twitter account
-
హైదరాబాద్ మెట్రో X అకౌంట్ హ్యాక్
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ‘ఎక్స్’ అకౌంట్ హ్యాక్‌కు గురైంది. దీనిపై మెట్రో యాజమాన్యం స్పందించింది. ఎలాంటి లింకులపై క్లిక్ చేయొద్దని.. తమ ఎక్స్ అకౌంట్‌ను సంప్రదించేందుకు ఎవరూ ప్రయత్నించవద్దని కోరింది. త్వరగా ఖాతాను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపింది.⚠️ Important Notice: Our official Twitter/X account (@ltmhyd) has been hacked. Please avoid clicking any links or engaging with posts until further notice. We're working on it and will update you soon. Stay safe! #landtmetro #metroride #mycitymymetromypride #hyderabadmetro… pic.twitter.com/NiNyNNlN1M— L&T Hyderabad Metro Rail (@ltmhyd) September 19, 2024 -
భారత ప్రభుత్వంపై మస్క్ కంపెనీ వ్యతిరేక స్వరం
తమ ప్లాట్‌ఫామ్‌లోని కొన్ని ఖాతాలు, పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఎలాన్ మస్క్‌కు చెందిన సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) పేర్కొంది. ప్రభుత్వ ఆదేశాలను తాము పాటిస్తాం కానీ, వారి చర్యలతో ఏకీభవించబోమని ప్రకటించింది. అయితే కంపెనీ ఆరోపణలపై ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ‘ఎక్స్’కు సంబంధించిన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ హ్యాండిల్లో ఈ మేరకు పోస్ట్‌లో వివరాలను కంపెనీ వెల్లడించింది. భారత ప్రభుత్వ చర్యలతో తాము ఏకీభవించడం లేదని, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ పోస్ట్‌లను తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. అయితే భారత ప్రభుత్వ ఆదేశాలకు కట్టుబడి ఉంటామని తెలిపింది. "ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భారత్‌లో మాత్రమే ఈ ఖాతాలు, పోస్ట్‌లను నిలిపివేస్తాం. అయినప్పటికీ మేము ఈ చర్యలతో విభేదిస్తున్నాం. ఈ పోస్ట్‌లకు భావప్రకటనా స్వేచ్ఛను కొనసాగిస్తున్నాం" అని పేర్కొంది. ప్రభుత్వ ఉత్తర్వును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ఇంకా పెండింగ్‌లో ఉందని ‘ఎక్స్’ తెలిపింది. ప్రభావిత యూజర్లకు కూడా ఈ చర్యల నోటీసును అందించినట్లు పేర్కొంది. గత ఏడాది జూన్‌లో నిర్దిష్ట సోషల్ మీడియా ఖాతాలు, ట్వీట్లను బ్లాక్ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా ‘ఎక్స్’ వేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. భారత ప్రభుత్వ ఆదేశాలను పాటించనందుకు కంపెనీకి హైకోర్టు రూ.50 లక్షల జరిమానా విధించింది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని హైకోర్టు సమర్థించిందని, దేశ చట్టాన్ని కంపెనీ తప్పక పాటించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. -
గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ నేతలు, ప్రభుత్వ అధికారులకు చెందిన ట్విట్టర్ అకౌంట్లు ఇటీవల వరుసగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఈ అకౌంట్లను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు డీపీలు మార్చడం, సంబంధం లేని పోస్టులు పెడుతున్నారు. గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్, మాజీ మంత్రి కేటీఆర్ ట్వీటర్ అకౌంట్లు కూడా హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. మొన్న తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ పేజ్ హ్యాక్ చేసిన కేటుగాళ్లు.. తాజాగా గవర్నర్ తమిళిసై ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులకు రాజ్‌భవన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘ఎక్స్’లో ఇక ఆడియో, వీడియో కాల్స్.. ఎలా ఆక్టివేట్ చేయాలంటే..
టెక్నాలజీ కంపెనీల మధ్య ఎప్పుడూ పోటీ ఉంటుంది. మెటా ఆధ్వర్యంలోని వాట్సప్ కొన్నేళ్లుగా ఆడియో, వీడియోకాల్ సదుపాయాన్ని కల్పిస్తుంది. అదే తరహాలో ఇపుడు మరో టెక్ దిగ్గజమైన ఎక్స్(ట్విటర్) ఆడియో, వీడియోకాల్ సౌకర్యాన్ని తన వినియోగదారులకు అందించనుంది. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఎలాన్‌మస్క్ తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతానికి కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. అయితే దీన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే Settings->Privacy & Safety->Direct Messages-> Enable Audio & Video Calling ఫీచర్‌ని ఎనేబల్ చేసుకోవాలి. (ఇదీ చదవండి: ప్రపంచంలోనే మేటి ఇండియన్ బీస్కూళ్లు..) ఎవరికీ ఫోన్ నంబరు ఇవ్వకుండానే కాల్స్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎక్స్ ప్లాట్‌ఫామ్‌ని ‘ఎవ్రీథింగ్ యాప్’గా మార్చటంలో భాగంగానే వాయిస్, వీడియో కాల్స్ ఫీచర్లను తీసుకురానున్నట్లు గతంలో మస్క్ ప్రకటించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, మ్యాక్, పీసీల్లో ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చు. Early version of video & audio calling on 𝕏 https://t.co/aFI3VujLMh — Elon Musk (@elonmusk) October 25, 2023 -
ఆకాశంలో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయట!
రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే కోట్ల కొద్దీ నక్షత్రాలు కనువిందు చేస్తుంటాయి. అందులో కొన్ని ఆకారాలూ కనిపిస్తుంటాయి. కానీ భవిష్యత్తులో ఆ చుక్కల లెక్కలన్నీ మారిపోతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నక్షత్రాలన్నీ స్థానం మారిపోతాయని.. ఆకాశాన్ని అత్యంత ప్రకాశవంతమైన వెలుగు ఆక్రమిస్తుందని అంటున్నారు. మరి దానికి కారణం ఏమిటో తెలుసా? మన భూమి, సౌర కుటుంబం ఉన్న పాలపుంత గెలాక్సీ, సమీపంలోని ఆండ్రోమెడా అనే మరో గెలాక్సీ రెండూ ఢీకొని కలసిపోనుండటమే. ఇప్పటికే ఈ రెండూ ఒకదానికొకటి సమీపంలోకి వస్తున్నాయి. మరో 375 కోట్ల ఏళ్ల తర్వాత ఢీకొనడం మొదలవుతుంది. సుమారు 700 కోట్ల ఏళ్ల తర్వాత రెండూ పూర్తిగా కలసిపోయి పెద్ద గెలాక్సీగా మారిపోతాయి. ఈ క్రమంలో చాలా నక్షత్రాలు చెల్లాచెదురైపోతాయి. వాటి స్థానాలు మారిపోతాయి. మరి ఇలా రెండూ దగ్గరికి రావడం, కలిసిపోవడం జరుగుతున్నప్పుడు మనకు ఆకాశం ఎలా కనిపిస్తుందనే దానిపై నాసా ఓ వీడియోను రూపొందించింది. చంద్ర ఎక్స్‌రే అబ్జర్వేటరీ తీసిన చిత్రాలు, దాని సాయంతో చేసిన పరిశీలన ఆధారంగా సిద్ధం చేసిన ఈ వీడియోను.. చంద్ర అబ్జర్వేటరీ పేరిట ఉన్న ‘ఎక్స్ (ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేసింది. మనం చూసేది పాలపుంతే కాదు..! మన సౌర కుటుంబం ఉన్న పాలపుంత (మిల్కీవే) గెలాక్సీ అంటూ ఫొటోల్లో, ఇంటర్నెట్లో మనం చూస్తున్నది నిజానికి పాలపుంత ఫొటో కానే కాదు. అసలు మనం పాలపుంత మొత్తం చిత్రాన్ని తీయడం సాధ్యమే కాదు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల నక్షత్రాలున్న పాలపుంత గెలాక్సీలో మధ్య భాగానికి ఓ పక్కన మన సూర్యుడు, భూమి ఉన్నాయి. పాలపుంత గెలాక్సీ మొత్తాన్ని దాటి బయటికి వెళితే తప్ప దీనిని ఫొటో తీయలేం! ఎలాగంటే.. సముద్రం మధ్య చిన్న పడవలో కెమెరా పట్టుకుని కూర్చున్న మనం వేల కిలోమీటర్లు విస్తరించి ఉన్న సముద్రం మొత్తాన్ని ఫొటో తీయగలమా? ఇదీ అంతే.. మరి మనం చూసే పాలపుంత చిత్రం ఏమిటి అంటారా.. దాదాపుగా పాలపుంతలా ఉండే ఆండ్రోమెడా గెలాక్సీ చిత్రమే. ఈ గెలాక్సీయే భవిష్యత్తులో పాలపుంతను ఢీకొట్టేది. -
టీడీపీ చీప్ ట్రిక్స్.. ట్విట్టర్ ఖాతాలో అసత్య ప్రచారం
మదనపల్లె : రోజురోజుకీ ప్రజాదరణ కోల్పోతున్న టీడీపీ పబ్లిసిటీ పిచ్చితో ఎంతటి బరితెగింపుకై నా సిద్ధపడుతోంది. అధికార పార్టీ నేతలపై దుష్ప్రచారం చేయడంలో పచ్చ పార్టీ ఎంతకై నా తెగిస్తోంది. మూడురోజుల క్రితం మదనపల్లె మండలంలో ఓ మైనర్ బాలుడిపై అతడి స్నేహితులు దాడికి పాల్పడితే.. ఆ ఘటనను సైతం టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకునే క్రమంలో కులప్రస్తావన తీసుకువచ్చి ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారంటూ సోషల్ మీడియా ట్విట్టర్లో తప్పుడు ప్రచారాన్ని మొదలెట్టింది. నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి ఉన్న ప్రతిష్టను, క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్ట్రిక్కులను ప్రయోగిస్తోంది. ఘటనకు సంబంధించిన వివరాలు.. పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన వెంకటరమణ, అంజలి దంపతుల కుమారుడు ఆదిరామమూర్తి(17) ప్రశాంత్‌నగర్‌లోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఇతడు అదే కాలనీకి చెందిన ప్రవీణ్‌కుమార్‌తో గొడవపడ్డాడు. దీన్ని మనస్సులో పెట్టుకున్న ప్రవీణ్ ఈనెల 17న ఆదిరామమూర్తిని సీటీఎంలో స్నేహితులు జరుపుతున్న తన పుట్టినరోజు వేడుకలకు రావాల్సిందిగా కోరాడు. తన ద్విచక్రవాహనంలో ఎక్కించుకుని తీసుకువెళ్లాడు. అక్కడ ప్రవీణ్‌తో పాటుగా మదనపల్లె రామారావుకాలనీకి చెందిన రక్షిత్, చందూ, సీటీఎం నేతాజీకాలనీకి చెందిన నౌషాద్, హేమంత్బాబులు కలిసి ఆదిరామమూర్తిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. తాము కొడుతున్న దృశ్యాలను వీడియోలో చిత్రీకరించారు. ఈ ఘటనపై బాధితుడు తాలూకా పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా తనను పట్టించుకోలేదంటూ 19న మదనపల్లె ప్రెస్‌క్లబ్‌లో తల్లిదండ్రులతో కలిసి విలేకరుల సమావేశంలో చెప్పాడు. తమకు న్యాయం జరగకపోతే వడ్డెరసంఘం ఆధ్వర్యంలో నిరసన తెలుపుతామని హెచ్చరించారు. మరుసటిరోజు పత్రికల్లో ఈ విషయమై వార్తలు రావడంతో స్పందించిన తాలూకా పోలీసులు దాడికి పాల్పడిన నిందితులపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ సంఘటనను టీడీపీకి చెందిన నాయకులు తమకు అనుకూలంగా వడ్డెర కులానికి చెందిన మైనర్‌బాలుడిపై ఎమ్మెల్యే అనుచరులు అమానుషంగా దాడికి పాల్పడ్డారంటూ తెలుగుదేశం పార్టీ జై టీడీపీ ట్విట్టర్ అకౌంట్లో వీడియోను పోస్ట్‌చేసి అసత్యప్రచారానికి పూనుకున్నారు. ఘటనలో పాల్గొన మైనర్ బాలురు సాధారణ దినసరికూలీ, కార్మిక కుటుంబాలకు చెందిన వారు. వీరికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. మైనర్బాలురకు, వారి కుటుంబాలకు రాజకీయాలతో కానీ పార్టీలతో కానీ ఎలాంటి సంబంధం లేకున్నా... జరిగిన ఘటనకు ఏమాత్రం సంబంధంలేని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనుచరులను బాధ్యులను చేస్తూ టీడీపీ నీచ,కుట్ర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి చీప్‌ట్రిక్స్ మానుకోకపోతే భవిష్యత్తులో టీడీపీకి తీవ్ర నష్టం తప్పదని, పచ్చపార్టీ నాయకులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. -
న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ఖాతాను లాక్ చేసిన ట్విటర్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..!
మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విటర్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ - ఏఎన్ఐ (ANI) ఖాతాను లాక్ చేసింది. కనీస వయసు ప్రమాణాలను పాటించనందుకు తమ ఖాతాను ట్విటర్ లాక్ చేసిందని ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్ తాజాగా తెలిపారు. ఈ వార్తా సంస్థకు ట్విటర్ హ్యాండిల్‌ను క్లిక్ చేయడానికి ప్రయత్నించగా 'ఈ ఖాతా ఉనికిలో లేదు' అని చూపుతోంది. ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే.. ఏఎన్ఐ ట్విటర్ ఖాతా లాక్ అయిన కొన్ని నిమిషాల తర్వాత స్మితా ప్రకాష్ ఏఎన్ఐ హ్యాండిల్ లాక్ చేసినట్లు తెలియజేస్తూ ట్విటర్ పంపిన ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను తన వ్యక్తిగత ఖాతా ద్వారా ట్వీట్ చేశారు. మొదట మా ఖాతాకున్న గోల్డ్ టిక్ తీసేసి బ్లూటిక్ ఇచ్చారు. ఇప్పుడు లాక్ చేశారు అంటూ ఎలాన్ మస్క్‌ను ట్యాగ్ చేశారు. ‘ట్విటర్ ఖాతాను సృష్టించడానికి, మీకు కనీసం 13 సంవత్సరాలు ఉండాలి. మీరు ఈ వయసు నిబంధనకు అనుగుణంగా లేరని ట్విటర్ నిర్ధారించింది. కాబట్టి మీ ఖాతాను లాక్ చేశాం’ అని ఈ-మెయిల్లో ట్విటర్ పేర్కొంది. ఇదీ చదవండి: Google Play Store: గూగుల్ సంచలనం! 3500 యాప్‌ల తొలగింపు.. ఏఎన్ఐ వెబ్సైట్ ప్రకారం.. దక్షిణాసియా ప్రముఖ మల్టీమీడియా వార్తా సంస్థ అయిన ఏఎన్ఐకి భారతదేశం, దక్షిణ ఆసియా సహా ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ బ్యూరో సెంటర్లు ఉన్నాయి. ఇక ఏఎన్ఐ ట్విటర్ ఖాతాకు 7.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఎన్డీటీవీ ఖాతా కూడా.. మరోవైపు ఎన్డీటీవీ ఖాతాను కూడా ట్విటర్ లాక్ చేసింది. ఎన్డీటీవీ ట్విటర్ హ్యాండిల్‌ను ఓపెన్ చేయగా అకౌంట్ ఉనికిలో లేనట్లు చూపిస్తోంది. అయితే ఎన్డీటీవీ ట్విటర్ అకౌంట్ ఎందుకు నిలిచిపోయిందన్నది తెలియరాలేదు. -
ట్విట్టర్ కామెంట్ తో డబ్బు సంపాదించుకొనే అవకాశం
-
‘సెలబ్రిటీ’ ఖాతాలకు మళ్లీ బ్లూ టిక్
న్యూఢిల్లీ: చందా మొత్తాన్ని చెల్లించలేదంటూ చాలా మంది ప్రముఖుల ట్విట్టర్ ఖాతాల్లో బ్లూ టిక్‌ను తొలగించిన ట్విట్టర్ యాజమాన్యం ఆదివారం కొందరికి బ్లూ టిక్‌ను పునరుద్ధరించింది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ట్విట్టర్ ఖాతాలకే ఈ మినహాయింపు ఇచ్చినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, రాహుల్ గాంధీ, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీసహా ప్రముఖ భారతీయ నటులు, రాజకీయనేతలు, క్రీడాకారుల బ్లూ టిక్‌ను ఇటీవల తొలగించగా ఆదివారం ఆ టిక్ మళ్లీ ప్రత్యక్షమైంది. లక్షలాది మంది ఫాలోవర్లు ఉండటం వల్లే వీరందరికి బ్లూ టిక్ ఇచ్చారా ? లేక సబ్‌స్క్రైబ్ చేసుకున్నారా అనేది తెలియరాలేదు. ‘చందా కట్టకున్నా ఆదివారం బ్లూ టిక్ మళ్లీ వచ్చేసింది. మిస్టర్ మస్క్ మీరే నా తరఫున చందా రుసుం కట్టేశారా? ’ అంటూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆదివారం ట్వీట్‌చేశారు. అయితే లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్న ఖాతాలకు మాత్రమే వెరిఫైడ్ స్టేటస్(బ్లూ టిక్) హోదా కట్టబెట్టినట్లు తెలుస్తోంది. అయితే, దివంగతుల ఖాతాలకు టిక్ ప్రత్యక్షమవడం గమనార్హం. మైఖేల్ జాక్సన్, చాడ్విక్ బోస్‌మ్యాన్, కోబె బ్రయాంట్ తదితర సెలబ్రిటీల ఖాతాలు ఇందులో ఉన్నాయి. కాగా బ్లూ టిక్ కోసం చందా కట్టే ప్రసక్తే లేదని ప్రకటించిన కొందరు ప్రముఖుల తరఫున తానే నగదు చెల్లించి టిక్ పునరుద్ధరించినట్లు ట్విట్టర్ యజమాని, కుబేరుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు. దిగ్గజ నటుడు విలియం శాట్నర్ తదితరుల తరఫున మస్క్ రుసుం చెల్లించారు. -
R Ashwin: ట్విటర్ అకౌంట్‌పై ఆందోళన.. ఎలాన్ మస్క్‌కు లేఖ
టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన ట్విటర్ అకౌంట్‌పై ఆందోళన చెందుతున్నాడు. ట్వీట్స్ చేసినప్పుడల్లా పాప్అప్స్ ఎక్కువగా వస్తున్నాయని.. మార్చి 19 అంటూ ఏదో గడువు చూపిస్తుందని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తన ట్విటర్ అకౌంట్‌కు భద్రత కల్పించాలంటూ అశ్విన్ ట్విటర్ సీఈవో ఎలాన్ మస్క్‌కు బుధవారం లేఖ రాశాడు. ''నా ట్విటర్ ఖాతాకు సంబంధించిన భద్రతపై ఆందోళనగా ఉంది. ట్వీట్ చేసినప్పుడల్లా ఏవో తెలియని పాప్అప్స్(Pop-Ups) వస్తున్నాయి. ఆ లింక్‌లను క్లిక్ చేస్తే ఎలాంటి సమాచారం రావడం లేదు. అయితే మార్చి 19వ తేదీ వరకు గడువు చూపిస్తూ పాప్అప్ లింకులు కనిపిస్తున్నాయి. కాబట్టి అప్పటిలోగా నా ట్విటర్ అకౌంట్‌ను ఎలా భద్రంగా ఉంచుకోవాలనేదానిపై మీరు(ఎలాన్ మస్క్) వివరణ ఇస్తే బాగుంటుంది'' అని పేర్కొన్నాడు. కాగా ఎలాన్ మస్క్ ట్విటర్ 'బ్లూ టిక్' తీసుకొచ్చినప్పటి నుంచి ట్విటర్ ఖాతాల నిర్వహణ, భద్రత విషయంలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పడు అశ్విన్ చెప్పింది కొత్త సమస్యలా కనిపిస్తుంది. మరి అశ్విన్ ఎదుర్కొంటున్న సమస్యపై ఎలాన్ మస్క్ స్పందించి పరిష్కారం ఏంటనేది చూపిస్తారా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కాగా అశ్విన్ ఇటీవలే బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో బౌలింగ్‌లో అదరగొట్టాడు. నాలుగు టెస్టులు కలిపి 25 వికెట్లు పడగొట్టిన అశ్విన్.. జడేజాతో కలిసి సంయుక్తంగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. ట్విటర్లో విభిన్న పోస్టులను షేర్ చేస్తూ తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అశ్విన్ తాజాగా విరామం దొరకడంతో ట్విటర్ అకౌంట్ భద్రతపై ఎలాన్ మస్క్‌కు లేఖ రాశాడు. Ok !! how do I get my Twitter account secure before the 19th of March now, I keep getting pop ups but none of the links lead out to any clarity. @elonmusk happy to do the needful. Point us in the right direction pls. — Ashwin 🇮🇳 (@ashwinravi99) March 15, 2023 చదవండి: '#Rest In Peace.. పాకిస్తాన్ క్రికెట్' ICC Test Rankings: టీమిండియా ఆటగాళ్ల సత్తా.. నంబర్1 అశూ! ఇక కోహ్లి ఏకంగా -
టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ ఖాతా హ్యాక్
హైదరాబాద్: టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని టీఎస్ ఆర్టీసీ ధృవీకరించింది. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ సజ్జనార్ ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురి కావడం చాలా దురదృష్టకర సంఘటనగా టీఎస్ ఆర్టీసీ పేర్కొంది. ప్రస్తుతం సదరు అకౌంట్ నుంచి ఎటువంటి ట్వీట్లను చేయడం కానీ రిప్లై ఇవ్వడం కానీ జరగడం లేదని టీఎస్ ఆర్టీసీ పీఆర్వో పేర్కొన్నారు. ట్విట్టర్ అకౌంట్‌ను పునరుద్ధరించే పనిలో ఉన్నామని , దీనికి ట్విట్టర్ సపోర్ట్ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. -
యశ్‌కి బర్త్‌డే విష్.. ప్రశాంత్ నీల్ ట్విటర్ అకౌంట్ క్లోజ్!
కేజీయఫ్ సిరీస్‌తో ఒక్కసారిగా నేషనల్ స్టార్స్ అయిపోయారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంతో ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్‌గా మారాడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ ‘సలార్’ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమాకు కమిట్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రశాంత్ నీల్‌కు షాక్ తగిలింది. ఇటీవల రాఖీభాయ్ యశ్‌కు బర్త్‌డే విషెస్ చెప్పి ట్రోల్స్ బారిన పడ్డారు ఆయన. చదవండి: శ్రీహాన్‌తో పెళ్లి ఎప్పుడో చెప్పిన సిరి! ఆయన విషెస్ చెప్పిన తీరుపై కన్నడీగులు మండిపడ్డారు. దీంతో నెట్టింట ఆయనకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంతకి ఏం జరిగిందంటే.. జనవరి 8న కన్నడ స్టార్ హీరో యశ్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన పుట్టిన రోజు శుభకాంక్షలు తెలుపుతూ ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్‌ను ఆయన ఉర్దూ భాషలో చేశారు. దీంతో కన్నడ ప్రజలు, ప్రేక్షకులు ప్రశాంత్ నీల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కర్ణాటక చెందిన మీరు కన్నడలోనే ట్వీట్ చేయొచ్చు కదా’ అని ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఆర్ఆర్ఆర్కు ఆస్కార్ అవార్డు ఖాయం, రాసిపెట్టుకొండి: హాలీవుడ్ నిర్మాత ‘అసలు ఉర్దూలో ఎందుకు ట్వీట్ చేశారు?’ అంటూ నెటిజన్లు ఆయనను ట్రోల్ చేశారు. ఈ క్రమంలో సడెన్ ఆయన ట్వీటర్ బ్లాక్ అయిపోయింది. ఆయన ట్విటర్ ఖాతా ఓపెన్ చేసి చూడగా ‘ఈ ఖాతా పని చేయడం లేదు’ అనే నోటిఫికేషన్ చూపిస్తోంది. దీంతో ఆయనకు వస్తున్న నెగిటివిటీ కారణంగానే ప్రశాంత్ నీల్ ట్విటర్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేశారని అంత అభిప్రాయ పడుతున్నారు. అయితే దీనికి అసలైన కారణంగా మాత్రం తెలియదు. దీనిపై క్లారిటీ రావాలంటే స్వయంగా ప్రశాంత్ నీల్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాలి. -
అందుకే నా ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేశారు: నటుడు
‘కాంతార’ నటుడు కిశోర్ కుమార్ ట్విటర్ ఖాతాను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. గత రెండు రోజులుగా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. దీనిపై నెటిజన్లు నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తన పోస్టుల కారణంగానే ట్విటర్ అతడి ఖాతాను సస్సెండ్ చేశారని కొందరు అంటుంటే, ట్విటర్ నిబంధనలు ఉల్లంఘించడమే కారణమని మరికొందరు అభిప్రాయం పడుతున్నాయి. ఇలా తన ట్విటర్ ఖాతా సస్పెండ్ కావడంపై తీవ్ర చర్చ జరుగుతున్న క్రమంలో తాజాగా కిషోర్ కూమార్ స్పందించాడు. చదవండి: ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పుడు నేను అనుకుంది చేయలేకపోయా: ప్రభాస్ తన ట్విటర్ అకౌంట్‌ను నిలిపివేయడానికి కారణమేంటో వివరిస్తూ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేశాడు. ‘నా అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారు. అందువల్లే నా ట్విటర్ నా అకౌంట్‌ను తొలగించింది. అంతేకాని నేను పెట్టిన పోస్ట్‌ల వల్ల కాదు. నా ట్విటర్ సస్పెన్షన్‌పై ఇప్పటికైన అనవసరమైన వాదనలను ఆపండి. నా పోస్ట్‌ల వల్ల దానిని నిలిపివేయలేదు. డిసెంబర్20న నా అకౌంట్ హ్యాక్ అయింది. దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటామని ట్విటర్ నాకు హామీ ఇచ్చింది’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ట్విటర్ తనతో జరిపిన సంప్రదింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను కూడా ఈ సందర్భంగా ఆయన షేర్ చేశాడు. చదవండి: సోనూసూద్.. తప్పుడు సందేశాలివ్వొద్దు!: నార్త్ రైల్వే ఆగ్రహం View this post on Instagram A post shared by Kishore Kumar Huli (@actorkishore) -
కాంతార నటుడికి షాకిచ్చిన ట్విటర్!
‘కాంతార’ నటుడు కిశోర్ కుమార్‌కి ట్విటర్ భారీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించారంటూ అతని ఖాతాను సస్పెండ్ చేసింది. అతని ఖాతాని ఓపెన్ చేయగా..‘నిబంధనలు ఉల్లంఘించిన ఖాతాను ట్వీటర్ సస్పెండ్ చేస్తుంది’అనే మెసేజ్ డిస్ప్లే అవుతోంది. అయితే కిశోర్ ఖాతాను నిలివివేయడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికీ తెలియదు. కిశోర్‌కి ట్విటర్‌తో పాటు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ఖాతాలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టాలో 43 వేల మంది, ఫేస్బుక్లో 66 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రాజకీయాలతో పాటు పలు అంశాలపై సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటాడు. ఇటీవల ‘కాంతార’దేవుడిని అవమానించిన ఓ వ్యక్తి మరణించారనే వార్త బాగా వైరల్ అయింది. దీనిపై కిశోర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘దేవుడు లేదా దెయ్యం అనేది మన నమ్మకం మాత్రమే. మీరు నమ్మితే, ఉంది, మీరు నమ్మకపోతే, లేదు. ఇలా కష్టకాలంలో ధైర్యాన్నిచ్చే నమ్మకాలను అవమానించాల్సిన పనిలేదు. అక్రమార్కులను శిక్షించేందుకు చట్టం ఉంది. వారి విశ్వాసం వారిది. విశ్వాసం కలిగి ఉండండి, మూఢనమ్మకం కాదు’అని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే మీడియా సంస్థ ఎన్డీటీవీని అదానీ గ్రూప్ దక్కించుకోవడాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా వ్యతిరేకించాడు. -
భారత్‌లో 48వేలకు పైగా ట్విటర్ అకౌంట్లు బ్యాన్!
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ట్విట్టర్ భారత్‌లో 48,624 అకౌంట్లను నిషేధించింది. అందులో న్యూడిటీ, పిల్లలపై లైంగిక దోపిడి, ప్రోత్సాహించేలా ఉండడమే అందుకు కారణంగా తెలిపింది. సదరు అకౌంట్లు అక్టోబర్ 26 నుంచి నవంబర్ 25 మధ్య కాలంలో ట్విటర్ నియమాలను ఉల్లంఘించినట్లు వెల్లడించింది. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త IT రూల్స్, 2021కి అనుగుణంగా ట్విటర్ నెలవారీ నివేదికలో, తన ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగాల ద్వారా ఒకే సమయంలో భారత్ నుంచి 755 ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపింది. వాటిలోని 121 యూఆర్ఎల్ (URL)లపై చర్య తీసుకున్నట్లు పేర్కొంది. వీటిలో కోర్టు ఆదేశాలతో పాటు వ్యక్తిగత వినియోగదారుల నుంచి స్వీకరించిన ఫిర్యాదులు కూడా ఉన్నాయి. భారత్ నుంచి అందుకున్న ఫిర్యాదుల వివరాలు ఇలా ఉన్నాయి. దుర్వినియోగం/వేధింపు (681), తర్వాత ఐపీ (IP)-సంబంధిత ఉల్లంఘన (35), ద్వేషపూరిత ప్రవర్తన (20), గోప్యతా ఉల్లంఘన (15)కు సంబంధించినవిగా పేర్కొంది. కొత్త IT రూల్స్ 2021 ప్రకారం, భారీ డిజిటల్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలు, 5 మిలియన్లకు పైగా వినియోగదారులతో, నెలవారీ నివేదికలను ప్రచురించాల్సి ఉంటుంది. చదవండి: కొత్త ఏడాదిలో యూజర్లకు షాక్.. నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ షేర్ చేస్తే పైసలు కట్టాలి! -
ప్రభుత్వాలకు ట్విటర్ గ్రే టిక్..
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ తాజాగా ప్రభుత్వాలకు సంబంధించిన అధికారిక ఖాతాలకు బూడిద రంగు (గ్రే) టిక్ మార్కును, కంపెనీలకు బంగారు వర్ణం (గోల్డెన్) టిక్ మార్కును కేటాయించడం ప్రారంభించింది. మిగతా వెరిఫైడ్ ఖాతాలకు బ్లూ టిక్ మార్క్ ఉంటుంది. కొత్త మార్పుల ప్రకారం భారత ప్రభుత్వ హ్యాండిల్, ప్రధాని నరేంద్ర మోదీ హ్యాండిల్ టిక్ మార్క్‌ను బ్లూ నుంచి గ్రేకు మార్చింది. ప్రధాని ట్విటర్ ఖాతాకు 8.51 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. నెలకు 8 నుంచి 11 డాలర్ల వరకూ చార్జీలతో ట్విటర్ బ్లూ సర్వీసు అందిస్తున్న కంపెనీ ప్రస్తుత సబ్‌స్క్రయిబర్స్ తమ సబ్‌స్క్రిప్షన్‌ను అప్‌గ్రేడ్, రద్దు లేదా ఆటో – రెన్యూ చేసుకోవచ్చని పేర్కొంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రిటన్ దేశాల్లో ట్విటర్ బ్లూ సర్వీస్ అందుబాటులో ఉంది. చదవండి: 8 ఏళ్లలో రూ. 4 లక్షల కోట్లు.. డిజిన్వెస్ట్‌మెంట్‌తో కేంద్రం ఆదాయం -
మస్క్... నువ్వు మాకొద్దు!
వాషింగ్టన్: సామాజిక దిగ్గజ సంస్థ ట్విట్టర్‌కు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యాడంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మస్క్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిని ఉద్దేశిస్తూ మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. ‘ ట్విట్టర్‌కు సీఈవోగా నేను తప్పుకోవాలా ?. ఈ పోలింగ్‌లో వచ్చే ఫలితాలకు అనుగుణంగా నడుచుకుంటా. మీ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరేం ఆశిస్తారో అదే మీకు దక్కుతుంది’ అని మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. దీనిపై ట్విటర్ యూజర్లు వెంటనే భారీగా స్పందించారు. పోలైన ఓట్లలో 57.5 శాతం ఓట్లు మస్క్‌కు వ్యతిరేకంగా పడ్డాయి. మాకు మీరు అక్కర్లేదంటూ ‘యస్’ చెబుతూ ఓట్లు వేశారు. ఆదివారం సాయంత్రం మొదలైన ఈ ఓటింగ్ సోమవారం తెల్లవారుజామున ముగిసింది. మస్క్ పిలుపునకు స్పందనగా 1.7 కోట్లకుపైగా ఓట్లు పోల్ అయ్యాయని సీఎన్ఎన్ పేర్కొంది. ఓటింగ్ ఫలితంపై మస్క్ ఇంకా స్పందించలేదు. దాదాపు 44 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక మస్క్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై విమర్శలు కొనసాగుతుండటం తెల్సిందే. భారీగా సిబ్బంది కోతలకు సిద్దమవడం, ఎక్కువ గంటలు చెమటోడ్చి పనిచేయాలని ఒత్తిడి తేవడం వంటి నిర్ణయాలతో మస్క్ పేరు చెబితేనే ట్విటర్ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. ట్విటర్ విధానపర నిర్ణయాల్లో మార్పులపైనా ఆన్లైన్ ఓటింగ్ చేపడతానని మస్క్ ప్రకటించారు. ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, మాస్టోడోన్, ట్రూత్ సోషల్, ట్రైబల్, నోస్టర్, పోస్ట్ వంటి ఇతర సోషల్‌మీడియా సంస్థల ఖాతాలకు వాడుతున్న అవే యూజర్ఐడీలతో కొనసాగుతున్న/అనుసంధానమైన ట్విట్టర్ ఖాతాలను తొలగిస్తామని ట్విటర్ తెలిపింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నన్ను ఫాలో అవ్వండి’, ‘ఫేస్బుక్లో నా ప్రొఫైల్ చెక్ చేయండి’ వంటి వాటికీ ట్విట్టర్ చెక్ పెట్టనుంది. -
ఏపీ: వైఎస్ఆర్సీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
-
ఏపీ: వైఎస్సార్సీపీ ట్విటర్ అకౌంట్ హ్యాక్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్ర ప్రదేశ్ అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది. ప్రొఫైల్పిక్, కవర్ పిక్‌లను మార్చేశారు హ్యాకర్లు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ట్విటర్ పేజీలో క్రిప్టో పోస్టులు చేశారు దుండగులు. రంగంలోకి దిగింది వైఎస్సార్సీపీ టెక్నికల్ టీం. ఈ ఘటనపై ట్విటర్ యాజమాన్యానికి వైఎస్ఆర్సీపీ ఐటీ సిబ్బంది ఫిర్యాదు చేశారు. పలు ట్వీట్లను రీట్వీట్లు సైతం చేస్తున్నారు హ్యాకర్లు. -
మస్క్ షాకింగ్ డెసిషన్:150 కోట్ల ట్విటర్ యూజర్లకు మంగళం!
న్యూఢిల్లీ: మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ కొత్త బాస్, టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పారు. దాదాపు 1.5 బిలియన్ల ఇన్‌యాక్టివ్ ఖాతాలను తొలగిస్తోంది. 1.5 బిలియన్ ఖాతాల నేమ్ స్పేస్‌ను ఖాళీ చేయడం1.5 బిలియన్ ఖాతాల నేమ్ స్పేస్‌ను ఖాళీ చేస్తున్నానంటూ మస్క్ శుక్రవారం ట్వీట్ చేశారు. (108 ఎంపీ కెమెరాతో అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్, ఫస్ట్ సేల్ ఆఫర్ కూడా!) ప్లాట్‌ఫారమ్‌లో సంవత్సరాలుగా చురుగ్గా లేకుండా, ఎలాంటి ట్వీట్స్ లేకుండా, కనీసం లాగిన్ కూడా కాని 1.5 బిలియన్ ఖాతాల పేర్లను తొలగించనున్నట్టు తేల్చి చెప్పారు. అంతేకాదు యూజర్ అకౌంట్ స్టేటస్‌ను తెలిపే సాఫ్ట్వేర్ అప్డేట్పై తాము పనిచేస్తున్నామన్నారు. దీని ద్వారా తమ ట్వీట్లు "షాడో బ్యానింగ్" ఎందుకు ఎలా అయిందో, ఎలా అప్పీల్ చేయాలో వినియోగదారులకు తెలుస్తుందన్నారు. (భారత్‌పే కో-ఫౌండర్, మాజీ ఎండీకి భారీ షాక్!) Twitter will soon start freeing the name space of 1.5 billion accounts — Elon Musk (@elonmusk) December 9, 2022 "ట్విట్టర్ ఫైల్స్ 2" లో సంచలన విషయాలను వెల్లడించింది. అలాగే ఒక రహస్య టీం ఆధ్వర్యంలో అప్పటి సీఈవో జాక్ డోర్సీ సెలబ్రిటీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే షాడో బ్యానింగ్ లాంటి వివాదాస్పద నిర్ణయాలను తీసుకుందని ఆరోపించింది. ఈ సీక్రెట్ గ్రూప్‌లో లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ హెడ్ (విజయ గద్దే), గ్లోబల్ హెడ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ (యోయెల్ రోత్), మాజీ జాక్ డోర్సే, పరాగ్ అగర్వాల్ ఇతరులు ఉన్నారని ది ఫ్రీ ప్రెస్ ఫౌండర్, ఎడిటర్ బారీ వీస్ చెప్పారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ట్రంప్‌కు మళ్లీ ట్విట్టర్.. ఖాతా పునరుద్ధరించినట్లు మస్క్ ప్రకటన
ట్రంప్‌కు మళ్లీ ట్విట్టర్.. ఖాతా పునరుద్ధరించినట్లు ఎలాన్ మస్క్ ప్రకటన -
ఎలాన్ మస్క్ రూటే సపరేటు.. 22 నెలల తర్వాత ట్రంప్ ఖాతాకు గ్రీన్‌సిగ్నల్
ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్.. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత పలు సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఆసక్తికర పరిణామం జరిగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునురుద్ధరణ విషయంలో ఎలాన్ మస్క్ ఓటింగ్ నిర్వహించారు. ఈ ఓటింగ్ అనంతరం.. ట్రంప్ ట్విట్టర్ ఖాతాపై బ్యాన్‌ను తొలగించినట్టు స్పష్టం చేశారు. వివరాల ప్రకారం.. ట్విట్టర్లోకి డొనాల్డ్ ట్రంప్ రీ ఎంట్రీ ఇచ్చారు. జీవితకాల నిషేధానికి గురైన ట్రంప్ ఖాతాను ఎట్టకేలకు ట్విట్టర్ పునరుద్ధరించింది. అయితే, 2021 జనవరిలో జరిగిన క్యాపిటల్ హిల్ దాడి తర్వాత ట్రంప్ అకౌంట్‌ను మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. దీంతో, ఆయన ఖాతా పునరుద్ధరణపై ఎలాన్ మస్క్ నిర్వహించిన ఓటింగ్‌లో 51.8 శాతం మంది ట్రంప్‌కు అనుకూలంగా ఓటువేశారు. Reinstate former President Trump — Elon Musk (@elonmusk) November 19, 2022 అయితే.. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌పై మస్క్ పోల్ నిర్వహించారు. ట్విట్టర్ వేదికగా ఎలాన్ మస్క్.. ట్రంప్ అకౌంట్‌కు Yes OR No చెప్పాలని సోషల్ మీడియాలో శనివారం పోల్ పెట్టారు. 24 గంటల పాటు పోల్ కొనసాగగా.. పోలింగ్‌లో ట్రంప్‌కు అనుకూలంగా 51.8 శాతం, వ్యతిరేకంగా 48.2 శాతం మంది ఓటింగ్ చేశారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధించాలనే ఎక్కువ మంది కోరుకోవడంతో అకౌంట్‌పై బ్యాన్‌ను ఎత్తివేశారు. The people have spoken. Trump will be reinstated. Vox Populi, Vox Dei. https://t.co/jmkhFuyfkv — Elon Musk (@elonmusk) November 20, 2022 ఈ నేపథ్యంలో ట్రంప్ ట్విట్టర్‌పై బ్యాన్ ఎత్తివేస్తున్నట్టు ఎలాన్ మస్క్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ప్రజల స్వరమే.. దేవుడి స్వరమంటూ మస్క్ కామెంట్స్ చేయడం విశేషం. ఇక, 22 నెలల తర్వాత ట్రంప్ అకౌంట్ ట్విట్టర్లో మళ్లీ ప్రత్యక్షమైంది. దీంతో, ట్రంప్ మద్దతుదారులు ఆనందంలో కామెంట్స్ చేస్తున్నారు. -
కేజీఎఫ్2 ఎఫెక్ట్.. కాంగ్రెస్ ట్విటర్ అకౌంట్ బ్లాక్!
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చింది బెంగళూరు కోర్టు. హస్తం పార్టీ ట్విటర్ ఖాతాను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జోడో యాత్రలో కేజీఎఫ్-2 సాంగ్స్ ప్లే చేశారంటూ మ్యూజిక్ సంస్థ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన క్రమంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ గాంధీ ఇటీవల కర్ణాటకలో భారత్ జోడో యాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో కాపీరైట్ నిబంధనలను ఉల్లంఘించి కన్నడ చిత్రం కేజీఎఫ్-2లోని పాటలను ఉపయోగించారని ఎంఆర్టీ మ్యూజిక్ మేనేజర్ ఎం నవీన్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ సహా ముగ్గురు సీనియర్ నాయకులపై ఆరోపణలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారించిన బెంగళూరు కోర్టు.. కాంగ్రెస్ ట్విటర్ ఖాతాతో పాటు.. భారత్ జోడో యాత్ర ప్రచార ట్విటర్ హ్యాండిల్‌ను సైతం తాత్కాలికంగా బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా దినేష్ అరోరా.. సీబీఐ చేతికి కీలక ఆధారాలు! -
ఎలన్ మస్క్‌కు ఘోర అవమానం?!
ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్‌కు ఘోర అవమానం జరిగిందా?.. అవుననే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. అందుకు కారణం.. మాజీ ప్రేయసి అంబర్ హర్డ్. ఎలన్ మస్క్.. ఎట్టకేలకు ట్విట్టర్(ట్విటర్) డీల్‌ను ముగించిన సంగతి తెలిసిందే. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించిన మస్క్.. తొలుత యూజర్ల అభిమానాన్ని చురగొన్నాడు కూడా. అయితే.. ట్విట్టర్ ఆఫీస్‌లో అడుగుపెట్టాక తనదైన నిర్ణయాలతో ట్విట్టర్‌ను ఆగం పట్టిస్తున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మార్పుల పేరిట బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ నుంచి.. కీలక పదవుల్లో ఉన్న వాళ్లను సాగనంపగా.. ఆపై టెస్లా ఉద్యోగులను ట్విటర్‌లోకి తెచ్చుకున్నాడు. మరోవైపు వెరిఫికేషన్ ప్రాసెస్‌కు, బ్లూటిక్ కోసం 8 డాలర్లు చెల్లించాలని ప్రకటించి.. పక్కా కమర్షియల్ ఆలోచనను అమలు చేస్తున్నాడు. ఈ క్రమంలో నిరసన వ్యక్తం చేస్తూ కొందరు సెలబ్రిటీలు ట్విటర్‌ను వీడుతున్నారు. ట్విటర్‌ను ఇప్పటికే చాలామంది ప్రముఖులు వీడారు. టోనీ బ్రాక్స్టన్, షోండా రిమ్స్‌తో పాటు ప్రొఫెషనల్ రెజ్లర్(రిటైర్డ్)..డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ మిక్ ఫోలీ ట్విటర్ అకౌంట్లను డిలీట్ చేశారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్‌లోకి నటి అంబర్ హర్డ్ కూడా చేరింది. ఆమె ఎందుకు వీడిందో అనే దానిపై స్పష్టత లేకున్నా.. సెలబ్రిటీల గుడ్‌బై మూమెంట్లో ఆమె కూడా చేరడం పట్ల మస్క్‌పై సెటైర్లు పడుతున్నాయి. మాజీ ప్రేయసి మస్క్ పరువు తీసేసిందనే అభిప్రాయమే ఎక్కువగా వినిపిస్తోంది కూడా. మరోవైపు ఆమె మాజీ భర్త జానీ డెప్ అభిమానుల కారణంగానే ఆమె ట్విటర్‌కు గుడ్‌బై చెప్పి ఉంటుందనే వాదన సైతం చక్కర్లు కొడుతోంది కూడా. అంబర్ హర్డ్.. 2016 నుంచి 2018 మధ్య ఎలన్ మస్క్‌తో డేటింగ్ చేసింది. అయితే అప్పటికే నటుడు జానీ డెప్తో ఆమె విడాకులకు సిద్ధమైంది. అయితే మస్క్ వల్లే తన కాపురంలో చిచ్చు రగిలిందని, హర్డ్ సైకోతనం భరించలేక తాను విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు జానీ డెప్. ఈ క్రమంలో జానీ డెప్ వేసిన పరువు నష్టం దావా కేసు.. విచారణ సందర్భంగా మస్క్ కూడా హాజరవుతాడని అంతా భావించారు. కానీ, అది జరగలేదు. ఇక ఈ కేసులో ఈ ఏడాది మొదట్లో జానీ డెప్‌కు అనుకూలంగా తీర్పు వెలువడడం గమనార్హం. అయితే ఆ సమయంలోనూ ఆమెకు సంబంధించిన కోర్టు ఫీజులను ఎలన్ మస్క్ చెల్లించాడనే వాదన వినిపించింది. -
మేము ట్విటర్‌లా ఫీజుల వసూలు చేయం.. ఇటు వచ్చేయండి!
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏం చేసినా అది వైరల్‌గా మారుతుంది. ఆయన చేసే ప్రతీ పనిలో తన ట్రేడ్‌మార్క్‌ని ప్రదర్శిస్తుంటారు. అయితే ఒక్కోసారి అవి విమర్శలకు కూడా దారి తీస్తుంటాయి. తాజాగా ట్విటర్ టేకోవర్ తర్వాత ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు మస్క్. ట్విటర్లోని బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పెంచుకోవాలని భావిస్తున్నారు. దీంతో అది నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది. తాజాగా దీనిపై కూ(koo) సీఈవో, సహవ్యవస్థాపకుడు అప్రమేయ రాధాకృష్ణ స్పందించారు. ఇటు వచ్చేయండి! ట్విట్టర్‌కు పోటీగా ఉన్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ (Koo) యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెట్టింట బ్లూ టిక్ వివాదం నడుస్తున్న నేపథ్యంలో కూ సంస్థ సీఈఓ రాధాకృష్ణ దీనిపై ట్వీట్ చేశారు. అందులో తాము ట్విటర్‌లా కాదని తెలుపుతూ.. ‘వెరిఫికేషన్ బ్యాడ్జ్ కోసం ‘కూ’ నెలకు రూ. 1,600 వసూలు చేయదని #switchtokoo" అని ట్వీట్ చేశారు. మరి ఈ ట్విట్ యూజర్లను ఆకర్షిస్తుందా లేదా వేచి చూడాల్సిందే. ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు టేకోవర్ చేసిన ఎలాన్ మస్క్ అనూహ్య మార్పులతో దూసుకుపోతున్నారు. ట్విటర్ తన సొంతమైన వెంటనే సీఈవో పరాగ్ అగర్వాల్, సీఎఫ్‌వో నెద్ సెగాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె లాంటి కీలక ఎగ్జిక్యూటివ్‌లను తొలగించిన సంగతి తెలిసిందే. ఇక భవిష్యత్తులో మరెన్ని మార్పులు వస్తాయో చూడాలి. చదవండి: ట్విటర్ యూజర్లకు షాక్: భారీ వడ్డన దిశగా మస్క్ ప్లాన్లు -
ట్విటర్ బ్లూటిక్ వివాదం: మండిపడుతున్న నెటిజన్లు
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అతిపెద్ద మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజుపై నెటిజన్లు మండిపడుతున్నారు. పలు మీమ్స్, సెటైర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన బిలియనీర్ ఎలాన్ మస్క్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. నెలకు 20 డాలర్లు (రూ.1600కుపై మాటే) చెల్లించడం అవసరమా? అని విమర్శిస్తున్నారు. దీని బదులు నెలకు 1600 సిప్ (సిస్టంఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడి పెట్టుకోవచ్చు అని ఒకరు మండిపడ్డారు. బ్లూటిక్కా? అసవసరమే లేదు. అదేమీ సర్టిఫికేట్ కాదుగా..అసలు నేను ఎపుడూ అడగలేదు అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. (ట్విటర్ యూజర్లకు షాక్: భారీ వడ్డన దిశగా మస్క్ ప్లాన్లు) Blue Tick folks now be like “I will give it up, I never asked for it, yeh koi certificate nahi hai.” 😂 — Shiv Aroor (@ShivAroor) October 31, 2022 Now opening a SIP of Rs 1600 pm which I saved by not having a blue tick. — Gabbbar (@GabbbarSingh) October 31, 2022 I’ve got your Blue Tick right here pic.twitter.com/hlCOzOumwe — cosmic jester (@cosmicjester) October 31, 2022 కాగా బిలియనీర్ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు తరువాత సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ట్విటర్ చేతికి రాగానే సీఈవో పరాగ్ అగర్వాల్ సహా కీలక ఎగ్జిక్యూటివ్‌లపై వేటు వేసిన మస్క్ సంస్థలో ఉద్యోగులను తొలగించే ప్రణాళిల్లోఉన్నట్టు పలు నివేదికలుకోడై కూస్తున్నాయి. అయితే ఈ వార్తలను మస్క్ తిరస్కరించినప్పటికీ ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. సరికొత్తగా బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు అంతర్గత పత్రాలను ఉటంకిస్తూ వెర్జ్ రిపోర్ట్ చేసింది. నవంబర్ 7లోగా ఈ కొత్త వెరిఫికేషన్ రీవాంప్ను రూపొందించాలని, లేదంటే వేటు తప్పదని మస్క్ తన ఉద్యోగులను కోరినట్లు సమాచారం. -
ట్విటర్ యూజర్లకు షాక్: భారీ వడ్డన దిశగా మస్క్ ప్లాన్లు
న్యూఢిల్లీ: టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ కొనుగోలు చేసినప్పటినుంచి ప్రతీ రోజు ఏదో ఒక సెన్సేషన్తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మస్క్ సరికొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు తాజాగా తెలుస్తోంది. బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ల ద్వారా ఆదాయం పెంచుకోవాలని యోచిస్తున్నన్నారన్న వార్త ట్రెండ్ అవుతోంది. ఇప్పటిదాకా బ్లూటిక్ అంటే గౌరవంగా, అఫీషియల్ ఖాతాగా భావించేవారు. ఇపుడిక వారికి నెలకు సుమారు రూ. 1640 భారంగా మారనుంది. ఈ వార్తలతో ‘ట్విటర్ బ్లూ’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. (Bluetick ట్విటర్ బ్లూటిక్ వివాదం: మండిపడుతున్న నెటిజన్లు) SOURCES: The new twitter blue verification feature will have 69 tiers, with the top tier giving you a crown icon and the power to ban any user. It will cost $420,000,000. Elon Musk told Twitter employees if they don’t finish it by Monday, he will blast Nickelback in the office. — Shibetoshi Nakamoto (@BillyM2k) October 31, 2022 44 బిలియన్ డాలర్లు వెచ్చించి ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్ ట్విటర్ యూజర్లకు గట్టి షాక్ ఇవ్వనున్నారట. ముఖ్యంగా ట్విటర్‌కు బాగా ఎడిక్ట్ అయిన బ్లూ టిక్ వెరిఫైడ్ అకౌంట్ యూజర్ల నుంచి సబ్స్క్రిప్షన్ ఛార్జీలను వసూలు చేయాలని ఎలన్ మస్క్ భావిస్తున్నారట. ది వెర్జ్ నివేదిక ప్రకారం బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ కోసం వినియోగ దారుల నుంచి నెలకు 20 డాలర్లు (19.99) వసూలు చేయనున్నారట. దీనిపై అధికారిక ధృవీకరణ లేనప్పటికీ, బ్లూటిక్ ఉన్న యూజర్లు ఈ కొత్త నిబంధన ప్రకారం చెల్లింపు చేయాల్సిందే. ఇందుకుగాను యూజర్లకు 90 రోజులు గడువు ఇస్తారు. గడుపులోపు చెల్లించకపోతే సదరు యూజర్లు ట్విటర్ వెరిఫికేషన్ బ్యాడ్జ్‌ను కోల్పోతారు. అంతేకాదు ఈ ఫీచర్‌ను ప్రారంభించడానికి ఉద్యోగులకు నవంబర్ 7 వరకు గడువిచ్చారు. లేదంటే వారికి ఉద్వాసన తప్పదని కూడా హెచ్చరించినట్టు సమాచారం. Oh no, all our diabolical plans have been revealed!! — Elon Musk (@elonmusk) October 31, 2022 అయితే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో సబ్స్క్రిప్షన్ పద్దతి అమల్లో ఉంది. ప్రస్తుతం అమెరికాలో నెలకు 5 డాలర్లు వసూలు చేస్తోంది. మరోవైపు ఇప్పటికే ప్రీమియం, హెవ్వీ ట్వీటర్లను కోల్పోతోందన్న నివేదికల మధ్య ఈ సర్వీస్‌ను ప్రపంచవ్యాప్తంగా ఎలా అందుబాటులోకి తెచ్చేలా మొత్తం పేమెంట్ స్ట్రక్చర్ప్లాన్ను ఎలా మారుస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. -
ప్లీజ్.. వాటిని స్క్రీన్షాట్లు తీయకండి.. యూజర్లను కోరిన ట్విటర్!
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్.. ట్వీట్లను స్క్రీన్ షాట్లు తీయకండని యూజర్లను కోరుతోంది. స్క్రీన్ షాట్ తీసే బదులుగా ఆ ట్వీట్ షేర్చేయడం లేదా ఆ లింక్‌ని కాపీ చేసుకోమని పలువురు యూజర్లకు సూచిస్తోంది. దీని ద్వారా ట్విటర్‌ని మరింత మంది యూజర్లకు చేరువయ్యేలా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని భావిస్తోంది. దీనికి సంబంధించిన ట్వీట్‌ను సెక్యూరిటీ రిసెర్చర్, రివర్స్ ఇంజినీరింగ్ నిపుణులు జేన్ మంచున్ వాంగ్ మొదట షేర్ చేశారు. ప్రస్తుతం బీటా యూజర్లు ద్వారా షేర్ ట్వీట్, కాపీ లింక్ అనే రెండు కొత్త ఫీచర్లను ట్వీటర్ పరీక్షిస్తోంది. త్వరలో మిగతా యూజర్లకు కూడా ఈ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఆగస్టులో, మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ఓ కొత్త ఫీచర్‌ని పరీక్షిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్ష ద్వారా యూజర్లు ఇతరులకు ట్విట్టర్ అకౌంట్ లేకపోయినా, వారితో కూటా ట్వీట్లను పంచుకునేందుకు వీలు కల్పిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ యూజర్లను ఆకట్టుకునేందుకు ముందు వరుసలో ట్వీటర్ ఉంటుంది. ఇటీవల తన వినియోగదారులకు ఎడిట్ ట్వీట్ బటన్‌ను వాడుకలోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉంది. ట్విట్టర్ ప్రకటించిన మేరకు ఈ ఎడిట్ ఫీచర్ కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోని ట్విట్టర్ బ్లూ వినియోగదారులు మాత్రం ఉపయోగించగలరు. ఈ ఫీచర్ త్వరలో యుఎస్‌కి వస్తుందని కంపెనీ తెలిపింది. చదవండి: టాటా టియాగో ఈవీకి రెస్పాన్స్ అదిరింది.. రికార్డ్ బుకింగ్స్‌తో షాకైన కంపెనీ! -
భారత్‌లో పాక్ ప్రభుత్వ ట్విటర్ ఖాతా నిలిపివేత
పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ట్విటర్ ఖాతాను భారత్‌లో నిలిపివేశారు. లీగల్ డిమాండ్ నేపథ్యంలోనే శనివారం నుంచి ఆ ఖాతాను భారత్‌లో ట్విటర్ బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా కోర్టు ఆదేశాల తరహా డిమాండ్‌కు ప్రతిస్పందనగా ట్విటర్ ఇలాంటి చర్యలు తీసుకోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఇప్పుడు పాక్ గవర్నమెంట్ ట్విటర్ అకౌంట్‌ను ఉన్నపళంగా ఎందుకు బ్లాక్ చేశారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(PFI)పై భారత్‌లో నిషేధం నేపథ్యంలో ఆ సంస్థ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేసింది. తర్వాత ఇప్పుడు పాక్ ప్రభుత్వ ట్విటర్ అకౌంట్‌ను బ్లాక్ చేయడం గమనార్హం. పీఎఫ్ఐపై భారత ప్రభుత్వ నిషేధాన్ని పాక్ అధికారులు ఖండిస్తూ.. బహిరంగంగా ప్రకటనలు సైతం విడుదల చేశారు. అయితే.. ఇలా పాక్‌కు చెందిన అకౌంట్లను బ్లాక్ చేయడం, తిరిగి పునరుద్ధించడం కొత్తేం కాదు. గతంలోనూ ఇలా చాలాసార్లే జరిగింది కూడా. జూన్ నెలలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 కింద న్యూఢిల్లీ వర్గాలు చాలావరకు రాయబార కార్యాలయాలు, జర్నలిస్టులు, కొందరు ప్రముఖుల అకౌంట్లను నిషేధించిందని పాక్ మీడియా కథనాలు ప్రచురించింది. ఐరాసలో పాక్ రాయబార కార్యాలయం, టర్కీ, ఇరాన్, ఈజిప్ట్లలోనూ పాక్ రాయబార కార్యాలయ ట్విటర్ అకౌంట్లను భారత్ బ్లాక్ నిషేధించింది. అంతేకాదు.. 8 యూట్యూబ్ ఆధారిత న్యూస్ ఛానెల్స్(అందులో ఒకటి పాక్‌కు చెందింది కూడా), ఒక ఫేస్బుక్ అకౌంట్‌ను ‘భారత్ వ్యతిరేక, ఫేక్ కంటెంట్’ను పోస్ట్ చేసిందనే నెపంతో బ్లాక్ చేసింది భారత్. భారత్ వ్యతిరేక కంటెంట్ పోస్ట్ చేసినందుకుగానూ మొత్తం 100 యూట్యూబ్ ఛానెల్స్, నాలుగు ఫేజ్‌బుక్ పేజీలు, ఐదు ట్విటర్ అకౌంట్లు, మూడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లను బ్లాక్ చేసింది. ఇదీ చదవండి: అన్నీ బీజేపీ గుప్పిట్లోనే ఉన్నాయ్ కదా! -
Gurpreet kaur: పెళ్లైన మరుసటి రోజే అకౌంట్ బ్లాక్ చేసిన సీఎం భార్య
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య.. డాక్టర్ గురుప్రీత్ కౌర్(32) మరోసారి వార్తల్లో నిలిచారు. వివాహం జరిగిన మరుసటి రోజే ఆమె తన ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారు. దీంతో, ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కాగా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. గురువారం రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో, డాక్టర్ గురుప్రీత్ కౌర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. నెటిజన్లు ఆమె గురించి వివరాల కోసం తెగ వెతికేశారు. ఇదిలా ఉండగా.. వివాహం సందర్బంగా గురుప్రీత్ కౌర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో మెహందీ, పెళ్లికి సంబంధించిన ఫొటోలను పోస్టు చేశారు. అంతేకాకుండా పెళ్లికి ముందు సీఎం మాన్, ఆయన తల్లి హర్పాల్ కౌర్‌తో దిగిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు. అయితే, సీఎం మాన్ భార్య కావడం, ఎంతో ఫేమస్ అవడంతో ఆమె ట్విట్టర్ ఖాతాను ఫాలో చేసే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఒక్కసారిగా ఆమె ట్విట్టర్ అకౌంట్ కనిపించకుండా పోయింది. దీంతో, సోషల్ మీడియాలో నెటిజన్లు ఖంగుతిన్నారు. ఆమె ఎందుకు ఇలా చేశారని ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఫాలోవర్ల సంఖ్య పెరగడం కారణంగానే ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అయినట్టు సమాచారం. Dr. Gurpreet Kaur TDr. Gurpreet Kaur Twitter Account : ਭਗਵੰਤ ਮਾਨ ਦੀ ਪਤਨੀ ਡਾ. ਗੁਰਪ੍ਰੀਤ ਕੌਰ ਦੇ ਨਾਂ ‘ਤੇ ਬਣਿਆ ਟਵਿੱਟਰ ਅਕਾਊਂਟ ਸਸਪੈਂਡwitter Account : ਭਗਵੰਤ ਮਾਨ ਦੀ ਪਤਨੀ ਡਾ. ਗੁਰਪ੍ਰੀਤ ਕੌਰ ਦੇ ਨਾਂ ‘ਤੇ ਬਣਿਆ ਟਵਿੱਟਰ ਅਕਾਊਂਟ ਸਸਪੈਂਡ https://t.co/eJxCVX3wgK — PREETNAMA (@preetchouhan346) July 8, 2022 ఇక, ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ అవడంపై సీఎం మాన్ కానీ, ఆయన భార్య కానీ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. ఇక, డాక్టర్ గురుప్రీత్ కౌర్ 2018 నుంచి ట్విట్టర్లో యూజర్‌గా అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. కానీ, రెండేళ్లలో ఆమె ప్రత్యేకంగా ట్వీట్ ఏమీ చేయలేదు, పోస్ట్‌లను మాత్రం రీట్వీట్ చేసింది. అదే సమయంలో, ఆమె తనను తాను రైతు కుమార్తెగా అభివర్ణించింది. -
సార్ మీరు ‘ఎన్నారై’యేనా!.. ఆనంద్ మహీంద్రా రిప్లై అదిరింది!
దేశీయ వ్యాపార దిగ్గజం ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటారు. సమకాలిన అంశాలతో స్పందిస్తూ రకరకాల పోస్ట్‌లను షేర్ చేయడమే కాదు. నెటిజన్లకు అడిగిన ప్రశ్నలకు రిప్లయి ఇస్తారు. కొన్నిసార్లు ట్విట్టర్ యూజర్ల విచిత్రమైన ప్రశ్నలకు ఆనంద్ మహీంద్రా చమత్కారంగా జవాబు ఇస్తుంటారు. కొన్నిసార్లు ఆయన స్పందనలు నెటిజన్లను నవ్వులు పూయిస్తాయి. అలాంటి మహీంద్రాను ఓ నెటిజన్ మీరు ఎన్నారైనా? అని అడిగినందుకు ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఆ రిప్లై సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Manhattan. 4th of July. 2022. It’s hard for man-made light to compete with the moon! (3/3) pic.twitter.com/388sXbFg5Q — anand mahindra (@anandmahindra) July 5, 2022 దేశీయ బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా అమెరికా న్యూయార్క్ సిటీ మాన్హాటన్లో ఉన్నారు. మాన్హాటన్లో ఉన్న ఆయన నగర అందాల్ని వర్ణిస్తూ ఫోటోల్ని, వీడియోల్ని ట్వీట్ చేశారు. వాటికి సంబంధించిన ట్వీట్లకు రిప్లయ్ ఇస్తుండగా..ఓ నెటిజన్ ఆనంద్ మహీంద్రాను “మీరు ఎన్నారైనా?” అని అడగ్గా..అందుకు మహీంద్రా చమత్కారంగా నేను 'హెచ్ఆర్ఐ'(మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా) అని బదులిచ్చారు. Just visiting family in New York. So am an HRI. Heart (always) resident in India….😊 https://t.co/ydzwTux9vr — anand mahindra (@anandmahindra) July 5, 2022 దీంతో నెటిజన్లు తమదైన శైలిలో ఆనంద్ మహీంద్రాను ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “హా హా బాగుంది! మీ దిల్ హై హిందుస్తానీ! అని మాకు బాగా తెలుసు అని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..“సర్. మీరు ఎంఆర్ఐ (మహీంద్రా రెసిడెంట్ ఆఫ్ ఇండియా)” అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. -
'ఎలన్ మస్క్.. మొత్తానికి అనుకున్నది సాధించాడు'
బిజినెస్ టైకూన్ ఎలన్ మస్క్ మొత్తానికి అనుకున్నది సాధించాడు. ఎంపిక యూజర్లకు ట్విటర్ ఎడిట్ బటన్ అందుబాటులోకి తెచ్చేలా చేశారు. ప్రస్తుతం ఎలన్ మస్క్ ట్విటర్ కొనుగోలు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ.. మస్క్ కోరుకున్నట్లు ట్విటర్ ఎడిట్ బటన్ అందుబాటులోకి రావడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. యూజర్లందరికి ఎడిటన్ బటన్ అందుబాటులోకి తెచ్చేందుకు ట్విటర్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. అయితే ఈ తరుణంలో ట్విటర్ సెలెక్టెడ్ యూజర్లకు ఎడిట్ బటన్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఫిల్టర్ ఫీచర్ సాయంతో అసభ్య పదజాలంతో చేసిన ట్విట్లను డిలీట్ చేస్తుందని, ఎడిట్ బటన్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చిందని ముకుల్ శర్మ అనే టెక్నాలజీ క్రియేటర్ ట్వీట్ చేశాడు. Twitter Edit button is here, but only for potentially abusive/harmful/offensive tweets for now. Plus, Twitter is testing a like/dislike feature, which lets you view the stats (likes, comments, RTs) in the notifications section itself and lets you engage with the tweet right there pic.twitter.com/UovNjhdFek — Mukul Sharma (@stufflistings) June 20, 2022 ఎడిటన్ బటన్ ఆప్షన్‌తో గతంలో అభ్యంతరకరమైన ట్వీట్లు చేస్తే డిలీట్ చేయడం తప్పా వేరే దారి లేదు. కానీ ఎడిట్ బటన్ ఆప్షన్ సాయంతో యూజర్లు అభ్యంతరకరమైన ట్వీట్ చేస్తే.. వాటిని ఎడిట్ చేయోచ్చు, లేదంటే డిలీట్ చేయోచ్చు. ఇక ఈ ఆప్షన్ కోసం మస్క్ కొంత కాలం ట్విటర్‌తో ఫైట్ చేసి.. చివరికి ఆ సంస్థను కొనుగోలు చేశారు. Do you want an edit button? — Elon Musk (@elonmusk) April 5, 2022 విమర్శల వెల్లువ ట్విటర్ వాక్ స్వాతంత్రపు విధానాలకు కట్టుబడి లేదంటే గతంలో మస్క్ ఆ సంస్థపై తీవ్ర విమర్శలు చేశారు. ఆ విమర్శల పరంపరను కొనసాగిస్తూ ఏప్రిల్ 5న ట్విటర్లో మీకు ఎడిట్ బటన్ కావాలా అంటూ పోల్ పెట్టాడు. ఆ పోల్ దెబ్బకు ఆ సంస్థ పునాదుల్ని కదిలేలా చేశాయి. ట్విటర్‌ను తానే 44 బిలియన్లకు కొనుగోలు చేస్తున్నట్టు మస్క్ ప్రకటించాడు. కానీ అంతలోనే ట్విటర్లో ఫేక్ అకౌంట్లపై సంస్థ క్లారిటీ ఇవ్వాల్సిందేనని ట్విస్ట్ ఇచ్చాడు. ఎంతో దూరం లేదు ఎలన్ మస్క్ ప్రకటనతో ఆయన ట్విటర్ కొనుగోలు అంశం ఆగినట్లే ఆగి..మళ్లీ మొదలైంది. ఇటీవల మస్క్ ట్విటర్ ఉద్యోగులతో సంభాషించాడు. సంస్థలో ఉద్యోగులకు స్వేచ్ఛ ఉంటుందని హామీ ఇచ్చాడు. ఆర్ధికంగా ఎదిగేందుకు ఖర్చుల్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఇక టెస్లా మాదిరిగా ట్విటర్ ఉద్యోగుల తొలగింపు ఉంటుందా అనే అంశంపై దాటవేశాడు. ఈ తాజా పరిణామాల నేపథ్యంలో ట్విటర్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తేవడం.. మస్క్ ట్విటర్‌ను పూర్తి స్థాయిలో దక్కించుకోవడం ఎంతో దూరంలో లేదని మస్క్ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి👉మాయదారి ట్విటర్..కరిగిపోతున్న మస్క్ సంపద! -
ఈలాన్‌మస్క్‌కి మద్దతు పలికి కేంద్ర మంత్రి!
ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఈలాన్మస్క్తో అంటీముట్టనట్టుగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఓ కేంద్ర మంత్రి నుంచి ఈలాన్ మస్క్‌కి పరోక్ష మద్దతు లభించింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ట్విటర్ విషయంలో ఈలాన్ మస్క్ తెలిపిన అభిప్రాయాలను కేంద్ర ఐటీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమర్థించారు. ట్విటర్లో విద్వేషపూరిత ట్వీట్లు చేస్తున్నారని, అనవసర గొడవలకు కారణం అవుతున్నాడంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ని తమ ప్లాట్‌ఫారమ్ నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నట్టు గతంలో ట్విటర్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని అప్పుడే వ్యతిరేకించాడు ప్రపంచ కుబేరుడు ఈలాన్ మస్క్. ఫ్రీ స్పీచ్‌కి అవకాశం ఉండాలనే నినాదంతో ట్విటర్లోనూ పోల్స్ పెడుతూ చివరకు ఆ సంస్థను టేకోవర్ చేశారు. కాగా ట్రంప్‌పై శాశ్వత నిషేధం అనైతికంగా సరికాదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా చేయడం తమ వైఫలమ్యంటూ ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే తనతో చెప్పినట్టు కూడా మస్క్ తెలిపాడు. కాగా ట్రంప్‌ను ట్విటర్ నుంచి శాశ్వతంగా నిషేధించడం తమ వైఫల్యమంటూ జాక్ డోర్సే తెలిపినట్టుగా వచ్చిన వార్తా కథనాన్ని రీట్వీట్ చేస్తూ కేంద్ర మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏదైనా ఒక ప్లాట్‌ఫామ్ నుంచి ఒక వ్యక్తిని శాశ్వతంగా నిషేధించడం అంటే యూజర్ల ప్రాథమిక హక్కులను హరించినట్టే. ఇటువంటి ఏకపక్ష నిర్ణయాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే బలమైన చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. Deplatforming is a big deal - Its a violation of fundamental rights of users n must hv force of law behind it for any platform to exercise n must never ever be be done arbitrarily. @elonmusk @jack https://t.co/gkYLTbTiGB — Rajeev Chandrasekhar 🇮🇳 (@Rajeev_GoI) May 11, 2022 ఫ్రీ స్పీచ్, శాశ్వత నిషేధం వంటి అంశాలపై ఇప్పటికే ఈలాన్ మస్క్‌కి రోజురోజుకి ఆదరణ పెరుగుతుండగా తాజాగా భారత మంత్రి కూడా ఇందులో జతయ్యారు. పైగా మంత్రి ట్వీట్‌కు స్పందిస్తున్నవారు సైతం శాశ్వత నిషేధం అనే నిర్ణయం సరికాదంటున్నారు. చదవండి: Donald Trump: ట్విటర్ అలా చేయకుండా ఉండాల్సింది - ఈలాన్ మస్క్ -
బాంబు పేల్చిన ఎలన్ మస్క్!
ఎలన్ మస్క్ కాదు కాదు.. సైక్లోన్ మస్క్(ట్విటర్ యూజర్లు ముద్దుగా పెట్టిన పేరు) ట్విట్టర్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఎలన్ మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తన వద్ద ప్లాన్ బి ఉందంటూ బాంబు పేల్చారు. ప్రస్తుతం ఈ బిజినెస్ టైకూన్ ట్విటర్ కొనుగోలు అంశం హాట్ టాపిగ్గా మారింది. ఈ నేపథ్యంలో ట్విటర్ యూజర్లు శ్రీలంకను అప్పుల్లో నుంచి గట్టెక్కించాలని సైక్లోన్ మస్క్‌ను విజ్ఞప్తి చేస్తున్నారు. ట్విటర్లో ఎలన్ మస్క్ అతిపెద్ద వాటాదారుడు. లాభపేక్షతో సంబంధం లేకుండా ట్విటర్‌కు చెందిన ఒక్కో షేర్‌ను 54.20 డాలర్లకు కొనుగోలు చేస్తానని బంపరాఫర్ ప్రకటించారు. తద్వారా 43 బిలియన్ డాలర్లు (రూ.3.22లక్షల కోట్లు) చెల్లిస్తామని ఆఫర్ చేశారు. కానీ మస్క్ ఆఫర్‌ను ట్వీటర్ యాజమాన్యం తిరస్కరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఎలాగైనా ట్వీటర్‌ను దక్కించుకునేందుకు 'ప్లాన్-బి'ని అమలు చేస్తానని కెనడాలోని వాంకోవా నగరంలో జరిగిన టెడ్-2020 సమావేశంలో ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'హోస్టైల్ టేకోవర్'తో ట్వీటర్‌ను సొంతం చేసుకోవచ్చు. అంటే ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరక్టెర్తో సంబంధం లేకుండా షేర్ హోల్డర్స్‌ను ఒప్పించి ట్వీటర్‌ను చేజిక్కించుకోవచ్చు. ఇదే ఎలన్ ప్లాన్-బి' అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఎలన్ మస్క్ ట్విటర్‌కు ఇచ్చిన ఆఫర్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. కానీ ఓ వర్గానికి చెందిన యూజర్లు మాత్రం పీకల్లోతు అప్పుల్లో (53 బిలియన్ డాలర్లు) ఉన్న శ్రీలంకను గట్టెక్కించాలని కోరుతున్నారు. Elon Musk's Twitter bid - $43 billion Sri Lanka's debt - $45 billion He can buy it and call himself Ceylon Musk 😀 H/t Whatsapp — Kunal Bahl (@1kunalbahl) April 14, 2022 స్నాప్ డీల్ సీఈఓ కునాల్ బాల్..ఎలన్ మస్క్ ట్వీటర్కు 43 బిలియన్ డాలర్లను ఆఫర్ చేశారు. అదేదో 45 బిలయన్ డాలర్లతో శ్రీలంకను కొనుగోలు చేసి తనని తాను సైక్లోన్ మస్క్‌గా పిలిపించుకోవచ్చు కదా అంటూ ఓ స్మైల్ మీమ్‌ను యాడ్ చేశారు. Elon Musk has launched a $43 bln hostile takeover for Twitter. If he adds another $8 bln he could discharge the national debt of Sri Lanka and rename it Ceylon Musk 🤣 From WA.. — Shreyasi Goenka (@anvivud) April 15, 2022 మరో ట్వీటర్ యూజర్ శ్రేయాసీ గోయెంకా..43 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. మరో 8 బిలియన్ యాడ్ చేసి శ్రీలంకను అప్పుల్లో నుంచి బయపడేసి సైక్లోన్ మస్క్‌గా పేరు మార్చుకోవచ్చు కదా అని ట్వీట్లో పేర్కొంది. ప్రస్తుతం ఆ ట్వీట్లో వైరల్ అవుతున్నాయి. మీకోసం ఆ ట్వీట్లు. చదవండి: ట్విటర్‌పై ఎలన్‌మస్క్ దండయాత్ర.. ఈసారి ఆ రూట్లో.. -
ట్విటర్ దీపం
సమస్యలను పరిష్కరించడం, తోటివారికి సాయం చేసే గుణం ఉంటే అధికారం, పదవులు, డబ్బులు లేకపోయినప్పటికీ ట్వీట్స్‌తో సామాజిక సేవ చేయవచ్చని నిరూపించి చూపిస్తోంది ఒడిషా ట్విటర్ క్వీన్ దీపా బారీక్. ఒడిషాలోని బర్గఢ్ జిల్లా టెమ్రీ గ్రామానికి చెందిన దీపా బారీక్ తండ్రి వ్యవసాయదారు. తల్లి అంగన్వాడి వర్కర్. మూడేళ్ల క్రితం దీపకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. దీంతో ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా వాడాలో తెలుసుకునేందుకు పక్కింట్లో ఉంటోన్న సామాజిక కార్యకర్త దిబాస్ కుమార్ సాహుని కలిసింది. అతను స్మార్ట్ ఫోన్ వాడకం గురించి వివరిస్తూ వివిధ రకాల సోషల్ మీడియా యాప్‌లు దీప ఫోన్లో వేశాడు. వీటితోపాటు ట్విటర్ యాప్ వేస్తూ ‘‘నువ్వు చేసే ట్వీట్‌ను తప్పనిసరిగా ఫలానా వ్యక్తులు చూడాలనుకుంటే వారి అకౌంట్‌ను ట్యాగ్ చేసి పోస్టుచేస్తే వారికి నేరుగా చేరుతుంది’’ అని చెప్పాడు. దిబాస్ చెప్పిన ఈ విషయమే దీపను ఒడిషా ట్విటర్ క్వీన్‌గా మార్చింది. సౌకీలాల్‌తో తొలిసారి.. అది 2019 ఒడిషాలో తీవ్ర అల్పపీడనం ఏర్పడి గ్రామాల్లో ఇళ్లు కొట్టుకు పోవడంతో చాలామంది నిరాశ్రయులయ్యారు. టెమ్రీ గ్రామానికి పక్కనే ఉన్న మరో గ్రామంలో ఇల్లు కొట్టుకుపోవడంతో పేద దంపతులు ఉండడానికి వసతి లేక ఇబ్బందులు పడుతుండడం కనిపించింది దీపకు. అది చూసి చలించిపోయి సౌకీలాల్ దంపతుల సమస్యను వివరిస్తూ.. ఒడిషా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఐదుగురు ఉన్నత స్థాయి అధికారులతోపాటు సోషల్ మీడియా గ్రీవెన్స్ సెల్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసింది. ట్వీట్ చేసిన 48 గంటల్లోనే గ్రామాభివృద్ధి అధికారి గ్రామాన్ని సందర్శించి, సౌకీలాల్ ఇల్లు కట్టుకునేందుకు రూ.98 వేల రూపాయలను ఇచ్చారు. ఈ సంఘటన దీపకు ముందుకు సాగడానికి ఉత్సాహాన్ని ఇవ్వడంతో..తరువాత మగదిక్కులేని వితంతువులకు పెన్షన్ కష్టాలు, ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న వారి సమస్యలను రాష్ట్ర ఆశీర్వాద్ యోజన అధికారులకు చేర్చి వితంతువుల సమస్యను పరిష్కరించింది. వికలాంగులకు ప్రభుత్వం అందించే సదుపాయాలన్నింటిని వారి చెంతకు చేర్చడం, బిలాస్పూర్ గ్రామంలో డ్యామ్ మరమ్మతుల కారణంగా పంటపొలాలకు నీళ్లు అందకపోవడంతో.. ఆ సమస్యను నీటిపారుదల అధికారులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడంతో రైతులు పంటలు పండించేందుకు నీరు అందింది. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా దీప ఐదు వేలమందికి పైగా సాయం చేయడం విశేషం. దేశంలో ఎక్కడున్నా... నేనున్నానంటూ... వివిధ సమస్యల పరిష్కారానికి దీప ట్వీటర్ సాయంతో చేస్తున్న కృషి స్థానికంగా చాలా పాపులర్ అయ్యింది. దీంతో ఎవరికి ఏ సమస్య ఉన్నా దీపను కలిసి వివరించడం, ట్విటర్ వేదికగా దీప ఆ సమస్యను సంబంధిత అధికారుల ముందు ఉంచడం, వారు దానిని పరిష్కరించడం చకచక జరిగిపోతున్నాయి. సొంతరాష్ట్రంలో ఇబ్బంది పడుతోన్న వారికేగాక, బతుకుదెరువుకోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన వారికి సైతం దీప సాయం చేస్తోంది. గతేడాది అక్టోబర్‌లో ఒడిషాకు చెందిన 23 మంది తెలంగాణలోని పెద్దపల్లిలో ఓ ఇటుకల తయారీ బట్టీలో పనిచేయడానికి చేరారు. బట్టీ యజమాని ఆహారం, నీరు ఇవ్వకుండా, ఎక్కువ గంటలు పనిచేయమంటూ హింసించేవాడు. రోజులు గడిచేకొద్ది వాళ్ల పరిస్థితి మరింత దారుణంగా మారింది. అది తట్టుకోలేక అక్కడినుంచి ఎలా బయటపడాలా? అనుకుంటోన్న సమయంలో వారిలో ఒకతనికి దీప గురించి తెలియడంతో.. వెంటనే ఈ సమస్య గురించి దీపకు చెప్పారు. వెంటనే ఆమె తెలంగాణ పోలీసులకు ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చింది. పోలీసులు స్పందించి 23 మంది కూలీలను రక్షించి సొంతరాష్ట్రానికి పంపించారు. ఇలా దేశంలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తోన్న వెయ్యిమంది ఒడిషా కూలీలకి సాయం చేసింది. సమస్యలను వెతుక్కుంటూ.. అడిగిన వారికేగాక, చుట్టుపక్కల గ్రామాల్లో పర్యటిస్తూ అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకోవడం, దినపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రజాసమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, ఆయా అధికారులకు చేరవేయడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తోంది దీప. ప్రస్తుతం సైన్స్‌లో పీజీ చేస్తున్న దీప భవిష్యత్‌లో ప్రొఫెసర్ కావాలనుకుంటోంది. ‘‘ప్రొఫెసర్‌గా పనిచేస్తూ నా లాంటి వారినెందరినో తయారు చేయవచ్చు. ఇలాంటివాళ్లు సమాజంలో మరెంతోమందికి సాయం చేస్తారు’’ అంటూ భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం విశేషం. తన ద్వారా సాయం అందిన వారితో దీప. -
యూపీ CMO ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన హ్యాకర్లు
-
యూపీ సీఎంవో ట్విటర్ అకౌంట్ హ్యాక్
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయపు అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ గురైంది. హ్యాకింగ్‌కు పాల్పడ్డ దుండగలు.. అకౌంట్ టైం లైన్‌పై కోతి చేష్టలకు పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి ఇది జరిగినట్లు అధికారులు వెల్లడించారు. వందల మంది ట్విటర్ యూజర్లను ట్యాగ్ చేస్తూ సీఎంవో ట్విటర్ టైం లైన్‌పై పోస్టులు చేశారు హ్యాకర్లు. అటుపై ఆకతాయిలు కోతి బొమ్మను అకౌంట్ ప్రొఫైల్ ఫొటోగా మార్చేసి.. మరీ ఈ పనికి పాల్పడ్డారు. వెంటనే దీంతో అందుకు సంబంధించిన పోస్టుల స్క్రీన్ షాట్లు వైరల్ అయ్యాయి. అయితే విషయం గమనించిన ప్రభుత్వ సాంకేతిక సిబ్బంది.. వెంటనే అకౌంట్‌ను పునరుద్ధరించారు. హ్యాకర్లు పోస్ట్ చేసిన ట్వీట్లను డిలీట్ చేసి.. ఘటనపై విచారణకు ఆదేశించారు. -
కేంద్ర ప్రభుత్వ శాఖ ట్విటర్ హ్యాక్.. మధ్యలో ఎలన్ మస్క్ ఎందుకు వచ్చాడు!
న్యూఢిల్లీ: కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ అధికార ట్విటర్ ఖాతా గురువారం హ్యాక్ చేశారు. హ్యాకింగ్ అనంతరం ఈ ఖాతా పేరును టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్‌గా మార్చడంతో పాటు ప్రొఫైల్ పిక్ ఆయన ఫోటోని ఉంచారు. అంతేకాకుండా ‘మీరు మిలియనీర్‌గా మారడానికి ఇదొక ప్రత్యేక అవకాశం. 7,200,000 డాలర్లు గెలిచేందుకు మిస్టరీ బాక్స్‌లో ఉన్నాయి’ అని పేర్కొంటూ ఒక లింక్‌ను సైబర్ నేరగాళ్లు ఈ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. (చదవండి: యోగిజీ ఎఫెక్ట్: ప్లీజ్.. చంపొద్దు కావాలంటే జైల్లో పెట్టండి ) ఈ షాకింగ్ ఘటన జరిగిన తర్వాత పాస్‌వర్డ్‌ను మార్చడంతో పాటు ఢిల్లీ పోలీసులకు చెందిన సైబర్ క్రైమ్ బృందానికి సమాచారం అందించారు. ఈ హ్యాకింగ్ గురించి కేంద్ర ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ ట్వీట్‌ను తొలగించారు. హ్యాక్ అయిన ఖాతాను కొద్ది గంటల్లోనే పునరుద్ధరించారు. అనంతరం కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది. తమ అధికార ట్విట్టర్ ఖాతాకు గురువారం సైబర్ భద్రతకు సంబంధించిన సమస్యలు వచ్చాయని తెలిపింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు అందులో పోస్ట్ అయిన లేదా షేర్ చేసిన, బదులు ఇచ్చిన సమాచారానికి తమ మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. కాగా భారత ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెందిన ట్విట్టర్ ఖాతాతో పాటు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. -
మెగా ఫ్యాన్స్‌కు షాక్, అది ఫేక్ అట!
మెగాస్టార్ చిరంజీవి సతీమణి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తల్లి సురేఖ కొణిదెల రీసెంట్గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సురేఖ కొణిదేల పేరుతో ట్విటర్ ఖాతా దర్శనమిచ్చింది. అంతేకాదు తన తొలిపోస్ట్ తనయుడి గురించే షేర్ చేయడంలో మెగా ఫ్యాన్స్ సంతోషం మరింత రెట్టింపు అయ్యింది. దీంతో వరసగా మెగా ప్యాన్స్, నెటిజన్లు ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. చదవండి: సాయి పల్లవి యాడ్ రిజెక్ట్ చేయడంపై స్పందించిన సుకుమార్ ఈ క్రమంలో కొద్ది గంట్లోనే ఈ ఫ్రొఫైల్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 2 వేలు దాటింది. ఇదిలా ఉంటే. ఇప్పుడు వారందరికి షాకిస్తూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. చూస్తుంటే ఇది తన నిజమైన ఖాతా కాదని తెలింది. ఎందుకంటే ఈ ఫ్రొఫైల్‌ను మెగా కుటుంబంలోని ఏ ఒక్కరూ ఫాలో కావడం లేదు. అంతేకాదు సురేఖ కొణిదెల ఇంటి పేరులో స్పెల్లింగ్ మిస్టెక్ కూడా ఉంది. చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ ఇది మెగా ఫ్యాన్ పని అని, ఎవరో సురేఖ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. తల్లికొడుకుల ఫొటోను షేర్ చేసిన అభిమానం చాటుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ‘నా సూపర్ స్టైలిష్ కొడుకుతో నా మొదటి పోస్ట్‌తో ట్విటర్లో చేరినందుకు సంతోషంగా ఉంది’అంటూ ఈ పోస్ట్‌ను షేర్ చేయండంతో ఇది నిజమైన అకౌంట్ అనుకుని అంతా భ్రమపడ్డారు. ఇదిలా ఉంటే గతంలో కూడా సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి పేరుతో కూడా ఫేక్ అకౌంట్ దర్శమించిన సంగతి తెలిసిందే. Happy To Join On Twitter My First Post With Super Stylish Son @AlwaysRamCharan #RamCharan #RamCharan𓃵 #RRR. pic.twitter.com/BviB9PnvGP — Surekha Konidala (@SurekhaKonidala) February 26, 2022 -
సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి భార్య.. ఫస్ట్ పోస్ట్ ఎంటంటే?
Surekha Konidela Opened An Account In Twitter: సోషల్ మీడియాలో అనేకమంది తారలు యాక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన మూవీ అప్డేట్స్, సరదా సన్నివేశాలు, మోస్ట్ మెమొరబుల్ థింగ్స్‌ను అభిమానులతో పంచుకుంటారు. నెటిజన్లు, ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఒక మంచి ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా. ఇటీవల ప్రతీ ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరుస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. ట్విటర్లో అడుగుపెట్టిన సురేఖ కొణిదెల తన ఫస్ట్ పోస్ట్‌ను షేర్ చేశారు. రామ్ చరణ్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నా సూపర్ స్టైలిష్ కొడుకుతో నా మొదటి పోస్ట్‌తో ట్విటర్లో చేరినందుకు సంతోషంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే చిరంజీవి ఆచార్య ఏప్రిల్ 29న రిలీజ్ కానుండగా గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. Happy To Join On Twitter My First Post With Super Stylish Son @AlwaysRamCharan #RamCharan #RamCharan𓃵 #RRR. pic.twitter.com/BviB9PnvGP — Surekha Konidala (@SurekhaKonidala) February 26, 2022 -
Twitter: సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ట్విట్టర్ హ్యాక్
సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ట్విట్టర్ ఖాతా బుధవారం హ్యాక్ అయ్యింది. పైగా హ్యకర్లు ఖాతా పేరును ఎలెన్ మస్క్ అని పేరు మార్చారు. అంతేకాదు ప్రోఫైల్‌లో చేప ఫోటో పెట్టారు. అదే సమయంలో కొన్ని ట్వీట్లు కూడా చేశారు. అయితే కొద్ది సమయంలోనే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆ ఖాతాను రికవరి చేసిందని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో ఆ ట్విట్టర్ ఖాతా యథావిధిగా పనిచేస్తోంది. ఆ ట్వీట్లు కూడా తొలగించారు. అయితే హ్యాకర్లు గతంలో ప్రధాని మోదీ ఖాతాను హ్యాక్ చేసిన వారే సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఖాతాను కూడా హ్యాక్ చేసి ఉండవచ్చు. ఎందుకంటే అప్పుడూ మోదీ ఖాతా హ్యాక్ అయినప్పుడు ఏం కంటెంట్ ఉందో అదే కంటెంట్ ఈ ఖాతాలో కూడా ఉంది. ఇటీవల చాలామంది ప్రముఖుల ఖాతాలు హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. (చదవండి: ఒమిక్రాన్ ఉధృతిని ఆపలేం.. బూస్టర్‌తో ప్రయోజనం ఉండకపోవచ్చు! అయినా ఆందోళనవద్దు!: డాక్టర్ జైప్రకాష్) -
క్రిస్మస్ రోజే ట్విటర్ ఖాతా తొలగించిన అరియానా.. ఫ్యాన్స్ షాక్ !
Ariana Grande Deletes The Twitter Account On Christmas: హాలీవుడ్ పాప్ సింగర్ అరియానా గ్రాండె తన పాటలు, నటనతో ఎంతో పేరు తెచ్చుకుంది. 2013-2014 మధ్యలో వచ్చిన 'సామ్ అండ్ క్యాట్' టీవీ షోతో మరింత పాపులర్ అయింది అరియానా. అలాగే 'ది వాయిస్' సీజన్‌కు న్యాయనిర్ణేతగా కూడా కనిపించి అలరించింది. సోషల్ మీడియా పుణ్యమా అని అరియానా గ్రాండె పేరు ఈ సంవత్సరం ఎక్కువగా వినిపించింది. ఈ ఏడాది మేలో లాస్ ఏంజెల్స్ లగ్జరీ రియల్టర్ డాల్టన్ గోమెజ్‌ను సీక్రెట్‌గా వివాహం చేసుకుని అభిమానులకు షాక్ ఇచ్చిన అరియానా తాజాగా మరోసారి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా శుక్రవారం (డిసెంబర్ 25) క్రిస్మస్ సంబురాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా సెలబ్రిటీలందరూ తమ ఫొటోలను, క్రిస్మస్ వేడుకలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ రోజు తన ట్విటర్ ఖాతా తొలగించి అభిమానులను ఆశ్చర్యపరిచింది అరియానా. ఎలాంటి సమాచారం లేకుండా తన అకౌంట్ డిలీట్ చేయడంతో అభిమానులు షాక్ అయ్యారు. ఇంతకీ ఏమైందా అని ఆరా తీశారు అరియానా ఫ్యాన్స్. అరియానా సైబర్ వేదింపులకు గురయి ఉంటుందని, అందుకే డిలీట్ చేసిందని కొందరు భావిస్తున్నారు. లేదా తన కొత్త ప్రాజెక్ట్ ప్రకటనతో వచ్చేందుకు ఇలా చేసిందా అని తికమక పడుతున్నారు. ఆమె మీద ట్రోలర్స్ ప్రభావం పడిందేమోనని, వారివల్లే ఖాతా తొలగించిందేమో అని ఆరోపిస్తున్నారు. ఆమె మళ్లీ ట్విటర్‌లోకి రావాలని అరియానా ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. View this post on Instagram A post shared by Ariana Grande (@arianagrande) బ్యాంగ్ బ్యాంగ్, బ్రేక్ ఫ్రీ, సైట్ టు సైడ్ వంటి హిట్ సాంగ్స్ పాడిన అరియానా గ్రాండె ఇన్‌స్టా గ్రామ్‌లో మాత్రం యాక్టివ్‌గా ఉంది. తన తాజా నెట్‌ఫ్లిక్స్ చిత్రం డోంట్ లుక్ అప్ ప్రచార చిత్రాలను షేర్ చేసింది. దానికి సంబంధించిన ప్రమోషన్స్ కూడా చేస్తుంది. అంతేకాకుండా ఇన్‌స్టా వేదికగా అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం విశేషం. మెర్రీ.. బీ సేఫ్, ఐ లవ్ యూ అని స్టోరీ షేర్ చేసింది ఈ బ్యూటీఫుల్ సింగర్. ఇదీ చదవండి: తన నివాసంలో ప్రియుడిని పెళ్లాడిన పాప్ సింగర్ -
ఆటోడ్రైవర్ చేష్టలతో వణికిపోయిన యువతి.. పట్టపగలే ఘటన
తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరి ప్రయాణాలు చేసే మహిళలకు చేదు అనుభవాలు ఎదురుకావడం కొత్తేం కాకపోవచ్చు. కానీ, ఆ ఘటనలను మరికొందరి దృష్టికి తీసుకెళ్లి.. ఇతరులను అప్రమత్తం చేయాలనే ఆలోచన మాత్రం మంచిదే!. తాజాగా ఢిల్లీలో ఓ హర్యానాలో ఓ యువతి.. ఓ ఆటోడ్రైవర్‌తో తనకు ఎదురైన చేదు అనుభవం పంచుకునేందుకు ట్విటర్‌ను వేదిక చేసుకుంది. అలా ఆమె ట్వీట్లు రీ-ట్వీట్లు, షేర్ల ద్వారా వైరల్ అవుతున్నాయి. నిష్తా పలివాల్.. కమ్యూనికేషన్స్ స్పెషలిస్ట్‌గా పని చేసే యువతి(అంతకు మించి వివరాలేవీ వెల్లడించలేదు). డిసెంబర్ 19న మధ్యాహ్న సమయంలో తనకు భయానక అనుభవం ఎదుర్కొన్నట్లు ట్విటర్ ద్వారా తెలియజేసిందామె. ఓ ఆటోడ్రైవర్ దాదాపుగా ఆమెను కిడ్నాప్ చేసినంత పని చేశాడట. కానీ, అదృష్టం బాగుండి ఆమె ఆ దాడి నుంచి తప్పించుకోగలిగింది. Yesterday was one of the scariest days of my life as I think I was almost abducted/ kidnapped. I don’t know what it was, it’s still giving me chills. Arnd 12:30 pm, I took an auto from the auto stand of a busy market Sec 22 (#Gurgaon) for my home which is like 7 mins away (1/8) — Nishtha (@nishtha_paliwal) December 20, 2021 ‘‘మధ్యాహ్నం 12గం.30ని సమయం. గుర్గావ్ సెక్టార్ 22లోని బిజీ మార్కెట్లోని ఆటోస్టాండ్ అది. అక్కడున్న ఓ ఆటో దగ్గరికి వెళ్లా. డివోషనల్ సాంగ్స్(అతను ఏ మతస్తుడో చెప్పడం నాకిష్టం లేదు.. ఎందుకంటే ఇది మతానికి సంబంధించిన అంశం కాదు కాబట్టి) మీడియం వాల్యూమ్‌లో పెట్టుకుని వింటున్నాడతను. అతని వాలకం చూస్తే నాకే అనుమానం రాలేదు. నా దగ్గర క్యాష్ లేకపోవడంతో పేటీఎం చేస్తానని ఆ డ్రైవర్‌తో చెప్పా. అతను సరేనన్నాడు. కేవలం ఏడు నిమిషాల్లో ఇంటికి చేరాలి. కానీ, వెళ్లాల్సిన రోడ్డులో కాకుండా.. మరో రోడ్డులో అతను టర్న్ తీసుకున్నాడు. ఎందుకు ఈ దారి అని అడిగినా.. అతని నుంచి సమాధానం లేదు. పదేపదే అడగడంతో బిగ్గరగా దేవుడ్ని తల్చుకున్నాడతను. ఆ చేష్టలతో భయం వేసింది. ఆ భయంలోనే అతన్ని భుజం మీద పదే పదే కొట్టాను. అయినా స్పందన లేదు. చివరికి ఒక్కటే మార్గం కనిపించింది. బయటకు దూకితే ఏమైతది మహా అంటే కాళ్లు, చేతులు విరుగుతాయి. లేదంటే తల పగులుతుంది. కానీ, ఆ మృగం చేతిలో పడితే.. మానం వీలైతే ప్రాణమూ పోవచ్చు. అందుకే దూకేశా. ఆ డ్రైవర్ మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా అలాగే ముందుకు వెళ్లిపోయాడు. నేను సురక్షితంగా బయటపడ్డా. పట్టపగలే ఆరోజు నరకం చూశా. ఇలాంటి అనుభవం మరొకరికి ఎదురు కాకూడదనే ఈ విషయం చెప్తున్నా’’ అంటూ పోస్ట్ చేసిందా యువతి. ఇక ఈ ఘటనపై పోలీసులు స్పందించారని, ఆటో డ్రైవర్‌ను ట్రేస్ చేసే పనిలో ఉన్నారని చెబుతూ మరో ట్వీట్ చేసిందామె. చదవండి: కన్నీళ్లతో వైరల్ అవుతున్న బాలుడి ఫొటో.. ఎందుకో తెలుసా? -
ఇమ్రాన్ ఖాన్‌కు ఘోర పరాభవం.. పరువు పాయే
ఇస్లామాబాద్: దాయాది దేశం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు గత మూడు నెలల నుంచి జీతాలు చెల్లించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక పాక్, ఉగ్రవాదులకు అత్యంత సురక్షిత ప్రాంతంగా ప్రపంచదేశాల భావిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్‌ను ఆర్థికంగా ఆదుకోవడానికి ఏ దేశం ముందుకు రావడం లేదు. మరోవైపు డ్రాగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం పాక్‌కు రుణం ఇస్తోంది కానీ.. అవి ఆ దేశ అవసరాలను తీర్చడం లేదు. మరి కొన్ని నెలలు పరిస్థితి ఇలానే కొనసాగితే.. పాకిస్తాన్ ప్రభుత్వంలో భారీ మార్పుల చోటు చేసుకుంటాయి. పాక్ ప్రభుత్వంపై సామాన్యులతో పాటు ప్రభుత్వ అధికారులకు కూడా పీకల్దాక కోపం ఉంది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ వైఫల్యాలను ఎండగడతూ రూపొందిచిన ఓ పెరడీ వీడియో పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మరో ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే.. ఈ వీడియోను సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం తన ట్విటర్లో షేర్ చేసింది. (చదవండి: ఈ కడుపుమంట ఎందుకు?) ‘‘ద్రవ్యోల్బణంలో పాకిస్తాన్ గత రికార్డులను బద్దలు కొట్టింది. ఇమ్రాన్ ఖాన్.. మీరు ఇంకేత కాలం ప్రభుత్వ అధికారులు నోరు మెదపకుండా.. మీ కోసం పని చేయాలని ఆశిస్తున్నారు. గత మూడు నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఫీజు కట్టకపోవడంతో మా పిల్లలను పాఠశాల నుంచి బయటకు పంపిస్తున్నారు. ఇంకెంత కాలం మొద్దు నిద్ర నటిస్తారు.. ఇదేనా కొత్త పాకిస్తాన్’’ అనే క్యాప్షన్‌తో పెరడీ పాట వీడియోను షేర్ చేశారు. ఇక దీనిలో ఓ వ్యక్తి.. ‘‘సబ్బు ధర పెరిగిందా.. వాడకండి.. పిండి ఖరీదు ఎక్కువగా ఉందా.. తినకండి.. మందుల ధరలు పెరిగాయా.. అయితే ఆస్పత్రులకు వెళ్లకండి.. మీరు కేవలం పన్నుల చెల్లించి.. హాయిగా నిద్రపోండి. మీ పిల్లలకు తిండి, తిప్పలు, చదువు లేకపోయినా పర్వాలేదు. పాకిస్తాన్ ఎప్పటికి మేల్కొదు’’ అని సాగుతూ ఉంటుంది. ఇక ప్రతి వైఫల్యం దగ్గర ఇమ్రాన్ ఖాన్ గతంలో చెప్పిన డైలాడ్ ‘కంగారు పడకండి’ అని వస్తుంది. అంటే తిండి లేకపోయినా సరే కంగారు పడకండి అని సాగుతుంది ఈ పాట. (చదవండి: ఇంటికి నిప్పు పెట్టి ఆర్పుతున్నట్లు నటన) ఈ వీడియోని ట్విటర్లో షేర్ చేసిన కాసేపటికే ఇది తెగ వైరలయ్యింది. దాంతో అధికారుల స్పందించారు. ట్విటర్ నుంచి వీడియోని తొలగించారు. అకౌంట్ హ్యాక్ అయ్యిందని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ఆ తర్వాత పాక్ విదేశాంగ మంత్రిత్వ ‘‘సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయానికి చెందిన ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయి. ఈ ఖాతాలలో పోస్ట్ చేసిన సందేశాలు సెర్బియాలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుంచి వచ్చినవి కావు’’ అని ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్‌లో ఉంది. The Twitter, Facebook and Instagram accounts of the Embassy of Pakistan in Serbia have been hacked. Messages being posted on these accounts are not from the Embassy of Pakistan in Serbia. — Spokesperson 🇵🇰 MoFA (@ForeignOfficePk) December 3, 2021 చదవండి: కశ్మీర్ అంశంలో తాలిబన్ల సాయం తీసుకుంటాం: పాక్ -
ట్విటర్ కొత్త సీఈఓ నియామకంపై కంగనా ఆసక్తికర కామెంట్.. అలా అందేంటీ ?
Kangana Ranaut Comment On New Twitter CEO: కంగనా రనౌత్ చేతిలో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆమె దర్శకురాలిగా, నిర్మాతగా కూడా మారిన నటి. కానీ కంగనా పని చేయనప్పుడు, ఆమె ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి ఇష్టపడుతుంది. ఆమె ఎప్పుడూ ప్రతిదాని గురించి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది మరియు చాలా తరచుగా తన వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తిస్తుంది. ట్విట్టర్ సీఈఓగా జాక్ డోర్సీ స్థానంలో పరాగ్ అగర్వాల్ నియమితులవుతున్నట్లు ప్రకటించినప్పుడు ఈసారి కూడా అలాంటిదే జరిగింది. ఢాకాడ్ నటి ఈ వార్తలపై త్వరగా స్పందించింది మరియు అనేక మంది అభివృద్ధిని మరియు గర్వించదగిన క్షణాన్ని జరుపుకుంటున్నట్లుగా, కంగనా కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ట్విటర్ కొత్త సీఈఓ నియామకంపై కంగనా 'బై చాచా జాక్' అని రాసుకొచ్చింది. అయితే ఇంతకుముందు తన అభ్యంతరకరమైన ట్వీట్ల వల్ల ఆమెను ట్విటర్ నుంచి నిషేంధించారు. ఈ కొత్త అధికార మార్పుతో కంగనా మళ్లీ ట్విటర్‌లోకి అడుగుపెడుతుందేమో చూడాలి. ఇటీవల కూడా ఆమె ఒక పోస్ట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక జంట ఒకరినొకరు తమ చేతుల్లో పట్టుకున్న స్కెచ్‌ను షేర్ చేస్తూ 'నీ కోసమే మేము జీవిస్తున్నాం' అంటూ తన ప్రేమ జీవితం గురించి హింట్ ఇచ్చింది. ఇది చూసిన కంగనా అభిమానులు ఆమె ఎవర్నో ఒకర్ని మిస్ అవుతుందని అనుకుంటున్నారు. అంతకుముందు కూడా తన జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడని, రాబోయే కొన్నేళ్లలో తాను పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కనాలనుకుంటున్నానని పోస్ట్ చేసింది కంగనా. ఇది చదవండి: మిస్టర్ కంగనా రనౌత్ గురించి త్వరలోనే చెబుతా -
టిమ్ కుక్ ను..ఎలన్ తిట్టినంత పనిచేస్తున్నారు?!
కొద్ది కాలం క్రితం యాపిల్ సీఈఓ టిమ్ కుక్.. టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను బూతులు తిట్టారంటా?' అనే కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఆ కథనాల్ని టీమ్ కుక్, ఎలన్ మస్క్‌లు ఆ కథనాల్ని కొట్టి పారేశారు. కానీ ఎలన్ మస్క్ మాత్రం టిమ్ కుక్‌పై రివెంజ్ తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.అందుకు ఊతం ఇచ్చేలా ఆ ఇద్దరి గురించి మరో చర్చ మొదలైంది. టిమ్ కుక్ నిజంగా ఎలన్‌ను తిట్టారో..? లేదో? కానీ ఎలన్ మాత్రం టిమ్ కుక్ ను టార్గెట్ చేస్తూ అన్నంత పని చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎందుకంటారా? యాపిల్ సీఈఓ టిమ్ కుక్, టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ల మధ్య పచ్చగడి వేస్తే భగ్గుమంటుంది.ఆ విషయాన్ని మీడియా ఆధారాలతో సహా బయటపెట్టినా..అదేం లేదు. నాన్సెన్స్ అంటూ కొట్టి పారేస్తుంటారు. తాజాగా యాపిల్ గత సోమవారం(అక్టోబర్ 18) జరిగిన ఓ లాంఛ్ ఈవెంట్లో మాక్ బుక్ ప్రో, ఎమ్1 ప్రో, మ్యాక్స్ చిప్స్, థర్డ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్‌ను రిలీజ్ చేసింది. వీటితో పాటు పాలిషింగ్ క్లాత్ గురించి ప్రస్తావించింది. యాపిల్ గాడ్జెట్స్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులు వాటిని శుభ్రం చేసేందుకు పాలిషింగ్ వస్త్రాన్ని వినియోగించాలని సూచించింది. అంతా బాగుంది కానీ పాలిషింగ్ క్లాత్ ధర రూ.1900 ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. Introducing Apple Bağdat Caddesi, our beautiful new store in Istanbul. We’re glad to be a part of this vibrant community and we can't wait to welcome customers to this spectacular new space. pic.twitter.com/BtJiGDAeqq — Tim Cook (@tim_cook) October 22, 2021 Come see the Apple Cloth ™️ — Elon Musk (@elonmusk) October 22, 2021 యాపిల్ పాలిషింగ్ క్లాత్‌పై ట్రోలింగ్ కొనసాగుతుండగానే.. యాపిల్ సంస్థ ఇస్తాంబుల్‌లో యాపిల్ కొత్త స్టోర్‌ను ప్రారంభించింది. ప్రారంభానికి ముందు స్టోర్ గురించి టిమ్ కుక్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు ఎలన్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఎలన్.. టిమ్ కుక్‌ను ఉద్దేశిస్తూ 'వచ్చి యాపిల్ పాలిషింగ్ క్లాత్ ను చూడండి టిఎం' అంటూ ట్వీట్‌కు రిప్లయి ఇచ్చారు. ఆ ట్వీట్‌కు నెటిజన్ల మాత్రం ‘పవర్ ప్లే: టెస్లా, ఎలన్ మస్క్, అండ్ ది బెట్ ఆఫ్ ది సెంచూరీ’ బుక్ గురించి చర్చించుకుంటున్నారు. . ఆ బుక్‌లో ఏముంది ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ రైటర్ టిమ్ హగ్గిన్స్ రాసిన ‘పవర్ ప్లే: టెస్లా, ఎలన్ మస్క్, అండ్ ది బెట్ ఆఫ్ ది సెంచూరీ’ అనే బుక్ విషయంలో అదే జరిగింది. అప్పుడెప్పుడో ఎలన్ మస్క్ టెస్లా విలీన ప్రతిపాదనను యాపిల్ సీఈవో టిమ్ కుక్ ముందుంచారట. అంతేకాదు డీల్ ఒకే అయితే తననే యాపిల్ సీఈఓగా ప్రకటించాలని మస్క్ కోరాడట. అంతే మస్క్ ప్రతిపాదనతో ఒంటికాలిపై లేసిన టిమ్ కుక్.. ఎలన్‌ను బూతులు తిట్టినట్లు టిమ్ హగ్గిన్స్ తన బుక్‌లో రాసుకొచ్చారు. కానీ అలాంటి ఒప్పొందాలు జరగలేదని.. ఒకరంటే ఒకర్ని ఇన్స్పిరేషన్ అంటూ డైలాగులు చెబుతుంటారు. చదవండి: యాపిల్ సీఈవోగా మస్క్!!.. బూతులు తిట్టేసిన టిమ్ కుక్, నాన్సెన్స్.. -
టీఎంసీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో భారతీయ జనాతా పార్టీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీల మధ్య ట్విటర్ వేదికగా విమర్శల పర్వం కొనసాగుతోంది. భబానీపూర్ జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీపై టీఎంసీ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా, భవానీపూర్‌లో జరిగిన ఉపఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఉద్దేశ పూర్వకంగా దూరంగా ఉన్నారని ఆరోపణలు చేశారు. ఇప్పటికే టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్... ఎంపీ లాకెట్ ఛటర్జీపై ట్విటర్ వేదికగా ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే. కాగా, టీఎంసీ ఆరోపణలను బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ ఖండించారు. భబానిపూర్ ఉప ఎన్నికలకు దిలీప్ ఘెష్, సువేందు అధికారి క్యాంపెయిన్ చేశారని తెలిపారు. తాను.. ఉత్తర ఖండ్ ఎన్నికల ఇన్చార్జ్గా అక్కడ దృష్టిపెట్టానని అన్నారు. ఈ ఉప ఎన్నికలలో 41 ఏళ్ల హైకోర్టు న్యాయవాది గ్రీన్ హర్న్ ప్రియాంక టిబ్రేవాల్.. మమత బెనర్జీకి వ్యతిరేకంగా బరిలో నిలబడ్డారు. ఈ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 3 రానున్నాయి. Ha Ha! Don't worry. Mamatadi will win with large margin. U want this also. I know that u hv to write in favour of yr party. But still I thank u that even in this reply also u didn't mention the name of the bjp candidate. कहि पे निगाहे, कहि पे निशाना। Well done. https://t.co/3ew8YnUfP4 — Kunal Ghosh (@KunalGhoshAgain) September 27, 2021 చదవండి: మమతా బెనర్జీ ఇటలీ పర్యటనకు అనుమతి నిరాకరణ -
అయ్యయ్యో వద్దమ్మా.. సుఖీభవ!!
Ayyayo Vaddamma Sukhibhava Video: శాంతిభద్రతల పరిరక్షణ మాత్రమే కాదు.. పౌరుల వ్యక్తిగత భద్రత కోసం పోలీస్ వ్యవస్థ అహర్నిశలు శ్రమించడం చూస్తున్నాం. దేశంలో పలు రాష్ట్రాల పోలీసులు జనాలతో కనెక్టివిటీ కోసం సోషల్ మీడియా విరివిగా వినియోగిస్తున్నారు కదా!. అందులో హైదరాబాద్ పోలీసులు సైతం డిఫరెంట్ పంథాలో అవేర్నెస్ కల్పిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాను కుదిపేస్తున్న ‘సుఖీభవ’ మీమ్‌ను సైతం ఇప్పుడు వాడేశారు. సోషల్ మీడియాలో గత కొన్నిరోజులుగా ‘సుఖీభవ’ అనే వీడియో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. నల్లగుట్ట శరత్ అనే పిలగాడు ఓ టీ పౌడర్ యాడ్‌ను రీ-క్రియేట్ చేసి జోరుగా తీన్మార్ స్టెప్పులేయడం, అది కాస్త మీమ్స్ పేజీల ద్వారా ఇంటర్నెట్లో వైరల్ కావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రైజ్‌మనీ గెలిచారంటూ లింకులు పంపి ఆన్లైన్ మోసాలకు పాల్పడే వాళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ఈ మీమ్‌ను వాడేశారు. ‘అలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి’ అంటూ ఒరిజినల్ యాడ్‌లోని స్క్రీన్ షాట్‌నే ఉపయోగించారు. అలాంటి లింక్స్ ఓపెన్ చేయకండి.... #సుఖీభవ #sukhibhava #cybersafety #yoursafetyisourfirstpriority pic.twitter.com/1GZ2zAbl59 — హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) September 23, 2021 ఇక శరత్ వీడియో ఎప్పుడు, ఏ సందర్భంలో తీసిందో స్పష్టత లేనప్పటికీ.. విపరీతంగా వైరల్ అవుతోంది. గతంలో టిక్‌టాక్, యూట్యూబ్ ఇంటర్వ్యూలతో ట్రోలింగ్‌కు గురైన ఈ యువకుడు.. ఇప్పుడు ఓవర్నైట్సెన్సేషన్ కావడం విశేషం. ముఖ్యంగా మీమ్స్ పేజీలు ఈ వీడియో ద్వారా ఫాలోవర్స్‌కి అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. సెలబ్రిటీలు, పొలిటీషియన్లను సైతం వదలకుండా ట్రోల్ చేస్తున్నారు మరికొందరు. చూస్తుంటే.. రాబోయే రోజుల్లో ఈ-సెలబ్రిటీగా బుల్లితెరపై శరత్ కనిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో!! E video monnatnunchi chusthunna ..navvu agatla 😂#Sukhibhava pic.twitter.com/cJljiuHrhY — Teetotaler (@Imbuvan) September 20, 2021 Viral: కుక్కలకు గొడుగు పట్టి.. మనుషులను దారిలో పెట్టి.. -
ఆ బాలుడి ఆత్మవిశ్వాసం నచ్చింది
జగిత్యాల: జగిత్యాలకు చెందిన ఓ బాలుడి మాటలకు కేటీఆర్ ఫిదా అయ్యారు. తన ట్విట్టర్ అకౌంట్లో ఆ వీడియోను షేర్ చేశారు. జగిత్యాలకు చెందిన బండివారి ప్రకాశ్ ఓల్డ్ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. చదువుకుంటూనే ఉదయం సమయంలో ఇంటింటా దినపత్రికలు వేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ప్రకాశ్‌ను ప్రశంసించి.. చదువుకునే వయస్సులో పనిచేస్తున్నావని అడుగగా, తప్పేముందని తిరిగి ప్రశ్నించాడు. ‘ఈ వయస్సులో నీవు కష్టపడాల్సి వస్తోంది’అని సదరు వ్యక్తి అనగా, కష్టపడితే ఏమవుతుంది, భవిష్యత్‌లో నాకే మేలు జరుగుతుందని’బదులిచ్చాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి ధైర్యాన్ని చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా, ప్రకాశ్ ఆత్మవిశ్వాసానికి మంత్రి కేటీఆర్ కూడా ముగ్ధుడయ్యారు. ఆ చిన్నారి భవిష్యత్ బాగుండాలని కోరారు. కష్టపడుతూ చదువుకోవడం అభినందనీయమని, బాలుడి ఆత్మవిశ్వాసం తనకు ఎంతో నచ్చిందని ట్వీట్ చేశారు. బాలుడి తండ్రి క్యాబ్ నడుపుతుండగా, తల్లి అనూష టైలరింగ్ చేస్తుంటుంది. -
KTR Office: మేము చూసుకుంటాం.. సాయం చేస్తాం
సాక్షి, సప్తగిరికాలనీ(కరీంనగర్): న్యుమోనియాతో బాధ పడుతున్న 45 రోజుల పసిపాప కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కరీంనగర్‌కు చెందిన ఆ చిన్నారి తండ్రి అసీఫ్ రోజువారీ ఆటోడ్రైవర్. ఆటోను కిరాయికి తీసుకొని నడుపుతున్న అతను తన బిడ్డ ఆసుపత్రి బిల్లు చెల్లించే పరిస్థితిలో లేడు. ఆ కుటుంబ దీనస్థితిని చూసి చలించిన కరీంనగర్‌కు చెందిన సామాజిక సేవకురాలు మునిపల్లి ఫణిత తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తోపాటు పలువురికి పాప ఆసుపత్రిలో ఉన్న ఫొటోలను గురువారం పోస్ట్ చేసి, ఆదుకోవాలని కోరారు. ఆమె ట్వీట్‌కు గంటలోపే మంత్రి కార్యాలయం స్పందించింది. ‘మేము చూసుకుంటాం.. వీలైనంత త్వరగా సహాయం చేస్తాం’ అని రీట్వీట్ చేశారు. శుక్రవారం ఉదయం అసీఫ్కు మంత్రి కేటీఆర్ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. పాప వైద్య చికిత్స వివరాలు అడిగారని, ఆసుపత్రి బిల్ ఎంత అవుతుంది.. ఇంకా ఎన్ని రోజులు ఆసుపత్రిలో ఉంటారు.. తదితర వివరాలు అడిగారని, వీలైనంత త్వరగా మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పారని అసీఫ్ తెలిపాడు. చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ బీమా -
రాహుల్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, ట్విట్టర్ మధ్య చెలరేగిన వివాదం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ అధికారిక అకౌంట్, ఇతర నేతల ఖాతాలను ట్విట్టర్ ఎట్టకేలకు పునరుద్ధరించింది. ఢిల్లీలో తొమ్మిదేళ్ల దళిత బాలికను అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణల నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఫొటోలు రాహుల్ తన ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. బాధిత కుటుంబం ఫొటోలు షేర్ చేయడం తమ సంస్థ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేసింది. అయితే రాహుల్ ఆ ఫొటోలు సామాజిక మాధ్యమంలో పెట్టడానికి ఆ కుటుంబమే అనుమతించిందని, వారు ఇచ్చిన అనుమతి పత్రాన్ని ట్విట్టర్‌కు సమర్పించారు. దీంతో ట్విట్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బ్లాక్ చేసిన ఖాతాలను పునరుద్ధరించింది. దీనిపై కాంగ్రెస్ తన అధికారిక ఖాతాలో సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేసింది. ఫేస్‌బుక్‌పై బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం దళిత బాలిక కుటుంబీకుల వీడియోను రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని కమిషన్ గతంలో ‘ఇన్స్టాగ్రామ్’ మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌కు నోటీసులు పంపింది. నోటీసులపై ఫేస్బుక్ స్పందించలేదు. ఆగ్రహించిన ఎన్సీపీసీఆర్ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీచేసింది. రాహుల్‌పై ఏం చర్యలు తీసుకున్నారనేది ఫేస్బుక్ తెలపకపోవడాన్ని కమిషన్ తప్పుబట్టింది. ఆయనపై చర్యలపై నివేదికతో ఫేస్బుక్ అధికారులు మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. -
Twitter: ఎట్టకేలకు రాహుల్ ట్విటర్ ఖాతా పునరుద్ధరణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ కొన్ని నిబంధనలు ఉల్లంఘించారని ఆయన ఖాతాను ట్విటర్ నిషేధించిన విషయం తెలిసిందే. ఖాతాను నిలిపివేయడంపై రాజకీయ దుమారం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంపై శుక్రవారం రాహుల్ తీవ్రంగా విమర్శలు చేశారు. రాజకీయ వ్యవహారాల్లో ట్విటర్ తలదూర్చిందని యూట్యూబ్‌లో ఓ వీడియో విడుదల చేశారు. (చదవండి: రాజకీయాల్లో ట్విట్టర్ తలదూరుస్తోంది) విమర్శలు చేసిన మరుసటి రోజే శనివారం ట్విటర్ రాహుల్ ఖాతాను పునరుద్ధరించింది. రాహుల్ ఖాతాను తిరిగి తెరిచింది (అన్‌లాక్). ఇటీవల ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై రాహుల్ తప్పుబట్టారు. బాధిత కుటుంబాన్ని పరామర్శి వారితో దిగిన ఫొటోలను ఆగస్ట్ 4వ తేదీన ట్విటర్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విటర్లో పోస్టులు చేశారు. ఇది తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ట్విటర్ రాహుల్ గాంధీ ఖాతాతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు 5 వేల మంది ఖాతాలను నిలిపివేసింది. కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సూర్జేవాలా, రోహన్ గుప్తా, పవన్ ఖేరా, మాణిక్కం ఠాగూర్‌తో పాటు రాహుల్ వివాదాస్పద ట్వీట్లను డిలీట్ చేయడంతో ట్విటర్ వారి ఖాతాలను పునరుద్ధరించింది. రాహుల్‌ను రెండు కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ట్విటర్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఇతరుల ప్రైవసీ.. భద్రత దృష్ట్యా మేం తప్పనిసరిగా నియమాలు పాటించాల్సి ఉంది. ఆ ఫొటో పోస్టు చేయడంపై మా ప్రతినిధులు పరిశీలించి ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో భాగంగా చర్యలు తీసుకున్నాం. మా విజ్ఞప్తి మేరకు ఎట్టకేలకు రాహుల్ గాంధీ ఓ లేఖ రాశారు.’ అని వివరించారు. రాహుల్ ఫొటో ఉంచడంపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. బాధితుల కుటుంబం ఫొటోలు ఉంచిన రాహులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆ క్రమంలోనే రాహుల్ ట్విటర్ ఖాతాను నిలిపివేసినట్లు తెలిసింది. ఖాతా పునరుద్ధరణపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఒక్క వాక్యం ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేసింది. అంటే చివరకు సత్యమే గెలిచిందని పేర్కొంటూ ఆ ట్వీట్ చేసింది. Satyameva Jayate — Congress (@INCIndia) August 14, 2021 -
కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చిన ట్విట్టర్
-
కాంగ్రెస్ నేతలకు షాకిచ్చిన ట్విటర్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం కాంగ్రెస్ పార్టీకి ట్విటర్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ ట్విటర్ ఖాతాను ఇప్పటికే లాక్ చేసిన ట్విటర్ తాజాగా మరో ఐదుగురు కాంగ్రెస్ సీనియర్ నేతల అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్ చేయడం దుమారం రేపింది. దీంతోపాటు కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను కూడా బ్లాక్ చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ నేతలు మండి పడుతున్నారు. పార్టీ మీడియా హెడ్ రణదీప్ సింగ్ సూర్జేవాలా, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, లోక్ సభలో పార్టీ విప్ మాణిక్యం ఠాగూర్, మాజీ మంత్రి జితేంద్ర సింగ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుస్మితా దేవ్ ట్విటర్ అకౌంట్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ విషయాన్ని పార్టీ నేత ప్రణవ్ ఝా ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ట్విటర్ చీఫ్ జాక్ డోర్సేపై విమర్శలు గుప్పించారు. తమ సీనియర్ నేతలతోపాటు దాదాపు 5 వేలమంది ఇతర నాయకులు, కార్యకర్తల ఖాతాలు బ్లాక్ అయ్యాయని ఆరోపించిన కాంగ్రెస్ మోదీ సర్కార్‌పై ధ్వజమెత్తింది. మోదీజీ ఇంకెంత భయపడతారంటూ ఎద్దేవా చేసింది. దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పోరాడింది, ప్రజల ఆకాంక్షను కేవలం సత్యం, అహింస తోనే సాధించిందనీ, అప్పుడూ గెలిచాం, మళ్లీ గెలిచి తీరుతాం అంటూ కాంగ్రెస్ తన ఇన్‌స్టా పేజీ పోస్ట్‌లో పేర్కొంది. ప్రజలకోసం పనిచేస్తున్న తమను ఇలాంటి చర్యలు ఏమాత్రం అడ్డుకోలేవంటూ ట్విటర్ ఇండియాకు సవాల్ విసిరింది. కాగా ఢిల్లీలో ఇటీవల తొమ్మిదేళ్ల బాలిక హత్యాచార ఘటన నేపథ్యంలో రాహుల్ బాధిత బాలిక, తలిదండ్రుల ఫోటోలను షేర్ చేసిననేపథ్యంలో ఆయన అధికారిక ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసింది. మరోవైపు బాధితుల ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంపై సీరియస్‌గా స్పందించిన జాతీయ బాలల హక్కుల సంఘం రాహుల్‌పై చర్య తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Congress (@incindia) -
‘భావ వ్యక్తీకరణ’ను అడ్డుకోవడమే: కాంగ్రెస్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా సస్పెండ్ చేసి, ఒక ట్వీట్‌ను తొలగించి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ట్విట్టర్ సంస్థ హరించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మోదీ సర్కార్ ఆదేశాలకు తలొగ్గి ట్విట్టర్ సంస్థ ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని, భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తోందని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ట్విట్టర్ వైఖరిని మరింతగా ఎండగట్టేందుకు సిద్ధంకావాలని పార్టీ ప్రధాన కార్యదర్శుల భేటీలో నేతలు నిర్ణయం తీసుకున్నారు. -
రాహుల్ గాంధీకి ఝలక్
కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(51)కి మైక్రోబ్లాగింగ్సైట్ ట్విటర్ ఝలక్ ఇచ్చింది. కొద్ది గంటలు(దాదాపు ఒకరోజు!) ఆయన ట్విటర్ అకౌంట్‌ను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ ట్విటర్ పేజీ విషయాన్ని తెలియజేసింది. ఢిల్లీ మైనర్(9) హత్యాచార ఘటనకు సంబంధించి బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్.. బాలిక తల్లిదండ్రులతో ఉన్న ఫొటోని ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ చర్యతో బాధితుల ఐడెంటిటీని రివీల్ చేశాడని, జువైనల్ చట్టాన్ని ఉల్లంఘించాడని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR) గుస్సా అయ్యింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు, ట్విటర్ ఇండియాకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ తరుణంలో ఆయన ట్విటర్ అకౌంట్‌ను తాత్కాలికంగా బ్లాక్ చేసిన ట్విటర్.. ఆపై కాసేపు స్టేటస్ అప్డేట్ను కూడా లాక్ చేసినట్లు సమాచారం. దీంతో ఆయన ఆ ఫొటో ట్వీట్‌ను డిలీట్ చేయగా.. అకౌంట్ మళ్లీ యాక్టివేట్ అయ్యింది. Shri @RahulGandhi’s Twitter account has been temporarily suspended & due process is being followed for its restoration. Until then, he will stay connected with you all through his other SM platforms & continue to raise his voice for our people & fight for their cause. Jai Hind! — Congress (@INCIndia) August 7, 2021 -
ధోనికి షాక్ ఇచ్చిన ట్విటర్; అభిమానుల ఆగ్రహం
ఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనికి ట్విటర్ షాక్ ఇచ్చింది. ధోని అకౌంట్ నుంచి బ్లూ వెరిఫైడ్ టిక్‌మార్క్‌ను తొలగించింది. అయితే ట్విటర్ ఆ టిక్‌ను ఎందుకు తొలగించిందనే దానిపై స్పష్టత రాలేదు. ధోనీ ట్విటర్లో కొంతకాలంగా యాక్టివ్‌గా లేకపోవడంతోనే ఇలా జరిగి ఉంటుందని సమాచారం. ధోని ఈ ఏడాది జనవరి 8న చివరి ట్వీట్ చేశాడు. అప్పటినుంచి ధోని ట్విటర్లో యాక్టివ్‌గా లేడు. ట్విటర్ రూల్స్ ప్రకారం ఆరు నెలల పాటు ఒక వ్యక్తి అకౌంట్లో లాగిన్ కాకుంటే సదరు సంస్థ బ్లూ టిక్ తొలగిస్తుంది. ఒకవేళ బ్లూ టిక్ మళ్లీ కావాలంటే వెరిఫికేషన్ కోరుతుంది. అయితే ధోని ట్విటర్‌కు బ్లూ టిక్ తొలగించడంపై అతని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బ్లూటిక్‌ను యాడ్ చేయాలంటూ ట్విటర్ సంస్థను డిమాండ్ చేశారు. తన రిటైర్మెంట్ విషయాన్ని కూడా ధోని ట్విటర్లో కాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అంతేగాక తన ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను కూడా ధోని ఇన్స్టాలోనే షేర్ చేస్తూ వచ్చాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చిన ధోని ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. -
నెటిజన్లకు షాక్, పోస్ట్‌లపై 'కూ' యాప్ కొరడా
ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన దేశీయ యాప్ 'కూ' యూజర్లపై కొరడా ఝుళిపించింది.కేంద్ర ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అకౌంట్లను బ్లాక్ చేసే పనిలో పడింది. దేశ భద్రత దృష్ట్యా కేంద్రం సోషల్ మీడియాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. కేంద్రం ప్రవేశ పెట్టిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్- 2021కు వ్యతిరేకంగా ఉన్న సోషల్ మీడియా అకౌంట్లపై ఆయా సోషల్ మీడియా సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా 'కూ' యాప్ 3,431 సోషల్ మీడియా పోస్టులపై దృష్టిసారించింది. జులై నెలలో కమ్యూనిటీ గైడ్‌లైన్స్ విరుద్దంగా ఉన్న 498 పోస్ట్‌లను డిలీట్ చేసింది. మరో 2,933 పోస్ట్‌లను పర్యవేక్షించనుంది. కూ యాప్ వివరాల ప్రకారం.. 'ప్రో యాక్టీవ్ మోడరేట్'లో భాగంగా మొత్తం 65,280 పోస్ట్ లను దృష్టిసారించగా..వాటిలో 1,887 పోస్ట్‌లను డిలీట్ చేసినట్లు మిగిలిన 63,393 పోస్ట్‌లపై హెచ్చరికలు జారీ చేయడం, బ్లర్ చేయడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అకౌంట్ వెరిఫికేషన్ జులైలో ఐటీ రూల్స్ అనుగుణంగా ఉన్న ట్విట్టర్ యూజర్లు తమ అకౌంట్లను బ్లూటిక్ వెరిఫికేషన్‌కు అప్లయ్ చేయాలని సూచించింది. తాజాగా కూ యాప్ సైతం ఎల్లో టిక్ వెరిఫికేషన్‌కు అప్లయ్ చేయాలని కోరింది. కాగా, బ్లూటిక్, ఎల్లో టిక్ వెరిఫికేషన్ అకౌంట్ కావాలంటే ప్రముఖులై ఉండాలి. ఉదాహరణకు రాజకీయ పార్టీలకు చెందిన నేతలు, సినిమా స్టార్స్, స్పోర్ట్స్ పర్సన్, బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇలా ఆయా రంగాల్లో రాణిస్తున్న వారి సేవలకు గుర్తుగా ఆయా సోషల్ మీడియా సంస్థలు ఈ వెరిఫికేషన్ అకౌంట్లను అందిస్తుంటాయి. -
కట్టు దాటితే... కష్టమే!
వార్తలకూ, వ్యాఖ్యలకూ వేదికగా అభిప్రాయాలన్నిటినీ స్వేచ్ఛగా చేరవేస్తామనే సోషల్ మీడియా పక్షి మళ్ళీ వార్తగా మారింది. కొద్ది రోజుల్లోనే ఒకటికి పది సార్లు... వివాదాలకు ట్విట్టర్ కేంద్ర బిందువైంది. వరుసగా మీద పడుతున్న కేసులతో వార్తల్లో నిలుస్తోంది. భారతదేశ పటాన్ని తప్పుగా చూపడం, కేంద్ర స్థాయి రాజకీయ నేతల ఖాతాలను తాత్కాలికంగా ఆపడం, చిన్నారుల అశ్లీల చిత్రాలు వేదికలో ఉండడం – ఇలా ఈ మధ్యకాలంలో ట్విట్టర్‌పై జరిగిన రచ్చ చాలానే ఉంది. నిజానికి, భారత ప్రభుత్వం రూపొందించిన కొత్త ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐ.టి.) నిబంధనలు మే 26 నుంచి అమలులోకి వచ్చాయి. ఆ నిబంధనలకు కంపెనీలన్నీ కట్టుబడి తీరాలనే అంశంపై కేంద్రానికీ, ట్విట్టర్‌కూ మధ్య కొద్దికాలంగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ట్విట్టర్ ఠలాయింపులు, తాజా కేసులు, వాద వివాదాలు చూస్తుంటే అవి మరింత క్షీణించాయా అనిపిస్తోంది. భారతదేశంలో స్థానిక నిబంధనలకు ఒప్పుకుంటే, ఆ పైన ఇతర దేశాల్లోనూ అక్కడి చట్టాల పాటింపు ఇబ్బంది తప్పదనేది ఈ విదేశీ ప్రైవేట్ మైక్రో బ్లాగింగ్ సంస్థ భావన. అమెరికన్ చట్టం ప్రకారం కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ కేంద్ర ఐ.టి. శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విట్టర్ ఖాతాను ఇటీవల ఆ సంస్థ కొద్దిసేపు తాత్కాలికంగా ఆపేయడం రచ్చయింది. ఆపైన లద్దాఖ్ సహా భారత భూభాగంలోని జమ్మూకశ్మీర్ ప్రాంతాన్ని భారత్‌లో అంతర్భాగం కానట్టు చూపడం ట్విట్టర్‌ను అందరిలోనూ అప్రతిష్ఠ పాలు చేసింది. భారతీయులు ఎందరో పనిచేస్తున్న ఆ సంస్థ తన వెబ్‌సైట్‌లోని ‘ట్వీప్ లైఫ్’ సెక్షన్లో చూపిన ఆ మ్యాప్ సహజంగానే తీవ్ర విమర్శలకు దారితీసింది. చేసిన తప్పు అర్థమైన ట్విట్టర్ కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టి, వివాదాస్పద మ్యాప్‌ను నిశ్శబ్దంగా తొలగించింది. ఆ మాటకొస్తే, ట్విట్టర్‌కు వివాదాలు కొత్త కావు. గతంలో లేహ్ ప్రాంతాన్ని జమ్మూకశ్మీర్‌లో భాగంగా, లద్దాఖ్‌ను చైనాలో అంతర్భాగంగా చూపి, ఇరుకున పడింది. ట్విట్టర్ కార్యకలాపాలను చైనా అనుమతించకపోయినా, భారత్ విషయంలో చైనీస్ మ్యాప్‌ను ఆ సంస్థ అనుసరిస్తోందంటూ వ్యంగ్యాస్త్రాలూ వచ్చాయి. పదుల లక్షల్లో ట్విట్టర్ వినియోగదారులు, పరిమితులు లేని కోట్ల కొద్దీ వ్యాపారం భారతదేశంలో ఉన్నప్పటికీ, ట్విట్టర్‌కు ఈ దేశ ప్రయోజనాలు, మనోభావాల మీద అక్కర లేదని బి.జె.పి. సహా వివిధ రాజకీయ పక్షాల నేతలు ఆరోపిస్తున్నది అందుకే! దానికి తగ్గట్టే వారు అధికారంలో ఉన్న వివిధ రాష్ట్రాలలో ట్విట్టర్‌పై వరుసగా ఒకటికి మూడు కేసులూ వచ్చి పడ్డాయి. భారీ టెక్ సంస్థలు భారతీయుల సమాచారంతో వ్యాపారంలో లాభాల పంటలు పండించు కోవడం చూస్తూనే ఉన్నాం. కానీ, అవి ఏ మేరకు జవాబుదారీగా ఉంటున్నాయన్నది ప్రశ్న. ఓ మెట్టు పైకెక్కి, అనేక విదేశీ సంస్థలు, సోషల్ మీడియా వేదికల లాగానే ట్విట్టర్ కూడా ‘యాంటీ ఇండియా’, ‘యాంటీ మోదీ’ అని ముద్ర వేస్తున్నవాళ్ళూ ఉన్నారు. ఆ మాటల్లో నిష్పాక్షికత మాటెలా ఉన్నా, ఎవరైనా సరే భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎన్నటికీ సమర్థనీయం కాదు. బాధ్యత లేకుండా కేవలం హక్కులే అనుభవిస్తామనడమూ సరికాదు. నూతన ‘ఐ.టి. నిబంధనలు – 2021’ ప్రకారం మన దేశంలో 50 లక్షల మందికి పైగా వినియోగదారులున్న ప్రతి సోషల్ మీడియా వేదిక కూడా ప్రతి నెలా తమకు వచ్చిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యల వివరాలతో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టే 59 వేల చిల్లర పోస్టులు తొలగించామంటూ, గూగుల్ తన తొలి నెలవారీ నివేదికను తాజాగా సమర్పించింది. ట్విట్టర్, వగైరా కూడా ఆ బాటలోనే తమపై వచ్చిన ఫిర్యాదులకు తీసుకున్న చర్యలను క్రమం తప్పకుండా వివరించాల్సిందే. ట్విట్టరే కాదు... ఏ సంస్థ అయినా తాను ఏ గడ్డ మీద నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోందో, ఎక్కడ వ్యాపారం చేస్తోందో ఆ దేశపు చట్టాలను గౌరవించడం విధి. అందుకు భిన్నంగా వ్యవహరించాలని అనుకోవడం సహజ వ్యాపార సూత్రాలకూ విరుద్ధమే. అలాగని నిబంధనల్లో లోటుపాట్లపై నోరుమూసుకోనక్కర లేదు. న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. నిర్ణీత మెసేజ్ ఎవరి నుంచి మొదలైందో ఆచూకీ తీయడం లాంటివాటిపై ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ సవాలు చేసింది అలాగే! నిజానికి, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి ఇతర విదేశీ సంస్థలు సైతం తొలుత వ్యతిరేక స్వరం వినిపించినా, చివరకు కేంద్ర నిబంధనలకు తలొగ్గాయి. తల ఊపడంలో ఆలస్యమైన ట్విట్టర్ మాత్రం ఇంకా ఠలాయిస్తున్నట్టు కనిపిస్తోంది. ఫిర్యాదుల పరిష్కరణకు స్థానికంగా భారతీయ పౌరులనే సంస్థ పక్షాన అధికారిగా నియమించాలనే నిబంధన దగ్గరే ట్విట్టర్ ఇప్పటికీ తప్పటడుగులు వేస్తోంది. ట్విట్టర్‌ను ఏకంగా నిషేధించాలంటూ వీరంగం వేస్తున్న వారి వాదనలూ వినిపిస్తున్నాయి. అయితే, ప్రభుత్వం అన్నిటికీ తొందరపడకుండా, చట్టం తన పని తాను చేసుకొనిపోయే «ధోరణిని అనుసరిస్తే మేలు. భావప్రకటన స్వేచ్ఛను అనుమతిస్తూనే, దేశసమైక్యత, సమగ్రత లాంటి అంశాల్లో సందర్భాన్ని బట్టి కటువుగా ఉండాలి. కానీ, దాదాపు 70 కోట్ల మంది జనాభా ఆన్లైన్లో ఉండే దేశంలో అవసరానికి మించి అత్యుత్సాహం ప్రదర్శిస్తే మాత్రం అసలు విషయం పక్కకు పోతుంది. చివరకు కక్ష సాధిస్తున్నారనో, పీడిస్తున్నారనో అభిప్రాయం కలిగే ప్రమాదం ఉంది. అందుకే, మధ్యే మార్గంతో శాంతియుత సహజీవనం చేయకుండా ఎవరు కట్టు దాటినా అది కష్టమే! -
ఈ ఆర్సీబీ ప్లేయర్ ఎవరో గుర్తు పట్టండి..?
బెంగళూరు: త్వరలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 సెకండాఫ్ మ్యాచ్‌ల నేపథ్యంలో పలు ఫ్రాంఛైజీల యాజమాన్యాలు తమ తమ అభిమానులను ఉత్సాహపరిచే నిమిత్తం సోషల్ మీడియాలో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ట్విటర్ వేదికగా అభిమానులకు క్విజ్ పోటీ నిర్వహించింది. తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ ఇమేజ్ను షేర్ చేసి అందులో ఉన్న ఆర్సీబీ ఆటగాడు ఎవరో గుర్తుపట్టాల్సిందిగా అభిమానులను కోరింది. ఇందు కోసం ఓ క్లూను కూడా ఇచ్చింది. ఆ ఆటగాడి ఐపీఎల్ అరంగేట్రం 2021 సీజన్లో ముంబై ఇండియన్స్‌పై జరిగిందని క్లూను వదిలింది. ఇంతకీ ఈ రాయల్ ఛాలెంజర్ ఎవరో మీరు గుర్తు పట్టారా..? చదవండి: చోటా ధోనీని చూడండి.. హెలికాప్టర్ షాట్‌ను ఇరగదీస్తున్నాడు Can you tell us which Royal Challenger this is, 12th Man Army? 🤔 Hint: He made his debut against MI in #IPL2021. #PlayBold #WeAreChallengers pic.twitter.com/ytN1KOeiP9 — Royal Challengers Bangalore (@RCBTweets) June 6, 2021 -
ఇలాంటి వార్తలను నమ్మకండి :నటి సుహాసిని
ప్రముఖ దర్శకులు మణిరత్నం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్లో అకౌంట్ ఓపెన్ చేస్తే అభిమానులకు ఆనందమే. బుధవారం అలాంటి ఆనందమే దక్కింది. అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. జూన్ 2న మణిరత్నం పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చారన్నట్లుగా కొన్ని వార్తలు వచ్చాయి. వీటిపై మణిరత్నం భార్య, ప్రముఖ నటి సుహాసిని స్పందించారు. ‘‘బుధవారం మణిరత్నం ట్విటర్ అకౌంట్‌ను స్టార్ట్ చేసినట్లుగా ఒక వ్యక్తి మణిరత్నం పేరుతో ట్వీట్ చేశాడు. ఇలాంటి నకిలీ అకౌంట్‌ను నమ్మొదు. దయచేసి అప్రమత్తంగా ఉండండి’’ అని పేర్కొన్నారు సుహాసిని. -
లక్షమంది నెటిజన్లు ఫిదా, ఏముందా ఆ వీడియోలో!
ధీరుడు ఒకేసారి మరణిస్తే..పిరికి వాడు క్షణం క్షణం మరణిస్తాడన్నా వివేకానందుడి సూక్తులు నేటి యువతకు ఎంతో ఆదర్శం. కెరటం నాకు ఆదర్శం.. లేచి పడినందుకు కాదు.. పడి లేచినందుకంటారు. పోటీ పరీక్షలైనా, అనుకున్న లక్ష్య సాధనే అయినా ఆశావాహులు అనుకున్న లక్ష్యాల్ని సాధించే క్రమంలో మహనీయుల సూక్తల్ని స్మరిస్తుంటారు. కానీ ఆచరణలోనే తడబడుతూ లక్ష్య సాధనలో చతికిల పడుతుంటారు. అలాంటి వారు గమ్యం చేరే వరకు విస్మరించొద్దని అంటున్నాడు ఓ ఏడేళ్ల బుడ్డోడు. మొదటి ప్రయత్నంలో విఫలమైనా మళ్లీ మళ్లీ ప్రయత్నించి విజయం సాధించవచ్చని ఓ ఫీట్ ను చేసి చూపించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఐఏఎస్ అధికారి ఎంవీ రావు షేర్ చేసిన వీడియోలో బుడ్డోడు ఓ పోల్ ను ఎక్కడానికి అనేక సార్లు ప్రయత్నిస్తాడు. టార్గెట్ రీచ్ కాలేకపోతాడు. ఇలా పలు మార్లు ట్రై చేసి చివరికి విజయం సాధిస్తాడు. ఆ వీడియోను ఎంవీ రావు షేర్ చేస్తూ జీవితంలో పట్టుదల చాలా ముఖ్యం. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు విస్మరించని ఈ బుడ్డోడే నా గురువు అని ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి వీడియోను లక్షమందికి పైగా వీక్షించారు. వేలాది మంది ఆ చిన్నారి సాధించిన ఫీట్ కు ఫిదా అవుతున్నారు. మీరూ విజయవంతమయ్యే వరకు మళ్లీ మళ్లీ ప్రయత్నించండి అంటూ రీట్వీట్ చేస్తుంటే.. ఏం ఫీట్ రా బాబు అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం లక్షమందికి పైగా నెటిజన్లను ఆకట్టుకున్న వీడియోను మీరూ చూడండి. కాగా, ఇక ఈ ఇంటర్నెట్ సెన్సేషన్ పేరు హుస్సేనీ. ఇరాన్ కు చెందిన ఫుట్ బాల్ ప్లేయర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయన్సర్. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు తన ఆటతో,ఆటలోని ఫీట్లతో ఆకట్టుకోవడంలో దిట్ట. This Kid is my Guru 😊 👏 💐🍫 pic.twitter.com/eiUPxxLzzG — Dr. M V Rao, IAS (@mvraoforindia) May 27, 2021 -
అరెస్ట్‌కి డిమాండ్.. దణ్ణం పెట్టిన యువిక
సాక్షి, ముంబై : క్షణికావేశంలో నోరు జారడం.. ఇబ్బందులు చుట్టుముట్టాక క్షమాపణలు చెప్పడం సెలబ్రిటీలకు అలవాటుగా మారింది. అయితే ఏకంగా అరెస్ట్ చేయాలనేంత డిమాండ్ బహుశా బాలీవుడ్ నటి యువికా చౌదరి విషయంలోనే జరిగిందేమో!. నిమ్న వర్గాలను కించపరిచేలా కామెంట్ చేసిందంటూ #ArrestYuvikaChaudhary హ్యాష్ ట్యాగ్‌తో విరచుకుపడ్డారు ట్వీపుల్స్. ఈ మేరకు ఇన్‌స్ట్రామ్‌లో చేతులు జోడించి ఆమె నెటిజన్స్‌కి క్షమాపణలు చెప్పుకుంది. తాను మాట్లాడింది ఆ అర్థంతో కాదని, మాట్లాడేటప్పుడు తాను సోయి లేకుండా వ్యవహరించానని కామెంట్ చేసింది. తన వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరుతూ ఆ వీడియోలో ఆమె కోరింది. మరోవైపు తనకు ఎవరీని నొప్పించే ఉద్దేశం లేదని ట్విట్టర్లో ఓ ట్వీట్ యువిక. ‘ఫిర్ బీ దిల్ హై హిందుస్థానీ’, ఓం శాంతి ఓం లాంటి సినిమాలతో పాటు డజనుకి పైగా టీవీ షోలతో 37 ఏళ్ల యువిక నార్త్ ఆడియొన్స్‌లో మంచి క్రేజ్ దక్కించుకుంది. View this post on Instagram A post shared by Yuvikachaudhary (@yuvikachaudhary) నటి యువికా చౌదరికి ఒక యూట్యూబ్ వ్లోగ్ ఉంది. అందులో తన భర్త హేయిర్ క్రాఫ్ చేయించుకుంటుండగా వీడియో తీసింది ఆమె. ఆ టైంలో వ్లోగ్ వీడియో తీసిన ప్రతీసారి తన అవతారం భంగీ(దళితులు, డ్రైనేజీలు శుభ్రం చేసేవాళ్లు)ల్లాగే ఎందుకు ఉంటుందో తెలియడం లేదని కామెంట్ చేసింది. ఆ కామెంట్‌పై నెటిజన్స్ విరుచుకుపడ్డారు. యువికాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ట్విట్టర్లో రెండు రోజులగా హ్యాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ నడిపించారు. దీంతో యువికా క్షమాపణలు చెప్పింది. ఇక బుల్లితెరపై మరో నటి మున్ మున్ దత్తా యూట్యూబ్‌లో ఈ తరహా కామెంట్లు చేయడంతో ఆమెపై ఎస్సీఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు అయ్యింది. -
Donald Trump: పంతం నెగ్గించుకున్న ట్రంప్..
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సొంతగా ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల అనంతరం ట్రంప్ అనుచరులు విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. అమెరికా పార్లమెంట్ భవనంపై దాడి చేసేలా ట్రంప్ తన మద్దతుదారుల్ని ఉసిగొలిపినట్లు పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దూసుకెళ్లి రిపబ్లిక్ పార్టీ జెండాలు ఊపుతూ ఆయనకు అనుకూలంగా నినాదాలు చేశారు. పెద్ద ఎత్తున అక్కడి చేరిన ట్రంప్ మద్దదారులను పోలీసుల అదుపు చేయడనాకి ప్రయత్నించారు. కానీ ట్రంప్ అనుచరులు పోలీసులపై దాడి చేయడానికి యత్నించటంతో హింసాత్మక అల్లర్లు చెలరేగి ఐదుగురు మరణించారు. ఈ అల్లర్లుకు పాల్పడిన 52 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడ్డ తన మద్దతుదారులు ఇళ్లకు వెళ్లిపోవాలని ట్రంప్ తన ట్విటర్ ఖాతా వేదికగా పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్ చేసిన ట్వీట్ పౌర సమాజ సమగ్రతకు వ్యతిరేకంగా ఉందని ట్విటర్ యాజమాన్యం ఆయన ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసింది.ఫేస్బుక్ అధినేత జుకర్‌బర్గ్ సైతం ట్రంప్ ఫేస్బుక్ అకౌంట్‌ను శాశ్వతంగా తొలగించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాను కొత్తగా ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫ్లామ్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తానని ట్రంప్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ట్రంప్ ఫేస్బుక్, ట్విటర్ తరహాలో తాను కూడా సొంతంగా ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రూపొందించుకున్నారు. ట్విటర్ తరహాలో www.DonaldJTrump.com/desk URL పేరుతో రూపొందిచిన ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ట్రంప్ తన అభిప్రాయాల్ని ప్రజలతో పంచుకుంటారు. ఇక ఆయన ఒక్కరే దానిలో తన అభిప్రాయాలను వ్యక్తం చేసే విధంగా ఆ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ‘అమెరికాను మళ్లీ గొప్పగా మార్చాలని మేము నమ్ముతున్నాము’ అనే నినాదం, ‘సేవ్ అమెరికా’ పేరుతో కనిపిస్తున్న ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోగో డిజైన్ అందరిని ఆకర్షిస్తోంది. చదవండి: లండన్‌లో బ్లింకెన్‌తో జై శంకర్ భేటీ -
హైదరాబాద్: నటుడు సోనూసూద్ పేరుతో మోసాలు
-
ప్రముఖ నటుడు సోనూసూద్ పేరుతో భారీ మోసం..
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటుడు సోనూసూద్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన యువకుడిని సైబర్‌క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. సోనూసూద్ కార్పొరేట్ కార్యాలయం పేరుతో పెద్ద మొత్తంలో చీటింగ్ జరిగింది. సోనూసూద్ కార్పొరేట్ సంస్థ పేరుతో ఆశిష్‌కుమార్ అనే యువకుడు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయగా, ఆ అకౌంట్‌కు బాధితులు పెద్దఎత్తున నిధులు పంపించారు. సోనూసూద్ పేరు చెప్పి ఆశిష్ డబ్బులు వసూలు చేశాడు. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేశారు. ఆశిష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: భక్తుల అనుమతిపై టీటీడీ కీలక నిర్ణయం.. తెలంగాణలో ఐసెట్ నోటిఫికేషన్ విడుదల -
అమీర్ ఖాన్ నిర్ణయానికి అభిమానులు హర్టయ్యారు..
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ అభిమానులకు షాకిచ్చాడు. సోషల్‌మీడియా నుంచి అతను వైదొలుగుతున్నట్లు ట్వీట్ చేయడంతో అభిమానులతో పాటు యావత్ సినీ ప్రపంచం కుదుపునకు లోనైంది. అమీర్ తన ఆఖరి ట్వీట్లో.. "తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు(మార్చి 14) తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, తనపై ఇన్నేళు ప్రేమాభిమానాలను చూపించిన వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను, సోషల్ మీడియా వేదికగా ఇదే నా చివరి పోస్ట్, సోషల్ మీడియా నుంచి తాను తప్పుకుంటున్నానంటూ" పేర్కొన్నాడు. అయితే ఈ స్టార్ హీరోకు సంబంధించిన అప్డేట్స్ను స్వీయ నిర్మాణ సంస్థ అయిన అమీర్‌ఖాన్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఏకేపీ) అందించనున్నట్లు ఆయన తెలిపారు. ఏకేపీకి సంబంధించిన ట్విటర్ ఖాతా వివారలను (@akppl_official) అతని ఆఖరి ట్వీట్లో పోస్ట్ చేశాడు. pic.twitter.com/8zPwlB5uO0 — Aamir Khan (@aamir_khan) March 15, 2021 -
సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్!
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు నిరసనలపై ట్విటర్లో తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్న వారి అకౌంట్లు బ్లాకింగ్ వివాదాస్పదమైన నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సామాజిక మాధ్యమాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు. వ్యాపారం చేయడానికి వచ్చిన వారు ఎఫ్‌డీఐలు తెచ్చి, భారత చట్టాలను గౌరవించాలని చెప్పారు. ట్విట్టర్లో విద్వేషపూరిత ట్వీట్లు పెడుతున్న వారందరి ఖాతాలను నిలిపివేయాలని కేంద్రం ఆదేశించినప్పటికీ ఆ సంస్థ సంపూర్ణంగా ఆ పని నిర్వహించకపోవడంతో రవిశంకర్ సోషల్ మీడియా సంస్థలకు వార్నింగ్ ఇచ్చారు. గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ అమెరికాలోని క్యాపిటల్ భవనంపై దాడి సమయంలో ఒక రకంగా, ఎర్రకోటపై దాడి ఘటనలో మరో రకంగా ఎలా స్పందిస్తారని ట్విట్టర్‌ను సూటిగా ప్రశ్నించారు. క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సమయంలో పోలీసులకు అండగా ఉండి విద్వేషాన్ని వెళ్లగక్కేవారి ఖాతాలను సస్పెండ్ చేసిన సామాజిక మాధ్యమాలు ఎర్రకోట ఘటన సమయంలో అదే తరహాలో ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు తమ దగ్గర కుదరవని అన్నారు. ‘తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయొద్దు. మీరు ఇక్కడ వ్యాపారం కోసం వచ్చారు. అదే చేసుకోండి. చట్టాలకు కట్టుబడి వ్యవహరించండి. లేదంటే కఠిన చర్యలు తీసుకుంటాం’అని హెచ్చరించారు. -
ప్రియుడితో నటి బ్రేకప్: సోషల్ మీడియాకు గుడ్‌బై!
హాలీవుడ్ లవ్ బర్డ్స్ బెన్ అఫ్లెక్- అన డె అర్మాస్ ఈ మధ్యే ప్రేమ బంధానికి స్వస్తి పలికిన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు వారాలకు అన డె సోషల్ మీడియాకే గుడ్‌బై చెప్తూ ట్విటర్ అకౌంట్‌ను డిలీట్ చేసింది. ఆమె తీసుకున్న నిర్ణయంతో అన డె అభిమానులు విచారంలో మునిగిపోయారు. కాగా "డీప్ వాటర్" సినిమా షూటింగ్ సమయంలో బెన్, అన డె ప్రేమలో పడ్డారు. గతేడాది ఏప్రిల్‌లోనే ప్రేమ విషయాన్ని అన డె అధికారికంగా ధృవీకరించింది. అతడితో కలిసి పుట్టినరోజు జరుపుకున్న ఫొటోలను సైతం అభిమానులతో పంచుకుంది. తన క్వారంటైన్ సమయాన్ని కూడా లాస్ ఏంజెల్స్‌లోని బెన్ నివాసంలో అతడి పిల్లలతో గడిపింది. కానీ ఏడాది తిరిగేలోగా ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. (చదవండి: ‘టైటానిక్’ చూడాలంటేనే అసహ్యం వేస్తోంది: కేట్) బెన్ ఇప్పుడు అనతో డేటింగ్ చేయట్లేదని, వారి మధ్య బంధం బీటలు వారిందని వారి సన్నిహితులు మీడియాకు తెలిపారు. బెన్ తన పిల్లలతో కలిసి లాస్ ఏంజెల్స్‌లోనే ఉండాలనుకుంటున్నాడని, కానీ అన డె లాస్ ఏంజెల్స్‌కు రావాలనుకోవట్లేదని మీడియాకు తెలిపారు. విడిపోయినప్పటికీ వారు సంతోషంగానే ఉన్నారని పేర్కొన్నారు. కాగా ఆ మధ్య బెన్ అఫ్లెక్ ఇంట్లో నుంచి అన డె ఫొటోలను సిబ్బంది చెత్త డబ్బాలో పారేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట ప్రత్యక్షం కావడంతో సదరు నటి తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలోనే ఆమె సోషల్ మీడియా నుంచి తప్పుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. (చదవండి: ‘టెక్ట్స్ ఫర్ యూ’ షూటింగ్ పూర్తయిందోచ్!) A life-sized cardboard cutout of Ana de Armas from inside Ben Affleck’s residence was seen being thrown out into a trash can. (January 18, 2021) pic.twitter.com/4bxxDC97WZ — Ana de Armas Updates (@ArmasUpdates) January 19, 2021 -
ఫేస్బుక్, ట్విటర్‌కు కేంద్రం షాక్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ప్రధానంగా ఉన్న ఫేస్బుక్, ట్విటర్‌కు కేంద్ర ప్రభుత్వం సమన్లు జారీ చేసింది. దుర్వినియోగంపై సమన్లు జారీ చేసి ఈనెల 21వ తేదీన తమ ముందుకు హాజరుకావాలని ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు పంపించింది. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులు అందించిన ఆధారాలతో పార్లమెంటరీ కమిటీ ప్రతినిధులు ఆ సంస్థల ప్రతినిధులతో చర్చించనున్నారు. సోషల్ మీడియాను దుర్వినియోగం చేసిన అంశంపై మాట్లాడనున్నారు. డిజిటల్ రంగంలో పౌరుల హక్కుల రక్షణ, సోషల్ మీడియాతో పాటు ప్రధాన మీడియాలో ప్రధానంగా మహిళల భద్రత విషయమై ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇటీవల సోషల్ మీడియా సంస్థలపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఒక పార్టీకి.. కొందరు నాయకులకు మద్దతుగా సోషల్ మీడియా వ్యవహరిస్తోందని గుర్తించారు.దీనిపై కొన్ని నెలల కిందట పెద్ద వివాదమే నడిచిన విషయం తెలిసిందే. రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. మొత్తంగా సోషల్ మీడియా దుర్వినియోగంపై నియంత్రణ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఫేస్బుక్, ట్విటర్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సంస్థల ప్రతినిధులతో 21వ తేదీన సమావేశమై కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చే అవకాశం ఉంది. లేదా కొత్తగా నిబంధనలు విధించి వీటిని తప్పనిసరిగా అమలయ్యేలా నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల వాట్సాప్ వ్యక్తిగత వివరాల అప్డేట్పై రేగిన వివాదం నేపథ్యంలో ఈ భేటి ప్రాధాన్యం సంతరించుకుంది. (చదవండి: నిన్న ట్రంప్.. నేడు గ్రేసీ) -
ట్రంప్ ట్విట్టర్ బ్యాన్.. స్పందించిన డోర్సే
వాషింగ్టన్: గత వారం క్యాపిటల్ హిల్ భవనంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం ట్విట్టర్ ట్రంప్ అకౌంట్‌ని శాశ్వతంగా బ్యాన్ చేసింది. మరోసారి ఇలాంటి విధ్వంసకర చర్యలు జరగకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ని బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే ట్రంప్ అకౌంట్ బ్యాన్పై స్పందించారు. ఈ నిర్ణయం సరైనదే కానీ ఇందుకు తానేం గర్వపడటం లేదని.. పైగా ఇలాంటి చర్యలతో మాట్లాడే స్వేచ్ఛను హరించినట్లే అని అభిప్రాయపడ్డారు. ‘స్పష్టమైన మినహాయింపులు ఉన్నప్పటికీ.. చివరకు నిషేధం విధించాల్సి వచ్చింది అంటే మేం ఆరోగ్యకరమైన సంభాషణను ప్రోత్సహించడంలో విఫలమయ్యామని నేను భావిస్తున్నాను అన్నారు’ డోర్సే. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్స్ చేశారు. (చదవండి: ట్రంప్ బ్యాన్ : ట్విటర్ నష్టం ఎంతో తెలుసా? ) ‘ఆన్లైన్ ప్రసంగం వల్ల ఆఫ్‌లైన్‌లో హానీ కలగడం అనేది వాస్తవం. అందువల్ల బ్యాన్ విధించడం కరెక్టే. కానీ అది ప్రజా సంభాషణని విచ్ఛిన్నం చేస్తుంది. విభజన, స్పష్టత, విముక్తి, అభ్యాసం సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి.. ఇలాంటి ముందస్తు చర్యలు ప్రమాదకరమైనవని నేను భావిస్తున్నాను’ అన్నారు డోర్సే. అంతేకాక ఇలాంటి చర్యల వల్ల ఒపెన్ ఇంటర్నెట్ ఉద్దేశం, ప్రయోజనాలు దెబ్బతింటాయని డోర్సే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్‌పై నిషేధం విధించడాన్ని పలువురు రిపబ్లికన్లు తప్పు పట్టారు. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా వీరి జాబితాలో ఉన్నారు. ఈ మేరకు మెర్కెల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులను శాసనసభ సభ్యులు నిర్ణయించాలి తప్ప ప్రైవేటు సంస్థలు కాదు’ అన్నారు మెర్కెల్. (చదవండి: అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్) I do not celebrate or feel pride in our having to ban @realDonaldTrump from Twitter, or how we got here. After a clear warning we’d take this action, we made a decision with the best information we had based on threats to physical safety both on and off Twitter. Was this correct? — jack (@jack) January 14, 2021 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని సవాలు చేస్తూ ట్రంప్ పదేపదే నిరాధారమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారం రోజుల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు కాంగ్రెస్ సమావేశం అయ్యింది. ఇదే సమయంలో ట్రంప్ మద్దతుదారలు క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ట్రంప్ అభిశంసనను ఎదుర్కొన్నారు. ఇక అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. -
ట్రంప్ నోరు మూయించిన తెలుగమ్మాయి
ఆయన డొనాల్డ్ ట్రంప్.. అగ్రరాజ్యానికి అధినేత ఏమైనా అనగలడు.. ట్విటర్లో మరీనూ... ఓడినా మనదే గెలుపన్నాడు.. ఏదేదో ట్వీట్ చేశాడు.. అభిమానులు ఇంకో అడుగు ముందుకేశారు.. క్యాపిటల్ హిల్‌పై ఏకంగా దాడికి దిగారు.. సరిగ్గా ఈ సమయంలోనే ‘పిట్ట’ పులి అయింది.. ట్రంపరితనానికి తాళం వేసింది. ఆయన మాటలు ప్రపంచానికి వినపడకుండా చేయడంలో కీలకపాత్ర వహించిన విజయ గద్దె మన తెలుగు అమ్మాయి.. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతురాలిగా ఇన్‌స్టయిల్ మ్యాగజీన్ విజయను ఎంపిక చేసింది... ట్రంప్ ఖాతాను మూయించిన విజయ గురించి... విజయ గద్దె... ఇప్పుడు ఈ పేరు... పెద్ద పెద్ద అధికారుల గుండెలను పరుగులు పెట్టిస్తోంది.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మక పదవిగా పేరు పొందిన అమెరికన్ ప్రెసిడెంట్ కాళ్ల కింద భూమిని కుదిపేసింది విజయ. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ ఖాతాను విజయవంతంగా అడ్డుకున్నారు విజయ. ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు... అసలు ట్విటర్ అనే మాట ట్రంప్ నోటిలో నుంచి వినపడకుండా చేసేశారు. జనవరి 8, 2021న ‘డొనాల్డ్ ట్రంప్ ట్విటర్’కు తలుపులు వేసి, తాళం పెట్టేశారు విజయ. ఇలా ఒక ప్రధాన అధికారి అధికారాలకు తాళం వేయటం ప్రపంచ చరిత్రలో బహుశ ఇదే మొదటిసారేమో అనుకుంటున్నారు. దీనితో అమెరికా అధ్యక్షుడి సోషల్ మీడియా గోడ బీటలు వారింది. ట్విటర్ కంపెనీ... న్యాయ, సిద్ధాంత, ట్రస్ట్, రక్షణ (పి.ఆర్. ఎగ్జిక్యూటివ్) విషయాలకు అధికారిగా ఉన్న విజయ గద్దె తన చేతిలోని గొడ్డలితో ఆ గోడలను పగులగొట్టారు. ‘‘డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ అకౌంట్‌ను శాశ్వతంగా నిషేధిస్తున్నాం. లేకపోతే ఆయన తన ట్వీట్ల ద్వారా మరింత హింసకు పాల్పడేలా ఉన్నారు. అదేవిధంగా మా విధివిధానాలను కూడా ఇందులో వివరించాం. మా నిర్ణయాలను మీరంతా చదువుకోవచ్చు’’ అంటున్నారు విజయ. ఇంతటి ఘాటైన చర్యకు కారణం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ ట్విటర్లో చేస్తున్న వ్యాఖ్యలు... హింసకు దారితీస్తున్నాయి. అమెరికా మర్యాద ను బజారు పాలు చేస్తున్నాడని, ట్రంప్‌కి ఇలా జరగడమే మంచిదని అమెరికన్లు భావిస్తున్నారు. విజయ భారతీయురాలు, మన తెలుగువారు. బాల్యంలోనే వీరి కుటుంబం హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లిపోవటంతో, టెక్సాస్‌లోనే పెరిగారు విజయ. విజయ తండ్రి కెమికల్ ఇంజనీర్‌గా మెక్సికోలో ఉన్న గల్ఫ్ ఆయిల్ రిఫైనరీలో పనిచేస్తుండటం వల్ల...విజయ న్యూజెర్సీలో హైస్కూల్ చదువు పూర్తి చేశారు. కార్నెల్ విశ్వవిద్యాలయం, న్యూయార్క్ యూనివర్సిటీ లా స్కూల్లో చదువు పూర్తి చేశాక విజయ సుమారు పది సంవత్సరాల పాటు అనేక స్టార్టప్స్‌లో న్యాయ శాఖలో పనిచేశారు. 2011లో సోషల్ మీడియా కంపెనీలో చేరారు. కార్పొరేట్ లాయర్‌గా.. వీటి వెనుక ఉండే విధివిధానాల గురించి బాగా తెలుసుకున్నారు. అందువల్ల సుమారు ఒక దశాబ్దకాలంగా ట్విటర్‌ను సక్రమమైన పద్ధతిలో నడిపించటంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచం రాజకీయ నాయకులు విజయం సాధించటంలో ట్విటర్ ప్రముఖ పాత్ర పోషిస్తుండటంతో.. విజయకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది. ట్విటర్ సిఈవో జాక్ డార్సీతో విజయ గద్దె ట్విటర్ సిఈవో... జాక్ డార్నీ భారత దేశంలో పర్యటించినప్పుడు దలైలామాను కలిసిన సందర్భంలో విజయ కూడా వారిరువురి మధ్య నిలబడి ఫొటో తీయించుకున్నారు. అందరి చూపులూ విజయ మీదే నిలిచాయి. అమెరికన్ పబ్లికేషన్స్ కూడా విజయ గురించి ప్రస్తావించటం మొదలు పెట్టాయి. రాజకీయనాయకులు విజయ గురించి... ‘‘మనం మన జీవితంలో ఇంతటి శక్తివంతమైన సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ గురించి ఎన్నడూ విని ఉండం’’ అంటున్నారు. ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ను నిషేధిస్తూ విజయ ట్వీట్ ఇన్‌స్టయిల్ మ్యాగజీన్ అత్యంత ప్రభావితమైన మహిళల గురించి ఒక లిస్టు విడుదల చేసింది. 2020లో ‘ద బడాస్ 50’.. ‘ప్రపంచాన్ని మారుస్తున్న ఈ మహిళ ను కలవండి’ అంటూ విజయను పత్రిక ప్రశంసించింది. ట్విటర్లో అత్యంత శక్తిమంతురాలిగా ఉన్న విజయ గద్దె.. ‘ఏంజెల్స్’ సంస్థలో సహ వ్యవస్థాపకురాలిగా ఉంటున్నారు. ఈ సంస్థ ద్వారా... మూల నిధులు సేకరించి, స్టార్టప్‌లకు పురుషులతో పాటు మహిళలలకు కూడా సమానంగా సహాయం అందచేస్తూ, ఆ కంపెనీలు విజయవంతంగా నడిచేందుకు సహాయపడుతున్నారు. -
ట్విట్టర్ నుంచి ట్రంప్ అవుట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా నిషేధిస్తున్నట్టుగా సామాజిక మాధ్యమం ట్విట్టర్ ప్రకటించింది. ఒక దేశాధినేత అకౌంట్‌ని శాశ్వతంగా తొలగించడం ఇదే తొలిసారి. అమెరికా క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడికి దిగిన రెండు రోజుల తర్వాత ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజులుగా ట్విట్టర్ వేదికగా ట్రంప్ పెట్టే పోస్టులు హింసను ప్రేరేపించేలా ఉన్నాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్విట్టర్ తెలిపింది. ఇప్పటికే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ట్రంప్ అధ్యక్షుడి హోదాలో ఉన్నంతవరకు ఆయన అకౌంట్‌ని బ్లాక్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ‘కొద్ది రోజులుగా ట్రంప్ అకౌంట్ నుంచి వచ్చే ట్వీట్లను సమీక్షిస్తున్నాం. అవి ఎలా ప్రజల్లోకి వెళుతున్నాయి, ఏ విధంగా వాటిని అర్థం చేసుకునే అవకాశం ఉంది వంటి అంశాలను పరిశీలించాక అవి మరింతగా హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని తేలింది’అని ట్విట్టర్ తెలిపింది. చూస్తూ ఊరుకోం: ట్రంప్ ట్విట్టర్ తీసుకున్న ఈ అసాధారణ నిర్ణయం తాను ఊహించిందేనని ట్రంప్ అన్నారు. ఈ విషయంలో తాను కానీ, తన మద్దతుదారులు కానీ చూస్తూ మౌనంగా ఊరుకోమని హెచ్చరించారు. తన అకౌంట్ నిషేధించాక ఆయన అమెరికా అధ్యక్షుడి హోదాలో అధికారిక ఖాతా ద్వారా వరస ట్వీట్లు చేశారు. ‘ట్విట్టర్లో స్వేచ్ఛగా భావాలను ప్రకటించే అవకాశం లేదు. రాడికల్ వామపక్ష భావజాలం కలిగిన వారినే ఆ సంస్థ ప్రోత్సహిస్తూ ఉంటుంది. వాక్ స్వాతంత్య్రాన్ని ఎప్పుడూ అడ్డుకుంటూ ఉంటుంది. అందుకే ఈ సారి కొత్త సామాజిక మాధ్యమం ద్వారా వస్తాను. వివిధ వెబ్సైట్లతో సంప్రదింపులు జరుపుతున్నాను’’అని ట్రంప్ తన ట్వీట్లలో పేర్కొన్నారు. ట్విట్టర్ చర్య నమ్మశక్యంగా లేదని ఇండియన్ అమెరికన్ పొలిటీషియన్ నిక్కీ హేలీ అన్నారు. 11న అభిశంసన? అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై అభిశంసనకు రంగం సిద్ధం అవుతోంది. క్యాపిటల్ హిల్‌పై దాడి ఘటన నేపథ్యంలో రాజీనామా చేయా లంటూ వెల్లువెత్తుతున్న డిమాండ్లను ట్రంప్ పెడచెవిన పెడుతుండటంపై డెమోక్రాట్లు ఆగ్రహంతో ఉన్నారు. త్వరలో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండగా అంతకు ముందే అభిశంసనతో ట్రంప్‌ను సాగనంపే ప్రయత్నాలను వేగిరం చేశారు. తిరుగు బాటును ప్రేరేపించారనే కారణంతో చేపట్టే అభిశంసనకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు మీడియా కథనాలు వెలువడుతున్నాయి. హౌస్‌లో అభిశంసన తీర్మానాలను ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు సోమవారం ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సీఎన్ఎన్ వర్గాలు తెలిపాయి. -
ట్రంప్‌నకు షాక్.. ట్విటర్ శాశ్వత సస్పెండ్
న్యూయార్క్: ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ తాజాగా పేర్కొంది. రెండు రోజుల క్రితం క్యాపిటల్ బిల్డింగ్‌పై జరిగిన హింసాత్మక దాడులను ప్రోత్సహించే విధంగా ఇటీవల ట్రంప్ చేసిన ట్వీట్స్ నేపథ్యంలో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు ట్విటర్ వివరణ ఇచ్చింది. దీనికితోడు మరోసారి హింసాత్మక అల్లర్లకు మద్దతిచ్చే రిస్కులున్నందున ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా బంద్ చేసేందుకు నిర్ణయించినట్లు తెలియజేసింది. అంతేకాకుండా కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్ ప్రమాణ స్వీకారం తదితర సమయాలలోనూ ఆన్లైన్ ద్వారా మరోసారి నిరసనలను ప్రోత్సహించే అవకాశముండటంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు సుదీర్ఘ వివరణను ఇచ్చింది. చాలకాలంగా ట్రంప్‌సహా వివిధ ప్రపంచ నేతలకు నిబంధనలలో కొంతమేర మినహాయింపులను అమలు చేస్తున్నట్లు ట్విటర్ ఈ సందర్భంగా వెల్లడించింది. వ్యక్తిగత దూషణలు(దాడులు), హేట్ స్పీచ్ తదితర విషయాలలో ప్రపంచ నేతలకు నిబంధనలనుంచి మినహాయింపులను ఇస్తున్నట్లు తెలియజేసింది. (హెచ్1 బీ వీసాలకు నేడు తీపి కబురు) పెరుగుతున్న ఒత్తిడి క్యాపిటల్ బిల్డింగ్ వద్ద బుధవారం జరిగిన హింసాత్మక ఘటనల తదుపరి సోషల్ మీడియా దిగ్గజాలపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఓవైపు ఫేస్బుక్ తాత్కాలికంగా ట్రంప్ ఖాతాను ఈ నెల 20వరకూ నిలిపివేయగా.. ట్విటర్ సైతం తొలుత 12 గంటలపాటు ట్రంప్ ఖాతాకు చెక్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజా ఒత్తిళ్ల నేపథ్యంలో ట్రంప్ ఖాతాను ట్విటర్ శాశ్వతంగా నిషేధించేందుకు నిర్ణయించగా.. ఫేస్బుక్ సైతం ఇదే బాటలో నడిచే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ వీడియో ద్వారా తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయడం ద్వారా క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడులకు ట్రంప్ ఉసిగొల్పారంటూ సోషల్ మీడియా దిగ్గజాలు పేర్కొన్నాయి. (హెచ్1 బీ వీసాలకు మళ్లీ ట్రంప్ షాక్) నిబంధనలు పాటించాలి ప్రపంచ నేతల ఖాతాల విషయంలో కొంతమేర మినహాయింపులను అమలు చేస్తున్నప్పటికీ నిబంధనల హద్దులను పూర్తిగా దాటితే చర్యలు తప్పవని ట్విటర్ తాజాగా స్పష్టం చేసింది. ఎవరైనాగానీ ట్విటర్‌ను హింసకు వినియోగించుకోవడాన్ని సమర్థించబోమని తెలియజేసింది. ట్విటర్‌కు సుమారు 8.9 కోట్లమంది ఫాలోవర్స్ ఉన్నట్లు తెలియజేసింది. కాగా.. ట్రంప్‌నకు మద్దితిచ్చే మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్, అటార్నీ సిడ్నీ పోవెల్ ఖాతాలనూ శాశ్వతంగా నిషేధించినట్లు ట్విటర్ తాజాగా వెల్లడించింది. (ట్రంప్ ఫేస్బుక్, ట్విటర్ ఖాతాలు బంద్) -
ట్రంప్ ఫేస్బుక్, ట్విటర్ ఖాతాలు బంద్
వాషింగ్టన్: నిబంధనలు ఉల్లంఘిస్తూ పోస్టులు పెట్టినందుకు ఫేస్బుక్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఖాతాను 24 గంటలపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ట్విటర్ సైతం ట్రంప్ చేసిన మూడు ట్వీట్లను తొలగించమని కోరుతూ తాత్కాలికంగా ఖాతాను నిలిపివేసింది. అధ్యక్ష ఎన్నికలపైనా, వాషింగ్టన్ డీసీలో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల పట్ల ఆధారరహిత వ్యాఖ్యలు చేయడంతో ఫేస్బుక్, ట్విటర్ ట్రంప్ ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలియజేశాయి. రెండు రకాల పాలసీ నిబంధనలకు విరుద్ధంగా ట్రంప్ పోస్టులు పెట్టడంతో ఖాతాకు తాత్కాలికంగా చెక్ పెట్టినట్లు ఫేస్బుక్ పేర్కొంది. ఇదే విధంగా కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్‌ను నియామకాన్ని నిలిపివేయమంటూ ట్రంప్ మద్దతుదారులు కాంగ్రెస్‌పై నిరసనలను వ్యక్తం చేస్తున్న అంశంపై ట్విటర్ 12 గంటలపాటు ఖాతాను నిలిపివేస్తున్నట్లు తెలియజేసింది. ఈ అంశాలపై చేసిన మూడు ట్వీట్లను తొలగించవలసిందిగా సూచించింది. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఈ ట్వీట్లను తొలగించకపోతే.. ట్రంప్ ఖాతా నిలిపివేత కొనసాగుతుందని ట్విటర్ పేర్కొంది. (చైనా పేమెంట్ యాప్‌లకు ట్రంప్ చెక్) -
నేను సూపర్ హ్యాపీ: నటి వరలక్ష్మి
చెన్నై: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో దక్షిణాదికి చెందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. అయితే తాజాగా వరలక్ష్మి ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు డిసెంబర్ 2వ తేదీన హ్యాకింగ్ బారిన పడ్డాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో తన పేరు మీద ఏమైనా పోస్టులు వస్తే జాగ్రత్తగా ఉండాలని అభిమానుల్ని కోరారు. అయితే తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ ట్విటర్ ఖాతా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ట్విటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: ‘తలైవి’ వర్ధంతి : కంగనా స్టన్నింగ్ స్టిల్స్) మళ్లీ ఇంత త్వరగా రీ ఎంట్రీ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనం సోషల్ మీడియాలో బతుకుతున్నాం, ఇక్కడ ఏమైనా జరగొచ్చు కానీ అదంతా నిజం కాదని, మనం చూసిన ప్రతీదాన్ని నమ్మకూడదని ట్విటర్లో పేర్కొన్నారు. వరలక్ష్మి ప్రస్తుతం తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్గా, విలన్ క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ సినిమాలో వరలక్ష్మి నటించనున్నారు. Thank you to @Twitter for having retrieving my account..!!! Super happy to be back.. — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) December 4, 2020 -
ప్రిన్స్ మహేష్‌బాబు @60 లక్షలు
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' చిత్రంతో బిజీగా ఉన్నాడు. తాజాగా మహేష్ 6 మిలియన్ల క్లబ్లో చేరాడు. ఎందులో అనుకుంటున్నారా... ప్రస్తుతం సోషల్ మీడియాలో అత్యంత వేగంగా ప్రాచుర్యం పొందిన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 6 మిలియన్ ఫాలోవర్స్‌ను పొందాడు. ఇప్పటికే టాలీవుడ్ అందగాడు అనే పేరున్న మహేష్ సోషల్ మీడియా ద్వారా ఇతర భాషల అభిమానులకు చేరవయ్యాడు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో మాత్రమే కాదు ప్రిన్స్ ట్విటర్లోనూ తన హవా చాటుకున్నాడు. ట్విట్టర్లో 10.9 మిలియన్ల ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు. ట్విటర్లో దక్షిణాది నటులకు అంత ఎక్కువ ఫాలోవర్స్ లేరు. కరోనా ప్రభావంతో చిత్ర సీమకు సంబంధించి ఎటువంటి సమాచారమైన ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఒక రకంగా అభిమానులకు ఇది తమ అభిమాన నటులను బాగా చేరువ చేస్తుంది. తాజాగా తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్‌తో మహేశ్ ఓ సినిమాకు సంతకం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరొక సంవత్సర కాలం తరువాత ఈ చిత్రం పట్టాలెక్కనున్నట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'స్పైడర్' చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో మహానటి ఫేం కీర్తి సురేష్ నటిస్తుంది. ఇంతకు ముందు మహేష్ సరసన కీర్తి నటించలేదు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదే మొదటి చిత్రం కావడంతో అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం సమకూర్చనున్నారు. https://instagram.com/urstrulymahesh?igshid=10zqpfxawvdul -
నకిలీ ట్విటర్ ఖాతా, బాలీవుడ్ నటి ఫిర్యాదు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి రవీనా టాండన్ నకిలీ సోషల్ మీడియా ఖాతా ఇబ్బందుల్లో పడ్డారు. దీంతో ఆమె ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పేరు మీద నకిలీ ట్విట్టర్ ప్రొఫైల్‌ను సృష్టించిన సైబర్ నేరగాడు, ముంబై పోలీసులను, పోలీస్ బాస్ ను అపఖ్యాతి పాలు చేశారని అరోపిస్తూ ఆమె ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. దీంతో సదరు ట్విటర్ ఖాతాను అధికారికంగా బ్లాక్ చేశారు. ముంబై పోలీసులను, ఉన్నతాధికారి పరంవీర్ సింగ్‌ను అపఖ్యాతిపాలు చేసేలా, మార్ఫింగ్ చిత్రాలతో రవీనా ట్విటర్ లో పోస్ట్ చేసిన వీడియో కలకలం రేపింది. దీంతో అప్రత్తమైన నటి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ముంబై పోలీసుల సైబర్ సెల్ చర్యలకు దిగింది. ఈ సందర్భంగాపోలీసు అధికారి మాట్లాడుతూ నిందితుడు రవీనా పేరుతో నకిలీ ట్విటర్ ఖాతాతో ముంబై పోలీస్ చీఫ్ సింగ్ పై ఒక వీడియోను సృష్టించి, అభ్యంతరకరమైన కంటెంట్‌ను పోస్ట్ చేశాడని తెలిపారు. అలాగే ఆమె ట్విట్టర్ పోస్టుల ద్వారా మరాఠీ భాషను, మరాఠీ మాట్లాడేవారిని కించపరిచాడని పేర్కొన్నారు. సమాచార సాంకేతిక చట్టం ప్రకారం కేసు నమోదు చేసినట్టు తెలిపారు. -
చైనా వైరాలిజిస్ట్కు షాక్
బీజింగ్: కరోనా వైరస్ మహమ్మారి చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వూహాన్ ల్యాబ్‌లో తయారైందని హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డా. లి మెంగ్ యాన్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి తన దగ్గర ఆధారాలున్నాయని యాన్ తెలిపారు. ఈ క్రమంలో ట్విట్టర్ ఆమెకు షాక్ ఇచ్చింది. తన అకౌంట్‌ను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. యాన్ ఖాతాను మంగళవారం తొలగించినట్లు డైలీ మెయిల్లోని ఒక నివేదిక తెలిపింది. ఆమె ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేయబడింది అనే మెసేజ్ వచ్చింది. నిబంధనలను ఉల్లంఘించే వారి ఖాతాలను ట్విట్టర్ నిలిపివేస్తుంది. అయితే యాన్ అకౌంట్‌ని సస్పెండ్ చేయడంపై ట్విట్టర్ ఇంకా స్పందించలేదు. కరోనా వైరస్‌కు సంబంధించి అవాస్తవ సమాచార వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని మైక్రోబ్లాగింగ్ సైట్ మే నెలలో హెచ్చరికలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం యాన్ ఉల్లంఘించిన ట్విట్టర్ నియమాలు ఏంటనే దాని గురించి స్పష్టత లేదు. (కరోనా: ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం) హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరైన లి మెంగ్ కరోనా వైరస్ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమని మొదటినుంచి చెబుతూనే ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసునని ఆమె అన్నారు. పలు భద్రతా కారణాల దృష్ట్యా ఆమె హాంకాంగ్ నుంచి అమెరికాకు తరలివచ్చేశారు. సెప్టెంబర్ 11న ఓ షోలో ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌పై చేసిన పరిశోధనలు.. తాను ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పంచుకున్నారు. -
ప్రధాని ట్విట్టర్ ఖాతా హ్యాక్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కి అనుసంధానంగా ఉన్న ట్విట్టర్ ఖాతా గురువారం హ్యాకయింది. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు పంపించాలంటూ మోదీ అకౌంట్ నుంచి ఆయన ఫాలోవర్లకు మెసేజ్‌లు వెళ్లాయి. ‘‘కరోనా కట్టడికి జాతీయ సహాయ నిధికి క్రిప్టో కరెన్సీ ద్వారా విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా. భారత్‌లో డిజిటల్ కరెన్సీ చెలామణిలోకి వచ్చింది’’అంటూ ప్రధాని ఖాతా నుంచి హ్యాకర్లు ట్వీట్ చేశారు. ఆ తర్వాత ప్రధాని ఖాతా నుంచి ‘‘ఈ అకౌంట్‌ని జాన్ విక్ హ్యాక్ చేసింది. అయితే పేటీఎం మాల్ని మాత్రం మేము హ్యాక్ చెయ్యలేదు’’అని సైబర్ నేరగాళ్లు మరో మెసేజ్ పంపారు. గత నెల 30న పేటీఎం డేటా తస్కరణ జాన్ విక్ పనేనంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాము ఆ పని చెయ్యలేదని నిరూపించడానికి ప్రధాని ఖాతాను హ్యాక్ చేసినట్టుగా నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ట్విట్టర్ సంస్థ రంగంలోకి దిగి ఆ మెసేజ్‌లు తొలగించింది. ప్రధాని ఖాతాను పునరుద్ధరించి అన్ని రకాలుగా భద్రతను కల్పించింది. దర్యాప్తు ముమ్మరం చేసింది. మిగిలిన అకౌంట్లు భద్రం ప్రధాని ట్విటర్ ఖాతా హ్యాకయిందని తెలిసిన వెంటనే అన్ని చర్యలు చేపట్టామని, ఆయన మిగిలిన ఖాతాలకు వచ్చిన ముప్పేమీ లేదని ట్విట్టర్ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. @narendramodi_in అని ఉండే ఈ అకౌంట్‌కి 25 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇప్పటివరకు 37 వేల ట్వీట్లు చేశారు. ఆగస్టు 31న మన్‌కీ బాత్ కార్యక్రమానికి సంబంధించిన ట్వీట్ ఆఖరిగా ట్వీట్ చేశారు. మోదీ ప్రసంగాలకు సంబంధించిన సమాచారం అంతా ఈ ఖాతా నుంచే ట్వీట్లు చేస్తారు. అయితే 6.1 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్న ఆయన మరో ఖాతాకి ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు. గత జూలైలో బరాక్ ఒబామా, జో బైడెన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల ఖాతాలు కూడా హ్యాక్ అవడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్!
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని ట్విటర్ ప్రతినిధులు ధ్రువీకరించారు. భారత ప్రధాన మంత్రి మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్ గురువారం వేకువ జామున హ్యాక్ అయిందని, ఈ ఘటనపై విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. ఈ ఖాతాను పునరుద్ధరించేందుకు అన్ని చర్యలు చేపట్టిన్లు వెల్లడించారు. ఇతర ఖాతాలపై ఇలాంటి ప్రభావం ఉంటుందని భావించడం లేదని చెప్పుకొచ్చారు. కాగా కోవిడ్-19 నేపథ్యంలో పీఎం నేషనల్ ఫండ్ ద్వారా క్రిప్టోకరెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వాలని ఆయన కోరినట్లుగా నేరగాళ్లు వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఈ ఖాతాను జాన్ విక్ (hckindia@tutanota.com) హ్యాక్ చేసింది. మేం పేటీఎం మాల్‌ను హ్యాక్ చేయలేదు’’ అని పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ వ్యక్తిగత వెబ్‌సైట్‌కు అనుసంధానంగా ఉన్న narendramodi_in హ్యాండిల్‌కు 2.5 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ అకౌంట్ నుంచి మోదీ ఇప్పటి వరకు సుమారుగా 37 వేల ట్వీట్లు చేశారు. చివరిసారిగా ఆగష్టు 31న మన్ కీ బాత్ గురించి ఇందులో ప్రస్తావించారు. ఇక ట్విటర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలైలో ఎంతో మంది ప్రముఖుల ఖాతాలు హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. (చదవండి: అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్ ) అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రస్తుతం డెమొక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన జో బిడెన్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ప్రముఖ బిలియనీర్ వారెన్ బఫెట్ తదితరుల ఖాతాలను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. వీరితో పాటు అనేక వ్యాపార సంస్థల పేరిట ట్వీట్లు పెట్టిన హ్యాకర్లు.. డిజిటల్ కరెన్సీ(బిట్‌కాయిన్) స్కామ్‌కు విఫలయత్నం చేశారు. కాగా గతేడాది ఆగష్టులో ట్విటర్ సీఈవో, సహ వ్యవస్థపాకుడు జాక్ డోర్సీ ఖాతాను హ్యాక్ చేసిన నేరగాళ్లు వివాదాస్పద ట్వీట్లతో బెంబేలెత్తించిన విషయం తెలిసిందే. -
వాటికి చెక్ : టిక్‌టాక్ కొత్త ఎత్తుగడ
శాన్ఫ్రాన్సిస్కో : ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాడికి వ్యతిరేకంగా రక్షణ మార్గాలను టిక్‌టాక్ అన్వేషిస్తోంది. ఈ క్రమంలో తన ప్లాట్‌ఫామ్ భద్రతపై తప్పుడు వార్తలు, పుకార్లను అడ్డుకునేందుకు ఒక సమాచార కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అలాగే డేటా సెక్యూరిటీపై సందేహాలను తీర్చేందుకు ఒక ట్విటర్ ఖాతాను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. (టిక్‌టాక్ : ట్రంప్ మరో ట్విస్టు) అమెరికా ప్రభుత్వం వేసిన ఆరోపణలన్నింటినీ ఖండించిన టిక్‌టాక్ ఒక వెబ్సైట్ (www.tiktokus.info)ను, @tiktok_comms పేరుతో ట్విటర్ అకౌంట్ ను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా టిక్‌టాక్ సంబంధించిన వాస్తవ వార్తలను అందించేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే సంబంధిత వార్తలకు వెంటనే స్పందించే ఉద్దేశ్యంతో వీటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. అంతేకాదు టిక్‌టాక్ నిషేధానికి సంబంధించిన ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశాన్ని యూజర్లకు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. కుటుంబ సభ్యులుగా, వినియోగదారులు, క్రియేటర్స్, భాగస్వాములుగా వైట్ హౌస్ సహా మీరు ఎన్నుకున్న ప్రతినిధులకు మీ అభిప్రాయాలను తెలియజేసే హక్కు ఉందని టిక్‌టాక్ ప్రకటించింది. అలాగే చైనా ప్రభుత్వంతో వ్యక్తిగత డేటాను పంచుకుందున్న ఆరోపణలను మరోసారి తీవ్రంగా ఖండించింది. చైనాలో టిక్‌టాక్ అందుబాటులో లేదు. అక్కడి ప్రభుత్వానికి అమెరికా వినియోగదారుల డేటాను ఎప్పుడూ అందించలేదు.. అందించదు అని టిక్‌టాక్ స్పష్టం చేసింది. (రిలయన్స్ చేతికి టిక్‌టాక్?) కాగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యూజర్ల ఆదరణను సొంతం చేసుకున్న టిక్‌టాక్ ఇటీవలి కాలంలో అటు అమెరికాలోను ఇటు ఇండియాలోను భారీ ఎదురు దెబ్బ తగిలింది. కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడంలో వైఫల్యం, భారత-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్‌తో సహా 59 చైనా యాప్‌లను కేంద్రం నిషేధించింది. ట్రంప్ సర్కార్ కూడా ఇదే బాటలో పయనిస్తోంది. అమెరికాలో టిక్‌టాక్ భవితవ్యాన్ని తేల్చేందుకు ట్రంప్ 90 రోజుల గడువు విధించిన సంగతి తెలిసిందే. -
సోషల్ మీడియాలో మోదీ హవా
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన ఘనత సాధించారు. మోదీ దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రధాని మోదీ చురుకుగా ఉంటూ రాజకీయ, పాలనాపరమైన విషయాలను ప్రజలతో పంచుకుంటారు. తాజాగా ప్రధాని మోదీ తన ట్విటర్ ఖాతాలో 60 మిలియన్ల (6కోట్లు) ఫాలోవర్స్ మైలు రాయిని చేరుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న రాజకీయ నాయకుల్లో మోదీ మూడో స్థానంలో నిలిచారు. 120 మిలియన్ ఫాలోవర్స్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో నిలవగా, 83 మిలియన్ ఫాలోవర్స్‌తో ప్రస్తుత యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో ఉన్నారు. (ఖాతాల హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వండి) మోదీ 2009లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ట్విటర్ ఖాతాను ప్రారంభిచారు. 2014లో మోదీ ప్రధాని పదవి చేపట్టడంతో ట్విటర్లో ఆయన పాపులారిటీ అధికమవటంతో పాటు ఫాలోవర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. ఇక భారతదేశంలో ఏ ఇతర రాజకీయ నాయుకుడికి లేని ఫాలోవర్స్‌ను మోదీ దక్కించుకున్నారు. దాంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం అధికారిక ట్విట్టర్ ఖాతాను కూడా 37 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. అద్భుతమైన ప్రసంగ నైపుణ్యం కలిగిన మోదీ తన ట్విటర్ ఖాతాలో చురుకుగా ఉంటూ.. క్రమం తప్పకుండా ఆయన చేసిన ప్రసంగాలు, సందర్శించిన ప్రదేశాలు, కలిసుకున్న జాతీయ, అంతర్జాతీయ వ్యక్తుల సమాచారాన్ని ట్విటర్లో పంచుకుంటారన్న విషయం తెలిసిందే. (‘చైనా ట్విటర్’ అకౌంట్ మూసేసిన ప్రధాని ) -
ఆలీ పేరిట నకిలీ ట్విట్టర్ అకౌంట్
-
ఆలీ పేరిట నకిలీ ట్విటర్ అకౌంట్
సాక్షి, హైదరాబాద్: తన పేరిట నకిలీ అఫిషియల్ ట్విటర్ అకౌంట్ నడుస్తోందని తెలుసుకుని సినీ నటుడు ఆలీ షాక్ తిన్నారు. వెంటనే సైబరాబాద్‌లోని క్రైమ్ డిపార్టుమెంటు డిప్యూటీ కమిషనర్ రోహిణి ప్రియదర్శినికి శనివారం ఫిర్యాదు చేశారు. (14 వేల మద్యం బాటిళ్లు ధ్వంసం) 2017 నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఆలీ పేరిట అధికారిక ట్విటర్ అకౌంట్‌ను నడుపుతున్నాడు. సందర్భానుసారంగా వీడియోలు, మెసేజ్‌లు పెడుతున్నాడు. పలువురు నటీనటులకు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెట్టాడు. ఆ అకౌంట్ తనది కాదని, తన పేరిట అకౌంట్ రన్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆలీ తన ఫిర్యాదులో కోరారు. (అమెజాన్ ఆపిల్ డేస్ సేల్ : తగ్గింపు ధరలు) -
అమెరికాలో హ్యాకింగ్ కలకలం..
వాషింగ్టన్ : అగ్రరాజ్యం అమెరికాలో హై ప్రొఫైల్ ట్విటర్ అకౌంట్లే లక్ష్యంగా హ్యాకర్లు రెచ్చిపోయారు. వారి ట్విటర్ అకౌంట్లను హ్యాక్ చేసి బిట్‌కాయిన్ అడ్రస్‌కి వెయ్యి డాలర్లు పంపిస్తే, వెంటనే తిరిగి రెట్టింపు సొమ్ము పంపిస్తామంటూ మోసపూరిత ట్వీట్లు చేశారు. బ్లూ టిక్ ఉన్న అకౌంట్ల నుంచి ఈ ట్వీట్లు రావడంతో నిజమేననుకొని వారి అభిమానులు కొందరు భారీ మొత్తంలో హ్యాకర్లకు డబ్బులు కూడా పంపించినట్టు తెలుస్తోంది. హ్యాకింగ్‌కు గురైన అకౌంట్లలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్, అపర కుబేరులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, నటి కిమ్ కర్ధాషియన్లతోపాటూ పలువురు ప్రముఖులు ఉన్నారు. (అమెరికాలో విదేశీ విద్యార్థులకు ఊరట) హ్యాకింగ్ ఘటన తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే పేర్కొన్నారు. నష్టాన్ని నివారించే పనిలో ఉన్నామని, హ్యాకింగ్‌కు పాల్పడింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని ట్వీట్ చేశారు. (కరోనా: అమెరికాలో రికార్డు స్థాయిలో కేసులు) Tough day for us at Twitter. We all feel terrible this happened. We’re diagnosing and will share everything we can when we have a more complete understanding of exactly what happened. 💙 to our teammates working hard to make this right. — jack (@jack) July 16, 2020 -
ట్రోల్స్‌పై ఘాటుగా స్పందించిన హీరోయిన్
ముంబై: తనపై విపరీతంగా ట్రోల్స్‌పై చేస్తున్న నెటిజన్లపై తానే గెలిచానని హీరోయిన్ సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత వారం తన ట్విటర్ ఖాతాను డియాక్టివేట్ చేసినప్పటి నుంచి తనని మరింత ఎగతాలి చేస్తూ నెటిజన్లు ఫన్నీ మిమ్స్ క్రియోట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీనిపై సోనాక్షి స్పందిస్తూ కేవలం ట్విటర్ నుంచి మాత్రమే తాను నిష్క్రమించానని.. ఇవి నిజమైన ట్రోల్స్ కాదంటూ నెటిజన్లకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు షేర్ చేస్తూ.. ‘కొంతమంది తాము ఏదో గెలిచినట్లు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. సరే నేను దానికి సంతోషిస్తాను. మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేస్తున్నారు. ఇలా చేయడం ద్వారా ఎవరికి లాభం లేదు, నష్టం కూడా లేదు. ఇక మీరు ప్రత్యేక్షంగా చేసే విమర్శలు, అవమానాలకు కేంద్రమైన నా ట్విటర్ అకౌంట్ తీసేశాను. నన్ను, నా కుటుంబాన్ని, స్నేహితులను బాధ పెట్టాలనుకున్నారు. కానీ ఇకపై మీకు ఆ అవకాశం లేకుండా చేశాను. కాబట్టి ఇక్కడ గెలిచింది నేనే’ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. (ట్విటర్ అకౌంట్ డియాక్టివేట్ చేసిన హీరోయిన్!) తాను తన ట్విటర్ నుంచి వైదొలుగుతున్నట్లు గత వారం సొనాక్షి ప్రకటించారు. ‘‘తమ ఆత్మవిశ్వాసాన్ని కాపాడుకోవడానికి తెలివైన వారు మొదటగా వేసే అడుగు నెగిటివిటికీ దూరంగా ఉండటం. కాబట్టి నేను ట్విటర్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నాను. అందుకని నా ఖాతాను తొలగిస్తున్నాను. గుడ్ బై గాయ్స్. ఇక ప్రశాంతంగా ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు. (‘సోనాక్షిని కించపరిచే ఉద్దేశం నాకు లేదు’) View this post on Instagram How i got myself off twitter and away from the negativity 😂 Some people are celebrating like they won something... im happy for you, tumhe laga raha hai na... lagne do, kisi ko koi farak nahi padh raha. But lets face it, ive cut the direct source of insult and abuse in my life. Ive taken away YOUR power to be able to say whatever it is that you want to me, my family and my friends. Ive taken away that access you had to me, that i had given you so trustingly. So theres only one winner here. Me. Your negativity has never served me or my life, which is why it literally took a snap of a finger to get rid of a following of 16 million people which ive garnered over the last ten years. Just like that. And im better off for it. I wish all those haters and trolls lots of love and healing, or you can continue with the hate but please know it’ll NEVER reach me. Accha ab yeh chakkar mein i know the people who love me are caught up too... please know that your love and support is what has kept me going all this while, and it always will! And I request you all to keep spreading that love and light wherever you go and to as many people as you can. Because Love is the answer. Always ❤️ A post shared by Sonakshi Sinha (@aslisona) on Jun 21, 2020 at 8:11am PDT కాగా సుశాంత్ ఆత్మహత్యపై స్పందిస్తూ బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ బాలీవుడ్ పరిశ్రమలోనిప్రముఖులు, స్టార్‌కిడ్స్‌పై మండిపడుతూ ట్విటర్లో వీడియో షేర్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోనాక్షి స్పందిస్తూ..కొంత మంది సోదరభావంతో ఇతరుల మరణాలను కూడా ఫేమ్ కోసం వాడుకుంటున్నారు అంటూ కంగనాను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. అంతేగాక ఆభ్యంతరక వ్యాఖ్యలతో విమర్శలు చేయడంతో నెటిజన్లు సోనాక్షిపై విమర్శలు గుప్పిస్తూ ట్రోల్స్ చేయడం ప్రారంభించారు. ఇక అవి తారాస్థాయికి చేరడంతో తన ట్విటర్ ఖాతాను సోనాక్షి గత శనివారం తోలగించారు. (ఎంతగా ప్రాధేయపడ్డాడో పాపం సుశాంత్..) -
చైనా లింకులున్న ట్విటర్ అకౌంట్లు నిలిపివేత
లండన్: చైనా ప్రభుత్వానికి మద్దతుగా ట్వీట్లు చేస్తున్న, చైనాతో సంబంధమున్న ట్విటర్ ఖాతాలను ఆ సంస్థ నిలిపివేసింది. ఆయా ట్వీట్లలో చైనా ప్రభుత్వానికి మద్దతుగా వ్యాఖ్యలు ఉంటుండడంతో, ట్విటర్ సంస్థ చైనా ప్రభుత్వాన్ని సంప్రదించింది. అయితే, అవి తమవి కాదని వారు తెలపడంతో దాదాపు 23,750 ఖాతాలను నిలిపివేసినట్లు ట్విటర్ ప్రకటించింది. ఈ ఖాతాలు చేస్తున్న ట్వీట్లను రీట్వీట్ చేస్తున్న మరో 1,50,000 అకౌం ట్లను సైతం నిలిపివేసింది. చైనాలో ట్విటర్ సహా, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సర్వీసులపై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. -
మోదీ ట్విటర్ ఆన్‌ఫాలో.. వైట్‌హౌస్ వివరణ
వాషింగ్టన్ : కొన్ని వారాలుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ ఖాతాను ఫాలో అయిన వైట్‌హౌస్ తాజాగా ఆయనను ఆన్‌ఫాలో చేసిన సంగతి తెలిసిందే. ఇది కాస్త భారత్‌లో చర్చనీయాంశంగా మారింది. అమెరికా–భారత్‌ల మధ్య దెబ్బతిన్న బంధాలకు ఇదొక నిదర్శనమని పలువురు వ్యాఖ్యానించారు. అయితే ఇందుకు సంబంధించి బుధవారం వైట్‌హౌస్ వర్గాలు వివరణ ఇచ్చాయి. అమెరికా అధ్యక్షుడు పర్యటించే దేశాలకు చెందిన దేశాధినేతల అధికారిక ట్విటర్ ఖాతాలను వైట్‌హౌస్ అనుసరించడం సాధారణంగా జరుగుతుంటుందని తెలిపాయి. అధ్యక్షుడి పర్యటనకు మద్దతుగా.. వారి ట్విట్స్‌ను రీట్విట్ చేసేందుకు కొద్దికాలం పాటు మాత్రమే ఆ ఖాతాలను ఫాలో అవనున్నట్టు వెల్లడించాయి. ‘వైట్ హౌస్ ట్విటర్లో అమెరికా ప్రభుత్వ సీనియర్ ట్విటర్ అకౌంట్స్ అనుసరిస్తుంది. అధ్యక్షుడి విదేశీ పర్యటన సమయంలో మాత్రమే అందుకు.. అతిథ్య దేశానికి సంబంధించిన అకౌంట్లను కొద్దికాలం ఫాలో అవుతుంది’ అని వైట్‌హౌస్‌కు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. కాగా, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫిబ్రవరి చివరి వారంలో ఇండియా పర్యటనకు వచ్చిన సమయంలో వైట్‌హౌస్ అధికార ట్విటర్ అకౌంట్.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, భారత ప్రధాని కార్యాలయం, అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం, ఇండియాలోని అమెరికా దౌత్య కార్యాలయం, భారత్‌లో అమెరికా రాయబారి ట్విటర్ ఖాతాలను అనుసరించడం మొదలుపెట్టింది. అయితే ఈ వారంలో ఆ ఆరు ఖాతాలను వైట్‌హౌస్ ట్విటర్లో ఆన్‌ఫాలో చేసింది. దీంతో వైట్‌హౌస్ ట్విటర్ లో అనుసరిస్తున్న ఖాతాల సంఖ్య 13కు తగ్గింది. చదవండి : మోదీ ట్విట్టర్‌తో అమెరికా కటీఫ్ -
మోదీ ట్విట్టర్‌తో అమెరికా కటీఫ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్విట్టర్’లో భారత ప్రధాని మోదీతో స్నేహానికి ముగింపు పలికారు. ట్రంప్ ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్న అధ్యక్షుడి నివాసమైన వైట్‌హౌస్ ట్విట్టర్లో మోదీని అన్‌ఫాలో చేసింది. రాష్ట్రపతి కోవింద్‌ను, ప్రధాని కార్యాలయం(పీఎంవో), అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని అనుసరించడం మానేసింది. కొన్ని రోజుల క్రితం వరకు మోదీసహా 19 మంది భారతీయులను ట్విట్టర్లో ఫాలో అయ్యేది. తాజాగా ఆ సంఖ్య 13కు పడిపోయింది. ఈ 13 మంది అమెరికా పరిపాలనతో సంబంధం ఉన్న భారతీయులు. వైట్‌హౌస్ ట్విట్టర్ ఖాతాను 2.1కోట్ల ఫాలోవర్లు ఉన్నారు. మూడు వారాల క్రితం మోదీ వైట్‌హౌస్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్న తొలి ప్రపంచస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి వైట్‌హౌస్ మోదీ ట్విట్టర్ ఖాతాను అనుసరించడం ప్రారంభించింది. మోదీ ట్విట్టర్ ఖాతాను వైట్‌హౌస్ అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఎందుకు చేసిందన్న స్పష్టం కాకపోయినప్పటికీ అమెరికా–భారత్ మధ్య దెబ్బతిన్న బంధాలకు ఇదొక నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. -
భారత్‌పై విద్వేషం: ట్విటర్ ఖాతా తొలగింపు
సాక్షి, న్యూఢిల్లీ : గల్ఫ్ దేశాల్లో భారత్‌పై తప్పుడు వార్తల్ని ప్రచారం చేసేందుకు పాకిస్తాన్ గూడఛర్య సంస్థ ఐఎస్ఐ వాడుతున్న నకిలీ ఖాతాను ట్విటర్ తొలగించింది. సౌదీ యువరాణి నౌరా బింట్ ఫైసల్ పేరును అనుకరించేలా నౌరాఅల్‌సాద్ ఐడీ పేరుతో ఇదనియాలుసాఫ్ అనే ఖాతాను ట్విటర్ నిలిపివేసింది. పాకిస్తాన్ నుంచి నిర్వహిస్తున్నఈ ట్విటర్ ఖాతా ద్వారా భారత్ వ్యతిరేక ప్రచారాన్ని హోరెత్తిస్తున్నట్టు గుర్తించారు. ఇతరులను బెదిరించడం, వేధింపులకు గురిచేయడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నందున ఇవి తమ ప్రమాణాలకు అనుగుణంగా లేవంటూ సదరు ఖాతాను ట్విటర్ తొలగించింది. సోషల్ మీడియా వేదికల్లో పలు నకిలీ ఖాతాలను ఉపయోగిస్తూ భారత్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీపై గల్ఫ్ దేశాల్లో ఐఎస్ఐ విషం చిమ్ముతోందని భారత భద్రతా దళాలు ఎప్పటి నుంచో పేర్కొంటున్న సంగతి తెలిసిందే. నకిలీ ఖాతాలతో సోషల్ మీడియాలో భారత వ్యతిరేక సందేశాలను పాకిస్తాన్ చేరవేస్తోందని ఆధాలతో సహా భారత నిఘా వర్గాలు నివేదికను రూపొందించాయి. భారత్‌పై విద్వేష విషం చిమ్మేందుకు గల్ప్ దేశాల రాచరిక కుటుంబ సభ్యుల పేరుతో నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నట్టు పరిశోధకులు వెల్లడించారు. చదవండి : ఆయన ఇంకా సీఎం అనే భ్రమలో ఉన్నారు -
వివాదాస్పద ట్వీట్.. రంగోలి ఖాతా తొలగింపు
కంగనా రనౌత్ సోదరి, ఫైర్‌బ్రాండ్ రంగోలి చందేల్ ట్విటర్ ఖాతాను అధికారులు తొలగించారు. ఓ వర్గాన్ని ఉద్ధేశించి రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తోందని బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన ఆరోపణలపై స్పందించిన ట్విటర్ అధికారులు ఆమె అకౌంట్‌ను సస్పెండ్ చేశారు. కాగా బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తిని ఐసోలేషన్‌కు తరలిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై రంగోలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ధిష్ట వర్గానికి చెందిన వారిని, సెక్యూలర్ మీడియాను కాల్చి చంపాలని రంగోలి ట్వీట్ చేశారు. (రంగోలి సంచలన వ్యాఖ్యలు) ఈ ట్వీట్ కాస్తా వైరలవ్వడంతో రంగోలి చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని దర్శకుడు రీమా కగ్టి, నటి కుబ్రా సైత్తోపాటు కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ సహా ట్విటర్లో ఫిర్యాదు చేశారు. ఒక వర్గంపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినందుకు, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన రంగోలిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముంబై పోలీసులు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ట్యాగ్ చేశారు. వీటిపై స్పందించిన ట్విటర్ అధికారులు వెంటనే రంగోలి అకౌంట్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. చివరికి రంగోలి అకౌంట్‌ను అధికారులు తొలగించడంతో ఫరాఖాన్తోపాటు తదితర నటులు ట్విటర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (‘అలా అయితే.. కంగనా నటన వదిలేస్తుంది’) Thank you @Twitter @TwitterIndia @jack for suspending this account. I reported this because she targeted a specific community and called for them to be shot along with liberal media and compared herself to the Nazis. 🙏🙏🙏 . pic.twitter.com/lJ3u6btyOm — Farah Khan (@FarahKhanAli) April 16, 2020 -
తొలిసారి ట్వీట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. బుధవారం ఆయన ట్విటర్ ఖాతాను తెరిచారు. చిరంజీవి కొణిదెల పేరుతో అకౌంట్‌ను ప్రారంభించిన ఆయన.. అభిమానులతో మాట్లాడటం ఆనందంగా ఉందని అన్నారు. తెలుగు ప్రజలకు శ్రీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంవత్సరాది రోజున ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా మహమ్మారిని కలిసికట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందామని ఆయన పిలుపునిచ్చారు. (ఈ అమ్మ సెంటిమెంట్లను గౌరవించండి: మోదీ) అలాగే కరోనా వైరస్ (కోవిడ్-19)ను అరికట్టడానికి భారత ప్రభుత్వం 21 రోజులపాటు ప్రజలందరిని ఇళ్లలోనే ఉండమని ఇచ్చిన ఆదేశానికి మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా మద్దతు తెలిపారు. కరోనా వంటి మహమ్మారిని ఎదుర్కొవడానికి కేంద్ర తీసుకున్న నిర్ణయం అనివార్యమైందని ఆయన పేర్కొన్నారు.ఈ క్లిష్ట సమయంలో మనమంతా సురక్షితంగా ఉండటానికి ప్రధాని నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ ఇచ్చే ఆదేశాలను పాటిద్దామని పిలుపునిచ్చారు. ఇంటి పట్టునే ఉందామని.. సురక్షితంగా ఉండాలని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. (‘ఆర్ఆర్ఆర్’ టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల..) #HappySarvariUgadi DELIGHTED to directly engage with my beloved fellow Indians,Telugus & my dearest fans through a platform like this.This #NewYear’s Day,let’s resolve to defeat this global health crisis with awareness & responsibility. #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/Fb3Cnw4nHH — Chiranjeevi Konidela (@KChiruTweets) March 25, 2020 -
సౌదీలో 88వేల ట్విట్టర్ ఖాతాలు బ్లాక్
వాషింగ్టన్: సౌదీ అరేబియాలో ఆ దేశ అధికారులకు అనుకూలంగా సందేశాలు పోస్ట్ చేస్తున్నందుకు గానూ దాదాపు 88 వేల అకౌంట్లను శుక్రవారం బ్లాక్ చేసినట్లు ట్విట్టర్ వెల్లడించింది. ఇక ట్రంప్‌నకు అనుకూలంగా, ప్రత్యర్థులను కించపరిచే రీతిలో పోస్టులు చేసినందుకు గానూ వియత్నాం, అమెరికా, జార్జియాలలో 600 అకౌంట్లను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సంస్థలు బ్లాక్ చేశాయి. అలాగే వియత్నాంలోని ఓ నెట్‌వర్క్‌ను బ్లాక్ చేసినట్లు ఫేస్బుక్ తెలిపింది. సౌదీలో బ్లాక్ చేసిన 88 వేల అకౌంట్లలో 5,927 అకౌంట్ల సమాచారాన్ని ట్విట్టర్ విడుదల చేసింది. సౌదీకి చెందిన సోషల్ మీడియామార్కెటింగ్ సంస్థ స్మాట్ సమాచార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు ట్విట్టర్ ప్రాథమిక దర్యాప్తులో గుర్తించింది. -
ఆ అకౌంట్లపై చర్యలు తీసుకోండి: సచిన్
ముంబై: తన కుమారుడు అర్జున్ టెండూల్కర్, కూతురు సారా టెండూల్కర్ పేరు మీద ఉన్న ట్వీటర్ అకౌంట్లు ఫేక్ అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పష్టం చేశాడు. వాటిపై చర్యలు తీసుకోవాలని మైక్రో బ్లాగింగ్ సైట్ ట్వీటర్‌ను కోరాడు. జూనియర్ టెండూల్కర్ పేర మీద ఉన్న ట్వీటర్ అకౌంట్ తన కుమారుడు అర్జున్‌ది కాదని పేర్కొన్నాడు. అలాగే తన కుమారుడు అర్జున్‌కు కానీ, కూతురు సారాకు కానీ ట్వీటర్ అకౌంట్ల లేవనే ఈ విషయాన్ని సచిన్ తెలియజేశాడు. జూనియర్ టెండూల్కర్ పేరుతో కొంతమంది ప్రముఖలపై వ్యతిరేకంగా ట్వీట్లు వస్తున్న నేపథ్యంలో సచిన్ స్పందించాడు. ‘ఆ అకౌంట్ అర్జున్ టెండూల్కర్‌ది కాదు. అసలు అర్జున్‌కు ట్వీటర్ అకౌంట్ లేదు. మా పిల్లలు ఇద్దరికీ ట్వీటర్ అకౌంట్లు లేవు. పలువురిపై జూనియర్ టెండూల్కర్ పేరుతో వస్తున్న ట్వీట్లు మా కుమారుడివి కావు. అది ఫేక్ అకౌంట్. దానిపై ట్వీటర్ ఇండియా సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకోవాలి’ అని సచిన్ విజ్ఞప్తి చేశాడు. మహారాష్ట్ర రాజకీయాలకు సంబంధించి మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు మద్దతు ఇస్తున్నానంటూ జూనియర్ టెండూల్కర్ పేరుతో ఒక ట్వీట్ వెలుగు చూసింది. ‘ ఐయామ్ విత్ ఫడ్నవీస్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో జూనియర్ టెండూల్కర్ అకౌంట్లో దర్శనమిచ్చింది. ఇది సచిన్ కుమారుడు అర్జున్ చేసిందంటూ పెద్ద దుమారం లేచింది. దాంతో సచిన్ వివరణ ఇచ్చుకుంటూ తన కుమారుడుకు ట్వీటర్ అకౌంట్ లేదన్నాడు. అలానే కూతురు సారాకు కూడా ఎటువంటి అకౌంట్ లేదన్నాడు. లెఫ్టార్మ్ మీడియం పేసరైన అర్జున్.. అండర్ 16, అండర్-19 స్థాయిలో ముంబైకు ప్రాతినిథ్యం వహించాడు. ఈ ఏడాది ఆరంభంలో ప్రి సీజన్ టోర్నమెంట్లో భాగంగా ముంబై సీనియర్ జట్టుకు కూడా సెలక్ట్ అయ్యాడు. మరొకవైపు అండర్-19 భారత జట్టుకు కూడా అర్జున్ ఆడాడు. గతేడాది శ్రీలంకతో జరిగిన అండర్-19 మ్యాచ్‌లకు భారత్ తరఫున అర్జున్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక భారత్-ఇంగ్లండ్ సీనియర్ జట్లకు నెట్స్‌లో బౌలింగ్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. I wish to clarify that my son Arjun & daughter Sara are not on Twitter. The account @jr_tendulkar is wrongfully impersonating Arjun and posting malicious tweets against personalities & institutions. Requesting @TwitterIndia to act on this as soon as possible. — Sachin Tendulkar (@sachin_rt) November 27, 2019 -
లాగిన్ కాకుంటే ఆ ఖాతాలు తొలగిస్తాం
శాన్ఫ్రాన్సిస్కో: మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్.. యాక్టివ్‌గా లేని తన ఖాతాదారులకు వార్నింగ్ ఈ-మెయిల్స్ పంపుతోంది. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ట్విటర్ అకౌంట్ లాగిన్ చేయకుండా నిద్రాణవ్యవస్థలో(ఇన్‌యాక్టివ్) ఉన్న యూజర్‌నేమ్‌తో పాటు ఖాతాలను పూర్తిగా తొలగిస్తామని పేర్కొంది. అలా జరగకుండా ఉండాలంటే డిసెంబరు 11లోగా లాగిన్ అవ్వాలంటూ వినియోగదారులను ట్విటర్ హెచ్చరించింది. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు విశ్వసనీయ సమాచారం, కచ్చితత్వం కొరకు మాత్రమే తాము నిద్రావస్థలో ఉన్న ట్విటర్ అకౌంట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపింది. అయితే తాము ఒక్కసారిగా ఇన్‌యాక్టివ్ ట్విటర్ అకౌంట్లను తొలగించమని, తొలగింపు ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతుందని ఈ మేరకు ట్విటర్ అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు. ట్విటర్ కస్టమర్లు యాక్టివ్‌గా ఉన్నంతవరకు వారి ఖాతా సేఫ్‌గా ఉంటాయని వివరించారు. ట్విటర్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్విటర్ ఖాతాను మరిచినవారితో పాటు చనిపోయిన ఖాతాదారుల అకౌంట్లపై ప్రభావం కనిపించనుంది. -
కాంగ్రెస్‌లో సింధియా కలకలం
భోపాల్: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్‌లో ఆ పార్టీ యువ నేత జ్యోతిరాదిత్య సింధియా మరోసారి వార్తల్లోకెక్కారు. తన ట్విట్టర్ అకౌంట్ ప్రొఫైల్‌లో కాంగ్రెస్ పార్టీ పేరు తీసేసి ప్రజాసేవకుడు, క్రికెట్ ప్రేమికుడు అని పెట్టుకోవడం రాజకీయంగా కలకలం సృష్టించింది. ముఖ్యమంత్రి కమల్నాథ్కీ, జ్యోతిరాదిత్యకి మధ్య విభేదాలు ఉన్నాయని, త్వరలోనే ఆయన పార్టీ వీడతారంటూ పలు ఊహాగానాలు చెలరేగాయి. అయితే జ్యోతిరాదిత్య మాత్రం అదేమీ లేదంటూ కొట్టి పారేశారు. అతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా భూతద్దంలో పెట్టి చూస్తుందని మండి పడ్డారు. నెలరోజుల క్రితమే తాను ట్విట్టర్ అకౌంట్లో ప్రొఫైల్ మార్చానని,కాంగ్రెస్ పార్టీతో తాను తెగతెంపులు చేసుకున్నట్టు వస్తున్న వార్తలన్నీ నిరాధారమని ట్వీట్ చేశారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయానికి ఎంతో కృషి చేసిన జ్యోతిరాదిత్య సింధియా సీఎం పదవిని ఆశించి భంగపడ్డారు. ముఖ్యమంత్రి కమల్‌నాథ్, మరో కీలక నేత దిగ్విజయ్‌సింగ్‌లకు ప్రాధాన్యం ఇచ్చి తనను నిర్లక్ష్యం చేస్తున్నారన్న భావనలో జ్యోతిరాదిత్య ఉన్నట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. -
ట్విటర్‌కు గుడ్‌బై, రెడ్‌ఇట్‌కు ప్రశంసలు
శాన్ ఫ్రాన్సిస్కో : మల్టీ-బిలియనీర్, టెక్ మొగల్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను సోషల్‌మీడియా ఖాతా ట్విటర్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. తద్వారా 29 మిలియన్ల ట్విటర్ ఫాలోయర్లకు ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో తన ట్విటర్ అకౌంట్‌ను డిలీట్ చేస్తానని చెప్పడం ఇదిరెండవసారి. అయితే అప్పట్లో ఖాతాను తొలగిస్తానని చెప్పినప్పటికీ, అకౌంట్ యాక్టివ్‌గా ఉండటం విశేషం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ గురించి ఖచ్చితంగా తెలియదు కానీ, రెడ్ఇట్ బావుందంటూ వరుస పోస్ట్‌లలో వ్యాఖ్యానించారు. కాగా టెస్లా సీఈఓ అధికారిక రెడ్ఇట్ ఖాతా చాలా సంవత్సరాలుగా యాక్టివ్‌గా లేదు. అయితే ఈ పోస్ట్‌ల తర్వాత మస్క్ ట్విటర్ ఖాతా ఇప్పటికీ చురుకుగా వుండటం ఆసక్తికరం. కాగా గత ఏడాది బ్రిటీష్ గజ ఈతగాడు వెర్నాన్ అన్స్వర్త్పై ఎలాన్ మస్క్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి తీసాయి. థాయ్ గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలలు, సాకర్ కోచ్ రక్షణలో కీలక పాత్ర పోషించిన వెర్నాన్‌ను 'పేడో గై' అని పిలిచినందుకు వచ్చేనెలలో విచారణను ఎదుర్కోన్నారు. 57 వేల పౌండ్ల పరువు నష్టం దావా అతనిపై దాఖలైన సంగతి తెలిసిందే. అంతకుముందు, తన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా గురించి తప్పుదోవపట్టించే కార్పొరేట్ సమాచారాన్ని అందించారంటూ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆరోపణలు చేసింది. ఫలితంగా 20 మిలియన్ల జరిమానాను మస్క్ చెల్లించవలసి వచ్చింది. Going offline — Elon Musk (@elonmusk) November 1, 2019 Reddit still seems good — Elon Musk (@elonmusk) November 1, 2019 Not sure about good of Twitter — Elon Musk (@elonmusk) November 1, 2019 -
ట్విటర్ సీఈవో అకౌంట్ హ్యాక్
ట్విటర్ సీఈవో, సహ వ్యవస్థపాకుడు జాక్ డోర్సీ ట్విటర్ ఖాతాకే దిక్కులేకుండా పోయింది. డోర్సీ ఖాతాను శుక్రవారం మధ్యాహ్నం హ్యాక్ చేసిన హ్యాకర్లు వివాదాస్పద ట్వీట్లతో దడ పుట్టించారు. ప్రధానంగా ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాంబు వుందంటూ ట్వీట్ చేయడం కలకలం రేపింది. దీంతోపాటు జాత్యహంకార, దేశ విద్రోహపూరిత కామెంట్లు ఉండటంతో కొంతమంది నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. దాదాపు 4 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్న ట్విటర్ సీఈవో ఎకౌంట్‌నే హ్యాక్ చేసి సైబర్ నేరగాళ్లు భారీ షాకిచ్చారు. స్వయంగా సంస్థ సీఈవో ఖాతాకు భద్రత లోపించడం చర్చనీయాంశమైంది. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఆయన ఖాతాను స్వాధీనం చేసుకున్న హ్యకర్లు అనుచిత ట్వీట్లు చేశారు. నాజీ నాయకుడు అడాల్ఫ్ హిట్లర్ నిర్దోషి, అమాయకుడంటూ ట్వీట్ చేశారు. నల్లజాతీయులు, యూదుల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాంబు ఉందని సూచించే ట్వీట్ కూడా ఉంది. అయితే హ్యాకింగ్‌ను పసిగట్టిన భద్రతా సిబ్బంది డోర్సీ ఖాతాను వెంటనే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక గంటలోపు సదరు ట్వీట్లను, రీట్వీట్లను తొలగించారు. కొన్ని ట్విటర్ ఖాతాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసారు.. మరోవైపు డోర్సీ ట్విటర్ ఎకౌంట్ ఎలా హ్యాక్ అయిందన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నట్లు ట్విటర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. భద్రతా పరిశోధకుడు బ్రియాన్ క్రెబ్స్ మాట్లాడుతూ, సిమ్ మార్పిడి లేదా బాధితుడి ఫోన్ నంబర్‌ద్వారా హ్యాకింగ్ జరిగినట్టు గుర్తించామన్నారు. మొబైల్ ప్రొవైడర్ భద్రతా లోపం కారణంగా అకౌంట్ తో లింక్ చేసిన ఫోన్ నంబర్‌ను హ్యక్ చేసారన్నారు. కాగా డోర్సీ ఖాతా హ్యాక్ అవడం ఇదే మొదటిసారి కాదు. 2016లో కూడా ఇలాంటి ఉదంతం చోటు చేసుకుంది. దీంతోపాటు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ట్విట్టర్ ఖాతాలను కూడా హ్యాక్ చేసిన సంగతి తెలిసిందే. -
ట్విటర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ డైరెక్టర్
సామాజిక కోణంలో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు అనురాగ్ కశ్యప్. వ్యక్తిగతంగానూ అలాంటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. రాజకీయ అంశాలపై అనురాగ్ స్పందించే తీరు వివాదాస్పదమైన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ స్టార్ డైరెక్టర్ ట్విటర్‌కు గుడ్ బై చెప్పారు. తన కారణంగా తన కుటుంబ సభ్యులకు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తిన అనురాగ్ చాలా సందర్భంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురయ్యారు. ‘దొంగలు రాజ్యమేలుతారు, దుర్మార్గం జీవన విదానం అవుతుంది. సరికొత్త భారతదేశంలో నివసిస్తున్న అందరికీ శుభాకాంక్షలు. మీరు అభివృద్ధిలోకి వస్తారు. నేను నా అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తపరచలేనపుడు నేను మౌనంగానే ఉండిపోతాను గుడ్ బై’ అంటూ చివరి ట్వీట్ చేశారు అనురాగ్. -
నారా దేవాన్ష్‌కు అప్పుడే ట్విటర్ అకౌంటా!
ట్విటర్లో యమా యాక్టివ్‌గా ఉండే ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ తన నాలుగేళ్ల కుమారుడు దేవాన్ష్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేస్తున్న ట్వీట్లు తీవ్రచర్చనీయాంశంగా మారాయి. తన కుమారుడు దేవాన్ష్‌ను(@naradevaansh) ట్యాగ్ చేస్తూ పలు సందర్భాల్లో లోకేశ్ ట్వీట్లు చేశారు. దేవాన్ష్ చాలా త్వరగా పెద్దవాడు అయిపోతున్నాడని, అతనితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానంటూ గురువారం ట్విటర్లో నారాలోకేశ్ పోస్ట్ పెట్టారు. దేవాన్ష్‌తో గడిపిన మధుర క్షణాలు, ఎప్పటికీ గుర్తుండిపోతాయని పేర్కొంటూ కొన్ని ఫోటోలను పోస్ట్ చేశారు. ఇప్పటికే నారా దేవాన్ష్ పేరుతో ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్లతోపాటూ వివిధ సామాజిక మాధ్యమాలలో కూడా అకౌంట్లు ఉన్నాయి. అయితే ఇవి అధికారిక అకౌంట్లా కాదా అనేదానిపై స్పష్టత లేదు. కానీ ఏకంగా నారా లోకేశే దేవాన్ష్ పేరుతో ఉన్న అకౌంట్‌ను పలు సందర్భాల్లో ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టడంతో అది దేవాన్ష్ అకౌంటే అని స్పష్టమవుతోంది. ‘మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నదే ప్రధానంగా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది’ అంటారు శంకరాచార్యుడు. చిన్న పిల్లలు తెలిసో తెలియకో సామాజిక మాధ్యమాలపై ఎక్కువగా దృష్టిపెడితే ఎదుగుదలలో బహు ముఖ వికాసం లోపించి, వృధా వ్యవహారాల్లో మునిగి తేలుతూ మేధోమరుగుజ్జుతనానికి లోనయ్యే అవకాశం ఉంది. అందుకే పలు సామాజిక వెబ్సైట్లలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే కనీస వయసు ఉండాలనే నిబంధనలను పెట్టాయి. ట్విటర్ అకౌంట్ వాడాలంటే కనీస వయసు 13 ఏళ్లు ఉండాలనే నిబంధన ఉంది. ఈ విషయం కూడా తెలియకుండా ఏపీ ఐటీ మంత్రిగా ఎలా పని చేస్తున్నారంటూ లోకేశ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటి నుంచే దేవాన్ష్‌కు సామాజిక మాధ్యమాల్లో ఫాలోవర్లను పెంచాలనే ఆలోచన నారా లోకేష్‌కు ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే దేవాన్ష్‌కు దీర్ఘకాలంలో ఫాలోవర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ఫాలోవర్లు, లైకులు, షేర్లు, ట్రెండింగ్ అంటూ చిన్న పిల్లాడి మదిలో అనవసరపు చర్చ జరిగితే అది అతని మనస్తత్వంపై ప్రభావం పడే అవకాశం ఉంది. -
ట్వీట్లు చేసేది నేనే, దెయ్యం కాదు..!
సాక్షి, న్యూఢిల్లీ: ‘నా ట్విటర్ ఖాతాలో నుంచి ట్వీట్లు చేసేది నేనేనని, దెయ్యం కాద’ని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ చమత్కరించారు. సమిత్ పాండే అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ చేసిన ట్వీట్‌కు ఆమె ఈమేరకు బదులిచ్చారు. ‘సుష్మా స్వరాజ్ అకౌంట్‌ను ఆమె కాకుండా మరెవరో (పీఆర్) నిర్వహిస్తున్నార’ని సమిత్ పాండే అనుమానం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి బదులుగా ‘ట్విటర్లో యూజర్లు అడిగిన ప్రశ్నలకు మాధానాలిచ్చేది నేనే, నా దెయ్యం కాద’ని సుష్మా తెలిపారు. గతవారం ట్విటర్లో మరోవ్యక్తి ‘మిమ్మల్ని మీరు ఎందుకు చౌకీదార్ (కాపలాదారు)గా పిలుచుకుంటార’న్న ప్రశ్నకు జవాబుగా.. ఎందుకంటే నేను భారత్‌లో, విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ప్రయోజనాలకు కాపలా కాస్తున్నానని సుష్మా దీటుగా సమాధానమిచ్చారు. -
పేరుకు ముందు ‘చౌకీదార్’
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. సోషల్ మీడియా వేదికగా ‘మై భీ చౌకీదార్’ పేరిట ప్రచారాన్ని ఉధృతం చేసింది. దీనిలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం తన ట్విట్టర్ ఖాతాలో పేరును ‘చౌకీదార్ నరేంద్ర మోదీ’గా మార్చారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు తమ ట్విట్టర్ ఖాతాల పేర్లకు ‘చౌకీదార్’పదాన్ని జతచేర్చారు. ‘నేను కాపాలాదారుడినే (చౌకీదార్). కాపాలాదారుగా దేశానికి సేవ చేయాలన్న దృఢ నిశ్చయంతో ఉన్నాను. కానీ నేను ఒంటరిని కాదు. అవినీతి, సామాజిక దుశ్చర్యలు వంటి వాటిపై పోరాడే ప్రతి ఒక్కరూ చౌకీదార్లే. దేశాభివృద్ధి, పురోగతి కోసం కృషి చేసే ప్రతీ భారతీయుడు ‘మై భీ చౌకీదార్’అని అంటున్నారు’అని ప్రధాని తన ట్వీట్లో పేర్కొన్నారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కూడా ట్విట్టర్లో స్పందించారు. ‘దేశానికి కాపాలాదారుల్లా వ్యవహరిస్తున్న మేం నగదు రహిత ఆర్థిక లావాదేవీల ద్వారా ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తామని హామీ ఇస్తున్నాం. దశాబ్దాలుగా పేరుకుపోయిన నల్లధనం, అవినీతి వల్ల ప్రతికూల ప్రభావం ఎదురైంది. మెరుగైన భవిష్యత్ కోసం వీటిని తొలగించాల్సిన అవసరముంది’అని పేర్కొన్నారు. అయితే, బీజేపీ ప్రారంభించిన నేనూ కాపలాదారునే అనే ప్రచారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూడా ‘కాపలాదారుడే దొంగ’ప్రచారాన్ని ప్రారంభించింది. కాగా, లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 100 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ బహిరంగ ర్యాలీలు, సమావేశాలు నిర్వహించారని బీజేపీ ఆదివారం పేర్కొంది. -
ట్విటర్లో ప్రియాంక గాంధీకి ఇంత ఫాలోయింగా!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇటీవలె అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ తాజాగా సోషల్ మీడియాలో ప్రపంచంలోకీ అడుగుపెట్టారు. సోమవారం ఆమె పేరు మీద అధికారికంగా ట్విటర్ ఖాతాను ప్రారంభించారు. ప్రియాంక ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎలాంటి ఖాతా లేదన్న విషయం తెలిసిందే. అయితే ఆమె ట్విటర్‌ను ప్రారంభించిన కొద్ది గంటల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్స్ పెరిగారు. మొదటి 15 నిమిషాల్లో ఆమెను అనుసరిస్తున్న వారిసంఖ్య ఐదు వేలకు చేరగా.. పది గంటల్లో వారిసంఖ్య లక్షకు చేరింది. ప్రియాంక గాంధీ ట్విటర్ ఖాతా ప్రారంభించడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్ స్పందించారు. సోషల్ మీడియాలో కొత్త సూపర్ స్టార్ అడుగుపెట్టారంటూ ఆయన ట్వీట్ చేశారు. ప్రియాంక ఖాతాను ప్రారంభించినప్పటికీ ఇప్పటి వరకూ ఒక్క ట్వీట్ కూడా చేయ్యలేదు. ప్రస్తుతం ఆమె ఏడుగురిని అనుసరిస్తున్నారు. రాహుల్ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, రణదీప్ సుర్జేవాలా, అహ్మాద్ పటేల్, అశోక్ గెహ్లోట్, సచిన్ ఫైలెట్లను ఆమె ఫాలో అవుతున్నారు. కాగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ టాప్‌లో ఉండగా, శశిథరూర్ రెండవ స్థానంలో ఉన్నారు. ఇక తాజా గణాంకాల ప్రకారం ట్విటర్ ద్వారా రాహుల్‌గాంధీకి 8.48 మిలియన్లు, శశి థరూర్‌కి 6.75 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. Pleased to welcome @priyankagandhi to @twitter. It was once a lonely furrow for a Congressman to plough — glad to see @INCIndia stalwarts now all take to it with enthusiasm. — Shashi Tharoor (@ShashiTharoor) February 11, 2019 -
నిమిషాల్లో ప్రియాంకకు వేలమంది ఫాలోయర్లు
-
నిమిషాల్లో ఆమెకు వేలమంది ఫాలోయర్లు
సాక్షి, లక్నో: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా భావిస్తున్న ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికలకు సర్వం సన్నద్ధమవుతున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా , తూర్పు యూపీ ప్రచార ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన అనంతరం పూర్తిగా కార్యాచరణ ప్రణాళికలో దిగిపోయారు. లక్నోలో నిర్వహించనున్న మెగా రోడ్ షో కంటే ముందుగా సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలకు పార్టీ సన్నాహకాల్లో భాగంగా లక్నోలో నాలుగు రోజుల పర్యటన మొదలుకానున్న నేపథ్యంలో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్లోతన అధికారిక ట్విటర్ ఖాతాను ఆమె ఓపెన్ చేశారు. అంతే నిమిషాల్లో 22వేల మందికి పైగా పాలోవర్లు ఆమె ఖాతాలో చేరిపోయారు. కాగా ప్రియాంక గాంధీ రాజకీయ రంగప్రవేశంపై రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో నెలకొన్న ఉత్కంఠకు రెండు వారాల క్రితం తెరపడిన సంగతి తెలిసిందే. క్రియాశీల రాజకీయాల్లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చిన అనంతరం ప్రియాంక గాంధీ వాద్రా రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా పర్యటిస్తున్నారు. దీనిపై అటు కాంగ్రెస్ నాయకులు, శ్రేణులతోపాటు, ఇతర వర్గాల్లో కూడా భారీ అంచనాలే ఉన్నాయి. -
కూల్‌గా.. కామ్‌గా..!
ఎన్నికల ప్రచారం అంటే మైకుల హోరు.. డప్పువాయిద్యాలు.. బాణసంచా చప్పుళ్లు వినిపించేవి. కాలం మారింది. కొంత పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. తాము చెప్పదలచుకున్న విషయాన్ని క్షణాల్లో ఓటర్లు, కార్యకర్తలకు చేరిపోయేలా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకు వాట్సప్, ఫేస్‌బుక్‌లను ఉపయోగించుకుంటున్నారు. తమ పార్టీ మేనిఫోస్టోతో పాటు.. ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కామ్‌గా.. కూల్‌గా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. మిర్యాలగూడ... టీఆర్ఎస్ అభ్యర్థి : నల్లమోతు భాస్కర్‌రావు ఫేస్బుక్ ఖాతా : నల్లమోతు భాస్కర్‌రావు ఫేస్ బుక్ ఫెండ్స్ : 35,678 పోస్టింగ్‌లు : ప్రతి రోజు ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఫొటోలతో పాటు వీడియోలు ఫేస్బుక్లో పోస్టులు చేస్తున్నారు. అదే విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు తిరిగి అధికారంలో వస్తే చేస్తామని చెబుతున్న ఎన్నికల మేనిఫెస్టోలను కూడా ప్రచారంలో పెట్టారు. వ్యూవర్స్ : ఎక్కువగా పార్టీ కార్యకర్తలే ఉన్నారు. ఈ సారి కూడా ఎన్నికల్లో గెలుస్తాడని, మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందనే పోస్టులు పెడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి : ఆర్.కృష్ణయ్య ఫేస్బుక్ ఖాతా : ర్యాగా కృష్ణయ్య ఫేస్బుక్ ఫ్రెండ్స్ : 38,521 పోస్టింగ్‌లు : ప్రతి రోజు ఎన్నికల ప్రచారం ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకంగా వచ్చిన వీడియో క్లిప్పింగ్‌లు, మహాకూటమి అధికారంలోకి వస్తే చేస్తామని చెబుతున్న ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేస్తున్నారు. వ్యూవర్స్ : బీసీలంతా ఏకమై గెలిపించాలని కోరుతూ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్యను గెలిపించాలని కోరుతూ పోస్టింగ్‌లు పెడుతున్నారు. నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి : కాంగ్రెస్ పార్టీ ఫేస్బుక్ పేరు : నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 5,000 మంది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పేరు మీద ఫేస్బుక్ ప్రారంభించారు. ఫేస్బుక్లో 5వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ప్రతిరోజు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర, నియోజకవర్గానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను పోస్టింగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు, మేనిఫెస్టో అంశాలను వివరించడంతోపాటు లైవ్ ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహిస్తూ నేరుగా ప్రసంగాలు కూడా చేస్తున్నారు. అంతేగాక ఉత్తమ్సేన, ఉత్తమ్ యువసేన పేరుతో మరో రెండు ఫేస్బుక్ ఖాతాలు కూడా ఆయన అనుచరులు ప్రారంభించి విస్తృత ప్రచారాలు చేస్తున్నారు. హూజూర్‌నగర్... శానంపూడి సైదిరెడ్డి : టీఆర్ఎస్ పార్టీ ఫేస్బుక్ పేరు : శానంపూడి సైదిరెడ్డి, అంకిరెడ్డి ఫౌండేషన్, సై యూత్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 5,000 టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి తన పేరుమీద ప్రారంభించిన ఫేస్బుక్లో తన ప్రచార పోస్టింగ్‌లు పెడుతున్నారు. స్థానికత నినాదంతో ముందుకు వెళుతున్న ఆయన ఫేస్‌బుక్‌లోని తన ఫాలోవర్స్‌ను చైతన్యం చేసేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల వల్ల నియోజకవర్గం ఏ విధంగా నష్టపోయిందనే అంశాలను వివరిస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా పోస్టింగ్ చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్త అంశాలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేగాక సైదిరెడ్డి తన తండ్రి పేరు మీద ప్రారంభించిన అంకిరెడ్డి ఫౌండేషన్, సై యూత్ పేర్లపై కూడా ఫేస్‌బుక్‌లు ప్రారంభించారు. ఈ రెండు సోషల్ మీడియా ఖాతాలను సుమారు 10 వేల మంది ఫాలో అవుతున్నారు. అంకిరెడ్డి ఫౌండేషన్ సభ్యులతో పాటు సై యూత్ సభ్యులు కూడా సైది రెడ్డికి మద్దతుగా విస్తృతంగా పోస్టింగ్‌లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు. భువనగిరి... ఫేస్బుక్ పేరు : అనిల్‌కుమార్‌రెడ్డి కుంభం ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 22,802 ఫేస్బుక్లో పెడుతున్న పోస్టింగ్‌లు: ప్రస్తుతం ఎన్నికల ప్రచార చిత్రాలు. ఎన్నికల ప్రచార లైవ్ కార్యక్రమాలు. ఎన్నికల ప్రచా రాలకు సంబంధించిన లైవ్ వీడియోలు. నాలుగేళ్ల కాలంలో భువనగిరి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చేసిన పోరాటాలు, పాదయాత్రలు, సమావేశాలు. ధర్నాలు, రాస్తారోకోలు వంటి పోస్టింగ్‌లు పెడుతున్నారు. వీటితో సమాజ సేవా కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలు ఫేస్బుక్లో పోస్టింగ్ చేస్తున్నారు. జోరుగా ప్రచారం.. తిరుమలగిరి (తుంగతుర్తి) : తుంగతుర్తి నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫేస్బుక్, వాట్సప్‌లలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గాదారి కిశోర్‌కుమార్ తన పేరు మీదనే ఫేస్బుక్, ట్విట్టర్లలో ఖాతాలు తెరిచి ప్రతిరోజు ప్రచారానికి సంబంధించిన ఫొటోలు, కార్యక్రమాల వివరాలను పోస్ట్ చేస్తున్నారు. దీంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ, జీకే యూత్, అన్ని మండలాల గ్రూపులతో వాట్సప్ ఖాతాలు తెరిచి ప్రతిరోజు కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్ ఫేస్బుక్, వాట్సప్‌లలో 25 గ్రూపుల ద్వారా తన ప్రచార కార్యక్రమాన్ని, పర్యటన వివరాలను తెలియజేస్తున్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య సామాజికమాద్యమాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అభ్యర్థి పేరు : గాదరి కిశోర్‌కుమార్. ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల పేర్లు : గాదరి కిశోర్‌కుమార్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 4448 ట్విట్టర్ ఫాలోవర్ల సంఖ్య : 2560 అభ్యర్థి పేరు : అద్దంకి దయాకర్ ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల పేరు : అద్దంకిదయాకర్ ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 5 వేలు ట్విట్టర్ఫాలోవర్ల సంఖ్య : 1670 అభ్యర్థి పేరు :కడియం రామచంద్రయ్య ఫేస్బుక్, ట్విట్టర్ ఖాతాల పేరు : కడియం రామచంద్రయ్య ఫేస్బుక్ ఫ్రెండ్స్ సంఖ్య : 3859 -
ఆ పోలీసులు మనవాళ్లయితే ఆ కిక్కే వేరబ్బ..
సాక్షి, హైదరాబాద్: కెనడాలో ఓ పంజాబీ కుటుంబం నడిరోడ్డుపై అల్లరి చేస్తుండటంతో వారిని హెచ్చరించడానికి పోలీసులు వచ్చారు. అయితే అలా వచ్చినవారు కూడా పంజాబీలు కావడంతో గలాటా చేస్తున్న వాళ్లు ఆనందంతో కేరింతలు కొట్టారు. పంజాబీ స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. పంజాబీలను హెచ్చరించడానికి పంజాబీ పోలీసులే వస్తే కెనడాలో పరిస్థితి ఇలా ఉంటుందంటూ ఓ నెటిజన్ ఈ వీడియోను పోస్టు చేశారు. 13 సెకండ్ల ఈ వీడియోలో సాటి పంజాబీ పోలీసులను చూసి ఆ పంజాబీ కుటుంబం ఉబ్బితబ్బిబ్బైపోవడం చూడొచ్చు. -
త్రిష ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
తన ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని నటి త్రిష పేర్కొంది. దక్షిణాదిలో సంచలన నటీమణుల వరుసలో నటి త్రిష పేరు కచ్చితంగా ఉంటుంది. ఇటీవల తెరపైకి వచ్చిన 96 చిత్రంలో ఈ బ్యూటీ నటనకు అన్ని వర్గాల నుంచి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రస్తుతం రజనీకాంత్‌కు జంటగా పేట చిత్రంలో నటిస్తోంది. నటీనటుల ట్విట్టర్ అకౌంట్స్ తరచూ హ్యాక్‌కు గురవుతుండడం, ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని సమస్యల్లోకి నెట్టడం జరుగుతుంటుంది. ఇంతకుముందు కూడా ఇలాంటి ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా హీరోయిన్ల ట్విట్టర్ హ్యాక్‌కు గురవుతుంటాయి. అలా నటి త్రిష ట్విట్టర్ ఇప్పుడు హ్యాక్‌కు గురైంది. ఈ విషయాన్ని త్రిష శనివారం ఉదయం గుర్తించిందట. దీంతో ఎవరో అగంతుకులు తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారని, అభిమానులెవరూ ఏ విషయాన్ని తన ట్విట్టర్‌కు పోస్ట్ చేయవద్దని ట్వీట్ చేసింది. అదే విధంగా తన పేరుతో పోస్ట్ కాబడిన విషయాలను ఎవరూ నమ్మొద్దు అని పేర్కొంది. దీని గురించి త్రిష తల్లి ఉమాకృష్ణన్ స్పందిస్తూ ఎవరో అగంతకులు త్రిష ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారన్నారు. వారు త్రిష ట్విట్టర్‌ను ఓపెన్ చేసి చూస్తున్నారు. వారు త్రిష ట్విట్టర్ అకౌంట్ నుంచి ఇతరులకు తప్పుడు సమాచారాన్ని ప్రసారం చేస్తున్నారని తెలిపారు. ఈ విషయం శనివారం ఉదయమే తమకు తెలిసిందని, దీంతో వెంటనే ట్విట్టర్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను మార్చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం పేట చిత్ర షూటింగ్ నిమిత్తం వారణాసిలో ఉన్న త్రిష తన అభిమానులకు తెలిపిందని అన్నారు. త్రిష ట్విట్టర్ అకౌంట్‌ను ఇంతకు ముందొకసారి అగంతకులు హ్యాక్ చేశారన్నది గమనార్హం. ఆ సమయంలో త్రిష జల్లికట్టుకు మద్దతు తెలపగా ఆమె ట్విట్టర్‌ను హ్యాక్ చేసిన వారు త్రిష గురించి ఇష్టమొచ్చిన విధంగా తప్పుడు ప్రచారం చేశారు. ఈ విషయమై త్రిష పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాజా పరిణామాలకు చెన్నైకి తిరిగొచ్చిన తరువాత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. -
నీలాంటి మగాళ్ల వల్లే!
ట్వీటర్లో సోనమ్ కపూర్ ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమెకు కోటి 20 లక్షల మంది ట్వీటర్ ఫాలోయర్స్ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు సడన్‌గా ట్వీటర్ నుంచి తప్పుకుంటున్నా అనేశారు సోనమ్. ‘‘నా ట్వీటర్ అకౌంట్‌ను ఆపేస్తున్నాను. నెగిటివిటీ బాగా పెరిగిపోయింది’’ అని పేర్కొన్నారు సోనమ్. తనుశ్రీ దత్తా వివాదం విషయంలో సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉన్నారు సోనమ్. ఓ నెటిజన్ చేసిన విమర్శలే సోనమ్ ట్వీటర్‌కి ఫుల్స్టాప్ పెట్టడానికి కారణమని బాలీవుడ్ సినీ జనాలు విశ్లేషిస్తున్నారు. ఇటీవల ముంబైలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా పెరిగిపోవడం వల్లే గమ్యం చేరుకోవడానికి తనకు బాగా ఆలస్యం అవుతోందని అర్థం వచ్చేలా సోనమ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ఓ నెటిజన్ స్పందిస్తూ– ‘‘సోనమ్... ఈ పరిస్థితి మీ లాంటి వారి వల్లే. మీరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించరు. బాగా ఇందనం ఖర్చయ్యే వాహనాలనే వాడతారు. మీ ఇంట్లో దాదాపు 10 నుంచి 20 ఏసీలు వాడతారు. ఇలా గ్లోబల్ వార్మింగ్‌కి కారణం అవుతారు. ఫస్ట్ మీ పాపులేషన్‌ని కంట్రోల్ చేసుకో’’ అని బదులు చెప్పాడు. సోనమ్ కూడా ఏం తగ్గలేదు. ‘‘మీ లాంటి మగవారి వల్లే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణిస్తే లైంగిక వేధింపులకు గురి అవుతామేమోనని మహిళలు భయపడుతున్నారు’’ అని రెస్పాండ్ అయ్యారు సోనమ్. ఈ సంగతి ఇలా ఉంచితే.. ఆమె ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉన్నారు. దాదాపు కోటీ నలభై లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. -
మా రాకుమారుడి పేరెంటో తెలుసా?
బాలీవుడ్లో బెస్ట్ జోడి షాహిద్ కపూర్, మీరా రాజ్‌పుత్‌లు. వీరి ఇంట ఇప్పుడు ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. మీరా నిన్న సాయంత్రం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తమ చిన్ని రాకుమారుడు పేరును షాషిద్ కపూర్, అందరూ ఊహించినట్టుగానే నేడు ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. తమ రాకుమారుడు పేరు ‘జైన్ కపూర్’ గా పేర్కొన్నాడు. ‘జైన్ కపూర్ ఇక్కడ. మేము పూర్తి అనుభూతి చెందుతున్నాం. అందరి అభినందనలకు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు. మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. లవ్ టూ ఆల్’ అని ట్వీట్ చేశారు. అంతేకాక, షాహిద్ కపూర్ తన భార్య కోసం ప్రత్యేకంగా ఓ క్యూట్ బర్త్‌డే కేక్‌ను కూడా డిజైన్ చేయించారు. డఫోడిల్క్రియేషన్స్ ఈ కేక్‌ను డిజైన్ చేశారు. దానిపై హ్యాపీ బర్త్‌డే మదర్ హెన్ అని రాయించాడు షాహిద్. తన చిన్ని రాకుమారుడి పేరును రివీల్ చేస్తూ షాహిద్ కపూర్ చేసిన ట్వీట్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ‘జైన్ కపూర్ కూడా తన పేరు లాగా చాలా అందంగా ఉంటాడు. బేబి బాయ్‌ను చూడటానికి మేమందరం ఎంతో ఆతృతగా వేచిచూస్తున్నాం’ అని డాక్టర్ ఇందిరా ట్వీట్ చేశారు. ‘జైన్ చూడటానికి మేమందరం వేచిచేయలేకపోతున్నాం. మా ప్రేమను, అభినందనలను పంపుతున్నాం’టాటాస్కై కూడా ట్వీట్ చేసింది. ఆల్రెడీ షాహిద్, మీరా దంపతులకు మిషా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాబు పుట్టడంతో, వారి ఫ్యామిలీ పూర్తైనట్టు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. Zain Kapoor is here and we feel complete. Thank you for all the wishes and blessings. We are overjoyed and so grateful. Love to all. ❤️🙏 — Shahid Kapoor (@shahidkapoor) September 7, 2018 -
పాస్వర్డ్స్ మార్చుకోండి
శాన్ఫ్రాన్సిస్కో: ట్వీటర్‌ను వినియోగిస్తున్న 33 కోట్ల యూజర్లూ తమ ఖాతాల పాస్వర్డ్స్ మార్చుకోవాలని ట్వీటర్ కోరింది. ఫేస్బుక్ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందని బ్రిటన్‌కు చెందిన కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో ట్వీటర్ ఈ ప్రకటన చేసింది. సోషల్ మీడియా ఖాతాల డేటా అమ్ముకుంటున్నారని, చోరీ జరుగుతోందనే ఆరోపణలు గట్టిగా వినవస్తున్న నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ట్వీటర్లో సమస్య తలెత్తింది. దీంతో ఆ సంస్థ అంతర్గత దర్యాప్తు చేపట్టింది. పాస్‌వర్డ్‌ల చోరీ గాని, సమాచార దుర్వినియోగం గాని జరిగిందా అనే అంశంపై విచారణ చేసింది. ఇందులో అలాంటివేమీ జరగలేదని వెల్లడైంది. అయితే ముందు జాగ్రత్త చర్యగా వినియోగదారులంతా తమ పాస్వర్డ్స్ మార్చుకోవాలని సూచించింది. అయితే ట్వీటర్లో తలెత్తిన సమస్య ఎన్ని పాస్‌వర్డ్స్‌పై ప్రభావం చూపిందనే విషయాన్ని వెల్లడించలేదు. ఇదే పాస్వర్డ్ ఇంకా ఎక్కడెక్కడ వినియోగిస్తున్నారో అక్కడా మార్చుకుంటే మంచిదని సూచించింది. -
ఐవానా ఫాలో ఫాలో ఫాలో యు
అదేంటీ మహేశ్‌బాబు ఫొటో పెట్టి, ఎన్టీఆర్ సాంగ్ రాశారేంటి అనుకుంటున్నారా? మేటర్లోకి వెళ్తే మీకే అర్థం అవుతుంది. మహేశ్ ట్వీటర్లో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందరికీ తెలిసిందే. సినిమా అప్డేట్స్ దగ్గర నుంచి వాళ్ల పిల్లలు గౌతమ్, సితార ఫొటోల దాకా అన్నీ అభిమానులతో పంచుకుంటుంటారు మహేశ్. లక్షలమంది అభిమానులు ఆయన్ను ఫాలో అవుతుంటారు. ఇటీవలే 6 మిలియన్ (60 లక్షలు) ఫాలోవర్స్‌ను టచ్ చేశారు ఆయన. కానీ మహేశ్ మాత్రం తన బావ గల్లా జయదేవ్‌ను మాత్రమే ఫాలో అవుతారు. మహేశ్ ట్వీటర్ ఖాతా తెరిచినప్పటినుంచి కేవలం తన బావని మాత్రమే ఫాలో అయ్యారు. ఇప్పుడు మరొకర్ని కూడా ఫాలో అవుతున్నారు. ఈ రెండో వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా? మహేశ్‌కు ‘శ్రీమంతుడు, భరత్ అనే నేను’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివ. మహేశ్ కెరీర్లో హిట్స్ కచ్చితంగా డెలివర్ చేయాల్సిన ప్రతిసారీ కొరటాల శివ సినిమా హిట్ అందించారు. సో.. ఆ అభిమానంతోనే కొరటాల శివను మహేశ్ ఫాలో ఫాలో అవుతున్నారని ఊహించవచ్చు. -
సినిమాలు లేకపోయినా... ఆమె హవా తగ్గలేదు!
లోకనాయకుడు, నటుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రుతీహాసన్. అయితే కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది ఈ భామ. తన బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ కోర్స్లేతో షికార్లు చేస్తూ బిజీ బిజీగా ఉంది. ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వదంతులు ప్రచారంలో ఉన్నాయి. ఏడాది నుంచి శ్రుతి ఏ సినిమా చేయకపోయినా... తెరపై అభిమానులకు కనిపించకపోయినా. ట్వీటర్లో మాత్రం ఆమె హవా కొనసాగిస్తోంది. భారీ సంఖ్యలో అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్, మోహన్‌లాల్ వంటి స్టార్లను వెనక్కి నెట్టి ముందు వరుసలో నిలిచింది శ్రుతి. ఏడు మిలియన్ల మంది అభిమానులు ట్వీటర్లో ఈ నటిని ఫాలో అవుతున్నారు. సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా.. ఆమె హవా మాత్రం తగ్గలేదంటున్నారు నెటిజన్లు. నటి సమంత, శ్రుతికి కాస్త దగ్గర్లో ఉంది. సమంతను ట్వీటర్లో 6.53 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. -
పాండ్యా ట్వీట్.. ట్విస్ట్
సాక్షి, స్పోర్ట్స్ : రాజ్యాంగ పిత అంబేద్కర్‌ను అవమానించేలా ట్వీట్ చేశాడంటూ ఆల్‌రౌండర్ హర్దిక్ పాండ్యాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జోధ్‌పూర్(రాజస్థాన్) ఆదేశాల మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడో ట్విస్ట్ బయటపడింది. ఆ పోస్ట్ అయ్యింది హర్దిక్ అఫీషియల్ అకౌంట్ నుంచి కాదన్నది ఇప్పుడు తేలింది. హర్దిక్ పాండ్యా అసలు ట్విట్టర్ అకౌంట్ యూజర్ నేమ్ @hardikpandya7 ఉండగా.. ఆ పోస్ట్ మాత్రం @sirhardik3777 పేరుతో ఉంది. పైగా పోస్ట్ చేసిన ఆ అకౌంట్ డిలేట్ అయి ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో అది ఫేక్ అకౌంట్ కావటంతో కేసు వీగిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయన్నది నిపుణులు చెబుతున్న మాట. -
రాహుల్ ట్విటర్ పేరు మారింది
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు తన ట్విటర్ అకౌంట్ పేరు మార్చేశారు. సోషల్ మీడియా నుంచి భారీ ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తిన తర్వాత రాహుల్ ఇక చివరికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ‘ఆఫీస్‌ఆప్‌ఆర్‌జీ’గా ఉన్న తన ట్విటర్ పేరును, ఇక నుంచి సాదాసీదాగా ‘రాహుల్‌గాంధీ’ అని పెట్టుకున్నారు. అంతకముందు ఉన్న ‘ఆఫీస్‌ఆప్‌ఆర్‌జీ’ పేరుపై సోషల్ మీడియా యూజర్లు విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ‘ఆఫీస్‌ఆప్‌ఆర్‌జీ’ అంటే రాహుల్ గాంధీ కార్యాలయం అని అర్థం. గొప్ప కోసం లేదా వెర్రితనంగా అభివర్ణిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవారు. ఈ విమర్శలకు సమాధానంగా తన ట్విట్టర్ ఖాతాలో తన పెంపుడు కుక్క ట్వీట్లు పెడుతుందంటూ ఆయన జోకులు కూడా పేల్చారు. గత నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ మెంబర్లతో సమావేశమైన రాహుల్, తన సోషల్ మీడియా వ్యూహంపై చర్చించారు. కొన్ని అంశాలపై తాను ఎక్కువగా ఫోకస్ చేశానని, వాటిని మైక్రోబ్లాగింగ్సైట్లో పోస్టు చేసే ముందు వాటికి సూచనలను కూడా తన కమ్యూనికేషన్ టీమ్‌కు ఇస్తున్నట్టు తెలిపారు. తన ట్విటర్ అకౌంట్లో ఎక్కువగా రాజకీయాలపైనే ఫోకస్ చేసినట్టు చెప్పారు. బర్త్‌డే శుభాకాంక్షలు వంటి సాధారణమైన వాటికి ట్విటర్ వాడనని పేర్కొన్నారు. కేవలం తన ఆలోచనలన్నీ రాజకీయ ట్వీట్లపైనే అన్నారు. For those of you who missed it, my Twitter handle has changed from 9 am this morning to @RahulGandhi The @OfficeOfRG account has been discontinued. I look forward to your feedback and comments and to continuing my dialogue with you via Twitter and other platforms. — Rahul Gandhi (@RahulGandhi) March 17, 2018 -
ఎయిరిండియా అకౌంట్ హ్యాక్, విమానాలన్నీ రద్దు
ముంబై : ఎయిరిండియా అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఉదయం చాలా గంటల పాటు ఎయిరిండియా ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్ బారిన పడినట్టు ఈ విమానయాన సంస్థ తెలిపింది. హ్యాక్ అయిన తమ ట్విటర్ అకౌంట్ @airindiain లో టర్కిష్ భాషలో మెసేజ్‌లు పోస్టు అవుతున్నాయని ఎయిరిండియా అధికార ప్రతినిధి చెప్పారు. తమ అకౌంట్లో పోస్టు అయిన హానికరమైన కంటెంట్ అంతటిన్నీ తాము తొలగించనట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్విటర్ అకౌంట్ రిస్టోర్ అయిందని వెల్లడించారు. హ్యాకింగ్‌కు గురైన ఎయిరిండియా అకౌంట్లో పోస్టు అయిన ఒక మెసేజ్ ఈ విధంగా ఉంది. ''చివరి నిమిషంలో ఎంతో ముఖ్యమైన ప్రకటన. మా అన్ని విమానాలను రద్దు చేశాం. ఇప్పటి నుంచి, టర్కిష్ ఎయిర్‌లైన్స్‌తో మేము ఎగరాలనుకుంటున్నాం'' అని పోస్టు అయింది. ఈ మెసేజ్ చూసిన ఎయిరిండియా ట్విటర్ ఫాలోవర్స్ అందరూ ఒక్కసారిగా షాకింగ్‌కు గురయ్యారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఎయిరిండియాను ఇటీవల ప్రైవేటీకరణ చేయాలనుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎయిరిండియా అధికారిక అకౌంట్లో ఈ మెసేజ్ కనిపించడం తీవ్ర గందరగోళానికి తెరతీసింది. ప్రస్తుతం ఎయిరిండియా ట్విటర్ అకౌంట్‌కు 1,46,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. -
యూజర్లందరికీ ట్విటర్ బ్లూ టిక్
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ట్విటర్ ఎంతో ప్రాముఖ్యం చెందిన సంగతి తెలిసిందే. ఏ విషయాన్నైనా ఇటీవల అధికారికంగా ప్రకటించడానికి ట్విటర్‌నే ప్రధాన సాధనంగా ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు ట్విటర్‌ను ఉపయోగించనంతగా మరోదాన్ని ఉపయోగించరు. ట్విటర్ ద్వారానే విలువైన విషయాలను షేర్ చేస్తుంటారు. అందుకు తగ్గట్టు ట్విటర్ కూడా వారికి ఆ అకౌంట్ వాళ్లదే అని తెలిసేటట్టుగా వెరిఫికేషన్ టిక్ కూడా ఇస్తోంది. ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ టిక్‌ను యూజర్లందరకూ ఇస్తోంది. యూజర్ల గుర్తింపును నిర్థారిస్తూ.. ట్విటర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ ప్రక్రియను చేపడుతోంది. గతేడాది రద్దు చేసిన ఈ ప్రక్రియను, ఇప్పుడు మళ్లీ చేపడుతున్నట్టు తెలిపింది. తొలుత ఈ బ్లూ టిక్ ఉండటాన్ని.. కొందరు స్టేటస్ సింబల్‌గా భావించేవారు. కానీ ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ టిక్‌ను ఇక అందరికీ ఇస్తోంది. సంబంధిత వినియోగదారుని అకౌంట్ అతనిదే అని ధ్రువీకరిస్తూ ఈ బ్లూ టిక్ మార్క్ ఇస్తారు. ప్రపంచంలో అత్యంత నమ్మకమైన సర్వీసులు అందించే దానిలో తాము ఒకరిగా ఉండాలనుకుంటున్నామని, ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్టు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే చెప్పారు. అయితే ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వ గుర్తింపు ఐడీ కార్డు, ఫేస్బుక్ ప్రొఫైల్, ఫోన్ నంబర్ వంటివి ఏమైనా అందించాలా అన్న విషయాలేవి ట్విటర్ తెలుపలేదు. 2009లో తొలుత ఈ వెరిఫికేషన్ కోడ్ ప్రక్రియను ట్విటర్ చేపట్టింది. తొలినాళ్లలో సినిమా వాళ్లకు, క్రీడాకారులకు, వీఐపీలకు మాత్రమే ఈ టిక్ మార్క్ ఇచ్చింది. ఆ తర్వాత జర్నలిస్టులకు కూడా ఇవ్వడం ప్రారంభించింది. అయితే గతేడాది కొత్త దరఖాస్తుదారులకు ఈ బ్లూ టిక్ వెరిఫికేషన్‌ను ఇవ్వడాన్ని ట్విటర్ రద్దు చేసింది. మళ్లీ ఇప్పుడు ప్రారంభించింది. ప్రస్తుతం సామాన్యులకు కూడా ఈ టిక్ మార్కును అందిస్తోంది. సామాన్యులకు కూడా ఈ టిక్ మార్కును అందించడంతో, ఫేక్ అకౌంట్స్ కట్టడయ్యే అవకాశం ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. -
నా అకౌంట్ హ్యాక్ అయింది: నటి
సాక్షి, చెన్నై: టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న కొద్దీ వాటి దుర్వినియోగం సెలబ్రిటీలకు చిక్కులు తెచ్చిపెడుతోంది. సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాకింగ్ చేసి వాటి నుంచి అసభ్యకర పోస్టులు, లేక తమను గిట్టని వర్గంపై ట్వీట్లు చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తాజాగా దక్షిణాది ప్రముఖ సినీనటి రాధికా శరత్‌కుమార్ ట్వీటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. దీనిపై ఆమె ఆందోళన వ్యక్తం చేయగా.. నెటిజన్లు ఆమెకు మద్ధతుగా నిలుస్తున్నారు. ‘నా ట్వీటర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ సమస్య నుంచి బయటపడేదాక నాకు మద్ధతుగా నిలవాలంటూ’ నటి రాధిక ట్వీట్ ద్వారా విజ్ఞప్తిచేశారు. డోంట్ వర్రీ మేడమ్ అంటూ ఆమె ఫాలోయర్లు రీ-ట్వీట్లు చేస్తున్నారు. కాగా, ఇటీవల పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్, రాజ్యసభ సభ్యుడు స్వపన్ దాస్‌గుప్తాల ట్వీటర్ అకౌంట్లు హ్యాకింగ్‌కు గురైన విషయం తెలిసిందే. హ్యాకింగ్ వెనక టర్కీ కేంద్రంగా పనిచేస్తున్న, పాక్ అనుకూల అయిల్దిజ్ టిమ్ బృందం ఉన్నట్లు గుర్తించారు. అంతకుముందు సచిన్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. తన కుమరుడు అర్జున్, కూతురు సారా టెంటూల్కర్లకు సోషల్ మీడియా అకౌంట్లు లేవని.. ఆ పేర్లతో ఏవైనా పోస్టులు కనిపిస్తే నమ్మవద్దని సచిన్ కోరారు. సారా పేరుతో ట్వీటర్ ఖాతా తెరిచి ట్వీట్లు చేస్తున్న ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. My Twitter account is hacked .please bear with me while I get this sorted — Radikaa Sarathkumar (@realradikaa) 26 February 2018 -
మళ్లీ మాట తప్పిన వర్మ
ఓ మాట చెప్పటం.. మాట మీద నిలబడకపోవటం సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు అలవాటు. గతంలో ఇలాగే మాటలు చెప్పిన మాట తప్పిన సందర్భాలు వర్మ కెరీర్ లో చాలానే ఉన్నాయి. తాజా మరోసారి తన మార్క్ చూపించాడు వర్మ. 2017 మే 27 ఇక ట్విట్టర్ కు గుడ్ బై అంటూ ప్రకటించి తన ట్విట్టర్ అకౌంట్ ను డీ యాక్టివేట్ చేశాడు రామ్ గోపాల్ వర్మ. తాను డిస్ట్రబ్ చేస్తున్న వ్యక్తులు తానకు బోర్ కొట్టారని అందుకే ఇక ఎవరినీ ట్వీట్లతో ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. అందుకే ట్విట్టర్ అకౌంట్ క్లోజ్ చేస్తున్నట్టుగా తెలిపాడు. అయితే మరోసారి మాట తప్పిన వర్మ తన ట్విట్టర్ అకౌంట్ ను తిరిగి ప్రారంభించాడు. కాసేపటి క్రితమే (2018 జనవరి 2 మద్యాహ్నం 2 గంటల ప్రాంతంలో) వర్మ తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ చేశారు. మరోసారి తాను ట్విట్టర్ లోకి అడుగుపెడుతున్నట్టుగా ట్వీట్ చేసిన వర్మ, పవన్ మీద దాడి ప్రారంభించాడు. ‘ట్విట్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిన నేను పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసితో ఇన్స్పైర్ అయ్యి మళ్లీ వచ్చా’ అంటూ ట్వీట్ చేశాడు. తన రెండవ ట్వీట్ ను రజనీ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి చేసిన వర్మ ఈ సారి ఎవరిని టార్గెట్ చేస్తాడోచూడాలి. Here’s my Jesus like rejuvenated second coming on Twitter😌 ..Wish u all as happy a new year as every other bygone Happy Old Year — Ram Gopal Varma (@RGVzoomin) 2 January 2018 Twitter Ajnaatavaasam loki velina nenu p k ajnaatavaasi tho inspire ayyi malli vachcha pic.twitter.com/nzjjDcHw5B — Ram Gopal Varma (@RGVzoomin) 2 January 2018 Never seen more thundering power than in @superstarrajini the way he announced his political entry ..My prediction is each and everyone in entire TN will vote only for him..it will be dumb of any political party to contest against him — Ram Gopal Varma (@RGVzoomin) 2 January 2018 -
సుష్మా స్వరాజ్ నీకు ఇది తగునా.?
న్యూఢిల్లీ : ట్విట్టర్లో ప్రశ్నించినంత మాత్రాన అకౌంట్‌ను బ్లాక్ చేయడం తగునా.. అని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా నిలదీశారు. ఇందుకు సంబంధించిన స్ర్కీన్ షాట్లను ఆయన తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు. విదేశాంగ మంత్రి తనని బ్లాక్ చేయడం ద్వారా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, ఏదైనా అంశం గురించి అడిగితే ఒక పార్లమెంటు సభ్యుని ఖాతాను బ్లాక్‌చేస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా ఒక మంత్రి వ్యవహరించే తీరు.. అని సుష్మా స్వరాజ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014లో ఇరాక్‌లో అపహరణకు గురైన 39 మంది భారతీయుల విషయంలో ఈ ఇద్దరి నేతల మధ్య మాటల యుద్దం నడిచిన విషయం తెలిసిందే. గతంలో దీనిపై సుష్మా స్వరాజ్ పార్లమెంటులో మాట్లాడుతూ.. ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో అపహరణకు గురైన భారతీయులు బాదుష్ జైలులో ఉన్నట్టు ఇరాక్ అధికారులు సమాచారమిచ్చారన్నారు. అపహరణకు గురైన వారిని మరణించినట్లు ప్రకటించడం చాలా తేలికైన పనని, కానీ తాను అలా చేయబోనన్నారు. అలా చెప్పిన నన్నెవరూ ప్రశ్నించే వారు లేరన్నారు. ఎలాంటి రుజువులు లేకుండా అలా చెప్పడం సమంజసం కాదన్నారు. Is this the way to run external affairs ministry? Does it behove the office of Sushma Swaraj ji to block a Member of Parliament for asking tough questions on 39 Indians missing in Iraq? pic.twitter.com/CvYl8aLREF — Partap Singh Bajwa (@Partap_Sbajwa) 27 December 2017 -
ట్రంప్ ట్వీటర్ బంద్!
వాషింగ్టన్: ట్వీటర్లో చురుగ్గా ఉండే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఖాతాను గురువారం ట్వీటర్ కస్టమర్ సపోర్ట్ విభాగంలో పనిచేసే ఉద్యోగి ఒకరు 11 నిమిషాల పాటు డీయాక్టివేట్ చేశారు. వెంటనే తేరుకున్న ట్వీటర్ యాజమాన్యం ట్రంప్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది. చివరిరోజు విధులు నిర్వహిస్తున్న కస్టమర్ సపోర్ట్ ఉద్యోగి ఒకరు పొరపాటున ట్రంప్ ట్వీటర్ ఖాతాను డీయాక్టివేట్ చేశారని వివరణ ఇచ్చింది. ఈ విషయమై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ‘ ఓ రోగ్ నా ఖాతాను నిలిపివేశాడు. దీన్ని బట్టి నా మాటలు ప్రజలు వింటున్నారనీ, వారిపై నా మాటలు ప్రభావం చూపిస్తున్నాయని అర్థమవుతోంది’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. -
అమీర్ ఫ్యాన్స్ దెబ్బ, కమల్ అబ్బా..
సాక్షి: కమల్ ఖాన్ బాలీవుడ్లో సెలబ్రిటీ. ఎల్లప్పుడూ వివాదాల్లో ఉంటాడు. హీరోలను విమర్శించడం ఆపై అభిమానుల నుంచి చివాట్లు తినడం ఆయనకు అలవాటు. అయినా తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోరు. వివాదాలను ఇంటి చూట్టు తిప్పుకుంటా నేను ఇంతే అనే రేంజ్లో ఫీల్ అవుతారు. కానీ సెలబ్రిటీకి కూడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అమీర్‌ఖాన్ అభిమానుల దెబ్బకు ఖంగుతున్నాడు. తమ అభిమాన నటుడిపై విమర్శలు చేసినందుకు ఏకంగా కమల్‌ఖాన్ ట్వట్టర్ అకౌంట్‌నే బ్లాక్ చేశారు. వివరాల్లోకి వెళ్తే అమీర్ ఖాన్ తాజాగా నటించిన సీక్రెట్ సూపర్‌స్టార్ సినిమా క్లైమాక్స్‌ను రివీల్ చేస్తూ ఓ సమీక్ష రాశాడు. అయితే ఇంకా విడుదల కాకుముందే కథను సోషల్ మీడియాలో చెప్పడంతో అమీర్‌ఖాన్ అభిమానులకు కోపం వచ్చింది. దీంతో కమల్ ఖాన్ అకౌంట్‌పై ట్వట్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో కమల్‌ఖాన్ అకౌంట్ ఆగిపోయింది. గతంలో కమల్ బాహుబలి సినిమా, మహేష్ బాబు, పవన్‌కల్యాణ్‌పై కూడా విమర్శలు చేశారు. దీనిపై కమల్‌ఖాన్ మీడియాకు ఓలేఖ రాశాడు. కేవలం సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాయడం వల్లే తన ట్విట్టర్ ఖాతా కోల్పోయాననని తెలిపాడు. గత నాలుగేళ్లలో ఎంతో డబ్బు సినిమాలకు ఖర్చుపెట్టానని, తన ఖాతాకు 6మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని పేర్కొన్నాడు. అంతేకాడు అమీర్‌ఖాన్‌పై విమర్శలు ఎక్కుపెట్టాడు. 'అమీర్ నన్ను ట్విట్టర్లో ఉండనీయాలనుకోవట్లేదు. ఎందుకంటే ట్విట్టర్‌కు యజమాని అమీర్ కాబట్టి నేను మరో కొత్త ఖాతా తెరవాలనుకోవట్లేదు అంటూ విమర్శించాడు. -
దోమను చంపినందుకు ట్వీటర్ ఖాతా క్లోజ్!
హింసను ప్రేరేపించేలా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచితే సంబంధిత ఖాతాలను నిలిపివేస్తామని ట్వీటర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్లుగానే చనిపోయిన దోమ ఫొటో ట్వీట్ చేశాడని ఓ వ్యక్తి ట్వీటర్ ఖాతాను సదరు సంస్థ నిలిపివేసింది. ఈ సంఘటన శాన్ఫ్రాన్సిస్కోలో జరిగింది. జపాన్‌కి చెందిన ఓ వ్యక్తి శాన్ఫ్రాన్సిస్కోలో నివాసముంటున్నాడు. ఆగస్టు 20న అతడు ఇంట్లో టీవీ చూస్తుండగా దోమ కుట్టిందట. ఈ క్రమంలో కోపంతో ఆ దోమను చంపి దాన్ని ఫొటో తీసి ట్వీటర్లో ఉంచాడు. ‘నేను టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకునే సమయంలో నన్ను కుట్టడానికి ప్రయత్నిస్తావా..! చావు’ అని అతడు ట్వీట్ చేశాడు. ఆ కొద్దిసేపటికే ‘మీ ట్విటర్ ఖాతాను తొలగిస్తున్నాం. ఇక నుంచి మీరు ఈ ఖాతాను తెరవలేరు’ అని అతనికి ఓ మెసేజ్ వచ్చింది. వెంటనే అతడు ఆగస్టు 26న మరో ట్వీటర్ ఖాతాను తెరిచి ‘చంపిన దోమ ఫొటో ట్వీటర్లో ఉంచినందుకు నా పాత ఖాతాను పూర్తిగా నిలిపివేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమా’ అంటూ ప్రశ్నించాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 32 వేల మంది రీట్వీట్ చేయగా 28 వేల లైక్‌లు వచ్చాయి. -
బాలీవుడ్ గాయకుడికి మరోసారి చుక్కెదురు
ముంబయి: సోషల్ మీడియా ద్వారా అనుచిత వ్యాఖ్యలు చేసి భంగపడ్డ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు అభిజీత్ భట్టాచార్య (58)కు మరోసారి చుక్కెదురైంది. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ మరో సారి అభిజిత్ ఖాతాను సస్పెండ్ చేసింది. సోమవారం ఉదయం ఖాతా యాక్టివేట్ అయిన కొద్ది సమయంలోనే అతనికి నిరాశ ఎదురైంది. అభిజిత్ ట్విట్టర్ ఖాతా మళ్లీ సస్పెండ్ అయింది. అభిజీత్ తాజాగా తన ట్విటర్ లో మరో ఖాతాను ఓపెన్ చేశారు. ఇది నా అధికారిక ట్విట్టర్ అకౌంట్.. మిగతావన్నీ ఫేక్ అంటూ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇటీవల తాను ట్విట్టర్‌కు దూరంగాతో ఉండడంతో తన ప్రతిష్టను భంగపర్చడానికి కొన్ని నకిలీ ఖాతాలు వచ్చాయని ఈ వీడియో క్లిప్ లో పేర్కొన్నారు. వందేమాతరం ..తాను మళ్లీ వచ్చేశాననీ, దేశద్రోహులు తన నోరు మూయించలేరని వ్యాఖ్యానించారు. భారత సైన్యానికి తన సెల్యూట్’ అంటూ ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ ట్విట్ చేసిన కొద్ది గంటల్లోనే అభిజీత్ ఖాతా మళ్లీ సస్పెండ్ కావడం విశేషం. కాగా ఇటీవల జేఎన్‌యూ విద్యార్థిని గురించి ట్విటర్లో అసభ్యకరంగా వ్యాఖ్యానించాడన్న కారణంగా అతని ట్విటర్ ఖాతాని ట్విట్టర్ బ్లాక్ చేయడం, దీనికి నిరసనగా మరో బాలీవుడ్ సింగర్ ట్విటర్ ఖతాను ఉపసంహరించుకోవడం తెలిసిన విషయాలే. అయితే ఈ వ్యవహారంపై అభిజీత్ ఇంకా స్పందించలేదు. -
పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్!
హైదరాబాద్ : జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. హ్యాకర్లు ఆయన అకౌంట్‌ను హ్యాక్ చేసి, పాస్వర్డ్ కూడా మార్చేశారు. గత మూడు రోజుల నుంచి ఆయన ట్విట్టర్ అకౌంట్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే సాంకేతిక లోపం వల్లే తన అకౌంట్లో సమస్య ఏర్పడిందని పవన్ భావించారట. అయితే ఇవాళ ఆయన ట్విట్టర్ అకౌంట్ పూర్తిగా స్తంభించడంతో ...ఐటీ నిపుణులతో సంప్రదిస్తున్నారు. మరోవైపు ట్విట్టర్ హ్యాక్ అయిన విషయంపై పవన్ ...అభిమానులను అప్రమత్తం చేశారు. మే 8న పవన్ చివరిసారిగా ట్విట్ చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ ట్విట్టర్ అకౌంట్ పని చేయడం లేదని జనసేన పార్టీ అధికారికంగా ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన చేసింది. ట్విట్టర్ ఖాతా హ్యాక్ చేసి ఉండవచ్చని, నిపుణుల చేత సంప్రదించిన తర్వాత మిగతా వివరాలు వెల్లడిస్తామని తెలిపింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జనసేన హెచ్చరించింది. -
నా భార్య మానసిక రోగి!
‘‘నా భార్య మానసిక రోగి’’ అని గాయని సుచిత్ర భర్త, నటుడు కార్తీక్‌కుమార్ పేర్కొన్నారు. పలువురు సినీప్రముఖుల ఆంతరంగిక విషయాలను సోషల్ మీడియా ద్వారా బయట పెడుతూ గాయని సుచిత్ర కోలీవుడ్‌లో అలజడి రేపుతున్న విషయం తెలిసిందే. ఆ మధ్య హీరో ధనుష్ తనతో తప్పుగా ప్రవర్తించారని, ఈ విషయాన్ని ఎప్పుడు.. ఎవరితో చెప్పడానికైనా సిద్ధమేనని తన ట్విట్టర్లో పేర్కొన్నారామె. ఆ వెంటనే ఆ వ్యాఖ్యలకు, తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్ చేశారని ప్లేటు ఫిరాయించారు. ఆ తర్వాత హీరో ధనుష్– హీరోయిన్ త్రిష, సంగీతదర్శకుడు అనిరుద్– హీరోయిన్ ఆండ్రియా, హీరో రానా–హీరోయిన్ త్రిష, బుల్లితెర నటి డీడీ (దివ్యదర్శిని) ఒక యువకునితో క్లోజ్‌గా ఉన్న దృశ్యాలను సుచిత్ర ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ‘ఇవి వారి రాసలీలలు’ అంటూ ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు. అలాగే వేరే వ్యక్తుల నీలి చిత్రాలను పోస్ట్ చేసి, రాయలేని వ్యాఖ్యలను పొందుపరిచారు. అదే విధంగా ‘వేచి చూడండి.. మరికొందరి తారల రాసలీలలను బయట పెడతా’ అంటూ పోస్ట్ చేయడం చిత్రపరిశ్రమలో మరింత కలకలం సృష్టించింది. ఈసారి గాయని సుచిత్ర భర్త, నటుడు కార్తీక్‌కుమార్ స్పందిస్తూ.. ఆ ఫొటోలకు, తన భార్య సుచిత్రకు ఎలాంటి సంబంధం లేదని, ఆమె ట్విట్టర్‌ను ఎవరో హ్యాక్ చేశారని, సంబంధించిన వారికి తాను క్షమాపణలు చెప్పుకుంటున్నానని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గాయని సుచిత్ర తన భర్త నుంచి విడిపోవడానికి సిద్ధమైందనే ప్రచారం జోరందుకుంది. అయితే అది వదంతి మాత్రమేనని కార్తీక్‌కుమార్ కొట్టిపారేశారు. అదే విధంగా తన భార్య మానసిక రుగ్మతతో బాధపడుతోందని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తాజాగా సుచిత్ర ట్విట్టర్లో మరో సంచలన వ్యాఖ్యలను పోస్ట్ చేశారు. ధనుష్, అనిరుద్‌తో పార్టీలో పాల్గొన్నానని, అప్పుడు తాను సేవించిన పానీయంలో మద్యం కలిపారని, ఆ తరువాత జరిగిన ఘోర అనుభవం గురించి చెప్పలేనని సుచిత్ర పేర్కొనడం దుమారం రేపింది. ఆ తర్వాత ఆ వ్యాఖ్యలు చేసింది ‘నేను కాదు, నా ట్విట్టర్‌ను హ్యాక్ చేసి ఎవరో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసే విషయమై చర్చిస్తున్నామ’ని సుచిత్ర పేర్కొన్నారు. మొత్తం మీద సుచిత్ర ప్రవర్తన కోలీవుడ్‌ని ఒక కుదుపు కుదిపేస్తోందనే చెప్పాలి. ధనుష్, అనిరుద్, త్రిష, ఆండ్రియా తదితరులు సుచిత్ర చేసిన వ్యాఖ్యలకు, పెట్టిన ఫొటోలకు స్పందించలేదు. కాగా.. సుచిత్ర ట్విట్టర్‌ను ఎవరూ హ్యాక్ చేయలేరని, ఆ విధంగా ఆమె పాస్వర్డ్ పెట్టుకున్నారని నెటిజన్లు పేర్కొనడం గమనార్హం. మరి.. సుచిత్ర ట్విట్టర్ హ్యాక్ అయ్యిందా? ఏది నిజం? ఏది అబద్ధం? ఇదిలా ఉంటే.. తన అనుమతి లేకుండా ట్విట్టర్ ఎకౌంట్‌ను ఇతరులు అనుసరించలేని విధంగా సుచిత్ర సెట్ చేసుకున్నారు. – ‘సాక్షి’ చెన్నై -
మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..?
-
రాహుల్, మాల్యా, బర్కాలకు షాక్ ఇచ్చింది వీరే
దేశంలో ప్రముఖులు, సంపన్నుల ట్విట్టర్ అకౌంట్లు, ఈ-మెయిల్ సర్వర్లను హ్యాక్ చేస్తున్న హ్యాకింగ్ బృందాన్ని ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, విజయ్ మాల్యా, ప్రముఖ జర్నలిస్టు బర్కా దత్ ల ట్విట్టర్ అకౌంట్లు, ఈ-మెయిళ్ల సర్వర్లు హ్యాక్ చేసింది ఈ బృందమేనని వెల్లడించారు. కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నేతల అంతర్గత ఈ-మెయిళ్లను బహిర్గతం చేస్తామని లెజియన్ హ్యాకర్లు బృందం పేర్కొంది. బ్యాంకులకు రూ.7వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యాకు బుద్ధి చెప్తామని కూడా హ్యాకర్లు పేర్కొన్నారు. ఈ ఘటనలపై దృష్టి సారించిన ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు హ్యాకర్లకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. 'లెజియన్' అంటే? ఐదు దేశాల్లో ఉన్న పలువురు వ్యక్తులతో(హ్యాకర్లు) ఏర్పడిన బృందమే లెజియన్. అమెరికా, స్వీడన్, కెనడా, థాయ్ లాండ్, రొమెనియా దేశాల నుంచి వీరందరూ హ్యాకింగ్ కు పాల్పడుతున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. తమ బృందాన్ని మరింత విస్తృత పరచుకునేందుకు ఆసక్తి గల హ్యాకర్లు legion_group@sigaint.orgకు మెయిల్ చేయాలనే ఒక సందేశాన్ని వారు వదిలినట్లు చెప్పారు. అయితే, ఈ హ్యాకర్లకు 'లెజియన్ ఆఫ్ డూమ్ ఆఫ్ ది 1980' బృందానికి ఎలాంటి సంబంధాలు లేవని వెల్లడించారు. 2000వ దశకంలో ప్రముఖుల ఈ-మెయిల్ అకౌంట్ లను హ్యాక్ చేస్తూ బెంబేలెత్తించారు. కానీ, ఇరు బృందాలు హ్యాకింగ్ కు పాల్పడటానికి గల బలమైన కారణం ప్రముఖ ధనికుల అవినీతిని బయటపెట్టడం. లెజియన్ ఎందుకు హ్యాకింగ్ చేస్తోంది? ప్రపంచంలో అవినీతిని బయటపెట్టడం కోసమే లెజియన్ ఏర్పడింది. కానీ, ఈ బృందం అవినీతికి వ్యతిరేకంగా నిర్వహించిన కార్యకలాపాలు ఏవీ ఇప్పటివరకూ బయటకు రాలేదు. లెజియన్ ఎలా పని చేస్తుంది? సాధారణ సర్వర్ల ద్వారా కాకుండా ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారో కనుగొనలేని సర్వర్లు, బ్రౌజర్ల ద్వారా లెజియన్ పని చేస్తోంది. అంటే సాధారణ బ్రౌజర్లైన గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ ల ద్వారా కాకుండా 'ది ఆనియన్ రౌటర్(టీఓఆర్)' అనే బ్రౌజర్ ద్వారా వీరు నెట్ ను వినియోగిస్తారు. దీన్నే డార్క్ నెట్ అని కూడా అంటారు. దీన్ని కొంతమంది యాక్టివిస్టులు, జర్నలిస్టులు ఉపయోగిస్తుంటారు. ఇలాంటి హ్యాకింగ్ సంస్ధలు ఇంకా ఉన్నాయా? అవును. ఇలాంటి సంస్ధలు ఇంకా ఉన్నాయి. 2003లో వివిధ దేశాలకు చెందిన యాక్టివిస్టులు, హ్యాక్టివిస్టులు కలిసి అసోసియేటెడ్ ఇంటర్నేషనల్ నెట్ వర్క్ పేరిట ఓ సంస్ధను ప్రారంభించారు. ఇలాంటి సంస్ధల్లో ఒకరు ఈ పని చేయాలని ఎవరూ సూచించరు. కేవలం తమ వద్ద ఉన్న ఆలోచనలను పంచుకుని వాటిని కార్యరూపం దాల్చేలా చేయడానికి యత్నిస్తారు. ఈ గ్రూపు పెద్ద ఎత్తున ప్రభుత్వ వెబ్ సైట్లు, కార్పొరేట్, మత గ్రూపులకు చెందిన సైట్లను పలుమార్లు క్రాష్ చేశాయి. -
ట్రాయ్ చైర్మన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
న్యూఢిల్లీ: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ ట్విట్టర్ అకౌంట్ శనివారం హ్యాంకింగ్ కు గురైంది. శర్మ అకౌంట్ ను హ్యాక్ చేసిన హ్యాకర్లు ఆయన గురించి అసభ్యకరమైన పోస్టులు పెట్టారు. దీనిపై ప్రకటన విడుదల చేసిన ట్రాయ్ అధికారులు.. మెసేజ్ లలో ఉన్న సారాంశంపై స్పందించొద్దని కోరారు. శర్మ ప్రస్తుతం అధికారిక పనుల మీద ఫిజి, ఆస్ట్రేలియాల పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు. టెలికాం సంస్థల ఆర్ధిక విషయాలపై రెగ్యులేటరీ పాత్ర కాన్ఫరెన్స్ కోసం ఆయన ఆస్ట్రేలియా వెళ్లినట్లు తెలిసింది. -
శ్రీశ్రీ రవిశంకర్ ఆశ్రమంలో బుర్హాన్ వనీ తండ్రి
న్యూఢిల్లీ: ఉగ్రసంస్థ హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్‌తో ఒకపక్క కశ్మీర్ రగిలిపోతుంటే అతని తండ్రి ముజఫర్ వనీ... ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఈ విషయాన్ని స్వయంగా రవిశంకర్ తన ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించారు. బెంగళూరులోని ఆశ్రమంలో ముజఫర్ రెండ్రోజులు ఉన్నాడని, ఈ సందర్భంగా పలు అంశాలు చర్చించామని ట్వీట్లో శ్రీశ్రీ పేర్కొన్నారు. -
కొత్త ట్విట్టర్ ఖాతా తెరిచిన హేమ
ముంబై: బాలీవుడ్ సీనియర్ నటి, ఎంపీ హేమ మాలిని కొత్త ట్విట్టర్ ఖాతా తెరిచారు. తన పాత ట్విట్టర్ ఖాతాను సినిమా, నృత్య కార్యక్రమాల వివరాలు అందించడానికి పరిమితం చేసుకోవాలని నిర్ణయించారు. 'హేమమలిని ఎంపీ ఎంటీఆర్' పేరుతో కొత్త ట్విట్టర్ ఖాతా తెరిచినట్టు ఆమె వెల్లడించారు. తన నియోజకవర్గం మథురలో తన చేపట్టే కార్యకలాపాల వివరాలు దీని ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంటానని చెప్పారు. మథురలో తాను పాల్గొన్న కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలు ఇందులో పెట్టారు. జూన్ లో మథురలో హింసాత్మక ఘటనలు జరిగిన సమయంలో ట్విట్టర్ పేజీలో తన సినిమా షూటింగ్ కు సంబంధించిన ఫొటో పోస్టు చేసి ఆమె విమర్శలపాలయ్యారు. సొంత నియోజకవర్గం హింసాత్మక ఘటనలతో అట్టుడిపోతుంటే ఏమీ పట్టనట్టు ఉంటారా అంటూ నెటిజన్లు ఆమెను దుమ్మెత్తి పోశారు. -
ఇక ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం..
కోల్‌కతా: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించినా.. ఆయన అధికారిక ట్విట్టర్ అకౌంట్ కొత్త పేరుతో కొనసాగనుంది. కలాంకు సన్నిహితంగా ఉండే సహాయకుల బృందం.. 'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం' పేరుతో ట్విట్టర్ అకౌంట్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. డాక్టర్ కలాం ఆలోచనలు, పాఠాలు, ప్రణాళికలను ట్విట్టర్లో పంచుకుంటామని ఆయన సహాయకులు చెప్పారు. కలాంతో సన్నిహితంగా ఉండే ఐఐఎం పూర్వ విద్యార్థి శ్రీజన్ పాల్ సింగ్.. ఈ ట్విట్టర్ అకౌంట్ బాధ్యతలు చూడనున్నారు. కలాం స్ఫూర్తిదాయక సందేశాలు, ఆయన ఉపన్యాసాలు ట్విట్ చేస్తారు. అలాగే కలాం రచనలు 'వింగ్స్ ఆఫ్ ఫైర్', 'ఇండియా 2020', 'ఇగ్నిటెడ్ మైండ్స్', 'అనదర్ బుక్', అడ్వాంటేజ్ ఇండియా' తదితర పుస్తకాలలోని ముఖ్యమైన వ్యాఖ్యాలను ట్విట్టర్లో ఉంచుతారు. ట్విట్లర్లో కలాంకు 14 లక్షల మందికిపైగా ఫాలోయర్స్ ఉన్నారు. -
ఆయనకు కోటిన్నర మంది ఫాలోవర్లు!
బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతుంటారు. సోషల్ మీడియాలో ఆయన మహా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు తోచిన విషయాలు, తెలిసిన విశేషాలను ట్విట్టర్ ద్వారా పంచుకుంటూ ఉంటారు. తన సినిమా షూటింగ్ జరుగుతుండగా అక్కడకు సమీపంలో కాల్పులు జరిగిన విషయాన్ని కూడా కొద్ది నిమిషాల్లోనే ట్వీట్ చేశారు. మరి అంత యాక్టివ్‌గా ఉండే అమితాబ్‌కు ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారో తెలుసా? అక్షరాలా కోటీ యాభై లక్షల మంది!! అవును, @srbachchan పేరుతో అమితాబ్ నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాను ఇప్పటికి కోటిన్నర మంది ఫాలో అవుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా సీనియర్ బచ్చన్ సాబ్ తెలిపారు. అంతేకాదు.. అంతమంది తనను ఫాలో అవుతున్నందుకు ఆయన ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయారు. ట్విట్టర్.. 1.5 మిలియన్.. య్యా.... బడూంబా.. అంటూ మొన్నీమధ్య ట్వీట్ చేశారీ పెద్దాయన. T 1880 - TWITTER ... 15 MILLION !!! YEEEAAAEAEAEAAAHHHHHHHHH !! BADDOOOOOOOMMMBAAAAA !! — Amitabh Bachchan (@SrBachchan) May 28, 2015 -
ఒబామా గిన్నిస్ రికార్డు!
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టారు. ట్విట్టర్లో ఖాతా తెరిచిన ఐదు గంటల్లోనే ఏకంగా పది లక్షల మంది ఫాలోవర్లను సంపాదించి, ఈ ఫీట్ సాధించిన తొలి వ్యక్తిగా రికార్డులకెక్కారు. @POTUS అనే పేరుతో ఆయన తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించారు. పోటస్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. ఈ పేరుమీద తెరిచిన అకౌంట్‌కు కేవలం ఐదు గంటల్లోనే పది లక్షల మంది ఫాలోవర్లు వచ్చిన విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ తన వెబ్సైట్లో ప్రకటించింది. ఇంతకుముందు నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ 23 గంటల 22 నిమిషాల్లో పదిలక్షల మంది ఫాలోవర్లను సంపాదించాడు. ఒబామాకు ఇంతకుముందే @BarackObama అనే ఐడీతో ట్విట్టర్ ఖాతా ఉంది. అయితే అధికారిక ఖాతా కోసం దీన్ని కొత్తగా తెరిచి, అంతలోనే పనిలో పనిగా గిన్నిస్ రికార్డు కూడా సాధించేశారు. 'హలో ట్విట్టర్! నేను బరాక్ ఒబామా. ఆరేళ్ల తర్వాత నేను సొంత ఖాతా తెరిచా' అని ఒబామా తొలిసారి ట్వీట్ చేశారు. ఇది కేవలం బరాక్ ఒబామాది మాత్రం కాదు. అమెరికా అధ్యక్షుడి అధికారిక ట్విట్టర్ ఖాతా. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తే వారికి ఈ ఖాతాను బదిలీ చేసేస్తామని వైట్‌హౌస్ ఇంటర్నెట్ స్ట్రాటజీ అసిస్టెంట్ డైరెక్టర్ అలెక్స్ వాల్ తెలిపారు. -
ఖాతా తెరవగానే.. 14.60 లక్షలమంది ఫాలోయర్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విట్టర్లో ఖాతా తెరిచిన కొన్ని గంటల్లోనే లక్షలాదిమంది అభిమానులు ఫాలోయర్లుగా చేరారు. ఒబామా ట్విట్టర్లో ఎకౌంట్ తెరిచిన 12 గంటల్లోనే ఆయన ఫాలోయర్ల సంఖ్యగా ఏకంగా 14.60 లక్షలకు చేరింది. సోమవారం ఒబామా అధికారికంగా ట్విట్టర్లో జాయినయ్యారు. 'హలో ట్విట్టర్! నేను బరాక్ ఒబామా. ఆరేళ్ల తర్వాత నేను సొంత ఖాతా తెరిచా' అని ఒబామా తొలిసారి ట్వీట్ చేశారు. కొన్ని గంటల తర్వాత న్యూజెర్సీలో తన పర్యటన గురించి ఒబామా ట్విట్టర్లో పేర్కొన్నారు. అమెరికా మాజీ బిల్ క్లింటన్ ట్వీట్‌కు స్పందిస్తూ మూడోసారి ఒబామా ట్వీట్ చేశారు. ఒబామా ట్విట్టర్లో 65 మంది ఫాలో అవుతుండగా, వీరిలో ఒక్కరూ విదేశీ నేత లేరు. -
ట్విట్టర్లోకి అడుగుపెట్టిన రాహుల్!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎట్టకేలకు సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. తోటి నాయకులంతా ట్విట్టర్‌ను ఏలేస్తున్న ఈ కాలంలో.. ఇన్నాళ్ల తర్వాత ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేశారు. @OfficeOfRG అనే ఐడీతో ట్విట్టర్ హ్యాండిల్ ప్రారంభించారు. ఆయన కేవలం మూడంటే మూడే అకౌంట్లను ఫాలో అవుతున్నారు. అవి.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ. అయితే.. ఇందులో వస్తున్న ట్వీట్లను చూస్తుంటే మాత్రం ఇది రాహుల్ గాంధీ స్వయంగా నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాలా కాకుండా, ఆయన తరఫున వేరే ఎవరో నిర్వహిస్తున్నట్లే కనిపిస్తోంది. మే 12వ తేదీన రాహుల్ గాంధీ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో 15 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారంటూ ఓ ప్రకటనను మొదటి ట్వీట్‌గా ఇచ్చారు. రాహుల్ అధికారిక కార్యక్రమాలు, రాబోయే కార్యక్రమాల గురించి ఇందులో ఉంటుందని కూడా చెప్పారు. కాగా, గురువారం రాత్రి సమయానికి సుమారు 43 వేల మంది రాహుల్ ట్విట్టర్ ఖాతాను ఫాలో అవుతున్నారు. On 12th May Rahul Gandhi will begin a 15km padyatra in Telangana's Adilabad Dist- covering 5 villages,starting from Wadial Village — Office of RG (@OfficeOfRG) May 7, 2015 -
'ఎక్కడున్నా.. మీతోనే నేను'
ముంబయి: తాను ఎక్కడ ఉన్నా అందరితో టచ్‌లో ఉంటానని అభిమానులకు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ చెప్పారు. ఇక తన ట్విట్టర్ ఖాతాను ఇక హిరల్ థక్కర్ చూసుకుంటుందని తెలియజేశారు. తన గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలని ఉన్నా.. హిరల్ను అడగొచ్చని ఆయన చివరిసారిగా ఏప్రిల్ 16న ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలను కూడా ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేశారు. ఐదేళ్ల నుంచి ట్విట్టర్లో ఉన్న ఆయన తన ఖాతాను నిర్వహించేందుకు హిరల్ను ప్రత్యేకంగా నియమించుకున్నారు. ఇక నుంచి ట్విట్టర్లో ఏం పోస్ట్ చేయాలో ఆమెకు చెబుతానని, తాను ఎక్కడ ఉన్నా మీతో టచ్‌లో ఉంటానని, నెట్ వర్క్ లేనపుడు హిరల్కు చెప్తానని అన్నారు. హిట్ అండ్ రన్ కేసులో ఆయనకు ఐదేళ్ల జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. -
వారి ప్రాణాలు తీయడం ఎంత వరకు న్యాయం?:వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: తుపాకులేమీ లేని 20 మంది కూలీల ప్రాణాలను బలిగొనడం ఎంతవరకు న్యాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యానించారు. శేషాచలం అడవుల్లో 20 మంది ఎర్రచందనం కూలీల కాల్చివేత ఘటనపై ఆయన ట్వీట్ చేశారు. ‘‘వారి చేతుల్లో ఎలాంటి తుపాకులు లేనప్పుడు 20 మంది కూలీల ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసం’’ అని వైఎస్జగన్ తన ట్విటర్ ఖాతాలో ప్రశ్నించారు. How is it fair to take the lives of 20 labourers especially when they're not carrying any guns? — YS Jagan Mohan Reddy (@ysjagan) April 8, 2015 -
కూలీల ప్రాణాలు తీయడం ఎంత వరకు న్యాయం?
-
బాబుపై ట్విట్టర్లో ధ్వజమెత్తిన వైఎస్ జగన్
హైదరాబాద్ : సోషయల్ మీడియా ట్విట్టర్లోకి ప్రవేశించిన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తొలి ట్విట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక విధానలపై ఆయన ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. రైతు హత్యలకు ఎవరు కారకులు..? మోసం చేసిన చంద్రబాబుదా...పట్టించుకోని అతని ప్రభుత్వానిదా? గట్టిగా నిలదీయని మన సమాజానిదా? అని వైఎస్ జగన్ ట్విట్టర్లో ప్రశ్నించారు. Who is responsible for the murders of these farmers? CBN who cheated? His govt which failed? Or a society which didn't question enough? — YS Jagan Mohan Reddy (@ysjagan) February 26, 2015 -
ట్విట్టర్లోకి వైఎస్ జగన్
-
ట్విట్టర్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్
ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోషల్ మీడియాలోకి ప్రవేశించారు. @ysjagan అనే ట్విట్టర్ హ్యాండిల్‌తో ఆయన డిజిటల్ మీడియాలోకి అడుగుపెట్టారు. ఇన్నాళ్లుగా ప్రజలతో మమేకం అవుతూ.. నేరుగా వారితోనే సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్న విపక్షనేత.. ఇప్పుడు నేరుగా సంప్రదించడానికి వీలుగా ట్విట్టర్ ఖాతాను తెరిచారు. యువతీ యువకులు, ఎన్నారైలు, ఇతరులు ఎవరైనా సరే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ అభిప్రాయాలు తెలియజేయడానికి, వివిధ అంశాలపై ఆయన తన మనోభావాలను పంచుకోడానికి వేదికగా ఈ ట్విట్టర్ ఖాతా ఉపయోగపడనుంది. బుధవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఈ ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ అయ్యింది. సోషల్ మీడియా విస్తృతి పెరిగిన నేపథ్యంలో ఆయా అంశాలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై ఏపీలోని ఏకైక ప్రతిపక్ష పార్టీ అధినేతగా జగన్ ట్వీటర్ ద్వారా ఎప్పటికప్పుడు స్పందించేందుకు వీలవుతుందని పార్టీ నేతలు వెల్లడించారు. @Ysrcp follow @ysjagan — YS Jagan Mohan Reddy (@ysjagan) January 9, 2015 -
ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ మానియా
-
ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ మానియా
ఎప్పుడొచ్చాం అన్నది కాదన్నయ్యా... ఎంత స్పీడ్‌గా జనాలకు కనెక్ట్ అయ్యామన్నదే ముఖ్యం ...అన్నట్లు ట్విట్టర్లో సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మానియా కొనసాగుతోంది. నూతన సంవత్సరం సందర్భంగా పవన్ ట్విట్టర్ అకౌంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దాంతో పవన్ ట్విట్టర్ ఖాతాను అభిమానులు విపరీతంగా షేర్ చేసుకుంటున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన తొలి ట్వీట్ చేశారు. అలా అకౌంట్ ప్రారంభించారో , లేదో వెంటనే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ విషయాన్ని ఫేస్బుక్లో షేర్ చేశారు. పవన్‌కు ఫాలోవర్లు నిమిష నిమిషానికీ పెరగడం మొదలుపెట్టారు. కేవలం 40 నిమిషాల్లోనే పవన్ ట్విట్టర్ ఖాతాను 5వేల మందికి పైగా ఫాలోకాగా, తాజాగా ఆ సంఖ్య 62వేలకు చేరటం విశేషం. ఇక బాలీవుడ్లో అమితాబ్, కోలీవుడ్‌లో రజనీకాంత్లకు ట్విట్టర్లో మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అమితాబ్ ...ఎప్పటికప్పుడు ట్విట్టర్లో అప్డేట్గా ఉంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకుంచున్నారు. -
ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ మానియా
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ట్విటర్లో చేరిపోయారు. ఇటీవలే కొచ్చాడయాన్ విడుదల తర్వాత తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ట్విట్టర్ ఖాతా తెరిచి అభిమానులకు సందేశాలు పంపడం, వారి వద్దనుంచి అభినందనలు అందుకోవడం చూసిన పవన్.. తాను కూడా అభిమానులకు మరింత చేరువ కావడానికి అధికారికంగా ట్విటర్ ఖాతా ఓపెన్ చేస్తే బాగుంటుందని భావించారు. ఆయన ఇలా ఓపెన్ చేశారో, లేదో వెంటనే ఆయన అభిమానులు ఆ విషయాన్ని ఫేస్బుక్లో షేర్ చేశారు. వెంటనే ఆయనకు ఫాలోవర్లు నిమిష నిమిషానికీ పెరగడం మొదలుపెట్టారు. కేవలం 40 నిమిషాల్లోనే పవన్ ట్విట్టర్ ఖాతాను 5వేల మందికి పైగా ఫాలో అయ్యారు. -
పోలీసు అధికారికి ఐఎస్ బెదిరింపులు
బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ట్వీటర్ అకౌంట్‌ను నిర్వహిస్తున్న కీలక వ్యక్తి మెహిదీ మస్రూర్ బిశ్వాస్ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన బెంగళూరు సీనియర్ పోలీసు అధికారి బెదిరింపులు వచ్చాయి. తాము బిశ్వాస్‌ను పట్టుకున్నట్లు తాను ట్వీట్ చేయగా అజ్ఞాత వ్యక్తుల నుంచి హెచ్చరికలు వచ్చాయని డీసీపీ(క్రైం) అభిషేక్ గోయెల్ తెలిపారు. అరెస్టుకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ చేసిన ట్వీట్లను పట్టించుకోమని గోయెల్ చెప్పారు. కాగా, ఐఎస్ఐఎస్లోకి కొత్త వారిని ఆకర్షించేందుకు, రిక్రూట్ చేసుకునేందుకు అకౌంట్‌ను నిర్వహిస్తున్నట్లు బిశ్వాస్ తమ విచారణలో అంగీకరించాడన్నారు. -
ఐఎస్ మద్దతుదారుడి అరెస్ట్
‘ట్వీటర్ ఖాతా’ మెహ్దీని పట్టుకున్న పోలీసులు ఐటీసీ ఫుడ్స్‌లో ఏటా 5.3 లక్షల వేతనంతో ఉద్యోగం చేస్తున్న మెహ్దీ సాక్షి, బెంగళూరు: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు వినియోగించే ట్వీటర్ ఖాతాను నిర్వహిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరుకు చెందిన మెహ్దీ మస్రూర్ బిస్వాస్(24) గత కొన్నేళ్లుగా ఈ ఖాతాను నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన ఇతడు ఐటీసీ ఫుడ్స్ సంస్థలో ఏటా రూ.5.3 లక్షల వేతన ప్యాకేజీతో ఎగ్జిక్యూటివ్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. బెంగళూరులో అద్దె నివాసం నుంచి అతడిని అరెస్టు చేసినట్లు కర్ణాటక డీజీపీ లాల్‌రుకుం పచావో శనివారమిక్కడ విలేకరులకు వెల్లడించారు. ఐఎస్ఐఎస్ ఖాతాను తానే నిర్వహిస్తున్నట్లు మెహ్దీ అంగీకరించాడని తెలిపారు. ఐఎస్ ఉగ్రవాదుల ట్వీటర్ ఖాతాను ‘షామీ విట్నెస్’ పేరుతో బెంగళూరుకు చెందిన మెహ్దీ నిర్వహిస్తున్నాడని, బ్రిటన్‌కు చెందిన చానల్ ‘4 న్యూస్’ బయటపెట్టిన సంగతి తెలిసిందే. అరెస్టు చేస్టున్న సమయంలో మెహ్దీ నుంచి ఎలాంటి ప్రతిఘటన లేదని బెంగళూరు పోలీసు కమిషనర్ ఎంఎన్ రెడ్డి తెలిపారు. ‘బిశ్వాస్‌పై ఐపీసీ సెక్షన్ 125 (వ్యక్తిగతంగాగానీ సమూహంగాగానీ ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించడం లేదా అందుకు యత్నించడం), సెక్షన్ 18, సెక్షన్ 39లతోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్ 66 కింద కేసులు నమోదు చేశాం. అతడి నుంచి రెండు ఫోన్లు, ఒక ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నాం’’ అని తెలిపారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నామని, మన దేశం వరకైతే ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాల్లో అతడి ప్రమేయం లేదని అన్నారు. ఐఎస్ ఉగ్రవాద సంస్థలో బిశ్వాస్ ఇప్పటివరకు ఎవరినీ చేర్చలేదని. విదేశాలకు కూడా ఎప్పుడూ వెళ్లలేదని అన్నారు. పగలు ఉద్యోగం.. రాత్రి ఇంటర్నెట్లో.. బిశ్వాస్ పగలంతా ఉద్యోగం చేస్తూ రాత్రి వేళలో ఇంటర్నెట్ ముందు గడిపేవాడని డీజీపీ పచవ్ తెలిపారు. ఐఎస్ఐఎస్/ఐఎస్ఎల్ వెబ్సైట్లలో బ్రేకింగ్ న్యూస్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 60 జీబీ డేటా సామర్థ్యంగల ఇంటర్నెట్ కనెక్షన్‌ను వాడుతున్నాడని వివరించారు. బిశ్వాస్కు ఇద్దరు అక్కలు ఉన్నారని, ఇతడి తండ్రి పశ్చిమబెంగాల్ విద్యుత్ బోర్డులో పనిచేసి రిటైర్డ్ అయ్యారని వివరించారు. నమ్మను: బిశ్వాస్ తండ్రి కోల్‌కతా: బిశ్వాస్కు ఐఎస్‌తో సంబంధాలున్నాయని నమ్మడం లేదని ఆయన తండ్రి శ్వాస్ చెప్పారు. కుమారుడి ఇంటర్నెట్ అకౌంట్‌ను ఎవరైనా హ్యాక్ చేసి ఉండొచ్చని అన్నారు. ‘‘ఈ విషయం తెలియగానే శుక్రవారం ఫోన్ చేసి అడిగాను. ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావడం లేదని చెప్పాడు’ అని తెలిపారు. -
'షమీ విట్నెస్' పేరుతో ట్వీట్స్...!
బెంగళూరు : ఐఎస్ఐఎస్ ట్విట్టర్ అకౌంట్ వెనుక బెంగళూరుకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ హస్తం ఉన్నట్లు బ్రిటన్ ఛానల్ 4 న్యూస్‌లో ప్రత్యేక కథనం వెలువడింది. 'షమీ విట్నెస్' పేరుతో ట్వీట్స్, తీవ్రవాద సంస్థలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నట్లు పేర్కొంది. 'షమీ విట్నెస్' పేరిట ఆతను నిర్వహిస్తున్న ట్విట్టర్ ఖాతాను 17,700 మంది ఫాలో అవుతున్నట్లు ఆ ఛానల్ వెల్లడించింది. అలాగే జిహాదీలు, ఉగ్రవాద మద్దతుదారులు, నియామకాలు జరిపే వారికి ఈ ఖాతా ఒక వారధిగా మారిందని ఛానల్ 4 పేర్కొంది. అయితే ఈ కథనంపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తోక ముడిచిన పాక్ ఉగ్రవాది
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని చంపుతామంటూ హెచ్చరికలు జారీచేసిన ఉగ్రవాది తోకముడిచాడు. వాఘా సరిహద్దుల వద్ద ఆత్మాహుతి దాడి జరిపి, దాదాపు 61 మంది ప్రాణాలను బలిగొన్న సంఘటనకు తామే బాధ్యులమని చెప్పుకొన్న తెహరిక్ ఎ తాలిబన్ పాకిస్థాన్‌కు అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎహసానుల్లా ఎహసాన్.. తాజాగా తన ట్విట్టర్ ఖాతాను మూసేశాడు. వాఘా పని అయిపోయిందని, ఇక తమ తదుపరి లక్ష్యం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీయేనని ట్విట్టర్ వేదికగా ఎహసానుల్లా ఎహసాన్ గతంలో హెచ్చరికలు చేశాడు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి తన ట్విట్టర్ అకౌంట్‌ను అతడు మూసేశాడు.