Maths
-
'ఏఐకు అదో పెద్ద సవాలు'
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ.. ఎంతోమంది దృష్టిని ఆకర్శిస్తోంది. అయితే ఇప్పటికి కూడా ఇందులో లోపాలు ఉన్నాయని 'డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్' (Deutsche Bank Research) ఓ నివేదికలో వెల్లడించింది.ఏఐ టెక్నాలజీ అన్ని విషయాల్లోనూ రాణిస్తోంది, కానీ లెక్కల (గణితం) విషయానికి వస్తే.. గణనలు చేయడంలో అంత ఆశాజనకంగా లేదని లోపభూయిష్టంగా ఉందని డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్ పేర్కొంది. ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కొన్ని సమస్యలను ఇప్పటికీ పరిష్కరించకపోవడం అనేది ఒక పెద్ద సవాలుగా మారిపోయిందని తెలిపింది.ఏఐలో ఫైనాన్స్, హెల్త్ కేర్ కూసే నెమ్మదిగా ఉందని డ్యుయిష్ బ్యాంక్ రీసెర్చ్ తెలిపింది. కాబట్టి ఈ రంగాలలో ఏఐ ఫలితాలు తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చని పేర్కొంది. కాబట్టి ఈ రంగంలో ఆశాజనక ఫలితాలు అందించడానికి ఏఐ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఎంతనై ఉంది.ఇదీ చదవండి: భారత్‌కు బాసటగా బ్రెజిల్!.. సరికొత్త ప్లాన్ ఇదే.. కొన్ని రంగాల్లో మాత్రం.. ఏఐ ఉత్పాదక ఊహాతీతంగా, ఆశ్చర్యపడిచే విధంగా ఉంది. అపరిశోధనలను సంబంధించిన విషయాలను అందించడం, వస్తావా ప్రపంచం అనుసరించే అనేక గేమ్ ఇంజిన్లను సృష్టించడంలో కూడా ఏఐ చాలా అద్భుతంగా ఉందని వెల్లడించింది. -
రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడు 11వ తరగతి మ్యాథ్స్ సిలబస్‌లో హిట్‌మ్యాన్ పేరిట ఉన్న 35 బంతుల టీ20 సెంచరీని పాఠ్యాంశంగా పొందుపరిచారు. రోహిత్ శతకాన్ని ఉదాహరణగా తీసుకుని గణిత శాస్త్రంలోని ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ కాన్సెప్ట్‌పై పలు ప్రశ్నలు అడిగారు. రోహిత్ క్రికెటింగ్ కెరీర్‌లోని ఘనతలను పాఠ్యాంశంగా పొందుపరచడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఓ అప్పర్ ప్రైమరీ స్కూల్ పాఠ్యపుస్తకంలో ఇతనికి సంబంధించిన అంశాలను పాఠ్యాంశంగా చేర్చారు. Captain Rohit Sharma featured in the 11th Class Maths Text book. 👌 pic.twitter.com/mSgDnHm6Ye — Johns. (@CricCrazyJohns) February 26, 2024 కాగా, పాఠ్యాంశంగా మారిన రోహిత్ టీ20 సెంచరీ 2017 డిసెంబర్లో చేసింది. ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన నాటి మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ 35 బంతుల్లో 10 ఫోర్, 12 సిక్సర్ల సాయంతో సెంచరీ చేశాడు. కొద్ది నెలల కిందటి వరకు ఇది అంతర్జాతీయ టీ20ల్లో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీగా చలామణి అయ్యింది. గతేడాది చివర్లో జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్ బ్యాటర్ కుశాల్ మల్లా.. రోహిత్, డేవిడ్ మిల్లర్ పేరిట సంయుక్తంగా ఉండిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును చెరిపేశాడు. మంగోలియాతో జరిగిన మ్యాచ్‌లో కుశాల్ 34 బంతుల్లోనే సెంచరీని బాదాడు. అయితే, కుశాల్ పేరిట ఈ రికార్డు ఎక్కువ రోజులు నిలబడలేదు. ఇవాళ (ఫిబ్రవరి 27) నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ కుశాల్ రికార్డును బద్దలు కొట్టాడు. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో లాఫ్టీ కేవలం 33 బంతుల్లోనే శతక్కొట్టి, టీ20 ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. -
25 ఏళ్లు..23 అటెంప్ట్‌లు..చివరికి సాధించాడు
భోపాల్: అతడొక సెక్యూరిటీ గార్డు.. అతడి నెల సంపాదన రూ.5 వేలు. కానీ అతడిప్పుడు పట్టుదలకు, ధృడ నిశ్చయానికి, చెక్కు చెదరని ఆత్మ విశ్వాసానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారాడు. మధ్యప్రదేశ్ జబల్పూర్లో నివిసించే 56 ఏళ్ల ఆసెక్యూరిటీ గార్డు పేరు రాజ్‌కరణ్ బారువా. ఇంతకీ అతడి గొప్పేంటంటే ఎమ్మెస్సీ మ్యాథ్స్ పీజీ డిగ్రీలో పాసవ్వాలనే కల కోసం 25 ఏళ్లు వేచి చూశాడు. 25 ఏళ్లలో 23 సార్లు అటెంప్ట్ చేసి ఫెయిలయ్యాడు. 24వసారి విజయం సాధించాడు. మ్యాథ్స్‌లో పీజీ సాధించి కల నెరవేర్చుకున్నాడు. నిజానికి 1996లోనే అతనికి ఆర్కియాలజీలో మొదటి పీజీ వచ్చింది. అప్పుడే అతడు పోస్ట్ గ్రాడ్యుయేట్. కానీ మ్యాథ్స్‌లో రెండో పీజీ సాధించడం అతడి కల. కల కోసం పట్టు వదలని విక్రమార్కునిలా కష్టపడి చివరకు అనుకున్నది సాధించాడు. ఈ 25 ఏళ్లలో అతడు రాత్రి సెక్యూరటీగార్డుగా, పగలు ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ చదివాడు. ‘నాకు ఇంఘ్లీష్ పెద్దగా రాదు. ఇదే నాకు మ్యాథ్స్ పీజీ పాసవడానికి అడ్డంకిగా మారింది. ప్రతిసారి ఒక్క సబ్జెక్టు తప్ప అన్నింటిలో ఫెయిల్ అయ్యేవాడిని. కానీ చివరికి ఇండియన్ ఆథర్ రాసిన పుస్తకాలు చదవి పాసయ్యాను. నేను పరీక్షలు రాస్తున్నట్టు పనిచేసే చోట ఎవరికీ చెప్పే వాడిని కాదు. ఎవరికి తెలియకుండా రాత్రి వేళల్లో చదువుకునేవాడిని. అప్పుడు కూడా ఎవరైనా పని ఉందని పిలిస్తే వెళ్లి పనిచేసేవాడిని. నేను పెళ్లి చేసుకోలేదు. కానీ నా కలలతోనే నాకు పెళ్లి జరిగింది’అని బారువా చెప్పుకొచ్చాడు. ఇదీచదవండి..ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్ -
మ్యాథ్స్‌తో ఆర్ట్‌ను మిళితం చేసే సరికొత్త ఆర్ట్!
‘ఆర్టిస్ట్‌గా అన్నీ కుమారి ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్నకు ఒక ముక్కలో జవాబు చెప్పాలంటే... ‘మాథ్స్, ఆర్ట్‌ను మిళితం చేసి సరికొత్త ఆర్ట్‌ను సృష్టించింది’ జీవితం కూడా గణితంలాంటిదే. కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కొన్ని ఎంతకీ కావు... ఈ సారాంశం కుమారి చిత్రాల్లో ప్రతిఫలిస్తుంది... మనం పుట్టి పెరిగిన వాతావరణం ఆలోచనల్లో, ఆచరణలో, చివరికి ఆర్ట్‌లో కూడా ప్రభావం చూపుతుంది. దీనికి నిలువెత్తు సాక్ష్యం అన్నీ కుమారి ఆర్ట్. గణితం, సంగీతం, క్రాఫ్ట్‌ల గురించి విలువైన చర్చలు జరిగే ఇంట్లో పెరిగింది కుమారి. చిన్నటిప్పటి నుంచి తనకు లెక్కలు అంటే ఇష్టం. లెక్కలంటే భయపడే పిల్లలకు భిన్నంగా అన్నీ కుమారి గంటల తరబడి లెక్కలు చేస్తూ కూర్చునేది. అంకెలు, సంఖ్యలు తన ప్రియ నేస్తాలుగా మారాయి. ‘ఆర్ట్‌కు లెక్కలకు దోస్తు కుదరదు’ అంటారు. అయితే అన్నీకి లెక్కలు అంటే ఎంత ఇష్టమో, ఆర్ట్ అంటే కూడా అంతే ఇష్టం. అయితే ఆర్ట్ స్కూల్లో మాత్రం అంకెలు నచ్చినంతగా చిత్రాలు నచ్చలేదు. తనకు కావాల్సినదేదో ఆ చిత్రాల్లో లోపించినట్లుగా అనిపించేది. ఆ సమయంలో రకరకాల ప్రయోగాల గురించి ఆలోచించేది. విజువల్ వకాబులరీ సృష్టించాలనే ఆలోచన అలా వచ్చిందే. ఆర్ట్ స్కూల్ తరువాత... బొమ్మలు గీస్తూ కూర్చోలేదు. తనలోని శూన్యాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయాణాన్ని సాధనంగా ఎంచుకుంది. జార్ఖండ్‌లోని హజరీబాగ్కు వెళ్లి సోరాయి మ్యూరల్ ఆర్ట్ సంప్రదాయాన్ని, తమిళనాడు వెళ్లి కోలమ్ ఫ్లోర్ డ్రాయింగ్ సంప్రదాయాన్ని అధ్యయనం చేసింది. ఆ కళలో చుక్కలు, గీతలు, వంకలు చూస్తుంటే రకరకాల గణిత సూత్రాలు కంటిముందుకు వచ్చేవి. దీనికితోడు ప్రాచీన భారతీయ ఆలయాలలోని ఆర్కిటెక్చర్లో గణితం ఒక భాగమై ఉందనే విషయాన్ని అర్థం చేసుకుంది. ప్రకృతి ప్రపంచానికి, గణిత సూత్రాలకు మధ్య ఉండే అంతర్లీన సంబంధం కుమారిని ఆకట్టుకుంది. సైన్స్‌కు ఉండే శక్తి అది సృష్టించే వస్తువుల్లో కనబడుతుంది. ఇక ఆర్ట్‌కు ఉండే శక్తి మానవ ఉద్వేగాలను, అనుభవాలను ప్రతిఫలించే వేదికలో కనబడుతుంది. ముఖ్య అంశం ఏమిటంటే గణితానికి సంబంధించిన సంక్లిష్ఠతను సరళీకరించి జనాలలోకి తీసుకువెళ్లే శక్తి ఆర్ట్‌కు ఉంది. అందుకే ఈ రెండు బలమైన మాధ్యమాలను ఒకేచోటుకి తీసుకురావాలనుకుంది. తను సృష్టించే ఆర్ట్ ఎలా ఉండాలంటే... మన సంస్కృతీ, సంప్రదాయాలలోకి తిరిగి ప్రయాణించేలా, మన కళలను పండగలా సెలబ్రేట్ చేసుకునేలా, మన మూలాలతో ఆత్మీయంగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి అనే లక్ష్యంతో బయలుదేరింది. ఆ లక్ష్యసాధనలో విజయం సాధించి ఆర్టిస్ట్‌గా తనదైన ప్రత్యేకత నిలుపుకుంది. తాజాగా అన్నీ కుమారి ఆర్ట్ ఎగ్జిబిషన్ ముంబైలోని తావో ఆర్ట్ గ్యాలరీలో జరుగుతోంది. (చదవండి: ఆంగ్ల మహాసముద్రంలో ఆనంద విహారం!) -
అబాకస్‌లో ప్రపంచ రికార్డు
నారాయణపేట రూరల్: పెన్ను, పేపర్ లేకుండా మెదడులో కసరత్తు చేసి గణితంలో సమాధానాలు చెప్పే విధానం అబాకస్. దీంట్లో అతి వేగంగా అత్యధిక ప్రశ్నలను సాధించి పట్టణానికి చెందిన విద్యార్థులు ప్రపంచ రికార్డు పొందారు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సింగార్‌బేస్ వీధిలో రీతూ అనే శిక్షకురాలు ప్రైవేట్‌గా కొద్దికాలంగా అబాకస్‌లో పిల్లలకు శిక్షణ ఇస్తుంది. ఈ క్రమంలో గతేడాది పట్టణానికి చెందిన చరణ్, వైభవ్, ప్రణవి ఐరేంజ్ సంస్థకు దరఖాస్తు చేసుకోగా వారి నుంచి పరీక్షలో పాల్గొనేందుకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో ఆయా విద్యార్థులకు సంబంధించిన వీడియోలను అప్లోడ్ చేయగా వారు చూసి ఆన్లైన్లో లైవ్‌లో పరిశీలించారు. అవాకై ్కన వారు హైదరాబాద్ కార్యాలయానికి పిలిపించి పది డిజిట్ లకు సంబంధించిన వంద ప్రశ్నలను వేయగా పెన్ను, పేపర్ లేకుండా ఒక్క నిమిషంలోనే సమాధానాలు చెప్పారు. దీంతో వారిని అబాకస్‌లో ఆర్థమెటిక్ క్యాలిక్యులేషన్ ప్రక్రియలో ప్రపంచ రికార్డు సాధించినట్లు ప్రకటించి ప్రశంసాపత్రాలను అందించారు. దీంతో సోమవారం కలెక్టర్ శ్రీహర్ష ముగ్గురు విద్యార్థులు, టీచర్‌ను అభినందించారు. -
గుడ్ స్కూల్ యాప్‌ను ప్రారంభించిన అడివి శేషు
సైన్స్ అంటే ఎంత ఇష్టమో... గణితం అంటే అంతా భయమని సినీ నటుడు ఆడివి శేషు అన్నారు. చదవడం ఎంత ముఖ్యమో... చదివి దాన్ని గుర్తు పెట్టుకోవడం అంతే ముఖ్యమని పేర్కొన్నారు. పరీక్షల సయమంలో ఒత్తిడికి గురి కాకుండా సులభమైన పద్ధతితో నేర్చుకుని గుర్తు పెట్టుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఓ హోటల్లో గుడ్ స్కూల్ యాప్‌ను అడివి శేషు ప్రారంభించారు. తెలుగు, ఆంగ్లంలో యాప్‌ను రూపొందించడం ద్వారా గ్రామీణ ప్రాంత పిల్లలకు సైతం ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆడివి శేషు అన్నారు. ప్రస్తుతం గుఢచారి-2 చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందని... తర్వాత హాలీవుడ్ తరహా చిత్రంలో నటిస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యార్థులకు నాణ్యత గల దృశ్యమాన కంటెంట్‌ను అందించడానికి ప్రత్యేకంగా రూపొందించబడిన కొత్త-ఏజ్డ్-టెక్కో సిస్టమ్, గుడ్ స్కూల్ యాప్ అని ఛైర్మన్ వెంకట్‌రెడ్డి అన్నారు. శిక్షణతో పాటు, ఇది విశిష్టమైన విద్యా అనుభవాలను అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో సహకారం, సృజనాత్మకత, ఆట నేర్చుకునే విధంగా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ శ్రీనివాసరావు, సీఈవో విజయ్ భాస్కర్, విద్యారంగ ప్రముఖులు పున్నమి కృష్ణ, మేములపాటి శ్రీధర్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భయాన్ని పోగొట్టి.. ఆడుతూ.. పాడుతూ.. లెక్కలు
మ్యాథ్స్ అంటే స్టూడెంట్స్‌కు ఎప్పుడూ భయమే. వారిలో భయాన్ని పోగొట్టి ఆట, పాటలతో మ్యాథ్స్ నేర్పిస్తుంది తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా సిరసనగండ్ల జిల్లా పరిషత్ పాఠశాల టీచర్ రూపారాణి. విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, లెక్కలు అంటే మక్కువ చూపే విధంగా బోధిస్తున్న ఈ టీచర్ ప్రయత్నాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే! మ్యాథ్స్ అంటే కొందరి విద్యార్థుల్లో చెప్పలేనంత భయం ఉంటుంది. కొందరికైతే అదొక ఫోబియా. అదే గేమ్స్ అంటే ఎంతో ఇష్టం చూపిస్తారు. విద్యార్థుల్లో ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో లెక్కలపై మక్కువ చూపే విధంగా ఈ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఓ కొత్త ఆలోచన చేసింది. ఆ ఆలోచనను వెంటనే ఆచరణలో పెట్టింది. ఫలితం ఇప్పుడా టీచర్ దగ్గర లెక్కల పాఠాలు నేర్చుకున్న పిల్లలకు అంకెలు, సంఖ్యలు, ఆల్జీబ్రాలు, కొలతలు, వేగాలు అన్ని మంచినీళ్ల ప్రాయంగా అర్ధమవసాగాయి. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే కానీ ఇప్పుడు వీరు కార్పొరేట్‌కు ఏ మాత్రం తీసిపోరని నిరూపిస్తున్నారు. రూపారాణి ఇటీవల కేరళ రాష్ట్రం త్రిశూర్‌లో జరిగిన జాతీయ స్థాయి సైన్స్, మ్యాథ్స్ ఎగ్జిబిషన్లో ప్రతిభ కనబర్చి, టీచర్ కేటగిరిలో ప్రత్యేక బహుమతిని సాధించారు. చార్పత్తర్తో.. విద్యార్థులు ఆడుకునే చార్ పత్తర్ ఆటతో గ్రాఫింగ్ పాయింట్లు ఎలా పెట్టవచ్చో చూపుతున్నారు. ఒక బాక్స్‌లో నాలుగు సమాన బాక్స్‌లు చేసి మధ్యలో నాలుగు రాళ్లు పెట్టి, వాటిని విద్యార్థులు తీసుకునే విధానం ద్వారా గ్రాఫింగ్ పాయింటింగ్ నేర్పిస్తున్నారు. డయల్ యువర్ ఫార్ములాతో ఫార్ములాలను కనుక్కోవడం, మ్యాజిక్ ఫార్ములాతో సమస్యలు ఎలా సాధన చేయవచ్చో, సంఖ్య రేఖపై ఆటల ద్వారా కూడికలు, తీసివేత గుణాంకాలను చేయడం, ఎలక్ట్రికల్ లైట్స్‌తో ప్రాపర్టీ ఆఫ్ సర్కిల్స్.. ఇలా విద్యార్థులకు ఆటలతో అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేస్తున్నారు. పాటలతో ఎక్కాలు బతుకమ్మ పాటలతో ఎక్కాలను సులభంగా నేర్చుకునే విధంగా, యానిమేటెడ్ డిజిటిల్స్ ద్వారా విద్యార్థులకు దృశ్య రూపకంగా సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. దీంతో విద్యార్థులు మ్యాథ్స్ అంటే భయం పోయి మక్కువ చూపుతున్నారు. నాన్న స్పూర్తితోనే! మా నాన్న రాజమౌళి ప్రభుత్వం ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యారు. టూర్లకు వెళ్లిన సమయంలో విద్యార్థుల కోసం బొమ్మలను తీసుకువచ్చి, వాటి ద్వారా విద్యా బోధన చేశారు. దీంతో విద్యార్థులూ చదువు పట్ల మక్కువ చూపించేవారు. అలా నాన్న స్ఫూర్తితో నేనూ ఏదైనా చేయాలనుకుని ఆలోచించాను. విద్యార్థులకు ఆటల ద్వారా మ్యాథ్స్‌ను బోధిస్తున్నారు. మానాన్న స్పూర్తితోనే విద్యార్థులకు ఆటలు పాటల ద్వారా మాథ్స్ చెప్పుతున్నాను. దీంతో విద్యార్థుల పాస్ పర్సంటెజ్ బాగా పెరుగుతుంది. సిరసనగండ్ల జెడ్పీ స్కూల్లో మ్యాథ్స్ టీచర్‌గా ఉన్న నేను ఇటీవల డిప్యూటేషన్ పై మూట్రాజ్పల్లిలో విధులు నిర్వర్తిస్తున్నాను. ఇక్కడా ఇదే పద్ధతిలో మ్యాథ్స్ బోధిస్తున్నాను. – పెందోట రూపారాణి జాతీయ స్థాయిలో ప్రతిభ విద్యార్థులకు ఆటలతో మ్యాథ్స్ బోధించే విధానాన్ని జాయ్ ఫూల్ లెర్నింగ్ మ్యాథ్స్ బై గేమ్స్ యూజింగ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ పేరుతో ఎగ్జిబిట్లను రూపొందించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చారు. కేరళ రాష్ట్రం త్రిశూల్‌లో జరిగిన జాతీయ స్థాయిలో ఈ ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. విశ్వేశ్వరయ్య ఇండ్రస్టియల్ టెక్నాలజీ మ్యూజియం తరుపున ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: సతీష్ కుమార్ -
లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
