ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి (Realme) నుంచి రియల్‌మి 10 సిరీస్ (Realme 10 Series) నవంబర్‌లో గ్రాండ్ లాంచ్‌క్ రెడీగా ఉంది. కంపెనీ రియల్‌మీ 10 సిరీస్‌ను చైనాలో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్‌లో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. లాంచ్‌కు ముందు, ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌పై పుకార్లు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కూడా త్వరలో Realme 10 సిరీస్ మార్కెట్లోకి రానున్నట్లు ట్విటర్ ద్వారా తెలిపింది.
రాబోయే లైనప్‌లో వనిల్లా Realme 10, Realme 10 Pro+ అనే రెండు మోడల్‌లు ఉన్నాయి. కంపెనీ రియల్‌మీ సిరీస్ డిజైన్, పెర్ఫార్మెన్స్, పనితీరును ట్విటర్ ద్వారా రివీల్ చేసింది. రెగ్యులర్ మోడల్ MediaTek Helio G99 SoC ద్వారా పవర్ అందిస్తుంది. Realme 10 Pro+ హుడ్ కింద MediaTek డైమెన్సిటీ 1080 SoCని కలిగి ఉంటుంది.
ఫీచర్ల అంచనా..
Realme 10 4G.. 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 ఇంచెస్ FHD+ AMOLED డిస్‌ప్లే
►స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో పంచ్-హోల్ కటౌట్ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం
►4GB RAM, 128GB స్టోరేజ్
►స్మార్ట్‌ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ
Realme 10 Pro+ 5G.. 6.7 ఇంచెస్ AMOLED FHD+ డిస్‌ప్లే
► అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉండే అవకాశం
►స్మార్ట్‌ఫోన్ 8GB వరకు RAM, 128GB ఇన్‌బిల్ట్ స్టోరేజ్ జత చేయబడిన డైమెన్సిటీ 1080 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది.
►67W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీ సపోర్ట్
చదవండి: మస్క్‌కు షాక్: ట్విటర్ ఉద్యోగులను దిగ్గజాలు లాగేసుకుంటున్నాయ్?
Comments
Please login to add a commentAdd a comment