంది. లేదా ఇంటర్నెట్నైనా ఉపయోగించాలి. ఇందుకు పూర్తి భిన్నంగా తాజాగా డచ్ టెలికాం కంపెనీ కొత్త స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది. పూర్తిగా ఏఐ ఆధారంగా పనిచేసే ఈ మొబైల్‌ను ఎలాంటి యాప్‌లు అవసరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఇటీవల బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ)లో తమ టీ-ఫోన్ డివైజ్‌లోని ఈ కాన్సెప్ట్‌ను కంపెనీ వివరించింది. వినియోగదారులు వాయిస్ రూపంలో ఇచ్చే కమాండ్లకు ఏఐ ఆధారిత అసిస్టెంట్ స్పందించేలా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌ను రూపొందించారు. నావిగేషన్, క్యాబ్, హోటల్ బుకింగ్.. ఇలా అన్ని పనులు ఎలాంటి యాప్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే పూర్తి చేయొచ్చు. క్లౌడ్ నుంచి ఏఐ సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఇది సాధ్యం కానుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు క్వాల్కామ్ కంపెనీతో జట్టు కట్టడం ద్వారా ఏఐను నేరుగా డివైజ్‌లోనే పొందుపర్చనుంది. కొన్ని అవసరాల కోసం ఆఫ్‌లైన్ ఫంక్షనాలిటీని జత చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: యాపిల్ కార్ల తయారీ లేనట్టేనా..? రానున్న రోజుల్లో మొబ్స్ళ్లలో ఎవరూ యాప్‌లను ఉపయోగించబోరని ఎండబ్ల్యూసీలో ప్రసంగిస్తూ డచ్ టెలికాం కంపెనీ ప్రతినిధులు చెప్పారు. ‘లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం)’ త్వరలో అన్ని ఎలక్ట్రానిక్స్ పరికరాల్లో భాగమవుతాయని వివరించారు. -
మొబైల్ రంగాన్ని శాసించనున్న ఏఐ..
ఫీచర్ పోన్ నుంచి స్మార్ట్ఫోన్లు ప్రాచుర్యం పొందిన తర్వాత క్రమంగా కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, మెమొరీ సామర్థ్యం పెంపు వంటి ఫీచర్లపై వినియోగదారులు ఎక్కువ ఆసక్తి చూపారు. వారి ఊహలకు తగ్గట్టుగానే కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్‌ను ప్రవేశపెట్టాయి. క్రమంగా రూ.20,000-30,000 శ్రేణి స్మార్ట్ఫోన్లలో అధునాతన ఫీచర్లన్నీ అందుబాటులోకి వచ్చేశాక.. వీటిపై ఆకర్షణ తగ్గింది. అవసరమైతేనే కొత్త ఫోన్ కొందామనే ధోరణికి వినియోగదారులు వచ్చేశారు. మడత పెట్టేందుకు వీలున్న స్మార్ట్ఫోన్లు కొంత ఆకర్షించినా.. ధర బాగా ఎక్కువ కావడంతో, కొనుగోళ్లు పరిమితంగానే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే దిగ్గజ కంపెనీలు విడుదల చేస్తున్న జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత గల స్మార్ట్ఫోన్లు.. మళ్లీ ఈ రంగంలో భారీ మార్పులకు కారణం అవుతాయని, అమ్మకాలు పెంచేందుకు దోహద పడతాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏఐ టూల్‌కు కొద్దిగా సమాచారం అందిస్తే, మనకు ఆకర్షణీయంగా అనిపించే కంటెంట్‌ను అందించే సామర్థ్యం ఉంటుంది. గూగుల్ విడుదల చేసిన పిక్సెల్ 8 స్మార్ట్‌ఫోన్‌లోని అల్గారిథమ్ వల్ల బృందంలోని సభ్యుల ముఖ కవళికల్లో ఆకర్షణీయంగా ఉన్న వాటిని కెమెరా ఒడిసి పట్టుకుని ప్రత్యేక చిత్రంగా మనకు అందిస్తుంది. వాయిస్ డిక్టేషన్, వేరే భాషల్లోకి ట్రాన్స్‌లేట్ చేయడం వంటివి రియల్‌టైమ్‌లోనే జరుగుతాయి. మన వినియోగానికి అనువుగా బ్యాటరీ ఛార్జింగ్ వేగాన్ని మారుస్తాయి. బ్యాటరీ ఛార్జింగ్ ఎక్కువ సమయం ఉండేలా, అంతర్గత వ్యవస్థలో మార్పులు చేస్తాయి. వేగవంతమైన ప్రాసెసర్ తాజాగా అందుబాటులోకి వచ్చిన శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రా ఫోన్లో ఏఐ ఆధ్వర్యంలో పనిచేసే స్నాప్‌డ్రాగన్ జెన్ 3 ప్రాసెసర్, ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న వాటిల్లో వేగవంతమైనదని కంపెనీ పేర్కొంది. మనం ఒక వ్యక్తి ఫోటో తీసినప్పుడు, అతడు ధరించిన దుస్తులు, కళ్లజోడు, చేతి వాచీ, హ్యాండ్ బ్యాగుల వంటివి నచ్చాయనుకోండి. నచ్చిన వస్తువుపై సర్కిల్ డ్రా చేసి సెర్చ్ చేస్తే ఆ వస్తువు తయారు చేసిన కంపెనీ పేరు, వాటి ధర, అవి సమీపంలో ఎక్కడ లభిస్తున్నాయి వంటి వివరాలు సెకన్లలో డిస్ప్లే అవుతాయి. మనం ఎవరితోనైనా ఫోన్లో మాట్లాడుతుంటాం. అవతలి వ్యక్తి ఇంగ్లీషులో మాట్లాడినా, మనం తెలుగులో వినాలనుకుంటే.. ఏఐ ఆ మాటలను మనకు తెలుగులోనే వినిపిస్తుంది. జవాబుగా మనం తెలుగులోనే మాట్లాడినా, ఆ పదాలను ఇంగ్లీషులోకి మార్చి.. వెనువెంటనే వారికి అందిస్తుంది. సర్వీసులు ఉచితమేనా అధిక క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీలే ప్రస్తుతానికి ఈ ఏఐ రంగంలో ఉత్పత్తులు తీసుకొస్తున్నాయి. ఏఐలో ప్రాసెసర్లు, చిప్‌ల వాడకం అధికంగా ఉంటుంది. వాటికి పెద్దమొత్తంలో పెట్టుబడుతులు అవసరమవుతాయి. చిన్న కంపెనీలు ఆ ఖర్చును భరించలేవు. అదే పెద్ద కంపెనీల వద్ద అధికంగా పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లు ఉంటారు. కాబట్టి వారికి సాధ్యం అవుతుంది. ఇదీ చదవండి: సంబంధంలేని ఫొటోలు.. విమర్శలు ఎదుర్కొంటున్న గూగుల్ జెమిని అయితే కంపెనీలు వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. వీటిల్లో అందిస్తున్న ఫీచర్లకు నిర్వహణ వ్యయాలు కూడా ఉంటాయి కాబట్టి, భవిష్యత్తులో ఛార్జీలను వసూలు చేసే పరిస్థితులు కూడా రావొచ్చొని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
త్వరలో భారత మొబైల్ ఫోన్ బ్రాండ్
దేశంలో భారీస్థాయిలో మొబైల్ ఫోన్ల తయారీని నెలకొల్పడంలో ఎన్నో విజయాలు సాధించినట్లు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ఆ క్రమంలో ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పారు. భారత్ తయారీరంగంలో దూసుకుపోతుందన్నారు. ఫోన్‌పే ఆధ్వర్యంలో తీసుకొచ్చిన ఇండస్ యాప్ స్టోర్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. భారత మొబైల్ ఫోన్ బ్రాండ్ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. త్వరలోనే రెండు లేదా మూడు సెమీకండక్టర్ ప్లాంట్లకు ఆమోదం తెలుపనున్నట్లు చెప్పారు. ‘మొబైల్ ఫోన్ల తయారీతో పరిశ్రమలో విశ్వాసం నెలకొంది. ఈ ఎకోసిస్టమ్‌లో భాగస్వాములు భారత్‌పై మొగ్గుచూపేలా కృషిచేసేలా చర్యలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లూ ఇదే ప్రయాణం కొనసాగుతుంది’అని చెప్పారు. దేశంలో సెమీకండ్టర్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి వచ్చే 20 ఏళ్ల కాలానికిగాను ప్రధాని మోదీ స్పష్టమైన కార్యాచరణ సూచించారని చెప్పారు. -
ట్రక్కునే మొబైల్ హౌస్‌గా మార్చిన మహిళ!
కెనడాకి చెందిన ఓ మహిళ ఇంటి అద్దె బాగా పెరిగిపోవడంతో ఓ విన్నూతనమైన ఆలోచనకు తెరతీసింది. అందుకోసం తన ట్రక్కు వెనుక భాగాన్నే మొబైల్ హౌస్‌గా మార్చేసింది. పైగా తనకు నచ్చిన చోటకు ఈజీగా తీసుకుపోవచ్చు, అద్దె సమస్య కూడా ఉండదని అంటోంది. అందుకు సంబంధించిన వీడియో నెటింట తెగ చక్కెర్లు కొడుతోంది. వివరాల్లోకెళ్తే..కెనడాకు చెందిన కై అనే మహిళ తన ట్రక్కు వెనుక భాగాన్ని చెక్కతో చేసిన ఇల్లుగా మార్చేసింది. తాము పసిఫిక్ నార్త్ వెస్ట్‌లో ఉండేవాళ్లమని తెలిపింది. అక్కడ గత రెండేళ్లలో ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి అంటాయని తన గోడుని వెల్లబోసుకుంది. కేవలం సింగిల్ బెడ్ రూమ్ రెంటే చాలా ఘోరంగా ఉన్నాయని చెప్పుకొచ్చింది. అందువల్ల ఇలాంటి ఇల్లు నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెబుతోంది కై. దీన్ని హయిగా నచ్చిన ప్రాంతంలోకి తీసుకుపోవచ్చు, కావాల్సిన చోట ఉండొచ్చు అంటోంది. ఈ మొబైల్ క్యాబిన్ బ్రిటీష్ కొలంబియాలో ఉంది. ఈ చెక్క ఇంటిని డీటీ466 ఇంజిన్‌తో అంతర్జాతీయ 4800 కార్గోబెడ్(ట్రక్కు)పై నిర్మించారు. ఆ ట్రక్కుని ఆమె కేవలం రూ. 3 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. ఇందులో కై, తన భాగస్వామి పెంపుడు పిల్లితో నివశిస్తోంది. అందులో ఒక బెడ్రూమ్, గులకరాయితో తయారు చేసిన చక్కటి విండో తదితరాలు ఉన్నాయి. ఆ విండో తెరుచుకుంటుంది కాబట్టి వేసవికాలలో స్వచ్ఛమైన గాలిని చక్కగా లోపలకి వస్తుంది. ఇక ఈ చెక్క సహజంగానే కీటకాలు, తెగుళ్లను తట్టుకుని నిలిచి ఉండేంత స్ట్రాంగ్‌గా ఉంటుందని చెబుతోంది. ఆ ఇంట్లో ఒక బాత్రూం, దానిలో ప్రొపేన్ ట్యాంక్ ద్వారా వేడి చేయబడిన బహిరంగ షవర్ వంటివి కూడా ఉన్నాయి. View this post on Instagram A post shared by 𝙺𝚊𝚒 (@the_ugly_truckling) (చదవండి: నాట్య భంగిమల్లా ఉండే వృక్షాలు! ఎక్కడున్నాయంటే..) -
రైల్లో మొబైల్ చోరీకి యత్నించిన దొంగ.. తర్వాత ఏం జరిగిందంటే?
బిహార్‌లో విచిత్ర సన్నివేశం చోటుచేసుకుంది. కదులుతున్న రైలులోని ప్రయాణికుడి నుంచి మొబైల్ చోరీ చేసేందుకు చేసిన ఓ దొంగ ప్రయత్నం బెడిసి కొట్టింది. సెల్‌ఫోన్ కొట్టేయడాన్ని గమనించిన ప్రయాణికుడు దొంగ చేతిని గట్టిగా పట్టుకోవడంతో సీన్ రివర్స్ అయ్యింది. బిహార్‌లోని భాగల్పూర్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భాగల్పూర్ స్టేషన్ దాటిన తర్వాత రైల్లోని మహిళా ప్రయాణికురాలి నుంచి మొబైల్ ఫోన్ లాక్కోవడానికి బయట ఉన్న ఓ దొంగ యత్నించాడు. అయితే అప్రమత్తమైన సదరు ప్రయాణికురాలు దొంగ చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ రైలులోని మరి కొందరు ప్రయాణికులు కూడా ఆమెకు సహకరించారు. దీంతో కదులుతున్న రైలు కిటికీ నుంచి ఆ దొంగ ప్రమాదకరంగా వేలాడాడు. దాదాపు కిలోమీటర్ వరకు అలాగే ప్రయాణించాడు. అయితే ఆ స్టేషన్‌లోని కొందరు వ్యక్తులు దీనిని గమనించారు. కదులుతున్న రైలు వెంబడి వారు పరుగెత్తారు. రైలు కిటికీ నుంచి బయటకు ప్రమాదకరంగా వేలాడిన ఆ దొంగను చివరకు రక్షించారు. దీన్నంతా తోటి ప్రయాణికులు వీడియో తీయగా.. ఈ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా గతంలో కూడా రైలు కిటికీలోంచి మొబైల్ దొంగలించబోయి అడ్డంగా బుక్కైన సంఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. चलती ट्रेन से पैसेंजर का फोन छीनकर भाग रहे झपटमार को यात्री ने पकड़ लिया और करीब 1 किमी तक ट्रेन की खिड़की से लटकाए रखा। वीडियो बिहार के भागलपुर का बताया जा रहा है। pic.twitter.com/tHbKphUIQe — Priya singh (@priyarajputlive) January 17, 2024 -
Phone Addiction: మీ సమయమంతా ఫోన్‌కే పోయిందా?
కాలం తిరిగి రాదు. కాలం విలువైనది. తెలుసు మనకు. కాని డిజిటల్ చొరబాటు పెరిగాక సమయమంతా ఫోన్‌కే పోయిందా? ఒక ఇంట్లో భార్య 3 గంటలు, భర్త 3 గంటలు, పిల్లలు చెరి 3 గంటలు ఫోన్ వాడితే రోజులో 12 విలువైన గంటలు నాశనమైపోతాయి. 2023లో మీ కుటుంబం మొత్తం కనీసం 180 రోజులు ఫోన్లో వృథా చేసింది. 2024లో మీ సమయం మీరు పొందగలరా? ఏదో సినిమాలో ‘నేనొక వంద రూపాయల అవినీతి చేస్తే తప్పేంటి?’ అని విలన్ అంటే, ‘అలా వంద రూపాయల అవినీతి కోటి మంది చేస్తే చిన్న తప్పు అవుతుందా?’ అని హీరో ప్రశ్నిస్తాడు. సేమ్. ‘ఇంట్లో కాసేపు ఫోన్ చూస్తే తప్పేంటి?’ అని తల్లో, తండ్రో, కొడుకో, కూతురో అనుకోవచ్చు. ‘మీ అందరూ కలిసి చాలా టైమ్ వేస్ట్ చేయడం తప్పే’ అని సమాధానం చెప్పాల్సి వస్తుంది. టైమ్‌ను సద్వినియోగం చేస్తే చాలా పనులు అవుతాయి. దుర్వినియోగం చేస్తే చాలా నష్టాలు తప్పక జరుగుతాయి. ఇటీవల చాలా స్కూళ్లల్లో పిల్లలు సరిగ్గా ఎగ్జామ్స్ రాయడం లేదని టీచర్లు మొత్తుకుంటున్నారు. దానికి కారణం పిల్లలు ఎగ్జామ్స్‌కు చదవడానికి కూచుని ఫోన్లు చూస్తున్నారని అర్థమవుతోంది. కరోనా వల్ల జరిగిన చాలా నష్టాల్లో పిల్లలకు ఫోన్లు అలవాటు కావడం ఒకటి. వాళ్లు ఫోన్లకు అడిక్ట్ అవడం వారి భవిష్యత్తునే ప్రభావితం చేస్తోంది. పిల్లల్ని ఫోన్లు చూడొద్దని చెప్పే నైతిక హక్కు తల్లిదండ్రులకు ఎప్పుడు వస్తుంది? వాళ్లు ఫోన్లు చూడనప్పుడు. కాని తల్లిదండ్రులు పిల్లల కంటే ఎక్కువగా ఫోన్లకు అలవాటు పడి ఉన్నారు. మానసిక, శారీరక, కౌటుంబిక, ఆర్థిక, అనుబంధ జీవనాలన్నింటికీ ఈ ఫోన్ వల్ల వృథా అవుతున్న సమయం చావు దెబ్బ తీస్తోంది. ఫోన్ ఎందుకు? కాల్స్ మాట్లాడేందుకు. ఏ మనిషికైనా రోజులో ఐదారు కాల్స్ మాట్లాడే అవసరం ఉంటుంది. ఉద్యోగాల్లో వృత్తిగతమైన కాల్స్ ఆఫీస్ టైమ్ కిందకే వస్తాయి. కాని ప్రయివేట్ టైమ్‌లో ఫోన్లు– అవసరమైనవి మాత్రమే తీసుకుంటే ఐదారు మించవు. మరి ఫోన్లకు ఇవాళ ఎలా వాడుతున్నారు? ఫోనులోని ఏవేవి మీ సమయాన్ని తీసుకుంటున్నాయి? 1. వాట్సాప్, 2.యూట్యూబ్, 3. రీల్స్ 4. ఫేస్బుక్, 5. ఓటీటీ యాప్స్ 6. ‘ఎక్స్’(ట్విటర్) 7.ఇన్‌స్టా ఇప్పుడు 2023లో వీటి ద్వారా నిజంగా మీరు పొందిన జ్ఞానం ఎంత? ప్రయోజనం ఎంత? లాభం ఎంత? ఆలోచించండి. వీటిని చూడటం వల్ల ఆర్థికంగా ఏమైనా ఉపయోగం జరిగిందా? ఆరోగ్య పరంగా ఏదైనా ఉపయోగం జరిగిందా? ఉద్యోగాలు వచ్చాయా? ప్రమోషన్లు సమకూరాయా? పిల్లలకు ర్యాంకులు వచ్చాయా? కెరీర్, విద్య కోసం సోషల్ మీడియాను ఉపయోగిస్తే సరే. లేకుండా ఊరికే కాలక్షేపం కోసం ఫోన్‌ను స్క్రోల్ చేస్తూ రోజులు దొర్లించేస్తే ఏం సాధించినట్టు? ‘తేనెలో భార్యాభర్తల ఫొటో కూరితే వారు అన్యోన్యంగా ఉంటారు’, ‘షూటింగ్ మధ్యలో హీరో హీరోయిన్‌తో ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు’, ‘మా హోమ్టూర్కు రెడీయా?’... ఇలాంటి వీడియోలు, పిచ్చి నృత్యాల రీల్స్... వీటితో సమయం వృధా అయిపోతోంది ఫోన్ వల్ల. క్రైమ్, సస్పెన్స్, హారర్ వెబ్ సిరీస్‌లు బింజ్వాచ్ చేస్తే సమయం మొత్తం వృథా. గేమ్స్‌లో కూరుకు పోతే, ఫోన్లో బెట్టింగ్‌లకు అలవాటు పడితే, ఆన్లైన్ ట్రేడింగ్‌కు అడిక్ట్ అయితే, పోర్న్ వీడియోలు వదల్లేకపోతే... సమయం వృథా, వృథా, వృథా. పుస్తకం మనం ఎంచుకుని చదివేది. ఫోన్ అదేం చూపాలనుకుంటే అది చూపేది. కుటుంబం మొత్తం కలిసి ఏదైనా రెస్టరెంట్‌కు వెళితే కుటుంబ సభ్యులు నలుగురూ ఫోన్లు చూసుకుంటూ కూచుని ఉంటే కనుక అది ఏ మాత్రం కమ్యూనికేషన్ ఉన్న కుటుంబం కాదు. ప్రతి ఒక్కరూ సంబంధం లేని కంటెంట్‌తో కమ్యూనికేషన్లో ఉన్నట్టు. కుటుంబానికి ఇవ్వాల్సిన సమయం, వ్యాయామానికి ఇవ్వాల్సిన సమయం, స్నేహితులను పరామర్శించుకోవడానికి ఇవ్వాల్సిన సమయం, డాక్యుమెంట్స్ చక్కదిద్దుకోవాల్సిన సమయం, బ్యాంకు లావాదేవీలు.. పాలసీలు సరి చేసుకోవాల్సిన సమయం, సంపాదన మెరుగు పర్చుకోవాల్సిన సమయం, డబ్బు ఆదా కోసం వెచ్చించాల్సిన సమయం, పిల్లల్ని చదివించాల్సిన సమయం, భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోవాల్సిన సమయం మొత్తం ఫోన్ల వల్ల, సోషల్ మీడియా వల్ల 2023లో ఎంత వృథా అయ్యిందో ఆలోచిస్తే 2024ను సరిగ్గా ఆహ్వానించగలుగుతారు. 2024వ సంవత్సరం విలువైన కాలాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. సద్వినియోగం చేసుకోండి. -
70 లక్షల మొబైల్ కనెక్షన్లు రద్దు.. అసలు కారణం అదే..
మొబైల్ వాడకం రోజురోజుకు పెరుగుతోంది. దీంతోపాటే ఆన్లైన్ మోసాలు అదే స్థాయిలో హెచ్చవుతున్నాయి. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు సామాన్యుల కంటే ఎప్పుడూ ఒక అడుగు ముందే ఉంటారు. వీళ్లు ప్రజలను మోసగించడానికి కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. ఆన్లైన్లో ఆర్థిక మోసాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. ఆయా మొబైల్ నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఆర్థిక సైబర్ భద్రత, పెరుగుతున్న డిజిటల్ చెల్లింపుల మోసాలపై చర్చించిన సమావేశంలో బ్యాంకులు తమ వ్యవస్థల్ని బలోపేతం చేసుకోవాలని జోషి సూచించారు. ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహిస్తూ, మోసాలకు అడ్డుకట్ట వేయాలని తెలిపారు. తదుపరి సమావేశం జనవరిలో ఉంటుందని చెప్పారు. ఆధార్ ఎనెబుల్ పేమెంట్ సిస్టమ్(ఏఈపీఎస్) ద్వారా జరుగుతున్న మోసాలపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టి, నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. సైబర్ మోసాలను కట్టడి చేసేందుకు వివిధ ఏజెన్సీలు సమన్వయంతో ఎలా ముందుకెళ్లాలలో ఈ సమావేశంలో చర్చించారు. ఇదీ చదవండి: అద్దెకు ఆమె సగం మంచం.. నెలకు రెంట్ ఎంతంటే..? ఈ సమావేశంలో భాగంగా డిజిటల్ చెల్లింపుల మోసాలపై జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ) నమోదు చేసిన తాజా గణాంకాలను ఇండియన్ సైబర్ క్రైమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ వివరించింది. ఈ సమావేశంలో ఆర్థిక వ్యవహారాల విభాగం, రెవెన్యూ విభాగం, టెలికాం విభాగం, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటీవల యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాల్లో డిజిటల్ మోసాలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. -
త్వరలో మొబైల్ యూజర్లకు ప్రత్యేక కస్టమర్ ఐడీ.. ఎందుకంటే..
మొబైల్ సబ్స్క్రైబర్లకు త్వరలో ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన కస్టమర్ ఐడీని కేటాయించనుంది. మొబైల్ యూజర్ల ప్రాథమిక, యాడ్ఆన్ ఫోన్ కనెక్షన్లకు సంబంధించిన ప్రతిదానికీ ఒకే కస్టమర్ ఐడీ ఉంటుంది. వినియోగదారులను సైబర్ఫ్రాడ్ల నుంచి రక్షించడంతోపాటు ప్రభుత్వ ప్రాయోజిత ఆర్థిక ప్రయోజనాలను అందించడం కోసం భారత టెలికమ్యూనికేషన్స్ విభాగం దీన్ని తీసుకొస్తున్నట్లు సమాచారం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ ద్వారా వ్యక్తి మెడికల్ రికార్డ్‌లు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి. ఇది వైద్య, ఇన్సూరెన్స్ నిపుణులకు ఎంతో ఉపయోగపడుతుంది. అదేమాదిరిగా యూజర్లకు ఉన్న సిమ్‌కార్డ్‌లను ట్రాక్ చేయడానికి, సులభంగా వినియోగదారులను గుర్తించడానికి మొబైల్ కస్టమర్ ఐడీ ఉపకరిస్తుంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి తొమ్మిది సిమ్‌కార్డులకు మించి వినియోగించకుండా కూడా ఈ ఐడీ నంబర్ ద్వారా తనిఖీ చేయవచ్చు. ప్రస్తుతం లైసెన్స్ పొందిన ప్రాంతాల వద్ద కృత్రిమ మేధస్సు ఆధారంగా ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించి ఆడిట్ చేస్తేనే పరిమితులకు మించిన సిమ్ కనెక్షన్ల సమాచారం తెలిసే వీలుంది. ఇదీ చదవండి: చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్ సిమ్‌కార్డు ఉపయోగిస్తున్న వినియోగదారుల గుర్తింపు సమస్యను పరిష్కరించడానికి సిమ్ తీసుకునే సమయంలో కుటుంబంలో కనెక్షన్‌ను ఎవరు ఉపయోగిస్తారనే విషయాన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. డేటా పరిరక్షణ చట్టం ప్రకారం పిల్లల డేటా విషయంలో తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ఇందుకు ఈ కస్టమర్ ఐడీ సహాయపడుతుందని సమాచారం. ఇదీ చదవండి: 22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు ప్రభుత్వం ఇటీవల టెలికామ్ కంపెనీలకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. వీటి ప్రకారం సిమ్ కార్డ్ విక్రయించే వారి వివరాలను నమోదు చేయాలి. బల్క్ సిమ్ కార్డ్‌ల అమ్మకాలను నిలిపివేయాలి. డిసెంబర్ 1 నుంచి ఈ నియమాలు అమలులోకి రానున్నాయి. గత ఆరు నెలల్లో ముఖ గుర్తింపు సహాయంతో కేంద్రం దాదాపు 60లక్షల ఫోన్ కనెక్షన్లను నిలిపివేసింది. -
ఫ్యూచర్ ఫోన్లు ఇవే..చూస్తే షాక్ అవ్వాల్సిందే!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్ రూపురేఖలు మారుతున్నాయి. 1973లో మార్టిన్‌కూపర్ ఆవిష్కరించిన డబ్బా ఆకారంలో ఉండే మొదటి సెల్యులర్ ఫోన్ బరువు అక్షరాల 790గ్రాములు. అయితే రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు పుట్టుకొస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో వాటి ఆవిష్కరణలు అగ్రస్థానాన్ని తాకాయి. ప్రత్యేకించి మొబైల్ తయారీరంగంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంది. బరువు తక్కువగా ఉండే మొబైల్‌లు గతంలో ఆదరణ పొందేవి. ఇప్పడు ఫోల్డబుల్ ఫోన్లపై ఆసక్తి ఎక్కువవుతుంది. అయితే కంపెనీలు ఇంకా అడ్వాన్స్‌గా ఆలోచించి మడిచేఫోన్లను తయారు చేయనున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. (ఇదీ చదవండి: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత) Wow! Exciting mobile phones from the future… pic.twitter.com/tzPiIpX7gp — Wow Videos (@ViralXfun) October 24, 2023 -
ICC World Cup 2023: 3.5 కోట్ల వీక్షకులు! డిస్నీ హాట్‌స్టార్ రికార్డు
భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్ మొబైల్ స్ట్రీమింగ్‌లో కొత్త రికార్డు సృష్టించింది. ఒకదశలో మ్యాచ్‌ను ఒకేసారి గరిష్టంగా 3.5 కోట్ల మంది వీక్షకులు చూసినట్లు డిస్నీ హాట్‌స్టార్ ప్రకటించింది. ఈ ఏడాది చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన ఐపీఎల్ ఫైనల్‌ను 3.2 కోట్ల మంది ఏకసమయంలో చూడగా... ఇప్పుడు ఆ రికార్డును తాజా ప్రపంచకప్ మ్యాచ్ బద్దలు కొట్టింది. -
24 పరుగులకు ఐఫోన్ 15.. 36 పరుగులకు స్కోడా కారు!
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం స్విగ్గీ ‘మ్యాచ్ డే మానియా’ ద్వారా క్యాష్‌ప్రైజ్‌ను ఆఫర్ చేయనుంది. క్రికెట్ వరల్డ్‌కప్ 2023 సందర్భంగా తన కష్టమర్లలో జోష్ నింపేందుకు వివిధ ప్రైజ్‌మనీతో అలరించనుంది. అక్టోబర్ 11 నుంచి నవంబర్ 19 వరకు క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసిన కస్టమర్లకు రూ.150 తగ్గించనున్నట్లు కంపెనీ తెలిపింది. మ్యాచ్ డే మానియా ఆఫర్ ప్రకారం.. కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ ధర ఆధారంగా వారి వాలెట్లో రన్స్ జమ అవుతాయి. 2 పరుగులకు స్విగ్గీ లేదా ఇన్‌స్టామార్ట్‌లో నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయవచ్చు. 4 పరుగులకు డైనింగ్‌లో రాయితీపై డైన్అవుట్ ద్వారా బిల్లు చెల్లించే వెసులుబాటు ఉంటుంది. 6 పరుగులు సాధిస్తే స్విగ్గీ హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత సాధించవచ్చు. లేదంటే రూ.10000 స్విగ్గీమనీ సొంతం చేసుకోవచ్చు. ఇలా పరుగులు పెరుగుతున్న కొద్దీ తాజ్హోటల్లో బస, తనిష్క్ వోచర్ గెలుచుకోవచ్చు. 24 పరుగులకు ఐఫోన్ 15, 36 పరుగులకు స్కోడా కారు గెలుపొందే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. -
తుపాను సమయంలో ఫోన్ వాడకూడదా? దీనిలో నిజమెంత?
పిడుగులు పడుతున్నప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదని చాలామంది అంటుంటారు. ఆ సమయంలో ఫోన్లను వినియోగిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, పిడుగుపాటుకు గురయ్యే అవకాశాలు పెరుగుతాయని కూడా చెబుతారు. ఇదేవిధంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వాతావరణంలో ఇంటర్నెట్ వాడకూడదని కూడా అంటుంటారు. దీనివెనుకగల కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మొబైల్ ఫోన్లు విద్యుత్తును ఆకర్షిస్తాయని, మెరుపు మెరిసినప్పుడు దానిలోని విద్యుత్ శక్తిని ఫోన్ తన వైపుకు ఆకర్షిస్తుందని చాలామంది నమ్ముతారు. ఫలితంగా ఇంటిపై పిడుగు పడే అవకాశాలుంటాయని చెబుతారు. దీని వెనుక ఉన్న లాజిక్ గురించి కొందరు ఏమంటారంటే.. మెరుపులోని విద్యుత్ ఫోన్టవర్ ద్వారా మీ ఫోనును చేరుకుంటుందని అంటుంటారు. తుఫాను సమయంలో మెరుపులు, పిడుగులలోని విద్యుత్ ఫోన్‌కు చేరుకుని అది పేలవచ్చని, లేదా ఇంటిపై పిడుగులు పడవచ్చని చెబుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో, నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం మొబైల్ ఫోన్లు సిగ్నల్స్ కోసం రేడియో తరంగాలను, ఎలక్ట్రిక్ మాగ్నెటిక్ వేవ్స్ ను స్వీకరిస్తాయి. ఈ తరంగాల గుండా విద్యుత్ ఎప్పుడూ ప్రవహించదు. అంటే ఈ రేడియో తరంగాల ద్వారా విద్యుత్తు మీ ఫోన్‌కు ఎప్పటికీ చేరదు. మొత్తంగా చూస్తే పిడుగుపాటు సమయంలో మొబైల్ ఫోన్ వాడకూడదనేది కేవలం భ్రమ మాత్రమేనని చెప్పవచ్చు. ఎవరైనా తుఫాను సమయంలో కూడా మొబైల్ ఫోన్‌ను నిరభ్యరంతరంగా ఉపయోగించవచ్చు. అయితే వైర్డ్ టెలిఫోన్ విషయంలో కొంతమేరకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: ‘ఓం’పై నేపాల్‌కు ఎందుకు ద్వేషం?