MI
-
లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున
-
MI vs LSG: లక్నో గెలిస్తేనే ఆశలు సజీవం!
-
ముంబై ని ఓడించి play offs లోకి కేకేఆర్
-
కేకేఆర్‌ను ఢీకొట్టనున్న ముంబై
-
ముంబైకి షాకిచ్చిన ఢిల్లీ
-
సగం ధరకే రెడ్ మీ స్మార్ట్‌ఫోన్స్.. ఎక్కడంటే..!
సాక్షి,ముంబై: స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్మీ పేరెంట్ కంపెనీ ఎంఐ క్లియరెన్స్ సేల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సేల్ అతి తక్కువ ధరకే స్మార్ట్ఫోన్లను అందిస్తోంది. ఈ సేల్‌లో కొనుగోలుదారులు రూ. 3,999కే స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఎంఐ క్లియరెన్స్ సేల్కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. దీని ప్రకారం రెడ్ మీ 6ఏ, రెడ్ మీ వై3, రెడ్ మీ నోట్ 7 ప్రో. వంటి మోడల్స్ ను దాదాపు సగం ధరకు కొనుగోలు చేయవచ్చు. ఎంట్రీ-లెవల్ బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 6ఏ మోడల్ ప్రారంభ ధర రూ.6,999 కాగా, క్లియరెన్స్ సేల్ లో దీన్ని రూ. 3,999కి అందుబాటులో ఉంచింది. ప్రాథమిక ఫీచర్లతో, 2జీ ర్యామ్, 16జీబీ స్టోరేజీతో వచ్చిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ 6ఏ, దీంతోపాటు మిగతా మోడళ్లను కూడా తక్కువకే ఎంఐ సేల్‌లో లభ్యం. అయితే ఈ సేల్‌లో తగ్గింపుతో కొనుగోలు చేసిన స్మార్ట్ఫోన్లు వారంటీని కలిగి ఉండవు అనేది గమనార్హం. -
వారేవ్వా:రూ.10వేలకే!! రూ.30వేల ఖరీదైన 40 అంగుళాల ఎల్ఈడీ టీవీ!
మీరు టీవీ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకిదే సువార్ణావకాశం. 40అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ కేవలం రూ.10,499కే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీ అసలు ధర రూ.30వేలు ఉండగా ఎక్ఛేంజ్ ఆఫర్లో అతి తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశాన్ని ఫ్లిప్ కార్ట్ అందిస్తుంది. 40అంగుళాల ఎంఐ4ఏ హారిజోన్ ఎడిషన్ ఎంఐ4ఏ హారిజోన్ ఎడిషన్ 40అంగుళాల ఎల్ఈడీ స్మార్ట్ టీవీ ధర రూ.29,999కే అందుబాటులో ఉంది. అయితే ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎంఐ టీవీ ధరపై 23శాతం డిస్కౌంట్ తో రూ.22,999కే అందిస్తుంది. ఇక అదనంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌పై 10 శాతం డిస్కౌంట్ తో టీవీ ధర రూ.21,499కి చేరుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ మీరు కోరుకున్న టీవీపై డిస్కౌంట్‌తో పాటు ఎక్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు 40అంగుళాల టీవీపై ఎక్ఛేంజ్ ఆఫర్ కింద రూ.11వేల వరకు పొంద వచ్చు. దీంతో టీవీ ధర రూ.10,499లకే అందుబాటులోకి వస్తుంది. -
ఎంఐ ప్రియులకి షియోమీ షాకింగ్ న్యూస్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీ మార్కెట్లో ఎంఐ, రెడ్ మీ పేరుతో మొబైల్స్ తీసుకొస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. బడ్జెట్ ప్రియుల కోసం రెడ్ మీ పేరుతో మొబైల్స్ తీసుకొస్తుంది. ఇక ప్రీమియం యూజర్ల కోసం ఎంఐ పేరుతో మొబైల్స్ టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఫిట్నెస్ బ్యాండ్లు మార్కెట్లోకి వస్తాయి. అయితే, ఇక నుంచి ఎంఐ పేరుతో కాకుండా ‘షియోమీ’ పేరుతోనే వినియోగదారుల చేరువ కావడం కోసం సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. (చదవండి: పోస్ట్ ఆఫీస్ టాప్ - 5 డిపాజిట్ స్కీమ్స్) ఇక నుంచి ‘ఎంఐ’ లోగో స్థానంలో కొత్త బ్రాండ్ ‘షియోమీ’పేరుతో డివైజస్ మార్కెట్లోకి వస్తాయని వెల్లడించింది. ఇప్పటికే వచ్చిన ఎంఐ బ్రాండ్ మొబైల్స్ ఇక నుంచి ‘షియోమీ' లోగోతో వస్తాయని పేర్కొంది. షియోమీ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన నేపథ్యంలో ఆ పేరుతోనే యూజర్లకు దగ్గరికి కావడం కోసం కొత్త బ్రాండింగ్ తో ముందుకు వస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఎంఐ బ్రాండింగ్ గల ప్రొడక్ట్ స్థానంలో 'షియోమీ' పేరుతో కొత్త లోగో వస్తుంది. రెడ్ మీ కింద తయారు చేసిన ఉత్పత్తులు అదే లోగోతో కొనసాగుతాయని చైనీస్ టెక్ కంపెనీ పేర్కొంది. ఎంఐ బ్రాండింగ్‌కు బదులు ‘'షియోమీ’ లోగోను తీసుకురావాలని గత సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నట్లు ఇండియా మార్కెటింగ్ హెడ్ జస్కరన్ సింగ్ కపానీ పేర్కొన్నారు. చివరగా, భారతదేశంలో విడుదలైన దాని ల్యాప్ టాప్, ఎంఐ నోట్ బుక్ అల్ట్రా ఎంఐ లోగోకు బదులుగా షియోమీ లోగోతో వచ్చింది. -
Mi బ్రాండ్ పేరు మారుతోంది ? కొత్తగా నేమ్ ఇదే ?
ఇండియాలో హయ్యస్ట్ అమ్మకాలు సాధించిన ఎంఐ బ్రాడ్ పేరు మారబోతుంది. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్లు నాణ్యతతో అందిస్తూ ఇండియా మార్కె్ట్లో చెరగని ముద్ర వేసింది ఎంఐ బ్రాండ్. స్మార్ట్ఫోన్లతో మొదలు పెట్టి టీవీలు, వాచీలు, ఇయర్ ఫోన్స్, ల్యాప్టాప్స్ ఇలా అనేక విభాగాలకు విస్తరించిన ఎంఐ బ్రాండ్, దాని లోగో ప్రస్తుతం ఉన్న రూపంలో భవిష్యత్తులో కనిపించదు. Mi ఎలా వచ్చింది. ఎంఐ బ్రాండ్‌తో మనకు లభించే ఫోన్లు, ల్యాప్‌ల్యాప్‌లను తయారు చేసే కంపెనీ పేరు షావోమి. ఇంగ్లిష్‌లో Xiaomiగా రాస్తారు. ఇందులో చివరి రెండు అక్షరాలైన Mi అక్షరాలనే లోగోగా మార్చి షావోమి చైనా, ఇండియాతో పాటు ఏషియా మార్కెట్లో తిరుగులేని బ్రాండ్‌గా మారింది. ఎంఐ బ్రాండ్ ఎప్పటి నుంచి షావోమి నుంచి తొలి స్మార్ట్‌ఫోన్ 2011 ఆగస్టులో వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్న మోడల్స్ వచ్చాయి. ఇందులో ఎంఐ నోట్ సిరీస్‌కి ఇండియాలో మంచి ఆధరణ లభించింది. తాజాగా షావోమి సంస్త చైనాలో మిక్స్ 4 పేరుతో కొత్త ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఈ సందర్భంగా ఫోన్‌పై ఎంఐకి బదులు షావోమి అని ముద్రించింది. అంతేకాదు ఫోన్ ఆన్ చేసినప్పుడు వచ్చే ఎంఐ లోగో బదులు షావోమి లోగోను పొందు పరిచింది. మిగిలిన చోట ఎప్పుడు ప్రస్తుతం చైనాలో ఎంఐ బ్రాండ్ స్థానంలో షావోమి బ్రాండ్ నేమ్, లోగోను ఉపయోగిస్తున్నామని, త్వరలోనే ఇతర మార్కెట్ రీజియన్లలో కూడా ఎంఐ బదులు షావోమి లోగో, బ్రాండ్ నేమ్‌ను ప్రవేశపెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. భవిష్యత్తులో రిలీజ్ అయ్యే ప్రొడక్టులపై ఎంఐ బదులుగా షావోమి అని ఉంటుందని వెల్లడించారు. అమ్ముడైన ఫోన్లు ఎన్ని 2011లో షావోమి సంస్థ నుంచి తొలి ఫోన్ ఎంఐ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 80 కోట్ల ఫోన్ల అమ్మకాలు జరిగాయి. టెక్ దిగ్గజ కంపెనీలైన శామ్సంగ్, ఆపిల్లను సైతం ఎంఐ వెనక్కి నెట్టింది.తాజాగా ఈ కంపెనీ బ్రాండ్ నేమ్‌ని ఎంఐ నుంచి షావోమికి మారుతోంది. చదవండి: Work From Home: ఐటీ కంపెనీలకు కర్నాటక సర్కార్ రిక్వెస్ట్ -
షావోమికి షాక్: సెల్ ఫోన్లతో వెళ్తున్న లారీనీ దోచేశారు
కోలారు: చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి-75పై దోపిడీదారులు చెలరేగిపోయారు. కంటైనర్ లారీని అడ్డుకుని రూ.6.4 కోట్ల విలువైన సెల్ఫోన్లను దోపిడీ చేశారు. ఈ ఉదంతం కర్ణాటకలోని కోలారు జిల్లా, ముళబాగిలు తాలూకాలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. చైనా మొబైల్ కంపెనీ షావోమికి చెందిన ఎంఐ కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్లతో బయలుదేరిన కంటైనర్‌ను వెంటాడి మరీ దోచుకున్న వైనం కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ముళబాగిలు పోలీసుల కథనం మేరకు...చెన్నై నుంచి బెంగళూరుకు ఎంఐ కంపెనీకి చెందిన సెల్ఫోన్ల లోడ్‌తో గురువారం సాయంత్రం పీజీ ట్రాన్స్పోర్ట్కు చెందిన కంటైనర్ లారీ (నం.కేఏ01ఏపీ6824) బయల్దేరింది. అర్ధరాత్రి దాటిన తర్వాత ముళబాగిలు తాలూకా దేవరాయసముద్ర గ్రామ సమీపంలోకి చేరుకోగానే కారులో వెంటాడిన 8 మంది దుండగులు లారీని అడ్డగించారు. డ్రైవర్‌ను తాళ్లతో బంధించి నిర్జన ప్రదేశంలో వదిలేసి సెల్ఫోన్ల లారీతో ఉడాయించారు. నేర్లహళ్లి గ్రామం వద్ద సెల్ఫోన్లను మరో లారీలోకి తరలించి తీసుకెళ్లారు. తెల్లవారుజామున డ్రైవర్ కట్లు విప్పుకుని ముళబాగిలు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సెంట్రల్ జోన్ ఐజీ చంద్రశేఖర్, కోలారు ఎస్పీ కిశోర్‌బాబు, డీఎస్పీ గోపాల్ నాయక్, ముళబాగిలు ఎస్ఐ ప్రదీప్ సింగ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డీఎస్పీ గోపాల్‌నాయక్ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి దుండగుల కోసం గాలింపు చేపట్టారు. సెల్‌ఫోన్ బాక్స్‌లు ఎత్తుకెళ్లిన తర్వాత ఖాళీగా ఉన్న కంటైనర్ -
ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్‌గా రెడ్మీ
-
సంచలనం:యాపిల్‌ను వెనక్కి నెట్టిన షియోమీ
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమీ సంచలనం సృష్టించిది. యాపిల్ కంపెనీని వెనక్కి నెట్టేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్ మేకర్‌గా నిలిచింది. ఇక ఈ చైనీస్ మొబైల్ కంపెనీ ఇప్పుడు శాంసంగ్ టాప్ పొజిషన్‌కు ఎర్త్ పెట్టేందుకు సిద్ధమైంది. టెక్నాలజీ మార్కెట్ అనలిస్ట్ canalys నివేదిక ప్రకారం.. 2021 రెండో క్వార్టర్లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాల ద్వారా షియోమీ రెండో స్థానానికి చేరుకుంది. ఇక మొత్తం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 19 శాతం షేర్లతో దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్ టాప్ పొజిషన్లో ఉండగా, షియోమీ 17 శాతం షేర్ల వద్ద ముగిసింది. సాధారణంగా ఇప్పటిదాకా శాంసంగ్, యాపిల్ల్లో మాత్రమే ఏదో ఒకటి నెంబర్ వన్ పొజిషన్లో ఉంటూ వచ్చేవి. ఫస్ట్ టైం షియోమీ రెండో ప్లేస్‌కు చేరి ఆ సంప్రదాయానికి పుల్‌స్టాప్ పెట్టింది. హువాయ్ పతనం తర్వాత మిగతా ఫోన్ కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈ గ్యాప్‌ను పూరించే పోటీలో షియోమీ పైచేయి సాధించింది. లాటిన్ దేశాలకు 300 శాతం కంటే ఎక్కువ, ఆఫ్రికా దేశాలకు 150 శాతం, పశ్చిమ యూరప్ దేశాలకు 50 శాతం షియోమీ ఫోన్ ఎగుమతులు వెళ్లాయి. ఎంఐ11 అల్ట్రా లాంటి ఫోన్ల వల్లే షియోమీ క్రేజ్ పెరిగిందని.. అదే టైంలో ఒప్పో, వివో నుంచి గట్టి పోటీ ఎదురైందని కనాలిస్ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ షియోమీ రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక ఈ ఊపు ఇలాగే కొనసాగితే షియోమీ నెంబర్ వన్ బ్రాండ్‌గా అవతరించేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం యాపిల్‌కు 14 శాతం షేర్ ఉండగా, ఒప్పో.. వివోలు చెరో పదిశాతం మార్కెట్‌ను కలిగి ఉన్నాయి. -
ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో రాబోయే ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు
ప్రముఖ మొబైల్ తయారీ దిగ్గజాలలో ఒకటైన షియోమీకి చెందిన ఎంఐ 11 మొబైల్ ఇంకా అన్నీ దేశాలలో విడుదల అయ్యిందో కాలేదో గాని అప్పుడే తదుపరి తరం మొబైల్ ఎంఐ 12పై అనేక పుకార్లు బయటకి వస్తున్నాయి. ఈ పుకార్ల ప్రకారం.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 895 ప్రాసెసర్, 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో రానున్నట్లు తెలుస్తుంది. మన మానవుడి కంటి సామర్థ్యమే 576 మెగాపిక్సల్ అలాంటిది ఎంఐ 12 మొబైల్ లో 200 మెగాపిక్సల్ అంటే కొంచెం అతిశయోక్తిగా ఉంది. పుకార్ల ప్రకారం అయితే ఈ ఫీచర్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్ నెలలో చైనాలో తీసుకొచ్చిన ఎంఐ 11లో ఫ్లాగ్ షిప్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తీసుకొచ్చింది. ప్రపంచంలో మొదటిసారి స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వచ్చిన మొబైల్ కూడా షియోమీ(ఎంఐ 11) కంపెనీకి చెందినదే. తర్వాత రాబోయే ఎంఐ 12 స్మార్ట్‌ఫోన్‌లో తదుపరి క్వాల్ కామ్ నుంచి రాబోయే ప్రాసెసర్ తీసుకొచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు. చైనీస్ టిప్ స్టార్ షేర్ చేసిన వివరాల ప్రకారం.. షియోమీ కొత్తగా తీసుకొని రాబోయే ఫోన్లో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ ఎస్ఎమ్8450 అనే పేరుతో పిలిచే ప్రాసెసర్ తీసుకొస్తునట్లు తెలుస్తుంది. ఆ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 895 లేక కొత్తగా ప్రకటించిన స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ అని విషయం పూర్తిగా తెలియదు. 16-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ టెక్నిక్ స్నాప్ డ్రాగన్ 888 ప్లస్ అనే ప్రాసెసర్, 888 ప్రాసెసర్ కంటే చాలా శక్తివంతమైనది. ఎంఐ 12లో శామ్ సంగ్, ఒలంపస్ నుంచి రాబోయే 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుందని సమాచారం. ఈ పుకార్ల ప్రకారం 16-ఇన్-1 పిక్సెల్ బిన్నింగ్ అనే టెక్నిక్ ద్వారా 200-మెగాపిక్సెల్ కెమెరా అవుట్ పుట రానుంది. అంటే 12 మెగాపిక్సల్ సామర్ధ్యమే(12*16 =192 మెగాపిక్సల్). ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్ లో ఒలంపస్ లోగో కూడా ఉండవచ్చు. ఇది అడ్రినో 730 జీపీయు, క్వాడ్-ఛానల్ ఎల్ పీడీడీఆర్5 ర్యామ్ సపోర్ట్ రానున్నట్లు తెలుస్తుంది. చదవండి: State Bank Day: పీఎం కేర్స్ ఫండ్‌కు భారీ విరాళం -
48 ఎంపీ కెమెరాతో కొత్త టీవీ లాంచ్ చేసిన ఎంఐ
షియోమీ చైనాలో ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్, ఎంఐ టీవీ ఈఎస్ 2022 స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది. రెండు టీవీలు విభిన్న ఫీచర్లతో వచ్చాయి. ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ మీడియాటెక్ MT9950 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 3డీ ఎల్ యుటీ ఫిల్మ్ ఇండస్ట్రియల్ గ్రేడ్ కలర్ కరెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. దీని ముందు భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 48 మెగాపీక్సెల్ మెయిన్ కెమెరాను కలిగి ఉంది. మరోవైపు, ఎంఐ టీవీ ఈఎస్ 2022 మీడియాటెక్ ఎమ్ టి9638 ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. రెండు టీవీలు బెటర్ కాంట్రాస్ట్, పిక్చర్ క్వాలిటీ కొరకు మల్టీ జోన్ బ్యాక్ లైట్ సిస్టమ్ ని కలిగి ఉన్నాయి. ఈ కొత్త ఎంఐ టీవీ 6 ఎక్స్ ట్రీమ్ ఎడిషన్ 55 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 5,999(సుమారు రూ.68,900), 65 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 7,999(సుమారు రూ.91,900), ఇక 75 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 9,999 (సుమారు రూ.1,14,800)గా ఉంది. మరోవైపు, ఎంఐ టీవీ ఈఎస్ 2022 55 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 3,399(సుమారు రూ.39,000), 65 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 4,399(సుమారు రూ.50,500), 75 అంగుళాల మోడల్ ధర సీఎన్ వై 5,999 (సుమారు రూ.68,900)గా ఉంది. ఈ రెండు స్మార్ట్ టీవీలు అధికారికంగా జూలై 9న మార్కెట్లోకి రానున్నాయి. ఎంఐ.కామ్ లో ఇప్పటికే ప్రీ ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. చదవండి: Gravton Quanta EV: రూ.80కే.. 800 కిలోమీటర్లు ప్రయాణం -
వచ్చేసింది..ఎంఐ 11లైట్.. ప్రీ ఆర్డర్‌పై భారీ తగ్గింపు..!
ముంబై: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి ఎంఐ 11 లైట్‌ను జూన్ 22న లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎంఐ 11 లైట్ మార్చిలోనే విడుదల కాగా భారత్‌లో జూన్ 28 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానుంది. భారత్‌లో ఎంఐ 11 లైట్ 6జీబీ, 8 జీబీ వేరియంట్లలో రానుంది. కాగా ఎంఐ 11లైట్ (6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ) రూ. 21, 999 లభించనుంది. (8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ) వేరియంట్ రూ. 23, 999 కు లభిస్తోంది. ఎంఐ 11 లైట్ జాజ్ బ్లూ, ట్యూస్కానీ కోరల్, వినైల్ బ్లాక్ కలర్ వేరియంట్లతో రానుంది. ప్రపంచంలోనే అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా షావోమీ చెబుతుంది. ఎంఐ 11 లైట్ బరువు కేవలం 157 గ్రాములు మాత్రమే. కాగా ఈ ఫోన్ 6.8 ఎమ్ఎమ్ థిక్‌నెస్‌ను కల్గి ఉంది. తాజాగా ఎంఐ 11లైట్‌ను ప్రీ ఆర్డర్ చేస్తే రూ. 1,500 ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డ్‌ను ఉపయోగించే వారికి రూ.1,500 డిస్కౌంట్ అదనంగా లభిస్తోంది. ఎంఐ లైట్ 6జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ. 18, 999 ధరకు, 8జీబీ ర్యామ్+128 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను రూ. 20,999 ధరకు అందించనుంది. ఎంఐ 11 లైట్ ఫోన్‌ను ఫ్లిప్ కార్డులో, ఎంఐ స్టోర్‌లో జూన్ 25న ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చును. ఎంఐ 11 లైట్ తొలి సేల్ జూన్ 28 నుంచి ప్రారంభంకానుంది. ఎంఐ 11 లైట్ ఫీచర్స్: 6.55 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా , 33వాట్ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ *Drumrolls* It's THAT time now. Own the 6GB + 128GB for just 18,999/-* 8GB + 128GB for just 20,999/-* (incl. offers) So, save the date to pre-book the slimmest and the lightest smartphone of 2021 starting from 25th June, 12 noon ⏰#LiteAndLoaded #Mi11Lite pic.twitter.com/oud9MsVPiJ — Mi India (@XiaomiIndia) June 22, 2021 చదవండి: Xiaomi : స్మార్ట్‌వాచ్‌పై భారీ తగ్గింపు..! -
ఆన్లైన్లో ఎంఐ 11 లైట్ ఫీచర్స్ వైరల్
షియోమీ జూన్ 22న భారతదేశంలో తీసుకొని వస్తున్న ఎంఐ 11 లైట్ ఫీచర్స్ ఆన్లైన్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో ఇది కొనుగోలుకు రానుంది. ఎంఐ 11 లైట్ మూడు రంగుల్లో అందించనున్నట్లు షియోమీ ఇటీవల ప్రకటించింది. ఎంఐ 11 లైట్ ఇప్పటికే 2021 స్లిమ్మింగ్, తేలికైన స్మార్ట్ ఫోన్ గా దృవీకరించారు. షియోమీ ఎంఐ 11 లైట్ ధర రూ.25,000 కంటే తక్కువగా తీసుకొస్తారని సమాచారం. ఫోన్ బేస్ వేరియెంట్ ధర రూ.20,000 ఉండవచ్చు. ఎంఐ 11 లైట్ వన్ ప్లస్ నార్డ్ సీఈ 5జీ, ఐక్యూఓయూ జెడ్3, ఇతర ఫోన్ లతో పోటీ పడనుంది. ఆన్లైన్లో వైరల్ అవుతున్న ఎంఐ 11 లైట్ ఫీచర్స్ ఈ క్రింది విదంగా ఉన్నాయి. ఎంఐ 11 లైట్ ఫీచర్స్: 6.5 అంగుళాల ఎఫ్ హెచ్ డీ+ అమోల్డ్ డిస్ ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా , 33వాట్ రాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4,250 ఎమ్ఎహెచ్ బ్యాటరీ చదవండి: Revolt RV400: రెండు గంటల్లో బుకింగ్స్ క్లోజ్.. స్పెషల్ ఏంటి? -
షియోమీ నుంచి మరో సరికొత్త ఒఎల్‌ఈడీ టీవి
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ మొబైల్స్ తో పాటు, స్మార్ట్ టీవిల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే రెండు టీవిలను విడుదల చేసిన సంస్థ వచ్చే నెలలో మరో కొత్త ఒఎల్‌ఈడీ డిస్ప్లేతో టీవిని మార్కెట్లోకి తీసుకొనిరావాలని యోచిస్తుంది. చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ వీబోలో మి టీవీ లాంచ్‌ను టీజ్ చేయడం ప్రారంభించింది. కొత్తగా తీసుకొనిరాబోయే ఈ మోడల్ టీవి గురించి ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ ఒక టిప్‌స్టర్ అందించిన వివరాల ప్రకారం.. సంస్థ తర్వాత తరం ఒఎల్‌ఈడీ టీవి కావచ్చునని తెలుస్తుంది. షియోమీ గత ఏడాది జూలైలో ఎంఐ టివి లక్స్ సిరీస్‌ను ఒఎల్‌ఈడీ డిస్ప్లేతో పరిచయం చేసింది. సాదారణంగా షియోమీ దాని ఎంఐ టీవి శ్రేణిలో ఎల్ఇడి ప్యానెల్స్‌ను ఉపయోగిస్తుంది. వీబోలోని ఎంఐ టీవీ జనరల్ మేనేజర్ రెండు వేర్వేరు టీవీ సెట్ల చిత్రాలను పంచుకున్నారు. గత ఏడాది సంస్థ తెచ్చిన ఎంఐ టివి లక్స్ 65 అంగుళాల 4కె ఒఎల్‌ఈడీ టీవి ధర సిఎన్ వై 12.999 (సుమారు రూ.1,48,800)గా ఉంది. కంపెనీ తన కొత్త ఒఎల్‌ఈడీ ఎంఐ టీవిని గత ఏడాది ఆఫర్ చేసిన దానికంటే తక్కువ ధరకు తీసుకొస్తుందా అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. దీని ఎప్పుడు విడుదల చేయనున్నారు అనే దాని గురించి కంపెనీ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. చదవండి: ఎయిర్టెల్ 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా? -
Mi 11 Ultra: ఎంఐ 11 అల్ట్రా సేల్ మరింత ఆలస్యం
షియోమీ ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 23న విడుదల అయిన సంగతి తెలిసిందే. అదే రోజున ఎంఐ 11 సిరీస్‌లో ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్‌ని కూడా పరిచయం చేసింది షియోమీ. ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్స్ సేల్ మొదలైన ఎంఐ 11 అల్ట్రా సేల్ ఇంకా మొదలుకాలేదు. ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యి చాలా రోజులు గడిచిపోయిన సేల్ జరగకపోవడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. షియోమీ ఇండియాలో ఎంఐ 11 అల్ట్రా స్మార్ట్ఫోన్లను ఎందుకు సేల్ కు తీసుకురావట్లేదనే చర్చ జరుగుతుంది. షియోమీ అభిమానులు కూడా ఎంఐ 11 అల్ట్రా సేల్ ఎప్పుడు ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఈ అయోమయానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు సంస్థ క్లారిటీ ఇచ్చింది. తమ కంట్రోల్లో లేని అనివార్య పరిస్థితుల కారణంగా ఎంఐ 11 అల్ట్రా షిప్మెంట్ ఆలస్యం జరుగుతుందని, వీలైనంత త్వరగా సేల్ తేదీలను ప్రకటిస్తామని ట్విట్టర్లో ప్రకటించింది. దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్ల కారణంగా షియోమీ సరఫరా, ఉత్పత్తి ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని తెలుస్తుంది. ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్: 6.81 అంగుళాల డబ్ల్యూక్యూహెచ్డీ+ ఈ4 అమొలెడ్ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా 48 మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్ రియర్ కెమెరా 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 5,000ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ వైర్లెస్, వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ 10వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,990. చదవండి: కేవలం వారంలో భారీగా పెరిగిన ముకేశ్ అంబానీ సంపద -
షావోమి అద్భుతమైన స్మార్ట్ఫోన్లు, కళ్లు చెదిరే ఎంఐ టీవీ
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ మరో మూడు స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే భారత మార్కెట్లో రారాజులా వెలుగొందుతున్న షావోమీ తాజాగా అత్యంత సమర్థవంతమైన ఫ్లాగ్షిప్ ఎంఐ 11 సిరీస్‌లో ఎంఐ 11 అల్ట్రా ఎంఐ 11ఎక్స్, ఎంఐ 11ఎక్స్ ప్రో మోడల్స్‌ని వర్చువల్ ఈవెంట్ ద్వారా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పటికే వీటిని చైనాలో రిలీజ్ చేసింది. వివిధ డెబిట్, క్రెడిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా అందిస్తోంది. అంతేకాదు ఎంఐ క్యూఎల్ఇడి టీవీ 75ను కూడా లాంచ్ చేసింది. దీని ధర 119,999 రూపాయలు ( 1,600 డాలర్లు) ఏప్రిల్ 27 మధ్యాహ్నం 12 గంటలకు తొలిసేల్ ఉంటుంది. 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ వేరియంట్లలో ఎంఐ 11ఎక్స్‌ను తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.29,999. రూ.31,999 గా నిర్ణయించింది. మొదటి సేల్ ఏప్రిల్ 27న ప్రారంభమవుతుంది. ఎంఐ 11 అల్ట్రా 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.69,990 ఎంఐ 11ఎక్స్ ప్రోను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.39,990 కాగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.41,999. అమెజాన్‌తో పాటు షావోమీ ఇండియా అధికారిక వెబ్సైట్లో కొనొచ్చు. ఏప్రిల్ 24 నుంచి సేల్స్ మొదలు . -
భారీ ర్యామ్‌తో విడుదలైన ఎంఐ మిక్స్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ తన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్ లో ఎంఐ మిక్స్ పేరుతో విడుదల చేసింది. ఇది టాప్-ఆఫ్-లైన్ స్పెసిఫికేషన్లతో నో-బెజెల్ స్మార్ట్‌ఫోన్. ఫోల్డబుల్ డిస్ ప్లే మాత్రమే కాకుండా షియోమీ ఎంఐ మిక్స్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లో108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్స్ తో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో మూడు వేరియంట్లలో తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి చైనాలో ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, హువావే మేట్ ఎక్స్ 2లతో పోటీ పడనుంది. దీనిని మన దేశంలో ఎప్పుడు తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత లేదు. ఎంఐ మిక్స్ ఫోల్డ్ 6.52-అంగుళాల అమోలేడ్ ప్యానల్‌తో 840 x 2,520 పీఎక్స్ రిజల్యూషన్‌తో బయట వస్తుంది. ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ తెరిచినప్పుడు పెద్ద స్క్రీన్ 4: 3 నిష్పత్తిలో 1440పీ రిజల్యూషన్‌తో 8.01-అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. ఇప్పటి వరకు తీసుకొచ్చిన ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లలో ఇదే అతిపెద్ద డిస్ప్లే అని కంపెనీ పేర్కొంది. ఓఎల్ఈడి ప్యానెల్ హెచ్‌డిఆర్10 ప్లస్, డాల్బీ విజన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్ చేస్తే 6.5-అంగుళాల డిస్ప్లే 27: 9 నిష్పత్తితో, 90హెర్ట్జ్ కంటే ఎక్కువ రిఫ్రెష్ రేటు కలిగి ఉంది. ఇది 12జీబీ, 16జీబీ ర్యామ్ ఎంపికలతో స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇందులో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా (శామ్సంగ్ హెచ్ఎం 2 సెన్సార్), లిక్విడ్ లెన్స్ టెక్నాలజీతో 8 ఎంపీ సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో 13 ఎంపీ కెమెరా(ఎఫ్/2.4) ఉన్నాయి. ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ కూడా ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే డ్యూయల్ సెల్ 5,020 ఎంఏహెచ్ బ్యాటరీని అందించింది. 37 నిమిషాల్లో ఫోన్‌ను ఫుల్ ఛార్జ్ చేయవచ్చు అని కంపెనీ పేర్కొంది. ఎంఐ మిక్స్ ఫోల్డ్‌లో క్వాడ్ స్పీకర్లు కూడా ఉన్నాయి. ఇవి హర్మాన్ కార్డాన్ చేత ట్యూన్ చేయబడతాయి.ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12తో నడుస్తుంది. ఫోన్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. కనెక్టివిటీ విషయానికి వస్తే 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఎంఐ మిక్స్ ఫోల్డ్ ఫీచర్స్: 6.52-అంగుళాల అమోలేడ్ ప్యానల్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ 108 ఎంపీ ప్రైమరీ కెమెరా(శామ్సంగ్ హెచ్ఎం 2 సెన్సార్) 08 ఎంపీ సెకండరీ కెమెరా 13 ఎంపీ కెమెరా(ఎఫ్/2.4) 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 5,020 ఎంఏహెచ్ బ్యాటరీ 67వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయుఐ 12 ఓఎస్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ 12 జీబీ + 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,12,100 12 జీబీ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,23,300 16 జీబీ + 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర: సుమారు రూ.1,45,700 చదవండి: ఈ-వాహన రంగంలో షియోమీ భారీ పెట్టుబడులు శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్...! -
మార్చి 29న ఎంఐ 11 యూత్ ఎడిషన్ లాంచ్
ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ సరికొత్త మొబైల్స్‌ను ఎప్పటికప్పుడూ మార్కెట్లోకి తీసుకొస్తుంది. తాజాగా ఎంఐ 11 యూత్ ఎడిషన్‌ను చైనాలో మార్చి 29న లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎంఐ 11 ప్రో, ఎంఐ 11 అల్ట్రా, ఎంఐ బ్యాండ్ 6, కొత్త ఎంఐ మిక్స్ వంటి ఇతర కొత్త మొబైల్ వేరియంట్స్, పరికరాలను లాంచ్ చేయనున్నారు. ఎంఐ 11 యూత్ ఎడిషన్‌లో అమోఎల్ఈడి ప్యానెల్, ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల డిస్ప్లే అందిస్తున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90హెర్ట్జ్ కలిగి ఉంది. అదే విధంగా 20ఎంపీ సెల్ఫీ కెమెరాను షియోమీ అందిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 780 5జీ ప్రాసెసర్ అమర్చారు. సాధారణ ఫోన్ల మాదిరిగానే ఇందులో షియోమీ ఎంఐ 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ అందిస్తుంది. ఎంఐ 11 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ట్రఫుల్ బ్లాక్, సిట్రస్ ఎల్లో, మింట్ గ్రీన్ రంగులలో లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కెమెరాల విషయానికొస్తే, స్మార్ట్‌ఫోన్ లో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్, 5 ఎంపీ మాక్రో కెమెరా తీసుకొనిరానున్నారు. ఈ ఫోన్లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ అంతర్గత సామర్థ్యంతో తయారుచేశారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4,250 ఎంఏహెచ్ గా ఉంది. ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. చదవండి: ఈ అమెజాన్ లింకుతో జర జాగ్రత్త! -
ఎంఐ 11 అల్ట్రా ఫీచర్స్ వీడియో లీక్
ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ షియోమీకి చెందిన ఎంఐ 11 అల్ట్రా మొబైల్ వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ వీడియోలో ఆ మొబైల్ కు సంబందించిన డిజైన్, స్పెసిఫికేషన్లు వివరాలు ఉన్నాయి. ఎంఐ 11 సిరీస్‌లో తీసుకునివచ్చే టాప్ ఎండ్ మోడల్ ఇదే అయ్యే అవకాశం ఉంది. షియోమీ కంపెనీ మాత్రం ఎంఐ 11 అల్ట్రాకు సంబందించి ఎటువంటి సమాచారాన్ని అధికారికంగా ఎక్కడ ప్రకటించలేదు. దీనిలో 120ఎక్స్ అల్ట్రా పిక్సెల్ ఏఐ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ టెక్ బఫ్ యూట్యూబర్ దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ఎంఐ 11 అల్ట్రాలో రెండు వేరియంట్లు రానున్నట్లు తెలిపారు. బ్లాక్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. దీని కెమెరా మాడ్యూల్ కూడా చాలా పెద్దగా ఉంది. వీడియోలో మనం గమనిస్తే వెనకవైపు ఫోన్లో సగభాగాన్ని కెమెరా మాడ్యూలే ఆక్రమించింది. దీంతోపాటు వెనక కెమెరా మాడ్యూల్లో చిన్న డిస్ ప్లే కూడా ఉంది. దీని సాయంతో వెనక కెమెరాలో కూడా సెల్ఫీలు తీసుకోవచ్చు. అలాగే మొబైల్ స్క్రీన్ కూడా కనబడుతుంది. ఎంఐ 11 అల్ట్రా లీకైన ఫీచర్స్: డిస్ప్లే: 6.8-అంగుళాల ఓఎల్ఈడి డిస్ప్లే రిఫ్రెష్ రేట్: 120 హెర్ట్జ్ బ్యాటరీ: 5,000 ఫాస్ట్ ఛార్జింగ్: 67వాట్ వైర్డ్, 67వాట్ వైర్లెస్, 10వాట్ రివర్స్ ఛార్జింగ్ ర్యామ్: 12జీబీ స్టోరేజ్: 256జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 888 బ్యాక్ కెమెరా: 50ఎంపీ + 48ఎంపీ + 48ఎంపీ సెల్ఫీ కెమెరా: 20 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఆండ్రాయిడ్ 11 కలర్స్: బ్లాక్, వైట్ చదవండి: ఎంఆధార్ వినియోగదారులకు తీపికబురు ప్రపంచంలో చవకైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం -
అదిరిపోయే ఫీచర్స్ తో విడుదలైన ఎంఐ11
షియోమీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నా ఎంఐ 11ను గ్లోబల్ మార్కెట్లో 8జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో విడుదల చేసింది. షియోమీ ఎంఐ 11 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేయనుంది. అవుట్-ఆఫ్-ది-బాక్స్ ఎంఐయూఐ 12.5 ఓఎస్ తో పనిచేస్తుంది. ఎంఐ 11 మొబైల్ ఇండియా లాంచ్‌కు సంబంధించిన వివరాలను షియోమీ ఇంకా వెల్లడించలేదు. షియోమీ ఎంఐ 11ను గత ఏడాది డిసెంబర్లో చైనాలో విడుదల చేశారు. షియోమీ ఎంఐ 11 ఫీచర్స్: డిస్ప్లే: 6.81-అంగుళాల 2కే డబ్ల్యూక్యూహెచ్‌డి అమోలెడ్ రిఫ్రెష్ రేట్: 120హెర్ట్జ్ బ్యాటరీ: 4,600 ఎమ్ఏహెచ్ ఫాస్ట్ ఛార్జింగ్: 55 డబ్ల్యూ వైర్డ్, 50 డబ్ల్యూ వైర్లెస్ ర్యామ్: 8జీబీ LPDDR5 స్టోరేజ్: 128జీబీ, 256జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 888 బ్యాక్ కెమెరా: 108ఎంపీ(ఎఫ్/1.85) + 13ఎంపీ(ఎఫ్/2.4) + 5ఎంపీ సెల్ఫీ కెమెరా: 20 ఎంపీ ఆండ్రాయిడ్ ఓఎస్: ఎంఐయూఐ 12.5 కలర్స్: హారిజన్ బ్లూ, మిడ్ నైట్ గ్రే, క్లౌడ్ వైట్ కనెక్టివిటీ: 5జీ, 4జీ ఎల్‌టిఇ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ 5.2 ఎంఐ 11 ధర: ఎంఐ 11 8జీబీ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యూరో 749(సుమారు రూ.65,800)గా నిర్ణయించగా, 8జీబీ + 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర యూరో 799(సుమారు రూ.70,100)గా ఉంది. ఫోన్ క్లౌడ్ వైట్, హారిజోన్ బ్లూ, మిడ్నైట్ గ్రే కలర్ ఆప్షన్లలో వస్తుంది. దీనికి రెండు సంవత్సరాల వారంటీ లభిస్తుంది. చదవండి: వాట్సాప్‌ను వెనక్కి నెట్టేసిన టెలిగ్రాం నోకియా 5.4ను టీజ్ చేసిన ఫ్లిప్‌కార్ట్ -
షియోమీ ఎంఐ11 లాంచ్ లైవ్ ఈవెంట్
షియోమీ ఎంఐ11 గ్లోబల్ గా ఈ రోజు సాయంత్రం 5:30గంటలకు లాంచ్ కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఫ్లాగ్షిప్ షియోమి ఫోన్ ఎంఐ11తో పాటు ఎంఐయూఐ 12.5ను కూడా విడుదల చేయనున్నారు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888ప్రాసెసర్ తో ఎంఐ11ను గత ఏడాది చివర్లో చైనాలో విడుదల చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ 2కె డిస్ప్లే, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. షియోమీ ఎంఐ11లో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంది. షియోమీ ఎంఐ11 గ్లోబల్ లాంచ్ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్‌తో సహా షియోమీ సోషల్ మీడియా ఛానెల్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఈ క్రింది వీడియో ద్వారా లాంచ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు. -
లీకైన ఎంఐ11 గ్లోబల్ ధరలు
షియోమీకి చెందిన ఎంఐ11 స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ కు సంబందించిన యూరోపియన్ మార్కెట్ ధరలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. ఈ ఫోన్ యొక్క ధరలను ఒక టిప్‌స్టర్ బయటకి షేర్ చేసారు. లీకైన సమాచారం ప్రకారం, ఐరోపాలో ఎంఐ11 ధర 799(సుమారు రూ.69,800) యూరొల నుంచి ప్రారంభమవుతుంది. షియోమీ యొక్క ఈ ఫ్లాగ్షిప్ మొబైల్ ఇప్పటికే చైనాలో తీసుకొచ్చారు. అక్కడ బేస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు ధర చైనా యువాన్ 3,999(సుమారు రూ.45,300)గా ఉంది.(చదవండి: ఎస్బీఐ వినియోగదారులకు శుభవార్త!) ఐరోపాలో ఎంఐ11 ధర(అంచనా): టిప్‌స్టర్ సుధాన్షు షేర్ చేసిన సమాచారం ప్రకారం, ఎంఐ11 బేస్ 8జీబీ+128జీబీ స్టోరేజ్ మోడల్ ధర యూరప్‌లో యూరో 799(సుమారు రూ.69,800)కి తీసుకురానున్నట్లు సమాచారం. అదే సమయంలో 8జీబీ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యూరో 899(సుమారు రూ.78,500)గా నిర్ణయించినట్లు సమాచారం. చైనాలో లాంచ్ చేసిన మొబైల్ ధరల కంటే ధరలు ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంఐ11 ఫీచర్స్: డ్యూయల్ నానో సిమ్ తో రాబోయే ఎంఐ11 ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12తో పనిచేస్తుంది. ఇది 6.81-అంగుళాల 2కే డబ్ల్యూఓ హెచ్ డి(1,440x3,200 పిక్సెల్స్) డిస్ప్లేని కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఇందులో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఎంఐ11లో 108 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ షూటర్ కెమెరా, 5ఎంపీ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం 20మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఎంఐ11 టర్బోచార్జ్ 55వాట్ వైర్డు, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,600 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. -
షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్
షియోమీ కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబందించిన స్పెసిఫికేషన్లు కూడా ఆన్ లైన్లో లీకయ్యయి. ఇది రెడ్ మీ కే40 సిరీస్ లేదా ఎంఐ 11 సిరీస్‌కు సంబంధించిన ఫోన్ అని టెక్ నిపుణులు భావిస్తున్నారు. రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ కానుంది. ఇందులో వనిల్లా మోడల్ క్వాల్కామ్ నుంచి సబ్-ఫ్లాగ్షిప్ ప్రాసెసర్‌ను షియోమీ తీసుకొస్తున్నట్లు సమాచారం.(చదవండి: బిగ్ బ్యాటరీతో విడుదలైన పోకో ఎం3!) ఇందులో పంచ్ హోల్ కటౌట్ ఉన్న ఓఎల్ఈడీ డిస్ప్లేను షియోమీ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు ఒక ప్రముఖ టిప్‌స్టర్ తెలిపారు. అలాగే మిడ్ రేంజ్ మొబైల్ లో ఉపయోగించే ఎస్ఎం7350 ప్రాసెసర్ తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఇది 5ఎక్స్ జూమ్ కి సపోర్ట్ చేసే 64 ఎంపీ కెమెరా కలిగి ఉండవచ్చని టిప్‌స్టర్ పేపేర్కొన్నారు. ఇది రాబోయే రెడ్మి కె40 లేదా ఎంఐ 11 సిరీస్ వేరియంట్ కావచ్చు అని భావిస్తున్నారు. రెడ్ మీ కే40 స్మార్ట్ ఫోన్ ఈ నెలలోనే లాంచ్ సిద్ధంగా ఉంది. దీని ధర సిఎన్‌వై 2,999(సుమారు రూ.34,000) నుంచి ప్రారంభమవుతుంది. రెడ్ మీ కే40లో మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది లాంచ్ అయిన క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 765జీకి తర్వాత వెర్షన్‌గా స్నాప్ డ్రాగన్ 775జీ రానుంది. ఈ ప్రాసెసర్ ను ఇందులో తీసుకురానున్నట్లు అంచనా. -
షియోమీ ప్రియులకి గుడ్‌న్యూస్!
షియోమీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నా ఎంఐ 11 మొబైల్ విడుదల తేదీని సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఎంఐ 11ను ఫిబ్రవరి 8న గ్లోబల్ లాంచ్ కి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. గత నెలలో చైనాలో ఎంఐ 10కి కొనసాగింపుగా ఎంఐ 11ను విడుదల చేశారు. డిసెంబరులో ఆవిష్కరించబడిన ఫ్లాగ్షిప్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888తో వచ్చిన మొదటి మోడల్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ రికార్డు సృష్టించింది. దీనిలో షియోమీ కొత్త ఎంఐయుఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంను తీసుకోనురానున్నట్లు సమాచారం. ఎంఐ 11 ఫీచర్స్: డ్యూయల్ నానో సిమ్ ఎంఐ 11 ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంతో పని చేయనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో 6.8-అంగుళాల 2కే డబ్ల్యూక్యూహెచ్డీ అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో పాటు 8జీబీ లేదా 12జీబీ ర్యామ్ ను తీసుకోని రానున్నారు. ఎంఐ 11లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ఇందులో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. షియోమీ ఎంఐ 11లో 256జీబీ యుఎఫ్ఎస్3.1 స్టోరేజ్‌ను అందించనున్నారు. ఈ ఫోన్ లో ఎంఐ టర్బోచార్జ్ 55 డబ్ల్యూ వైర్డ్, 50 డబ్ల్యూ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేసే 4,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్లో కనెక్టివిటీ కోసం 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ వి5.2, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎ-జిపిఎస్, ఎన్ఎఫ్సి, ఇన్ఫ్రారెడ్, యుఎస్బి టైప్-సి పోర్ట్‌లు ఉన్నాయి. ఎంఐ 11 ధర: గ్లోబల్ మార్కెట్ షియోమీ ఎంఐ 11 ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ చైనాలో కోసం సిఎన్‌వై3,999 (సుమారు రూ.45,300)కి లాంచ్ చేశారు. ఎంఐ 11 8జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ మోడల్ సిఎన్‌వై 4,299 (సుమారు రూ.48,700)కి, టాప్-ఆఫ్-లైన్ 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ ఆప్షన్ సిఎన్‌వై4,699(సుమారు రూ.53,200) ధరను కలిగి ఉంది. -
పెరిగిన షియోమీ స్మార్ట్ టీవీ ధరలు
న్యూఢిల్లీ: షియోమీ తన స్మార్ట్ టీవీల ధరలను పెంచేసింది. సుమారు టీవీల ధరలు 3వేల వరకు పెరిగాయి. షియోమీ యొక్క ఎంఐ టీవీ 4ఏ, ఎంఐ టీవీ 4ఎక్స్, ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు షియోమీ యొక్క ఎంఐ.కామ్ వెబ్సైట్ లో కూడా కనిపిస్తున్నాయి. స్మార్ట్ టీవీల మీద పెరిగిన ధరలు ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల్లో కూడా వర్తిస్తుంది అని పేర్కొంది. గత నెలలో షియోమీ తమ స్మార్ట్ టీవీల ధరలను విడిభాగాల ధరలు పెరిగిన కారణంగా పెంచనున్నట్లు ప్రకటించింది.(చదవండి: శామ్సంగ్: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ) ఎంఐ టీవీ 4ఏ ప్రో 32-అంగుళాల ధర రూ.13,999 నుంచి రూ.14,999కి, ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ 32అంగుళాల మోడల్ ధర రూ.14,999 నుంచి రూ.15,499కి పెరిగింది. అదేవిధంగా ఎంఐ టీవీ 4ఎ 43 అంగుళాల ధర రూ.22,499 నుంచి రూ.24,999కి పెరిగింది. ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ 43 అంగుళాల వేరియంట్ ధర రూ.23,499 నుంచి రూ.25,999కి పెంచింది. షియోమీ ఎంఐ టీవీ 4ఎక్స్ 43అంగుళాల ధర రూ.25,999 నుంచి రూ.28,999కి పెంచింది. మరోవైపు ఎంఐ టీవీ 4ఎక్స్ 50 అంగుళాల ధర రూ.31,999 నుంచి రూ.34,999కి, ఎంఐ టీవీ 4ఎక్స్ 55 అంగుళాల టీవీ ధర రూ.36,999 నుంచి రూ.39,999కి పెంచింది. గడిచిన రెండేళ్లలో షియోమీ 50 లక్షల టీవీలను విక్రయించినట్లు గత నెలలో పేర్కొంది. దీంతోపాటు షియోమీ ఎంఐ క్యూఎల్ఈడీ టీవీని కూడా గత నెలలో లాంచ్ చేసింది. ఇందులో డాల్బీ విజన్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. -
షియోమీ ఎంఐ 10ఐ ఫస్ట్ సేల్
న్యూఢిల్లీ: షియోమీ ఎంఐ 10ఐ ఈ రోజు భారతదేశంలో అమ్మకానికి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు జనవరి 7నే అందుబాటులో ఉంది. షియోమీ ఈ వారం మొదట్లో ఎంఐ 10ఐని విడుదల చేసింది. ఎంఐ 10ఐ అమెజాన్ ఇండియా, ఎంఐ.కామ్‌లో ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు అందుబాటులోకి వచ్చింది. ఎంఐ 10ఐ యొక్క 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.20,999. 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999, అలాగే 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.23,999గా ఉంది. ఎంఐ 10ఐ పసిఫిక్ సన్‌రైజ్, అట్లాంటిక్ బ్లూ, మిడ్నైట్ బ్లాక్ వంటి మూడు రంగులలో లభిస్తుంది.(చదవండి: శామ్సంగ్: ఒకటి కొంటే ఒకటి ఫ్రీ) ఎంఐ 10ఐ స్పెసిఫికేషన్స్: డిస్ప్లే: 6.67-అంగుళాల ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే(120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్) ర్యామ్: 6జీబీ, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ రియర్ కెమెరా: 108ఎంపీ + 8ఎంపీ + 2ఎంపీ+ 2ఎంపీ సెల్ఫీ కెమెరా: 16 మెగాపిక్సెల్ బ్యాటరీ: 4,820 ఎంఏహెచ్(33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్) ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్ కనెక్టివిటీ: 5జీ, 4జీ, డ్యూయల్ వోఎల్‌టిఇ, యుఎస్బి టైప్-సి పోర్ట్, బ్లూటూత్ 5.1, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ధర: రూ.20,999-23,999 -
రేపే షియోమీ ఎంఐ 10ఐ లాంచ్
న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో కొత్త మొబైల్ ఎంఐ 10ఐను షియోమీ అన్ని మొబైల్ కంపెనీల కంటే ముందుగా లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆన్లైన్ ద్వారా లాంచ్ చేయనున్నారు. లాంచ్ చేయడానికి ముందే 108 మెగాపిక్సెల్ కెమెరా సెటప్, స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ వంటి కీలక వివరాలను షియోమీ వెల్లడించింది. ఈ ఫోన్ 2020లో చైనాలో లాంచ్ అయిన ఎంఐ 10టీ లైట్ యొక్క రీబ్రాండ్ వెర్షన్ అని భావిస్తున్నారు. కంపెనీ మాత్రం దీనిని భారతీయ మొబైల్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తయారు చేసినట్లు పేర్కొంది.(చదవండి: 39 వేల చైనా యాప్ లను నిషేదించిన యాపిల్) ఎంఐ 10ఐ ఫీచర్స్: ఇది నిజంగా ఎంఐ 10టి లైట్ యొక్క రీబ్రాండ్ అయితే దీనిలో 1080 రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల డిస్ప్లేను తీసుకురానున్నారు. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను తీసుకురానున్నారు. ఇది 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజ్ ఆప్షన్ లలో లభించనుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2-కెమెరా మాక్రో షూటర్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. సెల్ఫీల కోసం ఇందులో 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఇది 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4820 ఎమ్ఏహెచ్ బ్యాటరీ యూనిట్‌ను కలిగి ఉంటుంది. ఎంఐ 10ఐ ధర విషయానికొస్తే సుమారు భారతదేశంలో రూ.25,000 ఉండనుంది. -
షియోమీ న్యూ ఇయర్ 5జీ ఫోన్ ఇదే..!
న్యూఢిల్లీ: భారతదేశంలో ఎంఐ 10ఐ మొబైల్ ను జనవరి 5న తీసుకొస్తున్నట్లు షియోమీ ఇండియా చీఫ్ మను కుమార్ జైన్ అధికారికంగా ప్రకటించారు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ లో 108 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తున్నట్లు ప్రకటించారు. ఎంఐ 10ఐ రెడ్మి నోట్ 9 ప్రో గత నెల చైనాలో విడుదలైన 5జీ యొక్క రీబ్రాండెడ్ వెర్షన్. "కొద్ది రోజుల్లో మేము ఎంఐ 10ఐ అని పిలువబడే మా సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను ఎంఐ బ్రాండ్ క్రింద విడుదల చేయబోతున్నాం" అని జైన్ దాదాపు ఒకటిన్నర నిమిషాల నిడివి గల వీడియోలో చెప్పారు. ఎంఐ 10ఐలో ఐ అంటే ఇండియా అని తెలిపారు. భారత వినియోగదారుల కోసం ఈ ఫోన్ ను ప్రత్యేకంగా రూపొందించినట్లు పేర్కొన్నారు.(చదవండి: వొడాఫోన్ ఐడియా బంపరాఫర్) A perfect start to the new decade is #ThePerfect10. Launching the all-new #Mi10i where the 'i" stands for India. 🇮🇳 i = Made for India, Made in India, Customised by the India product team. Launching on 05.01.2021. New year, new start!🤩 pic.twitter.com/ZtSV7nYX4H — Mi India #Mi10TSeries5G (@XiaomiIndia) December 31, 2020 ఎంఐ 10ఐ ఫీచర్స్: ఎంఐ 10ఐ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ఆమోఎల్ఈడి డిస్ప్లే కలిగి ఉంటుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఎంఐ 10ఐ రెండు వేర్వేరు వేరియంట్లలో 6జీబీ, 8జీబీ ర్యామ్ ఆప్షన్స్ + 128జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ స్టాండర్డ్ గా ఉంటుందని భావిస్తున్నారు. దీనిలో 108 మెగాపిక్సల్ కెమెరాతో పాటు 8ఎంపీ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా, 2ఎంపీ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కోసం ముందుభాగంలో 16 మెగా పిక్సల్ కెమెరా తీసుకురానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ 4,820 ఎంఏహెచ్ నాన్-రీప్లేస్బుల్ లి-పాలిమర్ బ్యాటరీతో రోజంతా అద్భుతమైన బ్యాకప్‌ను అందిస్తుంది. దీనితో పాటు 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. నెట్వర్క్, కనెక్టివిటీ కోసం 4జీ వోల్టిఇ, వై-ఫై, మొబైల్ హాట్‌స్పాట్, వి5.0 బ్లూటూత్, ఎ-జిపిఎస్ విత్ గ్లోనాస్, ఎన్ఎఫ్సి మరియు టైప్-సి యుఎస్బి ఉన్నాయి. -
మరోసారి తన సత్తా చాటిన షియోమీ
చైనా: షియోమీ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎంఐ 11 ఫీచర్స్ ను కంపెనీ ప్రకటించింది. ఎంఐ 11 ఫ్లాగ్షిప్ మొబైల్ యొక్క ధర, ప్రత్యేకతలు, డిజైన్ వంటి వాటిని చైనాలో ఒక కార్యక్రమంలో విడుదల చేసారు. ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ని ఈ మొబైల్ లో తీసుకొచ్చారు. దీంతో మరోసారి షియోమీ మొబైల్ మార్కెట్ లో తనసత్తా చాటుకుంది. కేవలం ప్రాసెసర్ పరంగా మాత్రమే కాకుండా డిజైన్, కెమెరాల వంటి వాటితో పాటు ఇతర స్పెసిఫికేషన్స్ విషయంలో కూడా భారీ మార్పులు చేసింది. అయితే గ్లోబల్ మార్కెట్ లో ఎప్పుడు తీసుకొస్తారో అనేది విషయంపై స్పష్టత ఇవ్వలేదు. (చదవండి: లీకైన గెలాక్సీ ఎస్ 21 ఫీచర్స్) షియోమీ ఎంఐ 11 ఫీచర్స్: షియోమీ ఎంఐ 11 మొబైల్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 480 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, పంచ్-హోల్ కటౌట్ డిస్ప్లే తో వస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో 6.81-అంగుళాల ఇ4 అమోలెడ్ క్యూహెచ్డీ+డిస్ప్లేను కలిగి ఉంది. ఇది క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 5జీ ప్రాసెసర్ చేత 12జీబీ ఎల్‌పిడీడీఆర్5 ర్యామ్, 256జీబీ స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయుఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే ఇందులో 5జీ, 4జీ ఎల్టీఇ, వై-ఫై 6ఇ, బ్లూటూత్ వీ 5.2, జీపీఎస్/ఎ-జీపీఎస్, ఎన్ఎఫ్సీ, ఇన్ఫ్రారెడ్(ఐఆర్), యుఎస్బీ టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే కెమెరాల విషయానికొస్తే ఎంఐ 11 వెనుక భాగంలో f/1.85 ఎపర్చర్‌తో 108ఎంపీ ప్రైమరీ కెమెరా, 13ఎంపీ f/2.4 ఎపర్చర్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5ఎంపీ f/2.4 ఎపర్చర్ టెలిఫోటో-మాక్రో కెమెరాను కలిగి ఉంది. దింట్లో MEMC వీడియో ఫ్రేమ్ టెక్నాలజీ, ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజషన్ వంటివి ఉన్నాయి. ఇందులో సెల్ఫీ కోసం 20ఎంపీ కెమెరా ఉంది. ఎంఐ 11లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, హర్మాన్ కార్డాన్ స్టీరియో స్పీకర్లు, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. ఇందులో 55వాట్ వైర్డ్ ఛార్జింగ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్, 10వాట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. షియోమీ ఎంఐ 11 8జీబీ+ 128జీబీ ధర సీఎన్‌వై 3,999(సుమారు రూ.45,000), 8జీబీ + 128జీబీ వేరియంట్ ధర సీఎన్‌వై 4,299(సుమారు రూ.48,300), టాప్-ఎండ్ 12జీబీ+256జీబీ మోడల్ ధర సీఎన్‌వై 4,699(సుమారు రూ.52,900)గా ఉంది. ఇది బ్లూ, వైట్ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ రోజు నుంచి ప్రీ-ఆర్డర్ల కోసం సిద్ధంగా ఉంది. జనవరి 1న చైనాలో అమ్మకానికి రానుంది. -
యాపిల్ బాటలో షియోమీ
చైనా: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ రేపు(డిసెంబర్ 28) ఫ్లాగ్షిప్ ఫోన్ ఎంఐ 11ను విడుదల చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా షియోమీ సీఈఓ లీ జూన్ ఫ్లాగ్షిప్ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ లోపల ఛార్జర్‌ను తీసుకురావడం లేదని అధికారికంగా ధ్రువీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు లీ జూన్ పేర్కొన్నారు. ఇంట్లో పాత ఛార్జర్ లేని వినియోగదారులు కొత్త ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాలి అని అన్నారు. గతంలో ఇదే విదంగా యాపిల్ పర్యావరణ హితం అనే కారణంతో ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను ఇయర్ఫోన్లు, ఛార్జర్ లేకుండా మార్కెట్ లోకి తీసుకొచ్చింది. అదేవిదంగా శామ్సంగ్ నుండి త్వరలో రాబోయే గెలాక్సీ ఎస్ 21 సిరీస్ స్మార్ట్ఫోన్లతో కూడా ఛార్జర్‌ను తీసుకురావడం లేదని సమాచారం.(చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో మరో షాపింగ్ ఫెస్టివల్) రాబోయే ఎంఐ 11 ఫ్లాగ్షిప్ ఫోన్ యొక్క రిటైల్ బాక్స్ లోపల ఛార్జర్‌ను తీసుకురావడం లేదని చైనా సోషల్ మెసేజింగ్ యాప్ వీబోలో అధికారికంగా ధ్రువీకరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ చర్య తీసుకున్నట్లు లీ జూన్ చెప్పారు. అదేవిదంగా ఎగ్జిక్యూటివ్ రిటైల్ బాక్స్ యొక్క ఫోటోను షేర్ చేసారు. ఈ ఫొటోలో '11' నెంబర్ తో మినిమాలిస్టిక్ డిజైన్ లో బాక్స్ సైజ్ సన్నగా ఉంది. గతంలో వచ్చిన సమాచారం ప్రకారం ఎంఐ 11 ఫ్లాగ్షిప్ ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను తీసుకురానున్నారు. ఇది స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ చేత పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12పై పనిచేయనుంది. అలాగే, ఫ్లాగ్‌షిప్‌లో QHD ప్లస్ రిజల్యూషన్‌తో పాటు 120హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్ ఉంటుంది. షియోమీ ఎంఐ 11 ఫ్లాగ్షిప్ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో వస్తుంది. షియోమీ ఎంఐ 11 బేస్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128 జిబి స్టోరేజ్ ధర. సీఎన్‌వై 4,500 (సుమారు రూ.50,700) లభించనుంది. దీని 8జీబీ ర్యామ్ + 256 జీబీ మోడల్ సీఎన్‌వై 4,800(సుమారు రూ.54,000), టాప్-ఎండ్ మోడల్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర సీఎన్‌వై 5,200 (సుమారు రూ.58,600)గా ఉండనుందని తెలుస్తోంది. -
షియోమీ మరో అద్భుత ఆవిష్కరణ
మొబైల్ కంపెనీలు యూజర్లను ఆకట్టుకోవడం కోసం రోజుకో టెక్నాలజీని తీసుకొస్తున్నాయి. ఇప్పటికే శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తుండగా.. ఎల్జీ, ఒప్పో వంటి ఇతర కంపెనీలు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నాయి. మొబైల్ మార్కెట్ లో పోటీని తట్టుకునేందుకు షియోమీ కూడా మరో కొత్త టెక్నాలజీ మొబైల్ ని తీసుకురాబోతుంది. తాజాగా షావోమి సరౌండ్ డిస్ప్లే, పాప్-అప్ కెమెరా తో కొత్త ఫోన్‌ను తీసుకురాబోతుంది. వీటికి సంబంధించిన డిజైన్లు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఎంఐ మిక్స్ ఆల్ఫా పేరుతో దీనిని మార్కెట్ లోకి తీసుకువస్తున్నారు.(చదవండి: ఆపిల్, గూగుల్ కంపెనీలకు భారీ షాక్) షియోమీ కాన్సెప్ట్ ఫోన్ పేటెంట్ లను లెట్స్‌గో డిజిటల్ టెక్ సంస్థ విడుదల చేసింది. షియోమీ ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రపంచ మేధో సంపత్తి కార్యాలయంలో భాగమైన ది హేగ్ బులెటిన్‌తో పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. 2020 డిసెంబర్ 18న స్మార్ట్‌ఫోన్ యొక్క 16 స్కెచ్‌లు బయటకి వచ్చాయి. ఈ 16 స్కెచ్లలో మొబైల్ ఫుల్ 360 డిగ్రీల ర్యాపారౌండ్ డిస్ప్లే కలిగి ఉంది. దీనితో పాటు పాప్-అప్ ఫీచర్‌తో ట్రిపుల్ కెమెరా, డ్యూయల్-ఎల్ఈడీ ఫ్లాష్ లైట్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ మొబైల్ పై భాగంలో పవర్ బటన్, సెకండరీ మైక్రోఫోన్ ఉన్నాయి. ఫోన్ దిగువ భాగంలో స్పీకర్ గ్రిల్, ప్రైమరీ మైక్రోఫోన్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యుఎస్బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఇది స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ తో పనిచేయనున్నట్లు సమాచారం. దీనిని మార్కెట్లోకి ఎప్పుడు తీసుకువస్తారో అనే దానిపై ఇంకా సమాచారం లేదు. -
షియోమీ ఎంఐ 11 ప్రైస్ లీక్
షియోమీ ఎంఐ 11 సిరీస్ లో భాగంగా రెండు ఫోన్లను తీసుకొస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ మొబైల్ ని డిసెంబర్ 28న చైనాలో ప్రారంభించనున్నారు. ఈ లాంచ్ కి ముందు ఎంఐ 11 మొబైల్ యొక్క ధరలు మార్కెట్ లోకి లీక్ అయ్యాయి. ఎంఐ 11 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ని 4500 చైనా యువాన్లు/ 687 డాలర్లు(సుమారు 50,500)కు తీసుకురానునట్లు సమాచారం. అలాగే షియోమీ ఎంఐ 11 యొక్క 8/256 జీబీ ఆప్షన్ సిఎన్‌వై4,800(సుమారు రూ. 55,000), 12/256 జీబీ వేరియంట్‌కు సిఎన్‌వై 5,200(సుమారు రూ.60,000) ధర ఉంటుందని సమాచారం.(చదవండి: ఈ మొబైల్స్ వాడేవారికి గుడ్ న్యూస్) ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రానున్నట్లు కంపెనీ సీఈవో లీ జున్ ఇప్పటికే వెల్లడించారు. దీని స్పెసిఫికేషన్స్ సంబందించిన పూర్తీ సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. దీనిలో ఫుల్ హెచ్డీ+ అమోఎల్ఈడీ డిస్ప్లే తీసుకురానున్నట్లు సమాచారం. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉండనుంది. లీక్‌లు ప్రాథమిక సమాచారం మేరకు 108 మెగాపిక్సెల్ లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ టెలిఫొటో షూటర్ ఉండనున్నట్లు పేర్కొన్నారు. గీక్ బెంచ్‌లో ఈ ఫోన్ M2011K2C కోడ్ నేమ్ తో కనిపించింది. ఈ మొబైల్ 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఈ మొబైల్ ని మన దేశంలో జనవరి లేదా ఫిబ్రవరి నెలలో తీసుకురానున్నారు. -
జనవరి 5న రానున్న "ఎంఐ 10ఐ"
చైనా మొబైల్స్ సంస్థ షియోమీ మార్కెట్ లోకి మరో మొబైల్ ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. ఎంఐ 10 సిరీస్ లో భాగంగా ‘ఎంఐ 10ఐ’ పేరుతో వచ్చే మొబైల్ 2021 జనవరి 5న తీసుకువస్తున్నారు. ఇది క్వాడ్-కెమెరా సెటప్ తో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో రానుంది. చైనాలో ఇటీవల విడుదల చేసిన నోట్ 9 ప్రో 5జీకి రీబ్రాండెడ్ గా దీనిని తీసుకొస్తున్నట్లు సమాచారం. కానీ, ట్విటర్ లో ఈ మొబైల్ పేరును మాత్రం షియోమీ వెల్లడించలేదు. ఎంఐ 10 సిరీస్ లో భాగంగా ఎంఐ 10 ప్రో, ఎంఐ 10 లైట్, ఎంఐ 10 అల్ట్రా, ఎంఐ 10 లైట్ జూమ్ మొబైల్స్ తీసుకురానున్నట్లు సమాచారం.(చదవండి: ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బెస్ట్ బడ్జెట్ మొబైల్స్ ఇవే!) A perfect start to the new year. #ThePerfect10 Guess what's coming and 1⃣0⃣ lucky winners stand a chance to win #Mi goodies perfect for all you enthusiasts. A hint is in the video. Leave your responses with #ThePerfect10. 05.01.21 Stay Tuned. Spread The Word. pic.twitter.com/PnD4xmZWt7 — Mi India #Mi10TSeries5G (@XiaomiIndia) December 22, 2020 ఎంఐ 10ఐ ఇటీవల గీక్‌బెంచ్‌లో మోడల్ నంబర్ M2007J17Iతో కనిపించింది. గీక్‌బెంచ్‌లో వెబ్సైట్లో వెలువడిన వివరాల ప్రకారం షియోమీ తీసుకురాబోయే ఫోన్ 8జీబీ ర్యామ్ తో రానుంది. ఈ ఫోన్ గీక్‌బెంచ్‌లో సింగిల్-కోర్ స్కోరు 652, మల్టీ-కోర్ స్కోరు 2,004ను పొందింది. ఇది ఔట్ అఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 11తో రానున్నట్లు సమాచారం. క్వాడ్ కెమెరా సెటప్‌లో భాగంగా 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉండనున్నాయి. ఎంఐ 10ఐలో సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,820 ఎంఏహెచ్ బ్యాటరీ రానుంది. ఎంఐ 10ఐ 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే కలిగి ఉండనుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 750 ప్రాసెసర్ తీసుకురానున్నట్లు సమాచారం. -
ఫోను దొరికే వరకు పెళ్లి చేసుకోను!
న్యూఢిల్లీ: ఇష్టపడే ఫోనుపై కస్టమర్ మోజు ఎంతదూరం పోతుందనేందుకు కమల్ అహ్మద్ ఉదంతం నిదర్శనంగా చెప్పవచ్చు. స్మార్ట్ ఫోన్ యుగంలో రోజుకు పలు మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కొన్ని ఫోన్లయితే కస్టమర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వీరాభిమానుల్లో కమల్ ఒకరు. ఎంఐ కంపెనీకి పెద్ద అభిమానైన కమల్ సదరు కంపెనీ రూపొందించిన ఎంఐ 10టీ ప్రో ఫోను తన చేతికి వచ్చేవరకు పెళ్లి కూడా చేసుకోనని ప్రతినబూనాడు. ఇదే ఆశ్చర్యమనుకుంటే, అంతకుమించిన ఆశ్చర్యాన్నిస్తూ సదరు కంపెనీ కమల్‌కు నచ్చిన ఫోనును పంపింది. ‘‘ఎంఐ 10టీ ప్రో ఫోను దొరికే వరకు పెళ్లి చేసుకోను’’ అని డిసెంబర్ 11న కమల్ ట్వీటాడు. డిసెంబర్ 21న ఫోను తన చేతికి వచ్చిందని చెబుతూ దాని గుణగణాలు వర్ణిస్తూ మరో ట్వీట్ చేశాడు. చదవండి: 5జీ స్మార్ట్‌ఫోన్ కావాలంటున్నారు Finally received this monster. 🤩 The Mi 10T Pro display is indeed impressive. Most gorgeous phone. The amazing #108MP flagship #Mi10TPro. So many features. Under 40K, #Mi10T Pro is pretty good value for a phone. 👌 🥰 Thank you so much @manukumarjain @XiaomiIndia 🙏🙏 I ❤️ Mi pic.twitter.com/RkiyE6RiDx — #MiFan Kamal Ahamad (@kamalahamad65) December 21, 2020 షామీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్‌కు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. ఆయన కూడా సరదాగా ప్రతిస్పందిస్తూ ఇక కమల్ పెళ్లికి రెడీ కావచ్చని ట్వీట్ చేశాడు. ఇంతకీ కంపెనీ ఆయనకు నిజంగా ఫ్రీగా ఫోను ఇచ్చిందా? లేదా అని ఆరాతీయగా, ఎంఐ ఫ్యాన్ అయిన కమాల్ కంపెనీకి సంబంధించిన పలు ఇమేజ్ బిల్డింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటాడని, అనుకోకుండా తనకు లక్ కలిసివచ్చి ఫోను పొందేందుకు కూపన్ గెలుచుకున్నాడని కంపెనీ ప్రతినిధి చెప్పారు. ఎలాగైతేనేం కమల్ విషయంలో మాత్రం ‘కమాల్’ జరిగిందనుకోవచ్చు. haha! I think you are now ready to get married 😂😂 On a serious note, #Mi10TPro is probably the best flagship phone in India right now. I hope you like it. 🙏 Please do try out the #108MP camera and share your feedback with us. I ❤️ #Mi #Mi10 #Mi10T https://t.co/fsrOsQfVZP pic.twitter.com/mKVvZw9SH6 — Manu Kumar Jain (@manukumarjain) December 21, 2020 -
షియోమీ లవర్స్ కి గుడ్ న్యూస్
షియోమీ తన సొంత ప్లాట్ఫామ్లో నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్‌ను నిర్వహిస్తోంది. నేటి(డిసెంబర్ 18) నుండి డిసెంబర్ 22 వరకు ఈ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా ఎయిర్ ప్యూరిఫైయర్, స్మార్ట్ వాచ్, బ్యాక్‌ప్యాక్, స్మార్ట్ఫోన్లు ఇంకా మరిన్ని ఉత్పత్తులపై కంపెనీ 4,000 రూపాయల వరకు తగ్గింపును అందిస్తోంది. ఈ సేల్‌లో షియోమీ రెడ్మి నోట్ 9 ప్రో రూ.13,999కు లభిస్తుంది. షియోమి నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్ సందర్భంగా ఎంఐ నోట్‌బుక్ 14 హారిజన్ ఎడిషన్‌ను రూ.9 వేల తగ్గింపుతో రూ.50,999కు పొందవచ్చు. కంపెనీ తన ఎంఐ వాచ్ రివాల్వ్‌ను 9,999 రూపాయలకు అందిస్తోంది. గతంలో దీని ప్రారంభ ధర రూ.15,999కు లభించింది. ఫిట్నెస్ వాచ్‌లో 10 స్పోర్ట్స్ మోడ్లు, బాడీ ఎనర్జీ మానిటరింగ్, జిపిఎస్ సపోర్ట్, 1.39-అంగుళాల అమోలెడ్ డిస్ప్లే ఉన్నాయి. షియోమీ తన 10,000ఎంఏహెచ్ ఎంఐ వైర్లెస్ పవర్ బ్యాంక్‌పై రూ.700 తగ్గింపుతో 1,999 రూపాయలకు లభిస్తుంది. ఈ పవర్ బ్యాంకు 10వాట్ ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఉత్పత్తిపై ఈ సేల్‌లో తగ్గింపును ప్రకటించింది.(చదవండి: అమెజాన్ లో మరో కొత్త సేల్) -
క్యూఎల్ఇడి 4కే టీవీ లాంచ్ చేసిన షియోమీ
న్యూఢిల్లీ: 55 అంగుళాల క్యూఎల్ఇడి అల్ట్రా-హెచ్డి స్క్రీన్‌తో గల స్మార్ట్ టీవీని షియోమీ భారతదేశంలో విడుదల చేసింది. ఎంఐ క్యూఎల్ఇడి 4కే మోడల్ టీవీని భారత్ లో మొదటిసారిగా పరిచయం చేసింది. ఈ స్మార్ట్ టీవీ 3840x2160 పిక్సెల్ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. ప్రస్తుతం 55-అంగుళాల సైజు ఆప్షన్లో లభిస్తుంది. ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీ డిసెంబర్ 21న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్స్, విజయ్ సేల్స్ సహా ఇతర రిటైల్ దుకాణాల ద్వారా ఫస్ట్ సేల్ కి రానుంది. దీని ధర వచ్చేసి రూ.54,999.(చదవండి: ఆ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు) ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీ ఫీచర్స్: ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీ 55 అంగుళాల అల్ట్రా-హెచ్డి(3840x2160) పిక్సెల్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది హెచ్ఎల్జి, హెచ్‌డిఆర్ 10, హెచ్‌డిఆర్ 10ప్లస్, డాల్బీ విజన్‌తో సహా వివిధ హెచ్‌డిఆర్ ఫార్మాట్లకు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ టీవీ 10 ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ టీవీ లాంఛర్తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్ ఎమ్‌టి 9611 క్వాడ్-కోర్ ప్రాసెసర్ ఉంది. ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీలో 2జీబీ ర్యామ్, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 6 స్పీకర్స్ 30వాట్ సౌండ్ ఔట్పుట్ ఇస్తాయి. 3 హెచ్డీఎంఐ, రెండు యూఎస్బీ పోర్టులు ఉన్నాయి. ఇందులో క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్‌గా వస్తుంది. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటుతో 4కే రిజల్యూషన్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఎంఐ క్యూఎల్ఇడి 4కే టీవీ బ్లూటూత్ 5, హెచ్డీఎంఐ ఈఏఆర్ సీ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఈ టీవీలో రిమోట్ లో కూడా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, గూగుల్ అసిస్టెంట్ కోసం వేర్వేరు బటన్స్ ఉన్నాయి. -
డిసెంబర్ 29న రానున్న ఎంఐ 11
తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం, షియోమీ ఎంఐ 11 మొబైల్ ని డిసెంబర్ 29న లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఎంఐ 11 సరికొత్త క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుందని షియోమి సహ వ్యవస్థాపకుడు, సిఇఒ లీ జూన్ ఇప్పటికే ధృవీకరించారు. వీబోలో రెడ్మి ప్రొడక్ట్ డైరెక్టర్ వాంగ్ టెంగ్ థామస్ వెల్లడించిన కెమెరా శాంపిల్ ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఈ నెల చివర్లో ఎంఐ 11 ప్రారంభించనున్నట్లు గిజ్మో చైనా వెబ్ సైట్ షేర్ చేసిన నివేదిక ద్వారా తెలుస్తుంది. ఎంఐ 11 సిరీస్ మోడళ్లను మొదట చైనాలో లాంచ్ చేస్తారా లేదా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేస్తారా అనే విషయంపై ఇప్పటి వరకు స్పష్టతలేదు.(చదవండి: ఐఫోన్13లో టచ్ఐడీ ఫింగర్ ప్రింట్ స్కానర్) ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం ఎంఐ 11 మొబైల్ లో 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకురానున్నారు. అలాగే, సెల్ఫీ కోసం పంచ్ హోల్ కెమెరా తీసుకురానున్నారు. వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ కలిగి ఉండనుంది. లీకైన ఫోటోల ప్రకారం.. మొబైల్ నీలం, వైట్ గ్రేడియంట్ కలర్ వేరియంట్లలో లభించనుంది. ఎంఐ 11లో వెనుక కెమెరాలో పెద్ద మార్పులు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో రెండు పెద్ద కెమెరా టెలిఫోటో కెమెరా సెన్సార్లు, మూడవ కెమెరా మాక్రో కెమెరాతో రావచ్చు. ఈ మొబైల్ లో 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో QHD ప్లస్ ఏఎంఓఎల్ఈఢీ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇప్పటికే మీ 10టీ ప్రోలో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను తీసుకొచ్చారు. ఊహాగానాల ప్రకారం ఎంఐ 11 ధర 3,999 యువాన్లు(సుమారు రూ.44,984) నుండి 4,499యువాన్ల(రూ.50,610) మధ్య ఉండనుంది. అయితే ప్రో వెర్షన్ మాత్రం ర్యామ్, స్టోరేజ్ బట్టి 5,299 యువాన్ల నుండి 5,499 యువాన్ల మధ్య ఉండనుంది. -
షియోమి నుంచి మరో బెస్ట్ స్మార్ట్ ఫోన్
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షియోమీ 2021 ఏడాదిలో ఎంఐ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే కొత్తగా రాబోయే ఈ ఫోన్ ఫీచర్స్ గురుంచి గత కొంత కాలంగా పుకార్లు చాలా వస్తున్నాయి. ఈ రూమర్ల ప్రకారం స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ తో రాబోయే మొట్ట మొదటి షియోమీ ఇదేనని తెలుస్తుంది. కొన్ని నివేదికల ప్రకారం వచ్చే నెలలో దీనిని విడుదల చేయడమే కాకుండా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని సమాచారం. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కోసం పంచ్-హోల్ కటౌట్‌తో రానుంది. ఎంఐ 11 ఫోన్లో ఫుల్ హెచ్డి ప్లస్ స్క్రీన్ రిజల్యూషన్‌తో పాటు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుందని భావిస్తున్నారు. ఎంఐ 11 ప్రో వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2కే రిజల్యూషన్ డిస్ప్లేని కలిగి ఉంటుంది. ఇది కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. ఎంఐ 11 4,780ఎమ్ఏహెచ్ బ్యాటరీ 55వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో రానున్నట్లు సమాచారం. అదేవిదంగా, ఎంఐ 11ప్రోలో 4,970ఎమ్ఏహెచ్ బ్యాటరీ 100వాట్ సూపర్ ఫాస్ట్ టెక్నాలజీ తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌ను కంపెనీ సొంత MIUI 12పై నడవనుంది. ఈ ఫోన్ 35 నిమిషాల్లో 0 నుండి 100% వరకు ఛార్జ్ చేయగలదని సమాచారం. ఈ ఫోన్లలో 6వ తరం ఆర్టిఫిషల్ ఇంజిన్, సరికొత్త హెక్సాగాన్ కో-ప్రాసెసర్, హయ్యర్ బ్యాండ్‌విడ్త్ స్పెక్ట్రా ISP, క్వాల్కామ్ అడ్రినో జీపీయు వంటి వాటిని అందించనున్నట్లు తెలుస్తోంది. ఎంఐ 11 గతేడాది లాంచ్ అయిన ఎంఐ 10కు తర్వాతి వెర్షన్ గా ఇది రానుంది. షియోమీ వచ్చే ఏడాది లాంచ్ చేయబోయే అద్భుతమైన ఉత్పత్తి ఇదేనని తెలుస్తోంది. -
జనవరిలో రానున్న మీ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్స్
షియోమీ తన మీ 10 సిరీస్ తర్వాత రాబోయే సిరీస్ ను త్వరలో తీసుకొస్తున్నట్లు చాలాకాలంగా పుకార్లు వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా మీ 11 సిరీస్ తో రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్లు వచ్చే ఏడాది జనవరిలో లాంచ్ అవుతాయని సమాచారం. తాజా నివేదికల ప్రకారం, షియోమీ 2021 జనవరిలో మీ 11 మరియు మీ 11 ప్రోలను తీసుకురావాలని యోచిస్తోంది. స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ రాబోయే ఫోన్లలో మీ 11, మీ 11 ప్రో ఫోన్లు ఒకటని తెలుస్తుంది.(చదవండి: నోకియా లవర్స్ కి గుడ్ న్యూస్) షియోమీ మీ 10 ప్రో అప్ గ్రేడ్ వెర్షన్ గా వస్తున్న మీ 11 ప్రో మొబైల్ WQHD + ప్యానెల్ 120హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు డిస్ప్లేతో రాబోతుందని సమాచారం. స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్ తో రాబోయే మొట్టమొదటి చైనీస్ ఫోన్‌గా ఇది గుర్తింపు పొందింది. స్నాప్‌డ్రాగన్ 865 ప్రాసెసర్ కంటే ఇది 20 శాతం ఎక్కువ పవర్ ఎఫిసియెంట్, 10 శాతం ఎక్కువ శక్తివంతమైనది. కొన్ని నివేదికల ప్రకారం, కొత్త స్నాప్‌డ్రాగన్ క్వాల్కామ్ చిప్సెట్ ఆపిల్ యొక్క A14 బయోనిక్ చిప్సెట్ కంటే వేగంగా పనిచేస్తుందని సమాచారం. ఇందులో ఉండే ప్రధాన కెమెరా 108-మెగాపిక్సెల్ నుండి 192-మెగాపిక్సెల్స్ వరకు ఉండనుంది. ఇతర లెన్స్‌లలో 48 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ అప్‌గ్రేడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్లు ఉండనున్నాయి. దీని గురుంచి షియోమీ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ మీ 11 సిరీస్ వచ్చే ఏడాది జనవరి నాటికి కంపెనీ చైనాలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొదట దీని చైనా మార్కెట్ లోకి తీసుకొచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. షియోమీ మీ 11 సిరీస్ ను యుఎస్‌లో శామ్సంగ్ గెలాక్సీ ఎస్ 30 సిరీస్‌ను జనవరిలో లాంచ్ చేయడానికి ముందే తీసుకురావాలని చూస్తుంది. -
బడ్జెట్లో రెడ్మీ 5జీ మొబైల్స్ విడుదల
మొబైల్ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల అయ్యింది. రెడ్మి నోట్ 9 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 26న చైనాలో విడుదల చేసింది. చైనాలో లాంచ్ ఈవెంట్ లో భాగంగా రెడ్మి నోట్ 9 4జీ, రెడ్మి నోట్ 9 5జీ, శక్తివంతమైన రెడ్మి నోట్ 9 5జీ ప్రో స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఈ మూడింటిలో ప్రో మోడల్ ను రిటైల్ మార్కెట్ లో 1,600 యువాన్ల(చైనా కరెన్సీ)కు తీసుకొచ్చింది. అలాగే రెడ్మి నోట్ 9 5జీని 1,300 యువాన్లకు, రెడ్మి నోట్ 9 5జీ 1,000 యువాన్ల ధరకు చైనాలో అమ్ముతుంది. డిసెంబర్ 1 నుండి కొనుగోలుకు ఇవి అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. కానీ భారత్ లో ఎప్పుడు విడుదల చేస్తారో ఇంకా ప్రకటించలేదు. (చదవండి: ఇండియన్ పబ్జిలో 3 కొత్త ఫీచర్స్) రెడ్మి నోట్ 9 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్ రెడ్మి నోట్ 9 ప్రో 5జీ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్ పై పని చేయనుంది. 1080p రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో 6.67-అంగుళాల డిస్ప్లేని కలిగిఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఐసోసెల్ హెచ్ఎం 2 సెన్సార్ తో నిర్మించబడింది. ఇతర కెమెరాల విషయానికి వస్తే 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2-కెమెరా మాక్రో షూటర్ మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఫోన్లో 16 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే MIUI 12పై నడుస్తుంది. రెడ్మి నోట్ 9 ప్రో 5జీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,820ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఇది కేవలం 58 నిమిషాల్లో 0% నుండి 100% వరకు ఛార్జ్ చేస్తుంది. రెడ్మి నోట్ 9 ప్రో 5జీ 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర యువాన్ 1,599(సుమారు రూ.17,960), 8జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,799(సుమారు రూ .20,210), చివరగా, 8జీబీ ర్యామ్/256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,999(సుమారు రూ.22,450). రెడ్మి నోట్ 9 5 జీ స్పెసిఫికేషన్స్ రెడ్మి నోట్ 9 5 జి మీడియాటెక్ డైమెన్సిటీ 800 యు ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. రెడ్మి నోట్ 8లో కనిపించే చిప్సెట్ కంటే 800యు రెండు రెట్లు వేగంగా పనిచేస్తుందని షియోమి పేర్కొంది. రెడ్మి నోట్ 9 5 జీలో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్సిడి ప్యానెల్ డిస్ ప్లేను అందించారు. ఈ ప్యానెల్ గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది. కెమెరాల విషయానికొస్తే, 48-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంది. 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. దీనిలో సెల్ఫీ కోసం 13 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో పనిచేస్తుంది, అలాగే 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే MIUI 12పై నడుస్తుంది. రెడ్మి నోట్ 9 5 జీ 6 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,299 (సుమారు రూ.14,590), 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్1,499 (సుమారు రూ. 16,840), 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర యువాన్ 1,699 (సుమారు రూ.19,000). (చదవండి: బడ్జెట్లో మోటో 5జీ ఫోన్) రెడ్మి నోట్ 9 4 జీ స్పెసిఫికేషన్స్ రెడ్మి నోట్ 9 4 జీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.53-అంగుళాల ఎల్సిడి డిస్ప్లేను కలిగి ఉంది. ఇది అడ్రినో 610 జిపియుతో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా పనిచేసే MIUI 12పై నడుస్తుంది. ఇది 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 6,000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఇందులో 120 డిగ్రీల సూపర్ వైడ్ యాంగిల్ లెన్స్, థర్డ్ డెప్త్ సెన్సార్‌తో కూడిన 48 ఎంపి కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఉంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా సెన్సార్ ఉన్నాయి. ఈ మోడల్లో 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మరియు స్టీరియో స్పీకర్లు కూడా ఉన్నాయి. రెడ్మి నోట్ 9 4 జీ ధర 4 జీబీ ర్యామ్/128 జిబి స్టోరేజ్ వేరియంట్‌కు యువాన్ 999 (సుమారు రూ. 11,220), 6 జీబీ ర్యామ్ / 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు యువాన్ 1,099 (సుమారు రూ.12,340), 8జీబీ RAM / 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు యువాన్ 1,299 (సుమారు రూ. 14,560), 8జీబీ ర్యామ్/ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ కోసం యువాన్ 1,499 (సుమారు రూ. 16,830) వద్ద లభిస్తున్నాయి. -
కొత్త రికార్డు సృష్టించిన షియోమి
2020 మొబైల్ తయారీ దారులకు కష్టతరమైన సంవత్సరం. కోవిడ్ మహమ్మారి వల్ల లాక్డౌన్ విధించడంతో ఫోన్ యొక్క అమ్మకాలు బాగా క్షిణించాయి. లాక్డౌన్ సడలింపుల తర్వాత మొబైల్ రంగం కొంచెం కుదుటపడింది. ఏదేమైనా, ఈ దీపావళి సీజన్ నుండి మొబైల్ రంగం తిరిగి పుంజుకుంటుంది. ఎంఐ ఇండియా ఈ దీపావళి సీజన్ లో13 మిలియన్ పరికరాలను విక్రయించినట్లు సంస్థ ప్రకటించింది. సంస్థ విడుదల చేసిన సమాచారం ప్రకారం, పండుగ అమ్మకాలలో 9 మిలియన్లకు పైగా స్మార్ట్ఫోన్లే ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ లలో ఎంఐ 10 టి ప్రో, రెడ్మి నోట్ 9 ప్రో మాక్స్, రెడ్మి నోట్ 9 ప్రో, రెడ్మి 9 ప్రైమ్ రెడ్మి 9, రెడ్మి 9ఎ వంటి మోడళ్లు ఎక్కువగా అమ్ముడైనట్లు పేర్కొంది.(చదవండి: గూగుల్ మ్యాప్స్ లో మరో సరికొత్త ఫీచర్) ఈ పండుగ అమ్మకాలలో పర్యావరణ అనుకూల ఉత్పత్తులకు గణనీయమైన డిమాండ్ ఉందని తెలిపింది. టీవీలు, స్ట్రీమింగ్ డివైజ్‌లు, ట్రిమ్మర్లు, స్మార్ట్ బ్యాండ్స్, ఆడియో ఉత్పత్తులు, పవర్ బ్యాంక్స్ తదితర 4 మిలియన్ డివైజ్‌లను విక్రయించినట్టు వివరించింది. బెస్ట్ సెల్లర్ల జాబితాలో ఇటీవలే లాంచ్ చేసిన ఎంఐ వాచ్ రివాల్వ్, ఎంఐ స్మార్ట్ స్పీకర్లు ఉన్నట్టు పేర్కొంది. ఎంఐ బాక్స్ 4కె, ఎంఐ టీవీ స్టిక్‌లకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో టాప్ సెల్లింగ్ స్ట్రీమింగ్ డివైజ్‌లుగా నిలిచినట్టు తెలిపింది. ఈ సంవత్సరం 4కె టివిల వృద్ధిలో అతిపెద్ద డిమాండ్ ఉందని కంపెనీ వెల్లడించింది. ముఖ్యంగా పెద్ద స్క్రీన్ పరిమాణాలు గల 50/55-అంగుళాల టీవీలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే గత ఏడాదితో పోలిస్తే 50 శాతం వృద్ధిని నమోదు చేశాయి. -
స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో షావోమి దూకుడు
న్యూఢిల్లీ: చైనా కంపెనీ షావోమీకి చెందిన ఎంఐ ఇండియా గత వారం పండుగ అమ్మకాల్లో భాగంగా 50 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించినట్టు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలు ఈ నెల 16 నుంచి 22 వరకు పండుగల ప్రత్యేక అమ్మకాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ‘‘ఎంఐ అభిమానులు తమకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌ను పండుగల తగ్గింపులు, ఆఫర్లను ఉపయోగించుకుని 15,000కుపైగా రిటైల్ భాగస్వాముల నుంచి కొనుగోలు చేసుకోగలిగారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పోర్టళ్లతోపాటు ఎంఐ డాట్ కామ్ సాయంతో దేశవ్యాప్తంగా 17వేల పిన్కోడ్ల పరిధిలోని కస్టమర్లను చేరుకోగలిగినట్టు’’ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. -
బిగ్ కెమెరా, 5జీ : ఎంఐ 10టీ ప్రొ
సాక్షి, ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు షావోమి ఎంఐ బ్రాండ్ లో కొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. ఎంఐ10టీ, ఎంఐ 10టీ ప్రో పేర్లతో రెండు కొత్త ఫోన్లను భారత్‌లో ఆవిష్కరించింది. 5జీ కనెక్టివిటీ, ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్, 144 హెర్ట్జ్ ఫాస్ట్ రిఫ్రెష్ రేట్ లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. ధరలు, లభ్యత ఎంఐ 10టీ రెండు స్టోరేజ్ వేరియంట్లలో లభ్యం కానుంది. 6 జీబీ ర్యామ్ ,128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999 8 జీబీ ర్యామ్ , 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999 కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో లభ్యం కానుంది. ఎంఐ 10టీ ప్రో ఒక్క వేరియంట్లో మాత్రమే లభ్యం. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 అరోరా బ్లూ, కాస్మిక్ బ్లాక్, లూనార్ సిల్వర్ రంగుల్లో లభ్యం కానుంది. అక్టోబర్ 16 నుండి ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంటుంది ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ బిలియన్ డే సేల్‌లో భాగంగా ఈ ఫోన్ కొనుగోలు చేసేవారికి రూ.3,000 బ్యాంక్ క్యాష్ బ్యాక్, ఎక్స్ చేంజ్ ద్వారా రూ.2000 అదనపు తగ్గింపు, నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఎంఐ 10టీ ప్రో ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 10 108+13+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంఐ 10టీ ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే ఆండ్రాయిడ్ 10 ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 865 ప్రాసెసర్ 64+13+5ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్
-
షావోమి కొత్త స్మార్ట్ టీవీ: హారిజన్ ఎడిషన్
సాక్షి, ముంబై : షావోమి ఎంఐ టీవీ సిరీస్‌లో రెండు నూతన స్మార్ట్ టీవీలను భారత మార్కెట్లో సోమవారం విడుదల చేసింది. ఎంఐ టీవీ 4ఏ హారిజన్ ఎడిషన్ సిరీస్‌లో ఈ టీవీలు లాంచ్ అయ్యాయి.32 అంగుళాల హెచ్డీ ,43 అంగుళాల ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ తో రెండు స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్ ఓఎస్, ఎంఐ క్విక్ వేవ్ ఫీచర్‌ను, ఇన్‌బిల్ట్ క్రోమ్‌క్యాస్ట్, గూగుల్ అసిస్టెంట్, గూగుల్ డేటా సేవర్ ఫీచర్లను జోడించింది. 3 హెచ్డిఎమ్ఐ పోర్ట్‌లు, 2 యుఎస్బి-ఎ పోర్ట్‌లు, ఈథర్నెట్ పోర్ట్ , స్పీకర్లను ఆక్స్ వైర్‌తో కనెక్ట్ చేయడానికి 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ కోసం వివిడ్ పిక్చర్ ఇంజిన్ (వీపీఈ) తోపాటు ప్యాచ్ వాల్‌ను ఈ టీవీలలోఅందిస్తోంది. 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 8జీబీ స్టోరేజ్ అప్షన్ తో లభ్యం. ధరలు ఎంఐ టీవీ 4ఎ హారిజన్ ఎడిషన్ 32 ఇంచుల టీవీ ధర 13,499 రూపాయలు ఎంఐ టీవీ 4ఎ 43 ఇంచుల టీవీ ధర 22,999 రూపాయలు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ హోం స్టోర్లలో 32అంగుళాల టీవీని ఈ నెల 11వ తేదీ నుంచి, అలాగే 43 ఇంచుల టీవీని ఈ నెల 15వ తేదీ నుంచి కొనుగోలు చేయవచ్చు Mi TV #HorizonEdition Series is here. - Bezel-less Design* - #PatchWall: 20+ Entertainment Apps - Immersive Horizon Display - Vivid Picture Engine - 20W Stereo 🔊 - Mi QuickWake - https://t.co/PLwrieRGw0#MiTV4A32 - ₹13,499 | Sale: Sep 11#MiTV4A43 - ₹22,999 | Sale: Sep 15 pic.twitter.com/ekGNBC9KKH — Mi India (@XiaomiIndia) September 7, 2020 -
షావోమి : కొత్త ఎంఐ టీవీ త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి మరో ఎంఐ టీవీని ఇండియాలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 7న ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్‌ను లాంచ్ చేస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించింది. కానీ కొత్త ఎంఐ ఆండ్రాయిడ్ ఎంఐ స్మార్ట్ టీవీ ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్ల వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది. అయితే టెలివిజన్ విభాగంలో అత్యధిక ప్రీమియం ధరలో దీన్ని లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా. కొన్ని నెలల విరామం తరువాత, రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో దీన్ని తీసుకు రానుంది. ఎంఐ టీవీ హారిజన్ ఎడిషన్ టీజర్ ప్రకారం ప్రీమియం స్క్రీన్ కలిగి ఉండవచ్చని సూచించే ‘క్వింటెన్షియల్ డిస్ప్లే టెక్’ తోపాటు, ప్యాచ్‌వాల్ లాంచర్, 5వేలకు పైగా యాప్ లకు యాక్సెస్ లభించనుంది. ఎంఐ టీవీ స్విచ్ ఆన్ చేసిన ప్రతిసారీ పూర్తిగా రీబూట్ కావడానికి 45 సెకన్ల సమయం పడుతుందన్న విమర్శల నేపథ్యంలో ‘క్విక్ వేక్’ ఫీచర్ కూడా జోడించినట్టు తెలుస్తోంది. 👀 What have we got in store for you next? 😉 Immersive. Work Of Art. #HorizonEdition coming on 07.09.2020. Drop your guess in comments. Know more - https://t.co/czbzkkZzJB pic.twitter.com/12zjDMqg3X — Mi India (@XiaomiIndia) August 24, 2020 -
అద్భుతమైన ఎంఐ నోట్‌బుక్స్ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి నోట్‌బుక్ లను గురువారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎంఐ నోట్ బుక్ 14 పేరుతో తీసుకొచ్చింది. అందరూ ఎదురు చూసినట్టుగానే హారిజన్ ఎడిషన్ ను కూడా లాంచ్ చేసింది. వీటి ప్రారంభ దరలు రూ.54999, రూ. 41999గా ఉంచింది. ఈ ప్రారంభ ధరలు జూలై 16 వరకు మాత్రమే చెల్లుతాయని కంపెనీ ప్రకటించింది. అయితే గుడ్ న్యూస్ ఏమింటంటే ఈ రెండింటిపైనా రూ. 2వేల తగ్గింపును అందిస్తోంది. హెచ్ డీఎఫ్ సీ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వినియోగదారులకు ఈ ఆఫర్ వర్తించనుంది. అలాగే 9 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది. జూన్ 17 నుంచి అమెజాన్, షావోమి ఆన్ లైన్, ఆఫ్ లైన్ స్టోర్లలో కొనుగోలుకు లభ్యం. అద్భుతమైన డిజైన్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ ,ఇంటెల్ కోర్ 10 వ జెన్ ప్రాసెసర్ల (కోర్ ఐ 7 , కోర్ ఐ 5)తో అయిదు వేరియింట్లతో ల్యాప్ టాప్ విభాగంలోకి షావోమి దూసుకొచ్చింది. ఎంఐ నోట్‌బుక్ ధరలు ఎంఐ నోట్‌బుక్ 14 (256 జీబీ): రూ .41,999 ఎంఐ నోట్‌బుక్ 14 (512 జీబీ): రూ .44,999 ఎంఐ నోట్‌బుక్ 14 (ఎన్ విడియా జిపియుతో 512 జీబీ) : రూ .47,999 ఎంఐనోట్‌బుక్ 14 హారిజన్ ఎడిషన్ (కోర్ ఐ 5): రూ 54,999 ఎంఐ నోట్‌బుక్ 14 హారిజన్ ఎడిషన్ (కోర్ ఐ 7): రూ .59,999 -
షావోమి ఎంఐ నోట్‌బుక్స్, మరో టీజర్
సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమి భారతీయ ల్యాప్‌టాప్ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది. బడ్జెట్ ధరల్లో స్మార్ట్ ఫోన్లను తీసుకొచ్చి భారతీయ వినియోగదారుల మనసులను కొల్లగొట్టిన షావోమి తాజాగా ఎంఐ నోట్‌బుక్ లను లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ధృవీకరించిన సంస్థ వరుస టీజర్లతో ఆసక్తిని రేపుతోంది. దీంతో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న నోట్ బుక్ మోడల్స్ ప్రవేశంపై అభిమానులకు మరింత క్లారిటీ వచ్చింది. ఇంటెల్ కోర్ఐ ఐ7 10వ జనరేషన్ అల్టిమేట్ ప్రాసెసర్ తో నోట్ బుక్ ను ఈ నెల(జూన్ ) 11న తీసుకురానున్నామని ఎంఐ ఇండియా తాజాగా తెలిపింది. అయితే, అధికారిక లాంచ్‌కు ముందే, షావోమి రాబోయే ల్యాప్‌టాప్ ఎంఐ నోట్‌బుక్, ఎంఐ నోట్ బుక్ హారిజోన్ ఎడిషన్ పేరుతో రానున్నాయనే సమాచారం లీక్ అయింది. కాగా చైనాలో కొంతకాలంగా ఎంఐ, రెడ్మి సిరీస్ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చిన్పటికీ, భారతీయ మార్కెట్లో ల్యాప్‌టాప్‌ను విడుదల చేయడం ఇదే మొదటిసారి. (షావోమి ల్యాప్‌టాప్ లాంచ్ : ఈ నెలలోనే) చదవండి : రెడ్మీ 10 ఎక్స్ వచ్చేసింది.. పంతులమ్మ ఆదాయం : అధికారులకు షాక్ There you go, Mi fans. The #MiNoteBook will be coming with the latest @IntelIndia i7 10th Gen processor. There are very few #Notebooks in India with this processor. Few more days to go to #MakeEpicHappen. Global Debut on June 11. pic.twitter.com/sEogAecX47 — Mi India (@XiaomiIndia) June 5, 2020 Working on other Notebooks - 🧑💻🔌🧑💻🔌🧑💻🔌😡 Working on #MiNoteBook -🧑💻🧑💻🧑💻🧑💻🧑💻🧑💻🔌😎 Mi fans, guess the #Epic 🔋 life on the upcoming #Mi💻. Get ready to #MakeEpicHappen. Global Debut on June 11.#Xiaomi ❤️️ pic.twitter.com/SvgcPSpAfU — Manu Kumar Jain (@manukumarjain) June 4, 2020 -
షాకింగ్ న్యూస్; షావోమి వివరణ
సాక్షి, హైదరాబాద్: వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అవసరానికి మించి సేకరిస్తున్నట్టు వస్తున్న వార్తలను షావోమి ఇండియా తోసిపుచ్చింది. డేటా గోప్యత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది. షావోమి ఇండియా మొత్తం డేటాను రెండేళ్ల క్రితం స్థానిక సర్వర్లకు తరలించినట్టు వెల్లడించింది. వినియోగదారుల స్పష్టమైన అనుమతి లేకుండా డేటాను తాము సేకరించడం లేదని షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ ట్విటర్ ద్వారా తెలిపారు. తమ దగ్గరున్న సమాచారాన్ని సురక్షితంగా ఉంటుందని, బయటకు వెల్లడించే అవకాశం లేదన్నారు. ఇండియా డేటా ఇండియాలోనే ఉంటుందని స్పష్టం చేశారు. షావోమి తన కంపెనీ ఫోన్ల ద్వారా ఎక్కువగా యూజర్ డేటాను సేకరిస్తున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఇవన్నీ తప్పుడు వార్తలని ఆయన కొట్టిపారేశారు. ఈ మేరకు మనుకుమార్ జైన్ ఒక ప్రకటన విడుదల చేశారు. (మొబైల్ డేటాతో ‘కరోనా’ గుర్తింపు!) ‘ఇంటర్నెట్ సంస్థగా షావోమి వినియోగదారుల సమాచార రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. డేటా గోప్యతలో ప్రపంచంలోని ఇతర ప్రముఖ బ్రౌజర్ల మాదిరిగానే ఎంఐ బ్రౌజర్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తుంది. ఇది వినియోగదారుల నుంచి స్పష్టమైన అనుమతి లేదా సమ్మతి లేకుండా వారి డేటాను సేకరించదు. మా దగ్గరున్న సమాచారాన్ని పూర్తి సురక్షితంగా ఉంటుంది. రహస్య మోడ్‌లో బ్రౌజ్ చేసిన వాటిని ఎంఐ బ్రౌజర్ ఎప్పటికీ గుర్తించలేదు. లాగిన్ అయిన వినియోగ డేటా మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు ఏదైనా వెబ్సైట్ పని చేయకపోతే లేదా నెమ్మదిగా ఉంటే మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగ్గా, వేగంగా చేయడానికి రహస్య డేటా ఉపయోగించబడుతుంది. ఇది ఇతర బ్రౌజర్ చేసే మాదిరిగానే ఉంటుంది. ఎంఐ బ్రౌజర్‌తో సహా షావోమి స్మార్ట్ఫోన్లు, వాటిలోని డీఫాల్ట్ యాప్‌లు.. భద్రత, గోప్యతపరంగా సురక్షితమైనవని ప్రఖ్యాత అంతర్జాతీయ థర్డ్ పార్టీ కంపెనీలు ట్రస్ట్ఆర్క్, బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ (బిఎస్ఐ) ధ్రువీకరించాయి. ఎంఐ బ్రౌజర్, ఎంఐ క్లౌడ్‌లోని భారత వినియోగదారుల డేటా అంతా ఇండియాలోని ఏఎస్‌డబ్ల్యూ సర్వర్లలో స్థానికంగా నిల్వ చేయబడుతుంద’ని మనుకుమార్ జైన్ వివరించారు. -
ఎంఐ పేరుతో నకిలీ వెబ్సైట్
సాక్షి, సిటీబ్యూరో : ప్రముఖ ఫోన్ల విక్రయ సంస్థ ఎంఐ పేరుతో నకిలీ వెబ్సైట్ ఏర్పాటైంది. ఇది అసలుదే అని నమ్మిన బాధితుడు ఓ ఫోన్ ఖరీదు చేయడానికి రూ.18 వేలు బదిలీ చేసి మోసపోయాడు. చివరకు విషయం తెలుసుకున్న అతడు శనివారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నగరంలోని పశ్చిమ మండలంలో ఉన్న జూబ్లీహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఆన్లైన్లో ఎంఐ ఫోన్ ఖరీదు చేయాలని భావించారు. దీనికోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన ఆయనకు ఎంఐ సంస్థ పేరిట ఓ వెబ్సైట్ కనిపించింది. (www.mi-home.in) చిరునామాతో, అసలు వెబ్‌సైట్‌ను పోలినట్లే ఇది ఉంది. దీంతో దాని ద్వారా రెడ్మీ నోట్–9 ఫోన్ ఖరీదు చేసిన ఆయన ఆ సైట్ ద్వారానే రూ.18 వేలు చెల్లించారు. ఎప్పటికీ ఫోన్ డెలివరీ కాకపోవడంతో అనుమానం వచ్చి ఎంఐ సంస్థను సంప్రదించారు. ఈ నేపథ్యంలో ఆ సైట్ నకిలీదని తెలిసింది. దీంతో బాధితుడు శనివారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ తరహాకు చెందిన నకిలీ వెబ్‌సైట్స్ మరికొన్ని ఉండవచ్చని, చెల్లింపులు చేసే ముందు ప్రతి ఒక్కరూ సరి చూసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. -
‘షావోమి’కి పండగే పండగ
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్సెట్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ ‘షావోమి’ దసరా, దీపావళి అమ్మకాల్లో దుమ్మురేపింది. ఈ పండగ సీజన్లో 1.2 కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్మి సరికొత్త రికార్డు సృష్టించింది. సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 29 వరకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ డాట్‌కామ్ ద్వారా నిర్వహించిన పండగ అమ్మకాల్లో భారీ వృద్ధి సాధించింది. గతేడాది ఫెస్టివ్ సేల్స్‌తో పోల్చుకుంటే 40 శాతం వృద్ధి నమోదు చేసి భారత మార్కెట్లో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఈ పండగ సీజన్లో 85 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఇందులో ఎక్కువగా రెడ్మి నోట్ 7 సిరీస్ ఫోన్లు అమ్ముడుపోయాయి. ఇదే సమయంలో 6 లక్షలకుపైగా ఎంఐ టీవీలను కూడా సేల్ చేసింది. 30 లక్షలకు పైగా ఈకో సిస్టమ్ ప్రొడక్ట్స్ విక్రయించినట్టు షావోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, షావోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఎంఐ టీవీలు హాట్‌కేకుల్లా అమ్మడయ్యాయని తెలిపారు. పవర్ బ్యాంక్, ఎయిర్ ఫ్యూరిఫయిర్, స్మార్ట్ వాటర్ ఫ్యూరిఫయిర్లు కూడా నిమిషాల వ్యవధిలోనే సేల్ అయినట్టు చెప్పారు. అంచనాలను మించి అమ్మకాలు జరగడంతో వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపారు. తమ సిబ్బందితో కలిసి ఆయన సెలబ్రేట్ చేసుకున్నారు. ‘పండగ అనేది షావోమికి ఎప్పుడూ పెద్ద షాపింగ్ సీజన్. అమ్మకాలను పెంచేందుకు కష్టపడ్డాం. ఈ సీజన్లో మా కంపెనీ అమ్మకాలు అంచనాలను మించాయి. మా ప్లాట్‌ఫామ్ ద్వారా 1.2 కోట్ల వస్తువులను విక్రయించి అందరికంటే ముందు నిలిచాం. ఈ సంతోషాన్ని అభిమానులతో కలిసి పంచుకుంటామ’ని షావోమి ఇండియా ఆన్లైన్ సేల్స్ హెడ్ రఘురెడ్డి తెలిపారు. గతేడాది పండగ సీజన్లో షావోమి 85 లక్షల డివైస్‌లు విక్రయించింది. (చదవండి: స్మార్ట్‌ఫోన్ విక్రయాల రికార్డు, టాప్ బ్రాండ్ ఇదే) -
నిమిషాల్లోనే అవుట్ ఆఫ్ స్టాక్
సాక్షి, న్యూఢిల్లీ: షావోమి తాజాగా మార్కెట్లోకి విడుదల చేసిన ‘రెడ్మి నోట్ 8, 8 ప్రో’ స్మార్ట్ఫోన్లు 15 నిమిషాల్లోపే అమ్ముడైపోయాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభించిన వెంటనే హాట్‌కేకుల్లా సేల్ అయ్యాయి. ఎంఐ వెబ్సైట్లో నోస్టాక్ అని కనిపించగా, వెయిట్ లిస్ట్ ఫుల్ అని అమెజాన్ వెట్‌సైట్ చూపించింది. రేపు కూడా ఈ ఫోన్లు ఎంఐ, అమెజాన్ ఇండియా వెబ్సైట్లలో అమ్మకానికి పెట్టనున్నట్టు షావోమి తెలిపింది. మంగళవారం (అక్టోబర్ 22) మధ్యాహ్నం 12 గంటలకు అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇన్ బిల్ట్ అమెజాన్ అలెక్సాతో విడుదలైన ఈ స్మార్ట్ఫోన్లు.. గూగుల్ అసిస్టెన్స్, అలెక్సాతో పనిచేస్తాయని కంపెనీ వివరించింది. ఒకేసారి రెండు ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన తొలి మొబైల్స్ ఇవే కావడంతో వీటిని కొనేందుకు వినియోగదారులు అమితాసక్తి చూపారు. ప్రపంచంలోనే తొలిసారిగా 64 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్, హెలియో జీ90టీ చిప్సెట్తో విడుదలైన అధునాతన స్మార్ట్ఫోన్లు ఇవేనని సంస్థ ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ అన్నారు. రెడ్మి నోట్ 8 ఫీచర్లు 6.39 అంగుళాల డిస్ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 9 పై క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 665 సాక్ 4 జీబీ ర్యామ్ , 64 జీబీ స్టోరేజ్ 48+ 8 + 2 +2 ఎంపీ రియర్ క్వాడ్ కెమెరా 13 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000ఎంఏహెచ్ బ్యాటరీ 4జీబీ/64జీబీ ధర రూ.9,999 6జీబీ/128జీబీ ధర రూ.12999 రెడ్‌మినో ట్ 8 ప్రో ఫీచర్లు 6.53 అంగుళాల డిస్ప్లే 1080x2340 పిక్సెల్స్ రిజల్యూషన్ మీడియా టెక్ హీలియో ప్రాసెసర్ జీ90టీ ఆండ్రాయిడ్ 9 పై 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 4+8+2+2 ఎంపీ క్వాడ్ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 4500ఎంఏహెచ్ బ్యాటరీ 6జీబీ/64జీబీ ధర రూ.14999 6జీబీ/128జీబీ ధర రూ.15,999 8జీబీ/128జీబీ ధర రూ.17999 -
ఎంఐ ఫాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్: బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై : భారతదేశంలో నంబర్‌వన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఎదిగిన షావోమి తన దూకుడును కొనసాగిస్తోంది. బిగ్ స్ర్కీన్, బిగ్‌బ్యాటరీ, ఏఐ కెమెరాలు అంటూ వినియోగదారులను ఆకర్షిస్తున్న షావోమి తాజాగా ఎంఐ ఫ్యాన్స్‌కు మరో గుడ్‌న్యూస్ అందించింది. బుధవారం రెడ్మి 8 లాంచింగ్ సందర్బంగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు షావోమి ఎండీ మను కుమార్ జైన్. అలాగే 64ఎంపీ క్వాడ్ కెమెరా(4) లతో మరో (రెడ్మి నోట్ 8 ప్రొ ) స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయబోతున్నట్టు చెప్పారు. ఈ నెల 16నే దీన్ని ఆవిష్కరించనున్నామని తెలిపారు. రూ. 5కోట్ల రిటర్న్ గిఫ్ట్ ఆఫర్ గత ఐదేళ్లుగా కాలంగా కస్టమర్లు తమపై చూపించిన ప్రేమకు ప్రతిఫలంగా రూ. 500 కోట్లను తిరిగి వారికి ఇచ్చేస్తున్నట్టు షావోమి ఎండీ మనుకుమార్ జైన్ ప్రకటించారు. తొలి 50 లక్షల వినియోగదారులకు 4జీబీ వేరియంట్ అప్డేట్ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. 50 లక్షల రెడ్మి8 కొనుగోలుదారులకు రూ. 1000 విలువ (రూ. 5 కోట్లు) గల అప్డేట్ను ఉచితంగా అందిస్తుందన్నమాట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పండుగ సీజన్లో కేవలం 7రోజుల్లో 5.3 మిలియన్ల స్మార్ట్ఫోన్ల విక్రయాలు నమోదయ్యాయని ప్రకటించారు. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఎంఐ దీపావళి సేల్‌లో నిమిషానికి 525 డివైస్‌లు అమ్మినట్టు తెలిపారు. షావోమిపై వినియోగదారుల అసాధారణ ప్రేమ ఎప్పటికే ఇలాగే కొనసాగాలని మనుకుమార్ ఆశించారు. ఈ సందర్భంగా కస్టమర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రెడ్మి నోట్ 8 ప్రో ఫీచర్లు 6.53 అంగుళాల డిస్ప్లే, 64 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8ఎంపీ 120-డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్, 2మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2ఎంపీ మాక్రో కెమెరాతో క్వాడ్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే 20 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 18వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, క్విక్ ఛార్జ్ 3.0 లకు మద్దతుగా 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఎన్ఎఫ్సి సపోర్ట్, యుఎస్బి టైప్-సి పోర్ట్,ఎంఐయుఐ 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పై 9 ప్రధాన ఫీచర్లు. ధర రూ. సుమారు 14,000. దీన్నిఇప్పటికే చైనా మార్కెట్లో లాంచ్ చేసింది. Mi fans, for all the love you have given us over the last 5 years, we're giving back ₹500 Cr. The first 5 million fans will get the #Redmi8, #4GB64GB variant for ₹7,999 & people who order 3GB variant will get upgraded to a 4GB variant. Thank you! pic.twitter.com/jsOJgZcRzM — Redmi India for #MiFans (@RedmiIndia) October 9, 2019 Excited to share the biggest news that we've sold 5.3mn+ #Xiaomi devices in last 7 days. That makes a whopping 525 devices sold every minute since the start of @amazonIN @Flipkart #DiwaliWithMi sale. Ur love for #Xiao️mi has been phenomenal as always. Thank you, Mi fans! ❤️ pic.twitter.com/wXVZ95VM2H — Mi India for #MiFans (@XiaomiIndia) October 5, 2019 -
చెన్నై చెడుగుడు ఆడుకుంటుందా? ముంబై మెరిపిస్తుందా?
-
పేలిన మొబైల్
కృష్ణరాజపురం : ఛార్జింగ్ పెడుతుండగా సెల్‌ఫోన్ పేలిపోయిన ఘటన సోమవారం బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. బొమ్మనహళ్లి ప్రాంతానికి చెందిన చంద్రు అనే యవకుడు కొద్ది రోజుల క్రితం రెడ్మి మొబైల్ కొనుగోలు చేశాడు. ఈ క్రమంలో సోమవారం మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా మొబైల్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడాన్ని గమనించిన చంద్రు వెంటనే దూరంగా పారిపోయాడు. పొగలు రావడం మొదలైన కొద్ది క్షణాల్లో మొబైల్ పెద్ద శబ్దం చేస్తూ పేలిపోయింది. ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. -
షావోమి బిగ్ సర్ప్రైజ్.. బంపర్ ఆఫర్ కూడా
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ రంగంలో సంచనాలను నమోదు చేసిన చైనా కంపెనీ షావోమి ఇపుడిక డిజిటల్ చెల్లింపుల రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. గూగుల్ పే, పేటీఎం తరహాలో తన పేమెంట్ యాప్ ఎంఐపేను లాంచ్ చేసింది. ఇండియాలో 'ఎంఐ పే' యూపీఐ సర్వీస్ కోసం ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. డేటా లీక్ పట్ల ఎలాంటి ఆందోళన అవసరం లేదని అత్యధిక భద్రమైన సర్వీసులను అందిస్తామని హామీ ఇచ్చింది. యూజర్ల డేటాను ఇండియాలో మాత్రమే స్టోర్ చేస్తామని షావోమీ ప్రకటించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) క్లియరెన్స్ అనంతరం 'ఎంఐ పే' యాప్‌ను అధికారికంగా తీసుకొచ్చింది. ఎంఐ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే కాదు... బిల్లులు, రీఛార్జుల చెల్లింపులు చేయొచ్చు. ఇందుకోసం 120 బిల్లర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. భారత్ క్యూఆర్ కోడ్‌తో సహా ఇతర క్యూఆర్ కోడ్స్ స్కాన్ చేయొచ్చు. యూజర్లకు ఆఫర్లు ఎంఐ పే యాప్ యూజర్లకు మరో బంపర్ఆఫర్ కూడా ప్రకటించింది. వినియోగదారులు రెడ్మీ నోట్ 7, 32 అంగుళాల ఎంఐటీవీ 4ఏ ప్రో గెలుచుకునే అవకాశముందని షావోమీ ప్రకటించింది. ఇప్పటికే చైనాలో వినియోగంలో ఉన్న ఈ వ్యాలెట్ సర్వీసును ఇండియన్ యూజర్ల కోసం ఆవిష్కరించింది. కొద్ది రోజుల క్రితం ఇండియాలో 'ఎంఐ పే' బీటా వర్షన్ రిలీజ్ చేసిన చేసిన సంగతి తెలిసిందే. Mi fans! Here's a BIG surprise for all of you. Use #MiPay and stand a chance to win #RedmiNote7 and #MiTV 4A Pro 32". pic.twitter.com/wAEM0Bll7P — Mi India (@XiaomiIndia) March 19, 2019 -
రూ.3,000 వరకూ తగ్గిన ఎమ్ఐ ఏ2 ధరలు
ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజ కంపెనీ షావోమి తన ఎమ్ఐ ఏ2 స్మార్ట్ఫోన్ల ధరలను రూ.3,000 వరకూ తగ్గించింది. భారత్‌లో అమ్మకాలు ఆరంభించి ఐదేళ్లవుతోందని పేర్కొన్న కంపెనీ... ఈ సందర్భంగా ఎమ్ఐ ఏ2 స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించింది. 4 జీబీర్యామ్/64 జీబీ ఇంటర్నల్ మెమెరీ ఉన్న మోడల్ ధర రూ.2,000 తగ్గి రూ.13,999కు చేరిందని షావోమి తెలిపింది. అలాగే 6 జీబీ ర్యామ్/128 జీబీ ఇంటర్నల్ మెమెరీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గి రూ.15,999కు చేరిందని పేర్కొంది. -
షావోమీ టీవీ ధరలు తగ్గాయ్!
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారత్‌లో టాప్ నిలిచిన చైనా కంపెనీ టీవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంఐ స్మార్ట్‌టీవీల పేరుతోబడ్జెట్ ధరల్లో వీటిని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి స్మార్ట్‌టీవీల్లో కూడా నెం.1 బ్రాండ్‌గా నిలిచింది. తాజాగా షావోమి తన కస్టమర్లకు నూతన సంవత్సర కానుకను అందించింది. ఎంఐ టీవీలపై ధరలను తగ్గించినట్టు ప్రకటించింది. ఎంఐ టీవీల ధరలను తగ్గించినట్టు షావోమి వెల్లడింది. వెయ్యి నుంచి 2వేల రూపాయల దాకా ఈ తగ్గింపు ఉండనుంది. 32 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ధర రూ.1500 తగ్గింపుతో ప్రస్తుతం రూ.12,499లకు అందుబాటులో ఉంది. 32 అంగుళాల ఎంఐ టీవీ 4సీ ప్రొ ధర. రూ.13,999గా ఉంది. రూ.2 వేలను తగ్గించింది. 49 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఏ ప్రొ రూ.1000తగ్గి రూ. 30,999లకే అందుబాటులో ఉంది. Mi fans! There couldn't be a better beginning. Get your hands on TVs from India's #1 Smart TV Brand at an unbeatable price, starting today. How's this for a New Year gift? RT to spread happiness. pic.twitter.com/9ZWb2dYlyw — Mi India (@XiaomiIndia) January 1, 2019 -
ఇల్లంతా ‘ఎంఐ’ మయం..!
న్యూఢిల్లీ: చేతిలో ఎంఐ ఫోన్... హాల్లో ఎంఐ ఫ్రిజ్... కిచెన్‌లో ఎంఐ వాటర్ ప్యూరిఫయర్... బాల్కనీలో ఎంఐ వాషింగ్ మెషిన్... బెడ్ రూమ్‌లో ఎంఐ ఏసీ... భవిష్యత్తులో ఇదే చూడబోతున్నాం!. చౌక ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎంఐ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లతో భారతీయులకు చేరువైన చైనా కంపెనీ ‘షావోమీ’... భారత మార్కెట్లో మరింతగా పాతుకుపోయే ప్రణాళికలను రచిస్తోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నుంచి పూర్తి స్థాయి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీగా అవతరించనుంది. షావోమీ ఉన్నత స్థాయి ఉద్యోగ బృందం ప్రస్తుతం ఇదే పనిలో ఉంది. భారత మార్కెట్లో భారీ వృద్ధికి అవకాశం ఉన్న ఎయిర్‌కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, వాటర్ ప్యూరిఫయర్ల విభాగాల్లో ఉత్పత్తులను తీసుకురావడంపై షావవోమీ దృష్టి సారించినట్టు సమాచారం. అన్ని ఉత్పత్తులను కూడా ఇంటర్నెట్ ఆధారితంగా నియంత్రించేందుకు (ఐవోటీ) వీలుండే స్మార్ట్‌గానే ఉంటాయని, రిమోట్‌గా వీటిని నియంత్రించుకోవచ్చని కంపెనీ ఉద్యోగులు తెలిపారు. వృద్ధి అవకాశాలు... భారత మార్కెట్లో షావోమీ ఏటా 100 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా మరింత వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోవాలన్నది కంపెనీ ఆలోచన. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా ఈ ఒక్క విభాగమే శాశ్వతం కాదనుకుని అదనపు వృద్ధి అవకాశాలపై కంపెనీ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. నిజానికి షావోమీ ఇప్పటికే భారత మార్కెట్లో స్మార్ట్ఫోన్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, టీవీలతోపాటు మరికొన్ని గ్యాడ్జెట్లను కూడా విక్రయిస్తోంది. స్మార్ట్ టెలివిజన్ల విభాగంలో వచ్చే ఏడాది మరిన్ని ఉత్పత్తులను తీసుకురానుంది. షావోమీ ప్రస్తుతం తన ఉత్పత్తులను తొలుత ఆన్లైన్లో విడుదల చేసి, తర్వాత ఎంఐ స్టోర్లలో అందుబాటులోకి తెస్తోంది. ఇకపై పెద్ద ఎలక్ట్రానిక్, మొబైల్ రిటైల్ స్టోర్లలోనూ తన ఉత్పత్తులను అందుబాటులోకి తేనుందని పరిశ్రమకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఆఫ్‌లైన్‌లో భారీ విస్తరణ... షావోమీ దేశవ్యాప్తంగా కొత్తగా 500 పట్టణాల్లోకి వచ్చే ఏడాది తన కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికతో ఉంది. ప్రస్తుతం కంపెనీ దేశంలోని టాప్ 50 పట్టణాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. షావోమీ ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ స్మార్ట్ టెలివిజన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రధాన కంపెనీలైన శామ్సంగ్, సోనీ, ఎల్జీ ఉత్పత్తులతో పోలిస్తే 30–50 శాతం చౌక ధరలకే ఆఫర్ చేయడం ద్వారా వాటికి గట్టి సవాల్ విసిరింది. తొలుత ఆన్లైన్లో ఆరంభించిన విక్రయాలను తర్వాత ఎంఐ స్టోర్లకు విస్తరించింది. స్థానిక కంపెలతో తయారీ ఒప్పందాలను చేసుకుంది. ఇదే తరహాలో హోమ్ అప్లయన్సెస్ విభాగంలోనూ మరిన్ని ఉత్పత్తులతో చొచ్చుకుపోవాలన్నది కంపెనీ వ్యూహం. ప్రధాన కంపెనీలకు దీటుగా ఫీచర్లన్నింటినీ ఇస్తూ, ధరల పరంగా చౌకగా అందుబాటులోకి తీసుకురావడం ఎంఐ విజయసూత్రంగా ఉంది. -
ఎంఐ స్పెషల్ సేల్ : భారీ డిస్కౌంట్లు
ఎంఐ ఫ్యాన్స్‌కు శుభవార్త. షావోమి ఇండియా ప్రమోషనల్ ఆఫర్‌ను అందుబాటులోకి తెస్తోంది. డిసెంబరు 6నుంచి 8వతేదీవరకుఈ స్పెషల్ సర్ప్రైజ్ సేల్‌ను నిర్వహించనుంది. అమెజాన్‌లో ప్రత్యేకంగా ఈ సేల్ ఉంటుంది. ముఖ్యంగా ఎంఐ ఏ2, రెడ్ మి వై2 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఎంఐఏ 2: 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 14,999లకే అందిస్తోంది. ఎంఆర్పీ ధర రూ. 17,499. ఎంఐఏ 2 6జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 16,999లకే లభ్యం. ఎంఆర్పీ ధర రూ. 20,500. రెడ్మి వై2 ( 3/2జీబీ) వేరియంట్ రూ.8999కే లభ్యం కానుంది. ఎంఆర్పీ ధర రూ. 10,499. రెడ్మి వై2 ( 4జీబీ/64జీబీ) వేరియంట్ రూ.10,999కే లభ్యం కానుంది. ఎంఆర్పీ ధర రూ.13,499. వీటితోపాటు రెడ్ మి 6ఏ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ అనంతరం రూ.5999 లకే అందిస్తోంది. Mi fans! It is Selebration time. I ❤️ Mi sale on @amazonIN begins on December 6th. We have got huge discounts on your favourite Mi smartphones. 🎊🎉🎈 RT if you're excited! pic.twitter.com/EZr6zBjnvR — Mi India (@XiaomiIndia) December 4, 2018 -
షావోమి వేగం : మరో బిగ్ టీవీ లాంచ్
సాక్షి,ముంబై: మొబైల్స్ తయారీదారు షావోమీ టీవీ సెగ్మెంట్లో శరవేగంగా దూసుకుపోతోంది. ఇటీవీల టీవీ మార్కెట్‌పై దృష్టి పెట్టిన షావోమి వరుసగా లాంచ్‌లతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా 75 ఇంచులఎంఐ టీవీ 4ఎస్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది, ఈ రోజు నుంచే సేల్స్‌ను ప్రారంభించింది. దీని ధరను రూ.82,100గా నిర్ణయించింది. ఇక ఈ టీవీ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, డీటీఎస్ హెచ్డీ డాల్బీ ఆడియో, బ్లూటూత్, వైఫై తదితరాలు లభిస్తున్నాయి. -
అదిరే ఫీచర్లతో రెడ్మి నోట్ 6 ప్రో
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను పొందుపరుస్తూ చైనా మొబైల్ తయారీదారు షావోమీ వినియోగదారుల ఆదరణను పొందింది. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన రెడ్మి నోట్ 5ప్రో కి కొనసాగింపుగా రెడ్మి సిరీస్‌లో మరో అద్భుతమైన ఫోన్ ‘రెడ్మి నోట్ 6ప్రో’ ను తీసుకొస్తోంది. ముందూ, వెనుక నాలుగు కెమెరాలతో ఈ డివైస్‌ను ఈ నెల 23న మార్కెట్లో విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దీనిని మార్కెట్లో రిలీజ్ చేయనున్నారు. దీని ఫీచర్లు ప్రధానంగా ఇలా ఉండనున్నాయి. 6.26 ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20+2 ఎంపీ రియర్ కెమెరాలు 12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర వివరాలు అధికారికంగా ఇంకా విడుదల కావాల్సి ఉంది. అయితే సుమారు రూ.15వేల లోపు ధరను నిర్ణయించే అవకాశం ఉందని అంచనా. -
ఫ్లేఆఫ్ రేసులోకి రోహిత్ సేన!
-
అదేంటో! అలా జరుగుతోంది: రోహిత్ శర్మ
-
అదేంటో! అలా జరుగుతోంది: రోహిత్ శర్మ
కోల్‌కతా: టోర్నో ప్రారంభంలో దారుణ వైఫల్యాలను చవిచూసే ముంబై ఇండియన్స్... పోనుపోను పుంజుకుంటూ.. చివరికి టైటిల్ విజేతగా నిలుస్తుండటం పరిపాటి అయింది. మరీ ముఖ్యమంగా గడిచిన మూడేళ్లలో ఫస్ట్ ఆఫ్‌లో ఫ్లాప్ కావడం.. సెకండాఫ్‌లో హిట్ కావడం రివాజుగా మారింది. దీనిపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ‘‘అదేంటోమరి!(నవ్వులు) మే నెలలోనే మేం అద్భుతంగా రాణించడం జరుగుతోంది. గత మూడేళ్లుగా టోర్నో ద్వితియార్ధంలోనే బాగా ఆడుతున్నాం’’ అని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2018లో భాగంగా బుధవారం కోల్‌కతాపై ముంబై 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఏమిటన్న ప్రశ్నకు రోహిత్ తడుముకోకుండా సమాధానం చెప్పాడు.. ‘ఇంకేంటి.. ఇషాన్ ఇన్నింగ్సే’ అని. బీభత్సం సృష్టించాడు: ‘‘ఇషాన్ కిషన్ తనదైన రోజు కోసం ఎదురుచూశాడు. అతను ఆటాడిన తీరు నిజంగా అద్భుతం. వాస్తవానికి పిచ్ కాస్త ఇబ్బంది పెట్టింది. అయినాసరే అతను ఏమాత్రం భయపడకుండా బీభత్సం సృష్టించాడని చెప్పొచ్చు. చివర్లో బెన్ కట్టింగ్ సైతం అసాధారణంగా ఆడాడు. జట్టును ప్లేఆఫ్ రేసులో సజీవంగా నిలపడానికి సమిష్టిగా కృషించాం. చక్కటి ఫలితాన్ని రాబట్టగలిగాం’’ అని రోహిత్ చెప్పాడు. సాధారణంగా ఓపెనర్‌గా బరిలోకి దిగే ఇషాన్ కిషన్.. కోల్‌కతాతో మ్యాచ్‌లో అనూహ్యంగా 4వ స్థానంలో వచ్చాడు. దుమ్మురేపే షాట్లతో 21 బంతుల్లోనే 62 పరుగులు సాధించి మ్యాచ్ గతిని సమూలంగా మార్చేశాడు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ ఇషాన్ స్టన్నింగ్ ఇన్నింగ్స్‌తో ముంబై 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో దారుణంగా విఫలమైన కోల్‌కతా 18.1 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. -
ఏం చెయ్యాలో అదే చేస్తా: దినేశ్ కార్తీక్
కోల్‌కతా: ‘‘కొన్ని విషయాలు అంతేనండీ, ఓ బాధపడుతూ కూర్చోవాల్సిన పనిలేదు. వీలైనంత తొందరగా అన్నీ మర్చిపోవాలి. మళ్లీ రీచార్జ్ అవ్వాలి. ఓటమి బారి నుంచి ఎంత తొందరగా బయటపడతామన్నదే ఆటలో కీలకం. నాయకుడిగా నా 11 మంది సైన్యాన్ని నమ్మాను. ఎప్పటికీ నమ్ముతూనే ఉంటాను. ఖచ్చితంగా మనం ప్లే ఆఫ్స్ కు వెళతామన్న పట్టుదల వాళ్లలో కలుగజేస్తాను. కెప్టెన్‌గా ఏం చెయ్యాలో అదే చేస్తాను’’ అంటున్నాడు దినేశ్ కార్తీక్. ఐపీఎల్ 2018లో భాగంగా బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 102 పరుగుల తేడాతో ఘోరపరాజయం తర్వాత డీకే స్పందన ఇది. 11 మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు, ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న కోల్‌కతా.. ప్లేఆఫ్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది. అయితే, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తామని డీకే ధీమావ్యక్తం చేశాడు. పరాజయంపై పోస్ట్‌మార్టం: ‘‘మా ఓటమికి ప్రధాన కారణం క్యాచ్డ్రాప్స్. రెండో కారణం ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్. ఆ తర్వాత అనవసర రనౌట్స్. నిజానికి 200పైచిలుకు లక్ష్యం ఎప్పుడూ టఫ్‌గానే ఉంటుంది. పవర్ ప్లేలోనే కీలకమైన వికెట్లు కోల్పోవడంతో.. ఆ తర్వాత కూడా మేం కోలుకోలేకపోయాం. క్యాచ్‌లు జారవిడిచిన ఫలితంగానే ముంబై అంత భారీ స్కోరు చేసింది. మిడిల్ ఓవర్స్‌లో ఇషాన్ చెలరేగిపోయాడు. అతణ్ని కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు’’ అని దినేశ్ కార్తీక్ చెప్పాడు. మ్యాచ్ రిపోర్ట్: బుధవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగుల భారీస్కోరు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 62; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగాడు. కెప్టెన్ రోహిత్ శర్మ (31 బంతుల్లో 36; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. పీయూష్ చావ్లాకు 3 వికెట్లు దక్కాయి. తర్వాత కోల్‌కతా నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 108 పరుగులకే కుప్పకూలింది. ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. పాండ్యా బ్రదర్స్ కృనాల్, హార్దిక్ చెరో 2 వికెట్లు తీశారు. -
గెలిచాం కానీ.. క్రెడిట్ నాకొద్దు!
ముంబై: ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ సత్తాచాటింది. ఐపీఎల్ 2018లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ముంబై 13 పరుగుల విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇంకా మిగిలింది నాలుగు మ్యాచ్‌లే కావడంతో అన్నింటా విజయం సాధించాల్సిన పరిస్థితి ముంబైది. ఈ తరుణంలో జట్టులోని లోపాలపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మార్పు రావాలి: ‘‘ఇప్పటికైతే గెలిచాం కానీ.. మా బ్యాటింగ్ తీరు చాలా మారాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి అదనంగా 15-20 పరుగులు సాధించాల్సిన ఆవశ్యకత ఉంది. ఓపెనర్లు అద్భుతంగా రాణించినా, మేం అనుకున్న స్కోరును సెట్ చేయలేకపోయాం. ఛేజింగ్‌లో కోల్‌కతా తొలి 10 ఓవర్లు ఆడిన తీరు కొంత ఆందోళన కలిగించింది. కానీ ఆ తర్వాత మా బౌలర్లు పుంజుకున్నారు. మొత్తానికి బౌలింగ్ యూనిట్ వల్లే గెలిచాం’ అని రోహిత్ అన్నాడు. క్రెడిట్ నాకొద్దు: ‘‘మిడిల్ ఆర్డర్లోనూ మాకు ముగ్గురు పవర్ హిట్టర్స్ ఉన్నారు కాబట్టి బ్యాటింగ్ సత్తాకు ఢోకాలేదు. ఎటొచ్చీ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడమే కావాల్సింది. టోర్నీలో ముంబై ఇండియన్స్ కథ ముగుస్తుందనుకున్న వేళ జట్టు సభ్యులంతా ఎంతో పట్టుదలతో ఆడి, ప్లేఆఫ్ ఆశల్ని సజీవంగా నిలిపారు. ఈ క్రెడిట్ నా ఒక్కడికే వద్దు. మా బాయ్స్ అందరి పాత్రా ఉంది. మున్ముందు మ్యాచ్‌ల్లోనూ ఇదే తరహాలో రాణిస్తామన్న నమ్మకం ఉంది’’ అని ముంబై సారధి పేర్కొన్నాడు. తర్వాతి మ్యాచ్‌కూడా కోల్‌కతాతోనే: ఆదివారం నాటి మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై.. కోల్‌కతాపై గెలుపొందింది. కాగా, ముంబై తదుపరి మ్యాచ్ కూడా ఇదే ప్రత్యర్థితో తలపడనుంది. బుధవారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగనున్న మ్యాచ్ ఇరు జట్లకూ కీలకం కానుంది. 10 పాయింట్లతో కోల్‌కతా 4వ స్థానంలో ఉండగా, ముంబై 8 పాయింట్లతో 5వ స్థానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్, సీఎస్కే, కింగ్స్ పంజాబ్‌లు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
ఉసూరుమనిపించిన షావోమి ఫస్ట్‌సేల్
సాక్షి, ముంబై: తమ అభిమాన బ్రాండ్ షావోమి స్మార్ట్ టీవీలను సొంతం చేసుకోవాలనుకున్న కస్టమర్లను అవుట్ ఆఫ్ స్టాక్ నోటిపికేషన్ వెక్కిరించింది. విక్రయాలు మొదలు పెట్టిన కొన్ని నిమిషాల్లోనే ఎంఐ ఎల్ఈడీ టీవీలు చేజారిపోవడం వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 12గంటలకు ఎంఐ 32, 43, 55 అంగుళాల స్మార్ట్ టీవీల సేల్స్ గ్రాండ్ ఓపెనింగ్.. బిగ్ సేల్స్ అంటూ కంపెనీ వెల్లడించింది. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర కేవలం రూ.13, 999గా, 43 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.22 999గాను, 55 అంగుళాల టీవీని రూ .39,999గాను నిర్ణయించింది. అయితే సేల్ ప్రారంభించిన నిమిషాల్లోనే వినియోగదారులను ఉసూరుమనిపించింది. ఒక విధంగా కళ్లు మూసి తెరిచేలోపు అవుట్ ఆఫ్ స్టాక్...నోటి ఫై మి అని దర్శనమివ్వడంపై కస్టమర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తదుపరి విక్రయాలు 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుందని షావోమి ప్రకటించింది. కాగా స్మార్ట్‌ఫోన్ సంచలనం షావోమి టీవీ సెగ్మెంట్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. అత్యాధునిక ఫీచర్లు, సరసమైన ధర అంటూ వినియోగదారులకు ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో గతనెలలో ప్రారంభించిన కొత్త టీవీ సిరీస్ ఎంఐ స్మార్ట్‌టీవీ 4ఏ ల తొలి విక్రయంలో ఫ్లిప్‌కార్ట్, తన అధికారిక వెబ్సైట్లో భారత వినియోగదారులకు నేడు (మంగళవారం) అందుబాటులోకి తెచ్చింది. మరోవైపు ఇటీవల లాంచ్ చేసిన రెడ్మి నోట్ 5, నోట్ 5 ప్రో సేల్స్‌ను కూడా ఈ రోజు మరోసారి ప్రారంభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాల్లో కూడా సేమ్ స్టోరీ రిపీట్ అవుతుండటం గమనార్హం. దీనిపై షావోమి అభిమానుల ఆగ్రహం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. -
అద్భుతమైన ఎంఐ స్మార్ట్ టీవీ సేల్, స్పెషల్ ఆఫర్స్
సాక్షి,ముంబై: చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమి భారత్‌లో తొలిసారిగా ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4 విక్రయాలను ప్రారంభించింది. స్మార్ట్ఫోన్లతో ప్రధాన ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించిన షావోమీ ఇపుడిక టీవీ రంగంలో కూడా ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమై పోయింది. ఈ నేపథ్యంలో అద్భుత ఫీచర్లతో లాంచ్ చేసిన ఎంఐ స్మార్ట్ టీవీని ఈ మధ్యాహ్నం 2 గంటలనుంచి ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం ద్వారా విక్రయానికి అందుబాటులోకి తేనుంది. ‘ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4’ పేరుతో ప్రపంచంలోనే అతి పలుచనైన టీవీని ఇటీవల మార్కెట్లో ఆవిష్కరించింది. చైనా వెలుపల భారత్‌లోనే తొలిసారిగా టీవీలను విక్రయిస్తోంది. దీని ధర రూ.39,999 గా కంపెనీ నిర్ణయించింది. శాంసంగ్, సోనీ, ఎల్జీ లాంటి దిగ్గజ ఎలక్ట్రానిక్ సంస్థల టీవీలకు గట్టిపోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాల అంచనా. ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4 ఫీచర్లు 4.9 ఎంఎం అల్ట్రా–థిన్ ఫ్రేమ్‌లెస్ డిజైన్ 55 అంగుళాల ఎల్ఈడీ డిస్ప్లే ప్యానెల్ 4కే రెజల్యూషన్ (3840x2160 పిక్సెల్స్) హెచ్డీఆర్ సపోర్ట్, 64 బిట్ 1.8 గిగాహెర్జ్ట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్ 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ ఇక లాంచింగ్ విషయానికి వస్తే....ఎంఐ టీవీ కొనుగోలుదారులకు రూ.619 విలువ చేసే సోనీ లివ్, హంగామా ప్లే 3 నెలల చందా ఉచితం. అలాగే ఎంఐ ఐఆర్ కేబుల్ (రూ. 299) ఫ్రీ. దీంతోపాటు రూ.1,099 విలువ చేసే ఆన్సైట్ ఇన్ష్టలేషన్ ఉచితం. అంతేకాదు స్మార్ట్ టీవీతో కలిపి 11-బటన్ మిని రిమోట్‌ను అందిస్తోంది. దీంతో అటు టీవీని, ఇటు సెట్-టాప్ బాక్సును నియంత్రించవచ్చు. ఇక కనెక్టివిటీ పరంగా, మూడు హెచ్డీఎంఐ 2.0 పోర్ట్స్, రెండు యూఎస్బీ పోర్ట్స్, డ్యూయెల్ బాండ్ వై–ఫై, బ్లూటూత్ 4.0, డాల్బే+డీటీఎస్ సినిమా ఆడియో క్వాలిటీ, ప్యాచ్‌వాల్ ఓఎస్, మల్టీ లాంగ్వేజ్ సపోర్ట్ వంటి పలు ప్రత్యేకతలు ఈ స్మార్ట్‌టీవీ సొంతం. ముఖ్యంగా 15 భాషల్లో 5,00,000లకుపైగా గంటల (వీటిలో 80 శాతం ఉచితం) అందించేందుకు వీలుగా హంగామా, ఏఎల్టీ బాలాజీ, జీ5, సోనీ లిప్ వంటి పలు సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నామని షావోమి ప్రకటించిన సంగతి తెలిసిందే. Mi fans! For the first time ever, #MiTV4 goes on sale today at 2PM on https://t.co/D3b3Qt4Ujl & @Flipkart. Are you ready for the visual treat? pic.twitter.com/zXSmbTR1kd — Mi India (@XiaomiIndia) February 22, 2018 Mi fans! Greet the world's thinnest LED TV - #MiTV4 - 4.9mm Ultra-thin - 4K HDR 10 Frameless display First sale on Feb 22 on https://t.co/D3b3QtmvaT, @Flipkart and Mi Home. RT if you ❤️ the Mi TV 4. pic.twitter.com/1eRg7pOrmO — Mi India (@XiaomiIndia) February 16, 2018 -
రాణించిన రాయుడు, తివారీ
కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ లో ముంబై ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరుగుతున్న చివరి లీగ్ మ్యాచులో ముంబై యువ ఆటగాళ్లు సౌరభ్ తివారి, అంబటి రాయుడులు మినహా మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో ముంబై, కోల్ కతాకు సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబైకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సిమన్స్ బౌల్ట్ బౌలింగ్ లో డక్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రోహిత్ శర్మ, సౌరభ్ తివారితో కలిసి ఆచితూచి నెమ్మదిగా ఆడడంతో పవర్ ప్లే ముగిసే సరికి ముంబై స్కోరు 51/1 చేయగలిగింది. ఈ తరుణంలో రోహిత్ శర్మ(27)ను రాజ్ పుత్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. తర్వాత బ్యాటింగ్ కు దిగిన అంబటి రాయుడు, సౌరభ్ తో వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగెత్తించాడు. 9 ఫోర్లతో 42 బంతుల్లో సౌరభ్ అర్థశతకం సాధించాడు. వీరిద్దరూ క్రీజులో కుదురుకుంటున్న సమయంలో ఉమేశ్ వేసిన 17 ఓవర్లో లేని పరుగు ప్రయత్నించిన సౌరభ్ తివారీ రనౌటయ్యాడు. అయినా రాయుడు బ్యాటింగ్ లో వేగం తగ్గకుండా ఆడటంతో 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాయుడు(63) కుల్దీప్ యాదవ్ వేసిన 19 ఓవర్లో వరుస బంతుల్లో ఫోర్, సిక్స్ కొట్టి మరుసటి బంతికి స్టంప్ అవుటయ్యాడు. చివరి ఓవర్లో బోల్ట్ 5 పరుగులిచ్చి పోలార్డ్(13) అవుట్ చేయడంతో ముంబై 5 వికెట్లు కోల్పోయి173 పరుగులు చేయగలిగింది. ఇక కోల్ కతా బౌలర్ల లో బోల్ట్ కు రెండు వికెట్లు పడగా కుల్డీప్ యాదవ్, రాజ్ పుత్ లకు చెరో వికెట్ లభించింది. -
టాస్ నెగ్గిన గంభీర్ సేన
కోల్ కతా: ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగే ఐపీఎల్ చివరి లీగ్ మ్యాచ్ లో టాస్ నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ కొంత ఆలస్యంగా ప్రారంభమయింది. అయితే కోల్ కతా జట్టులోగాయం తో బాధపడుతున్న క్రిస్ వోక్స్ స్థానంలో ట్రేంట్ బోల్ట్ ను ఎంపిక చేసింది. ఇక ముంబై ఎలాంటి మార్పు లేకుండా బరిలోకి దిగుతుంది. కోల్ కతాకు ఈ మ్యాచ్ సంక్లిష్టంగా మారింది. ఈ మ్యాచ్ ఓడితే పంజాబ్ మ్యాచ్ ఫలితంపై ఎదురు చూడల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వేళ కోల్ కతా ఈ మ్యాచ్ ఓడి పంజాబ్ పుణే పై గెలిస్తే మూడు జట్లు 16 పాయింట్లతో సమంగా ఉంటాయి. అప్పుడు రన్ రేట్ కీలకం అవుతుంది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్ బెర్త్ ను కైవసం చేసుకోగా, కోల్ కతా సమీపంలో ఉంది. 13 మ్యచుల్లో 9 గెలిచిన ముంబై 18 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలోకొనసాగుతుండగా, కోల్‌కతా 8 గెలిచి మూడో స్తానంలో కొనసాగుతుంది. ఇంతకు ముందు ఇరు జట్లు ఒక సారి తలపడగా విజయం ముంబైని వరించింది. కోల్ కతా ఈ మ్యాచ్ లో ఎలాగై నెగ్గి ముంబై పై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడం ముంబైని కలవర పెడుతుంది. పంజాబ్ తో అనూహ్యాంగా ఓడిన ఇరు జట్లు ఓటములకు బ్రేక్ వేయాలని భావిస్తున్నాయి. -
చివరి ఓవర్లో గట్టెక్కిన కింగ్స్ ఎలెవన్
-
సాహోరే... పంజాబ్
-
సాహోరే... పంజాబ్
►చివరి ఓవర్లో గట్టెక్కిన కింగ్స్ ఎలెవన్ ►ప్లే ఆఫ్ ఆశలు సజీవం ►పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్ ►సాహా మెరుపు ఇన్నింగ్స్ ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు వరుసగా మూడు మ్యాచ్‌లను నెగ్గాల్సిన ఒత్తిడిలో ఉన్న పంజాబ్ ‘కింగ్స్’లా చెలరేగింది. వృద్ధిమాన్ సాహా (93 నాటౌట్) తుదికంటా క్రీజులో నిలిచి భారీ స్కోరు సాధించి పెట్టగా.. ఆ తర్వాత బౌలర్లు పట్టు విడవకుండా ప్రయత్నించి లీగ్‌లో టాప్ పొజిషన్లో ఉన్న ముంబై ఇండియన్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించారు. అయితే పొలార్డ్ చివరి బంతి వరకు విజయం కోసం ప్రయత్నించి పంజాబ్‌ను వణికించాడు. మ్యాక్స్‌వెల్ సేన ఇక తమ చివరి మ్యాచ్‌లో పుణేపై కచ్చితంగా నెగ్గి ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ముంబై: వాంఖెడే మైదానం పరుగుల వర్షంతో తడిసి ముద్దయ్యింది. 231 పరుగుల లక్ష్యం.. టి20ల్లో ఇది కష్టసాధ్యమైనదే అయినా ముంబై ఇండియన్స్ మాత్రం చివరి బంతి వరకు పోరాడింది. అయితే ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన దశలో పొలార్డ్ ఓ భారీ సిక్స్ బాదినా మోహిత్ అద్భుతంగా బంతులేసి తమ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 7 పరుగుల తేడాతో నెగ్గి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. అంతకుముందు వృద్ధిమాన్ సాహా (55 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సీజన్లో తొలిసారి తమ కీలక మ్యాచ్‌లో చెలరేగడంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), గప్టిల్ (18 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. ఆ తర్వాత 231 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి ఓడింది. సిమన్స్ (32 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పార్థివ్ (23 బంతుల్లో 38; 7 ఫోర్లు), పొలార్డ్ (24 బంతుల్లో 50 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 30; 4 సిక్సర్లు) చెలరేగారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాహాకు దక్కింది. సాహా, మ్యాక్స్ దూకుడు... ఫామ్‌లో ఉన్న ఆమ్లా లేకుండానే బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆ లోటు లేకుండా ఓపెనర్లు గప్టిల్, సాహా అద్భుత ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్లోనే గప్టిల్ రెండు, సాహా ఓ ఫోర్‌తో జట్టు 13 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఓవర్లో సాహా రెచ్చిపోయి మూడు ఫోర్లు బాదడంతో స్కోరు దూసుకెళ్లింది. ఈ దూకుడుకు పంజాబ్ 3.4 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే ఆరో ఓవర్లో తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచిన గప్టిల్ మూడో బంతికి వెనుదిరిగాడు. ఇక మ్యాక్స్‌వెల్ రాకతో రన్‌రేట్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కరణ్ శర్మ ఓవర్లో రెండు సిక్సర్లు, ఆ తర్వాత హర్భజన్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన తను అర్ధ సెంచరీ వైపు దూసుకెళుతున్న దశలో బుమ్రా బోల్తా కొట్టించాడు. అప్పటికే జట్టు స్కోరు 11 ఓవర్లలో రెండు వికెట్లకు 131 పరుగులకు చేరింది. ఓవర్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన సాహా 31 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 16వ ఓవర్లో మార్‡్ష (16 బంతుల్లో 25; 2 సిక్సర్లు) అవుటైన అనంతరం స్కోరులో కాస్త వేగం తగ్గింది. శుభారంభం అందినా.. లక్ష్యం భారీగా ఉండటంతో ప్రారంభంలో ముంబై ఇన్నింగ్స్ కూడా దానికి తగ్గట్టుగానే సాగింది. ఓపెనర్లు పార్థివ్, సిమన్స్ ధాటిగా ఆడి శుభారంభాన్ని అందించారు. రెండో ఓవర్లో పార్థివ్ మూడు ఫోర్లు బాదాడు. ఆరో ఓవర్లో సిమన్స్ రెండు సిక్సర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్లోనే సిమన్స్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే తొమ్మిదో ఓవర్ నుంచి ముంబై పతనం ప్రారంభమైంది. మోహిత్ శర్మ వేసిన ఆ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో చెలరేగిన పార్థివ్ నాలుగో బంతికి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 99 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక పదో ఓవర్లో సిమన్స్ లాంగ్ ఆన్‌లో ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర గప్టిల్ అమాంతం పైకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ తీసుకోవడంతో ముంబై షాక్‌కు గురైంది. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ (5), నితీశ్ రాణా (12) వరుసగా అవుట్ కావడంతో 22 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే పొలార్డ్, హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా గేరు మార్చారు. హెన్రీ వేసిన 16వ ఓవర్లో వీరిద్దరు రెండేసి సిక్సర్లు బాదడంతో మొత్తంగా 27 పరుగులు వచ్చాయి. కానీ మరుసటి ఓవర్లో సందీప్.. పాండ్యా వికెట్ తీయడంతో ఐదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా కరణ్ శర్మ ఆడిన ఆరు బంతుల్లోనే మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాది 19 పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన దశలో ముంబై తడబడి విజయానికి దూరమైంది. ఆదివారం వరకు వేచి చూడాలేమో! ►ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ గెలవడంతో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్‌కు చేరుకోగా... మిగతా మూడు బెర్త్‌ల కోసం నాలుగు జట్లు బరిలో ఉన్నాయి. ►నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో ఢిల్లీపై రైజింగ్ పుణే గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పుణే ఓడినా ఆ జట్టు ఆదివారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ►శనివారం గుజరాత్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ సన్‌రైజర్స్ ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే పుణేతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓడిపోవాలి. ►శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ కోల్‌కతా ఓడితే మాత్రం ఆ జట్టు భవితవ్యం గుజరాత్, హైదరాబాద్... పుణే, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ప్లే ఆఫ్‌కు చేరే అన్ని జట్లు ఏవో తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదేమో! -
ఫలించిన పంజాబ్ వ్యూహం
► సాహా విజృంభణ.. ముంబైకి భారీ లక్ష్యం ► రాణించిన మాక్స్ వెల్, గప్టిల్, షాన్ మార్ష్ ముంబై: కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ బ్యాట్స్ మెన్ వృద్దిమాన్ సాహా 93 పరుగులతో విజృంభించడంతో పంజాబ్ ముంబైకి 231 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. మరో వైపు ఓపెనర్ ఆమ్లా అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో సాహాను ఓపెనర్ గా ప్రయత్నించిన పంజాబ్ వ్యూహం ఫలించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, సాహా మంచి శుభారంబాన్ని అందించారు. ఇక మలింగ వేసిన మూడో ఓవర్లో గప్టిల్, సాహా లు బౌండరీలతో విరుచుకపడి 19 పరుగులు పిండుకున్నారు. ఈ దూకుడుతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేయగలిగింది. వేగంగా ఆడుతున్న మార్టిన్ గప్టిల్ (37) కరణ్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి హార్థిక్ పాండ్యా కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్, సాహా తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మాక్స్ వెల్ హార్భజన్ వేసిన 9 ఓవర్లో మూడు సిక్స్ లు బాదడంతో జట్టుకు 21 పరుగులు చేరాయి. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 47 పరుగులు చేసిన మాక్స్ వెల్ బూమ్రా బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన షాన్ మార్ష్ తో సాహా ఇన్నింగ్స్ కొనసాగించాడు. హార్భజన్ వేసిన బంతిని సిక్సర్ గా మలిచిన సాహా 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. సాహా కి తోడుగా మార్ష్ కూడా చెలరేగడంతో 15 ఓవర్లకే పంజాబ్ 173 పరుగులు చేయగలిగింది.ఈ తరుణంలో భారీ షాట్ కుప్రయత్నించిన షాన్ మార్ష్ (25) క్యాచ్ అవుటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా మినహా మిగిలిన వారంతా పోటా పోటిగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పంజాబ్ 18 ఓవర్లోనే 200 పరుగులకు చేరుకొంది. చివర్లో సాహా, అక్సర్ దాటిగా ఆడటంతో పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి ఈ సీజన్లోనే అత్యధికంగా 230 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కరణ్ శర్మ, మెక్లిన్ గన్ లకు తలో వికెట్ దక్కింది.