'మీకేమైనా పిచ్చా.. ఎందుకలా కొట్టుకుంటారు' | Virender Sehwag Fires On Fight Between Rohith And Dhoni Fans In Twitter | Sakshi
Sakshi News home page

'మీకేమైనా పిచ్చా.. ఎందుకలా కొట్టుకుంటారు'

Published Sun, Aug 23 2020 12:00 PM | Last Updated on Sun, Aug 23 2020 2:26 PM

Virender Sehwag Fires On Fight Between Rohith And Dhoni Fans In Twitter - Sakshi

ఢిల్లీ : భారత క్రికెట్‌ అభిమానుల మధ్య గొడవలు జరగడం అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా కొల్హాపూర్‌లో ధోని, రోహిత్‌ శర్మ అభిమానుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవ పెద్దగా మారి ఒక వ్యక్తిని చెరుకుతోటకు తీసుకెళ్లి విచక్షణారహితంగా దాడి చేశారు. అయితే ఈ గొడవలో గాయపడిన వ్యక్తి ధోని అభిమానా లేక రోహిత్‌ అభిమానా అనేది తెలియదు. తాజాగా దీనిపై భారత మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

'మీకు ఏమైనా పిచ్చా.. మేమంతా జట్టుగా కలిసి ఉండి దేశం కోసం ఆడతాం.. ఒకరికి ఒకరం పెద్దగా మాట్లాడకపోయినా.. ఎవరిపని వారు చేసుకుంటూనే గెలుపుకోసం ఎదురుచూస్తుంటాం. కొందరు అభిమానులు మాత్రం ఇలా హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ఆటగాళ్లను వేరుగా చూడొద్దు.. టీమిండియాను మాత్రమే చూడండి..ఇక మీదట అభిమానుల మధ్య ఇలాంటి గొడవలు జరగొద్దు ' అంటూ వీరు సీరియస్‌గా చెప్పుకొచ్చాడు. సెహ్వాగ్‌ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. సెహ్వాగ్‌ చెప్పింది నిజం.. ఎందుకలా కొట్టుకుంటారు.. వారు దేశం కోసం ఆడుతుంటే మధ్యలో మీ లొల్లేందిరా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

చదవండి : 
కోహ్లికి కితాబిచ్చిన సునీల్‌ గావస్కర్‌
అభిమానుల మనసు గెలుచుకున్న ధోని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement