న్యూఢిల్లీ: మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ కొత్త బాస్, టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పారు. దాదాపు 1.5 బిలియన్ల ఇన్‌యాక్టివ్ ఖాతాలను తొలగిస్తోంది. 1.5 బిలియన్ ఖాతాల నేమ్ స్పేస్‌ను ఖాళీ చేయడం1.5 బిలియన్ ఖాతాల నేమ్ స్పేస్‌ను ఖాళీ చేస్తున్నానంటూ మస్క్ శుక్రవారం ట్వీట్ చేశారు. (108 ఎంపీ కెమెరాతో అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్, ఫస్ట్ సేల్ ఆఫర్ కూడా!)
ప్లాట్‌ఫారమ్‌లో సంవత్సరాలుగా చురుగ్గా లేకుండా, ఎలాంటి ట్వీట్స్ లేకుండా, కనీసం లాగిన్ కూడా కాని 1.5 బిలియన్ ఖాతాల పేర్లను తొలగించనున్నట్టు తేల్చి చెప్పారు. అంతేకాదు యూజర్ అకౌంట్ స్టేటస్‌ను తెలిపే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌పై తాము పనిచేస్తున్నామన్నారు. దీని ద్వారా తమ ట్వీట్‌లు "షాడో బ్యానింగ్" ఎందుకు ఎలా అయిందో, ఎలా అప్పీల్ చేయాలో వినియోగదారులకు తెలుస్తుందన్నారు. (భారత్‌పే కో-ఫౌండర్, మాజీ ఎండీకి భారీ షాక్!)
Twitter will soon start freeing the name space of 1.5 billion accounts
— Elon Musk (@elonmusk) December 9, 2022
"ట్విట్టర్ ఫైల్స్ 2" లో సంచలన విషయాలను వెల్లడించింది. అలాగే ఒక రహస్య టీం ఆధ‍్వర్యంలో అప్పటి సీఈవో జాక్ డోర్సీ సెలబ్రిటీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే షాడో బ్యానింగ్ లాంటి వివాదాస్పద నిర్ణయాలను తీసుకుందని ఆరోపించింది. ఈ సీక్రెట్ గ్రూప్‌లో లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ హెడ్ (విజయ గద్దే), గ్లోబల్ హెడ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ (యోయెల్ రోత్), మాజీ జాక్ డోర్సే, పరాగ్ అగర్వాల్ ఇతరులు ఉన్నారని ది ఫ్రీ ప్రెస్ ఫౌండర్, ఎడిటర్ బారీ వీస్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment