Rohith sharma
-
నితీశ్ కు గోల్డెన్ ఛాన్స్? విరాట్, రోహిత్ కు షాక్!
-
మాల్దీవుల్లో చిల్ అవుతున్న రోహిత్ శర్మ (ఫోటోలు)
-
రోహిత్ శర్మ అపార్ట్మెంట్ అద్దె ఎంతంటే..?
సొంతంగా అపార్ట్మెంట్ కొనుగోలు చేసి చాలామంది అద్దెలతోనే రూ.వేలు సంపాదిస్తున్నారు. విభిన్న రంగాల్లో తాము సంపాదించిన డబ్బంతా రియల్టీలో పెట్టుబడిగా పెట్టి రెగ్యులర్ ఇన్కమ్గా మలుచుకుంటున్నారు. తమ స్థాయికి తగినట్లు దాదాపు చాలామంది ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. అలాంటివారిలో ప్రముఖ భారత క్రికెటర్ రోహిత్ శర్మ ఏమీ తీసిపోలేదు. ముంబయిలోని లోయర్ పరేల్‌లో ఉన్న తన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను ఇటీవల నెలకు రూ.2.6 లక్షలకు లీజుకు ఇచ్చారు. జనవరి 2025లో నమోదైన ఈ రియల్టీ లావాదేవీకి సంబంధించిన వివరాలను స్క్వేర్ యార్డ్స్ విడుదల చేసింది.ప్రైమ్ లొకేషన్, ప్రీమియం సౌకర్యాలుమాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్ (లోధా గ్రూప్) అభివృద్ధి చేసిన హై-ఎండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘లోధా మార్క్విస్-ది పార్క్’లో ఈ అపార్ట్మెంట్ ఉంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ), నారిమన్ పాయింట్ వంటి ప్రధాన వ్యాపార ప్రాంతాలకు సమీపంలో ఉండడంతో భారీగా డిమాండ్ ఏర్పడింది. రోహిత్ శర్మకు చెందిన ఈ ప్రాపర్టీలో 1,298 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా, రెండు కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. రోహిత్, అతని తండ్రి గురునాథ్ శర్మ 2013 మార్చిలో రూ.5.46 కోట్లకు ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. స్క్వేర్ యార్డ్స్ వివరాల ప్రకారం ప్రస్తుత అద్దె ఆదాయం నెలకు రూ.2.6 లక్షలుగా ఉంది. ఇది 6 శాతం అద్దె రాబడిని ప్రతిబింబిస్తుంది.లోధా మార్క్విస్-ది పార్క్‌లో శర్మ కుటుంబానికి ఉన్న ఆస్తి ఇది ఒక్కటి మాత్రమే కాదు. మరో అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేశారు. దీన్ని 2024 అక్టోబర్‌లో నెలకు రూ.2.65 లక్షలకు అద్దెకు ఇచ్చారు. ఇది ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్లో వ్యూహాత్మక పెట్టుబడులను హైలైట్ చేస్తుంది.ఇదీ చదవండి: రోజూ రెండు కోట్ల మంది భక్తులు.. అంతరాయంలేని కనెక్టివిటీ!ముంబయి స్థిరాస్తి మార్కెట్ ఎదుగుదలకు కారణాలు..ముంబయి భౌగోళిక పరిమితులు రియల్టీ రంగాన్ని భారీగా పెంచుతున్నాయి. ఒక వైపు అరేబియా సముద్రం ఉండడం, మరోవైపు విస్తరణకు పరిమిత భూమి ఉండడం ప్రాపర్టీ ధరల పెరుగుదలకు కారణమవుతుంది. ప్రధాన ఆర్థిక కేంద్రంగా, మెరుగైన ఉద్యోగ అవకాశాలు, జీవన ప్రమాణాలను కోరుకునే ప్రజలను ముంబయి ఆకర్షిస్తుంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) వంటి అనేక బహుళజాతి సంస్థలు, ఆర్థిక సంస్థలకు పుట్టినిల్లు ముంబయి. వృత్తి నిపుణులు, విద్యార్థులు, ప్రవాసుల రాక కారణంగా అద్దె ఆస్తులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. దక్షిణ ముంబయి, బాంద్రా, అంధేరి, పొవాయ్ వంటి ప్రాంతాల్లో అద్దె భారీగా ఉంటుంది. -
ఇంగ్లాండ్ పై భారత్ గ్రాండ్ విక్టరీ.. రోహిత్ శర్మ విధ్వంసం
-
రోహిత్ శర్మకు మరో బిగ్ షాక్.. కొత్త వన్డే కెప్టెన్ ఎవరంటే?
-
రిటైర్ మెంట్ వార్తలపై స్పందించిన రోహిత్ శర్మ
-
భార్యకు రోహిత్ శర్మ బర్త్ డే విషెస్.. పోస్ట్ వైరల్
-
హ్యాపీ 9 బేబీ.. అన్నింటిలోనూ నువ్వు బెస్ట్: రోహిత్ శర్మపై భార్య రితిక పోస్ట్(ఫొటోలు)
-
అనుష్క.. నీ ఇంటిపేరును అలాగే ఉంచు: విరుష్క జోడీకి నాడు రోహిత్ శర్మ విషెస్(ఫొటోలు)
-
ముంబై టాప్-3 లిస్టులో దక్కని చోటు.. రోహిత్ ఏమన్నాడంటే..!
-
జెర్సీ నంబర్ 18, 45లకు రిటైర్ మెంట్ ఇవ్వాలి..
-
దక్షిణాఫ్రికాకు బయలుదేరిన రోహిత్! వీడియో వైరల్
-
కెప్టెన్ల ఫోటో షూట్: దీని వెనుక సంచలన స్టోరీ, కనీవినీ ఎరుగని అద్భుతం
వరల్డ్ కప్ ఫైనల్ పోరుకు కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రేపు (నవంబరు 19, ఆదివారం) జరగనున్న ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు అక్కడికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలోవరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా సారథి రోహిత్ శర్మ, ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ ల ఫొటో షూట్ ఆకర్షణీయంగా నిలిచింది. అసలీ ఫోటో షూట్ ఎక్కడ? దీని వెనుక ఉన్న కథ ఏంటి? తెలుసుకుందాం రండి..! అహ్మదాబాద్ లోని చారిత్రక ప్రదేశం 'అదాలజ్ మెట్ల బావి' వద్ద ఇరు జట్ల సారధులు అదాలజ్ వావ్‌ను సందర్శించారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. దిదీనికి సంబంధించిన ఫొటోలను ఐసీసీ, బీసీసీఐ, గుజరాత్ టూరిజం విభాఘం తమ ఎక్స్( ట్విటర్)లో పోస్ట్ చేశాయి. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరానికి అహ్మదాబాద్‌కు ఉత్తరాన ఇరవై కిలోమీటర్ల దూరంలో గాంధీనగర్ జిల్లాకి సమీపంలోని అదాలాజ్ అనే చిన్న గ్రామంలో ఉన్న ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెట్ల బావి ఉంది. గుజరాత్లో మార్వాడీ భాషలో, స్టెప్‌వెల్‌ను ‘వావ్’ అంటారు. ఇలాంటి ఇక్కడ చాలా కనిపిస్తాయి. అలాంటి వాటిల్లో ఒకటి అదాలజ్ ని వావ్? Rohit Sharma, the captain of the Indian #Cricket Team, and Pat Cummins, the captain of the Australian Cricket Team, visited #AdalajStepwell. They were mesmerized by the architectural marvel of the stepwell and overwhelmed by the warm hospitality of #Gujarat. VC: @ICC pic.twitter.com/93MncfCIUR — Gujarat Tourism (@GujaratTourism) November 18, 2023 అదాలజ్ ని వావ్ అదాలజ్ ని వావ్ లేదా అదాలజ్ స్టెప్‌వెల్ ను 1499లో తన భర్త జ్ఞాపకార్థం వాఘేలా రాజవంశం అధినేత వీర్ సింగ్ భార్య రాణి రుదాదేవి నిర్మించారు. ఇదొక అద్భుతంగా శిల్పాలతో నిండివున్న ఈ కట్టడం ఇండో-ఇస్లామిక్ వాస్తుశిల్ప అద్భుతానికి గొప్ప నిదర్శనం. గుజరాత్‌లోని అత్యుత్తమ స్మారక కట్టడాలలో ఒకటిగా నిలిచిన ఈ మెట్ల బావి ఐదు అంతస్తుల లోతులో ఉంటుంది. తూర్పు ప్రవేశం నుండి బావి వరకు మొదటి అంతస్తులో ఉన్న పాలరాతి స్లాబ్‌పై అదాలజ్ స్టెప్‌వెల్ చరిత్రను సంస్కృతంలో ఒక శాసనం లిఖించారు. భర్త చివరి కోరిక కోసం, భార్య ప్రాణత్యాగం పురాణాల ప్రకారం, 15వ శతాబ్దంలో,రణవీర్ సింగ్ అప్పట్లో దండై దేశ్ అని పిలిచే ప్రాంతాన్ని పాలించాడు. ఇక్కడ ఎపుడూ విపరీతమైన నీటి ఎద్దడి ఉండేది. కేవలం వర్షాలే ఆధారం. దీంతో అతిపెద్ద, లోతైన బావిని నిర్మించమని ఆదేశించాడు. కానీ అది పూర్తి కాకముందే, పొరుగున ఉన్న ముస్లిం పాలకుడు మహమ్మద్ బేగ్డా దండాయి దేశ్‌పై దండెత్తాత్తుతాడు. ఈ యుద్ధంలో వీర్ సింగ్ అసువులు బాస్తాడు. దీంతో అప్పటి సంప్రదాయం ప్రకారం అతని భార్య రాణి సతీసహగమనం కోసం సిద్ధమవుతుండగా, బేగ్డా ఆమెను వివాహం చేసుకోవాలను కుంటున్నట్లు చెప్తాడు. అయితే ఈ ప్రాంత రక్షణ, భర్త చివరి కోరికను నెరవేర్చాలనే ఆశయంతో ఇక్కడ ముందుగా మెట్ల బావి నిర్మాణాన్ని పూర్తి చేయాలనే షరతుతో అతని ప్రతిపాదనను అంగీకరిస్తుంది. ఫలితంగా రికార్డు సమయంలో స్టెప్‌వెల్ నిర్మాణానికి పూనుకుంటాడు. కానీ రాణి పథకం వేరే ఉంటుంది. ఇది పూర్తికాగానే ప్రార్థనలతో మెట్ల బావికి ప్రదక్షిణలు చేసి, ఆతరువాత బావిలోకి ప్రాణ త్యాగం చేస్తుంది. ఈ సంఘటనలు బావి గోడలపై చిత్రీకరించి ఉన్నాయి. ఈ బావి ప్రత్యేకలు ఏంటంటే సంవత్సరాల తరబడి నీటి ఎద్దడి కారణంగా నీటి మట్టంలో కాలానుగుణ హెచ్చుతగ్గుల స్థాయిలోని భూగర్భ జలాలకోసం ఇంత లోతుగా దీన్ని నిర్మించారు. సోలంకి నిర్మాణ శైలిలో ఇసుకరాయితో నిర్మించబడిన అదాలజ్ మెట్ల బావి పైభాగంలో అష్టభుజాకారంలో 16 స్తంభాలు, 16 ప్లాట్‌ఫారమ్‌లతో ఉంటుంది. మూడు మెట్ల మార్గాలు భూగర్భంలో కలుస్తాయి. 16 మూలల్లో దేవతలతోపాటు, పలు విగ్రహాలు చెక్కారు. దేవతలు ఇక్కడికి నీరు నింపడానికి వస్తుంటారని గ్రామస్తుల నమ్మకం. అలాగే యాత్రికులు, వ్యాపారులకు ఆశ్రయం ఇచ్చింది. బావి అంచున ఉన్న చిన్న చిన్న నవగ్రహాలు లేదా తొమ్మిది గ్రహాలు దుష్టశక్తుల నుండి స్మారక చిహ్నాన్ని కాపాడుతాయని స్థానికులు నమ్ముతారు. అష్టభుజి పైకప్పు తో తక్కువ గాలి లేదా సూర్యకాంతి ల్యాండింగ్లోకి ప్రవేశించి, లోపల ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ బయట కంటే చల్లగా ఉండటానికి కారణమని ఆర్కిటెక్చర్, ఆర్కియాలజీ రంగంలోని నిపుణులు అంచనా. భయంకరమైన ఎండాకాలంలో కూడా ఇక్కడి ఉష్ణోగ్రత బయటకంటే దాదాపు ఐదు డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ఇంకా అమీ ఖుంబోర్ (ప్రాణాదార నీటికి ప్రతీకాత్మక కుండ) , కల్పవృక్షం (జీవిత వృక్షం) ఏక శిలా విగ్రహాలు, పై అంతస్తులలో ఏనుగులు (3 అంగుళాలు (76 మిమీ) చెక్కడాలు. మజ్జిగ చిలకడం, స్త్రీల అలంకరణ, రోజువారీ పనుల దృశ్యాలతోపాటు నృత్యకారులు, సంగీత విద్వాంసుల ప్రదర్శన లాంటివి ఇక్కడి గోడల నిండా కనిపిస్తాయి. మేస్త్రీలకు మరణ శిక్ష బావికి సమీపంలో దొరికిన సమాధుల ద్వారా ఇంకొక కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ బావిని నిర్మించిన ఆరుగురు మేస్త్రీలవే సమాధులే. వారి నిర్మాణ శైలి, నిర్మాణ నైపుణ్యానికి, ప్రతిభకు ముగ్దుడైన బేగ్డా ఇలాంటిదే మరొక బావిని నిర్మించగలరా అని మేస్త్రీలని అడిగాడట. దానికి సరే అని వారు సమాధానం చెప్పడంతో వారికి మరణశిక్ష విధించాడు. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కట్టడం మరొకటి ఉండకూడదని భావించాడట. -
డేవిడ్ బెక్హాంకు అంబానీ అదిరిపోయే ట్రీట్..!
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
-
కోహ్లీ, రోహిత్ టీ ట్వంటీ కెరీర్ ముగిసినట్టేనా ?
-
అలా చేస్తేనే రోహిత్ శర్మ ఫామ్ లోకి వస్తాడు
-
రోహిత్ శర్మ ఫెయిల్యూర్ కి కారణం శిఖర్ ధావన్
-
తదుపరి కెప్టెన్ రహానే..!
-
రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఎర్త్ పెట్టిన రహానే
-
రోహిత్ శర్మ, రాహూల్ ద్రావిడ్ తో విభేదాలు? విరాట్ కోహ్లీ ఎమోషనల్ పోస్ట్
-
ఆ ఒక్కటి జరిగితే యశస్వి జైస్వాల్ కెరీర్ నెక్స్ట్ లెవెల్ కే..!
-
WTC ఫివర్ ఫేవరెట్ గా ఇండియా ఎందుకంటే..!
-
నవీన్ ఉల్ హుక్ కి ఎటకారం ఎక్కువే ..
-
అదే మా ఓటమికి కారణం: రోహిత్ శర్మ
-
ఫైనల్ కి వెళ్ళేది ఏవరు.. ప్రెజర్ లో GT జోష్ లో MI
-
సపోర్ట్ బౌలర్‌గా వచ్చాడు.. అతనిలో టాలెంట్ ఉందని ముందే పసిగట్టాను..!
-
తిలక్ వర్మ ఇంట్లో సచిన్, రోహిత్
-
పంత్ చేసిన పనికి రోహిత్ శర్మ ఫైర్, కోహ్లీ వల్ల...
-
రోహిత్ శర్మపై రిషబ్ పంత్ ఫ్యాన్స్ ఫైర్..
-
తప్పుగా మాట్లాడుతున్నారు..ఇకనైనా మారండి
-
ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా: రోహిత్ శర్మ
ముంబై:టీమిండియా స్టార్ ఓపెనర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తుంది. రోహిత్ శర్మ తన కూతురు సమైరా తో కలిసి వున్న ఓ ఫోటో ను పోస్ట్ చేశాడు.ఇక రోహిత్‌కు తన కూతురు సమైరా అంటే ఎంతో ఇష్టమనే విషయం తెలిసిందే.తన కూతురు కు సంబంధించి వీడియోలు, ఫొటోలను సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటుంటాడు.కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవాధికంగా వాయిదాపడటంతో ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ ప్రస్తుతం ఇంట్లోనే గడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం తన గారాలపట్టి సమైరాను భుజాలపై ఎత్తుకుని ఉన్న ఓ ఫొటోను రోహిత్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.దానికి 'ఆడపిల్ల తండ్రిగా గర్వపడుతున్నా' అనే క్యాప్షన్ ఇచ్చాడు.ఈ పోస్టుకు కొన్ని గంటల్లోనే వైరల్ అయింది.అటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్, ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో రోహిత్‌కు చోటు దక్కిన విషయం తెలిసిందే. (చదవండి:Eng Vs Ind: షెడ్యూల్ ముందుకు జరపండి! ) -
మరోసారి అంపైరింగ్ తప్పిదం.. ఈసారి రోహిత్
చెన్నై: భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో విజయాల సంగతి పక్కన పెడితే.. అంపైరింగ్ అపహాస్యానికి గురవుతున్నట్లు సుస్పష్టమవుతుంది. మ్యాచ్ తొలి రోజు రహానే విషయంలో జరిగిన పొరపాటే రెండో రోజు ఆటలో రోహిత్ శర్మ విషయంలోనూ పునరావృతం కావడం ఇంగ్లీష్ ఆటగాళ్లతో పాటు యావత్ క్రీడాభిమానులకు విస్మయాన్ని కలిగిస్తోంది. ఫీల్డ్ అంపైర్ పొరపాటు చేస్తే సరిదిద్దాల్సిన థర్డ్ అంపైర్ కూడా అదే తప్పును రిపీట్ చేస్తే.. అది జట్టు జయాపజయాలపైనే కాకుండా అంపైరింగ్ వ్యవస్థపైనే నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. రెండో రోజు భారత రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ ఎల్బీడబ్యూ విషయంలో ఇంగ్లండ్ రివ్యూ కోరింది. స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతి మిడిల్ స్టంప్‌ను తాకే దిశగా పయనిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రోహిత్ షాట్ అడే ప్రయత్నం చేశాడన్న కారణంగా అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. రివ్యూ చూసిన థర్డ్ అంపైర్ బంతి ఆఫ్ స్టంప్ అవతలి నుంచి వెళ్తుందని కన్ఫర్మ్ చేసి నాటౌట్‌గా ప్రకటించాడు. అయితే రీప్లేలో మాత్రం రోహిత్ ఎటువంటి షాట్‌కు ప్రయత్నించిన దాఖలాలు కనబడలేదు. బంతి మిడిల్ స్టంప్‌ను తాకుతుందని సుస్పష్టంగా తెలుస్తోంది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై విస్మయానికి గురైన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఈ విషయంపై వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ సైతం తన అసహనాన్ని తెలియజేశాడు. కాగా, తొలి రోజు ఆటలో సైతం రహానే అంపై'రాంగ్' నిర్ణయం వల్ల బతికిపోయిన సంగతి తెలిసిందే. జాక్ లీచ్ వేసిన బంతి రహానే గ్లోవ్స్‌ను తాకుతూ వికెట్‌కీపర్ చేతుల్లోకి వెళ్లినట్లు రీప్లేలో స్పష్టంగా తెలుస్తోంది. దీనిపై ఇంగ్లండ్ ఆటగాళ్లు రివ్యూకి వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా పొరపాటు చేసి రహానేను నాటౌట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ ఎల్బీడబ్యూ యాంగిల్లోనే పరిశీలించి, క్యాచ్ అవుట్ విషయాన్ని విస్మరించాడు. ఏదిఏమైనప్పటికీ ఇటు వంటి అంపై'రాంగ్' నిర్ణయాలు ఆటగాళ్లలో తప్పుడు అభిప్రాయాన్నినింపేస్తాయి. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 25 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులు చేసిన భారత్, 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కలుపుకొని 249 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 134 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. అశ్విన్ 5 వికెట్లతో రాణించాడు. If that’s a shot then I’m a rockstar #INDvEND pic.twitter.com/eTfNvW6V84 — simon hughes (@theanalyst) February 14, 2021 -
ఎయిర్‌పోర్ట్‌లో టీమిండియాకు ఘన స్వాగతం
ముంబై: ఆస్ట్రేలియా టూర్‌ను విజయవంతంగా ముగించి.. ట్రోఫీతో భారత క్రికెట్ జట్టు సభ్యులు సగర్వంగా స్వదేశం చేరారు. విమానాశ్రయాల్లో వారికి ఘన స్వాగతం లభించింది. ఆస్ట్రేలియా నుంచి జట్టు సభ్యులు గురువారం భారత్‌కు చేరుకున్నారు. ముంబైలో కెప్టెన్ అజింక్య రహానే, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి, ఓపెనర్ పృథ్వీ షా దిగగా.. బ్రిస్బెన్ టెస్ట్‌లో హీరోగా నిలిచిన రిషబ్ పంత్ ఢిల్లీలో అడుగుపెట్టాడు. ఇక టెస్ట్‌లో సత్తా చాటిన మహ్మద్ సిరాజ్ హైదరాబాద్ చేరుకున్నాడు. ఆటగాళ్లకు విమానాశ్రయ సిబ్బందితో పాటు అభిమానులు, ప్రయాణికులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఢిల్లీలో దిగిన అనంతరం రిషబ్ పంత్ మీడియాతో మాట్లాడారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. సిరీస్ మొత్తం ఆడిన తీరుపై జట్టు అంతా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. -
కరోనా పరీక్షలు.. బీసీసీఐకి పెద్ద ఊరట
మెల్బోర్న్: సిడ్నీ వేదికగా జరగబోయే మూడో టెస్టుకు ముందు బీసీసీఐకి పెద్ద ఊరట లభించింది. భారత క్రికెటర్లు, సిబ్బందికి ఆదివారం ఆర్టీ-పీసీఆర్ పద్ధతిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. అందరికీ నెగటివ్‌గా తేలిందని బీసీసీఐ ఒక ప్రకటలో తెలిపింది. పరీక్షలు చేయించుకున్నవారిలో ఐసోలేషన్‌లో ఉన్న రోహిత్ శర్మ, పృథ్వీ షా, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, నవదీప్ సైనీ ఉన్నారని వెల్లడించింది. కాగా, పింక్‌బాల్ టెస్టులో విజయం అనంతరం ఈ ఐదుగురు కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన సంగతి తెలిసిందే. అయితే, వారిపై అభిమానంతో నవల్దీప్ సింగ్ అనే వ్యక్తి చాటుగా బిల్లు చెల్లిచడం, ఆ విషయాన్ని ట్విటర్లో పేర్కొనడంతో వైరల్‌గా మారింది. (చదవండి: రోహిత్ బీఫ్ ఆర్డర్ చేశాడా.. హిట్‌మ్యాన్‌పై ట్రోలింగ్!) దాంతోపాటు తను బిల్లు కట్టిన విషయం తెలుసుకుని రోహిత్ శర్మ తనను వారించినట్లు, రిషభ్ పంత్ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని నవల్దీప్ ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో ఈ సంగతి క్రికెట్ ఆస్ట్రేలియా దృష్టికి వచ్చింది. బయో బబుల్ దాటి వచ్చారనే ఆరోపణలతో తాజాగా సీఏ ఈ ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచింది. ఆటగాళ్లు బయో బబుల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నాయి. దీంతో వీరు ప్రయాణాల్లో, ప్రాక్టీస్ సమయాల్లో... మిగతా భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 7 నుంచి జరుగనున్న మూడో టెస్టు కోసం ఇరు జట్లు 2 రోజుల ముందుగా సిడ్నీకి బయల్దేరుతాయి. (చదవండి: మళ్లీ ఆంక్షలా... మా వల్ల కాదు!) మూడో టెస్టుకు పాటిన్సన్ దూరం భారత్‌తో జరగనున్న మూడో టెస్టుకు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ పాటిన్సన్ దూరమయ్యాడు. పక్కటెముకల గాయం కారణంగా పాటిన్సన్ మూడో టెస్టుకు అందుబాటులో ఉండడం లేదని క్రికెట ఆస్ట్రేలియా ట్విటర్లో తెలిపింది. అతని స్థానంలో మరొక ఆటగాడిని రీప్లేస్ చేయడం లేదని, నాలుగో టెస్టుకు పాటిన్సన్ అందుబాటులో ఉంటాడని పేర్కొంది. Men's Squad Update: Fast Bowler James Pattinson has been ruled out of our Australian squad for the third #AUSvIND Vodafone Test with bruised ribs. He will not be replaced in the squad and will be assessed further ahead of the Brisbane Test match. pic.twitter.com/YAauH5zDHj — Cricket Australia (@CricketAus) January 3, 2021 -
ఐసోలేషన్‌లో రోహిత్ శర్మ
మెల్బోర్న్: భారత క్రికెటర్లపై అభిమానంతో ఒక వీరాభిమాని చేసిన పని వారికి కొత్త చిక్కులు తెచ్చి పెట్టింది. ఈ అభిమానం కారణంగా భారత జట్టు టెస్టు వైస్ కెప్టెన్ రోహిత్‌శర్మ సహా నలుగురు క్రికెటర్లు ఐసోలేషన్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త సంవత్సరం రోజున బయటకు వెళ్లి అల్పాహారం చేసిన కారణంగా రోహిత్ శర్మ, యువ ఓపెనర్లు శుబ్‌మన్ గిల్, పృథ్వీ షా, వికెట్‌కీపర్ రిషభ్ పంత్, పేసర్ నవదీప్ సైనీలను ఐసోలేషన్‌కు తరలించినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) శనివారం వెల్లడించింది. ఆటగాళ్లు బయో బబుల్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారా లేదా అని తెలుసుకునేందుకు బీసీసీఐ, సీఏ సంయుక్తంగా దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పింది. ► సీఏ ప్రొటోకాల్ ప్రకారం ఆటగాళ్లు ఇన్డోర్ ప్రదేశాల్లో భోజనం చేయకూడదు. ప్రజా రవాణా వ్యవస్థను వాడకుండా సామాజిక దూరాన్ని పాటిస్తూ కాలిబాటన వారికి సమీపంలోని అవుట్డోర్ వేదికలకు మాత్రమే వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. ► అయితే శుక్రవారం కొత్త సంవత్సరం సందర్భంగా మెల్బోర్న్లోని సమీప రెస్టారెంట్‌కు వెళ్లి భారత క్రికెటర్లు అల్పాహారం చేస్తుండగా... అక్కడే ఉన్న భారత అభిమాని ఒకరు వారికి తెలియకుండా క్రికెటర్ల బిల్లు చెల్లించాడు. ఇది తెలుసుకున్న రోహిత్ శర్మ తనను వారించినట్లు, రిషభ్ పంత్ తనను ఆలింగనం చేసుకున్నట్లు, ఆ తర్వాత క్రికెటర్లతో కలిసి ఫొటో తీసుకున్నానని ఆ అభిమాని ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో ఈ సంగతి సీఏ దృష్టికి వచ్చింది. ► బయో బబుల్ దాటి వచ్చారనే ఆరోపణలతో తాజాగా సీఏ ఈ ఐదుగురిని ఐసోలేషన్‌లో ఉంచింది. దీంతో వీరు ప్రయాణాల్లో, ప్రాక్టీస్ సమయాల్లో... మిగతా భారత జట్టుతో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. 7 నుంచి జరుగనున్న మూడో టెస్టు కోసం ఇరు జట్లు 2 రోజుల ముందుగా సిడ్నీకి వస్తాయి. ► ‘ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఉల్లంఘన జరగలేదు. మన వాళ్లకు నిబంధనల గురించి బాగా తెలుసు. వారిపై బీసీసీఐ ఎలాంటి దర్యాప్తు చేపట్టడం లేదు. రెండో టెస్టు లో భారత్ చేతిలో ఓటమి అనంతరం ఆస్ట్రేలియాలోని ఓ వర్గం మీడియా ఇలాంటి ద్వేషపూరిత వార్తలను ప్రచారం చేస్తోంది. మూడో టెస్టు ముందర భారత జట్టును కలవరపెట్టేందుకు ఇది ఓ ప్రయత్నమైతే, ఇది చాలా చెడ్డ కుట్ర అని భావించవచ్చు. ఇప్పుడు ఈ వివాదం 2007–08లో జరిగిన ‘మంకీ గేట్’ నాటి పరిస్థితులను తలపిస్తోంది’ అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి వివరణ ఇచ్చారు. రెస్టారెంట్లో భారత క్రికెటర్లు -
రోహిత్ శర్మకు లైన్ క్లియర్
బెంగళూరు : టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మకు లైన్ క్లియర్ అయింది. జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో శుక్రవారం వైద్య బృందం నిర్వహించిన ఫిట్నెస్ టెస్టులో హిట్‌మ్యాన్ పాసయ్యాడు. ఈ మేరకు బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. బీసీసీఐ వైద్య బృందంతోపాటు ఎన్సీఏ డైరెక్టర్ రాహుల్ ద్రవిడ్, సెలక్టర్ల పర్యవేక్షణలో రోహిత్‌కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించారు. (చదవండి : బీకేర్ ఫుల్.. మరిన్ని బౌన్సర్లు దూసుకొస్తాయి) కాగా ఫిట్నెస్ పరీక్షలో రోహిత్ సఫలం కావడంతో డిసెంబర్ 14న ఆస్ట్రేలియాకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా రోహిత్ నిబంధనల ప్రకారం 14 రోజుల క్వారంటైన్ అనంతరం జట్టుతో కలవాల్సి ఉంటుంది. దీంతో తొలి రెండు టెస్టులకు దూరం కానున్న రోహిత్ చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడు. కాగా మొదటి టెస్టు అనంతరం టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లి పెటర్నీటి సెలవులపై స్వదేశానికి రానున్నాడు. కోహ్లి స్థానంలో మిగిలిన మూడు టెస్టులకు అజింక్యా రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఆసీస్- భారత్‌ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ అడిలైడ్ వేదికగా డిసెంబర్ 17నుంచి జరగనుంది.(చదవండి : అందుకే హార్దిక్‌ను వద్దనుకున్నాం: కోహ్లి) -
దుమ్మురేపిన కోహ్లి.. రెండో స్థానంలో రోహిత్
దుబాయ్ : 2020 ఏడాది ముగింపు సందర్భంగా గురువారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఆసీస్ టూర్లో రెండు హాఫ్ సెంచరీలతో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 870 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గాయం కారణంగా ఆసీస్ టూర్‌కు దూరంగా ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ 842 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి రెండు స్థానాల మధ్య 28 పాయింట్ల వ్యత్యాసం ఉండడం విశేషం. (చదవండి : అందుకే హార్దిక్‌ను వద్దనుకున్నాం: కోహ్లి) బాబర్ అజమ్(837), రాస్ టేలర్(818), ఆరోన్ ఫించ్(791) పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఇక టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్‌లో వరుసగా రెండు సెంచరీలు సాధించి జోరు కనబర్చిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ చాలారోజుల తర్వాత టాప్ 20లోకి అడుగుపెట్టగా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా టాప్ 20లో చోటు సంపాదించాడు. ఇక ఆసీస్ టూర్లో బ్యాటింగ్‌లో ఇరగదీసిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా 555 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచి బ్యాటింగ్‌లో కెరీర్ బెస్ట్ చేరుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగానికి వస్తే న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. బంగ్లాదేశ్ బౌలర్ ముజీబుర్ రెహమాన్ 701 పాయింట్లతో రెండో స్థానం.. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా 700 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో టాప్ 10లో బుమ్రా మినహా టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా లేడు. ఇక ఆసీస్‌కు చెందిన హాజిల్‌వుడ్, పాట్ కమిన్స్‌లు ఆరు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.(చదవండి : టీమిండియాకు మరో షాక్) -
కెప్టెన్‌కే ఏమీ తెలీదు!
సిడ్నీ: ఆస్ట్రేలియా విమానం ఎక్కుతున్న సమయంలో కూడా జట్టు వైస్ కెప్టెన్ తమతో పాటు ఎందుకు రావడం లేదో కెప్టెన్‌కు తెలీదు! ఈ వ్యవహారంపై జట్టు సారథికి సమాచారం ఇవ్వాల్సిన బోర్డు ఏదీ చెప్పకుండా అన్ని విషయాలను దాచి పెట్టింది! భారత క్రికెట్‌కు సంబంధించి తాజా పరిస్థితి ఇది. ఐపీఎల్లో రోహిత్ శర్మ గాయపడటం మొదలు ఇప్పుడు తొలి రెండు టెస్టులకు దూరం కావడం వరకు నెల రోజులుగా సాగుతున్న అతని ఫిట్నెస్ వివాదంలో ఇప్పుడు మరో కొత్త అంశం తెర పైకి వచ్చింది. అసలు రోహిత్ శర్మ గాయం గురించే తనకు పూర్తి సమాచారం లేదని స్వయంగా కెప్టెన్ విరాట్ కోహ్లి వెల్లడించాడు. అసలు ఒక రకమైన అనిశ్చితి, గందరగోళం కనిపించిందని అతను చెప్పడం ఈ వ్యవహారం ఎలా సాగిందో చెబుతోంది. టీమిండియా కెప్టెన్‌కు, బీసీసీఐకి మధ్య ఎలాంటి సమాచార లోపం ఉందో కూడా ఇది చూపిస్తోంది. రోహిత్ వ్యవహారానికి సంబంధించి కోహ్లి చేసిన వ్యాఖ్యలు అతని మాటల్లోనే... ‘దుబాయ్‌లో సెలక్షన్ కమిటీ సమావేశానికి రెండు రోజుల ముందు మాకు ఒక మెయిల్ వచ్చింది. ఐపీఎల్లో గాయపడిన కారణంగా రోహిత్ శర్మ సెలక్షన్‌కు అందుబాటులో లేడని, అతనికి కనీసం రెండు వారాల విశ్రాంతి, రీహాబిలిటేషన్ అవసరమని అందులో ఉంది. దీనికి సంబంధించి మంచి చెడులన్నీ రోహిత్‌కు చెప్పామని, అతను దానిని అర్థం చేసుకున్నాడని కూడా ఉంది. అందుకే ఎంపిక చేయడం లేదని చెప్పారు. అయితే ఆ తర్వాత అతను ఐపీఎల్ ఆడటంతో అంతా బాగుందని, ఆస్ట్రేలియా విమానం ఎక్కుతాడని మేం అనుకున్నాం. అయితే అది జరగలేదు. (289 రోజుల తర్వాత...) మాతో రోహిత్ ఎందుకు ప్రయాణించడం లేదో మాకెవరికీ సమాచారం లేదు. దాని తర్వాత బోర్డు నుంచి అధికారికంగా ఒకే ఒక మెయిల్ వచ్చింది. అందులో రోహిత్ ఎన్సీఏలో ఉన్నాడని, అతని గాయాన్ని పర్యవేక్షిస్తున్నామని, నవంబర్ 11న మరింత స్పష్టత వస్తుందని రాసుంది. సెలక్షన్ కమిటీ సమావేశం జరిగిన రోజు నుంచి మొదలు పెడితే ఐపీఎల్ ముగిసి, ఎన్సీఏలో చేరే వరకు మాకు ఎలాంటి సమాచారం లేదు. దీనిపై పూర్తిగా స్పష్టత లోపించింది. అసలు ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు వేచి చూడటమే సరైంది కాదు. అంతా గందరగోళంగా ఉందనేది వాస్తవం. రోహిత్ పరిస్థితికి సంబంధించి ఎంతో అనిశ్చితి నెలకొంది. ఎక్కడా స్పష్టత లేదు’ -
రోహిత్, ఇషాంత్ అవుట్
న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టుకే కాదు... అభిమానులనూ ఇది కచ్చితంగా నిరాశపరిచే వార్త! బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్ లకు అనుభవజ్ఞులైన స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ దూరమయ్యారు. అటు ప్రధాన బ్యాట్స్‌మన్ రోహిత్, ఇటు వెటరన్ పేసర్ ఇషాం త్ ఇద్దరూ దూరమవడం భారత్‌కు ఒక విధంగా ఆల్‌రౌండ్ దెబ్బలాంటిదే! జట్టు బ్యాటింగ్, బౌలింగ్‌లపై ఇది తప్పకుండా ప్రభావం చూపుతుందని భారత జట్టు మేనేజ్మెంట్ కలవరపడుతోంది. అయితే చివరి రెండు టెస్టుల వరకల్లా అందుబాటులోకి రావాలని జట్టుతో పాటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆశిస్తోంది. నిజానికి టెస్టు సిరీస్‌కు సమయమున్నప్పటికీ ఆస్ట్రేలియాలో అమలవుతున్న కఠిన కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్లు ఇప్పటికిప్పుడు బయల్దేరితేనే తొలి టెస్టు ఆడగలరు. ఇదే విషయాన్ని ఆదివారం హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పారు. అక్కడ 14 రోజుల ఐసోలేషన్ తర్వాతే వారు మైదానంలోకి అడుగు పెట్టి ప్రాక్టీస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు అలజడి రేపుతున్న దశలో అక్కడి ప్రభుత్వం భారత క్రికెటర్లకు క్వారంటైన్ విషయంలో ఏమాత్రం మినహాయింపు ఇవ్వడం లేదు. అందుకే సీనియర్ ఆటగాళ్లు తొలి రెండు టెస్టులకు దూరమని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఎన్సీఏలోనే ఆటగాళ్లు... సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటన కోసం యూఏఈలో ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత క్రికెట్ జట్టు సభ్యులు సిడ్నీ ఫ్లయిట్ ఎక్కారు. కానీ జట్టుకు ఎంపికైనప్పటికీ గాయాలతో రోహిత్, ఇషాంత్ వెళ్లలేకపోయారు. లీగ్ మధ్యలోనే పక్కటెముకల గాయంతో ఇషాంత్ స్వదేశానికి రాగా, తొడకండరాల గాయంతోనే ఫైనల్ మ్యాచ్ ఆడిన రోహిత్ భారత్‌కు వచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్నారు. ఇషాంత్ గాయం నుంచి కోలుకోవడంతో ఫిజియో, ట్రెయి నర్ల పర్యవేక్షణలో ప్రాక్టీస్ పెంచాడు. అయితే మ్యాచ్ ఫిట్నెస్ స్థాయికి ఇంకా రాలేదు. రోజుకు కనీసం 20 ఓవర్లయినా బౌలింగ్ చేస్తేనే టెస్టు బౌలర్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు. అందుకే పని ఒత్తిడిని ఉన్నపళంగా పెంచకుండా ఎన్సీఏ బృందం జాగ్రత్తలు తీసుకుంటోంది. వీళ్లిద్దరు పూర్తి ఫిట్నెస్ సాధించాలంటే మరో 3–4 వారాలు పడుతుందని ఎన్సీఏ ఫిజియో బోర్డుకు నివేదిక ఇచ్చాడు. అయ్యర్‌కు అవకాశం! పరిమిత ఓవర్ల జట్టు సభ్యుడైన శ్రేయస్ అయ్యర్‌కు టెస్టులాడే అవకాశం రావొచ్చు. రోహిత్ అం దుబాటులో లేకపోవడం, తొలి టెస్టు తర్వాత కెప్టెన్ కోహ్లి స్వదేశానికి రానుండటంతో అయ్యర్ టెస్టు అరంగేట్రానికి అవకాశాలు మరింత మెరుగయ్యాయి. టీమిండియా ఈ పర్యటనలో ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టి20లు, నాలుగు టెస్టులు ఆడుతుంది. -
కూతుళ్లతో మురిసిపోతున్న ముంబై ఆటగాళ్లు
దుబాయ్ : ఐపీఎల్ 13వ సీజన్లో మరోసారి అదరగొట్టే ప్రదర్శన చేసిన ముంబై ఇండియన్స్ ఆరవసారి ఫైనల్లోకి ప్రవేశించింది. ప్లేఆఫ్‌లో ఢిల్లీపై ఘన విజయం సాధించిన ముంబై మరో టైటిల్‌పై కన్నేసింది. కాగా నేడు ఎస్ఆర్హెచ్, ఢిల్లీ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గెలిచిన జట్టు మంగళవారం ముంబై ఇండియన్స్‌తో తుది పోరుకు సిద్ధమవనుంది. కాగా ఫైనల్ మ్యాచ్‌కు మూడు రోజుల సమయం ఉండడంతో ముంబై ఆటగాళ్లు తమ కుటుంబసభ్యులతో ఆనందంగా గడిపారు. ఈ సందర్భంగా రోహిత్ కూతురు సమైరా, ధవల్ కులకర్ణి కూతురు నితారా, తారే కూతురు రబ్బానీల బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా ఆటగాళ్లు తమ కూతుళ్లతో కలిసి దిగిన ఫోటోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇప్పుడీ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే.. డికాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ విభాగం బలంగా కనబడుతుండగా.. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్‌లు చెలరేగిపోతున్నారు. బుమ్రా 14 మ్యాచ్‌ల్లో 27 వికెట్లతో టాప్‌లో కొనసాగుతుండగా.. బౌల్ట్ 22 వికెట్లతో ఉన్నాడు. అన్నింట్లోనూ సమానంగా కనిపిస్తున్న ముంబై మంగళవారం జరగబోయే ఫైనల్లో గెలిచి ఐదోసారి కప్ సొంతం చేసుకోవాలని భావిస్తుంది. -
చివరి రెండు టెస్టులకు కోహ్లి దూరం!
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో జనవరి తొలి వారం నుంచి జరగనున్న చివరి రెండు టెస్టులకు కెప్టెన్ విరాట్ కోహ్లి దూరం కానున్నాడు. భార్య అనుష్క డెలివరీ దృష్ట్యా కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడు. అతని స్థానంలో ఆసీస్ టూర్‌కు రోహిత్ శర్మను ఎంపిక చేసే అవకాశం ఉంది. ముందు ప్రకటించిన జట్టులో రోహిత్‌ను సెలక్టర్లు పక్కనపెట్టిన తెలిసిందే. ఐపీఎల్లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీన్ని సాకుగా చూపి అతన్ని ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయలేదని తెలిసింది. అయితే, కోహ్లితో విభేదాల కారణంగా హిట్‌మ్యాన్‌ను ఆస్ట్రేలియా పర్యటన నుంచి తప్పించారని సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తింది. కాగా, ఆస్ట్రేలియా పర్యటనకు ఆటగాళ్లు భార్యా పిల్లలను తీసుకెళ్లేందుకు బీసీసీఐ అనుమతినిచ్చింది. (చదవండి: ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్!) -
'రోహిత్ శర్మను గుడ్డిగా నమ్మాను.. అందుకే'
దుబాయ్ : సూర్యకుమార్ యాదవ్.. ఇప్పుడు ముంబై ఇండియన్స్‌లో కీలక ఆటగాడిగా ఉన్నాడు. కానీ ఇదే సూర్యకుమార్ దేశవాలి క్రికెట్లో మెరుగ్గా రాణించినా అనామక ఆటగాడిగానే ఐపీఎల్‌కు పరిచయమయ్యాడు. అతని ఐపీఎల్ కెరీర్ తొలుత ముంబై ఇండియన్స్‌తోనే మొదలైంది. 2012లో ముంబై ఇండియన్స్ సూర్యకుమార్‌ను కొనుగోలు చేసింది. కానీ అతనికి రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదు. కారణం .. ముంబై జట్టులో అప్పటికే సీనియర్ ఆటగాళ్లైన సచిన్, రోహిత్ శర్మ, పొలార్డ్ సహా మిగతా ఆటగాళ్ల మధ్య అతను లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చేది.. ఒక్కోసారి ఆ అవకాశం కూడా రాలేదు. ఆ తర్వాత 2014లో జరిగిన ఐపీఎల్ వేలంలో సూర్యకుమార్ యాదవ్‌ను కేకేఆర్ కొనుగోలు చేసింది. కేకేఆర్ వెళ్లిన తర్వాత ఒక్కసారిగా అతని ఆటస్వరూపం మారిపోయింది. (చదవండి : మా జట్టు ప్రదర్శన నన్ను నిరాశపరిచింది : ప్లెమింగ్) ముఖ్యంగా ఐపీఎల్ 2015లో ముంబై ఇండియన్స్, కేకేఆర్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా లీగ్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 98 పరుగుల క్లాసిక్ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే చేదనలో భాగంగా కేకేఆర్ తరపున సూర్యకుమార్ కేవలం 20 బంతులెదుర్కొని 5 సిక్స్‌లతో 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. అప్పుడే సూర్యకుమార్ అనే పేరు మారుమోగింది. సూర్య ఇన్నింగ్స్‌తో రోహిత్ శర్మ క్లాసిక్ ఇన్నింగ్స్‌ను ఎవరు గుర్తు పెట్టుకోలేదు. ఐపీఎల్ కెరీర్లో సూర్యకుమార్‌కు ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత కేకేఆర్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్ పలు కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2018లో జరిగిన వేలంలో సూర్యకుమార్‌ను రూ. 3.2 కోట్లతో మళ్లీ ముంబై ఇండియన్స్ దక్కించుకుంది. (చదవండి : అతను చాలా డేంజరస్ ప్లేయర్: సచిన్) అప్పటినుంచి ముంబైకి ఆడుతున్న సూర్యకుమార్ జట్టులో కీలకంగా మారాడు. ఓపెనర్ల తర్వాత వన్‌డౌన్‌లో వస్తూ సూర్యకుమార్ యాదవ్ స్థిరంగా పరుగులు సాధిస్తున్నాడు. కాగా ఐపీఎల్ 13వ సీజన్లో మంచి ప్రదర్శన ఇస్తున్న సూర్యకుమార్ రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాన్ ఆప్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ తన ఐపీఎల్ జర్నీపై పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ' ఐపీఎల్లో నేను ఆడిన ప్రతీ స్థానాన్ని ఇష్టపడుతా. ముంబై ఇండియన్స్‌కి ఆడిన కొత్తలో ఎక్కువగా లోయర్ ఆర్డర్లో ఆడేవాడిని. కానీ ఈరోజు నా ప్రదర్శనతో టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు రావడం.. రాణించడం సంతోషంగా ఉంది. ముంబై నుంచి కేకేఆర్‌కు మారిన తర్వాత కూడా లోయర్ ఆర్డర్‌లోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. లోయర్ ఆర్డర్లో వచ్చే ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మొదట బ్యాటింగ్ చేస్తే స్కోరు వేగం పెంచే ప్రయత్నం చేయాలి.. చేజింగ్‌లో అయితే మెరుపులు మెరిపించాలి. ఇలాంటి ఇన్నింగ్స్‌లు నాకు చాలానే ఉపయోగపడ్డాయి. వేలంలో ముంబైకి వచ్చిన తర్వాత నాకు బాధ్యత మరింత పెరిగింది. ముంబైకి ఆడిన చాలా సందర్భాల్లో యాంకరింగ్ పాత్ర పోషించాల్సి వచ్చింది. కానీ గత రెండు మూడేళ్లలో నాలో చాలా మార్పులు వచ్చాయి. అందుకు కారణం ముంబై కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ. 2018లో నేను మళ్లీ ముంబై జట్టులోకి వచ్చిన తర్వాత రోహిత్ నన్ను నమ్మి టాప్ఆర్డర్లో బ్యాటింగ్ అవకాశం ఇచ్చాడు. ఆ సమయంలో అతను ఒకటే చెప్పాడు. నీ ఆట నువ్వు ఆడు.. ఫలితం అదే వస్తుంది. అప్పటినుంచి నేను రోహిత్ శర్మను గుడ్డిగా నమ్ముతూ వస్తున్నా.. అందుకే నా ఆటతీరు లో గణనీయంగా మార్పు చోటుచేసుకుంది. రిషబ్ పంత్ నుంచి నా వరకు చూసుకున్నా మా జనరేషన్లో దూకుడైన ఆటతీరుకు రోహిత్‌ను ఆదర్శంగా తీసుకుంటాం. అందుకే మ్యాచ్‌కు ముందు, తర్వాత రోహిత్ ను కలిసి ఎన్నో సలహాలు తీసుకుంటా. అతను చెప్పే విషయాలను శ్రద్దగా వింటూ దానిని మ్యాచ్‌లో ఆచరించడానికి ప్రయత్నిస్తా. అంతేగాక ప్రాక్టీస్ సమయం, జిమ్ టైమ్ ప్లేస్ ఏదైనా సరే తన ప్రతి అనుభవాన్ని మాతో పంచుకుంటాడు. క్లిష్ట సమయాల్లో అతను ఎదుర్కొన్న తీరును స్పష్టంగా వివరించేవాడు. అందుకే రోహిత్‌ను నేను గుడ్డిగా నమ్ముతా. అంటూ చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్లో ఇప్పటివరకు 91 మ్యాచ్‌లాడి 1724 పరుగులు చేశాడు. కాగా ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్‌లో అక్టోబర్ 11న ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. (చదవండి : 'ఈ సమయంలో గేల్ చాలా అవసరం') -
ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు
షార్జా: సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టు ఆల్‌రౌండ్ షో కనబర్చిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. పిచ్ నెమ్మదిగా ఉండడంతో అంత స్కోర్ చేయడం సులువుకాదని, ముగ్గురు 'హార్డ్ హిట్టర్స్' తమ జట్టులో ఉండడం అనుకూల అంశమన్నారు. లక్ష్య ఛేదనలో ఆ జట్టును కట్టడి చేయడంలో బౌలర్లు సఫలమయ్యారని మ్యాచ్ ముగిసిన తర్వాత అన్నారు. ముంబై ఇండియన్స్ మరోసారి ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గెలిచి పాయింట్స్ పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు క్వింటన్ డీకాక్ అర్ధ సెంచరీతో మంచి ఆరంభానిచ్చాడు. చివర్లో వచ్చిన పోలార్డ్ 25(13), హర్దిక్ పాండ్యా 28(19), కృణల్ పాండ్యా 20(5) చెలరేగిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 208 పరుగులు సాధించారు. (చదవండి: ముంబై విజయనాదం) లక్ష్యఛేదనలో విఫలం: వార్నర్ 209 భారీ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌కు మంచి ఆరంభమే లభించింది. వార్నర్ ఉన్నంతసేపు ఆ జట్టుకు విజయావకాశాలు కనిపించినా అతడు అవుటయ్యాక ఛేదనలో మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. లక్ష్య ఛేదనలో మంచి పార్టన్‌షిప్ లభించలేదని... ముంబైయ ఇండియన్స్ బౌలర్లు సమష్టిగా రాణించారని వార్నర్ అన్నారు. ఈ మ్యాచ్‌లో తమ బౌలర్ల ప్రదర్శన పేలవంగా ఉందని చివర్లో ఎక్కువగా ఫుల్‌టాస్ బంతులు వేశారని వార్నర్ అన్నాడు. భువనేశ్వర్ గాయంతో ఈ మ్యాచ్‌లో ఆడకపోవడంతో అతడు లేని లోటు మ్యాచ్‌లో కనిపించింది. (చదవండి: చెన్నై చిందేసింది) -
ముంబైతో మ్యాచ్‌కు భువీ దూరం
షార్జా : ఐపీఎల్ 13వ సీజన్లో నేడు ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య షార్జా వేదికగా మధ్యాహ్నం 3.30 గంటలకు ఆసక్తికర మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు విజయాలు సాధించిన సన్‌రైజర్స్.. ఈ మ్యాచ్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. మరోవైపు ఓ మ్యాచ్‌లో ఓడి.. మరో మ్యాచ్‌లో గెలుస్తూ.. రెండు విజయాలు సాధించిన ముంబై ఇండియన్స్ ఎస్ఆర్హెచ్పై గెలవాలనే కసితో బరిలో దిగనుంది. ఇప్పటి వరకూ ఇరు జట్లు దుబాయ్, అబుదాబిల్లో మాత్రమే మ్యాచ్‌లు ఆడాయి. కాగా తొలిసారి షార్జాలో ఆడబోతున్నాయి. కాగా టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ఏంచుకుంది. ఇరు జట్ల బలబలాలు రోహిత్ శర్మ, పొలార్డ్, డికాక్, పాండ్య, ఇషాన్ కిషన్ లాంటి హిట్టర్లతో ముంబై బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా ఉంది. చిన్న స్టేడియంలో ముంబై ఇండియన్స్ సిక్సర్ల మోత మోగించే అవకాశం ఉంది. ముంబై బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్య కుమార్ యాదవ్‌లకు సన్‌రైజర్స్‌పై పెద్దగా చెప్పుకునే రికార్డేం లేదు. గతంలో జరిగిన మ్యాచ్‌ల్లో పొలార్డ్, పాండ్యాలను రషీద్ ఖాన్ నిలువరించగా.. కాగా పొలార్డ్‌కు 22 బంతులేసిన భువీ అతన్ని 3 సార్లు ఔట్ చేశాడు. బౌలింగ్‌లో బుమ్రా, బౌల్ట్, రాహుల్ చాహర్‌లతో ముంబై పటిష్టంగానే ఉంది. ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే వార్నర్ టచ్‌లోనే కనిపిస్తున్నా భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోతున్నాడు. బెయిర్ స్టో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు. మనీష్ పాండే, కేన్ విలియమ్సన్‌లు తమ ఫామ్‌ను కొనసాగిస్తే ముంబైకి కష్టాలు తప్పకపోవచ్చు. చెన్నైతో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ప్రియమ్ గార్గ్, అభిషేక్ శర్మలు మరోసారి రాణిస్తే ఎస్ఆర్హెచ్ జట్టుకు తిరుగుండదు. మరోవైపు చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ప్రధాన బౌలర్ భువీ గాయపడిన సంగతి తెలిసిందే. భువనేశ్వర్ గాయంతో మ్యాచ్‌కు దూరమవడంతో అతని స్థానంలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్ స్థానంలో సిద్దార్థ్ కౌల్ జట్టులోకి వచ్చారు. ఇప్పటివరకు ఐపీఎల్లో ముంబై, సన్‌రైజర్స్‌లు 14 మ్యాచ్‌ల్లో తలపడగా.. చెరో ఏడుసార్లు చొప్పున గెలుపొందాయి. కాగా ఈ మ్యాచ్ ద్వారా పలువురు ఆటగాళ్లు పలు మైలురాళ్లను చేరుకోనున్నారు. ట్రెంట్ బౌల్ట్‌కిది 100వ టీ20 మ్యాచ్ కాగా ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్‌కు ఇది 50వ మ్యాచ్. మనీష్ పాండే ఐపీఎల్లో 3వేల పరుగుల మైలురాయిని చేరడానికి ఇంకా 40 పరుగులు దూరంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా, జేమ్స్ పాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా సన్‌రైజర్స్ జట్టు : డేవిడ్ వార్నర్(కెప్టెన్), జానీ బెయిర్ స్టో, మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, అబ్దుల్ సామద్, అభిషేక్ శర్మ, ప్రియాం గార్గ్, రషీద్ ఖాన్, సందీప్ శర్మ, సిద్ధార్థ్ కౌల్, టి. నటరాజన్ -
'సెంచరీగా మలిచి ఉంటే బాగుండేది'
అబుదాబి : ఐపీఎల్ 13వ సీజన్లో కోల్‌కతాపై విజయం తమ జట్టులో జోష్ నింపిందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం జట్టు సమిష్టి ప్రదర్శనపై రోహిత్ స్పందించాడు.' చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ఓటమి తర్వాత మా గేమ్‌ప్లాన్‌ను మార్చాలనుకున్నాం. అందుకు తగ్గట్టే కోల్‌కతాతో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసే అవకాశం రావడంతో దూకుడుగా ఆడాలనే నిశ్చయించుకున్నాం. దానికి తగ్గట్టే మా ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాం. గేమ్‌ప్లాన్ సరిగ్గా రావడంతో మ్యాచ్ గెలిచాం. దీనికి తోడు జట్టు సమిష్టి ప్రదర్శన కలిసొచ్చింది. ఇక నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. 54 బంతులెదుర్కొని 80 పరుగులు చేయడం సంతోషమే.. దానిని సెంచరీగా మలిస్తే బాగుండేది. సీఎస్కేతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో జరిగిన పొరపాటును రిపీట్ కాకుండా చూసుకోవాలనుకున్నా. అందుకు తగ్గట్టే ఆడుతూ.. పిచ్ నా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత బ్యాట్ ఝుళిపించా. (చదవండి : కమిన్స్ విఫలం వెనుక కారణం ఇదే) అంతేగాక మధ్య ఓవర్లలో ఎంతసేపు నిలబడితే చివర్లో అంత వేగంగా పరుగులు సాధిస్తామనే 50 పరుగులు తర్వాత కాస్త నెమ్మదించాను. కానీ అనూహ్యంగా 80 పరుగుల వద్ద ఔట్ కావాల్సి వచ్చింది. అప్పటికే అలసిపోయాను అనే ఫీలింగ్ కలిగింది.. దాంతో సెంచరీ చేస్తే బాగుండు అనే ఫీలింగ్ కలగలేదు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మా జట్టు ముందు మ్యాచ్‌తో పోలిస్తే చాలా మెరుగుపడింది. జట్టుతో ఆలస్యంగా కలిసినా బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. అయితే యూఏఈలో ఐపీఎల్ జరుగుతుందని ముందు మేం ఊహించలేదు. కానీ మా పేస్ పవర్ ముంబై వాంఖడేలో సరిగ్గా సరిపోయేది. కానీ ఇక్కడ స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువగా అనుకూలిస్తున్నా.. మా బౌలర్లు మంచి ప్రదర్శనే కనబరిచారు. రానున్న రోజుల్లో దీనిని ఇలాగే కొనసాగిస్తామ’ని చెప్పకొచ్చాడు. కాగా రోహిత్ శర్మ ఐపీఎల్లో మరో 10 పరుగులు చేస్తే 5 వేల పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డులెక్కనున్నాడు. ఇప్పటివరకు రోహిత్ ఐపీఎల్లో 190 మ్యాచ్‌ల్లో 4990 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 37 అర్థ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ కంటే ముందు కోహ్లి, రైనాలు ఐపీఎల్లో 5 వేల పరుగులు సాధించారు. రోహిత్ శర్మ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో భాగంగా ఐపీఎల్లో 200 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విండీస్ స్టార్ క్రిస్ గేల్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) పేరిట ఉంది. గేల్ 326 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉండగా, ఏబీ డివిలియర్స్ 214, ఎంఎస్ ధోనీ 212 సిక్సర్లతో తరువాతి స్థానాల్లో ఉన్నారు. సురేష్ రైనా 194 సిక్సర్లతో టాప్ 5లో ఉన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ తన తర్వాతి మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో సెప్టెంబర్ 28న తలపడనుంది. (చదవండి : కోట్లు పెట్టి కొన్నాం.. ఇలా అయితే ఎలా!) -
రోహిత్ మెరుపులు.. ముంబై భారీ స్కోరు
అబుదాబి: ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపులతో కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. మొదట టాస్ గెలిచి ఫీల్డింగ్ ఏంచుకున్న కోల్‌కతాకు రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్‌తో చుక్కలు చూపించాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ 54 బంతుల్లో 80 పరుగులు చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్‌లో 3ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. (చదవండి : సిక్స్‌లతో రెచ్చిపోయిన రోహిత్.. ముంబై స్కోరెంతంటే) క్వింటన్ డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్ మొదటి ఓవర్లోనే సిక్స్ బాదాడు. అయితే తర్వాతి ఓవర్లో శివమ్ మావి బౌలింగ్‌లో డికాక్ బారీ షాట్‌కు యత్నించిన డికాక్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో ముంబై 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వరుస ఫోర్లతో ఆకట్టుకున్నాడు. దీనికి తోడు హిట్‌మాన్ కూడా సిక్సర్లతో రెచ్చిపోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. రోహిత్‌కు జత కలిసిన సూర్యకుమార్ యాదవ్ కూడా బౌండరీలతో విరుచుకుపడడంతో స్కోరుబోర్డు 10కి పైగా రన్‌రేట్‌తో ఉరకలెత్తింది. ఈ నేపథ్యంలో జట్టు స్కోరు 10.2 ఓవర్లలో 98 పరుగులకు చేరగానే సూర్యకుమార్ యాదవ్ 47 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన సౌరబ్ తివారి 13 బంతుల్లో 21 పరుగులు చేసి ఇన్నింగ్స్‌లో తన వంతు పాత్ర పోషించాడు. సెంచరీ దిశగా పయనిస్తున్న రోహిత్ బారీ షాట్‌కు ప్రయత్నించి శివమ్ మావి బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్ ఇచ్చివెనుదిరిగాడు. వెంటనే 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. రోహిత్ ఇన్నింగ్స్‌తో ముంబై స్కోరు 200 దాటుతుందని భావించగా చివర్లో కేకేఆర్ బౌలర్లు కట్టడి చేయడంతో 195 పరుగులు చేయగలిగింది. ఇక కేకేఆర్ బౌలర్లలో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన నమోదు చేయలేదు. కాగా గతేడాది జరిగిన వేలంలో రూ. 15 కోట్లు పెట్టి కొన్న పాట్ కమిన్స్ 3 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి నిరాశపరిచాడు. కేకేఆర్ బౌలర్లలో శివమ్ మావి రెండు, సునీల్ నరైన్, ఆండ్రీ రసెల్ చెరో వికెట్ తీశారు. (చదవండి : 'ధోని విషయంలో ప్రతీసారి ఈ ప్రశ్న వస్తుంది') -
సిక్స్‌లతో రెచ్చిపోయిన రోహిత్.. స్కోరెంతంటే
అబుదాబి: ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. క్వింటన్ డికాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రోహిత్ మొదటి ఓవర్లోనే సిక్స్ బాదాడు. అయితే తర్వాతి ఓవర్లో శివమ్ మావి బౌలింగ్‌లో డికాక్ బారీ షాట్‌కు యత్నించిన డికాక్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. దీంతో ముంబై 8 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ వరుస ఫోర్లతో ఆకట్టుకున్నాడు. దీనికి తోడు హిట్‌మాన్ కూడా సిక్సర్లతో రెచ్చిపోవడంతో పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరు 6 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. రోహిత్‌కు జత కలిసిన సూర్యకుమార్ యాదవ్ కూడా బౌండరీలతో విరుచుకుపడడంతో స్కోరుబోర్డు 10కి పైగా రన్‌రేట్‌తో ఉరకలెత్తింది. ఈ నేపథ్యంలో జట్టు స్కోరు 10.2 ఓవర్లలో 98 పరుగులకు చేరగానే సూర్యకుమార్ యాదవ్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ముంబై, కోల్‌కతాల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరిగాయి. అయితే విజయాల్లో ముంబైదే పైచేయిగా కనిపిస్తుంది. వీరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఏకంగా 19 మ్యాచ్‌ల్లో ముంబయి గెలుపొందగా.. 6 మ్యాచ్‌ల్లో మాత్రమే కోల్‌కతా విజయం సాధించింది. అయితే.. 2014లో యూఏఈ వేదికగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు జరగగా.. అబుదాబి వేదికగా ఈ రెండు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా ఏకంగా 41 పరుగుల తేడాతో ముంబయిపై గెలుపొందడం గమనార్హం. కాగా గత ఐదు మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే 4-1 తేడాతో ముంబై కోల్‌కతాపై పైచేయిలో ఉంది. ముంబై ఇండియన్స్ 4సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గగా.. కోల్‌కతా రెండుసార్లు ఆ ఫీట్‌ను సాధించింది. (చదవండి : 'ధోని విషయంలో ప్రతీసారి ఈ ప్రశ్న వస్తుంది') -
ముంబై వర్సెస్ కోల్‌కతా.. పైచేయి ఎవరిదో!
అబుదాబి: ఐపీఎల్ 2020 సీజన్‌ని ఓటమితో ఆరంభించిన ముంబై ఇండియన్స్ బుధవారం మరో బిగ్‌ఫైట్‌కు రెడీ అయింది. హిట్టర్లతో బలంగా కనిపిస్తున్న కోల్‌కతా నైటరైడర్స్‌తో అబుదాబి వేదికగా తలపడనుంది. ముంబై, కోల్‌కతాల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరిగాయి. అయితే విజయాల్లో ముంబైదే పైచేయిగా కనిపిస్తుంది. వీరి మధ్య జరిగిన మ్యాచ్‌ల్లో ఏకంగా 19 మ్యాచ్‌ల్లో ముంబయి గెలుపొందగా.. 6 మ్యాచ్‌ల్లో మాత్రమే కోల్‌కతా విజయం సాధించింది. అయితే.. 2014లో యూఏఈ వేదికగా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లు జరగగా.. అబుదాబి వేదికగా ఈ రెండు జట్లు ఒకసారి తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోల్‌కతా ఏకంగా 41 పరుగుల తేడాతో ముంబయిపై గెలుపొందడం గమనార్హం. కాగా గత ఐదు మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే 4-1 తేడాతో ముంబై కోల్‌కతాపై పైచేయిలో ఉంది. ముంబై ఇండియన్స్ 4సార్లు ఐపీఎల్ టైటిల్ నెగ్గగా.. కోల్‌కతా రెండుసార్లు ఆ ఫీట్‌ను సాధించింది. (చదవండి : 'సామ్సన్ తోపు .. కాదంటే చర్చకు రెడీ') బలాబలాలు దినేష్ కార్తిక్ సారధ్యంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ బలంగానే కనిపిస్తుంది. ఇటీవల ముగిసిన కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో సత్తాచాటిన వెస్టిండీస్ హిట్టర్లు ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్‌తో పాటు ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాట్స్మెన్లు ఇయాన్ మోర్గాన్, టామ్ బాంటన్‌లు కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున బరిలోకి దిగబోతున్నారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరు రాణించినా ఇక ముంబైకి కష్టాలు తప్పవు. వీరితో పాటు కెప్టెన్ దినేశ్ కార్తీక్, నితీశ్ రాణా, శుభమన్ గిల్ కూడా హిట్టింగ్‌లో రాటుదేలినవారే.. దీంతో కోల్‌కతా బ్యాటింగ్ విభాగం దుర్బేధ్యంగా ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో గతేడాది వేలంలో అత్యధిక ధర పలికిన పాట్ కమిన్స్ జట్టు బౌలింగ్‌లో కీలకపాత్ర పోషించనున్నాడు. యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా కీలకం కానున్నాడు. ఇక ముంబై విషయానికి వస్తే.. చెన్నైతో జరిగిన మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఆశించిన రీతిలో రాణించలేకపోయింది. మొదట బ్యాటింగ్ చేసి 162 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ విఫలమై 5 వికెట్ల తేడాతో మ్యాచ్‌ను చెన్నైకి అప్పగించింది. అయితే జట్టుగా చూసుకుంటే ముంబై ఎప్పటికీ ప్రమాదకారే.. మొదట ఓటమిలతో లీగ్‌ను ప్రారంభించినా ఆ తర్వాత ఫుంజుకునే సత్తా ముంబైకి ఉంది. హిట్‌మాన్ రోహిత్, డికాక్, సౌరబ్ తివారి, పొలార్డ్, హార్దిక్ పాండ్యాలతో బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది. గత మ్యాచ్‌లో సౌరభ్ తివారి మంచి ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నాడు. కాగా బౌలింగ్ విభాగంలో బుమ్రా, బౌల్ట్‌లతో బలంగా కనిపిస్తున్నా.. లసిత్ మలింగ లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. మరీ కోల్‌కతాతో మ్యాచ్‌లో ముంబై ఏ విధంగా ఆడుతుందన్నది కొద్ది సేపట్లో తేలనుంది. ముంబై తుది జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), డీకాక్, సూర్యకుమార్ యాదవ్, సౌరబ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్, పాటిన్సన్, రాహుల్ చహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా కోల్‌కతా తుది జట్టు : దినేష్ కార్తిక్(కెప్టెన్), శుభమన్ గిల్, నితీష్ రాణా, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, ఇయాన్ మోర్గాన్, పాట్ కమిన్స్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి, నిఖిల్ నాయక్, సందీప్ వారియర్ -
'రోహిత్ ఇది నాది.. వెళ్లి సొంత బ్యాట్ తెచ్చుకో'
దుబాయ్ : రోహిత్ శర్మ అంటేనే హిట్టింగ్‌కు మారుపేరు.. అందుకే అతన్ని ముద్దుగా హిట్‌మ్యాన్ అని పిలుచుకుంటారు. అంతర్జాతీయ క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన రోహిత్ శర్మకు సొంత బ్యాట్ కూడా లేదంట. అదేంటి.. రోహిత్ శర్మ ఐపీఎల్ 13వ సీజన్ కోసం దుబాయ్‌లో ఉన్నాడు కదా.. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ వద్ద సొంత బ్యాట్ లేకపోవడమేంటని ఆశ్చర్యపోతున్నారా.. అసలు విషయం ఏంటంటే.. ఐపీఎల్ 2020కి సంబంధించి డ్రీమ్ 11 సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ స్పాన్సర్‌గా వివో తప్పుకున్న నేపథ్యంలో ఏడాది కాలానికి గానూ రూ.250 కోట్లతో డ్రీమ్ లెవెన్ కంపెనీ ఒప్పందం చేసుకుంది.(చదవండి : స్టోక్స్ ఆడతాడో... లేదో...!) ఈ సందర్భంగా ఐపీఎల్ 13వ సీజన్‌కు సంబంధించి ఆటగాళ్లతో ప్రమోషనల్ వీడియోలు చేస్తున్న డ్రీమ్ 11 సంస్థ తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రమోషనల్ వీడియో ఒకటి విడుదల చేసింది. ఆ వీడియోలో రోహిత్ గల్లీ క్రికెట్ ఆడుతుంటాడు. చేతిలో బ్యాట్ పట్టుకొని హిట్టింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్న రోహిత్‌ను ఒక వ్యక్తి వచ్చి ఏం చేస్తున్నావ్ అని అడుగుతాడు.. దానికి ఓపెనింగ్ చేస్తున్నా అంటూ హిట్‌మ్యాన్ సమాధానమిస్తాడు. ఎంతైనా తాను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌ను కదా అంటూ నవ్వుతూ పేర్కొంటాడు. దీనికి అవతలి వ్యక్తి నీ చేతిలో ఉన్న బ్యాట్ ఎవరిది అని అడుగుతాడు.. దానికి రోహిత్ తటపటాయిస్తూ.. బ్యాట్ నీదేనా అని అడుగుతాడు. దీంతో ఆ వ్యక్తి రోహిత్ చేతిలో ఉన్న బ్యాట్ లాక్కుంటూ.. అవును బ్యాట్ నాదే.. వెళ్లి నీ సొంత బ్యాట్ తెచ్చుకో.. అప్పటివరకు ఫీల్డింగ్ చేయ్ అంటూ పక్కకు నెట్టేస్తాడు. దాంతో రోహిత్ బిత్తరచూపులు చూస్తుండగా వీడియో ముగుస్తుంది. (చదవండి : షార్జా స్టేడియాన్ని చుట్టేసిన దాదా) దీనిపై ముంబై ఇండియన్స్ సహచరుడు , బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వీడియో ట్విటిర్‌లో షేర్ చేస్తూ కామెంట్ చేశాడు. రోహిత్ బాయ్.. అది మన క్రికెట్ కాదు.. గల్లీ క్రికెట్. నీ సొంత బ్యాట్ తెచ్చుకొని బరిలోకి దిగు.. అంటూ కామెంట్ జత చేశాడు. బుమ్రా షేర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. కాగా సెప్టెంబర్ 19న మొదలుకానున్న ఐపీఎల్ 13వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో తలపడనుంది. -
రోహిత్ శర్మ స్టన్నింగ్ క్యాచ్ చూస్తారా..
దుబాయ్ : ఐపీఎల్ 2020 సీజన్ మొదలుకావడానికి ఇంకా వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండడంతో అన్ని జట్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేశాయి. లీగ్‌లో మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 19న చెన్నై సూపర్ కింగ్స్, డిపెడింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా ముంబై ఆటగాళ్ల ప్రాక్టీస్ వీడియోలను ఆ జట్టు యాజమాన్యం ట్విటర్లో షేర్ చేస్తూ వచ్చింది. (చదవండి : ఐపీఎల్లో తొలి అమెరికన్ క్రికెటర్!) మొన్నటికి మొన్న బ్యాటింగ్ ప్రాక్టీస్ సందర్భంగా సిక్సులతో రెచ్చిపోయిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్.. తాజాగా తనలోని ఫీల్డింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ప్రాక్టీస్ సందర్భంగా మొదటి రెండు బంతులను సాదాసీదాగా అందుకున్న రోహిత్ మూడో బంతిని మాత్రం ఎడమ పక్కకు ఒరిగి ఒంటి చేత్తో డైవ్‌చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కెప్టెన్సీ, బ్యాటింగ్‌తో పాటు తనలో మంచి ఫీల్డర్ ఉన్నాడంటూ రోహిత్ కామెంట్ చేశాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తమ ట్విటర్లో షేర్ చేసుకుంది. కాగా డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న ముంబై ఇండియన్స్‌పై మరోసారి అంచనాలు బాగానే ఉన్నాయి. లీగ్‌లో ఉన్న ఫేవరెట్ జట్లలో ఒకటిగా ఉన్న ముంబైకి వ్యక్తిగత కారణాలతో స్టార్ బౌలర్ లసిత్ మలింగ దూరం కావడం కొంచెం ఇబ్బందిగా మారొచ్చు. రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌కు క్రిస్‌లిన్, క్వింటాన్ డీకాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్, సూర్యకుమార్ యాదవ్‌లతో బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్‌లు జట్టులో ఉండటం అదనపు బలం. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ మెక్లీన్‌గన్‌తో పాటు ట్రెంట్ బౌల్ట్, కౌల్టర్ నైల్ రూపంలో నాణ్యమైన పేసర్లు ఉన్నారు.(చదవండి : 'మోసం చేయడం కళ.. అందరికి అబ్బదు') 👀 Just another one-handed Rohit Sharma stunner in the slip cordon! 😉#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @ImRo45 pic.twitter.com/h6rykVHe1Q — Mumbai Indians (@mipaltan) September 11, 2020 -
వామ్మో రోహిత్.. ఇంత కసి ఉందా!
దుబాయ్ : ఐపీఎల్ అంటేనే ఫోర్లు, సిక్సర్లతో పాటు బారీ హిట్టింగ్‌లు కనిపిస్తాయి. ఐపీఎల్లో ఎవరి సిక్స్ ఎంత దూరం వెళుతుందన్నది రికార్డుల్లో లెక్కేస్తారు. టీమిండియా ఆటగాడు.. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అంటేనే భీకరమైన హిట్టింగ్‌కు పెట్టింది పేరు. బ్యాటింగ్ ఆడేటప్పుడు రోహిత్ శర్మ ఎంత కసిగా ఉంటాడనేది ఇప్పటికే చాలాసార్లు చూశాం. అతను బంతిని బలంగా బాదాడంటే.. స్టేడియం అవతల పడాల్సిందే. తాజాగా దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఆరంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్‌కు సన్నద్దమయ్యేందుకు ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నారు. కాగా ఈ సీజన్లో చెన్నైతో జరిగే మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తలపడనున్న సంగతి తెలిసిందే. (చదవండి : 6 నెలల తర్వాత తొలిసారి విమానం ఎక్కా) ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అబుదాబి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి ఆ జట్టు యాజమాన్యం షేర్ చేసింది. ఆ వీడియోలో బ్యాటింగ్ ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్న రోహిత్ స్పిన్నర్ వేసిన బంతిని బారీ సిక్స్‌గా మలిచాడు. 95 మీటర్ల ఎత్తులో వెళ్లిన ఆ బంతి స్టేడియం బయటకు వెళ్లి రోడ్డు మీద వెళ్తున్న బస్సు రూఫ్‌టాప్‌పై పడింది. ఇంకేముంది.. బౌలింగ్ వేసిన స్పిన్నర్ బిత్తరచూపులు చూడగా.. రోహిత్ విజయసంకేతం చూపించాడు. దాదాపు నాలుగు నెలల తర్వాత బ్యాటింగ్ ప్రాక్టీస్ చేపట్టిన రోహిత్ బారీ షాట్లతో రీచార్జ్ అయినట్లే కనిపిస్తుంది. రానున్న మ్యాచ్‌లో తన విధ్వంసం ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పాడు. ఈ వీడియోను ముంబై ఇండియన్స్ తన ట్విటర్లో షేర్ చేస్తూ వినూత్న కాప్షన్‌ను రాసుకొచ్చింది. 'బ్యాట్స్మెన్లు సిక్స్‌లు కొడతారు.. లెజెండ్స్ స్టేడియాలను క్లియర్ చేస్తారు.. కానీ హిట్‌మ్యాన్ మాత్రం మూడు పనులు( బారీ సిక్స్+ స్టేడియం అవతల + వాహనాలపై పడడం) కలిపి చేస్తాడు. అది ఒక్క రోహిత్‌కే సాధ్యం' అంటూ కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడిమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వీడియో చివర్లో నీ సిక్స్‌తో బస్సు అద్దాలను గాని పగలగొట్టావా అంటూ రోహిత్‌ను ఎవరో అడిగినట్లు వినిపిస్తుంది. కాగా అంతకుముందు ప్రాక్టీస్ సందర్భంగా ముంబై ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రాక్టీస్ సమయంలో ఆరు బంతులను ఆరుగురు బౌలర్లను ఇమిటేట్ చేస్తూ విసిరిన వీడియో కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. (చదవండి : 'ఐపీఎల్లో ఆడనందుకు నాకు బాధ లేదు') 🙂 Batsmen smash sixes 😁 Legends clear the stadium 😎 Hitman smashes a six + clears the stadium + hits a moving 🚌#OneFamily #MumbaiIndians #MI #Dream11IPL @ImRo45 pic.twitter.com/L3Ow1TaDnE — Mumbai Indians (@mipaltan) September 9, 2020 -
కోహ్లి, రోహిత్‌ల ఆధిపత్యం
దుబాయ్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం ప్రదర్శించారు. బుధవారం తాజాగా విడుదల చేసిన ర్యాంకుల్లో వీరిద్దరూ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. కోహ్లి 871 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, రోహిత్ 855 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచాడు. వీరి తర్వాత బాబర్ ఆజమ్ (పాకిస్తాన్), రాస్ టేలర్ (న్యూజిలాండ్), డుప్లెసిస్ (దక్షిణాఫ్రికా) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు. టెస్టు బ్యాట్స్‌మెన్ ర్యాంకుల్లో స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) 911 పాయింట్లతో తొలి స్థానాన్ని కైవసం చేసుకోగా... విరాట్ కోహ్లి (886 పాయింట్లు), మార్నస్ లబ్‌షేన్ (827 పాయింట్లు) తర్వాతి రెండు స్థానాలను సాధించారు. పాకిస్తాన్‌తో మూడో టెస్టులో 267 పరుగులు సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ జాక్ క్రాలీ 53 స్థానాలు మెరుగుపరుచుకొని కెరీర్లో అత్యుత్తమంగా 28వ ర్యాంకుకు చేరుకున్నాడు. టి20 కేటగిరీలో భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ రెండో ర్యాంకులో ఉన్నాడు. పాకిస్తాన్ బ్యాట్స్‌మన్ బాబర్ ఆజమ్ టాప్ ర్యాంకును, ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా, 904 పాయింట్లు), వన్డేల్లో ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్, 722 పాయింట్లు), టి20ల్లో రషీద్ ఖాన్ (736 పాయింట్లు) మొదటి స్థానంలో ఉన్నారు. 719 పాయింట్లతో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వన్డేల్లో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల పాకిస్తాన్‌తో సిరీస్‌లో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ టెస్టు బౌలర్ల ర్యాంకుల్లో టాప్–10లో చోటు దక్కించుకున్నాడు. అతను ఆరు స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంకుకు చేరుకున్నాడు. టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ వన్డేల్లో రెండో ర్యాంకులో... టెస్టులు, టి20ల్లో మూడో స్థానంలో నిలిచింది. -
'మీకేమైనా పిచ్చా.. ఎందుకలా కొట్టుకుంటారు'
ఢిల్లీ : భారత క్రికెట్ అభిమానుల మధ్య గొడవలు జరగడం అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా కొల్హాపూర్‌లో ధోని, రోహిత్ శర్మ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవ పెద్దగా మారి ఒక వ్యక్తిని చెరుకుతోటకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఈ గొడవలో గాయపడిన వ్యక్తి ధోని అభిమానా లేక రోహిత్ అభిమానా అనేది తెలియదు. తాజాగా దీనిపై భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. Kya karte rehte ho paagalon. Aapas mein players are either fond of each other or just don't talk much, kaam se kaam rakhte hain. But kuchh fans alag hi level ke pagle hain. Jhagda Jhagdi mat karo, Team India ko- as one yaad karo. pic.twitter.com/i2ZpcDVogE — Virender Sehwag (@virendersehwag) August 23, 2020 'మీకు ఏమైనా పిచ్చా.. మేమంతా జట్టుగా కలిసి ఉండి దేశం కోసం ఆడతాం.. ఒకరికి ఒకరం పెద్దగా మాట్లాడకపోయినా.. ఎవరిపని వారు చేసుకుంటూనే గెలుపుకోసం ఎదురుచూస్తుంటాం. కొందరు అభిమానులు మాత్రం ఇలా హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ఆటగాళ్లను వేరుగా చూడొద్దు.. టీమిండియాను మాత్రమే చూడండి..ఇక మీదట అభిమానుల మధ్య ఇలాంటి గొడవలు జరగొద్దు ' అంటూ వీరు సీరియస్‌గా చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సెహ్వాగ్ చెప్పింది నిజం.. ఎందుకలా కొట్టుకుంటారు.. వారు దేశం కోసం ఆడుతుంటే మధ్యలో మీ లొల్లేందిరా అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి : కోహ్లికి కితాబిచ్చిన సునీల్ గావస్కర్ అభిమానుల మనసు గెలుచుకున్న ధోని -
'కెప్టెన్‌గా జట్టులో నాకే ప్రాధాన్యం తక్కువ'
ముంబై : ఏ ఆటైనా సరే జట్టుకు కెప్టెన్ ఎంతో అవసరం. జట్టులోని ఆటగాళ్లను ఒకతాటిపై నడిపిస్తూ.. తన నిర్ణయాలతో జట్టును ముందుకు నడిపించాలి. జట్టుకు అవసరమైన సమయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం, బౌలర్లకు సలహాలివ్వడం చేస్తుంటారు. ఒక్కోసారి కొందరు ఆటగాళ్లు కెప్టెన్‌గా తాము ఏం చేసినా చెల్లుతుందని ఆదిపత్యం ప్రదర్శించాలని చూస్తుంటారు. కానీ తన పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు నాలుగు టైటిళ్లు సాధించిపెట్టిన రోహిత్ ఇలా అనడం కాస్త ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13వ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రోహిత్ శర్మ పీటీఐ ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. (ధోనితో పోలికపై రోహిత్ స్పందన) ‘ఒకవేళ నేను కెప్టెన్ అయితే, జట్టులో అతి తక్కువ ప్రాధాన్యత ఉన్న ఆటగాడిని నేనేనని భావిస్తాను. ఈ భావన ఒక్కో కెప్టెన్‌కు ఒకో తీరుగా ఉంటుంది. నేను ఇప్పటివరకూ ఇలాంటి సిద్ధాంతంతోనే పనిచేశాను. ఐపీఎల్ టోర్నీలో నాకు చాలావరకు ఇది ఫలితాల్నిచ్చింది. జట్టుకోసం ఫలితాన్ని రాబట్టే ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతాను. కెప్టెన్ ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే ఓపిక నశిస్తుంది. ఆటగాళ్లపై నోరు పారేసుకుంటాం. కానీ అది మంచిది కాదు. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఐపీఎల్‌కు ముందు మాకు చాలా సమయం దొరికింది. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేస్తున్నాం. ముంబైలో వర్షాలు, వాతావరణం కారణంగా బయటకు వెళ్లి వర్కౌట్స్ చేసే పరిస్థితి లేదు. అందుకే ఇంట్లోనే జిమ్ చేస్తున్నాను. దుబాయ్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ ఆడటం అంత తేలికేమీ కాదని’ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. (ధోని రికార్డును బ్రేక్ చేసిన మోర్గాన్) -
'అలా అనుకుంటే కోహ్లి స్థానంలో..'
న్యూఢిల్లీ : టీమిండియా కెప్టెన్సీలో మార్పు చేయాలని బీసీసీఐ భావిస్తే ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లికి రోహిత్ శర్మ రెడిమేడ్‌గా ఉన్నాడని మాజీ టెస్టు క్రికెటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. ఒకవేళ రానున్న కాలంలో జరగనున్న ఐసీసీ ఈవెంట్స్‌లో భారత్ టైటిల్ నెగ్గడంలో విఫలమైతే నాయకత్వ మార్పులో కొత్త దిశగా వెళితే మాత్రం రోహిత్‌శర్మను ఆప్షన్‌గా చూడవచ్చని చోప్రా తెలిపాడు. స్పోర్ట్స్ వ్యాఖ్యాత సవేరా పాషాతో జరిగిన యూట్యూబ్ ఇంటరాక్షన్‌లో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ప్రస్తుతానికైతే టీమిండియా ఆటతీరు బాగానే ఉంది. ఒకవేళ రానున్న ఆరు నెలలు లేక ఏడాదిన్నర కాలంలో ఆటతీరులో ఏవైనా లోపాలు కనిపిస్తే కొత్త కెప్టెన్‌ను చూసే అవకాశం ఉంటుంది. ఒక బ్యాట్స్‌మన్‌గా కోహ్లిని తప్పుబట్టలేము. ఒక్కడిగా చూస్తే కోహ్లి ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడిగా ఉంటాడు. ఒక బ్యాట్స్‌మన్‌గా ఎప్పుడో ఉన్నత శిఖరానికి చేరుకున్నాడు. కానీ జట్టుగా చూస్తే మాత్రం కోహ్లి కెప్టెన్‌గా ఇంకా నేర్చుకుంటున్నాడు. ఒకవేళ రానున్న కాలంలో నాయకత్వ మార్పును కోరుకుంటే రోహిత్ శర్మ రెడీమేడ్ కెప్టెన్‌గా రెడీగా ఉన్నాడు. వచ్చే 10 నుంచి 12 నెలల కాలం పాటు కోహ్లీనే కెప్టెన్‌గా ఉంటాడు.. ఒకవేళ రానున్న ఐసీసీ ఈవెంట్స్‌లో భారత్ టైటిల్ నెగ్గకపోతే మాత్రం నాయకత్వ మార్పు ఉంటుంది. రానున్న చాంపియన్స్ ట్రోపీని ఇండియా గెలుస్తుందనే ఆశిస్తున్నా. ఎందుకంటే 2013 తర్వాత టీమిండియా చాంపియయన్స్ ట్రోపీ గెలవలేదు. అంతేగాక 2021లో టీ20 ప్రపంచకప్ భారత్‌లో జరగనుంది. ఒకవేళ ఈ రెండింటిలో ఏ ఒక్కటి గెలవలేకపోయినా జట్టు మేనేజ్మెంట్ నాయకత్వ మార్పు గురించి ఆలోచన చేయాల్సిందే. ' అంటూ ఆకాశ్ చోప్రా తెలిపాడు.('నాకు ఆరు నెలల ముందే కరోనా వచ్చింది') 2014లో ఎంఎస్ ధోనీ నుంచి టెస్టు క్రికెట్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న కోహ్లి జట్టును బాగానే నడిపించాడు. అనతికాలంలోనే టెస్టుల్లో జట్టును నెంబర్‌వన్ స్థానంలో నిలిపాడు. అంతేగాక టెస్టుల్లో వరల్డ్ క్లాస్ పేసర్లతో టెస్టు క్రికెట్లో భారత్‌ను అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాడు. ఇక 2017లో వన్డే కెప్టెన్సీగా బాధ్యతలు తీసుకున్న కోహ్లి సమర్థంగానే నడిపించినా మేజర్ ఐసీసీ ఈవెంట్స్ టైటిళ్లను మాత్రం తేలేకపోయాడు. వాటిలో 2017లో జరిగిన చాంపియన్స్ ట్రోపీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ అక్కడ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో ఓడిపోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో లీగ్‌లో అప్రతిహాత విజయాలతో దూసుకెళ్లిన కోహ్లి సేన సెమీస్‌లో మాత్రం న్యూజిలాండ్ చేతిలో భంగపడింది. అయితే ఇంగ్లండ్ మాజీ ఆటగాడు నాసిర్ హుస్సెన్ మాత్రం కోహ్లి లాంటి ఆటగాడిని కెప్టెన్సీ పదవి నుంచి తీసే అవకాశం ఇప్పట్లో లేదని పేర్కొన్నాడు. అతను ఆటగాడిగానే గాక కెప్టెన్‌గానూ విజయవంతం అయ్యాడని నాసిర్ తెలిపాడు. మరోవైపు కోహ్లి కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తే అతను ఒత్తిడికి లోనవ్వకుండా తన ఆట తాను ఆడుకుంటాడని భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అతు్ల్ వాసన్ తెలిపాడు. అయితే అతుల్ వ్యాఖ్యలను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కొట్టిపారేశాడు.(వార్నర్‌ను ట్రోల్ చేసిన అశ్విన్) -
యువరాజ్‌పై కేసు నమోదు
చండీగఢ్ : టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌పై హర్యానాలోని హిసార్ జిల్లా హన్సి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. యుజువేంద్ర చహల్‌ను కులం పేరుతో కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా దళిత హక్కుల కార్యకర్త, న్యాయవాది రజత్ కల్సాన్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు యూవీపై కేసు నమోదు చేయాలంటూ హన్సీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన యూవీపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలని పోలీసులను ఒత్తిడి చేశారు. వివరాల్లోకి వెళితే.. రోహిత్ శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడుతూ టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను సరదాగా కామెంట్ చేసే క్రమంలో కులం పేరు వాడటంతో అది కాస్తా వివాదానికి దారి తీసింది. టిక్‌టాక్‌లో చాహల్ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్ చేస్తున్నాడని, వీళ్లకేం పని లేదంటూ వాల్మీకి సమాజాన్ని కించపరిచేలా యువీ వ్యాఖ్యలు చేశాడు.(యువీకి సరికొత్త తలనొప్పి) దీనిపై సోషల్ మీడియాలోనూ పెద్ద దుమారమే రేగింది.ఒక కులాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేస్తావా అంటూ యువీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక కులం పేరుతో యువరాజ్ కామెంట్ చేయడం నిజంగా సిగ్గు చేటని సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఏ పరిస్థితుల్లోనైనా మతాన్ని, కులాన్ని, జాతిని, వర్ణాన్ని ఉద్దేశించి మాట్లాడటం అవతలి వాళ్లను కించపరచడమేనంటూ విమర్శలు కురిపించారు. ఈ క్రమంలోనే యువరాజ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ‘యువరాజ్ సింగ్ మాఫీ మాంగో’(యువరాజ్ క్షమాపణలు చెప్పాలి) పేరుతో ట్విటర్లో ట్రెండ్ చేస్తున్నారు.(ధోని.. నా హెలికాప్టర్ షాట్లు చూడు!) -
ఖేల్ రత్న అవార్డుకు హిట్‌మ్యాన్
ముంబై : టీమిండియా వన్డే టీమ్ వైస్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మను ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు 2020కు నామినేట్ చేసినట్టు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసీసీఐ) శనివారం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది. కాగా ఇశాంత్ శర్మ, శిఖర్ ధావన్, మహిళా క్రికెటర్ దీప్తి శర్మలను అర్జున అవార్డుకు నామినేట్ చేశారు. భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ 2016 జనవరి 1 నుండి 2019 డిసెంబర్ 31 వరకు పరిశీలన కాలంతో సంబంధిత అవార్డులకు ఆహ్వానాలను కోరింది. ఈ మేరకు క్రీడా శాఖ ప్రతిపాధించిన సమయంలో రోహిత్ శర్మ ప్రదర్శన గమనిస్తే టీ20 క్రికెట్లో నాలుగు సెంచరీలు, 8 వన్డేల్లో 150కు పైగా పరుగులు సాధించాడు.(అందుకే స్మిత్‌ను గేలి చేశా: ఇషాంత్) 2017 ఆరంభం నుంచి వన్డేల్లో 18 శతకాలు నమోదు చేయగా, మొత్తం 28 శతకాలతో వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. కాగా రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచ కప్‌లో అత్యద్భుత ప్రదర్శన నమోదు చేశాడు. ఒకే వరల్డ్‌కప్‌లలో ఐదు సెంచరీలు నమోదు చేసిన మొదటి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు. అతని అద్భుతమైన ప్రదర్శన కారణంగానే ఐసిసి వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. వన్డేల్లో మూడు ద్విశతాకాలు చేసిన ఏకైక క్రికెటర్‌గానూ రికార్డు హిట్‌మ్యాన్ పేరిటే ఉంది. మరోవైపు అర్జున అవార్డుకు నామినేట్ అయిన శిఖర్ ధావన్ సైతం కొన్నేండ్లుగా నిలకైడన ప్రదర్శన చేస్తున్నాడు. టెస్టుల్లో పేసర్ ఇషాంత్ శర్మ విజృంభిస్తూ.. ఎంతో కాలంగా జట్టుకు సేవలందిస్తున్నాడు. మరోవైపు భారత మహిళల జట్టు ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మూడేండ్లుగా బ్యాట్‌తో, బంతితో రాణిస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నది. వన్డే, టీ20 ప్రపంచకప్ టోర్నీల్లోనూ అద్భుత ప్రదర్శన చేసింది.(స్టోక్స్ కోసం ఏమైనా రూల్స్ మార్చారా?) -
'రోహిత్ ఎదగడానికి ధోనియే కారణం'
ఢిల్లీ : టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మపై మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఈ స్థాయిలో ఉన్నాడంటే అదంతా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని చలవేనని పేర్కొన్నాడు. 2007లో అరంగేట్రం చేసిన మొదటి రోజుల్లో రోహిత్ శర్మ చాలా మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. అప్పుడు జట్టు కెప్టెన్‌గా ధోని చాలాకాలం పాటు మద్దతుగా నిలిచాడని స్టార్‌స్పోర్ట్ష్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో తెలిపాడు. ('ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నా') గంభీర్ మాట్లాడుతూ.. ' రోహిత్ అంతర్జాతీయ కెరీర్‌ను 2007లో ప్రారంభించినా అతని కెరీర్ ఊపందుకున్నది మాత్రం 2013 నుంచే... ఎందుకంటే జట్టులోకి వచ్చిన మొదట్లో రోహిత్ చాలా మ్యాచ్‌ల్లో విఫలమైనా అప్పటి కెప్టెన్ ధోని చాలా మద్దతునిచ్చాడు. రోహిత్‌ను ఓపెనర్‌గా పంపాలని మహీ 2013లో నిర్ణయం తీసుకున్నాడు. అప్పటి నుంచి రోహిత్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఏకంగా వన్డేల్లో మూడు ద్విశతకాలను సాధించి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. సెలెక్షన్ కమిటీ, జట్టు మేనేజ్మెంట్ గురించి మాట్లాడొచ్చు.. కానీ కెప్టెన్ మద్దతు లేకపోతే అవన్నీ నిరుపయోగమే. అంతా కెప్టెన్ చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయంలో మాత్రం రోహిత్ శర్మకు ధోనీ చాలా కాలం మద్దతుగా నిలిచాడు. నాకు తెలిసి అంత సపోర్ట్ మరే ఆడగాడు పొందలేదని నేను అనుకుంటున్నా' అని గంభీర్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత యువ ఆటగాళ్లకు కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మద్దతుగా నిలువాల్సిన అవసరం ఉందని గౌతమ్ గంభీర్ చెప్పాడు. -
'ఆత్మహత్య చేసుకోవాలని మూడుసార్లు అనుకున్నా'
ఢిల్లీ : వ్యక్తిగత, క్రికెట్ కెరీర్ సంబంధిన సమస్యలు, మానసిక వేదన కారణంగా తీవ్ర ఒత్తిడికి గురై మూడుసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ చెప్పాడు. టీమిండియా ఓపెనర్ రోహిత్‌శర్మతో ఇన్స్టాగ్రామ్ లైవ్ ద్వారా మాట్లాడిన షమీ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. 2018 ప్రారంభంలో తన భార్య హసిన్ జహాన్ షమీ, అతడి సోదరుడిపై సెక్షన్ 498ఏ కింద గృహ హింస కేసు పెట్టింది. ఇది జరిగిన కొద్ది రోజులకే రోడ్డు ప్రమాదంలో షమీ గాయపడ్డాడు. ఆ సమయంలో ఎదుర్కొన్న క్లిష్ట పరిస్థితులను, ఒత్తిడిని షమీ ఇప్పుడు వెల్లడించాడు. (అజహర్... తీన్మార్) 'నా భార్బ గృహ హింస కేసు పెట్టడంతో కుటుంబ సమస్యలు ప్రారంభమయ్యాయి.. అప్పుడే నాకు యాక్సిడెంట్ అయింది. ఐపీఎల్‌కు మరో 10-12రోజులు ఉందనగా ఆ ప్రమాదం జరిగింది. అలాగే నా వ్యక్తిగత విషయాలు మీడియాలో నడిచాయి. ఒకవేళ నా కుటుంబం మద్దతు లేకపోతే నేను క్రికెట్ కెరీర్‌ను కోల్పోతానేమో అని ఆలోచించా. ఆ సమయంలో తీవ్ర వ్యక్తిగత సమస్యల కారణంగా మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన మూడుసార్లు వచ్చింది. మేం 24వ అంతస్తులో ఉండేవాళ్లం. నేను అక్కడి నుంచి దూకేస్తానేమోనని మా కుటుంబ సభ్యులు భయపడేవారు. నా సోదరుడు నాకు చాల మద్దతుగా నిలిచాడు. ఆ సమయంలో 24గంటలు నాతో పాటే ఉండి నన్నుకంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఆ బాధ నుంచి బయటపడి క్రికెట్‌పై దృష్టి సారించాలని నా తల్లిదండ్రులు చెప్పేవారు. వారు నా మంచి కోసమే చెబుతున్నారని భావించి దెహ్రాదూన్ అకాడమీలో ట్రైనింగ్ ప్రారంభించి చాలా శ్రమించానంటూ' పేర్కొన్నాడు. 2015 ప్రపంచకప్ తర్వాత గాయం నుంచి కోలుకునేందుకు 18నెలల సమయం పట్టడంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యానని, అప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వచ్చిందన్నాడు. తన కుటుంబం మద్దతుగా నిలువకపోయి ఉంటే ఆత్యహత్య చేసుకొని ఉండేవాడినేమోనని మహ్మద్ షమీ తెలిపాడు. -
కరోనా: హిట్ మ్యాన్ భారీ విరాళం!
న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో లాక్డౌన్లోకి వెళ్లిపోయిన భారత్ మళ్లీ మునుపటి స్థితికి చేరుకోవాలని హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఆకాంక్షించారు. కష్టకాలంలో ఉన్న మన దేశానికి సేవ చేసే బాధ్యత అందరిపైనా ఉందని ట్విటర్లో పేర్కొన్నారు. కోవిడ్-19 బాధితులను, పేదలను ఆదుకునేందుకు తన వంతుగా రూ.80 లక్షలు విరాళం ఇచ్చినట్టు తెలిపారు. పీఎం కేర్స్‌కు రూ.45 లక్షలు, మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.25 లక్షలు, ఫ్రీ ఇండియా స్వచ్ఛంద సంస్థకు, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్‌కు రూ. 5 లక్షల చొప్పున రోహిత్ సాయం చేశారు. (‘పీఎం కేర్స్’కు విరాళాలివ్వండి) ఇక భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, అతని భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ.. పీఎం–కేర్స్ ఫండ్, మహారాష్ట్ర ముఖ్య మంత్రి సహాయనిధి కోసం తామిద్దరం నిధులు అందించనున్నట్లు ప్రకటించారు. అయితే తాము ఎంత మొత్తం విరాళంగా ఇస్తున్నది మాత్రం వారిద్దరు గోప్యంగా ఉంచారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూ.50 లక్షల చొప్పున పీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. (చదవండి: విరుష్క జోడీ విరాళం రూ. 3 కోట్లు!) -
నా ఒక్కగానొక్క భార్యతో వాలెంటైన్స్ డే..!
న్యూఢిల్లీ : గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ కుటుంబానికి సమయం కేటాయిస్తున్నాడు. వాలెంటైన్స్ డే సందర్భంగా ధావన్ షేర్ చేసిన ఓ ఫొటో అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. భార్య ఆయేషాతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేసిన ధావన్.. ‘నా ఒక్కగానొక్క సతీమణి, స్నేహితురాలితో ప్రేమికుల దినోత్సవ వేడుకలు’అని క్యాప్షన్ పెట్టాడు. అందమైన జంటకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ధావన్‌కు అతని ఐపీఎల్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ కూడా శుభాకాంక్షలు తెలిపింది. (చదవండి : ధావన్ స్థానంలో పృథ్వీ షా) ఇక పరిమిత ఓవర్ల క్రికెట్లో ధానవ్ సహచరుడు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా అభిమానులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు తెలిపాడు. ‘రేపంటూ లేనట్టుగా మీ ఇష్టమైన వారికి ప్రేమను పంచండి’అని క్యాప్షన్ పెట్టి భార్య రితికాతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో భుజానికి గాయమైన ధానవ్ న్యూజిలాండ్ పర్యటనకు దూరమైన సంగతి తెలిసిందే. టీ20, వన్డే సిరీస్‌లకు దూరమైన ధావన్, టెస్టు సిరీస్‌కు కూడా ఎంపిక కాలేదు. న్యూజిలాండ్-భారత్ తొలిటెస్టు ఫిబ్రవరి 21న మొదలు కానుంది. View this post on Instagram Happy valentine day everyone. Love your loved ones like there is no tomorrow ❤️ @ritssajdeh A post shared by Rohit Sharma (@rohitsharma45) on Feb 14, 2020 at 12:28am PST -
సిరీస్ కంటే.. చహల్ ఫొటోనే హైలైట్..!
న్యూఢిల్లీ : ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌ను ట్రోల్ చేశాడు. టీమిండియా ఆసీస్‌తో సిరీస్ నెగ్గినదానికంటే.. చహల్ కండల ప్రదర్శనే హైలైట్‌గా నిలిచిందని ట్విటర్లో చమత్కరించాడు. దాంతోపాటు షర్ట్ లేకుండా ఉన్న చహల్ ఫొటోను, హాలీవుడ్ స్టార్, మాజీ రెజ్లర్ డ్వేన్ జాన్సన్ ఫొటోను జతచేసి ట్విటర్లో పోస్టు చేశాడు. కాగా, రోహిత్ ట్వీట్‌కు అంతే సరదాగా చహల్... ‘ది రాక్’అని రిప్లై ఇచ్చాడు. డ్వేన్ జాన్సన్ ‘ది రాక్’ పేరుతో రెజ్లర్‌గా బరిలోకి పాపులర్ అని తెలిసిందే. మైదానం బయట కూడా రోహిత్ చహల్ మంచి స్నేహితులు కావడం గమనార్హం. ఇదిలాఉండగా.. నిర్ణయాత్మక మూడో వన్డేలో 119 పరుగులతో రోహిత్ చెలరేగాడు. దీంతో 287 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. రోహిత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇక అంతర్జాతీయ వన్డే క్రికెట్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 9000 పరుగులు పూర్తిచేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా రోహిత్ (217) రికార్డు అందుకున్నాడు. Best picture I saw today. India wins the series but someone else takes the headlines. Bravo!! @yuzi_chahal pic.twitter.com/dN0RXh05q9 — Rohit Sharma (@ImRo45) January 20, 2020 -
గ్రేట్ ఇండియన్ క్రికెట్ సిరీస్
భారత క్రికెట్‌కు 2019 ‘గుడ్’గా సాగి ‘బైబై’ చెప్పింది. ఆటలో మేటి జట్టుగా టీమిండియా దూసుకెళ్లగా... వ్యక్తిగతంగానూ క్రికెటర్లు ఎన్నో మైలురాళ్లను అందుకున్నారు. కొన్ని సిరీస్‌లలో అయితే ఒకరిని మించి ఒకరు దంచేశారు. గాయాల మరకలు, కీలక ఆటగాళ్ల లోటు ఏ సిరీస్‌లోనూ కనబడలేదంటే అతిశయోక్తి కాదు. బ్యాటింగ్ ఇండియాలో బౌలింగ్ గ్రేట్ అయ్యింది ఈ ఏడాదే. కోహ్లి ‘టన్’లకొద్దీ పరుగులు, రోహిత్ ప్రపంచకప్ శతకాలు, కొన్ని మచ్చుతునకలైతే... టెస్టుల్లో మయాంక్, వన్డేల్లో రాహుల్ రెగ్యులర్ ఓపెనర్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ఎదిగారు. 2019లో కోహ్లి సేన జోరు టెస్టుల్లో అయితే భారత్‌కు ఓటమన్నదే లేదు. రెగ్యులర్ ఓపెనర్ ధావన్ లేని భారత్‌కు మయాంక్ అగర్వాల్ రూపంలో మరో నిలకడైన బ్యాట్స్‌మన్ జతయ్యాడు. పరిమిత ఓవర్ల క్రికెటర్ రోహిత్‌కు ఐదురోజుల ఆట కలిసొచ్చింది కూడా ఈ ఏడాదే. ఆ్రస్టేలియా పర్యటనలోని ఆఖరి టెస్టును డ్రా చేసుకున్న భారత్... ఆ తర్వాత ఆడితే గెలుపు తప్ప మరో ఫలితం ఎరుగదు. విండీస్ దీవుల్లో ఆడిన రెండు టెస్టుల్ని భారీతేడాతో గెలిచింది. అక్టోబర్‌లో ఇక్కడికొచ్చిన దక్షిణాఫ్రికాను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సఫారీ జట్టుపై రెండు టెస్టులైతే ఇన్నింగ్స్‌తేడాతో గెలుపొందడం విశేషం. ఓపెనర్లుగా మయాంక్, రోహిత్ సెంచరీలు, డబుల్ సెంచరీలతో మెరిశారు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్ (2–0)లో భారత్‌కు రెండో ఇన్నింగ్స్ ఆడే అవకాశమే రాలేదు. రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్ దెబ్బకు బంగ్లా కునారిల్లింది. వరల్డ్ చాంపియన్íÙప్లో భాగంగా ఆడిన మూడు సిరీస్‌లూ గెలిచి అందుబాటులో ఉన్న 360 పాయింట్లను తమ ఖాతాలో వేసుకుంది. ఇంటా గెలిచి... రచ్చా గెలిచి... ఏడాది ప్రత్యేకించి వన్డేల్లో టీమిండియా గర్జించింది. ఎక్కడికెళ్లినా ఎదురేలేని జట్టుగా తిరిగొచి్చంది. ఇంటా బయటా కలిపి ఐదు ద్వైపాక్షిక సిరీస్‌లాడిన భారత్ నాలుగింటిని వశం చేసుకుంది. ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో ఒకటి రద్దయితే ఏడు గెలిచింది. ఓవరాల్‌గా ఏ జట్టుకూ సాధ్యం కానీ 70 శాతం విజయాలు నమోదు చేసింది. మొదట ఆ్రస్టేలియా గడ్డపై కంగారూ పెట్టించి మరీ వన్డే క్రికెట్లో భారత్ విజయ శాసనానికి శ్రీకారం చుట్టింది. అక్కడ మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకొని కొత్త ఏడాదికి గెలుపు రుచిని చూపించింది. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ ధోని ఆట అదరహో! తొలుత ఓడిన మ్యాచ్ సహా... వరుస వన్డేల్లో మిస్టర్‌కూల్ (51, 55 నాటౌట్, 87 నాటౌట్) అర్ధసెంచరీలతో అదరగొట్టాడు. ఆ వెంటే న్యూజిలాండ్‌కెళ్లి చితగ్గొట్టింది. ఐదు వన్డేల్లో ఒకే ఒక్క మ్యాన్ మినహా ప్రతి పోరులో పరాక్రమం చూపింది. 4–1తో కివీరెక్కలు విరిచింది. ఈ సిరీస్‌లో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు చూపించిన తెగువ క్రికెట్ విశ్లేషకుల్ని ఆకర్షించింది. ముఖ్యంగా ఆఖరి వన్డేలో రోహిత్, ధావన్, ధోనిలాంటి హేమాహేమీలు సైతం విలవిలలాడిన చోట మన రాయుడు (113 బంతుల్లో 90; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగాడు. 18 పరుగులకే 4 వికెట్లను కోల్పోయిన భారత్‌కు పెద్దదిక్కయ్యాడు. మొత్తానికి విజయగర్వంతో ఉన్న కోహ్లి సేనకు సొంతగడ్డపై ఆసీస్ చేతిలో అనూహ్య పరాజయం ఎదురైంది. ఈ యేడు భారత్ కోల్పోయిన సిరీస్ (2–3తో) ఇదొక్కటే! అనంతరం వరల్డ్‌కప్ ముగిశాక కరీబియన్ దీవులకెళ్లి మళ్లీ జయకేతనం ఎగరేసింది. అక్కడ 3వన్డేల సిరీస్‌లో తొలి వన్డే రద్దవగా తర్వాత రెండు వన్డేల్ని సునాయాసంగా గెలుచుకుంది. మళ్లీ ఇటీవల ఇక్కడికొచ్చాక కూడా వెస్టిండీస్‌ను విడిచిపెట్టలేదు. భారీస్కోర్లు చేసిమరీ 2–1తో నెగ్గింది. అయితే విండీస్ ఓడినా ఆకట్టుకుంది. ఈ క్యాలెండర్‌ను కోహ్లి రోహిత్‌లు అసాధారణ ఫామ్‌తో ముగించారు. రోహిత్ 28 మ్యాచ్‌ల్లో 57.30 సగటుతో 1490 పరుగులు చేశాడు. 7 సెంచరీలు, 6 అర్ధసెంచరీలు బాదాడు. 26 వన్డేలాడిన కెపె్టన్ 59.86 సగటుతో 1377 పరుగులు చేశాడు. 5 సెంచరీలు, 7 ఫిఫ్టీలు కొట్టాడు. మెరుపుల్లో వెనుకబడింది పొట్టి ఫార్మాట్లో మాత్రం భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. న్యూజిలాండ్ పర్యటనలో ఆతిథ్య జట్టు చేతిలో 2–1తో ఓడిన టీమిండియా... స్వదేశంలో ఆసీస్ చేతిలో 2–0తో కంగుతింది. గట్టి జట్లపై మన మెరుపులు మెరవలేదు. అయితే విండీస్ పర్యటనలో భాగంగా అమెరికాలో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రం కోహ్లి సేన చెలరేగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. సొంతగడ్డపై సఫారీతో జరిగిన మూడు మ్యాచ్‌ల పొట్టి ఆటను 1–1తో సమం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ రద్దయింది. తర్వాత బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో సిరీస్‌లను 2–1తో గెలిచినప్పటికీ ఒక్కో మ్యాచ్‌లో ఎదురుదెబ్బలు తిన్నది. సెమీస్‌లో చెదిరిన ‘ప్రపంచ’కల కోహ్లిసేన ఇంగ్లండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగింది. విదేశీ దిగ్గజాలు, వ్యాఖ్యాతలు సైతం కప్ భారత్‌దే అని జోస్యం చెప్పారు. అయితే భారత్ కూడా ఫేవరెట్ హోదాకు సెమీస్ దాకా న్యాయం చేసింది. 9 లీగ్ మ్యాచ్‌లకు గాను ఒక్క ఆతిథ్య జట్టు చేతిలోనే ఓడింది. ఒక వన్డే రద్దయింది. ఆసీస్, దక్షిణాఫ్రికాలాంటి మేటి జట్లను అవలీలగా మట్టికరిపించి... లీగ్ టాపర్‌గా నాకౌట్ బరిలో దిగిన టీమిండియాకు ఊహించని విధంగా న్యూజిలాండ్ చేతిలో చుక్కెదురైంది. ఈ టోరీ్నలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఐదు శతకాలతో రికార్డులకెక్కాడు. -
'రోహిత్‌ను ఓపెనర్‌గా ఆడనివ్వండి'
న్యూఢిల్లీ : వెస్టిండీస్‌తో జరిగిన టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లు టీమిండియా విజయవంతంగా ముగించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. మిడిలార్డర్లో అజింక్యా రహానే, హనుమ విహారి అద్భుతంగా ఆడారని, ఇక బౌలింగ్ విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని పేర్కొన్నాడు. ఇక ఓపెనర్లలో మయాంక్ అగర్వాల్ ఆకట్టుకున్నా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ పూర్తిగా విఫలమయ్యాడని, అతడి స్థానంలో డాషింగ్ బ్యాట్సమెన్ రోహిత్‌శర్మకు ఓపెనర్‌గా ఆడే అవకాశం ఇవ్వాలని సూచించాడు. ప్రపంచకప్‌లో రోహిత్‌శర్మ 9 మ్యాచుల్లోనే ఐదు శతకాలతో 648 పరుగుల అద్బుత ప్రదర్శనను ఎవరు మర్చిపోలేరు అని తెలిపాడు. విండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ స్థానం ఆశించాడని, కానీ అతనికి అవకాశం ఇవ్వకుండా బెంచ్‌కు పరిమితం చేయడం తనకు నచ్చలేదని గంగులీ తెలిపాడు. వరుస అవకాశాలు వచ్చినా కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా విఫలమవుతూ వస్తున్నాడని, ఇప్పటివరకు 27 టెస్టుల్లో 50 సగటుతో పరుగులు సాధించిన రోహిత్‌శర్మను ఓపెనర్‌గా ఆడిస్తే బాగుంటుందని చాలాసార్లు చెప్పినట్లు పేర్కొన్నాడు. మిడిలార్డర్లో అజింక్యా రహానే, హనుమ విహారిలు ఆకట్టుకోవడంతో అక్కడ వేరే వారికి అవకాశం లేకుండా పోయిందని గంగూలీ స్పష్టం చేశాడు. -
స్వదేశం చేరుకున్న మొదటి క్రికెటర్
సాక్షి, ముంబై: ఇంగ్లాండ్‌లో జరిగిన క్రికెట్ వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరి కంటే ముందు ఓపెనర్ రోహిత్ శర్మ ఇండియాకు వచ్చేశాడు. శనివారం తెల్లవారు జామున ముంబై విమానాశ్రయానికి చేరుకున్న రోహిత్ కారులో తన నివాసానికి చేరుకున్నారు. ఆయన వెంట భార్య రితిక, కూతురు సమైరా ఉన్నారు. ఈ ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేసి టాప్ బ్యాట్స్‌మన్‌గా కొనసాగుతున్నాడు. ఐదు సెంచరీలతో రోహిత్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించి నిరాశపరిచాడు. -
కుటుంబ సభ్యులతో మాల్దీవుల్లో ‘హిట్‌మ్యాన్’
టీమిండియా వైస్ కెప్టెన్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మాల్దీవుల్లో కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గుడుపుతున్నాడు. హైదరాబాద్ వేదికగా ఐపీఎల్ 2019 ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన హోరా హోరీ మ్యాచ్‌లో ఐపీఎల్ సీజన్12 కప్‌ని ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ముద్దాడాడు. ఇటు ఐపీఎల్ విజయంతో మంచి జోష్‌లో ఉన్న హిట్‌మ్యాన్ రోహిత్ త్వరలో జరగబోయే వరల్డ్‌కప్‌కు ముందు భార్య రితికా, కూతురు సమారియాలతోపాటూ కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవుల్లో పర్యటిస్తున్నాడు. ఫ్యామిలీ టూర్‌కు సంబంధించి ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ రికార్డులకెక్కిన విషయం తెలిసిందే. నాలుగుసార్లు ముంబైకి టైటిల్ అందించిన రోహిత్.. 2009లో డెక్కన్ ఛార్జర్స్ జట్టు సభ్యుడిగా తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. రిక్కీ పాంటింగ్ నుంచి ముంబై ఇండియన్స్ పగ్గాలు అందుకున్న రోహిత్ 2013లో తన జట్టుకు మొదటిసారి ట్రోఫీని అందించాడు. తర్వాత 2015లో ముంబైకి టైటిల్ అందించిన హిట్ మ్యాన్ 2017, 2019ల్లో ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్‌ల్లో ఒక్క పరుగు తేడాతో తన జట్టును విజేతగా నిలిపాడు. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న #10YearChallenge (టెన్ ఇయర్ ఛాలెంజ్)లో భాగంగా రోహిత్‌కు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. 2009 ఐపీఎల్లో అప్పటి దక్కెన్ చార్జెస్ జట్టుకు ఆడిన రోహిత్ శర్మ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఇక 2019 ఐపీఎల్లో ముంబై జట్టుకు కెప్టెన్‌గా ఉండి ట్రోఫీ అందుకున్నాడు. 2009, 2019 ఫొటోలను జత చేసి షేర్ చేయడంతో ఆ ఫొటో ట్రెండ్ అవుతోంది. -
బేసి... సరి అయినప్పుడు!
సాక్షి క్రీడావిభాగం : ముంబై ఇండియన్స్ పేసర్ అల్జారి జోసెఫ్ ఈ సీజన్లో కేవలం 3 మ్యాచ్‌లు ఆడి గాయంతో టోర్నీకి దూరమయ్యాడు. నిబంధనల ప్రకారం జట్టు నుంచి వెళ్లిపోయాక అతని గాయం సమస్య సొంత బాధ్యత లేదా వెస్టిండీస్ బోర్డు చూసుకోవాలి. కానీ ముంబై ఇండియన్స్ అలా చేయలేదు. తమ సొంత ఖర్చులతో జోసెఫ్ పూర్తిగా కోలుకునే వరకు ముంబైలోనే ఉంచి చికిత్స చేయించేందుకు సిద్ధమైంది. ముంబై టీమ్ సంస్కృతి గురించి ఎవరైనా మాట్లాడితే ఇలాంటి ఉదాహరణలు బోలెడు. నీకు ఏ లోటు రాకుండా చూస్తాం... మాకు విజయాలు అందించు చాలు అనేది ముంబై టీమ్‌లో మాత్రమే కనిపించే తత్వం. అందుకే చాలా మంది వేలం నుంచి కూడా ఆ టీమ్‌లో ఉండాలని కోరుకుంటారు. చివరి వరకు కూడా ఓటమి అంగీకరించకుండా పోరాడే గుణం ముంబై ఆటగాళ్లలో తరచుగా కనిపిస్తోంది. అది కూడా ఏ ఒక్కరో కాకుండా సమష్టి తత్వంతో ఆ జట్టు వరుసగా టైటిల్స్ సాధిస్తోంది. తలా ఓ చేయి... ఈ సీజన్‌కు వచ్చేసరికి ట్రోఫీ విజయాన్ని ఏ ఒక్కరికో ఆపాదించలేం. సరిగ్గా చెప్పాలంటే అందరూ ఒక్కో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఎప్పటిలాగే ఆరంభంలో పరాజయాలతో మొదలు పెట్టిన ముంబై అనూహ్యంగా దూసుకుపోయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం ఆశ్చర్యకరం. కేవలం 2 అర్ధసెంచరీలతో మొత్తం 405 పరుగులు చేయడం రోహిత్ స్థాయి ప్రదర్శన కాదు. అయినా సరే జట్టుకు అది సమస్యగా మారలేదు. డి కాక్ నాలుగు అర్ధసెంచరీలు సహా 529 పరుగులతో టీమ్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్ క్వాలిఫయర్‌లో తన క్లాస్ చూపించగా, హార్దిక్ పాండ్యా ఏకంగా 192 స్ట్రైక్‌రేట్‌తో 402 పరుగులు చేయడం ముంబై విజయంలో కీలకంగా మారిందని చెప్పవచ్చు. పొలార్డ్ ఒకే ఒక అర్ధసెంచరీ చేసినా అది అవసరమైన మ్యాచ్‌లో జట్టును గెలిపించింది. ఇప్పుడు ఫైనల్లో అతని ఆట మళ్లీ ముంబై తమ జట్టుతోనే కొనసాగించేందుకు కారణంగా మారనుంది. టీమ్‌నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు కాకపోవడం విశేషం. బౌలింగ్‌లో బుమ్రా, రాహుల్ చహర్ చెరో 19, 13 వికెట్లు తీసి కీలకంగా మారారు. మలింగ భారీగా పరుగులిచ్చినా ఫైనల్ తరహాలో అసలు సమయంలో తన సత్తా ప్రదర్శిస్తూ తనపై మేనేజ్మెంట్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. సమష్టి ఆటతో పాటు మొత్తంగా రోహిత్ వ్యూహాలు ముంబైని మహాన్‌గా నిలిపాయి.మరోవైపు కేవలం ధోని బ్యాటింగ్, అతని కెప్టెన్సీనే నమ్ముకున్న చెన్నై చివరి మెట్టుపై కుప్పకూలింది. ధోని రనౌట్ కాకపోతే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో కానీ మొత్తంగా ఆరంభం నుంచి వారికి సమస్యగా ఉన్న బ్యాటింగ్ చివరకు కొంప ముంచింది. చెన్నై అసలు పోరులో మాత్రం బలమైన ప్రత్యర్థి ముందు నిలవలేక చివరకు 0–4తో ముంబైపై ఓడి సీజన్ ముగించింది. రోహిత్ పగ్గాలు చేపట్టాక... జంబో జెట్ టీమ్, భారీ హంగామా, అంబానీల అండాదండా ఉన్నా ఐపీఎల్ తొలి ఐదు సీజన్లలో ముంబై టైటిల్ గెలవలేకపోయింది. సచిన్ టీమ్‌లో ఉన్నా, పాంటింగ్ లాంటి దిగ్గజం కెప్టెన్‌గా వచ్చినా ఆ తర్వాత కూడా రాత మారలేదు. కానీ 2013లో రోహిత్ శర్మ నాయకుడిగా వచ్చి టీమ్‌ను మార్చేశాడు. అంతకుముందుతో పోలిస్తే ఒక్కసారిగా ముంబై టీమ్ మారిపోయినట్లుగా కనిపించింది. అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్‌కు పరిమిత సంఖ్యలోనే కెప్టెన్సీ అవకాశాలు వచ్చినా... ఐపీఎల్లో మాత్రం తన నాయకత్వ లక్షణాలతో రోహిత్ వరుస విజయాలు అందించాడు. 2013, 2015, 2017 లతో పాటు ఇప్పుడు 2019లో బేసి సంవత్సరాల్లో టైటిల్ సాధించి కొత్త ఘనతను సృష్టించాడు. ఇందులో మూడు సార్లు ధోని నాయకత్వంలోని చెన్నైపై... మరో మ్యాచ్‌లో ధోని సభ్యుడిగా ఉన్న టీమ్‌పై గెలవడం ముంబై స్థాయిని చూపిస్తోంది. 2017లో పుణేతో జరిగిన ఫైనల్లో 129 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోగలగడం కూడా రోహిత్ వల్లే సాధ్యమైంది. -
రోహిత్... ఇదేం తీరు?
కోల్‌కతా: ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అనుచిత చర్యకు పాల్పడ్డాడు. ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఔటై పెవిలియన్‌కు వెళ్తూ నాన్ స్ట్రయికింగ్ ఎండ్‌లో ఉన్న వికెట్లను రోహిత్ బ్యాట్‌తో కొట్టాడు. 233 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో అతడు మంచి టచ్‌లో ఉన్న సమయంలో గర్నీ వేసిన బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ ఔటివ్వగా... రోహిత్ డీఆర్ఎస్ కోరాడు. కానీ, నిర్ణయం వ్యతిరేకంగా వచ్చింది. దీంతో అసహనానికి గురైన అతడు అంపైర్ ఎదుటే బ్యాట్‌ను వికెట్లకు తాకించాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి 2.2లోని లెవల్ 1ను ఉల్లంఘించినందుకు దీనిపై అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పెట్టారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా రోహిత్ రూ.12 లక్షల జరిమానా ఎదుర్కొన్నాడు. -
బెంగళూరు కథ కంచికే!
ముంబై: ఈ ఐపీఎల్ సీజన్లో అందరికంటే ముందే క్వాలిఫయర్స్ రేసులోకి వచ్చిన జట్టు చెన్నై అయితే... అందరికంటే ముందే నిష్క్రమిస్తున్న జట్టు బెంగళూరు. ఇరు జట్లకి ‘ఒకటే’ తేడా. అది ఏంటంటే సూపర్‌కింగ్స్ ‘ఒకటి’ ఓడి ఏడు గెలిచింది. రాయల్ చాలెంజర్స్ మాత్రం ‘ఒకటి’ గెలిచి ఏడు ఓడింది. దీంతో ఇంకా ఆరు మ్యాచ్‌లు మిగిలున్నా... బెంగళూరు ముందుకెళ్లే దారులు దాదాపు మూసుకుపోయాయి. సోమవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ ఐదు వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. మొదట బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. డివిలియర్స్ (75; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు), మొయిన్ అలీ (50; 1 ఫోర్, 5 సిక్స్‌లు) రాణించారు. తర్వాత ముంబై 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసి గెలిచింది. హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. చహల్, మొయిన్ అలీ చెరో 2 వికెట్లు తీశారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు... మొదట కోహ్లి (8)ని, తర్వాత పార్థివ్ (28) వికెట్లను కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు 49/2. ఈ దశలో డివిలియర్స్‌కు జతయిన మొయిన్ అలీ సిక్సర్లతో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడో వికెట్‌కు 10.1 ఓవర్లలోనే ఇద్దరు కలిసి చకచకా 95 పరుగులు జోడించారు. డివిలియర్స్ 49 బంతుల్లో (4 ఫోర్లు, 2 సిక్స్‌లు), అలీ 31 బంతుల్లో (1 ఫోర్, 5 సిక్సర్లు) అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. అనంతరం మలింగ... అలీతో పాటు స్టొయినిస్ (0)లను ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. దీంతో బెంగళూరు మరిన్ని పరుగులు చేయలేకపోయింది. 4.1 ఓవర్లలో ముంబై స్కోరు 50... లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఓపెనర్లు డికాక్ 40; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), రోహిత్ శర్మ (28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. దీంతో జట్టు 4.1 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. వీళ్లిద్దరు పరుగు తేడాతో 71 స్కోరు వద్ద నిష్క్రమించారు. తర్వాత వచ్చిన సూర్యకుమార్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్), ఇషాన్ కిషన్ (9 బంతుల్లో 21; 3 సిక్సర్లు) ధాటిని కొనసాగించారు. దీంతో ముంబై లక్ష్యం దిశగా సాగింది. ఆఖర్లో బంతులకు, పరుగులకు మధ్య అంతరం పెరగడంతో హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝళిపించాడు. పవన్ నేగి వేసిన 19వ ఓవర్లో అతను వరుసగా 6, 4, 4, 6తో 22 పరుగులు చేయడంతో మరో ఓవర్ మిగిలుండగానే ముంబై లక్ష్యాన్ని అధిగమించింది. ఐపీఎల్లో నేడు పంజాబ్(vs)రాజస్తాన్ వేదిక: మొహాలి, రాత్రి గం.8 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
ముంబై మళ్లీ కొట్టింది
రోహిత్ శర్మ నాయకత్వంలో ముంబై ఇండియన్స్ రెండోసారి లీగ్ విజేతగా నిలిచింది. 2015 సీజన్ తొలి రెండు వారాల పాటు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబై ఒక్కసారిగా జూలు విదిల్చి దూసుకుపోయింది. రెండేళ్ల క్రితంలాగే అదే కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో అదే ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసి టైటిల్‌ను చేజిక్కించుకుంది. నెమ్మదైన ఈడెన్ గార్డెన్ పిచ్‌పై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ధోని నిర్ణయంపై ఆ తర్వాత కొంత చర్చ కూడా జరిగింది. గెలిపించిన కెప్టెన్: ఫైనల్లో ముందుగా సిమన్స్ (68), ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (26 బంతుల్లో 50) సహాయంతో ముంబై ఇండియన్స్ 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 8 వికెట్లకు 161 పరుగులే చేసి 41 పరుగుల తేడాతో ఓడింది. డ్వేన్ స్మిత్ (48 బంతుల్లో 57) స్లో హాఫ్ సెంచరీతో ఛేదనలో జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. చివరకు ముంబై కూడా రెండు టైటిళ్లు గెలిచిన చెన్నై, కోల్‌కతా సరసన నిలిచింది. ►నాలుగు సెంచరీలు: 2015 లీగ్‌లో డివిలియర్స్, గేల్, వాట్సన్, మెకల్లమ్ శతకాలతో చెలరేగారు. గేల్ అత్యధికంగా 38 సిక్సర్లు బాదాడు. ►ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: ఆండ్రీ రసెల్ (కోల్‌కతా – 193 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు, 14 వికెట్లు) ►అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్): డేవిడ్ వార్నర్ – సన్‌రైజర్స్, 562 పరుగులు ►అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్): డ్వేన్ బ్రేవో – చెన్నై, 26 వికెట్లు -
ముంబై చాంపియనైంది
క్రికెట్ దేవుడు, బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐకాన్ ప్లేయర్‌గాఉన్న జట్టు ముంబై ఇండియన్. ఐదు సీజన్లు గడిచినా చాంపియన్ షిప్‌ను అందుకోలేకపోయింది. ఈ ఐదేళ్లలో ఒకసారి 2010లో ఫైనల్ గడప తొక్కినా... చివరకు చెన్నై చేతిలో చుక్కెదురైంది. ఆరో సీజ¯Œ లో మాత్రం అదే చెన్నైపై బదులు తీర్చుకున్న సచిన్ జట్టు 2013 చాంపియన్ అయింది. ఐదు సీజన్లుగా అలసట లేని పోరాటం చేసిన ముంబై ఇండియన్ జట్టు రాత ఆరో సీజన్ నుంచి మారిపోయింది. ఆటగాళ్ల ప్రయత్నానికి అదృష్టం కూడా తోడవడంతో 2013 చాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్ ఫేవరెట్ చెన్నై సూపర్‌కింగ్స్‌తో సాధారణ లక్ష్యాన్ని కాపాడుకొని తొలిసారి విజేతగా నిలిచింది. 2010లో ఫైనల్ మెట్టుపై తమనో ‘పట్టు’పట్టిన చెన్నైపై ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఆ తర్వాత ఆడిన ఐదు సీజన్లలో మరో రెండుసార్లు (2015, 2017) టైటిల్‌ను కైవసం చేసుకుంది. మొదట ఈ సీజన్లో పాంటింగ్ సారథ్యంలో తలపడిన ముంబై ఇండియన్స్ అనంతరం రోహిత్ శర్మ నేతృత్వంలో పుంజుకుంది. సచిన్ ఆడిన చివరి ఐపీఎల్ కూడా ఇదే. గాయంతో ఫైనల్ ఆడలేకపోయిన సచిన్ ఈ సీజన్‌తో ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. పెప్సీ ఐపీఎల్... డీఎల్ఎఫ్ ఐదేళ్ల కాంట్రాక్టు గడువు ముగియడంతో పెప్సీకో ఐపీఎల్ ప్రధాన స్పాన్సర్‌గా వచ్చింది. దీంతో డీఎల్ఎఫ్ ఐపీఎల్ కాస్తా పెప్సీ ఐపీఎల్‌గా మారింది. తొమ్మిది జట్లతో మొదలైన ఈ సంగ్రామంలో ముంబై ఇండియన్ చివరిదాకా పట్టుదలగా ఆడింది. ఇక ఈ లీగ్‌కు చెన్నైలో రాజకీయ ఆందోళనలు వెల్లువెత్తాయి. శ్రీలంకలోని తమిళులపై సింహళీయుల అణచివేత కారణంగా తమిళనాడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. దీంతో అప్పటి తమిళనాడు సీఎం జయలలిత లంక ఆటగాళ్లు చెన్నైలో ఆడకుండా చూసుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ఐపీఎల్ పాలకమండలికి, బీసీసీఐకి లేఖ రాసింది. దీంతో లంకేయులెవరూ చెన్నై గడ్డపై అడుగుపెట్టలేదు. లీగ్ విషయానికొస్తే 9 జట్లు బరిలోకి దిగగా మొత్తం 76 మ్యాచ్‌లు జరిగాయి. లీగ్ దశలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో పాటు, ముంబై ఇండియన్స్ సమవుజ్జీగా నిలిచింది. రెండు జట్లు 16 మ్యాచ్‌ల్లో 11 చొప్పున గెలిచి తొలి రెండు స్థానాల్లో ప్లే–ఆఫ్ బరిలో నిలిచాయి. చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్కే) ఆటగాళ్ల హవా నడిచిన ఈ లీగ్‌లో మైక్ హస్సీ 733 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను అందుకోగా, చెన్నై ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ చేజిక్కించుకున్నాడు. ఇక జట్టు మొత్తంగా చూసుకుంటే పాల్గొన్న తొలి సీజన్లోనే ఏమాత్రం అంచనాలు లేని సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతంగా ఆడింది. అసాధారణ బౌలింగ్‌తో ప్రత్యర్థుల మెరుపులకు కళ్లెం వేసి మరీ తక్కువ స్కోర్లను కాపాడుకున్న జట్టేదైనా ఉంటే అది సన్ రైజర్సే! మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 119, 126, 136 పరుగుల్ని చేసి... టి20ల్లో అతిసాధారణమనే ఈ లక్ష్యాల్ని నిలబెట్టుకోవడం గొప్ప విశేషం. బౌలర్లు స్టెయిన్ , ఇషాంత్ శర్మ, కరణ్ శర్మ, డారెన్ స్యామీ సమష్టిగా రాణించారు. లీగ్ దశ ముగియడంతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన చెన్నై, ముంబై ప్లే ఆఫ్ అడ్వాంటేజ్ పొందగా, మూడు, నాలుగో స్థానాల్లో ఉన్న రాజస్తాన్, సన్ రైజర్స్ ఎలిమినేటర్ ఆడాయి. ఇందులో రాజస్తాన్ జట్టు ముందంజ వేయగా... హైదరాబాద్ ఆట ముగిసింది. తొలి క్వాలిఫయర్‌లో ముంబైని ఓడించిన చెన్నై నేరుగా ఫైనల్ చేరింది. ప్లే ఆఫ్ సౌలభ్యంతో ముంబై రెండో క్వాలిఫయర్‌లో రాజస్తాన్‌పై గెలిచి ఫైనల్ చేరింది. ఫైనల్ డ్రామా... ఈ లీగ్‌లో చెన్నై బ్యాటింగ్ పవర్ సూపర్. 200 పైచిలుకు పరుగులు చేయడమే కాకుండా... 180, 170, 190 పరుగులకు పైగా లక్ష్యాల్ని ఛేదించింది. కానీ ఫైనల్లో మాత్రం ముంబై తమ ముందుంచిన 149 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. మొదట పొలార్డ్ (32 బంతుల్లో 60 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులతో ముంబై 9 వికెట్లకు 148 పరుగులు చేసింది. తర్వాత చెన్నై 2, 2, 3, 35 చూస్తుండగానే 39 పరుగులకే ఆరు వికెట్లను కోల్పోయింది. మలింగ (2/22), జాన్సన్ (2/19), హర్భజన్ (2/14)ల ధాటికి చెన్నై ఇన్నింగ్స్ కాస్తా పేకమేడలా కూలింది. 58 పరుగులు చేసేసరికి 8 వికెట్లు!! కానీ కెప్టెన్ ధోని (45 బంతుల్లో 63 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) ఒంటరి పోరాటంతో నిర్ణీత ఓవర్లు ఆడేసి 9 వికెట్లకు 129 పరుగులు చేసింది. 23 పరుగులతో గెలిచిన ముంబై తొలిసారి లీగ్ చాంపియన్ అయింది. దక్క¯Œ ఔట్... రైజర్స్ ఇన్ ఈ ఆరో సీజన్లోనూ 2012లాగే తొమ్మిది జట్లే ఆడాయి. కానీ జట్టు మారింది. హైదరాబాదీ ఆధీనంలోని దక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీ రద్దయింది. చెన్నైకి చెందిన ప్రముఖ సన్ టీవీ నెట్వర్క్ ఆధీనంలోకి హైదరాబాద్ వెళ్లింది. 2009 చాంపియన్ అయిన దక్కన్ చార్జర్స్... కొచ్చి టస్కర్స్ కేరళలాగే నిర్ణీత బ్యాంక్ గ్యారంటీని ఇవ్వకపోవడంతో బీసీసీఐ దక్కన్‌ను లీగ్ నుంచి తప్పించింది. కుదిపేసిన ‘స్పాట్’ మీకు తెలుసా... ప్రస్తుతం బీసీసీఐ కార్యవర్గంతో పాటు ‘సుప్రీం’ నియమించిన పరిపాలక కమిటీ (సీఓఏ) రావడానికి, తొలిసారిగా బోర్డులో సంస్కరణలు చేయడానికి, ప్రొఫెషనలిజాన్ని (సీఈఓ) తేవడానికి... ఇవన్నీ రావడానికి ఈ సీజనే కారణం. అదెలాగంటే ‘స్పాట్ ఫిక్సింగ్’ జరిగింది ఈ సీజన్లోనే. రాజస్తాన్ క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్ , అజిత్ చండిలా ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు ఢిల్లీ పోలీసులకు ఆధారాలు లభించడంతో కేసు నమోదు చేశారు. ముకుల్ ముద్గల్ కమిటీ విచారణ, తదనంతరం లోధా కమిటీ సిఫార్సులు. సంస్కరణలు అవన్నీ ఇప్పటికీ కొనసా...గుతున్నాయి. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్: వాట్సన్ రాజస్తాన్ రాయల్స్ అత్యధిక పరుగులు ఆరెంజ్ క్యాప్: హస్సీ చెన్నై: 733 అత్యధిక వికెట్లు పర్పుల్ క్యాప్: బ్రేవో చెన్నై: 32 -
ఫుల్ చార్జింగ్...
తొలి ఐపీఎల్లో చివరి స్థానాల్లో నిలిచిన రెండు జట్లు మరుసటి ఏడాదే ఫైనల్లో తలపడటం 2009 ఐపీఎల్‌కు సంబంధించి చెప్పుకోదగ్గ విశేషం. గిల్‌క్రిస్ట్ నాయకత్వంలోని హైదరాబాద్ టీమ్ డెక్కన్ చార్జర్స్ విజేతగా నిలిచింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా టోర్నీ మొత్తాన్ని దక్షిణాఫ్రికాకు తరలించడంతో ఇండియన్ లీగ్ కాస్తా ‘సఫారీ లీగ్’గా మారిపోయింది. ఈ టోర్నీ లో తొలిసారి ఒక్కో ఇన్నింగ్స్‌లో పది ఓవర్ల తర్వాత ఏడున్నర నిమిషాల టైమ్ ఔట్ విరామ నిబంధనను తెచ్చారు. ఇది తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ టోర్నీ విశేషాలను చూస్తే... కుంబ్లే శ్రమ వృథా... జొహన్నెస్‌బర్గ్‌లో జరిగిన ఫైనల్లో చార్జర్స్ 6 పరుగుల తేడాతో బెంగళూరును ఓడించింది. తొలుత చార్జర్స్ 6 వికెట్లకు 143 పరుగులు చేసింది. కుంబ్లే 16 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. బెంగళూరు 9 వికెట్లకు 137 పరుగులే చేసింది. వివాదం... అతి చెత్త ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఈసారి ఆఖరి స్థానంలో నిలిచింది. అయితే దానికంటే ‘ఫేక్ ఐపీఎల్ ప్లేయర్’ పేరుతో బ్లాగ్‌లో వచ్చిన కథనాలు వివాదం రేపాయి. టీమ్ లోగుట్టు విషయాలు ఇందులో బయటకు వచ్చాయి. దక్షిణాఫ్రికా నుంచి టోర్నీ మధ్యలోనే పంపించిన ఆకాశ్ చోప్రా, సంజయ్ బంగర్లు దీని వెనక ఉన్నారని వినిపించింది. లీగ్‌లో రెండు సెంచరీలు నమోదయ్యాయి. బెంగళూరు తరఫున మనీశ్ పాండే 114 నాటౌట్ పరుగులు చేయగా, ఢిల్లీ తరఫున డివిలియర్స్ 105 నాటౌట్ పరుగులు చేశాడు. వీరు గుర్తున్నారా! దక్కన్ చార్జర్స్ విన్నింగ్ టీమ్‌లో గిల్‌క్రిస్ట్, సైమండ్స్, గిబ్స్, వాస్, డ్వేన్ స్మిత్, ర్యాన్ హారిస్, స్టయిరిస్, ఫిడేల్ ఎడ్వర్డ్స్ విదేశీ ఆటగాళ్లు కాగా, లక్ష్మణ్, రోహిత్, ప్రజ్ఞాన్ ఓజా, ఆర్పీ సింగ్ భారత్ తరఫున తమ సత్తా చాటినవారు. వై. వేణుగోపాలరావు కూడా భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా... దేశవాళీ ఆటగాళ్లు తిరుమలశెట్టి సుమన్, డీబీ రవితేజ, అజహర్ బిలాఖియా, షోయబ్ అహ్మద్, జస్కరణ్ సింగ్, హర్మీత్ సింగ్‌లకు టీమిండియా తరఫున ఆడే అవకాశం ఎప్పుడూ రాలేదు. ►మ్యాన్ ఆఫ్ ద సిరీస్: గిల్‌క్రిస్ట్ (చార్జర్స్–495 పరుగులు, 10 క్యాచ్‌లు+8 స్టంపింగ్‌లు) ►అత్యధిక పరుగులు (ఆరెంజ్ క్యాప్): మాథ్యూహేడెన్ (చెన్నై–572) ►అత్యధిక వికెట్లు (పర్పుల్ క్యాప్): ఆర్పీ సింగ్ (దక్కన్ చార్జర్స్–23) -
టీమిండియా ఈసారి అలా బోల్తా పడొద్దు...
గత 13 నెలలుగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనలతో భూగోళాన్ని చుట్టేస్తోంది టీమిండియా. ఈ ప్రయాణంలో మధురమైన విజయాలను సొంతం చేసుకుంది. పలు ఘనతలను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడిక ప్రతిష్టాత్మక ప్రపంచ కప్‌నకు ముందు విదేశాల్లో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో మూడు నెలలుగా సాగుతున్న ఆస్ట్రేలియా–న్యూజిలాండ్ పర్యటనను మరింత గొప్పగా ముగించి... టి20 సిరీస్‌ను ఒడిసిపట్టి సగర్వంగా స్వదేశానికి చేరేందుకు ఒక్క గెలుపు దూరంలో ఉంది. దీనిని రోహిత్ బృందం నిజం చేయాలని ఆశిద్దాం. హామిల్టన్: న్యూజిలాండ్ గడ్డపై శుక్రవారం తొలి టి 20 విజయాన్ని అందుకున్న టీమిండియా... అదే ఊపులో మొదటిసారి సిరీస్‌ను చేజిక్కించుకునేందుకు సిద్ధమవుతోంది. రెండు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ జరుగబోయే చివరి మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుని ఆ దేశ పర్యటనను ఘనంగా ముగించాలని భావిస్తోంది. ఈ క్రమంలో గత మ్యాచ్‌లో గెలుపును అందించిన జట్టునే బరిలో దించనుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కోల్పోయిన నేపథ్యంలో, పొట్టి ఫార్మాట్ సిరీస్‌ను చేజార్చుకోకూడదని భావిస్తున్న కివీస్... కుగ్లీన్, ఫెర్గూసన్‌ల స్థానంలో నీషమ్, టిక్నెర్లను ఆడించనుంది. ఈసారి అలా బోల్తా పడొద్దు... నాలుగో వన్డేలో పేసర్ ట్రెంట్ బౌల్ట్ ధాటికి 92 పరుగులకే ఆలౌటైన హామిల్టన్‌లోనే చివరి టి20 జరుగనుంది. నేటి మ్యాచ్‌లో బౌల్ట్ లేనప్పటికీ ఆ అనుభవంతో భారత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు తొలి టి20లో తడబడినప్పటికీ తప్పులను దిద్దుకున్న మన జట్టు... ఆక్లాండ్‌లో సమష్టిగా రాణించింది. బ్యాటింగ్‌లో రోహిత్, పంత్... బౌలింగ్‌లో పేసర్లు భువనేశ్వర్, ఖలీల్, ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా మెరిశారు. కీలకమైన చివరి మ్యాచ్‌లో హార్దిక్, చహల్ కూడా ప్రభావం చూపితే కివీస్‌కు ఇబ్బందులు తప్పవు. చహల్ స్థానంలో కుల్దీప్ను తీసుకోవచ్చని భావిస్తున్నా... కృనాల్ రూపంలో ఎడంచేతి వాటం స్పిన్నర్ ఉన్నందున ఆ అవకాశం కనిపించట్లేదు. ఓపెనర్లు రోహిత్, ధావన్‌లలో ఒక్కరు నిలదొక్కుకున్నా భారీ స్కోరుకు బాటలు పడతాయి. ధావన్ ప్రారంభాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ఐదు మ్యాచ్‌లుగా అతడి నుంచి అర్ధ సెంచరీ నమోదు కాలేదు. భారీ స్కోర్లకు అవకాశం ఉన్న పిచ్‌పై వీరు బలమైన పునాది వేస్తే పంత్, ధోని, కార్తీక్ చెలరేగేందుకు వీలుంటుంది. ఆ ఇద్దరిని తప్పించి... ఆతిథ్య న్యూజిలాండ్‌కు తమ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్ లేమి ఆందోళనగా మారింది. మున్ముందు కీలక టోర్నీల దృష్ట్యా విలియమ్సన్ గాడినపడటం వారికి అత్యవసరం. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ సీఫెర్ట్, రెండో దాంట్లో గ్రాండ్‌హోమ్ దూకుడుతో ఆ జట్టుకు కీలకంగా నిలిచారు. ఈ మైదానంలో గతేడాది ఇంగ్లండ్‌పై ఓపెనర్ కొలిన్ మున్రో 18 బంతుల్లోనే అర్ధశతకం బాదాడు. మిడిలార్డర్లో టేలర్ నిలకడగా ఆడుతున్నాడు. అయితే, అతడి నుంచి జట్టు ఇంకా భారీ స్కోరు ఆశిస్తోంది. ప్రభావం చూపలేకపోతున్న ఆల్ రౌండర్ కుగ్లీన్, పేసర్ ఫెర్గూసన్‌లను తప్పించి... పిచ్ పరిస్థితుల రీత్యా నీషమ్ వైపు మొగ్గుచూపింది. ధాటిగా ఆడగల అతడు మీడియం పేసర్‌గా బౌలింగ్‌లోనూ పనికొస్తాడు. టిమ్ సౌతీతో కలిసి టిక్నెర్ పేస్ బాధ్యతలు పంచుకుంటాడు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, పంత్, విజయ్ శంకర్, ధోని, హార్దిక్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, ఖలీల్, చహల్. న్యూజిలాండ్: సీఫెర్ట్, మున్రో, విలియమ్సన్, రాస్ టేలర్, మిషెల్, నీషమ్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, సౌతీ, సోధి, టిక్నెర్. పిచ్, వాతావరణం బౌండరీ సరిహద్దులు కొంచెం పెద్దవైనా... వేగవంతమైన ఔట్ ఫీల్డ్‌కు తోడు పిచ్ బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలం. సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్–ఇంగ్లండ్ మధ్య ఇక్కడ జరిగిన టి20లో ఇరు జట్లు 386 పరుగులు చేశాయి. ఈసారి కూడా పరుగుల వరద ఖాయం. -
టీమిండియా గెలిచి నిలిచేనా?
ఆక్లాండ్: న్యూజిలాండ్‌తో తొలి టీ20లో ఘోర పరాభవాన్ని చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు రెండో టీ20 పోరుకు సిద్ధమైంది. న్యూజిలాండ్ గడ్డపై తొలి టీ20 సిరీస్ సాధించాలనే లక్ష్యంతో పోరుకు సమాయత్తమైన భారత్ జట్టుకు శుభారంభం లభించలేదు. తొలి మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలై సిరీస్‌లో వెనుకబడింది. ఇది మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కావడంతో టీమిండియా బరిలో ఉండాలంటే కచ్చితంగా రెండో మ్యాచ్‌లో గెలవాల్సిన పరిస్థితి. రేపు(శుక్రవారం) భారతకాలమాన ప్రకారం ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఉదయం గం.11.30ని.లకు ఆరంభం కానుంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా జరుగనున్న రేపటి మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపుపై దృష్టి సారించాయి. ఒకవైపు సిరీస్‌ను ఇక్కడ కొట్టేయాలనే కసితో కివీస్ సిద్ధమవుతుండగా, మ్యాచ్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోకూడదనే భారత్ భావిస్తోంది. మార్పులు తప్పవా? తొలి టీ20లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌తో భారత్ పోరుకు సిద్ధమైనప్పటికీ కనీసం పోరాడటంలో విఫలమైంది. కివీస్ సాధించిన స్కోరును చూసి భయపడ్డారో లేక బ్యాటింగ్ విభాగం బలంగా ఉందని ఎవరికి వారే భావించారో కానీ ఓవరాల్‌గా చేతులెత్తేశారు భారత క్రికెటర్లు. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు కూడా. తుది 11మందిలో 8మంది బ్యాట్స్‌మెన్ ఉండటాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. ఈ బ్యాటింగ్ లైనప్‌తో కొండంత లక్ష్యాన్నికూడా సునాయాసంగా ఛేదించవచ్చు అనుకుంటే మొత్తంగా విఫలం కావడంపై రోహిత్ ఆందోళన వ్యక్తం చేశాడు. దాంతో రెండో టీ20కి భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఖలీల్ అహ్మద్, కృనాల్ పాండ్యాలను తప్పించే అవకాశాలు కనబడుతున్నాయి. వీరి స్థానాల్లో చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, సిద్దార్థ్ కౌల్‌ను టీమిండియా మరొకసారి పరీక్షించనుంది. ఈ ముగ్గురిలో సిద్ధార్థ్ కౌల్, కుల్దీప్ యాదవ్‌లు తుది జట్టులో ఆడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సీఫెర్ట్‌కు వ్యూహ రచన చేశారా? కివీస్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ ఈ సిరీస్‌కు దూరం కావడంతో తుది జట్టులో చోటు దక్కించుకున్న టీమ్ సీఫెర్ట్.. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. 43 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 84 పరుగులు చేసి కివీస్ భారీ స్కోరు బాటలు వేశాడు. ఈ తరుణంలో రేపటి మ్యాచ్‌కు సీఫ్టెర్ట్‌ను తొందరగా పెవిలియన్‌కు పంపించకపోతే భారత్ మరొకసారి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కాగా, ఈ సిరీస్‌లో మ్యాచ్‌కు మ్యాచ్‌కు మధ్య సమయం తక్కువగా ఉండటంతో కివీస్ బ్యాటింగ్ ఆర్డర్‌పై భారత్ ఎంతవరకూ కసరత్తు చేసిందనేది ప్రధానమైన ప్రశ్న. ఒకవైపు ఒత్తిడిలో భారత్ మ్యాచ్‌కు సిద్ధమవుతుండగా, ఫుల్ జోష్‌తో కివీస్ బరిలోకి దిగుతుంది. మరి టీమిండియా గెలిచి సిరీస్‌పై ఆశలు నిలుపుకుంటుందా.. లేక ముందుగానే కివీస్‌కు సిరీస్‌ను సమర్పించుకుంటుందో చూడాలి. తుది జట్లు(అంచనా) భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధావన్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, భువనేశ్వర్ కుమార్, చహల్, కుల్దీప్ యాదవ్, సిద్దార్థ్ కౌల్ న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్(కెప్టెన్), టీమ్ సీఫెర్ట్, కొలిన్ మున్రో, డార్లీ మిచెల్, రాస్ టేలర్, గ్రాండ్‌హోమ్, సాన్‌ట్నర్, స్కాట్ కుగ్లేన్,టిమ్ సౌథీ, ఇష్ సోధీ, ఫెర్గూసన్ -
కలసికట్టుగా కొట్టేశారు
అదే జోరు... అదే ఊపు! న్యూజిలాండ్‌పై వరుసగా రెండో విజయం అందుకునే క్రమంలో టీమిండియా ఎక్కడా పట్టు విడవలేదు. క్రీజులోకి దిగిన ఒక్కొక్క బ్యాట్స్‌మెన్ తమవంతుగా పరుగులు జోడిస్తే... బంతినందుకున్న బౌలర్లు బాధ్యతగా వరుసగా వికెట్లు పడగొట్టారు. ఫలితంగా ప్రత్యర్థిని కుదేలు చేస్తూ... కోహ్లి సేన సునాయాసంగా గెలిచేసింది. అన్ని రంగాల్లో భారత్ విజృంభణతో... కివీస్ తేలిపోయి చేతులెత్తేసింది. మౌంట్ మాంగనీ: బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించి అందించిన ఆత్మవిశ్వాసంతో చెలరేగిన టీమిండియా బౌలర్లు న్యూజిలాండ్ పని పట్టారు. ఓపెనర్ల అద్భుత భాగస్వామ్యం, మిడిలార్డర్ సమయోచిత ఆట, బౌలర్ల విజృంభణతో ప్రత్యర్థికి ఏమాత్రం అవ కాశం ఇవ్వకుండా ఆడిన కోహ్లి సేన... ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండు జట్ల మధ్య శనివారం ఇక్కడ జరిగిన వన్డేలో తొలుత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (96 బంతుల్లో 87; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు); శిఖర్ ధావన్ (67 బంతుల్లో 66; 9 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించి శుభారంభం ఇవ్వగా, కెప్టెన్ విరాట్ కోహ్లి (45 బంతుల్లో 43; 5 ఫోర్లు), అంబటి రాయుడు (49 బంతుల్లో 47; 3 ఫోర్లు, 1 సిక్స్), ఎంఎస్ ధోని (33 బంతుల్లో 48 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), కేదార్ జాదవ్ (10 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) భారీ స్కోరుకు తోడ్పడ్డారు. ఛేదనలో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్ (4/45), యజువేంద్ర చహల్ (2/52), పేసర్ భువనేశ్వర్ కుమార్ (2/42) దెబ్బకు కివీస్ 40.2 ఓవర్లలో 234 పరుగులకే ఆలౌటైంది. లోయరార్డర్ బ్యాట్స్‌మన్ డగ్లస్ బ్రాస్‌వెల్ (46 బంతుల్లో 57; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) చేసిన పరుగులే ఆ జట్టు ఇన్నింగ్స్‌లో అత్యధికం. దీంతో భారత్ 90 పరుగులతో గెలుపొందింది. మూడో వన్డే సోమవారం మౌంట్ మాంగనీలోనే జరుగనుంది. రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. అందరూ ఆడారు పిచ్‌పై ఉన్న అంచనాలతో టాస్ గెలిచిన కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇన్నింగ్స్ ప్రారంభ ఓవర్లోనే రోహిత్ రెండు గండాల నుంచి బయటపడ్డాడు. అటు ధావన్‌కు కూడా బంతి రెండుసార్లు ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఇవి మినహా వీరిద్దరూ సాధికారికంగా ఆడారు. పోటాపోటీగా అర్ధ సెంచరీల వైపు కదిలారు. ఈ క్రమంలో ఫెర్గూసన్ ఓవర్లో బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్స్ కొట్టి రోహిత్ హాఫ్ సెంచరీ (62 బంతుల్లో) అందుకున్నాడు. ఓపెనింగ్ భాగస్వామ్యామూ 100 దాటింది. కాసేపటికే ధావన్ సైతం అర్ధశతకం (53 బంతుల్లో) చేరుకున్నాడు. అయితే, వికెట్లకు దూరంగా వెళ్తున్న బౌల్ట్ బంతిని ఆడబోయి అతడు వెనుదిరిగాడు. దీంతో 154 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది. సెంచరీ చేయడం ఖాయంగా కనిపించిన రోహిత్... పుల్ షాట్‌కు యత్నించి డీప్‌స్క్వేర్ లెగ్‌లో గ్రాండ్‌హోమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. కోహ్లి, రాయుడు మరీ దూకుడుకు పోకుండా పరిస్థితులకు తగ్గట్లు ఇన్నింగ్స్‌ను నడిపించారు. కోహ్లి వెనుదిరిగాక... ధోని, రాయుడు బాధ్యత తీసుకున్నారు. అర్ధసెంచరీ ముంగిట రాయుడు ఔటయ్యాడు. ధోని, జాదవ్ తాము ఎదుర్కొన్న 26 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టు స్కోరును 300 దాటించారు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో 21 పరుగులు రావడం విశేషం. బౌలర్లు పడగొట్టారు భారత ఇన్నింగ్స్‌లో రోహిత్‌లా కివీస్ ఇన్నింగ్స్‌లో తొలి బంతికే గప్టిల్ (15)కు లైఫ్ దక్కింది. రనౌట్ ప్రమాదంతో పాటు స్లిప్‌లో రోహిత్ క్యాచ్ వదిలేయడంతో బయటపడిన అతడు ఎంతోసేపు నిలవలేదు. భువీ షార్ట్ బంతిని థర్డ్‌మ్యాన్ దిశగా ఆడి బౌండరీ వద్ద చహల్‌కు క్యాచ్ ఇచ్చాడు. షమీ ఓవర్లో రెండు వరుస సిక్స్‌లు, ఫోర్ సహా నాలుగు బంతుల్లో 18 పరుగులు రాబట్టిన కెప్టెన్ విలియమ్సన్ (20)... మరుసటి బంతినే వికెట్ల మీదకు ఆడుకుని బౌల్డయ్యాడు. మున్రో (31) వికెట్ల ఎదుట చహల్‌కు దొరికిపోయాడు. జాదవ్ ఓవర్లో ధోని మెరుపు స్టంపింగ్ రాస్ టేలర్ (22) ఆట కట్టించింది. జట్టును కొంత దూరం లాక్కొచ్చిన లాథమ్ (34)ను కుల్దీప్ ఎల్బీ చేశాడు. గ్రాండ్‌హోమ్ (3), నికోల్స్ (28), సోధి (0)... కుల్దీప్ మాయలో పడిపోవడంతో కివీస్ 166/8తో నిలిచింది. ఈ దశలో లోయరార్డర్ బ్యాట్స్‌మన్ బ్రాస్‌వెల్ బ్యాట్ ఝళిపించాడు. 35 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. అతడిని భువీ, ఫెర్గూసన్ (12)ను చహల్ ఔట్ చేయడంతో ఆతిథ్య జట్టు ఆట ముగిసింది. -
కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన రోహిత్
లక్నో: పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన మార్కుతో దూసుకుపోతున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మరో రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. విరాట్ కోహ్లి పేరిట ఉన్న రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. వెస్టిండీస్ జరుగుతున్న రెండో టీ20లో కోహ్లి(2,102)ని రోహిత్ అధిగమించాడు. ఈ సిరీస్‌లో విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో రోహిత్ శర్మ జట్టు భారత క్రికెట్ జట్టు పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తొలి వన్డేలో గెలిచిన రోహిత్ బృందం.. రెండో టీ20లో సైతం గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గప్తిల్ 2,271 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా. రోహిత్ శర్మ(2,203) రెండో స్థానంలో ఉన్నాడు. పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 2,171 పరుగులతో మూడో స్థానంలో, న్యూజిలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్ మెకల్లమ్ 2,140 పరుగులతో నాలుగో స్థానంలో ఉండగా, కోహ్లి ఐదో స్థానంలో ఉన్నాడు. -
సమమా? సిరీసా?
టి20లు అంటేనే మెరుపు షాట్లు... భారీ స్కోర్లు! కానీ, కోల్‌కతాలో ఆదివారం తొలి మ్యాచ్ ఇలాంటి మెరుపులేమీ లేకుండానే సాగింది. వెస్టిండీస్ ఆట ఇంతేనని సరిపెట్టుకుంటే, టీమిండియా సైతం కొంత కష్టంగానే లక్ష్యాన్ని ఛేదించింది. జట్ల బలాబలాలు ఎలా ఉన్నా, పిచ్ గురించి వస్తున్న విశ్లేషణలను చూస్తే లక్నోలో జరుగనున్న రెండో మ్యాచ్ కూడా మొదటిదానికి భిన్నంగా ఉండేట్లు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో తెలివిగా ఆడిన జట్టుదే విజయం అనడంలో సందేహం లేదు. మరి... మరో గెలుపుతో రోహిత్ బృందం సిరీస్‌ను ఇక్కడే కైవసం చేసుకుంటుందా? పర్యాటక జట్టు పుంజుకుని పోటీ ఇస్తుందా? లక్నో: టెస్టు, వన్డే సిరీస్‌ల తరహాలోనే టి20 సిరీస్‌నూ ఒడిసి పట్టేందుకు మరో విజయం దూరంలో టీమిండియా. వెస్టిండీస్‌తో మంగళవారం లక్నోలో కొత్తగా నిర్మించిన ‘భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయి అంతర్జాతీయ స్టేడియం’లో రెండో మ్యాచ్. రోహిత్ సేనకు అటు సిరీస్‌తో పాటు పొట్టి ఫార్మాట్ ప్రపంచ చాంపియన్‌పై విజయాల రికార్డు మెరుగుపర్చుకునే అవకాశం. అయితే, అప్పటివరకు ఎలా ఆడినా, ఉప్పెనలా విరుచుకుపడి క్షణాల్లో ఫలితం మార్చేసే కరీబియన్లకు ఏమేరకు ముకుతాడు వేస్తారనే దానిపైనే ఇది ఆధారపడి ఉంది. మరోవైపు పిచ్ నెమ్మదిగా ఉంటుందనే అంచనాల రీత్యా అభిమానులకు ఉర్రూతలూగించే క్రికెట్ విందు లేనట్లే. భారత్... భువీతో! బంతి ఆగిఆగి బ్యాట్‌పైకి రావడంతో కోల్‌కతాలో టీమిండియాకు ఛేదన ఏమంత సులువు కాలేదు. ప్రధాన బ్యాట్స్‌మెన్ విఫలమైనా, లోతైన బ్యాటింగ్ లైనప్‌తో భారత్ పెద్దగా కంగారు పడాల్సిన పని లేకపోయింది. వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు అరంగేట్ర ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా అండగా నిలిచి లాంఛనాన్ని ముగించాడు. అయితే, ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంతవరకు సరైన ఇన్నింగ్స్ ఆడకపోవడం జట్టుకు కొంత ఇబ్బందిగా ఉంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగితే కెప్టెన్ రోహిత్‌తో పాటు కేఎల్ రాహుల్, మనీశ్ పాండే సాధ్యమైనన్ని పరుగులు అందించాల్సి ఉంటుంది. రిషభ్ పంత్ మరోసారి స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌గానే వచ్చే వీలుంది. దినేశ్ కార్తీక్, కృనాల్ ఆఖర్లో చెలరేగితే ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని విధించవచ్చు. ఛేదన అయినా ఇదే తీరులో ఆడాల్సి ఉంటుంది. ఇక ఈ మ్యాచ్‌కు భారత్ బౌలింగ్‌లో ఒక మార్పుతో బరిలో దిగే అవకాశం ఉంది. పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంలో భువనేశ్వర్ జట్టులోకి వస్తాడు. బుమ్రా, ఖలీల్ అహ్మద్ అతడితో పాటు బంతిని పంచుకుంటారు. స్పిన్ బాధ్యతలు కుల్దీప్, కృనాల్ తీసుకుంటారు. విండీస్... పోరాడితే ప్రత్యర్థి ప్రతిభ కంటే మ్యాచ్, పిచ్ పరిస్థితులను పట్టించుకోకుండా ఆడటమే కోల్‌కతాలో వెస్టిండీస్ పరాజయానికి ప్రధాన కారణమైంది. బ్యాట్స్‌మెన్ సహజ శైలిలో షాట్లకు దిగి వికెట్లు పారేసుకోవడంతో మోస్తరు లక్ష్యాన్నీ నిర్దేశించలేకపోయింది. ఫామ్‌లో ఉన్న షై హోప్ అనవసర రనౌట్ మరింత దెబ్బతీసింది. బౌలింగ్‌లోనే జట్టు ప్రతిఘటన చూపగలిగింది. కెప్టెన్ బ్రాత్‌వైట్, పియర్ పొదుపైన బౌలింగ్‌కు తోడు పేసర్ థామస్ మెరుపు స్పెల్ ఆశలు రేపినా అది విజయానికి సరిపోలేదు. హెట్‌మైర్, పొలార్డ్, బ్రావో తలో చేయి వేసి... ఆఖర్లో బ్రాత్‌వైట్ బ్యాట్ ఝళిపిస్తే భారత్‌కు సవాల్ విసిరే స్కోరు చేయగలదు. ఏదేమైనా బ్యాట్స్‌మెన్ కాస్త ఓపికగా ఆడి భారీగా పరుగులు సాధిస్తేనే విండీస్ విజయం అందుకోగలదు. తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, కేఎల్ రాహుల్, పాండే, పంత్, దినేశ్ కార్తీక్, కృనాల్, భువనేశ్వర్, కుల్దీప్, బుమ్రా, ఖలీల్. వెస్టిండీస్: బ్రాత్‌వైట్ (కెప్టెన్), హోప్, రామ్‌దిన్, హెట్‌మైర్, బ్రావో, పొలార్డ్, రావ్మన్ పావెల్, అలెన్, కీమో పాల్, పియర్, థామస్. పిచ్, వాతావరణం కొత్తగా నిర్మించిన ఈ మైదానంలో పిచ్ చాలా నెమ్మదిగా ఉంది.వర్ష సూచనలు లేవు. రాత్రి వేళ మంచు కురుస్తుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్‌కే మొగ్గు చూపొచ్చు. రాత్రి గం.7 నుంచి స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం -
పాక్‌పై భారత్ ఘనవిజయం
-
తొలి దెబ్బ మనదే
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పరాభవానికి ఏడాది తర్వాత భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ప్రత్యర్థికి సొంత మైదానంలాంటి ఎడారి గడ్డలో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏకపక్ష విజయం సాధించింది. ముందుగా చక్కటి బౌలింగ్‌తో పాకిస్తాన్‌ను స్వల్ప స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా, ఆ తర్వాత అలవోక బ్యాటింగ్‌తో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది. ఆసియా కప్‌లో దాయాదుల మధ్య జరిగిన తొలి పోరులో రోహిత్ సేనకే విజయం దక్కింది. ఇది ఇక్కడితో ముగిసిపోలేదు. వచ్చే ఆదివారం సూపర్–4 దశలో రెండు జట్లు మరోసారి పోరుకు ‘సై’ అంటున్నాయి. సంచలనాలు లేకపోతే ఫైనల్లో కూడా మళ్లీ తలపడే అవకాశం ఉండటంతో ద్వైపాక్షికం కాని మూడు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో ప్రస్తుతానికి పాక్‌పై భారత్‌దే 1–0తో పైచేయి అయింది. దుబాయ్: ఆసియా కప్ తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తడబడిన భారత్ తర్వాతి రోజే అసలు సమరంలో తమ పూర్తి సత్తాను ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో టీమిండియా సునాయాస విజయం సాధించింది. బుధవారం ఇక్కడ జరిగిన పోరులో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తుగా ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది. బాబర్ ఆజమ్ (62 బంతుల్లో 47; 6 ఫోర్లు), షోయబ్ మాలిక్ (67 బంతుల్లో 43; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ (3/13), కేదార్ జాదవ్ (3/23) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. అనంతరం భారత్ 29 ఓవర్లలో 2 వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ రోహిత్ శర్మ (39 బంతుల్లో 52; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించగా, శిఖర్ ధావన్ (54 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. నేడు జరిగే గ్రూప్ ‘బి’ చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో అఫ్గానిస్తాన్ తలపడుతుంది. కీలక భాగస్వామ్యం... హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరాశాజనక ప్రదర్శన కనబర్చిన భువనేశ్వర్ ఈసారి భారత్‌కు అదిరే ఆరంభాన్ని అందించాడు. పాక్ ఓపెనర్లను వరుస ఓవర్లలో అతను పెవిలియన్ పంపించాడు. ఇమామ్ (2), ఫఖర్ జమాన్ (0) ఒత్తిడికి లోనై వికెట్లు సమర్పించుకున్నారు. బుమ్రా తన తొలి రెండు ఓవర్లను మెయిడిన్లుగా ముగించడం విశేషం. ఈ దశలో ఆజమ్, మాలిక్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. పవర్‌ప్లే ముగిసేసరికి పాకిస్తాన్ 25 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత ఫీల్డర్ల వైఫల్యాలు వీరికి కలిసొచ్చాయి. పాండ్యా బౌలింగ్‌లో 26 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మాలిక్ ఇచ్చిన క్యాచ్‌ను ధోని... 37 వద్ద భువనేశ్వర్ వదిలేశారు. జాదవ్ జాదూ... ఎట్టకేలకు కుల్దీప్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అతను వేసిన చక్కటి బంతికి ఆజమ్ క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ఆజమ్, మాలిక్ మూడో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. దీని తర్వాత పాక్ పతనం మొదలైంది. జాదవ్ బంతికి భారీ షాట్ ఆడబోయిన సర్ఫరాజ్ (6)ను అద్భుత క్యాచ్‌తో మనీశ్ పాండే వెనక్కి పంపగా... లేని సింగిల్ కోసం ప్రయత్నించిన మాలిక్‌ను రాయుడు డైరెక్ట్ త్రోతో రనౌట్ చేశాడు. ఆసిఫ్ (9), షాదాబ్ (8) వికెట్లు కూడా జాదవ్ ఖాతాలోకే వెళ్లాయి. చివర్లో అష్రఫ్ (21), ఆమిర్ (18 నాటౌట్) పోరాటంతో ఈ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది. 77 పరుగుల వ్యవధిలో పాక్ చివరి 8 వికెట్లు పడ్డాయి. నిలకడగా... లక్ష్య ఛేదనలో భారత్‌కు శుభారంభం లభించింది. కుదురుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత రోహిత్, ధావన్ బ్యాట్ ఝళిపించారు. ఆమిర్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రోహిత్, ఉస్మాన్ వేసిన తర్వాతి ఓవర్లో మరో ఫోర్, సిక్స్ బాదాడు. మరోవైపు ధావన్ కూడా చకచకా పరుగులు సాధించాడు. హసన్ ఓవర్లో మరో భారీ సిక్సర్ కొట్టిన రోహిత్, అదే ఓవర్లో ఫోర్‌తో 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే షాదాబ్... రోహిత్‌ను క్లీన్ బౌల్డ్ చేయడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే ధావన్ కూడా వెనుదిరిగాడు. అయితే అంబటి రాయుడు (31 నాటౌట్; 3 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (31 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు. షేక్ కోసం ప్రసారం ఆపేసి... ఏదైనా మ్యాచ్ మధ్యలో టోర్నీతో సంబంధం ఉన్న ప్రముఖులతో మాట్లాడించడం తరచుగా జరిగేదే. కానీ బుధవారం స్టార్ అన్ని హద్దులు దాటేసింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చైర్మన్ షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ సందేశం వినిపించడం కోసం మ్యాచ్ ప్రసారాన్నే ఆపేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ సందర్భంగా బుమ్రా వేసిన 8వ ఓవర్ ప్రసారం కాలేదు. పాండ్యాకు గాయం... 18వ ఓవర్లో ఐదో బంతిని వేస్తున్న సమయంలో హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా ముందుకు పడిపోయాడు. తీవ్రమైన వేడికి, కండరాలు పట్టేయడం వల్ల అతను ఇబ్బంది పడ్డాడని ముందుగా అనుకున్నారు. అతడిని స్ట్రెచర్‌పై మైదానం బయటకు తీసుకెళ్లాల్సి వచ్చింది. బీసీసీఐ ఆ తర్వాత అధికారిక వివరణ ఇచ్చింది. పాండ్యా వెన్నునొప్పితో బాధ పడుతున్నట్లు వెల్లడించింది. నడవగలిగే స్థితిలో ఉన్నాడని, అతని గాయాన్ని వైద్యులు పర్యవేక్షిస్తున్నారని చెప్పింది. భారత్ ఇన్నింగ్స్‌లో పాండ్యాకు బ్యాటింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. మనీశ్ పాండే సూపర్ క్యాచ్... భారత జట్టులో ఫీల్డింగ్ ప్రమాణాలపరంగా చూస్తే మనీశ్ పాండే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు. బుధవారం అతను దానిని మళ్లీ నిరూపించాడు. పాండ్యా గాయం కారణంగా పెవిలియన్ చేరగా... అతని స్థానంలో మనీశ్ సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డింగ్‌కు వచ్చాడు. జాదవ్ బౌలింగ్‌లో సర్ఫరాజ్ ఇచ్చిన క్యాచ్‌ను వైడ్ లాంగాన్ బౌండరీ వద్ద అతను అద్భుతంగా అందుకున్నాడు. బంతిని అందుకునేందుకు ముందుగా తన కుడి వైపు చాలా దూరం పరుగెత్తిన పాండే అదే ఊపులో క్యాచ్ పట్టేశాడు. అయితే తనను తాను నియంత్రించుకోవడం కష్టం కావడంతో బంతిని గాల్లోకి విసిరి బౌండరీ బయటకు వెళ్లిపోయాడు. మళ్లీ లోపలికి వచ్చి అతను క్యాచ్‌ను పూర్తి చేశాడు. ఐపీఎల్లో ఈ తరహా క్యాచ్‌లు చాలా కనిపించినా అంతర్జాతీయ మ్యాచ్‌లలో అరుదనే చెప్పవచ్చు. పాక్‌పై భారత్ మరో 126 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఇన్నింగ్స్‌లో మిగిలిన బంతులపరంగా చూస్తే పాక్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద గెలుపు. -
నేడు వార్మప్..రేపు అసలు పోరు!
ఎడారి దేశంలో పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 45 డిగ్రీల వరకు చేరుతున్నాయి. వేడితో ఆటగాళ్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇటీవలే ఇంగ్లండ్‌లో సుదీర్ఘ పర్యటన అనంతరం తిరిగొచ్చిన కొందరు ఈ ఎండలకు ఇంకా అలవాటు పడే ప్రయత్నంలోనే ఉన్నారు. ఇలాంటి స్థితిలో భారత జట్టు గతంలో ఎన్నడూ లేని రీతిలో వరుసగా రెండు రోజులు అంతర్జాతీయ వన్డేలు ఆడాల్సి వస్తోంది. ఆసియా కప్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్‌లో హాంకాంగ్‌తో తలపడనున్న టీమిండియా, రేపు రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో పసికూన హాంకాంగ్‌తో పోరుకు కొందరు ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి పాక్‌తో మ్యాచ్‌కు సిద్ధమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుబాయ్: భారత్, హాంకాంగ్ పదేళ్ల క్రితం ఇదే ఆసియా టోర్నీలో ఒకే ఒకసారి తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో భారత్ ఏకంగా 256 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇప్పుడు మరోసారి ఈ రెండు జట్లు ముఖాముఖికి సిద్ధమయ్యాయి. బలా బలాలను చూస్తే ప్రత్యర్థికంటే అందనంత ఎత్తులో ఉన్న భారత్‌కు విజయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురు కాకపోవచ్చు. సరిగ్గా చెప్పాలంటే బుధవారం పాకిస్తాన్‌తో తలపడాల్సి ఉన్న రోహిత్ సేనకు... హాంకాంగ్‌తో మ్యాచ్ వార్మప్గానే ఉపకరిస్తుంది. ఈ పోరులో టీమిండియా తుది జట్టు కూర్పు ఎలా ఉండబోతుందనేదే ప్రధానాంశం. మిడిలార్డర్ ఖాయం చేసేందుకు... వచ్చే వరల్డ్ కప్‌కు ముందు భారత్‌కు తుది జట్టు విషయంలో ఇంకా స్పష్టత రాని అంశం మిడిలార్డర్ గురించే. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న కెప్టెన్ రోహిత్ శర్మ ‘4, 6 స్థానాల కోసం జట్టులో గట్టి పోటీ ఉంది. తమ చోటు ఖాయం చేసుకునే ప్రయత్నంలో ఉన్న అందరూ ప్రతిభావంతులే. ఆయా స్థానాల గురించి ఈ టోర్నీ తర్వాత మరింత స్పష్టత వస్తుంది’ అని చెప్పాడు. అంటే ఐదో స్థానంలో ధోని ఆడటం ఖాయమైపోయింది. ఆల్‌రౌండర్‌గా ఏడో స్థానంలో హార్దిక్ పాండ్యా ఉంటాడు. మూడో స్థానంలో ఈ టోర్నీ వరకు ఎవరైనా ఆడినా అది కోహ్లి స్థానం మాత్రమే. మిడిలార్డర్ కోసం ఇప్పుడు రాహుల్, కార్తీక్, జాదవ్, రాయుడు, మనీశ్ పాండే పోటీ పడుతున్నారు. గాయంతో జాదవ్, అనూహ్య రీతిలో రాయుడు ఇంగ్లండ్ టూర్‌కు దూరం కాగా... తాజాగా దేశవాళీ వన్డే ఫామ్‌తో పాండే కూడా నేనున్నానంటూ సిద్ధమయ్యాడు. జాదవ్ పార్ట్‌టైమ్ స్పిన్ అతనికి అదనపు బలం కానుంది. ఈ నేపథ్యంలో హాంకాంగ్‌తో పోరులో ఎవరు జట్టులోకి వస్తారో చూడాలి. మరో వైపు పాక్‌తో మ్యాచ్‌కు ముందు బుమ్రాకు విశ్రాంతినివ్వాలని భావిస్తే కొత్త కుర్రాడు ఖలీల్ అహ్మద్ అరంగేట్రం చేసే అవకాశం ఉంది. రోహిత్ పరోక్షంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. భువనేశ్వర్ ఈ మ్యాచ్‌తో పునరాగమనం చేస్తున్నాడు. స్పిన్‌లో చహల్, కుల్దీప్లకు తోడుగా అక్షర్‌కు చాన్స్ దక్కవచ్చు. మరోవైపు తొలి మ్యాచ్‌లో పాక్ చేతిలో చిత్తుగా ఓడిన హాంకాంగ్ ఇక్కడైనా కాస్త పోటీ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. భారత్‌లాంటి జట్టుపై సంచలన విజయానికి దాదాపుగా ఆస్కారం లేకపోయినా కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలు ఆ జట్టులో ఆత్మవిశ్వాసం పెంచవచ్చు. పాకిస్తాన్, హాంకాంగ్ మధ్య మ్యాచ్ జరిగిన పిచ్‌పైనే ఈ మ్యాచ్ కూడా నిర్వహిస్తున్నారు. పొడిగా ఉండే వికెట్‌పై స్పిన్నర్లు ప్రభావం చూపించగలరు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ►సాయంత్రం 5 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–1 లో ప్రత్యక్ష ప్రసారం -
రోహిత్, ధోనిలపైనే భారత్ ఆశలు
గత కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్‌లు వెల్లువెత్తడంతో క్రికెట్ అభిమానుల దృష్టిలో ఆసియా కప్ తన ప్రాభవం కోల్పోయింది. అయితే ఆసియా ఖండంలో అగ్ర జట్టుగా గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉండటంతో ఆటగాళ్లు ఇప్పటికీ ఈ టోర్నీని గెలుచుకోవడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. యువకులతో నిండిన భారత జట్టుకు సారథ్యం వహించి షార్జాలో జరిగిన తొలి ఆసియా కప్‌ను గెలిపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈసారి షార్జాలో మ్యాచ్‌లు లేకపోయినా మళ్లీ యూఏఈలో టోర్నీ జరగడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు షార్జాలో బెనిఫిట్ మ్యాచ్ జరిగినా కూడా యూఏఈ దద్దరిల్లేది. అలాంటి చోట ఒక్క మ్యాచ్ కూడా లేకపోవడం ఆశ్చర్యకరం. ఆ విషయాన్ని పక్కన పెడితే వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌కు వార్మప్లాంటిది కాబట్టి ఈ టోర్నమెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఏ జట్టు ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే వారి సన్నాహాలు అంత మెరుగవుతాయి. వరల్డ్ కప్‌లోగా తమ లోపాలేమిటో తెలుసుకొని వాటిని సరిదిద్దుకునే అవకాశం లభిస్తుంది. ఇంగ్లండ్‌తో పోలిస్తే యూఏఈలో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుందనేది వాస్తవమే అయినా ఒక జట్టుగా తమ గురించి తెలుసుకునేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ఏ ఆటగాడు ఒత్తిడిని అధిగమించగలడో, జట్టును నడిపించగల సత్తా లేనివాళ్లు ఎవరో కూడా గుర్తించవచ్చు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేత పాకిస్తాన్ ఇక్కడ ఫేవరెట్‌గా కనిపిస్తోంది. అత్యంత ఆకర్షణ కలిగిన వారి మాజీ కెప్టెన్ ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్న నేపథ్యంలో అతనికి ఆసియా కప్‌ను కానుకగా ఇవ్వాలని వారు భావిస్తుండవచ్చు. చండిమాల్ దూరం కావడంతో లంక బలహీనంగా మారగా, షకీబ్ ఫిట్నెస్ సమస్యలతో బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. మరి భారత్ సంగతేమిటి? ఇంగ్లండ్‌లో అవమానకర రీతిలో ఓడిన తర్వాత జట్టులో ఎంతో బాధ దాగి ఉంది. అందువల్ల ఆసియా కప్‌ను గెలిచి తమ అభిమానులకు సాంత్వన కలిగించాలని వారు కోరుకుంటున్నారు. అయితే అది అంత సులువు కాదు. ప్రత్యర్థులకు భారత జట్టు లోపాలు, అనిశ్చితి గురించి బాగా తెలుసు కాబట్టి వాటిపైనే దాడి చేస్తారు. కెప్టెన్‌గా ముందుండి నడిపించాల్సిన అత్యుత్తమ వన్డే ఆటగాడు రోహిత్ శర్మపైనే జట్టు చాలా ఆధారపడుతోంది. రోహిత్‌కు అండగా నిలిచేందుకు, యూఈఏ ఎడారి ఎండల్లో కూడా సహనం కోల్పోకుండా చూసేందుకు ధోని కూడా ఉన్నాడు. తాజా సమస్యలను అధిగమించి పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకునేందుకు వీరిద్దరిదే ప్రధాన పాత్ర కానుంది. -
వారిద్దరూ టెస్టులకు సిద్ధం!
తొలి వన్డేలో భారత్ అద్భుత ప్రదర్శనను చూసిన తర్వాత రాబోయే రెండు వన్డేల్లో ఏం చేయాలనే దానిపై ఇంగ్లండ్ వ్యూహ బృందం తలలు బద్దలు కొట్టుకోవాల్సిందే. గత ఐదేళ్లలో 300 పరుగులకంటే ఎక్కువగా సగటు స్కోరు నమోదైన పిచ్‌పై ఇంగ్లండ్ 268కే పరిమితమైంది. అదీ భారత్‌కు చెందిన ఇద్దరు ప్రధాన పేసర్లు భువనేశ్వర్, బుమ్రా లేకుండా ఇది జరిగింది. అసలు మ్యాచ్ గెలవాలంటే ఎన్ని పరుగులు చేయాల్సి ఉంటుందోనని ఇంగ్లండ్ సుదీర్ఘంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. ఏమాత్రం చప్పుడు చేయని సూపర్ కార్ తరహాలో రోహిత్ శర్మ బ్యాటింగ్ కనిపిస్తుంది. అఫ్గానిస్తాన్‌తో టెస్టుకు అతడిని పక్కన పెట్టారు కానీ తన బ్యాటింగ్‌తో అతను మళ్లీ టెస్టుల్లోకి ఎంపికయ్యే విధంగా ఆడుతున్నాడు. ఇక కుల్దీప్ టెస్టుల్లో కూడా తనకు చోటు కల్పించవచ్చని తన ఆటతో నిరూపించాడు. భారత బ్యాటింగ్‌కంటే కూడా కుల్దీప్ స్పిన్‌ను ఎలా ఎదుర్కోవాలనేదే ఇంగ్లండ్‌కు పెద్ద సమస్యగా మారింది. పరిమిత ఓవర్ల మ్యాచ్‌లో 6 వికెట్లు పడగొట్టడం అంటే బ్యాటింగ్‌లో 150కి పైగా పరుగులు చేయడంతో సమానం. రోహిత్ రెండు సెంచరీలలాగే కుల్దీప్ రెండు సార్లు ఐదు వికెట్లు పడగొట్టడం టెస్టుల్లో అతనికి అవకాశం కల్పించవచ్చు. ప్రస్తుతం తీవ్రంగా ఎండ ఉంటోంది కాబట్టి స్పిన్‌కు బాగా అనుకూలిస్తోంది. భారత్‌ను ఎలా నిలువరించాలో ఇంగ్లండ్ తొందరగా కనిపెట్టకపోతే వన్డే సిరీస్ కూడా టి20 సిరీస్‌లాగే ముగియడం ఖాయం. -
కుల్దీప్ కోత.. రోహిత్ మోత : భారత్ ఘన విజయం
నాటింగ్‌హామ్: ఇంగ్లండ్ మరోసారి చైనామన్ కుల్దీప్ యాదవ్ (6/25) స్పిన్‌లో చిక్కుకుంది. మొదట పటిష్టస్థితిలో ఉన్న ఇంగ్లిష్ ఇన్నింగ్స్ ఆ తర్వాత కుల్దీప్ ‘మణికట్టు’ మాయలో పడింది. గురువారం జరిగిన తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 268 పరుగుల వద్ద ఆలౌటైంది. జోస్ బట్లర్ (51 బంతుల్లో 53; 5 ఫోర్లు), బెన్ స్టోక్స్ (103 బంతుల్లో 50; 2 ఫోర్లు) రాణించారు. ఉమేశ్ యాదవ్ 2, చహల్ ఒక వికెట్ తీశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 40.1 ఓవర్లలో 2 వికెట్లకు 269 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (114 బంతుల్లో 137 నాటౌట్; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) కెరీర్లో 18వ సెంచరీతో చెలరేగగా, విరాట్ కోహ్లి (82 బంతుల్లో 75; 7 ఫోర్లు) రాణించాడు. మరో 9.5 ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ గెలవడం విశేషం. కుల్దీప్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో వన్డే శనివారం జరుగుతుంది. 10–0–25–6... ఇది భారత స్పిన్నర్ కుల్దీప్ బౌలింగ్ ప్రదర్శన. అతడు వేసిన 60 బంతుల్లో 38 డాట్ బాల్సే. ఒక్కటంటే ఒక్కటి కూడా బౌండరీ లైన్‌ను దాటలేదు. అంతలా రెచ్చిపోయాడు ఈ చైనామన్ బౌలర్. మొదట టాపార్డర్‌ను, ఆ తర్వాత ఇన్నింగ్స్‌ను ఆదుకున్న మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌ను... ఇలా క్రీజులో ఎవరు వచ్చినా విడిచిపెట్టలేదు. 300 పైచిలుకు స్కోరు ఖాయమనుకున్న జట్టును 268 పరుగులకే కట్టడి చేశాడు. టాస్ నెగ్గిన కోహ్లి ఫీల్డింగ్‌కే మొగ్గుచూపాడు. దీంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన జేసన్ రాయ్ (35 బంతుల్లో 38; 6 ఫోర్లు), బెయిర్‌స్టో (35 బంతుల్లో 38; 5 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 73 పరుగులు జోడించారు. పేసర్లు ఉమేశ్, సిద్ధార్థ్ కౌల్లను చితకబాదిన ఓపెనర్లు కుల్దీప్ బౌలింగ్‌కు దిగగానే మోకరిల్లారు. తొలి ఓవర్లోనే రాయ్‌ని, రెండో ఓవర్లో జో రూట్ (3), బెయిర్‌స్టోలను ఔట్ చేశాడు. దీంతో జట్టు స్కోరు వంద దాటినప్పటికీ 4 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో బట్లర్, బెన్‌స్టోక్స్ జట్టును ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 93 పరుగులు జతచేశారు. ఆ తర్వాత మళ్లీ కుల్దీప్ మాయ మొదలైంది. వీరిద్దరితో పాటు విల్లీ (1)ని ఔట్ చేశాడు. చివర్లో మొయిన్ అలీ (24), ఆదిల్ రషీద్ (22) ఓ మోస్తరుగా రాణించడంతో ఇంగ్లండ్ 250 పరుగుల మార్కును దాటింది. రోహిత్ జోరు... బ్యాట్స్‌మెన్ ఫామ్ దృష్ట్యా ఏమంత కష్టం కానీ లక్ష్యాన్ని భారత్ సునాయాసంగానే ఛేదించింది. ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ ఇంగ్లిష్ బౌలింగ్‌ను ఈజీగా చితక్కొట్టాడు. ఈ టూర్లో రెండు వరుస మ్యాచ్‌ల్లో సెంచరీలు బాదేశాడు. చివరి టి20లోనూ శతక్కొట్టిన భారత ఓపెనర్ ఈ తొలి వన్డేలోనూ చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో ధావన్ (27 బంతుల్లో 40; 8 ఫోర్లు) ధాటి కొనసాగింది. అతను వేగంగా ఆడే పనిలో వెనుదిరగ్గా... తొలి వికెట్‌కు 59 పరుగులు జతయ్యాయి. తర్వాత కెప్టెన్ కోహ్లి క్రీజులోకి రాగా రోహిత్ ఆట మొదలైంది. ఇద్దరు చక్కని సమన్వయంతో బ్యాటింగ్ చేశారు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం అవకాశమివ్వకుండా పరుగులు జతచేశారు. దీంతో 15వ ఓవర్లో జట్టు స్కోరు వందకు చేరింది. ఇద్దరు అదును దొరికిన బంతిని బౌండరీకి తరలిస్తూ జట్టు రన్‌రేట్ పడిపోకుండా ఆడుకున్నారు. ఈ క్రమంలో మొదట రోహిత్ 54 బంతుల్లో (6 ఫోర్లు, 1 సిక్స్)... తర్వాత కోహ్లి 55 బంతుల్లో (5 ఫోర్లు) అర్ధసెంచరీల్ని పూర్తిచేసుకున్నారు. దీంతో 30 ఓవర్లకంటే ముందే 28.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 200 దాటింది. మొయిన్ అలీ, ఆదిల్ రషీద్‌ల బౌలింగ్‌లో సిక్స్‌లు కొట్టిన రోహిత్ 82 బంతుల్లో (12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేశాడు. రెండో వికెట్‌కు 167 పరుగులు జోడించాక, జట్టు స్కోరు 226 పరుగుల వద్ద విరాట్ కోహ్లి స్టంపౌటైనా రోహిత్ శర్మ లాంఛనాన్ని పూర్తిచేశాడు. -
భారత్ అదరహో...
ఇంగ్లండ్ గడ్డపై ఇండియా అదరగొట్టింది. లక్ష్యం ఎంతటిదైనా తమ ముందు దిగదుడుపే అని మరోసారి నిరూపించింది. బలమైన ఇంగ్లండ్ అంటూ వినిపించిన మాటలను తేలిగ్గా తీసిపారేసినట్లుగా చివరి టి20లో సునాయాస విజయంతో సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్న రోహిత్ శర్మ, అంతర్జాతీయ టి20ల్లో మూడో సెంచరీతో మెరిసిన వేళ టీమిండియా 199 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కోహ్లి సమయోచిత బ్యాటింగ్, పాండ్యా మెరుపులు భారత్ పనిని సులువుగా మార్చేశాయి. ఇక గురువారం నుంచి ఇరు జట్ల మధ్య వన్డే సమరానికి తెర లేవనుంది. బ్రిస్టల్: భారీ అంచనాలతో ఇంగ్లండ్‌లో దిగిన భారత్ తొలి దశలో దానిని నిలబెట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌ను 2–1తో గెలుచుకొని సత్తా చాటింది. ఆదివారం ఇక్కడ జరిగిన చివరి టి20లో భారత్ 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. ముందుగా ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. జేసన్ రాయ్ (31 బంతుల్లో 67; 4 ఫోర్లు, 7 సిక్సర్లు), బట్లర్ (21 బంతుల్లో 34; 7 ఫోర్లు) ధాటిగా ఆడారు. పాండ్యాకు 4 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 201 పరుగులు సాధించింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (56 బంతుల్లో 100 నాటౌట్; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. కోహ్లి (29 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (14 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచారు. రోహిత్‌కే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కూడా దక్కింది. ఓపెనర్ల విధ్వంసం... ఎప్పటిలాగే ఇంగ్లండ్ జట్టుకు ఓపెనర్లు శుభారంభం అందించారు. రాయ్, బట్లర్ తమదైన శైలిలో దూకుడుగా ఆడటంతో భారత బౌలర్లు లయ తప్పారు. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న దీపక్ చహర్ వేసిన తొలి ఓవర్లో బట్లర్ మూడు ఫోర్లు బాదాడు. ఆ తర్వాత ఉమేశ్ ఓవర్లో రాయ్ 2 ఫోర్లు, సిక్సర్‌తో చెలరేగాడు. పాండ్యా వేసిన ఆరో ఓవర్లో రాయ్ వరుసగా 4, 4, 6, 6 కొట్టడంతో 22 పరుగులు వచ్చాయి. ఫలితంగా పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు 73 పరుగులకు చేరింది. అయితే ఎట్టకేలకు బట్లర్‌ను బౌల్ట్ చేసి కౌల్ ఈ జోడీని విడగొట్టాడు. వీరిద్దరు 47 బంతుల్లోనే 94 పరుగులు జత చేయడం విశేషం. ఆ తర్వాత రాయ్‌ను అవుట్ చేసి చహర్ తన తొలి వికెట్ అందుకున్నాడు. అనంతరం హేల్స్ (24 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. 13 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 132 పరుగులకు చేరింది. ఈ దశలో పాండ్యా వేసిన ఓవర్‌తో మ్యాచ్ మలుపు తిరిగింది. తొలి బంతికి మోర్గాన్ (6)ను ఔట్ చేసిన పాండ్యా, చివరి బంతికి హేల్స్ ఆట ముగించాడు. ఆ తర్వాత స్టోక్స్ (14), బెయిర్ స్టో (14 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అడపాదడపా కొన్ని మెరుపు షాట్లు ఆడినా... ఆరంభంలో కనబర్చిన దూకుడును ఇంగ్లండ్ చూపలేకపోయింది. వీరిద్దరు కూడా పాండ్యా బౌలింగ్‌లోనే వెనుదిరిగారు. చివరి ఓవర్లో కూడా ఇంగ్లండ్ మరో రెండు వికెట్లు కోల్పోయింది. ఒక దశలో కనీసం 230 పరుగులు చేసేలా కనిపించిన జట్టు... భారత్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చివరకు 200 పరుగుల మార్క్‌ను కూడా అందుకోలేకపోయింది. తన తొలి ఓవర్లో 22 పరుగులిచ్చిన పాండ్యా, తర్వాతి 3 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. రోహిత్ ఒంటిచేత్తో... లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలోనే శిఖర్ ధావన్ (5) వికెట్ కోల్పోయింది. వేగంగా ఆడబోయిన రాహుల్ (10 బంతుల్లో 19; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా జోర్డాన్ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. అయితే మరోవైపు రోహిత్ దూకుడైన బ్యాటింగ్‌తో భారత్ దూసుకుపోయింది. తాను ఎదుర్కొన్న మూడో బంతిని సిక్సర్‌గా మలిచి ఖాతా తెరిచిన రోహిత్ ఇన్నింగ్స్ ఆసాంతం స్వేచ్ఛగా ఆడాడు. ఎక్కడా అతని షాట్లలో తడబాటు కనిపించలేదు. ప్రతీ ఇంగ్లండ్ బౌలర్‌ను అతను అలవోకగా ఎదుర్కొన్నాడు. జోర్డాన్ ఓవర్లో ఫోర్, 2 సిక్సర్లతో ధాటిని పెంచిన అతను 28 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్రీజ్‌లో ఉన్నంత సేపు కోహ్లి కూడా తనదైన శైలిలో చక్కటి షాట్లతో ఆకట్టుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 57 బంతుల్లోనే 89 పరుగులు జోడించారు. జోర్డాన్ రిటర్న్ క్యాచ్‌కు కోహ్లి వెనుదిరిగినా, అప్పటికే భారత్ విజయం దిశగా సాగుతోంది. రోహిత్‌కు పాండ్యా జత కలిసిన తర్వాత గెలుపు సునాయాసమైపోయింది. 24 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ తర్వాతి 16 బంతుల్లోనే ఆట ముగించేసింది. బాల్ వేసిన 17వ ఓవర్లో 3 ఫోర్లతో 15 పరుగులు రాగా, విల్లీ వేసిన 18వ ఓవర్లో పాండ్యా ఒక సిక్స్, 2 ఫోర్లు కొట్టాడు. రోహిత్ కూడా మరో ఫోర్ బాదడంతో 20 పరుగులు లభించాయి. జోర్డాన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి రోహిత్ 56 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా... భారీ సిక్స్‌తో పాండ్యా గెలిపించాడు. స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) ధోని (బి) చహల్ 67; బట్లర్ (బి) కౌల్ 34; హేల్స్ (సి) ధోని (బి) పాండ్యా 30; మోర్గాన్ (సి) ధోని (బి) పాండ్యా 6; స్టోక్స్ (సి) కోహ్లి (బి) పాండ్యా 14; బెయిర్ స్టో (సి) ధోని (బి) పాండ్యా 25; విల్లీ (బి) ఉమేశ్ 1; జోర్డాన్ (రనౌట్) 3; ప్లంకెట్ (సి) ధోని (బి) కౌల్ 9; రషీద్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–94; 2–103; 3–134; 4–140; 5–177; 6–181; 7–183; 8–194; 9–198. బౌలింగ్: దీపక్ చహర్ 4–0–43–1; ఉమేశ్ 4–0–48–1; కౌల్ 4–0–35–2; పాండ్యా 4–0–38–4; చహల్ 4–0–30–0. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 100; ధావన్ (సి) బాల్ (బి) విల్లీ 5; రాహుల్ (సి) జోర్డాన్ (బి) బాల్ 19; కోహ్లి (సి అండ్ బి) జోర్డాన్ 43; పాండ్యా (నాటౌట్) 33; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (18.4 ఓవర్లలో 3 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–21; 2–62; 3–151. బౌలింగ్: విల్లీ 3–0–37–1; బాల్ 3–0–39–1; జోర్డాన్ 3.4–0–40–1; ప్లంకెట్ 3–0–42–0; స్టోక్స్ 2–0–11–0; రషీద్ 4–0–32–0. ► 3 అంతర్జాతీయ టి20ల్లో రోహిత్ సెంచరీల సంఖ్య. కొలిన్ మున్రో (న్యూజిలాండ్) మాత్రమే 3 సెంచరీలు సాధించాడు. ► 5 ఒకే ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్ ధోని. అయితే ఐదుగురిని ఔట్ చేసిన కీపర్లలో షహజాద్ (అఫ్గానిస్తాన్) కూడా ఉన్నాడు. అతను 3 క్యాచ్‌లు పట్టి, 2 స్టంపింగ్‌లు చేశాడు. ► 76 భారత్ తరఫున టి20లు ఆడిన 76వ ఆటగాడు దీపక్ చహర్ ► 8 భారత్ ఆడిన మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లు. అన్నింటిలోనూ విజేతగా నిలిచింది. -
ఐపీఎల్: ఆ ఇద్దరు మాత్రమే అలా..
ఇండియాన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ద్వారా కోట్లలో వ్యాపారం జరుతుందనే విషయం తెలిసిందే. ప్రతి సంత్సరం ఏప్రిల్-మేలో ఐపీఎల్‌ను నిర్వహిస్తారు. ఐపీఎల్ ప్రారంభయిందంటే ప్రేక్షకులకు పండుగే. కొంతమంది ప్లేయర్స్ ఎక్కువ ధర పలికి కోట్ల రూపాయాలను తమ ఖాతాలో వేసుకుంటారు. అయితే 11 సీజన్లలో ఐపీఎల్ ఫ్రాంఛైజీలు 694 ఆటగాళ్లలతో కాంట్రాక్టులు కుదుర్చుకున్నాయి. కానీ, కేవలం ఇద్దరు మాత్రమే రికార్డు స్థాయిలో రూ. 100 కోట్లు సంపాదించారు. మిస్టర్ కూల్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు ఐపీఎల్ వందకోట్ల క్లబ్ చేరిపోయారు. వీరు ఇప్పటివరకూ జరిగిన మొత్తం ఐపీఎల్లో ఆ జట్టు యాజమాన్యం నుంచి వేతన రూపంలోనే రూ. 100 కోట్లు సంపాదించారని తెలుస్తోంది. మిస్టర్ కూల్ ధోని రూ. 107.8 కోట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ రూ. 101.6 కోట్లతో రెండోస్థానంలో ఉన్నాడు. ప్రేక్షకులు ఎంతగానో అదరించే ఐపీఎల్ మొదటి సీజన్ 2008 నుంచి ప్రారంభమైన విషయం విదితమే. ఫస్ట్ సీజన్లో చెన్నై యాజమాన్యం రూ. 6కోట్లకు ధోనిని సొంతం చేసుకుంది. మిస్టర్ కూల్ 2008 నుంచి 2015 వరకూ చెన్నై జట్టు ప్రాతినిధ్యం వహించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చెన్నై జట్టుపై 2016, 2017 నిషేధం విధించారు. ఆ రెండు సంవత్సరాలు ధోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు ఆడాడు. తిరిగి ఈ సంవత్సరం చెన్నై జట్టు ఐపీఎల్‌లోకి అడుగుపెట్టింది. 11వ సీజన్లో ధోని చెన్నై జట్టును విజయంవైపు నడిపించాడు. తొమ్మిది సీజన్లు అడిన చెన్నై జట్టు మూడు సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ ఐపీఎల్ మొదటి సీజన్ డెక్కన్ ఛార్జర్స్‌కు ఆడాడు. అప్పుడు డెక్కన్ యాజమాన్యం రూ. 3కోట్లకు రోహిత్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత నుంచి ముంబై జట్టుకు ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్ మూడుసార్లు ఐపీఎల్ విజేత నిలిచిన విషయం తెలిసిందే. ఆరంభం నుంచే వీరు కోట్లలో పలికారు. ఇటీవల జరిగిన ఐపీఎల్-11వ సీజన్లో దోని, రోహిత్‌ల కోసం ఆ జట్టు యాజమాన్యాలు రూ. 15కోట్లు పెట్టాయి. ఐపీఎల్ మొత్తంలో 694 మంది ఆటగాళ్లలో కేవలం ధోని, రోహిత్ శర్మలు మాత్రమే రూ. 100కోట్ల క్లబ్లో చేరారు. -
అదేంటో! అలా జరుగుతోంది: రోహిత్ శర్మ
-
ముంబై గెలిచిందోచ్...
హమ్మయ్య... ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ మరో విజయం సాధించింది. రెండు రోజుల క్రితం వరకు పట్టికలో చివరి స్థానంలో నిలిచేందుకు తమతో పోటీ పడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ అద్భుత ఆటను చూసి స్ఫూర్తి పొందిందో ఏమో పటిష్ట చెన్నైపై కీలక గెలుపుతో ఐపీఎల్లో తమ ఆట ముగిసిపోలేదని ముంబై గుర్తు చేసింది. పనిలో పనిగా లీగ్ తొలి మ్యాచ్‌లో తమకు అనూహ్యంగా షాక్ ఇచ్చిన సూపర్ కింగ్స్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ముంబైకి ఇది రెండో విజయం కాగా... మెరుపు బ్యాటింగ్‌తో ఇంతకుముందు మ్యాచ్ గెలిపించిన రోహిత్ శర్మనే ఈసారి అర్ధ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైనా, అంబటి రాయుడు రాణించినా బౌలింగ్ వైఫల్యంతో చెన్నైకి రెండో ఓటమి తప్పలేదు. పుణే: పేరుకే చెన్నై సూపర్ కింగ్స్ సొంత మైదానం... కానీ మహారాష్ట్ర మద్దతంతా ముంబై టీమ్‌కే... ఇలాంటి వాతావరణంలో రోహిత్ బృందం మురిసింది. వాంఖెడేలో కూడా ఓడుతూ వచ్చిన ముంబై ఇండియన్స్ ఎట్టకేలకు తమకు అండగా నిలిచిన అభిమానుల మధ్య కీలక విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ముంబై 8 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రైనా (47 బంతుల్లో 75 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రాయుడు (35 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. అనంతరం ముంబై ఇండియన్స్ 19.4 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (33 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ సాధించగా... లూయీస్ (43 బంతుల్లో 47; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (34 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. రైనా అర్ధసెంచరీ... అంబటి రాయుడు అద్భుత ప్రదర్శన ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. ఇన్నింగ్స్ మూడో బంతికి కొట్టిన భారీ సిక్సర్‌తో అతని జోరు మొదలైంది. అనంతరం కృనాల్ బౌలింగ్‌లోనూ మరో సిక్స్ కొట్టిన రాయుడు హార్దిక్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6 బాదాడు. మరోవైపు వాట్సన్ (12) విఫలం కావడంతో బరిలోకి దిగిన రైనా కూడా సిక్సర్‌తోనే ఖాతా తెరిచాడు. ఆ తర్వాత మార్కండే బౌలింగ్‌లో వరుసగా 4, 6 కొట్టాడు. ఒకరితో మరొకరు పోటీ పడి దూకుడుగా ఆడిన వీరిద్దరు రెండో వికెట్‌కు 42 బంతుల్లోనే 71 పరుగులు జోడించారు. కృనాల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రాయుడు అవుట్ కావడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన ధోని, ఆ తర్వాత ధాటిని పెంచాడు. ఒక దశలో ఆరు బంతుల వ్యవధిలో 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టడం విశేషం. మరోవైపు 35 బంతుల్లో రైనా అర్ధసెంచరీ పూర్తయింది. అయితే మరో భారీ స్కోరుకు సిద్ధమమవుతున్న తరుణంలో మెక్లీనగన్ వేసిన 18వ ఓవర్ చెన్నైకి బ్రేక్ వేసింది. ఈ ఓవర్లో ధోని, బ్రేవో (0)లను అవుట్ చేసిన అతను నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బిల్లింగ్స్ (3) విఫలమైనా... చివరి రెండు ఓవర్లలో రైనా ఒక్కో సిక్సర్ బాదడంతో సూపర్ కింగ్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. చివర్లో ప్రత్యర్థిని కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు సఫలమయ్యారు. తొలి పది ఓవర్లలో 91 పరుగులు చేసిన చెన్నై, తర్వాతి పది ఓవర్లలో మరో 78 పరుగులు మాత్రమే జోడించగలిగింది. కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో ముంబైకి ఓపెనర్లు సూర్యకుమార్, లూయీస్ మెరుగైన ఆరంభాన్ని ఇచ్చారు. విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శించకుండానే ప్రశాంతంగా ఆడుతూ చక్కటి షాట్లతో వీరిద్దరు చకచకా పరుగులు జోడించారు. తొలి వికెట్‌కు 59 బంతుల్లో 69 పరుగులు జోడించిన తర్వాత జడేజా అద్భుత క్యాచ్‌కు సూర్యకుమార్ వెనుదిరిగాడు. అనంతరం బరిలోకి దిగిన రోహిత్... వాట్సన్ ఓవర్లో రెండు సిక్సర్లతో చెలరేగాడు. లూయీస్, రోహిత్ భాగస్వామ్యం ముంబై విజయంపై ఆశలు పెంచింది. వీరిద్దరు 38 బంతుల్లోనే 59 పరుగులు జత చేశారు. లూయీస్‌ను బ్రేవో అవుట్ చేసి ఈ జోడీని విడదీశాడు. అయితే హార్దిక్ పాండ్యా (8 బంతుల్లో 13 నాటౌట్; 1 సిక్స్) అండగా రోహిత్ మ్యాచ్‌ను ముగించాడు. చివరి రెండు ఓవర్లలో 22 పరుగులు చేయాల్సిన దశలో ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో రోహిత్ నాలుగు ఫోర్లతో జట్టును గెలుపు ముంగిట నిలిపాడు. -
ధనాధన్ ఆటకు అంతా సిద్ధం!
పది వసంతాల క్రితం వేసవి అంటే భారత్‌లో ఆటలకు బ్రేక్... విశ్రాంతి అనో విరామం పేరుతోనో ఆటగాళ్లు మైదానానికి దూరమైతే అభిమానులు ‘ఇండోర్ గేమ్స్’కే పరిమితం! ఇలాంటి సమయంలో క్రికెట్ అభిమానులపై పన్నీటి జల్లు కురిసింది. చిన్నస్వామి స్టేడియంలో బ్రెండన్ మెకల్లమ్ సృష్టించిన పెద్ద తుఫాన్ క్రికెట్ వినోదానికి కొత్త చిరునామాను చూపించింది. టి20 క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు మరెంతో ఉందంటూ దూసుకొచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచ క్రికెట్‌ను మార్చేసింది. కొడితే ఫోర్, లేదంటే సిక్సర్... బంతి గాల్లో లేచిందంటే చాలు నరాలు తెగే ఉద్వేగం, ఉత్కంఠ... ఒక్క బంతితో ఫలితాలు మారిపోయే మ్యాచ్‌లు...ఒక్కటి కూడా ప్రేక్షకులను నిరాశ పరచని మ్యాచ్‌లు...చీర్ గర్ల్స్లు, ఆపై చీర గర్ల్స్ కూడా వచ్చి బౌండరీ బయటనుంచి కూడా అభిమానుల ఉత్సాహాన్ని పెంచాయి. ఐపీఎల్‌ను మన నట్టింట్లోకి తీసుకు వచ్చేశాయి. దశాబ్దం దాటిపోయింది... ఐపీఎల్ సాధారణ లీగ్ స్థాయి నుంచి పైపైకి ఎదిగి అందనంత ఎత్తులో శిఖరాన నిలిచింది. ఇప్పుడు ఐపీఎల్ అంటే ఒక టోర్నీ మాత్రమే కాదు. ప్రపంచ క్రికెట్ అభిమానుల గుండె చప్పుడు. ఇందులో అవకాశం దక్కడం అంటే క్రికెటర్‌కు ఎవరెస్ట్‌ను ఎక్కినంత ఆనందం. అభిమానుల దృష్టిలో తమ దినచర్యలో ఒక భాగం. క్రికెటర్లు కోటీశ్వరులు కావడమే ఐపీఎల్ సాధించిన గెలుపు కాదు. ఏదో ఒక రూపంలో లీగ్‌లో భాగం కావాలని చూసేవారికి లెక్కే లేదు... లీగ్‌లో లెక్కల విలువ గురించి తెలిసి క్రికెటర్ల భుజం మీద బొమ్మగా వాలితే చాలు తమ వ్యాపారం వర్ధిల్లుతుందని భావించి లైన్లో నిలబడే కార్పొరేట్ల జాబితాకు పరిమితే లేదు. ధనాధన్ ఫటాఫట్ బాదుడు... మార్ మార్ మెరుపులు చూడమంటూ ఐపీఎల్ ఇస్తున్న పిలుపుకు వచ్చే 51 రోజులు మనందరం దాసోహం అవడం మాత్రం ఖాయం. ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదకొండో సీజన్ సంబరాలకు రంగం సిద్ధమైంది. నేడు ఈ మెగా టోర్నీకి తెర లేవనుంది. వాంఖెడే స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతుంది. మే 27న ఇదే మైదానంలో ఫైనల్ జరుగుతుంది. ఎప్పటిలాగే ఎనిమిది జట్లు బరిలోకి దిగుతున్నాయి. నిషేధం కారణంగా రెండు సీజన్ల పాటు లీగ్‌కు దూరమైన చెన్నై, రాజస్తాన్ జట్లు పునరాగమనం చేస్తున్నాయి. పదేళ్లు ముగిసిన తర్వాత ఆటగాళ్ల ఎంపిక కోసం ఈ ఏడాది పెద్ద ఎత్తున వేలం జరిగింది. కొద్ది మంది స్టార్లు మినహా ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు ఈ సారి కొత్త జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు. పదేళ్ళుగా ఫలానా క్రికెటర్ అంటే ఆ జట్టు అంటూ ఐపీఎల్ అభిమానుల మనసులో ముద్రించుకుపోయిన అనేక మందిని ఈసారి వారంతా వేర్వేరు జెర్సీలో చూడబోతుండటం కూడా మరో విశేషం. మూడు సార్లు విజేతగా నిలిచిన ముంబై మరోసారి జయకేతనం ఎగురవేస్తుందా? ధోని మళ్లీ తన టీమ్‌ను గెలుపు దిశగా నడిపించగలడా? ఢిల్లీ, పంజాబ్‌లకు ఈ సారైనా చాన్స్ ఉందా? వార్నర్ లేని రైజర్స్, కొత్త కెప్టెన్‌తో కోల్‌కతా, రహానే నేతృత్వంలో రాజస్థాన్ల అదృష్టం మారుతుందా? అన్నింటికి మించి 2008 నుంచి జట్టు మారని ఒకే ఒక్కడు విరాట్ కోహ్లి ఈ సారైనా కప్‌ను ముద్దాడగలడా అనే ప్రశ్నలకు నేటి నుంచి సమాధానాలు వెతుక్కోవచ్చు. ►ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సురేశ్ రైనా. 161 మ్యాచ్‌లలో అతను 139.09 స్ట్రైక్‌రేట్‌తో 4540 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 31 అర్ధసెంచరీలు ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో కోహ్లి (4418), రోహిత్ శర్మ (4207) నిలిచారు. ►ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన జట్టు ముంబై ఇండియన్స్. 157 మ్యాచ్‌లలో ఆ జట్టు 91 గెలిచి 65 ఓడింది. రెండో స్థానంలో ఉన్న చెన్నై 132 మ్యాచ్‌లలో 79 గెలిచి 51 ఓడింది. -
దిగ్గజాలు దున్నేస్తాయా?
జట్టులో లెక్కకు మిక్కిలి స్టార్లు... మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే ఆటగాళ్లు... తడబడినా ఎదురీదగలిగేంత స్థైర్యం... నిలదొక్కుకుని గెలవగల బలగం... ...ఇదీ ముంబై ఇండియన్స్ పరిచయంజట్టును నడిపించేదే ఓ దిగ్గజం... ప్రతికూలత ఎదురైనా వెరవని వైనం... ఉన్న వనరులతోనే గెలవగల నేర్పు... సమష్టి ఆటతీరుకు పెట్టింది పేరు... ...ఇదీ చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం సాక్షి క్రీడా విభాగం : ఐపీఎల్ పది సీజన్లలో ఐదుసార్లు విజేతలు ముంబై ఇండియన్స్ (3), చెన్నై సూపర్‌కింగ్స్ (2) జట్లే. అంటే, మొత్తం టైటిళ్లలో సగం ఈ రెండింటి వద్దే ఉన్నట్లు. దీంతోపాటు ముంబై ఒకసారి, చెన్నై నాలుగుసార్లు రన్నరప్‌గా నిలిచాయి. గణాంకాలు చూస్తేనే తెలిసిపోతుంది ఈ రెండు ఫ్రాంచైజీలు ఎంత బలమైనవో! క్రమంగా ఊపందుకుని కప్‌ను ఎగరేసుకుపోవడం ముంబై తీరైతే, అడ్డంకులను అధిగమిస్తూ, నిలకడైన ఆటతో టైటిల్ కొట్టేయడం చెన్నై లక్షణం. ఈ ఏడాది రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలో దిగుతుండగా, రెండేళ్ల నిషేధం తొలగిన చెన్నై మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో పూర్వ వైభవం పొందాలని ఆశిస్తోంది. మరి వీటి బలాబలాలేమిటో, బలహీనతలేమిటో చూద్దాం...! క్రమంగా... బలంగా... తొలి రెండు సీజన్లు లీగ్ దశలో నిష్క్రమణ, తర్వాత మూడేళ్లలో ఒకసారి రన్నరప్, రెండుసార్లు ప్లే ఆఫ్స్, చివరి ఐదేళ్లలో మూడుసార్లు చాంపియన్. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ప్రయాణాన్ని ఇలా మూడు దశలుగా చెప్పుకోవాలి. ఒక దశలో స్టార్లు ఎక్కువై, ఆటగాళ్లు తక్కువై ఫలితాల పరంగా ఈ జట్టు పూర్తిగా నిరాశపరిచింది. కానీ, రోహిత్ చేతికి పగ్గాలు వచ్చాక పరిస్థితి మారింది. 2013లో కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేసిన ఈ హిట్‌మ్యాన్... తర్వాతి ఏడాది నుంచి పూర్తిస్థాయి సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. ముఖ్యంగా 2015, 2017లలో టైటిల్ గెలవడంలో రోహిత్‌దే ముఖ్య పాత్ర. వేలంలోనూ మంచి ఆటగాళ్లను ఎంచుకుని ఈసారి సైతం భారీ అంచనాలతోనే రంగంలోకి వస్తోంది. అయితే... రోహిత్ కాక చెప్పుకోదగ్గ బ్యాట్స్‌మెన్ ఎవిన్ లూయీస్, డుమిని, సౌరభ్ తివారీ మాత్రమే కావడంతో బ్యాటింగ్ భారమంతా కెప్టెన్‌పైనే పడేలా కనిపిస్తోంది. హార్దిక్, కృనాల్ పాండ్యా, పొలార్డ్ వంటి ఆల్‌రౌండర్లు, బుమ్రా, కమిన్స్, ముస్తాఫిజుర్ వంటి పేసర్లు ఉండటం భరోసానిస్తోంది. ఇదీ జట్టు: రోహిత్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, సౌరభ్ తివారీ, సూర్యకుమార్, సిద్దేశ్ లాడ్, శరద్లాంబా, తజిందర్ దిల్లాన్, మయాంక్ మార్కండే, అనుకూల్ రాయ్, ఇషాన్ కిషన్, తారే, బుమ్రా, రాహుల్ చహర్, మొహిసిన్ ఖాన్, నిధీశ్, ప్రదీప్ సాంగ్వాన్ (స్వదేశీ), డుమిని, లూయీస్, కట్టింగ్, ధనంజయ, పొలార్డ్, బెహ్రన్‌డార్ఫ్, కమిన్స్, ముస్తాఫిజుర్, మెక్లీనగన్ (విదేశీ). ఘన పునరాగమనం కోసం... ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టంటే చెన్నై సూపర్ కింగ్సే. 2008 నుంచి 2015 వరకు ఎనిమిది సీజన్లలో రెండుసార్లు విజేతగా నిలిచిందీ జట్టు. నాలుగుసార్లు రన్నరప్‌తో సరిపెట్టుకోగా, రెండుసార్లు సెమీఫైనల్స్‌కు చేరింది. పరిస్థితులకు తగ్గట్లు జట్టు సభ్యులను వాడుకునే ధోని నాయకత్వ ప్రతిభ, రైనా మెరుపులకు మిగతా ఆటగాళ్ల సహకారం తోడవడంతో లీగ్‌లో చెన్నై ఎప్పుడూ పేలవ ప్రదర్శన చేయలేదు. ఉన్న వనరులతోనే ఫలితం రాబట్టగలడం ధోని శైలి కాబట్టి ఈసారి కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదు. అయితే... టి20 స్థాయికి తగిన ఓపెనర్లు లేకపోవడం లోటు. వాట్సన్ మునుపటి స్థాయిలో ఆడట్లేదు. దీంతో బిల్లింగ్స్, విజయ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. డు ప్లెసిస్, జాదవ్, రైనా, రాయుడు, ధోనిలతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది. బ్రావో, ఇన్‌గిడి, శార్దుల్ పేస్ బాధ్యతలు మో స్తారు. రెండేళ్ల నిషేధంతో జట్టు స్వరూపం కొంత మారినా... మహి నాయకత్వ పటిమ, స్థానిక అభిమానుల మద్దతు చెన్నైకి పెద్ద బలం. దీంతో ఎప్పటిలానే ఈ ఫ్రాంచైజీ కనీసం సెమీస్‌కు చేరగలదని చెప్పొచ్చు. ఇదీ జట్టు ధోని (కెప్టెన్), రైనా, మురళీ విజయ్, హర్భజన్, జాదవ్, రాయుడు, ధ్రువ్ షోరే, జడేజా, కరణ్ శర్మ, క్షితిజ్ శర్మ, నారాయణ్ జగదీశన్, కేఎం ఆసిఫ్, చైతన్య బిష్ణోయ్, దీపక్ చహర్, మోను కుమార్, కనిష్క్ సేథ్, శార్దుల్ ఠాకూర్ (స్వదేశీ). డు ప్లెసిస్, బ్రావో, వాట్సన్, బిల్లింగ్స్, ఇన్‌గిడి, తాహిర్, మార్క్ వుడ్ (విదేశీ). -
బంగ్లాదేశ్‌పై 17 పరుగులతో గెలుపు
-
దర్జాగా ఫైనల్‌కు...
అన్ని రంగాల్లో ఆధిపత్యం... ప్రత్యర్థిపై సాధికార విజయం... రన్‌రేట్, గణాంకాలతో పని లేదు... అవతలి జట్ల ఫలితాలతో సంబంధం లేదు... తుది సమరానికి ఆత్మవిశ్వాసంతో పయనం... టీమిండియా కప్ గెలవడమే ఇక తరువాయి! కొలంబో: టాపార్డర్ బ్యాట్స్‌మెన్ రాణించి జట్టుకు పోరాడే స్కోరు అందించారు. బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. దాంతో నిదహస్ ట్రోఫీ ముక్కోణపు టి20 టోర్నమెంట్లో భారత్ రాజసంగా ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం ఇక్కడ జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రోహిత్ సేన 17 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా... కెప్టెన్ రోహిత్ శర్మ (61 బంతుల్లో 89; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) దూకుడు, సురేశ్ రైనా (30 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), ధావన్ (27 బంతుల్లో 35; 5 ఫోర్లు, 1 సిక్స్)ల సమయోచిత ఆటతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం వాషింగ్టన్ సుందర్ (3/22) స్పిన్ ఉచ్చులో చిక్కిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ముష్ఫికర్ రహీమ్ (55 బంతుల్లో 72 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) తుదికంటా నిలిచినా జట్టును గెలిపించలేకపోయాడు. తమీమ్ ఇక్బాల్ (19 బంతుల్లో 27; 4 ఫోర్లు, 1 సిక్స్), షబ్బీర్ రహ్మాన్ (23 బంతుల్లో 27; 2 ఫోర్లు, 1 సిక్స్) తప్ప మిగతావారెవరూ రాణించలేదు. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. శుక్రవారం శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగే చివరి లీగ్ మ్యాచ్ విజేతతో ఆదివారం జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. రోహిత్ జయహో... రైనా అదరహో ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం, ఆపై బంగ్లా బలహీన బౌలింగ్‌ను తలచుకుని భారత్ భారీ స్కోరు చేసేందుకు మంచి అవకాశంగా అభిమానులు భావించారు. కానీ ప్రత్యర్థి ఇందుకు ఆస్కారం ఇవ్వలేదు. పైగా తొలి ఐదు ఓవర్లను ఒక్కో బౌలర్‌తో వేయించి ఆశ్చర్యపరిచిం ది. టీమిండియా ఓపెనర్లలో ధావన్ ఎప్పటిలాగే జోరు చూపించినా, రోహిత్ టైమింగ్ కుదరక ఇబ్బంది పడ్డాడు. దీంతో ఇన్నింగ్స్ ఓ మాదిరిగానే ప్రారంభమైంది. పదో ఓవర్ ఐదో బంతికి ధావన్ అవుటయ్యేసరికి భారత్ స్కోరు 70/1. రోహిత్ ఎక్కువ బంతులు ఎదుర్కొన్నా దూకుడుగా ఆడలేకపోయాడు. 13వ ఓవర్లో కాని అతడి అర్ధ శతకం (42 బంతుల్లో) పూర్తవలేదు. గత నెలలో పోర్ట్ ఎలిజబెత్ వన్డేలో దక్షిణాఫ్రికాపై శతకం తర్వాత ఆడిన ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌కిదే తొలి అర్ధ శతకం కావడం గమనార్హం. అయితే... తర్వాతి నుంచే పరిస్థితి మారింది. కుదురుకున్న రైనా, మెహదీ హసన్ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్‌తో ఊపులోకి వచ్చాడు. ఇద్దరూ జోరు చూపడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. ఇక అబు హైదర్ వేసిన 18వ ఓవర్లో రోహిత్ రెండు, రైనా ఒక సిక్స్ కొట్టి 21 పరుగులు పిండుకు న్నారు. దీంతో కెప్టెన్ వ్యక్తిగత స్కోరు 79కి చేరింది. 19వ ఓవర్లోనూ రెండు ఫోర్లు కొట్టిన ‘హిట్‌మ్యాన్’ సెంచరీ చేయడం ఖాయంగా కనిపించింది. కానీ చివరి ఓవర్ అద్భుతంగా వేసిన రూబెల్ హుస్సేన్ 4 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. సుందర్ మాయలో పడి... గత మ్యాచ్‌లో లంకపై భారీ లక్ష్యాన్ని ఛేదించి ఆశ్చర్యపరిచిన బంగ్లాదేశ్‌కు ఈసారి 177 పరుగులు కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ బంగ్లా జట్టు భారత యువ ఆఫ్ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ వలలో పడిపోయింది. టోర్నీలో కొత్త బంతిని పంచుకుంటూ పొదుపుగా బౌలింగ్ చేస్తూ వికెట్లు తీస్తున్న సుందర్ తన మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. వరుస ఓవర్లలో లిటన్ దాస్ (7), సౌమ్య సర్కార్ (1), తమీమ్ ఇక్బాల్‌లను పెవిలియన్‌కు పంపి బంగ్లాను దెబ్బతీశాడు. కెప్టెన్ మహ్ముదుల్లా (11)ను చహల్ అవుట్ చేయడంతో ఆ జట్టు 61 పరుగులకే నలుగురు ప్రధాన బ్యాట్స్‌మెన్‌ను కోల్పోయింది. ముష్ఫికర్, షబ్బీర్‌లు అయిదో వికెట్‌కు 65 పరుగులు జోడించినా అప్పటికే సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరిగిపోయింది. భారత బౌలర్లలో చహల్ (1/21), విజయ్ శంకర్ (0/28) రాణించినా, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ (1/50) ధారాళంగా పరుగులిచ్చాడు. ►అంతర్జాతీయ టి20ల్లో భారత్ తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ శర్మ (75 సిక్సర్లు) రికార్డు. ►భారత్ తరఫున టి20 మ్యాచ్‌లో మూడు వికెట్లు తీసిన పిన్న వయస్సు బౌలర్‌గా సుందర్ (18 ఏళ్ల 160 రోజులు) గుర్తింపు. అక్షర్ పటేల్ (21 ఏళ్ల 178 రోజులు; జింబాబ్వేపై 2015లో) పేరిట ఉన్న రికార్డు తెరమరుగు. ►టి20ల్లో బంగ్లాదేశ్‌పై భారత్‌కిది వరుసగా ఏడో విజయం. -
నేటి నుంచే ముక్కోణపు టి20 టోర్నీ
-
నవ యువ సమరం
పేస్ బౌలింగ్‌లో పూర్తిగా కొత్త కూర్పు... స్పిన్ దళంలోనూ కొంత మార్పు... బ్యాటింగ్‌లో దూకుడు మేళవింపు... సత్తా పరీక్షకు సిద్ధమైన ఆల్‌రౌండర్లు... వెరసి ముక్కోణపు టి20 టోర్నీలో నయా టీమిండియాప్రధాన ఆటగాళ్ల విశ్రాంతి నేపథ్యంలో ఒక ప్రయోగం! నేటి నుంచే సమరం ప్రారంభం. కొలంబో: శ్రీలంక స్వాతంత్య్రం పొంది 70 ఏళ్లవుతున్న సందర్భంగా తలపెట్టిన ‘నిదాహస్’ ముక్కోణపు టి20 టోర్నీ మంగళవారం ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారత్ ఆతిథ్య శ్రీలంకను ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో ఎదుర్కోనుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి సహా ఆరుగురు రెగ్యులర్ ఆటగాళ్లు లేకుండానే బరిలో దిగుతున్నందున టీమిండియా కొత్తకొత్తగా కనిపిస్తోంది. అన్ని విభాగాల్లో కూర్పు మారనుంది. ఈ నేపథ్యంలో అలవాటైన ఉపఖండ పరిస్థితుల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని మన జట్టు ఎలా ఆడుతుందోననే ఆసక్తి నెలకొంది. అందరికీ అవకాశం... బ్యాటింగ్‌లో మనీష్ పాండే, దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, ఆల్‌రౌండర్ కోటాలో దీపక్ హుడా, విజయ్ శంకర్, స్పిన్‌లో వాషింగ్టన్ సుందర్, పేస్‌లో మొహమ్మద్ సిరాజ్, ఉనాద్కట్, శార్దూల్ ఠాకూర్... ఇలా జట్టులోని ఎక్కువ శాతం ఆటగాళ్లు తమని తాము నిరూపించుకునేందుకు ఈ టోర్నీ చక్కని వేదిక. సమీకరణాల రీత్యా ఒకరిద్దరు తప్ప వీరిలో అందరూ తుది జట్టులో ఉండేవారే. ఇక్కడ రాణిస్తే వీరికిది అదనపు ప్రయోజనంగా మారుతుంది. అన్నిటికీ మించి దక్షిణాఫ్రికా పర్యటనలో పూర్తిగా విఫలమైన రోహిత్ శర్మ ముందు మరో అవకాశం. ఈ ‘హిట్ మ్యాన్’ ఇప్పుడు బ్యాటింగ్ బాధ్యత నెరవేర్చడంతో పాటు సారథ్య సామర్థ్యమూ చాటుకోవాలి. ఇష్టమైన ప్రత్యర్థి లంకపై చెలరేగితే ఫూర్వ ఫామ్‌ను అందుకుంటాడు. వైస్ కెప్టెన్ హోదా దక్కిన మరో ఓపెనర్ శిఖర్ ధావన్ ఇందుకు తగ్గట్లు ఆడాల్సి ఉంటుంది. సఫారీలపై టి20ల్లో వన్‌డౌన్‌లో మెరుపులు మెరిపించిన రైనా మరోసారి ఆకట్టుకుంటే స్థానం పదిలం చేసుకుంటాడు. కేఎల్ రాహుల్, పాండేలను 4, 5 స్థానాల్లో పంపాలనుకుంటే... వికెట్ కీపర్‌గా కార్తీక్, పంత్‌లలో ఎవరుండాలో తేల్చుకోవాల్సి ఉంటుంది. స్పిన్ ఆల్‌రౌండర్ స్థానానికి సుందర్, హుడా మధ్య పోటీ ఉంది. చహల్‌కు తోడుగా అక్షర్ పటేల్‌ను ఆడించే అవకాశాలే ఎక్కువ. శార్దూల్, ఉనాద్కట్, సిరాజ్‌లతో పేస్ కూర్పు మొత్తం కొత్తగా కనిపిస్తోంది. మూడో పేసర్ కావాలనుకుంటేనే సిరాజ్‌కు అవకాశం ఉంటుంది. లంక మెరుగైనా..? గతేడాది వరుస పరాజయాలతో డీలాపడిన శ్రీలంక... ఇటీవల బంగ్లాదేశ్ పర్యటనలో వన్డే టోర్నీ, టెస్టు సిరీస్ నెగ్గి ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. జట్టులోకి తిరిగొచ్చిన యువ బ్యాట్స్‌మన్ కుశాల్ మెండిస్ చక్కగా రాణించాడు. అయితే కీలక ఆటగాళ్లు గుణరత్నే, మాథ్యూస్ దూరమవడం లంకకు లోటుగా మారనుంది. కెప్టెన్ చండిమాల్, ఓపెనర్ ఉపుల్ తరంగాలతో పాటు తిసారా పెరీరా వంటి ఆల్‌రౌండర్లున్న బ్యాటింగ్ ఆర్డర్ ప్రత్యర్థికి సవాల్ విసిరేదే. పేసర్ లక్మల్, స్పిన్నర్ అఖిల ధనంజయ ఇటీవలి సిరీస్‌లలో భారత్‌ను ఇబ్బందిపెట్టారు. సొంతగడ్డపై వీరిని ఎదుర్కొనడంలో జాగ్రత్తగా ఉండాలి. రెండో పేసర్‌గా చమీర, షనక, నువాన్ ప్రదీప్‌లలో ఎవరిని ఆడిస్తారో చూడాలి. పిచ్, వాతావరణం వికెట్ నెమ్మదిగా ఉంటుంది. ఆరంభంలో పేసర్లకు సహకరిస్తుంది. మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్ తిరగొచ్చు. సాయంత్రం వేళ వాతావరణం కొంత మేఘావృతంగా ఉండనుంది. టోర్నీ ఫేవరెట్లమా? కాదా? పూర్తి స్థాయి జట్టుతో ఆడుతున్నామా..? లేదా..? అనే విషయాలు నేను ఆలోచించడం లేదు. జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం అదృష్టం. దానిని ఓ గౌరవంగా భావిస్తా. తీరికలేని క్రికెట్ నుంచి కొంత విశ్రాంతి అవసరం. కుర్రాళ్లు ఎంతోకాలంగా స్థిరంగా రాణిస్తూ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వారెలా ఆడతారో చూడాలనుకుంటున్నాం. ఒక్క ఓవర్‌తో అంతా మారిపోయే టి20ల్లో తమదైన రోజున ఏ జట్టైనా గెలవగలదు.’ తుది జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్/రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్/దీపక్ హుడా, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, శార్దుల్ ఠాకూర్, జైదేవ్ ఉనాద్కట్. శ్రీలంక: కుశాల్ మెండిస్, గుణతిలక, కుశాల్ పెరీరా, చండిమాల్ (కెప్టెన్), ఉపుల్ తరంగ, షనక, తిసారా పెరీరా, ధనంజయ, అపొన్సొ, లక్మల్, చమీర. ►278 గత 11 ఇన్నింగ్స్‌లలో లంకపై రోహిత్ చేసిన పరుగులు. వీటిలో డిసెంబర్లో 43 బంతుల్లో చేసిన సెంచరీ కూడా ఉంది. స్ట్రైక్ రేట్ 146.31. ► 3 శ్రీలంకలో శ్రీలంకతో జరిగిన మూడు టి20 మ్యాచ్‌ల్లోనూ భారత జట్టే నెగ్గింది. ఓవరాల్‌గా రెండు జట్ల మధ్య 14 టి20 మ్యాచ్‌లు జరిగాయి. పదింటిలో భారత్, నాలుగింటిలో శ్రీలంక గెలిచాయి. -
ఎక్కడా తగ్గలేదు
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లు గెలుచుకొని సగర్వంగా తిరిగి వెళుతుండటం పట్ల తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ చాలా సంబరంగా ఉన్నాడు. చివరి టి20లో కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్, ఈ మ్యాచ్‌లో తమ వ్యూహాలన్నీ సఫలమయ్యాయని చెప్పాడు. ‘ఈ రెండు పరిమిత ఓవర్ల ట్రోఫీలను అందుకోవడం సంతోషంగా ఉంది. సిరీస్ మొత్తం మేం చాలా దూకుడుగా ఆడాం. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మా బృందం వెనకడుగు వేయలేదు. దాని వల్లే ఇవాళ విజేతలుగా ఇక్కడ నిలబడ్డాం’ అని రోహిత్ వ్యాఖ్యానించాడు. తొలి ఆరు ఓవర్లలో కచ్చితత్వంతో వికెట్లపైకి మాత్రమే బంతులు వేయాలనేది తమ వ్యూహమని, దీనిని సమర్థంగా అమలు చేసి బౌలర్లు మ్యాచ్ గెలిపించారని అతను అన్నాడు. ‘నిజాయితీగా చెప్పాలంటే మేం మరో 15 పరుగులు తక్కువగా చేశాం. మాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే చివర్లో కాస్త జోరు తగ్గింది. అయితే ఈ అనుభవంతో మున్ముందు మరిన్ని విషయాలు నేర్చుకుంటాం’ అని రోహిత్ అభిప్రాయ పడ్డాడు. ఏ జట్టుకూ సాధ్యం కాని రీతిలో గత రెండున్నర నెలలుగా అద్భుత ప్రదర్శన కనబర్చామన్న భువనేశ్వర్ కుమార్...ఈ పర్యటన తనకు మధురానుభూతిగా మిగిలిపోయిందని చెప్పాడు. -
శ్రీమతికి... ప్రేమికుల రోజు కానుక
పోర్ట్ ఎలిజబెత్: భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఐదో వన్డేలో సాధించిన సెంచరీని తన శ్రీమతి రితిక సజ్దేకు ప్రేమికుల రోజు కానుకగా ఇస్తున్నట్లు చెప్పాడు. అతని శతకంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ 4–1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై రోహిత్ మాట్లాడుతూ ‘విదేశీ గడ్డపై వన్డేల్లో మాకు ఇదే అతిపెద్ద సిరీస్ విజయం. ఈ ద్వైపాక్షిక సిరీస్‌లో మేం అద్భుతంగా ఆడాం. ఇంతకుముందు ఆస్ట్రేలియాలో (2007–08) కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ గెలిచాం. అది కూడా క్లిష్ట పరిస్థితులను ఎదురొడ్డే సాధించాం. ఈ రెండు విజయాల్ని పోల్చలేం. అయితే ఈ వన్డే సిరీస్ గెలుపు మాకు చాలా ముఖ్యమైంది. తొలి వన్డే నుంచే మా ఆధిపత్యాన్ని మొదలుపెట్టాం. ఇప్పుడు విజయంతో సంతోషంగా ఉన్నాం. 25 ఏళ్ల తర్వాత సఫారీ గడ్డపై సిరీస్ గెలవడంలో కుర్రాళ్ల పాత్ర ఎంతో ఉంది. అందరూ కఠిన సవాళ్లకు సిద్ధమయ్యారు. సమష్టిగా చెమటోడ్చి ఫలితం సాధించారు’ అని అన్నాడు. టెస్టు సిరీస్ ఓడినప్పటికీ ఏకపక్షంగా ముగియలేదని... ఆతిథ్య జట్టును దీటుగా ఎదుర్కొన్నామని చెప్పాడు. మా లక్ష్యం 5–1 చరిత్ర సృష్టించిన ఈ విజయం మా జట్టు సమష్టి ప్రదర్శన. దక్షిణాఫ్రికా సిరీస్ కోల్పోయే ఒత్తిడిలో ఉందని గ్రహించాం. సిరీస్‌లో 4–1తో నిలవడం గొప్పగా అనిపిస్తోంది. కానీ మేం 5–1తో ముగించాలని అనుకుంటున్నాం. ఇంకా ఎక్కడ లోపాలున్నాయో చర్చించుకుంటాం. వచ్చే మ్యాచ్‌లో కొందరికి అవకాశం ఇద్దామని ఆలోచిస్తున్నాం. అయినా అంతిమ లక్ష్యం విజయమే. మూడో టెస్టు నుంచి మాకు మంచి సమయం నడుస్తోంది. –భారత కెప్టెన్ కోహ్లి -
తిరుగులేని టీమిండియా.. ఆటగాళ్ల వీరవిహారం!
క్రికెట్లో విజయానికి చిరునామాగా నిలిచిన మహేంద్రసింగ్ ధోనీ నుంచి విరాట్ కోహ్లి పూర్తిస్థాయిలో కెప్టెన్సీ పగ్గాలు చేపట్టింది ఈ ఏడాదే. గత ఏడాది వరకు టెస్టుల్లో మాత్రమే కెప్టెన్‌గా కొనసాగిన కోహ్లి.. ఈ ఏడాది ధోనీ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో వన్డేలు, టీ-20ల నాయకత్వ పగ్గాలు కూడా అందుకున్నాడు. దీంతో మూడు ఫార్మెట్లలోనూ సారథిగా జట్టుపై పూర్తి పట్టు సాధించాడు. ఇక, ఈ ఏడాది అభిమానులు ఎక్కువగా కోహ్లి జపమే చేశారు. ఏడాది మొదట్లో కెప్టెన్సీ తీసుకోవడం మొదలు, చివర్లో పెళ్లి వరకూ అభిమానుల ఊహకందనిరితీలో కోహ్లి అలరిస్తూ వచ్చాడు. ఒక్క చాంపియన్ ట్రోఫీ మినహా అన్ని సిరీస్‌ల్లో విజయం సాధించి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న కొత్త పెళ్లికొడుకు కోహ్లికి వచ్చే ఏడాది ఎన్నో సవాళ్లు ముందున్నాయి. టీమిండియా విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఈ ఏడాది జరిగిన ది బెస్ట్ ఘటనలపై ఓ లుక్ వేద్దాం..(సాక్షి ప్రత్యేకం) టీమిండియా నయా కెప్టెన్.. ఈ ఏడాది మొదట్లో వన్డే, టీ20ల కెప్టెన్సీ పగ్గాలు చేపట్టిన కోహ్లి.. అటు బ్యాటింగ్‌తోనూ, ఇటు జట్టు విజయాలతోనూ అభిమానులను అలరించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌కు విశ్వరూపం చూపించాడు. 350పరుగుల లక్ష్యాన్ని కేదార్ జాదవ్ (76బంతుల్లో120) సహకారంతో కోహ్లి (104 బంతుల్లో122) అలవోకగా ఛేదించాడు.(సాక్షి ప్రత్యేకం) అలాంటి ఇన్నింగ్స్‌లు చెప్పలేనన్ని ఉన్నాయి. కెప్టెన్‌గా ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లపై వరుస సిరీస్ విజయాలు అందుకున్నాడు. ఈ విజయ పరంపరతో ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్లో నంబర్ వన్ స్థానం టీమిండియా వాకిట నిలిచింది. ఈ ఏడాది కోహ్లి టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించడం గమనార్హం. టీమిండియా ఫిట్నెస్ జపం.. ‘‘యథా రాజా తథా ప్రజా’’ అన్నట్టు ఫిట్నెస్ విషయంలో కెప్టెన్ కోహ్లిని మిగతా ఆటగాళ్లు అనుసరిస్తున్నారు. ఇప్పుడు అందరు అటగాళ్లు దేహదారుఢ్యంపై దృష్టిపెట్టి ఆటలో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రతి ఆటగాడు కోహ్లియే మాకు ఫిట్నెస్ గురువు అంటున్నాడు. కుంబ్లేతో వివాదం-కొత్త కోచ్ నియామకం కోచ్‌గా కుంబ్లే నియాయకం తర్వాత జట్టులో కొత్త ఉత్సాహంతోపాటు క్రమశిక్షణ ఎక్కువైంది. ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో కుంబ్లే కాస్త కటువుగా వ్యవహరించడంతో ఆయన మాకోద్దు బాబోయ్ అంటూ కోహ్లి అండ్ కో బీసీసీఐతో మొరపెట్టుకుంది. దీంతో కుంబ్లే బలవంతంగా తప్పుకోవాల్సి వచ్చింది. టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రిని త్రిమూర్తులు (సచిన్,గంగూలి,లక్ష్మణ్) నియమించారు. గెలిస్తే పార్టీ లేకుంటే మరింత ప్రాక్టీస్ అన్న రవిశాస్త్రి ఫార్ములా ఆటగాళ్లందరికీ నచ్చడంతో వారు ఈ కోచ్‌కు బాగా కనెక్ట్ అయ్యారు. కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కోహ్లి కెప్టెన్సీలో కొత్త వారికి పుష్కలంగా అవకాశాలు లభిస్తున్నాయి. కేఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా, హార్థిక్ పాండ్యా, మనీష్ పాండే, కేదార్ జాదవ్, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్ లాంటి వారికి వరుస అవకాశాలు లభిస్తుండగా.. సిరాజ్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ వంటి కొత్త ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు.(సాక్షి ప్రత్యేకం) స్పిన్ ద్వయం అనగానే ఒకప్పుడు కుంబ్లే-హర్భజన్, అశ్విన్-జడేజాలు గుర్తుకువచ్చేవాళ్లు.. ఇప్పుడు కుల్దీప్ యాదవ్- యజువేంద్ర చాహల్ జోడీ కూడా తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. ఆటగాళ్ల రికార్డులు ఈ ఏడాది ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కోహ్లి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో (వన్డేల్లో నంబర్ వన్, టెస్టుల్లో నం. టూ, టీ20లో నం 3) కోహ్లి సత్తా చాటుతుండగా.. టెస్ట్‌ల్లో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్న పుజారా మూడో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో ఎవరికీ సాధ్యం కానిరీతిలో డబుల్ సెంచరీలు మూడు సాధించిన రోహిత్ శర్మ.. టీ-20లో వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సొంతం చేసుకున్నాడు.(సాక్షి ప్రత్యేకం) పరిమిత ఓవర్ల క్రికెట్లో ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న హార్థిక్ పాండ్యా తమదైన రికార్డులు నెలకొల్పాడు. ఈ సంవత్సరం టెస్టులకే పరిమితమైనా అద్భుత ప్రదర్శనతో టీంఇండియా విజయాలలో స్పిన్ ద్వయం అశ్విన్-జడేజాలు తమ వంతు పాత్ర పోషించారు. ఈ ఏడాది చివర్లో కోహ్లి తన పెళ్లి కోసం విరామం తీసుకోవడంతో అతని స్థానంలో కెప్టెన్‌గా రోహిత్ శ్రీలంకతో వన్డే, టీ20ల సిరీస్‌లో రాణించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఐపీఎల్ అదుర్స్, ముచ్చటగా మూడోసారి ముంబై ఈ సారి ఐపీఎల్లో భారత ఆటగాళ్లు వ్యక్తిగత ప్రదర్శనతో ఆకట్టుకోగా.. కొత్త ఆటగాళ్లు తెరపైకి వచ్చారు. కృనాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శన ముంబై కప్ గెలువడంలో కీలకపాత్ర పోషించింది. కోహ్లి ఉండటంతో బెంగళూర్‌పై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్నా బౌలింగ్ బలహీనంగా ఉండటంతో ఈసారి బెంగళూరు జట్టు అభిమానులకు నిరాశ మిగిలించింది. (సాక్షి ప్రత్యేకం) అదరగొట్టిన మహిళల క్రికెట్ టీం క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది డబుల్ బొనాంజా అందించిందని చెప్పవచ్చు. పురుషుల జట్టు వరుస విజయాలతో అదరగొట్టగా.. మహిళల జట్టు అద్భుతమైన పోరాటపటిమతో ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకొని అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. హర్మన్‌ప్రీత్ కౌర్, మిథాలీరాజ్, ఏక్తాబిస్త్, జులాన్ గోస్వామి, రాజేశ్వరీ గైక్వాడ్ తదితర మహిళా క్రికెటర్లు తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మొదటిసారిగా ప్రపంచకప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయగా.. టీమిండియా మ్యాచ్‌లకు భారత్‌లో విశేష ఆదరణ లభించింది. (సాక్షి ప్రత్యేకం)సెమీఫైనల్లో హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసీస్‌పై సెంచరీ చేసి జట్టును గెలిపించగా.. ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓడినప్పటికీ.. భవిష్యత్‌లో మహిళల క్రికెట్ జట్టు అద్భుతాలు సాధించగలదని అభిమానుల్లో ఆశలు నింపింది. చివర్లో పెళ్లి విందు ఆటతోపాటు ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచిన విరాట్ కోహ్లి ఎట్టకేలకు తన ప్రియురాలు అనుష్క శర్మను పెళ్లాడారు. వీరిద్దరూ గత కొద్దిరోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంకతో టెస్టు సిరీస్ ముగిశాక హఠాత్తుగా విరామం తీసుకున్న కోహ్లి.. పెద్దగా హడావిడి లేకుండా ఇటలీకి వెళ్లి.. డిసెంబర్11న అనుష్క శర్మను పెళ్లి చేసుకున్నాడు. ఇటలీలోని టస్కనీ పట్టణంలో వీరి వివాహం కొద్దిమంది సన్నిహితుల నడుమ అట్టహాసంగా జరిగింది. ఇదిగో మా పెళ్లి ఇలా జరిగిందంటూ తమ పెళ్లి ఫొటోలను కోహ్లి, అనుష్క ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నారు.(సాక్షి ప్రత్యేకం) ఆ ఫొటోలు అభిమానులకు తెగ నచ్చేశాయి. ఈ ఏడాది అతిపెద్ద పెళ్లి వేడుకగా ఇది నిలిచింది. అనంతరం ఢిల్లీలో, ముంబైలో కోహ్లి-అనుష్క జంట అన్ని రంగాల ప్రముఖులకు వివాహ విందు ఇచ్చింది. -
కొత్త కుర్రాళ్ల లోకం!
ఓపెనర్‌గా రోహిత్ జోడీ ఎవరు? రాహుల్‌కు తుది జట్టులో చోటుంటుందా? మిడిలార్డర్లో భారాన్ని మోసేదెవరు? బుమ్రాతో కొత్త బంతి పంచుకునేదెవరు? పదునైన యార్కర్ల థంపి అరంగేట్రం చేస్తాడా? హిట్టర్ దీపక్ హుడాకు అవకాశమిస్తారా? కుర్రాడైన వాషింగ్టన్ సుందర్‌ను పరీక్షిస్తారా? శ్రీలంకతో బుధవారం ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌కు భారత తుది జట్టు కూర్పుపై ఇవీ సగటు క్రికెట్ అభిమాని సందేహాలు. రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి, సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్, పేసర్ భువనేశ్వర్‌కు విశ్రాంతినివ్వడంతో ఈ పొట్టి ఫార్మాట్ సిరీస్‌లో భారత్ అన్ని విభాగాల్లో కొత్త మేళవింపులతో బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాక్షి క్రీడావిభాగం: టెస్టు, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న భారత జట్టు చివరిదైన టి20 సిరీస్‌నూ గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉంది. రోహిత్ శర్మ (68 మ్యాచ్‌లు), ధోని (83 మ్యాచ్‌లు), బుమ్రా (30 మ్యాచ్‌లు), హార్దిక్ పాండ్యా (24 మ్యాచ్‌లు) మినహా జట్టులోని మిగతా వారికి అంతర్జాతీయ టి20ల్లో అంతగా అనుభవం లేదు. శ్రీలంక ఎలాగూ ప్రమాదకర ప్రత్యర్థి కాదు కాబట్టి... సమీకరణాల ప్రకారం చూస్తే తొలిసారి టి20 జట్టులోకి ఎంపికైన వాషింగ్టన్ సుందర్, బాసిల్ థంపి, దీపక్ హుడా అరంగేట్రం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాతో పాటు భారం పంచుకునేది ఎవరనే ఆసక్తి కలుగుతోంది. రెండో ఓపెనర్ ఎవరో? రెగ్యులర్ ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ శర్మ రావడం ఖాయం. మరి రెండో ఓపెనర్ ఎవరు? ఈ స్థానం కోసం రాహుల్, శ్రేయస్ అయ్యర్లలో ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. తాజా ఫామ్‌ను లెక్కలోకి తీసుకుంటే అయ్యర్‌కే ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే... తన తొలి టి20 మ్యాచ్‌లోనే విండీస్ గడ్డపై సెంచరీతో అదరగొట్టిన రాహుల్ అవకాశాలను తోసిపుచ్చలేం. వేగంగా, భారీ షాట్లు ఆడగలగడం అతడి ప్రత్యేకత. టెస్టుల్లో వచ్చినట్లు టి20ల్లో రాహుల్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక శ్రేయస్ రెండు వరుస అర్ధ శతకాలతో వన్డేల్లో సత్తా చాటాడు. ఖాళీల్లోకి బంతిని కొడుతూ కళాత్మకంగా ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో మిడిలార్డర్‌ను మరింత పటిష్టం చేయాలనుకుంటే ఇతడిని ఓపెనర్‌గా తీసుకొచ్చి అక్కడ మరొకరికి చోటిచ్చే ఆలోచన చేయొచ్చు. ఇదే జరిగితే రాహుల్ బెంచ్‌కు పరిమితం కావాల్సి ఉంటుంది. ఇంకా కావాలంటే జట్టు మేనేజ్మెంట్ దినేశ్ కార్తీక్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించే ప్రయోగమూ చేయొచ్చు. మిడిలార్డర్ సంగతేంటి? ఇటీవల జట్టును ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న అంశం మిడిలార్డర్. సీనియర్లు, ఫినిషర్ల అవసరం ఎక్కువగా ఉండే ఇలాంటి చోట వైఫల్యం పరాజయాలకు దారితీస్తోంది. ఒకవేళ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపి, వన్‌డౌన్‌లో అయ్యర్‌ను ఆడిస్తే మిగిలేది 4, 5, 6 స్థానాలు. వీటిలో 6వ స్థానం ధోనిదే. మిగతా రెండింటికి మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్ పోటీలో ఉన్నారు. 7వ స్థానంలో హార్దిక్ పాండ్యా కుదురుకున్నాడు. ధనాధన్ మ్యాచ్‌లు కావడంతో పరిస్థితిని బట్టి పాండ్యాను ఇంకా ముందుకు పంపే ఆలోచన చేయొచ్చు. మంచి ఫీల్డర్ అయిన మనీశ్ పాండే వరుసగా విఫలమవుతున్నాడు. వాషింగ్టన్ సుందర్, దీపక్ హుడా వంటి ఆల్‌రౌండర్లతో బౌలింగ్‌ను మరింత పటిష్ఠం చేసి, వైవిధ్యం చూపాలనుకుంటే మనీశ్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇక చహల్, కుల్దీప్ ప్రధాన స్పిన్నర్లు. టి20 సిరీస్‌లోనూ వీరే బాధ్యతలు తీసుకోవచ్చు. లంక జట్టులో ఎడంచేతి వాటం బ్యాట్స్‌మెన్ ఎక్కువ కాబట్టి వీరికితోడుగా సుందర్, హుడాలలో ఒకరిని ఆడించవచ్చు. ‘పేస్’ వైపే చూపంతా..! ప్రస్తుత సిరీస్‌లో ప్రధాన బౌలర్ బుమ్రాతో బంతిని పంచుకునే పేసర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే హైదరాబాదీ సిరాజ్‌కు ఒక అవకాశం దక్కింది. మిగిలింది కేరళ స్పీడ్‌స్టర్, యార్కర్ల దిట్ట బాసిల్ థంపి, జయదేవ్ ఉనాద్కట్. ఎడంచేతి వాటంతో పాటు, కొంత అనుభవం ఉన్న ఉనాద్కట్‌కు రెండో పేసర్‌గా ప్రాధాన్యం దక్కవచ్చు. సిరీస్ ఫలితం ముందుగా తేలిపోతే... చివరి మ్యాచ్‌కు సరికొత్త మేళవింపును చూసే అవకాశముంటుంది. ►7 భారత్, శ్రీలంక జట్ల మధ్య ఇప్పటివరకు మొత్తం 11 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ ఏడింటిలో గెలుపొందగా... శ్రీలంక నాలుగింటిలో విజయం సాధించింది. ► 211 శ్రీలంకపై టి20ల్లో భారత్ అత్యధిక స్కోరు. 2009లో మొహాలీలో 207 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ టీమిండియా ఈ స్కోరు చేసింది. ► 101 శ్రీలంకపై భారత్ అత్యల్ప స్కోరు. 2016లో పుణేలో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ ఓడింది. ► 88 ఇప్పటివరకు భారత్ ఆడిన టి20 మ్యాచ్‌లు. ఇందులో 52 గెలిచి, 33 ఓడింది. ఒక మ్యాచ్ ‘టై’ కాగా... రెండింటిలో ఫలితం రాలేదు. ► 15 స్వదేశంలో భారత్ 28 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 15 విజయాలు, 13 పరాజయాలు ఉన్నాయి. ► 6 వీరేంద్ర సెహ్వాగ్, ధోని, సురేశ్ రైనా, అజింక్య రహానే, విరాట్ కోహ్లి తర్వాత టి20ల్లో భారత్‌కు నాయకత్వం వహించనున్న ఆరో కెప్టెన్ రోహిత్ శర్మ. -
ముందే అనుకున్నా ఆసాంతం ఆడాలని...
రోహిత్ శర్మ... మూడో డబుల్ సెంచరీతో మరో సంచలన ఇన్నింగ్స్‌కు తెరతీసిన భారత ఓపెనర్. నాయకుడిగా తొలి మ్యాచ్‌లోనే ఎదురైన చిత్తు ఫలితంతో నీరుగారిపోలేదు. ఓపిగ్గా ఆడటంపైనే దృష్టి పెట్టాడు. దీంతో మరో మ్యాచ్ మొదలయ్యేసరికే అసాధారణ ప్రదర్శనకు కేంద్రబిందువయ్యాడు. మొహాలీ: సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవాలనే లక్ష్యంతోనే బ్యాటింగ్ ప్రారంభించానన్నాడు భారత కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలో వన్డే క్రికెట్ చరిత్రలో మూడో డబుల్ సెంచరీ బాదిన బ్యాట్స్‌మన్‌గా పుటల్లోకి ఎక్కాడు. రెండో వన్డేలో డబుల్ సెంచరీ చేసిన ఈ ఓపెనర్ మ్యాచ్ ముగిశాక బీసీసీఐ.టీవి వెబ్సైట్ కోసం హెడ్ కోచ్ రవిశాస్త్రికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అద్భుతమైన బ్యాటింగ్‌ను ఇలా చెప్పుకొచ్చాడు. వికెట్‌ను పారేసుకోవద్దనుకున్నా... అంత తేలిగ్గా వికెట్‌ను పారేసుకోవద్దని అనుకున్నా. క్రీజ్ నుంచి నిష్క్రమించొద్దని గట్టిగా నిర్ణయించుకున్నా. సాధ్యమైనంత ఎక్కువ సేపు క్రీజులో నిలబడాలని స్వయంగా నిర్దేశించుకున్నాను. ముందుగా నిలదొక్కుకుంటే పిచ్‌నుంచి ఎదురయ్యే సవాల్‌ను అధిగమించవచ్చని ధావన్‌తో చెప్పాను. ఆరంభమే కీలకం... పిచ్ పరిస్థితుల దృష్ట్యా ఆరంభ ఓవర్లే కీలకమనిపించింది. క్రీజులో పాతుకుపోతే... మిగతా పని సులువవుతుందని ఓపెనర్లిద్దరం భావించాం. భారీ ఇన్నింగ్స్‌కు భాగస్వామ్యాలెంత మేలు చేస్తాయో తెలుసు కాబట్టే అంత తేలిగ్గా షాట్లను ఎంచుకోలేదు. 209, 264, 208... అన్నీ విలువైనవే... నా మూడు ద్విశతకాల్లో ఏది ఎక్కువ ఇష్టమంటే చెప్పటం కష్టం. ఈ మూడు నేను క్లిష్టమైన సందర్భాల్లోనే చేశాను. సిరీస్ ఫలితాన్ని తేల్చే నిర్ణాయక మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై (209) సాధించా. అలాగే గాయం నుంచి కోలుకోగానే పరుగులు చేస్తానో లేదో అనే సందిగ్ధస్థితిలో లంకపై (264) సత్తా చాటుకున్నా. ఇక ఇప్పుడు... సిరీస్‌లో చెత్తగా, చిత్తుగా వెనుకబడిన దశలో చేశా. దీంతో ఇవన్నీ నాకు ప్రత్యేకమైనవే. నేను ధోనిని కాదు... గేల్‌నూ కాదు ‘నాకు తెలుసు నేనేమీ ధోనిని, గేల్‌ను కాదని. వాళ్లంత పవర్ నాలో లేదని. నేను నమ్ముకుంది టైమింగ్‌నే. ఓపిగ్గా బంతి కోసం కాచుకున్నా. చెత్త బంతిపైనే చెలరేగా. వాళ్లయితే ఏ బంతినైనా అలవోకగా బాదేస్తారు. నా కోచ్ శంకర్ బసు నా పాత్రకు తగ్గట్లు నన్ను తయారు చేశారు. అయనకు థ్యాంక్స్. -
‘సూపర్ హిట్’ మ్యాన్...
సాక్షి క్రీడా విభాగం: అపార ప్రతిభావంతుడు... అందుకు తగిన న్యాయం చేయలేడు... సుదీర్ఘ సమయం ఆడగలడు... కానీ మ్యాచ్ విన్నర్ అని భరోసా లేదు... అగ్రశ్రేణి బ్యాట్స్‌మనే... తేలిగ్గా వికెట్ ఇచ్చేస్తాడు... నైపుణ్యంలో కోహ్లి కంటే మిన్న... అయినా అతడిలా కసికసిగా కనిపించడు... అన్నీ ఉన్నా ఇంకా ఏదో లోటు... ఇవీ రోహిత్ గురించి ఉన్న విశ్లేషణలు. బహుశా భారత క్రికెట్లో ఏ ఆటగాడికీ ఇన్ని ఘనతలు–లోపాలు ఆపాదించి ఉండరేమో! ఈ ముంబై బ్యాట్స్‌మన్‌కు మాత్రం అంతా అలా జరిగిపోయింది. కొన్నిసార్లు అతడి బాడీ లాంగ్వేజ్, ప్రదర్శన ఇందుకు తగ్గట్లే ఉండేవి. దీంతో మళ్లీ మళ్లీ ఉనికి చాటుకోవాల్సిన పరిస్థితి. మారుతున్నాడు... రోహిత్ మారాడు. మారుతున్నాడు. ఇంకా మారగలడు! కొన్నేళ్లుగా అతడి ప్రస్థానం గమనిస్తే ఇది స్పష్టమవుతోంది. ఐపీఎల్లో సారథ్యం పుణ్యాన ఒత్తిడిని అధిగమించడం నేర్చుకున్నాడు. ఓపెనింగ్‌కు మారాక స్థిరత్వం అలవర్చుకున్నాడు. జట్టులోని పోటీ దృష్ట్యా చురుకుదనం ఒంటబట్టించుకున్నాడు. ప్రతిఫలంగానే టెస్టు టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న అతడికి పరిస్థితుల రీత్యా వన్డే సారథ్యమూ దక్కింది. కోహ్లి తర్వాత అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అనే అనధికారిక గుర్తింపుగానూ దీనిని భావించవచ్చు. వారిద్దరి తర్వాత ఇతడేనా..! భారత వన్డే క్రికెట్ బ్యాట్స్‌మెన్‌లో ఇప్పటికి తొలి రెండు స్థానాలు సచిన్, కోహ్లిలవే. గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్‌ల శకం ముగిసింది. ధోనీ, యువరాజ్ కెరీర్ చరమాంకంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో పరుగుల పరంగా చూసుకున్నా, వయసు ప్రకారం అంచనా వేసినా సచిన్, కోహ్లిల తర్వాతి స్థానం ఆక్రమించేందుకు రోహిత్‌కు అవకాశం ఉంది. 30 ఏళ్ల రోహిత్ సునాయాసంగా అయిదారేళ్లు ఆడగలడు. ఓపెనర్ అవతారమెత్తిన ఈ నాలుగేళ్లలోనే మూడు డబుల్ సెంచరీలు బాదిన లెక్కలను బేరీజు వేసుకుంటే భారత్ తరఫున అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానానికి చేరడం ఖాయంగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఆరు సెంచరీల ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటే మున్ముందు రెండో స్థానానికి కోహ్లితో సైతం ‘పరుగు’ పోటీలో ఉంటాడేమో అనిపిస్తోంది. 300 కొట్టేస్తాడేమో! మొహాలీలో రోహిత్ ఆడిన బంతులు 153. ఇందులో శతకానికే 115 (అర్ధ సెంచరీకి 65, సెంచరీకి 50) పోయాయి. ద్విశతకం చేరుకోవడానికి మరో 36 మాత్రమే ఆడాడు. వాస్తవానికి ఈ వేగం తొలి నుంచి కానీ, 50 పూర్తయ్యాక కానీ చూపెడితే తన అత్యధిక స్కోరు (264)ను అధిగమించేవాడేమో. ఇంకొంచెం ముందుకు ఆలోచిస్తే వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ చేసేవాడేమో. ఇంకేం చేయాలి... ప్రస్తుతం రోహిత్ టైమ్ నడుస్తోంది. ఈ ఊపును కొనసాగించాలి. ఇంకా మెరుగయ్యేందుకు అవకాశాలు సృష్టించుకోవాలి. ఈ విషయంలో కోహ్లినే స్ఫూర్తిగా తీసుకోవాలి. దీనికి చేయాల్సిందల్లా ఆట, బాడీ లాంగ్వేజ్, శారీరక దారుఢ్యం, గెలుపు కాంక్షల్లో 2008 నాటి కోహ్లికి, 2017 నాటి కోహ్లికి ఎంత తేడా ఉన్నదో ఒక్కసారి పరిశీలించడమే. ఇక రోహిత్ మధ్యలో బరువు పెరిగి, ఆట లయ తప్పి వేటుకు గురవడం మినహా.. 2008లో ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉన్నాడు. ఇప్పుడు అనుభవం వచ్చింది, జట్టులో స్థానానికి ఢోకా లేదు కాబట్టి ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపుతూ చురుకుగా వ్యవహరించాలి. -
శ్రీమతికి బహుమతి
మా రెండో పెళ్లి రోజున చేసిన ఈ ద్విశతకం నా శ్రీమతి రితికా సజ్దేకు అంకితం. ఈ ప్రత్యేక సందర్భంలో ఆమె ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఆమే నా బలం. నా కోసం ఎప్పుడూ అక్కడే ఉండాలి. ఈ ఒత్తిడి ఆటలో అది ప్రత్యేకంగా నిలుస్తుంది. మ్యాచ్‌లో ఎలా వ్యవహరించాలనేదానిపై గట్టిగా నిర్ణయించుకున్నాం. దానినే చివరి వరకు అమలు చేశాం. ఇప్పుడిక విశాఖపట్నం మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాం. నా ద్విశతకాల్లో మూడూ కీలక సమయాల్లోనే చేశా. ఏదో ఒకదానిని ఎంచుకోమంటే మాత్రం చెప్పలేను. గాయం నుంచి కోలుకుని కోల్‌కతాలో చేసిన 264ను కొంచెం ఎక్కువ గుర్తుంచుకుంటా. ధర్మశాలలో ఓడిపోయి జట్టుగా పై చేయి సాధించాల్సిన స్థితిలో చేసిన ప్రస్తుత డబుల్ సెంచరీ కూడా ప్రత్యేకమైనదే. ఈ మ్యాచ్‌లో తొలి వంద పరుగులను వేగంగా చేసినా... వికెట్ ఇచ్చేవాడిని కాదు. నా గత డబుల్ సెంచరీలను కూడా నిదానంగానే ప్రారంభించి చేశాను. – రోహిత్ శర్మ, భారత కెప్టెన్ మూడూ (ముద్దూ) ముచ్చట... 49వ ఓవర్ ముగిసేసరికి రోహిత్ స్కోరు 191 పరుగులు... అతను డబుల్ పూర్తి చేయగలడా అని అందరిలో ఉత్సుకత. గ్యాలరీలో కూర్చున్న అతని భార్య రితిక మొహంలో ఎంతో ఆందోళన కనిపిస్తోంది. అయితే పెరీరా వేసిన తొలి బంతినే రోహిత్ సిక్స్ సాయంతో 197కు చేరుకున్నాడు. తర్వాతి బంతికి రెండు పరుగులు తీసే ప్రయత్నంలో రనౌటయ్యే ప్రమాదం కనిపించింది. ఈ సమయంలోనైతే రితిక చూడలేక కళ్లు మూసుకుంది. అనంతరం మూడో బంతిని మిడ్‌వికెట్ దిశగా ఆడి డబుల్ పూర్తి చేసుకున్న రోహిత్ గాల్లోకి ఎగిరి గర్జన చేశాడు. అతనితో పాటు రితిక కూడా భావోద్వేగాలు దాచుకోలేక కంట తడి పెట్టింది. డిసెంబర్ 13 వీరిద్దరి పెళ్లి రోజు కూడా కావడంతో రోహిత్ తన ఉంగరం వేలిని చుంబిస్తూ రితిక వైపు ముద్దులు విసిరి సంబరం జరుపుకోవడం స్టేడియంలోని అభిమానుల మోముపై చిరునవ్వులు పూయించేలా చేసింది. -
'డబుల్' ట్రిపుల్
రోహిత్ శర్మ కొడితే అలా ఇలా ఉండదు... ఎలా ఉంటుందంటే శ్రీలంకను అడిగితే చెబుతుంది. అటు క్లాస్, ఇటు మాస్ కలగలిపి సాగిన రోహిత్ బాదుడుకు క్రికెట్ ప్రపంచం కొత్త రికార్డులతో స్వాగతం పలికింది. వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం అంటే ఎవరెస్ట్‌ను ఎక్కినంత సంబరంగా భావించే సమయంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు డబుల్ సెంచరీలతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు ఈ ముంబైకర్. ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇంతకు ముందే రెండో ద్విశతకంతో మురిపించిన అతను మరో హీరోచిత ఇన్నింగ్స్‌తో దిగ్గజ ఆటగాళ్ల జాబితాలో చేరాడు. వన్డేల్లో ఏడు డబుల్ సెంచరీలు నమోదైతే మూడు రోహిత్‌వే ఉండటం అతని స్థాయిని చూపిస్తోంది. గతంలోనే ఒకసారి రోహిత్ దెబ్బ రుచి చూసిన శ్రీలంకను భారత హిట్‌మ్యాన్ మళ్లీ ఆడుకున్నాడు. బంతి వేస్తే చాలు రాకెట్ వేగంతో గాల్లో తేలుతూ అలా సిక్సర్‌గా మారుతుంటే లంక ఆటగాళ్లు నిస్సహాయంగా మారిపోయి ప్రేక్షకుల్లా చూస్తుండిపోయారు. 13 ఫోర్లు, 12 సిక్సర్లు... 124 పరుగులు బౌండరీల రూపంలోనే రాబట్టి రోహిత్ వీర విధ్వంసం సృష్టించాడు. అతడిని అవుట్ చేయడం తమ వల్ల కాదంటూ లంక చేతులెత్తేసిన వేళ ఈ భారత బ్యాట్స్‌మన్ తనకు సుస్థిర స్థానాన్ని తనే స్వయంగా లిఖించుకున్నాడు. తన చండ ప్రచండ బ్యాటింగ్‌తో కెప్టెన్‌గా కూడా తొలి విజయాన్ని అందుకున్నాడు. మొహాలీ: తొలి మ్యాచ్‌లో పరాజయానికి భారత్ అదే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంది. బలమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని కుదేలు చేసి గట్టిగా బదులిచ్చింది. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును ముందుండి గెలిపించాడు. బుధవారం ఇక్కడ జరిగిన రెండో వన్డేలో భారత్ 141 పరుగుల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (153 బంతుల్లో 208 నాటౌట్; 13 ఫోర్లు, 12 సిక్సర్లు) డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతనికి శ్రేయస్ అయ్యర్ (70 బంతుల్లో 88; 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శిఖర్ ధావన్ (67 బంతుల్లో 68; 9 ఫోర్లు) అండగా నిలిచారు. అనంతరం లంక 50 ఓవర్లలో 8 వికెట్లకు 251 పరుగులే చేయగలిగింది. మాథ్యూస్ (132 బంతుల్లో 111 నాటౌట్; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం చేసినా లాభం లేకపోయింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో, చివరి వన్డే ఆదివారం విశాఖపట్నంలో జరగనుంది. రాణించిన ధావన్, అయ్యర్... టాస్ గెలిచిన శ్రీలంక గత మ్యాచ్‌లాగే పిచ్‌పై తేమను నమ్ముకొని భారత్‌కు బ్యాటింగ్ అప్పగించింది. ఆ జట్టు ఆశించిన విధంగానే తొలి పది ఓవర్ల పాటు లంకదే ఆధిపత్యం సాగింది. కానీ ఆ తర్వాత రోహిత్ వీర విజృంభణకు తోడు అయ్యర్, ధావన్ ఆట మొత్తం సీన్‌ను మార్చేసింది. ఆరంభంలో బంతి బాగా స్వింగ్ కావడంతో పాటు భారత ఓపెనర్లు కూడా జాగ్రత్తగా ఆడటంతో పరుగులు పెద్దగా రాలేదు. ఫలితంగా పవర్‌ప్లే ముగిసే సరికి జట్టు 33 పరుగులే చేయగలిగింది. అయితే 11వ ఓవర్లో ధావన్ వరుసగా రెండు ఫోర్లతో దూకుడు మొదలు పెట్టిన తర్వాత జట్టు దూసుకుపోయింది. అనంతరం ప్రదీప్ ఓవర్లో ధావన్ మరో 3 బౌండరీలతో జోరు పెంచి 47 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్ది సేపటికే పతిరాణా బౌలింగ్‌లో ధావన్ అవుట్ కావడంతో 115 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా ధాటిగా ఆడుతూ రోహిత్‌కు సహకారం అందించాడు. చూడచక్కటి షాట్లతో సరిగ్గా 50 బంతుల్లోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేశాడు. లక్మల్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు కొట్టి సెంచరీ దిశగా వెళ్లిన అయ్యర్ దురదృష్టవశాత్తూ ఆ మైలురాయిని అందుకోలేకపోయాడు. రోహిత్, అయ్యర్ రెండో వికెట్‌కు 213 పరుగులు జోడించారు. ధోని (7), పాండ్యా (8) విఫలమైనా... రోహిత్ జోరుతో చివరి 10 ఓవర్లలో భారత్ 147 పరుగులు సాధించింది. మాథ్యూస్ మినహా... దాదాపు అసాధ్యంగా కనిపించిన లక్ష్య ఛేదనలో శ్రీలంక జట్టు పూర్తిగా తడబడింది. మాథ్యూస్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. నాలుగో ఓవర్లో తరంగ (7) వెనుదిరగ్గా, గుణతిలక (16) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. తొలి మ్యాచ్ ఆడుతున్న∙వాషింగ్టన్ సుందర్... తిరిమన్నె(21)ను అవుట్ చేయడంతో కెరీర్లో తొలి వికెట్ దక్కించుకున్నాడు. «డిక్వెలా (22)ను చహల్ పెవిలియన్ చేర్చాడు. మాథ్యూస్, డిక్వెలా నాలుగో వికెట్‌కు జోడించిన 53 పరుగులే ఆ జట్టులో అత్యధిక భాగస్వామ్యం. ఆ తర్వాత గుణరత్నే (34; 5 ఫోర్లు) కొద్ది సేపు మాథ్యూస్‌కు సహకరించాడు. చివరకు 122 బంతుల్లో మాథ్యూస్ తన కెరీర్లో రెండో సెంచరీ పూర్తి చేసుకున్నా... జట్టును గెలిపించడంలో మాత్రం విఫలమయ్యాడు. పరుగులు పోటెత్తాయిలా... తొలి వంద పరుగులు పూర్తి చేసేందుకు 115 బంతులు పడితే... తర్వాతి వందకు రోహిత్‌కు 36 బంతులే సరిపోయాయి. ఆట సాగిన కొద్దీ అతని ఇన్నింగ్స్ ఎంత భీకరంగా సాగిందో చెప్పేందుకు ఇది చాలు. ఎప్పటిలాగే రోహిత్ తనదైన శైలిలో నెమ్మదిగా ప్రారంభించి... తర్వాత మెల్లగా వేగం పెంచి చివర్లో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ గత రెండు డబుల్ సెంచరీల సమయంలో కూడా దాదాపు ఇదే తరహాలో పరుగులు చేశాడు. ఈ సారి మొహాలీలో పెద్ద బౌండరీలు కూడా ఈ హిట్‌మ్యాన్ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయాయి. మాథ్యూస్ వేసిన తొలి ఓవర్‌ను రోహిత్ మెయిడిన్‌గా ఆడాడు. చివరకు 9వ బంతికి అతను ఖాతా తెరిచాడు. గత మ్యాచ్ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని నిలదొక్కుకునేందుకే ప్రాధాన్యతనివ్వడంతో పవర్‌ప్లేలో అతని స్కోరు 32 బంతుల్లో 15 మాత్రమే. పతిరాణా వేసిన ఓవర్లో రెండు ఫోర్లతో మొదటి సారి రోహిత్ బ్యాటింగ్‌లో చమక్కు కనిపించింది. 65 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తయిన తర్వాత అతను మెల్లగా గేర్లు మార్చాడు. ప్రదీప్ వేసిన 27వ ఓవర్లో తన ట్రేడ్‌మార్క్ స్టయిల్లో లాంగాన్ మీదుగా కొట్టిన సిక్సర్ డజనులో మొదటిది. ఆ తర్వాత పతిరాణా బౌలింగ్‌లో సింగిల్‌తో రోహిత్ కెరీర్లో 16వ సెంచరీ పూర్తయింది. శతకం దాటినా కూడా అప్పటిదాకా ఆడింది సాధారణ ఇన్నింగ్స్‌లాగే కనిపించింది. 43వ ఓవర్ ముగిసే సరికి రోహిత్ స్కోరు 126 బంతుల్లో 116 పరుగులే. ఆ తర్వాత మొదలైంది అసలు ప్రభంజనం. ధర్మశాల హీరో లక్మల్ వేసిన 44వ ఓవర్ రెండో బంతిని మిడ్‌వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. ఆ వెంటనే పట్టు తప్పి లక్మల్ వైడ్ వేశాడు. ఆ తర్వాతి మూడు బంతులను 6, 6, 6 లుగా బాది అతనికి రోహిత్ తనేమిటో చూపించాడు. ప్రదీప్ వేసిన మరుసటి ఓవర్లో కూడా వరుసగా రెండు సిక్సర్లతో రోహిత్ 150కు చేరుకున్నాడు. అదే ప్రదీప్‌కు తర్వాతి ఓవర్లో వరుసగా 4,4,6తో మళ్లీ రోహిత్ చేతిలో శిక్ష పడింది. రోహిత్ ఈ ఇన్నింగ్స్‌లో తాను ఆడిన చివరి 27 బంతుల్లో 11 సిక్సర్లు, 3 ఫోర్లతో ఏకంగా 92 పరుగులు సాధించగా... ప్రదీప్ పరుగులు ఇవ్వడంలో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సరిగ్గా మూడేళ్ల క్రితం రోహిత్ చేతిలోనే చావుదెబ్బ తిన్న శ్రీలంకకు ఈసారి మళ్లీ అలాంటి అనుభవమే ఎదురైంది. ►153 బంతుల్లో 208 నాటౌట్ ►13 ఫోర్లు ►12 సిక్స్‌లు ►3 రోహిత్ వన్డే కెరీర్లో డబుల్ సెంచరీల సంఖ్య. గతంలో ఆస్ట్రేలియాపై (209; 2013లో బెంగళూరులో), శ్రీలంకపై (264; 2014లో కోల్‌కతాలో) డబుల్ సెంచరీలు చేశాడు. సచిన్, సెహ్వాగ్, గేల్, గప్టిల్ ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు. ►220 భారత్ తరఫున వన్డేల్లో బరిలోకి దిగిన 220వ క్రికెటర్‌గా 18 ఏళ్ల వాషింగ్టన్ సుందర్ గుర్తింపు పొందాడు. ►100 వన్డేల్లో 300 అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం భారత్‌కిది 100వ సారి. ఆస్ట్రేలియా (96 సార్లు) రెండో స్థానంలో ఉంది. ►1 ఒక ఏడాదిలో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్ (45) నిలిచాడు. సచిన్ 1998లో 40 సిక్స్‌లు కొట్టాడు. -
ఓడితే... సిరీస్ గెలవలేం
ఒకటే కదా ఓడాం అంటే కుదరదిపుడు! ఈ రెండో మ్యాచ్ నెగ్గితేనే సిరీస్‌లో నిలవగలం, ఆ తర్వాత గెలవగలం. ఇందులోనూ ఓడితే స్వదేశంలో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను సమర్పించుకుంటాం. కాబట్టి చెత్త ఆటతీరును, కొత్త ప్రయోగాలను పక్కన బెట్టాలి. ఒత్తిడిని అధిగమించి ఫలితాన్ని రాబట్టాలి. మూడు వన్డేల సిరీస్‌లో ఇక్కడ 1–1తో నిలువరిస్తేనే వైజాగ్‌లో తేల్చుకోవచ్చు. రోహిత్ సేన తస్మాత్ జాగ్రత్త! మొహాలి: టీమిండియా ఇప్పుడు రెండు లక్ష్యాలతో బరిలోకి దిగాలి. మైదానంలో దిగడానికి ముందే ఒత్తిడిని జయించాలి. ఆ తర్వాతే ప్రత్యర్థి పని పట్టాలి. ఈ రెండు పూర్తయితేనే సిరీస్ గురించి ఆలోచించాలి. ప్రస్తుతం రోహిత్ సేన చేయాల్సింది ఇదే. బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరు కలిసికట్టుగా కదంతొక్కాలి. ఈ వన్డేలో గెలిస్తేనే... సిరీస్ ఆశల్ని సజీవంగా ఉంచుకుంటాం. లేదంటే శ్రీలంక ప్రతీకారానికి మనమే మరో బాట వేస్తాం. సిరీస్‌లో శుభారంభం చేసిన శ్రీలంక... రెట్టింపైన ఆత్మవిశ్వాసంతో బుధవారం జరిగే రెండో వన్డేకు సై అంటోంది. ఈ డే నైట్ మ్యాచ్ కూడా ఉదయం 11.30 గంటలకే ఆరంభమవుతుంది. చేజారితే... చేతికందదు! చావోరేవో తేల్చుకునే మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలవాలి. తొలి వన్డేలాగే ఒక వేళ టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగితే భారత బ్యాట్స్‌మెన్‌కు కఠిన పరీక్షే ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కమ్ ఓపెనర్ రోహిత్ శర్మ బ్యాటింగ్ భారాన్ని జాగ్రత్తగా మోయాలి. మిడిలార్డర్ యువకులతో నిండి ఉంది. నిప్పులు చేరిగే లక్మల్ బౌలింగ్‌కు యువ బ్యాట్స్‌మెన్ మళ్లీ తలొగ్గితే పరుగుల రాక గగనమవుతుంది. కాబట్టి టాపార్డర్‌లో ధావన్ కూడా ఓపిగ్గా ఆడాల్సి ఉంటుంది. ఒక మోస్తరు స్కోరు వస్తే మిగతా కథను నడిపించేందుకు ధనాధన్ ధోని ఉండనే ఉన్నాడు. తొలి వన్డేలో పక్కన బెట్టిన రహానేకు చాన్స్ దక్కొచ్చు. అందివచ్చిన అవకాశాల్ని దినేశ్ కార్తీక్, మనీశ్ పాండేలు సద్వినియోగం చేసుకోవాలి. బౌలింగ్‌లో బుమ్రా, భువనేశ్వర్‌లతో పాటు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, చహల్ నిలకడ చూపెడితే గెలుపు కష్టం కాదు. ఒకవేళ అలసత్వంతో ఆడి ఈ మ్యాచ్‌ను చేజార్చుకుంటే ఇక సిరీస్ చేతికందదు. సిరీస్‌పైనే లంక కన్ను మొదట తొలి టెస్టులో, అనంతరం ఇపుడు తొలి వన్డేలో పర్యాటక జట్టు శ్రీలంక తమ పేస్ పదునుతోనే ఆతిథ్య జట్టును దెబ్బ కొట్టింది. తొలి టెస్టులో భారత్‌కు చావుతప్పి కన్నులొట్టబోయినా... తొలి వన్డేలో మాత్రం మ్యాచ్, ‘నంబర్‌వన్’ ప్రతిష్ట రెండు పోయాయి. దీంతో తొణికిసలాడే ఆత్మవిశ్వాసంతో ఉన్న సింహళ జట్టు ఇపుడు ఒక్క మ్యాచ్‌పైనే కాదు... ఏకంగా సిరీస్‌పైనే దృష్టిపెట్టింది. లంక పేస్‌కు తురుపుముక్క అయిన లక్మల్ నుంచి మరో చక్కని ప్రదర్శనను ఆశిస్తున్నారు. బ్యాటింగ్‌లో తరంగ ఫామ్‌లోకి వచ్చాడు. మూడో టెస్టును గట్టెక్కించిన ధనంజయ డిసిల్వా కూడా అందుబాటులోకి రావడంతో టాపార్డర్ పటిష్టమైంది. మిడిలార్డర్లో మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నేలతో జట్టు బ్యాటింగ్ ఆర్డర్ సమతూకంగా ఉంది. టాసే విన్నర్ శీతాకాలంలో భారత్‌లో రాత్రి మంచు ప్రభావం ఎక్కువ. ఉత్తర భారతంలోనైతే మరింత ఎక్కువ. దీంతో మ్యాచ్‌లకు టాస్ కీలకమవుతుంది. టాస్ నెగ్గిన జట్టు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటుంది. గతేడాది ఇక్కడ న్యూజిలాండ్ 286 పరుగుల భారీ స్కోరు చేసినా కోహ్లి సేన సునాయాసంగా ఛేదించింది. ఆ మ్యాచ్‌లో పడిన మొత్తం 13 వికెట్లలో సీమర్లే 8 వికెట్లు తీశారు. కాబట్టి టాస్ గెలిస్తే... సగం మ్యాచ్ గెలిచినట్లే! పిచ్, వాతావరణం ఒకపుడు మొహాలి పిచ్ సీమర్లకు అచ్చొచ్చినా... రానురాను ఆ పరిస్థితి మారింది. అయితే ఇపుడు శీతాకాలం కాబట్టి వికెట్ నుంచి పేసర్లు లబ్ధి పొందొచ్చు. చినుకులు పడే అవకాశమున్నా... మ్యాచ్‌ను అది ప్రభావితం చేయదు. జట్లు (అంచనా) భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్/రహానే, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, అక్షర్/కుల్దీప్, బుమ్రా, చహల్. శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగా, తిరిమన్నే/కుశాల్/సమరవిక్రమ, ధనంజయ డిసిల్వా, మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ, ప్రదీప్. ►ఉదయం 11.30 గంటల నుంచి ‘స్టార్ స్పోర్ట్స్–1’లో ప్రత్యక్ష ప్రసారం -
'కోట్లా'లో కొట్టేశారు
భారత జట్టు అద్భుత ప్రదర్శనతో చెలరేగింది. వన్డే ఫామ్‌ను టి20లకూ కొనసాగిస్తూ భారీ విజయాన్ని అందుకుంది. పదేళ్లలో ఐదుసార్లు తలపడితే ప్రతీ సారి న్యూజిలాండ్ ముందు తలవంచిన టీమిండియా ఇప్పుడు కివీస్‌కు ఆ అవకాశం ఇవ్వలేదు. జొహన్నెస్‌బర్గ్ నుంచి మొదలు పెడితే నాగపూర్ వరకు దక్కని విజయం భారత్ న్యూఢిల్లీలో అందుకుంది. బ్యాటింగ్‌లో ధావన్, రోహిత్ ద్వయం భారత్ తరఫున టి20ల్లో అత్యుత్తమ భాగస్వామ్యం నమోదు చేసి తిరుగులేని స్కోరును అందిస్తే... ఆ తర్వాత మన బౌలర్లు ప్రత్యర్థి పని పట్టారు. సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో విజయాన్ని అందించి సహచరులు సీనియర్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు ఘనమైన వీడ్కోలు అందించారు. మరోవైపు భారత్ విజయంతో ఐసీసీ టి20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్‌ను రెండో స్థానానికి నెట్టి పాకిస్తాన్ జట్టు తొలిసారి నంబర్‌వన్ ర్యాంకును సొంతం చేసుకుంది. న్యూఢిల్లీ: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన భారత జట్టు న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో బోణీ చేసింది. బుధవారం ఇక్కడి ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 53 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శిఖర్ ధావన్ (52 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ (55 బంతుల్లో 80; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ షాట్లతో చెలరేగారు. తొలి వికెట్‌కు 158 పరుగులు జోడించిన వీరిద్దరు భారత్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. చివర్లో కోహ్లి (11 బంతుల్లో 26 నాటౌట్; 3 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడాడు. అనంతరం న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు మాత్రమే చేయగలిగింది. లాథమ్ (36 బంతుల్లో 39; 3 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. భారత బౌలర్లలో అక్షర్, చహల్ చెరో 2 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌తో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన నెహ్రా... తన ఆఖరి ఇన్నింగ్స్‌లో వికెట్ తీయకుండానే నిష్క్రమించాడు. తాజా ఫలితంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టి20 శనివారం రాజ్‌కోట్‌లో జరుగుతుంది. రికార్డు ఆరంభం... వన్డేల్లో భారత్ తరఫున అత్యుత్తమ జోడీలలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ద్వయం తొలిసారి టి20ల్లో కూడా భారీ భాగస్వామ్యంతో సత్తా చాటింది. ధావన్ ఇన్నింగ్స్ ఆసాంతం దూకుడుగా ఆడగా... ఆరంభంలో నెమ్మదిగా ఆడిన రోహిత్, ఆ తర్వాత భారీ షాట్లు కొట్టాడు. మంచు కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డ న్యూజిలాండ్ ఫీల్డర్లు వీరిద్దరి క్యాచ్‌లు వదిలేయడం కూడా భారత ఓపెనర్లకు కలిసొచ్చింది. ముందుగా బౌల్ట్ బౌలింగ్‌లో 8 పరుగుల వద్ద సాన్‌ట్నర్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన ధావన్, ఆ తర్వాత బౌల్ట్ వేసిన తర్వాతి రెండు ఓవర్లలో కలిపి నాలుగు ఫోర్లు బాదాడు. ముఖ్యంగా స్వీప్ షాట్‌ను సమర్థంగా ఆడిన అతను పరుగులు రాబట్టాడు. మరోవైపు 16 పరుగుల వద్ద సౌతీ సునాయాస క్యాచ్ వదిలేయడంతో రెండో అవకాశం దక్కించుకున్న రోహిత్, వెంటనే మున్రో ఓవర్లో ఫోర్, సిక్స్‌తో చెలరేగాడు. సోధి బౌలింగ్‌లో వరుసగా 4, 6 కొట్టిన ధావన్ 37 బంతుల్లో కెరీర్లో మూడో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు సాన్‌ట్నర్ ఓవర్లో వరుసగా 6, 4, 4 బాదిన రోహిత్ 42 బంతుల్లో కెరీర్లో 12వ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. చివరకు రికార్డు భాగస్వామ్యం తర్వాత ధావన్‌ను అవుట్ చేసి... ఈ జంటను విడగొట్టిన సోధి, తర్వాతి బంతికే పాండ్యా (0)ను కూడా పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రోహిత్ కూడా అవుటైనా... కోహ్లి భారీ సిక్సర్ల జోరు భారత్ స్కోరు 200 పరుగులు దాటేలా చేసింది. అంతకుముందు 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లి క్యాచ్ కూడా వదిలేసి కివీస్ ఉపకారం చేసింది. తొలి 10 ఓవర్లలో 80 పరుగులు చేసిన భారత్, తర్వాత పది ఓవర్లలో ఏకంగా 122 పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్‌తో శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. టపటపా... భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ దశలోనూ న్యూజిలాండ్ కావాల్సిన పట్టుదలను ప్రదర్శించలేకపోయింది. రెండో ఓవర్లోనే స్పిన్నర్‌ను దించి భారత్ ఫలితం సాధించింది. చహల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన గప్టిల్ (4) హార్దిక్ పాండ్యా అత్యద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ఆ తర్వాత భువనేశ్వర్ సూపర్ యార్కర్‌కు మున్రో (7) వెనుదిరిగాడు. అనంతరం విలియమ్సన్ (24 బంతుల్లో 28; 1 ఫోర్, 1 సిక్స్) ఆదుకునే ప్రయత్నం చేసినా అది సరిపోలేదు. ఒక ఎండ్‌లో లాథమ్ నిలబడ్డా... మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. 16 పరుగుల వ్యవధిలో నాలుగు ప్రధాన వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ ఇక కోలుకోలేకపోయింది. చివర్లో సాన్‌ట్నర్ (14 బంతుల్లో 27 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడినా కివీస్ విజయానికి చాలా దూరంలో నిలిచిపోయింది. ఒక అవుట్... రెండు రివ్యూలు బౌల్ట్ వేసిన 19వ ఓవర్ చివరి బంతిని రోహిత్ ఆడే ప్రయత్నం చేయగా, బంతి వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. దాంతో కివీస్ అప్పీల్‌పై అంపైర్ అవుట్‌గా ప్రకటించారు. అయితే బ్యాట్‌కు తగిలిన తర్వాత బంతి నేలను తాకి వెళ్లిందా అనేదానిపై స్పష్టత లేకపోవడంతో ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సహాయం కోరారు. అయితే అత్యుత్సాహం ప్రదర్శించిన థర్డ్ అంపైర్ అనిల్ చౌదరి అసలు విషయం చెప్పకుండా ‘బ్యాట్ నేలకు తాకిన శబ్దం’ మాత్రమే అంటూ భారీ స్క్రీన్‌పై నాటౌట్ అని ప్రకటించేశారు కూడా. దాంతో ఆశ్చర్యపోయిన న్యూజిలాండ్ మళ్లీ ‘రివ్యూ’ కోరింది. ఈ సారి అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తగిలిందని స్పష్టంగా కనిపించడంతో రోహిత్ వెనుదిరగాల్సి వచ్చింది. -
టాప్–5లో రోహిత్ శర్మ... కోహ్లి టాప్ ర్యాంక్ పదిలం
ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న సిరీస్‌లో అదరగొడుతోన్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ మెరుగైన స్థానానికి చేరాడు. సోమవారం ఐసీసీ విడుదల చేసిన వన్డే బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అతను ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి 790 పాయింట్లతో ఐదో ర్యాంకుకు చేరుకున్నాడు. అతను 2016 ఫిబ్రవరిలో అత్యుత్తమంగా మూడో ర్యాంకులో నిలిచాడు. మరోవైపు భారత కెప్టెన్ కోహ్లి అగ్రస్థానంలోనే కొనసాగుతుండగా, డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) 865 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ 12 పాయింట్ల తేడాతో తొలి రెండు స్థానాలను దక్కించుకున్నారు. రహానే నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని 24వ స్థానానికి చేరుకున్నాడు. భారత బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ కెరీర్లోనే ఉత్తమ ర్యాంకు 7కు చేరుకున్నాడు. -
రో‘హిట్టింగ్’తో ముగింపు
భారత్ మళ్లీ పంజా విసిరింది. పరాజయాన్ని ఒక్క మ్యాచ్‌కే పరిమితం చేస్తూ తమదైన శైలిలో మరోసారి చెలరేగింది. గత మ్యాచ్ ఓటమికి తగిన రీతిలో జవాబిస్తూ సత్తా చాటడంతో సిరీస్‌లో మరో వన్డే మన ఖాతాలో చేరింది. సొంతగడ్డపై తిరుగులేని ప్రదర్శనతో చెలరేగిన టీమిండియా ముందు నిలవలేక ప్రత్యర్థి ఆస్ట్రేలియా పూర్తిగా చేతులెత్తేసింది. భారీ విజయంతో సిరీస్‌ను ముగించిన కోహ్లి సేన నంబర్‌వన్ స్థానాన్ని సుస్థిరపర్చుకుంది. ఇక తదుపరి లక్ష్యం టి20 సిరీస్. రోహిత్ శర్మ మెరుపు సెంచరీ, రహానే కళాత్మక ఇన్నింగ్స్ 243 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు సునాయాసంగా మార్చేశాయి. ఈ ‘సియట్’ జోడి పిచ్‌పై వేగంగా దూసుకుపోయి వరుసగా మూడో మ్యాచ్‌లో శతక భాగస్వామ్యం నెలకొల్పింది. అంతకుముందు శుభారంభం చేసి కూడా భారత స్పిన్ ద్వయం దెబ్బకు ఆస్ట్రేలియా కుదేలైంది. ఆసీస్‌పై వరుసగా మూడు సిరీస్‌లలో టాప్ స్కోరర్‌గా నిలిచిన రోహిత్, 6 వేల పరుగుల మైలురాయితో మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకున్నాడు. నాగపూర్: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ను భారత్ అద్భుత రీతిలో ముగించింది. ఐదు వన్డేల సిరీస్‌ను 4–1తో గెలుచుకుంది. ఆదివారం జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. గత మ్యాచ్‌లో బెంగళూరులో ఓటమి మినహా... చెన్నై, కోల్‌కతా, ఇండోర్లలో కూడా భారత్ నెగ్గింది. ఐదో వన్డేలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (62 బంతుల్లో 53; 5 ఫోర్లు) అర్ధ సెంచరీ చేయగా... స్టొయినిస్ (63 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్), ట్రావిస్ హెడ్ (59 బంతుల్లో 42; 4 ఫోర్లు) రాణించారు. అక్షర్ పటేల్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 42.5 ఓవర్లలో 3 వికెట్లకు 243 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రోహిత్ శర్మ (109 బంతుల్లో 125; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) వన్డేల్లో 14వ సెంచరీ సాధించాడు. అజింక్య రహానే (74 బంతుల్లో 61; 7 ఫోర్లు) ఈ సిరీస్‌లో వరుసగా నాలుగో అర్ధ సెంచరీ చేయగా, విరాట్ కోహ్లి (55 బంతుల్లో 39; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ నెల 7న రాంచీలో తొలి మ్యాచ్ జరుగుతుంది. మిడిలార్డర్ తడబాటు... ఆస్ట్రేలియాకు మరోసారి ఓపెనర్లు వార్నర్, ఫించ్ (36 బంతుల్లో 32; 6 ఫోర్లు) శుభారంభం అందించారు. తన తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన తర్వాత బుమ్రా పట్టు తప్పాడు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ చెలరేగిపోవడంతో తన తర్వాతి మూడు ఓవర్లలో అతను 34 పరుగులు సమర్పించుకున్నాడు. ఇందులో ఒకే ఓవర్లో ఫించ్ కొట్టిన మూడు బౌండరీలు కూడా ఉన్నాయి. పవర్‌ప్లేలో తొలి ఐదు ఓవర్లలో 21 పరుగులు మాత్రమే చేసిన ఆసీస్ తర్వాతి ఆరు ఓవర్లలో 39 పరుగులు రాబట్టింది. అయితే ఫించ్‌ను అవుట్ చేసి 66 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యాన్ని పాండ్యా విడదీశాడు. ఆ తర్వాత రెగ్యులర్ స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్‌తోపాటు పార్ట్‌టైమర్ కేదార్ జాదవ్ ఆస్ట్రేలియాను కట్టి పడేయడంతో పరుగులు రావడం కష్టంగా మారింది. దాంతో తీవ్ర అసహనానికి గురైన స్మిత్ (16) జాదవ్ బౌలింగ్‌లో వికెట్‌కు అడ్డంగా ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగాడు. కొద్ది సేపటికే వార్నర్‌తో పాటు హ్యాండ్స్కోంబ్ (13)ను అక్షర్ అవుట్ చేయడంతో కంగారూల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఈ దశలో స్టొయినిస్, హెడ్ చక్కటి సమన్వయంతో ఆడుతూ ఐదో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. కుదురుకున్న ఈ జంట చివరి ఓవర్లలో చెలరేగడమే తరువాయి అని అనిపించినా... భారత బౌలర్లు ఆ అవకాశం ఇవ్వలేదు. ఎనిమిది బంతుల వ్యవధిలో హెడ్, స్టొయినిస్ పెవిలియన్ చేరడంతో ఆసీస్ భారీ స్కోరుపై ఆశలు కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో షమీ, ఉమేశ్, చహల్ స్థానంలో భారత్ భువనేశ్వర్, బుమ్రా, కుల్దీప్లకు చోటు కల్పించింది. మళ్లీ అదే జోరు... గత రెండు వన్డేల్లో భారత్‌కు శతక భాగస్వామ్యం అందించిన రహానే, రోహిత్ జోడి ఈ మ్యాచ్‌లోనూ అదే ఊపును కొనసాగించి భారత్ విజయాన్ని సులభం చేసింది. ఆరంభంలో రహానే చకచకా పరుగులు సాధించగా, తొలి 14 బంతుల పాటు రోహిత్ పరుగే తీయలేదు! అయితే వరుసగా రెండు ఫోర్లతో ఖాతా ప్రారంభించిన రోహిత్ ఆ తర్వాత చెలరేగిపోయాడు. పది ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 43 పరుగులకు చేరింది. హెడ్ బౌలింగ్‌లో వరుసగా ఫోర్, సిక్స్ కొట్టిన రోహిత్ 52 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించగా, ఆ వెంటనే 64 బంతుల్లో రహానే కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. అయితే కూల్టర్‌నీల్ బౌలింగ్‌లో రహానే ఎల్బీగా వెనుదిరగడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అంపైర్ నిర్ణయంపై రహానే రివ్యూ చేసినా ఫలితం దక్కలేదు. అనంతరం కోహ్లి సహకారంతో రోహిత్ మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. వీరిద్దరు ఆసీస్ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. కూల్టర్‌నీల్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టి రోహిత్ 94 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కూల్టర్ తర్వాతి ఓవర్లో కూడా రోహిత్ మరో ఫోర్, సిక్స్ బాదాడు. భారత్ విజయానికి 20 పరుగులు కావాల్సిన స్థితిలో రోహిత్‌ను జంపా అవుట్ చేసి 99 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యాన్ని ముగించాడు. అదే ఓవర్లో కోహ్లి కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగ్గా... పాండే (11 నాటౌట్), జాదవ్ (5 నాటౌట్) 43వ ఓవర్లో మ్యాచ్‌ను ముగించారు. ►9 భారత్ తరఫున 6 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో ఆటగాడు రోహిత్ శర్మ. ఐదో వన్డేతో స్వదేశంలో తక్కువ ఇన్నింగ్స్ (42)లలో 2 వేల పరుగుల మైలురాయిని దాటిన భారత ఆటగాడిగా కూడా రోహిత్ నిలిచాడు. అతను ఓపెనర్‌గానే 4 వేల పరుగులు చేయడం విశేషం. నా దృష్టిలో ఇది పూర్తి సాధికారిక విజయం. అసలు లోపాలే కనిపించకుండా ఆడాం. నాలుగు మ్యాచ్‌లలో కూడా మాపై ఒత్తిడి నెలకొన్నా... దానిని అధిగమించి గెలవగలిగాం. ఈ సిరీస్ నుంచి మాకు ఎన్నో సానుకూల అంశాలు ఉన్నాయి. సిరీస్ గెలిచిన తర్వాత కూడా అంతే తీవ్రత, పట్టుదలతో ఆడేలా ఆటగాళ్లను ప్రోత్సహించడంలో టీమ్ మేనేజ్మెంట్ విజయవంతమైంది. భువీ, బుమ్రా అద్భుతంగా ఆడితే... షమీ, ఉమేశ్ కూడా ఏకైక మ్యాచ్‌లో బాగా బౌలింగ్ చేశారు. బ్యాట్స్‌మెన్‌తో పాటు ఇద్దరు మణికట్టు స్పిన్నర్లు కూడా కీలక పాత్ర పోషించారు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ హార్దిక్ పాండ్యా అవకాశాలు అందిపుచ్చుకొని మంచి ఉదాహరణగా నిలిచాడు. ఇంత మంది సమర్థులలో తుది 11 మందిని ఎంచుకోవడం కష్టమే అయినా... ఇది సంతోషకర పరిణామమే. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
బ్రేక్ పడింది!
-
బ్రేక్ పడింది!
భారత జట్టు ఓడిపోయింది...అవును, నిజమే. వరుసగా తొమ్మిది మ్యాచ్‌లలో గెలిచి ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చెలరేగుతున్న టీమ్ ఎట్టకేలకు తలవంచింది. ముందుగా బ్యాటింగ్ చేసినా, లక్ష్యాన్ని ఛేదించినా... అలవాటుగా అలవోకగా విజయాలు అందుకున్న కోహ్లి సేన, భారీ లక్ష్యాన్ని వేటాడే క్రమంలో చేరువగా వచ్చి చివరకు ఓటమి పక్షాన నిలిచింది. వరుసగా పదో గెలుపు సాధించి కొత్త చరిత్రను లిఖించాలని భావించిన టీమిండియా ఆ ప్రయత్నంలో విఫలం కాగా... విదేశాల్లో 11 వరుస పరాజయాల తర్వాత ఆస్ట్రేలియాకు బెంగళూరులో విజయంతో ఊరట లభించింది. సిరీస్‌లో తొలి విజయంతో స్మిత్ సేన క్లీన్‌స్వీప్ అవకాశం లేకుండా చేసి పరువు కాపాడుకుంది. 335 పరుగుల పేద్ద లక్ష్యం... చిన్నస్వామిలాంటి చిన్న స్టేడియంలో అసాధ్యం ఏమీ కాదు. అందుకే మన బ్యాట్స్‌మెన్ ఎక్కడా తగ్గలేదు. రోహిత్, రహానే ఇచ్చిన శుభారంభాన్ని ఆ తర్వాత హార్దిక్ పాండ్యా తన దూకుడుతో కొనసాగిస్తే... కేదార్ జాదవ్, మనీశ్ పాండే జంట గెలుపు దిశగా నడిపించింది. అయితే ఆఖర్లో ఆసీస్ పేస్ బౌలర్ల అద్భుత బౌలింగ్ భారత్‌ను కట్టి పడేసింది. చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయి వికెట్లు కోల్పోవడంతో మనకు మరో విజయం చిక్కలేదు. అంతకు ముందు తన వందో వన్డేలో వార్నర్ మెరుపు సెంచరీకి తోడు ఫించ్ దూకుడైన బ్యాటింగ్ ఆస్ట్రేలియాకు భారీ స్కోరు అందించి మ్యాచ్‌లో విజయంపై ఆశలు రేపేలా చేశాయి. బెంగళూరు : భారత పర్యటనలో ఆస్ట్రేలియాకు ఎట్టకేలకు విజయం లభించింది. తమ బ్యాటింగ్ బలంపై ఆధార పడుతూ వచ్చిన ఆ జట్టుకు ఈ మ్యాచ్‌లో ప్రధాన పేసర్లు కూడా అండగా నిలవడంతో దాదాపు తొమ్మిది నెలల తర్వాత కంగారూలు గెలుపు బాట పట్టారు. గురువారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా 21 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (119 బంతుల్లో 124; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకం బాదగా, ఆరోన్ ఫించ్ (96 బంతుల్లో 94; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) త్రుటిలో ఆ అవకాశం కోల్పోయాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 231 పరుగులు జోడించడం విశేషం. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. అనంతరం భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 313 పరుగులు చేసింది. కేదార్ జాదవ్ (69 బంతుల్లో 67; 7 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (55 బంతుల్లో 65; 1 ఫోర్, 5 సిక్సర్లు), అజింక్య రహానే (66 బంతుల్లో 53; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా... హార్దిక్ పాండ్యా (40 బంతుల్లో 41; 1 ఫోర్, 3 సిక్సర్లు) రాణించాడు. కేన్ రిచర్డ్సన్ 3 వికెట్లు పడగొట్టాడు. తాజా ఫలితంతో ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ 3–1తో ముందంజలో ఉంది. సిరీస్‌లో ఆఖరి వన్డే ఆదివారం నాగపూర్‌లో జరుగుతుంది. ఓపెనర్ల జోరు... ఆస్ట్రేలియాకు మరోసారి ఓపెనర్లు ఫించ్, వార్నర్ అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. తొలి ఓవర్ నుంచే వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడుతూ బౌండరీలు సాధించారు. ఫలితంగా పది ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 63 పరుగులకు చేరింది. ఇందులో షమీ, ఉమేశ్ చెరో ఐదు ఓవర్లు వేయగా... మొత్తం 12 బౌండరీలు వచ్చాయి. ఆ తర్వాత అక్షర్, పాండ్యా, చహల్ కూడా ప్రభావం చూపలేకపోవడంతో ఆసీస్ అలవోకగా పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో వార్నర్ 45 బంతుల్లో, ఫించ్ 65 బంతుల్లో అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అంతకుముందు 47 పరుగుల వద్ద ఫించ్‌ను స్టంపౌట్ చేయడంతో ధోని విఫలమయ్యాడు. 30 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోరు 191 పరుగులకు చేరింది. జాదవ్ బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా ఫోర్ కొట్టిన వార్నర్ వన్డేల్లో 14వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అనంతరం అక్షర్ ఓవర్లో సిక్స్, 2 ఫోర్లతో వార్నర్ 16 పరుగులు రాబట్టాడు. ఎట్టకేలకు పార్ట్ టైమర్ జాదవ్ ఈ భారీ భాగస్వామ్యాన్ని విడదీశాడు. జాదవ్ వేసిన 35వ ఓవర్ చివరి బంతికి లాంగాన్‌లో అక్షర్‌కు క్యాచ్ ఇచ్చి వార్నర్ వెనుదిరగడంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఈ దశలో భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కంగారూలను నియంత్రించారు. మరో ఐదు పరుగుల వ్యవధిలో ఫించ్, స్మిత్ (3) కూడా అవుట్ కావడంతో వేగంగా ఆడటంలో ఆసీస్ విఫలమైంది. ఒక దశలో 50 బంతులపాటు ఆ జట్టు బౌండరీ కొట్టలేదు. అయితే చివర్లో టిమ్ హెడ్ (38 బంతుల్లో 29; 1 ఫోర్, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా... హ్యాండ్స్కోంబ్ (30 బంతుల్లో 43; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుగా ఆడటంతో ఆసీస్ మెరుగైన స్కోరు సాధించగలిగింది. భారత్ తమ ప్రధాన బౌలర్లు ముగ్గురు భువనేశ్వర్, బుమ్రా, కుల్దీప్లకు విశ్రాంతినిచ్చి వారి స్థానంలో షమీ, ఉమేశ్, అక్షర్‌లకు అవకాశం కల్పించింది. మూడు అర్ధ సెంచరీలు... గత మ్యాచ్‌లాగే మరోసారి భారత జట్టు ఓపెనర్లు రహానే, రోహిత్ సెంచరీ భాగస్వామ్యంతో శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు చక్కటి సమన్వయంతో ఆడటంతో తొలి పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 65 పరుగులు సాధించింది. ముందుగా రహానే 58 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా, జంపా ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదిన రోహిత్ 42 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే రిచర్డ్సన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రహానే వెనుదిరగడంతో 106 పరుగుల తొలి వికెట్ పార్ట్‌నర్‌షిప్‌కు తెర పడింది. కొద్ది సేపటికే కోహ్లితో సమన్వయ లోపం, స్మిత్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా రోహిత్ రనౌటయ్యాడు. ఆ వెంటనే కూల్టర్‌నీల్ బౌలింగ్‌లో కట్ చేయబోయి వికెట్లపైకి ఆడుకోవడంతో కోహ్లి (21) ఆట ముగిసింది. ఈ దశలో పాండ్యా, జాదవ్ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. వీరిద్దరు ఒకవైపు జాగ్రత్తగా ఆడుతూనే మరోవైపు భారీ షాట్లతో దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో జంపా బౌలింగ్‌పై మరోసారి తన ఆధిపత్యం ప్రదర్శిస్తూ పాండ్యా వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే నాలుగో వికెట్‌కు 78 పరుగులు జత చేసిన అనంతరం జంపా బౌలింగ్‌లో మళ్లీ భారీ షాట్‌కు ప్రయత్నించి పాండ్యా పెవిలియన్ చేరాడు. ఈ సమయంలో జాదవ్, పాండే కలిసి మరో చక్కటి భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 61 పరుగులు జోడించారు. 54 బంతుల్లో జాదవ్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే ఇలాంటి స్థితిలో ఆసీస్ పేసర్లు కమిన్స్, రిచర్డ్సన్ చక్కటి యార్కర్లతో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేసి భారత జోడీపై ఒత్తిడి పెంచారు. ఫలితంగా భారీ షాట్‌కు ప్రయత్నించి జాదవ్ వెనుదిరగ్గా... మరో మూడు బంతులకే పాండేను కమిన్స్ బౌల్డ్ చేశాడు. ధోని (13) కూడా తన ముద్ర చూపలేకపోవడంతో భారత్ విజయంపై ఆశలు కోల్పోయింది. ►8 కెరీర్ వందో వన్డేలో సెంచరీ చేసిన ఎనిమిదో, ఆస్ట్రేలియా తరఫున తొలి ఆటగాడు వార్నర్. ►100 ఉమేశ్ యాదవ్ వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టాడు. అతను మొత్తం 71 వన్డేలు ఆడాడు. ►2000 కెప్టెన్‌గా వన్డేల్లో కోహ్లి 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అందరికంటే తక్కువ ఇన్నింగ్స్ (36)లలో అతను ఈ ఘనత నమోదు చేశాడు. -
సిరీస్ 'విన్' డోర్
-
సిరీస్ 'విన్' డోర్
ఓ దశలో ఆసీస్ స్కోరు 37.4 ఓవర్లలో 224/1. అప్పటికే ఓపెనర్ ఆరోన్ ఫించ్ వీర బాదుడుతో శతకం సాధించి జట్టును అత్యంత పటిష్టమైన స్థితికి చేర్చగా, అతనితో పాటు క్రీజులో స్మిత్ ఉన్నాడు. విధ్వంసకర బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ కూడా బ్యాటింగ్ చేయాల్సి ఉండటంతో స్కోరు 350 వరకు చేరుతుందేమో అని అంతా భావించారు. అయితే ఆ తర్వాత భారత బౌలర్లు వారిని ఓ ఆటాడుకున్నారు. వరుస బంతుల్లో స్మిత్, మ్యాక్సీ పెవిలియన్‌కు చేరడంతో మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా చివరి 10 ఓవర్లలో జట్టు కేవలం 59 పరుగులే చేసి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత ఎప్పటిలాగే టీమిండియా బ్యాట్స్‌మెన్ తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. ఓపెనర్లు రోహిత్, రహానే అర్ధసెంచరీలతో చెలరేగి శుభారంభాన్ని అందించగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తనదైన శైలిలో ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మరో చక్కటి విజయం భారత్ వశమైంది. కోహ్లి కెప్టెన్సీలో ఇది భారత్‌కు వరుసగా తొమ్మిదో విజయం. దీంతో ధోని రికార్డును సమం చేశాడు. ఇండోర్: టీమిండియా జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇటీవలి కాలంలో ఓటమనేదే లేకుండా సాగుతున్న కోహ్లి సేన ఖాతాలో మరో వన్డే సిరీస్ చేరింది. సిరీస్‌లో తొలిసారిగా ఆస్ట్రేలియా జట్టు నుంచి బ్యాటింగ్ మెరుపులు కనిపించినా టీమిండియా సత్తా ముందు అది కూడా సరిపోలేదు. ఫ్లాట్ పిచ్‌పై దుమ్ము రేపిన రోహిత్ (62 బంతుల్లో 71; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), రహానే (76 బంతుల్లో 70; 9 ఫోర్లు)కు తోడు చివర్లో హార్దిక్ పాండ్యా (72 బంతుల్లో 78; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ఆసీస్ విసిరిన భారీ లక్ష్యం ఉఫ్‌మని తేలిపోయింది. ఫలితంగా ఆదివారం స్థానిక హోల్కర్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు ఉండగానే 3–0తో ఖాయం చేసుకుంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 293 పరుగులు చేసింది. ఫించ్ (125 బంతుల్లో 124; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకంతో మెరిశాడు. స్మిత్ (71 బంతుల్లో 63; 5 ఫోర్లు), వార్నర్ (44 బంతుల్లో 42; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కుల్దీప్ యాదవ్, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 47.5 ఓవర్లలో 5 వికెట్లకు 294 పరుగులు చేసి నెగ్గింది. మనీశ్ పాండే (32 బంతుల్లో 36 నాటౌట్; 6 ఫోర్లు) తన ఫామ్‌ను అందుకున్నాడు. కమిన్స్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఫించ్ దూకుడు సిరీస్‌లో తొలిసారిగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు శుభారంభం దక్కింది. గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఓపెనర్ ఫించ్ పిచ్‌ను సద్వినియోగం చేసుకుని చెలరేగాడు. ఆరంభంలో నెమ్మదిగా ప్రారంభించిన అతను ఆ తర్వాత జూలు విదిల్చాడు. మూడో ఓవర్లో ఫించ్ రెండు ఫోర్లు బాదగా తొమ్మిదో ఓవర్లో వార్నర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో స్కోరు 49 పరుగులకు చేరింది. అయితే 14వ ఓవర్లో పాండ్యా ఆఫ్ కట్టర్‌కు వార్నర్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 70 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే భారత్ ఆనందం ఎంతో సేపు నిలవకుండా ఫించ్, స్మిత్ జోడి చెలరేగింది. ముఖ్యంగా ఇప్పటిదాకా ఆసీస్‌ను ఇబ్బంది పెట్టిన చైనామన్ కుల్దీప్ను లక్ష్యంగా చేసుకున్న ఫించ్ అతడు వేసిన 26 బంతుల్లో 41 పరుగులు సాధించాడు. తను వేసిన 30వ ఓవర్లో వరుసగా 4, 6తో చెలరేగగా... 34వ ఓవర్లో కుల్దీప్ వేసిన గూగ్లీ బంతిని స్వీప్ షాట్‌తో బౌండరీ సాధించి వన్డేల్లో 8వ సెంచరీ (110 బంతుల్లో)ని అందుకున్నాడు. అదే ఓవర్లో భారీ సిక్స్‌ను సాధించాడు. అటు స్మిత్ 55 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ దశలో కుల్దీప్ మాయకు ఈసారి ఫించ్ దొరికాడు. డీప్ మిడ్వికెట్లో జాదవ్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. భళా.. బౌలర్లు ఫించ్ ధాటిగా ఆడిన తీరు చూస్తే భారత్‌కు భారీ లక్ష్యం ఖాయమనిపించినా డెత్ ఓవర్లలో భారత బౌలర్లు పట్టు సాధించిన తీరు అద్భుతం. 40 ఓవర్లలో 234/2 స్కోరుతో అత్యంత పటిష్టంగా ఉన్న ఆసీస్‌ను కనీసం 300 పరుగులు కూడా చేయకుండా నిలువరించగలిగారు. చివరి 10 ఓవర్లలో కేవలం 59 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఫించ్ అవుటైన కొద్దిసేపటికే స్మిత్‌ను 42వ ఓవర్ చివరి బంతికి కుల్దీప్ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే క్రీజులో మ్యాక్స్‌వెల్ ఉండడంతో పరుగుల వరద ఖాయమనుకున్నా ఆ తర్వాత ఓవర్ తొలి బంతికే అతడిని ధోని మెరుపు వేగంతో స్టంప్ చేసి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బుమ్రా, భువనేశ్వర్ కట్టుదిట్టమైన బంతులకు ఆసీస్ పరుగుల కోసం విలవిల్లాడింది. మెరిసిన రోహిత్, రహానే లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత ఓపెనింగ్ జోడి రహానే, రోహిత్ ఆసీస్ బౌలర్లను ఊచకోత కోస్తూ తమ బ్యాట్లను ఝుళిపించారు. రిచర్డ్సన్ వేసిన తొమ్మిదో ఓవర్లో రోహిత్ కొట్టిన సిక్సర్‌కు బంతి స్టేడియం బయట పడింది. ఇక పదో ఓవర్లో రహానే మూడు ఫోర్లు సాధించడంతో పవర్ ప్లేలో భారత్ 68 పరుగులు చేసింది. 42 బంతుల్లో రోహిత్ శర్మ సిక్సర్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అటు రహానే 50 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 22వ ఓవర్లో రోహిత్ ఆడిన పుల్ షాట్ భారీ సిక్సర్‌గా వెళుతుందనిపించినా నేరుగా సబ్‌స్టిట్యూట్ కార్ట్‌రైట్ చేతుల్లోకి వెళ్లింది. దీంతో తొలి వికెట్‌కు 139 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత రహానే కూడా కమిన్స్ బౌలింగ్‌లో ఎల్బీగా అవుటయ్యాడు. సూపర్ పాండ్యా ఈ సమయంలో కోహ్లితో పాటు నంబర్ ఫోర్ స్థానానికి ప్రమోట్ అయిన పాండ్యా సూపర్ షో ప్రదర్శించాడు. తానెదుర్కొన్న నాలుగో బంతినే సిక్సర్‌గా మలిచాడు. అయితే 29వ ఓవర్ నుంచి ఏడు ఓవర్ల పాటు ఆసీస్ బౌలర్లు ఆధిక్యం ప్రదర్శించారు. ఈ మధ్యలో ఒక్క బౌండరీ కూడా రాకపోగా వరుస ఓవర్లలో కోహ్లి, జాదవ్ పెవిలియన్‌కు చేరడంతో ఒత్తిడి పెరిగింది. అయితే 37వ ఓవర్లో పాండ్యా 6, 4 బాది ఇన్నింగ్స్‌ను తిరిగి ట్రాక్‌లోకి తెచ్చాడు. అదే ఓవర్ చివరి బంతికి తను ఇచ్చిన క్లిష్టమైన క్యాచ్‌ను స్మిత్ పట్టలేకపోయాడు. ఇదే జోరుతో 45 బంతుల్లో అర్ధ సెంచరీని అందుకున్నాడు. స్టొయినిస్ వేసిన 42వ ఓవర్లో పాండ్యా నాలుగు ఫోర్లతో విరుచుకుపడడంతో 18 పరుగులు వచ్చాయి. విజయానికి మరో 8 పరుగుల దూరంలో పాండ్యా వెనుదిరిగాడు. దీంతో మనీష్ పాండేతో కలిసి ఐదో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మరో 13 బంతులుండగానే భారత్ నెగ్గింది. ►తాజా విజయంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ 120 పాయింట్లతో దక్షిణాఫ్రికా (119)ను అధిగమించి నంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ►తర్వాతి రెండు వన్డేలకోసం ప్రకటించిన భారత జట్టులో జడేజా స్థానంలో అక్షర్ పటేల్ తిరిగి వచ్చాడు. -
రోహిత్.. ఇలా అయితే ఎలా?
రాంచీ: న్యూజిలాండ్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ మళ్లీ విఫలమయ్యాడు. రాంచీలో జరుగుతున్న నాలుగో వన్డేలో రోహిత్ శర్మ కేవలం 11 పరుగులు చేసి జట్టు స్కోరు 19 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఈ వన్డేలో తాను ఎదుర్కొన్న తొలి 9 తొమ్మిది బంతుల్లో ఒకే పరుగు చేసిన రోహిత్ చివరికి 19 బంతుల్లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. టీమిండియాకు 261 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లతో టచ్ లోకి వచ్చినట్లు కనిపించిన రోహిత్ ఆ మరుసటి ఓవర్లో సౌథీ బౌలింగ్ లో తొలి బంతికే కీపర్ వాట్లింగ్ కు క్యాచ్ ఇచ్చి తన వైఫల్యాన్ని కొనసాగించాడు. సిరీస్ లో ఓవరాల్ గా చూస్తే రోహిత్ శర్మ 14, 15, 13, 11 చేసి విఫలమయ్యాడు. -
మెరిసిన ముంబై.. బెంగళూరు బేజారు
బెంగళూరు: తమ విధ్వంసకారులు విఫలమైన చోట ఓటమిని ఒప్పుకొని, ప్రత్యర్థి జట్టు బాగా ఆడిందంటూ కితాబివ్వడం తప్ప విరాట్ కోహ్లీకి మరో దారిలేదు. అవును. ఐపీఎల్ 9లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. బుధవారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ సేన అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రతిభ ముందు తలవంచింది. బెంగళూరు విసిరిన 152 పరుగుల లక్ష్యాన్ని ముంబై మరో ఎనిమిది బంతులు ఉండగానే ఛేదించింది. తెలుగు తేజం అంబటి రాయుడు (44), పొలార్డ్ (35), బట్లర్ (29)లు ముంబై విజయంలో కీలక పాత్ర పోశించారు. ఓపెనర్ రోహిత్ శర్మ 25 పరుగులు చేశాడు. 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై 153 పరుగులు చేసింది. ఈ విజయంతో రోహిత్ సేన పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. పొదుపుగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీసిన కుణాల్ పాండ్యాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. బౌలింగ్‌కు అనుకూలించిన పిచ్‌పై బెంగళూరు ఓపెనర్లు విరాట్ కొహ్లీ (7 పరుగులు), క్రిస్‌గేల్ (5 పరుగులు) ఇద్దరూ విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, ఎబీ డివిలియర్స్ ఆచితూచి ఆడుతూ బెంగళూరు ఇన్నింగ్‌ను చక్కదిద్దారు. తొలి 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులకు చేరింది. ఈ క్రమంలో ఏబీ డివిలియర్స్(27 బంతుల్లో 24 పరుగులు) పాండ్యా బౌలింగ్‌లో వెనుదిరిగినా రాహుల్(53 బంతుల్లో 68, నాటౌట్) సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ వాట్సన్(14 బంతుల్లో 15)తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చివర్లో సచిన్ బేబి(13 బంతుల్లో 25 పరుగులు, నాటౌట్) మెరవడంతో ముంబై ముందు బెంగళూరు 152 పరుగుల టార్గెట్‌ను ఉంచింది. ముంబై బౌలర్లలో సౌథీ, మెక్క్లెనగన్, పాండ్యాలకు ఒక్కో వికెట్ చొప్పున దక్కింది. -
ఇక్కడ వీరబాదుడు.. అక్కడ నీరసం!
ఐపీఎల్ అంటే చాలు.. మన క్రికెటర్లకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చేస్తుంది. దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు ఎలా ఆడినా, ఐపీఎల్లో మాత్రం విజృంభించేస్తారు. ఈ విషయం పదే పదే చాలాసార్లు రుజువు అవుతూనే ఉంది. నిన్న కాక మొన్న జరిగిన ఆసియా కప్ టి20 మ్యాచ్‌లలో ఓపెనింగ్ జోడీ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఎంత అందంగా ఆడారో అందరికీ తెలుసు. ముఖ్యంగా రోహిత్ శర్మ అయితే తనకు అచ్చొచ్చిన మైదానాల్లో కూడా ఏమాత్రం మంచి ప్రదర్శనలు చూపించలేదు. కానీ బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో మాత్రం మెరుపులు మెరిపించాడు. 54 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో ఏకంగా 84 పరుగులు చేశాడు. మరి టి20 ప్రపంచకప్‌లో మాత్రం అతడు చేసిన మొత్తం పరుగులు కేవలం 88. అది కూడా చిట్టచివరి మ్యాచ్, సెమీఫైనల్లో 43 పరుగులు చేయడం వల్ల ఆ మాత్రం కనిపించింది. అంతకుముందు లీగ్ దశలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో వరుసగా అతడి స్కోర్లు చూస్తే నీరసం రాక తప్పదు. మొట్టమొట న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5, తర్వాత పాకిస్థాన్ మీద 10, కీలకమైన బంగ్లా మ్యాచ్‌లో 18, ఆ తర్వాత ఆస్ట్రేలియా మీద కేవలం 12 పరుగులు.. ఇవీ రోహిత్ స్కోర్లు. ఆ సీజన్ ముగిసి కూడా ఎన్నాళ్లో కాలేదు. కానీ ఐపీఎల్ రాగానే ఒక్కసారిగా ఎక్కడలేని ఉత్సాహం వచ్చిందో ఏమో గానీ.. ఏకంగా 84 పరుగులు సాధించాడు! ఐపీఎల్లో సరిగా ఆడకపోతే తర్వాతి సీజన్‌కు తమకు వేలంలో తగినంతగా డబ్బులు రావన్న భయమో.. కెప్టెన్‌గా ఉండి కూడా ఆడకపోతే తర్వాత జట్టులోనే స్థానం కోల్పోవాల్సి వస్తుందనో ఆడి ఉండొచ్చని క్రికెట్ అభిమానులు అంటున్నారు. నిజానికి ఎవరైనా దేశానికి ప్రాతినిధ్యం వహించేటపుడు మరింత ఉత్సాహంగా ముందుకెళ్తారు. కానీ టీమిండియా క్రికెటర్లలో కొంతమంది మాత్రం దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. అదే వెస్టిండీస్‌లో అంతగా పేరులేని బ్రెత్‌వైట్ లాంటి బ్యాట్స్‌మన్ కూడా చివరి ఓవర్లో నాలుగు బంతులకు నాలుగు సిక్సర్లు బాది ఫలితాన్ని తలకిందులు చేస్తున్నారు. ఇప్పటికైనా మనవాళ్లు డబ్బులే కాక.. దేశం గురించి కాస్తంత పట్టించుకుంటే అభిమానులు కూడా సంతోషిస్తారు. -
విమానంలో ఈత కొట్టిన భారత క్రికెటర్లు
విమానంలో భారత క్రికెట్ ఆటగాళ్లు ఈత కొట్టారు. విమానంలో ఈత కొట్టడం ఏంటి.. అది కూడా క్రికెటర్లు అంటున్నారు, అనుకుంటున్నారా ? నిజమేనండి.. చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆఖరి బంతి వరకు పోరాడి ఒక్క పరుగుతో విజయం సాధించిన భారత ఆటగాళ్లు ఫుల్ జోష్ మీద ఉన్నారు. బంగ్లాదేశ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చివరి మూడు బంతుల్లో మూడు వికెట్లు తీసి గట్టెక్కిన టీం ఇండియా ఆటగాళ్లు ఆ ఆనందాన్ని హోలీ రూపంలో జరుపుకొని..ఇప్పుడు విమానంలో కూడా ఈత కొట్టారు. అది కూడా నీటిలో ఆక్సిజన్ అందించే స్నోర్కెలింగ్ అనే పరికరాన్ని ధరించి. హర్బజన్ సింగ్, రోహిత్ శర్మ, రహానేలు స్నోర్కెలింగ్ పరికరాన్ని ధరించి విమానంలో ఈత కొడతున్నట్టు ఉన్న వీడియోను హర్భజన్ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. చాలా ఎంజాయి చేస్తున్నట్టు పేర్కొన్నాడు. అయితే యువరాజ్ సింగ్ మాత్రం తమతో జాయిన్ అవ్వడానికి సాహసించలేదంటూ హర్భజన్ ట్విట్ లో పేర్కొన్నాడు. ఓ లేటెస్ట్ యాప్ ను వాడి తాము విమానంలో ఈత కొడుతున్నట్లు కనిపించేలా బ్యాగ్రౌండ్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. విశేషాలను ఓ వీడియో తీసి ఈ క్రికెటర్స్ బంగ్లాపై మ్యాచ్ విజయాన్ని ఆస్వాదించారు! Snorkelling in the flight with my mates what fun @ImRo45 @ajinkyarahane88 Yuvi didn't get the gears to join in ✌️✌ pic.twitter.com/nPzt5A9Xbx — Harbhajan Singh (@harbhajan_singh) March 24, 2016 -
ఆచితూచి ఆడుతున్న టీమిండియా
ఇండోర్: టీమిండియా బ్యాట్స్మెన్లు ఆచితూడి ఆడుతున్నారు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో ఇండోర్‌లో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో కూడా భారత్ బ్యాట్స్‌మెన్స్ బ్యాట్‌ను వేగంగా కాకుండా ఆచితూచి ఝళిపిస్తున్నారు. ఇప్పటికే టీ ట్వంటీలో, తొలి వన్డేలో ఓటమిని చవిచూసిన టీమిండియా రెండో వన్డేలో నిలకడగా ఆడాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండో ఒవర్ నాలుగో బంతికే రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడం కూడా ఇందుకు మరో కారణం. బుధవారంనాటి మ్యాచ్‌లో పది ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 44/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో దవన్(14), రహానే(24) ఉన్నారు. రహానే కాస్త వేగంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ దక్షిణాఫ్రికా బౌలర్లు మాత్రం తీవ్రంగానే కట్టడిచేస్తున్నారు. అతి క్లిష్టంగా పరుగులు వస్తున్నాయి. -
3 పరుగులకే సెంచరీ వీరుడు అవుట్
ఇండోర్: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో బుధవారం ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. కేవలం 3 పరుగులు మాత్రమే చేసిన రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యాడు. గత మ్యాచ్‌లలో వరుసగా సెంచరీ చేసిన రోహిత్ శర్మ రబాబా వేస్తున్న రెండో ఓవర్లోని నాలుగో బంతికే వికెట్ సమర్పించుకుని పెవిలియన్ బాటపట్టాడు. దీంతో క్రీజులో ఉన్న శిఖర్ ధవన్ కు అజింక్య రహానే తోడయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 4 ఓవర్లకు ఒక వికెట్ కోల్పోయి 12 పరుగులు. -
కోహ్లి స్టయిలే వేరు!
పూర్తిస్థాయి కెప్టెన్‌గా పగ్గాలు తీసుకున్న వెంటనే కోహ్లి తన తొలి అడుగులోనే దూకుడు చూపించాడు. కెప్టెన్‌గా తన మొదటి నిర్ణయంతో ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాడు. ఉపఖండంలో ముగ్గురు పేసర్లతో సహా ఐదుగురు బౌలర్లతో తుది జట్టును ఎంపిక చేశాడు. దీనికోసం టెస్టు జట్టుకు వెన్నెముకలాంటి పుజారాను పెవిలియన్‌లో కూర్చోబెట్టాడు. ఇది తన ‘ముద్ర’ను చూపించే ప్రయత్నమా? లేక సేఫ్‌గా ఆడిన గేమా? సాక్షి క్రీడా విభాగం : ఆటలో ఆ ఇద్దరివీ భిన్న ధ్రువాలు... ఒకరికి దూకుడు అలవాటైతే మరొకరి ఆట నిండు కుండలా ప్రశాంతం. ఒక టెస్టు మ్యాచ్‌లో వీరిలో ఒకరిని మాత్రమే ఎంచుకోవాల్సిన పరిస్థితి వస్తే కెప్టెన్ ఏం చేయాలి? రిస్క్ ఉన్నా ‘కొత్తదనం’ గురించి ఆలోచించాలా? లేక సంప్రదాయానికి పట్టం కట్టాలా? బంగ్లాదేశ్‌తో టెస్టుకు ముందు కోహ్లికి ఎదురైన పరిస్థితి ఇది. ఈ విషయంలో తను ఎలాంటి మొహమాటాలకు పోలేదు. ఐదో బౌలర్ కోసం చతేశ్వర్ పుజారా, రోహిత్ శర్మలలో ఒకరిని పక్కన పెట్టాల్సి వచ్చినప్పుడు టెస్టు స్పెషలిస్ట్ అని చూడకుండా పుజారాను పెవిలియన్‌కు పరిమితం చేశాడు. తాను నాయకత్వం వహించిన సిడ్నీ టెస్టులాగే మూడో స్థానాన్ని రోహిత్‌కు అప్పగించాడు. ఇది కోహ్లి తనదైన కొత్త శైలి చూపించే ప్రయత్నమా? లేక రోహిత్‌ను తప్పిస్తే వచ్చే విమర్శలనుంచి తప్పించుకోవడమా? కోహ్లి మనసులో ఏముందో... ఆస్ట్రేలియాలాంటి చోట కూడా భారత జట్టు ఎప్పుడూ ఐదుగురు బౌలర్లతో ఆడలేదు. ధోని జమానాలో అయితే అసలు దాని గురించి పెద్దగా చర్చించే అవసరం కూడా రాలేదు. సిడ్నీ టెస్టులో కెప్టెన్‌గా నలుగురు బౌలర్లనే ఆడించిన కోహ్లి బంగ్లాదేశ్ రాగానే ఒక్కసారిగా దూకుడు పెంచాలని భావించాడు. ఉపఖండంలో భారత్ ముగ్గురు పేసర్లతో ఆడటం కూడా చాలా అరుదైన విషయం. ఈ స్థితిలో కచ్చితంగా ఒక ప్రధాన బ్యాట్స్‌మన్‌పై వేటు వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓపెనర్‌గా విజయ్, ధావన్‌ల రికార్డు ప్రకారం వారిని పక్కన పెట్టడం కష్టం. తాను, రహానే, కీపర్ కచ్చితంగా ఉండాలి కాబట్టి రోహిత్, పుజారాల మధ్య పోటీ నెలకొంది. అయితే ‘నేనొచ్చాశానోచ్’ అనే సందేశం ఇవ్వడానికో లేక నా శైలి భిన్నం అని చాటుకోవడానికో కోహ్లి ఐదుగురు బౌలర్ల సూత్రం పాటించాడు. నిజంగా బంగ్లాలాంటి జట్టును ఆలౌట్ చేయాలంటే ఐదుగురు బౌలర్లు అవసరమా అనేది సందేహం. పుజారా అవసరం లేదా? ద్రవిడ్ వారసుడిగా జట్టులోకి వచ్చిన పుజారా నికార్సయిన టెస్టు బ్యాట్స్‌మన్. గంటల కొద్దీ క్రీజ్‌లో పాతుకుపోవడం, భీకరమైన కొత్త బంతి పని పట్టి తర్వాత వచ్చే బ్యాట్స్‌మన్ పని సులువు చేయడంలో అతను దిట్ట. అయితే ఇదంతా స్కోరు బోర్డులో కనిపించదు. 2014 ఆరంభంలో దక్షిణాఫ్రికా సిరీస్ మొదలు 20 ఇన్నింగ్స్‌లలో కలిపి పుజారా రెండు అర్ధ సెంచరీలతో 483 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 24.15 మాత్రమే. మూడో స్థానం ఆటగాడినుంచి ఆశించిన ప్రదర్శన మాత్రం ఇది కాదు. అయితే టెస్టు జట్టులో అలాంటి ఆటగాడి అవసరం కూడా ఉంటుంది. ఐపీఎల్ ఆడని పుజారా కౌంటీల్లో యార్క్ షైర్ తరఫున ఆరు ఇన్నింగ్స్‌లలో 264 పరుగులు చేసి ఫామ్‌లోకి వచ్చాడు. కౌంటీల్లో ఆటంటే సరిగ్గా టెస్టు మ్యాచ్‌లకు అతికిపోయే దృక్పథం ఉంటుంది కాబట్టి అతను బంగ్లాతో మ్యాచ్‌కు పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లే. అయితే జట్టులో ప్రతీ బ్యాట్స్‌మన్ దూకుడు నేర్వాలని పదే పదే చెబుతున్న కోహ్లి... సంప్రదాయ శైలిలో ఆడే పుజారాలాంటి ఆటగాడి అవసరం ఈ టెస్టుకు లేదని భావించాడేమో. పైగా పుజారాను తప్పించినా అతనికి పెద్దగా మద్దతు లభించదు కాబట్టి ఇది సేఫ్గేమ్లాంటిదే. రోహిత్‌పైనే నమ్మకం రోహిత్ తాను ఆడిన ఆఖరి టెస్టులో ఆసీస్‌తో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి 53, 39 పరుగులు చేశాడు. తర్వాతి మ్యాచ్‌నుంచి ఒక ఆటగాడిని తప్పించేంత ఘోరమైన ప్రదర్శన ఏమీ కాదు ఇది. కాబట్టి అతను పూర్తిగా విఫలమై, మరో ఆటగాడు తనను తాను నిరూపించుకుంటే తప్ప రోహిత్‌ను తప్పించడం సరైంది కాదు. కాబట్టి సిడ్నీనుంచి ఆటోమెటిక్‌గా రోహిత్‌కు చోటు దక్కినట్లే. టెస్టుల్లో రోహిత్ రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. సొంతగడ్డపై తొలి రెండు టెస్టుల్లో సెంచరీల తర్వాత ఉపఖండం బయట 16 ఇన్నింగ్స్‌లలో అతని సగటు 24.93 మాత్రమే. ఎనిమిది టెస్టుల్లో రెండు అర్ధ సెంచరీలే చేశాడు. కానీ వన్డేల్లో ఓపెనర్‌గా మారిన తర్వాత వచ్చిన దూకుడు రోహిత్ బ్యాటింగ్‌లో అన్ని ఫార్మాట్లలో కనిపిస్తోంది. టెస్టులకు కూడా అది అవసరమని కెప్టెన్ భావించినట్లున్నాడు. చాలా సందర్భాల్లో కోహ్లి, రోహిత్ బ్యాటింగ్‌ను ప్రశంసిస్తూ వచ్చాడు. ఇటీవల ఐపీఎల్ ప్రదర్శన, నాయకత్వం రోహిత్‌ను ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తిగా నిలిపింది. కొన్ని సందర్భాల్లో భవిష్యత్తు కెప్టెన్ అంటూ ప్రశంసలు కూడా మొదలయ్యాయి. ఈ స్థితిలో రోహిత్‌ను పక్కన పెడితే కోహ్లిపై అన్ని వైపులనుంచి విమర్శలు ఎదురయ్యేవి. పూర్తి స్థాయి కెప్టెన్‌గా అప్పుడే ఇలాంటి వాటిని ఎదుర్కోవడం విరాట్‌కూ ఇష్టం ఉండదు. శైలి భిన్నమే: స్యామీ ధోనితో పోలిస్తే కెప్టెన్సీ విషయంలో కోహ్లి శైలి భిన్నంగా ఉంటుందని వెస్టిండీస్ టి20 సారథి డారెన్ స్యామీ అభిప్రాయపడ్డాడు. ‘ధోని ఎక్కువగా మాట్లాడకుండా తాను చెప్పదలుచుకుంది కూల్‌గా చెప్తాడు. కానీ కోహ్లి ప్రతి అంశంలోనూ జోక్యం చెసుకోవడాన్ని ఇష్టపడతాడు. ఐపీఎల్లో బెంగళూరును నడిపిన తరహాలో జాతీయ జట్టును కూడా నడిపితే కోహ్లి మంచి ఫలితాలు సాధిస్తాడు’ అని స్యామీ అన్నాడు. ఐపీఎల్లో స్యామి బెంగళూరు జట్టుకు ఆడాడు. -
'అర్జున' కు రోహిత్ పేరు ప్రతిపాదన
కోల్‌కతా: కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం అర్జున అవార్డు కోసం 2015 సంవత్సరానికి రోహిత్ శర్మ పేరును ప్రతిపాదించాలని ఆదివారం సమావేశమైన బీసీసీఐ వర్కింగ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల మృతి చెందిన క్రికెటర్లు అంకిత్ కేసరి, గౌరవ్ కపూర్లకు ఈ సమావేశంలో శ్రద్ధాంజలి ఘటించారు. డంకన్ ఫ్లెచర్ పదవీ కాలం ప్రపంచకప్‌తో ముగియడంతో బీసీసీఐ, కోచ్ ఎంపికపై దృష్టి పెట్టింది. అందు కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భారత మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ సభ్యులుగా ఉంటారు. -
ఇక ఐపీఎల్‌పైనే దృష్టి: రోహిత్
ప్రపంచకప్ గెలవకపోవడం నిరాశ కలిగించింది ముంబై: ఆస్ట్రేలియాలో జరిగిన ప్రపంచకప్ తమను నిరాశపరిచినా ఇప్పుడు ఆటగాళ్ల దృష్టంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్‌ను దక్కించుకోవడం పైనే ఉందని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ‘ప్రపంచకప్‌ను నిలబెట్టుకోలేక పోవడం జట్టు ఆటగాళ్లను నిరుత్సాహపరిచింది. అయితే స్వదేశానికి తిరిగి వచ్చాక మా ముందు మరో సవాల్ ఉందని తెలుసు. అదే ఐపీఎల్. ఇప్పుడు మా ఆలోచనంతా ఈ టైటిల్‌ను ఎలా దక్కించుకోవడం పైనే ఉంది. మేమంతా నాలుగు నెలలపాటు ఆసీస్ పర్యటనలో ఉన్నాం. ఇప్పుడు నెల రోజుల పాటు ఏకధాటిగా జరిగే లీగ్ కోసం మానసికంగా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే ఐపీఎల్ షెడ్యూల్ మాకు ఎప్పుడో తెలుసు. ఆటగాడిగా ప్రతీ టోర్నీలో రాణించాల్సిందే’ అని రోహిత్ అన్నాడు. లీగ్ ప్రారంభ మ్యాచ్‌లో ముంబై జట్టు కోల్‌కతాతో ఆడనుంది. డిఫెండింగ్ చాంప్ కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)కు మంచి బౌలింగ్ యూనిట్ ఉందని, శాయశక్తులా వారిని ఓడించేందుకు ప్రయత్నిస్తామని రోహిత్ చెప్పాడు. తొలి మ్యాచ్ కాబట్టి ఇద్దరిపై ఒత్తిడి ఉంటుందన్నాడు. చాలామంది నైపుణ్యం కలిగిన దేశవాళీ ఆటగాళ్లను వేలంలో తీసుకున్నట్టు, టోర్నీలో వారు చక్కగా రాణిస్తారనే కోరికను వ్యక్తపరిచాడు. 2013 ఫైనల్లో ఈడెన్ గార్డెన్‌లోనే చెన్నైపై నెగ్గి టైటిల్ దక్కించుకున్నామని గుర్తుచేశాడు. తొలి మ్యాచ్‌లోనే గెలిచి టోర్నీని ఆత్మవిశ్వాసంతో ఆరంభిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. పేసర్ మలింగ ప్రస్తుతం ఫామ్‌లో లేకపోవడం తమనేమీ ఆందోళన పర్చడం లేదని, అతడేంటో ఇప్పటికే రుజువైందని చెప్పుకొచ్చాడు. -
34 పరుగుల వద్ద రోహిత్ (15) ఔట్!
-
వన్డేల్లో రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు!