కాలేజీ ప్రిన్సిపాల్ గది ముందు పడిగాపులు పడుతున్న విద్యార్థులు
విద్యార్థులను బయటికి పంపేసిన గుడివాడలోని ఇంజినీరింగ్ కళాశాల
గుడివాడ టౌన్: ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ వీకేఆర్, వీఎన్‌బీ అండ్ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదివే సుమారు 275 మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ అందాల్సి ఉంది. అందులో కొంతమంది ఏదోవిధంగా ఫీజు బకాయిలు చెల్లించగా.. 30 మందికి పైగా చెల్లించలేకపోయారు.
దీంతో వారికి హాల్ టికెట్ ఇచ్చేది లేదని సోమవారం యాజమాన్యం బయటకు పంపేసింది. వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో స్పందించిన ప్రిన్సిపాల్ ప్రసాదరావు ఫీజు రీయింబర్స్‌మెంట్ వచ్చినా రాకపోయినా నిర్ణీత సమయంలోగా బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులతో హామీ పత్రాలు రాయించుకుని హాల్ టికెట్లు ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment