సాక్షి, హైదరాబాద్:కనీస వేతనాలకు సంబంధించి జీవోలు ఇచ్చి.. గెజిట్ ప్రింట్ చేయకపోవడంపై వైఖరిని తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది. ఐదేళ్లకు ఒకసారి కనీస వేతనాలను సవరిస్తూ గెజిట్ విడుదల చేయాల్సి ఉండగా 2007 తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఇవ్వలేదని పేర్కొంటూ తెలంగాణ రీజినల్ ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది.
ప్రభుత్వం వెంటనే గెజిట్‌ను విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది. ప్రతివాదులుగా సీఎస్, కార్మిక శాఖ కమిషనర్ తదితరులను పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ వైఖరిని తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment