టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ ఆడేందుకు సమాయత్తమవుతున్నాడు. ఈ సీజన్ ధోనికి చివరిదని ప్రచారం జరుగుతున్న వేళ అందరి కళ్లు అతనివైపే ఉన్నాయి. జట్టులో అందరికంటే ముందే చెన్నై చేరుకున్న ధోని తన ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నాడు. ఇక కీపర్‌గా, బ్యాటర్‌గా ధోని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ధోని బౌలింగ్ వేయడం తక్కువగా చూసుంటాం.
అంతర్జాతీయ కెరీర్‌లో ఒకటి లేదు రెండు మ్యాచ్‌ల్లో ధోని పార్ట్‌టైం బౌలింగ్ చేశాడు. మొత్తంగా 538 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన ధోనీ.. మొత్తం కెరీర్‌లో కేవలం 22 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా వన్డేల్లో ఓ వికెట్ కూడా తీసుకున్నాడు. ఇక ఐపీఎల్‍లో ధోని ఒక్కసారి కూడా బౌలింగ్ చేసిన దాఖలాలు లేవు. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్‌లో ధోని బౌలింగ్ చేసే అవకాశాలున్నాయి.
ఐపీఎల్ 2023 కోసం మహీ చెన్నైలో ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యాడు. ఇందులో భాగంగా తన బౌలింగ్ నైపుణ్యానికి కూడా పదును పెట్టాడు. పలు ఓవర్లు బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మాత్రం ఈ అరుదైన సంఘటనను కెమెరాలో బంధించి అద్భుతమైన వీడియోను రూపొందించింది. నెట్స్‌లో అతడు బ్యాటింగ్ చేసే వీడియోకు ఈ బౌలింగ్ క్లిప్‌ను జత చేసింది. ఈ లెక్కన ధోనీ బౌలింగ్ చేస్తుంటే.. ధోనీనే బ్యాటింగ్ చేస్తున్నట్లుగా వీడియోను ఎడిట్ చేసింది. అంతేకాకుండా ఈ వీడియోను సీఎస్‌కే సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వీడియోకు "ది మల్టీవర్స్ మహీ" అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ''ఒకే వీడియోలో పర్పుల్ క్యాప్.. ఆరెంజ్ క్యాప్ కనిపిస్తున్నారు''.. '' ఏకకాలంలో బ్యాటింగ్, బౌలింగ్.. ధోనికి మాత్రమే ఇది సాధ్యం''.. ''మహీ ఫిట్‌నెస్ చూస్తుంటే పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాడు'' అంటూ కామెంట్స్ చేశారు.
ఇక మార్చి 31న ప్రారంభం కానున్న ఐపీఎల్ 16వ సీజన్‌లో తొలి మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, సీఎస్‌కే మధ్య జరగనుంది. గతేడాది ఐపీఎల్‌లో సీఎస్‌కే ఆకట్టుకునే ప్రదర్శన ఇవ్వలేకపోయింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు విజయాలు మాత్రమే సాధించిన సీఎస్‌కే పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది మాత్రం మంచి ప్రదర్శన కనబరిచి టైటిల్‌ను ధోనికి గిఫ్ట్‌గా ఇవ్వాలని సీఎస్‌కే భావిస్తోంది.
చదవండి: Ben Stokes: అడుగుపెట్టిన కాసేపటికే బరిలోకి.. బ్యాట్‌తో విధ్వంసం
Comments
Please login to add a commentAdd a comment