
షియోమీ ఎంఐ11 గ్లోబల్ గా ఈ రోజు సాయంత్రం 5:30గంటలకు లాంచ్ కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఫ్లాగ్‌షిప్ షియోమి ఫోన్ ఎంఐ11తో పాటు ఎంఐయూఐ 12.5ను కూడా విడుదల చేయనున్నారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888ప్రాసెసర్ తో ఎంఐ11ను గత ఏడాది చివర్లో చైనాలో విడుదల చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ 2కె డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. షియోమీ ఎంఐ11లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. షియోమీ ఎంఐ11 గ్లోబల్ లాంచ్ యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌తో సహా షియోమీ సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ క్రింది వీడియో ద్వారా లాంచ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు.