DECISION
-
ఇన్సూరెన్స్ ప్రీమియంలపై త్వరలో భారీ నిర్ణయం!
దేశంలోని లక్షలాది మంది బీమా పాలసీదారులకు ఉపశమనం కలగనుంది. ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై వస్తు సేవల పన్ను (జీఎస్టీ GST) త్వరలో తగ్గే అవకాశం ఉంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) తన సిఫారసులను సమర్పించడంతో జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయానికి మార్గం సుగమమైంది.ప్రస్తుతం హెల్త్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై 18% జీఎస్టీ విధిస్తున్నారు. ఇన్సూరెన్స్ అన్నది అత్యవసర సేవగా మారిన నేపథ్యంలో చాలా మంది వినియోగదారులకు జీఎస్టీ భారంగా మారింది. ప్రతిపాదిత తగ్గింపు బీమాను మరింత చౌకగా మార్చి తద్వారా ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే బీమా కవరేజీ తక్కువగా ఉన్న భారతదేశంలో బీమా వ్యాప్తిని పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.త్వరలోనే నిర్ణయంబీమాపై మంత్రుల బృందం (జీవోఎం) ఏప్రిల్ లో సమావేశమై తమ సిఫార్సులను ఖరారు చేయనుంది. తరువాత వాటిని జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం కోసం సమర్పించనుంది. బహుశా ఏప్రిల్ చివరిలో లేదా మే ప్రారంభంలో జరగనున్న తన తదుపరి సమావేశంలో కౌన్సిల్ ఈ విషయాన్ని చర్చించే అవకాశం ఉంది. ఈ నిర్ణయానికి రాష్ట్రాల నుండి విస్తృత మద్దతు లభించింది. బీమా రంగంలో జీఎస్టీ ఉపశమనం ఆవశ్యకతపై రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.జీఎస్టీ తగ్గింపు వల్ల బీమా ప్రీమియంల మొత్తం తగ్గి తద్వారా నేరుగా పాలసీదారులకు ప్రయోజనం చేకూరుతుందని భావిస్తున్నారు. ఈ చర్య మరింత మందిని ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేలా ప్రోత్సహిస్తుంది. వారికి ఆర్థిక భద్రతను, నిశ్చింతను అందిస్తుంది.సవాళ్లూ ఉన్నాయి..ఈ ప్రతిపాదనకు సవాళ్లు లేకపోలేదు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ (ఐటీసీ) క్లెయిమ్ చేసుకునే సామర్థ్యంపై జీఎస్టీ మినహాయింపుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని బీమా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఖర్చులు అంతిమంగా వినియోగదారుల మీదే పడతాయి. దీంతో పన్ను తగ్గింపు ఉద్దేశిత ప్రయోజనాలు దెబ్బతినవచ్చు. ఈ అడ్డంకులు ఉన్నప్పటికీ, సగటు భారతీయుడికి బీమాను మరింత అందుబాటులో, చౌకగా చేసే దిశగా ఈ చొరవ ఒక సానుకూల అడుగును సూచిస్తుంది. -
ఇంటి డెసిషన్.. ఇంత ఫాస్టా?
ఇల్లు కొనే ముందు సవాలక్ష ఎంక్వైరీలు, చర్చలు, లాభనష్టాల బేరీజులు... ఇలా చాంతాడంత లిస్టే ఉంటుంది. కానీ, నేటి యువతరం గృహ కొనుగోలు నిర్ణయాన్ని చిటికేసినంత ఈజీగా తీసేసుకుంటున్నారు. నాణ్యత, ప్రాంతం, వసతులు నచ్చితే చాలు ధర గురించి ఆలోచించకుండా ముందుకెళ్లిపోతున్నారు. మూడేళ్ల క్రితం వరకు ఇంటి కొనుగోలు నిర్ణయానికి 33 రోజుల సమయం పడితే.. ఈ ఆర్థిక సంవత్సరం అర్ధ వార్షికం(హెచ్1) నాటికి కేవలం 26 రోజుల్లోనే డెసిషన్ తీసుకుంటున్నారు. - సాక్షి, సిటీబ్యూరో మనదేశంలో అత్యంత ప్రాధాన్య పెట్టుబడి స్థిరాస్తి రంగమే. ప్రాపర్టీ అన్వేషకులు కొనుగోలుదారులుగా మారేందుకు పట్టే సమయంపై ప్రాపర్టీ కన్సల్టెన్సీ అనరాక్ అధ్యయనం చేసి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 2019, 2024 ఆర్థిక సంవత్సరంలో ఈ కొనుగోలు సమయం కేవలం 25 రోజులుగా ఉంది. 2021 కోవిడ్ మహమ్మారి సమయంలో గరిష్టంగా 33 రోజుల సమయం పట్టింది.వేగానికి కారణమిదే... ఆర్థికంగా సన్నద్ధమయ్యాకే ప్రాపర్టీలను కొనేందుకు ముందుకొస్తున్నారు. కొన్నేళ్లుగా మార్కెట్లో బ్రాండెడ్ డెవలపర్ల నుంచి గృహాల విక్రయాలు పెరిగాయి. నిర్మాణంలో నాణ్యత, గడువులోగా పూర్తి చేస్తారనే విశ్వాసం ఆయా సంస్థలపై ఉండటంతో కొనుగోలుదారులు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.రూ.3 కోట్లయినా చిటికెలో నిర్ణయం.. సాధారణంగా గృహ కొనుగోలులో ధరకే అధిక ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ, యువ కస్టమర్లు ధర గురించి పట్టించుకోవట్లేదు. రూ.3 కోట్ల ధర ఉన్న అల్ట్రా లగ్జరీ గృహాల ఎంపికకు అతి తక్కువగా, కేవలం 15 రోజుల్లోనే నిర్ణయం తీసుకుంటున్నారు. రూ.1–3 కోట్ల ధర ఉన్న ఇళ్లకు 27 రోజులు, రూ.50 లక్షల నుంచి రూ.కోటి రేటు ఉన్న యూనిట్ల కొనుగోలుకు ఏకంగా 30 రోజులు సమయం తీసుకుంటున్నారు.డిమాండ్‌తో వేగంగా నిర్ణయం కోవిడ్ తర్వాతి నుంచి విశాలైన గృహాలు, హైఎండ్ ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. ఈ విభాగంలో ఇళ్లు వేగంగా అమ్ముడవుతున్న కారణంగా కస్టమర్లు కొనుగోలు నిర్ణయాన్ని వేగంగా తీసుకుంటున్నారు. – ప్రశాంత్‌రావు, డైరెక్టర్, పౌలోమీ ఎస్టేట్స్ -
బిహార్‌లో కంపెనీ పెట్టి తప్పు చేశాను.. సీఈవో ఆవేదన
బిహార్‌లో తొలి సెమీకండక్టర్ కంపెనీ సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్. నాలుగేళ్ల క్రితం ఈ సంస్థ ఏర్పాటైంది. అయితే బిహార్‌లో కంపెనీ పెట్టడం తన జీవితంలో "అత్యంత చెత్త నిర్ణయం" అని వాపోతున్నాడు ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన చందన్ రాజ్. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్)లో ఆయన ఓ పోస్ట్ పెట్టారు.బిహార్‌ను "ల్యాండ్ ఆఫ్ ఫ్రస్టేషన్"గా పేర్కొన్న చందన్ రాజ్ అక్కడ సెమీకండక్టర్ కంపెనీ నడపడానికి అష్టకష్టాలు పడుతున్నట్టు వాపోయారు. ఆ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో తన కంపెనీతో కలిసి పనిచేయడానికి క్లయింట్స్ ఎవరూ ముందుకు రావడం ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు, మౌలిక సదుపాయాల కోసం గత నాలుగేళ్లుగా ఎదురు చూస్తున్నానని, ఎవరూ సహాయం చేయలేదన్నారు. బిహార్ ప్రభుత్వం సెమీకండక్టర్ పరిశ్రమలను అర్థం చేసుకోలేదని రాసుకొచ్చారు. స్థానిక గ్యాంగ్‌స్టర్ బెదిరిస్తే పోలీసులు కూడా పట్టించుకోరంటూ చందన్ రాసుకొచ్చారు.ఎవరీ చందన్ రాజ్?సెమీకండక్టర్ స్టార్టప్ వ్యవస్థాపకుడైన చందన్ రాజ్.. తన లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం, ఒడిషాలోని బిజూ పట్నాయక్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీతో 2009లో పట్టభద్రుడయ్యారు.శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, మలేషియా, ఇజ్రాయెల్‌లోని ఇంటెల్, రొమేనియాలోని సిలికాన్ సర్వీస్ ఎస్ఆర్ఎల్, షాంఘైలో నోకియా బెల్ ల్యాబ్స్, ఎన్ఎక్స్పీలతో సహా వివిధ సాంకేతిక సంస్థలలో ఇంజనీరింగ్, నిర్వాహక పాత్రలలో పనిచేశారు. 2020 డిసెంబర్లో బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో సురేష్ చిప్స్ అండ్ సెమీకండక్టర్ సంస్థను ఏర్పాటు చేశారు.Bihar - The land of frustration. Lots of problems and struggle to survive here as a semiconductor/VLSI Company.Worst decision of my life to start a company in Bihar— Chandan Raj (@ChandanRaj_ASIC) October 9, 2024 -
ఎమ్మెల్యేల అనర్హతపై సంచలన నిర్ణయం
-
విద్యా కుసుమాలు.. వాడిపోతున్నాయి
పరీక్ష పాసవ్వలేదనో, అమ్మ తిట్టిందనో, నాన్న కొట్టాడనో, ప్రేమవిఫలమైందనో.. మరో కారణంగానో చిన్న వయసులోనే జీవితాల్ని చాలిస్తున్న విద్యార్థులు ఆత్యహత్యలు మనసుల్ని పట్టి కుదిపేస్తుంటాయి. కదా.. తాజాగా ఒక అధ్యయనం ఈ తీవ్రతకు నిదర్శనంగా నిలిచింది. భారతదేశంలో జనభా వృద్దిరేటు కన్న విద్యార్థులు ఆత్యహత్యలే ఎక్కువ అని తేలింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ఆధారంగా, ఇంటర్నేషనల్ కెరీర్ అండ్ కాలేజ్ కౌన్సెలింగ్ (IC3) కాన్ఫరెన్స్ ,ఎక్స్పో 2024లో బుధవారం సమర్పించిన "విద్యార్థుల ఆత్మహత్యలు: భారత్‌ను వణికిస్తున్న మహమ్మారి(ఎపిడెమిక్ స్వీపింగ్ ఇండియా)" నివేదికలో ఈ విషయాలు వెల్లడైనాయి.ఈ నివేదిక ప్రకారం మొత్తం ఆత్మహత్యల సంఖ్య సంవత్సరానికి 2 శాతం పెరిగింది. 2021- 2022 మధ్య విద్యార్థుల బలవన్మరణాలు 4 శాతం పెరిగాయి. విద్యార్థుల ఆత్మహత్య కేసులు తక్కువగా నమోదయ్యే అవకాశ ఉన్న నేపథ్యంలో ఈ పెరుగుదల ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. అంతేకాదు ఇది మొత్తం ఆత్మహత్యల ట్రెండ్‌ను కూడా ఇది అధిగమించింది. గత దశాబ్దంలో, 0-24 సంవత్సరాల వయస్సున్న జనాభా 582 మిలియన్ల నుండి 581 మిలియన్లకు తగ్గగా, విద్యార్థుల ఆత్మహత్యలు 6,654 నుండి 13,044కి పెరిగింది. ఆందోళనకరంగా విద్యార్థుల ఆత్మహత్యలు!దేశంలో జనాభా వృద్ధి, మొత్తం ఆత్మహత్యల రేట్ల కంటే, విద్యార్థి ఆత్మహత్యలే అధికంగా ఉన్నాయి. గత రెండు దశాబ్దాలుగా వీరి ఆత్మహత్యల వార్షిక రేటు నాలుగు శాతం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు అనూహ్యంగా పెరిగాయని, పురుషుల ఆత్మహత్యలు 50 శాతం, మహిళల ఆత్మహత్యలు 61 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది. 2022లో మొత్తం విద్యార్థుల ఆత్మహత్యల్లో 53 శాతం మగ విద్యార్థులే. అయితే, 2021-22 మధ్య, మగ విద్యార్థుల ఆత్మహత్యలు 6 శాతం తగ్గాయి. కానీ ఇదే సమయంలో ఆడపిల్లల ఆత్మహత్యలు 7 శాతం పెరగడం గమనార్హం.మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో అత్యధిక విద్యార్థుల ఆత్మహత్యలు ఉన్న రాష్ట్రాలుగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇది జాతీయ మొత్తంలో మూడింట ఒక వంతు. దక్షిణాది రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు సమిష్టిగా 29 శాతం వాటా కలిగి ఉన్నాయి. కోటా లాంటి కోచింగ్ కేంద్రాల హబ్ రాజస్థాన్ రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. అంతేకాదు కేసులు నమోదైన దాని ప్రకారం గుర్తించిన డేటా మాత్రమేననని, నమోదు కానీ కేసుల సంఖ్య కలిస్తే వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉండవచ్చనే ఆందోళన వ్యక్తం చేసింది. 2017 మెంటల్ హెల్త్‌కేర్ యాక్ట్ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల ఆత్మహత్యాయత్నాలను నేరరహితం చేసినప్పటికీ రిపోర్టింగ్ పద్ధతులను ప్రభావితం చేస్తూనే ఉంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో రిపోర్టింగ్ తక్కువగా ఉంటుందని నివేదిక తెలిపింది. విద్యార్థి ఆత్మహత్యలకు కారణాలు- నివారణ మార్గాలుఆర్థిక, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ర్యాంకుల్లో రేసులో వముందుండాలనే విషయంలో తల్లిదండ్రులు ,సమాజం నుండి తీవ్రమైన పోటీ, భారీ అంచనాలు విద్యార్థులలో అధిక ఒత్తిడికి, ఆందోళనకు కారణమవుతున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యలు: డిప్రెషన్, ఆందోళన, ఇతర మానసిక ఆరోగ్య పరిస్థితులు విద్యార్థుల ఒత్తడికి మరింత ఆజ్యం పోస్తున్నాయి. అయితే విద్యార్థుల మానసిక ఆందోళనలో అండగా నిలిచి, తగిన సహాయం, కౌన్సెలింగ్ సదుపాయాలు విద్యాసంస్థల్లో లేకపోవడం దురదృష్టం. ఆత్మహత్య ఆలోచనలు అడ్డుకుని, ఆరోగ్య, కెరీర్ కౌన్సెలింగ్ అందించడం ,అవగాహన కల్పించడం చాలా అవసరం.కుటుంబ సమస్యలు, వివాదాలు, తల్లిదండ్రుల ఘర్షణలు,కుటుంబ సభ్యులనుంచి తగిన ఆప్యాయత, ఆసరా లేకపోవడంతో నిరాశతో కుంగిపోతున్న విద్యార్థులు. అందుకే వారికి మేమున్నామనే భరోసా కల్పించాలి. సమస్యలతో బాధపడుతున్నవారికి మానసిక ఆరోగ్య నిపుణులు లేదా విశ్వసనీయ వ్యక్తులద్వారా కౌన్సెలింగ్ ఇప్పించడం ముఖ్యం. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యకు ప్రయత్నించడం మరియు సహాయం చేయడం నేరం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
రుణమాఫీపై నేడు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన అంబేడ్కర్ సచివాలయంలో జరగనుంది. లోక్ స భ ఎన్నికల అనంతరం జరుగుతున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రైతు రుణమాఫీకి నిధుల సమీకరణ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకా శం ఉంది. ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణాల ను మాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన సంగతి విదితమే.ఈ నేపథ్యంలోనే నిధుల సమీకరణ, రుణమాఫీ కటాఫ్ తేదీలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెండు లక్షల రూపాయల వర కు పంట రుణాలు తీసుకున్న వారి రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ మేరకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఒక నిర్ణయం తీసు కుని.. నిధులు సమకూర్చే బాధ్యతను అధికార యంత్రాంగంపై పెట్టే అవకాశం ఉంది.ధాన్యం కొనుగోళ్లపై చర్చప్రస్తుతం కొనసాగుతున్న ధాన్యం కొనుగోళ్ల పురోగతిని సమీక్షించడంతోపాటు, వచ్చే ఖరీఫ్ పంటల ప్రణాళికపై కూడా మంత్రివర్గం చర్చించనుంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై కూడా చర్చించనున్నారు. రాష్ట్ర ఆదాయం పెంచుకునే దిశగా వనరుల సమీకరణ, ఆదాయ పెంపునకు ఉన్న అవకాశాలపై చర్చించే అవకాశం ఉంది. కుంగిపోయిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల (కాళేశ్వరం) రిపేర్లకు సంబంధించి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే మధ్యంతర నివేదికను సమర్పించింది.ఇందులోని సిఫారసులు పరిశీలించి తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణపై కేబినెట్లో చర్చించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. జూన్ నుంచి కొత్త విద్యాసంవత్సరం ఆరంభమవుతున్న నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల ప్రారంభానికి ముందే అవసరమైన సన్నాహక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. విద్యార్థుల నమోదు, పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్‌ల పంపిణీ తదితర అంశాలను చర్చించి విద్యాశాఖ అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. -
ఆ రెండు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌కే!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 29వ తేదీన ఎమ్మెల్యేల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీనే దక్కించుకునే అవకాశముంది. సంఖ్యాబలం పరంగా చూస్తే కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్ఎస్కు ఒకటి రావాల్సి ఉన్నా.. ఈ రెండు స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు, వేర్వేరుగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో.. అధికార కాంగ్రెస్ పార్టీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు రాజీనామా చేసిన ఏ సభ్యుడి స్థానంలో ఎన్నిక కావడానికి నామినేషన్ వేస్తున్నారో స్పష్టంగా పేర్కొనాలని కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికవడంతో వారిద్దరూ గతనెల 9వ తేదీన తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీలుగా వీరిద్దరికీ 30 నవంబర్ 2027 వరకు గడువు ఉన్నా.. ప్రత్యక్ష ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో వేర్వేరుగా జరిగే ఈ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లలో ఒకటి తెల్ల, రెండోది గులాబీ రంగులో ముద్రించాలని స్పష్టం చేశారు. మొత్తం సభ్యులు(119), ఎన్నికవ్వాల్సిన స్థానాల సంఖ్య +1తో భాగించడంతో వచ్చే భాగఫలం(ఒకరికి కావాల్సిన ఓట్ల సంఖ్య 59.5)ను నిర్ధారిస్తారు. ప్రస్తుతం వేర్వేరుగా ఎన్నిక నిర్వహిస్తుండటం వల్ల ఒక అభ్యర్థికి కనీసం 59.5 ఓట్లు లభిస్తే ఆ అభ్యర్థి ఎన్నిక కావడానికి వీలుంటుంది. అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది సభ్యులున్నందున, రెండు స్థానాలకు వేర్వేరుగా 119 మంది సభ్యులు రెండుసార్లు ఓట్లు వేయాల్సి ఉండడంతో ఈ రెండు స్థానాలూ కాంగ్రెస్‌కే దక్కనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉంటే.. రెండింటికీ ఒకే నోటిఫికేషన్, ఒకే పోలింగ్ స్టేషన్ ఉన్న పక్షంలో మొత్తం సభ్యుల సంఖ్య(119)ని ఎన్నిక కావాల్సిన స్థానాలు రెండింటికి +1 కలప డం వల్ల 39.6 ఓట్లు లభిస్తే ఒక ఎమ్మెల్సీ స్థానం రావడానికి అవకాశం ఉండేది. ఈ లెక్కన కాంగ్రెస్‌కు ఒకటి, బీఆర్ఎస్కు ఒకటి కచ్చితంగా వచ్చేవి. రెండోస్థానం కైవసం చేసుకోవడానికి ఏ పార్టీకి కూడా మెజారిటీ లేనందున దాదాపు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగే అవకాశం ఉండేది. అయితే ఎన్నికల సంఘం ఈ రెండింటికీ వేర్వేరుగా ఎన్నిక నిర్వహించాలని ఆదేశించింది. అసెంబ్లీలోని కమిటీ హాల్–1లో ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే వారు ఎస్సీ, ఎస్టీలు రూ. 5 వేలు, మిగిలిన కులాల వారైతే రూ.10 వేలు డిపాజిట్ కట్టాలని పేర్కొన్నారు. -
మళ్లీ తెరపైకి తుమ్మిడిహట్టి!
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పునఃసమీక్షకు సిద్ధమైంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం అంబేడ్కర్ ప్రాణహిత–చెవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు పనుల పునరుద్ధరణ, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన పెండింగ్ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన మేరకు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వం ప్రారంభించనున్నట్లు చర్చ జరుగుతోంది. తుమ్మిడిహట్టి వద్ద 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించి... అక్కడి నుంచి కాల్వలు, సొరంగాలు, లిఫ్టుల ద్వారా ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి నీళ్లను ఎత్తిపోసే అంశాన్ని కొత్త ప్రభుత్వం పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరంతో పోల్చితే తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజీ నుంచి ఎల్లంపల్లిలోకి నీళ్లను ఎత్తిపోయడానికి నిర్వహణ వ్యయం తక్కువ కానుంది. ఈ నేపథ్యంలో వార్ధా బ్యారేజీ, చెన్నూరు ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కొత్త ప్రభుత్వం పక్కనబెట్టనుందని నీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. ఈ నెల 29న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంత్రి డి.శ్రీధర్‌బాబు మేడిగడ్డ బ్యారేజీని సందర్శించాక తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మాణంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురయ్యాయని కాంగ్రెస్ గతంలో చాలాసార్లు ఆరోపణలు చేసింది. చివరి దశలో ఉన్న ఈ ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడాన్ని కొత్త ప్రభుత్వం తొలి ప్రాధాన్యతగా ఎంచుకొనే అవకాశం ఉంది. వార్ధా, చెన్నూరు లిఫ్ట్ బదులు తుమ్మిడిహట్టి... గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనబెట్టి దాని స్థానంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు కింద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతిపాదించిన ఆయకట్టుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీరు సరఫరా చేసే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో తుమ్మిడిహట్టి వద్ద గతంలో ప్రతిపాదించిన బ్యారేజీకి బదులుగా.. వార్ధా బ్యారేజీని నిర్మించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు సరఫరా చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం డీపీఆర్‌ను సైతం సిద్ధం చేసింది. మేడిగడ్డ బ్యాక్‌వాటర్ నుంచి చెన్నూరు నియోజకవర్గానికి సాగునీటి సరఫరా చేసేందుకు కొత్త ఎత్తిపోతల పథకం నిర్మాణానికి సైతం పాలనాపరమైన అనుమతులు జారీ చేసింది. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే వార్ధా బ్యారేజీ, చెన్నూరు ఎత్తిపోతల పథకాలను నిర్మించాల్సిన అవసరం ఉండదు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మిస్తే చెన్నూరుకు గ్రావిటీతోనే సాగునీరు సరఫరా చేయడానికి అవకాశం ఉండగా గత ప్రభుత్వం అనవసరంగా ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని అప్పట్లో పలువురు రిటైర్డ్ ఇంజనీర్లు ఆరోపించారు. వేచిచూస్తున్న కాంట్రాక్టర్లు.. బిల్లులు వస్తాయనే భరోసా లేకపోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పలు ఎత్తిపోతల పథకాల పనుల కొనసాగింపుపై కాంట్రాక్టర్లు సైతం పునరాలోచనలో పడ్డారు. కొత్త ప్రభుత్వ ప్రాథమ్యాలపై స్పష్టత వచ్చే వరకు వేచిచూసే ధోరణిలో కాంట్రాక్టర్లు ఉన్నారని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ప్రభు త్వం చేపట్టిన సంగమేశ్వర, బసవేశ్వర, నాగమడుగు వంటి ఎత్తిపోతల పథకాల పనులు ప్రస్తుతం నత్తనడకన సాగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్లో లోపాలు బయటపడటంతో వాటిపై ఆధారపడి నిర్మిస్తున్న ఈ మూడు ఎత్తిపోతల పథకాలను కొనసాగిస్తారా లేదా? అనే అంశంపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే వరకు వేచిచూడాలని కాంట్రాక్టర్లు భావిస్తున్నట్లు తెలిసింది. భూసేకరణకు సంబంధించిన న్యాయ చిక్కులతో కొంతకాలం కిందే సంగమేశ్వర ఎత్తిపోతల పనులు ఆగిపోగా బసవేశ్వర పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి. నాబార్డు నుంచి సంగమేశ్వర కోసం రూ. 2,392 కోట్లు, బసవేశ్వర కోసం రూ. 1,774 కోట్ల రుణం కోసం దరఖాస్తు చేసుకోగా ఇప్పటివరకు మంజూరు కాలేదు. -
సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు
-
ఫస్టు నుంచి చూద్దాం!
అందరి షూ ర్యాక్‌లో దుమ్ము పట్టిన వాకింగ్ షూస్ ఉంటాయి. అవి గత సంవత్సరం జనవరి నెలలో కొన్నవి. కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా, వాకింగ్ చేయాలనుకుని కొన్నవి అవి. ఆ వాకింగ్ ఎన్ని రోజులు సాగిందో. ప్రస్తుతం అవి దుమ్ముకొట్టుకుని, పట్టించుకునే యజమాని కోసం ఎదురు చూస్తూ అలా పడి ఉంటాయి. ఆ దారిన వెళుతున్నప్పుడల్లా ఆ జిమ్ కనిపిస్తూనే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు వెళ్లి మూడో నెల నుంచి మానేసిన జిమ్. ట్రైనర్ ఇప్పటికీ ఫోన్ చేస్తుంటాడు. జిమ్ నుంచి అలెర్ట్ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. గత సంవత్సరం కంటిన్యూ చేయలేదు కాని ఈ సంవత్సరం మళ్లీ చేరి కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటారు కొందరు. ఉదయం వాకింగ్ ఫ్రెండ్స్ వాకింగ్ చేస్తూనే ఉంటారు. మనం వారు కనిపిస్తే ముఖం తిప్పుకుని వెళ్లిపోతూ ఉంటాం. నాలుగు రోజుల సింగారంగా మన వాకింగ్ ముగిసిపోయి ఉంటుంది. ‘న్యూ ఇయర్ రానివ్వండి. జాయిన్ అవుతాను’ అని వాళ్లు కనిపించినప్పుడల్లా అంటూనే ఉంటారు. తక్షణం అవశ్యం ఆరోగ్యం ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. ‘తక్షణం అవశ్యం ఆరోగ్యం’ అనుకోవాలి విజ్ఞులు. ఇవాళ రేపట్లో మనం ఏం తింటున్నామో అందరికీ తెలుసు. విషం. మందులు విషం. కల్తీ గాలి. అయితే పరిగెత్తి చేసే ఉద్యోగాలు లేదా తిష్ట వేసినట్టుగా కదలక కూచుని చేసే కొలువులు... ఆరోగ్యం ఎలా? వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు నెరవేరాలంటే ఆరోగ్యం ముఖ్యం. అందుకు ప్రయత్నం ముఖ్యం. అక్కడే వస్తుంది చిక్కు. ‘ఆరంభించరు నీచ మానవులు’ అని భర్తృహరి అన్నాడుకాని ‘ఆరంభించడానికి వేచి చూస్తారు సోమరి పోతులు’ అనాలి నిజానికైతే. ‘జనవరి 1 వస్తేనే ఆరంభిస్తా’ అనుకుంటే జనవరి 1 వస్తేనే భోం చేస్తా అనుకోరు ఎందుకో. ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ జనవరి 1 అంటే కొత్త సంవత్సరం వస్తుంది. క్యాలెండర్ మారుతుంది. అన్నిచోట్ల ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. కనుక కొత్తగా నిర్ణయాలను అమలు చేద్దాం అని చాలామంది అనుకుంటారు. దీనిని ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ అంటారు. అయితే డాక్టర్ జాన్ నార్క్రాస్ అనే సైకాలజీ ప్రొఫెసర్ ఇలా న్యూ ఇయర్ నిర్ణయాలు తీసుకుంటున్నవారిని గత 40 ఏళ్లుగా పరిశీలిస్తూ ఏమని తేల్చాడంటే– సాధారణంగా న్యూ ఇయర్ నిర్ణయాలలో ముఖ్యమైనవి 2. మొదటిది ఫిట్నెస్ సాధించడం, రెండోది బరువు తగ్గడం. ఫిట్నెస్ సాధించాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఒక నెల రోజుల్లో సగానికి సగం మంది వ్యాయామం ఆపేస్తున్నారు. ఆరు నెలల్లో తొంభై శాతం మంది. పది శాతం మందే న్యూ ఇయర్ నిర్ణయాలను కొనసాగిస్తున్నారు. నిర్ణయం తీసుకోవడం ఎందుకు నీరుగారి పోవడం ఎందుకు? మంచి సీజన్ అమెరికా, బ్రిటన్లలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జిమ్‌లు కిటకిటలాడతాయి. నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి ఖాళీ అయిపోతాయి. కొత్త సంవత్సరం ఉత్సాహం, నిర్ణయం నిలబడకపోవడమే కారణం. నిపుణులు ఏమంటున్నారంటే మీరు, మీ చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడు ఉత్సాహం గా ఉంటే అప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అని. ఉదాహరణకు మనకు వేసవి కాలం ఉత్సాహంగా అనిపిస్తే అప్పుడు మొదలెట్టి కొనసాగించాలి. లేదా నవంబర్ మంచి సీజన్ అనుకుంటే మొదలెట్టాలి. అమెరికాలో జనవరి నెల చలిలో మొదలెట్టే వ్యాయామాలు కొనసాగించడం సాధ్యం కావడం లేదని తేల్చారు. మన దగ్గర కూడా జనవరి చలి. ఆ చలిలో ఉదయాన్నే లేవలేక న్యూ ఇయర్ రెజల్యూషన్ పాటించడం లేదని బాధపడి... ఇదంతా ఎందుకు? ఈ రోజు నుంచే మొదలెట్టొచ్చు కదా. ముఖ్యం... చాలా ముఖ్యం ఆరోగ్యం కోసం కష్టపడటం ముఖ్యం. చాలా ముఖ్యం. ఏదో ఒక మంచి సందర్భంలో వజ్ర సంకల్పం తీసుకోవాలి. ఆల్కహాల్ తగ్గిస్తాను, స్మోకింగ్ మానేస్తాను, ఫేస్బుక్ కట్టేస్తాను, పిల్లలతో గడుపుతాను, యోగా చేస్తాను, నాన్‌వెజ్ వారంలో ఒక్కరోజే... ఇలా ఏ మంచి నిర్ణయమైనా మీకు మేలు చేస్తుంది. నేటి మీ నిర్ణయం రేపు మీ యోగం. -
కొత్త మెట్రోరూట్‌తో డిస్టెన్స్ తక్కువ, వయబులిటీ ఎక్కువ?
ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి 'రేవంత్ రెడ్డి' కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే గత ప్రభుత్వం శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ప్రతిపాదించిన మెట్రోరైల్ విస్తరణ అలైన్‌మెంట్‌ను నిలిపివేయాలని ఆదేశించారు. దానికి బదులు ఎంజీబీఎస్, ఎల్బీనగర్ మార్గాల్లో ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రైల్ పొడిగింపుపై ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న మెట్రో అలైన్మెంట్ ఔటర్ రింగ్ రోడ్డుగుండా వెలుతుందని, దీని ద్వారా ఇప్పటికే ఔటర్‌రింగ్ రోడ్డు, జీవో 111 ప్రాంతాల్లో ఎంతో అభివృద్ధి జరిగింది. ఇప్పుడు అభివృద్ధికి నోచుకోలేని రూట్స్ ద్వారా ఎయిర్ పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ఉండేలా డిజైన్‌ను మార్చాలని సీఎం సూచించారు. కొత్త ప్రణాళికల ద్వారా హైదరాబాద్ నగరం నలువైపులా అభివృద్ధి సమానంగా జరుగుతుందని ఆయన అన్నారు. హైదరాబాద్ జనాభా ఎక్కువగా సిటీ మధ్యలో, తూర్పు ప్రాంతంలో, పాతబస్తీలో ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేందుకు మెట్రో అలైన్మెంట్ మార్చేలా ప్రణాళికలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి హైదారాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్‌కు సూచించారు. దీన్ని బట్టి ఎంజీబీఎస్, ఓల్డ్‌సిటీ, ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టు వరకు మార్గాన్ని ఎంచుకోవడం లేదా.. ఇప్పటికే ఎల్బీనగర్ రూట్లలో మెట్రో ఉంది కాబట్టి, చాంద్రాయణగుట్ట రూట్ ద్వారా ఎయిర్‌పోర్టు వరకు మెట్రో నిర్మాణం చేపట్టేలా చూడాలని HMRL ఎమ్‌డిని కోరారు. దీని ద్వారా ఎక్కువ మంది ప్రజలు మెట్రోను వినియోగించుకునే అవకాశంతో పాటు అటు మెట్రోరైల్‌కు కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా మైండ్ స్సేస్ రూట్ ద్వారా మెట్రో నిర్మిస్తే దాదాపుగా 31 కిలోమీటర్ల మేర దూరం ఉంటుంది. అదే ఎల్బినగర్ రూట్ ద్వారా నిర్మిస్తే ఈ డిస్టెన్స్ మరో 5 కిలోమీటర్లు తగ్గే అవకాశం ఉంది. ఈ రూట్లో పెద్దగా మలుపులు ఉండే అవకాశం లేదు. ఈ మార్గాల్లో మెట్రో నిర్మించడం వల్ల వ్యయం కూడా తగ్గుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌పోర్టు మెట్రోను శ్రీశైలం రోడ్డు నుంచి తుక్కుగూడ వరకు పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని కోరారు. మొదటి ఫేజ్‌లో నిర్మించకుండా మిగిలిపోయిన పాతబస్తీలోని 5.5 కిలోమీటర్ల మెట్రో రైల్‌ను ఎల్అండ్టీ ఇప్పటివరకు నిర్మించకపోవడంపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ రూట్ పూర్తైతే పాతబస్తీ అభివృద్ధి జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎక్స్‌ప్రెస్ ఎయిర్పోర్ట్ మెట్రోకు సంబంధించి 6 వేల 250 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని తొలత నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 27.5 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ కాగా.. విమానాశ్రయం సమీపంలో 2.5 కిలోమీటర్లు భూగర్భంలో నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. మిగతా కిలోమీటర్ మేర రోడ్డుకు సమాంతరంగా ఉంటుంది. మొత్తంగా 8 నుంచి 9 స్టేషన్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. విమానాశ్రయంలో రెండు మెట్రో స్టేషన్లు నిర్మించాలనుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత జరిగిన సమీక్షలో కీలక మార్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక వేల రూట్ మార్చాల్సి వస్తే ఎయిర్‌పోర్టు మెట్రో ప్రస్తుత అలైన్మెంట్ నిలిపివేయాల్సి వస్తే జీఎంఆర్‌తో కుదుర్చకున్న ఒప్పందంపై కూడా నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో పాటు ప్రస్తుతం నగర జనాభా 2 కోట్లకు చేరువలో ఉంది, భవిష్యత్తులో ఈ సంఖ్య 3 కోట్లకు చేరే అవకాశం ఉంది. జనాభా పెరుగుదలను, అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్‌షిప్‌లను, తూర్పు నుంచి పడమర వరకు.. మూసీ మార్గంలో నాగోల్ నుంచి గండిపేట్ దాకా ఎంజీబీఎస్‌ను కలుపుతూ రోడ్, మెట్రో కనెక్టివిటీ ఉండేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయనుంది. -
కొత్త రేషన్‌కార్డులు ఇస్తారా?
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశ్రీ మొదలు రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు లబ్ధిదారులుగా ఉండాలంటే..రేషన్‌కార్డు తప్పనిసరి అయ్యింది. అధికారంలోకి వస్తే అర్హులైన వారందరికీ కొత్త రేషన్‌కార్డులు (ఆహారభద్రత కార్డులు) జారీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మంగళవారం పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి హైదరాబాద్‌లోని పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసే సమీక్ష సమావేశంలో కొత్త రేషన్‌కార్డుల జారీకి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంలో ఆసక్తి నెలకొంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్‌కార్డుల కోసం ఎన్ని విజ్ఞప్తులు వచ్చినా, ఇప్పటికే రాష్ట్రంలో 90 లక్షలకు పైగా కార్డులు ఉన్నాయనే కారణంతో ఆ దిశగా దృష్టి పెట్టలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో 3 లక్షల కార్డులు జారీ చేశారు. అప్పటి నుంచి కొత్తగా దరఖాస్తులు ఆహ్వనించలేదు. ఉమ్మడి కుటుంబాల నుంచి వేరుపడినవారు... ఈ పదేళ్లలో జన్మించిన పిల్లల పేర్లు కూడా కార్డుల్లో చేర్చలేదు. చనిపోయిన వారి పేర్లు మాత్రమే ఎప్పటికప్పుడు తొలగించారు. రాష్ట్రంలో 90.14 లక్షల రేషన్‌కార్డులు: రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 90.14 లక్షలు ఉన్నాయి. ఇందులో జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్ఎఫ్ఎస్ఏ) కింద 54.48 లక్షల కార్డులు ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆహారభద్రత కార్డులు 35.66 లక్షలు ఉన్నాయి. ఇవి కాకుండా అంత్యోదయ అన్నయోజన కింద 5.62 లక్షల కార్డులు, అన్నపూర్ణ పథకం కింద 5,211 కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల పరిధిలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న జనాభా, ప్రజల ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకుంటే ఈ కార్డుల లబ్ధిదారుల్లో 20 శాతం వరకు అనర్హులే ఉన్నట్టు గత ప్రభుత్వం గుర్తించింది. అయితే అనర్హుల నుంచి కార్డులను ఏరివేత ప్రక్రియ ప్రారంభిస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంగా యథాతథ స్థితి కొనసాగించింది. అనర్హులను తొలగిస్తారా...? గతంలో తెలుపు, గులాబీ రేషన్‌కార్డులు ఉండేవి. 2014లో కేంద్ర ప్రభుత్వం గులాబీకార్డులను పూర్తిగా ఎత్తివేసి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) వారికే ఆహారభద్రత కార్డులు జారీ చేసింది. కేంద్రం జారీ చేసిన రేషన్ కార్డులు పొందలేని వారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహారభద్రత కార్డులు ఇచ్చిం ది. ఈ లెక్కన రాష్ట్రంలో 90.14 లక్షల కుటుంబాలకు రేషన్‌కార్డులు ఉండగా, లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.83 కోట్లు. రాష్ట్ర జనాభానే 4 కోట్లు అనుకుంటే సుమారు 3 కోట్ల మంది ఆహారభద్రత కార్డులకు అర్హులుగా ఉన్నారు. కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి విధివిధానాలు రూపొందిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రేషన్‌కార్డులలో అర్హులైన వారిని మాత్రమే కొనసాగించి, కొత్తగా బీపీఎల్ పరిధిలోకి వచ్చే వారికి కార్డులు జారీ చేస్తారా లేక ఉన్న వాటి జోలికి వెళ్లకుండా కొత్తగా అర్హులను గుర్తిస్తారా చూడాలి. -
ఎన్నికల ఫలితాలు, ఆర్బీఐ కీలక నిర్ణయం
ముంబై: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు సాధారణ అంశాలైన క్రూడాయిల్ ధరలు, రపాయి కదలికలపైనా దృష్టి సారించవచ్చంటున్నారు. ‘‘ నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ ఎన్నికలు 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌గా పరిగణిస్తున్నందున, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు కానుందని మార్కెట్ వర్గాలు విశ్వసిస్తున్నాయి. నిఫ్టీ ఇప్పటికే సరికొత్త శిఖరానికి చేరుకుంది. కావున తదుపరి నిరోధం 20,500–20,800 స్థాయిని చేధించేందుకు ప్రయత్నం చేసుకుంది. ఇదే సమయంలో సచీలు వారం రోజులు ర్యాలీ నేపథ్యంలో గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణకు అవకాశం లేకపోలేదు. దిగువ స్థాయిలో 19850–20050 శ్రేణిలో తక్షణ మద్దతు ఉంది’’ అని మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ తాప్సే తెలిపారు. బుధవారం ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ సమావేశం ఆర్బీఐ ద్రవ్య పాలసీ కమిటీ బుధవారం( డిసెంబర్ 6న) ప్రారంభం కానుంది. చైర్మన్ శక్తికాంత దాస్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం వెల్లడించనున్నారు. ద్రవ్యోల్బణ దిగిరావడంతో కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే సప్లై సమస్యలు, వృద్ధి అవుట్లుక్లతో పాటు వచ్చే ఏడాది వడ్డీరేట్ల తగ్గింపు అభిప్రాయాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనున్నాయి. స్థూల ఆర్థిక గణాంకాలు భారత్‌తో సహా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, ఈయూలు మంగళవారం సేవారంగ పీఐఎం గణాంకాలు ప్రకటించనున్నాయి. అమెరికా బుధవారం నవంబర్ ప్రైవేట్ రంగ ఉద్యోగ కల్పన డేటా, వీక్లీ జాబ్‌లెస్ గణాంకాలను గురువారం వెల్లడించనుంది. ఇదే రోజున యూరోజోన్ ప్రస్తుత సంవత్సరపు క్యూ3 జీడీపీ డేటా, చైనా వాణిజ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి. జపాన్ క్యూ3 జీడీపీ డేటా శుక్రవారం వెల్లడి అవుతుంది. ఆయా దేశాలకు సంబంధించిన కీలక స్థూల ఆర్థిక డేటా ప్రకటనకు ముందు మార్కెట్ వర్గాలు అప్రమత్తత వహించవచ్చు. నవంబర్‌లో రూ.9 వేల కోట్ల పెట్టుబడులు గత రెండు నెలలు నికర అమ్మకదారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్లు నవంబర్‌లో ర.9వేల కోట్ల పెట్టబడులు పెట్టారు. అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు తగ్గడంతో పాటు దేశీయ మార్కెట్ బౌన్స్ బ్యాక్ ర్యాలీ ఇందుకు కారణమని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ఇదే నెలలో డెట్ మార్కెట్లో ర.14,860 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ‘‘భారత్ వృద్ధి రానున్న రోజుల్లో మరింత పెరగడం, బలమైన ఆర్థిక డేటా, ప్రోత్సాకర కార్పొరేట్ ఆదాయాలు తదితర కారణాలతో దేశీ మార్కెట్లోకి పెట్టుబడులు క్రమంగా పెరుగుతున్నాయి’’ అని నిపుణులు పేర్కొన్నారు. -
పత్తి రైతుకు ‘ధర’హాసం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పత్తి రైతులకు మంచి ధర దక్కాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఏటా నవంబర్ మొదటి వారంలో కొనుగోళ్లకు శ్రీకారం చుడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ ఏడాది పత్తి ధరల్లో హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఈ నెల 25వ తేదీ నుంచే కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించింది. రాష్ట్రంలో పత్తి పండించిన ఏ ఒక్క రైతు నష్టపోకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా ముందుగానే పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. 12.85 లక్షల టన్నుల దిగుబడులు రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 14.13 లక్షల ఎకరాలు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో 13.50 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా.. 12.85 లక్షల టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా. ఇటీవలే కనీస మద్దతు ధరలను ప్రభుత్వం ప్రకటించింది. ఏటా క్వింటాల్‌కు రూ.200 నుంచి రూ.300 వరకు పెంచుతుండగా, తొలిసారి ఏకంగా రూ.640 మేర పెంచింది. పొడుగు పింజ రకానికి క్వింటాల్‌కు రూ.7,020, మీడియం రకానికి రూ.6,620 చొప్పున కనీస మద్దతు ధర నిర్ణయించింది. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌కు రోజుకు 3 నుంచి 5 వేల క్వింటాళ్ల పత్తి వస్తుండగా.. క్వింటాల్‌కు రూ.7 వేల నుంచి రూ.7,400 వరకు పలుకుతోంది. అప్రమత్తమైన ఫ్రభుత్వం కనీస మద్దతు ధరకు కాస్త అటూ ఇటుగా మార్కెట్ ధరలు ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా కొనుగోళ్లకు ఏర్పాట్లు చేసింది. 34 ఏఎంసీలతో పాటు 50 జిన్నింగ్ మిల్లుల వద్ద కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్వింటాల్‌కు రూ.13 వేల వరకు ధర లభిస్తుందని అంచనా వేస్తున్నారు. నిబంధనలు ఇవీ తేమ 8 లేదా అంతకంటే తక్కువ శాతం ఉండాలి. 8 శాతం కంటే పెరిగిన ప్రతి ఒక్క శాతం తేమకు ఒక శాతం చొప్పున మద్దతు ధరలో రూ.70.20 చొప్పున తగ్గిస్తారు. 12 శాతానికి మించి తేమ ఉన్న పత్తిని కొనుగోలు చేయరు. పత్తి పింజ పొడవు 29.50 ఎంఎం నుంచి 30.50 ఎంఎం వరకు ఉండవచ్చు. మైక్రో నైర్ విలువ నిర్ణీత పరిధి కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే ప్రతి 0.2 విలువకు క్వింటాల్‌కు రూ.25 తగ్గిస్తారు. పత్తిలో దుమ్ము, ధూళి, చెత్తా, చెదారం లేకుండా చూసుకోవాలి. గుడ్డు పత్తికాయలు, రంగుమారిన, పురుగు పట్టిన కాయలను వేరు చేసి శుభ్రమైన పత్తిని మాత్రమే తీసుకురావాలి. నీళ్లు జల్లిన పత్తిని కొనుగోలు చేయరు. కౌడు పత్తి, ముడుచుకుపోయిన పత్తిని మంచి పత్తిలో కలపరాదు. గోనె సంచుల్లో కానీ లేదా లూజు రూపంలో మాత్రమే తీసుకు రావాలి. ప్లాస్టిక్ సంచుల్లో తీసుకొస్తే కొనుగోలుకు అనుమతించరు. ఆర్బీకేల్లో నమోదుకు శ్రీకారం ఈ–పంట నమోదు ఆధారంగా సీఎం యాప్ ద్వారా వాస్తవ సాగుదారుల నుంచి నేరుగా పత్తి కొనుగోలు చేయనున్నారు. రైతులు తమ సమీపంలోని ఆర్బీకే కేంద్రంలో ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకాల నకలుతో పేరు నమోదు చేసుకొని టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్‌లో పేర్కొన్న తేదీన పత్తిని నిర్ధేశించిన యార్డు లేదా జిన్నింగ్ మిల్లుకు తీసుకెళితే.. నిర్ధేశిత గడువులోగా రైతు ఖాతాలకు నగదు జమ చేస్తారు. తొందరపడి అమ్ముకోవద్దు మార్కెట్లో ధరలు ఎమ్మెస్పీకి కాస్త అటూఇటుగా ఉండడంతో ముందుజాగ్రత్త చర్యగా ఈ నెల 25వ తేదీ నుంచి కొనుగోలు కేంద్రాలు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పంట నమోదు ప్రామాణికంగా ఆర్బీకేల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు కొనుగోలు చేస్తాం. మార్కెట్లో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున తొందరపడి రైతులెవరూ అమ్ముకోవద్దని చెబుతున్నాం. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా మంచి ధరలు వచ్చే అవకాశాలున్నాయి. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ -
సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం..88,342 మంది విద్యార్థులు తిరిగి బడికి
-
భారత్‌లో ఆఫ్ఘన్ ఎంబసీ మూసివేత!
ఈరోజు (ఆదివారం, అక్టోబర్ 1) నుండి భారతదేశంలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీ ప్రకటించింది. భారత ప్రభుత్వం నుండి మద్దతు లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఎంబసీ ఆదివారం విడుదల చేసిన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం గురించి ఆఫ్ఘన్ అధికారులు మాట్లాడుతూ న్యూఢిల్లీలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేయడం చాలా విచారకరం. ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం సంయుక్తంగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు, దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఆతిథ్య దేశం నుండి తమకు సహకారం అందడం లేదని, ఈ కారణంగానే కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నామని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం ఆరోపించింది. ఆఫ్ఘన్ రాయబార కార్యాలయ రాయబారి, ఇతర సీనియర్ దౌత్యవేత్తలు భారతదేశం నుండి యూరప్‌కు వెళ్లి, యూఎస్ఏలో ఆశ్రయం పొందిన తరువాత ఈ పరిణామం జరిగిందని ఆఫ్ఘన్ ఎంబసీకి చెందిన ముగ్గురు అధికారులు తెలిపారు. ఐదుగురు ఆఫ్ఘన్ దౌత్యవేత్తలు భారత్‌ను విడిచిపెట్టినట్లు ఎంబసీ అధికారులు తెలిపారు. న్యూఢిల్లీలోని ఆఫ్ఘన్ రాయబార కార్యాలయం కార్యకలాపాలను నిలిపివేయడం ఇదేమీ మొదటిసారి కాదు. 2021లో కూడా ఆఫ్ఘన్ రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. భారతదేశంలోని ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయానికి ప్రస్తుతం రాయబారి ఫరీద్ మముంద్జే నేతృత్వం వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: 22 ఏళ్లుగా ఖైదీ.. విడుదల రోజే పరారీ! Press Statement FOR IMMEDIATE RELEASE Date: 30th September, 2023 Afghanistan is closing its Embassy in New Delhi. The Embassy of the Islamic Republic of Afghanistan in New Delhi regrets to announce the decision to cease its operations, effective October 1, 2023. pic.twitter.com/BXesWPdLFP — Afghan Embassy India (@AfghanistanInIN) September 30, 2023 -
వైద్య సేవల్లో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సేవలు చాలా బాగున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్ష మంగ్లా చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయమని, ఈ విధానం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు వైద్యుల సేవలు అందించడం శుభపరిణామం అని చెప్పారు. హర్ష మంగ్లా శనివారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. రాష్ట్రంలో వైద్య కార్యక్రమాలు, వైద్య శాఖ పని తీరు వంటి పలు అంశాలపై ఆయన చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. వైద్య సేవలు చేరువ ఎఫ్డీసీ ఓ వినూత్న కార్యక్రమం. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ వైద్య సేవలు చేరువ అవుతాయి. రాష్ట్రంలో వంద శాతం విలేజ్ క్లినిక్స్‌ను హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లుగా అభివృద్ధి చేయడం చాలా మంచి విషయం. వీటి ద్వారా ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయి. గ్రామాల్లోనే 12 రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు వీటిలో సేవలు అందిస్తున్నారు. వెల్నెస్ సెంటర్ల పరిధిలో నివసిస్తున్న ప్రతి వ్యక్తి ఆరోగ్య వివరాలు, చరిత్ర వీటిలో ఉంటాయి. వీటి ఆధారంగా వైద్య సేవలు అందుతాయి. ప్రజలకు డిజిటల్ వైద్య సేవల కల్పనే లక్ష్యంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) అమలు చేస్తున్నాం. ఈ కార్యక్రమం అమలులోనూ ఏపీ ప్రభుత్వం ఉత్తమ పనితీరు కనబరుస్తోంది. అవయవ దానానికి ముందుకు రావాలి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రజలందరికీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్ కార్డుల జారీ, అవయవ దానం క్యాంపెయిన్, రక్తదానం క్యాంప్‌లు వంటి నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరూ అవయవ దానం, రక్తదానం చేయడానికి ముందుకు రావాలి. అవయవదానానికి ఏపీలో చాలా మంది ముందుకు వస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం ఆరోగ్య కార్యక్రమాల అమలులో ఏపీ మిగతా అన్ని రాష్ట్రాలకంటే ముందుంది. ప్రజలకు ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రుల్లోనూ ఉచిత వైద్యం అందించడానికి ఆరోగ్యశ్రీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ప్రతి కుటుంబానికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది. పేద, మధ్య తరగతి ప్రజలకు ఈ పథకంతో ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ కార్డుల జారీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. -
వానాకాలం సీఎంఆర్ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: గత వానాకాలం (2022–23) కస్టమ్ మిల్లింగ్ గడువును నవంబర్ 30 వరకు పొడిగిస్తూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ డిప్యూటీ సెక్రెటరీ జై ప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెలాఖరుతో పూర్తవుతున్న సీఎంఆర్ గడువు పెంచాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 25న కేంద్రానికి లేఖ రాసింది. గత సంవత్సరం వానాకాలానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను వచ్చే మూడు నెలల్లో పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచి్చన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సీఎంఆర్ విషయంలో మిల్లర్లు రీసైక్లింగ్ బియ్యం అప్పగించకుండా ఎఫ్‌సీఐ, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. షెడ్యూల్ ప్రకారం పెండింగ్ సీఎంఆర్‌ను డెలివరీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరింది. మిల్లుల వారిగా రాతపూర్వకంగా షెడ్యూల్‌ను తీసుకోవాలని సూచించింది. ఎఫ్‌సీఐ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలనీ, ప్రొటోకాల్ ప్రకారం సీఎంఆర్ డెలివరీ సమయంలో బియ్యాన్ని పరీక్షించి ఎప్పటి బియ్య మో నిర్ధారించాలని ఎఫ్‌సీఐని ఆదేశించింది. -
ఉమ్మడిగా వామపక్షాల పోటీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఏయే స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనే అంశాన్ని తేల్చేందుకు వచ్చే నెల ఒకటో తేదీన సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. గురువారం హైదరాబాద్‌లోని ఎంబీ భవన్లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర నేతల ఉమ్మడి సమావేశం జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, పోతినేని సుదర్శన్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కలవేణి శంకర్, హేమంత్ కుమార్ తదితరులు ఈ భేటీలో పాల్గన్నారు. అనంతరం తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించారు. బీజేపీకి సహకరించేలా సీఎం కేసీఆర్ ఆలోచనలు: తమ్మినేని వీరభద్రం కేంద్రంలో బీజేపీకి సహకరించే విధంగా బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆలోచనలు ఉన్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. కేసీఆర్ ఇండియా కూటమిలో చేరకుండా పరోక్షంగా బీజేపీకి మద్దతుగా కొత్త ఫ్రంట్ తెరిచారని విమర్శించారు. కమ్యూనిస్టు పారీ్టలు బీజేపీ ఓటమి కోసమే పనిచేస్తాయని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే పోటీ చేస్తాయని, ప్రజా సమస్యలపై పోరాటం ఆగదని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మజ్లిస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా పోటీచేస్తూ.. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీలుస్తోందని ఆరోపించారు. మహిళలను ఉద్ధరించే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని, ఎన్నికల్లో లబ్ధి కోసమే బిల్లు తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌తో పొత్తు అంశం చర్చకు రాలేదు: కూనంనేని అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై చర్చించలేదని, అయితే ఆ పార్టీతో పొత్తు వద్దనే ఆలోచన తమకు లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసే పోటీ చేస్తాయని.. సీట్ల పంపకంపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించారు. మజ్లిస్‌తో కేసీఆర్‌కు మొదటి నుంచీ సఖ్యత ఉందని.. సమైక్యతా దినోత్సవమంటే ఏమిటో మజ్లిస్, కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలను మోసం చేయడంలో బీజేపీ ఆరితేరిందన్నారు. రాజ్యాంగ పీఠిక నుంచి సామ్యవాదం, లౌకికవాదం పదాలను తొలగించ డం ఏమిటని నిలదీశారు. దేశాన్ని హిందూరాజ్యంగా మార్చే కుట్ర ఇది అని మండిపడ్డారు. -
పెరిగిన రొయ్యల ధరలు.. 20 కౌంట్ కేజీ ధర రూ.610
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా రొయ్యల కౌంట్ ధరలు పెంచేందుకు ప్రాసెసింగ్ కంపెనీలు ముందుకొచ్చాయి. గత నెలాఖరులో జరిగిన ఆక్వా సాధికారత కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రకటించిన ధరలను మరోసారి పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి. 20 నుంచి 55 కౌంట్ వరకు కేజీకి రూ.10 చొప్పున, 56 నుంచి 100 కౌంట్ వరకు కేజీకి రూ.5 చొప్పున ధర పెంచుతున్నట్టు ప్రకటించాయి. దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా.. తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిపై ఆక్వా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులు ఏ దశలోనూ నష్టపోకూడదన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రుల సారథ్యంలో సమావేశమైన రైతు సాధికారత కమిటీ రొయ్యల ధరలను పెంచేందుకు కృషి చేస్తోంది. ఆక్వా రైతుల సమక్షంలో ప్రాసెసింగ్ కంపెనీలు, ఎగుమతిదారులతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు జరుపుతున్న చర్చలు మంచి ఫలితమిస్తున్నాయి. గత నెలాఖరులో ప్రకటించిన ధరలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగగా, మంగళవారం మరోసారి పునఃసమీక్షించి.. కేజీకి రూ.5 నుంచి రూ.10 చొప్పున పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఈ నెల 9వ తేదీ నుంచి రానున్న పది రోజుల పాటు కొత్త ధరలు అమలులో ఉంటాయి. కోత పెడితే చర్యలు ప్రభుత్వం నిర్దేశించిన ధరల చెల్లింపులో ఏజెంట్లు, షెడ్ల నిర్వాహకులు కోత పెడుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో ఎగుమతిదారులతో పాటు షెడ్ల యజమానులు, ఏజెంట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకనుండి రైతుల నుంచి కొనుగోలు చేసే వారెవరైనా కచ్చితమైన బిల్లులు ఇచ్చి కొనుగోలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. లేకుంటే అప్సడా చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా.. దేశంలో ఒక్క ఏపీలో మాత్రమే కౌంట్ల వారీగా ధరలను ప్రకటిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పూర్వం నుంచి కొనసాగుతున్నట్టుగా ప్రతి 10 కౌంట్లకు ఒక ధర చొప్పున నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకటించిన కౌంట్ ధరలు పొరుగు రాష్ట్రాలతో కంటే మెరుగ్గా ఉన్నాయి. తమిళనాడు, ఒడిశా, గుజరాత్, పశి్చమ బెంగాల్, మహరాష్ట్రలో ప్రధాన కౌంట్లకు మన కంటే కేజీకి రూ.5 నుంచి రూ.25 వరకు తక్కువగానే చెల్లిస్తున్నారు. -
అనాథ పిల్లలకు అండగా
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏటా తన పుట్టినరోజు సందర్భంగా వినూత్న సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు 47వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది అర్థవంతంగా జరుపుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడాలో ఉన్న స్టేట్ హోమ్‌లోని అనాధ పిల్లలకు అండగా నిలవాలనుకుంటున్నట్లు ప్రకటించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 10, 12వ తరగతుల్లో ప్రతిభావంతులైన 47 మంది పిల్లలకు, ప్రొఫెషనల్ కోర్సుల నుంచి మరో 47 మంది పిల్లలకు వ్యక్తిగతంగా అండగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్ టాప్‌లు అందిస్తానని తెలిపారు. వారి బంగారు భవిష్యత్కై బెస్ట్ ఇన్స్టిట్యూట్ ద్వారా రెండేండ్ల పాటు అత్యుత్తమ కోచింగ్ ఇప్పిస్తానని స్పష్టం చేశారు. కాగా, తన పుట్టినరోజు సందర్భంగా ఎవరికి తోచిన మార్గంలో వారు అనాథ పిల్లలకు సహాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను కోరుతున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. నేడు వెయ్యిమంది రక్తదానం మంత్రి కేటీఆర్ 47వ జన్మదినం సందర్భంగా సోమవారం ఖాజాగూడలోని దివ్యశ్రీ ఎన్ఎస్ఎల్ ఐటీ పార్క్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఐటి టవర్లలో పనిచేసే దాదాపు 1000 మంది టెక్కీలు రక్తదానం ఇవ్వనున్నారు. -
ఒకే బంతికి రెండు రివ్యూలు ధోనిని మించిపోయిన అశ్విన్..!
-
PM Modi: తొమ్మిదేళ్ల పాలనలో తీసుకున్న 'ప్రతి నిర్ణయం.. ప్రజల కోసమే'
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నేటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దీన్ని తొమ్మిదేళ్ల సేవగా మోదీ పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లో తాను తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించేదనని అన్నారు. ఈ మేరకు మోదీ ట్విట్టర్ వేదికగా.."తాను వినయం, కృతజ్ఞతలతో ఉన్నానని, తాను ఈ తొమ్మిదేళ్ల సేవలో ప్రతి నిర్ణయం ప్రజల జీవితాలను మెరుగుపరచాలనే కోరికతో మార్గనిర్దేశం చేసిందేనని చెప్పారు. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించేందుకు తాను మరింత కష్టపడి పనిచేస్తా." అని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా, ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా నెలరోజుల పాటు భారీ ప్రత్యేక సంప్రదింపు ప్రచారాన్ని బీజేపీ ప్లాన్ చేసింది. గత తొమ్మిదేళ్లలో దేశం ఫస్ట్ అనే మంత్రంతో దేశం ప్రతి రంగంలోనూ అపూర్వమైన అభివృద్ధి సాధించిందని బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం ప్రారంభించిన సర్వతోముఖాభివృద్ధి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆర్థికవేత్తలు, విశ్లేషలకు 21వ శతాబ్దం భారతదేశానికి చెందినదని అభిప్రాయపడ్డారు. కాగా, మే 26, 2014న ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన నరేంద్ర మోదీ మళ్లీ తిరిగి మే 30, 2019న రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. Today, as we complete 9 years in service to the nation, I am filled with humility and gratitude. Every decision made, every action taken, has been guided by the desire to improve the lives of people. We will keep working even harder to build a developed India. #9YearsOfSeva — Narendra Modi (@narendramodi) May 30, 2023 (చదవండి: ఆ నిజాన్ని మనమందరం అంగీకరించాలి!: అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు) -
సోనియా గాంధీ కుటుంబానికి ఎదురుదెబ్బ
ఢిల్లీ: సోనియా గాంధీ కుటుంబానికి ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తమ పన్ను మదింపులను సెంట్రల్ సర్కిల్‌కు బదిలీ చేయాలన్న ఐటీ అధికారుల నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు ఆమె కుటుంబ సభ్యులు. అయితే.. ఆ పిటిషన్లను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఐటీ శాఖ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర స్వచ్ఛంద ట్రస్టులు ఢిల్లీ హైకోర్టులోపిటిషన్ దాఖలు చేశాయి. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ మన్మోహన్, జస్టిస్ దినేష్ కుమార్ శర్మలతో కూడిన డివిజన్ బెంచ్.. ఇవాళ ఆ పిటిషన్లను కొట్టేశాయి. ఐటీ తీసుకున్న బదిలీ నిర్ణయం చట్టానికి లోబడి జరిగిందని తాము గుర్తించినట్లు బెంచ్ ఈ సందర్బంగా పేర్కొంది. ‘‘సమన్వయంతో కూడిన దర్యాప్తు కోసమే ఐటీ శాఖ ఈ బదిలీ నిర్ణయం తీసుకుంది. అందుకే ఐటీ అధికారులు జారీ చేసిన ఆదేశాలను సమర్థిస్తున్నాం. న్యాయపరమైన ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉన్నందున ఇందులో జోక్యం చేసుకోదల్చుకోలేదు. మెరిట్ ఆధారంగా ఈ వ్యవహారాన్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించలేద’’ని బెంచ్ స్పష్టం చేసింది. Delhi High Court dismisses pleas moved by Rahul Gandhi, Sonia Gandhi, Priyanka Gandhi Wadra, Aam Aadmi Party and other charitable trusts challenging the IT authorities' decision to transfer their tax assessments to the central circle.#DelhiHighCourt #IncomeTax pic.twitter.com/lx7EohAk48 — Live Law (@LiveLawIndia) May 26, 2023 అయితే.. తాము పిటిషన్లు కొట్టేసినప్పటికీ.. తగిన చట్టబద్ధమైన అధికారం వ్యవస్థ ముందు తమ వాదనలు వినిపించే స్వేచ్ఛ పిటిషనర్లకు ఉంటుందని మాత్రం బెంచ్ సూచించింది. ఇదీ చదవండి: పార్లమెంట్ ప్రారంభోత్సవంపై పిల్ -
Civil Services Day: దేశ ప్రయోజనాలే పరమావధిగా..
న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులు తీసుకొనే ప్రతి నిర్ణయానికీ దేశ ప్రయోజనాలే పరమావధి కావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. మీపై దేశ ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోండి అని అధికారులకు సూచించారు. సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘వికసిత్ భారత్’ అనే థీమ్‌తో ఈ కార్యక్రమం నిర్వహించారు. పన్ను చెల్లింపుదారుల సొమ్మును అధికారంలో ఉన్న పార్టీ సొంత ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తోందా? లేక దేశ అభివృద్ధి కోసం వెచ్చిస్తోందా? అన్నది విశ్లేషించాల్సిన బాధ్యత సివిల్ సర్వీసెస్ అధికారులపై ఉందని మోదీ చెప్పారు. జాతి నిర్మాణంలో ఉన్నత స్థాయి అధికారుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. వారి క్రియాశీల భాగస్వామ్యం లేకపోతే దేశంలో వేగవంతమైన అభివృద్ధి సాధ్యమయ్యేది కాదని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ అధికారి దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని వెల్లడించారు. మీరు తీసుకొనే ప్రతి నిరం్ణయానికి దేశ ప్రగతే ఆధారం కావాలన్నారు. ప్రపంచంలో భారత్ ప్రాధాన్యం నానాటికీ పెరుగుతోందని, అధికార యంత్రాంగం సమయం వృథా చేయకుండా దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. ‘దేశం ప్రథమం, పౌరులు ప్రథమం’ ప్రజల ఆకాంక్షలకు ప్రభుత్వ పాలనా వ్యవస్థ అండగా నిలవాలని, వారి కలలు సాకారం అయ్యేందుకు ప్రభుత్వ అధికారులు సాయం అందించాలని ప్రధాని మోదీ సూచించారు. వికసిత భారతదేశానికి ఇది అత్యంత కీలకమని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ప్రభుత్వ యంత్రాంగం చుట్టూ ప్రతికూలత ఆవరించి ఉండేదని, అది ఇప్పుడు సానుకూలతగా మారిందని వివరించారు. ‘దేశం ప్రథమం, పౌరులు ప్రథమం’ అనే నినాదంతో ముందుకు సాగుతున్నామని, దేశంలో బలహీనవర్గాల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఉద్ఘాటించారు. మీ కోసం మీరు ఏం చేసుకున్నారు అనే దాన్నిబట్టి కాకుండా ప్రజల కోసం ఏం చేశారన్న దాన్నిబట్టే మీ పనితీరు, ప్రతిభను గుర్తించవచ్చని సివిల్ సర్వీస్ అధికారులకు సూచించారు. ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలన్న గాఢమైన ఆకాంక్షతో పనిచేస్తే చిరస్మరణీయమైన వారసత్వాన్ని మిగిల్చిన వారవుతారని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నమైన సిద్ధాంతాలు, భావజాలాలున్న పార్టీలు ముఖ్యమని అభిప్రాయపడ్డారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. యువత కలలు ఛిద్రం కావడానికి వీల్లేదన్నారు. గత ప్రభుత్వాల హయాంలో కొనసాగిన విచ్చలవిడి అవినీతికి అడ్డుకట్ట వేశామని రూ.3 లక్షల కోట్లు అవినీతిపరుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నామన్నారు. సివిల్ సర్వెంట్ల సేవలు ప్రశంసనీయం: రాష్ట్రపతి ‘సివిల్ సర్వీసెస్ డే’ సందర్భంగా సంబంధిత అధికారులందరికీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి వారి సేవలు ప్రశంసనీయ మంటూ రాష్ట్రపతి ట్వీట్ చేశారు. దేశ ప్రగతిలో వారి కృషి, అంకితభావం, సేవలను ప్రశంసించాలంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. ఏటా ఏప్రిల్ 21న కేంద్రం సివిల్ సర్వీసెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. -
లెక్క ఎక్కువైనా పర్లేదు..మాకు కాస్ట్లీ ఇళ్లే కావాలి!
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు మరింత పెరిగితే అది తమ భవిష్యత్తు కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుందని 96 శాతం మంది కొనుగోలుదారులు (ఇల్లు కొనాలని అనుకుంటున్నట్టు) చెప్పారు. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్, సీఐఐతో కలసి దీనిపై ఓ సర్వే నిర్వహించింది. ‘ద హౌసింగ్ మార్కెట్ బూమ్’ పేరుతో నివేదిక విడుదల చేసింది. ఆర్బీఐ గతేడాది మే నుంచి ఇప్పటి వరకు రెపో రేటుని 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. ఇటీవలి ఏప్రిల్ సమీక్షలో మాత్రం రేట్ల పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తటస్థ వైఖరిని ప్రదర్శించింది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 80 శాతం మంది తమకు ధరలు ముఖ్యమైన అంశమని చెప్పారు. ఒకవైపు నిర్మాణంలో వినియోగించే ముడి సరుకుల ధరలు పెరిగిన ఫలితంగా ప్రాపర్టీల ధరలకు సైతం రెక్కలు రావడం తెలిసిందే. దీనికి తోడు గృహ రుణాలపై రేట్లు 2.5 శాతం మేర పెరగడం భారాన్ని మరింత పెరిగేలా చేసింది. విశాలమైన ఇంటికే ప్రాధాన్యం.. ధరలు పెరిగినప్పటికీ వినియోగదారుల ప్రాధాన్యతల్లో పెద్ద మార్పు కనిపించలేదు. 42 శాతం మంది 3బీహెచ్‌కే ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. 40 శాతం మంది 2బీహెచ్‌కే ఇళ్ల కొనుగోలుకు అనుకూలంగా ఉండగా, 12 శాతం మంది ఒక్క పడకగది ఇంటి కోసం చూస్తున్నారు. 6 శాతం మంది అయితే 3బీహెచ్‌కే కంటే పెద్ద ఇళ్లను సొంతం చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో ఉన్నారు. సర్వేలో పాల్గొన్న వారిలో 58 శాతం మంది తాము రూ.45 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధరలో ఇంటిని కొనుగోలు చేస్తామని చెప్పారు. ఏడాదిలోపు నిర్మాణం పూర్తి చేసుకునే ఇంటికే తాము ప్రాధాన్యం ఇస్తామని 36 శాతం మంది తెలిపారు. దేశ రాజధాని ప్రాంత పరిధిలో ఇల్లు కొనుగోలు చేయాలని చూస్తున్న వారిలో 45 శాతం మంది 3బీహెచ్‌కే తీసుకోవాలని అనుకుంటున్నారు. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 42 శాతం మంది ఎంపిక 2బీహెచ్కేగానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రాపర్టీ ధరలు చాలా ఎక్కువగా ఉండడం కొనుగోలు ప్రాధాన్యతల్లో మార్పునకు కారణమని తెలుస్తోంది. ఇల్లు కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారిలో 52 శాతం మంది సొంత వినియోగానికేనని చెప్పారు. ప్రతికూల పరిస్థితుల ప్రభావం ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయిలో ఉండడం, అంతర్జాతీ య ఆర్థిక వ్యవస్థలో ఉన్న అనిశ్చితి ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశీయ హౌసింగ్ డిమాండ్‌పై ప్రభావం చూపిస్తున్నట్టు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి అన్నారు. మొత్తం మీద ఇళ్ల డిమాండ్‌లో రేట్ల పెంపు ఒక భాగమేనని పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో పెద్దా, చిన్న కంపెనీల్లో ఉద్యోగాల కోతలు సైతం ఇళ్ల కొనుగోలు డిమాండ్‌పై ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగాలు కోల్పోయిన వారు ఇంటి కొనుగోలును వాయిదా వేసుకోవచ్చన్నారు. 2024–25 నాటికి అన్ని సమస్యలు సమసిపోయి, హౌసింగ్ మార్కెట్ తిరిగి బలంగా పుంజు కుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
మూడు పార్టీలకు జాతీయ హోదా రద్దు చేసిన కేంద్రం ఎన్నికల సంఘం
-
కృష్ణ అంత్యక్రియల విషయంలో మహేష్ తప్పు చేశాడా ..?
-
Telangana: రాహుల్ టూర్ అనుమతిపై నిర్ణయం వీసీదే: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఓయూ పర్యటనపై దాఖలైన హౌజ్ మోషన్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు సోమవారం విచారించింది. రాహుల్ టూర్ అనుమతిపై నిర్ణయాన్ని వీసీకే హైకోర్టు వదిలేసింది. దరఖాస్తును పరిశీలించాలని వీసీకి హైకోర్టు ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను హైకోర్టు ముగించింది. చదవండి👉: రాహుల్ రాకపై కాక! కాగా, రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీ సందర్శన వ్యవహారం మరింత ముదురుతోంది. రాజకీయాలకు అతీతంగా రాహుల్ ఓయూకి వస్తారంటూ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వీహెచ్ ఓయూ వీసీని కలిసి అనుమతి కోరినా.. రాజకీయ సభలకు అనుమతి లేదంటూ తిరస్కరించడంతో కాంగ్రెస్ అనుబంధ విభాగాలు ఆందోళనకు దిగాయి. ఓయూ విద్యార్థి నేతలు ఆదివారం మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి యత్నించారు. ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ వైస్ చాన్స్‌లర్ (వీసీ) చాంబర్ ముందు చీరలు, గాజులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. ఈ విద్యార్థి నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం, వారిని పరామర్శించేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే జగ్గారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. -
ఉక్రెయిన్ అధ్యక్షుడి జెలెన్స్కీ సంచలన ప్రకటన
-
భూముల రిజిస్ట్రేషన్ల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
కేంద్ర కేబినెట్ నిర్ణయాలతో స్టాక్ మార్కెట్లతో దూకుడు
-
సిరీస్ పై ఐసీసీదే తుది నిర్ణయం
-
త్వరలో 8 మెడికల్ కాలేజీలకు దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసే 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైద్య ఆరోగ్యశాఖ వచ్చే నెల 20 తర్వాత దరఖాస్తు చేయనుంది. ఆ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. సంగారెడ్డి, వనపర్తి, జగిత్యాల, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, కొత్తగూడెం, మంచిర్యాలలో ఏర్పాటు చేయనున్న కాలేజీలకు ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. రామగుండంలో ఏర్పాటు చేసే సింగరేణి మెడికల్ కాలేజీకి కూడా త్వరలోనే అనుమతి వచ్చే అవకాశాలున్నాయి. దీనికీ అనుమతులు రాగానే మొత్తం ఎనిమిది కళాశాలలకు ఒకేసారి ఆన్లైన్లో జాతీయ వైద్య కమిషన్‌కు దరఖాస్తు చేయడానికి వైద్య ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేస్తుంది. అందుకు సంబంధించి ఉన్నతస్థాయిలో సమీక్ష జరిగింది. వచ్చే నెల 26 వరకు దరఖాస్తుకు గడువు ఉండటంతో ఆలోపు చేయాలని భావిస్తున్నారు. మెడికల్ కాలేజీకి కేంద్రం నుంచి అనుమతి రావాలంటే వాటికి అనుబంధంగా కచ్చితంగా 300 పడకల ఆసుపత్రి అందుబాటులో ఉండాలి. అయితే కొన్నింటికి వందా రెండొందలు మాత్రమే పడకలున్నాయి. దీంతో తక్కువ ఉన్న వాటికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుత ఆసుపత్రి భవనాల్లోనే పైభాగంలో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. లేబొరేటరీలు, వైద్యపరికరాలు, ఫర్నీచర్ కొనుగోలుకు టెండరు ప్రక్రియ పూర్తయింది. మరికొన్ని టెండర్ ప్రక్రియలు వివిధ దశల్లో ఉన్నాయి. కేంద్రానికి దరఖాస్తు చేశాక అక్కడి నుంచి ఉన్నతస్థాయి తనిఖీ బృందం ఏడాది చివరికల్లా రాష్ట్రానికి వచ్చే అవకాశముంది. వారు తనిఖీలకు వచ్చేనాటికి ఒక్కో మెడికల్ కాలేజీలో 97 మంది పోస్టులను భర్తీ చేయాలి. నూతన నియామకాలను ఈసారి అఖిల భారత స్థాయిలో చేపట్టాలని నిర్ణయించారు. -
కొత్త ఎయిర్‌పోర్టులపై త్వరలో మరో ముందడుగు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా నిర్మించతలపెట్టిన ఆరు కొత్త విమానాశ్రయాలకు సంబంధించి మరో వారం పదిరోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. ఆయా ప్రాజెక్టులకు కన్సల్టెంటుగా ఉన్న ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది. విమానాశ్రయాల ప్రాథమిక స్వరూపాన్ని వివరించనుంది. ఈ సంస్థ గత జూన్‌లోనే వీటికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల (టెక్నో ఎకనమిక్ ఫీజబిలిటీ) నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. తాజాగా ఆరు విమానాశ్రయాలకు ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను వివరించడంతో పాటు వాటిని అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించనుంది. దీంతో వీటికి సంబంధించిన ప్రాథమిక కసరత్తు పూర్తి అవుతుంది. ఆ తర్వాత నిర్మాణానికి సంబంధించిన అసలు ప్రక్రియ మొదలు కానుంది. అనుమానాల నివృత్తి.. అంచనా వ్యయంపై స్పష్టత ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే మొత్తం రాష్ట్ర అవసరాలను తీరుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రం నలుదిక్కులా కొత్త విమానాశ్రయాల ఏర్పాటు అవసరమని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు నివేదిక కోరుతూ కన్సల్టెన్సీ బాధ్యతను ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ వాణిజ్య విభాగానికి అప్పగించింది. దాని ప్రతినిధులు పలుమార్లు క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. వరంగల్ మామునూరు, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఉన్న పాతకాలం నాటి శిథిలమైన ఎయిర్‌స్ట్రిప్స్‌ను పునరుద్ధరించ (బ్రౌన్‌ఫీల్డ్) వచ్చని తెలిపారు. వాటితో పాటు నిజామాబాద్‌లోని జక్రాన్‌పల్లి, కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్‌నగర్‌లోని దేవరకద్రల వద్ద కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టులను ప్రతిపాదించారు. వీటన్నిటిలో విమానాశ్రయాల నిర్మాణం సాధ్యమేనని తేల్చి ప్రాథమిక నివేదిక అందజేశారు. ఆ తర్వాత వాటి నిర్మాణానికి అయ్యే వ్యయ అంచనాలు, కావాల్సిన భూమి వివరాలు, ఆయా విమానాశ్రయాల నిర్మాణం జరగాలంటే తీసుకోవాల్సిన చర్యలతో ఫీజబిలిటీ రిపోర్టును అందజేశారు. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ విమానాశ్రయాలకు సంబంధించి ఫేజ్–1, ఫేజ్–2 పేరుతో రెండు వేరువేరు అంచనాలను అందజేశారు. ఫేజ్–1 ప్రకారం రూ.1,350 కోట్లు, ఫేజ్–2 ప్రకారం రూ.2 వేల కోట్లకుపైగా నిర్మాణ వ్యయం కానుంది. ఇక భూసేకరణకు ఇంతకు మించి ఖర్చు కానుంది. ఈ నేపథ్యంలో ఖర్చు తగ్గింపునకు సంబంధించి ఇప్పుడు జరగబోయే సమావేశంతో స్పష్టత రానుంది. ఇక పాల్వంచ, దేవరకద్ర, బసంత్‌నగర్ విమానాశ్రయాలకు సంబంధించి ఫీజబిలిటీ నివేదిక అస్పష్టంగా ఉంది. వీటిపైనా స్పష్టత ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఆ రెండూ జీఎంఆర్‌కు..! ఆరు విమానాశ్రయాలను నిర్మిస్తామని, వెంటనే అనుమతి మంజూరు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఢిల్లీ పర్యటన సందర్భంగా విమానయాన శాఖను కోరారు. కానీ ప్రస్తుతం వ్యయ అంచనాలు భారీగా ఉన్న నేపథ్యంలో రెండుమూడు ముందు చేపట్టి మిగతావి తర్వాత చేపడితే ఎలా ఉంటుందన్న విషయంలోనూ కొంత చర్చ జరుగుతోంది. దీనిపై కూడా ఈ సమావేశంలో స్పష్టత రానుంది. మరోవైపు ఇప్పటికే మనుగడలో ఉన్న విమానాశ్రయానికి 150 కి.మీ. పరిధిలో రెండోది ఉండొద్దనే ఒక నిబంధన ఉంది. జీఎంఆర్ సంస్థ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. ఆ నిబంధన ప్రకారం చూస్తే మహబూబ్‌నగర్, వరంగల్ ఎయిర్‌పోర్టులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చనే అంశంపై కూడా సమావేశంలో సూచనలు అందే అవకాశం ఉంది. ఆ రెంటినీ జీఎంఆర్‌కు అప్పగించే అంశాన్ని చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. -
టెన్త్ మరియు ఇంటర్ పరీక్షల పై నేడు సీఎం జగన్ కీలక నిర్ణయం
-
ఓపెన్ స్కూల్ విద్యార్థులంతా పాస్
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటికే రెగ్యులర్ పదో తరగతి విద్యార్థులను పాస్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ విద్యార్థులందరినీ పాస్ చేయాలని నిర్ణయించింది. దీంతో 72 వేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. రాష్ట్రంలోని ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో చదువుతూ ఏప్రిల్/మే నెలల్లో పరీక్షలు రాయాల్సిన వారిని కరోనా నేపథ్యంలో పాస్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ తరహాలోనే రాష్ట్ర ఓపెన్ స్కూల్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 42 వేల మంది ఓపెన్ ఎస్సెస్సీ, 30 వేల మంది ఓపెన్ ఇంటర్మీడియట్ విద్యార్థులు పాస్ కానున్నారు. ఆయా విద్యార్థులకు సంబంధించి కిందటి తరగతుల్లో (వారు పాసైంది ఏదైతే అది) 4 సబ్జెక్టులను పరిగణనలోకి తీసుకొని అందులో మంచి మార్కులు వచ్చిన మూడింటి యావరేజ్ మార్కుల ఆధారంగా ప్రతి సబ్జెక్టుకు మార్కులను కేటాయించే అవకాశం ఉంది. ఒకవేళ విద్యార్థులు తమ మార్కులను పెంచుకోవాలనుకుంటే తర్వాత నిర్వహించే పరీక్షలు రాయాల్సి ఉంటుంది. -
నా జీవితంలో అతి పెద్ద నిర్ణయం
కంటికి కనిపించని శత్రువు కోరల్లో చిక్కుకొని విలవిల్లాడుతున్న దేశ ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టడానికి ఆంక్షల్ని ఎత్తి వేయడం పెను సవాల్‌గా మారిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆ నిర్ణయమే తన జీవితంలో అతి పెద్దదన్న ట్రంప్ దానిని ఎప్పుడు తీసుకుంటారో వెల్లడించలేదు. కోవిడ్ –19 దెబ్బతో అగ్రరాజ్యం సంక్షోభంలో పడిపోయింది. దేశంలోని 33 కోట్ల మందిలో 95 శాతానికి పైగా ఇళ్లకే పరిమితమయ్యారు. కొద్ది వారాల్లోనే 1.7 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వైట్ హౌస్‌లో శుక్రవారం ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ ప్రజల్ని ఇల్లు కదలవద్దన్న ఆంక్షల్ని ఎత్తి వేయడమే తాను జీవితంలో తీసుకోబోయే అతి పెద్ద నిర్ణయమని వ్యాఖ్యానించారు. దేశాన్ని ఆర్థికంగా గాడిలో పెట్టాలంటే ప్రజలందరూ మళ్లీ పనుల్లోకి రావాలని, దానికి తగిన సమయం కోసం చూస్తున్నామని అన్నారు. ‘దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనికి ఆ దేవుడిపైనే భారం వేశారు. అయితే కచ్చితంగా ఆ నిర్ణయం నేను నా జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం అవుతుంది’అని ట్రంప్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
దక్షిణాఫ్రికా నుంచి అమెరికాకు...
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా ఆఫ్ స్పిన్నర్ డేన్ పీట్ అనూహ్య నిర్ణయంతో ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సభ్యదేశమైన దక్షిణాఫ్రికా జట్టును వదిలి అసోసియేట్ టీమ్ అమెరికాతో జతకట్టేందుకు సిద్ధమయ్యాడు. శనివారం ఉదయమే ఈ ఒప్పందానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని అతను ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ‘ఈ రోజు ఉదయం కాంట్రాక్ట్‌పై సంతకం చేశా. చాలా కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ... ఇది నాకో మంచి అవకాశం. ఆర్థికంగానూ, జీవనశైలి పరంగానూ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని వదులుకోలేకపోయాను. పైగా గతేడాది అమెరికాకు వన్డే జట్టు హోదా దక్కింది. ఇంకా ఆలోచించడానికి ఏముంది? దక్షిణాఫ్రికా వన్డే తుది జట్టులో తనకు చోటు దక్కే అవకాశాలు అతి స్వల్పంగా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను ’ అని పీట్ వ్యాఖ్యానించాడు. ఈ వేసవిలో ప్రారంభం కానున్న ‘ మైనర్ లీగ్ టి20 టోర్నమెంట్’ నుంచి అతను అమెరికా తరఫున తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. 2014లో సఫారీ జట్టు తరఫున అరంగేట్రం చేసిన పీట్ తొమ్మిది టెస్టుల్లో 26 వికెట్లు దక్కించుకున్నాడు. -
ఫెడ్ నిర్ణయం, క్యూ4పై మార్కెట్ దృష్టి
ముంబై: లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. ఈ క్రమంలో సోమవారం నాలుగో దశ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే మూడు దశలు పూర్తవగా.. నేడు జరిగే పోలింగ్...ఎన్నికల చివరి అంకానికి దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నాయనే ఉత్కంఠ మార్కెట్లో పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు ఒడిదుడుకులు కూడా మరింత పెరుగుతాయి’ అని అన్నారయన. కొనసాగుతున్న పోలింగ్, కార్పొరేట్ కంపెనీల తొలిత్రైమాసిక ఫలితాలు ఈవారంలో మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల ఫలితాలు మార్కెట్ అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఇకపై వెల్లడికానున్న కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా ఉండి.. ఇదే సమయంలో ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గిస్తే మాత్రం సమీపకాలంలోనే మన మార్కెట్లు అవుట్పెర్ఫార్మ్ చేస్తాయి’ అని వ్యాఖ్యానించారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజ ఫలితాల వెల్లడి అంబుజా సిమెంట్స్, కొటక్ మహీంద్రా బ్యాంక్, కెన్ ఫిన్ హోమ్స్, టీవీఎస్ మోటార్ కంపెనీలు గత ఆర్థిక సంవత్సర(2018–19) చివరి త్రైమాసిక ఫలితాలను మంగళవారం (30న) ప్రకటించనున్నాయి. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలైన బ్రిటానియా (బుధవారం), డాబర్ (గురు), హిందూస్తాన్ యూనిలివర్ (శుక్ర) ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇక ఇదేవారంలో రిజల్స్ ప్రకటించనున్న ఇతర ప్రధాన కంపెనీల్లో.. టాటా కెమికల్స్, టాటా పవర్, ఫెడరల్ బ్యాంక్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అజంతా ఫార్మా, ఎల్ఐసి హౌసింగ్ ఫైనా¯Œ్స, రేమండ్, బంధన్ బ్యాంక్, ఎక్సైడ్ ఇండస్ట్రీస్‌లు ఉన్నాయి. ఈ ఫలితాలు మార్కెట్ ట్రెండ్‌కు అత్యంత కీలకంకానున్నాయని ఎడెల్వీజ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ సాహిల్ కపూర్ అన్నారు. ఫెడ్ సమావేశంపై మార్కెట్ ఫోకస్ వడ్డీ రేట్లను సమీక్షించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈవారంలోనే సమావేశంకానుంది. మంగళ, బుధవారాల్లో ఫెడరల్ ఓపె¯Œ మార్కెట్ కమిటీ ఈ అంశంపై చర్చించనుండగా.. ఈ సమావేశానికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఫెడరల్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం ప్రకటించనున్నారు. భారీ ఒడిదుడుకుల మధ్య క్రూడాయిల్ గతవారంలో 75 డాలర్లకు సమీపించి మార్కెట్‌కు ప్రతికూలంగా మారిన బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. వారాంతాన దిగొచ్చింది. శుక్రవారం 71.63 డాలర్ల వద్ద ముగిసింది. ఈ అంశం ఆధారంగా డాలరుతో రూపాయి మారకం విలువ 69.50–70.30 శ్రేణిలో ఉండేందుకు అవకాశం ఉందని ఎడిల్వీస్ సెక్యూరిటీస్ ఫారెక్స్ హెడ్ సజల్ గుప్తా విశ్లేషించారు. ఈ వారంలో ట్రేడింగ్ 3 రోజులే.. ముంబైలో సార్వత్రిక ఎన్నికలు పోలింగ్ ఉన్న కారణంగా సోమవారం(29న) స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. ఆ తరువాత రోజైన మంగళవారం యథావిధిగా మార్కెట్ కొనసాగనుంది. అయితే, మళ్లీ బుధవారం(1న) మహారాష్ట్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఈ, ఎ¯Œ ఎస్ఈలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మొత్తంగా ఈ వారంలో మార్కెట్లో ట్రేడింగ్ మూడు రోజులకే పరిమితంకానుంది కొనసాగుతున్న విదేశీ నిధుల వెల్లువ భారత్ క్యాపిటల్ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో భారీగా పెట్టుబడులు చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఏప్రిల్ 1–26 కాలంలోనూ రూ.17,219 కోట్లను పెట్టుబడిపెట్టినట్లు డిపాజిటరీ డేటా ద్వారా వెల్లడయింది. -
మహబూబ్‌నగర్‌లో.. వలస జీవుల తీర్పెటో..?
హలో..! నేను.. మాట్లాడుతున్న. ఎలా ఉన్నారు..? అక్కడ ఏం పని చేస్తున్నరు..? మనోళ్లు ఎంత మంది ఉంటరు..? అందరికీ పని దొరుకుతుందా..? ఏప్రిల్ 11న ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలున్నయ్ తెలుసు కదా. తప్పకుండా రావాలి మరీ. వచ్చి ఓటు రూపంలో నన్ను ఆశీర్వదించండి. రవాణా ఖర్చులకు ఇబ్బందిపడకండా మనోళ్లు చూసుకుంటరు. అక్కడ మీ బాధలు నాకు తెలుసు. నేను గెలిస్తే మీకు ఇక్కడే ఉపాధి కల్పిస్తా.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, మిగతా సాగునీటి పథకాలకు నిధులు తెచ్చి వాటిని పూర్తి చేస్తా. సాగునీటి ఇబ్బందులు తీర్చి మీ చేనులను సస్యశ్యామలం చేస్తా. ఓటు వేసేందుకు తప్పకుండా రండి. మీ ఒక్క ఓటు నా గెలుపునకు ముఖ్యం. మరిచిపోవద్దు. ప్లీజ్..’అంటూ ఎంపీ అభ్యర్థులు, వారి అనుచరులు ఇతర ప్రాంతాల్లో ఉంటోన్న వలస ఓటర్లను మచ్చిక చేసుకుంటున్న తీరు ఇది. సాక్షి , మహబూబ్‌నగర్: పాలమూరు.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఈ ప్రాంతంలో నెలకొన్న కరువే. వ్యవసాయ భూములున్నా సాగుకు నీరు లేక.. స్థానికంగా చేసేందుకు పని దొరక్క పొట్ట కూటి కోసం ముంబై.. పూణె.. కర్ణాటక.. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు గుర్తొస్తాయి. దశాబ్దాల కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంత మంది పాలకులు మారినా.. వలసజీవుల తల రాతలు మారడం లేదు. పరాయి ప్రాంతాల్లో వారు పడుతోన్న కష్టాలు గుర్తుకొస్తాయి. ‘స్థానికంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి జిల్లాను సస్యశా మలం చేస్తాం.. నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అంటూ ప్రతిసారీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే హామీలు గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్లీ వలస జీవులతో మన నాయకులకు పని పడింది. ఈ నెల 11 తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డ ఎంపీ అభ్యర్థులు తాజాగా వలస జీవుల ఓట్లనూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎన్నికలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్యకర్తలు.. కుల.. మత పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు తాజాగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తోన్న వలస కూలీలు, కార్మికుల ఓట్లపై దృష్టి సారించారు. మూడున్నర లక్షలకు పైనే.. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలున్నాయి. మహబూబ్‌నగర్ పరిధిలో 15,05,190మంది, నాగర్‌కర్నూల్ పరిధిలో 15,88,746మంది ఓటర్లున్నారు. రెండు సెగ్మెంట్ల నుంచి మూడున్నర లక్షలకు పైగా మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులుగా పని చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కోయిలకొండ, దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాజ్‌పేట, మద్దూరు, కోస్గి మండలాల నుంచి పెద్ద మొత్తంలో ముంబయి, బెంగళూరు, పూణె నగరాల్లో ఉంటున్నారు. మక్తల్ మండలం కర్లి, గుడిగండ, మంతన్‌గోడ్, అనుగొండ, జక్లేర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో ఉంటున్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎక్కువ మంది ముంబైలో ఉంటున్నారు. ఇలా వలస వెళ్లిన వారిని గుర్తించిన ఎంపీ అభ్యర్థులు, అనుచరులు వారికి ఫోన్లు చేస్తున్నారు. ఉగాది పండుగకు రాకున్నా.. పోలింగ్ రోజు కచ్చితంగా రావాలని అభ్యర్థిస్తున్నారు. ఉగాదికి తమ సొంతూర్లకు విచ్చేసిన వారి వివరాలు తీసుకుని వారిని కలుస్తున్నారు. ఎన్నికల తర్వాతే వెళ్లాలని అప్పటి వరకు ఏవైనా ఖర్చులున్నా తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అందరి నోటా అదే మాటా.. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ప్రచారాన్ని వేగిరాన్ని పెంచిన ఎంపీ అభ్యర్థులందరూ ‘వలస’ ఓట్లు రాబట్టేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్న అభ్యర్థులు తాము గెలిస్తే వలసలకు అడ్డుకట్ట వేసేలా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఇలాంటి హామీలే ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వస్తుందని.. నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని.. తమను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని, వలసలను నివారించేందుకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామంటూ బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు మహబూబ్‌నగర్ ప్రజల సమస్యలు తెలుసని.. ఎంపీగా గెలిస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎవరూ వలస వెళ్లకుండా, వలస వెళ్లిన వారిని రప్పించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థులు చల్లా వంశీచందర్‌రెడ్డి, మల్లురవి హామీలు ఇస్తున్నారు. వలస వెళ్లిన వారందరూ తిరిగి వచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలకు అడ్డుకట్ట వేస్తామంటూ టీఆర్ఎస్ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో వలస జీవులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
ఎయిర్‌టెల్‌కు 7 కోట్లమంది యూజర్లు షాకిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం మార్కెట్ సంచలనం రిలయన్స్ జియో దెబ్బతో విలవిలలాడిన ప్రయివేటు దిగ్గజ టెల్కో ఎయిర్‌టెల్‌కు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. తాజా నివేదికల ప్రకారం ఇప్పటికే.. జియో దెబ్బకు కుదేలైన ఎయిర్టెల్ సుమారు 5-7 కోట్ల ఖతాదారులను ఎయిర్టెల్ కోల్పోనుంది. జీవిత కాల కస్టమర్లు ఉచిత ఇన్కమింగ్ కోసం 35రూపాయల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలన్న నిబంధన కంపెనీపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. లైఫ్ టైం ఫ్రీ ఇన్‌కం ప్లాన్‌లో ఉన్న కస్టమర్లు నెలకు మినిమమ్ బ్యాలెన్స్ రూ. 35గా ఎయిర్టెల్ ఇటీవల ఆదేశించింది. కస్టమర్లు నెలకు ఈ మినిమమ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని లేదంటే కనెక్షన్‌ను కట్ చేస్తానని నోటీసులు కూడా పంపింది. దీంతో చాలా మంది కస్టమర్లు ఎయిర్‌టెల్‌ను వీడనున్నారని సమాచారం. ఎయిర్టెల్ ఏమంటోంది? తమ తాజా నిర్ణయం వల్ల తమకు నష్టం ఏమీ ఉండదని ఎయిర్టెల్ ధీమాగా చెబుతోంది. ఖాతాదారులను నష్టపోనుందన్న అంశంపై స్పందించిన ఎయిర్టెల్ ఈ చర్య వల్ల యావరేజ్ రెవిన్యూ పర్ యూజర్ (సగటు వినియోగదారుని నుండి వచ్చే ఆదాయం) ఏపీఆర్‌యూ పెరుగుతుందని, ఇప్పటికే చాలా సిమ్‌లు లైఫ్ టైం ప్యాకేజ్ కింద కేవలం ఇన్కమింగ్ కాల్స్ కోసమే వాడుతున్నారని , దీన్ని అరికట్టడానికే ఈ చర్య తీసుకున్నామని ఎయిర్టెల్ తెలిపింది. అంతేకాదు ఒక వేళ కస్టమర్లు తగ్గినా ఆ భారాన్ని మోయడానికే తాము సిద్ధ పడ్డామని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. 4జీ సేవలతో బాటు , ఇతర రంగాల్లో నుంచి తమకు ఆదాయం వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. -
నిరుద్యోగులకు కఠినంగా మారనున్న ఏపీపీఎస్పీ తాజా నిర్ణయం
-
ఆటోచార్జీలు పెంచడం తప్పదు
సాక్షి, జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్) : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పట్టణంలో నడుస్తున్న ఆటో చార్జీలను పెంచడం తప్పదని ఆటో యూనియన్ జేఏసీ నాయ కులు వెల్లడించారు. మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బీలో ఆటో యూనియన్ జేఏసీ సమావేశంలో రాములు, ఎస్ఏ శ్యామ్, శ్రీనివాసులు, అంబదాస్ మాట్లాడుతూ ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. పట్టణంలో రూరల్ ఆటోలు తిరుగడం వల్ల పట్టణ ఆటోలను నమ్ముకుని జీవిస్తున్న వారికి గిరాకీ తగ్గుతున్నాయనే భావన వస్తుందన్నాను. ఈ అంశంపై చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. పట్టణంలో చార్జీల పెంపుపై త్వరలోనే మరో సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. చార్జీలు పెంచడానికి జేఏసీ తీర్మానించిందని, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రాజు, శ్రీనివాస్, వెంకట్, విజయ్‌కుమార్, సత్యం, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ కేబినెట్ వివాదస్పద నిర్ణయం
-
ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా
వాషింగ్టన్: ఏడు దేశాలు రెండేళ్లపాటు చర్చోపచర్చలు జరిపిన తర్వాత 2015లో సాకారమైన చారిత్రక ఇరాన్ అణు ఒప్పందం నుంచి వైదొలుగుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలు ఉత్పత్తి చేయకుండా నాటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో కుదిరిన ఉమ్మడి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక (జేసీపీవోఏ)ను ‘క్షీణించిన, కుళ్లినది’గా అభివర్ణించే ట్రంప్.. తాను అధికారంలోకి వస్తే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తానని 2016లో ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించారు. చెప్పినట్లుగానే జేసీపీవోఏ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు మంగళవారం ట్రంప్ ప్రకటించారు. తననిర్ణయంతో అమెరికా మిత్రదేశాలతోనూ విభేదాలు తెచ్చుకున్నారు. అమెరికాతో సంబంధం లేకుండా తాము ఈ ఒప్పందానికి కట్టుబడి ఉంటామనీ, ఇరాన్ కూడా అలాగే చేయాలని ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, చైనా, జర్మనీ ప్రకటించాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఆంక్షలు విధించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలతోపాటు జర్మనీ కూడా కలసి ఇరాన్‌తో రెండేళ్లపాటు చర్చలు జరిపిన అనంతరం 2015లో వియన్నాలో జేసీపీవోఏ ఒప్పందం కుదరడం విదితమే. అణు కార్యక్రమాలను నిలిపివేసినందుకుగాను అప్పటివరకు ఇరాన్‌పై ఉన్న అంతర్జాతీయ ఆంక్షలను ఎత్తేశారు. ఐక్యరాజ్యసమితిలో తీర్మానం ద్వారా ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయ చట్టంగా కూడా గుర్తించారు. ‘మనం ఇరాన్ అణు బాంబును నియంత్రించలేమనేది నాకు స్పష్టంగా తెలుసు. ఈ ఒప్పందం మూలంలోనే లోపాలు ఉన్నాయి. కాబట్టే దీని నుంచి అమెరికా తప్పుకుంటున్నదని నేను ప్రకటిస్తున్నాను’ అని ట్రంప్ చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు విధించారు. ట్రంప్ నిర్ణయ ప్రభావమెంత? అమెరికాప్రకటించిన ఆంక్షలు ఇరాన్ ఆటోమొబైల్ రంగంపై మూడు నెలల తర్వాత, చమురు రంగంపై ఆరు నెలల తర్వాత అమల్లోకి వస్తాయి. కాబట్టి అంతర్జాతీయ చమురు ధరలు వేగంగా పెరిగే అవకాశాల్లేవు. అమెరికా మిత్ర దేశాలు అనేకం ఇరాన్ నుంచి ముడి చమురు కొంటున్న నేపథ్యంలో అవి అమెరికాను అనుసరిస్తూ కొనుగోళ్లు తగ్గించుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఈ మిత్రదేశాల బ్యాంకులపై అమెరికా ఆరు నెలల తర్వాత ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. అందుకే అమెరికా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని ఐరోపా మిత్రదేశాలు కోరుతున్నాయి. ట్రంప్ నిర్ణయం వల్ల మిత్ర దేశాలైన ఇంగ్లండ్, ఫ్రాన్స్, జర్మనీలు అమెరికాకు దూరమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. భారత్‌పై తక్షణ ప్రభావం ఉండదు: ఇరాన్‌పై అమెరికా పునరుద్ధరించిన ఆర్థిక ఆంక్షలను ఐరోపా దేశాలు పాటించనంత వరకు భారత ముడిచమురు దిగుమతులపై ప్రభావం ఉండదని భారత అధికారులు వెల్లడించారు. -
భారత్ బంద్‌కు పిలుపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు దళిత సంఘాలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను దుర్వినియోగ పరుస్తున్నారనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు గత నెల 20న కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌పై ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేయాలంటే ప్రత్యేకంగా నియమించిన అధికారుల అనుమతి కావాలంటూ పేర్కొంది. అలాగే సామాన్యులనైనా(ఎస్టీ, ఎస్సీలు కాకుండా మిగతా కులాలకు చెందినవారు) అరెస్ట్ చేయాలంటే సీనియర్ ఎస్పీ అనుమతి కావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం బలహీనపడుతుందని భావించి బీజేపీ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. దేశవ్యాప్తంగా పలు దళిత సంఘాలు సోమవారం ఆందోళనలు కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అట్రాసిటీ యాక్ట్ అంతకుముందు ఎలా ఉందో అలానే ఉంచాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్(ఎన్సీఎస్టీ), నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్స్(ఎన్సీఎస్సీ)లు డిమాండ్ చేశాయి. -
సౌదీ అరేబియా సంచలన నిర్ణయం
రియాద్ : సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై మహిళలు కూడా ఆర్మీలో చేరవచ్చంటూ చారిత్రక ప్రకటన చేసింది. మహిళా సాధికారతను పెంపొందించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. రియాద్, మక్కా, అల్-ఖాసిం, మదీనా తదితర ప్రొవిన్సెస్ల సైన్యంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని.. అందుకు గురువారం(మార్చి 1వ తేదీ) ఆఖరు రోజని ప్రకటించింది. ఆర్మీలో చేరాలనుకునే మహిళలు దరఖాస్తులో 12 అంశాలను తప్పకుండా పూరించాలని తెలిపింది. సౌదీ జాతీయురాలై ఉండటం.. 25-35 ఏళ్ల మధ్య వయస్సు.. హైస్కూలు విద్యార్హత కలిగి ఉండాలి. వైద్య పరీక్షలు చేసుకోవడం తప్పనిసరని పేర్కొంది. ఇక శారీరక ధారుఢ్యం విషయంలో అభ్యర్థి వయసు 155 సెంటీమీటర్లకు తగ్గకూడదని తెలిపింది. వీటితోపాటు ఇతరత్రా నిబంధనలను విధించింది. అయితే గార్డియన్ అనుమతితోనే ఆమె సైన్యంలో చేరాలన్న నిబంధనపై మాత్రం మహిళా హక్కుల సంఘాలు పెదవి విరుస్తున్నాయి. ఇక ఈ నియామకం యుద్ధంలో పోరాటడం కోసం కాదని.. తాము సైన్యంలో రాణించగలమన్న భావన మహిళలలో పెంపొందించేందుకేననని అధికారులు చెబుతున్నారు. చమురుపై ఆధారపడుతున్న సౌదీ భవిష్యత్తులో దాని నుంచి దూరంగా జరగాలనే ఉద్దేశంతో విజన్ 2030 కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్.. మహిళల అభ్యున్నతికి ఆటంకాలుగా ఉన్న చట్టాలకు సవరణలు చేస్తూ వారికి సడలింపులు ఇస్తున్నారు. మహిళలు డ్రైవింగ్ చేయటంపై నిషేధం ఎత్తివేత, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు అనుమతులు మంజూరు చేసిన విషయం విదితమే. -
వెనక్కి తగ్గిన కేంద్రం: రాహుల్ ఎఫెక్టేనా?
సాక్షి, న్యూఢిల్లీ: పాస్‌పోర్టు రంగుమార్పులో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆరెంజ్ కలర్లో పాస్‌పోర్టులను జారీ చేయాలనే ఆలోచనను విరమించుకుంది ఇకమీదట ప్రస్తుతం ఉన్న విధానం కొనసాగుతుందని ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. పాస్‌పోర్ట్ చివరి పేజీ ప్రింటింగ్‌లో ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించిందని ఒక ప్రకటనలో విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దీనిపై రివ్యూ నిర్వహించిన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వివిధ వాటాదారులతో సమగ్ర చర్చలు చేపట్టారు. అనంతరం నారింజ రంగు జాకెట్ తో ఒక ప్రత్యేక పాస్‌పోర్ట్ జారీ కాదు , చివరి పేజీ ముద్రణలో ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయించిందని విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా ఇమిగ్రేషన్ చెక్ అవసరం ఉన్న పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఆరెంజ్ రంగు పాస్‌పోర్డు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది బీజేపీ వివక్షాపూరిత ఆలోచనా ధోరణికి నిదర్శనమనీ, వలస కార్మికులను రెండో తరగతి పౌరులుగా బీజేపీ పరిగణించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదంటూ మండిపడిన సంగతి తెలిసిందే. -
హాలహర్వి ఎస్సై సస్పెన్షన్
హాలహర్వి: కర్నూలు జిల్లా హాలహర్వి పోలీసు స్టేషన్ ఎస్సై కృష్ణమూర్తిని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే సస్పెండ్ చేశారని ఆలూరు సి.ఐ అబ్దుల్ గౌస్ తెలిపారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులను వేధింపులకు గురిచేయడం, ఇసుక అక్రమ రవాణాలో ఎస్సై భాగస్వామి కావడంతోనే ఆయన్ను జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. -
ప్రభుత్వ నిర్ణయంపై ఏపీ జేఏసీ తీవ్ర అభ్యతరం
-
చెడును వాయిదా వెయ్యాలి...
ఆత్మీయం కొన్ని ప్రత్యేక సందర్భాలలో లేదా పర్వదినాలలో చాలామంది కొత్త పనులకి శ్రీకారం చుడతారు. ‘ఇవాళ్టి నుంచి నేను అన్నీ నిజాలే చెప్పాలి’, ‘ఇతరులకు మంచి చేయలేకపోయినా, కనీసం చెడు చేయకూడదు’, ‘నా చెడు అలవాట్లన్నీ మానుకోవాలి...’ ఇలా చాలా నిర్ణయాలు తీసుకుంటారు. వాటిని నిలబెట్టుకోవాలని ప్రమాణాలు చేస్తారు, మొక్కులు మొక్కుకుంటారు. అయితే, నిర్ణయాలు ఎంత ఆవేశంతో, తొందరపాటుగా తీసుకుంటారో... వాటిని మరచిపోవడంలోనూ అంతే ఆవేశం, తొందరపాటు చూపుతారు. ఒక నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడమంటే ఎంత కష్టమో అర్థం అయిన తరవాత నిర్ణయాలను గాలికి వదిలేస్తారు. తమ తమ అలవాట్లను, పంథాను మార్చుకోవడంలో విఫలమవుతుంటారు. తీసుకున్న నిర్ణయం మీద కట్టుబడి ఉండాలి. అప్పుడే అనుకున్న నిర్ణయం ఆచరణలో పెట్టగలుగుతాం. ‘మంచి చేయాలనుకున్నప్పుడు వెంటనే ప్రారంభించాలి, చెడు చేయాలనుకుంటే వాయిదా వేయాలి’ అని పౌరాణికులు ప్రవచిస్తున్నారు. ఎందుకంటే, రావణాసురుడు సముద్రంపై వార ధిని నిర్మించాలనుకున్నాడు కానీ వాయిదా వేశాడు. సీతమ్మను అపహరించాలనుకున్నాడు, వెంటనే ఆ నిర్ణయాన్ని అమలు చేశాడు. అందుకే భ్రష్టుపట్టిపోయాడు. కాబట్టి ఇంతకన్నా నిదర్శనం ఏముంది? మంచిని ఆ క్షణంలో ప్రారంభించడం వల్ల అందరూ సుఖశాంతులతో ఉంటారు. చెడును వాయిదా వేసుకోవటం వల్ల మనిషిలో రోజురోజుకీ చెడు ప్రభావం కొంతయినా తగ్గుముఖం పట్టి కొంతకాలానికి పరివర్తన వచ్చి చెడు చేయటం మానుకుంటారు. అందుకే నిర్ణయాలు చెడ్డవయినప్పుడు వాటిని వాయిదా వేయాలి. -
నయీమ్ కేసులో మళ్లీ మొదలైన హడావిడి
-
ఫిర్యాదుదారుల చెంతకే అధికారులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ‘మీ కోసం’ కార్యక్రమంలో అందే ఫిర్యాదుల పరిష్కారానికి కొత్త విధానం అమల్లోకి రాబోతోంది. ఇకపై అధికారులు ఫిర్యాదుదారుని వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. సమస్యలతో సతమతం అవుతున్న వారు, ప్రభుత్వ సహాయం అర్థించే వారు ప్రతి సోమవారం కలెక్టరేట్‌కు రావ డం.. వినతిపత్రాలు ఇవ్వడం.. సమస్య పరిష్కారం కాకపోవడంతో పదేపదే అధికారుల చుట్టూ తిరగడం సర్వసాధారణ విషయంగా మారింది. సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలువురు కలెక్టరేట్ వద్దే ఆత్మహత్యకు యత్నించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 24న నిర్వహించిన జిల్లా అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో కలెక్టర్ ఓ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు నుంచి ‘మీ కోసం’లో వచ్చిన అర్జీలను స్వీకరించిన అనంతరం.. వాటిని పరిష్కరించాలి్సన బాధ్యత గల అధికారి అర్జీదారుని వద్దకు వెళ్లాలి. ఫిర్యాదుదారు ఇచ్చిన అర్జీని చదివి వినిపించాలి. ఆ తర్వాత ఆ సమస్యను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించాలి. పరిష్కరించిన విధానాన్ని కూడా అర్జీదారునికి చదివి వినిపించాలి. అర్జీదారుడు తన సమస్య పరిష్కారమైనట్టు సంతృప్తి చెందినదీ, లేనిది వీడియోలో చిత్రీకరించాలి. అనంతరం అర్జీదారునితో సంబంధిత అధికారి సెల్ఫీ తీసుకుని దానిని పరిష్కార నివేదికతోపాటు మీ కోసం వెబ్‌పోర్టల్‌లో పొందుపరచాలి. ఒకవేళ ఆ సమస్య ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిష్కరించడానికి వీలుకాని పక్షంలో ఆ విషయాన్ని అర్జీదారునికి ఎండార్స్మెంట్ ఇచ్చి, దాన్ని వెబ్సైట్లో పొందుపరచాలి. రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలకు సంబంధించిన దరఖాస్తులకు సెల్ఫీతోపాటు వీడియో కూడా కచ్చితంగా అప్లోడ్ చేయాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
‘రద్దు’ తర్వాత హైదరాబాద్‌లోనే భారీగా బంగారం కొనుగోళ్లు
- కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఉంగుటూరు: నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తరువాత దేశంలోని మిగతా ప్రాంతాలకంటే హైదరాబాద్‌లోనే ఎక్కువ మంది బంగారం కొన్నారని, వారి వివరాలన్నీ తమ దగ్గరున్నాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఆదివారం గుంటూరు జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరు స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో విలేకరుస మావేశంలో మాట్లాడిన ఆయన.. కరెన్సీ రద్దును విప్లవాత్మక నిర్ణయంగా అభివర్ణించారు. కేంద్రప్రభుత్వం అవినీతిపై పోరాడుతున్నదని, జనవరి నాటికి పరిస్థితులు మెరుగుపడతాయని అన్నారు. దేశంలో పెద్ద ఎత్తున నల్లధనం పేరుకుపోయిందని, పొరుగు దేశంలో దొంగనోట్లు ముద్రించి టెర్రరిస్ట్, డ్రగ్స్ కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని వెంకయ్య చెప్పారు. కొంతమంది బ్యాంకు ఉద్యోగులు అవినీతికి పాల్పడుతున్నారని, దీనిని మార్చుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు ప్రజలను రెచ్చకొడుతున్నాయని విమర్శించారు. వ్యక్తిగత ఖాతాల్లో రూ.2.50 లక్షల వరకు డబ్బుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదని, అంతకు మించితేనే లెక్క చెప్పాల్సి ఉంటుందని అన్నారు. కాగా, జనవరి 8న ముప్పవరపు ఫౌండేషన్ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వెంకయ్యనాయుడు తెలిపారు. -
కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన మేనకా
న్యూఢిల్లీ: వీధి కుక్కలను నిర్మూలించడానికి కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పర్యావరణ ఉద్యమకారిణి, కేంద్రమంత్రి మేనకాగాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. కుక్కలను చంపాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమైనదిగా, అశాస్త్రీయమైనదిగా పేర్కొన్నారు. కుక్కల స్టెరిలైజేషన్ కోసం కేంద్రం ఇస్తున్న నిధులు ఎక్కడికి పోతున్నాయని కేరళ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కుక్కులను నిర్మూలించడానికి వాటిని చంపడమే పరిష్కారం కాదని తేల్చి చెప్పారు. ఢిల్లీ నగరంలో 5,00,000 ల కుక్కులుండేవని స్టెరిలైజేషన్ తర్వాత వాటి సంఖ్య 70 వేలకు తగ్గిందన్నారు. -
కేసుల పరిష్కారంలో వేగం తప్పనిసరి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత గుంటూరు లీగల్: జిల్లాలోని న్యాయమూర్తులు తమ కోర్టులలో ఉన్న కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.సుమలత సూచించారు. జిల్లా న్యాయమూర్తుల సమీక్ష సమావేశం ఆదివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కోర్టు హాల్లో నిర్వహించారు. జిల్లాలోని సీనియర్ సివిల్ జడ్జి కోర్టుల పనితీరును స్వయంగా ప్రధాన న్యాయమూర్తి సుమలత సమీక్షించారు. జూనియర్ సివిల్ జడ్జి కోర్టుల పనితీరును అదనపు జిల్లా జడ్జిలు సమీక్షించారు. జూన్, జులై మాసంలో నమోదైన కేసులు, పరిష్కారమైన కేసుల వివరాలను ఆమె తెలుసుకున్నారు. కేసుల పరిష్కారంలో వేగం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇచ్చిన పలు తీర్పులను ఉటంకిస్తూ కేసుల పరిష్కారంలో ఆయా తీర్పులను ప్రామానింగా తీసుకోవాలని సూచించారు. జిల్లాలో జూన్, జూలై మాసాల్లో ఎక్కువ కేసులు పరిష్కరించిన ఒకటో అదనపు జిల్లా జడ్జి గుమ్మడి గోపీచంద్, మంగళగిరి సీనియర్ సివిల్ జడ్జి కె.చింరజీవులు, పిడుగురాళ్ళ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.సుజాతను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా న్యాయమూర్తుల సమీక్ష సమావేశం పూర్తి స్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించడం ఇదే ప్రథమం. పవర్ పాయంట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలోని వివిధ కోర్టులలో ఉన్న కేసుల వివరాలు, పరిష్కార మైన కేసుల వివరాలను చూపించారు. సమావేశంలో మానవత్వం గురించి తెలిపే సన్నివేశాలు, కుటుంబ సభ్యుల పట్ల చూపే ప్రేమ, అనురాగాలు తదితర సన్నివేశాలను వీడియో ద్వారా చూపారు. సీనియర్ న్యాయమూర్తులు, జూనియర్ న్యాయమూర్తులతో అనుసంధానమై వారికి ఉన్న అనుమానాలను నివత్తి చేస్తూ కేసుల పరిష్కారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను బోధించారు. వచ్చే సమీక్షా సమావేశం నాటికి జిల్లాలో కేసుల పరిష్కారంలో వేగం పెంచి జిల్లా న్యాయవ్యవస్థకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తికి మంచి పేరు తెస్తామని న్యాయమూర్తులు హామీ ఇచ్చారు. -
ప్రజలను నిర్వాసితులను చేస్తే సహించం
- రైతులు, ప్రజల పొట్టగొట్టే ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యమం - బందరులో జరిగే ఉద్యమాలకు అండగా ఉంటాం - పది వామపక్ష పార్టీల సమావేశ నిర్ణయం సాక్షి, విజయవాడ: బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లక్ష ఎకరాల భూమి సమీకరించేలా సోమవారం నోటిఫికేషన్ జారీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని పది వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. బందరు పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో తీరప్రాంతంలోని మత్స్యకారులు, రైతులు, ప్రజల జీవనాన్ని దెబ్బతీసే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని ప్రకటించారు. భూమిని కాపాడుకునేందుకు బందరు ప్రాంతానికి చెందిన రైతులు, ప్రజలు జరిపే ఉద్యమాలకు బాసటగా నిలవాలని నిర్ణయించారు. విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో సీపీఐ(ఎంఎల్) రాష్ట్ర నాయకుడు గుర్ర విజయ్‌కుమార్ అధ్యక్షతన పది కమ్యూనిస్టు పార్టీల సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. సమావేశ నిర్ణయాలను పది వామపక్షపార్టీల నేతలు పత్రికలకు విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణం వల్ల రాష్ర్ట ప్రజలకు జరిగే నష్టాన్ని వివరిస్తూ ఈ నెల 17న విశాఖలో నిర్వహించనున్న జాతీయ సెమినార్‌పై ప్రచారం నిర్వహిస్తున్న సీపీఎం నాయకులను పోలీసులను అరెస్టు చేయడాన్ని నాయకులు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ప్రజాస్వామిక వాదులంతా నిరసించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. విశాఖలో అరెస్టు చేసిన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీహెచ్ నర్శింగరావు, నగర కార్యదర్శి బి.గంగారావులతో పాటు 26మంది నాయకులను, కార్యకర్తలను విడుదల చేయాలని, పోలీసులు స్వాధీనం చేసుకున్న ప్రచార వాహనాన్ని వెంటనే విడిచిపెట్టాలని కోరారు. సమావేశంలోపి.మధు, వై.వెంకటేశ్వర్లు(సీపీఎం), కె.రామకృష్ణ, ముప్పాళ్లనాగేశ్వరరావు, జెల్లివిల్సన్(సీపీఐ), పి.ప్రసాద్, యు.వెంకటేశ్వర్లు(సీపీఐఎంఎల్-న్యూడెమోక్రసీ), హరినాథ్, సత్యనారాయణ(సీపీఐఎంఎల్-లిబరేషన్), పి.రామారావు(సీపీఐఎంఎల్-న్యూడెమోక్రసీ), పి.సుందరామరాజు, అజీం పాషా, సుభాష్ చంద్రారెడ్డి(ఫార్వర్డ్‌బ్లాక్), కిషోర్(సీపీఐఎంఎల్) హాజరయ్యారు. -
బ్రెగ్జిట్ పై ప్రజా నిర్ణయాన్నిగౌరవిస్తాంః ఒబామా
వాషింగ్టన్ః యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలన్న బ్రిటన్ ప్రజల తీర్పును గౌరవిస్తానని అమెరికా అధ్యక్షుడు బారాక్ ఒబామా అన్నారు. బ్రెగ్జిట్ పై స్పందించిన ఒబామా.. ఈ పరిస్థితుల్లో అమెరికాతో బ్రిటన్ కు ఉన్న సంబంధాలపై ఎటువంటి ప్రభావం ఉండదన్నారు. బ్రిటన్ తో ఎప్పట్లాగే సంబంధాలు కొనసాగిస్తామని వివరించారు. బ్రిటన్ ప్రజలు తమ గళాన్ని వినిపించారని, వారి నిర్ణయాన్ని తాము తప్పక గౌరవిస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా ఓ ప్రకటనలో తెలిపారు. యూరోపియన్ యూనియన్ తో బ్రిటన్ విడిపోయినా, ఆ రెండింటితో అమెరికా సంబంధాలు విడివిడిగా కొనసాగుతాయన్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోయేందుకు పెట్టిన ఓటింగ్ లో ఎక్కువ మంది బ్రిటన్ ప్రజలు మద్దతు పలకిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బ్రిటన్ ఈయూతో విడిపోవడం ఖాయమైంది. -
‘మూతబడులు’ తెరుద్దాం
♦ జీరో ఎన్రోల్మెంట్ స్కూళ్లపై తాజా నిర్ణయం ♦ తిరిగి ప్రారంభించనున్న విద్యాశాఖ ♦ విద్యార్థుల నమోదు పెంచాలని టీచర్లకు ఆదేశం ♦ ఈ నెల 8 నుంచి 16 వరకు బడిబాట ♦ రోజువారీ కార్యక్రమాలు వెల్లడించిన విద్యాశాఖ సాక్షి, రంగారెడ్డి జిల్లా: మూతబడులు తిరిగి ప్రారంభం కానున్నాయి. కొత్తగా విద్యార్థుల నమోదు లేకపోవడం.. ఉన్న విద్యార్థులు పక్క స్కూళ్లకు తరలిపోవడంతో 2015-16 విద్యాసంవత్సరంలో జిల్లాలో 14 పాఠశాలలకు తాళం పడింది. జీరో ఎన్‌రోల్‌మెంట్‌గా పేర్కొంటూ అక్కడ పనిచేసే టీచర్లను సమీప పాఠశాలలకు డెప్యూటేషన్‌పై పంపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ పాఠశాలలను పునఃప్రారంభించాల్సిందిగా విద్యాశాఖ నిర్ణయించింది. పాఠశాలల మూసివేతపై అత్యున్నత న్యాయస్థానం జోక్యం చేసుకుని సర్కారుకు మొట్టికాయలు వేయడంతో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. నమోదు పెంచాలని ఆదేశం.. గతేడాది మూసివేసిన పాఠశాలలను తాజాగా తెరవాలని విద్యాశాఖ ఆదేశిస్తూ ఆయా టీచర్లకు ప్రత్యేకంగా లక్ష్యాలు నిర్ణయించింది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగేందుకు చొరవ తీసుకోవాలని.. ఆంగ్ల మాధ్యమాన్ని సైతం ప్రవేశపెట్టొచ్చని విద్యాశాఖ ఇప్పటికే సూచనలు జారీ చేసింది. ఈక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తీసుకునే నిర్ణయంపై బడి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. విద్యార్థుల నమోదు లేకుంటే బడులు మూసేయొద్దని ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో ప్రస్తుత టీచర్లు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి. తెరుచుకోనున్న పాఠశాలలివే.. జీరో ఎన్‌రోల్‌మెంట్‌తో జిల్లాలో 14 పాఠశాలలకు మూతపడగా.. తాజాగా వాటిని తెరవనున్నారు. ఎంపీపీఎస్ కస్లాబాద్తండా (మేమీన్పేట్), ఎంపీపీఎస్ సైదాలిపూర్(మోమీన్‌పేట్), ఎంపీయూపీఎస్ లక్ష్మారెడ్డిగూడ (శంకర్పల్లి), జీపీఎస్ ఎరుకుంటతండా (శంకర్పల్లి), ఎంపీపీఎస్ అలిజాపూర్ (రాజేంద్రనగర్), ఎంపీపీఎస్ చేవెళ్ల (చేవెళ్ల), ఎంపీపీఎస్ రాంసింగ్‌తండా (కుల్కచర్ల), జీపీఎస్ కొర్రొంతండా (మంచాల), ఎంపీపీఎస్ హెచ్‌డబ్ల్యూ ఆరుట్ల (మంచాల), జీపీఎస్ బుగ్గతండా (మంచాల), ఎంపీపీఎస్ అంబేద్కర్‌నగర్ (కందుకూరు), ఎంపీపీఎస్ కటికపల్లి (కందుకూరు), ఎంపీపీఎస్ దాసర్లపల్లి ఉర్దూ (కందుకూరు), ఎంపీపీఎస్ నేదునూరు ఉర్దూ (కందుకూరు) పాఠశాలలు తాజాగా పునఃప్రారంభం అవుతాయి. రేపట్నుంచి బడిబాట.. బడిబాట కార్యక్రమంపై విద్యాశాఖ స్పష్టతనిచ్చింది. ఈనెల మూడోతేదీ నుంచి బడిబాట చేపట్టనున్నట్లు తొలత ప్రకటించినప్పటికీ.. అందుకు సంబంధించి మార్గదర్శకాలను విద్యాశాఖ వెల్లడించలేదు. తాజాగా బడిబాట షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 8 నుంచి 16వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా విద్యాశాఖ స్పష్టం చేసింది. 8న విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులతో ఎన్రోల్మెంట్పై ర్యాలీలు నిర్వహించాలి. 9న టీచర్లు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం. 10న స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం. 13న ఒకటో తరగతి విద్యార్థులకు సామూహిక అక్ష్యరాభ్యాసం. 14న మండలస్థాయిలో ఎన్రోల్మెంట్పై సమీక్ష. 15, 16 తేదీల్లో గ్రామ విద్యా రిజిస్టర్‌ను సమగ్రంగా పూర్తి చేయాలి. ఈక్రమంలో టీచర్లు గ్రామంలో ఇంటింటికీ తిరిగి విద్యార్థులను చేర్పించేందుకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని విద్యాశాఖ సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. -
పెళ్లి నగలు కొనేవారికి భారీ ఊరట
ముంబై: బంగారు ఆభరణాలపై 1 శాతం పన్ను విధింపులో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. 42 రోజులు పాటు బంగారు వర్తకుల దేశవ్యాప్త సమ్మెతో దిగి వచ్చిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఒక శాతం ఎక్సైజ్ డ్యూటీ వ్యతిరేకంగా పరిశ్రమ మొత్తం విస్తృతంగా సమ్మెలు చేపట్టిన ససేమిరా అన్న ప్రభుత్వం ఎట్టకేలకు సానుకూలంగా స్పందించింది. బంగారం లావాదేవీలపై విధించిన పన్నుపై అటు ప్రజలు, ఇటు ఆభరణాల వ్యాపారులు నుంచీ తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తడంతో , ఆభరణాల నగదు కొనుగోళ్లపై విధించిన ఒక శాతం పన్నును తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం రేపటి నుంచి (జూన్ 1) అమలులోకి వస్తుందని ప్రకటించింది. దీంతో స్టాక్ మార్కెట్లో ఆభరణాల షేర్లన్నీ లాభాల బాట పట్టాయి. ఈ ఆర్థిక బడ్జెట్ లో జూన్ 1వ తేదీనుంచి బంగారంతో తయారు చేసిన ఆభరణాలు, బంగారు నాణేల కొనుగోళ్లపై ఒక శాతం టాక్స్ ను ప్రభుత్వం ప్రదిపాదించింది. ఫైనాన్స్ బిల్లు ప్రకారం నగదు ద్వారా ఎవరైతే వినియోగదారులు 2 లక్షలకు మించి బంగారు ఆభరణాలు లేదా బంగారు నాణేలను కొనుగోలు చేస్తారో వారి నుండి టీసీఎస్ (సోర్స్ వద్ద పన్ను సేకరణ) రూపంలో ఒక శాతం పన్ను వసూలు చేయనున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు. వెండి మినహా మిగతా అన్ని రకాల విలువైన లోహాలతో తయారైన ఆభరణాలపై ఒక శాతం ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తూ, బడ్జెట్ లో ప్రతిపాదించగా దీనిపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. బంగారు దుకాణదారులు దేశవ్యాప్త సమ్మెకు దిగారు. తమ వ్యాపారాన్ని దెబ్బతీసే పన్నును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘ ఉద్యమంలో తీవ్ర నష్టాలను చవి చూడడంతో ఏప్రిల్ లో పాక్షికంగా ఉద్యమాన్ని విరమించారు. అటు టైటాన్ షేర్లు 4 శాతం లాభపడగా, గీతాంజలి, పీసీ జ్యువెల్లర్, త్రిభువన్ దాస్ జువేరీ, శ్రీ గణేష్ లాంటి ఆభరణాలు షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. దీనిపై ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెల్లరీ ఫెడరేషన్ అధ్యక్షుడు బచిరాజ్ బామల్వా సంతోషం వ్యక్తం చేశారు. పెళ్లి ఆభరణాలు కొనుగోలు చేసేవారికి ఇంచి పెద్ద ఊరట అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మార్కెట్లో చాలా తక్కువ డిమాండ్ ఉందనీ, జూన్ లో పెళ్లిళ్ల సీజన్ రాబోతున్న తరుణంలో రూ .5 లక్షల వరకు పరిమితి పెరగడం పెద్ద రిలీఫ్ అని మరో ప్రతినిధి గాడ్గిల్ పేర్కొన్నారు. -
శాసనసభ ఉద్యోగుల విభజనపై త్వరలో సీఎస్‌లతో భేటీ
► ఉభయ రాష్ట్రాల స్పీకర్ల నిర్ణయం.. మే 10 తర్వాత సమావేశం జరిగే అవకాశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనసభ, మండళ్లలో పనిచేసే ఉద్యోగుల విభజన అంశంపై త్వరలో రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో భేటీ నిర్వహించాలని ఏపీ, తెలంగాణ సభాపతులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఎస్.మధుసూదనాచారి నిర్ణయించారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు దాటుతున్నా ఇంత వరకూ ఉద్యోగుల విభజన పూర్తవలేదు. దీంతో ఉద్యోగుల విభజనతో పాటు పదోన్నతుల అంశాన్నీ పరిశీలించాల్సిందిగా చాలా రోజులుగా ఉద్యోగ సంఘాల నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ రాష్ట్రాల సభాపతులు శనివారం సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లు ఏ.చక్రపాణి, స్వామిగౌడ్, శాసనసభ కార్యదర్శులు రాజా సదారాం. కె.సత్యనారాయణ పాల్గొన్నారు. ఉద్యోగుల విభజన అంశం క్లిష్టతరమైంది కాబట్టి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను భాగస్వాములను చేయాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో మే 10 తర్వాత రెండు రాష్ట్రాల సీఎస్‌లతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఇకపై ఏపీ అసెంబ్లీ సమావేశాలు అమరావతిలో జరిపేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగుల్లో మెజారిటీ భాగం తమను తెలంగాణ అసెంబ్లీకి కేటాయించాల్సిందిగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ నిర్వహణ ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగుల విభజన సమయంలో ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ తన వాదనగా సమావేశంలో వినిపించింది. -
దద్దరిల్లిన పార్లమెంట్... ఎథిక్స్ కమిటీ
న్యూఢిల్లీ : 'స్టింగ్ ఆపరేషన్‌పై పార్లమెంటు బుధవారం అట్టుడికిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుని ముడుపుల వ్యవహారంపై ప్రతిపక్షాలు సృష్టించిన రభసతో ఉభయ సభలు దద్దరిల్లాయి. తృణమూల్ నేతలు ముడుపులు తీసుకున్న టేపులపై విచారణ చేపట్టాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆ అంశాన్ని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీకి అప్పగించారు. ముడుపులు తీసుకున్న అంశంపై విచారణ అనంతరం ఈ కమిటీ నివేదికను ఇస్తుందని స్పీకర్ తెలిపారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ నిరసనకు దిగింది. కనీస తీర్మానం లేకుండా ఏక పక్షంగా నిర్ణయం తీసుకున్నారని ఇది అన్యాయమని సీనియర్ తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సౌగత్ రాయ్ ఆరోపించారు. ఈ సందర్భంగా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. అయితే గతంలో కూడా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని స్పీకర్ వివరణ ఇచ్చారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే స్పీకర్ కమిటీని సభలో ప్రకటించారు. బీజేపీ సీనియర్ నేత అద్వానీ అద్వానీ నేతృత్వంలో అర్జున్ మేఘ్వాల్, కరియా ముండా (బీజేపీ), బి మహతాబ్ (బిజూ జనతా దళ్), నినాంగ్ ఎరింగ్ (కాంగ్రెస్), అక్షయ్ యాదవ్ (సమాజ్‌వాదీ పార్టీ) తదితర 15 మంది సభ్యులతో ఎథిక్స్ కమిటీ కమిటీని ఏర్పాటు చేశారు. బీజేపీ సీనియర్ అద్వానీ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీపై నమ్మకముందని, తమకు న్యాయ జరుగుతుందన్న విశ్వాసాన్ని రాయ్ వ్యక్తం చేశారు. కాగా పశ్చిమబెంగాల్ కు చెందిన టీఎంసీ మంత్రులు, ఎంపీలు కొందరు ఓ ప్రైవేటు కంపెనీ దగ్గర పనుల కోసం ముడుపులు తీసుకుంటూ రహస్య కెమెరాకు చిక్కిన వ్యవహారం బెంగాల్లో, ఢిల్లీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. -
'నా మనసులో మాట చెప్పడం ఇష్టంలేదు'
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హంతకుల విడుదల కోరుతూ తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖపై వ్యాఖ్యానించడానికి, రాజీవ్ కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిరాకరించారు. దీనిపై ఏం చేయాలో కేంద్రమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆ అంశంపై తానేమీ చెప్పలేనన్నారు. దీనిపై గురువారం స్పందించిన రాహుల్ దీనిపై తన మనసులోని మాటను బయటపెట్టడం తనకు ఇష్టం లేదన్నారు. అయితే తమిళనాడు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాజీవ్ దోషులను విడుదల చేస్తే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదని లోకసభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే గురువారం పార్లమెంట్లో అన్నారు. ఇలాంటి చర్యల వల్ల దేశ ఐక్యతకే భంగం కలిగే ప్రమాదం ఉందన్నారు. తమిళనాడు రాసిన లేఖను కేంద్ర హోంశాఖ బయటపెట్టడం శోచనీయమన్నారు. కాగా తమిళనాడు రాసిన లేఖను పరిశీలిస్తున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సభలో తెలిపారు. ఈ కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో ఏడుగురు నిందితులను విడుదల చేసే విషయంలో, కేంద్రం అనుమతి కావాలంటూ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. -
ఎక్కడి ‘రేట్లు’ అక్కడే..!
ఆర్బీఐ పరపతి విధాన సమీక్షలో నిర్ణయం రెపో రేటు 6.75 శాతం, రివర్స్ రెపో 5.75 శాతం, సీఆర్ఆర్ 4 శాతంగా కొనసాగింపు ద్రవ్యోల్బణం పెరుగుదల అంచనాలే కారణం... అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు కూడా.. ముంబై: ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈసారి అందరి అంచనాలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం నిర్వహించిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో కీలక పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకుతుండటం.. ఈ నెలలో జరిగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షలో దశాబ్దకాలం తర్వాత వడ్డీరేట్లను పెంచవచ్చన్న వాదనలు బలపడుతుండటం ఆర్బీఐ తాజా నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచాయి. అయితే, పరిస్థితులనుబట్టి తగిన సమయంలో రేట్ల తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తామని, ద్రవ్యోల్బణం కట్టడిలో ఉన్నంతవరకూ తాము సరళ విధానాన్నే అనుసరిస్తామని గవర్నర్ రాజన్ చెప్పారు. అంతేకాకుండా.. ఆర్బీఐ ఇప్పటివరకూ అందించిన రెపో రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు ఇంకా పూర్తిగా తమ ఖాతాదారులకు బదలాయించాల్సి ఉందని కూడా ఆయన బ్యాంకర్లకు తేల్చిచెప్పారు. బ్యాంకుల వడ్డీరేట్ల మార్పులకు ప్రామాణికమైన రెపో రేటు 6.75 శాతంలో ఆర్బీఐ ఈసారి ఎలాంటీ మార్పూ చేయలేదు. దీంతో ముడిపడిన రివర్స్ రెపో రేటు ఇప్పుడ్నున్నట్లే 5.75 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4 శాతంగానే కొనసాగనుంది. ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపో రేటును 1.25 శాతం తగ్గించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్‌లో జరిగిన సమీక్షలో అనూహ్యంగా అర శాతం రెపో కోతతో రాజన్ అందరినీ ఆశ్చర్యపరిచారు కూడా. ఇక ఫెడ్ పాలసీపైనే దృష్టి... ఆర్బీఐ తాజా సమీక్షలో తీసుకున్న నిర్ణయం సరైన దిశలోనే ఉందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అయితే, ఈ నెల 16న అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయం ఆధారంగానే వడ్డీరేట్లపై ఆర్బీఐ తదుపరి చర్యలు ఆధారపడిఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం, మెరుగైన ఉద్యోగ గణాంకాల నేపథ్యంలో ఫెడ్ వడ్డీరేట్ల పెంపు మొదలవుతుందన్న వాదనలు బలంగా వినబడుతున్నాయి. దీంతో మన క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ పెట్టుబడులు వెనక్కివెళ్లిపోయే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనలు నెలకొన్నాయి. మరోపక్క, అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి(5 శాతం) ఎగబాకిన నేపథ్యంలో ద్రవ్యోల్బణం గణాంకాలను కూడా ఇకపై ఆర్బీఐ నిశితంగా గమనిస్తుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.ప్రధానంగా ఆహారోత్పత్తుల ధరలు పెరగడం ఆర్బీఐని ఆందోళనకు గురిచేస్తోందనేది వారి అభిప్రాయం. పాలసీలో ఇతర ముఖ్యాంశాలు... ప్రస్తుత 2015-16 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7.4 శాతంగా ఉండొచ్చు. వ్యవసాయ రంగంలో మందగమన ధోరణి ఉంది. రుతుపవన వర్షపాతంలో కొరత కారణంగా ఖరీఫ్, రబీ దిగుబడి అంచనాలపై ప్రభావం ఉంటుంది. రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఏడాది జనవరినాటికి 6 శాతంగా, 2017 జనవరినాటికి 5 శాతంగా ఉండొచ్చు. గత రెండు నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగబాకిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది(అక్టోబర్‌లో 5 శాతం). బ్యాంకుల మొండిబకాయిల సమస్య తగ్గుముఖం పడితే తాజా రుణాలకు మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయి. చిన్న మొత్తాల పొదుపు రేట్లను మార్కెట్ వడ్డీరేట్ల (డిపాజిట్ రేట్లు)తో అనుసంధానించడంపై సమాలోచనలు జరుగుతున్నాయి. తదుపరి పాలసీ సమీక్ష వచ్చే ఏడాది ఫిబ్రవరి 2న జరుగుతుంది. రుణ రేట్లు మరింత తగ్గాల్సిందే.. బ్యాంకులకు ఆర్బీఐ గవర్నర్ రాజన్ స్పష్టీకరణ ఈ ఏడాదిలో ఆర్బీఐ రెపో రేటును 1.25 శాతం తగ్గిస్తే.. బ్యాంకులు మాత్రం ఇందులో సగాన్ని(0.6 శాతం) మాత్రమే బదలాయించాయని ఆర్బీఐ గవర్నర్ మరోసారి బ్యాంకర్లకు హెచ్చరిక స్వరాన్ని వినిపించారు. బ్యాంకులు తమ రుణ రేట్లను మరింత తగ్గించేందుకు ఆస్కారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ బాటలో కొనసాగుతోందన్న స్పష్టమైన సంకేతాలు కనబడుతున్నాయని కూడా రాజన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రికవరీ ఇంకా ప్రారంభస్థాయిలోనే ఉన్నందున.. ఈ ఏడాది తమ జీడీపీ అంచనా(7.4 శాతం)లో మార్పులు చేయడం లేదని రాజన్ చెప్పారు. తొలి త్రైమాసికంలో వృద్ధి 7 శాతంగా ఉంది. బ్యాంకుల మొండిబకాయిల(ఎన్పీఏ) సమస్యను తగ్గించేందుకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయని... 2017కల్లా బ్యాంకుల ఎన్పీఏలు దిగొచ్చేందుకు ఆస్కారం ఉందన్నారు. ఎన్పీఏల కట్టడికి బ్యాంకులకు మరిన్ని అధికారాలను ఇస్తున్న విషయాన్ని రాజన్ గుర్తు చేశారు. ఇక ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపును అమలు చేయడం ప్రభుత్వానికి కష్టతరమైన అంశమేనని, అయితే, అసాధ్యమేమీ కాదన్నారు. దీనివల్ల ద్రవ్యలోటు తగ్గింపు లక్ష్యానికి ఇబ్బందులేవీ ఉండబోవన్నారు. ఆదాయాలను పెంచుకోవడం లేదా, వ్యయాల కోత ద్వారా ఈ అదనపు వ్యయాన్ని ప్రభుత్వం సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని రాజన్ పేర్కొన్నారు. బ్యాంకర్ల ‘తగ్గింపు’ స్వరం... బేస్ రేటు లెక్కింపునకు కొత్త విధానం తీసుకొస్తుండటం... రెపో కోత ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదలాయించాల్సిందేనంటూ రాజన్ హెచ్చరికల నేపథ్యంలో బ్యాంకర్లు స్వరం మార్చారు. ఈ దిశగా అడుగులు వేసేందుకు సమాయత్తమవుతున్నారు. రానున్న రోజుల్లో రుణ రేట్ల కోత ఉంటుందన్న సంకేతాలిచ్చారు. ఆర్బీఐ పాలసీ నిర్ణయం తమ అంచనాల మేరకే ఉందని పేర్కొన్నారు. తాజా పాలసీ నిర్ణయం, వ్యాఖ్యలు చూస్తుంటే ఆర్బీఐ సరళ పాలసీ విధానానికి అద్దంపడుతున్నాయి. అవసరమైన సమయంలో రేట్లు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామన్న గవర్నర్ రఘురామ్ రాజన్ సంకేతాలు ఆర్థిక వ్యవస్థకు సానుకూలాంశం. ఆర్బీఐ ప్రవేశపెట్టనున్న కొత్త బేస్ రేటు విధానాన్ని పూర్తిగా పరిశీలించి తగిన చర్యలు చేపడతాం’. - అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ మా అంచనాలకు అనుగుణంగానే ఆర్బీఐ పాలసీ నిర్ణయం వెలువడింది. ఇప్పటివరకూ తీసుకున్న పాలసీపరమైన చర్యల ప్రభావం డిపాజిట్ రేట్ల(బ్యాంక్ నిధుల సమీకరణ వ్యయం)లో ప్రతిబింబించింది. దీంతో రుణాలపై వడ్డీరేట్లు మరింతగా తగ్గుతాయని భావిస్తున్నా. - చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్ చిన్న మొత్తాల పొదుపు రేట్లు మార్కెట్ వడ్డీరేట్లతో సమాన స్థాయికి వస్తే... బ్యాంకుల డిపాజిట్ రేట్లను మరింతగా తగ్గించేందుకు దోహదం చేస్తుంది. దీనివల్ల నిధుల సమీకరణ వ్యయం తగ్గుతుంది. అంతిమంగా రుణాలపై వడ్డీరేట్లను కూడా ఇంకా తగ్గుముఖం పడతాయి. - చంద్రశేఖర్ ఘోష్, బంధన్ బ్యాంక్ సీఎండీ ఇర బ్యాంకులే తగ్గించాలి: కార్పొరేట్ ఇండియా ఆర్బీఐ రెపో కోత పూర్తి ప్రయోజనాన్ని బ్యాంకులు కస్టమర్లకు బదలాయించాల్సిందేనని... రుణాలపై వడ్డీరేట్లను మరింతగా తగ్గించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నాయి. ‘ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ను పెంచేలా చేయాలంటే.. అటు ఇన్వెస్టర్లు, ఇటు వినియోగదార్లు అందరికీ రుణ రేట్లను మరింతగా తగ్గించాల్సి ఉందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ ఎ.దీదార్ సింగ్ వ్యాఖ్యానించారు. రుతుపవన వర్షాలు తగినంతగా లేకపోవడంతో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ బలహీనంగా ఉండటం ఆందోళన కలిగిస్తోందని ఆయన చెప్పారు. ‘ఇప్పుడు ఆర్బీఐ పాలసీ రేట్ల కోతను రుణాలపై రేట్ల తగ్గింపునకు బదలాయించడంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాల్సి ఉంది. పుంజుకుంటున్న రుణ వృద్ధికి అనుగుణంగా నిధులను అందించడానికి బ్యాంకులు సిద్ధంగా ఉండాలి. అధిక మొండిబకాయిల ప్రభావంతో రుణాలివ్వడానికి బ్యాంకులు వెనకడుగు వేయకుండా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలి’ అని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వ్యాఖ్యానించారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండేలా చూడాల్సిన బాధ్యత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉందని అసోచామ్ ప్రెసిడెంట్ సునిల్ కనోరియా అభిప్రాయపడ్డారు. బేస్ రేటుకు కొత్త మార్గదర్శకాలు వస్తున్నాయ్... బ్యాంకుల కనీస రుణ రేటు(బేస్ రేటు) లెక్కింపు విధానానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఈ వారంలోనే విడుదల చేయనున్నట్లు ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ చెప్పారు. ఇప్పుడున్న యావరేజ్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ స్థానంలో మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ ఆధారంగా బేస్ రేటును నిర్ణయించే విధంగా కొత్త విధానం ఉంటుందన్నారు. దీనివల్ల పాలసీ రేట్ల మార్పులకు అనుగుణంగా బ్యాంకులు తమ వడ్డీరేట్లలో వెంటనే దీన్ని అమలు చేయడానికి వీలవుతుందని చెప్పారు. ఇటీవలి కాలంలో రెపో రేటును భారీగానే తగ్గించినప్పటికీ.. ఈ ప్రయోజనంలో సగాన్ని మాత్రమే బ్యాంకులు కస్టమర్లకు బదలాయించిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ కొత్త విధానానికి తెరతీస్తోంది. అయితే, దేశీ మార్కెట్లో డిపాజిట్ల సమీకరణ వ్యయం ఇంకా అధికంగానే ఉన్న తరుణంలో ఇది తగిన విధానం కాదని బ్యాంకర్లు వాదిస్తున్నారు. మరోపక్క, 1-3 ఏళ్ల వ్యవధిగల డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా తగ్గించాయని.. ఈ స్థాయిలో బేస్ రేటును మాత్రం తగ్గించలేదంటూ రాజన్ గుర్తుచేశారు. రుణ రేట్లను మరింత తగ్గించాల్సిందేనని తేల్చిచెప్పారు. -
పాక్‌తో సిరీస్ గురించి త్వరలో చెబుతాం
బీసీసీఐ ప్రకటన మేమైతే భారత్‌కు రాము: పీసీబీ న్యూఢిల్లీ: భారత్‌లో క్రికెట్ సిరీస్ ఆడేందుకు ఎట్టి పరిస్థితిలోనూ వచ్చేది లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్పష్టం చేసింది. మరోవైపు భద్రతా కారణాలరీత్యా తమ జట్టు భారత్‌లో పర్యటించేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వాస్తవానికి ఇది పాక్ హోం సిరీస్ కాబట్టి యూఏఈలో జరగాల్సి ఉన్నా అక్కడికి వెళ్లేందుకు భారత్ ఆసక్తి చూపడం లేదు. ‘మా ప్రభుత్వ అనుమతి లేకుండా భారత్‌కు వెళ్లి ఆడలేం. అక్కడ మా జట్టు భద్రతపై ప్రభుత్వం ఆందోళన వెలిబుచ్చింది. యూఏఈలో ఇంతకుముందు ఐపీఎల్ జరిగింది. ఇప్పుడు అక్కడ ఆడేందుకు బీసీసీఐ ఎందుకు నిరాకరిస్తుందో అర్థం కావడం లేదు’ అని పీసీబీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చీఫ్ నజమ్ సేథీ తెలిపారు. ముంబై: వచ్చే నెలలో జరగాల్సిన భారత్, పాక్ క్రికెట్ సిరీస్‌పై ఓ స్పష్టత వచ్చేందుకు అభిమానులు మరి కొద్ది రోజులు వేచి చూడాలని బీసీసీఐ పేర్కొంటోంది. ‘పాక్‌తో సిరీస్ ఉంటుందా? లేదా? అనే విషయంపై మరో నాలుగైదు రోజులు వేచి చూడండి’ అని బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బదులిచ్చారు. ఇదిలావుండగా బోర్డు సభ్యుల కార్యకలాపాలపై రహస్యంగా విచారించేందుకు గత పాలకులు బ్రిటిష్ ఏజెన్సీని నియమించుకున్నారనే ఆరోపణలపై ఇద్దరు సభ్యల కమిటీ విచారణ ప్రారంభించింది. ‘అజయ్ షిర్కే, గోకరాజు గంగరాజులతో కూడిన కమిటీ గురువారం సంజయ్ పటేల్, అనిరుధ్ చౌధురిని కలిసి కొన్ని వివరాలు అడిగారు. సమాధానం ఇచ్చేందుకు కొంత సమయమివ్వాలని వారు కోరారు. ఈ విచారణ పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుంది’ అని ఠాకూర్ అన్నారు. ‘చెన్నై వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు’ ఐసీసీ టి20 ప్రపంచకప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో చెన్నైలోని చిదంబరం స్టేడియంపై ఇంకా ఓ నిర్ణయం తీసుకోలేదని బీసీసీఐ పేర్కొంది. ‘ఈ అంశంపై పూర్తిగా చర్చించాం. ఆ స్టేడియం విషయంలో కొన్ని సమస్యలున్నాయి. లంక ఆటగాళ్లు అక్కడ ఆడలేరు. మూడు స్టాండ్స్‌కు అనుమతి లేదు. ఇవి పరిష్కారం కావాల్సి ఉంది. అయితే ఇప్పటికైతే ఆ వేదికను తప్పించలేదు’ అని ఠాకూర్ తెలిపారు. -
'అగ్రిగోల్డ్' బాధితులకు రెండు నెలల్లో నగదు!
-
అగ్రిగోల్డ్ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
-
‘సత్యం’ బెయిల్‌పై 11న నిర్ణయం
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో దోషుల అప్పీళ్లపై విచారణ పూర్తయ్యే వరకు ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసి బెయిల్ ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై తీర్పు ఈ నెల 11కు వాయిదా పడింది. శిక్ష అమలును నిలిపివేయాలని, జరిమానా కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నందున దాని నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో రామలింగరాజు సహా ఇతర దోషుల తరఫు న్యాయవాదులు ఇప్పటికే వాదనలు వినిపించారు. దీనిపై శుక్రవారమే తన నిర్ణయాన్ని వెలువరిస్తామని జడ్జి చెప్పినప్పటికీ తీర్పు ప్రతి సిద్ధంకాకపోవడంతో కేసును వాయిదా వేశారు. -
మృదువర్షిణి.. గీతమారాలి
తండ్రి మరణం.. ఆర్థికంగా చితికిన కుటుంబం.. భారమైన జీవితం.. ప్రతిభ ఉన్నా అడ్డొచ్చిన పేదరికం.. వెరసి ఆ చిన్నారి చదువుకు అర్ధాంతరంగా స్వస్తి పలికింది. పుస్తకాలు, పెన్నులు పట్టాల్సిన అమ్మారుు.. తరతరాలుగా వస్తున్న కల్లుగీత వృత్తిని ఎంచుకుని కత్తులు, మోకులు పట్టుకుంది. మొక్కవోని ధైర్యంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని కుటుంబానికి అండగా నిలిచింది. ముకరంపుర: మంథని మండలం దుబ్బపల్లి గ్రామానికి చెందిన పెరుమాళ్ల మృదువర్షిణి 15 ఏళ్ల వయస్సులో తాటి చెట్లు ఎక్కి కల్లుగీస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వర్షిణి తండ్రి నర్సింహస్వామి 2006లో విద్యుత్ ప్రమాదానికి గురై మరణించారు. తల్లి శివకుమారి అనారోగ్యంతో బాధపడుతోంది. సోదరుడు చిన్నవాడు కావడం తో కుటుంబ బాధ్యతలను మృదువర్షిణి స్వీకరించింది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న బాలిక చిన్ననాటి నుంచి చదువుల్లో ముందుంది. తొమ్మిదో తరగతిలో 590 మార్కులు సాధించింది ప్రతిభ చాటుకుంది. ఉన్నతవిద్య అభ్యసించి ఉద్యోగం చేయూలనే ఆశ ఉన్నా.. కుటుంబ పోషణకు పదవ తరగతి మధ్యలోనే చదువు ఆపేసింది. తన చిన్నాన కొడుకు సతీష్ సమకూర్చిన తాటిచెట్లను సులభంగా ఎక్కే యంత్రం సహా యంతో ఆమె కులవృత్తిని చేపట్టింది. మృదువర్షిణి దీనగాథ తెలుసుకున్న తెలంగాణ గౌడ సంఘం ఆదుకునేం దుకు ముందుకు వచ్చింది. శుక్రవారం సంఘం రాష్ట్ర అ ధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్ హైదరాబాద్ నుంచి దు బ్బపల్లికి చేరుకుని తాత్కాలిక సహాయం కింద రూ.10 వేలు అందించారు. ఉన్నత చదవులు చదివించేందుకు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని గౌడసంఘం వసతిగృహంలో ఉచిత ప్రవేశం కల్పిస్తామన్నారు. ఆయన వెంట గౌడసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులి లక్ష్మీపతిగౌడ్, జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణగౌడ్, నాయకులు వంగ లక్ష్మీపతిగౌడ్, ముంజ సతీష్‌గౌడ్ ఉన్నారు. దీనస్థితిలో ఉన్న మృదువర్షిణి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వారు కోరారు. -
కశ్మీర్లో సుస్థిర ప్రభుత్వమే లక్ష్యం
గవర్నర్‌తో కమలనాథుల భేటీ మరింత గడువు కావాలని వినతి జమ్మూ: జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వం ఏర్పాటుకు ముమ్మర యత్నాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటులో బీజేపీతో దోస్తీకి తాము విముఖంకాదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) బుధవారం సూచనప్రాయంగా ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ ప్రతినిధి బృందం గురువారం జమ్మూలో గవర్నర్ ఎన్ఎన్ వోహ్రాను కలుసుకుంది. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుపై పార్టీలతో సంప్రదింపులకోసం తమకు మరింత గడువుకావాలని గవర్నర్‌ను కోరింది. జమ్మూ ప్రాంతానికి చెందిన నేత ముఖ్యమంత్రి కావాలన్న అంశంపై వెనక్కు తగనున్నట్టు కూడా ఆ పార్టీ సూచనప్రాయంగా తెలిపింది. ప్రభుత్వం ఏర్పాటుకు ఈ నెల 19వరకే గవర్నర్ గడువు విధించినా, బీజేపీ ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోబోదని, వివిధ పార్టీలతో తమ చర్చలు సాగుతున్నాయని, ప్రభుత్వం ఏర్పాటుపై త్వరలోనే ప్రజలకు శుభవార్త అందుతుందని గవర్నర్‌తో భేటీ అనంతరం బీజేపీ జమ్మూ కశ్మీర్ విభాగం అధ్యక్షుడు జుగల్ కిశోర్ శర్మ చెప్పారు. సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకోసమే బీజేపీ కృషిచేస్తుందని, ఇతర పార్టీలతో చర్చల ఫలితాలు వెల్లడయ్యేందుకు మరింత గడువు కావాలని గవర్నర్‌ను కోరామన్నారు. -
అన్ని అనుమతులుంటేనే ప్రవేశాలు
డీఎడ్ కాలేజీలపై రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని అనుమతులు ఉన్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈ ఎల్ఈడీ) కాలేజీల్లోనే ప్రవేశాలకు అనుమతి ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు అందజేసిన కాలేజీలనే ఈనెల 7 నుంచి నిర్వహించే కౌన్సెలింగ్‌కు అనుమతించనున్నారు. పాఠశాల విద్యా కమిషనర్ జగదీశ్వర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో 258 డీఈఎల్ఈడీ కాలేజీలు ఉండగా వాటిల్లో ఇప్పటివరకు 78 కాలేజీలు మాత్రమే ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్లు అందజేశాయి. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ తేదీ నాటికి సర్టిఫికెట్లను తీసుకువచ్చిన కాలేజీలను జాబితాలో చేర్చుతామని విద్యా శాఖ ఇప్పటికే ప్రకటించింది. నిర్ణీత గడువులోగా సర్టిఫికెట్లు తీసుకురాని కాలేజీలు, ఆ తరువాత తీసుకువస్తే రెండో విడత కౌన్సెలింగ్‌కు అనుమతించే అవకా శం ఉంది. మరోవైపు మైనారిటీ కాలేజీలు సొం తం గా ప్రవేశాలు(ఎస్డబ్ల్యూ-2) చేపట్టాలంటే, ఆ కాలేజీలు అన్నీ కన్సార్షియంగా ఏర్పడితే ఓ కన్వీనర్‌ను నియమిస్తారు. ఆ కన్వీనర్ నేతృత్వంలో ప్రవేశాలు చేపడతారు. అయితే రాష్ట్రంలోని అన్ని మైనారిటీ కాలేజీలు కలసి రానందున, వాటిని సాధారణ కౌన్సెలింగ్ జాబితాలోనే చేర్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబరు 1 ప్రకారం మైనారిటీ కాలేజీగా గుర్తింపు రావాలంటే రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ సర్టిఫికెట్ ఇవ్వాలి. కాని రాష్ట్రం లోని నాలుగైదు కాలేజీలు మినహా మిగతా కాలేజీలన్నీ జాతీయ మైనారిటీ కమిషన్ నుంచి మైనారిటీ హోదా సర్టిఫికెట్లు తెచ్చి పెట్టాయి. అయితే జాతీయ మైనారిటీ కమిషన్ ఇచ్చిన సర్టిఫికెట్లను దాఖలు చేసిన కాలేజీలను మైనారిటీ కాలేజీలుగా గుర్తించరాదని విద్యాశాఖ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. -
మిషన్ కాకతీయకు బడా కాంట్రాక్టర్ల గండం
భారీగా చెరువు పనులు దక్కించుకునేందుకు యత్నాలు వివిధ వర్గాల నుంచి సర్కార్‌కు ఫిర్యాదులు క్లాస్-5 కాంట్రాక్టర్ల అర్హతను రూ.50 లక్షలకు పెంచాలని ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: నీటిపారుదల శాఖలో బడా కాంట్రాక్టర్లంతా ‘మిషన్ కాకతీయ’ కోసం రింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. చిన్న కాంట్రాక్టర్లకు పనులేవీ దక్కకుండా తామే మొత్తం పనులు చేజిక్కించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. దీంతో ఈ వ్యూహానికి విరుగుడును ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా సీ-5 కాంట్రాక్టర్ల టెండర్ అర్హతను ఇప్పుడున్న పదిలక్షల రూపాయల వరకే పనిచేసే స్థాయి నుంచిరూ.50 లక్షల వరకు పెంచడానికి సిద్ధమైంది. కాంట్రాక్టర్లు రింగ్ కాకుండా ఉండేం దుకు, ఒక్కో కాంట్రాక్టరు వేసే టెండర్ల సంఖ్యపై పరిమితి విధించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. రూ.రెండు వేల కోట్లతో చెరువుల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం తొలి దశలో 600 చెరువులకు రూ.230 కోట్ల అంచనాతో పనులు ప్రారంభించనుంది. జనవరి మొదటివారం నుంచి టెండర్లు పిలిచి, రెండోవారం నుంచి పనులు ప్రారంభించేలా ప్రణాళికలు వేస్తోంది. మరోవైపు ఒకే జిల్లాలోని అరవై నుంచి డెభ్భై చెరువుల పనులు చేజిక్కించుకోవడం కోసం, ఇతరులెవరూ పోటీకి రాకుండా చూసేందుకు బడా కాంట్రాక్టర్లు కొద్దిమంది సిండికేట్ అవుతున్నట్టు ప్రభుత్వానికి వివిధ వర్గాల నుంచి సమాచారం అందింది. పనులు దక్కించుకునే బడా కాంట్రాక్టర్లు గరిష్టం, కనిష్ట విలువకు టెండర్లు ఒక్కరే దాఖలు చేసి, మధ్యలో ఉన్న వారిని పక్కకు తప్పించేలా చేయడం వీరి వ్యూహంలో భాగమని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే కాంట్రాక్టర్ల అర్హతా ప్రమాణాలను సవరించాలని, క్లాస్-5 కాంట్రాక్టర్ల అర్హతా ప్రమాణాల్ని సడలించి టెండర్లు దాఖలు చేయడానికి అర్హత కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రకంగా స్థానిక కాంట్రాక్టర్లందరికీ పనులు దక్కే విధంగా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం చిన్న నీటి పారుదల శాఖపై సమీక్షించనున్న మంత్రి టి.హరీశ్‌రావు ఈ విషయం చర్చించనున్నట్టు తెలిసింది. -
జల విద్యుత్ ప్రాజెక్టులపై కేంద్రం పర్యవేక్షణ
కృష్ణా, గోదావరి నదీ బోర్డుల్లో విద్యుత్ ఇంజనీర్లను సభ్యులుగా నియమించాలని కేంద్రం నిర్ణయం రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదాలకు పరిష్కారం చూపే దిశగా చర్యలు గోదావరి బోర్డులో సభ్యునిగా పట్నాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు త్వరలో కృష్ణాబోర్డులోనూ సభ్యుడి నియామకం సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి నదీ జలాలపై ఆధారపడిన విద్యుత్ ప్రాజెక్టులపై నిరంతర పర్యవేక్షణకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగిం చింది. జల విద్యుత్ వాటాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నిత్యకృత్యం గా మారిన వివాదాలకు పరిష్కారం చూపే దిశ గా తొలి అడుగు వేసింది. ప్రాజెక్టుల నీటి విని యోగంతో జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి, విని యోగం, వాటాల సక్రమ పంపిణీ బాధ్యతలను చూసేందుకు కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిలో ప్రత్యేకంగా విద్యుత్ ఇంజ నీర్లను సభ్యులుగా నియమించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు సీనియర్ అధికారి బి.పట్నాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణా బోర్డులో సైతం త్వరలోనే సభ్యుడిని నియమిస్తామని మౌఖికం గా తెలియజేసింది. ఇప్పటికే బోర్డుల పరిధిలో ఉన్న చైర్మన్, సభ్య కార్యదర్శులతో పాటు విద్యుత్‌రంగ సభ్యుడు సైతం బోర్డు సమావేశాల్లో తీసుకునే కీలక నిర్ణయాల్లో భాగంకానున్నారు. నిత్యం కీచులాటలే..: గోదావరి బేసిన్లో ఉన్న ఎగువ, దిగువ సీలేరు, కృష్ణా జలాలపై ఆధారపడ్డ శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో జల విద్యుదుత్పత్తి విషయమై రెండు రాష్ట్రాలు నిత్యం కీచులాడుతూనే ఉన్నాయి. సీలేరులో 700 మెగావాట్లు, శ్రీశైలంలో విద్యుదుత్పత్తి కోసం నీటి వాడకం వివాదాలపై బోర్డు స్వయం గా కలగజేసుకున్నా ఇంతవరకు ఎలాంటి ఫలి తం రాలేదు. దీంతో రెండు రాష్ట్రాలు కేంద్రమే ప రిష్కరించాలని కోరాయి. సీలేరులో ఏపీ విద్యుదుత్పత్తి చేస్తున్నా వాటి వివరాలేవీ బయటకు వెల్లడించడం లేదు. దీనిపై బోర్డు కలుగజేసుకొని స్వయంగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ ను సంప్రదించినా వివాదానికి తెరపడలేదు. శ్రీశైలంపై వాదోపవాదాలు..: ఇక శ్రీశైలం లో నీటి వాడకంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 554 అడుగులేనని, అంతకు మంచి విద్యుత్ అవసరాలకు వాడుకోవడానికి వీలులేదని ఏపీ అభ్యంతరం తెలుపుతుండగా, గతంలోని జీవోల ఆధారంగా తమకు 534 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం ఉందని తెలంగాణ గట్టిగా చెబుతోంది. సాగర్‌పైనా ఇరు రాష్ట్రాల మధ్య వివాదమే సాగుతోంది. వరుస వివాదాలు, ఫిర్యాదులపై బోర్డు తీసుకున్న చొరవ ఏమాత్రం ఫలించలేదు. సీలేరు వివాదంలో స్వయంగా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ చైర్మన్ నీరజా మాథూర్ కల్పిం చుకొని నివేదిక కోరినా ఏపీనుంచి స్పందన లేని కారణంగా అది సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో జల విద్యుదుత్పత్తిపై నిరంతర పర్యవేక్షణ, ని యంత్రణ ఉండేలా చూసేందుకు కొత్తగా విద్యు త్రంగ సీనియర్ ఇంజనీర్ని నియమించాలని కేంద్ర ప్రాధికార సంస్థ కేంద్ర విద్యుత్ శాఖను కోరింది. దీనికి కేంద్ర జల సంఘం అంగీకారం తెలుపడంతో కేంద్ర విద్యుత్ శాఖ, నదీ యాజ మాన్య బోర్డుల్లో విద్యుత్ అనుబంధ సభ్యుల నియామకాలకు ఒకే చెప్పింది. దీనిలో భాగంగా గోదావరి బోర్డులో పట్నాయక్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా, త్వరలోనే కృష్ణా బోర్డులో సైతం సభ్యుడి నియామకం ఉంటుందని నీటి పారుదల అధికారులకు సమాచారం పంపింది. -
సొమ్ము కట్టినా... ఇసుక రాదు!
అమలు కాని ప్రభుత్వ నిర్ణయం కానరాని రవాణా ఇబ్బంది పడుతున్న ప్రజలు డీఆర్డీఏకు కొత్త తలనొప్పులు వెంకోజీపాలెం : ఇసుక విక్రయ బాధ్యతలు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)కు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. మీసేవ కేంద్రాలలో సొమ్ము చెలిస్తే ఇంటికే ఇసుక పంపిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన ఆర్భాటమేనని తేలిపోయింది. ఇసుక రవాణా బాధ్యత ఎవరిదన్నది శేష ప్రశ్నగానే మిగిలిపోతోంది. లారీలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సొమ్ము ఇస్తుందన్న గ్యారంటీ లేకపోవడంతో ఏమిచేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఇసుక రీచ్‌లను పొదుపు సంఘాలకు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ మేరకు చీడికాడ మండలం కోనాం, వి.మాడుగుల మండలం సాగరం, మాకవరపాలెంలోని జి.కోడూరు, యలమంచిలిలోని ఏటికొప్పాక, కోటవురట్లలోని పందూరు ప్రాంతాలలో ఐదు రీచ్ నుంచి కొద్దినెలలుగా ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. మొదట్లో ప్రభుత్వ పనుల కోసమే ఇసుక విక్రయించారు. ప్రజలు, బిల్డర్ల అవసరాల దృష్ట్యా కొన్నాళ్లుగా అందరికీ ఇసుక విక్రయిస్తున్నారు. క్యూబిక్ మీటర్‌కు రూ.500 వంతున మీసేవ కేంద్రాలలో రుసుం వసూలు చేస్తున్నారు. సర్వీస్ చార్జీల కింద మరో రూ.25 చెల్లించాల్సి ఉంది. చిక్కంతా ఇసుక రవాణా వద్దే ఎదురవుతోంది. సొమ్ము కట్టినవారంతా తమ ఇంటికి ఇసుకను ఎప్పుడు పంపుతారని ప్రశ్నిస్తుండడంతో మీసేవ నిర్వాహకులు, డీఆర్డీఏ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ విషయమై ఇప్పటికే మీసేవ అధికారులు డీఆర్డీఏ ప్రాజెక్ట్ డెరైక్టర్ వి.సత్యసాయి శ్రీనివాస్‌తో చర్చించారు. ప్రస్తుతం ఇసుక రవాణా విషయమై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. ఒక ట్రాక్టర్లో 3 క్యూబిక్ మీటర్లు, క్వారీ లారీలో 9 క్యూబిక్‌మీటర్ల ఇసుక రవాణా చేసే అవకాశం ఉంది. ఇప్పటివరకు 3 వేల క్యూబిక్ మీటర్ల ఇసుక విక్రయాలతో పొదుపు సంఘాలకు రూ.10 లక్షల వరకు ఆదాయం సమకూరింది. ప్రస్తుతం సాగరంలో 110, కోడూరులో 16,250, ఏటికొప్పాకలో 7920, పందూరులో 4320 క్యూబిక్ మీటర్ల వంతన ఇసుక అందుబాటులో ఉంది. మూడేళ్లుగా విశాఖ నగరం, జిల్లాలో నిర్మాణ అవసరాలకు ఇసుకను శ్రీకాకుళం లేదా రాజమండ్రి నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దూరం ఎక్కువ కావడంతో రవాణా చార్జీలు తడిసిమోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో ఇసుక అందుబాటులోకి వచ్చినా రవాణా సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇసుక వున్నా దొరకని దుస్థితి నెలకొంది. కొంతమంది శ్రీకాకుళం, రాజమండ్రిలలో ఇసుక కోసం సొమ్ము చెల్లించడానికి మీసేవా కేంద్రాలకు వెళితే అక్కడ చుక్కెదురవుతోంది. జిల్లాలోని ఇసుక రవాణాకే దిక్కులేని పరిస్థితుల్లో అంతదూరం నుంచి ఇసుక ఎవరు తెస్తారన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం జిల్లాలో ఇసుక లభిస్తోంది. కానీ రవాణా సమస్య ఆటంకంగా ఉంది. ప్రస్తుతం ఇసుక రవాణాకు డీఆర్డీఏ వద్ద ఏర్పాట్లు లేవు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తాం. ఆయన సూచనల మేరకు నడుచుకుంటాం. - వి.సత్యసాయి శ్రీనివాస్, ప్రాజెక్ట్ డెరైక్టర్, డీఆర్డీఏ, విశాఖపట్నం -
తెలంగాణ కేబినెట్ భేటి నిర్ణయాలు!
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం పలు నిర్ణయాలను తీసుకుంది. కేబినెట్ సమావేశం తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. మైక్రో ఇరిగేషన్ కోసం 300 కోట్ల రూపాయలు కేటాయింపు చేపట్టినట్టు, ఈ పథకం కింద ఎస్సీ, ఎస్ టీ వర్గాలకు చెందిన రైతులకు 100 శాతం సబ్సీడి, చిన్న సన్నకారు రైతులకు 90 శాతం సబ్బిడీ ఉంటుందన్నారు. విజయ డెయిరీకి పాలు సరఫరా చేస్తున్న రైతులకు లీటర్ 4 రూపాయల చొప్పున ధరను పెంచినట్టు కేసీఆర్ తెలిపారు. అలాగే 1000 ఎకరాల్లో 252 కోట్ల వ్యయంతో పాలీ హౌస్ ల నిర్మాణం చేపడుతామని కేసీఆర్ వివరించారు. -
ఇంటి రుణం.. ఇలా సులభం
ఇల్లు కొనుక్కోవడమనేది చాలా కీలకమైన నిర్ణయం. ఇందులో బోలెడన్ని అంశాలు ఇమిడి ఉంటాయి. ఎలాంటిది తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి మొదలుకుని డౌన్పేమెంట్లు, రుణం సమకూర్చుకోవడం దాకా అనేక విషయాల గురించి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఇందులో అన్నింటికన్నా ముఖ్యమైనది గృహ రుణం పొందడం. ఇతరత్రా అన్నీ సిద్ధం చేసుకుని.. లోన్ కోసం దరఖాస్తు చేసుకున్నాక.. చివరికి చేతికొచ్చే దాకా సస్పెన్సే. ఎక్కడ కొర్రీ పడుతుందోనని వర్రీనే. ఇలాంటి పరిస్థితి ఎదురవకూడదంటే ఇంటి గురించి అనుకున్నాక.. ఒక అయిదారు నెలల ముందు నుంచే గృహ రుణం సమకూర్చుకోవడం కోసం సన్నాహాలు చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని సూత్రాలు పాటించాలి.. క్రెడిట్ నివేదిక... ప్రస్తుతం బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణాలు మంజూరు చేసే ముందు క్రెడిట్ హిస్టరీ.. అంటే గతంలో తీసుకున్న రుణాలు, వాటిని తిరిగి చెల్లించిన తీరు గురించి చూస్తున్నాయి. గతంలో దేనికైనా బకాయిపడినా, ఎగ్గొట్టినా, లేటుగా చెల్లించినా అందుకు సంబంధించిన వివరాలన్నీ సిబిల్ వంటి సంస్థల దగ్గర ఉంటాయి. అవి ఇచ్చిన నివేదికలు, స్కోరును బట్టి లోన్ ఇవ్వొచ్చా లేదా అన్నది బ్యాంకులు నిర్ణయం తీసుకుంటున్నాయి. కాబట్టి, బాకీలు లాంటివేమైనా ఉంటే తీర్చి.. క్రెడిట్ రిపోర్టు, స్కోరు సరిగ్గా ఉండేలా చూసుకోవడం మంచిది. క్రెడిట్ హిస్టరీ స్వయంగా తెలుసుకోవాలంటే ఆన్లైన్లో కూడా సిబిల్ నివేదికను తీసుకోవచ్చు. ఇందుకు రూ. 470 కట్టాల్సి ఉంటుంది. అలాగే, ఇతరత్రా ఈఎంఐలు ఏమైనా ఇప్పటికే కడుతున్న పక్షంలో ముందుగా వాటిని పూర్తి చేసుకోవడం కూడా ముఖ్యం. ఎందుకంటే.. మనకి ఎంత రుణం ఇవ్వాలనేది మనం ఎంత ఈఎంఐల భారం మోస్తున్నామన్నదానిపైనే ఆధారపడి ఉంటుంది. ఇతర ఈఎంఐలు ఎక్కువైన కొద్దీ మంజూరయ్యే రుణం పరిమాణం తగ్గిపోతుంది. సాధారణంగా జీతంలో ఈఎంఐల భారం 40 శాతం మించకూడదు. బ్యాంకులు ఈ అంశాన్ని కూడా పరిగణించి రుణ మొత్తంపై నిర్ణయం తీసుకుంటాయి. బ్యాంకింగ్ అలవాట్లు మెరుగుపర్చుకోవాలి.. లోన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇతర పత్రాలతో పాటు మన బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సాధారణంగా గడిచిన ఆరు నెలలు లేదా ఏడాది కాలానికి సంబంధించిన స్టేట్మెంట్ను బ్యాంకులు అడుగుతుంటాయి.మన బ్యాంకింగ్ అలవాట్లు, ఖాతాలో బ్యాలెన్స్ ఎంత ఉంచుతున్నారు మొదలైన వాటి గురించి ఈ స్టేట్మెంట్ ద్వారా తెలుస్తుంది. ఉద్యోగ స్థిరత్వం.. ఉద్యోగంలో స్థిరంగా కొనసాగుతుండటం కూడా రుణ మంజూరీలో కీలక పాత్ర పోషిస్తుంది. స్థిరం గా ఉద్యోగం చేస్తున్నారా లేక తరచూ మారిపోతున్నారా.. అలాగే కొన్నాళ్లపాటైనా ఒకే ఇంటిలో ఉంటున్నారా లేక అది కూడా మారిపోతున్నారా.. ఇలాంటివి సైతం బ్యాంకర్లు పరిశీ లిస్తారు. ఒకవేళ అలాంటేదేమైనా ఉంటే.. లోన్ విషయంలో పునరాలోచించే అవకాశం ఉంటుంది. ఇక, బ్యాంకుకు ఇవ్వాల్సిన పత్రాల విషయానికొస్తే.. సాధారణంగా వేతన జీవులైతే దరఖాస్తుతో పాటు గుర్తింపు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు, తాజా పే స్లిప్, ఫారం 16, ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్ లాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రాపర్టీకి సంబంధించిన పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. అధ్యయనం చేయండి .. సాధారణంగా ఒక్కో బ్యాంకు ఒక్కో రకంగా వడ్డీ రేటు వసూలు చేస్తుంటుంది. కనుక ఏ బ్యాంకు ఎంత వడ్డీపై ఇస్తోంది, ప్రత్యేక ఆఫర్లేమైనా ఉన్నాయా వంటి వాటిపై కాస్త అధ్యయనం చేయాలి. అప్పుడే మెరుగైన డీల్ దక్కించుకోవచ్చు. అలాగే, రుణం మంజూరు ప్రక్రియ ఎలా ఉంటుందో బ్యాంకులో తెలుసుకోవాలి. ప్రీ-అప్రూవ్డ్కి ప్రయత్నించండి.. ఇంకా ఏ ప్రాపర్టీ కొనాలన్నదీ ఇదమిత్థంగా నిర్ణయం తీసుకోకపోయినా... ప్రీ-అప్రూవ్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు ఇచ్చే వివరాలను బట్టి మీకు మంజూరు చేయబోయే రుణ మొత్తానికి బ్యాంకులు ముందస్తుగానే ఆమోదముద్ర వేస్తుంటాయి. దీంతో ఎంత మొత్తం లభిస్తుందనేది ఐడియా వస్తుంది కనుక మరికాస్త ధీమాగా ఇళ్ల వేట చేయొచ్చు. ప్రీ-అప్రూవ్డ్ను చూపించి రేటు విషయంలో బిల్డరుతో బేరమాడవచ్చు. అయితే, ప్రీ-అప్రూవ్ చేసినంత మాత్రాన అంత మొత్తాన్నీ బ్యాంకులు ఇచ్చేసే అవకాశాలూ లేవు. ఎందుకంటే.. మీరు ఎంచుకున్న ప్రాపర్టీ లేదా అది ఉన్న ప్రాంతం విషయంలో ఏవైనా సందేహాలుంటే బ్యాంకు తుది నిర్ణయం మారవచ్చు. ఇందుకే హెచ్డీఎఫ్సీ వంటి కొన్ని బ్యాంకులు తాము రుణం ఇచ్చే హౌసింగ్ ప్రాజెక్టుల వివరాలను తమ వెబ్సైట్లలో ఉంచుతున్నాయి. వాటిల్లో నుంచి నచ్చినది ఎంపిక చేసుకుంటే .. బ్యాంక్ ఎలాగూ ఆమోదించినదే కాబట్టి.. లోన్ ప్రక్రియ మరింత సులువుగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. -
మెడికల్ కౌన్సెలింగ్‌పై రేపు నిర్ణయం
తెలంగాణ సీఎస్‌తో వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి భేటీ సాక్షి, హైదరాబాద్ : ఎంబీబీఎస్ ఫీజుల పెంపు, కౌన్సెలింగ్ తేదీల ఖ రారుపై సోమవారం స్పష్టత రానుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధికారులు సమావేశమై దీనిపై అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు ఫీజుల పెంపు, కౌన్సెలింగ్ తేదీల నిర్ణయంపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. శనివారం ఇదే అంశంపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ చందా సమావేశమయ్యారు. సింగపూర్ పర్యటన ముగించుకుని సోమవారం కేసీఆర్ రాష్ట్రానికి వస్తున్నందున ఆయనతో సమావేశమైన అనంతరం కౌన్సెలింగ్ తేదీ, ఫీజుల పెంపుపై ఉత్తర్వులను వెలువరించాలని నిర్ణయించారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు నెలాఖరు వరకు కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిచేసి సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలివ్వడంతో ఆ లోగానే కౌన్సెలింగ్‌ను పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 30, 31 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి సెప్టెంబర్ 1న తరగతులు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల దరఖాస్తుల గడువు 25 దాకా పొడిగింపు విజయవాడ: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో అడ్మిషన్లకు అభ్యర్థులు ఈ నెల 25 వరకూ అప్లికేషన్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నోటిఫికేషన్ ప్రకారం వెబ్సైట్లో దరఖాస్తులు పొందడానికి 22 చివరి తేదీగా పేర్కొనగా, మరో మూడ్రోజులు పెంచుతూ ఈ నెల 25 తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తులను 26వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అందజేయాలి. వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www;//ntruhs.ap.nic.inను చూడవచ్చు. -
‘ఫీజు’కు రెండ్రోజుల్లో విధివిధానాలు: రావెల
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం త్వరలో కొత్త విధివిధానాలను ఖరారు చేయనుందని సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో జీవో జారీ చేస్తామన్నారు. మంగళవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చదువుతున్న ఏపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ర్ట ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు ముందుకు వస్తే అలాంటి వారికి ప్రభుత్వ పరంగా రూ.10 లక్షలు, బ్యాంకు గ్యారెంటీ ద్వారా మరో రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.20 లక్షలు సహాయం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో చదివే రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత కావాలని సభ్యులు పట్టుబట్టడంతో ప్రతి విద్యార్థికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. -
అనగనగా ఒక రాజు
-
'సత్యం' కేసు ఈ నెల 28కి వాయిదా
-
జైలో ? బెయిలో ?.. తేలేది నేడే!
-
రాజముద్ర
-
పని మొదలైంది!
-
నవ తెలంగాణ
-
నేడు రాజ్యసభకు టీ.బిల్లు
-
బ్యాట్ పడేశారు!
-
రాజీనామాపై కిరణ్ తర్జనభర్జన
-
తెలంగాణ.. పాస్
-
సమైక్య నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ వీధులు
-
మరింత వేడెక్కిన హస్తిన
-
నేడే చర్చ ఓటింగ్!
-
నేడు రాజినామా?
-
చర్చకొస్తే చెల్లుచీటీ
-
'రాజకీయ వ్యూహంతోనే కేజ్రీవాల్ రాజీనామా'
-
మూజువాణి ఓటుతో ఆమోదానికి ప్లాన్
-
19 పార్లమెంట్లో చర్చకు టి బిల్లు
-
సిగ్గు..సిగ్గు
-
యుద్ధకాండ
-
లోక్‌సభ..రణరంగం
-
రేపు లోక్‌సభకు టీ
-
బహిష్కరణ..స్కెచ్‌లో భాహమే!
-
ఫస్ట్...పెద్దల సభలో పెట్టవచ్చా?
-
బడ్జెట్ సమర్పయామీ
-
సీమాంధ్రకు చిల్లే!.. చర్చ
-
ఉత్తరాంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీలు
-
టీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఓకే
-
సమన్యాయమే మా విధానం
-
తుది బిల్లులో ఈ రెండింటికి చోటు?
-
తొలిసారిగా తిరస్కార ఓటుకు అవకాశం
-
సవరణలపై నిర్ణయం.. తుది బిల్లుకు ఆమోదం!
-
నేడు కేబినెట్‌కు బిల్లు వెళ్లడం అనుమానమే
-
అసంపూర్తిగా ముగింపు..
-
అరగంటలో ముగిసిన మంత్రుల బృందం భేటీ
-
10న రాజ్యసభలో బిల్లు.. లోక్‌సభలో 11న?
-
సవరణలపై కసరత్తు కోసం నేడు జీవోఎం భేటీ
-
టీ ఇచ్చేది ఇలాగా?
-
విభజన నిర్ణయాన్ని ప్రజలకు వదిలేయాలి
-
ఇక ‘ఢిల్లీ’మే సవాల్!
-
బిల్లు ఆగదు
-
రెండింటి డౌట్
-
ఇక హస్తిన చేతిలో
-
సీఎం డ్రామాతో నివ్వెరపోయిన జనం
-
స్వామి కార్యం...స్వకార్యం...
-
పొడిగింపా-ముగింపా?
-
సభలో చర్చ జరిగేనా.. బిల్లు సజావుగా వెళ్లేనా?
-
ఇంకా గడువు కావాలి
-
మినీ అసెంబ్లీలా గందరగోళంగా ముగిసిన బీఏసీ
-
నేటి నుంచి 3 రోజులే కీలకం
-
ఇక 72 గంటలే
-
లోపాలు సరిదిద్దితే విభజనకు సరేనా?
-
ఓటింగ్ డౌటే
-
తోడు దొంగాట!
-
శాసనసభలో కిరణ్‌కుమార్‌రెడ్డి
-
వారం చాలు...
-
కధ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం
-
అదనపు గడువు ఇస్తారా?ఇవ్వరా?
-
నిర్ణయం తీసుకునేముందు విశ్లేషించుకోవాలి
భర్త అనుమానపు వైఖరికి రమ్య మనసు భగ్గున మండింది. వెంటనే సూట్‌కేస్ సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. తల్లి గుండెల మీద తలవాల్చి భోరుమంది. విషయం తెలుసుకున్న తల్లి ‘‘ఇంత చిన్నదానికే ఇల్లు వదిలి వచ్చేయడం ఏంటమ్మా’’ అనడంతో అవాక్కయింది రమ్య. అనుమానంతో వేధించే భర్తలు సమాజంలో చాలామంది ఉన్నారు. అది ఒక రకంగా బాధాకరమైనదే. కాకపోతే దానికి పరిష్కారం భర్తని వదిలేయడం కాదు. అందుకే కూతురు చేసినదాన్ని సమర్థించకుండా నిజానిజాల్ని విశ్లేషించి, కర్తవ్యాన్ని బోధించింది రమ్య తల్లి. ఆమె చెప్పినదాని ప్రకారం... కొందరు భార్యలు ఏం చేసినా తప్పు పట్టాలని చూస్తారు. ఇలాంటి వారిని మార్చడం కష్టం. మరికొందరు తన భార్యవైపు ఎవరైనా చూసినా, సన్నిహితంగా ఉన్నా తట్టుకోలేరు. అది నిజానికి అనుమానం కాదు. భార్యమీది అతిప్రేమతో కలిగే అభద్రతాభావం... అంతే! భర్త అనుమానించడానికి కారణం ఏమిటో తెలుసుకుంటే... ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థమైపోతుంది. ఇదంతా వివరించి, ఆ పైన నీ ఇష్టం అంది. అందరూ ఆమెలా ఆలోచిస్తే సమస్యే ఉండదు. ప్రేమపూరితమైన మాటలతోనే వారిని దారిలోకి తెచ్చుకోవచ్చు. వాళ్లు అర్థం చేసుకోకపోతే కౌన్సెలింగ్ ఇప్పించవచ్చు. అదీ వర్కవుట్ కాకపోతే అప్పుడు ఆలోచించాలి. అంతే కానీ, రమ్యలా చేయడం కరెక్ట్ కాదు. బంధాలు దారపు పోగుల్లాంటివి. కాస్త గట్టిగా లాగితే చాలు... పుటుక్కున తెగిపోతాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అందుకే నిర్ణయం తీసుకునేముందు పరిస్థితిని విశ్లేషించుకోవాలి. ఫలితం ఉండదనుకుంటేనే నిర్ణయాలు తీసుకోవాలి. -
డోలాయమానంలో ప్రాజెక్టుల పరిస్ధితి
-
తెలంగాణపై నిర్ణయం మారదు
భీమ్‌గల్, న్యూస్‌లైన్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. భీమ్‌గల్ ఆర్టీసీ బస్టాండు ఆధునికీకరణ పనులకు సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్‌లు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీడబ్ల్యూసీ ఒకసారి తీసుకున్న నిర్ణయానికి తిరుగుండదన్నారు. మరో మూడు నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు. అంతవరకు తెలంగాణవాదులందరూ ఓపికగా ఉం డాలన్నారు. సీమాంధ్రలో కొందరు ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణపై వెనక్కి చూసేది లేదని సోనియా చెప్పారన్నారు. తెలంగాణ రాష్ర్టం ఇచ్చిన ఘనత కేవలం సోనియాగాంధీకి మాత్రమే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ అభివృద్ధి పట్ల మం చి చిత్తశుద్ధి ఉన్న యువకుడన్నారు. ఆయన అమెరికాలో చూసిన అభివృద్ధిలో కొంతైనా ఇక్కడ సాధించాలన్న తపనతో ఉన్నాడని అన్నారు. డిపోతో సంబంధంలేకుండా ప్రజలకు రవాణా వసతిని కల్పిం చామ న్నారు. ఆర్టీసీ బస్సులు మనవని, వాటి ని వాడుకోవాలని సూచించారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దన్నారు. ఇప్పుడు వేసిన బస్సులు విజయవంతమైతేనే డిపో వస్తుందన్నారు. 40 ఏళ్ల తరబడి కలగన్న మెడికల్ కళాశాలను సాధించామన్నారు. అయినా దీనిపై నేను సంతోషంగాలేనని, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిం చి, ప్రజలు ఎలాంటి వైద్యం కోసమైనా హైదరాబాద్‌కు వెళ్లే అవసరం లేకుండా చేసిననాడే తృప్తి పడతానని అన్నారు. అనంతరం బస్టాం డు ప్రాంగణంలోకి చేరుకుని పరిశీలించారు. జెండాలు ఊపి బస్సు సర్వీసులను ప్రారంభించారు. సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణతార, ఆర్టీసీ ఈ డీ పురుషోత్తం నాయక్, ఆర్ఎం కృష్ణకాంత్, ఆర్మూర్ డీఎం రాజమౌళి, స్థానిక సర్పంచ్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణపై నిర్ణయం మారదు
భీమ్‌గల్, న్యూస్‌లైన్:తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లోనూ మారదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. భీమ్‌గల్ ఆర్టీసీ బస్టాండు ఆధునికీకరణ పనులకు సోమవారం శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి సుదర్శన్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ ఎం.సత్యనారాయణరావు, ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్, డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్‌లు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. సీడబ్ల్యూసీ ఒకసారి తీసుకున్న నిర్ణయానికి తిరుగుండదన్నారు. మరో మూడు నాలుగు నెలల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందన్నారు. అంతవరకు తెలంగాణవాదులందరూ ఓపికగా ఉం డాలన్నారు. సీమాంధ్రలో కొందరు ఉద్యమాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణపై వెనక్కి చూసేది లేదని సోనియా చెప్పారన్నారు. తెలంగాణ రాష్ర్టం ఇచ్చిన ఘనత కేవలం సోనియాగాంధీకి మాత్రమే దక్కుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ అభివృద్ధి పట్ల మం చి చిత్తశుద్ధి ఉన్న యువకుడన్నారు. ఆయన అమెరికాలో చూసిన అభివృద్ధిలో కొంతైనా ఇక్కడ సాధించాలన్న తపనతో ఉన్నాడని అన్నారు. డిపోతో సంబంధంలేకుండా ప్రజలకు రవాణా వసతిని కల్పిం చామ న్నారు. ఆర్టీసీ బస్సులు మనవని, వాటి ని వాడుకోవాలని సూచించారు. ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దన్నారు. ఇప్పుడు వేసిన బస్సులు విజయవంతమైతేనే డిపో వస్తుందన్నారు. 40 ఏళ్ల తరబడి కలగన్న మెడికల్ కళాశాలను సాధించామన్నారు. అయినా దీనిపై నేను సంతోషంగాలేనని, పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పిం చి, ప్రజలు ఎలాంటి వైద్యం కోసమైనా హైదరాబాద్‌కు వెళ్లే అవసరం లేకుండా చేసిననాడే తృప్తి పడతానని అన్నారు. అనంతరం బస్టాం డు ప్రాంగణంలోకి చేరుకుని పరిశీలించారు. జెండాలు ఊపి బస్సు సర్వీసులను ప్రారంభించారు. సమావేశంలో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అరుణతార, ఆర్టీసీ ఈ డీ పురుషోత్తం నాయక్, ఆర్ఎం కృష్ణకాంత్, ఆర్మూర్ డీఎం రాజమౌళి, స్థానిక సర్పంచ్ రవినాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెల్లడి స్తే బాగుండేది - వెంకయ్య