డెలివరీ బాక్స్ ఓపెన్ చూసి షాక్ అయిన మహిళ? | Khammam Woman Orders Phone in Amazon, She Shock After | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ డెలివరీ బాక్స్ ఓపెన్ చూసి షాక్ అయిన మహిళ?

Published Tue, Jun 8 2021 7:12 PM | Last Updated on Tue, Jun 8 2021 9:40 PM

Khammam Woman Orders Phone in Amazon, She Shock After - Sakshi

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఖరీదైన వస్తువుల స్థానంలో రాళ్లు, ఇటుకలు, ఇతర వస్తువులను డెలివరీ చేసిన సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయి. ఇలా బుక్ చేసిన వస్తువు కాకుండా నకిలీ వస్తువులను, రాళ్లను చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. తాజాగా ఇలాంటి ఒక సంఘటన ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. అయితే, ఈ సారి ఆర్డర్ చేసిన వస్తువుకు బదులుగా లైఫ్‌బాయ్ రావడం చూసి ఆర్డర్ చేసిన వ్యక్తి కంగుతిన్నారు.
 
అమెజాన్‌లో బుర్హన్ పూర్‌కు చెందిన మంజుల అనే మహిళ రూ.10,400 విలువ చేసే వివో సీ-15 మొబైల్ ఫోన్ కోసం బుక్ చేసింది. బుక్ చేసిన కొద్దీ రోజులకు ఫోన్ కూడా డెలవరీ కూడా అయ్యింది. ఆర్డర్ చేసిన వ్యక్తి బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు ఎందుకైన మంచిది అని వీడియో రికార్డు చేశారు. తీరా ఆ మొబైల్ ఓపెన్ చేశాక అందులో రెండు లైఫ్‌బాయ్ సబ్బులు రావడం చూసి ఆశ్చర్యపోయారు. దీంతో భాదితులు మోసపోయినట్లు గ్రహించి వెంటనే అమెజాన్ సంస్థకు పిర్యాదు చేశారు. అమెజాన్ లాంటి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలో ఇలా జరగటం తెలిసి ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వినియోగదారుడి ఫిర్యాదును స్వీకరించిన అమెజాన్ సంస్థ విచారణ చేస్తుంది.

ఇది కూడా చదవండి: ఎలక్ట్రిక్ సైకిల్... 70 కి.మీ మైలేజ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement