'Every Decision Made': PM Modi's Tweet on 9 Years Of BJP Government - Sakshi
Sakshi News home page

తొమ్మిదేళ్ల పాలనలో తీసుకున్న'ప్రతి నిర్ణయం.. ప్రజల కోసమే': మోదీ

Published Tue, May 30 2023 11:21 AM | Last Updated on Tue, May 30 2023 11:49 AM

PM Modis Tweet on 9 Years Of BJP Government Every Decision Made - Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దీన్ని తొమ్మిదేళ్ల సేవగా మోదీ పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించేదనని అన్నారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్‌ వేదికగా.."తాను వినయం, కృతజ్ఞతలతో ఉన్నానని, తాను ఈ తొమ్మిదేళ్ల సేవలో ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే కోరికతో మార్గనిర్దేశం చేసిందేనని చెప్పారు.

అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు తాను మరింత కష్టపడి పనిచేస్తా." అని ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా, ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా నెలరోజుల పాటు భారీ ప్రత్యేక సంప్రదింపు ప్రచారాన్ని బీజేపీ ప్లాన్‌ చేసింది. గత తొమ్మిదేళ్లలో దేశం ఫస్ట్‌ అనే మంత్రంతో దేశం ప్రతి రంగంలోనూ అపూర్వమైన అభివృద్ధి సాధించిందని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది.

ప్రభుత్వం ప్రారంభించిన సర్వతోముఖాభివృద్ధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషలకు 21వ శతాబ్దం భారతదేశానికి చెందినదని అభిప్రాయపడ్డారు. కాగా, మే 26, 2014న ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ మళ్లీ తిరిగి మే 30, 2019న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. 

(చదవండి: ఆ నిజాన్ని మనమందరం అంగీకరించాలి!: అజిత్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement