సాక్షి, హైదరాబాద్: పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లు ఆదివారం నుంచి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. హాల్‌టికెట్లను ఈ రోజు ఉదయం 7.30 గంటల నుంచి 22వ తేది అర్ధరాత్రి వరకు ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ జె.పూర్ణచందర్‌రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హాల్‌టికెట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, ఎస్‌ఎస్‌సీ హాల్‌టికెట్ నంబర్‌ను ఎంటర్‌చేస్తే హాల్‌టికెట్ ప్రత్యక్ష్యమవుతుంది. దాన్ని ప్రింట్ తీసుకోవాలి.
మరిన్ని వివరాల కోసం 040-23150362, 040-23150462 నంబర్లు, support@tslprb.in ఈ మెయిల్ ఐడీ ద్వారా సంప్రదించాలని రిక్రూట్‌మెంట్ బోర్డు సూచించింది. వివిధ విభాగాలలోని 9,281 కానిస్టేబుల్ పోస్టులకు గానూ, దాదాపు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 24న కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించనున్నారు.
నేటి నుంచి కానిస్టేబుల్ పరీక్షకు హాల్‌టికెట్లు
Published Sun, Apr 17 2016 1:45 AM | Last Updated on Tue, Mar 19 2019 9:03 PM
Advertisement
Advertisement