
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను సిద్ధం చేశామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు దేవానందరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ‘బీఎస్‌ఈ.ఏపీ.జీవోవీ.ఇన్’ వెబ్‌సైట్ నుంచి స్కూల్ లాగిన్ ద్వారా వీటిని డౌన్‌లోడ్ చేసుకుని అటెస్ట్ చేసిన తరువాత విద్యార్థులకు అందించాలని సూచించారు.
హాల్ టికెట్లలో విద్యార్థుల ఫొటో ఇమేజ్ లేకపోయినా, అస్పష్టంగా ఉన్నా వాటిపై సదరు విద్యార్థుల ఫొటోలను అతికించి అటెస్ట్ చేసి, వారితో కూడా సంతకం చేయించి పరీక్షలు రాసేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఫొటోలను కొత్తగా అతికించిన హాల్‌టికెట్లకు సంబంధించిన ఫోటోలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా ప్రభుత్వ పరీక్షల విభాగానికి పంపాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment