Govt
-
త్వరలో ప్రభుత్వ క్రెడిట్ కార్డులు..
కేంద్ర ప్రభుత్వం నుంచి క్రెడిట్ కార్డులను (Credit Cards) సూక్ష్మ పరిశ్రమ వ్యవస్థాపకులు త్వరలో అందుకోనున్నారు. 2025 కేంద్ర బడ్జెట్లో (Union Budget 2025-26) హామీ ఇచ్చినట్లుగా మైక్రో ఎంట్రాప్రెన్యూర్లకు రూ. 5 లక్షల పరిమితితో క్రెడిట్ కార్డులను ఏప్రిల్ నుంచి కేంద్ర ప్రభుత్వం జారీ చేయనుంది.ఈ సౌకర్యం రాబోయే కొన్నేళ్లలో సూక్ష్మ-యూనిట్లకు అదనంగా రూ. 30,000 కోట్ల నిధులను అందించగలదు. ఇది వ్యాపార విస్తరణ కోసం ఇతర రుణ ఎంపికలకు అనుబంధంగా ఉంటుంది. ఈ పథకం నుండి ప్రయోజనం పొందడానికి, క్రెడిట్ కార్డు అందుకునేందుకు చిరు వ్యాపారులు నమోదు చేసుకోవాలి. ఈ నేపథ్యంలో రూ. 5 లక్షల పరిమితితో ఈ క్రెడిట్ కార్డును పొందడానికి అర్హత ప్రమాణాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..క్రెడిట్ కార్డు లిమిట్, షరతులురూ. 5 లక్షల లిమిట్ కలిగిన ఈ క్రెడిట్ కార్డ్.. చిరు దుకాణాలను, చిన్న తరహా తయారీ పరిశ్రమలను నిర్వహించేవారికి అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుల యూపీఐ లావాదేవీలు, బ్యాంక్ స్టేట్మెంట్లు వ్యాపార పరిస్థితులు అంచనా వేసిన తర్వాత ఈ క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తారు. కార్డుకు ఒక సంవత్సరం చెల్లుబాటు వ్యవధి ఉంటుంది. రూ. 10-25 లక్షల మధ్య వార్షిక టర్నోవర్ ఉన్నవారు మాత్రమే ప్రభుత్వ మైక్రో-క్రెడిట్ కార్డుకు అర్హులు.దరఖాస్తు ప్రక్రియప్రభుత్వం జారీ చేసే ఈ క్రెడిట్ కార్డును పొందడానికి, దేశవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులు ముందుగా ఉద్యమ్ (Udyam) పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. అనంతరం ఎంఎస్ఎంఈ క్రెడిట్ కార్డును పొందవచ్చు. పోర్టల్‌లో నమోదుకు ఈ దశలు పాటించండి..» అధికారిక ఉద్యమ్ పోర్టల్ msme.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. » 'క్విక్ లింక్స్' పై క్లిక్ చేయండి.» 'ఉద్యమ్ రిజిస్ట్రేషన్' ఎంచుకోండి.» రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలను అనుసరించండి. -
టార్గెట్ ఎఫ్‌డీఐ.. విధానాల సవరణకు యోచన!
దేశంలోకి మరిన్ని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను (FDI) ఆకట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా కొన్ని రంగాలలో విధానాలను సవరించాలని యోచిస్తోంది. తద్వారా మరిన్ని ఎఫ్‌డీఐలకు దారి చూపాలని చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తాజాగా పేర్కొన్నారు.ఈ బాటలో వివిధ ప్రభుత్వ శాఖలు, నియంత్రణ సంస్థలు, పారిశ్రామిక సహచర సంస్థలు, అడ్వయిజరీ, న్యాయ సంస్థలు, పెన్షన్ ఫండ్స్, ప్రయివేట్ ఈక్విటీ(పీఈ) సంస్థలు, వెంచర్స్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ తదితరాలతో అంతర్గత వాణిజ్యం, పారిశ్రామిక ప్రోత్సాహక శాఖ(డీపీఐఐటీ) సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా దేశీయంగా మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించుకునేందుకు అభిప్రాయాలు, సూచనలకు ఆహ్వానం పలికింది.వెరసి వివిధ శాఖలు, విభాగాలతో చర్చలు పూర్తిచేసినట్లు ప్రభుత్వ అధికారి వెల్లడించారు. దీంతో విభిన్న సమస్యలపై సలహాలు, సూచనలు అందుకున్నట్లు తెలియజేశారు. అయితే ఇంతవరకూ ఏ అంశాలపైనా తుది నిర్ణయాలకు రాలేదని తెలియజేశారు. నిబంధనలు, విధానాలను సరళతరం చేయడంపై ప్రస్తుతం దృష్టి సారించినట్లు వివరించారు. కాగా.. ఏఏ రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టిందీ వెల్లడించలేదు. -
వచ్చే బడ్జెట్లో భారీ శుభవార్త! ట్యాక్స్ తగ్గుతుందా?
రాబోయే 2025-26 బడ్జెట్లో ( 2025-26 Budget ) కేంద్ర ప్రభుత్వం ( Govt ) భారీ శుభవార్త చెప్పబోతోంది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రూ. 15 లక్షల వరకు వార్షిక సంపాదనపై ఆదాయపు పన్నును ( Income Tax ) తగ్గించే అవకాశం ఉందని రెండు ప్రభుత్వ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ నివేదిక పేర్కొంది. వృద్ధి మందగమనం మధ్య ఆర్థిక వ్యవస్థలో వినియోగాన్ని పెంచడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్య తీసుకోనున్నట్లు వివరించింది.పౌరులపై భారాన్ని తగ్గించేందుకు ఆదాయపు పన్ను రేట్లను తగ్గించాలని ప్రముఖ ఆర్థికవేత్తలు కూడా ప్రధాని నరేంద్ర మోదీని ( Narendra Modi ) కోరారు. రాబోయే బడ్జెట్‌పై వారి అభిప్రాయాలు సూచనలను వినడానికి నీతి ఆయోగ్‌లో ( NITI Aayog ) ప్రఖ్యాత ఆర్థికవేత్తలు, వివిధ రంగాల నిపుణులతో ప్రధాని మోదీ ఇటీవల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆదాయపు పన్నును తగ్గించాలని, కస్టమ్స్ టారిఫ్‌లను హేతుబద్ధీకరించాలని, రాబోయే బడ్జెట్లో ఎగుమతులకు మద్దతు ఇచ్చే చర్యలను ప్రవేశపెట్టాలని ఆర్థికవేత్తలు, నిపుణులు ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ( Nirmala Sitharaman ) 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ను 2025 ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. కాగా గత జులైలో 2024-25 బడ్జెట్ సందర్భంగా ఆదాయపు పన్ను చట్టంపై సమగ్ర సమీక్షను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ వీకే గుప్తా నేతృత్వంలో సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారు. 2025-26 బడ్జెట్‌కు ముందు ప్యానెల్ తన నివేదికను సమర్పించాల్సి ఉంది.అయితే కొత్త ఐటీ చట్టం రాబోయే బడ్జెట్ సెషన్లో ఉండదని, ఇది అమలులోకి రావడానికి ఏడాదికిపైగా సమయం పడుతుందని మనీ కంట్రోల్ రిపోర్ట్ పేర్కొంది. ‘మార్పులకు అనుగుణంగా వ్యవస్థలు మారాలి. ఇది పూర్తిగా కొత్త చట్టం కాబట్టి, చాలా క్లిష్టంగా ఉంటుంది. అన్ని నియమాలు కొత్త ఫారమ్‌లను ప్రారంభించాలి. పరీక్షించాలి.. సిస్టమ్-ఇంటిగ్రేట్ చేయాలి దీనికి సమయం కావాలి’ అని సీనియర్ ప్రభుత్వ అధికారిని ఉటంకిస్తూ నివేదించింది. -
లారెన్స్ బిష్ణోయ్‌ని కేంద్రం సంరక్షిస్తోంది: కేజ్రీవాల్ ఆరోపణ
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు ప్రభుత్వం నుంచి రక్షణ లభిస్తోందని ఆయన ఆరోపించారు.ఢిల్లీలో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ విధ్వంసం సృష్టిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. లారెన్స్ బిష్ణోయ్ బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లోని సబర్మతి జైలులో ఉన్నాడని, అక్కడి నుంచే దోపిడీ రాకెట్ నడుపుతున్నాడని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీలో భద్రతపై అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీలో ప్రశ్నలను లేవనెత్తుతూ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఢిల్లీలో చోటుచేసుకున్న పలు సంఘటనలను ఆయన ప్రస్తావించారు. #WATCH | In the Delhi Assembly, AAP MLA and party's national convener Arvind Kejriwal says, "In the last 10 years, Delhi's law and order is going from bad to worse, especially since 2019 when Amit Shah became the Home Minister...He is unable to handle Delhi...Incidents of murder… pic.twitter.com/vjCa9rGK4h— ANI (@ANI) November 29, 2024గత పదేళ్లలో ఢిల్లీలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 2019లో అమిత్ షా హోంమంత్రి అయినప్పటి నుండి ఢిల్లీ పరిస్థితి అధ్వాన్నంగా మారిందని ఆరోపించారు. నేరాలను అరికట్టడంలో ఆయన అసమర్థులుగా కనిపిస్తున్నారని, ఢిల్లీలో హత్యాయుత ఘటనలు తరచూ జరుగుతున్నాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఢిల్లీలోని జనానానికి దోపిడీ కాల్స్ వస్తున్నాయని, గ్యాంగ్ వార్, కాల్పులు బహిరంగంగానే జరుగుతున్నాయని ఆయన వాపోయారు. నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని కేజ్రీవాల్ ఆరోపించారు.ఇది కూడా చదవండి: కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి -
‘హైడ్రా’కు చట్టబద్ధత
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పర్యవేక్షణ, పరిరక్షణ ఏజెన్సీ (హైడ్రా)కు విస్తృతాధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీనితో ఇకపై ‘హైడ్రా’ చేపట్టబోయే కార్యకలాపాలకు చట్టబద్ధత లభించనుంది. ‘హైడ్రా’ చట్టబద్ధతపై హైకోర్టు పలుమార్లు ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో.. ప్రభుత్వం స్పందించి ఆర్డినెన్స్‌ను రూపొందించింది. ఇప్పటివరకు హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్‌కు ఉన్న పలు అధికారాలను ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌తో తన అధీనంలోకి తీసుకుంది. అయితే ‘హైడ్రా’ ఆర్డినెన్స్‌పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా.. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ నివృత్తి చేశారని, దీనితో గవర్నర్ ఆమోద ముద్ర వేశారని అధికారవర్గాలు తెలిపాయి. తక్షణమే అమల్లోకి..హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాల పరిరక్షణ.. చెరువులు, కుంటలు, పార్కులు, ఆటస్థలాలు వంటివి కబ్జా అవకుండా కాపాడటంతోపాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు ఎన్వోసీ జారీచేయడం తదితర లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం జూలై 19న జీవో ఎంఎస్ నంబర్ 99 ద్వారా ‘హైడ్రా’ను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల పరిధిలో ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తున్నప్పటికీ.. తాజాగా ఆర్డినెన్స్ ద్వారా కీలక అధికారాలను అప్పగించారు. ఈ సవరించిన జీహెచ్ఎంసీ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చిందని అధికారులు తెలిపారు. వచ్చే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలపనున్నట్టు వెల్లడించారు.ప్రపంచంలో ఉత్తమ నివాసయోగ్య నగరంగా..రాష్ట్రంలో పన్ను రాబడి, జీఎస్డీపీలో మూడో వంతు ఆదాయ వనరు అయిన హైదరాబాద్ ప్రపంచంలోని ఉత్తమ నివాస యోగ్య నగరాల్లో ఒకటిగా అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీలు గుర్తించాయని గెజిట్ నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పనలో, ఈజ్ ఆఫ్ లివింగ్తోపాటు ఆర్థిక, పారిశ్రామిక కార్యక్రమాల్లో హైదరా బాద్ పేరెన్నికగన్నదని తెలిపింది. వివిధ ప్రగతిశీల విధానా ల ద్వారా ఈ ఆకర్షణను కొనసాగించడానికి హైదరాబాద్ పాలనా యంత్రాంగం ప్రయత్నిస్తోందని వివరించింది.ప్రత్యేక ఏజెన్సీ ఆవశ్యకత ఉందంటూ..ఇటీవలి భారీ వర్షాలు, వరదలు హైదరాబాద్ నగరం దుర్భల పరిస్థితికి అద్దం పట్టాయని ప్రభుత్వం ఆర్డినెన్స్‌లో పేర్కొంది. ఆకస్మిక పరిస్థితులు, విపత్తుల కోసం ప్రత్యేక ఏజెన్సీల అవసరం ఉందని.. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల నిర్వహణ కోసం సమర్థమైన స్థితిస్థాపక వ్యవస్థలను అమలు చేయడానికి ఈ ఏజెన్సీలను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. జీహెచ్ఎంసీ మరింత విస్తృతంగా పనిచేయడానికి, అధికారాలను బలోపేతం చేయడానికి ఈ ఏజెన్సీల ఆవశ్యకత ఎంతో ఉందని వివరించింది. ఆక్రమణలకు గురయ్యే చెరువులు, కుంటలు వంటి నీటి వనరులు, గ్రీనరీ, బహిరంగ ప్రదేశాలు, కమ్యూనిటీ ఆస్తులు మొదలైన విలువైన వాటి రక్షణకు సంబంధించి ప్రత్యేక ఏజెన్సీ అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీకి అవసరమైన సామర్థ్యాన్ని అందించడానికి ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చట్టం–1955’కు అవసరమైన సవరణలు చేయడం తప్పనిసరని తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌ను ‘గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సవరణ) ఆర్డినెన్స్– 2024’గా పేర్కొంది.కొత్తగా ‘సెక్షన్ 374–బీ’ని చేరుస్తూ ఆర్డినెన్స్ఆర్డినెన్స్తో జీహెచ్ఎంసీ చట్టం–1955లో కొత్తగా 374–బీ సెక్షన్‌ను చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం.. కార్పొరేషన్, ప్రభుత్వ ఆస్తులను రక్షించే అధికారం పూర్తిగా ప్రభుత్వ అధీనంలోకి వెళ్తుంది. కార్పొరేషన్, కమిషనర్లకు సంబంధించిన అధికారాలను ఎవరైనా అధికారికి, లేదా ఏజెన్సీకి అప్పగించడానికి అవకాశం ఉంటుంది. ఒక రకంగా ప్రస్తుతం జీహెచ్ఎంసీ కమిషనర్‌కే పరిమితమైన అధికారాలన్నీ ఇకపై ప్రభుత్వానికి సంక్రమిస్తాయి. తద్వారా రోడ్లు, డ్రెయిన్లు, వీధులు, జల వనరులు, ఖాళీ స్థలాలు, పబ్లిక్ పార్కులు మొదలైన ఆస్తుల పరిరక్షణ వంటివాటి ఆక్రమణలు, విపత్తుల నుంచి రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. -
మా పొట్ట కొట్టొద్దు
అమలాపురం టౌన్/తిరుపతి అర్బన్: కొత్త మద్యం పాలసీని రూపొందిస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రభుత్వ మద్యం దుకాణాలను తొలగించే ప్రయత్నంలో ఉందని తెలిసి ఆ దుకాణాల్లో పనిచేస్తున్న సేల్స్‌మెన్, నైట్ వాచ్మెన్, సూపర్వైజర్లు ఆందోళన బాట పట్టారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఏపీ బ్రూవరీస్ లిమిటెడ్ లిక్కర్ డిపో పరి«ధిలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బంది ఆదివారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు.ముమ్మిడివరం, మలికిపురం, అంబాజీపేట మండల కేంద్రాల్లో నిరసనలకు దిగి తమ పొట్ట కొట్టవద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కొత్త మద్యం పాలసీ వల్ల తాము ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదే జరిగితే కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అమలాపురం డిపో పరిధిలో ఉన్న సుమారు వంద ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దాదాపు 350 మంది వరకూ సేల్స్‌మెన్, సూపర్వైజర్లు, నైట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నామన్నారు. ముమ్మిడివరం, లంకతల్లమ్మ గుడి సెంటర్ నుంచి పోలమ్మ చెరువు వరకూ ఆందోళనకారులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మలికిపురం గాంధీ సెంటర్, అంబాజీపేటల్లో ధర్నా చేశారు. అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు. రాజోలు మాజీ ఎమ్మెల్యే రాపాక దర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించండి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ మద్యం పాలసీ పద్ధతిలో 2019 నుంచి పనిచేస్తున్న కారి్మకులు డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ఎస్వీ హైసూ్కల్ గ్రౌండ్ నుంచి టౌన్ క్లబ్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. పలువురు కారి్మకులు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీ పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించనున్నట్లు తెలుస్తోందని చెప్పారు. తమను మద్యం షాపుల్లో అవకాశం లేకుంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. లేనిపక్షంలో సెపె్టంబర్ 7 నుంచి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
ప్రభుత్వ పథకాలు భేష్
సాక్షి ప్రతినిధి, వరంగల్/సాక్షి, యాదాద్రి: షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధికి, పేదలు, గిరిజనులు, ఆదివాసుల అభ్యున్నతికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చెప్పారు. ప్రభుత్వ పథకాలు బాగున్నాయంటూ కితాబిచ్చారు. ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాలకు సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ఇదే స్ఫూర్తి నిరంతరం కొనసాగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలతో గిరిజనులు, ఆదివాసులు అన్ని రంగాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మంగళవారం మూడు రోజుల రాష్ట్ర పర్యటన ప్రారంభించిన గవర్నర్.. యాదాద్రి జిల్లా పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో ములుగు జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకున్నారు. మంత్రి ధనసరి సీతక్క (అనసూయ), భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ శబరీష్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా భేటీ ఆయ్యారు. కలెక్టర్, ఎస్పీ, డీఎఫ్ఓలు ములుగు జిల్లా సమగ్ర అభివృద్ధిపై ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ములుగు జిల్లాలో కంటైనర్ హాస్పిటల్ వినూత్నంగా ఏర్పాటు చేయడంపై మంత్రి సీతక్కను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. రామప్ప గుడి, కోటగుళ్లు సందర్శన ములుగు జిల్లాకు చెందిన రచయితలు, కవులు, కళాకారులు, జాతీయ, అంతర్జాతీయ క్రీడా అవార్డు గ్రహీతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో జిష్ణుదేవ్ వర్మ సమావేశమయ్యారు. రామప్ప గుడి, సరస్సును సందర్శించారు. రామలింగేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప ఆలయ నిర్మాణం, విశిష్టత, శాండ్ బాక్స్ టెక్నాలజీ, శిల్పసంపద రమణీయతను తెలుసుకున్నారు. రామప్ప దేవాలయం మహాద్భుత కట్టడమని పేర్కొన్నారు.అనంతరం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని కోటగుళ్లు గణపేశ్వరాలయాన్ని గవర్నర్ వర్మ సందర్శించారు. తర్వాత లక్నవరం చేరుకుని రాత్రిబస చేశారు. ఈ కార్యక్రమాల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎస్పీ రణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు. కాగా గవర్నర్ బుధ, గురువారాల్లో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజలు బాగుండాలని యాదాద్రీశుని కోరుకున్నా అంతకుముందు ఉదయం రాజ్‌భవన్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన గవర్నర్ తొలుత యాదాద్రికి చేరుకున్నారు. విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆయనకు స్వాగతం పలికారు. రాష్ట్ర దేవాదాయశాఖ, సమాచార పౌర సంబంధాల శాఖల కమిషనర్ ఎం.హనుమంతరావు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో గవర్నర్‌కు అధికారులు, వేద పండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గవర్నర్ ముందుగా శ్రీస్వామివారి పుష్కరిణి వద్ద స్నాన సంకల్పం చేశారు. అఖండ జ్యోతి దీపారాధన చేసి మొక్కు టెంకాయ సమర్పించారు. తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోనికి ప్రవేశించారు. ధ్వజ స్తంభం వద్ద మొక్కిన తర్వాత అంతరాలయంలో అర్చన పూజచేశారు. దర్శనానంతరం గవర్నర్‌కు మహా మండపంలో వేద మంత్రాలతో వేదాశీ్వరచనం చేశారు. ఆలయం కట్టడాలను పరిశీలించిన గవర్నర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆలయ ఈఓ భాస్కర్‌రావు స్వామి వారి మెమొంటోను అందజేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి స్వామి వారి ప్రసా దాన్ని అందజేశారు. కలెక్టర్ హనుమంత్ కె.జెండగే, పలువురు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆయన వెంట ఉన్నారు. కాగా తెలంగాణ ప్రజలు బాగుండా లని లక్ష్మీనరసింహస్వామిని కోరుకున్నానని గవ ర్నర్ దేవాలయం వెలుపల మీడియాతో చెప్పారు. -
24 గంటలు ఓపీ వైద్యసేవలు బంద్
సాక్షి, హైదరాబాద్: కోల్‌కతాలో యువ పీజీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఓపీ వైద్యసేవలు నిలిపి వేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) పిలుపునిచ్చింది. అయితే అత్యవసర వైద్య సేవలను మినహాయించింది. కోల్‌కతాలో వైద్యురాలి హత్యను తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం నేత డాక్టర్ నరహరి తీవ్రంగా ఖండించారు.శనివారం తెలంగాణ ప్రభుత్వ వైద్యులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని, ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఒక గంట పాటు నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చారు. జూనియర్ డాక్టర్లు ఇప్పటికే సమ్మె చేస్తున్న కారణంగా అవసరమైతే ఒక గంట ఎక్కువగా పనిచేసి ఓపీ నిర్వహించాలన్నారు. కోల్‌కతా ఘటనను తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదల ఖండించారు. జూడాలు చేస్తున్న ధర్నాలకు హాజరు కావాలని నిర్ణయించామన్నారు. మంత్రి దామోదర సంఘీభావం డాక్టర్లు, నర్సులు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం ఒక ప్రకటనలో సంఘీభావం తెలిపారు. డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో డాక్టర్లు, నర్సింగ్ ఆఫీసర్లు, ఇతర వైద్య సిబ్బందికి భద్రత కల్పించాలని ఆయన ప్రిన్సిపాళ్లు, ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో సేవలను అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది భద్రతపై శాఖ ఉన్నతాధికారులతో మంత్రి చర్చించారు. ఇందిరా పార్కు వద్ద నేడు ధర్నా సుల్తాన్‌బజార్: మహిళా వైద్యురాలిపై అత్యాచారం,హత్య ఘటనను నిరసిస్తూ శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇందిరాపార్కులోని ధర్నాచౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ పి.కాళీప్రసాద్‌రావు డాక్టర్ జె.విజయరావులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ యాంటీ క్వాకరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి కూడా ధర్నాను విజయవంతం చేయాలన్నారు.నల్లబ్యాడ్జీలు ధరించి నేడు నిరసన వ్యక్తం చేయాలన్న నర్సుల సంఘంఉత్తరాఖండ్లో నర్సింగ్ ఆఫీసర్‌పై అత్యాచారం, హత్య, షాద్‌నగర్‌లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నర్సింగ్ ఆఫీసర్‌పై జరిగిన దాడితోపాటు కోల్‌కతాలో పీజీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారం, హత్యను తెలంగాణ ప్రభుత్వ నర్సుల సంఘంప్రధాన కార్యదర్శి మరియమ్మ తీవ్రంగా ఖండించారు. శనివారం తెలంగాణ ప్రభుత్వ నర్సింగ్ ఆఫీసర్స్ అందరూ తమ షిఫ్ట్ డ్యూటీలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. -
ఆ బ్యాంకుల్లో ఖాతాలు క్లోజ్.. కర్ణాటక సంచలన నిర్ణయం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ల పట్ల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఆ బ్యాంకుల్లో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఖాతాలను మూసివేయాలని బుధవారం అన్ని శాఖలను ఆదేశించింది.రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని శాఖలు, సంస్థలు, కార్పొరేషన్లు, బోర్డులు, స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర సంస్థలు ఈ బ్యాంకుల నుంచి తమ డిపాజిట్లు, పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. అలాగే ఈ బ్యాంకుల్లో కొత్త డిపాజిట్లు లేదా పెట్టుబడులు కూడా పెట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది.ఆయా బ్యాంకుల్లో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో అవకతవకలు, అనధికార లావాదేవీలు జరిగినట్లు రోపణలు వచ్చిన నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఆరోపణలకు సంబంధించి గతంలోనే హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడంతో ఖాతాలను మూసివేయాలనే నిర్ణయానికి దారితీసిందని ప్రభుత్వం తెలిపింది. రూ.187 కోట్ల కార్పొరేషన్ నిధులకు సంబంధించి అనధికార లావాదేవీలు జరిగిందని, ఇందులో రూ.88.62 కోట్లు ఐటీ కంపెనీల ఖాతాల్లోకి, హైదరాబాద్‌లోని సహకార బ్యాంకుకి బదిలీ అయినట్లు తేలిందని ఉత్తర్వుల్లో పేర్కొంది. -
ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన స్మృతీ ఇరానీ
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆమె గత పదేళ్లుగా ఈ బంగ్లాలో ఉంటున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె ప్రభుత్వం కేటాయించిన నివాసాన్ని ఖాళీ చేయవలసి వచ్చింది. ఎన్నికల్లో ఓడిపోయిన ఎంపీలంతా జూలై 11లోగా తమ నివాసాలను ఖాళీ చేయాల్సివుంది. దీనిపై స్మృతీ ఇరానీకి నోటీసు రావడంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు.2024 లోక్‌సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీ యూపీలోని అమేథీ నుంచి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆమె ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ నేపధ్యంలో ఆమె నివాసం ఉంటున్న ఢిల్లీలోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలంటూ ఆమెకు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని స్టేట్ డైరెక్టర్ నుంచి నోటీసు వచ్చింది. దీంతో ఆమె బంగ్లాను ఖాళీ చేశారు. -
నీట్ పేపర్ లీకేజీలో మరో కీలక పరిణామం.. రంగంలోకి దిగిన సీబీఐ
సాక్షి,ఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే నీట్ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజా కేంద్రం ఆదేశాలతో సీబీఐ కేసు నమోదు చేసింది. దీంతో నీట్‌పై వస్తున్న ఆరోపణలపై సీబీఐ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనుంది. కాగా, బీహార్‌లో జరిగిన లీకేజీతో పాటు గ్రేస్ మార్క్‌లపై సీబీఐ దృష్టి సారించనుంది.కేంద్రం నిర్ణయంతో నీట్ పరీక్ష లీకేజీపై కేంద్ర విద్యాశాఖ అప్రమత్తమైంది. నీట్ పరీక్ష ప్రక్రియ, నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు సిఫార్సుల కోసం ఇస్రో మాజీ చైర్మన్ కే.రాధాకృష్ణన్ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ తరుణంలో పేపర్ లీకేజీపై దర్యాప్తు చేయాలంటూ కేంద్రం సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగింది. పేపర్ లీకేజీపై కేసు నమోదు చేసుకుంది.720కి 720 మార్కులువైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్-యూజీ2024 ప్రవేశ పరీక్ష మే 5న జరిగింది. దేశ వ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో నీట్ చరిత్రలో ఎన్నడూ రాని విధంగా 67 మంది విద్యార్ధులకు 720కి 720 మార్కులు రావడం అనుమానాలు తెరపైకి వచ్చాయి.విద్యార్ధుల్లో ఉత్కంఠతీగ లాగితే డొంకంతా కదిలినట్లు నీట్ పేపర్ లీకేజీ జరిగినట్లు తేలింది. లీకేజీలో నిందితుల హస్తం ఆరా తీయగా.. బీహార్‌లో కేంద్రంగా నీట్ పేపర్ చేతులు మారాయని, పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, వరుస పరిణామాలపై సీబీఐ కేసు నమోదు చేయడంతో నీట్ పరీక్ష లీకేజీ ఎటుకి దారి తీసుస్తుందోనని విద్యార్ధులు, వారి తల్లిదండ్రుల్లో ఉత్కంఠ నెలకొంది. -
అక్రమాలకు పాల్పడిన టీచర్ల జంట.. రూ. 9 కోట్లు రికవరీకి చర్యలు
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే అక్రమాలకు పాల్పడితే.. అది కూడా తమకు ఉద్యోగాన్నిచ్చిన ప్రభుత్వాన్నే మోసగించాలని చూస్తే.. దాని పర్యవసానం ఎలా ఉంటుందో రాజస్థాన్‌లో వెల్లడయ్యింది. తమ స్థానంలో డమ్మీ టీచర్లను నియమించి, ఉద్యోగ విధులను చేస్తున్నట్లు నాటకమాడిన ఉపాధ్యాయ దంపతులపై ఇప్పుడు కోలుకోలేని దెబ్బ పడింది.రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో తమ స్థానంలో డమ్మీ టీచర్లను ఏర్పాటు చేసి, వారి చేత పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్న ఉపాధ్యాయ దంపతుల అక్రమాలపై విద్యాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి నుంచి రూ.9 కోట్ల 31 లక్షల 50 వేల 373 రికవరీ చేయాలని విద్యాశాఖ తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం విష్ణు గార్గ్ 1996 నుండి, అతని భార్య మంజు గార్గ్ 1999 నుంచి బరన్ జిల్లా పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు తమ బదులు డమ్మీ టీచర్లను నియమించి, వారిచేత విద్యార్థులకు బోధన సాగేలా చూస్తున్నారు. 2017లోనే వీరి వ్యవహారం బయటపడింది. అయితే రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉచ్చు బిగించింది.పోలీసులు, విద్యా శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి, ఈ ఇద్దరు ఉపాధ్యాయుల స్థానంలో నియమితులైన ముగ్గురు డమ్మీ ఉపాధ్యాయులను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఆ ఉపాధ్యాయ దంపతులు అరెస్టుకు భయపడి పరారయ్యారు. అక్రమాలకు పాల్పడిన ఈ ఇద్దరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తెలిపారు. -
డ్రైవింగ్ టెస్ట్ లేకుండా లైసెన్స్.. ప్రభుత్వం స్పష్టత
గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఏడీటీసీ), డ్రైవింగ్ స్కూళ్లు జారీ చేసిన సర్టిఫికెట్లకు సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టత ఇచ్చింది. మీడియా కథనాలపై స్పందించిన మంత్రిత్వ శాఖ జూన్ 1 నుంచి ప్రస్తుత నిబంధనల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేసింది."కొన్ని వర్గాల మీడియాలో ప్రసారం అవుతున్న వార్తలకు సంబంధించి, సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 లో గుర్తింపు పొందిన డ్రైవర్ శిక్షణ కేంద్రాలకు నిర్దేశించిన నిబంధనలు 31బీ నుంచి 31జే వరకు 2021 జూన్ 7న జీఎస్ఆర్ 394 (ఇ) ప్రకారం చేర్చడం జరిగింది. ఈ నిబంధనలు 2021 జులై 1 నుంచి అమలులో ఉన్నాయి. కొత్తగా 2024 జూన్ 1 నుంచి వీటిలో ఎటువంటి మార్పు ఉండదు" అని రవాణా శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.డ్రైవింగ్ టెస్ట్ తప్పనిసరిఅంటే 2021 జూలై 1 నుంచి ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని, 2024 జూన్ 1 నుంచి ఎలాంటి మార్పులు చేయలేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలాగే గుర్తింపు పొందిన డ్రైవర్ ట్రైనింగ్ సెంటర్లు (ఫారం 5బి) లేదా ఇతర డ్రైవింగ్ స్కూళ్ల (ఫారం 5) నుంచి కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ పొందినప్పటికీ డ్రైవింగ్ పరీక్ష నుంచి మినహాయింపు ఉండదని రవాణా శాఖ పునరుద్ఘాటించింది. -
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత
దేశంలో ఉల్లి ఎగుమతులపై విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ ఉల్లిపాయల ఎగుమతి విధానాన్ని నిషేధిత జాబితా నుంచి తొలగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు తక్షణమే అమలులోకి వచ్చేలా కనీస ఎగుమతి ధరను మెట్రిక్ టన్నుకు 550 డాలర్లు (రూ.45,860)గా నిర్ణయించింది.ఈమేరకు విదేశీ వాణిజ్య విధానంలో సవరణలు చేస్తున్నట్లు మే 4 నాటి నోటిఫికేషన్లో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) పేర్కొంది. మే 3 నుంచి ఉల్లిపై ప్రభుత్వం 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. దీంతో 40 శాతం సుంకంతో ఉల్లిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు వీలు కలుగుతుంది.ప్రస్తుతం ఉల్లి ఎగుమతిపై నిషేధం ఉంది. అయితే మిత్ర దేశాలైన యూఏఈ, బంగ్లాదేశ్‌లకు మాత్రం నిర్దిష్ట పరిమాణంలో ఉల్లి ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. గత ఏడాది ఆగస్టులో ఉల్లిపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది. 2023 డిసెంబర్లో ఎగుమతి నిషేధం విధించిన దాదాపు ఐదు నెలల తర్వాత ఏప్రిల్ 26న, మహారాష్ట్ర నుంచి ప్రధానంగా ఆరు పొరుగు దేశాలకు 99,150 మిలియన్ టన్నుల ఉల్లిని ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. -
ఆంధ్రప్రదేశ్‌కు టెస్లా!?
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో మ్యాన్యుఫ్యాక్చర్ యూనిట్ నెలకొల్పాలని అమెరికాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లాకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. టెస్లా యాజమాన్యానికి ఇప్పటికే రెండు ఈ-మెయిల్స్ పంపామని, స్థల పరిశీలనకు రావాలని ఆహ్వానించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ ఏప్రిల్ 22న ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేజిక్కించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. టెస్లా కంపెనీకి రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని తెలియజేసింది. ఒకవేళ టెస్లా ప్రైవేట్ భూమిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి కూడా సహకారం అందించనున్నట్లు భరోసా ఇచ్చింది. అనంతపురం జిల్లాలో.. “రాష్ట్రాన్ని సందర్శించి, వారి యూనిట్ ఏర్పాటుకు అవసరమైన భూములను పరిశీలించాలని టెస్లాను ఆహ్వానించాం. వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. అన్ని జిల్లాల్లో తగినంత భూమి అందుబాటులో ఉందని, వారు తమ ప్లాంట్‌ను నెలకొల్పేందుకు కావాల్సిన చోట భూమిని ఇస్తామని చెప్పాం. చెన్నై, బెంగళూరు, కృష్ణపట్నం ఓడరేవులకు సమీపంలో ఉన్నందున అనంతపురం జిల్లాలో కియా ప్లాంట్ సమీపంలో భూములను ప్రతిపాదించాం. ఇది బెంగళూరుకు దగ్గరగా ఉంటుంది. అలాగే చెన్నై, కృష్ణపట్నం పోర్టుకు దగ్గరగా ఉండాలనుకుంటే నాయుడుపేట, శ్రీ సిటీ సమీపంలో భూములు పరిశీలించవచ్చు" అని ఒక సీనియర్ అధికారి పేర్కొన్నట్లుగా ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఉటంకించింది. ఎన్నికల తర్వాత.. టెస్లా బృందం రాష్ట్రానికి వచ్చి వారి అవసరాలకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటే వారికి ప్రభుత్వ భూమి లేదా ప్రైవేట్ పార్టీల నుంచి భూమిని కొనుగోలు చేసైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అధికారి వివరించారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత టెస్లా బృందాలు ఆంధ్రప్రదేశ్‌కి వస్తాయన్నారు. ప్లాంట్ నిర్మాణానికి 2,500 ఎకరాలకు పైగా భూమి అవసరమని అంచనా. మస్క్ ప్రధానిని కలుస్తున్నప్పటికీ ఎలక్షన్ కోడ్ కారణంగా టెస్లా తయారీ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన చర్చల ఫలితం బయటకు రాదని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. వాస్తవానికి, 2021, 2022 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంటు ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ను ఆహ్వానించింది. ఇప్పుడు మరోసారి మస్క్ భారతదేశ పర్యటన గురించి తెలుసుకున్న తర్వాత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. -
ప్రభుత్వ ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్
మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాల ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ నిబంధన విధించింది. ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం ఇకపై ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టు, డిజైనర్, ప్రింటెడ్ దుస్తులు ధరించి స్కూలుకు రాకూడదు. ఈ విషయమై ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఉపాధ్యాయులు తమ వస్త్రధారణ విషయంలో హద్దులకు లోబడి ఉండాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ధరించే ఆధునిక దుస్తులు విద్యార్థులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని ఆ నోటిఫికేషన్లో వివరించారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మహిళా ఉపాధ్యాయులు, పురుష ఉపాధ్యాయులకు వేర్వేరు రకాల డ్రెస్ కోడ్లు అమలు చేయనున్నారు. మహిళా ఉపాధ్యాయులు జీన్స్ , టీ-షర్టులు, ముదురు రంగులు, డిజైన్లు లేదా ప్రింట్లు ఉన్న దుస్తులను ధరించకూడదు. వారు కుర్తా దుపట్టా, సల్వార్, చురీదార్, లేదా చీర ధరించాలని తెలిపారు. పురుష ఉపాధ్యాయులు, షర్టు, ప్యాంటు ధరించాలని మార్గదర్శకాలలో పేర్కొన్నారు. షర్టును ప్యాంట్‌లోకి టక్ ఇన్ చేయాలని సూచించారు. ఈ నిబంధనలు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకే కాకుండా ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు కూడా వర్తిస్తాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాగా ఈ డ్రెస్ కోడ్‌పై పలువురు ఉపాధ్యాయులు వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు ఏమి ధరించాలి? ఏమి ధరించకూడదనేది వారి వ్యక్తిగత విషయమని, దానిపై వారికి ప్రత్యేక హక్కు ఉంటుందని వారంటున్నారు. ఉపాధ్యాయుల వస్త్రధారణ విద్యార్థులపై దుష్ప్రభావం చూపకూడదనే ఉద్దేశ్యంతోనే డ్రెస్‌కోడ్‌ను రూపొందించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
అలా కుదరదు.. ఏఐ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌లు భారత్‌లో తమ ఉత్పత్తులను ఎలా పడితే అలా భారత్ మార్కెట్లోకి తీసుకురావడం కుదరదు. భారత్‌లో ఏఐ ఉత్పత్తులు ప్రారంభించే ముందు ప్రభుత్వ ఆమోదం పొందటం తప్పనిసరి. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. "తమ ఏఐ మోడల్స్‌ను ల్యాబ్ నుండి నేరుగా మార్కెట్‌కి తీసుకెళ్లడంలో మరింత క్రమశిక్షణతో ఉండటానికి ఇది సహాయపడుతుంది. డిస్క్లెయిమర్లు, కాపలా వ్యవస్థ ఉండాల్సిందే. తద్వారా వినియోగదారుకు ఏది నమ్మదగనిదో తెలుస్తుంది" అని మంత్రి అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు తక్షణమే అమలయ్యేలా చూడాలని, దీనికి సంబంధించిన తీసుకున్న చర్యలు, ప్రస్తుత స్థితిపై 15 రోజుల్లోగా నివేదికను మంత్రిత్వ శాఖకు సమర్పించాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కాగా ఈ ఆదేశాలు ఫిబ్రవరి 29న జారీ అయినట్లు మనీకంట్రోల్ నివేదిక తెలిపింది. ఏదైనా తప్పుడు సమాచారం లేదా డీప్‌ఫేక్ సృష్టికర్తను గుర్తించడానికి ఏఐ రూపొందించిన కంటెంట్‌ను శాశ్వత ప్రత్యేకమైన మెటాడేటా లేదా ఐడెంటిఫైయర్‌తో లేబుల్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఎర్రర్‌కు గురయ్యే మోడల్‌ను అమలు చేయాలనుకుంటే, దానిని టెస్టింగ్‌లో ఉన్నట్లు లేబుల్ చేయాలి. ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇది ఎర్రర్-ప్రోన్ ప్లాట్‌ఫారమ్ అని పేర్కొంటూ యూజర్ నిర్ధారణ, సమ్మతిని స్పష్టంగా తీసుకోవాలని మంత్రి వివరించారు. -
రూపాయి నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
నిత్యజీవితంలో మనం రోజూ 1, 2 , 5 రూపాయల నాణేలను చూస్తూనే ఉన్నాం, చలామణి చేస్తూనే ఉన్నాం. అయితే ఒక రూపాయి తయారు కావడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఐదు రూపాయలు తయారు చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. నిజానికి ఒక రూపాయి నాణేన్ని తయారు చేయడానికి 111 పైసలు (రూ.1.11), రెండు రూపాయల నాణెం కోసం రూ.1.28, ఐదు రూపాయల నాణెం తయారీకి రూ.3.68 ఖర్చు అవుతుంది. ఇక 10 రూపాయల నాణెం కోసం రూ.5.54 ఖర్చు అవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించినట్లు సమాచారం. మొత్తం మీద ఒక రూపాయి తయారీకి.. ఒక రూపాయి కంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుందని స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: మొన్న వార్నింగ్.. ఇప్పుడు ఆఫీస్ స్పేస్ - టెక్ దిగ్గజం కొత్త వ్యూహం! నాణేలు ముంబై, అలీపూర్ (కోల్‌కతా), సైఫాబాద్ (హైదరాబాద్), చెర్లపల్లి (హైదరాబాద్), నోయిడా (యుపి) లోని నాలుగు భారత ప్రభుత్వ మింట్లలో ముద్రిస్తారు. నాణేలు ఆర్బీఐ చట్టం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ద్వారా మాత్రమే చలామణి కోసం జారీ చేస్తారు. -
డాక్టర్లు యాంటీబయాటిక్స్ రాసిస్తున్నారా? కేంద్రం కీలక సూచనలు
ఏదైనా అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లినప్పుడు వైద్యులు రకరకాల మందులు, యాంటీబయాటిక్స్ రాసిస్తుంటారు. అయితే ఆ యాంటీబయాటిక్స్ ఎందుకు రాశారు.. ఆవశ్యకత ఏంటన్నది సామాన్యులకు తెలియదు. డాక్టరు చెప్పారు కదా చాలామంది వాడేస్తూ ఉంటారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా వైద్యులకు పలు కీలక సూచనలు చేసింది. కారణం రాయాల్సిందే.. రోగులకు యాంటీబయాటిక్స్ సూచించడానికి గల కారణాన్ని, ఆవశ్యకతను ప్రిస్క్రిప్షన్‌లో పేర్కొనడం తప్పనిసరి చేయాలని వైద్య కళాశాలలు, వైద్య సంఘాలలోని డాక్టర్లకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అత్యవసరంగా విజ్ఞప్తి చేసింది. అలాగే ఫార్మసిస్ట్‌లు కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, అర్హత కలిగిన డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ విక్రయింవద్దని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డాక్టర్ అతుల్ గోయెల్ కోరారు. వైద్య కళాశాలలు, మెడికల్ అసోసియేషన్ వైద్యులందరినీ ఉద్దేశించి రాసిన జనవరి 1 నాటి లేఖలో యాంటీమైక్రోబయాల్స్ దుర్వినియోగం, మితిమీరిన వాడకం డ్రగ్-రెసిస్టెంట్ పాథోజెన్స్ అభివృద్ధికి దోహదపడుతుందని డాక్టర్ అతుల్ గోయెల్ ఉద్ఘాటించారు. యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ (AMR) అనేది ప్రపంచ ప్రజారోగ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించిందన్నారు. దీనివల్ల 2019లో మాత్రమే ప్రపంచవ్యాప్తంగా సుమారు 12.7 లక్షల మరణాలు సంభవించాయన్నారు. ఇవికాక అదనంగా 49.5 లక్షల మరణాలు డ్రగ్-రెసిస్టెంట్ ఇన్ఫెక్షన్లతో సంబంధం కలిగి ఉన్నాయన్నారు. -
ఇలా సెలవులిచ్చారు.. అలా క్యాన్సిల్ చేశారు!
దేశ రాజధాని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం బుధవారం వరకు పాఠశాలలకు సెలవులు పొడిగిస్తూ జారీ చేసిన సర్క్యులర్‌ను ఉపసంహరించుకుంది. సెలవులు పొడిగిస్తూ సర్క్యులర్ జారీ చేసిన గంటలోపే విద్యాశాఖ డైరెక్టరేట్ ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. సెలవు పొడిగింపుపై తగిన నిర్ణయం తీసుకున్న తర్వాత ఢిల్లీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ కొత్తగా మళ్లీ సర్క్యులర్ జారీ చేయనుంది. దేశ రాజధాని ఢిల్లీలో చలిగాలులు, పొగమంచు కారణంగా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర పాఠశాలలకు సెలవులు పొడిగించారు. జనవరి 10 వరకు పాఠశాలలు మూసివేయాలని విద్యాశాఖ డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే పొరపాటుగా సెలవుల ఉత్తర్వు జారీ అయ్యిందని విద్యా శాఖ పేర్కొంది. సెలవుల పొడిగింపుపై ఆదివారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో విపరీతమైన చలిగాలుల వీస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా విజిబిలిటీ చాలా తక్కువగా ఉంది. పగటిపూట సూర్యకాంతి చాలా తక్కువగా ఉంటోంది. దట్టమైన పొగమంచు కారణంగా, విమానాలు, రైళ్ల రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అటువంటి పరిస్థితిలో విద్యార్థులకు పిల్లలకు ఉపశమనం కలిగించేందుకు శీతాకాలపు సెలవులను పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. -
అర్జెంటీనాను ఎక్కడికి తీసుకెళ్తున్నారు?
అర్జెంటీనా నూతన అధ్యక్షుడు జేవియర్ మిలీ.. ఇలా అధికారం చేపట్టారో లేదో అంతలోనే అనూహ్య నిర్ణయాలు తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఏడాది ఐదు వేల మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టులను రద్దు చేస్తున్నట్లు జేవియర్ మిలీ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. జేవియర్ మిలీ డిసెంబర్ 10న అర్జెంటీనా నూతన అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేశారు. సంక్షోభంలో కూరుకున్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా చర్యలు ప్రారంభించారు. దేశంలోని ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు పలు రంగాలలో కోతలు, పెట్టుబడుల తగ్గింపులకు శ్రీకారం చుట్టారు. జేవియర్ మిలీ ప్రమాణ స్వీకారోత్సవంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో, ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఎలి కోహెన్ పాల్గొన్నారు. కాగా 2023కు ముందు నియమితులైన ప్రభుత్వ ఉద్యోగుల కాంట్రాక్టులను సమీక్షించనున్నట్లు మిలీ ప్రభుత్వ అధికారులు తెలిపారు. అర్జెంటీనాలో త్వరలో ద్రవ్యోల్బణం దాదాపు 200 శాతానికి చేరుతుందనే అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వ నిబంధనలు, ఎగుమతులు, పెట్టుబడులను సవరించేందుకు ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. అలాగే ప్రభుత్వ ఆధ్వర్యంలోని పలు పరిశ్రమలను ప్రైవేటీకరించేందుకు అనుమతిస్తానని మిలే ప్రకటించారు. దేశాన్ని పునర్నిర్మాణ మార్గంలో తీసుకెళ్లడం, ప్రజలకు స్వేచ్ఛ, స్వయంప్రతిపత్తి కల్పించడం, దేశ ఆర్థికాభివృద్ధికి ఆటంకంగా ఉన్న నిబంధనలను సవరించడమే తన లక్ష్యమని మిలీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పలు ప్రభుత్వ కంపెనీలను ప్రైవేటీకరణపరం చేయనుందని నూతన అధ్యక్షుడు జేవియర్ మిలీ తెలిపారు. ఈ చర్యలలో పెసా (అర్జెంటీనా కరెన్సీ) విలువను 50 శాతం మేరకు తగ్గించడం, ఇంధనం, రవాణా సబ్సిడీలపై కోత, కొన్ని ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు స్వస్తి పలకడం వంటివి ఉన్నాయి. 53 ఏళ్ల మైలీ తన ఎన్నికల ప్రచారంలో తాను దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతానని, ఇందుకోసం పలు మార్పులు చేస్తానని పేర్కొన్నారు. దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రస్తుత తరుణంలో నిరాశ చెందిన అర్జెంటీనా ప్రజలకు ఆయన ఆశాజ్యోతిగా కనిపించారు. ఈ నేపధ్యంలో ప్రజా మద్దతుతో ఆయన ఆ కొత్త అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుని నిర్ణయాలివే.. తన 21 క్యాబినెట్ పదవులలో 12 పదవులను తొలగించారు. ఐదువేల మంది మంది ప్రభుత్వ ఉద్యోగులను ఇంటికి పంపించారు. లెక్కలేనన్ని ప్రభుత్వ నిబంధనలకు ముగింపు పలికారు. మిలిటరీలో అనేక మార్పులు చేశారు. ఆత్మరక్షణ హక్కును నిర్ధారించే బిల్లుకు మద్దతు పలికారు. చిన్నారుల ఇంటి విద్యను చట్టబద్ధం చేసే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. బిట్‌కాయిన్‌లో చట్టబద్ధమైన చెల్లింపు ఒప్పందాలకు శ్రీకారం పలికారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ దిశగా ముందడుగు వేశారు. సొంత చమురు పరిశ్రమను తెరిచే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ భీకర దాడులు.. 24 గంటల్లో 200 మంది మృతి -
అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రహ్లాద్ జోషి
ఢిల్లీ: అన్ని అంశాలపై ప్రభుత్వం చర్చకు సిద్దంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. ఈ సెషన్ లో 21 బిల్లులు తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. జనవరిలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుందని పేర్కొన్నారు. పార్లమెంట్ అఖిలపక్ష సమావేశం నేడు ముగిసింది. ఈ సమావేశానికి 23 పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో ప్రహ్లాద్ జోషి మాట్లాడారు. పేదల కోసం అనేక అద్భుత పథకాలు తెచ్చాం.. అయిదేళ్లలో ప్రభుత్వం సాధించిన విజయాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నామని ప్రహ్లాద్ జోషి తెలిపారు. పూర్తి స్థాయిలో జరగాల్సిన చివరి సెషన్.. స్వల్ప కాలిక చర్చకు వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విపక్షాలదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నేడు(శనివారం) నిర్వహించ తలపెట్టిన అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీకి వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష భేటీ సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4 నుంచి 22 వరకు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో రెండు జమ్మూకశ్మీర్, పుదుచ్చేరిలలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. వివాదాస్పద ఎన్నికల కమిషనర్ల నియామకం బిల్లును కూడా ప్రభుత్వం ఈ సమావేశంలో ప్రవేశపెట్టనుంది. #WATCH | Delhi: An all-party meeting is underway at the Parliament Library building, ahead of the winter session of Parliament. The winter session of Parliament, 2023 will begin from December 4 and continue till December 22. pic.twitter.com/PSwDtGFyPk — ANI (@ANI) December 2, 2023 శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114కు పెంచే బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకు రానుంది. దీనివల్ల కశ్మీర్ నుంచి వలస వెళ్లినవారికి, శరణార్థులకు, ఎస్టీలకు చట్టసభలో ప్రాతినిథ్యం లభించనుంది. ఈ బిల్లులతోపాటు 2023-24కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్లపై సమావేశాల్లో చర్చ, ఓటింగ్ జరగనుంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఐపిసి , సీఆర్పీసీలను మారుస్తూ కొత్త బిల్లులను తీసుకురానున్నారు. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇవి చివరి శీతాకాల సమావేశాలు గమనార్హం. వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్ష నేతలు సిద్ధమవుతున్నారు. ఇదీ చదవండి: Rajasthan Exit Poll Analysis: కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు? -
‘ఆ కంపెనీకి ప్రత్యేక రాయితీలుండవు..’
దేశంలోకి టెస్లా కార్లు ప్రవేశపెట్టేలా ఎలాన్‌మస్క్ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా దేశంలో కార్లు తయారీ కేంద్రాలు నెలకొల్పోందుకు కొన్ని మినహాయింపులు, రాయితీలు అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం ప్రత్యేకంగా టెస్లాకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. విద్యుత్ వాహన రంగంలో ఒక కంపెనీకి నిర్దిష్టంగా ప్రోత్సాహకాలు, మినహాయింపులు ఇవ్వడం జరగదని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఒకవేళ అలాంటివి ఏవైనా ఉంటే దేశంలో ప్రవేశించాలనుకునే వారితో పాటు ఈవీ తయారీదారులందరికీ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందని పేర్కొన్నారు. టెస్లా డిమాండ్‌పై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య చర్చలు జరిగాయన్నది వాస్తవమే అయినప్పటికీ.. తుది నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు. టెస్లా 2021 నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగా ఈవీలపై దిగుమతి సుంకాలను గణనీయంగా తగ్గించాలని కోరుతోంది. పూర్తిగా విదేశాల్లో తయారై భారత్‌కు వచ్చే వాహనాలపై ప్రస్తుతం 100 శాతం వరకు సుంకం వర్తిస్తోంది. విలువతో సంబంధం లేకుండా ఈ సుంకాన్ని 40 శాతానికి తగ్గించాలని టెస్లా కోరింది. దీనికి ససేమిరా అన్న ప్రభుత్వం దేశీయంగా తయారీ ప్రారంభించడంతో పాటు ప్రాంతీయంగానే విడిభాగాలను కొనుగోలు చేయాలని షరతు విధించింది. దీంతో టెస్లా ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఈ ఏడాది జూన్‌లో ప్రధాని మోదీ, ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సైతం కాలిఫోర్నియాలోని టెస్లా తయారీ కేంద్రాన్ని సందర్శించారు. దీంతో టెస్లా ఎంట్రీకి సంబంధించిన ప్రయత్నాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో టెస్లాకు కస్టమ్స్ సుంకంలో భారత్ మినహాయింపు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందంటూ వార్తలు వచ్చాయి. మరోవైపు ఒక కంపెనీకి ప్రత్యేకంగా ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని దేశీయ ఈవీ తయారీ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. -
నో డౌట్ గహ్లోత్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాదు! మోదీ జోస్యం
రాజస్తాన్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇరు పార్టీలు రసవత్తరంగా ప్రచార దూకుడిని పెంచేశాయి. ఎవరికీ వారు తమ పార్టీ గెలుస్తుందని ప్రగాల్బాలు పలుకుతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం దుంగార్పూర్లోని సగ్వారాలో జరుగుతున్న ప్రచార ర్యాలీలో కాంగ్రెస్‌పై తారా స్థాయిలో విరుచుకుపడ్డారు. తాను రాజస్తాన్‌లో ప్రసిద్ధ "మావ్జీ మహారాజ్ జీ!" ఆశీస్సులతో చెబుతున్నా.. కచ్చితంగా మళ్లీ గహ్లోత్ ప్రభుత్వం రానే రాదని జోస్యం చెప్పారు. ఈ పుణ్యభూమిలో ఉన్న గొప్పశక్తే తనను ఇలా అనేలా డేర్ చేయించిందని అన్నారు. తాను చెప్పిన జోస్యం ఫలించేలా రాజస్థాన్ ప్రజలే తిరగ రాయాలని అన్నారు. ఈ మేరకు మోదీ ఆ బహిరంగ ర్యాలీలో గహ్లోత్ ప్రభుత్వంలో జరిగిన పేపర్ లీక్‌లను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు. విద్యా విషయంలో అనుసరిస్తున్న దారుణమైన విధానల వల్లే యువత కలలు కల్లలయ్యాయని అన్నారు. ప్రభుత్వ నియామకాలన్నింటిలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్కామ్‌లకు పాల్పడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ దుష్టపాలన కారణంగానే మీ పిల్లలకు అన్యాయం జరిగిందన్నారు. ప్రజలు కాంగ్రెస్ గ్యారంటీ హామీల మాయలో పడకుండా ఉన్న తరుణంలోనే మోదీ హామీలన్నీ వేగంగా చేరువవ్వడమే గాకుండా రాజస్తాన్ కూడా వేగంగా అభివృద్ధి పథంలోకి దూసుకుపోగలదన్నారు. అందుకోసం అయినా కాంగ్రెస్‌ని తరిమికొట్టలాని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనను మార్చే శక్తి ప్రజాస్వామ్యానికి ఉంది. ఈ టైంలో మీరు చేసే ఒక్క చిన్నపాటు ఐదేళ్ల పాటు మీకు కష్టాన్ని తెచ్చి పెడుతుందనే విషయాన్ని గుర్తించుకోండి. అంతేగాదు కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అందేలా కాంగ్రెస్‌ని దూరం పెట్టడం అనేది అత్యంత ముఖ్యం అని చెప్పారు. రాజస్తాన్‌లో తమ పథకాలన్నీ అత్యంత వేగంగా అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు. నిజానికి కాంగ్రెస్ నాయకులు ఎక్కడకు వెళ్లి ఓటు వేయమని అడుగుతున్నా..ప్రజల నుంచి..ఓట్లు పడవన్నా!.. ఒకే ఒక్క సమాధానం వస్తుందని విమర్శించారు మోదీ. కాగా మూడు రోజుల్లో రాజస్తాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ద్విముఖ హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కానీ వివిధ ప్రాంతీయ చిన్న చిన్న పార్టీల కూడా ఏదోరకంగా తమ ఆధిక్యతను చాటుకోవాలనే యత్నం చేస్తుండటం విశేషం . (చదవండి: "పనౌటీ" దుమారం! మోదీని 'దురదృష్టం'తో పోలుస్తూ వ్యాఖ్యలు!) -
జీఎస్టీపై ప్రభుత్వం వరుస సమావేశాలు! ఏం మార్పులొస్తాయో..
వస్తు సేవల పన్ను (GST)తో పాటు ఇతర పరోక్ష పన్నులపై కేంద్ర ప్రభుత్వం త్వరలో వరుస సమావేశాలు నిర్వహించనుంది. జీఎస్టీ ఫైలింగ్‌తోపాటు పరోక్ష పన్ను ప్రక్రియల్లో మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఈ మేరకు జీఎస్టీ సహా పరోక్ష పన్నుల ప్రక్రియలను సమీక్షించడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం నవంబర్‌లో వరుస సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని ఓ ప్రభుత్వ సీనియర్ అధికారిని ఉటంకిస్తూ ‘మనీ కంట్రోల్’ కథనం ప్రచురించింది. ఈ సమావేశాల్లో జీఎస్టీ పోర్టల్ పనితీరు, పరోక్ష పన్ను ప్రక్రియలు, రిటర్న్‌లను దాఖలు చేయడంలో సౌలభ్యం, సాంకేతిక లోపాలు ఏవైనా ఉంటే వాటిని ఎలా పరిష్కరించాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. రాబోయేది పూర్తి బడ్జెట్ కాదు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల కారణంగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సమీక్షా సమావేశాలకు సీబీఐసీ, జీఎస్టీఎన్‌తోపాటు అన్ని ఫీల్డ్ యూనిట్ల ఉన్నతాధికారులు కూడా హాజరు కానున్నారు. ప్రభుత్వ జీఎస్టీ వసూళ్లు అక్టోబర్‌లో ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ. 1.72 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇవి ఇప్పటివరకు రెండో అత్యధిక జీఎస్టీ వసూళ్లు. కొత్త ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్ల ప్రారంభానికి ముందే కొత్త మార్పులు అమల్లోకి వస్తాయని భావిస్తున్నారు. సవరించిన రిటర్న్‌ల దాఖలుకు డిమాండ్ జీఎస్టీలో సవరించిన రిటర్న్‌ల దాఖలుకు అవకాశం కల్పించాలని వ్యాపారులు, పన్ను కన్సల్టెంట్ల సంఘాలు కోరుతున్నాయి. మధ్యప్రదేశ్ ట్యాక్స్ లా బార్ అసోసియేషన్, కమర్షియల్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు ఆ రాష్ట్రంలోని ప్రముఖ వ్యాపార, పన్ను సంస్థలు ఇటీవల సమావేశమై ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. -
కేన్సర్ రోగుల కష్టాలకు చెక్
సాక్షి, అమరావతి: కేన్సర్ రోగుల కష్టాలకు చెక్ పెడుతూ రాష్ట్రంలోని జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్స అందించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు కేన్సర్ రోగులు చికిత్స కోసం ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు. ఇకపై వారికి రాష్ట్రంలోనే ఆధునిక చికిత్సను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది. డిసెంబరు 21 నుంచి రాష్ట్రంలోని 12 జిల్లా ఆస్పత్రుల్లో డే–కేర్ కేన్సర్ సేవలు ప్రారంభిస్తోంది. రోగులు ఈ ఆస్పత్రుల్లో హబ్ అండ్ స్పోక్ విధానంలో కీమోథెరపీ, పాలియేటివ్ కేర్ సేవలు పొందవచ్చు. తిరుపతిలోని స్విమ్స్‌తో పాటు మిగిలిన ఉమ్మడి జిల్లాల్లోని పాత 10 బోధనాస్పత్రులు హబ్స్‌గా వ్యవహరిస్తాయి. వీటికి సమీపంలోని జిల్లా ఆస్పత్రులను మ్యాపింగ్ చేశారు. రోగులకు తొలుత హబ్స్‌లో చికిత్స అందిస్తారు. ఆ తర్వాత కేన్సర్ వైద్య నిపుణుల సూచనలతో జిల్లా ఆస్పత్రుల్లోనే చికిత్స అందిస్తారు. ఇందుకోసం ప్రతి జిల్లా ఆస్పత్రిలో నాలుగు పడకలతో ప్రత్యేకంగా ఒక యూనిట్ ఏర్పాటు చేస్తారు. వైద్య సేవలందించడానికి ప్రతి యూనిట్లో ఇద్దరు వైద్యులు, నలుగురు స్టాఫ్ నర్సులు, ఒక ఫార్మాసిస్ట్, ఒక ల్యాబ్ టెక్నీషియన్‌ను నియమించారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ప్రారంభించారు. మందులు, ఇంట్రావీనస్, ఇంట్రాపెరిటోనియల్, ఇంట్రాథేకల్ ఇలా వివిధ కేన్సర్ వ్యాధులకు కీమోథెరపీ చేస్తారు. సాధారణంగా బ్రెస్ట్, తల, గొంతు కేన్సర్ రోగులకు వ్యాధి తీవ్రత, రోగి పరిస్థితి ఆధారంగా ఆరు అంతకంటే ఎక్కువ సైకిల్స్ కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుందని రాష్ట్ర కేన్సర్ కేర్ ప్రత్యేకాధికారి డాక్టర్ రమేశ్ తెలిపారు. గర్భాశయ కేన్సర్‌తో బాధపడేవారికి ఐదు సైకిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వ్యాధి నిర్ధారణ అయిన రోగులకు తొలుత రెండు సైకిల్స్ కీమోథెరపీని బోధనాస్పత్రుల్లో (హబ్స్‌లో) ఇస్తారు. అనంతరం రోగి ఉంటున్న ప్రాంతానికి దగ్గరలోని జిల్లా ఆస్పత్రికి మ్యాప్ చేస్తారు. ఇలా మ్యాప్ చేసిన రోగికి హబ్‌లోని అంకాలజీ నిపుణుడి సూచనల మేరకు మిగిలిన అన్ని సైకిల్స్ కీమోథెరపీ జిల్లా ఆస్పత్రుల్లోనే చేస్తారు. భరించలేని నొప్పితో బాధపడుతున్న రోగులకు నొప్పి నుంచి నివారణ కల్పించేలా పెయిన్ అండ్ పాలియేటివ్ కేర్ సేవలు అందిస్తారు. కేన్సర్ రోగుల వైద్యానికి ఇప్పటికే రూ.1,800 కోట్లు ఖర్చు కేన్సర్ రోగులకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా పేద, మధ్యతరగతి వర్గాల్లోని అన్ని రకాల కేన్సర్ రోగులకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యాన్ని అందిస్తోంది. 2019–20 నుంచి ఇప్పటివరకు 2.70 లక్షల మందికిపైగా రోగులు ఉచిత వైద్య సేవలు అందుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1,800 కోట్లను ఖర్చు చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ రంగంలోనే మెరుగైన కేన్సర్ వైద్య సదుపాయాలను కల్పిస్తోంది. ఈ క్రమంలో కేన్సర్ రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలందించడానికి గుంటూరు బోధనాస్పత్రిని లెవెల్–1, కర్నూలు, విశాఖ ఆస్పత్రులను లెవెల్–2 సెంటర్స్‌గా అభివృద్ధి చేస్తోంది. డిసెంబర్ 21 నుంచి ప్రారంభం డిసెంబర్ 21 నుంచి 12 జిల్లా ఆస్పత్రుల్లో డే–కేర్ కేన్సర్ సేవల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. కీమోథెరపీ, పాలియేటివ్ కేర్‌కు అవసరమైన మందులు, ఇతర సదుపాయాలను ఏపీఎంఎస్ఐడీసీ సమకూరుస్తోంది. ఇక మీదట కేన్సర్ రోగులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే వారు చికిత్స పొందవచ్చు. – డాక్టర్ వెంకటేశ్వర్, డైరెక్టర్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్విసెస్ -
సీఎం జగన్‌ను కలిసిన అమెరికాలో పర్యటించిన విద్యార్థుల బృందం
-
విదేశీ విద్యా దీవెన కింద 1,830 మందికి సాయం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తున్న ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకం కింద ఇప్పటివరకు 1,830 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం లభించింది. గత ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్య పథకం అక్రమాల పుట్టగా మారిందని విజిలెన్స్ విచారణలో వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకంలోని లోపాలను చక్కదిద్ది మరింత ఎక్కువ మందికి, మరింత ఎక్కువ ఆర్థిక సాయం అందించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న విదేశీ విద్యా దీవెన’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. దీనికింద రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ విద్యార్థులందరికీ సంతృప్త విధానంలో విదేశీ విద్యకు ప్రభుత్వం సాయమందిస్తోంది. 21 నిర్దేశిత సబ్జెక్ట్ కేటగిరీల్లో 50 విశ్వవిద్యాలయాలు, సంస్థల్లో ప్రవేశం పొందినవారికి ట్యూషన్ ఫీజు కింద రూ.కోటి 25 లక్షల వరకు ఆర్థిక సాయం (వాస్తవ రుసుం) అందిస్తోంది. ఈబీసీలు రూ.కోటి వరకు ఆర్థిక సాయానికి అర్హులు. గత టీడీపీ ప్రభుత్వం కేవలం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలు మాత్రమే సాయం అందించేది. అంతేకాకుండా ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేవారి కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ.6 లక్షలకే పరిమితం చేసింది. ఆ ఆదాయ పరిమితిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా రూ.8 లక్షలకు పెంచింది. దీంతో ఎక్కువ మంది విద్యార్థులకు మేలు జరుగుతోంది. -
భారత్‌లో స్టార్టప్ కంపెనీల సరికొత్త రికార్డ్! ఏకంగా..
భారత్‌లో పారిశ్రామిక చైతన్యం పెరుగుతూ వస్తోంది. పరిశ్రమలు స్థాపించి తమకు చేతనైనంత మందికి ఉపాధి కల్పించాలన్న స్పృహ యువతలో బాగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా ప్రోత్సాహక విధానాలను అవలంభిస్తోంది. ఫలితంగా దీంతో దేశంలో స్టార్టప్ కంపెనీ సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన స్టార్టప్‌ల సంఖ్య 2016లో 450 ఉండగా ప్రస్తుతం లక్షకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఓ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ విపరీతమైన వృద్ధిని సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. (High Severity Warning: ఐఫోన్లు, యాపిల్ ప్రొడక్ట్స్‌కు హై సివియారిటీ వార్నింగ్!) భారతదేశంలో పరిశ్రమల స్థాపన, వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. తద్వారా దేశంలో బిజినెస్ ప్రారంభించడం, నిర్వహించాడాన్ని సులభతరం చేసినట్లు వివరించారు. -
ఏపీ వైద్య విద్యలో వందేళ్ల రికార్డు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైద్య నియామకాల నుంచి మెడికల్ కాలేజీల నిర్మాణం వరకు అన్నింటా ఆదర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానంతోపాటు రాష్ట్రంలో 95% కుటుంబాలను డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చి ప్రతి ఒక్కరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఐదు కొత్త వైద్య కళాశాలలను సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ప్రారంభించనున్నారు. తద్వారా వైద్య విద్యలో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నారు. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాలలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచే ఎంబీబీఎస్ మొదటి ఏడాది తరగతులు అందుబాటులోకి వచ్చాయి. విజయనగరం వైద్య కళాశాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని అక్కడి నుంచే మిగిలిన నాలుగు కళాశాలలను కూడా ప్రారంభించనున్నారు. జిల్లాకు ఒకటి చొప్పున ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చింది. అన్ని ప్రాంతాలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను మెరుగుపరుస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలలకు ప్రభుత్వ రంగంలో శ్రీకారం చుట్టడం ద్వారా సీఎం జగన్ నూతన అధ్యాయాన్ని లిఖించారు. 17 కొత్త కళాశాలలు.. 2,550 ఎంబీబీఎస్ సీట్లు రూ.8,480 కోట్లతో 17 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నారు. కొత్త కళాశాలల ఏర్పాటు ద్వారా అదనంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వీటిలో ఒక్కో చోట 150 చొప్పున 750 సీట్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా విద్యార్థులు అడ్మిషన్లు కూడా పొందారు. వచ్చే విద్యా సంవత్సరంలో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని మెడికల్ కళాశాలలను ప్రారంభించనున్నారు. ఇక మిగిలిన 7 వైద్య కళాశాలలను 2025–26లో ప్రారంభించేందుకు వీలుగా ఆయా ప్రాంతాల్లోని ప్రభుత్వాస్పత్రులను 330 పడకల జిల్లా ఆస్పత్రులుగా ప్రభుత్వం నోటిఫై చేసింది. మూడేళ్లలోనే సీట్లు రెట్టింపు రాష్ట్రంలో ఆంధ్రా వైద్య కళాశాల 1923లో మొదటిసారిగా ఏర్పాటైంది. ఆ తరువాత మరో పది ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు ద్వారా 2,185 ఎంబీబీఎస్ సీట్లు సమకూరాయి. అంటే 2,185 సీట్లు సమకూరడానికి వందేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 17 వైద్య కళాశాలలను అందుబాటులోకి తేవడం ద్వారా ఏకంగా 2,550 ఎంబీబీఎస్ సీట్లను సీఎం జగన్ మన విద్యార్థులకు అదనంగా సమకూరుస్తుండటం గమనార్హం. అంటే కేవలం మూడేళ్ల వ్యవధిలో రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు ప్రభుత్వ రంగంలో రెట్టింపు దాటనున్నాయి. చాలా అద్భుతంగా ఉన్నాయి అత్యాధునికంగా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ కాలేజీ కంటే మెరుగ్గా ఉంది. అత్యాధునిక ల్యాబ్స్, టీచింగ్ హాల్స్, లెక్చర్ హాల్స్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన కళాశాలలో తొలి బ్యాచ్‌లో చదవడం చక్కటి అనుభూతి. ప్రభుత్వం కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయకపోయి ఉంటే మేం ప్రైవేట్ కాలేజీలకు వెళ్లాల్సి వచ్చేది. – సీహెచ్, ఢిల్లీరావు, వైద్య విద్యార్థి, ఏలూరు వైద్య కళాశాల గొప్ప వరంలా భావిస్తున్నా మాది విశాఖపట్నం. మధ్యతరగతి కుటుంబం. నీట్లో కొంత మెరుగైన ర్యాంక్ వచ్చింది. అయినప్పటికీ బీసీ ‘ఏ’ కేటగిరీలో గతంలో ఈ ర్యాంకుకు మెడిసిన్‌లో సీటు రావటం సాధ్యమయ్యేది కాదు. ఈ ఏడాది నుంచి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించడంతో నా ర్యాంక్‌కు సీట్ దక్కింది. లేదంటే మళ్లీ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌కు వెళ్లాల్సి వచ్చేది. ఒత్తిడితోపాటు విలువైన సమయం, డబ్బు వృథా అయ్యేది. కార్పొరేట్ వైద్య కళాశాలలకు ధీటుగా మా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం గొప్ప వరంలా నాలాంటి ఎందరో విద్యార్థులు భావిస్తున్నారు. – బమ్మిడి లక్ష్మీజ్యోత్న్స, వైద్య విద్యార్థిని, ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల రెండు రకాల లాభాలు.. వైద్యవిద్య డిమాండ్‌కు తగ్గట్టుగా రాష్ట్రంలో కళాశాలలు లేకపోవడంతో మన విద్యార్థులు వలస వెళుతున్నారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలతో మన విద్యార్థులకు వైద్యవిద్య అవకాశాలు పెరుగుతున్నాయి. జిల్లా, ఏరియా ఆస్పత్రులున్న చోట బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తున్నాయి. వైద్య సేవలు, రోగనిర్ధారణ సేవల్లో నాణ్యత పెరుగుతుంది. ఇలా విద్య, వైద్యంలో రెండురకాలుగా లాభాలుంటాయి. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూలు జీజీహెచ్ ఉన్నత స్థాయి వైద్యం కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు ద్వారా వాటికి అనుబంధంగా బోధనాస్పత్రులు పని చేస్తాయి. వీటిద్వారా ప్రజలకు ఉన్నత స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. సూపర్ స్పెషాలిటీ సేవలు అభివృద్ధి చెందుతాయి. ఆయా ప్రాంతాల్లో జబ్బులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు పెరుగుతాయి. సేవలు రెట్టింపు అవుతాయి. అన్ని ప్రాంతాల్లో బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు వ్యయ ప్రయాసలు తొలగి అనుభవజ్ఞులైన వైద్యుల సంరక్షణ లభిస్తుంది. రోగులు మరింత త్వరగా కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. – డాక్టర్ జి.రవికృష్ణ,ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న చోటే వైద్య విద్యలో చేరా.. ప్రభుత్వం మా ప్రాంతంలో కొత్త వైద్య కళాశాలను ప్రారంభించడంతో అక్కడే ఆప్షన్ ఇచ్చా. అందులోనే సీటు వచ్చింది. ఇటీవలే తరగతులు ప్రారంభం అయ్యాయి. చాలా సంతోషంగా ఉంది. మేం ఉంటున్న ప్రాంతంలోనే వైద్య విద్య అభ్యసిస్తున్నా. లేదంటే దూర ప్రాంతాలు వెళ్లాల్సి వచ్చేది. మనవద్ద మెడికల్ సీట్లు పెరగడంతో చాలా మందికి అవకాశాలు లభించాయి. – మహ్మద్ హర్సిన బేగం, వైద్య విద్యార్థిని, రాజమండ్రి వైద్య కళాశాల నాలుగేళ్లలో వైద్యం బలోపేతం ఇలా.. నాలుగేళ్లలో ఏకంగా దాదాపు 53 వేలకు పైగా వైద్య పోస్టుల భర్తీ. ఎప్పటి ఖాళీలు అప్పుడే యుద్ధప్రాతిపదికన నియామకం. ఇందుకోసమే ప్రత్యేకంగా రిక్రూట్మెంట్ బోర్డ్ ఏర్పాటు. రూ.16,852 కోట్లతో 17 కొత్త వైద్య కళాశాలలు, వివిధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు నాడు–నేడు ద్వారా ప్రభుత్వాస్పత్రులకు జవసత్వాలు. గ్రామాల్లో 10,032 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌ల ఏర్పాటు. 12 రకాల వైద్య సేవలు, 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులతో సొంత ఊళ్లలోనే ప్రజలకు వైద్య సేవలు. దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు. నెలకు రెండుసార్లు గ్రామాలకు పీహెచ్సీ వైద్యులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన మందులు ఉచితంగా సరఫరా. టీడీపీ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీ బలోపేతం. వైఎస్సార్ ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్లు 1,059 నుంచి ఏకంగా 3,257కి పెంపు. 40 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కోసం రూ.8 వేల కోట్ల వ్యయం. వైఎస్సార్ ఆరోగ్య ఆసరాతో విశ్రాంతి సమయంలో జీవన భృతి చెల్లింపు. ఇప్పటివరకూ 17.25 లక్షల మందికి రూ.1,074.69 కోట్లు అందించిన ప్రభుత్వం. 108 (768 వాహనాలు), 104 (936) వాహనాలతో వైద్య సేవలు బలోపేతం. మరో 500 తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలతో కలిపి మొత్తం 2,204 వాహనాలతో ప్రజలకు ఉచిత వైద్య సేవలు. టీడీపీ హయాంలో 108 అంబులెన్స్‌లు కేవలం 531 మాత్రమే ఉండగా ఇందులో కేవలం 336 మాత్రమే మనుగడలో ఉండేవి. పీజీ మెడికల్ సీట్ల సంఖ్యను నాలుగేళ్లలో 966 నుంచి 1,767కి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం. జాతీయస్థాయిలో స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టులు ఖాళీలు 61 శాతం కాగా మన రాష్ట్రంలో అది కేవలం 3.96% మాత్రమే. వైఎస్సార్ పెన్షన్ కానుక కింద దీర్ఘకాలిక రోగులకు వ్యాధి తీవ్రతను బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రతి నెలా ఇంటి వద్దే పెన్షన్లు గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో 6 క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు దిశగా అడుగులు. -
పింఛన్లు:65,98,138
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వివిధ రకాల చేతి వృత్తిదారులకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా మరో 1,93,680 మందికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మంగళవారం కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రతి నెలా అందజేసే పింఛన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 65,98,138కి చేరింది. కొత్తగా మంజూరైన వారికి ఈ నెల నుంచే ఫింఛన్ డబ్బులు పంపిణీ చేసేందుకు వీలుగా ఈ నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని 14వతేదీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) సీఈవో ఏఎండీ ఇంతియాజ్ తెలిపారు. కొత్త పింఛన్ల మంజూరుకు అదనంగా అవసరమయ్యే నిధులను కూడా అన్ని గ్రామ, వార్డు సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసిందని, చాలా చోట్ల మంగళవారం సాయంత్రం నుంచే కొత్త పింఛన్‌దారులకు నగదు పంపిణీ ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెలలో కొత్తగా పింఛన్ మంజూరైన 1,93,680 మంది లబ్ధిదారులలో 95,653 మంది అవ్వాతాతల వృద్ధాప్య పింఛన్లున్నాయి. 40,058 మంది వితంతువులు, 29,858 మంది దివ్యాంగులు, 6,861 మంది డప్పు కళాకారులు, 4,763 మంది మత్య్సకారులు, 2,844 మంది కల్లుగీత కార్మికులు, 4 వేల మంది హెచ్ఐవీ బాధితులు కాగా మిగిలినవి ఇతర పింఛన్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెలలో కొత్తగా 3,42,452 మందికి పింఛన్లు... ఎప్పటిమాదిరిగానే ఈ నెల ఒకటో తేదీనే ప్రభుత్వం పింఛన్ల పంపిణీ ప్రారంభించే సమయంలో 1,48,772 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేసింది. అప్పటికే పింఛన్ల పొందుతున్న వారితో కలిపి సెప్టెంబరు ఒకటో తేదీన ప్రభుత్వం మొత్తం 64,04,458 మంది లబ్ధిదారులకు పింఛన్ల మొత్తాన్ని విడుదల చేసింది. తాజాగా రెండో విడతగా మంగళవారం మంజూరు చేసిన 1,93,680 మంది కొత్త లబ్ధిదారులతో కలిపి ఈ నెలలో రెండు విడతల్లో మొత్తం 3,42,452 మందికి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేయడం గమనార్హం. ఒక్క నెలలో పింఛన్లకు రూ.1,819.02 కోట్లు.. సెప్టెంబరు ఒకటో తేదీన మొత్తం 64,04,458 మందికి పింఛను డబ్బుల పంపిణీకి రూ.1,764.83 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా కొత్తగా మంజూరు చేసిన వారితో కలిపి ఈ నెలలో మొత్తం 65,98,138 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం మొత్తం రూ.1,819.02 కోట్లను సెప్టెంబర్‌లో విడుదల చేసింది. ఈ నెలలో రెండు విడతలతో పాటు కొత్తగా పింఛన్లు మంజూరు చేసిన 3,42,452 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం ప్రతి నెలా రూ.96.12 కోట్ల చొప్పున అదనంగా ఖర్చు చేసేందుకు ముందుకొచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాలుగేళ్లలో 28.26 లక్షల కొత్త పింఛన్లు రాష్ట్రంలో ప్రస్తుతం పింఛన్లు పొందుతున్న ప్రతి పది మందిలో నలుగురుకి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తరువాతే కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. జగన్ సీఎం అయ్యాక 28,26,884 మందికి ప్రభుత్వం కొత్తగా పింఛన్లు మంజూరు చేసినట్లు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు గణాంకాలతో వెల్లడిస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల కోసం సరాసరిన రూ.400 కోట్లు మాత్రమే ఖర్చు చేయగా ఇప్పుడు సీఎం జగన్ ప్రభుత్వం సెప్టెంబరు నెలలో ఏకంగా రూ.1,819 కోట్లు వెచ్చించడం గమనార్హం. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత గత నాలుగేళ్లుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా అర్హతే ప్రామాణికంగా సంతృప్త స్థాయిలో కొత్త పింఛన్లు మంజూరు చేస్తున్న విషయం తెలిసిందే. అవ్వాతాతలతో పాటు దివ్యాంగులకు ఏ చిన్న కష్టం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీనే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు. -
G20 Summit 2023: అంబానీ, అదానీలకు అందని ఆహ్వానం.. ఏం జరిగింది?
భారత్ అధ్యక్షతన ఢిల్లీ వేదికగా ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 8న ఏర్పాటు చేసిన డిన్నర్‌కు ప్రపంచవ్యాప్తంగా 500 మంది ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. ఈ డిన్నర్‌కు భారత్‌కు చెందిన బిలియనీర్లు, ప్రముఖ వ్యాపారవేత్తలు హాజరు కానున్నారని, వీరిలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రముఖంగా ఉన్నారని ఆయా వార్తా కథనాల్లో పేర్కొన్నారు. అయితే జీ20 డిన్నర్‌కు వ్యాపారవేత్తలకు ఆహ్వానానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆయా వార్తల్లో నిజం లేదని, ఈ డిన్నర్‌కు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలే కాదు.. ఏ వ్యాపారవేత్తలూ హాజరుకావడం లేదని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన వార్తా సంస్థ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఒక ట్వీట్ చేసింది. ‘జీ20 స్పెషల్ డిన్నర్‌కు ప్రముఖ వ్యాపారవేత్తలను ఆహ్వానించినట్లు ప్రచురించిన రాయిటర్స్ వార్తా కథనం ఆధారంగా పలు మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇవన్నీ అవాస్తవం. తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి. ఏ బిజినెస్ లీడర్‌ను డిన్నర్‌కు ఆహ్వానించలేదు’ అంటూ పీఐబీ ఫ్యాక్ట్ చెక్ పేర్కొంది. జీ20 సదస్సు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ప్రాంతంలోని ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ కాంప్లెక్స్‌లో జరుగుతుంది. ఈ ఏడాది జూలై 26న ప్రధాని నరేంద్ర మోదీ ఈ కాంప్లెక్స్‌ని ప్రారంభించారు. సమ్మిట్ మొదటి రోజు ముగిసిన తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత మండపంలో గొప్ప విందును ఏర్పాటు చేయనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సహా ప్రపంచ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారని భావిస్తున్నారు. Media reports based on an article by @Reuters have claimed that prominent business leaders have been invited at #G20India Special Dinner being hosted at Bharat Mandapam on 9th Sep#PIBFactCheck ✔️This claim is Misleading ✔️No business leaders have been invited to the dinner pic.twitter.com/xmP7D8dWrL — PIB Fact Check (@PIBFactCheck) September 8, 2023 -
14న 5 వైద్య కళాశాలల ప్రారంభం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వరంగ వైద్య విద్యలో నూతనాధ్యాయం ఆవిష్కృతమవుతోంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చిన 5 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విజయనగరంలో నూతనంగా నిర్మించిన వైద్య కళాశాలను 14వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్య అభివృద్ధికి ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల ఉండేలా వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.8,480 కోట్లతో 17 కొత్త కాలేజీలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణం పూర్తయింది. ఈ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలవుతున్నాయి. ఈ 5 కాలేజీల్లో ఒక్కో కళాశాలలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ద్వారా ఆల్ ఇండియా కోటా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. నూతన కాలేజీల్లో 111 ఆలిండియా కోటా సీట్లకు గాను 69 భర్తీ అయ్యాయి. రాష్ట్ర కోటాకు సంబంధించి డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తొలి విడత కౌన్సెలింగ్ పూర్తి చేసింది. ఈ కౌన్సెలింగ్‌లో 516 సీట్లు భర్తీ అయ్యాయి. ఇలా ఇప్పటి వరకు 585 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 10న ఆల్ ఇండియా కోటా మూడో విడత, రాష్ట్ర కోటా రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతాయి. వీటిలో మిగిలిన సీట్లు భర్తీ అవుతాయి. వచ్చే ఏడాది మరో 5 కాలేజీలు విజయనగరంలో వైద్య కళాశాల ప్రారంభించడానికి సీఎం జగన్ నేరుగా హాజరై, మిగిలిన నాలుగు కళాశాలలను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మరో ఐదు కళాశాలల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వీటిని వచ్చే ఏడాది ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నాం. – మురళీధర్ రెడ్డి, ఎండీ ఏపీఎంఎస్ఐడీసీ -
ఐఫోన్ వాడకం నిషేధం.. సంచలన నిర్ణయం తీసుకున్న ఆ దేశ ప్రభుత్వం!
సాధారణంగా యాపిల్ ఐఫోన్స్‌ని ప్రపంచ వ్యాప్తంగా ఎంతమంది ఇష్టపడతారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆధునిక కాలంలో చాలామందికి వినియోగించే మొబైల్స్‌లో ఐఫోన్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఆఫీసు పనులకు యాపిల్ ఐఫోన్స్ వాడకూడదని చైనా ఇటీవల ఆదేశించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఎక్కువ దేశాలు చైనా వస్తువులను వినియోగించడానికి ఒకింత ఆలోచిస్తాయి. కానీ చైనా ఐఫోన్స్ మాత్రమే కాకుండా విదేశీ బ్రాండ్ ఫోన్స్ వినియోగాన్ని నిషేదించింది. భద్రతాపరమైన భయం వల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదించింది. అయితే ఈ రూల్ ఎంతవరకు అమలవుతుందనేది తెలియాల్సి ఉంది. కొన్ని నివేదికల ప్రకారం కేవలం యాపిల్ ఐఫోన్స్ మాత్రమే వినియోగించకూడదని, ఇతర బ్రాండ్స్ గురించి ప్రస్తావించలేదని తెలుస్తోంది. ఈ విషయం మీద యాపిల్ కంపెనీ స్పందించకపోవడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా ఐఫోన్ 15 సిరీస్ విడుదలకు ముందు చైనా తీసుకున్న ఈ నిర్ణయం అమ్మకాలను దెబ్బ తీస్తుందని భావిస్తున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్‌లో నెలకు రూ. 40వేలు సేవ్ చేస్తున్నా.. టెకీ ట్వీట్ వైరల్ భద్రత మాత్రమే కాకుండా స్వదేశీ బ్రాండ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడానికి చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెరికా తరువాత యాపిల్ కంపెనీకి పెద్ద మార్కెట్ అయిన చైనా తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ఐఫోన్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది. దీనిపైన కంపెనీ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. -
వైద్య విద్య పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ రద్దు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇప్పటికే నిర్వహించిన కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రవేశాల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే కన్వినర్, యాజమాన్య కోటా సీట్లకు తొలి దశలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు గురువారం వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి ఉత్తర్వులిచ్చారు. కర్నూలు జిల్లా శాంతిరామ్ వైద్య కళాశాలలోని పలు కోర్సుల్లో పీజీ సీట్ల పెంపుదలకు సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట ఫేక్/ఫోర్జరీ అనుమతులు వెలువడ్డాయి. ఈ అంశంపై ఎన్ఎంసీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌ను హెల్త్ యూనివర్సిటీ అధికారులు రద్దు చేశారు. ఫోర్జరీ అనుమతుల ఘటన వెలుగు చూడటంతో అప్రమత్తమైన అధికారులు మిగిలిన వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల అనుమతులు సరిగా ఉన్నాయో, లేదో పరిశీలిస్తున్నారు. ఆయా కళాశాలలకు మంజూరైన సీట్లను, ఎన్ఎంసీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచిన సీట్లతో సబ్జెక్టుల వారీగా తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జీఎస్ఎల్, శాంతిరామ్, మహారాజా కళాశాలల్లో అనుమతించిన పీజీ సీట్లకు, ఎన్ఎంసీ వెబ్సైట్లో చూపిస్తున్న సీట్ల సంఖ్య మధ్య వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అంశంపై వివరణ కోరుతూ అధికారులు ఎన్ఎంసీకి లేఖ రాశారు. ఎన్ఎంసీ నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చాక కొత్తగా సీట్ మ్యాట్రిక్స్‌ను రూపొందించనున్నారు. ఆ తర్వాత వెబ్ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్ ఇస్తామని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు. -
బియ్యం అమ్మకం..రూ.4 వేల కోట్ల స్కామ్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిధుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం బియ్యం అమ్మకానికి పెట్టి.. కస్టమ్‌మిల్లర్ల నోట్లో మట్టికొట్టే పనిచేస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పెద్దపెద్ద కార్పొరేట్ కంపెనీలకు కిలో నాలుగైదు రూపాయల తక్కువకు అమ్మాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారన్నారు.రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం.. ఒక్క ఆక్షన్‌కి రూ.1000 కోట్ల స్కామ్.. కోటిటన్నులు అమ్ముకునే ప్రణాళిక బీఆర్ఎస్ సర్కారుదని ఆరోపించారు. ఈ విధంగా వచ్చే రూ.4 వేల కోట్ల అవినీతి సొమ్ము 100 నియోజకవర్గాల్లో..ఒక్కో సెగ్మెంట్లో రూ.40 కోట్లు ఖర్చు చేసి వచ్చే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపణలు సంధించారు. శనివారం అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సర్కార్ బియ్యం అమ్ముకుంటామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని, దీనికి వెనుక అసలు ఉద్దేశం అదేనని ఆరోపించారు. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోసం ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని వేలం వేసేందుకు వెయ్యికోట్ల టర్నోవర్, రూ.100 కోట్ల ప్రాఫిట్ ఉండాలనే నిబంధనలు పెట్టారని మండిపడ్డారు. మొదటిదశలో రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలం వేయాలని నిర్ణయించారని, టెండర్లో పాల్గొనేందుకు పౌరసరఫరాలశాఖ నిర్ణయించిన విధివిధానాలతో రైస్ మిల్లర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ఎంఎస్పీకి బియ్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్రంలో మిల్లర్లు సిద్ధంగా ఉన్నా, టెండర్ల ద్వారా తమ మిల్లు సామర్థ్యం మేరకు ధాన్యం దక్కించుకుందామనుకున్న మధ్యతరగతి మిల్లర్లకు అసలు అందులో పాల్గొనే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో రైస్‌మిల్లర్లు బియ్యం ఆక్షన్‌లో కొనలేరన్నారు. రైస్‌మిల్లర్ల వ్యాపారం బంద్ అయితే రైతులు రోడ్డుమీదకు వచ్చే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ నుంచి ఎంపీగా కల్వకుంట్ల కవిత పోటీచేస్తే మూడో స్థానానికి పరిమితం అవుతుందని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తాను ఎంపీగా పోటీలో ఉండడం ఖాయమని ప్రకటించారు. -
‘జీఎస్టీ వల్ల ప్రభుత్వ ఆదాయం పోతోంది’.. ఎవరన్నారీ మాట?
జీఎస్టీతో అన్ని రకాల వస్తువుల రేట్లు పెరిగిపోయాయని ఓవైపు దేశ ప్రజలు గగ్గోలు పెడుతుంటే మరోవైపు ప్రధాన మంత్రి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ బిబేక్ దేబ్రాయ్ మాత్రం జీఎస్టీ వల్ల ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోందని వ్యాఖ్యానించారు. ఒకే రేటుతో ఆదాయం తటస్థంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాజాగా కలకత్తా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ జీఎస్టీలో చాలా సరళీకరణ జరిగిందన్నారు. "ఆదర్శ జీఎస్టీ అనేది ఒకే రేటును కలిగి ఉండాలి. దీని ప్రభావం ప్రభుత్వ ఆదాయం మీద పడకూడదు. జీఎస్టీని మొదటిసారి ప్రవేశపెట్టినప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం, సగటు పన్ను రేటు కనీసం 17 శాతం ఉండాలి. కానీ, ప్రస్తుత జీఎస్టీ 11.4 శాతం. జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతోంది’’ అని బిబేక్ దేబ్రాయ్ పేర్కొన్నారు. అత్యధికంగా ఉన్న 28 శాతం జీఎస్టీ రేటు తగ్గాలని ప్రజలతోపాటు జీఎస్టీ కౌన్సిల్ సభ్యులు కోరుకుంటున్నారని, అయితే అత్యల్పంగా ఉన్న సున్నా, 3 శాతం జీఎస్టీ రేట్లు పెరగాలని మాత్రం ఎవరూ కోరుకోవడం లేదని బిబేక్ అన్నారు. అందుకే మనకు సరళీకృత జీఎస్టీ అసాధ్యమని చెప్పారు. అలాగే జీఎస్టీ నిబంధనల్లోనూ చాలా దుర్వినియోగం జరుగుతోందన్నారు. ఇదీ చదవండి: Renters Insurance: ఇల్లు లేకపోయినా హోమ్ ఇన్సూరెన్స్! ఎందుకు.. ఏంటి ప్రయోజనం? -
పెరుగుతున్న ఉల్లి ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఉల్లిపై కేంద్రం ఎగుమతి సుంకం విధించడం ఇదే తొలిసారి. వంటల్లో ప్రధానంగా ఉపయోగించే ఉల్లి ధర ప్రస్తుతం (ఆగస్ట్ 19) ఢిల్లీలో కిలోకు రూ. 37కి చేరింది. 2023 డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు భారత్ నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులు జరిగాయి. విలువ పరంగా చూస్తే వీటిని అత్యధికంగా దిగుమతి చేసుకున్న మొదటి మూడు దేశాలు బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ. రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశీయ మార్కెట్లో ఉల్లి లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించాలని నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం.. ఆగస్ట్ 19న దేశంలో ఉల్లి సగటు రిటైల్ ధర కిలోకు కనిష్టంగా రూ. 30గా ఉంది. ఇది గరిష్టంగా రూ. 63, కనిష్టంగా రూ. 10లుగా ఉంది. ఇదీ చదవండి: Revised I-T rules: ఉద్యోగులకు గుడ్‌న్యూస్: ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా! -
సర్కారు డబ్బులు వచ్చాయా? ఇదో రకం సైబర్ మోసం..!
‘సరోజిని ఇంట్లో పని చేసుకుంటుంటే ఫోన్ మోగింది. చేస్తున్న పని వదిలేసి, ఫోన్ అందుకుంది. గవర్నమెంట్ ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామనగానే తమ పొదుపు సంఘం గురించే అని, అవతలి వాళ్లు చెప్పేది వినడానికి చెవులు రిక్కించింది. ‘ప్రభుత్వం నుంచి వచ్చే పథకం మొత్తం డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయా’ అని అడిగారు అవతలి నుంచి. ‘ఇంకా రాలేదు సార్! వచ్చాక చెబుతా!’ అంది సరోజిని. ‘అంటే, మీరు వడ్డీ డబ్బులు కట్టలేదు. వడ్డీ వెంటనే కడితే వచ్చే మొత్తం జమ అవుతుంది, లేదంటే లేదు’ అని చెప్పడంతో కంగారు పడింది. ‘మా సంఘం వాళ్లందరినీ అడిగి చెబుతాను’ అంటే ‘అంత టైమ్ లేదు ఇప్పుడే కట్టేయాలి. అనడంతో తన ఖాతా నెంబర్, ఫోన్‌కి వచ్చిన నెంబర్ చెప్పింది. ఆ తర్వాత ఫోన్ కట్ అయ్యింది. అంతలో అదే బృందంలో ఉండే కమల పరిగెత్తుకుంటూ వచ్చి, ‘బ్యాంక్ వాళ్లు ఫోన్ చేశారు, ఆ తర్వాత వాళ్లేదో ఓటీపీ అని అడిగారు. చెప్పగానే నా ఖాతాలో పన్నెండువేల రూపాయలు కట్ అయ్యాయి. అవి మళ్లీ వస్తాయా?!’ అని అడిగింది. అప్పుడే సరోజిని అకౌంట్ నుంచి పదివేల రూపాయలు కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది. చూశారుగా... సైబర్ నేరగాళ్ల కొత్త తరహా మోసాలు ఇవి. అమాయక మహిళలను లక్ష్యంగా చేసుకుని ఖాతాలో ఉన్నదంతా దోచుకుంటున్న ఈ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలంటే ఏం చేయాలో చెబుతున్నారు సైబర్ నిపుణులు. అనుమానం రాకుండా దోపిడీ.. సైబర్ నేరగాళ్లు తాము ప్రభుత్వ కార్యాలయం నుండి మాట్లాడుతున్నామంటారు. ప్రభుత్వ పథకాల పేరిట పొదుపు సంఘాల మహిళలకు ఫోన్ చేసి తెలుగు భాషలో మాట్లాడుతుంటారు. వెంటనే వడ్డీ చెల్లిస్తే ఆ మొత్తాన్ని ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని చెబుతారు. మీ ఖాతాలో కొంత నగదు నిల్వ ఉండాలని పొదుపు సంఘాల మహిళలకు ఫోన్లు చేస్తుంటారు. ‘తమ ఖాతాలో నగదు నిల్వ లేదు’ అని మహిళలు చెబితే ‘ప్రభుత్వం డబ్బులు ఇస్తామన్నా.. మీ ఖాతాలో డబ్బులు లేకపోవడం ఏంటని, బ్యాంకులో తగినంత నగదు లేకపోతే పథకం డబ్బులు రావని చెబుతుంటారు. నేరగాళ్ల మాటలు నమ్మి, మహిళలు తమ స్మార్ట్ ఫోన్లోని మనీ యాప్స్ ద్వారా డబ్బులు చెల్లిస్తుంటారు. ఇలాంటి ఫోన్ కాల్స్ వస్తే ఏ మాత్రం నమ్మకూడదు. మోసగాళ్ల బారిన పడి మీ కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దు. బ్యాంక్ ఖాతా, వ్యక్తిగత వివరాలు, ఓటీపీ వంటివి ఎవరికీ చెప్పకూడదు. ఈ సైబర్ మోసాల పట్ల గ్రామీణ మహిళలు అవగాహన పెంచుకోవాలి. తెలిసిన వారు గ్రామీణ మహిళలను సైబర్ నేరాల పాలిటపడకుండా అప్రమత్తంగా ఉండాలనే విషయాలను తెలియజేయాలి. వెబ్సైట్ అయితే.. ప్రభుత్వ సైట్లు.. అంటే, ఆయుష్మాన్ యోజన, కిసాన్ యోజన, జన్ ధన్ యోజన వంటి పోర్టల్‌లు, అనేక నకిలీ వెబ్సైట్లు ప్రజలను మోసగించడానికి స్కామర్లకు సాధారణ పద్ధతిగా మారాయి. ఈ మోసపూరిత వెబ్సైట్లు తరచుగా అధికారిక ప్రభుత్వ పోర్టల్‌ల రూపకల్పన, కంటెంట్‌ను అనుకరిస్తాయి. వారు ప్రభుత్వ పథకాలపై ప్రజల నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటారు. అటువంటి స్కామ్‌ల బారిన పడకుండా ఉండటానికి, మీరు తీసుకోవలసిన కొన్ని చర్యలు: అధికారిక ప్రభుత్వ డొమైన్‌తో సరిపోలుతుందని నిర్ధారించుకోవడానికి వెబ్సైట్ యుఆర్‌ఎల్‌ని చెక్ చేయాలి. ప్రభుత్వ వెబ్సైట్లు సాధారణంగా భారతదేశంలో ‘gov.in‘ వంటి స్థిరమైన డొమైన్ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. డొమైన్ లో అక్షరదోషాలు లేదా వైవిధ్యాలు ఉన్న వెబ్సైట్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. వినియోగదారుల డేటాను రక్షించడానికి చట్టబద్ధమైన వెబ్సైట్లు సురక్షిత కనెక్షన్లను (HTTP) ఉపయోగిస్తాయి. సైట్ సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి అడ్రస్ బార్ లో ప్యాడ్‌లాక్ చిహ్నాన్ని తనిఖీ చేయాలి. అధికారిక మూలాలు: అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లు లేదా అధికారిక కమ్యూనికేషన్ ఛానెల్‌లలో అందించిన సమాచారం, లింక్‌లను మాత్రమే నమ్మాలి. లింక్‌లపై క్లిక్ చేయడం లేదా అనుమానాస్పద ఈ–మెయిల్స్, మెసేజ్‌లు లేదా సోషల్ మీడియా పోస్ట్‌ల నుండి సమాచారాన్ని షేర్ చేయడం మానుకోవాలి. మీకు ఆసక్తి ఉన్న ప్రభుత్వ పథకాన్ని అధికారిక మూలాల నుండి నేరుగా పరిశోధించాలి. ఇది మీకు అర్హత ప్రమాణాలు, ప్రయోజనాలు, దరఖాస్తు ప్రక్రియపై స్పష్టమైన అవగాహనను ఇస్తుంది. తెలియని వెబ్సైట్ల సమాచారంపై మాత్రమే ఆధారపడకూడదు. పథకం లేదా ఆఫర్ ప్రామాణికత గురించి మీకు ఖచ్చితంగా తెలియకుంటే, వివరాలను ధృవీకరించడానికి సంబంధిత ప్రభుత్వ శాఖ అధికారిక హెల్ప్‌లైన్ లేదా కస్టమర్ సేవను సంప్రదించాలి. ప్రభుత్వ పథకాలకు సాధారణంగా రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు కోసం ఎలాంటి ముందస్తు చెల్లింపులు అవసరం లేదు. ఏదైనా ప్రయోజనాన్ని అందించే ముందు ఫీజు చెల్లించమని వెబ్సైట్ మిమ్మల్ని అడిగితే జాగ్రత్తపడాలి. ఆఫర్ నిజం కానంత మంచిగా అనిపిస్తే, అది బహుశా అలానే ఉంటుంది. స్కామర్లు బాధితులను తమ ఉచ్చులోకి లాగేందుకు తరచుగా మనోహరమైన వాగ్దానాలను ఉపయోగిస్తారు. ఈ మోసాల గురించి మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు కూడా బాధితులుగా పడకుండా వారికి అవగాహన కల్పించండి. మోసపోయామని గ్రహిస్తే బాధితులు వెంటనే పోలీసులకు, సంబంధిత అధికారులకు తెలియజేయాలి. 1930కి కాల్ చేయవచ్చు. https://www.cybercrime.gov.in ద్వారా రిపోర్ట్ చేయవచ్చు. (చదవండి: భారతదేశ న్యాయవ్యవస్థలో లింగ సమానత్వానికి నాంది!) -
ఆ దీవుల్లో స్థిరపడేవారికి భారీ నజరానా!
ఐర్లండ్ పరిధిలో ఉన్న దీవుల్లో స్థిరపడటానికి సిద్ధపడేవారికి అక్కడి ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. చాలా దీవులు జనాలు లేక కళ తప్పినట్లు ఉండటంతో, ఈ దీవులను జనాలతో కళకళలాడేలా చేయాలని ఐర్లండ్ ప్రభుత్వం తలపెట్టింది. ఈ దీవుల్లో స్థిరపడటానికి వచ్చేవారికి ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి, ఇతర అవసరాలకు 84 వేల యూరోలు (రూ.76.16 లక్షలు) ఇవ్వనున్నట్లు ఐర్లండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హీదర్ హంప్రీస్ ప్రకటించారు. ఈ దీవుల్లో నివాసం ఉండేవారికి మంచి కెరీర్ అవకాశాలను కల్పిస్తామని ఆమె తెలిపారు. ఇక్కడ నివాసం ఉండేందుకు వచ్చేవారికి ఖాళీ స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు జాతీయ దీవుల కార్యాచరణ ప్రణాళిక కింద ప్రభుత్వ గ్రాంటు చెల్లిస్తామని వెల్లడించారు. చదవండి లాఠీ పట్టుకుని బోర్ కొట్టిందేమో! ఏకంగా గరిట పట్టుకుని.. -
Telangana Cabinet Meeting: కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలివీ..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ)ను ప్రభుత్వంలో విలీనం చేయాలని.. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు అధ్యక్షతన ఆర్అండ్బీ, రవాణా, కార్మిక, సాధారణ పరిపాలన శాఖల కార్యదర్శులతో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఆగస్టు 3 నుంచి ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో.. వివిధ పనులు, కార్యక్రమాల కోసం తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేసింది. వరద మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని నిర్ణయించింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమైంది. సుమారు 50కిపైగా అంశాలపై సుదీర్ఘంగా 6 గంటల పాటు చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సహచర మంత్రులతో కలసి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. రవాణా, ఆర్థిక శాఖల మంత్రులు, ఆర్టీసీ చైర్మన్‌తోపాటు కార్మికుల నుంచి వచి్చన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించామని తెలిపారు. ఆరీ్టసీని కాపాడేందుకు, ప్రజారవాణాను విస్తృతం చేయడానికి ఈ నిర్ణయం దోహదపడుతుందని చెప్పారు. వరద తక్షణ సాయంగా రూ.500 కోట్లు రాష్ట్రంలో పది రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు, వరదలతో జరిగిన ప్రాణ, ఆస్తి నష్టంపై మంత్రివర్గం విస్తృతంగా చర్చించిందని.. తక్షణ సాయంగా రూ.500 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించిందని కేటీఆర్ తెలిపారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ, నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం తదితర 10 జిల్లాల్లో ఆర్అండ్బీ/ పంచాయతీరాజ్ రోడ్లు, చెరువులు, కాల్వలు, పంట పొలాలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందని.. యుద్ధప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులకు ఈ నిధులను వినియోగించాలని ఆదేశించినట్టు వివరించారు. ఇక వివిధ జిల్లాల్లో పునరావాస కేంద్రాలకు తరలించిన 27వేల మంది ముంపు బాధితులకు సురక్షితమైన పునరావాసం కల్పించాలని కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు. వరదల్లో మృతిచెందిన 40 మందికిపైగా వివరాలను సేకరించి, వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. వరదలతో పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలు, ఇతర సమస్యలపై సమగ్రమైన నివేదిక అందించాలని కలెక్టర్లను కేబినెట్ ఆదేశించిందని.. రైతులకు విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖకు సూచించిందని వివరించారు. ఖమ్మం పొడవునా ప్రవహిస్తున్న మున్నేరువాగు వరద నుంచి పట్టణానికి రక్షణకోసం వరద గోడలు నిర్మించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వారి సేవలు భేష్.. వరద ముప్పును సైతం లెక్కచేయకుండా విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కోసం ధైర్య సాహసాలతో విధులు నిర్వహించిన విద్యుత్ శాఖ లైన్‌మన్, హెల్పర్‌తోపాటు ముందుచూపుతో 40మంది విద్యార్థులను కాపాడిన ఉపాధ్యాయుడు మీనయ్యను ఈ పంద్రాగస్టు సందర్భంగా సన్మానించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వారి సేవలను సీఎం కేసీఆర్ స్వయంగా ప్రస్తావించి కొనియాడారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అనాథల కోసం ప్రత్యేక పాలసీ రాష్ట్రంలోని అనాథ పిల్లలను ‘చిల్డ్రన్ ఆఫ్ ది స్టేట్’గా గుర్తిస్తూ.. వారి సంరక్షణ, ఆలనా పాలన చూసుకోవడానికి పకడ్బందీగా ‘అనాథ బాలల పాలసీ’ని రూపొందించాలని శిశుసంక్షేమ శాఖను కేబినెట్ ఆదేశించింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలకు తల్లిదండ్రులుగా నిలుస్తుందని.. ఆశ్రయం క ల్పిం చి, ప్రయోజకులుగా మార్చి, వారికంటూ ఓ కుటుంబం ఉన్నట్టుగా సంరక్షిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేబినెట్ తీసుకున్న మరిన్ని కీలక నిర్ణయాలివీ.. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల మంది బీడీ టేకేదారులకు ఆసరా పెన్షన్ ఇవ్వాలని కార్మిక శాఖను కేబినెట్ ఆదేశించింది. వరంగల్‌లోని మామునూరులో విమానాశ్ర యం నిర్మాణానికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా కోరిన మేరకు 253 ఎకరాల భూమి ని సేకరించాలని కేబినెట్ నిర్ణయించింది. బీదర్ తరహాలో ఇక్కడ విమానాశ్రయం నిర్వహించాలని, ఇకపై కుంటిసాకులు చెప్పవద్దని అథారిటీకి మంత్రి కేటీఆర్ సూచించారు. శంషాబాద్ విమానాశ్రయానికి ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో.. ఇతర నగరాల తరహాలో హైదరాబాద్‌లోనూ రెండో ఎయిర్‌పోర్టు అవసరమని మంత్రివర్గం అభిప్రాయపడింది. పుణె, గోవాలలో రక్షణ రంగ విమానాశ్రయాలను పౌర విమానాశ్రయాలుగా విని యోగిస్తున్న తరహాలోనే హకీంపేట ఎయిర్‌పోర్ట్‌ను పౌర విమానయాన సేవలకు వినియో గించాలని రక్షణ శాఖకు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రక్షణ, పౌరవిమానయాన శాఖలకు ప్రతిపాదనలు పంపిస్తామని కేటీఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ వంటి కాపు అనుబంధ కులాల కోసం ‘సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ’ నిర్మాణానికి స్థలం కేటాయిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో ఎనిమిది వైద్య కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనితో రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలన్న సీఎం కేసీఆర్ ఆశయం సాకారమైందని కేటీఆర్ చెప్పారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో హార్టికల్చర్ క ళాశాల ఏర్పాటుకు మంత్రివర్గం ఓకే చెప్పింది. వరదల్లో చనిపోయినవారిలో రైతు బీమా ఉన్న వారికి రూ.5 లక్షల సొమ్ము ఆటోమెటిగ్గా వస్తుందని, మరో రూ.4లక్షలు ఎక్స్‌గ్రేషియాగా చెల్లిస్తామని కేటీఆర్ తెలిపారు. -
అంగన్వాడీ కేంద్రాలకు నాడు–నేడు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన సదుపాయాల కల్పనకు అమలు చేస్తున్న ‘మనబడి నాడు–నేడు’ పథకాన్ని ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు విస్తరించింది. సుమారు రూ.500 కోట్లతో ఆయా కేంద్రాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులకు అవసరమైన విద్య, క్రీడా పరికరాలను అందజేయనుంది. ప్రధాన మౌలిక సదుపాయాలైన తాగునీరు, మరుగుదొడ్లు, భవనాలకు రంగులు, కిచెన్ షెడ్లు, ఫర్నీచర్, పిల్లలకు ఆటవస్తువులను అందుబాటులోకి తీసుకొస్తారు. మొత్తం అంగన్వాడీ కేంద్రాల్లో 50,600 కేంద్రాలను నాడు–నేడులోకి తీసుకున్నారు. పాఠశాలల ప్రాంగణాల్లో ఉన్నవాటిలో 600 కేంద్రాల్లో ఇప్పటికే నాడు–నేడు పనులు పూర్తిచేశారు. మరో 1,778 కేంద్రాల్లో సదుపాయాలు కల్పించారు. కొత్తగా 1,625 భవనాలను నిర్మించనున్నారు. నూతన జాతీయ విద్యావిధానాన్ని దేశంలో అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఏపీ నిలిచింది. అందులో భాగంగా విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. -
హరిత హైడ్రోజన్ వినియోగ విధానాలపై కసరత్తు
న్యూఢిల్లీ: దేశీయంగా హరిత హైడ్రోజన్ వినియోగానికి సంబంధించి విధానాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కేంద్ర పునరుత్పాదక ఇంధన శాఖ కార్యదర్శి భూపిందర్ సింగ్ భల్లా తెలిపారు. పరిశ్రమ తగు స్థాయిలో ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా డిమాండ్‌ను మదింపు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు ఆయన వివరించారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా భల్లా ఈ విషయాలు పేర్కొన్నారు. 2030 నాటికి ప్రతిపాదిత హరిత హైడ్రోజన్ ఉత్పత్తిలో 70 శాతం భాగం ఎగుమతుల కోసం ఉద్దేశించినదై ఉంటుందని ఆయన తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి సంబంధించి భారత్‌ను ప్రపంచ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం రూ. 19,744 కోట్లతో నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ప్రణాళికను ఆమోదించింది. మరోవైపు, హరిత హైడ్రోజన్ వినియోగానికి మారే క్రమంలో సిబ్బందికి శిక్షణ కల్పించేందుకు కేంద్రం కృషి చేస్తోందని భల్లా పేర్కొన్నారు. -
ఓఎన్డీసీలో ఫిర్యాదుల పరిష్కారానికి ఆటోమేటెడ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: చిన్న వ్యాపారులను కూడా ఈ–కామర్స్‌లో భాగం చేసేందుకు ఉద్దేశించిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)లో ఫిర్యాదుల పరిష్కారానికి పూర్తి ఆటోమేటెడ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు సంస్థ సీఈవో టీ. కోషి తెలిపారు. త్వరలోనే ఆన్లైన్ పరిష్కార వ్యవస్థను కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు వివరించారు. చిన్న రిటైలర్లు కూడా డిజిటల్ కామర్స్ ప్రయోజనాలను అందుకోవడంలో తోడ్పాటు అందించే ఉద్దేశంతో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ 2021 డిసెంబర్లో ఓఎన్డీసీని ప్రవేశపెట్టింది. ఇది కొన్నాళ్లుగా శరవేగంగా విస్తరిస్తోందని, గత కొద్ది నెలల్లోనే నెట్‌వర్క్‌లోని విక్రేతలు, సర్వీస్ ప్రొవైడర్ల సంఖ్య లక్ష దాటిందని కోషి వివరించారు. -
జాబ్‌మేళాలతో భారీగా ఉద్యోగ కల్పన
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం జాబ్‌మేళాలు నిర్వహించడం ద్వారా యువతకు స్థానికంగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. గత నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 987 జాబ్‌మేళాలు నిర్వహించి.. 1,05,889 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించింది. ఈ ఏడాది కూడా 286 జాబ్‌మేళాలు నిర్వహించడం ద్వారా కనీసం 30,000 మందికి ఉద్యోగాలు లభించే విధంగా ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో సుమారు 200 కంపెనీలను గుర్తించి వారికి అవసరమైన మానవ వనరులను అందించే విధంగా ఏపీఎస్ఎస్డీసీ ఒప్పందాలు కుదుర్చుకుంటోంది. ఇందుకోసం మినీ జాబ్‌మేళా, జాబ్‌మేళా, మెగా జాబ్‌మేళాలు నిర్వహించనుంది. రాష్ట్రంలో ప్రతి మంగళవారం మినీ జాబ్‌మేళా, శుక్రవారం జాబ్‌మేళా, ప్రతి మూడు నెలలకు ఒకసారి జోన్ పరిధిలో మెగా జాబ్‌మేళా నిర్వహించే విధంగా క్యాలెండర్ సిద్ధం చేసింది. ఇంటర్‌లోపు విద్యార్హత ఉన్న వారికి ఉద్యోగాల కల్పన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 192 స్కిల్ హబ్స్ ద్వారా శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతి మంగళవారం నిర్వహించే మినీ జాబ్‌మేళాల ద్వారా ఉపాధి కల్పించనుంది. మూడు, నాలుగు కంపెనీలకు మానవ వనరులు అవసరం కాగానే మినీ జాబ్‌మేళా, కనీసం 10 కంపెనీలకైతే జాబ్‌మేళా నిర్వహిస్తారు. ఇవి కాకుండా జోన్ పరిధిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి కనీసం 50 కంపెనీలతో మెగా జాబ్‌మేళా నిర్వహించనున్నారు. చదవండి: గ్రామవార్డు, సచివాలయ ఉద్యోగుల బదిలీలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం! -
ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాల పెంపు
సాక్షి, అమరావతి: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం 23 శాతం వేతనాన్ని పెంచుతూ గురువారం ఉతర్వులిచ్చింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆలమూరి విజయభాస్కర్ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
ఓపీఎస్‌కి దీటుగా పెన్షన్ స్కీమ్
సాక్షి, అమరావతి: పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)తో సమానంగా నూతన పెన్షన్ విధానం రూపుదిద్దుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిపారు. మంగళవారం వెలగపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీపీఎస్ స్థానంలో జీపీఎస్ అనేది ఉండదన్నారు. ఓపీఎస్‌తో సమానమైన పెన్షన్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయతి్నస్తోందన్నారు. ఉద్యోగులు 50 శాతం బెనిఫిట్ పొందే విధంగా ఈ విధానం ఉంటుందన్నారు. కేబినెట్లో తీసుకునే నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తి చెందుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉద్యోగుల సమస్యలపై ఈ ప్రభుత్వ హయాంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌తో పలు సమావేశాలు జరిగాయని గుర్తు చేశారు. అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు ఇచ్చారన్నారు. 32 శాఖలకు సంబంధించి సుమారు 454 అంశాలను ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం దృష్టికి తేగా 330 అంశాలు ఇప్పటికే పరిష్కారమయ్యాయన్నారు. తక్కువ వ్యవధిలో ఇన్ని సమస్యలు పరిష్కరించడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఇప్పటికే జీపీఎఫ్ బకాయిలు, సరెండర్ లీవులు, ఏపీజీఎల్ఐ పెండింగ్ బిల్లులను చెల్లించారని తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డుల విషయంలో సమస్యలను పరిష్కరించేందుకు ఆరోగ్యశ్రీ ïసీఈఓ ఖాతాలో హెల్త్ కార్డ్ డబ్బులను ఈ నెల నుంచే జమ చేస్తారని చెప్పారు. గతంలో ఓ సీఎం మాట తప్పారు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబధ్దీకరిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచి్చన తర్వాత తాము అలా ఎప్పుడు చెప్పామంటూ గతంలో ఒక ముఖ్యమంత్రి ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇప్పుడు సీఎం జగన్ హామీ ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబదీ్ధకరిస్తున్నారని తెలిపారు. సుమారు 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులర్ అయ్యే అవకాశం ఉందన్నారు. యూనివర్సిటీలు, సహకార సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పదవీ విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచనున్నారని తెలిపారు. స్పెషల్ పే చెల్లించేందుకు త్వరలో ఉత్తర్వులు వెలువడతాయన్నారు. డీఏ, పీఆర్సీ బకాయిలను పదవీ విరమణ తర్వాత ఇవ్వాలని తొలుత భావించినా ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు నాలుగేళ్లలో 16 విడతలుగా సుమారు రూ.7,382 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు. కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.76 వేల కోట్ల ఆదాయాన్ని నష్టపోయిందన్నారు. పద్ధతి ప్రకారం చెల్లింపులు తాము చేసిన ఉద్యమం వల్లే ప్రభుత్వం ఉద్యోగులకు మేలు చేస్తున్నట్లు కొన్ని ఉద్యోగ సంఘాలు గొప్పలు చెప్పుకొనే ప్రయత్నం చేయడం సరికాదని చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. గతంలో ముఖ్యమైన పెద్ద అంశాలపై మాత్రమే ఉద్యమాలు నిర్వహించగా ఇప్పుడు కొన్ని సంఘాలు ఎందుకు ఉద్యమం చేస్తున్నాయో ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఉద్యమం చేయడం వల్లే ప్రభుత్వం ఇవన్నీ ఇవ్వడం లేదని, ఒక పద్ధతి ప్రకారం చెల్లింపులు జరుగుతున్నాయని చెప్పారు. గతంలో పీఆర్సీ కమిషన్ నియమించాలని ఉద్యమాలు జరగగా ఇప్పుడు ప్రభుత్వం ముందుగానే నియమిస్తోందని గుర్తు చేశారు. చదవండి: ఆకాశమే హద్దుగా.. ఎగుమతుల్లో ఏపీ దూకుడు -
రిటైల్ సంస్థలకు షాక్ ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు..!
-
కాలుష్యానికి కళ్లెం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో వాయు కాలుష్యాన్ని 30% మేర తగ్గించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. విశాఖ, విజయవాడ నగరాల్లో గాలిలో ఉన్న కాలుష్యం అంతకంతకు పెరుగుతోన్న నేపథ్యంలో దాన్ని తగ్గించేందుకు రెండేళ్లుగా ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటికే విశాఖ మునిసిపల్ కార్పొరేషన్.. ఏయూ, ఐఐటీ (కాన్పూర్), అమెరికాకు చెందిన డ్యూక్ వర్సిటీలతో కలిసి కాలుష్య నియంత్రణకు ప్రణాళిక తయారు చేసింది. విజయవాడ కార్పొరేషన్ కూడా ఐఐటీ (తిరుపతి) భాగస్వామ్యంతో ప్రణాళిక సిద్ధం చేస్తోంది. శ్రీకాకుళం,విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు నగరాల్లో ఈ తరహా ప్రణాళికలను రూపొందించారు. ఇందుకోసం ఆ నగరాలకు ప్రభుత్వం ఏటా రూ.2 కోట్ల చొప్పున మూడేళ్లు కేటాయిస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు నగరపాలక సంస్థలు ఏయూ ఆధ్వర్యంలో కాలుష్య నియంత్రణ ప్రణాళికలు రూపొందించాయి. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు నగరాలకు ఐఐటీ (తిరుపతి) సహకారంతో, చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, కర్నూలు నగరాలకు నేషనల్ సెంటర్ ఫర్ అట్మోస్ఫియరిక్ రీసెర్చ్ (తిరుపతి) ద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రణాళికలను బట్టి గాలి కాలుష్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వాయు కాలుష్య పర్యవేక్షణ వాయు కాలుష్య నియంత్రణ కోసం ఈ నగరాల్లో రూ.35 కోట్లతో కంటిన్యూస్ యాంబియెంట్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో 5 చొప్పున, 11 మునిసి పాల్టీల్లో ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్నారు. వీటిద్వారా గాలి కాలుష్యాన్ని ఆన్లైన్లో పర్యవేక్షించడం, ప్రజలకు దానిపై డిజిటల్‌గా చూపించడంపై అవగాహన కల్పించనున్నారు. కొత్తగా ఏర్పాటైన ప్రతి జిల్లా కేంద్రంలోను ఒక స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 35 స్టేషన్లలో గాలి కాలుష్యాన్ని పర్యవేక్షించనున్నారు. వ్యర్థాల నుంచి ఇంధనం తయారీకి చర్యలు కార్పొరేషన్లు, మునిసిపాల్టీల నుంచి వచ్చే వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసేందుకు కాలుష్య నియంత్రణ మండలి చర్యలు తీసుకుంటోంది. అక్కడి నుంచి వచ్చే మురుగునీటిని ప్రస్తుతం 89 సివేజి ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా శుద్ధి చేస్తుండగా మరికొన్ని ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్లాస్టిక్, ఈ–పరిశ్రమల వ్యర్థాల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. చదవండి: ఒడిశా రైలు దుర్ఘటన: ‘నువ్వు నా హృదయానికి దగ్గరయ్యావు’.. -
కస్టమర్ల ఫోన్ నంబర్లు తీసుకోవద్దు..రీటైల్ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: మొబైల్ నంబరు ఇవ్వని కస్టమర్లకు రిటైలర్లు సర్వీసులు, రిఫండ్లను నిరాకరిస్తున్న ఉదంతాలపై కేంద్రం దృష్టి సారించింది. ఇటువంటి విధానాలను మానుకునేలా తమ తమ పరిధిలోని రిటైలర్లను కట్టడి చేయాలని పరిశ్రమల సమాఖ్యలకు సూచించింది. ఉత్పత్తులు లేదా సేవలను విక్రయించే సమయంలో కస్టమర్ల సమ్మతి లేకుండా వారి మొబైల్ నంబర్లు తీసుకోకుండా చూడాలని పేర్కొంది. సీఐఐ, ఫిక్కీ, అసోచాం, పీహెచ్‌డీసీసీఐ, రిటైలర్ల అసోసియేషన్ ఆర్ఏఐ, అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఈ మేరకు లేఖ రాశారు. ఉత్పత్తి లేదా సర్వీసు కొనుగోలుకు వినియోగదారు తన మొబైల్ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయొద్దని సూచించారు. ‘మొబైల్ నంబరు ఇవ్వడాన్ని తప్పనిసరి చేయడం వల్ల పలు సందర్భాల్లో కస్టమర్లు తమ అభీష్టానికి విరుద్ధంగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సి వస్తోంది. ఆ తర్వాత నుంచి వారికి రిటైలర్లు అసంఖ్యాకంగా మార్కెటింగ్, ప్రమోషనల్ సందేశాలు పంపిస్తుండటం సమస్యాత్మకంగా ఉంటోంది‘ అని సింగ్ పేర్కొన్నారు. విక్రయ సమయంలో.. కస్టమరుకు ఇష్టం లేకపోయినా, మొబైల్ నంబరు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడం అనేది వినియోగదారుల హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొన్నారు. మొబైల్ నంబరు ఇవ్వలేదన్న కారణంతో వినియోగదారుకు విక్రయించకపోవడం, రిటర్నులు .. ఎక్ఛేంజీలు .. రిఫండ్లను అనుమతించకపోవడం లేదా వినియోగదారు ఫిర్యాదులను పరిష్కరించకపోవడం అనేవి అనుచిత వ్యాపార విధానాల కిందికే వస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సమాఖ్యలు సహకరించి, రిటైలర్లకు తగు సూచనలను ఇవ్వాలని పేర్కొన్నారు. -
PM Modi: తొమ్మిదేళ్ల పాలనలో తీసుకున్న 'ప్రతి నిర్ణయం.. ప్రజల కోసమే'
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దీన్ని తొమ్మిదేళ్ల సేవగా మోదీ పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించేదనని అన్నారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్ వేదికగా.."తాను వినయం, కృతజ్ఞతలతో ఉన్నానని, తాను ఈ తొమ్మిదేళ్ల సేవలో ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే కోరికతో మార్గనిర్దేశం చేసిందేనని చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు తాను మరింత కష్టపడి పనిచేస్తా." అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా నెలరోజుల పాటు భారీ ప్రత్యేక సంప్రదింపు ప్రచారాన్ని బీజేపీ ప్లాన్ చేసింది. గత తొమ్మిదేళ్లలో దేశం ఫస్ట్ అనే మంత్రంతో దేశం ప్రతి రంగంలోనూ అపూర్వమైన అభివృద్ధి సాధించిందని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం ప్రారంభించిన సర్వతోముఖాభివృద్ధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషలకు 21వ శతాబ్దం భారతదేశానికి చెందినదని అభిప్రాయపడ్డారు. కాగా, మే 26, 2014న ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ మళ్లీ తిరిగి మే 30, 2019న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. Today, as we complete 9 years in service to the nation, I am filled with humility and gratitude. Every decision made, every action taken, has been guided by the desire to improve the lives of people. We will keep working even harder to build a developed India. #9YearsOfSeva — Narendra Modi (@narendramodi) May 30, 2023 (చదవండి: ఆ నిజాన్ని మనమందరం అంగీకరించాలి!: అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు) -
టీచర్లకు డ్రస్ కోడ్! కొత్త రూల్‌ని జారీ చేసిన ప్రభుత్వం
ఉపాధ్యాయులకు డ్రెస్ కోడ్ జారీ చేస్తూ ప్రభుత్వం సంచన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఈ ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. ఈ మేరకు అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్ట్లు, లెగ్గింగ్స్ ధరించకుండా నిషేధించేలా ఒక కొత్త నిబంధనను జారీ చేస్తు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. వృత్తి రీత్యా ఉపాధ్యాయులైతే బోధన, క్రమశిక్షణ పరంగా వస్త్రధారణ ఆదర్శంగా ఉండాలని చెప్పింది. ఉపాధ్యాయులు విధులను నిర్వర్తించే సమయంలో మర్యాదపూర్వక హోదాలో ఉంటారు కాబట్టి డ్రెస్ కోడ్‌ని అనుసరించాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొంది. అస్సాంలోని అని విద్యాశాఖల్లోని పురుష, మహిళా ఉపాధ్యాయులు లెగ్గింగ్‌లు, జీన్స్‌లు, టీ షర్ట్లు ధరించొద్దని కోరింది. కొందరూ ఉద్యోగులు తమకు నచ్చిన దుస్తులను ధరించి పాఠశాలలకు వస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, పబ్లిక్ కూడా చాలా వరకు దీన్ని ఆమెదించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. బోధనా సమయంలో ఉపాధ్యాయులు తమ వృత్తికి తగ్గట్టుగా గంభీరత ప్రతిబింబించే దుస్తులు ధరించే కోడ్ అవసరమని నోటిఫికేషన్లో వెల్లడించింది. పాఠశాల విద్యాశాఖ పేర్కొన్న నిబంధనను అందరూ కచ్చితంగా పాటించాలని, ఉల్లంఘించిన వారిపై క్రమశిక్షణా చర్యలకు తీసుకోవడం జరుగుతుందని అస్సాం ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు అస్సాం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు మాట్లాడుతూ..అస్సాం ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పాఠశాల నియమ నిబంధనలకు సంబంధించిన పుస్తకాన్ని ప్రవేశపెట్టనుంది. అందులో పాఠశాలను ఎలా నిర్వహించాలి, తరగతులు ఏవిధంగా నిర్వహించాలి వంటి వాటి తోపాటు ఉపాధ్యాయుల డ్రస్ కోడ్, పిల్లల యూనిఫాంకి సంబంధించిన రూల్స్ ఉంటాయని చెప్పారు. (చదవండి: పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వకండి! కోరుతున్న సాక్షాత్తు కంపెనీ సీఈ ..) -
‘అది పనిష్మెంట్ కాదు.. మోదీ విజన్’
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రి వర్గం మార్పులపై ఎర్త్ సైన్సెస్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం కొత్త మంత్రిత్వశాఖ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఈ బదిలీ అనేది మోదీ ప్రభుత్వం తనకు విధించిన శిక్ష మాత్రం కాదని అన్నారు. ఇదొక ప్రణాళిక అని అన్నారు. ఈ చర్య ప్రధాని మోదీ విజన్‌కు నిలువెత్తు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ఈ బదిలీ విషయమై తాను సుప్రీం కోర్టుకు వెళ్తున్నట్లు వస్తున్న వార్తలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. రాజకీయాలు మాట్లాడటానికి ఇది సమయం కాదని నొక్కి చెప్పారు. అలాగే న్యాయమంత్రిత్వ శాఖకు సంబంధించి ప్రశ్నలను అస్సలు అడగవద్దని, ప్రస్తుతం ఆ శాఖ తనకు సంబంధం లేనిదని తేల్చి చెప్పారు. అయినా మోదీ నాకు కొత్త బాధ్యతలు ఇస్తూనే ఉన్నందున తాను బాధ్యాతాయుతంగా పని చేస్తూనే ఉంటాను అని చెప్పారు. ఇదిలా ఉండగా రవిశంకర్ ప్రసాద్ నిష్క్రమణ తర్వాత రిజిజు జూలై 7, 2021న న్యాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయమూర్తి నియమకాల విషయమై సుప్రీం కోర్టు, ప్రభుత్వం వైఖరిపై తరుచు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యాయమూర్తుల కొలీజియం వ్యవస్థ రాజ్యాంగానికి పరాయి అని ఘాటు వ్యాఖ్యలు చేయడమే గాక రిటైర్డ్ యాక్టివిస్ట్ జడ్జిల న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పార్టీ పాత్ర షోషిస్తోందని విమర్శలు చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి న్యాయవ్యవస్థకు బేధాభిప్రాయాలు పొడచూపాయి. ఈ నేపథ్యంలోనే మోదీ సర్కార్ కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు న్యాయవ్యవస్థలో ఎలాంటి జగడాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇలా కిరణ్ రిజిజును తప్పించినట్లు పలువురు భావిస్తున్నారు. (చదవండి: లేడీ సింగం మృతిపై అనుమానాలు.. రభా వెనక భాగంలో గాయాలు!) -
త్వరలో కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం! 9 ఏళ్ల పాలనకు గుర్తుగా..
భారత్ కొత్త పార్లమెంటు భవనాన్ని మే నెలాఖరు కల్లా ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ తొమ్మిదేళ్ల పాలనుకు గుర్తుగా నిర్మించిన ఈ కొత్త పార్లమెంట్ భవనం పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ భవనాన్ని దాదాపు 970 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్తుల్లో నిర్మించారు. ఇందులో సుమారు 1,224 మంది ఎంపీలు ఉండవచ్చని అధికారులు తెలిపారు. ఇందులో భోజన గదులు, విస్తారమైన పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ఇది భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వ చిహ్నంగా ఉండనుంది. ఈ కొత్త పార్లమెంట్ నిర్మాణంలో జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్, కర్మ ద్వార్ అనే మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వాటిని వీఐపీలు, సందర్శకులు, అధికారుల కోసం ప్రత్యేక ప్రవేశ ద్వారాలుగా కేటాయించారు. దీనిని 2020 డిసెంబర్లో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఇదిలా ఉండగా, ఈ ప్రాంభోత్సవంలో భాగంలో నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల ప్రభుత్వానికి గుర్తుగా బీజేపీ దేశవ్యాప్తంగా అన్ని లోక్‌సభ నియోజకవర్గాలను కవర్ చేస్తూ నెల రోజుల పాటు భారీగా ప్రత్యేక ప్రచార ర్యాలీలను నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. ఈ మేరకు మే 30న ప్రధాని మోదీ భారీ ర్యాలీ ప్రచారాన్ని ప్రారంభిస్తారని, ఆ మరుసటి రోజే ప్రధాని రెండో ర్యాలీని నిర్వహించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల క్రితం మే 26, 2014న ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తదుపరి మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని దర్కించుకుని నిరాటంకంగా తొమ్మిదేళ్లు పాలించారు. అందుకు గుర్తుగా దేశ వ్యాప్తంగా బీజేపీ సినియర్ నేతలు సుమారు 51 ర్యాలీలు నిర్వహించనుండగా, దాదాపు 396 లోక్‌సభ స్థానల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు బీజేపీ పేర్కొంది. ఈ ర్యాలీలు, బహిరంగ సభలకు బీజేపీ ముఖ్యమంత్రులు, రాష్ట్రాల ప్రతిపక్ష నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించనున్నట్లు సమాచారం (చదవండి: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..) -
లక్ష్యానికి మించి ఎంఎస్ఎంఈ రుణాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యధికమందికి ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలను) ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండటంతో బ్యాంకులు కూడా విరివిగా రుణాలివ్వడానికి ముందుకొస్తున్నాయి. ఎంఎస్ఎంఈ రంగానికి 2022–23 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రుణ లక్ష్యాన్ని మూడునెలలు ముందుగా డిసెంబర్ నాటికే చేరుకున్నట్లు రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజా నివేదిక స్పష్టం చేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఎంఎస్ఎంఈ రంగానికి రూ.50,100 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంటే.. తొమ్మిది నెలల కాలంలోనే 6 శాతం అధికంగా రూ.53,419 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. ఈ మొత్తం మార్చి చివరి నాటికి మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం (పీఎంఈజీపీ) కింద వ్యాపార విస్తరణకు విరివిగా రుణాలను ఇప్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించడం రుణాలు పెరగడానికి ప్రధాన కారణంగా బ్యాంకు అధికారులు చెబుతున్నారు. ఎంఎస్ఎంఈ రంగంలో సూక్ష్మసంస్థలకు 2022–23లో రూ.23,300 కోట్ల రుణాలను ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే.. 14 శాతానికిపైగా అధికంగా మొత్తం రూ.26,658 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. అదే చిన్నతరహా యూనిట్లకు రూ.18,000 కోట్లకు, రూ.17,052 కోట్ల రుణాలను, మధ్యతరహా యూనిట్లకు రూ.8,800 కోట్ల లక్ష్యానికి అదనంగా రూ.9,439 కోట్ల రుణాలను మంజూరు చేశాయి. నాలుగేళ్లల్లో 46 శాతానికిపైగా పెరిగిన రుణాలు గడిచిన నాలుగేళ్లల్లో ఎంఎస్ఎంఈ రుణాలు 46 శాతానికిపైగా పెరిగాయి. 2019 మార్చి 31 నాటికి ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన ఔట్‌స్టాండింగ్ రుణ విలువ రూ.58,025 కోట్లుగా ఉంటే... అది 2022 డిసెంబర్ 31 నాటికి రూ.84,922 కోట్లకు చేరింది. గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే రుణాలు భారీగా పెరిగాయని, రెండేళ్ల కోవిడ్ సమయంలో కూడా విరివిగా బ్యాంకు రుణాలు మంజూరయ్యాయని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రోత్సాహకాలను సకాలంలో విడుదల చేయడంతోపాటు రుణాలను అందించే విధంగా ప్రభుత్వం చేయూతనందిస్తుండటంతో రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో 1,05,620 ఎంఎస్ఎంఈలు ఉండగా ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో 2,13,826కి పెరిగాయి. మూడున్నరేళ్లల్లో కొత్తగా 1,08,206 ఎంఎస్ఎంఈలు ఏర్పాటు కావడం ద్వారా రూ.20,537.28 కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు 10,04,555 మందికి ఉపాధి లభించినట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. (చదవండి: సొంత ఆదాయాల పెంపుపై పంచాయతీలు దృష్టి పెట్టాలి) -
తెలంగాణ: త్వరలో ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ
సుందరయ్య విజ్ఞాన కేంద్రం (హైదరాబాద్): టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. ఆర్టీసీ కళ్యాణ మండపంలో శుక్రవారం భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాజిరెడ్డి గోవర్థన్ మాట్లాడుతూ...ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఈ విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల భద్రత విషయంలో సంస్థ అన్ని రకాల చర్యలు చేపడుతుందన్నారు. రాజ్యాంగంలో కల్పించిన రిజర్వేషన్లు అమలు కాకుండా కొంతమంది కుట్ర చేస్తున్నారని, అటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సంస్థ జాయింట్ డైరెక్టర్ సంగ్రామ్‌సింగ్ పాటిల్, చీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ జి.రవీందర్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ.కృష్ణ, గడ్డం శ్రీనివాస్, ఈడీ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా పది పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా విద్యార్థులు పరీక్ష రాశారు. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం పరీక్ష రాయవలసిన అభ్యర్థులు 6,17,971 మంది కాగా 6,11,832 మంది (99.01 శాతం) హాజరయ్యారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి చెప్పారు. ఈసారి 26 జిల్లాలను ప్రాతిపదికగా తీసుకుని ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచే పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో హడావుడి నెలకొంది. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరయ్యేందుకు వీలుగా ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటుచేయడం, వాటిలో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించడంతో విద్యార్థుల్లో ఎక్కువ శాతం మంది సకాలంలోనే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫర్నిచర్‌తోపాటు మంచినీరు అందుబాటులో ఉంచారు. గత ఏడాది పదో తరగతి పరీక్షల్లో జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈసారి అనేక జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కలిగేలా విస్తృతమైన ప్రచారం కల్పించింది. అన్ని పరీక్ష కేంద్రాలను నో ఫోన్ జోన్లుగా ప్రకటించి చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ ఆఫీసర్లతో సహా ఎవరి ఫోన్లను అనుమతించలేదు. విద్యార్థులకు కూడా ఫోన్లు, డిజిటల్ వాచీలు, ఇయర్ఫోన్లు, బ్లూటూత్ వంటి డిజిటల్ పరికరాలను పూర్తిగా నిషేధించింది. ప్రతి కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ప్రత్యేక పోలీసు స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసింది. మొబైల్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్ల సంఖ్యను పెంచింది. లీక్‌లు, ఫేక్ ప్రచారాలు చేయకుండా ఈ చర్యలు అడ్డుకట్ట వేశాయి. ఎవరైనా ఎక్కడైనా లీక్ లేదా ఫేక్ ప్రశ్నపత్రాల ప్రచారం చేసినా వెంటనే పసిగట్టేలా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సిద్ధం చేసింది. ప్రతి ప్రశ్నపత్రం మీద క్యూఆర్ కోడ్‌తో కూడిన రక్షణ ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మాల్ ప్రాక్టీస్ కేసులు కూడా ఎక్కడా నమోదు కాలేదు. డిజిటల్‌గా పరీక్ష రాసిన దివ్యాంగ విద్యార్థులు అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) ఇన్‌క్లూజివ్ హైస్కూల్‌కు చెందిన ఆరుగురు దివ్యాంగ (దృష్టిలోపం ఉన్న) విద్యార్థినులు డిజిటల్‌గా పరీక్ష రాశారు. ఈ పాఠశాలకు చెందిన ఎక్కలూరు దివ్యశ్రీ, పొలిమెర చైత్రిక, ఏకుల సౌమ్య, మేఖ శ్రీధాత్రి, ఉప్పర నాగరత్నమ్మ, చందుగారి పావని రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రానికి హాజరయ్యారు. వీరు డిజిటల్ విధానంలో కంప్యూటర్ ద్వారా స్క్రయిబ్ సహాయం లేకుండా పరీక్ష రాశారు. (చదవండి: డిస్కంలకు కాస్త ఊరట..విద్యుత్ అమ్మకం ధరలు తగ్గింపు!) -
ఆర్థిక వ్యవస్థలో బొగ్గు కీలక పాత్ర: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బొగ్గు కీలక పాత్ర పోషిస్తున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. బొగ్గుని నల్ల బంగారంగా పేర్కొన్నారు. వాణిజ్య బొగ్గు గనుల ఏడో విడత వేలాన్ని రాజ్‌నాథ్ సింగ్ బుధవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్‌నాథ్ మాట్లాడుతూ.. ‘‘గడిచిన కొన్నేళ్లలో మన ఇంధన వినియోగం పెరిగింది. అది ఇక ముందూ వృద్ధి చెందుతుంది. ఈ అవసరాలను తీర్చేందుకు ఈ రోజు నుంచే చర్యలు తీసుకోవాలని’’ చెప్పారు. వ్యాపార సులభ తర నిర్వహణను ప్రోత్సహించేందుకు ముందస్తుగా ఉత్పత్తి ప్రారంభించిన వాటికి ప్రోత్సాహకాలు ఇస్తున్నట్టు మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. రాష్ట్రాలకు చెల్లించే ఆదాయంలో 50 శాతాన్ని రాయితీగా ఇస్తున్నట్టు చెప్పారు. వచ్చే 40-50 ఏళ్లపాటు బొగ్గు వినియోగం కొనసాగుతుందని చెబుతూ.. భారీగా ఉత్పత్తిని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఇప్పటి వరకు ఆరు విడతల వేలంలో 87 బగ్గు గనులను వేలం వేశామని, ఇవన్నీ ఉత్పత్తి ఆరంభిస్తే ఏటా రూ.33,200 కోట్ల ఆదాయంతో పాటు లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) 106 గనుల వేలం.. ఏడో విడతలో వేలానికి ఉంచిన 106 గనుల్లో 61 బ్లాక్‌లు పాక్షికంగా అన్వేషించినవి కాగా, 45 పాక్షికంగా బొగ్గు నిక్షేపాల గురించి అన్వేషణ నిర్వహించినవి. 95 నాన్ కోకింగ్ కోల్ గనులు అయితే, 10 లిగ్నైట్ గనులు ఉన్నాయి. ఈ గనుల నుంచి వెలికితీసే బొగ్గు వినియోగంపై ఎలాంటి ఆంక్షలను ప్రభుత్వం పెట్టలేదు. బొగ్గు రంగంలో ప్రైవేటు కంపెనీలూ తగిన అవకాశాలను సొంతం చేసుకునేందుకు కేంద్ర సర్కారు లోగడ ఈ రంగానికి సంబంధించి ద్వారాలు తెరవడం తెలిసిందే. మరోవైపు ఆరో విడతలో వేలం వేసిన 28 గనులకు సంబంధించి ఒప్పందాలపై బొగ్గు శాఖ సంతకాలు పూర్తి చేసింది. (సహారా కస్టమర్లకు గుడ్‌న్యూస్: ఇన్వెస్టర్లకు చెల్లింపులు) -
కనీస వేతనాలపై మీ వైఖరి ఏమిటి? ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్:కనీస వేతనాలకు సంబంధించి జీవోలు ఇచ్చి.. గెజిట్ ప్రింట్ చేయకపోవడంపై వైఖరిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది. ఐదేళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉండగా 2007 తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజినల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. ప్రభుత్వం వెంటనే గెజిట్‌ను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ప్రతివాదులుగా సీఎస్, కార్మిక శాఖ కమిషనర్ తదితరులను పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. -
మంటల్లో చిక్కుకున్న బస్సు..అదే టైంలో కండక్టర్ నిద్రిస్తుండటంతో..
బస్టాప్ వద్ద పార్క్ చేసి ఉన్న ఓ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో బస్సులో కండక్టర్ నిద్రించగా, బస్టాప్‌లోని రెస్ట్‌రూంలో డ్రైవర్ నిద్రించడానికి వెళ్లాడు. దీంతో కండక్టర్ ఈ ప్రమాదం బారినపడి..తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..బెంగుళూరులోని లింగధీరహల్లిలో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(బీఎంటీసీ) బస్టాండ్‌లో ఆగి ఉన్న బస్సులో అగ్ని ప్రమాదం జరిగింది. బీఎంటీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో..అదే సమయంలో ఆ బస్సులో కండక్టర్ నిద్రపోతున్నాడు. దీంతో అతను మంట్లో చిక్కుకుని..80 శాతం కాలిన గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఐతే బస్సు డ్రైవర్(39) ప్రకాశ్ ఆ సమయంలో బస్టాప్‌లోని రెస్ట్ రూంలో నిద్రపోవడంతో అతను సురక్షితంగా ఉన్నాడు. అర్థరాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని ఆర్టీసీ డీసీపీ పేర్కొన్నారు. ఐతే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు అధికారులు. (చదవండి: భారతీయులు అలాంటివి అనుమతించరు! సమాచార మంత్రి ఫైర్) -
తండ్రి పెన్షన్ కోసం అంధ తనయుడి ప్రదక్షిణలు.. 11 ఏళ్లుగా
సాక్షి, హైదరాబాద్: పోలీసు విభాగంలో డీఎస్పీగా సుదీర్ఘకాలం సేవలు అందించి పదవీ విరమణ చేశారాయన. ఆ తర్వాత అనారోగ్యంతో కన్నుమూశారు కె.పాండు రంగారావు. తండ్రి పెన్షన్ నుంచి రావాల్సిన తన వాటా కోసం ఆయన కుమారుడు కె.రాఘవేంద్ర (గతంలో కెమికల్ రియాక్షన్‌తో రెండు కళ్లూ కోల్పోయాడు) పదకొండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారులతో పాటు రాష్ట్రపతి, గవర్నర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకునేందుకు గురువారం ప్రగతి భవన్ వద్దకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆయనను అడ్డుకున్న పోలీసులు పంజగుట్ట ఠాణాకు తరలించి కౌన్సెలింగ్ అనంతరం వదిలిపెట్టారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర ‘సాక్షి’కి తన దయనీయ పరిస్థితులను ఇలా వివరించారు. అవి ఆయన మాటల్లోనే.. ’మా నాన్న పాండురంగారావు పోలీసు విభాగంలో సబ్– ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి డీఎస్పీ, ఏసీపీ హోదాలో పలు జిల్లాల్లో పనిచేశారు. 1986లో పదవీ విరమణ పొందారు. మా అమ్మ 1994లో చనిపోగా.. నాన్న అనారోగ్యంతో 2010లో కన్నుమూశారు. నేను చెన్నైలో ఇంటీరియర్ డిజైనింగ్ పని చేసేవాడిని. 2009లో కెమికల్ రియాక్షన్ కారణంగా రెండు కళ్లనూ కోల్పోయాను. నిబంధనల ప్రకారం పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగి మరణిస్తే ఆయన పెన్షన్‌లో 50 శాతం భార్యకు చెల్లించాలి. ఆమె కూడా లేని పక్షంలో వికలాంగులు, భర్తను కోల్పోయిన పిల్లలు ఉంటే వారికి 20 నుంచి 25 శాతం చెల్లించాలి. అంధుడిగా మారిన నేను.. మా తండ్రి పెన్షన్ నుంచి రావాల్సిన మొత్తం కోసం పదకొండేళ్లుగా పోరాటం చేస్తున్నాను. తోబుట్టువుల దయాదాక్షిణ్యాలతో.. ప్రస్తుతం నేను ఎల్బీనగర్లో నివసిస్తున్నా. నాకు ఇద్దరు సంతానం. భార్య దూరమైంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరాలు చదువుతున్న పిల్లల ఆలనాపాలనా నేనే చూసుకోవాలి. నెలవారీ ఖర్చులతో పాటు పిల్లల చదువు కోసమూ తోబుట్టువులపై ఆధారపడ్డాను. నాకు రావాల్సిన పెన్షన్ కోసం సంబంధిత అధికారులను 2010లోనే సంప్రదించాను. మొత్తం 19 రకాలైన సర్టిఫికెట్ల కావాలంటూ సూచించడంతో అవన్నీ సేకరించి పదకొండేళ్ల క్రితం దరఖాస్తు చేశా. నలుగురు ఎస్పీలు, అయిదుగురు ఏసీపీలు, దాదాపు పది మంది ఇన్స్పెక్టర్ల వద్దకు వెళ్లి ఈ పత్రాలు సేకరించాను. అప్పటి నుంచి పెన్షన్ కోసం నగర పోలీసు కమిషనరేట్, డీజీపీ కార్యాలయం, ఏజీ ఆఫీస్, పెన్షన్ ఆఫీస్, కలెక్టరేట్ తదితర కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. నా దీనావస్థను వివరిస్తూ ఇద్దరు రాష్ట్రపతులు (శీతాకాల విడిదికి వచ్చినప్పుడు), నలుగురు గవర్నర్లు, ఇద్దరు హోంమంత్రులకు వినతులు అందించినా ఇప్పటి వరకు ఫలితం లేకుండాపోయింది. సీఎంకు నివేదిద్దామంటే అవకాశం ఇవ్వట్లేదు గడిచిన పదకొండేళ్లుగా అనేక ప్రయత్నాలు చేస్తే ఇప్పటికి ఫైల్ నగర పోలీసు కమిషనర్ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్ ద్వారా ఏజీ కార్యాలయానికి చేరింది. ప్రస్తుతం అక్కడే ఆగిపోయింది. నా పరిస్థితిని వివరించి, న్యాయంగా నాకు రావాల్సిన పెన్షన్ ఇప్పించాలని కోరడానికి కొన్నేళ్లుగా ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తున్నా. ప్రతిసారీ పోలీసులు నన్ను అడ్డుకుంటున్నారు. కనీసం నా అభ్యర్థనను కూడా సీఎం వరకు తీసుకువెళ్లట్లేదు’ అని రాఘవేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: మండపంలోనే బోరున ఏడ్చేసిన వధూవరులు.. వీడియో వైరల్! -
ప్రైవేటు రంగం మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలి
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రభుత్వం కల్పించిన ప్రతిపాదనలను అనుకూలంగా మలుచుకోవాలని భారత పరిశ్రమలను (ఇండియా ఇంక్) ప్రధాని మోదీ కోరారు. ప్రభుత్వం మూలధన వ్యయాలను పెంచినట్టే, ప్రైవేటు రంగం కూడా మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అప్పుడే గరిష్ట ప్రయోజనం పొందగలమన్నారు. బడ్జెట్‌పై నిర్వహించిన 10వ వెబినార్‌లో భాగంగా ప్రధాని మాట్లాడారు. ప్రభుత్వం మూలధన వ్యయాల లక్ష్యాన్ని చారిత్రక గరిష్ట స్థాయి అయిన రూ.10 లక్షల కోట్లకు పెంచినట్టు గుర్తు చేశారు. అంతర్జాతీయంగా భారత్ ఎకానమీకి ప్రశంసలు లభిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. జీఎస్టీసహా ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను తగ్గింపు వల్ల పన్నుల భారం గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గినట్టు ప్రధాని తెలిపారు. ఈ చర్యలతో పన్నుల వసూళ్లు మెరుగుపడ్డాయని.. 2013–14 నాటికి 11 లక్షల కోట్లుగా ఉన్న పన్నుల ఆదాయం 2023–24 నాటికి రూ.33 లక్షల కోట్లకు చేరుకోవచ్చన్నారు. -
అన్నీ ఉండీ ధరలు పెరగడమా?
దేశంలో ప్రజలందరికీ కావాల్సిన దరిదాపు అన్ని నిత్యావసరాలు మనమే పండించుకుంటున్నాం. ఇటువంటి స్థితిలో, అంటే సరఫరా తగిన స్థాయిలో ఉన్నప్పుడు నిత్యావసరాల ధరలు పెరగకూడదు. కానీ, జరుగుతున్నది అదే. మార్కెట్ తాలూకూ డిమాండ్ –సరఫరా సాఫీగా జరగడాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలే స్వయంగా వ్యాపార వర్గాల అనుకూలతను చూపడం వల్ల వ్యాపారులు తమ ఇష్టానుసారం సరుకులను నిల్వ చేస్తూ, కొరతలను సృష్టిస్తూ, ధరలను పెంచే వీలు ఏర్పడుతోంది. పైగా ప్రభుత్వమే తన వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసం అమ్ముతోంది. ఈ లాభాపేక్ష లేకుండా... నిల్వ పెట్టిన సరుకులను మార్కెట్లోకి తరచుగా విడుదల చేస్తే ధరల పెరుగుదల నుంచి ప్రజలను కాపాడవచ్చు. గత సంవత్సర కాలంలో దేశంలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. గోధుమల ధర ఈ కాలంలో సుమారు 22 శాతం పెరిగింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భారత ఆహార సంస్థ గోడౌన్ల నుంచి 2.5 మిలియన్ టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్లో అమ్మాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం అనంతర వారంలోనే వాటి ధర 10 శాతం మేరకు తగ్గింది. ఇది సాధారణ మార్కెట్ సూత్రం. సరఫరా పెరిగితే డిమాండ్ తగ్గడం ఈ ధర తగ్గుదల వెనుకన పనిచేస్తోంది. గత సంవత్సర కాలంగా ఇతరత్రా నిత్యావసరాల ధరలు అన్నీ పెరిగిపోతోంటే ప్రభుత్వం చేష్టలుడిగి ఎందుకు ఉండిపోయింది? 2022 ఆగస్టు నాటికే అంతకు ముందరి సంవత్సర కాలంతో పోలిస్తే గోధుమల ధర 14 శాతం మేరన పెరిగి ఉంది. అయినా ప్రస్తుతం చేస్తున్నట్లుగా బహిరంగ మార్కెట్లోకి ధాన్యాన్ని విడుదల చేయలేదు. ఫలితంగా ధరల పెరుగుదల అలాగే కొనసాగింది. దీనికి కారణం, అప్పట్లో ప్రభుత్వం గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలను విదేశాలకు రికార్డు స్థాయిలో ఎగుమతి చేస్తోంది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధ క్రమంలో అంతర్జాతీయంగా ఏర్పడ్డ ధాన్యం కొరతలు, ముఖ్యంగా గోధుమల కొరత, విదేశీ మారక ద్రవ్య సముపార్జనకు బాగా కలిసి వచ్చింది. కానీ, ఇదే భారత ఆహార సంస్థ వద్ద గోధుమల కొరతకు దారి తీసింది. ఫలితమే అప్పుడు మార్కెట్లో ధర పెరిగినా గోధుమ గింజల సరఫరాను పెంచి, ధరలను తగ్గించలేని స్థితి. నేడు నడుస్తున్నది ఎన్నికల సంవత్సరం. ప్రజలను పెరిగే ధరల పాలు చేసి, వారిలో అసంతృప్తి పెరిగి అది తన ఎన్నికల పరాజయానికి దారి తీయకూడదన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. గత సంవత్సరం జరిగిన భారీ ఎగుమతుల నేపథ్యంలో అది నిల్వల కొరతకు దారి తీసిన తర్వాత... ప్రభుత్వం గోధుమల ఎగుమతులను నిషేధించింది. ఈ నిర్ణయాన్ని మార్పు చేయించేందుకు, అమెరికా నుంచి ఒత్తిడులు కూడా వచ్చాయి. చైనా మాత్రమే దేశీయ కొరతల నేపథ్యంలో, ఎగుమతులను నిషేధించాలన్న మన నిర్ణయాన్ని సమర్థించింది. 2022 సంవత్సర కాలంలో మన దేశం బియ్యాన్ని కూడా రికార్డు స్థాయిలో ఎగుమతి చేసింది. వాస్తవానికి నాడు దేశంలో బియ్యం నిల్వలు తగినంత స్థాయిలోనే ఉన్నప్పటికీ ఈ బియ్యం ఎగుమతుల నిర్ణయం దేశీయంగా బియ్యం ధరల పెరుగుదలకు కారణమయ్యింది. గత సంవత్సర కాలం పైబడి నిత్యావసరాల ధరలు తీవ్ర స్థాయిలో పెరిగిన స్థితి మనకు తెలిసిందే. దీనికి కొంత మేరకు విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకొనే వంటనూనెలు, చమురు వంటి వాటి ధరలు అంతర్జాతీయంగానే పెరగడం కారణం కావచ్చును. అయితే, ఇది పాక్షిక సత్యం మాత్రమే. దేశీయంగా వివిధ సరుకుల ధరలను ప్రధానంగా నిర్ణయించే మార్కెట్ శక్తులయిన ‘డిమాండ్ – సరఫరా’ల యాజమాన్యంలో జరుగుతోన్న లోపాలు ధరల పెరుగుదలకు ముఖ్య కారణం. దీనికి, యూపీఏ హయాం నుంచి కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. నాడు యూపీఏ పాలనా కాలంలో దేశంలో ధరలు పెరుగుతోన్న తరుణంలోనే... భారత ఆహార సంస్థ గోడౌన్లలోని ధాన్యాన్ని ఎలుకలు తినేయడం, లేదా అవి ముక్కిపోవడం జరుగుతున్నాయి. సుప్రీంకోర్టు ఈ విషయానికి సంబంధించి నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే, ఆ ప్రభుత్వం ‘ఉచిత భోజనం లేదు’ అంటూ గోడౌన్ల లోని ధాన్యాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు తిరస్కరించింది. మరో పక్కన అదే ధాన్యాన్ని విదేశాలకు... అక్కడ జంతువుల దాణాగా వాడకానికి ఎగుమతి చేసింది. దేశీయ ప్రజలను పెరుగుతోన్న ధరల నుంచి ఆదుకునేందుకు ప్రయత్నం చేయడం లేదా వారి క్షుద్భాదకు పరిష్కారం చూపడం ప్రభుత్వానికి లక్ష్యాలుగా లేవు. దాని ప్రధాన లక్ష్యం విదేశీ మారక ద్రవ్య సముపార్జన మాత్రమే! యూపీఏ అయినా, ఎన్డీయే అయినా అమలు జరుగుతోన్న విధానాలు ఒకటే. కాకుంటే యూపీఏలో సంస్కరణల పేరిట ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరించడంలో కొంత వెనుకా ముందు, లేదా మొహమాటాలు ఉన్నాయి. అలాగే, యూపీఏ ప్రభుత్వం కాస్తలో కాస్త నయంగా కొన్ని ప్రజానుకూల సంక్షేమ పథకాలను తెచ్చింది. దానిలో భాగమే జాతీయ ఉపాధి హామీ పథకం, ఆహార భద్రతా చట్టాల వంటివి. ప్రస్తుతం ఎటువంటి మొహమాటం లేకుండా... కార్పొరేట్, ధనవంతులు, వ్యాపార వర్గాల అనుకూల విధానాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. దీనంతటి ఫలితమే నేడు దేశంలో మొత్తంగా నిత్యావసరాల ధరల పెరుగుదల! ప్రభుత్వం ధరల నియంత్రణకు చిత్తశుద్ధితో పూనుకొని తగిన విధానాలను అనుసరిస్తే ఇంత స్థాయిలో పెరిగి ఉండేవే కాదు. ప్రస్తుతం జరిగిన విధంగా మార్కెట్లోకి గోధుమల నిల్వలను విడుదల చేసి ప్రైవేట్ వ్యాపారులు తమ ఇష్టానుసారం ధర పెంచగల అవకాశాన్ని కట్టడి చేయగలగడం ఒక ఉదాహరణ. మరింత ప్రాధాన్యత గల మరో ఉదాహరణ కేరళ వంటి రాష్ట్రాలది. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలు విడుదలైన సందర్భాలలో కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలలో ఇది అతి తక్కువ స్థాయిలో ఉంటూ రావడం గమనార్హం. దీనికి కారణం ఆ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థలు అమలు జరుగుతోన్న తీరు. ఈ రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా, దరిదాపు కుటుంబాలకు అవసరమైన అన్ని నిత్యావసరాలు పంపిణీ అవుతున్నాయి. ఫలితంగా బహిరంగ మార్కెట్లోని వ్యాపారులకు, ప్రజా పంపిణీ వ్యవస్థతో పోటీ ఏర్పడి, వ్యాపారులు తమ ఇష్టానుసారం సరుకులను నిల్వ చేస్తూ, వాటి కొరతలను సృష్టిస్తూ, తద్వారా ధరలను పెంచుకుంటూ పోయే పరిస్థితి లేకుండా పోయింది. అత్యంత సాధారణంగా కనపడే ఈ ఇంగితాన్ని ఆచరణలో అమలులో పెట్టి అటు రైతాంగానికీ, ఇటు వినియోగదారుడికీ ప్రయోజనాన్ని చేకూర్చే విధానాల అమలు సాధ్యమేనని ఈ ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే నిల్వ పెట్టిన సరుకులను మార్కెట్లోకి తరచుగా విడుదల చేస్తూ పోతే ధరల పెరుగుదల బెడద నుంచి ప్రజలను శాశ్వతంగా కాపాడడం సాధ్యమే. ఎన్నికల సంవత్సరంలో మాత్రమే ధరల తగ్గింపును సవాలుగా తీసుకుంటూ, మిగతా నాలుగు సంవత్సరాల కాలంలో ప్రజానీకాన్ని... వ్యాపారస్తులకూ, దొంగ నిల్వలకూ, కొరతలకూ బలిచేస్తూ పోవడం అత్యంత అసహజమైనది. అది కనీసం డిమాండ్ సరఫరాల తాలూకూ మార్కెట్ సూత్రం పరిధిలో కూడా ఇమడదు. నిజానికి మన దేశంలో ప్రజలందరికీ కావాల్సిన దరిదాపు అన్ని నిత్యావసరాలు (పాలకుల నిర్లక్ష్యంతో ఉత్పత్తి పెరుగుదల లేని వంటనూనె గింజల వంటి కొద్దిపాటివి మినహా) మనమే పండించుకుంటున్నాం. ఇటువంటి స్థితిలో, అంటే సరఫరా తగిన స్థాయిలో ఉన్న స్థితిలో కూడా నిత్యావసరాల ధరలు పెరగకూడదు. కానీ, వాస్తవంలో జరుగుతున్నది అదే. మార్కెట్ తాలూకూ డిమాండ్– సరఫరాను సాఫీగా జరగడాన్ని కాపాడవలసిన ప్రభుత్వాలే స్వయంగా వ్యాపార వర్గాల అనుకూలతను చూపడం... పైగా, స్వయంగా తానే ఒక వ్యాపారిగా తయారై భారత ఆహార సంస్థ వద్ద నిల్వ ఉన్న ధాన్యాన్ని విదేశీ మారక ద్రవ్యం కోసం అమ్ముతూ పోవడం... ఫలితంగా అధిక ధరల పరిస్థితి ఏర్పడింది. ఆహార పదార్థాల నిల్వలపై పరిమితులు విధించే చట్టాలను కూడా ప్రభుత్వం రద్దు చేస్తూ పోవడం వంటి చర్యలు కూడా ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయి. వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు, మొబైల్: 98661 79615 -
ఏపీలో బీచ్ ల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు
-
నికోబార్ వద్ద భారీ ట్రాన్స్షిప్మెంట్ కార్గో ప్రాజెక్ట్
న్యూఢిల్లీ: గ్రేట్ నికోరాబ్ ఐలాండ్ వద్ద బంగాళాఖాతంలో ‘ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ప్రాజెక్ట్’కు కేంద్ర షిప్పింగ్ శాఖ ఆసక్తి వ్యక్తీకరణలను (ఈవోఐ) ఆహ్వానించింది. పీపీపీ కాంట్రాక్ట్ సంస్థ, ప్రభుత్వ పెట్టుబడులు కలసి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి రూ.41,000 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ప్రతిపాదిత పోర్ట్ ప్రాజెక్ట్ వార్షికంగా 16 మిలియన్ కంటెయినర్ల నిర్వహణ సామర్థ్యంతో ఉంటుందని తెలిపింది. మొదటి దశ రూ.18,000 కోట్లతో 2028 నాటికి పూర్తవుతుందని, 4 మిలియన్ టన్నులకు పైగా కంటెయినర్లను ఇది నిర్వహించగలదని వివరించింది. ఈ రవాణా పోర్ట్‌కు అనుబంధంగా ఎయిర్పోర్ట్, టౌన్షిప్, పవర్ ప్లాంట్ కూడా నిర్మించాలనేది ప్రణాళికగా షిప్పింగ్ శాఖ తెలిపింది. అంతర్జాతీయ జల రవాణా మార్గంలో ఈ పోర్ట్ ఏర్పాటు కానుందని, ఇదే మార్గంలో ప్రస్తుతం సింగపూర్, క్లాంగ్, కొలంబో పోర్ట్‌లు ఉన్నట్టు పేర్కొంది. -
సత్ఫలితాలనిస్తున్న ఏపీ ప్రభుత్వ సంస్కరణలు
-
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త
-
ప్రభుత్వాలకు ట్విటర్ గ్రే టిక్..
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ తాజాగా ప్రభుత్వాలకు సంబంధించిన అధికారిక ఖాతాలకు బూడిద రంగు (గ్రే) టిక్ మార్కును, కంపెనీలకు బంగారు వర్ణం (గోల్డెన్) టిక్ మార్కును కేటాయించడం ప్రారంభించింది. మిగతా వెరిఫైడ్ ఖాతాలకు బ్లూ టిక్ మార్క్ ఉంటుంది. కొత్త మార్పుల ప్రకారం భారత ప్రభుత్వ హ్యాండిల్, ప్రధాని నరేంద్ర మోదీ హ్యాండిల్ టిక్ మార్క్‌ను బ్లూ నుంచి గ్రేకు మార్చింది. ప్రధాని ట్విటర్ ఖాతాకు 8.51 కోట్ల మంది ఫాలోయర్లు ఉన్నారు. నెలకు 8 నుంచి 11 డాలర్ల వరకూ చార్జీలతో ట్విటర్ బ్లూ సర్వీసు అందిస్తున్న కంపెనీ ప్రస్తుత సబ్‌స్క్రయిబర్స్ తమ సబ్‌స్క్రిప్షన్‌ను అప్‌గ్రేడ్, రద్దు లేదా ఆటో – రెన్యూ చేసుకోవచ్చని పేర్కొంది. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, బ్రిటన్ దేశాల్లో ట్విటర్ బ్లూ సర్వీస్ అందుబాటులో ఉంది. చదవండి: 8 ఏళ్లలో రూ. 4 లక్షల కోట్లు.. డిజిన్వెస్ట్‌మెంట్‌తో కేంద్రం ఆదాయం -
టెక్ దిగ్గజంపై అవినీతి మరక? ఇన్ఫోసిస్ ప్రాజెక్ట్‌పై ఆస్ట్రేలియా ప్రభుత్వం రివ్యూ!
ప్రముఖ దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఇచ్చిన 135 మిలియన్ డాలర్ల కాంట్రాక్ట్ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రాజెక్ట్‌పై రివ్వ్యూ నిర్వహించనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను ప్రైవేట్ టెక్ సంస్థలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే ఈ కాంట్రాక్ట్ గురించి ఆ దేశ ప్రభుత్వ అధికార పార్టీ లిబరల్ పార్టీ ఆఫ్ ఆస్ట్రేలియా ఎంపీ సువార్ట్ రాబర్ట్ ఇన్ఫోసిస్‌తో పాటు తన ఫ్రెండ్, బిజినెస్ పార్టనర్ జాన్ మార్గెరిసన్‌కు చెందిన కన్సల్టింగ్ సంస్థ సినర్జీ 360 తో పాటు మరో కంపెనీ యూనిసిస్‌కు లీక్ చేశారు. రాబర్ట్ ఈ మూడు సంస్థలకు ప్రాజెక్ట్‌కు సంబంధించిన సెన్సిటీవ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడంతో భారీ ప్రభుత్వ కాంట్రాక్ట్‌ను ఇన్ఫోసిస్ దక్కించుకోవడం సులభమైంది. ఇదే అంశంపై ఆస్ట్రేలియా మీడియా ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ దుమ్మెత్తి పోసింది. ఎంపీ తన అధికారంతో ప్రైవేట్ వ్యక్తుల్ని, సంస్థల్ని లాభం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించింది. దీంతో పునరాలోచనలో పడ్డ ప్రభుత్వం ఇన్ఫోసిస్‌కు ఇచ్చిన ప్రాజెక్ట్‌పై రివ్వ్యూ నిర్వహించేందుకు సిద్ధమైనట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఇన్ఫో కాంట్రాక్ట్ చేజికిచ్చుకునే విషయంలో ఏమైనా అవినీతికి పాల్పడిందా? లేదా? అని కులంకషంగా పరిశీలించనుంది. సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ అనుమానం సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ఇచ్చిన ఈసీఈ (entitlement calculation engine) ప్రాజెక్ట్ విషయంలో మొదటి నుంచి అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తుంది. ఈసీఈ అనేది చట్టం. వ్యాపార నియమాల ఆధారంగా కస్టమర్ అర్హతలను గణిస్తుంది. ఆయా ఏజెన్సీలకు కస్టమర్లు చెల్లింపు లేదా సేవలు ఈ చట్టం లోబడి పని చేయాలి. ఈ విభాగానికి చెందిన ప్రాజెక్ట్‌ను ఇన్ఫోసిస్ దక్కించుకుంది. చదవండి👉 భారతీయులేనా పనిమంతులు.. మేం పనికి రామా? టీసీఎస్‌పై అమెరికన్ల ఆగ్రహం! -
రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి నిధుల లభ్యతను పెంచే క్రమంలో దేశీయంగా తొలిసారి ష్యూరిటీ బాండ్ల బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. డిసెంబర్ 19న దీన్ని ఆవిష్కరించనున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ పథకంతో కాంట్రాక్టర్లకు భారీగా ఊరట లభించగలదన్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు .. కాంట్రాక్టరు తరఫున బీమా కంపెనీ ఈ ష్యూరిటీ బాండును జారీ చేస్తుంది. ఇదీ చదవండి: సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..? ప్రాజెక్టు పనితీరుకు లేదా సకాలంలో పూర్తి చేయడానికి సంబంధించి ఇది హామీగా పని చేస్తుంది. ఒకవేళ కాంట్రాక్టరు గానీ హామీ నిలబెట్టుకోలేకపోతే ప్రాజెక్టు ఇచ్చిన సంస్థ ఈ బాండు ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవడానికి వీలవుతుంది. ఫైనాన్షియల్ గ్యారంటీలో ఆర్థికపరమైన అంశాలు ఇమిడి ఉండగా.. ష్యూరిటీ బాండ్లలో పనితీరు సంబంధిత అంశాలు ఉంటాయి. ప్రస్తుతం కాంట్రాక్టర్లు భారీ మొత్తాలను ఫైనాన్షియల్ గ్యారంటీ చూపించేందుకు కేటాయించాల్సి వస్తోందని, ష్యూరిటీ బాండ్లను ప్రవేశపెడితే వారికి ఆయా నిధులు అందుబాటులోకి రాగలవని గడ్కరీ చెప్పారు. ఈ నిధులను వారు వ్యాపార వృద్ధికి ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తద్వారా మౌలిక రంగంలో నిధుల లభ్యతను పెంచుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడగలవని మంత్రి చెప్పారు. (రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్) ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్విట్స్)లో పెట్టుబడి పెట్టడం ద్వారా దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో రిటైల్ ఇన్వెస్టర్లు పాలుపంచుకో వచ్చని గడ్కరీ తెలిపారు. ఇన్విట్స్ ద్వారా దాదాపు ఎనిమిది శాతం రాబడులు కూడా అందుకోవచ్చన్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా పూర్తి స్వదేశీ, చౌక నిర్మాణ విధానాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. (రూపాయిల్లో వాణిజ్యంపై బ్యాంకుల అవగాహన కార్యక్రమాలు) -
కేంద్రానికి ఓఎన్జీసీ రూ.5,001 కోట్ల డివిడెండు
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం ఓఎన్జీసీ నుంచి ప్రభుత్వానికి డివిడెండ్ రూపేణా రూ. 5,001 కోట్లు లభించింది. వెరసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)ల నుంచి ఈ ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం డివిడెండ్ల ద్వారా దాదాపు రూ. 23,797 కోట్లు అందుకుంది. ఈ విషయాలను దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంతా పాండే తాజాగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. 2020లో నిలకడైన డివిడెండ్ల చెల్లింపు విధానాలను అవలంబించమంటూ సీపీఎస్ఈలకు దీపమ్ సూచించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా లాభదాయకత, పెట్టుబడి అవసరాలు, నగదు నిల్వలు, నెట్‌వర్త్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే అధిక డివిడెండ్ చెల్లింపులకు ఆదేశించింది. ప్రభు త్వ మార్గదర్శకాల ప్రకారం సీపీఎస్ఈలు వార్షికంగా నికర లాభాల నుంచి కనీసం 30% లేదా నెట్‌వర్త్‌లో 5% డివిడెండ్లుగా ప్రకటించవలసి ఉంటుంది. -
ఐకానిక్ అశోక్ హోటల్@ రూ.7,409 కోట్లు
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సుప్రసిద్ధ సంస్థ అశోక్ హోటల్ అంచనా విలువను ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఆస్తుల మానిటైజేషన్‌లో భాగంగా ఢిల్లీలోని కీలక ప్రాంతంలోగల అశోక్ హోటల్‌కు రూ. 7,049 కోట్ల సంకేత విలువను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 25 ఎకరాలలో విస్తరించిన ఈ ఆస్తి విక్రయాన్ని పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో చేపట్టనుంది. పెట్టుబడిదారులతో చర్చలు(ఇన్వెస్టర్ కన్సల్టేషన్) ఇప్పటికే ప్రారంభంకాగా.. క్యాబినెట్ నోట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆస్తుల మానిటైజేషన్(ఎన్ఎంపీ) జాబితాలో అశోక్ హోటల్, సమీపాన గల సామ్రాట్సహా టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌కు చెందిన 8 ఆస్తులున్నాయి. 2021 ఆగస్ట్‌లోనే సీతారామన్ నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల విలువైన ఎన్ఎంపీ కార్యాచరణకు తెరతీసిన సంగతి తెలిసిందే. తద్వారా విభిన్న మౌలిక రంగ ఆస్తుల విలువను అన్‌లాక్ చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం రూ. 33,422 కోట్లు మౌలిక సంబంధ శాఖలతో చర్చల ద్వారా నీతి ఆయోగ్ ఎన్ఎంపీ నివేదికను రూపొందించింది. ఈ నెల 14న నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో సమావేశంలో ఆర్థిక మంత్రి ఎన్ఎంపీ పురోగతిపై సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 33,422 కోట్ల విలువైన ఎన్ఎంపీని సాధించింది. 2021-22లో ప్రభుత్వం రూ. లక్ష కోట్ల లావాదేవీలు పూర్తిచేయడం ద్వారా తొలి ఏడాది లక్ష్యం రూ. 88,000 కోట్లను అధిగమించడం గమనార్హం! -
క్రిప్టో ఇన్వెస్టర్లకు ఆర్బీఐ రక్షణ
న్యూఢిల్లీ: ఆకాశమే హద్దుగా పెరిగిపోయిన వివాదాస్పద క్రిప్టో కరెన్సీలు అకస్మాత్తుగా మళ్లీ పాతాళానికి పతనమవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల కొద్దీ డాలర్ల ఇన్వెస్టర్ల పెట్టుబడులు హరించుకుపోతున్నాయి. 2021లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టోల మార్కెట్ విలువ కేవలం ఏడాది వ్యవధిలోనే 1 ట్రిలియన్ డాలర్ కన్నా తక్కువకి పడిపోవడం ఈ కరెన్సీల్లో ఉన్న రిస్కులను ప్రపంచానికి మరోసారి తెలియజేసింది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద క్రిప్టో ఎక్సే్చంజీగా వ్యవహరించిన ఎఫ్‌టీఎక్స్ కుప్పకూలడంతో దాని సహ–వ్యవస్థాపకుడు శామ్ బ్యాంక్మన్–ఫ్రైడ్ సంపద కేవలం రోజుల వ్యవధిలో ఏకంగా 16 బిలియన్ డాలర్లు హరించుకుపోయింది. భారీ సంపద ఇంత వేగంగా కరిగిపోయిన అతి తక్కువ సందర్భాల్లో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం. ఈ ఉదంతం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్టర్లను కుదిపేసింది. ప్రధాన స్రవంతిలోకి చేరి అందరి విశ్వసనీయతను పొందేందుకు నానా తంటాలు పడుతున్న క్రిప్టోలపై .. ఇప్పటిదాకా ఉన్న కాస్తో కూస్తో నమ్మకాన్ని కూడా సడలించేసింది. ఆర్బీఐ, ప్రభుత్వ అస్త్రాలతో క్రిప్టో లావాదేవీల కట్టడి.. అయితే, క్రిప్టో ప్రపంచంలో అల్లకల్లోలం రేగుతున్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు మాత్రం ఈ ప్రభావాల నుండి కొంత సురక్షితంగానే ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. క్రిప్టోలపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఆది నుండి కఠిన వైఖరులు పాటిస్తుండటమే మన ఇన్వెస్టర్లను కాస్త కాపాడుతోందని వారు తెలిపారు. క్రిప్టోలకు గుర్తింపునిచ్చేందుకు ఆర్బీఐ నిరాకరిస్తుండటం, ప్రభుత్వం పన్ను అస్త్రాన్ని ప్రయోగించడం .. వంటి అంశాలు దేశీయంగా డిమాండ్‌ను తగ్గించేందుకు, తద్వారా ఇన్వెస్టర్లను కొంత సురక్షితంగా ఉంచేందుకు దోహదపడినట్లు పేర్కొన్నారు. క్రిప్టోలకు చట్టబద్ధత కల్పించకపోయినప్పటికీ వాటి లావాదేవీలపై వచ్చే లాభాల మీద 30 శాతం పన్ను విధించింది ప్రభుత్వం. అంతేకాకుండా వర్చువల్ డిజిటల్ కరెన్సీలకు చెల్లింపులు రూ. 10,000 దాటితే 1 శాతం టీడీఎస్ కూడా విధించింది. ఇలాంటి చర్యలతో క్రిప్టోల జోలికి వెళ్లకుండా ఇన్వెస్టర్లను కాస్త కట్టడి చేసినట్లయిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ‘ఈ విషయంలో హీరోలు ఎవరు? ఇంకెవరు మన కేంద్ర ప్రభుత్వం, సెబీ, ఆర్బీఐ మొదలైనవే. భారతీయ బ్రోకింగ్ సంస్థలు కూడా క్రిప్టోల్లోకి ప్రవేశించి ఉంటే ఎంత మంది ఎంత డబ్బు పోగొట్టుకుని ఉండేవారో కదా. ప్రభుత్వం, ఆర్బీఐ ఇన్ని చర్యలు తీసుకుంటున్నా .. దాదాపు 3 శాతం మంది భారతీయులు క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేశారు. చివరిగా చెప్పేదేమిటంటే.. ఈ పతనం ఇంకా ముగియలేదు. మార్కెట్ పడిపోయింది కదా అని దయచేసి కొనుగోళ్లకు బైల్దేరవద్దు‘ అంటూ దేశీయంగా అతి పెద్ద ఆప్షన్స్ ప్లాట్‌ఫాం సెన్సిబుల్డాట్కామ్ సీఈవో ఆబిద్ హసన్ ట్వీట్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రిప్టోలకు గుర్తింపు ఇవ్వకూడదన్న ఆర్బీఐ, ప్రభుత్వ నిర్ణయాలు సరైనవేనని అసోసియేషన్ ఆఫ్ నేషనల్ ఎక్సే్చంజెస్ మెంబర్స్ ఆఫ్ ఇండియా (ఏఎన్ఎంఐ) ప్రెసిడెంట్ కమ్లేష్ షా అభిప్రాయపడ్డారు. -
యూనియన్ బ్యాంక్‌కు కొత్త అధికారి
న్యూఢిల్లీ: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పార్ట్ టైమ్ నాన్ అఫీషియల్ డైరెక్టర్, నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా శ్రీనివాసన్ వరదరాజన్ నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. వరదరాజన్‌కు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసుల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. యాక్సిస్ బ్యాంక్ డిప్యూటీ ఎండీగా సేవలు అందించారు. -
పుస్తక ప్రచురణపైనా పెత్తనమేనా?
రచయితలు ఏమి రాయాలో, ప్రచురణ కర్తలు ఏం ప్రచురించాలో కూడా ప్రభుత్వాలే ఆదేశించే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? ఇదే జరిగితే అర్థవంతమైన ప్రజాస్వామ్యంగా భారత్ తన ఉనికినే కోల్పోతుంది. మణిపూర్ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఆదేశం ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుంది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక అంశాలకు చెందిన ఏవైనా పుస్తకాలను ప్రచురించడానికి ముందు మణిపూర్ విద్యామంత్రి నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీకి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది పుస్తకాలపై సెన్సార్షిప్ విధించటానికి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు... రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛల ఉల్లంఘన కూడా! అయితే, నిర్దిష్టమైన పుస్తకాలను నిషేధించడానికి కూడా రాజ్యాంగం ప్రభుత్వానికి అనుమతినిస్తోంది. కానీ అది అచ్చయిన పుస్తకాలకే వర్తిస్తుంది. అంతేగానీ ప్రతి పుస్తకాన్నీ ప్రచురణకు ముందుగానే ప్రభుత్వానికి సమర్పించాలని దానర్థం కాదు. అయినా మన ప్రచురణకర్తలు ఎందుకు మౌనంగా ఉన్నారు అనేది పెద్ద ప్రశ్న. ప్రపంచంలో చాలా భయంకరమైన ఘటనలు జరుగుతుంటాయనీ, ప్రతి ఒక్క ఘటనపై మనం దృష్టి పెట్టలేమనీ నాకు తెలుసు. కానీ కొన్ని సార్లు మనం చూడలేకపోయిన లేక విస్మరించిన విష యాలు రెండూ మనల్ని ఆశ్చర్యచకితులను చేస్తాయి. ఒక్కోసారి స్వీయ ఓటమిలోకి కూడా మనల్ని నెడతాయి. ఈరోజు అలాంటి ఒక ఘట నపై నేను దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. సెప్టెంబర్ 15వ తేదీన మణిపూర్ ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగోళిక అంశాలకు చెందిన ఏవైనా పుస్తకాలను ప్రచురించడానికి ముందు వాటిని మణిపూర్ విద్యామంత్రి నేతృ త్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీకి సమ ర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. నిజం చెప్పా లంటే, ఇది పుస్తకాలపై సెన్సార్షిప్ విధించటానికి చేసిన ప్రయత్నం మాత్రమే కాదు... రాజ్యాంగం మనకు ప్రసాదించిన వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛల ఉల్లంఘన కూడా అవుతుందని ఆందోళన కలుగుతోంది. రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం, భౌగో ళిక అంశాలపై ప్రచురించిన కొన్ని పుస్తకాలు వాస్త వాలను వ్యక్తీకరించేలా ఉంటున్నాయి లేదా వివిధ సామాజిక బృందాల్లో శాంతియుత సహజీవనానికి విఘాతం కలిగించేవిగా ఉంటున్నాయని మణిపూర్ ప్రభుత్వం చెబుతోంది. ఇకనుంచి ఈ అంశాలపై రాసిన పుస్తకాలను రాష్ట్రంలోని వైస్‌చాన్సలర్లు, కాలేజీలు, యూనివర్సిటీల అధ్యాపకులు, మణి పూర్ ప్రభుత్వ ఉన్నత విద్యా శాఖ అధికారులతో కూడిన 15 మంది సభ్యుల కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ కమిటీ ఆమోదం లేకుండా ఏ పుస్తకాన్నయినా ప్రచురించినట్లయితే సంబంధిత చట్టప్రకారం శిక్షకు గురవుతారని ప్రభుత్వ ఆదేశం తెలిపింది. అయితే ఏ చట్టం కింద ఏ శిక్ష విధిస్తారనే విషయాన్ని అది నిర్దిష్టంగా పేర్కొనలేదు. అలాగే శిక్షకు గురయ్యేది రచయితా, లేక ప్రచురణకర్తా లేదా ఇద్దరూనా అనే విషయాన్ని కూడా స్పష్టంగా పేర్కొనలేదు. ఇప్పుడు రాజ్యాంగం వైపు చూద్దాం. భారత సార్వభౌమాధికారాన్ని, దేశ సమగ్రత ప్రయోజనా లను, శాంతిభద్రతలను దెబ్బతీసే రకం వాక్ స్వేచ్ఛపై హేతుపూర్వకమైన ఆంక్షలను విధించడా నికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (2) అనుమతిస్తోంది. ఇది నిర్దిష్టమైన పుస్తకాలను నిషే ధించేందుకు ప్రభుత్వాన్ని అనుమతిస్తోంది. దీనికి ఉదాహరణ ఏమిటంటే మహాత్మాగాంధీ హత్యపై కాల్పనిక చిత్రణకు సంబంధించి స్టేన్లీ వూల్పర్ట్ రాసిన ‘‘నైన్ అవర్స్ టు రామా’’ అనే పుస్తకాన్ని గతంలోనే నిషేధించారు. అంతమాత్రాన ప్రభు త్వంపైన పేర్కొన్న నాలుగు అంశాలపై రాసే ప్రతి పుస్తకాన్నీ ప్రచురణకు ముందుగానే ప్రభుత్వ కమి టీకి సమర్పించడాన్ని కూడా ఆర్టికల్ 19 (2) అనుమతిస్తుందా? దీనికి సమాధానం నిస్సందేహంగా లేదు అనే చెప్పాలి. దీనికి సమాధానం అవును అయితే అర్థ వంతమైన ప్రజాస్వామ్యంగా భారత్ తన ఉనికిని కోల్పోతుంది. కాబట్టే మణిపూర్ ప్రభుత్వ ఆదేశం అసంబద్ధమైనదే కాదు... ఆమోదించతగినది కూడా కాదు. అందుకనే ఈ అంశాన్ని చేపట్టడంలో, తీవ్రంగా నిరసన తెలపడంలో మన వైఫల్యం నన్ను ఆశ్చర్యపరుస్తోంది. అంతకు మించి భయ పెడుతోంది కూడా! అయితే పూర్తిగా వాస్తవ విరుద్ధంగా రూపొంది, సమాజాన్ని చిక్కుల్లో పడేసి, విచ్ఛిన్న పరిచే పుస్తకాలకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యా తీసుకోకూడదని దీనర్థం కాదు. ప్రభుత్వం ఇలాంటి పుస్తకాలను సవరించుకోవాలని డిమాండ్ చేయవచ్చు. నిషేధించకూడదు, కానీ ప్రభుత్వం తలుచుకుంటే దానిమీద నిషే«ధం కూడా విధించ వచ్చు. అయితే ఇవన్నీ కూడా ఏ పుస్తకానికి ఆ పుస్తకానికి మాత్రమే విడిగా వర్తించే అంశాలు. అదికూడా వాటిల్లో తప్పుందని తేలినప్పుడు! అంతేగానీ ప్రచురణకు ముందుగానే వ్యక్తులు రాసిన పుస్తకాలను కైవసం చేసుకుని, శోధించి, తర్వాత ఏది ప్రచురించవచ్చు, దేన్ని తిరస్కరించ వచ్చు అని నిర్ణయించే పనిని ప్రభుత్వం చేయ కూడదు. కానీ మణిపూర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశం సరిగ్గా దీన్నే ప్రతిపాదిస్తోంది. కానీ ఒక్క సానుభూతి చూపడం మినహా, మన ప్రచురణకర్తలు ఎందుకు దీనిపట్ల మౌనంగా ఉన్నారు? వారు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతారనీ, ప్రభుత్వ ఆదేశాలపై లీగల్ చర్యకు సిద్ధమవుతారనీ భావించాను. అయితే నిజాయతీగా చెప్పాలంటే మణిపూర్‌లో కొద్దిమంది ప్రచురణ కర్తలు మినహా యిస్తే బడా ప్రచురణ సంస్థల్లో ఏ ఒక్కటీ మణి పూర్ ప్రభుత్వ ఆదేశాన్ని సవాలు చేసిన పాపాన పోలేదు. బహుశా చిన్న స్థాయి ప్రచురణకర్తలకు ఇది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కావొచ్చు. దీని కయ్యే ఖర్చులను వారి పుస్తకాల ద్వారా రాబట్ట లేకపోవచ్చు. అయితే ప్రచురణ కర్తలు సామూహి కంగానే ఈ ఉక్కుపాదం మీద పోరాడవచ్చు. ఎందుకంటే వీరి హక్కులు, ప్రయోజనాలు మొత్తంగా ప్రమాదంలో పడుతున్నాయి మరి. ఆక్షేపణే లేకుండా వారు ప్రభుత్వ ఆదేశాన్ని ఆమోదించినట్లయితే (ప్రస్తుతానికి వారు ఆమో దిస్తున్నట్లే కనబడుతోంది) వారూ, వారి రచయి తలు కూడా నష్టపోతారు. వారితోపాటు మనం కూడా నష్టపోతాం. పాఠకులుగా మనం చదవాలనుకునే, నేర్చుకోవాల నుకునే పుస్తకాలను ప్రభుత్వాలు నిరాకరిస్తాయి. మణిపూర్ ప్రభుత్వ ఆదేశం అందరిలాగే మనల్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి మన మీడియా ఎందుకు మౌనంగా ఉంటోంది అనేది ప్రశ్న. టీవీల్లో దీనికి వ్యతిరేకంగా ఆగ్రహపూరితమైన చర్చలు ఎందుకు జరగడం లేదు? మన వార్తా పత్రికలు మండిపడుతూ సంపాదకీయాలు ఎందుకు రాయడం లేదు? వాళ్లకు పరిస్థితి అర్థం కాలేదా? లేక ఏం జరుగుతోందో వారికి నిజంగానే తెలియడం లేదా? వీటికి సమాధానాలు నాకు తెలీవు కానీ ఈ ప్రశ్నలన్నీ ప్రాసంగికత కలిగి నట్టివే! అందుకే నేటి పరిస్థితి చాలా నిస్పృహను కలిగిస్తోంది. చివరకు అది నా మిత్రుడు లేవనెత్తిన ప్రశ్న దగ్గర వచ్చి ఆగింది. చివరకు మనం ఇక్కడికి చేరామా అని ప్రశ్నించాడతను. నిజం చెప్పాలంటే, సమాధానం అవును అనే! వ్యాసకర్త: కరణ్ థాపర్, సీనియర్ పాత్రికేయులు -
సీఎస్ఆర్ నిబంధనలకు సవరణ.. నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోతే
న్యూఢిల్లీ: కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ఖాతాల్లో ఖర్చు చేయకుండా నిధులు మిగిలిపోతే వాటి వినియోగానికి సంబంధించి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయాలని కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు నిబంధనలను సవరించింది. సాధారణంగా నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో కంపెనీలు తాము సీఎస్ఆర్ కింద చేపట్టిన ప్రాజెక్టు పనులు పూర్తి కాని సందర్భంలో, దానికి కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోతే ఆ మొత్తాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తాజా సవరణ ప్రకారం ఆయా నిధులు సదరు ఖాతాల్లో ఉన్నంత వరకూ వాటి పర్యవేక్షణ కోసం కంపెనీలు సీఎస్ఆర్ కమిటీని ఏర్పాటు చేయాలి. అలాగే బోర్డు నివేదికలో పొందుపర్చాల్సిన సీఎస్ఆర్ కార్యకలాపాల వార్షిక రిపోర్టు ఫార్మాట్‌నూ ప్రభుత్వం సవరించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
అక్రమ వాణిజ్యం, ప్రభుత్వానికి రూ.58,521 కోట్ల నష్టం!
న్యూఢిల్లీ: అక్రమ వాణిజ్యం కారణంగా పెద్ద ఎత్తున పన్ను ఆదాయానికి నష్టం వాటిల్లుతోంది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో అక్రమ వాణిజ్యం కారణంగా రూ.58,521 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోయినట్టు వాణిజ్య మండలి ఫిక్కీ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. ఎఫ్ఎంసీజీ, మొబైల్ ఫోన్లు, పొగాకు ఉత్పత్తులు, మద్యం రంగాల్లో అక్రమ వాణిజ్యాన్ని ప్రస్తావించింది. ఈ రంగాల్లో అక్రమ వాణిజ్యం 2019–20లో రూ.2.60 లక్షల కోట్లుగా ఉంటుందని ఫిక్కీ అంచనా వేసింది. ఇందులో ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల టర్నోవర్ 75 శాతంగా ఉంటుందని తెలిపింది. అక్రమ వాణిజ్యం కారణంగా ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్డ్ పరిశ్రమలో రూ.17,074 కోట్లు, ఆల్కహాల్ ఉత్పత్తుల వల్ల రూ.15,262 కోట్లు, పొగాకు ఉత్పత్తుల వల్ల రూ.13,331 కోట్లు, ఎఫ్ఎంసీజీ హౌస్‌హోల్డ్, పర్సనల్ గూడ్స్ విభాగంలో రూ.9,995 కోట్లు, మొబైల్ ఫోన్లలో రూ.2,859 కోట్ల మేర పన్ను నష్టం వాటిల్లినట్టు వెల్లడించింది. ‘అక్రమ మార్కెట్లు.. జాతి ప్రయోజనాలకు విరుద్ధం’ పేరుతో ఫిక్కీ ఈ నివేదికను తీసుకొచ్చింది. పొగాకు ఉత్పత్తులు, మద్యం ఉత్పత్తుల రూపంలో ప్రభుత్వాలకు పెద్ద ఎత్తున పన్ను ఆదాయం వస్తుంటుంది. వీటిపై నియంత్రణలు కూడా ఎక్కువే కావడం గమనార్హం. అక్రమ వాణిజ్యం వల్ల ఖజానాకు కలిగిన నష్టంలో సగం పొగాకు, మద్యం ఉత్పత్తుల నుంచే ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఉపాధికీ నష్టమే.. ఎఫ్ఎంసీజీ ప్యాకేజ్డ్ ఫుడ్ పరిశ్రమలో అక్రమ వాణిజ్యం కారణంగా 7.94 లక్షల మంది ఉపాధికి నష్టం వాటిల్లింది. పొగాకు పరిశ్రమలో 3.7 లక్షల మంది, ఎఫ్ఎంసీజీ హౌస్‌హోల్డ్, పర్సనల్ గూడ్స్ పరిశ్రమలో 2.98 లక్షల మంది, ఆల్కహాల్ బెవరేజెస్‌లో 97,000 మంది, మొబైల్ ఫోన్ పరిశ్రమలో 35,000 మంది అక్రమ వాణిజ్యం కారణంగా ఉపాధి కోల్పోయారు. ‘‘ఈ రంగాల్లో అక్రమ వాణిజ్యం వల్ల ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. ఎందుకంటే ఇతర రంగాలతో ఈ రంగాలకు అనుబంధం ఉండడం వల్లే’’అని ఫిక్కీ నివేదిక వివరించింది. తయారీని బలోపేతం చేయడం, అసలైన ఉత్పత్తులకు సంబంధించి డిమాండ్–సరఫరా మధ్య అంతరం లేకుండా చూడడం, వినియోగదారుల్లో అవగాహన కల్పించడం, పన్ను టారిఫ్‌ల క్రమబద్ధీకరణ, ఆవిష్కరణలకు అనుకూల వాతావరణం.. అక్రమ వాణిజ్య నిరోధానికి అవసరమని ఫిక్కీ నివేదిక సూచించింది. చదవండి: TCS Work From Home Ends: టీసీఎస్ భారీ షాక్.. ఉద్యోగులు రెడీగా ఉండండమ్మా! -
రూపీలోనే ఇన్వాయిస్, చెల్లింపులు, భారీ ఊరట
న్యూఢిల్లీ: రూపాయి మారకంలోనే ఇన్వాయిసింగ్, చెల్లింపులు, ఎగుమతుల, దిగుమతుల సెటిల్ మెంట్లకు అనుమతిస్తూ వాణిజ్య శాఖ నిర్ణయం తీసుకుంది. రూపాయి మారకంలో వాణిజ్య నిర్వహణకు ఆసక్తి పెరగడంతో.. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలకు వీలుగా అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్బీఐ ఈ ఏడాది జూలైలోనే బ్యాంకులను కోరడం గమనార్హం. ఆర్బీఐ నిర్ణయానికి అనుగుణంగా విదేశీ వాణిజ్య విధానంలో కొత్త పారాగ్రాఫ్‌ను చేర్చినట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ప్రకటించింది. -
బిహార్‌లో బహిరంగంగా మద్యం సరఫరా... నితీష్ ప్రభుత్వాన్ని నిలదీసిన చిరాగ్ పాశ్వాన్
బిహార్: భారతీయ జనతాపార్టీ(బీజేపీ)తో రాజకీయ సంబంధాలు తెంచుకున్నప్పటి నుంచి బిహార్ సీఎం నితీష్ కుమార్ ప్రభుత్వం పై ప్రతిపక్షాలు, ఇతర పార్టీల నుంచి ఎడతెగనిదాడి ఎక్కువైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిరాగ్ పాశ్వాన్ , ప్రశాంత్ కిషోర్, ఆర్సీపీ సింగ్ వంటి నేతలు నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. బిహార్‌లో నేరాలు పెరిపోతున్నాయంటూ లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ఇటీవలే నితీష్ ప్రభుత్వం పై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అంతేకాదు సామాజిక మాధ్యమాల్లో కూడా అతనిపై పలు విమర్శలు చేస్తూ...ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చిరాగ్ పాశ్వాన్ బిహార్‌లో మద్యం పూర్తిగా నిషేధింపబడిందంటూ... నితీష్ కుమార్ ప్రభుత్వం చేస్తున్న వాదనలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ఒక వ్యక్తి బల్లియా నుంచి దరౌలికి బహిరంగంగా మద్యం సరఫరా చేస్తానంటూ బైక్ నడుపుతూ వెళ్లుతుంటాడు. అయినా సీఎం దృష్టి ప్రధాని కుర్చిపైనే ఉంది, ఆయన దయచేసి ఇక్కడ దృష్టి సారించి ఉంటే ఇదంతా జరిగేది కాదు అని ఆరోపణలు కూడా చేశాడు. ఆ వీడియోలో పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహంచినట్లు కనిపిస్తుంది. వాస్తవానికి బిహార్‌లో 2016 నుంచి మద్యాన్ని నిషేధించడమే కాకుండా అతిక్రమించింన వారికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే పెద్ద సంఖ్యలో నేరస్తులు జైళ్లల్లో శిక్ష అనుభవించడం ఎక్కువవ్వడం...మరోవైపు కేసుల సంఖ్య పెండింగ్‌లో ఉండటం తదితర కారణాల రీత్యా నితీష్ కుమార్ ప్రభుత్వం ఆర్టికల్ 37 ప్రకారం మద్యపాన నిషేధ చట్టాన్ని సవరించింది. మొదటిసారి నేరానికి పాల్పడితే మేజిస్ట్రేట్ సమక్షంలో సుమారు రూ. 2000 నుంచి 5000 వరకు జరిమాన చెల్లిస్తే వదిలేస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు, ఇతర పక్షాలు పెద్ద ఎత్తున నితీష్ కుమార్ ప్రభుత్వం పై విరచుకుపడుతున్నాయి. मुख्यमंत्री @NitishKumar जी! माना की आपकी दृष्टि अभी प्रधानमंत्री की कुर्सी पर ज्यादा है , लेकिन थोड़ा ध्यान इधर भी देते तो शायद बिहार में ये सब न हो रहा होता।देखिए कैसे खुलेआम दारू सप्लाई की जा रही है और आपकी पुलिस मूकदर्शक बन देख रही है। pic.twitter.com/IKTnFFoh5J — युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) September 12, 2022 (చదవండి: నా శాఖలో అందరూ దొంగలే... బిహార్ మంత్రి వ్యాఖ్యలు వైరల్) -
మద్యం బాటిళ్లతో గాజుల తయారీ... జీవనోపాధి ఇస్తూ...వ్యర్థాలకు చెక్
పట్నా: బిహార్‌లో ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో మద్యం పట్టుబడుతోంది. దీంతో స్వాధీనం చేసుకున్న బాటిళ్లను పారవేయడంలో తరుచుగా సమస్యలు ఎదుర్కొంటున్నామని బిహార్ ఎక్సైజ్ శాఖ మంత్రి సునీల్ కుమార్ అన్నారు. ఈ మద్యం బాటిళ్లను మట్టిని తొలగించే ఎర్త్ మూవర్ మిషన్లతో చితక్కొట్టడం వల్ల భారీ మొత్తంలో వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. అందుకని ఈ వ్యర్థాలను తగ్గించేలా జీవనోపాధిని ఇచ్చేలా బిహార్ ప్రభుత్వం ఒక వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. అదే మద్యం బాటిళ్లతో గాజుల తయారీ. ఈ గాజుల తయారీని 'జీవిక పథకానికి' చెందిన మహిళలకు శిక్షణ ఇవ్వడమే కాకుండా ఒక తయారీ యూనిట్‌ని కూడా ఏర్పాటు చేసేందుకు బిహార్‌ప్రభుత్వం ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ మేరకు బిహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రోహిబేషన్ శాఖ అందుకోసం దాదాపు కోటి రూపాయాల మొత్తాన్ని మంజూరు చేసింది. దీంతో ప్రోహిబేషన్ శాఖ గాజుల తరయారీ ముడి సరుకు కోసం జీవనోపాది కార్మికులను నియమించుకుంటుంది. ఆ కార్మికులకు పగిలిన మద్యం బాటిళ్ల పొడిని అందజేస్తారు. ఆ జీవనోపాది కార్మికులు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గాజులు తయారు చేయడంలో శిక్షణ పొందుతారు. తొలుత తయారీ యూనిట్ల సంఖ్య పరిమితంగా ఉంటుందని రానున్న నెలల్లో మరింతగా పెంచుతామని ప్రోహిబేషన్ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇది ఒక కుటీర పరిశ్రమలా పనిచేస్తుందన్నారు. అంతేకాదు దీన్ని మరింతగా విస్తరించగలమా లేదా అనే దానిపై నివేదికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో పేదరిక నిర్మూలన చేయడమే 'జీవిక పథకం' లక్ష్యమని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రవణ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు, ముఖ్యంగా మహిళలకు మరింత ఉపాధిని కల్పించడమే ఈ పథకం లక్ష్యం అని చెప్పారు. ఈ ప్రాజెక్టును పట్నాలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. వాస్తవానికి బీహార్‌లో ఏప్రిల్ 2016లో మద్యం నిషేధించబడింది. దీనితో పాటు, మద్యం నిల్వ, వినియోగం, అమ్మకం, తయారీ వంటివి శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తోంది.