Hall Tickets
-
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,535 సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. జనరల్ పరీక్షలు మార్చి 15వ తేదీన ముగుస్తాయి. మైనర్, ఒకేషనల్ పరీక్షలు 20వ తేదీ వరకు ఉంటాయి. ఈ నెల ఐదో తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు 20వ తేదీతో ముగుస్తాయి. ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వీరిలో మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు 5,00,963 మంది, ఒకేషనల్ విద్యార్థులు 44,581 మంది ఉన్నారు. రెండో సంవత్సరం జనరల్ విద్యార్థులు 4,71,021 మంది, ఒకేషనల్ విద్యార్థులు 42,328 మంది ఉన్నారు. ఈ నెల 20 నుంచి హాల్‌టికెట్ల పంపిణీకి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు గత ఏడాది అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అమలు చేస్తున్నారు. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ప్రశ్నపత్రాల ట్యాంపరింగ్, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు క్యూఆర్ కోడ్ విధానం పాటిస్తారు. ఈ విధానంలో ప్రశ్నపత్రం బయటకు వస్తే.. అది ఎక్కడ నుంచి వచ్చింది అనేది సెంటర్‌తో సహా సమస్త వివరాలు తెలిసిపోతాయి. ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేయనుంది. -
ఫీజు బకాయిలు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు
గుడివాడ టౌన్: ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ వీకేఆర్, వీఎన్‌బీ అండ్ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదివే సుమారు 275 మంది విద్యార్థులకు ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ అందాల్సి ఉంది. అందులో కొంతమంది ఏదోవిధంగా ఫీజు బకాయిలు చెల్లించగా.. 30 మందికి పైగా చెల్లించలేకపోయారు. దీంతో వారికి హాల్ టికెట్ ఇచ్చేది లేదని సోమవారం యాజమాన్యం బయటకు పంపేసింది. వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగడంతో స్పందించిన ప్రిన్సిపాల్ ప్రసాదరావు ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చినా రాకపోయినా నిర్ణీత సమయంలోగా బకాయిలు చెల్లిస్తామని రాతపూర్వకంగా హామీ ఇస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఆ తర్వాత విద్యార్థులు, తల్లిదండ్రులతో హామీ పత్రాలు రాయించుకుని హాల్ టికెట్లు ఇచ్చారు. -
14 నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–1 మెయిన్స్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు ఎంపికైన అభ్యర్థుల హాల్‌టికెట్లు ఈ నెల 14 నుంచి టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయ ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్లను పరీక్ష తేదీకి వారం రోజుల ముందు వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు కమిషన్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రాన్ని ముందుగానే సందర్శించాలని కమిషన్ సూచించింది. మెయిన్స్ పరీక్షలు ఈ నెల 21 నుంచి 27వ తేదీ వరకు ప్రతీరోజు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరుగుతాయి. ఈ పరీక్షలకు అభ్యర్థులను మధ్యాహ్నం 12.30 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను కేంద్రంలోనికి అనుమతించరని కమిషన్ స్పష్టం చేసింది. అభ్యర్థి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత తొలి పరీక్షకు వినియోగించిన హాల్‌టికెట్‌నే చివరి పరీక్ష వరకు వెంట ఉంచుకోవాలని డూప్లికేట్ హాల్‌టికెట్ జారీ చేసే అవకాశం లేదని పేర్కొంది. సమయం తెలుసుకు నేందుకు వీలుగా పరీక్ష హాల్లో గడియారాలను ఏర్పాటు చేస్తామని కమిషన్ వివరించింది. హాల్‌టికెట్‌లో పొరపాట్లు, ఇతర సమస్యలుంటే కమిషన్ కార్యాలయం పనిదినాల్లో 040– 23542185 లేదా 040–23542187 ఫోన్ నంబర్ల లో, లేదా హెల్ప్‌డెస్క్‌కు ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చని టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదల..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TSTET) 2024 హాల్ టికెట్లు విడుదలయ్యాయి. గురువారం సాయంత్రం 6 గంటలకు హాల్‌టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు అధికారులు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీనే హాల్ టికెట్లు విడుదల చేస్తామని టెట్ కన్వీనర్ ప్రకటించినప్పటికీ ఒక రోజు ఆలస్యమైంది. అభ్యర్థులు తమ జర్నల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.కాగా టెట్ కోసం 2,83,441 మంది దరఖాస్తులు చేసుకున్నారు. మే 20 నుంచి జూన్ 6 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం టెట్ ఫలితాలు జూన్ 12న విడుదలయ్యే అవకాశం ఉంది.హాల్ టికె ట్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
27 నుంచి ఏపీటెట్–2024
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (ఏపీటెట్)–2024 నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం టెట్ హాల్‌టికెట్లను https://aptet.apchss.in వెబ్సైట్లో ఉంచింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షకు 2,67,559 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారందరికీ పరీక్ష సెంటర్లను సైతం కేటాయించి, ఆయా వివరాలను ఆన్లైన్లో ఉంచింది. కాగా బీఈడీ చేసిన అభ్యర్థులు ఎస్జీటీ పోస్టులకు అనర్హులని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న బీఈడీ అభ్యర్థుల ఫీజును తిరిగి చెల్లించేందుకు విద్యాశాఖ చర్యలు తీసుకుంది. ఆయా అభ్యర్థుల ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు అకౌంట్‌కు ఫీజులు మొత్తాన్ని తిరిగి జమ చేయనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ప్రకటించింది. నిర్వహణ ఇలా.. పేపర్ 1ఏ : ఈనెల 27 నుంచి మార్చి 1 వరకు పేపర్ 2ఏ : మార్చి 2, 3, 4, 6 తేదీలు పేపర్ 1బి : మార్చి 5 (ఉదయం) పేపర్ 2బి : మార్చి 5 (మధ్యాహ్నం) 120 కేంద్రాల్లో ఏపీటెట్ ఈనెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా 120 కేంద్రాల్లో ఏపీ టెట్ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న పరీక్షా కేంద్రాన్ని మాత్రమే కేటాయించినట్టు కమిషనరేట్ తెలిపింది. సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థుల్లో 76.5 శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి ప్రాధాన్యత కేంద్రాన్నే కేటాయించారు. పరీక్ష కేంద్రాలపై అభ్యర్థులకు సందేహాలుంటే ఆయా జిల్లా విద్యాశాఖాధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. దీంతోపాటు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండేలా కమిషనరేట్‌లో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఫోన్ నంబర్లు 95056 19127, 97056 55349, 81219 47387, 81250 46997లో సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. -
ఆన్లైన్లో ఇంటర్ హాల్‌టికెట్లు
సాక్షి, అమరావతి: మార్చి ఒకటో తేదీ నుంచి ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారిక వెబ్సైట్లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచింది. పరీక్ష ఫీజు చెల్లించిన మొత్తం 10,52,221 మంది విద్యార్థుల హాల్‌టికెట్లను ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ లాగిన్ ద్వారా, అదేవిధంగా ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్సైట్ https://bieap.apcfss.in/ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. 2023–24 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4,73,058 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,79,163 మంది ఉన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులు వెబ్సైట్లో తమ పుట్టిన తేదీని, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పుట్టిన తేదీ లేదా తమ మొదటి సంవత్సరం హాల్‌టికెట్ నంబర్ నమోదు చేసి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ హాల్‌టికెట్లపై ప్రిన్సిపాల్ సంతకం అవసరం లేదని, నేరుగా విద్యార్థులు పరీక్షలకు హాజరుకావొచ్చని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి సౌరభ్‌గౌర్ ప్రకటించారు. ఎవరికైనా హాల్‌టికెట్‌పై ఫొటో ప్రింట్ కాకపోతే ఆ విద్యార్థులు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్‌ను సంప్రదిస్తే స్కాన్ చేసి ఫొటోతో కూడిన హాల్‌టికెట్‌ను ఇస్తారని వెల్లడించారు. మార్చి ఒకటి నుంచి మొదటి సంవత్సరం, రెండో తేదీ నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై 20వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లను సిద్ధం చేశారు. పరీక్షలు జరిగే గదుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్షకు హాజరైన ప్రతి విద్యార్థి హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. ప్రైవేటు యాజమాన్యాల వేధింపులకు చెక్ గతంలో ప్రైవేటు జూనియర్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఒత్తిడి చేసేవి. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యేవారు. ఈ విషయంపై ఇంటర్ బోర్డుకు కూడా అనేక ఫిర్యాదులు అందేవి. ఇప్పుడు ఎటువంటి వేధింపులు లేకుండా విద్యార్థుల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు పబ్లిక్ డొమైన్‌లోనే అందుబాటులో ఉంచింది. విద్యార్థులు ఎక్కడి నుంచి అయినా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించింది. -
గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు సర్వం సిద్ధం
సాక్షి, అమరావతి: ఈ నెల 25న నిర్వహించనున్న గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 14 నుంచి హాల్‌టికెట్ల జారీ మొదలుకాగా ఇప్పటివరకు దాదాపు 3.40 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. కాగా ఈ నెల 25న ప్రిలిమ్స్ పరీక్ష రోజే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) మెయిన్స్ పరీక్ష ఉంది. ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ ఉన్నతాధికారులు.. ఎస్బీఐ ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించారు. దీంతో గ్రూప్–2తో పాటు ఎస్బీఐ పరీక్ష రాసే అభ్యర్థులకు మార్చి 4న పరీక్ష నిర్వహించేందుకు బ్యాంకు అంగీకారం తెలిపింది. దీంతో గత కొన్నిరోజులుగా ఈ అంశాన్ని సాకుగా చూపి గ్రూప్ –2 పరీక్షను వాయిదా వేయించాలని కొన్ని రాజకీయ పక్షాలు చేసిన ప్రయత్నాలకు అడ్డుకట్ట పడింది. అడ్డంకులన్నీ తొలగడంతో ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను నిర్వహించనున్నారు. 4,83,525 మంది దరఖాస్తు.. గ్రూప్–2 పరీక్షల షెడ్యూల్‌ను గత డిసెంబర్ 7న ఏపీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 899 పోస్టులకు 4,83,525 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15న ఎస్బీఐ ప్రిలిమ్స్ ఫలితాలను వెల్లడించింది. ఫిబ్రవరి 25, మార్చి 4ను మెయిన్స్ తేదీలుగా ప్రకటించింది. దీంతో కొన్ని రాజకీయ పక్షాలు ఫిబ్రవరి 25న గ్రూప్–2 ప్రిలిమ్స్ నిర్వహిస్తే అదే రోజు ఎస్బీఐ, గ్రూప్స్ రెండు పరీక్షలు రాసే అభ్యర్థులు నష్టపోతారని ప్రచారం మొదలుపెట్టాయి. దీనివల్ల 5 వేల మందికి పైగా నష్టం కలుగుతుందన్నాయి. అభ్యర్థుల వివరాలు పంపండి.. ఈనెల 25న గ్రూప్–2 ప్రిలిమ్స్‌తోపాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులు తమ వివరాలను తమకు పంపాలని ఏపీపీఎస్సీ ఒక ప్రకటనలో కోరింది. అభ్యర్థులు తమ వివరాలను ఈ నెల 19 రాత్రి 12 గంటల లోగా appschelpdesk@gmail.com కు మెయిల్ చేయాలని సూచించింది. ఎస్బీఐకి లేఖ రాసిన ఏపీపీఎస్సీ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఏపీపీఎస్సీ అధికారులు.. ఎస్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్‌కు లేఖ రాశారు. ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమ్స్ తేదీని డిసెంబర్లోనే ప్రకటించామని తెలిపారు. ఈ పరీక్షకు 4,83,525 మంది చేసుకున్నారని, పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తిచేశామని వివరించారు. ఈ నేపథ్యంలో గ్రూప్–2తో పాటు ఎస్బీఐ మెయిన్స్ రాసే అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా మార్చి 4న జరిగే ఎస్బీఐ స్లాట్‌లో వారికి అవకాశం కల్పించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎస్బీఐ అధికారులు.. ఈనెల 25న గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు హాజరయ్యే ఎస్బీఐ అభ్యర్థులకు మార్చి 4న జరిగే స్లాట్‌లో అవకాశం కల్పించేందుకు అంగీకరించారు. దీంతో రెండు పరీక్షలు రాసే అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ సేకరిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు గ్రూప్–2తో పాటు ఎస్బీఐ పరీక్ష కూడా రాసేవారు 14 మంది ఉన్నట్టు తేలింది. పరీక్ష నాటికి ఎంత మంది అభ్యర్థులు ఉంటే వారందరి వివరాలను ఏపీపీఎస్సీ.. ఎస్బీఐకి అందించనుంది. దీంతో గ్రూప్–2 ప్రిలిమ్స్‌ను యధావిధిగా నిర్వహించనున్నారు. -
నేడు ఉపాధ్యాయ అర్హత పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)కు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,139 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం ఉదయ, మధ్యాహ్నం రెండు సెషన్లలో టెట్ పేపర్–1, పేపర్–2 నిర్వహించనున్నారు. పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేసిన విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సెలవు ప్రకటించింది. వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంచిన అధికారులు, వాటిలో పొరపాట్లు తలెత్తితే సరిచేసుకునే సూచనలు సైతం వెల్లడించారు. ♦ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే పేపర్–1 పరీక్షకు 1,139 కేంద్రాలు ఏర్పాటు చేయ గా, 2,69,557 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ♦మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే పేపర్–2 పరీక్షకు 913 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2,08,498 మంది అభ్యర్థులు హాజరవుతారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో... టెట్ జరిగే కేంద్రాల్లో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పరీక్ష తీరును పర్యవేక్షిస్తారు. అభ్యర్థులు పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయానికి గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రెండు బాల్ పాయింట్ బ్లాక్ పెన్నులు అభ్యర్థులు వెంట తెచ్చుకోవాలి. హాల్‌టికెట్ లేకుండా పరీక్షకేంద్రంలోని ప్రవేశం ఉండదు. అభ్యర్థులు ఓఎమ్మార్ పత్రంలో వివరాలు బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తోనే పూరించాలి. మరే రంగు పెన్నుతో నింపడానికి అనుమతించరు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగులు, ఇతర వస్తువులు పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యాకే అభ్యర్థులను కేంద్రం నుంచి బయటకు పంపిస్తారు. అభ్యర్థుల హాల్‌టికెట్‌లో పేరులో ఏమైనా స్వల్ప అక్షరదోషాలు, వివరాలు సరిగ్గా లేకుంటే పరీక్ష హాలులో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీలో సవరించుకోవాలి. హాల్‌టికెట్‌పైన ఫొటో, సంతకం సరిగా లేకున్నా ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించుకోవడంతో పాటు అభ్యర్థి ఆధార్ కార్డు, ఇతర ఫొటో ఐడీ కార్డులతో సంబంధిత డీఈఓలను సంప్రదించాలి. వారి అనుమతితోనే పరీక్షకు అనుమతిస్తారు. -
ఆన్లైన్లో ఏపీపీఎస్సీ పరీక్షల హాల్ టికెట్లు
సాక్షి, అమరావతి: ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్‌ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టుల పరీక్ష హాల్‌టికెట్లు వెబ్సైట్లో ఉంచినట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ నెల 18న ఉదయం, మధ్యాహ్నం పరీక్ష ఉంటుందని, అభ్యర్థులు www. psc. ap. gov. in వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ విజ్ఞప్తి చేశారు. 19న శాంపిల్ టేకర్ పరీక్ష ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, పబ్లిక్ హెల్త్ ల్యాబ్స్ అండ్ ఫుడ్ అడ్మిని్రస్టేషన్ విభాగంలో శాంపిల్ టేకర్ పోస్టుల భర్తీకి చేపట్టిన పరీక్ష ఈ నెల 19 నుంచి 21 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హాల్‌టికెట్లు కమిషన్ వెబ్సైట్లో ఉంచామని, అభ్యర్థులు 18వ తేదీ లోగా డౌన్లోడ్ చేసుకోవాలని కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. సాంకేతిక కారణాల రీత్యా ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు సర్విస్ కమిషన్ వెబ్సైట్ సేవలు నిలిచిపోతాయని, ఆలోగా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. 21, 22 తేదీల్లో ఏఈఈ పరీక్ష వివిధ ఇంజినీరింగ్ సర్వీసుల్లో ఖాళీల భర్తీకి ఉద్దేశించిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్స్ రాత పరీక్షను ఈ నెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది. హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి తెలిపారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో 21న మధ్యాహ్నం, 22న ఉదయం, మధ్యాహ్నం ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. -
గ్రూప్–4 పరీక్షకు విస్తృత ఏర్పాట్లు
సుభాష్‌నగర్: టీఎస్పీఎస్సీ ద్వారా జూలై 1న జరగనున్న గ్రూప్–4 పరీక్ష నిర్వహణకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గ్రూప్–4 పరీక్షలను పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, సంబంధిత శా ఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వ హించారు. పరీక్ష ఏర్పాట్లు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలపై అదనపు కలెక్టర్ వివరించారు. జూలై 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్ష కొనసాగుతుందని తెలిపారు. జిల్లాలో 39,183 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని వివరించారు. వీరి కోసం 125 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామ న్నారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్ ద్వారా ఇప్పటికే అత్యధిక మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని, మిగతా వారు కూడా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులు నిర్ణీత సమయానికి కనీసం 15 నిమిషాలు ముందే కేంద్రాలకు చేరుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. సమయం దాటితే లోనికి అనుమతి ఉండదని స్పష్టంచేశారు. అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బస్టాండ్లలో హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సీసీ కెమెరాల నిఘాలో పకడ్బందీగా పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. లైజనింగ్ ఆఫీసర్, ఆకస్మిక తనిఖీల కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామని చెప్పారు. అభ్యర్థులు నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించారు. సమావేశంలో అదనపు డీసీపీ మధుసూదన్‌రావు, ఆర్డీవోలు రవి, రాజేశ్వర్, డీఐఈవో రఘురాజ్, డీఈవో దుర్గాప్రసాద్, డీటీసీ వెంకటరమణ, చీఫ్ సూపరింటెండెంట్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఏప్రిల్ 3 నుంచి టెన్త్ ఎగ్జామ్స్.. 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 3వ తేదీన ప్రారంభమయ్యే పరీక్షలు 13వ తేదీ వరకు జరుగుతాయి. గత సంవత్సరం వరకు పదోతరగతిలో 11 పేపర్లతో పరీక్షలు జరగగా, వాటిని ఈసారి 6 ప్రశ్నపత్రాలకు కుదించారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. కాంపోజిట్ కోర్సు, సైన్స్ పేపర్ల వ్యవధి ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు ఉంటుంది. 2,652 కేంద్రాల్లో జరగనున్న పరీక్షలకు 4,94,620 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందులో 4,85,826 మంది రెగ్యులర్ విద్యార్థులు ఉన్నారు. కాగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఈ నెల 24 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు పంపించినట్లు విద్యాశాఖ తెలిపింది. హాల్‌టికెట్లను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్ www.bse. telangana.gov.in నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు పదో తరగతి పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతుల పరిశీలన ప్రక్రియ పూర్తి చేశారు. పరీక్షా సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్ల నియామకంతో పాటు స్టోరేజీ పాయింట్లకు రహస్య సామగ్రి పంపిణీ ప్రక్రియ పూర్తయింది. పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష విధులకు నియమించిన సిబ్బంది అందరికీ గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తయినట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రతి పరీక్షా కేంద్రంలో విద్యార్థుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ప్రథమ చికిత్స కిట్లను ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచనున్నారు. పరీక్షలు జరిగే అన్ని రోజులలో ఒక ఏఎన్ఎంను పరీక్ష కేంద్రానికి డిప్యూట్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవడానికి వీలుగా టీఎస్ఆర్టీసీ ఎక్కువ సంఖ్యలో బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రిపరేషన్ రోజులలో, పరీక్షా కాలంలో విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరాను అందించనుందని ప్రభుత్వం తెలిపింది. పదో తరగతి పరీక్షలకుసంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జిల్లా కలెక్టర్లు, డీఈవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. -
TSPSC: ఆఖరి నిమిషంలో హడావుడి!.. ఇదీ తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి
సాక్షి, హైదరాబాద్: సర్కారు కొలువు సాధించాలనే తపనతో సిద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థుల్లో చాలామంది దరఖాస్తుల సమర్పణ, హాల్‌టికెట్ల డౌన్లోడ్ విషయంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ విశ్లేషించింది. ఫలితంగా మెజారిటీ అభ్యర్థులు ఉద్యోగ యత్నం నుంచి ఆదిలోనే నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని అభిప్రాయపడింది. గతేడాది కాలంగా విడుదల చేసిన ఉద్యోగ ప్రకటనలకు సంబంధించి అభ్యర్థుల దరఖాస్తు సమర్పణ, హాల్‌టికెట్ల డౌన్లోడింగ్ తీరుకు సంబంధించిన వివరాలను మీడియాకు విడుదల చేసింది. 26 ప్రకటనలు.. 17,134 కొలువులు గతేడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో 17,134 ఉద్యోగ ఖాళీలకు సంబంధించి టీఎస్పీఎస్సీ 26 ఉద్యోగ ప్రకటనలు జారీచేసి దరఖాస్తులను స్వీకరించింది. అయితే దరఖాస్తుల సమర్పణకు అభ్యర్థులు సకాలంలో స్పందించడం లేదని కమిషన్ గుర్తించింది. దరఖాస్తు తొలినాళ్లలో పట్టించుకోకుండా గడువు తేదీ సమీపిస్తున్న తరుణంలో హడావుడి చేస్తున్నట్లు కనుగొంది. ఈ క్రమంలో సాంకేతిక కారణాలు, ఇతర ధ్రువపత్రాలు అందుబాటులో లేని కారణంగా తొలి ఘట్టమైన దరఖాస్తు సమర్పణ ప్రక్రియకే దూరమవుతున్నట్లు టీఎస్పీఎస్సీ పేర్కొంది. ముఖ్యంగా గ్రూప్–1 ఉద్యోగ దరఖాస్తులను పరిశీలిస్తే తొలి రెండు రోజుల్లో కేవలం 3.79 శాతం మంది అప్లై చేసుకోగా చివరి రెండ్రోజుల్లో 22.37 శాతం మంది దరఖాస్తులు సమర్పించారు. గ్రూప్–2 కేటగిరీలో తొలి రెండ్రోజుల్లో 9.24 శాతం దరఖాస్తులు రాగా చివరి రెండ్రోజుల్లో 16.32 శాతం మేర దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్–3లో తొలి రెండ్రోజులకు 7.22 శాతం, చివరి రెండ్రోజులకు 10.80 శాతం, గ్రూప్–4లో తొలి రెండ్రోజులు 3.45 శాతం, చివరి రెండ్రోజులు 10.69 శాతం మేర దరఖాస్తులు వచ్చినట్లు కమిషన్ వివరించింది. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌లోనూ ఆలస్యమే.. దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది హాల్‌టికెట్లను సైతం సకాలంలో డౌన్లోడ్ చేసుకోవడంలేదని టీఎస్పీఎస్సీ పేర్కొంది. పరీక్ష తేదీకి వారం ముందుగానే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచుతున్నా ఎక్కువ మంది అభ్యర్థులు వాటిని పరీక్ష తేదీకి ఒకట్రెండు రోజుల ముందే డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఫలితంగా పరీక్ష కేంద్రాన్ని సరిచూసుకోకపోవడంతోపాటు హాల్టికెట్లలో పొరపాట్లను సైతం పరిష్కరించుకోకుండానే చివరకు పరీక్షకు దూరమవుతున్నారని కమిషన్ వివరించింది. -
జేఈఈ మెయిన్స్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జరిగే జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు శని, ఆదివారాల్లో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో పరీక్ష కేంద్రం వివరాలు, సమయం పేర్కొంటారు. పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు ఎన్టీఏ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి అడ్మిట్ కార్డు పొందవచ్చు. జేఈఈ పరీక్షకు తెలంగాణ నుంచి 2 లక్షల మంది హాజరుకానున్నారు. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా 21 పట్టణాల్లో పరీక్ష నిర్వహించగా.. ఈసారి వీటిని 17కు తగ్గించారు. జేఈఈ పరీక్ష కేంద్రాల జాబితాను ఎన్టీఏ ఇది వరకే ప్రకటించింది. ఇందులో హయత్‌నగర్, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మేడ్చల్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ ఉన్నాయి. ఈసారి అన్ని విభాగాల్లోనూ నెగెటివ్ మార్కింగ్ ఉంటుందని ఎన్టీఏ స్పష్టం చేసింది. దీంతో పాటు మెయిన్స్ సిలబస్‌లోనూ మార్పు చేశారు. మేథ్స్‌లో ప్రపోర్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ (యాజ్ సొల్యూషన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్)ను పూర్తిగా తొలగించారు. సెట్స్, రిలేషన్స్, స్టాటిస్టిక్స్, త్రీ డైమెన్షన్, జామెట్రీలో లైన్స్ అండ్ ప్లేన్స్‌పై కొంత భాగాన్ని మేథ్స్‌లో కొత్తగా చేర్చారు. ఫిజిక్స్‌లో యంగ్స్ మాడ్యూల్స్ బై సియర్లస్ మెథడ్‌ను తొలగించారు. కెమిస్ట్రీలో న్యూక్లియర్ కెమిస్ట్రీ, ప్రాక్టికల్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ ఆఫ్ రెస్పిరేషన్ ఆఫ్ మోనో–ఫంక్షనల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫ్రమ్ బైనరీ మిక్చర్స్ తొలగించారు. వీటితో పలు అంశాలపై సిలబస్‌లో స్పష్టత ఇచ్చారు. -
8న గ్రూప్–1 స్క్రీనింగ్ టెస్ట్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–1 పోస్టుల నియామకానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్‌ను జనవరి 8వ తేదీన నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆబ్జెక్టివ్ విధానంలో ఈ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఎనిమిదో తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు పేపర్–2 పరీక్షలు ఉంటాయని, రాష్ట్రంలోని 18 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తామని వివరించారు. హాల్‌టికెట్లు ఈ నెల 31 నుంచి కమిషన్ వెబ్సైట్లో (https://psc.ap.gov.in) అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. జిల్లాల వారీగా పరీక్ష కేంద్రాల జాబితా కూడా వెబ్సైట్లో ఉంటుందని తెలిపారు. హాల్‌టికెట్లను ముందుగా డౌన్లోడ్ చేసుకుని పరీక్ష కేంద్రం, ఇతర మార్గదర్శకాలు, సూచనలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. -
టెట్ హాల్ టికెట్‌పై సన్నీ లియోన్ ఫోటో!
బెంగళూరు: ఎగ్జామ్ హాల్‌టికెట్‌పై సన్నీ లియోన్ ఫోటో కలకలం. దీంతో సీరియస్ అయిన విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు నవంబర్ 6న జరిగే కర్ణాటక టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్-2022)కి హాజరయ్యేందుకు యువతి హాల్ టికెట్ డౌన్‌లౌడ్ చేయగా ఒక్కసారిగా ఖంగుతుంది. దీంతో ఆమె ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా హల్ టికేట్ స్క్రీన్ షాట్లను షేర్చేసి తన గోడు వెల్లబోసుకుంది. ఈ ఫోటోలు వైరల్ కావడంతో విద్యాశాఖ సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించింది. ఈ ఘటన కర్ణాటకలోని రుద్రప్ప కాలేజీ అభ్యర్థికి ఎదురైంది. దీంతో సదరు కాలేజ్ ప్రిన్స్‌పాల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఐతే పోలీసుల విచారణంలో యువతి ఆన్లైన్లో దరఖాస్తును పూర్తి చేయలేదని వేరేవాళ్లు పూర్తి చేసినట్లు తెలిపింది. ఈ మేరకు విద్యాశాఖ అభ్యర్థులే ఆన్లైన్లో దరఖాస్తు అప్లై చేసుకునేలా యూజర్ ఐడీ పాస్వర్డ్ రూపొందించామని తెలిపింది. దీనిలో ఎవరూ జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉండదని స్పష్టం చేసింది. ఇది అభ్యర్థి నేరుగా అప్లై చేసుకోవాలి కాబట్టి విద్యాశాఖ పాత్ర ఉండదని తేల్చి చెప్పింది. ఈ ఘటనపై సత్వరమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ పోలీసులను కోరింది. (చదవండి: ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి.. ఏమైందో ఏమో కత్తితో పొడిచి...) -
టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో గ్రూప్–1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఈనెల 16వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని టీఎస్పీఎస్సీ కల్పించగా..తొలిరోజే 1,32,406మంది అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకున్నారు.. ఈనెల 16వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 1041 పరీక్షా కేంద్రాల్లో జరిగే ప్రిలిమ్స్‌కు 380202 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షను సాఫీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. టెస్ట్ బుక్‌లెట్‌లో మార్పులు...: గ్రూప్–1 పరీక్ష నిర్వహణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టెస్ట్ బుక్‌లెట్‌ను కొత్తగా డిజైన్ చేసింది. ఇదివరకు టెస్ట్‌బుక్‌లెట్ సిరీస్ కోడ్ స్థానంలో ఏ,బీ,సీ,డీ ని రాయాల్సి ఉండేది. అలా కాకుండా పరీక్షను మరింత పారదర్శకతతో నిర్వహించేందుకు టెస్ట్‌బుక్‌లెట్ సిరీస్ స్థానంలో ఆరు అంకెల నంబర్‌ను ఏర్పాటు చేసింది. నిర్దేశించిన బుక్లెట్ నంబర్‌ను ఓఎంఆర్ షీట్లో పూరించాల్సి ఉంటుంది. టెస్ట్‌బుక్‌లెట్ నంబర్‌ను ఓఎంఆర్ షీట్లో నిర్దేశించిన స్థానంలో నిర్ణీత పద్ధతిలో బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో గుర్తించే విధానాన్ని వివరణాత్మకంగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
రెండ్రోజుల్లో గ్రూప్–1 హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1 పరీక్షల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఈ నెల 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. ఇందులో భాగంగా పరీక్షకు వారం ముందు నుంచి హాల్‌టికెట్లు జారీ చేసేందుకు కసరత్తు చేపట్టింది. ఇప్పటికే హాల్‌టికెట్ల జారీకి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కాగా, అధికారులు వాటిని సాంకేతిక కోణంలో మరోమారు పరిశీలించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక రెండు రోజుల్లో టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రూప్–1 కేటగిరీలో 503 కొలువులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయగా 3,80,202 మంది దరఖాస్తులు సమర్పించారు. వడపోతలో భాగంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేసేందుకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. -
తెలంగాణ, ఏపీ, డిగ్రీ.. ఇవి అభ్యర్థుల పేర్లట!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/శ్రీరాంపూర్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎస్సెస్సీ, డిగ్రీ.. ఇవేంటో తెలుసా? ఇటీవల సింగరేణి జూనియర్ అసిస్టెంట్ హాల్టికెట్లలో అభ్యర్థుల పేర్లు. వినడానికి, చదవడానికి ఇవి నవ్వు పుట్టిస్తున్నా.. ఇది నిజమే. ఇటీవల సెప్టెంబర్ 4న జరిగిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షా ఫలితాలు ఈ నెల 10న విడుదలయ్యాయి. ఈ పరీక్షకు 98,882 మంది దరఖాస్తు చేసుకోగా 77,898 మంది హాజరయ్యారు. వీరిలో 49,328 మంది అనర్హులవగా 28,570 మంది అర్హత సాధించారు. ఈ క్రమంలో ఆదివారం ఫలితాలను గమనించిన అభ్యర్థులు నిర్వహణతీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. హాల్‌టికెట్లపై అక్షరదోషాలకు బదులు అచ్చుతప్పులు ఉండటమే ఇందుకు కారణం. ఉదాహరణకు.. వి.శ్రీధర్ అనే అభ్యర్థి(హాల్ టికెట్ నంబర్ 7709069) పేరు స్థానంలో ‘తెలంగాణ’అని ఉంది. బి.మణికంఠ అనే అభ్యర్థి(హాల్ టికెట్ నంబర్ 2204302) పేరు స్థానంలో ఆంధ్రప్రదేశ్ అని, బి.లలిత అనే అభ్యర్థి(హాల్‌టికెట్ నంబర్ 2218581) పేరు ‘డిగ్రీ’అని ఉంది. ఆంధ్రప్రదేశ్ అని ప్రచురించిన హాల్‌టికెట్ మరో అభ్యర్థి(హాల్ టికెట్ నంబర్ 3308978) పేరుకు బదులుగా బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని రాసి ఉంది. అసలే పరీక్ష నిర్వహణపై ముందు నుంచీ పలు రకాల వదంతులు చెలరేగిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా హాల్టికెట్లలో తప్పులు దొర్లడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సింగరేణి తీరును ఎండగడుతూ సోషల్ మీడియాలో మీమ్స్‌తో విరుచుకుపడుతున్నారు. -
జూన్ 6న టీఎస్ఆర్జేసీ సెట్–22
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యా సంస్థల సొసైటీ పరిధిలోని 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2022–23 విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించి జూన్ 6న అర్హత పరీక్ష టీఎస్ఆర్జేసీ సెట్–22 నిర్వహించనున్నట్లు సొసైటీ కార్యదర్శి సీహెచ్ రమణకుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్ష రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 40,281 మంది అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని, ఈనెల 28 నుంచి హాల్‌టికెట్లు వైబ్‌సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరుగుతుందని, మరిన్ని వివరాలకు సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొన్నారు. 24 నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి పరీక్షలు (10 ప్లస్ టు) ఈ నెల 24 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారత దేశంలోని రాష్ట్రాల అభ్యర్థులకు పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరుగుతాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ నెల 24 నుంచి జూన్ 10 వరకూ జరగనున్నాయి. -
Telangana: మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ పదో తరగతి పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 23 నుంచి జూన్ 1 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.. ఈ ఏడాది మొత్తం 5 లక్షల 8వేల 275 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. విద్యార్థుల హల్ టిక్కెట్లు గురువారం వెబ్ సైట్లో అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొంది. పరీక్షల షెడ్యూల్: మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్-ఏ మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 (కాంపోజిట్ కోర్స్) మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 (కాంపోజిట్ కోర్స్) మే 24- సెకండ్ లాంగ్వేజ్.. మే 25- థర్డ్ లాంగ్వేజ్ (ఇంగ్లీష్) మే 26- మ్యాథమెటిక్స్ మే 27- జనరల్ సైన్స్ పేపర్ (ఫిజికల్, బయోలాజికల్ సైన్స్) మే 28- సోషల్ స్టడీస్ మే 30 – ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1 (సంస్కృతం, అరబిక్) మే 31- ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 2 (సంస్కృతం, అరబిక్) జూన్ 1- ఎస్ఎస్సీ ఓకేషనల్ కోర్స్ (థియరీ) చదవండి: అనూహ్యం: డీజీపీని తప్పించిన సీఎం యోగి! కారణం ఏంటంటే.. -
తెలంగాణలో ఇంటర్ పరీక్షలు.. ప్రిన్సిపల్ సంతకం లేకున్నా..
సాక్షి, నిజామాబాద్: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు డీఐఈవో ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో 35,522 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫీజు చెల్లిస్తేనే హాల్‌టికెట్ ఇస్తామంటున్న కళాశాలలపై కఠిన చర్యలు ఉంటాయని, విద్యార్థులు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకుని ప్రిన్సిపాల్ సంతకం లేకుండానే పరీక్షకు హాజరుకావచ్చని ఇంటర్ విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. కోవిడ్ నిబంధనలతో పాటు నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ నిబంధన అమల్లో ఉంది. ఆర్టీసీ, విద్యుత్, పోలీస్, విద్యాశాఖ, పోస్టల్, ఇతరశాఖల కో–ఆర్డినేషన్‌తో పరీక్షలు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. మే 6 నుంచి ఇంటర్మీడియేట్ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఐఈవో రఘురాజ్ ‘సాక్షి’ ఇంటర్వ్యూ చేసింది. సాక్షి: ఆరో తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్షిక పరీక్షలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? డీఐఈవో: ఇంటర్ బోర్డు ఆదేశాలు, జిల్లా ఉన్నతాధికారుల సలహాల, సూచనలతో పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశాం. జిల్లా వ్యాప్తంగా 50 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. మొత్తం 35,522 మంది పరీక్షలు రాయనున్నారు. కేంద్రాల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ►నిమిషం ఆలస్యం నిబంధన అమలులో ఉందా గతంలో మాదిరిగానే నిమిషం నిబంధన అమ ల్లో ఉంటుంది. విద్యార్థులు నిర్ణీత సమయంలోగా కేంద్రాలకు చేరుకోవాలి. ఉదయం 8 గంటల నుంచే పరిశీలించి కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉద యం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష ఉంటుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ముందుగానే కేంద్రాలకు రావాలి. టీఎస్‌బీఐఈ ఎగ్జామ్ సెంటర్ లోకేటర్ అనే మొబైల్ యాప్ ద్వారా పరీక్షాకేంద్రం ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ►మాస్‌కాపీయింగ్‌పై పర్యవేక్షణ ఎలా ఉండనుంది పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల నీడలో పరీక్ష పత్రాలను తెరవాలి. మాస్‌కాపీయింగ్, అవకతవకలు జరగకుండా చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి అందుబాటులో ఉంటారు. వీరితో పాటు జిల్లాలో డిపార్ట్మెంట్ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ హోదాలోని రెవెన్యూ అధికారి, ఏఎస్సై హోదా కలిగిన ఒక పోలీసు అధికారితో కూడిన ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, నాలు గు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటుచేశాం. రాష్ట్ర స్థాయి తనిఖీ బృందాలూ తనిఖీలు చేపడతాయి. ►ఎండల తీవ్రత దృష్ట్యా తీసుకుంటున్న చర్యలు పరీక్ష ముగిసేసరికి మధ్యాహ్నం అవుతుంది. ప్రతి కేంద్రం వద్ద టెంట్ వేయాలని చెప్పాం. తాగునీరు, మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయా లు అందుబాటులో ఉంటాయి. ఓఆర్ఎస్ ప్యాకెట్లతో ఏఎన్ఎం అందుబాటులో ఉంటుంది. ఫ్యాన్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించాం. ►విద్యార్థులు మానసిక ఒత్తిడి అధిగమించాలంటే.. పరీక్షల సమయంలో చాలామంది విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. వారి కోసం ఇంటర్ బోర్డు కమిషనర్ సైక్రియార్టిస్ట్ను నియమించారు. 18005999333 నంబర్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలంటే భయం ఉన్న విద్యార్థులు ఈ నంబర్‌కు ఫోన్‌చేసి ఒత్తిడిని జయించవచ్చు. ►హాల్‌టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులు హాల్‌టికెట్లు ఇవ్వని కళాశాలల యాజమా న్యాలపై ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు ఉంటాయి. నోటీసులు కూడా జారీ చేస్తాం. కళాశాలలో హాల్‌టికెట్లు ఇవ్వకుంటే ఇంటర్‌బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని నేరుగా పరీక్షకు హాజరుకావచ్చు. ఈవిషయంలో విద్యార్థులు భయాందోళనకు గురికావొద్దు. ►పరీక్షలు సజావుగా సాగేందుకు చర్యలు పరీక్షలు సజావుగా జరిగేలా కలెక్టర్ సూచనల మేరకు అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించాం. పరీక్ష సమయానికి బస్సులు నడిచేలా చూడాలని ఆర్టీసీకి, విద్యుత్ అంతరాయం కలగకుండా ఉండేందుకు ఎస్ఈని, పోలీస్, డీఎంహెచ్‌వో, ఇతర జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించాం. -
హాల్‌టికెట్లను తప్పుగా ముద్రించినవారిపై ఫిర్యాదు
తాడేపల్లి రూరల్: ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియెట్ పరీక్షల హాల్టికెట్లలో సమయం తప్పుగా ముద్రించిన ఏపీసీఎఫ్ఎస్ఎస్ నిర్వాహకులపై ఇంటర్ పరీక్షల విభాగం అధికారులు సోమవారం రాత్రి గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అధికారులు మాట్లాడుతూ.. ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్‌టికెట్లపై సమయాన్ని ఉదయం 9 నుంచి 12 గంటల వరకు అని ముద్రించాల్సి ఉండగా.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు అని ముద్రించారని తెలిపారు. ఏపీసీఎఫ్ఎస్ఎస్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు, గోపి, ప్రతాప్ ఈ పని చేసినట్లు గుర్తించామని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందు కే ఇలా చేశారనే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న విద్యార్థులను గుర్తించి.. ఆయా కళాశాలలకు సమాచారం ఇస్తామన్నారు. అలాగే పరీక్షల సమయం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని తెలిపారు. -
టెన్త్ హాల్ టికెట్లు రెడీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను సిద్ధం చేశామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు దేవానందరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ‘బీఎస్ఈ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్సైట్ నుంచి స్కూల్ లాగిన్ ద్వారా వీటిని డౌన్లోడ్ చేసుకుని అటెస్ట్ చేసిన తరువాత విద్యార్థులకు అందించాలని సూచించారు. హాల్ టికెట్లలో విద్యార్థుల ఫొటో ఇమేజ్ లేకపోయినా, అస్పష్టంగా ఉన్నా వాటిపై సదరు విద్యార్థుల ఫొటోలను అతికించి అటెస్ట్ చేసి, వారితో కూడా సంతకం చేయించి పరీక్షలు రాసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫొటోలను కొత్తగా అతికించిన హాల్టికెట్లకు సంబంధించిన ఫోటోలను అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపాలని కోరారు. -
ఏపీపీ రాత పరీక్ష హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌కు అవకాశం
సాక్షి,హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నేతృత్వంతో జరుగుతున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ నియామక ప్రక్రియలో భాగంగా రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని బోర్డు శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నెల 18న ఉదయం 8 గంటల నుంచి 23వ తేదీ అర్ధరాత్రి వరకు అభ్యర్థులు హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబర్ 24న రాత పరీక్ష ఉంటుందన్నారు. హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకుని కలర్ జిరాక్స్ లేదా మామూలు జిరాక్స్ అందుబాటులో పెట్టుకోవాలని, హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో ఏదైనా సమస్యలుంటే రిక్రూట్మెంట్ బోర్డు కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. -
తల్లి పేరు సన్నీ లియోన్.. షాక్‌తో మైండ్ బ్లాక్
పట్నా: హెడ్డింగ్ చూడగానే వీరిద్దరికి వివాహం ఎప్పుడు అయ్యిందని ఆశ్చర్యపోతున్నారు. ఆగండి ఇంకో విషయం కూడా చెప్తాము.. ఆ తర్వాత మీ ఆశ్చర్యం మరి కాస్తా ఎక్కువవతుంది. అది ఏంటంటే వీరిద్దరు ఉత్తర బిహార్‌లోని ఓ టౌన్లో ఉంటున్నారని.. వీరికి 20 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చదువుతుంటేనే గందరగోళంగా అనిపిస్తుంది కదా.. హాల్‌టికెట్ తీసుకుని చూసుకున్న తర్వాత సదరు యువకుడు మనకంటే ఎక్కువ ఆశ్చర్యపోయుంటాడు. ఇంకా చెప్పాలంటే షాక్‌తో మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది ఈ ఘటన. ఓ కాలేజీ స్టూడెంట్ అడ్మిట్ కార్డ్ మీద అతడి తల్లి దండ్రుల పేర్ల స్థానంలో ఇమ్రాన్ హష్మి, సన్నీ లియోన్ పేర్లు ప్రింట్ చేశారు కాలేజీ యాజమాన్యం. (చదవండి: జాతీయగీతం మర్చిపోయిన విద్యాశాఖ మంత్రి) వివరాలు.. కుందన్ కుమార్(20) అనే యువకుడు ధనరాజ్ మహ్తో డిగ్రీ కాలేజీలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలో పరీక్షలు జరుగుతుండటంతో హాల్ టికెట్ తీసుకునేందుకు కాలేజీకి వెళ్లాడు. దాన్ని చూసిన అతడు ఒక్కసారి షాక్ అయ్యాడు. ఎందుకంటే దాని మీద అతడి తండ్రి పేరుకు బదులు ఇమ్రాన్ హష్మి అని.. తల్లి పేరు దగ్గర సన్నీ లియోన్ అని ఉంది. దీని గురించి కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లడంతో ప్రస్తుతం ఈ అడ్మిట్ కార్డ్ తెగ వైరలవుతోంది. యూనివర్సిటీ రిజాస్టారర్ రామ్ కృష్ణ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘విద్యార్థి వల్లనే ఈ తప్పిదం జరిగి ఉంటుందని భావిస్తున్నాం. దర్యాప్తు చేస్తున్నాం.. బాధితుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం’ అని తెలిపారు. -
ఇంటర్‌కు ఇకపై ఒకే హాల్‌టికెట్!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో వేర్వేరుగా కాకుండా రెండేళ్లూ ఒకే నెంబరుతో హాల్‌టికెట్ ఇచ్చే అంశంపై ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. జాతీయ స్థాయి, ఇతర ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు చేసే సమయంలో వేర్వేరు హాల్‌టికెట్ నెంబరు ఉండటం వల్ల విద్యార్థులు ఏది ఇవ్వాలనే విషయంలో కొంత గందరగోళానికి గురవుతున్నారు. ఒక్కోసారి మొదటి సంవత్సరపు హాల్‌టికెట్ నెంబరు ఇచ్చి నష్టపోతున్న సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రెండేళ్లకూ ఒకే నెంబరుతో కూడిన హాల్‌టికెట్లు జారీ చేసేలా ఇంటర్ బోర్డు ఆలోచిస్తోంది. వీలైతే వచ్చే ఏప్రిల్‌లో జరిగే పరీక్షలకు ఒకే నెంబరుతో కూడిన హాల్‌టికెట్ విధానం అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది. సిలబస్ కుదింపు.. ఇంటర్లో 30 శాతం సిలబస్ కుదింపుపై బోర్డు తాజా ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. గత ప్రతిపాదనల్లో కొందరు జాతీయ ప్రముఖులు, సంఘ సంస్కర్తలపై పాఠ్యాంశాలు, తెలంగాణ పండుగలు కుదిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభు త్వ ఆదేశాల మేరకు బోర్డు సిలబస్ కమిటీని సబ్జెక్టు నిఫుణులతో ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సిలబస్ కుదించే ప్రతిపాదనలు రూపొందించింది. కొన్ని సబ్జెక్టుల్లో 25 శాతం, మరికొన్నింటిలో 30 శాతం పాఠ్యాంశాలు తగ్గించేలా ప్రతిపాదించింది. అలాగే ఇంటర్నల్ అసెస్మెంట్ విధానంపైనా బోర్డు చేసిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వాస్తవానికి ఇంటర్లో డిస్క్రిప్టివ్ విధానంలోని పరీక్షల్లో విద్యార్థులు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, వీరిలో చాలామందికి ఆబ్జెక్టివ్ విధానంలోని ఎంసెట్‌లో మాత్రం తక్కువ మార్కు లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆబ్జెక్టివ్ విధానంతో కూడిన ఇం టర్నల్ అసెస్మెంట్పై బోర్డు ఆలోచిస్తోంది. వీటన్నింటిపైనా ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుందని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ప్రభుత్వ ఆమోదం లభించగానే విధానపర నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. -
హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
సాక్షి, అమరావతి: సచివాలయ ఉద్యోగ రాత పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న 10.56 లక్షల మంది అభ్యర్ధులలో మంగళవారం నాటికి 6.99 లక్షల మంది తమ హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని పరీక్షల నిర్వహణకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు పేర్కొన్నారు. మిగిలిన 3.57 లక్షల మంది తమ హాల్ టిక్కెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వెయిటేజీ కోసం 20వ తేదీలోగా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. ప్రస్తుతం కాంట్రాక్టు లేదంటే ఔట్సోర్సింగ్ పద్దతిలో పనిచేస్తూ సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు వెయిటేజీ మార్కుల కోసం తమ శాఖాధిపతుల నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రాలను çఈ నెల 20వ తేదీలోగా గ్రామ వార్డు సచివాలయ వెబ్ సైట్ అప్లోడ్ చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజా శంకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
నీట్ 2020 అడ్మిట్ కార్డ్ విడుదల
సాక్షి, ఢిల్లీ : సెప్టెంబర్ 13న నిర్వహించనున్న నేషనల్ ఎలిజిబిలిటి కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్ 2020)కి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం మధ్యాహ్నం అడ్మిట్ కార్డ్స్ విడుదల చేసింది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ 2020 కి సంబంధించిన అడ్మిట్‌కార్డులను కూడా ఎన్టీఏ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ముందుగా ప్రకటించినట్లుగానే జేఈఈ (మెయిన్స్) 2020 పరీక్షలు సెప్టెంబరు 1 నుంచి 6 వరకు, నీట్ 2020 పరీక్ష సెప్టెంబరు 13న నిర్వహించనుంది. మరోవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని పలు రాష్ట్ర ప్రభుత్వాలు, పలు పార్టీలు, విద్యార్థుల తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు కీలక నేతలు పరీక్షలు రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. దేశవ్యాప్తంగా నెలకొన్న వ్యతిరేకత మధ్యనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) జేఈఈ, నీట్ పరీక్షల షెడ్యూల్‌ను మంగళవారం విడుదల చేసింది. పరీక్ష సందర్భంగా విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్టీఏ మార్గదర్శకాలను విడుదల చేసింది. (చదవండి : షెడ్యూల్ ప్రకారమే నీట్, జేఈఈ) ఎన్టీఏ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి... ►విద్యార్థుల్లో అధిక శాతం మందికి వారు ఎంపిక చేసుకున్న మొదటి సెంటర్‌నే కేటాయించాలి. ►పరీక్ష సెంటర్‌కి వచ్చే విద్యార్థులు కచ్చితంగా ముఖానికి మాస్క్‌లు, చేతికి గ్లౌజ్‌లు ధరించాల్సి ఉంటుంది. ►వాటర్ బాటిల్, శానిటైజర్ కూడా వెంట తీసుకురావాలి. ►భౌతిక దూరం పాటించాలి. ►ఎగ్జామ్ సెంటర్లోకి కేవలం అడ్మిట్ కార్డుని మాత్రమే తీసుకురావాలి. ►కేటాయించిన స్లాట్ల ప్రకారం పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి. గుంపులుగా ఉండకూడదు. ►శరీర ఉష్ణోగ్రత 99.4 ఫారిన్‌హీట్ డిగ్రీల కంటే ఎక్కువ ఉన్న విద్యార్థులకు ఐసోలేషన్ గదుల్లో పరీక్ష. ►ఐసోలేషన్ గదుల్లోనే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయనున్నారు. ఇందుకోసం 15-20 నిమిషాల సమయం పట్టనుంది. ఆ లోపు వారి ఉష్ణోగ్రత తగ్గకపోతే.. ప్రత్యేక రూమ్‌లో వారికి పరీక్ష నిర్వహించనున్నారు. ►పరీక్ష హాల్లోకి వెళ్లేముందు ప్రతి ఒక్కరు చేతులను శుభ్రపరచుకోవాలి. ►పరీక్ష తరువాత ఒక్కొక్కరుగా బయటికి వెళ్లాలి. ►పరీక్ష ముగిసిన వెంటనే మాస్క్, గ్లోవ్స్‌ని పరీక్ష సెంటర్ బయట ఉన్న చెత్తబుట్టలో పడేయాలి. -
సెట్స్ దరఖాస్తులు 4,68,271
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు (సెట్స్) రాసేందుకు 4.68 లక్షల మందికిపైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్, ఐసెట్, ఎడ్‌సెట్, ఈసెట్, పీజీఈసెట్, పీఈసెట్, లాసెట్, పాలీసెట్‌కు ఈనెల 10తో దరఖాస్తు గడువు ముగిసిపోగా, ఆ తరువాత నుంచి ఆలస్య రుసుముతో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు ఆయా సెట్స్‌కు 4,68,271 మంది దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ఎంసెట్‌కు 2,21,505 మంది దరఖాస్తు చేసుకోగా, ఆ తరువాత పాలీసెట్‌కు 64,454 మంది, ఐసెట్‌కు 55,012 మంది దరఖాస్తు చేసుకున్నారు. 3 వరకు ఎంసెట్ హాల్‌టికెట్ల డౌన్లోడ్ జూలై 6–9 తేదీల మధ్య నిర్వహించే ఎంసెట్‌కు గతేడాది కంటే ఈసారి ఎక్కువ మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది 2.17 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఈసారి 2,21,505 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో ఇంజనీరింగ్ కోసం 1,42,645 మంది, అగ్రికల్చర్ కోసం 78,565 మంది, రెండింటి కోసం 295 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 3 వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు. జూలై 1న 250 కేంద్రాల్లో పాలీసెట్ పదో తరగతి ఉత్తీర్ణులై.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జూలై 1న పాలీసెట్ 2020 ప్రవేశపరీక్షను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర సాంకేతిక విద్యా, శిక్షణ మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి యూవీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. విద్యార్థులు ఫీజు చెల్లించినప్పుడే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు చేపట్టామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో జరిగే పాలీసెట్‌కు 38,404 మంది బాలురు, 26,050 మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థులు పరీక్ష కేంద్రాలను ఒకరోజు ముందే వెళ్లి చూసుకోవాలని సూచించారు. జూలై 4న ఈసెట్ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు (లేటరల్ ఎంట్రీ) ఉద్దే శించిన ఈసెట్‌ను జూలై 4న నిర్వహించేందుకు అన్ని ఏర్పా ట్లు చేసినట్లు ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ తెలిపారు. ఆన్లైన్లో పరీక్షలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు తమ వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. కాగా, జూలై 1 నుంచి 4 వరకు నిర్వహించే పీజీఈసెట్ హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు ఇప్పటికే చర్యలు చేపట్టామని పీజీఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కుమార్ వెల్లడించారు. విద్యార్థులు ఈ నెల 30 వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జూలై 5 నుంచి ఎడ్‌సెట్ హాల్‌టికెట్లు జూలై 15న నిర్వహించే ఎడ్‌సెట్ కోసం జూలై 5 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎడ్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ మృణాళిని తెలిపారు. ఇక పీఈసెట్‌కు హాజరయ్యేందుకు 5,457 మంది దరఖాస్తు చేసుకున్నట్టు కన్వీనర్ ప్రొఫెసర్ సత్యనారాయణ చెప్పారు. ఈసారి స్కిల్టెస్టును రద్దు చేశామని, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు మాత్రమే ఉంటుందని, త్వరలోనే తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. జూలై 13న జరిగే ఐసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 30 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రాజిరెడ్డి తెలిపారు. జూలై 2 నుంచి లాసెట్ హాల్‌టికెట్లు లాసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వారిలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. మొత్తంగా 28,805 మంది దరఖాస్తు చేసుకుంటే అందులో 20,575 మంది పురుషులే. ఈసారి న్యాయవిద్య కోర్సుల్లో చేరేందుకు ఐదుగురు ట్రాన్స్జెండర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో ముగ్గురు మూడేళ్ల న్యాయవిద్య కోర్సులో చేరేందుకు, ఇద్దరు ఐదేళ్ల కోర్సులో చేరేందుకు దరఖాస్తు చేసినట్లు లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీరెడ్డి తెలిపారు. జూలై 10న నిర్వహించే లాసెట్ కోసం.. 2వ తేదీనుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. -
తప్పుల సవరణకు అవకాశం
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఏ విషయంలోను ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా విద్యార్థుల హాల్టికెట్లలో జరిగే లోపాల సవరణకు ్టటbజ్ఛీ.ఛిజజ.జౌఠి.జీn వెబ్‌సైట్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. సైట్లోకి వెళ్లి తమ హాల్‌టికెట్‌లో తప్పులు ఏవైనా ఉంటే.. వాటిని సరి చూసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. లోపాల సవరణకు ఆదివారం వరకు మాత్రమే వెబ్‌సైట్‌ను అందుబాటులో ఉంచనున్నారు. ముఖ్యంగా గత సంవత్సరం ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంలో అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తప్పులు మరో సారి పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఏడాది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 35,000 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తప్పొప్పుల సవరణ ఇలా.. ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం విద్యార్థులు బోర్డు సూచించిన వెబ్‌సైట్‌లోని వెళ్లి పదో తరగతి హాల్‌టికెట్ నంబర్‌తో ప్రథమ సంవత్సరం హాల్‌టికెట్ సరిచూసుకోవచ్చు. ఇక రెండో సంవత్సరం విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం హాల్‌టికెట్ నంబర్‌తో హాల్‌టికెట్‌ను సరిచూసుకునేందుకు బోర్డు వెసులుబాటు కల్పిస్తుంది. ఆన్లైన్లో వచ్చిన హాల్‌టికెట్‌లో విద్యార్థి పేరు, తండ్రి, తల్లిపేరు, గ్రూప్, మీడియం, సెకండ్ లాంగ్వేజ్, పీహెచ్ కేటగిరి, సబ్జెక్టులు కట్టిన పరీక్ష ఫీజు వంటి తçప్పులు ఏవైనా ఉంటే వెంటనే విద్యార్థులు కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లాలి. ప్రిన్సిపాల్ కళాశాల లాగిన్లోకి వెళ్లి తప్పుల వివరాలను ఉన్నతాధికారులకు వివేదిస్తారు. ఈనెల 15వరకు బోర్డు అధికారులు తప్పుల వివరాలను సేకరించి, తర్వాత వాటిని సరిచేస్తారు. ఈ క్రమంలో అధికారులు తీసుకున్న చర్యల వల్ల హాల్‌టికెట్‌ల్లో తప్పులు ఉంటే విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు అవకాశం ఉంది. దృష్టి సారించని విద్యార్థులు ఇదిలాఉండగా, ఇంటర్మీడియెట్ బోర్డు పరీక్షలకు ముందే హాల్‌టికెట్లు, వాటిపై వివరాలను సరిచూసుకునేందుకు, తప్పొప్పులను సరిచేసేందుకు ఈ అవకాశం ఇవ్వగా.. విద్యార్థులు మాత్రం అంతగా ఆసక్తి చూపడంలేదు. ఏవైనా తప్పులు ఉన్నట్లయితే సరిచేసుకోని యెడల పరీక్షల అనంతరం సర్టిఫికెట్‌పై సైతం అవే తప్పులు అచ్చయ్యే అవకాశం ఉంది. గతంలో ఇలా జరగగా.. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు తప్పుల సవరణ కోసం ఇంటర్ బోర్డు చుట్టూ నెలల తరబడి తిరుగుతున్న సంఘటనలు ఉన్నాయి. విద్యార్థులు ముందుకు రావాలని అధికారులు సూచిస్తున్నారు. విద్యార్థులు సరిచూసుకోవాలి జిల్లాలోని వివిధ ఇంటర్మీడియెట్ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు తప్పకుండా తమ హాల్‌టికెట్, వివరాలు సరిచూసుకుని తప్పులు ఏవైనా ఉంటే వెంటనే కళాశాల ప్రిన్సిపాల్‌కు సమాచారం ఇవ్వాలి. వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకవేళ తర్వాత తప్పులు వస్తే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. – వెంక్యానాయక్, జిల్లాఇంటర్మీడియెట్ శాఖ అధికారి,మహబూబ్‌నగర్ -
రేపే నీట్.. సర్వం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా మే 5న నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్)కు తెలంగాణలో పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరగనుంది. రెండు గంటల ముందే పరీక్షా కేంద్రంలోకి చేరుకోవాలని.. 1.30 తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమయినా అనుమతి నిరాకరిస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు భారతీయ విద్యా మండలి ప్రకటన జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా ఈఏడాది 80వేలమంది నీట్ పరీక్షకు హాజరవుతున్నారని నిర్వహకులు తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని, బూట్లు, ఎత్తుమడిమల చెప్పులు, వాటర్ బాటిల్స్, ఫోన్స్, ఎలక్ట్రికల్ పరికరాలు, విద్యార్థినులు గాజులు, గొలుసులు, ఆభరాణాలు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకురావద్దని తెలిపారు. పరీక్షకు హాల్ టికెట్ తప్పనిసరి. అప్లికేషన్లో పొందుపరిచిన ఫోటో కాపీని తీసుకుని వెళ్లాలని, దానితో పాటు ఏదైనా గుర్తింపు కార్డు కూడా తప్పనిసరని విద్యా మండలి అధికారులు సూచించారు. -
నేటి నుంచి వెబ్సైట్లో ఈసెట్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: పాలిటెక్నిక్ పూర్తిచేసి ఇంజనీరింగ్ సెకండియర్‌లో ప్రవేశానికి (లాటరల్ఎంట్రీ) నిర్వహించే టీఎస్–ఈసెట్ ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నట్లు టీఎస్–ఈసెట్ కన్వీనర్ ఎ.గోవర్ధన్ ఓ ప్రకటనలో తెలిపారు. శనివారం నుంచి 9వ తేదీ వరకు ecet.tsche.ac.in నుంచి హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈనెల 11న ఉదయం 10 నుంచి 11 వరకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష హాలులోకి అనుమతించరని తెలిపారు. ఈ పరీక్షకు 28,020 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్ష నిర్వహణ కోసం మొత్తం 22 ప్రాంతీయ కేంద్రాలను (17 తెలంగాణలో, 5 ఏపీలో) ఏర్పాటుచేశారు. ప్రాంతీయ కేంద్రాల్లో అన్నింట్లో కలిపి 85 పరీక్షా కేంద్రాలున్నాయి. అభ్యర్థులంతా పరీక్ష కేంద్రానికి ఉదయం 8.30 గంటలకల్లా చేరుకోవాలని సూచించారు. కాలిక్యులేటర్లు, సెల్ఫోన్లు, చేతి గడియారాలు తదితర ఎలక్ట్రిక్ ఉపకరణాలను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష రాసే అభ్యర్థులు చేతులకు మెహిందీ, గోరింటాకు వంటివి పెట్టుకోకూడదని సూచించారు. -
ఇంటర్మీడియట్ బోర్డు లీలలు
సిరిసిల్లటౌన్: ఇంటర్మీడియట్ బోర్డులో నెలకొన్న నిర్లక్ష్యం మూలంగా ఓ విద్యార్థి విషయ పరీక్షను ఎదుర్కొంటున్నాడు. అతడి పేరున రెండు వేర్వేరు రోల్ నంబర్లతో హాల్‌టిక్కెట్లు రావడంతో పాటు సబ్జెక్టుల్లో తేడాలుండటంపై విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే..సిరిసిల్ల పట్టణానికి చెందిన వేముల సాయికుమార్ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఫిజిక్స్, మ్యాథమేటిక్ సబ్జెక్టుల్లో తప్పాడు. వీటికి సంబంధించి సప్లమెంటరీ ఫీజును చెల్లించాడు. గురువారం నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగనుండటంతో బుధవారం స్థానిక ఓప్రైవేటు కళాశాలలో హాల్‌టిక్కెట్ తీసుకోవడానికి వెళ్లాడు. అక్కడ రెండు హాల్‌టిక్కెట్లు తన పేరున 1937311769, 1937311757 నంబర్లతో రావడాన్ని చూసి అవాక్కయ్యాడు. ఒక దానిలో తాను తప్పిన ఫిజిక్స్, మ్యాథమేటిక్స్, మరోదానిలో ఫిజిక్స్, మ్యాథమేటిక్స్‌తో పాటు సంస్కృతం సబ్జెక్టుల్లో పరీక్షలు రాయాల్సిందిగా వచ్చింది. అయితే తాను పాసైన సంస్కృతం పేపర్ మళ్లీ రాయడం ఎందుకని ఆవేదన వ్యక్తం చేశాడు. సాయికుమార్‌కు వచ్చిన హాల్టికెట్లలో రెండింటిలో తన వివరాలు కరెక్టుగానే ఉన్నాయి. ఫొటోపై సంతకంతో పాటుగా రెండు హాల్‌టిక్కెట్లు జారీ చేయబడ్డాయి. అయితే ఒకదానిలో తాను పాసైన సబ్జెక్టు కూడా తప్పినట్లు రావడంతో తాను రెండు సబ్జెక్టులు రాయలా.. మూడు రాయాలాన్న సందిగ్ధంలొ ఉన్నాడు. ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జారీ అయిన హాల్టిక్కెట్లలొ ఏది నిజం..ఏది అబద్ధం అన్న విషయంలో కళాశాల యాజ మాన్యం, ఇంటర్మీడియట్ విద్యాధికారులు స్పష్టత ఇ వ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. ఒక విద్యార్థి భవిష్యత్తులో బోర్డు ఆటలాడటం ఏంటని విద్యార్థి స ంఘాల నాయకుల అభిషేక్ తదితరులు బోర్డును తప్పుబడుతున్నారు. న్యాయం చేయాలని సాయికుమార్ అధికారులను వేడుకుంటున్నాడు. -
హాల్ టికెట్లు ఇవ్వలేదని
మొయినాబాద్(చేవెళ్ల): పరీక్షలు రాసేందుకు హాల్ టికెట్లు ఇవ్వడంలేదంటూ ఇద్దరు విద్యార్థులు కళాశాల భవనం పైనుంచి దూకేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన మొయినాబాద్ మండల పరిధిలోని చిలుకూరు రెవెన్యూలో ఉన్న గ్లోబల్ ఫార్మసీ కళాశాలలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్లోబల్ ఫార్మసీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న 23 మంది విద్యార్థులకు పరీక్షలు రాసేందుకు కళాశాల యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వలేదు. సోమవారం నుంచే పరీక్షలు ప్రారంభం కావడంతో అంతకు ముందే పలుమార్లు విద్యార్థులు హాల్ టికెట్ల కోసం ప్రిన్సిపల్‌ను అడిగారు. చివరి నిమిషం వరకు హాల్ టికెట్లు వస్తాయని చెప్పిన ప్రిన్సిపల్ పరీక్షలు ప్రారంభమైన రోజున హాజరు సరిగా లేనందున మీరంతా డిటెండ్ అయ్యారని చెప్పారు. దీంతో మంగళవారం నాడు విద్యార్థులు కళాశాలలోనే ఆందోళన నిర్వహించి విద్యార్థి సంఘాల నాయకులకు సమాచారం ఇచ్చారు. బుధవారం ఎన్ఎస్టీడబ్ల్యూఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు కళాశాలకు వచ్చి యాజమాన్యంతో మాట్లాడారు. జేఎన్టీయూ నుంచే 23 మంది విద్యార్థులను డిటెండ్ చేశారంటూ చెప్పడంతో అందులోని ఇద్దరు విద్యార్థులు మహ్మద్ ఆసిఫ్, అయూబ్‌లో కళాశాల భవనం పైకి ఎక్కి దూకేందుకు ప్రయత్నించారు. అప్పటికే కళాశాల వద్దకు చేరుకున్న పోలీసులు వారిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. -
ప్రయివేటు పాఠశాల మోసం
చైతన్యపురి: వారిద్దరూ కష్టపడి చదివారు.. పాఠశాల నుంచి పదో తరతగి హాల్ టికెట్ తీసుకున్నారు.. గంట ముందే పరీక్షా కేంద్రానికి వెళ్లి హాల్‌టికెట్ నంబర్ చూసుకుని మరీ సీట్లో కూర్చున్నారు.. ఇన్విజిలేటర్ ఆన్సర్ షీట్, క్వశ్చన్ పేపర్ ఇచ్చారు.. పరీక్ష రాస్తుండగా వచ్చిన స్క్వాడ్.. ‘మీ హాల్‌టికెట్లు ఫేక్‌వి.. పరీక్ష రాయటానికి వీల్లేదు’ అంటూ పేపర్ తీసేసుకున్నారు. దీంతో ఎంతో ఆశలు పెట్టుకున్న ఆ పదో తరగతి విద్యార్థులు అయోమయంలో పడ్డారు. ఈ సంఘటన గురువారం సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ♦ ఉదయ్‌కుమార్, ఏదులకంటి అశ్విన్‌కుమార్ ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సరూర్‌నగర్ ఓల్డ్ పోస్టాఫీస్ సమీపంలోని న్యూ రెయిన్బో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో చదివారు. అయితే, ఈ స్కూలుకు పదో తరగతికి అర్హత లేదు. కానీ స్కూలు యాజమాన్యం మాత్రం పదోతరగతి విద్యార్థులను నగరంలోని వివిధ స్కూళ్ల విద్యార్థులుగా ఫీజులు కట్టించి పరీక్షలకు పంపిస్తుంటారు. ♦ ఈ క్రమంలోఏదులకంటి అశ్విన్‌కుమార్, ఉదయ్‌కుమార్‌ను ‘అల్కాపురి శ్రీద్వారకామయి ఎంహెచ్ఎస్ పాఠశాల’ విద్యార్థులుగా ఫీజులు కట్టించారు. వీరిలో అశ్విన్‌కుమార్‌కు మన్సూరాబాద్‌లోని జడ్పీహెచ్ స్కూల్ సెంటర్ కేటాయించారు. ఉదయ్‌కుమార్‌కు రామకృష్ణాపురంలోని సెయింట్ మార్టిన్ స్కూల్ సెంటర్ ఇచ్చారు. వాస్తవానికి అల్కాపురి శ్రీ ద్వారకామయి ఎంహెచ్ఎస్ పాఠశాల’ మూడేళ్ల క్రితమే మూతపడింది. ♦ న్యూ రెయిన్బో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి మాత్రం విద్యార్థుల హాల్‌టికెట్లపై ‘న్యూ మారుతీనగర్ శ్రీ ద్యారకామాయి స్కూల్ స్టాంపు’ వేసి పరీక్షకు పంపించారు. చదివిన స్కూల్‌కు అనుమతిలేక పోవడం.. లేని స్కూల్ నుంచి ఫీజుల కట్టడం, సంబంధం లేని స్కూల్ స్టాంపులు వేసి అటెస్ట్ చేసి ఇవ్వడంతో చివరి క్షణంలో బోర్డు అధికారులు గుర్తించి ఇద్దరు విద్యార్థులను ‘ఫేక్’గా తేల్చి పరీక్షలు రాయనీకుండా బయటకు పంపించివేశారు. పోలీస్ స్టేషన్లో పిర్యాదు... హాల్‌టికెట్ ఉన్నా పరీక్షలేక పోయిన విద్యార్థులు అశ్విన్‌కుమార్, ఉదయ్ కుమార్ తల్లిదండ్రులు సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో న్యూరెయిన్బో ఇంటిగ్రేటెడ్ స్కూల్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. తమ పిల్లల జీవితాలతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జరిగిన సంఘటనపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. అనుమతిలేని పాఠశాలలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని టీఆర్ఎస్వీ నాయకులు మహేందర్‌యాదవ్, శివరామకృష్ణ, ప్రవీణ్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రయివేటు విద్యాసంస్థలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నాయని, ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
తప్పులమయం
ఎల్.రమణ (పేరు మార్పు) నెల్లూరులోని జెడ్పీ కాలనీలో నివాసముంటున్నాడు. ఈ విద్యార్థి దర్గామిట్టలోని రత్నం హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. పరీక్షలు రాసేందుకు హాల్‌టికెట్ వచ్చింది. అందులో నారాయణ హైస్కూల్ నెల్లూరు అని మాత్రమే ఉంది. అడ్రస్ పూర్తిగా లేకపోవడంతో నాలుగు రోజులుగా నగరంలో ఉన్న నారాయణ హైస్కూల్స్ మొత్తం తిరుగుతున్నాడు. ఈ సమస్య కేవలం రమణకే పరిమితం కాలేదు. చాలామంది విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది. నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పంపిణీ చేసిన హాల్టికెట్లలో తప్పులు దొర్లాయి. ఎస్ఎస్సీ బోర్డు ఇష్టారీతిగా ముద్రించి పంపింది. గురువారం నుంచి పరీక్షలు జరుగనున్నాయి. గతంలో ప్రభుత్వ పరీక్షల విభాగం పదిరోజుల ముందే హాల్‌టికెట్లు పంపేది. వాటిలో ఏవైనా తప్పిదాలు ఉంటే సరిచేసుకునేందుకు అవకాశం ఉండేది. ఈ ఏడాది విద్యార్థులకు ఆ అవకాశం లేకుండా పో యి ందని ఉపాధ్యాయులు వాపోతున్నా రు. తక్కువ వ్యవధిలో పరిశీలించి సవరించుకోవడం ఏవిధంగా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. హాల్‌టికెట్ల లో తప్పులుంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో అటెస్టేషన్ చేయిస్తే సరిపోతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ విషయం విద్యార్థులకు తెలియకపోవడంతో రోజుల తరబడి విద్యాశా ఖ కా ర్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ అధికారులు అందుబాటులో లే క వారు ఇబ్బందులు పడుతున్నారు. అడ్రస్ లేదు జిల్లాలో 33,100 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో చాలామంది హాల్‌టికెట్లపై పరీక్ష కేంద్రం పేరు మాత్రమే ఉంది. ఆ పాఠశాల ఏ ప్రాంతంలో ఉందో అడ్రస్ లేదు. పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను విద్యార్థుల చేతిలోపెట్టి మీరే అడ్రస్ వెతుక్కోండని చేతులు దులుపుకున్నాయి. ఫీజు కడితేనే.. కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలో ఫీజు బకాయిలున్న విద్యార్థులను యా జమాన్యాలు తీవ్ర ఇబ్బంది పెట్టాయి. బుధవారం పొదలకూరురోడ్డులో ఉన్న ఓ పాఠశాల యాజమాన్యం ఫీజు చెల్లి స్తేనే హాల్‌టికెట్ ఇస్తామని చెబుతోందని డీ ఈఓ కె.శామ్యూల్‌కు ఫిర్యాదు అం దిం ది. దీంతో సంబంధిత పాఠశాలకు ఫోన్ చేసి విద్యార్థులకు వెంటనే హాల్‌టికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. కొందరు తల్లి దండ్రులు చేసేదేమీ లేక అప్పు చేసి ఫీజు చెల్లించి హాల్‌టికెట్లను తీసుకుంటున్నా రు. పాఠశాలల యా జమన్యానికి జి ల్లా విద్యాశాఖలోని పలువురు అధికారుల కు సత్సంబంధాలు ఉండటంతోనే వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధి కారులు మాత్రం హాల్‌టికెట్ ఇవ్వకుంటే విద్యాశాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోమని ఉచిత సలహా ఇస్తున్నారు. యాప్ ద్వారా తెలుసుకోవచ్చు విద్యార్థులకు ఇచ్చిన హాల్టికెట్లలో ఉండే కోడ్‌ను పరీక్షల యాప్‌లో టైప్ చేస్తే కేంద్రం అడ్రస్ తెలుస్తుంది. హాల్‌టికెట్లు ఇవ్వని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల విషయం మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. – కె.శామ్యూల్,జిల్లా విద్యాశాఖాధికారి -
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈనెల 29 వరకు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపించడంతో పాటు వాటిని వెబ్సైట్లో (www.bseap.org) కూడా పొందుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 11,356 పాఠశాలలకు చెందిన 6,17,484 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,834 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలోనూ పదోతరగతి పరీక్షలకు మొదలయ్యాయి. గురువారం నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు (కొన్ని సబ్జెక్టులు 12:45 గంటల వరకు) జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం 9:30 గంటల తర్వాత ఐదు నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 కేంద్రాల్లో 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులందరికీ ఇప్పటికే హాల్‌టికెట్లు జారీ చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. హాల్‌టికెట్లు అందని వారు www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. పరీక్ష హాల్లోకి సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరు. హాల్‌టిక్కెట్లు తప్ప ఇతర పేపర్లను తీసుకుపోరాదు. హాల్టిక్కెట్ల రోల్ నెంబర్లను, మెయిన్ ఆన్షర్ షీట్లు, అడిషనల్, బిట్, మ్యాప్, గ్రాఫ్ షీట్లతో సహ ఎక్కడా రాయరాదు. ఊరు, పేరు, సంతకం వంటి ఇతర చిహ్నాలు పెట్టరాదని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులను తొలి రెండు రోజులు మాత్రమే పరీక్ష ప్రారంభమైన అరగంటవరకు అనుమతిస్తామని, తరువాత నుంచి అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇంటర్ విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు నిరాకరణ
ఏలూరు టౌన్ : బుధవారం నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో సీఆర్ఆర్ కళాశాల యాజమాన్యం వివిధ కారణాలతో విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు మంజూరు చేసేందుకు నిరాకరించటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. హాల్‌టిక్కెట్లు ఏ కారణాలతోనైనా ఆపితే కఠిన చర్యలు తప్పవని ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు హెచ్చరించినా యాజమాన్యాలు పట్టించుకోవటంలేదు. మంగళవారం ఉదయం కళాశాలకు వెళ్ళిన విద్యార్థులు హాల్ టిక్కెట్లు ఇవ్వాలని కోరగా, ఇవ్వమంటూ యాజమాన్యం తెగేసి చెప్పింది. విద్యార్థులకు మద్దతుగా ఏబీవీపీ నాయకులు శ్రీకాంత్‌తోపాటు మరికొందరు విద్యార్థి నాయకులు కళాశాల వద్ద బైఠాయించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ కళాశాల వద్ద బైఠాయించినా సమాధానం చెప్పకపోవటంతో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో త్రీటౌన్ పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థులు ఆందోళన విరమించాలని హెచ్చరించారు. విద్యార్థులు ఆందోళన విరమించేదిలేదని, తమకు న్యాయం చేయాలని కోరారు. త్రీటౌన్ పోలీసులు పరిస్థితిని అదుపుచేసేందుకు విద్యార్థి సంఘం నాయకులను రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళి అరెస్టులు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా సీఆర్ఆర్ కళాశాల విద్యార్థులు చేపడుతోన్న ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్ మద్దతు తెలిపారు. విద్యార్థులు కళాశాల వద్దే రాత్రి 9.30 గంటలైనా ఆందోళన చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోకుండా కఠినంగా వ్యవహరించటం దారుణమని బొద్దాని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడితే సహించేదిలేదని, విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. పోలీసులు యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ విద్యార్థులను, ఏబీవీపీ నేతలను అరెస్టులు చేయటం దారుణమన్నారు. దీనిపై వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అండగా వైఎస్సార్సీపీ యువజన నాయకులు పసుపులేటి శేషు, దినేష్, యల్లపు మోజెస్ తదితరులు ఉన్నారు. -
ఇంటర్ పరీక్షలకు జీఎస్టీ దెబ్బ
తెనాలిఅర్బన్: జీఎస్టీ ప్రభావం ఇంటర్ కళాశాలలపై పడింది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు పరీక్ష హాల్ టిక్కెట్ ఇవ్వాలంటే రూ.500 నుంచి రూ.1000 నగదు జీఎస్టీ కింద చెల్లించాలని చెప్పి వసూలు చేస్తున్నారు. నగదు చెల్లించని పక్షంలో హాల్ టిక్కెట్ ఇచ్చేదిలేదని చెబుతున్నారు. చేసేదిలేక విద్యార్థులు నగదు చెల్లిస్తున్నారు. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ఈ నెల 28 నుంచి, ద్వితీయ సంవత్సర పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లను తెనాలి పట్టణంలోని అయా కళాశాలలు పంపిణీ చేస్తున్నాయి. ఇదే అదనుగా భా వించిన పట్టణంలోని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు జీఎస్టీ పేరిట విద్యార్థుల నుంచి కళాశాల స్థాయిని బట్టి వసూలు చేస్తున్నారు. కొన్ని కళాశాలలు ఒక్కో విద్యార్థి నుంచి రూ.500 వసూలు చేస్తుండగా, మరికొన్ని కళాశాలలు రూ.1000 వసూలు చేస్తున్నాయి. పరీక్ష ఫీజును గతంలోనే చెల్లించాం కదా ఇప్పుడు నగదు ఎందుకు ఇవ్వాలని విద్యార్థులు ప్రశ్నిస్తే జీఎస్టీ అని చెబుతున్నారు. ఇదేమి ఖర్మరా బాబు అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టెట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం
సాక్షి, అమరావతి: ఏపీ టెట్ పరీక్ష నిర్వహణలో గందరగోళం నెలకొంది. పరీక్ష కేంద్రాల కేటాయింపుల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. ఏ జిల్లా నుంచి అభ్యర్ధి దరఖాస్తు చేస్తే ఆ జిల్లాలో కాకుండా ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలను అధికారులు కేటాయించారు. అదే విధంగా సీటింగ్ కేపాసిటీ లేకుండానే పలు కేంద్రాలకు అధికారులు హాల్ టికెట్లను జారీ చేశారు. మరో వైపు హాల్ టిక్కెట్ల డౌన్ లోడ్‌లో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురు కావడంతో అభ్యర్ధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 21 నుంచి మార్చి మూడో తేదీత వరకు ఆన్లైన్లో టెట్ పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అయితే టెట్ నిర్వహణకు సంబంధించిన లోటుపాట్లతో మళ్లీ పరీక్షల వాయిదా పడుతుందేమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులపై గంటా ఆగ్రహం టెట్ పరీక్ష నిర్వహణకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యంపై మంత్రి గంటా శ్రీనివాసరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రాల కేటాయింపుల్లో పొరపాట్లు చోటు చేసుకోవడం పై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం మంత్రి గంటా సంబంధిత అధికారులతో వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు. పరీక్షా కేంద్రాల కేటాయింపులో అభ్యర్ధులను ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ నిలదీశారు. తొలిసారి ఆన్లైన్లో టెట్ పరీక్ష నిర్వహిస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని ముందు నుంచి చెబుతున్నా అధికారుల అలసత్వం కనబరచడం సరికాదన్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి గురువారం విజయవాడలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. -
‘టెట్’ కష్టాలు!
అనంతపురం ఎడ్యుకేషన్: రాయదుర్గానికి చెందిన ఎం. అలేఖ్య టెట్ పేపర్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ అమ్మాయికి ఒంగోలులో టెట్ కేంద్రం వేశారు. తండ్రి రమణ ప్రభుత్వ టీచరుగా పని చేస్తున్నారు. ఆయన కూతురును తీసుకుని ఒంగోలుకు వెళ్లి పరీక్ష రాయించాలంటే రెండు రోజులు సెలవు పెట్టాలి. పైగా వేలాది రూపాయలు ఖర్చు. ♦ అనంతపురం నగరానికి చెందిన బి.మదన ప్రతాప్‌రెడ్డి పేపర్–1 పరీక్షకు దరఖాస్తు చేశాడు. దరఖాస్తు సమయంలో రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ఆప్షన్ ఇచ్చారు. కానీ ఇవేవీ లేకుండా బెంగళూరు నగరంలో కేంద్రం వేశారు. ♦ యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన కేతిరెడ్డి ప్రతాప్‌రెడ్డి అనే అభ్యర్థి టెట్ పేపర్–2 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్లైన్లో హాల్‌టికెట్ కనిపించడం లేదు. పుట్టినరోజు, దరఖాస్తు ఐడీ నంబరు, ఆధార్‌నంబరు నమోదు చేసినా ‘డిటైల్స్ నాట్‌ఫౌండ్) అని వస్తోంది. దీంతో ప్రతాప్‌రెడ్డి ఆందోళన చెందుతున్నాడు. ♦ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్షను తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 21 నుంచి మార్చి 1వ తేదీ వరకు టెట్ 1, 2, 3 పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసలే ఆన్‌లైన్‌పై అవగాహన లేదని అభ్యర్థులు గగ్గోలు పెడుతుంటే... సుదూర ప్రాంతాల్లోని కేంద్రాలు కేటాయించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. ఇక మరికొందరు తమ హాల్‌టికెట్లు ఆన్లైన్లో కనిపించడం లేదని వాపోతున్నారు. రాయదుర్గం పట్టణంలోనే సుమారు వందమంది అభ్యర్థులు పేపర్–1, 2, 3 పరీక్షలు రాస్తుంటే వీరిలో 80 మందికిపైగా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మన రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో కేంద్రాలు వేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మహిళా అభ్యర్థినులకు తప్పని ఇక్కట్లు సుదూర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు పడిన మహిళా అభ్యర్థినులు తీవ్ర ఇక్కట్లు పడనున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల తల్లులు ప్రయాణ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. దీనికితోడు ఖర్చు కూడా భారీగా వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలతో పాటు మన రాష్ట్రంలో సుదూర ప్రాంతాల్లో కేంద్రాలకు మహిళా అభ్యర్థులు వెళ్లాలంటే కచ్చితంగా తోడుగా కుటుంబీకులను తీసుకెళ్లాలి. అందులోనూ ముందు రోజు వెళ్లాల్సి ఉంటుంది. పోను,రాను ప్రయాణం, భోజన, వసతి ఖర్చులన్నీ కలిపితే వేలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇవన్నీ తలచుకుని ఆర్థిక ఇబ్బందులున్న కొందరు పరీక్ష రాసేందుకు కూడా వెనుకంజ వేస్తున్నారు. కాగా టెట్ నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇప్పటిదాకా ఎలాంటి సమాచారం లేదు. హాల్‌టికెట్లు రాని కొందరు ఇక్కడి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు. -
పంచాయతీ కార్యదర్శుల ప్రిలిమ్స్ హాల్‌టిక్కెట్లు
మెయిన్స్‌కు సెంటర్ల ఆప్షన్ మార్పునకు అవకాశం అమరావతి: రాష్ట్రంలోని 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి ఏపీపీఎస్సీ ఈనెల 23వ తేదీన నిర్వహించనున్న స్క్రీనింగ్ టెస్టు (ప్రిలిమ్స్) పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అభ్యర్ధులకు హాల్టిక్కెట్ల జారీ ప్రక్రియను కమిషన్ చేపట్టింది. హాల్‌టిక్కెట్లు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని కమిషన్ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. ఈరోజు ఉదయం 11 గంటల తరువాత నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. హాల్‌టిక్కెట్లను డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఐఎన్ లేదా హెచ్‌టీటీపీ://ఏపీపీఎస్‌సీఏపీపీఎల్‌ఐసీఏటీఐఓఎన్‌ఎస్17.ఏపీపీఎస్సీ.జీఓవీ.ఐఎన్వెబ్ సైట్ల ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించారు. ఇలా ఉండగా పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసిన అభ్యర్ధులు తమ సొంత జిల్లాల్లో కాకుండా వేరే జిల్లా కేంద్రాల్లో స్క్రీనింగ్ టెస్టు రాసేలా ఆప్షన్లు ఇచ్చారు. తాము ఆ పరీక్ష రాసే జిల్లాల్లో స్థానికేతరులుగా మారిపోతామని, దీనివల్ల ఎంతో నష్టపోతామని ఆందోళన చెందారు. తాము సొంతజిల్లాల్లో పరీక్ష రాసేందుకు వీలుగా ఆప్షన్ల మార్పునకు అవకాశం కల్పించాలని ఏపీపీఎస్సీకి విన్నవించారు. వీరి అభ్యర్ధనలపై ఏపీపీఎస్సీ సానుకూలంగా స్పందించింది. స్క్రీనింగ్ టెస్టులో స్థానికత అన్నది పరీక్ష కేంద్రం ఆధారంగా నిర్ణయించేది కాదని ఏపీపీఎస్సీ మంగళవారం మరో ప్రకటనలో స్పష్టంచేసింది. మెయిన్స్‌లో మాత్రమే స్థానికత, ఇతర రిజర్వేషన్లు అమలు కానున్నందున ఆమేరకు మెయిన్స్‌కు పరీక్ష కేంద్రాల మార్పునకు అవకాశం కల్పించింది. ఈనెల 24వ తేదీనుంచి 30వ తేదీ వరకు అభ్యర్ధులు తమ పరీక్ష కేంద్రాలు మార్పు చేసుకోవచ్చని కమిషన్ వివరించింది. స్క్రీనింగ్ టెస్టు ఎక్కడ రాసినా మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసుకున్న కేంద్రమున్న జిల్లా ప్రాతిపదికన మాత్రమే స్థానికత, స్థానికేతర అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు. -
వ్యవసాయ పోస్టులకు హాల్ టికెట్లు విడుదల
ఏపీపీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఏప్రిల్ 4, 5 తేదీల్లో నిర్వహించనున్న వివిధ పోస్టులకు సంబంధించి పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ హాల్ టికెట్లను కమిషన్ వెబ్సైట్లో పొందిపరచినట్లు ఏపీ పీఎస్సీ కార్యదర్శి వైవీఎస్టీ సాయి తెలిపారు. కాగా అగ్రికల్చర్ డైరక్టరేట్‌లో వ్యవసాయ అధికారుల పోస్టులు, అసిస్టెంట్ కెమిస్ట్, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్‌లో అసిస్టెంట్ డైరక్టర్లు, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్లు, రాయల్టీ ఇన్స్పెక్టర్ పోస్టులకు గాను ఏపీపీఎస్సీ ఇంతకు ముందు నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. తుది ‘కీ’ ఆధారంగా రెస్పాన్స్ షీట్లు...: ఏపీపీఎస్సీ ఇంతకు ముందు జారీ చేసిన వివిధ విభాగాల్లోని అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల పరీక్షల ‘కీ’ని విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించింది. అనంతరం ఫైనల్ కీని ఖరారు చేసింది. దీని ఆధారంగా ఆయా అభ్యర్థుల వారీగా రెస్పాన్స్ షీట్లను రూపొందించింది. వీటిని అభ్యర్థులు పరిశీలించుకోవచ్చని ఏపీపీఎస్సీ పేర్కొంది. -
నిమిషం ఆలస్యమైనా..
నేటి నుంచి ఇంటర్ పరీక్షలు పరీక్ష కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకోవాలి.. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు ఈ–హాల్‌టికెట్లు చెల్లుబాటు సందేహాలుంటే సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ : 08462–245333 నిజామాబాద్ అర్బన్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని, 18వ తేదీ వరకు కొనసాగుతాయని, ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి ఒడ్డెన్న తెలిపారు. గురువారం నుంచి ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్ష కేంద్రానికి ఆరగంట ముందుగానే చేరుకోవాలి. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడదని అధికారులు పేర్కొంటున్నారు. సర్వం సిద్ధం జిల్లాలో 43 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 18,101 మంది జనరల్ విద్యార్థులు, 1,607 మంది వోకేషన్ విద్యార్థులు మొత్తం 19,708 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థులు 15,649, ప్రైవేట్ విద్యార్థులు 2,440 మంది.. మొత్తం 18,089 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 1,321, ప్రైవేట్ విద్యార్థులు 177 మంది మొత్తం 1,498 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం మొత్తం మంది విద్యార్థులు 39,295 మంది విద్యార్థులు ఉన్నారు.ప్రభుత్వ కళాశాలలు 17 సెంటర్లు, ఎయిడెడ్–2, రెసిడెన్షియల్–2, మోడల్ స్కూళ్లు–2, ప్రైవేట్‌లో–19 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణకు 1,007 ఇన్విజిలేటర్లను కేటాయించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 43 మందిని కేటాయించారు. మాస్‌కాపీయింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్ఐవో తెలిపారు. ఇందుకు సంబంధించి జిల్లాలోని ఫ్లయింగ్స్కా ్వడ్ బృందాలు 2, ఆరు సిట్టింగ్ స్కా ్వడ్ బృందాల తనిఖీలు చేయనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన హైపవర్ కమిటీ అందుబాటులో ఉంటుంది. పరీక్ష కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయనున్నారు. విద్యార్థులు వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్ఐవో తెలిపారు. అలాగే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలు తెలుసుకునేందుకు లోకేషన్ మ్యాప్‌ను అందుబాటులో తీసుకొచ్చినందుకు విద్యార్థుల హాల్‌టికెట్ నంబర్‌తో సెంటర్లు సులువుగా తెలుసుకోవచ్చును. మార్చి 9న పరీక్ష 19 తేదీకి మార్పు మార్చి 9వ తేదీన నిర్వహించవల్సిన సెకండరీయర్ గణితం–2, జువాలాజీ, హిస్టరీ పరీక్షలు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్నారు. విద్యార్థులకు పాత పరీక్ష కేంద్రాలలోనే పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులకు ఏమైన సందేహాలు ఉంటు 08462–245333 నెంబర్లకు సంప్రదించవచ్చును. -
‘టెక్నికల్ కోర్సు’ పరీక్షలు మార్చి 2 నుంచి
సాక్షి, హైదరాబాద్: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలు మార్చి 2 నుంచి ప్రారంభం కానున్నాయి. రెండు షిప్టుల్లో జరిగే ఈ పరీక్షలు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఆర్.సురేందర్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ పరీక్షలు మార్చి 2 నుంచి 5వ తేదీ వరకు, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ పరీక్షలు మార్చి 2న, టైలరింగ్, ఎంబ్రాయిడరీ హయ్యర్ గ్రేడ్ పరీక్షలు మార్చి 3 నుంచి 4వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే అభ్యర్థులకు హాల్‌టికెట్లు పంపిణీ చేశామని, హాల్‌టికెట్లు అందని వారు bse. telangana. gov. in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. -
నవంబర్ 26న కానిస్టేబుల్ రాతపరీక్ష
సాక్షి, హైదరాబాద్: పోలీసు కానిస్టేబుల్ (కమ్యూనికేషన్) పోస్టులకు నవంబర్ 26న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రాతపరీక్ష నిర్వహించనున్నామని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందే అభ్యర్థులు బోర్డు వెబ్సైట్ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. -
ఒకటో తేదీ నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 1 నుంచి 14 వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ వెంకటేశ్వర శర్మ తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు గురువారం తెలిపారు. 57 కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యేందుకు 17,490 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. 67 కేంద్రాల్లో నిర్వహించే ఎస్సెస్సీ పరీక్షలకు 20,659 మంది హాజరు కానున్నట్లు తెలిపారు. హాల్‌టికెట్లను telanganaopenschool.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఉదయం 8.30 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. మొదటి రోజు పరీక్షకు 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తామని, ఉదయం 9.35 గంటల తర్వాత, మధ్యాహ్నం పరీక్షకు 2.05 గంటల తర్వాత పరీక్ష హాల్లోకి అనుమతించబోమని వెల్లడించారు. రెండో రోజు నుంచి 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పరీక్ష రాసేందుకు రైటింగ్ ప్యాడ్, పెన్నులు, పెన్సిళ్లు, రబ్బర్లు, స్కేల్ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోమని చెప్పారు. -
ఓపెన్ స్కూల్ హాల్ టికెట్లు పంపిణీ
అనంతపురం ఎడ్యుకేషన్ : సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా ఈనెల 28 నుంచి జరిగే పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లు, స్కూల్ నామినల్ రోల్స్ ఆయా స్టడీ సెంటర్లకు పంపిణీ చేసినట్లు డీఈఓ అంజయ్య, ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఆయా స్టడీ సెంటర్ల కో ఆర్డినేటర్లను సంప్రదించి హాల్‌టికెట్లు పొందాలని సూచించారు. -
3 నుంచి ఎంసెట్-3 హాల్‌టికెట్లు
11వ తేదీన రాతపరీక్ష.. పక్కాగా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 లీకేజీ నేపథ్యంలో ఎంసెట్-3 పరీక్ష నిర్వహణకు సర్కారు పక్కాగా చర్యలు చేపడుతోంది. సెప్టెంబర్ 11న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ పరీక్ష హాల్‌టికెట్లను ఈ నెల 3 నుంచే డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56,153 మంది పరీక్షకు హాజరుకానున్నారు. ఇక ఈ రాత పరీక్షను పూర్తిగా నిఘా నీడలో చేపట్టనుంది. ఈ మేరకు ఎంసెట్ కమిటీ ఇప్పటికే పలుమార్లు పోలీసు శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించింది. మళ్లీ మళ్లీ మెడికల్ ఎంసెట్‌కు హాజరవుతున్న వారు, చాలా ఏళ్ల కింద ఇంటర్ ఉత్తీర్ణులైన వారు, ఇప్పటికే ఎంబీబీఎస్ చేస్తున్నవారు తిరిగి ఎందుకు ఎంసెట్ రాస్తున్నారన్న అంశంపై లోతైన విచారణ జరపాలని పోలీసు శాఖను కోరింది. ఇక విద్యార్థులు ఎంసెట్-3 హాల్‌టికెట్లను 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు tseamcet.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేసింది. ఎంసెట్-2 పరీక్ష సమయంలో పలు కేంద్రాల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తి అభ్యర్థుల నుంచి వేలిముద్రలు (బయోమెట్రిక్ డాటా) తీసుకోలేకపోయారు. దీంతో ఈసారి ప్రతి 200 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్ యంత్రం చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎంసెట్-3 పరీక్ష సమయానికి గంట ముందు నుంచే విద్యార్థుల నుంచి వేలిముద్రలు తీసుకోనున్నారు. 2011 నుంచి జరిగిన అన్ని ఎంసెట్ పరీక్షల ప్రశ్నపత్రాలను ఎంసెట్ కమిటీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
నేటి నుంచి టెట్ హాల్‌టికెట్లు
మే 1న రాత పరీక్ష సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 20వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరకు టెట్ విభాగం ఏర్పాట్లు పూర్తి చేసింది. అభ్యర్థులు తమ వెబ్సైట్ (http://tstet.cgg.gov.in) ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని టెట్ కన్వీనర్ జగన్నాథరెడ్డి వెల్లడించారు. ఈ పరీక్షకు 3,72,130 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని... అందులో పేపర్-1కు 99,993 మంది, పేపర్-2కు 2,72,137 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి అత్యధికంగా 64,030 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకోగా.. ఆదిలాబాద్ జిల్లా నుంచి తక్కువగా 15,413 మంది ఈ పరీక్ష రాయనున్నట్లు చెప్పారు. మే 1న ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష ఉంటుందని వివరించారు. మే 10 లేదా 11న ఫలితాలను ప్రకటించే అవకాశముంది. వివరాలు సరిచూసుకోండి.. హాల్‌టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత అభ్యర్థులు అందులోని వివరాలను సరిచూసుకోవాలి. అభ్యర్థి పేరు, తల్లి పేరు, తండ్రి పేరు, పుట్టినతేదీ, కులం, జెండర్, వైకల్యం లాంటి వివరాలు సరిగ్గా ఉన్నాయా, లేదా పరిశీలించాలి. పొరపాట్లు దొర్లితే పరీక్షహాల్లో నామినల్ రోల్ కమ్ ఫొటో ఐడెంటిటీ జాబితాలో వాటిని సరి చేయించుకోవాలి. ఫొటో, అభ్యర్థి హాజరయ్యే పేపర్, లాంగ్వేజ్-1 వంటి వివరాలు సరిగా లేకపోతే... వాటిని సరి చేసుకునేందుకు హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో టెట్ సెల్‌ను ఈనెల 25 నుంచి 29 మధ్య సరైన ఆధారాలతో సంప్రదించాలి. హాల్‌టికెట్‌లో రెండు భాగాలు ఉంటాయి. ప్రతి భాగంలో ముద్రించి ఉన్న ఫొటో కింద అలాంటి ఫొటోనే అతికించి సంతకం చేయాలి. పరీక్ష సందర్భంగా పైభాగాన్ని అభ్యర్థి తన వద్ద ఉంచుకుని, కింది భాగాన్ని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. -
నేటి నుంచి కానిస్టేబుల్ పరీక్షకు హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఆదివారం నుంచి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. హాల్‌టికెట్లను ఈ రోజు ఉదయం 7.30 గంటల నుంచి 22వ తేది అర్ధరాత్రి వరకు ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్ల కోసం అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, ఎస్ఎస్సీ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్‌చేస్తే హాల్‌టికెట్ ప్రత్యక్ష్యమవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి. మరిన్ని వివరాల కోసం 040-23150362, 040-23150462 నంబర్లు, support@tslprb.in ఈ మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని రిక్రూట్మెంట్ బోర్డు సూచించింది. వివిధ విభాగాలలోని 9,281 కానిస్టేబుల్ పోస్టులకు గానూ, దాదాపు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 24న కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించనున్నారు. -
టెన్షన్ వద్దు
సిటీబ్యూరో: టెన్త్ క్లాస్పరీక్షలు వచ్చేశాయి.. ఈనెల 21 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జరుగనున్నాయి.. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చే శాయి. పరీక్షలు వస్తున్నాయనే ఆందోళన చెందకండని నిపుణులు విద్యార్థులకు సూచిస్తున్నారు. పరీక్షలకు మొత్తం 1.78 లక్షల మంది రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 791 కేంద్రాలు ఏర్పాటు చేశారు. రె గ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు వేర్వేరు సెంటర్లు కేటాయించారు. ద్వితీయ భాష మినహా అన్ని పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరగుతాయి. ద్వితీయ భాష పరీక్ష మధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతుంది. ఇప్పటికే పరీక్షకు హాజ రయ్యే విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఆయా స్కూళ్లకు పంపించారు. ఫీజు విషయంలో స్కూల్ యాజ మాన్యాలు ఇబ్బందులకు గురిచేస్తే.. హాల్‌టికెట్లను వెబ్సైట్ నుంచి డౌల్‌లోడ్ చేసుకునే సౌకర్యాన్ని విద్యాశాఖ కల్పించింది. డౌల్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై సదరు స్కూల్ ప్రధానోపాధ్యాయులు లేదంటే గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకుని పరీక్షకు హాజరుకావాలని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల డీఈఓలు సోమిరెడ్డి, రమేష్ తెలిపారు. ఈ హాల్‌టికెట్లతో వచ్చే విద్యార్థులను పరీక్ష రాసేందుకు తప్పక అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో 21, రంగారెడ్డి జిల్లాలో 20 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను రంగంలోకి దించనున్నారు. పరీక్ష నిర్వహణ, కేంద్రాల చిరునామా తదితర విషయాలపై ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశాన్ని హైదరాబాద్ విద్యాశాఖ కార్యాలయం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఉదయం 8 గంటల నుంచే ఇవి పనిచేస్తాయి. ఇబ్బందులు తలెత్తకుండా... వేసవి దృష్ట్యా కేంద్రాల్లో తాగునీటికి కొరత లేకుండా చూస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో దాదాపు తాగునీటికి ఇబ్బందులు లేకపోవచ్చు. పరీక్షలు ముగిసేంతవరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఫిల్టర్ వాటర్‌ను అందుబాటులో ఉంచుతారు. అలాగే కేంద్రాల్లో ప్రథమ చికిత్స పెట్టెలతోపాటు పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. డీ హైడ్రేషన్, వడదెబ్బ తదితర ఆరోగ్య సమస్యలు తలెత్తితే అప్పటికప్పుడే చికిత్స అందిస్తారు. విద్యుత్ అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే జంట జిల్లాల కలెక్టర్లు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రానికి 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ఆ పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్లు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎర్రమంజిల్‌లో సీసీ కెమెరాలు నగరంలోని ఉన్నత పాఠశాలల్లో నిఘా నీడన పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాకో పెలైట్ ప్రాజెక్ట్ కింద ఒక పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు పరీక్షలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో ఎర్రమంజిల్ పాఠశాలలో మొత్తం 10 కెమెరాలు ఏర్పాటు చేశారు. తరగతి గదుల్లో 8, ప్రధానోపాధ్యాయుని చాంబర్ , బడి ఆవరణలో ఒకటి చొప్పున బిగించారు. మెరుగైన ఫలితాలు సాధిస్తాం.. పదో తరగతి పరీక్షలంటేనే కొంత ఆందోళన సహజమని, దాన్ని దూరం చేసేలా విద్యార్థులను సన్నద్ధం చేశామని డీఈఓలు పేర్కొన్నారు. పరీక్షలను ధైర్యంగా ఎదుర్కొనేలా, పాఠ్యాంశాలను అర్థం చేసుకుని చక్కగా సమాధానాలు రాసేలా వారిని తీర్చిదిద్దామని చెప్పారు. గతంలా కాకుండా.. ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. ఇలా చేయండి పరీక్షకు ముందు రోజు సెంటర్‌ను ఒకసారి చూస్తే కొంత ఆందోళన దూరమవుతుంది. పరీక్ష సమయానికి గంట ముందే సెంటర్‌కు చేరుకోవాలి. కనీసం ఉదయం 8.45 గంటలలోపు ఉండాలి సెల్ఫోన్లు, క్యాలిక్లేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. హాల్‌టికెట్, పెన్నులు, పెన్సిల్, రబ్బరు, స్కేల్, రైటింగ్ ప్యాడ్ ఎట్టిపరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. పెన్నులు అదనంగా ఉంచుకోవడం ఉత్తమం. ఎండ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ఏదైనా ఆహారం మితంగా తిని పరీక్షకు హాజరైతే మంచిది. జ్యూస్‌లు తీసుకుంటే నీరసం రాదు. ఒకవేళ హాల్‌టికెట్ పోగొట్టుకున్నా, ఫీజలు చెల్లించలేదని స్కూల్ యాజమాన్యాలు ఇబ్బందులకు గురిచేసినా హాల్‌టికెట్ పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గం ఉంది. www.bsetelangana.org వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని గెజిటెడ్ అధికారితో సంతకం చేయించుకుని పరీక్షలకు హాజరుకావచ్చు. -
టెన్త్ పరీక్షలకు హాల్ టికెట్లు జారీ
వెబ్సైట్నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు సాక్షి, హైదరాబాద్: ఈనెల 21నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ పూర్తి చేశామని ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎం.ఆర్.ప్రసన్నకుమార్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ హాల్‌టికెట్లను ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈఏపీ.ఓఆర్జీ’’ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. బోర్డు జారీచేసిన హాల్‌టికెట్లు అందకపోయినా, వాటిని పోగొట్టుకున్నా విద్యార్థులు ఈ వెబ్సైట్నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై పాఠశాల ప్రధానోపాధ్యాయునితో అటెస్టెడ్ చేయించుకోవాలని సూచించారు. -
నేటి నుంచే ఇంటర్ పరీక్షలు
* పావుగంట ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతి * అరగంట ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకుంటే మంచిది * హాజరు కానున్న 9.64 లక్షల మంది విద్యార్థులు * హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 21 వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. బుధవారం ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కానుండగా, గురువారం నుంచి సెకండియర్ పరీక్షలు మొదలు కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకే పరీక్ష ప్రారంభమవుతుంది. ఇంటర్ పరీక్షల్లో ప్రప్రథమంగా ఈ ఏడాది నుంచే నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ విధానాన్ని బోర్డు అమలు చేస్తోంది. ఎంసెట్ తరహాలోనే ఇంటర్ పరీక్షల్లోనూ హైటెక్ కాపీయింగ్ జోరుగా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తుండటంతో ఈ నిబంధనను అమలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులను నిర్ధేశిత సమయం కన్నా పావుగంట(8.45గంటలకే) ముందుగానే పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు. విద్యార్థులు వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యం చేసి ఆ తర్వాత నష్టపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఫీజు చెల్లించకపోవడం లేదా ఇతర కారణాలతో ప్రైవేటు జూనియర్ కళాశాలలు విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వని పక్షంలో వెబ్సైట్(www.tsbie.cgg. gov.in) నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును బోర్డు కల్పించింది. విద్యార్థుల హాల్టికెట్లలో ఏవైనా పొరపాట్లు ఉన్నట్లు గమనిస్తే.. సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లి మార్పు చేయించుకోవాలి. పరీక్షల సందర్భంగా మాస్ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు 50 ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 200 వరకు సిట్టింగ్ స్క్వాడ్లను పోలీసు, రెవెన్యూ బృందాలతో ఇంటర్ బోర్డు ఏర్పాటు చేసింది. ఇన్విజిలేషన్ విధుల్లో 24,651 మంది లెక్చరర్లు, 3,388 మంది టీచర్లు పాల్గొంటారు. పరీక్షలకు 1,257 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 478 ప్రభుత్వ కాలేజీలు, 34 ఎయిడెడ్ కాలేజీలు, 745 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. 118 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సూచనలు - పరీక్ష హాల్లో ఇన్విజిలేటర్లు ఇచ్చిన ఓఎంఆర్ బార్కోడ్లో పేరు, హాల్‌టికెట్ నంబర్, మీడియం వివరాలను విద్యార్థులు సరిచూసుకోవాలి. - జవాబుల బుక్‌లెట్‌లో 24 పేజీలు ఉన్నాయా? లేదా? చూసుకోవాలి. వేరు అడిషనల్ షీట్స్ ఇవ్వరు. కొత్త సిలబస్, పాత సిలబస్‌ను జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటిసారి పరీక్షలు రాసే వారంతా న్యూ సిలబస్ ప్రశ్నపత్ర ంతోనే రాయాలి. - దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇంటర్ పరీక్షల నిమిత్తం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. - పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. పరీక్ష కేంద్రాల్లో జామర్లు ఉంటాయి. - చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, అనుమతి పొందిన వారు మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలి. అదీ ప్రశ్నపత్రాల చేరవేత కోసమే. వారి ఫోన్లపైనా హైటెక్ నిఘా ఉంటుంది. జీపీఎస్ సహాయంతో వారి ఫోన్ నుంచి ఇతరులకు ఫోన్ వెళ్లినా, మెసేజ్ వెళ్లినా, ఇతరుల ఫోన్ల నుంచి వారి ఫోన్లకు కాల్ వచ్చినా, మెసేజ్ వచ్చినా రికార్డు చేస్తారు. ఇంటర్ పరీక్షలకు హాజరు కానున్న విద్యార్థులు ఫస్టియర్ జనరల్ 4,20,161 ఒకేషనల్ 36,494 సెకండియర్ జనరల్ 4,73,882 వొకేషనల్ 34,127 మొత్తం 9,64,664 -
కాలేజీ ముందు విద్యార్థినుల ఆందోళన
యాకుత్‌పురా (హైదరాబాద్) : పరీక్ష ప్రారంభమైనా తమకు హాల్ టిక్కెట్లు ఇవ్వలేదంటూ విద్యార్థినులు కళాశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటన యాకుత్‌పురాలో ఉన్న ఇస్లామియా బీఈడీ కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పరీక్ష ప్రారంభమైనా హాల్ టిక్కెట్లు మంజూరు చేయని యాజమాన్య వైఖరిని నిరసిస్తూ విద్యార్థినులు కాలేజీ ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
హాల్ టికెట్ టెన్షన్
60 శాతం హాజరు లేని ఇంటర్ విద్యార్థులకు హాల్‌టిక్కెట్లు ఇవ్వని వైనం జిల్లాలో 90 మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంఆర్థిక ఇబ్బందులతో గైర్హాజరయ్యామంటున్న విద్యార్థులు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మరో మూడు రోజుల్లో ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొంత మంది విద్యార్థులకు హాల్ టికెట్లు అందక పోవడంతో ఆందోళన చెందుతున్నారు. దాదాపు 76 వేల మంది విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కాగా హాజరు శాతం తక్కువగా ఉన్న 90 మందికి హాల్ టిక్కెట్లు ఇవ్వకపోడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇంటర్ బోర్డు నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థుల హాజరు 75 శాతం ఉండాలి. వారికే హాల్ టిక్కెట్లను ఇస్తారు. 69-74 శాతం హాజరు ఉంటే రూ. 200, 65-69 శాతం హాజరుకు రూ.250, 60-64 శాతం హాజరుకు రూ. 400 అపరాధ రుసుంతో పరీక్షలు రాసేందుకు అనుమతి ఇస్తారు. 60 శాతం కంటే తక్కువ హాజరు ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించరు. దాదాపుగా ప్రైవేట్ కళాశాలల్లో హాజరు శాతం తక్కువగా ఉన్నా విద్యార్థులు పరీక్షలు రాస్తారు. ఆయా యాజమన్యాలు రూ.2 వేల వరకు వారి నుంచి వసూలు చేసి 60 శాతానికిపైగా హాజరు వేసి ఇబ్బంది లేకుండా చూస్తారు. అయితే ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలల్లో కచ్చితమైన హాజరు ఉంటుంది. వీరికి హాజరులో ప్రిన్సిపాళ్లు ఎలాంటి మినాహాయింపు ఇవ్వరు. ప్రభుత్వ నిర్ణయం కోసం నిరీక్షణ హాజరు శాతం తక్కువగా ఉన్నా ఆర్ట్స్ విద్యార్థులకు మాత్రం అనుమతి ఇస్తారు. సైన్స్ విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో 60 శాతం హాజరు లేకుంటే అనుమతించరు. ప్రతి ఏటా చివరి సమయంలో ఆర్ట్స్ విద్యార్థులకు మాత్రం రూ. 500 ఫైన్‌తో పరీక్షలు రాసేందుకు వీలు కల్పిస్తారు. అయితే ఈ సారి మరో మూడు రోజుల సమయమే ఉన్నా ఆర్ట్స్ విద్యార్థుల అనుమతిపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం పరీక్షలకు అనుమతి ఇస్తుందా లేదా అన్న విషయంపై విద్యార్థులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఉన్నతాధికారులకు నివేదించాం నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు ఉండాలి. లేకుంటే పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వం. అయితే కొన్ని సడలింపులతో 60 శాతం హాజరు ఉన్నా హాల్ టిక్కెట్లు ఇస్తున్నాం. కనీసం 60 శాతం లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేందుకు మాకు అధికారంలేదు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. - పరమేశ్వరరెడ్డి, ఆర్ఐఓ 58 శాతం హాజరు ఉంది నా పేరు రమేష్. మా ఊరు పర్ల. నేను బీక్యాంపు జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్నాను. కరువు పరిస్థితుల నేపథ్యంలో కళాశాలకు సక్రమంగా హాజరు కాలేదు. 58 శాతం హాజరు ఉంది. పరీక్ష ఫీజు కట్టాను. ఇప్పుడు పరీక్షలు రాయనీయమంటే ఎలా? రమేష్, బీక్యాంప్ జూనియర్ కళాశాల -
జంబ్లింగ్.. గ్యాంబ్లింగ్!
ఒక్కో విద్యార్థి నుంచి రూ.800 నుంచి 1000 వసూలు చెల్లించకపోతే హాల్టిక్కెట్ల నిరాకరణ {పైవేటు, కార్పొరేట్ కాలేజీల దందా కొల్లగొట్టేది రూ.2 కోట్లపైనే విశాఖపట్నం: జంబ్లింగ్ బెడద తప్పిందని సంతోషిస్తున్న ఇంటర్ విద్యార్థులకు పలు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు సరికొత్త షాక్ ఇస్తున్నాయి. ఇదే వంకతో విద్యార్థుల నుంచి దండిగా దోచుకుంటున్నాయి. గురువారం నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి హాజరయ్యే విద్యార్థుల నుంచి ప్రైవేటు కాలేజీలు రూ.500, కార్పొరేట్ కళాశాలు రూ.800 నుంచి వెయ్యి రూపాయల తక్షణమే చెల్లించాలని నిబంధన విధించాయి. ఈ సొమ్ము ఇస్తేనే ప్రాక్టికల్స్‌కు హాల్‌టిక్కెట్లు ఇస్తామని పితలాటకం పెడుతున్నాయి. దీంతో విద్యార్థులు లబోదిబో మంటున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పిల్లలకు గురువారం నుంచి ఈ నెల 24 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. కొద్దిరోజులుగా జంబ్లింగ్ ఉంటుందంటూ హడావుడి చేసిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో రద్దు చేసింది. హమ్మయ్యా! అనుకుంటున్న తరుణంలో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఒక్కో విద్యార్థి నుంచి భారీగా సొమ్ము దండుకునే ఎత్తుగడ వేశాయి. ప్రాక్టికల్ పరీక్షలకు వచ్చే ఎగ్జామినర్లు మార్కులు ఎక్కువగా వేసేలా ‘మేనేజ్’ చేయడానికి ఈ సొమ్ము చెల్లించాల్సిందేనని ఆయా యాజమన్యాలు తెగేసి చెబుతున్నాయి. మీ పిల్లలకు మార్కులు పెరగడం కోసమే ఇదంతా.. మా కోసం కాదు.. అంటుండడంతో విధిలేని పరిస్థితుల్లో పలువురు తల్లిదండ్రులు అడిగినంతా ఇచ్చేస్తున్నారు. చెల్లించని వారి పిల్లలను టార్గెట్ చేసి మార్కులు తగ్గించేస్తారేమోనన్న భయంతో విధిలేక చెల్లిస్తున్న వారూ ఉన్నారు. ఎంపీసీ విద్యార్థులకు భౌతిక, రసాయనశాస్త్రాలకు 30 చొప్పున 60 మార్కులకు, బైపీసీ వారికి భౌతిక, రసాయన, జంతు, వృక్షశాస్త్రాలకు ఒక్కో దానికి 30 చొప్పున 120 మార్కులకు ప్రాక్టికల్స్ మార్కులుంటాయి. జేఈఈ మెయిన్స్‌కు వెయిటేజీ మార్కులు 40 శాతం, ఎంసెట్‌కు 25 శాతం ఉంది. జేఈఈ మెయిన్స్‌లో ఒక్క మార్కు తేడాలో 1200 ర్యాంకు వెనక్కి పోతుంది. కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు తమ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, ఎంసెట్‌లో ర్యాంకుల కోసం ఎగ్జామినర్స్ (వీరిలో అధికులు కాంట్రాక్టు లెక్చరర్లే) పేపరుకి కొంత మొత్తం చొప్పున ముట్టచెబుతుంటారు. పలు ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు ఇప్పటికే విద్యార్థుల నుంచి ఇదివరకే ల్యాబ్ ఫీజుల పేరుతో రూ.1000-1500 వరకు వసూలు చేశారు. ఈ ఏడాది విశాఖ జిల్లా, నగరం మొత్తమ్మీద 172 సెంటర్లలో 33.742 మంది ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు రాస్తున్నారు. వీరిలో దాదాపు 22 వేల మంది (ఎంపీసీ 15 వేలు, బైపీసీ 7 వేలు) ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్నారు. వీరు కాకుండా ఒకేషనల్ విద్యార్థులు మరో ఐదు వేల మంది వరకు ఉన్నారు. వీరి నుంచి సగటున రూ.800 చొప్పున వసూలు చేస్తే సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ వ్యవహారం బాహాటంగా జరుగుతున్నా సంబంధిత అధికారులు తమకేమీ తెలియదన్నట్టు వ్యవహరిస్తున్నారు. వసూలు నేరమే.. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన పనిలేదు. అలా వసూలు చేసే కాలేజీపై చర్యలు తీసుకుంటాం. నోటీసులిచ్చాక జరిమానా కూడా విధిస్తాం. ఇప్పటిదాకా మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు ఇస్తే విచారణ జరిపి తక్షణమే చర్య తీసుకుంటాం. -టి.నగేష్, ఆర్ఐవో, విశాఖ ఆ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలి అక్రమ వసూళ్లు చేస్తున్న కాలేజీలపై ఆర్ఐవో విచారణ జరిపి వాటి గుర్తింపు రద్దుచేయాలి. బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఇలా వసూలు చేసిన సొమ్మును తిరిగి విద్యార్థులకు చెల్లించాలి. లేనిపక్షంలో ప్రాక్టికల్స్ రాస్తున్న ఏబీవీపీ విద్యార్థుల ద్వారా అక్రమాల సమాచారం తెలుసుకుని ఆర్ఐవోపై చర్య తీసుకునే వరకు ఆందోళన చేస్తాం. -కె.వాసు, జిల్లా కన్వీనర్, ఏబీవీపీ -
మనీతో అటెండెన్స్ !
నకిలీ అటెండెన్స్‌తో కేఎంసీలో హాల్ టికెట్లు విచారణకు ఆదేశించిన ప్రిన్సిపాల్ ఎంజీఎం : కాకతీయ మెడికల్ కళాశాలలో టెక్నికల్ విభాగం కోర్సును పలువురు ఆడుతూ పాడుతూ పూర్తి చేస్తున్నారు. కేవలం పరీక్షలకు హాజరై సర్టిఫికెట్ పొందుతున్నారు. డబ్బులతో నకిలీ అటెండెన్స్ సమర్పించి హాల్ టికెట్ తీసుకొని పరీక్షలకు హాజరవుతున్నారు. ఇది కొన్నేళ్లుగా సాగుతోంది. కాగా నాలుగు రోజుల క్రితం రేడియూలజీ విభాగంలో ఇదే తరహాలో జరగడంతో అధికారులు గుర్తించి విచారణకు ఆదేశాలు జారీచేశారు. కాకతీయ మెడికల్ కళాశాలలో డీఎంఐటీ, డీఎంఎల్టీ, ఈసీజీ, డీడీఆర్ఏ, డీసీఆర్ఏ వంటి పలు టెక్నికల్ కోర్సుల్లో ఎంతోమంది విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. ప్రతి కోర్సును రెండు సంవత్సరాలు విద్యనుభ్యసించి పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే కోర్సులో చేరిన వారు ఉదయం 9 గంటల నుంచి 2 గంటల నుంచి ఎంజీఎంలో పనిచేస్తూ 2 గంటల నుంచి 4 గంటల వరకు కేఎంసీ కళాశాలలో తరగతులను వినాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనలను ఏ మాత్రం టెక్నికల్ కోర్సును అభ్యసించే వారికి కానరావు. ఇలాంటి వారికి ఆటెండెన్స్ ఇచ్చేందుకు కళాశాలలో ఓ టీమ్ ఏర్పడి పెద్ద దందా కొన్నేళ్లుగా కొనసాగిస్తోంది. నాలుగు రోజుల క్రితం రేడియూలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ గుర్తించడంతో వెలుగులోకి వచ్చింది. ఇద్దరు విద్యార్థులు ఏనాడూ హాజరు కాకుండా ఎలా హాల్ టికెట్లు పొందారనే విషయంపై సదరు ప్రొఫెసర్ కేఎంసీ ప్రిన్సిపాల్ అబ్బగాని విద్యాసాగర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన కేఎంసీ ప్రిన్సిపాల్ అసలు వారికి ఎవరు అటెండెన్స్ అందించారనే విషయంతోపాటు కొన్నేళ్లుగా సాగుతున్న ఈ దందాపై పూర్తిస్థాయి విచారణకు కమిటీ వేసినట్లు ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. అంతేకాకుండా పలు కోర్సుల్లో నకిలీ అటెండెన్స్ ఇస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు డీఎంఈ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు స్పష్టంచేశారు. ఇప్పటికైనా ఆయా విభాగాల అధిపతులు స్పందించి పలు టెక్నికల్ కోర్సుల్లో నకిలీ అటెండెన్స్ ఇస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. -
హాల్‌టికెట్ల కోసం డీఈడీ విద్యార్థుల రాస్తారోకో
-
హాల్‌టికెట్ల కోసం డీఈడీ విద్యార్థుల రాస్తారోకో
ఒంగోలు: పరీక్ష కొద్దిసేపట్లో రాయాల్సి ఉన్నా హాల్‌టికెట్లు ఇవ్వనందుకు నిరసనగా సోమవారం ఉదయం డీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఒంగోలు లోని పేర్నమిట్ట వెంకటసాయి డీఈడీ కాలేజీ, ఎన్.ఆగ్రహారంలోని లిటిల్ స్టార్ డీఈడీ కాలేజీలకు చెందిన సుమారు 40 మంది పరీక్ష కేంద్రమైన కర్నూలు రోడ్డులో ఉన్న జేవియర్ కళాశాల వద్ద రాస్తారోకో చేశారు. వెంటనే హాల్ టికెట్లు ఇవ్వాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. గుంటూరు: గుంటూరు జిల్లాలో కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. జిల్లాలోని వినుకొండలోని జీఎస్ఆర్ డీఈడీ కళాశాల వద్ద విద్యార్థులు ధర్నా చేప్టటారు. కొద్దిసేపట్లో పరీక్షలు రాయాల్సి ఉన్నా ఇప్పటికీ హాల్‌టికెట్లు ఇవ్వలేదని ప్రిన్సిపల్ చాంబర్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే హాల్‌టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఆన్లైన్లో స్కాలర్షిప్ పరీక్ష హాల్ టికెట్లు
సాక్షి, హైదరాబాద్: నవంబర్ 8న జరగనున్న జాతీయ ప్రతిభా అన్వేషణ పరీక్ష (రాష్ట్ర స్ధాయి ఎన్టీఏఎస్ఈ), నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (ఎన్ఎంఎంఎస్)లకు సంబంధించిన హాల్ టికెట్లను గురువారం నుంచి ఆన్లైన్లో ఉంచుతున్నట్లు బుధవారం ప్రభుత్వ పరీక్షల సంచాలకులు యం.ఆర్. ప్రసన్న కుమార్ తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను కార్యాలయం వెబ్ సైట్ www.bseap.org నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా కోరారు. ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశాలు హైదరాబాద్: ఓయూ క్యాంపస్ ఆంధ్ర మహిళా సభ ఉపాధ్యాయ విద్య కళాశాలలో నిర్వహిస్తున్న పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కష్ణవేణి తెలిపారు. ఏడాది కాల వ్యవధి గల ఈ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు దేశ విదేశాల్లో టీచర్ ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 040-9440365510 నంబర్‌ను సంప్రదించవచ్చు. బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో... హైదరాబాద్: ఓయూ క్యాంపస్ ఆంధ్రమహిళా సభ ఉపాధ్యాయ విద్య కళాశాలలో నిర్వహిస్తున్న బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ కష్ణవేణి తెలిపారు. ఎడ్‌సెట్-2015 రాయకున్నా ఓసీలు 50 శాతం, బీసీలు 45 శాతం, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం మార్కులతో డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. వివరాలకు 9000596158 నంబర్‌ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. -
20 న ఏఈఈ పోస్టుల ఆన్లైన్ పరీక్ష
హైదరాబాద్ : ఈ నెల 20న ఏఈఈ పోస్టులకు ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. 14 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని అభ్యర్ధులకు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఏఈఈ పోస్టుల ఆన్లైన్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు బోర్డు వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 99 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. అవసరమనుకున్న అభ్యర్ధుల కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో మాక్ టెస్టులు అందుబాటులో ఉంచుతున్నట్లు కమిషన్ సభ్యులు తెలిపారు. -
ప్రైవేటు ఎం-సెట్ మాయ
-
ప్రైవేటు ఎం-సెట్ మాయ
డౌన్లోడ్ కాని హాల్‌టికెట్లు.. హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లూ దిక్కులేవు ♦ సీట్లు కొన్న వారికే డౌన్లోడ్ అయ్యేలా చేశారన్న ఆరోపణలు ♦ యథేచ్ఛగా అక్రమాలు.. ఆందోళనలో విద్యార్థులు ♦ అందుబాటులో లేని కన్వీనర్.. ♦ ఫోన్ నంబర్ చెప్పేందుకు యాజమాన్యాల నిరాకరణ సాక్షి, హైదరాబాద్: సమాచారం ఇవ్వకుండా హడావుడిగా నోటిఫికేషన్.. పదిరోజుల్లోనే పరీక్ష, దరఖాస్తు గడువు 4 రోజులే.. ఇష్టారాజ్యంగా పరీక్షా కేంద్రాలు.. ఇప్పుడు డౌన్లోడ్ కాని హాల్‌టికెట్లు, ఫిర్యాదు చేద్దామన్నా దిక్కులేని ఫోన్ నంబర్లు... రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల్లో 35శాతం యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న ‘ప్రైవేటు’ ఎం-సెట్ మాయ ఇది. భారీ స్థాయిలో అక్రమాలు, అవకతవకలు, వందల కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలున్న ఈ పరీక్ష నిర్వహణ మరింత అనుమానాస్పదంగా మారుతోంది. బుధవారమే ఈ పరీక్ష జరుగనున్నా విద్యార్థులకు హాల్‌టికెట్లు డౌన్లోడ్ కావడం లేదు. ఫిర్యాదు చేద్దామన్నా ఎలాంటి ఫోన్ నంబర్లూ లేవు, చివరికి ఈ పరీక్ష కన్వీనర్ కూడా అందుబాటులో లేరు. ఇప్పటికే సీటుకు కోటి రూపాయల చొప్పున అమ్మేసుకున్న కాలేజీలు.. ఆ అభ్యర్థులకే సీట్లు దక్కేలా ‘అంతా’ సిద్ధం చేసుకున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఈ వ్యవహారం సాగుతోందని తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కాలేజీల సంఘం నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశపరీక్ష (ఎం-సెట్) బుధవారమే జరుగనున్నా.. ఈ పరీక్ష హాల్‌టికెట్లు డౌన్లోడ్ కావడం లేదు. దీంతో వందలాది మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. కంప్యూటర్ల ముందు కూర్చుని గంటల తరబడి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. పైగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనేకమంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. దరఖాస్తును సబ్మిట్ చేసినప్పుడు ఆమోదించినట్లు సందేశం వచ్చాక... హాల్‌టికెట్ తీసుకునే సమయానికి ఎలా తిరస్కరణకు గురవుతాయని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అంతేగాకుండా అసలు ఈ పరీక్షకు సంబంధించి ఎం-సెట్ కన్వీనర్ నుంచి కనీస వివరణలు కూడా వెలువడడం లేదు. ఆయనను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఎం-సెట్ కన్వీనర్‌ను సంప్రదించేందుకు ఫోన్ నంబర్ ఇవ్వాలని యాజమాన్యాల అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణను ‘సాక్షి’ ప్రతినిధి అడగగా.. ఆయన తెలియదని సమాధానం ఇవ్వడం గమనార్హం. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కూడా స్పందించడం లేదు. చేతులెత్తేసిన సర్కారు ప్రత్యేక ఎం-సెట్‌పై ప్రైవేటు కాలేజీలకే పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రభుత్వం.. యాజమాన్యాల అక్రమాలను అడ్డుకోవడంపై చేతులెత్తేసింది. ‘ఈ పరీక్షకు మాకు సంబంధం లేదు. యాజమాన్యాలకే అప్పగించాం. ప్రశ్నపత్రాన్ని జేఎన్టీయూకు, పరీక్ష నిర్వహణ టాటా కన్సల్టెన్సీకి ఇచ్చాం. కాబట్టి మాకు బాధ్యత లేద’ని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతేగాకుండా పరీక్షా కేంద్రాలను ఏ ప్రభుత్వ అధికారి కూడా తనిఖీలు చేయలేదన్న విమర్శలున్నాయి. యాజమాన్యాలు అంతా గోప్యం గా, ఇష్టారాజ్యంగా పరీక్షను నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. దీంతో ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు వైద్యవిద్య మరింత దూరం కానుంది. సీట్లు కొన్నవారికే వచ్చేలా! రాష్ట్రంలో 12 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లోని 35 శాతం యాజమాన్య కోటా సీట్లకు ప్రత్యేక ఎం-సెట్‌ను నిర్వహిస్తున్నారు. అయితే ఈ 35 శాతం సీట్లను ఇప్పటికే అమ్మేసుకున్న యాజమాన్యాలు.. ఈ పరీక్షను నామమాత్రంగా నిర్వహిస్తున్నాయి. సీట్లు కొన్న విద్యార్థులకే ఇందులో ర్యాంకులు వచ్చేలా అంతా ‘సిద్ధం’ చేసేసుకున్నట్లు తెలిసింది. జేఎన్టీయూ ప్రశ్నపత్రం తయారు చేస్తున్నా, పరీక్ష నిర్వహణ బాధ్యతను టాటా కన్సల్టెన్సీకి అప్పగించినా.. యాజమాన్యాలు మాత్రం పకడ్బందీగా అక్రమాలకు వ్యూహం పన్నాయి. తెలంగాణలో 15, ఏపీలో 11 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో కొన్నింటిలో ఇప్పటికే సీట్లు కొన్నవారు మాత్రమే పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. తద్వారా వారు సులువుగా సమాధానాలు రాసేలా సిద్ధం చేశారని, ఈ మేరకు ఇన్విజిలేటర్లకు ప్రత్యేక సూచనలు చేశారని సమాచారం. మైనారిటీ సీట్లకూ ప్రత్యేక పరీక్ష? రాష్ట్రంలోని మైనారిటీ వైద్య కళాశాలల్లో ఉన్న 25 శాతం యాజమాన్య కోటా సీట్లకు కూడా నాన్-మైనారిటీ కాలేజీల తరహాలో ప్రత్యేక వైద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష (ఎం-సెట్) నిర్వహించాలని వాటి యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరాయి. అయితే దీనిని ప్రభుత్వం తిరస్కరించింది. ఆ ప్రత్యేక ఎం-సెట్తోపాటే మైనారిటీ సీట్లకు కూడా నిర్వహించి ఉంటే బాగుండేదని స్పష్టం చేసింది. సాధారణ ఎంసెట్‌కు తోడు మరో రెండు పరీక్షలు నిర్వహించడం కుదరదని, పైగా ఈనెల 5వ తేదీ నాటికి ప్రవేశ పరీక్షలన్నీ అయిపోవాలన్న ఎంసీఐ నిబంధన ప్రకారం అది సాధ్యంకాదని తేల్చిచెప్పింది. మరోవైపు రాష్ట్రంలో రెండు మైనారిటీ వైద్య కాలేజీల్లో ఉన్న 75 యాజమాన్య కోటా సీట్లకు ఇంటర్ వెయిటేజీని 25 శాతం నుంచి 50 శాతానికి పెంచాలని సర్కారు యోచిస్తోంది. ఇక ఎన్నారై కోటా సీట్ల ఫీజును రూ.13.5 లక్షలకు పెంచాలని మైనారిటీ వైద్య కళాశాలలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఈ ఫైలు సీఎం వద్దకు వెళ్లినట్లు సమాచారం. -
18 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ హాల్ టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 24న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 18 నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ ముంబై తన వెబ్సైట్లో పేర్కొంది. ఈ నెల 11 నుంచే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని నోటిఫికేషన్ సందర్భంగా ప్రకటించింది. అయితే చాలా మంది విద్యార్థులు తమ ఫొటోలు, సంతకాలు, ఇతర సర్టిఫికెట్లు అప్లోడ్ చేయని కారణంగా దానిని ఈనెల 15కు వాయిదా వేసింది. అయితే ఇప్పటికీ ఇంకా కొంతమంది విద్యార్థులు వివరాలు అప్లోడ్ చేయని కారణంగా ఈనెల 18కి వాయిదా వేసినట్లు పేర్కొంది. 18 నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. -
15 నుంచి జేఈఈ అడ్వాన్స్డ్ హాల్‌టికెట్లు
సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశానికి ఈనెల 24న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈనెల 15 నుంచి హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐఐటీ ముంబై తెలిపింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సోమవారం (11వ తేదీ) నుంచే హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాల్సి ఉండగా, దానిని 15వ తేదీకి వాయిదా వేసినట్లు తమ వెబ్సైట్లో పేర్కొంది. విద్యార్థులు 20వ తేదీ వరకు హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని, వాటిల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే మార్పు చేసుకోవచ్చని వెల్లడించింది. -
2 నుంచి ఏపీ ఎంసెట్ హాల్ టికెట్లు జారీ
కాకినాడ(తూర్పుగోదావరి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 8న ఏపీ ఎంసెట్ పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని ఎంసెట్-2015 చైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి ప్రొఫెసర్ వీఎస్ఎస్ కుమార్ శుక్రవారం తెలిపారు. ఈనెల 2వ తేదీ నుంచి 6 వరకు ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంసెట్.ఓఆర్జీ’ వెబ్సైట్ నుంచి హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ సీహెచ్.సాయిబాబు తెలిపారు. పరీక్ష సమయానికి 2 గంటల ముందే కేంద్రానికి చేరుకోవాలన్నారు. గంట ముందు హాలులోకి అనుమతిస్తామన్నారు. ఒక నిమిషం ఆలస్యమైనా అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. -
రెగ్యులర్ విద్యార్థికి ఓల్డ్ పేపర్
కేయూ డిగ్రీ పరీక్షలో ఘటన హాల్‌టికెట్‌లో ఎక్స్ స్టూడెంట్ అని తప్పు దొర్లడమే కారణం కేయూ క్యాంపస్ : కేయూ పరీక్షల విభాగం తప్పు ఓ డిగ్రీ విద్యార్థిని ఇరకాటంలో పడేసింది. హాల్‌టికెట్‌లో ఎక్స్స్టూడెంట్గా తప్పు దొర్లడంతో రెగ్యులర్ ప్రశ్నపత్రం ఇవ్వకుండా.. ఓల్డ్పేపర్ ఇవ్వడమే ఇందుకు కారణం. విద్యార్థి కథనం ప్రకారం... హన్మకొండలోని న్యూసైన్స్ డిగ్రీ కాలేజీలో కె.సందీప్ డిగ్రీ బీకాం కంప్యూటర్స్ కోర్సు సెకండియర్ చదువుతున్నాడు. హన్మకొండలోని కాకతీయ మ హిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం కేటాయించారు. ఈ నెల 19న ఇంగ్లిష్ సబ్జెక్టు పేపర్‌తో పరీక్షలు ప్రారంభమయ్యాయి. సందీప్ పరీక్ష రాసేందుకు కాకతీయ మహిళా డిగ్రీ కళాశాలకు వెళ్లగా అక్కడ ఇన్విజిలేటర్ ఇంగ్లిష్ ఎక్స్స్టూడెంట్కు ఇచ్చే ఓల్డ్ ప్రశ్నపత్రం ఇచ్చారు. తాను రెగ్యులర్ స్టూడెంట్‌నని, ఈ మేరకు ప్రశ్నపత్రం ఇవ్వాలని కోరారు. అందుకు ఇన్విజిలేటర్ హాల్‌టికెట్‌పై ఎక్స్ స్టూడెంట్ అని ఉందని.. తామే ఏం చేయలేమని చెప్పా డు. దీంతో అతడు పరీక్ష సరిగ్గా రాయలేకపోయూడు. శుక్రవారం యూనివర్సిటీలోని సం బంధిత అధికారులను సంప్రదించగా... మీరు చది విన కాలేజీకి వెళ్లి సరిచేయించుకోవాలని సూచిం చారు. దీంతో అతడు న్యూసైన్స్ డిగ్రీకాలేజికి వెళ్లి సరిచేరుుంచుకున్నాడు.పరీక్షల విభాగం నుంచి వచ్చి న హాల్‌టికెట్‌లో తప్పు దొర్లడం వల్ల తాను ఇంగ్లిష్ పరీక్ష సరిగా రాయలేకపోయూనని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయూలని వేడుకున్నాడు. -
జేఈఈ మెయిన్‌లో ‘తెలంగాణ బోర్డు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి ఇంటర్ పరీక్షలు రాస్తున్నట్లుగా జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో మార్పు చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చర్యలు చేపట్టిందని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం వచ్చే నెల 4న ఆఫ్‌లైన్‌లో, 10, 11 తేదీల్లో ఆన్లైన్లో జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టిందని పేర్కొంది. ఇందులో భాగంగా తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డుకు చెందిన విద్యార్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునేటప్పుడు తాము తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియెట్ బోర్డు నుంచి పరీక్షలు రాస్తున్న అభ్యర్థులుగా వివరాలను నమోదు చేయాలని, ఆ తరువాతే హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బోర్డు పేరు ఉన్న చోట తెలంగాణ స్టేట్ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ పేరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. అలాగే దరఖాస్తు సమయంలో ఇచ్చిన ఆప్షన్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి మార్చుకోవచ్చని వివరించింది. విద్యార్థులు స్టేట్ ఆప్షన్‌ను మార్చుకునేందుకు తమ దరఖాస్తు నంబరును jeemain@nic.in మెయిల్‌కు పంపించాలని సూచించింది. -
సర్వం సిద్ధం
రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు కేంద్రాల వద్ద 144 సెక్షన్ వెబ్సైట్లోనూ హాల్‌టికెట్లు విద్యారణ్యపురి : జిల్లాలో ఈ నెల 9 నుంచి జరగనున్న ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులు జనరల్, ఒకేషనల్ విభాగాల్లో మొత్తం 1,04,381 మంది హాజరుకానున్నారు. 9న ప్రారంభం కానున్న ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 48,874 మంది, 10న మొదలయ్యే సెకండియర్ పరీక్షలకు 55,507 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. జిల్లావ్యాప్తంగా 131 పరీక్ష కేంద్రాలు కేటారుుంచారు. ఇందులో 62 ప్రైవేట్ జూనియర్ కాలేజీలు కాగా... 69 ప్రభుత్వ, ఇతర రెసిడెన్షియల్ , ఎయిడెడ్ కాలేజీలు ఉన్నారుు. సుమారు 5 వేల మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వర్తించనున్నారు. 131 మంది చొప్పున చీఫ్ సూపరింటెండెంట్లు(సీఎస్), డిపార్టుమెంటల్ ఆఫీసర్లను( డీఓ) నియమించారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్‌లతోపాటు పది సిట్టింగ్ స్క్వాడ్లను నియమాకం చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఒక్కో బృందంలో డిప్యూటీ తహసీల్దార్, ఏఎస్ఐ, సీనియర్ లెక్చరర్లు సభ్యులుగా ఉన్నారు. సిట్టింగ్ స్క్వాడ్ ఒక్కో బృందంలో సీనియర్ లెక్చరర్‌తోపాటు పీడీ లేదా లైబ్రేరియన్ ఉన్నారు. అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లను కూడా నియూమకం చేశారు. ఉన్నతస్థారుులో పర్యవేక్షణకు హైపవర్ కమిటీ నియూమకమైంది. ఇందులో జాయింట్ కలెక్టర్, ఎస్పీ, ఇంటర్‌విద్య ఆర్జేడీ, డీవీఈఓ ఉన్నారు. పరీక్షల షెడ్యూల్.. ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ పరీక్షలు 27వ తేదీ వరకు కొనసాగనున్నారుు. ఆయా పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు జరగనున్నారుు. విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు ఉదయం 8.30 గంటల కల్లా చేరుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. విద్యార్థులకు సంబంధించిన హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా కళాశాలలు ప్రిన్సిపాళ్లు తీసుకెళ్లారని, ఈ మేరకు వాటిని తీసుకుని పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు. వెబ్సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను తీసుకోవచ్చని వెల్లడించారు. పరీక్షల నేపథ్యంలో ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండేలా, పరీక్షల సమయంలో విద్యుత్ కోతలు విధించకుండా సంబంధిత అధికారులతో ఇంటర్ విద్య ఆర్ఐఓ మాట్లాడారు. ఇటీవల కలెక్టరేట్లో వివిధ శాఖాధికారులతో కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు సంబంధిత అధికారులకు కూడా ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను పరీక్షల సమయంలో మూసివేయాలని అధికారులు ఆదేశించారు. సమస్యాత్మక కేంద్రాలు 23 జిల్లాలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి సమస్యాత్మక కేంద్రాలు 23 ఉన్నట్లు గుర్తించిన అధికారులు... వీటిపై ప్రత్యేక దృష్టిసారించారు. కాపీయింగ్ నిరోధానికి చర్యలు తీసుకున్నారు. ఏపీటీడబ్ల్యూఆర్ జూనియర్ కాలేజీ(కురవి), ఏపీఎస్డబ్ల్యూజేసీ (మహబూబాబాద్), జీజేసీ(బి)(మహబూబాబాద్), ప్రిస్టన్ జూనియర్ కాలేజీ (జనగామ), ప్రభుత్వ జూనియర్ కాలేజీ(పరకాల), తేజస్విని గాంధీ జూనియర్ కాలేజీ (భూపాలపల్లి), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (భూపాలపల్లి, మద్దూరు, చేర్యాల, నెక్కొండ), పోతన కో ఆపరేటివ్ జూనియర్ కాలేజీ (పాలకుర్తి), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (కేసముద్రం, గూడూరు, కొత్తగూడెం,నర్మెట, చిట్యాల, దేవరుప్పుల, కొడకండ్ల, జఫర్‌గఢ్ సెంటర్లు సమస్యాత్మక కేంద్రాల జాబితాలో ఉన్నారుు. కాగా, జిల్లాలో మూడు సెల్ఫ్ సెంటర్లు ఏర్పాటుచేశారు. ఇందులో ధర్మసాగర్, మంగపేట, తాడ్వారుు ప్రభుత్వ నియర్ కాలేజీలు ఉన్నాయి. -
యాజమాన్యాలు ఇవ్వకుంటే సైట్లో తీసుకోండి
హాల్‌టికెట్లపై ఇంటర్ విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం సూచన సాక్షి,హైదరాబాద్: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వకపోతే వెబ్సైట్ ద్వారా వాటిని డౌన్లోడ్ చేసుకోవాలని ఇంటర్ విద్యార్థులకు బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆర్ .కృష్ణయ్య, శ్రీనివాస్‌గౌడ్ సూచించారు.bie.telangana.gov.in వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లు తీసుకుని పరీక్షలకు హాజరు కావాలని శనివారం చెప్పారు. సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఫీజులు చెల్లించకపోతే హాల్‌టికెట్లు ఇవ్వకుండా ప్రైవేట్ యాజమాన్యాలు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్న విషయాన్ని ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజా రామయ్యర్కుఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. -
12 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్
జిల్లాలో 158 పరీక్ష కేంద్రాలు విద్యారణ్యపురి : జిల్లాలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బీపీసీ, ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు ఈ నెల 12వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ వరకు నిర్వహించబోతున్నారు. ఈ నెల 17న మహాశివరాత్రి సందర్భంగా పరీక్ష ఉండదని ఇంటర్ విద్య ఆర్ఐఓ మలహల్రావు గురువారం వెల్లడించారు. మిగతా రోజుల్లో యథావిధిగా ఆదివారం, రెండో శనివారం కలిపి పరీక్షలు జరుగుతాయన్నారు. కళాశాలల వారిగా టైం టేబుల్, హాల్‌టికెట్లు, ఓఎం ఆర్ మార్కుల జాబితాలను పంపిస్తున్నామన్నారు. జిల్లాలో సైన్స్ ప్రాక్టికల్స్ పరీక్షల నిర్వహణకు 158 పరీక్షా కేంద్రాలు కేటాయించారన్నారు. పరీక్షలకు మొత్తం 16,183 మంది ఎంపీసీ, 8,690 మంది బీపీసీ విద్యార్థులు మొత్తంగా 24,873మంది విద్యార్థులు హాజరవుతున్నారని తెలిపారు. ఒకేషనల్ ఫస్టియర్‌లో 4,576 మంది, సెకండియర్‌లో 3,817 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఈ పరీక్షలు ప్రతి రోజు టైంబేబుల్‌ప్రకారం ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటలవరకు, మధ్యాహ్నం 2 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. -
పోస్టల్ నిర్లక్ష్యం.. హాల్‌టికెట్ ఆలస్యం
రెబ్బెన : ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఓవైపు పోస్టల్ సేవలు అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉన్నా.. ప్రజలకు విలువైన సేవలు అందించాల్సిన ఆ శాఖ ఉద్యోగులు మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడటంలేదు. ఆలస్యంగా హాల్‌టికెట్లు అందజేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. పరీక్ష మరుసటిరోజు అందజేత రెబ్బెన మండల కేంద్రానికి చెందిన దాగం సాయిప్రియ ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. దీనికి సంబంధించి పరీక్షను ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లో నిర్వహించగా ఆ హాల్‌టికెట్ (నంబర్ 8002084725) ను పోస్టల్ ద్వారా 7వ తేదీన పంపించారు. రెబ్బెన పోస్టాఫీసుకు చేరుకున్న హాల్‌టికెట్‌ను సకాలంలో అందించాల్సి ఉండగా పోస్టల్ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి 27వ తేదీన అందించారు. పరీక్ష కోసం ఎంతో కష్టపడి చదివినా పోస్టల్ శాఖ సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా అంతా వృథా అయిందని బాధితురాలు సాయిప్రియ ఆవేదన వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలు మండల కేంద్రంలో అనేకసార్లు జరిగినా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవటం లేదనే ఆరోపణలున్నాయి. సిబ్బందిపై ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితులురాలు తెలిపింది. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరింది. -
12న ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సెట్‌కు ఏర్పాట్లు
హైదరాబాద్: ఏపీఆర్జేసీ, ఏపీఆర్‌డీసీలలో ప్రవేశానికి ఈనెల 12న నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సెట్ కన్వీనర్ పి. జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష జిల్లా కేంద్రాలలో ఆరోజు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టరు, విద్యాశాఖాధికారి, జిల్లా కన్వీనర్ పర్యవేక్షణలో పరీక్ష జరుగుతుందని, పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నెట్లో హాల్‌టికెట్లను సీజీజీ.జీవోవీ.ఐఎన్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. కాగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 10 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించమని, హాల్లోకి వచ్చిన వారు 12.30 గంటల వరకు బయటికి వెళ్లేందుకు అనుమతించవద్దని చీఫ్ సూపరింటెండెంట్‌కు ఆదేశించినట్లు తెలిపారు. ఓఎమ్ఆర్ షీట్లను బ్లాక్ లేదా బ్లూ బాల్‌పెన్స్ మాత్రమే వాడాల్సి ఉంటుందని తెలిపారు. అలాగే నమూనా ఓఎంఆర్ షీట్లను నెట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
నేడే ‘టెట్-2014’
జంట జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్ జిల్లా నుంచి 32,796మంది రంగారెడ్డి జిల్లా నుంచి 16,235 మంది నిమిషం లేటైనా పరీక్షకు అనుమతించరు సాక్షి, సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(ఏపీటెట్) ఆదివారం జరగనుంది. ఈ పరీక్షకు జంటజిల్లాల నుంచి మొత్తం 49,031మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రెండు సెషన్లలో జరగనున్న ఈ పరీక్షకు మొత్తం 192 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయాకేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్ట్-1 పరీక్ష ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, పార్ట్-2 పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరగనున్నాయి. పరీక్షల నిర్వహణ సజావుగా జరిగేలా రెండు జిల్లాలకు జాయింట్ డెరైక్టర్ స్థాయిలో పరిశీలకులను, స్క్వాడ్ బృందాలను నియమించారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థులు గంట ముందుగానే పరీక్షాకేంద్రానికి చే రుకుంటే మంచిది. నిమిషం లేటైనా లోనికి అనుమతించరు. పరీక్షాకేంద్రంలో ఇచ్చిన ఓఎంఆర్ షీట్లో అభ్యర్థుల వివరాలు తప్పుగా ఉన్నట్లైతే సరిదిద్దుకోవాలి. ప్రశ్నపత్రం బుక్లెట్ కోడ్‌ను ఓఎంఆర్ షీట్లో తప్పనిసరిగా వేయాలి. ఓఎంఆర్ షీట్లో జవాబుల(వృత్తాల)ను నింపడానికి బ్లాక్ బాల్‌పాయింట్ పెన్నులు మాత్రమే వాడాలి. హాల్‌టికెట్లు అందని అభ్యర్థులు వెబ్సైట్ http://aptet.cgg.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థుల వెంట హాల్‌టికెట్, బాల్‌పాయింట్ పెన్నులు మినహా.. ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, ప్రింటెడ్ మెటీరియల్‌ను హాల్లోకి అనుమతించరు. వికలాంగ అభ్యర్థులకు అవసరమైన వారికి స్కైబ్(టెన్త్ విద్యార్థుల)లను విద్యాశాఖాధికారులు ఏర్పాటు చేస్తారు. పరీక్షాకేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్లు మినహా.. ఎవ్వరూ(డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలే టర్లతో సహా) సెల్ఫోన్లు వాడకూడదు. 300 ప్రత్యేక బస్సులు టెట్ సెట్-2014 పరీక్షల కోసం 300 ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ ఎ. కోటేశ్వర్రావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు రెండు విడతలుగా జరుగనున్న ఈ పరీక్షల సమయానికి అనుగుణంగా బస్సులు నడుపుతారు. వీటిపైన ‘టెట్ స్పెషల్’ అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నట్లు పేర్కొన్నారు. కింది రూట్లలో ప్రత్యేక బస్సులు.. సికింద్రాబాద్ నుంచి కోఠీ, ఆఫ్జల్‌గంజ్, దిల్సుఖ్నగర్, బార్కాస్,ఈసీఐఎల్ నుంచి ఆఫ్జల్‌గంజ్, మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్, రీసాలాబజార్, మెహదీపట్నం నుంచి ఈసీఐఎల్, సికింద్రాబాద్ నుంచి చార్మినార్, జీడిమెట్ల,బోరబండ నుంచి కోఠీ, చార్మినార్, సికింద్రాబాద్ నుంచి సనత్‌నగర్, కూకట్పల్లి, మల్కాజిగిరి, సఫిల్‌గూడ, తదితర ప్రాంతాలకు,ఉప్పల్ నుంచి సికింద్రాబాద్, జగద్గిరిగుట్ట నుంచి సికింద్రాబాద్, వెంకటాపురం నుంచి సికింద్రాబాద్, హనుమాన్‌పేట్,తుకారంగేట్ నుంచి సికింద్రాబాద్ వరకు, కోఠీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ నుంచి సనత్‌నగర్ వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. సికింద్రాబాద్-శిల్పారామం, సికింద్రాబాద్-నాంపల్లి, గోల్కొండ-మెహదీపట్నం, గోల్కొండ-చార్మినార్,హిమాయత్‌సాగర్ -కోఠీ, హయత్‌నగర్-కోఠీ, దిల్సుఖ్నగర్-పటాన్చెరు,నాంపల్లి-దిల్సుఖ్నగర్, రాంనగర్-మెహదీపట్నం,ఆర్టీసీ క్రాస్‌రోడ్స్-బీర్బన్బాగ్, దిల్సుఖ్నగర్-కొండాపూర్, తదితర రూట్లలో ప్రత్యేక బస్సులు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. -
రేపు టెట్
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహణకు జిల్లా కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం నాడు టెట్ నిర్వహించనున్నారు. డీ.ఈడీ అభ్యర్థులు హాజరయ్యే పేపర్-1 పరీక్షను ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 10 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికి 2,325 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. బీ.ఈడీ అభ్యర్థులు హాజరయ్యే పేపర్-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 80 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఇందుకు 19,196 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. హాజరయ్యే అభ్యర్థులకు సూచనలు పరీక్షకు ఒక నిమిషం ఆలస్యమైన అనుమతించరు. పరీక్ష సమయం పూర్తైన తర్వాతనే హాలు వదిలి వెళ్లాలి. హాల్‌టికెట్లను వెబ్సైట్లో పెట్టారు. గతంలో వెబ్సైట్ నుంచి తీసిన హాల్‌టికెట్లు కూడా అనుమతిస్తారు హాల్‌టికెట్ పొందిన వారు పరీక్ష కేంద్రం చిరునామాను ఒక రోజు ముందుగానే తెలుసుకుని పరీక్ష రోజు గంట ముందుగా సెంటర్‌కు హాజరుకావాలి. ఓఎంఆర్ షీట్లో వైట్నర్తో దిద్దడం చేయకూడదు. ఓఎంఆర్ షీట్లో హాల్‌టికెట్ నంబరు వేయడం, పేపర్ కోడ్‌ను నలుపు వలయంగా షేడ్ చేయడం తప్పనిసరి. -
రేపే ఏపీ టెట్
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ : ఉపాధ్యాయుల అర్హత పరీక్ష(టెట్)ను ఈ నెల 16న నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 19 కేంద్రాల్లో పేపర్-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 వరకు 103 కేంద్రాల్లో పేపర్-2 పరీక్ష ఉంటుందన్నారు. పేపర్ వన్ నిర్వహించే పరీక్షా కేంద్రానికి ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం పేపర్ టు పరీక్ష నిర్వహించే కేంద్రానికి 1.30 గంటలకు అభ్యర్థులు హాజ రుకావాలని డీఈవో కె. నాగేశ్వరరావు తెలిపారు. ఛీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో రిపోర్ట్ చేసి, పరీక్షా కేంద్రానికి సంబంధించిన మెటీరియల్‌ను తీసుకుని వెళ్లాలన్నారు. కేంద్రాల వద్ద వైద్యశిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హాల్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్లు 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌కు తప్పక హాజరుకావాలన్నారు. కర్నూలు డివిజన్లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులు, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఒకేషనల్ ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు హాజరుకావాలని, వారిని పాఠశాల నుంచి రిలీవ్ చేయాలని హెచ్ఎంలను ఆదేశించారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థులను గంట ముందే పరీక్షా కేంద్రానికి రావాలి. ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను పరీక్షా హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు ఇది వరకు డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లు అనుమతించబడును(ఫిబ్రవరి-2014) అభ్యర్థులు తమ ప్యాడ్, బ్లాక్‌బాల్ పాయింట్ పెన్ను వెంట తెచ్చుకోవాలి. -
రేపే టెట్
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణకు సమయం ఆసన్నమైంది. మూడుసార్లు వాయిదా పడిన ఎట్టకేలకు ఆదివారం ముహూర్తం ఖరారైంది. జిల్లాకేంద్రంలో నిర్వహించే పరీక్షకు 8,185 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో పేపర్-1 కోసం ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేయగా 1,806 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్ష సమయం ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు ఉం టుంది. పేపర్-2 కోసం 30 కేంద్రాలను ఏర్పాటు చేయ గా 6,379 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. ఈ పరీక్ష సమయం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు ఉంటుంది. పరీక్షల నిర్వహణ కోసం 38 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 38 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 38 మంది హాల్ సూపరింటెండెంట్లు, 6 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు(ఒక్కో బృందం లో ముగ్గురు సభ్యులు), 290 మంది ఇన్విజిలేటర్లు, ఆర్డీవో, డీఈవో స్పెషల్ అధికారులుగా ఉంటారు. ఒత్తిడిని దూరం చేసుకోవాలి పరీక్ష రాసే అభ్యర్థులు పరీక్షకు ఒక రోజు ముందు రాత్రి బాగా చదివేందుకు ప్రయత్నిస్తారు. కానీ అలా చేస్తే మె దడుకు తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. కాబట్టి అలా చేయొ ద్దు. పరీక్షకు వెళ్లే ముందు తాను బాగా రాస్తానని పాజిటి వ్ దృక్పథంతో ఉండాలి. పరీక్ష కేంద్రంలో కేటాయించిన స్థానంలో కూర్చున్న తర్వాత రెండు నిమిషాలు గట్టిగా కళ్లు మూసుకుని మెదడుకు కాస్తా విశ్రాంతి ఇవ్వాలి. పరీక్ష అయ్యేంత వరకు టీవీ, చాటింగ్, సినిమా, షికార్లు మానుకోవాలి. ఆహారం మితంగా తీసుకోవాలి. నూనే పదార్థాలకు దూరంగా ఉంటూ పీచు పదార్థాలు అధికంగా తీసుకోవాలి. ఏకాగ్రతను పెంపొందించేందుకు పది నిమిషాలు ధ్యానం చేయాలి. ఇవి తప్పనిసరి పాటించాలి.. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థి తప్పని సరిగా ఇంటర్నెట్ నుంచి హాల్ టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్‌టిక్కెట్‌లో ఏవైన పొరపాట్లు జరిగాయ అనేవి చూసుకోవాలి. పరీక్షకు రెండు బ్లాక్ బాల్‌పెన్‌లు, పరీక్ష ప్యాడ్ వెంట తీసుకెళ్లాలి. పరీక్షకు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో, అక్కడికి వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందో ముందే తెలుసుకుని వెళ్లాలి. పరీక్షకు చాలా మంది హాజరవుతున్న దృష్ట్యా పరీక్షకు ముందుగానే వెళ్లాలి. సయమానికి బస్సులు, ఆటోలు దొరకకపోతే ఇబ్బంది పడుతారు. పొరపాట్లు జరిగితే అంతే.. టెట్ పరీక్షకు ఓఎంఆర్ షీట్లో బాల్ బ్లాక్ పెన్‌తో మాత్రమే బబ్లింగ్ (వృత్తంలో ఉన్న నంబర్‌ను దిద్దడం) చేయాలి. ఒక్కొక్క అభ్యర్థికి ఒక్క ఓఎంఆర్ షీట్ మాత్రమే ఇస్తారు. హాల్‌టిక్కెట్ నంబర్ చూసుకుని నంబర్ పైన బబ్లింగ్ చేయాలి. మిగతా వాటిని ఖాళీగా ఉంచాలి. ఒకే వరుసలో ఉన్న నంబర్లలో బబ్లింగ్ చేస్తే ఓఎంఆర్ షీట్ చెల్లదు. ఒక గడిలో ఒక అంకెకు మాత్రమే బబ్లింగ్ చేయాలి. చాలా మంది అభ్యర్థులు పొరపాట్లు చేస్తారు. సమాధానం రాసేటప్పుడు మనం ఏ సమాధానానికి దిద్దుతామో గమనించుకోవాలి. పెన్‌తో బబ్లింగ్ చేయడం వల్ల వాటిని మళ్లీ సరిదిద్దలేం. సమాధానాలు ఒక్క వరస క్రమంలో చేస్తే బాగుంటుంది. మధ్యలో వాటిని వదలడం వల్ల చివరలో సమయం లేనట్లయితే ఖాళీగా వదిలేయాలి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. పరీక్షకు మరో ఒక రోజు సమయం ఉంది. ఈ సమయం అత్యంత కీలకమైనది. ఉన్న సమయం సద్వినియోగం చేసుకోవాలి. రోజుకు కనీసం ఆరు గంటలపాటు విశ్రాంతి తప్పనిసరి. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు. ప్రతి సబ్జెక్టుకు సంబంధించి సినాప్సిస్ (చదివిన వాటిని పేపర్‌పై రాసుకున్నవి) చూసుకోవాలి. గ్రూప్ డిస్కస్ చేస్తే ఆ సబ్జెక్టులో పట్టు ఉన్నవారు చెప్పే విషయాలు త్వరగా అర్థమవుతాయి. ఏదైన ప్రశ్నకు సమాధానం రాకపోతే అక్కడే సమయం వృధా చేయకుండా మరో ప్రశ్నకు సమాధానం రాయాలి. పకడ్బందీగా నిర్వహిస్తాం.. టెట్ పరీక్షను పకడ్బందీగా నిర్వహిస్తాం. అభ్యర్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. నిమిషం అలస్యమైన పరీక్ష కేంద్రంలోనికి అనుమతించం. పరీక్ష ముగిస్తేంత వరకు పరీక్ష కేంద్రం నుంచి బయటకు వెళ్లరాదు. అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లు వెంట తెచ్చుకోవద్దు. పరీక్షలో బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే వినియోగించాలి. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్ష జరుగుతున్న సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసి ఉంచాలి. అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూం నెంబర్ 08732-226434 పై సంప్రదించాలి. - రామారావు, డీఈవో -
వెబ్సైట్లో పంచాయతీ కార్యదర్శి హాల్‌టికెట్లు
నేటి నుంచి డౌన్‌లోడ్‌కు అవకాశం సాక్షి, హైదరాబాద్: పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థుల హాల్ టికెట్లను ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. ఈ పోస్టుల రాతపరీక్ష ఈనెల 23న జరగనుంది. 2,677 పోస్టుల కోసం 8 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం నుంచి 23వ తేదీ ఉదయం 8 గంటల వరకు అభ్యర్థులు హాల్ టికెట్లను ఠీఠీఠీ.్చఞటఞటఛి.జౌఠి.జీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ వెల్లడించింది. రాష్ట్ర విభజన బిల్లు, సీమాంధ్రలో ఆందోళనల మధ్య పరీక్ష జరుగుతుందా? లేదా? అనే అనుమానాలు నెలకొన్నాయి. ఈ అనుమానాలను తొలగిస్తూ ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహణకు సిద్ధమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. -
నేడు వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు సర్వం సిద్ధమయ్యాయి. ఇందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. పలువురు సుదూర ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు శనివారం సాయంత్రమే పరీక్ష సెంటర్ల వద్దకు చేరారు. ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం 3,555 మంది అధికారులను నియమించింది. కాగా, పరీక్ష కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేస్తున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అభ్యర్థులను అనుమతించకూడదని కలెక్టర్ అహ్మద్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఇద్దరు పోలీస్ సిబ్బంది చొప్పున 490 మందిని నియమించారు. అభ్యర్థులకు సూచనలు.. పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలి. హాల్ టికెట్, రైటింగ్ ప్యాడ్, బాల్ పెన్ (బ్లూ/బ్లాక్) వెంట తెచ్చుకోవాలి. హాల్ టిక్కెట్ వెంట తీసుకురావాలి. ఒకవేళ హాల్‌టికెట్‌పై ఫొటో లేకుంటే వాటిపై ఫొటోలు అతికించి గెజిటెడ్ అధికారులు సంతకం తీసుకోవాలి. నిమిషం అలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకూ పరీక్ష కేంద్ర వదిలి వెళ్లరాదు. జవాబు పత్రంలో మొదట హాల్‌టికెట్ నంబర్, పేపర్‌కోడ్, పరీక్ష బుక్లెట్ సిరీస్ (ఏ,బీ,సీ,డీ)లను వాటికి నిర్ణయించిన స్థలంలో బ్లూ/బ్లాక్ పెన్ను ఉపయోగించి రాయాలి. వీటిని తప్పుగా నమోదు చేస్తే జవాబు పత్రం చెల్లదు. అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించేటప్పుడు, పరీక్ష రాసే సమయంలో వీడియో తీస్తారు. అభ్యర్థుల వేలిముద్రలు కూడా సేకరిస్తారు. ఓఎంఆర్ పత్రాలు రెండు ఇస్తారు. మధ్యలో కార్బన్ పెట్టి ఉంటుంది. పరీక్ష పూర్తయ్యాక ఓఎంఆర్ పత్రాన్ని ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సి ఉంటుంది. మరో (డూప్లికేట్) ఓఎంఆర్ పత్రాన్ని అభ్యర్థులు తీసుకెళ్లవచ్చు. ఓఎంఆర్ షీట్‌పై బ్లేడ్, వైట్నర్, ఎరెజర్ లాంటివి ఉపయోగించి దిద్దరాదు. అలా చేస్తే ఓఎంఆర్ షీట్ చెల్లుబాటు కాదు. ఒకేసారి సమాధానం రాయాల్సి ఉంటుంది. తప్పుగా రాసినట్లు భావించి దాన్ని తొలగించి మళ్లీ రాసినట్లైతే అది చెల్లదు. సెల్ఫోన్లు, కాలిక్యూలెటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష హాలులోకి అనుమతించరు. మాల్ ప్రాక్టీస్, దుష్ర్పవర్తనకు పాల్పడితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ పరీక్ష నియమావళి చట్టం 1997 ప్రకారం శిక్షిస్తారు. {పశ్నపత్రంపై సమాధానాలు గుర్తించరాదు. ఇతర అభ్యర్థులతో మాట్లాడడం, సమాచారాన్ని చేరవేయడం వంటివి చేయకూడదు. అధికార యంత్రాంగం సూచనలు.. పరీక్ష రోజు జిరాక్స్ సెంటర్లు తెరవకుండా చూడాలి. ఆర్టీసీ బస్సులు ఎక్కువ సంఖ్యలో నడిపేలా చూడాలి. {పథమ చికిత్స కోసం పరీక్ష కేంద్రాల్లో ఏఎన్ఎంలను నియమించాలి పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలి. అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలి.