ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం త్వరలో కొత్త విధివిధానాలను ఖరారు చేయనుందని సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలుపై ఏపీ ప్రభుత్వం త్వరలో కొత్త విధివిధానాలను ఖరారు చేయనుందని సాంఘిక సంక్షేమ మంత్రి రావెల కిషోర్‌బాబు చెప్పారు. ఇందుకు సంబంధించి రెండు రోజుల్లో జీవో జారీ చేస్తామన్నారు. మంగళవారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో చదువుతున్న ఏపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రాష్ర్ట ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు విదేశాల్లో చదివేందుకు ముందుకు వస్తే అలాంటి వారికి ప్రభుత్వ పరంగా రూ.10 లక్షలు, బ్యాంకు గ్యారెంటీ ద్వారా మరో రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.20 లక్షలు సహాయం చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణలో చదివే రాష్ట్ర విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం అమలు చేస్తారా లేదా అన్న దానిపై స్పష్టత కావాలని సభ్యులు పట్టుబట్టడంతో ప్రతి విద్యార్థికీ న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.