ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైఎస్సార్‌సీపీ వెల్లడి
సాక్షి, అమరావతి: విద్యార్థులకు వెంటనే ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ఈనెల 5న తలపెట్టిన ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 12కి వాయిదా వేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
‘రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాం. ‘ఫీజు పోరు’ కార్యక్రమానికి అనుమతి కోరగా.. ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ ముగిశాక మార్చి 12న ‘ఫీజు పోరు’ నిర్వహించాలని నిర్ణయించాం’ అని వైఎస్సార్‌సీపీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment