Twitter Rolls Out Grey Tick Mark for Govt, Golden for Companies - Sakshi
Sakshi News home page

ప్రభుత్వాలకు ట్విటర్‌ గ్రే టిక్‌..

Published Wed, Dec 21 2022 12:40 PM | Last Updated on Wed, Dec 21 2022 1:09 PM

Twitter Rolls Out Grey Tick Mark For Govt And Golden For Companies - Sakshi

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్‌ తాజాగా ప్రభుత్వాలకు సంబంధించిన అధికారిక ఖాతాలకు బూడిద రంగు (గ్రే) టిక్‌ మార్కును, కంపెనీలకు బంగారు వర్ణం (గోల్డెన్‌) టిక్‌ మార్కును కేటాయించడం ప్రారంభించింది. మిగతా వెరిఫైడ్‌ ఖాతాలకు బ్లూ టిక్‌ మార్క్‌ ఉంటుంది. కొత్త మార్పుల ప్రకారం భారత ప్రభుత్వ హ్యాండిల్, ప్రధాని నరేంద్ర మోదీ హ్యాండిల్‌ టిక్‌ మార్క్‌ను బ్లూ నుంచి గ్రేకు మార్చింది.

ప్రధాని ట్విటర్‌ ఖాతాకు 8.51 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. నెలకు 8 నుంచి 11 డాలర్ల వరకూ చార్జీలతో ట్విటర్‌ బ్లూ సర్వీసు అందిస్తున్న కంపెనీ ప్రస్తుత సబ్‌స్క్రయిబర్స్‌ తమ సబ్‌స్క్రిప్షన్‌ను అప్‌గ్రేడ్, రద్దు లేదా ఆటో – రెన్యూ చేసుకోవచ్చని పేర్కొంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రిటన్‌ దేశాల్లో ట్విటర్‌ బ్లూ సర్వీస్‌ అందుబాటులో ఉంది.

చదవండి: 8 ఏళ్లలో రూ. 4 లక్షల కోట్లు.. డిజిన్వెస్ట్‌మెంట్‌తో కేంద్రం ఆదాయం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement