
సాక్షి, వైఎస్సార్ జిల్లా : వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాల ‘బి’ కేంద్రంలో లీకైన గణితం ప్రశ్నాపత్రం లీకేజీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రశ్నాపత్రం లీకేజీలో ప్రమోయమున్న తొమ్మదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీలో పదోతరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కొన్ని సబ్జెక్టులు పూర్తి కాగా, ఇటీవల నిర్వహించిన గణితం పరీక్షలో పేపర్ లీకేజీ జరిగింది. వైఎస్సార్ కడప జిల్లా వల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాల బి కేంద్రంలో గణితం ప్రశ్నా పత్రం వాట్సప్‌లో షేర్ చేసినట్లు తెలిసింది.
పేపర్ లీకేజీపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, పోలీసుల విచారణలో సాయి అనే వాటర్ బాయ్ ద్వారా ప్రశ్నాపత్రం ఫోటో తీయించి లీక్ చేసినట్లు నిర్ధారించారు.
ప్రశ్నాపత్రాన్ని ఫొటో తీసి వాటర్ బాయ్ వాట్సప్ ద్వారా కమలాపురం వివేకానంద ఇంగ్లీష్ మీడియం యాజమాన్యానికి పంపినట్లు తేలింది. నిందితుల్లో వివేకానంద స్కూల్ కరస్పాండెంట్ రామసుబ్బారెడ్డితో సహా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోయం ఉన్నట్లు తేలింది. మాస్ కాపీయింగ్ కోసమే పేపర్ లీక్ చేశారంటూ పోలీసుల సైతం ప్రకటించారు.