హాల్‌టికెట్‌పై పరీక్ష కేంద్రం అడ్రస్ ఇవ్వని దృ«శ్యం
ఎల్.రమణ (పేరు మార్పు) నెల్లూరులోని జెడ్పీ కాలనీలో నివాసముంటున్నాడు. ఈ విద్యార్థి దర్గామిట్టలోని రత్నం హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. పరీక్షలు రాసేందుకు హాల్‌టికెట్ వచ్చింది. అందులో నారాయణ హైస్కూల్ నెల్లూరు అని మాత్రమే ఉంది. అడ్రస్ పూర్తిగా లేకపోవడంతో నాలుగు రోజులుగా నగరంలో ఉన్న నారాయణ హైస్కూల్స్ మొత్తం తిరుగుతున్నాడు. ఈ సమస్య కేవలం రమణకే పరిమితం కాలేదు. చాలామంది విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉంది.
నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు పంపిణీ చేసిన హాల్‌టికెట్లలో తప్పులు దొర్లాయి. ఎస్‌ఎస్‌సీ బోర్డు ఇష్టారీతిగా ముద్రించి పంపింది. గురువారం నుంచి పరీక్షలు జరుగనున్నాయి. గతంలో ప్రభుత్వ పరీక్షల విభాగం పదిరోజుల ముందే హాల్‌టికెట్లు పంపేది. వాటిలో ఏవైనా తప్పిదాలు ఉంటే సరిచేసుకునేందుకు అవకాశం ఉండేది. ఈ ఏడాది విద్యార్థులకు ఆ అవకాశం లేకుండా పో యి ందని ఉపాధ్యాయులు వాపోతున్నా రు. తక్కువ వ్యవధిలో పరిశీలించి సవరించుకోవడం ఏవిధంగా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. హాల్‌టికెట్ల లో తప్పులుంటే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడితో అటెస్టేషన్ చేయిస్తే సరిపోతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ విషయం విద్యార్థులకు తెలియకపోవడంతో రోజుల తరబడి విద్యాశా ఖ కా ర్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ అధికారులు అందుబాటులో లే క వారు ఇబ్బందులు పడుతున్నారు.
అడ్రస్ లేదు
జిల్లాలో 33,100 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరిలో చాలామంది హాల్‌టికెట్లపై పరీక్ష కేంద్రం పేరు మాత్రమే ఉంది. ఆ పాఠశాల ఏ ప్రాంతంలో ఉందో అడ్రస్ లేదు. పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లను విద్యార్థుల చేతిలోపెట్టి మీరే అడ్రస్ వెతుక్కోండని చేతులు దులుపుకున్నాయి.
ఫీజు కడితేనే..
కొన్ని ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీలో ఫీజు బకాయిలున్న విద్యార్థులను యా జమాన్యాలు తీవ్ర ఇబ్బంది పెట్టాయి. బుధవారం పొదలకూరురోడ్డులో ఉన్న ఓ పాఠశాల యాజమాన్యం ఫీజు చెల్లి స్తేనే హాల్‌టికెట్ ఇస్తామని చెబుతోందని డీ ఈఓ కె.శామ్యూల్‌కు ఫిర్యాదు అం దిం ది. దీంతో సంబంధిత పాఠశాలకు ఫోన్ చేసి విద్యార్థులకు వెంటనే హాల్‌టికెట్లు ఇవ్వాలని ఆదేశించారు. కొందరు తల్లి దండ్రులు చేసేదేమీ లేక అప్పు చేసి ఫీజు చెల్లించి హాల్‌టికెట్లను తీసుకుంటున్నా రు. పాఠశాలల యా జమన్యానికి జి ల్లా విద్యాశాఖలోని పలువురు అధికారుల కు సత్సంబంధాలు ఉండటంతోనే వారి ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు. అధి కారులు మాత్రం హాల్‌టికెట్ ఇవ్వకుంటే విద్యాశాఖ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోమని ఉచిత సలహా ఇస్తున్నారు.
యాప్ ద్వారా తెలుసుకోవచ్చు
విద్యార్థులకు ఇచ్చిన హాల్‌టికెట్లలో ఉండే కోడ్‌ను పరీక్షల యాప్‌లో టైప్ చేస్తే కేంద్రం అడ్రస్ తెలుస్తుంది. హాల్‌టికెట్లు ఇవ్వని కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల విషయం మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. – కె.శామ్యూల్,జిల్లా విద్యాశాఖాధికారి
Comments
Please login to add a commentAdd a comment