Twitter Removes Blue Tick For Ms Dhoni Account: ధోనికి షాక్‌ ఇచ్చిన ట్విటర్‌; అభిమానుల ఆగ్రహం - Sakshi
Sakshi News home page

MS Dhoni: ధోనికి షాక్‌ ఇచ్చిన ట్విటర్‌; అభిమానుల ఆగ్రహం

Published Fri, Aug 6 2021 5:58 PM | Last Updated on Fri, Aug 6 2021 7:02 PM

Fans Loss Calm After Twitter Removes Blue Tick From MS Dhoni Account - Sakshi

ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనికి ట్విటర్‌ షాక్‌ ఇచ్చింది. ధోని అకౌంట్‌ నుంచి బ్లూ వెరిఫైడ్‌ టిక్‌మార్క్‌ను తొలగించింది. అయితే ట్విటర్‌ ఆ టిక్‌ను ఎందుకు తొలగించిందనే దానిపై స్పష్టత రాలేదు. ధోనీ ట్విటర్‌లో కొంతకాలంగా యాక్టివ్‌గా లేకపోవడంతోనే ఇలా జ‌రిగి ఉంటుంద‌ని సమాచారం. ధోని ఈ ఏడాది జనవరి 8న చివరి ట్వీట్‌ చేశాడు. అప్పటినుంచి ధోని ట్విటర్‌లో​ యాక్టివ్‌గా లేడు. ట్విటర్‌ రూల్స్‌ ప్రకారం ఆరు నెల‌ల పాటు ఒక వ్యక్తి అకౌంట్‌లో లాగిన్ కాకుంటే సదరు సంస్థ బ్లూ టిక్‌ తొలగిస్తుంది. ఒకవేళ బ్లూ టిక్‌ మళ్లీ కావాలంటే వెరిఫికేష‌న్ కోరుతుంది.

అయితే ధోని ట్విటర్‌కు బ్లూ టిక్‌ తొలగించడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బ్లూటిక్‌ను యాడ్‌ చేయాలంటూ ట్విటర్‌ సంస్థను డిమాండ్‌ చేశారు. తన రిటైర్మెంట్‌ విషయాన్ని కూడా ధోని ట్విటర్‌లో కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అంతేగాక తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను కూడా ధోని ఇన్‌స్టాలోనే షేర్‌ చేస్తూ వచ్చాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ఇచ్చిన ధోని ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement