టోర్నో ప్రారంభంలో దారుణ వైఫల్యాలను చవిచూసే ముంబై ఇండియన్స్... పోనుపోను పుంజుకుంటూ.. చివరికి టైటిల్ విజేతగా నిలుస్తుండటం పరిపాటి అయింది. మరీ ముఖ్యమంగా గడిచిన మూడేళ్లలో ఫస్ట్ ఆఫ్‌లో ఫ్లాప్ కావడం.. సెకండాఫ్‌లో హిట్ కావడం రివాజుగా మారింది. దీనిపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ‘‘అదేంటోమరి!(నవ్వులు) మే నెలలోనే మేం అద్భుతంగా రాణించడం జరుగుతోంది. గత మూడేళ్లుగా టోర్నో ద్వితియార్ధంలోనే బాగా ఆడుతున్నాం’’ అని వ్యాఖ్యానించాడు. ఐపీఎల్ 2018లో భాగంగా బుధవారం కోల్‌కతాపై ముంబై 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ ఏమిటన్న ప్రశ్నకు రోహిత్ తడుముకోకుండా సమాధానం చెప్పాడు.. ‘ఇంకేంటి.. ఇషాన్ ఇన్నింగ్సే’ అని.