Janhvi Kapoor Comments On Maths: అందాల తార, దివంగత శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ మొదటి సినిమా 'ధడక్'తోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. తన నటనతో, అందచందాలతో కోట్లాదిమంది మనసులు కొల్లగొట్టింది. అంతేకాకుండా యూత్‌లో యమ క్రేజ్ సంపాదించుకుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జాన్వీ.. పలు కామెంట్స్‌తో ట్రోలింగ్ కూడా ఎదుర్కొంది. తాజాగా మరోసారి ట్రోలింగ్ బారిన పడింది బ్యూటిఫుల్ జాన్వీ కపూర్. జాన్వీ కపూర్ నటించిన లేటేస్ట్ మూవీ 'గుడ్ లక్ జెర్రీ'. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో మాథ్స్‌పై కామెంట్స్ చేసి ట్రోలింగ్‌కు గురైంది. స్కూల్లో చదివేటప్పుడు నాకు చరిత్ర, లిటరేచర్ అంటే చాలా ఇష్టం. మ్యాథ్స్ అంటే అస్సలు ఇష్టం లేదు. అయినా నాకో విషయం అర్థం కాదు. అదేంటంటే.. కాలిక్యులేటర్ కనిపెట్టిన తర్వాత లెక్కలు చేయడం చాలా సులభమైంది. ఇంకా కష్టపడి ఆల్జీబ్రాను నేర్చుకోవడంలో ఉపయోగమేంటీ? గణితం కోసం ఎందుకు అంతలా తలలు బద్దలు కొట్టుకుంటారో అర్థం కాదు. అయితే చరిత్ర, సాహిత్యం ప్రజల్ని సంస్కారవంతమైన మనుషులుగా తీర్చిదిద్దుతాయి. మాథ్స్ మిమ్మల్ని నెమ్మదించేలా చేస్తుంది. అని మాట్లాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ట్రోలింగ్‌తో జాన్వీని ఆడేసుకుంటున్నారు. 'లక్షల ఫీజు కట్టి ఇంటర్నేషనల్ స్కూళ్లలో చదివిన వారి నాలెడ్జ్ ఎలా ఉంటుదనే దానికి ఇదే ఫ్రూఫ్', 'మీరు ఉన్న దయనీయ స్థితికి మ్యాథ్స్‌ను ఎందుకు నిందిస్తారు', 'కాలిక్యులేటర్‌తో ఆల్జీబ్రాని చేసేందుకు జాన్వీ కపూర్ ప్రయత్నిస్తోంది. ఇక్కడే లాజిక్ చచ్చిపోయింది. ఇక ముందుకు సాగండి. ఇంకా ఇలాంటివి చాలా చూడాలి' అంటూ ట్రోల్ చేస్తున్నారు. Who is this? pic.twitter.com/ow8hvWdToh — Abhijit Majumder (@abhijitmajumder) July 17, 2022 -
ఏఐసీటీఈ సర్వే: గణితంలో ఇంజనీరింగ్ విద్యార్థులు వీక్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థుల్లో గణితం సబ్జెక్టులో వెనుకబాటు ఎక్కువగా ఉంటోందని, ఫలితంగా ఆయా కోర్సుల్లో వారు తగిన నైపుణ్యాలను అలవర్చుకోలేకపోతున్నారని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) పరఖ్ సర్వే వెల్లడించింది. ఇంజనీరింగ్ కోర్సుల్లో కీలకమైన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో ఏఐసీటీఈ ‘పరఖ్’ పేరిట ఈ స్టూడెంట్ లెర్నింగ్ అసెస్మెంట్ (విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మూల్యాంకనం)ను ఇటీవల నిర్వహించింది. చదవండి: పరిశ్రమలకు ఊరట.. ఏపీఈఆర్సీ కీలక ఆదేశాలు.. ఈ సర్వే ఫలితాలను బుధవారం విడుదల చేసింది. సాంకేతిక విద్యలో అభ్యసన లోపాలను గుర్తించేందుకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఏఐసీటీఈ పరఖ్ పేరిట ఆన్లైన్ పరీక్షను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 2,003 సాంకేతిక విద్యాసంస్థలకు సంబంధించిన 1.29 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు. అభ్యర్థులు తమ అభ్యసన సామర్థ్యాలను ఈ పరఖ్ సర్వే ద్వారా స్వయం మూల్యాంకనం చేసుకునేలా దీన్ని నిర్వహించారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నమోదైన ఈ సర్వే గణాంకాలను ఏఐసీటీఈ విశ్లేషించి నివేదికలు విడుదల చేసింది. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులకు పరఖ్ ద్వారా ఏఐసీటీఈ ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ సబ్జెక్టు అంశాలతోపాటు ఆప్టిట్యూడ్ టెస్ట్‌ను నిర్వహించింది. సెకండియర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు ఆయా కోర్ సబ్జెక్టు అంశాలను ఆధారం చేసుకొని మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అంశాల్లో స్వయం సామర్థ్య పరీక్షలను పెట్టింది. థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులకు కోర్ సబ్జెక్టుల్లోనే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) అంశాలపైనా నిర్వహించింది. మ్యాథ్స్‌లోనే సమస్యలు.. ఏఐసీటీఈ విడుదల చేసిన నివేదికల ప్రకారం.. ఫస్టియర్ ఇంజనీరింగ్ విద్యార్థులు అన్ని మేజర్ ప్రోగ్రాముల్లోనూ మ్యాథమెటిక్స్లోనే సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీనికి కారణం ఈ విద్యార్థులకు గణితం సబ్జెక్టులో ప్రాథమిక స్థాయిలో అభ్యసన సామర్థ్యాలు సరిగా అలవడకపోవడమేనని పేర్కొంది. ప్రాథమిక, మాధ్యమిక, హయ్యర్ సెకండరీ స్థాయిల్లో గణితం సబ్జెక్టులో వీరికి తగిన సామర్థ్యాలు అలవడలేదని వివరించింది. అత్యధిక శాతం మంది ఇంజనీరింగ్ విద్యార్థులకు పాఠశాల స్థాయిలోని సామర్థ్యలోపాలు ఇప్పుడు సమస్యగా మారాయని పేర్కొంది. 22,725 మంది ఫస్టియర్ విద్యార్థులకు సంబంధించిన గణాంకాలను పరిశీలిస్తే.. ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాల్లో నైపుణ్యాలు అంతంతమాత్రంగా ఉండగా.. గణితంలో మరింత అధ్వానంగా ఉన్నారని తేల్చింది. ఆప్టిట్యూడ్ టెస్ట్‌కు సంబంధించి జనరల్ నాలెడ్జి, తదితర అంశాల్లోనూ చాలా వెనుకబడి ఉన్నారని స్పష్టం చేసింది. సబ్జెక్టులవారీగా స్కోర్లు ఎంతంటే.. పరఖ్ ద్వారా నిర్వహించిన సర్వే పరీక్షలో విద్యార్థులు ఇచ్చిన సమాధానాలను అనుసరించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఆప్టిట్యూడ్ టెస్టుల్లో ఏయే విభాగాల విద్యార్థులు ఎంత స్కోర్ చేశారో పరిశీలిస్తే అన్ని విభాగాల్లోనూ సగం శాతమే స్కోర్ ఉంది. గణితంలో.. ♦గణితంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు సాధించిన సగటు స్కోరు 37.48 శాతం మాత్రమే. ♦ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) విద్యార్థుల సగటు స్కోరు 38.9 శాతం. ♦మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 39.48 శాతం ♦ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.02 శాతం ♦కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థుల సగటు స్కోర్ 40.12 శాతం ఫిజిక్స్‌లో.. ♦ఫిజిక్స్ అంశాల్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు.. 52.5 శాతం సగటు స్కోర్‌తో మంచి ప్రతిభ చూపారు. ♦వీరి తర్వాత 51 శాతం స్కోర్‌తో కంప్యూటర్ సైన్స్, 50 శాతం స్కోర్‌తో మెకానికల్ విద్యార్థులు వరుస స్థానాల్లో ఉన్నారు. కెమిస్ట్రీలో.. కెమిస్ట్రీ ప్రశ్నలకు సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 53.1% సగటు స్కోర్‌తో అగ్రభాగాన ఉన్నారు. సీఎస్ఈ విద్యార్థులు 53%, సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు 51.3 శాతంతో తర్వాత స్థానాల్లో నిలిచారు. ఆప్టిట్యూడ్ టెస్టులో.. ఆప్టిట్యూడ్ టెస్టుకు సంబంధించి జనరల్ నాలెడ్జి తదితర అంశాల్లో విద్యార్థుల లోపాలు పరఖ్ సర్వేలో వెల్లడయ్యాయి. జనరల్ నాలెడ్జి, లాజికల్ రీజనింగ్ తదితర అంశాల్లో విద్యార్థులు వెనుకబడి ఉన్నారు. సర్వేలో పాల్గొనని అనేక విద్యాసంస్థలు పరఖ్ సర్వేలో ఐఐటీలు సహా అనేక సాంకేతిక విద్యాసంస్థలు పాల్గొనలేదు. తమిళనాడు నుంచి 24,499 మంది పాల్గొనగా.. అత్యల్పంగా గోవా నుంచి ముగ్గురు విద్యార్థులే పాల్గొన్నారు. పంజాబ్, హరియాణా, రాజస్థాన్ల నుంచి 12,387 మంది విద్యార్థులు ఈ పరఖ్ సర్వేలో భాగస్వాములయ్యారు. ఏపీ నుంచి 5,628, తెలంగాణ నుంచి 4,234, కర్ణాటక నుంచి 8,739, కేరళ నుంచి 3,431, మహారాష్ట్ర నుంచి 11,334, యూపీ నుంచి 5,288 మంది పాల్గొన్నారు. -
‘సాక్షి’ స్పెల్ బీ-మ్యాథ్ బీ పోటీలకు విశేష స్పందన
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు సాక్షి మీడియా తన కార్యాచరణను కొనసాగిస్తోంది. స్పెల్ బీ-మ్యాథ్ బీ పోటీలను నిర్వహిస్తోంది. ఏప్రిల్ 17న జరిగిన 2021-22 స్పెల్ బీ-మ్యాథ్ బీ రెండో రౌండ్ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి భారీ స్థాయిలో విద్యార్థులు పాల్గొన్నారు. తిరుపతి, కడప, అనంతపూర్, కర్నూలు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తాడేపల్లి గూడెం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, హైదరాబాద్ సెంటర్లలో నేడు (ఆదివారం) పరీక్షలు జరిగాయి. పరీక్షల అనంతరం విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దాం... -
మ్యాథ్స్, ఫిజిక్స్ లేకున్నా.. ఇంజనీరింగ్
సాక్షి, హైదరాబాద్: బీఈ/బీటెక్ ప్రవేశాలకు విద్యార్థులకు ఉండాల్సిన అర్హతల విషయంలో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కీలక నిర్ణయం తీసుకుంది. 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరే విద్యార్థులు ఇంటర్మీడియట్లో కచ్చితంగా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను చదివి ఉండాలన్న నిబంధనను తొలగించింది. వాటిని ఆప్షనల్‌గానే పేర్కొంది. నిర్దేశిత అర్హతల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే చాలని వెల్లడించింది. వాటితో పాటు ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో లేదా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఉండాలని, ఆ ర్యాంకుల ఆధారంగా ప్రవేశాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఈ అర్హతల విషయంలో సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేసింది. గతేడాది ఆ సబ్జెక్టులు తప్పనిసరి.. 2020–21 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం గతేడాది ఫిబ్రవరిలో జారీ చేసిన ఏఐసీటీఈ అప్రూవల్ ప్రాసెస్ హ్యాండ్‌బుక్ (రివైజ్డ్) 2020–21లో బీఈ/ బీటెక్/ బీఆర్క్/ బీప్లానింగ్ వంటి యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉండాల్సిన అర్హతలను వెల్లడించింది. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ వంటి సబ్జెక్టులను విద్యార్థులు తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని స్పష్టం చేసింది. వాటితో పాటు మరొక సబ్జెక్టు ఉండాలని పేర్కొంది. అందులో కెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ/ బయాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ అగ్రికల్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్ వంటి సబ్జెక్టులో ఏదో ఒకటి ఉంటే చాలని పేర్కొంది. అంటే బీఈ/బీటెక్/బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/ బ్యాచిలర్ ప్లానింగ్ కోర్సుల్లో చేరాలంటే ఆయా విద్యార్థులు ఇంటర్మీడియట్లో (12వ తరగతి) మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను తప్పనిసరి సబ్జెక్టులుగా చదివి ఉండాలని పేర్కొంది. అయితే తాజాగా మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల విషయంలో తప్పనిసరి అన్న నిబంధనను తొలగించింది. 2021–22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు బీఈ/ బీటెక్‌లో చేరాలంటే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్/ మ్యాథమెటిక్స్/ కెమిస్ట్రీ/ కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ బయాలజీ/ ఇన్ఫర్మాటిక్స్ ప్రాక్టీసెస్/ బయోటెక్నాలజీ/ టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్టు/ ఆర్కిటెక్చర్/ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్/ బిజినెస్ స్టడీస్/ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సబ్జెక్టుల్లో ఏవైనా మూడు సబ్జెక్టులు చదివి ఉంటే నాలుగేళ్ల ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు అర్హులుగా పేర్కొంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం మన దగ్గర ఎంపీసీ విద్యార్థులే ఇంజనీరింగ్‌లో చేరుతారు. ఏఐసీటీఈ పేర్కొన్న పలు కాంబినేషన్ల సబ్జెక్టులు మన దగ్గర ఇంటర్మీడియట్లో లేవు. పైగా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్మీడియట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - పాపిరెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యామండలి అన్ని కోణాల్లో పరిశీలిస్తాం నిర్దేశిత సబ్జెక్టుల్లో ఏవైనా మూడు చదివి ఉంటే చాలని పేర్కొన్న ఏఐసీటీఈ నిబంధనను పరిశీలిస్తాం. ఈసారి సాధ్యం అవుతుందా లేదా అన్న దానిపై సబ్జెక్టు నిపుణులతో, యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్ విభాగం నిపుణులతో చర్చిస్తాం. అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అయితే అర్హతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు/యూనివర్సిటీలు/ సంబంధిత బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని చెప్పినందున ఈ విషయాన్ని ఉన్నత విద్యా మండలితో చర్చిస్తాం. మండలి సూచనల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. - ప్రొఫెసర్ గోవర్ధన్, ఎంసెట్ కన్వీనర్ -
‘లెక్కలు’ కుదర్లేదు!
సాక్షి, హైదరాబాద్: రెండుసార్లు వాయిదాల తరువాత ఎంసెట్ ఎట్టకేలకు ప్రారంభమైంది. మొదటిరోజు పరీక్షకు 77.52 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం రెండు విడతల్లో 35,714 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయగా, 27,689 మంది పరీక్షకు హాజరైనట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు. తెలంగాణలోని ఏడు పట్టణాల్లోని 79 కేంద్రాల్లో 17,003 మందికి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా 14,555 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 9 పట్టణాల్లోని 23 కేంద్రాల్లో 18,711 మందికి పరీక్షలు నిర్వహించేలా ఏర్పాటు చేయగా 13,134 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వివరించారు. ఇక ఈనెల 10, 11, 14 తేదీల్లోనూ మరో ఆరు విడతల్లో పరీక్షలు జరగనున్నాయి. ఇక బుధవారం జరిగిన పరీక్షలో మేథమెటిక్స్ కఠినంగా వచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. సుదీర్ఘ సమాధాన ప్రశ్నల కారణంగా సమయం సరిపోలేదని వెల్లడించారు. ఇక మ్యాట్రిసెస్ సర్కిల్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చినట్లు సబ్జెక్టు నిపుణులు ఎంఎన్ రావు పేర్కొన్నారు. ఐదారు ప్రశ్నలు సుదీర్ఘమైనవి కావడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడాల్సి వచ్చిందని వెల్లడించారు. ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయని, బుధవారంనాటి పరీక్షల్లో సాధారణ విద్యార్థులకు160 మార్కులకు గాను 60 నుంచి 70 మార్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కరోనాతో తగ్గిన హాజరు శాతం ఎంసెట్‌కు హాజరైన విద్యార్థుల శాతం ఈసారి భారీగా తగ్గిపోయింది. కరోనా కారణంగా చాలా మంది విద్యార్థులు మొదటి రోజు పరీక్షకు హాజరుకాలేకపోయారు. గతేడాది మొదటి రోజు పరీక్షకు తెలంగాణలో 94.22 శాతానికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. గతేడాది ఉదయం సెషన్లో తెలంగాణలో 25,023 మందికి గాను 23,543 మంది (94.1%) హాజరు కాగా, మధ్యాహ్నం సెషన్లో 24,174 మందికి గాను 22,807 మంది (94.4%) హాజరయ్యారు. ఈసారి ఉదయం పరీక్షకు 8,602 మందికిగాను 7,415 మంది (86.20%) హాజరు కా గా, మధ్యాహ్నం పరీక్షకు 8,401 మందికి గాను 7,140 మంది (84.98%) హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ హాజరు మిగతా 6 సెషన్లలోనూ ఇలాగే కొనసాగే అవకాశముంటుందని వివరించారు. కాగా పరీక్ష కేంద్రాల్లో భౌతికదూరం పాటించలేదని, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాలను సరిగ్గా తీసుకోలేదని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. ఇక ఆన్లైన్ పరీక్ష అయినందున అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేస్తే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. -
‘పుట్టుకతో ఎవరు జీనియస్‌లు కాలేరు’
న్యూఢిల్లీ: గణితం అంటే కొందరు విద్యార్థులకు విపరీతమైన ఫోబియా ఉంటుంది. కానీ అలాంటి గణిత సబ్జెక్ట్‌ను 21ఏళ్ల నీలకంఠ భాను ప్రకాశ్ కాలిక్యులేటర్ లేకుండానే లెక్కలను సునాయసంగా సాధిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా మైండ్ స్పోర్ట్స్ ఒలంపియాడ్లో జరిగిన మెంటల్ కాలిక్యులేషన్ చాంపియన్‌షిప్‌లో భారత్ తరుపున తొలి స్వర్ణం సాధించాడు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రకాశ్, స్టీఫన్ కాలేజీలో చదువుతున్నాడు. కాగా ప్రకాశ్ తన లెక్కల ప్రతిభతో ప్రపంచంలోనే వేగవంతమైన మానవ కాలిక్యులేటర్‌గా నాలుగు ప్రపంచ రికార్డులు, 50లిమ్కా రికార్డులు ప్రకాశ సాధించాడు. తన విజయంపై ఓ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకాశ్ స్పందిస్తూ.. తాను పుట్టుకతో జీనియస్‌ను కాదని, పుట్టుకతో ప్రతి మనిషికి గణిత తెలివితేటలు ఉంటాయని అన్నారు. గణితంలో రికార్డులు బద్దలు కొడుతున్న ప్రకాశ్‌ది హైదరాబాద్ కావడం విశేషం.తానే కాదు ఎవరు పుట్టుకతో జీనియస్‌లు కాలేరని అభిప్రాయపడ్డారు. తాను ఇన్ని అరుదైన రికార్డులు సాధించడానికి 15ఏళ్లు కష్టపడ్డానని తెలిపారు. కానీ దేశంలోని విద్యార్థులకు గణిత సబ్జెక్ట్‌ను సునాయసంగా అర్థమయ్యే గణిత ల్యాబ్స్‌ను ప్రవేశపెడతానని తెలిపారు. గణిత ల్యాబ్స్ ద్వారా విద్యార్థులకు సబ్జెక్ట్ సునాయసంగా అర్థమవ్వడమే కాకుండా గణితంపై ఇష్టం కలిగి మెరుగైన ఫలితాలను సాధించవచ్చన్నారు. భారత దేశాన్ని గణితంలో అన్ని దేశాల కంటే ముందుంచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఫిట్‌నెస్‌లో ఉస్సేన్ బోల్ట్ ప్రపంచానికి ఎలా స్పూర్తి కలిగించాడో, మానసిక నైపుణ్యాలు, మానవ మెదడు సామర్థ్యం తెలుసుకోవడానికి ప్రేరణ కలిగిస్తాయని నీలకంఠ భాను ప్రకాశ్ పేర్కొన్నారు. -
వాట్సాప్ వండర్ బాక్స్ : భలే షార్ట్‌కట్
వాట్సాప్ వండర్ బాక్స్ మరో వండర్‌ను పరిచయం చేసింది. గణితం చదువుకునే సమయంలో ఎక్కాలు ఎంత ముఖ్యమైనవో అందరికీ తెలుసు. అంతేకాదు వాటిని బట్టీ పట్టడం ఎంత కష్టమో అనుభవమే.. మాస్టారు ఎక్కం అప్ప చెప్పమనగానే.. అయితే 5వ ఎక్కం, లేదంటే 10వ ఎక్కం...ఇదే కదా.. పిల్లలకు గుర్తొచ్చేది.. మిగతా ఎక్కాల జోలికి వెళ్లాలంటే విద్యార్థులకు ఒకింత గుబులే.. అయితే ఈ కష్టాల నుంచి గటెక్కేందుకు మాథ్స్ టీచర్ల చిట్కాలు, కిటుకులు పిల్లల మనసుల్లో బాగా గుర్తుండి పోతాయి కూడా. తాజాగా అలాంటి టీచర్ ఒకరు వాట్సాప్ వండర్ బాక్స్‌లో రౌండ్లు కొడుతున్నారు. తొమ్మిదో ఎక్కాన్ని అతి సులువుగా విద్యార్థులకు నేర్పిస్తున్న ఈ వీడియో పలువురిని ఆకట్టుకుంటోంది. కార్పొరేట్ దిగ్గజం ఎం అండ్ ఎం ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర ఇలాంటి వీడియో నొకదాన్ని ట్విటర్లో షేర్ చేశారు. ఈ తెలివైన, సులువైన షార్ట్‌కట్ గురించి తెలియదు. ఆమె నా గణిత ఉపాధ్యాయురాలిగా ఉండివుంటే.. గణితంలో బహుశా ఇంకా చాలా మెరుగ్గా వుండేవాడినంటూ వ్యాఖ్యానించారు. దీనికి ముగ్ధుడైన బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ రీ ట్వీట్ చేశారు. అంతేకాదు దీన్ని బైజూస్‌కి పంపిస్తున్నానని షారూక్ ట్వీట్ చేయడం విశేషం. Whaaaat? I didn’t know about this clever shortcut. Wish she had been MY math teacher. I probably would have been a lot better at the subject! #whatsappwonderbox pic.twitter.com/MtS2QjhNy3 — anand mahindra (@anandmahindra) January 22, 2020 -
సైన్స్ టీచరే మా‘స్టార్’..
సాక్షి, హైదరాబాద్: మా‘స్టార్’ టీచర్ సైన్స్ ఉపాధ్యాయులే అని విద్యార్థులు చెబుతు న్నారు. హైదరాబాద్‌లో హైస్కూల్ స్థాయి విద్యార్థులపై నిర్వహించిన తాజా అధ్యయనంలో 30 శాతం మందికి సైన్సు మాస్టార్లంటేనే ఇష్టమని తెలపడం విశేషం. ఇక 48 శాతం విద్యార్థులకు టీచర్లు మంచి మిత్రులేనట. విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు వారితో ఫ్రెండ్లీగానే వ్యవహరిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. ఇక 26 శాతం మందికి లెక్కల టీచర్లు అంటేనే ఇష్టమట. ఇక తెలుగు, ఆంగ్లం, హిందీ తదితర భాషలు బోధించే పండితులంటే 13 శాతం మందికి ఇష్టమని తెలిసింది. చివరగా మరో 12 శాతం మందికి సోషల్ టీచర్లంటేనే ఇష్టమని బ్రెయిన్లీ సంస్థ నగరంలో చేపట్టిన తాజా అధ్యయనంలో తేలింది. నగరంలో సుమారు మూడువేల మంది హైస్కూల్ స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల అభిప్రాయాలు సేకరించగా వారి ఇష్టాఇష్టాలు, టీచర్లు–విద్యార్థుల మధ్యనున్న అనుబంధం వంటి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రస్తుత విద్యావిధానంలో టీచింగ్ మెథడాలజీ విద్యార్థులకు అన్ని సబ్జెక్టులు.. క్లాస్‌వర్క్‌లు.. హోంవర్క్ వంటి విషయాల్లో బోధన, గైడెన్స్ బాగానే ఉన్నట్లు తేలింది. అయితే లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలు, దైనందిన జీవితంలో చిన్నారులకు పనికివచ్చే అంశాలు, బహిరంగ ప్రదేశాలు, విపత్కర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తెలియజెప్పే టీచర్లు కేవలం 24 శాతం మంది మాత్రమే ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించడం విశేషం. సందేహాల నివృత్తి ఇలా.. క్లాసులు జరుగుతున్న సమయంలో విద్యార్థులు అడిగే సందేహాలను విసుక్కోకుండా నివృత్తిచేసే ఉపాధ్యాయులు 48% మేర ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక రోజువారీగా తాము ఉపా ధ్యాయులను వివిధ అంశాలపై సందేహాలు అడుగు తున్నట్లు 37% విద్యార్థినీ విద్యార్థులు తెలిపారు. వారంలో కొన్నిసార్లు మాత్రమే తాము పలు అంశాలపై ఉపాధ్యాయులను సందేహాలు అడుగుతున్నామని మరో 29 శాతం మంది తెలిపారు. వారంలో కేవలం ఒకేసారి మాత్రమే తాము టీచర్లను డౌట్లు అడుగుతున్నట్లు 13 శాతం మంది విద్యార్థులు తెలపడం గమనార్హం. మొత్తంగా విద్యాబుద్ధులు నేర్పే ఉపాధ్యాయులు విద్యార్థినీ విద్యార్థుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. లోకజ్ఞానం నేర్పేవారు అరకొరే.. బండెడు పుస్తకాలు, క్లాస్‌వర్క్‌లు, హోమ్‌వర్క్‌లు, పరీక్షలు, మార్కులు సరేసరి కానీ.. విద్యార్థులకు లోకజ్ఞానం నేర్పే ఉపాధ్యాయులు కేవలం 24 శాతం మంది మాత్రమేనని ఈ సర్వే వెల్లడించడం గమనార్హం. సబ్జెక్టులను బోధించడంలో చూపుతున్న శ్రద్ధ.. విద్యార్థులకు దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి.. పరిసరాలను, ప్రకృతిని ఎలా పరిశీలించి విలువైన విషయాలను ఎలా గ్రహించాలి, ఇతరులతో, బహిరంగ ప్రదేశాల్లో ఎలా వ్యవహరించాలి అన్న అంశాలను నేర్పేవారి శాతం కేవలం 24 శాతమేనని తేలింది. రోజురోజుకు ఇలాంటి ఉపాధ్యాయుల సంఖ్య తగ్గుతుండడం పట్ల ఈ అధ్యయనం ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. 30%సైన్స్ టీచర్లంటే మక్కువ చూపిన విద్యార్థులు.. 26% లెక్కల మాస్టార్లంటే∙ఇష్టపడే వారు.. 13% చిన్నారులకు భాషా పండితులంటే ప్రేమ 12%సోషల్ టీచర్లు అంటే అభిమానంహైదరాబాద్‌లో బ్రెయిన్లీ సంస్థ అధ్యయనం -
నెట్టింట్లో లెక్కలు!
సాక్షి,సిటీబ్యూరో: ఎండల తీవ్రత పెరిగింది. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో వారు ఎక్కడికైనా బయటికి వెళ్లి ఆడుకోవాలని చూస్తుంటారు. ఇంతటి ఉష్ణోగ్రతల్లో వారు బయటికి వెళితే వడదెబ్బకు గురయ్యే ప్రమాదముంది. ఇప్పటి వరకు బడిలో గడిపిన వీరిని ఇంటి పట్టున కూర్చోపెట్టడం ఓ పట్టాన సాధ్యం కాదు. ఈ క్రమంలో వారికి లెక్కలపై ఆసక్తి, అనురక్తి కలిగించేందుకు ఇంటర్నెట్లో చక్కని అవకాశాలు ఉన్నాయి. కొన్ని వెబ్సైట్లు కేవలం పిల్లకు మేథమెటిక్స్‌ను అర్థవంతంగా నేర్పించేందుకు అనువుగా రూపొందించారు. వీటిని సెల్ఫోన్లో సైతం ఓపెన్ చేసి పిల్లలతో ప్రాక్టీస్ చేయించవచ్చు. అయితే, ఈ సైట్లలో కొన్ని ఉచిత సేవలు అందిస్తుంటే.. మరికొన్నింటికి డబ్బులు చెల్లించాలి. అయితే, చాలా వరకు వెబ్సైట్లు కొన్ని రోజులు ‘ఫ్రీట్రైల్’ కూడా అందిస్తున్నాయి. అలాంటి నెట్ వేదికల సమాచారమే ఈ కథనం. నిపుణులు ఏమంటున్నారంటే.. వేసవి సెలవుల్లో చిన్నారులకు వీలైనంత వరకు తమ కనుసన్నల్లో ఈ పేజీలు తెరిచే విధంగా తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. వారికి తెలియని భావనలు విడమరచి చెప్పాలి. వేసవి సెలవుల్లో ఎండలో తిరగకుండా ఇలాంటి పాఠ్యాంశ సంబంధ విషయాలను నేర్చుకుంటే విద్యార్థికి మంచిది. తరగతి గదిలో మిగతా విద్యార్థుల కన్నా చురుగ్గా ఉంటూ ఉపాధ్యాయుడి మెప్పు పొందడం సహా విజ్ఞానం సంపాదిస్తారని చెబుతున్నారు. www.funbrain.com ఈ వెబ్ పేజీలో శోధిస్తే కనీసం 17 రకాల ఆటల ద్వారా లెక్కలు నేర్చుకోవచ్చు. చిన్న చిన్న కూడికలు తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు సహా పలు ఆటలను ఆసక్తికరంగా దృశ్యరూపకంగా ఈ సైట్లో పొందుపరిచారు. ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు చదివే విద్యార్థుల మానసిక స్థాయిని అంచనా వేసి వారి స్థాయికి తగ్గట్టు ఈ లెక్కలు ఉంటాయి. పిల్లలకు ఈ వెబ్‌సైట్‌ను పరిచయం చేస్తే వారు ఇంట్లోనే ఉండడంతో పాటు ఈ సెలవుల్లో కొత్తగా లెక్కలపై పట్టు సాధించేందుకు వీలుంది. www.coolmath.com ప్రాధమిక తరగతులు చదివే పిల్లలకు ఎంతో ఉపయుక్తంగా ఈ సైట్‌ను తీర్చిదిద్దారు. ఉన్నత తరగతుల్లో పాఠ్యపుస్తకాలలో తారసపడే పలు ఎక్కలను సంబంధించిన సమాచారం ఎంతో ఆసక్తిగా స్వయంగా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకునేలా లెక్కలు ఉన్నాయి. ఈ వెబ్‌పేజీలోకి వెళితే అనేకానేక ఆటలతో లెక్కలు నేర్చుకోవచ్చు. www.easymaths.org అబాకస్.. ఇటీవల బహుళ ప్రచారం పొంది చలామణిలో ఉన్న గణిత భావనల్లో ప్రప్రథమ స్థానంలో ఉంది. గణితానికి సంబంధించిన చతుర్విధ (కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం) ప్రక్రియలను సులువుగా, వేగంగా నేర్చుకోవడానికి అబాకస్ బాగా దోహదపడుతుంది. బాల్యం నుంచే నేర్పిస్తే భవిష్యత్‌లో గణితంతో ఆటలాడుకోవచ్చని పలువురు చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు నిపుణులతో అబాకస్ నేర్పిస్తున్నారు. ‘ఈజీ మాథ్స్’ వెబ్సైట్లో అలాంటి అబాకస్‌ను సులువుగా ఇంట్లోనే నేర్చుకోవచ్చు. www.figurethis.org జాతీయ గణిత ఉపాధ్యాయ మండలి నిర్వహిస్తున్న ఇంటర్నెట్ పేజీ ఇది. ఇందులో ‘ఫిగర్ దిస్’ అన్న ఆటతో పాటు కుటుంబాలు పాఠశాల, గణితం, కుటుంబాలు ఇంటిపని, ప్రోత్సాహం, గణితం సాహిత్యం, ఇతర వనరులు, అన్న ఆరు రకాల వివరాల పేజీలున్నాయి. ఈ పేజీలో పిల్లలతో పాటు పెద్దలకు కావాల్సిన సమాచారం పొందవచ్చు. www.mathscat.com చాలామంది విద్యార్థులకు లెక్కలంటే భయం ఉంటుంది. అయితే, ఈ వెబ్ పేజీలో గణితానికి సంబంధించి కావాల్సినంత సమాచారం పొందవచ్చు. ఇందులో లెక్కలు ప్రాజెక్టు రూపంలో ఉంటాయి. ప్రతి ప్రాజెక్టు వర్కుతో ఎంతో కొంత విజ్ఞానం పొందవచ్చు. అనేక సరదా ఆటలు ఆడుకోవచ్చు. తను పుట్టిన తేదీ ఆధారంగా వయసును గంటలు, నిమిషాలు.. సెకన్లు సహా తెలుసుకోవచ్చు. ఇలాంటి ఆటలు ఎన్నో ఈ పేజీలో పొందుపరిచారు. కొత్తకొత్త ఆలోచనలు సృజనాత్మకత ఆపాదించుకునే ప్రాజెక్టులు, ప్రయోగాలు ఎన్ని చేయవచ్చో వివరిస్తుంది. www.aaamath.com నేటి తల్లిదండ్రులు తమ పల్లలను మూడేళ్ల వయసులోనే అంగన్వాడీ కేంద్రానికో లేదా ప్లేస్కూల్కో పంపిస్తున్నారు. ఇలాంటి పిల్లలు కూడా చక్కని పాఠాలు కథలుగా అందిస్తుంది ఈ సైట్. ఎల్కేజీ నుంచి ఎనిమిదో తరగతి చదివే పిల్లలకు అర్థమయ్యే రీతిలో లెక్కలు పొందుపరిచారు. అభ్యాసం చేయడం, సమస్యను పరిష్కరించడం, అది సరైనదేనా కాదా అన్న మదింపు వెంటవెంటనే తెర మీద కనిపిస్తుంది. పిల్లలు కూడా ఎంతో ఆసక్తితో నేర్చుకునేలా ఉన్నాయి. -
సీబీఎస్ఈ ‘గణితం’లో రెండు పేపర్లు
న్యూఢిల్లీ: పరీక్షల వేళ విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) కీలక నిర్ణయం తీసుకుంది. గణితం పరీక్షను స్టాండర్డ్, బేసిక్ అని రెండు విభాగాలుగా విడగొట్టి నిర్వహిస్తామని సీబీఎస్ఈ ప్రకటించింది. విద్యార్థులు తమ సామర్థ్యానికి అనుగుణంగా కఠినంగా ఉండే గణితం–స్టాండర్డ్ లేదా సులభంగా ఉండే గణితం–బేసిక్ పేపర్‌ను ఎంచుకోవచ్చు. 2020 మార్చి నుంచి దీన్ని అమల్లోకి తీసుకొస్తారు. ఈ 2 పేపర్లకు సంబంధించి పాఠ్యాంశాలు, బోధన, అంతర్గత మదింపులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. -
గణితం ఇక సులువే..!
పశ్చిమగోదావరి, నిడమర్రు: మనిషి చేసే ప్రతి పనికి ఓ లెక్క ఉంటుంది. లెక్కగా నడుచుకుంటే ప్రతి విద్యార్థికీ లెక్కలంటే మక్కువ పెరుగుతుంది. లెక్కలు.. ఎక్కాలు.. చిన్నప్పటి నుంచి వింటున్నా.. ఒకటో తరగతి నుంచి బట్టీ పట్టినా చాలా మంది విద్యార్థులకు గణితం అంటే ఎందుకో భయం. ఆ భయమే వారిని ఆ సబ్జెక్టుకు దూరం చేస్తుంది. దీంతో ప్రాథమిక పాఠశాలల్లో లెక్కల హోమ్ వర్క్ చేయలేనివారు బడికి పోవడానికి జంకుతారు. ఇలా గణితం అంటే భయపడే విద్యార్థులే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ‘గణిత మిత్ర’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు విద్యాశాఖాధికారులు. జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో ఈ గణితమిత్రలను ఏర్పాటు చేయాలని ఎస్సీఈఆర్టీ అధికారులు భావించారు. తొలి విడతగా జిల్లాలో రోలు ఎక్కువగా ఉన్న 134 పాఠశాలలను ఎంపిక చేశారు. సత్ఫలితాలు పొందేందుకే రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ, ఇతర స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సాధన పరీక్ష, రాష్ట్ర స్థాయి సాధన పరీక్షల వంటి వాటిలో ప్రాథమిక స్థాయి విద్యార్థులు గణిత ప్రక్రియల్లో వెనుకబడి ఉన్నట్టు గుర్తించారు. ఐదో తరగతి పూర్తి చేసే నాటికి చతుర్విద ప్రక్రియలైన కూడికలు, తీసివేతలు, భాగాహారాలు, గుణకారంలో అవగాహన లేకుండానే 70 శాతం మంది ఆరో తరగతిలోకి ప్రవేశిస్తున్నట్లు గుర్తించారు. వీరిలో 50 శాతం కనీసం మూడో తరగతి లెక్కలు కూడా చేయలేకపోతున్నట్లు ఆయా మూల్యాంకాల పరిశీలనలో తేలింది. ఇలాంటి వారికోసం సరళంగా సులభంగా, ఆసక్తికరంగా గణిత పాఠాలు నేర్చుకోవడానికి అవసరమైన బోధనోపకరణాలు అందిస్తే సత్ఫలితాలు పొందవచ్చని విద్యాశాఖ అధికారులు భావించారు. ఈ ఆలోచనల నుండే పుట్టుకొచ్చింది ‘గణితమిత్ర’ కార్యక్రమం. గణిత కిట్స్‌తో బోధన ఉపాధ్యాయులు చెప్పడం, విద్యార్థులు వినడం ద్వారా 26 శాతం, చూడటం ద్వారా నేర్చుకునేది 78 శాతం గుర్తుంటుందని సైకాలజీ నిపుణులు హెబ్బింగ్ హౌస్ తెలిపారు. ఆయన చెప్పిన అక్షర సత్యాన్ని నిజం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ, ఎస్సీఆర్టీ అ«ధ్వర్యంలో ఈ గణితమిత్ర కార్యక్రమం నిర్వహించనున్నారు. దీని అమలుకు రూపొందిం చిన గణిత కిట్స్ సోమవారం జిల్లా ఎస్ఎస్ఏ కార్యాలయానకి చేరుకున్నాయి. వీటిని ఒకటి రెండు రోజుల్లో ఎంపిక చేసిన పాఠశాలలకు సరఫ రా చేయనున్నారు. ఈ కిట్స్ వినియోగంపై ఆయా పాఠశాలల్లో ఎంపిక చేసిన టీచర్‌కు శిక్షణ ఇస్తారు. జిల్లాలో 134 పాఠశాలల ఎంపిక జిల్లాలో 334 ఆదర్శపాఠశాలు ఉన్నాయి. వీటిలో 134 పాఠశాలలను ఈ గణిత మిత్ర కార్యక్రమానికి తొలి విడత ఎంపిక చేశారు. గణిత కిట్లను పంపిణీ చేసి, వాటి వినియోగం ద్వారా స్పందనను ఫలితాల ఆధారంగా మిగిలిన పాఠశాలల్లో అమలు చేయాలని విద్యాశాఖాధికారులు నిర్ణయించారు. అభ్యసన సామగ్రి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు గణితంలోని బోధనాభ్యసన కృత్యాలు, పూసల చట్రం, అబాకస్, ఎక్కాలు సులభంగా నేర్పడానికి, గుణిజాలు తెలపడానికి అభ్యసన సామగ్రి ఉంటుంది. వివిధ ఆకారాలు, కాలం, పొడవు, బరువులకు సంబంధించిన ప్రక్రియలను సులభంగా అవగాహన చేసుకోవడానికి కృత్యాలు ఉంటాయి. కారణాంకాలు, గుణిజాలు, సౌష్టవాలు, కొలజాడి, లీటర్లు, మిల్లీ మీటర్లు పాత్రలు తదితర సులభంగా అర్థమయ్యేలా బోధించేందుకు అభ్యసన సామగ్రి ఉంటుంది. -
గణితమంటే వణుకు.. ఆంగ్లమంటే బెరుకు..!
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు చదువులో వెనుకబడిపోతున్నారు. లెక్కలంటే వణికిపోతున్నారు.. ఆంగ్లమంటే బెదిరిపోతున్నారు.. విజ్ఞానశాస్త్రమంటే వెర్రిమొగం వేస్తున్నారు. జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) ఇటీవల నిర్వహించిన జాతీయ సాధ న సర్వేలో ఈ విషయం బయటపడింది. చిత్తూరు ఎడ్యుకేషన్ : జిల్లాలో విద్యావిధానం, వివిధ సబ్జెక్టుల్లో 3, 5, 8, పదో తరగతి విద్యార్థుల ప్రతిభపై ఈ ఏడాది ఫిబ్రవరి 5న ఎన్సీఈఆర్టీ సర్వే నిర్వహించింది. ఈ ఫలితాలను తాజాగా విడుదల చేసింది. సర్వేలో విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో వెనుకబడినట్లు తేలింది. ముఖ్యంగా గణితం, ఆంగ్లం, సైన్సు సబ్జెక్టుల్లో పరిస్థితి దారుణంగా ఉంది. సోషల్‌లోనూ ఆశాజనకంగా లేదు. చివరికి మాతృభాషలోనూ అంతంతమాత్రంగానే ఉండడం దురదృష్టకరం. పాఠశాల విద్యకు, ఉన్నత విద్యాభ్యాసానికి వారధి పదో తరగతి. కీలకమైన ఈ తరగతిలో చదువుతున్న విద్యార్థులు ఆశించిన స్థాయిలో మెరుగైన ఫలితాలను చూపలేకపోతున్నారు. టీచర్ల కొరతే ప్రధాన సమస్య.. పదో తరగతి విద్యాబోధనకు టీచర్ల కొరత లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం వలనే సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జిల్లాలోని 694 ఉన్నత పాఠశాలల్లో 483 మంది సబ్జెక్టు టీచర్ల కొరత ఉంది. అందులో సబ్జెక్టుల వారీగా చూస్తే.. గణిత ఉపాధ్యాయులు తెలుగు మీడియం 52 మంది, ఉర్దూ మీడియం ఐదుగురు, తమిళంలో ఐదుగురు కొరత ఉన్నారు. అదేవిధంగా తెలుగు మీడియంలో ఫిజిక్స్ 25, బయలాజికల్ సైన్సు 65, సోషియల్ 149, ఇంగ్లిషు 41, తెలుగు 51 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గతేడాది జిల్లా పదో తరగతి ఫలితాల్లో 5వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు మూడేళ్లు వరుసగా 13వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. పదో తరగతి ఫలితాలలో విద్యార్థులు సరైన ప్రతిభ చూపకపోవడానికి అంతకు ముందు తరగతుల్లో పటిష్టమైన పునాదులు లేకపోవడమేనని విద్యావేత్తలు తేల్చిచెబుతున్నారు. ప్రధాన లోపాలివే.. ♦ గణితం మీద విద్యార్థులకు ఉన్న భయం తొలగించకపోవడం ♦ ప్రాజెక్టు విద్యావిధానంలో భాగంగా జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో గణితం బోధించకపోవడం ♦ సూత్రాలు, సిద్ధాంతాలు బట్టీ పద్ధతి కాకుండా అవగాహన కల్పించడంలో టీచర్ల వెనుకబాటుతనం మారిన పాఠ్యాంశాలు ♦ గణిత సిద్ధాంతాలను విశ్లేషణాత్మక బోధన చేయకపోవడం ♦ గణితం, సైన్స్ తదితర పాఠ్యాంశాల పూర్తి తర్వాత పరీక్షలు నామమాత్రంగా నిర్వహించడం ♦ పరీక్ష ఫలితాలను అనుసరించి అవసరమైన విద్యార్థులకు పునఃతరగతులు నిర్వహించకపోవడం ♦ పాఠ్యప్రణాళికను సకాలంలో రూపొందించుకోకపోవడం ♦ వెనుకబడిన విద్యార్థుల విషయంలో టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోకపోవడం ♦ పాఠశాల స్థాయిలో హెచ్ఎంలు, మండల స్థాయిలో ఎంఈఓల తనిఖీలు తూతూమంత్రంగానే ఉండడం ప్రాథమిక స్థాయిలో సరైన పునాదులు పడాలి విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో అన్ని సబ్జెక్టుల్లోనూ సరైన పునాదులు పడినప్పుడే ప్రతిభ చూపగలుగుతారు. టీచర్ల కొరత, పిల్లలపై తల్లిదండ్రుల శ్రద్ధ లోపించడం వంటి కారణాలతో ప్రాథమిక స్థాయిలో గణితం బేసిక్స్ నేర్చుకోలేకపోతున్నారు. – ముత్యాలరెడ్డి, గణిత ఉపాధ్యాయుడు, కుప్పంబాదూరు హైస్కూల్ విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన టీచర్లు తమకు నచ్చిన విధంగా కాకుండా సీసీఈ విధానాన్ని అనుసరించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో పాఠాలు చెప్పాలి. ఈ ఏడాది మరింతగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా, పదో తరగతిలో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేస్తాం. – డాక్టర్ పాండురంగస్వామి, డీఈఓ -
‘జేఈఈలో కెమిస్ట్రీ, మ్యాథ్స్ కఠినం’
సాక్షి, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కెమిస్ట్రీ పేపర్–1, మాథ్స్ పేపర్–2లు కఠినంగా ఉన్నాయని విద్యార్థులు అభిప్రాయపడ్డారు. ఆదివారం జరిగిన పరీక్షలో పేపర్–1 ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో పోలిస్తే మాథ్స్ కాస్త సులువుగా ఉందంటున్నారు. ఫిజిక్స్‌లో ప్రశ్నలు మధ్యస్థంగా ఉండగా, కెమిస్ట్రీ ప్రశ్నలు కఠినంగా ఉన్నాయంటున్నారు. మధ్యాహ్నం జరిగిన పేపర్–2లో మాథ్స్ ప్రశ్నలు కఠినంగా, ఫిజిక్స్, కెమిస్ట్రీ ప్రశ్నలు మధ్యస్థంగా ఉన్నాయంటున్నారు. జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష కీ ని ఈ నెల 29 నుంచి అందుబాటులో ఉంచుతామని ఐఐటీ కాన్పూర్ తెలిపింది. ఫలితాలు వచ్చేనెల 10న ప్రకటిస్తామని పేర్కొంది. -
గణితం కష్టమా..!
బద్వేలు: నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించేందుకు సర్వ శిక్షాభియాన్ (ఎస్ఎస్ఏ) ఆధ్వర్యంలో నిత్యం ప్రత్యేక ప్రయోగాలు, కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కష్టమనుకునే గణితాన్ని ప్రతి విద్యార్థి ఇష్టపడి చదివేందుకు వీలుగా ఏపీ మ్యాథ్స్ ఫోరం ఆ«ధ్వర్యంలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించింది. దీంతో విషయ పరిజ్ఞానం పెరగడంతో పాటు విద్యార్థి ఇష్టపడి చదివేలా అవసరమైన సూచనలు పొందొచ్చు. గణితంలో వచ్చే సందేహాలు, సమస్యలను ఉపాధ్యాయులు/విద్యార్థులు ఇతరులతో పంచుకుని పరిష్కరించుకోవచ్చు. ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యం మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయుల్లో వృత్తి నైపుణ్యం పెంపొందించుటకు ఏటా వృత్యంతర శిక్షణలు నిర్వహిస్తుంటారు. పెరుగుతున్న సాంకేతికతను ఉపయోగించుకుని తరగతి గది బోధనలో గతేడాది నుంచి డిజిటల్/వర్స్వల్ తరగతుల ప్రవేశాన్ని ప్రారంభించారు. దీంతో ఉపాధ్యాయునికి కంప్యూటర్ పరిజ్ఞానం తప్పని సరి అయింది. ఈ నేపథ్యంలో వేసవిలో రెండు రోజుల పాటు సమాచార సంబంధాల సాంకేతిక పరిజ్ఞానం (ఐసీటీ)పై ప్రతి ఉపాధ్యాయునికి శిక్షణనిచ్చారు. ఇందులో భాగంగానే గణితానికి సంబంధించి రూపొందించిన వెబ్సైట్ వినియోగంపై ప్రతి ఉపాధ్యాయునికి శిక్షణనిచ్చారు. దేశంలోనే తొలి ఆన్లైన్ గణిత చర్చా వేదిక ♦ ఎస్ఎస్ఏ ఆధ్వర్యంలో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ గణిత భావనలపై ‘ఏపీ మ్యాథ్స్ ఫోరం’ పేరు మీద వెబ్సైట్ రూపొందించింది. దీనిలో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ♦ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీఎంఏటీహెచ్ఆర్జీఓఆర్యూఎం.కామ్ లాగిన్ అయి ఉపాధ్యాయులైతే న్యూ టీచర్, విద్యార్థులైతే న్యూ స్టూడెంట్ టు జాయిన్లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. విద్యార్థులు: యూజర్ నేమ్, పాస్‌వర్డు క్రియేట్ చేసుకోవాలి. తర్వాత విద్యార్థి పేరు చిరునామా, చదువుతున్న పాఠశాల వివరాలు, ఫోన్ నంబరు, ఈ మెయిల్ ఐడీ తదితర సమాచారం నమోదు చేసి, విద్యార్థి ఫొటో ఆప్‌లోడ్ చేసి సబ్మిట్ ఎంటర్ చేస్తే నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఉపాధ్యాయులు: సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయ్యాలి. ఈ సెక్యూరిటీ కోడ్ కోసం 98490 45684 సెల్ నంబరును కాంటాక్టు చేసి కోడ్ తెలుసుకోవచ్చు. ఈ కోడ్ సహాయంతో వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ ప్రత్యేకతలు ♦ గణిత పరిజ్ఞానంపై నిపుణులు రాసిన అనేక ఆర్టికల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పలువురు శాస్త్రవేత్తల జీవిత విశేషాలు, గణితంలో సులువైన బోధనా పద్ధతులపై అనేక అర్టికల్స్ ఉంటాయి. ఎవరైనా రాసిన అర్టికల్స్‌ను కూడా ఆప్‌లోడ్ చేయవచ్చు. ♦ గణితంలోని వివిధ పాఠ్యాంశాలకు సంబం« దించిన నిపుణులు రాసిన పుస్తకాలు తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ఉన్నాయి. వేదిక్ మ్యాథ్స్, గణితప్రయోగాలు వంటి రచనలు ఉంటాయి. ♦ గణిత బోధనపై తయారు చేసిన వివిధ మాడ్యూల్స్, యూట్యూబ్ వీడియోస్ ఆప్‌లోడ్ చేశారు. ప్రాథమిక స్థాయి విద్యార్థులకు అవసరమైన గణిత మెటీరియల్ ఉంది. ♦ విద్యార్థులు తమ సందేహాలను పోస్టు చేస్తే నిపుణులు వాటిని అన్లైన్లోనే నివృత్తి చేస్తారు. -
లెక్క తప్పింది!
⇒మ్యాథ్స్‌లో ఎక్కువగా ఫెయిలవుతున్న విద్యార్థులు ⇒ఏటా పడిపోతున్న ఉత్తీర్ణత శాతం ⇒లెక్కల మాస్టార్లు ఉన్నా ఫలితం శూన్యం ⇒పర్యవేక్షణ లేమి, ప్రభుత్వ తీరుపై విమర్శలు ⇒నెరవేరని ‘మహా సంకల్పం’ ⇒ఇకనైనా మేల్కొంటారో..లేదో? లెక్క తప్పింది. ఈ సారీ పది ఫలితాల్లో జిల్లా అట్టడుగునే నిలిచింది. దీనికి లెక్కల సబ్జెక్టే ప్రధాన కారణమైంది. మాస్టార్లు ఉన్నా ఫలితం లేకుండా పోయింది. తరచూ అధికారులను మార్చేయడం, ఇన్చార్జ్ అధికారులతోనే నెట్టుకురావడం.. పర్యవేక్షణ లేకపోవడమే పెద్ద పొరబాటని ఉపాధ్యాయ సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. చిత్తూరు, సాక్షి: పది ఫలితాల్లో జిల్లా అట్టడుగు స్థానంలో నిలి చింది. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతమూ తగ్గిపోయింది. గత ఏడాది 90.11 శాతం ఉత్తీర్ణత వస్తే.. ఈసారి 80.55 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ సమీక్ష నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి జిల్లా వరుసగా మూడోసారి చివరిస్థానంలో నిలవడంపై కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అసంతృప్తికి లోనయ్యారు. చీటికీమాటికీ అధికారులను మార్చడం వల్లే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. మూడు ముక్కలాట విద్యాశాఖకు కొంతకాలంగా పూర్తిస్థాయిలో అధికారి లేరు. గత ఏడాది డిసెంబర్ నుంచి ఇన్చార్జ్ డీఈవోతోనే నెట్టుకురావాల్సి వస్తోంది. ఆయనకు (తిరుపతి డీవైఈవో, ఇన్చార్జ్ డీఈవో, ఇన్చార్జ్ పీవో) మూడు పదవులుండడంతో పనిభారం ఎక్కువైపోయింది. విద్యాశాఖపై పూర్తిస్థాయిలో దృష్టిసారించలేకపోయారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పది ఫలితాల్లో వెనుకబడటానికి కారణాలివే ⇒పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన తరుణంలో డీఈవోను మార్చివేశారు ⇒ఉపాధ్యాయుల పనితీరుపై పర్యవేక్షణ లేకుండా పోయింది ⇒ఎంఈవో పోస్టులను విద్యా సంవత్సరం చివరలో చేపట్టారు ⇒గత ఫలితాలపై విశ్లేషించుకోలేకపోయారు ⇒సిలబస్ నిర్ణీత కాలంలో పూర్తి చేయలేకపోయారు లెక్క తప్పింది ఇలా.. ఆరేళ్ల నుంచి జిల్లా విద్యార్థులు గణితంలో అధికంగా ఫెయిలవుతున్నారు. దీనిపై అధికారులు శ్రద్ధ చూపలేకపోయారు. లెక్కల మాస్టార్లు 1,900 మంది ఉన్నా ఫలితాల్లో ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. ఒక్కో పాఠశాలలో కనీసం ఇద్దరు లెక్కల టీచర్లు ఉన్నారు. అయినా ఉత్తీర్ణత సాధించడంలో వెనకబడి పోతున్నారు. ఈ ఏడాది పదిలో లెక్కల పరీక్ష 27,464 మంది విద్యార్థులు రాశారు. అందులో 20,699 మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. వీరిలో ఏ1 గ్రేడు సాధించనవారు వందల మంది మాత్రమే. ‘మహా’ వృథా పది ఫలితాల్లో మొదటి స్థానంలో నిలిపేందుకు గత కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మహాసంకల్పం పేరుతో విద్యార్థులకు వారానికో పరీక్ష జరిపించారు. ఎక్కడ వెనుకబడ్డారో గమనించి వారికి ప్రత్యేక తర్ఫీదు ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించారు. పరీక్షల్లో వచ్చిన మార్కులను ఎప్పటికప్పుడు డీఈవో ఆఫీసుకు పంపేలా చర్యలు తీసుకున్నారు. దీనిపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఇదే అదునుగా ఉపాధ్యాయులు విద్యార్థులకు వచ్చే మార్కులను ఎక్కువ చేసి పంపడం నేర్చుకునేశారు. మహా సంకల్పం వృథాగా మారిపోయింది. రాజకీయ జోక్యం ఎక్కువ విద్యారంగంపై రాజకీయ జోక్యం ఎక్కువ. శాఖల్లో ఉన్నత స్థానం ఖాళీ అయితే వాటిని అధికార పార్టీ నాయకుల ఇష్టులకే వదిలేయడం రివాజుగా మారుతోంది. అనర్హులు ఉన్నత స్థానాలను అ«ధిరోహిస్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అధికార పార్టీ వారి మాట వినకుంటే నిర్ధాక్షణ్యంగా వేటు వేయడం పరిపాటిగా మారిపోయింది. డీఈవో నాగేశ్వరరావు ఉదంతాన్నే దీనికి ఉదాహరణగా చూపుతున్నారు. -
గణితం పేరు వింటే గజగజ
వాషింగ్టన్: ప్రతిభ విషయంలో విద్యార్థులతో పోలిస్తే ఏమాత్రం తక్కువ కాకపోయినప్పటికీ కొంతమంది విద్యార్థినులు తమ కెరీర్లో సైన్సుకే ఎందుకు ప్రాధాన్యమిస్తారో తెలుసా? గణితానికి సంబంధించిన నైపుణ్యం విషయంలో వారికి వారిపై విశ్వాసం లేకపోవడమే. ఈ విషయాన్ని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన లారా పెరెజ్ ఫెల్కెనర్ వెల్లడించారు. ‘ఈ విషయంలో విద్యార్థినులు, విద్యార్థుల శక్తిసామర్థ్యాల మధ్య తేడాను గుర్తించేందుకుగాను నిరంతరంగా పరీక్షలు నిర్వహించాం. ఇందులో విద్యార్థినులకంటే విద్యార్థులే ఎక్కువ మార్కులు సాధించారు. విద్యార్థులదే పైచేయిగా ఉంది.’ అని లారా పెరెజ్ చెప్పారు. వాస్తవానికి విద్యార్థినులు ప్రతిభావంతులే అయినప్పటికీ గణితానికి సంబంధించిన నైపుణ్యం విషయంలో వారిపై వారికి నమ్మకం అంతంతే. ఈ పరీక్షల్లో బాలికలంటే బాలురే 27 శాతం మేర ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులను ఇందుకోసం ఎన్నుకున్నాం. అనేక ప్రశ్నలు ఇచ్చాం. అత్యంత కష్టమైన ప్రశ్నలు వచ్చాయని విద్యార్థినులు భావించారు. వారిపై వారికున్న విశ్వాసస్థాయి...ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం అనంతరం సైన్సు తీసుకోవాలా? లేక మేథమేటిక్స్ ఎంచుకోవాలా? అనేదానిపై ఒక నిర్ణయానికి వచ్చేలా చేస్తుంది’ అని పేర్కొన్నారు. -
అమెరికన్ పోలీసులా మజాకా!
లీనా డ్రేపర్ హోమ్ వర్క్ చేసుకుంటోంది. ఆ చిన్నారి వయసు 10 ఏళ్లు. మ్యాథ్స్‌లో ఆమెకో డౌట్ వచ్చింది. మేథ్స్ ఎలా ఉంటుందో తెలుసు కదా! మనసు లేని సబ్జెక్ట్. పాషాణ హృదయురాలు. చిన్న పిల్లా, పెద్ద పిల్లా అని చూసుకోదు. ఆన్సర్ కావాలంతే! ఏదో ఒకలా చెప్పేస్తే ఊరుకోదు. లాజిక్ కావాలి. లీనాకు వచ్చిన కష్టం ఏంటంటే (8+29) ×15 = ఎంత అన్నది. అమ్మని అడిగితే ‘సొంతంగా చెయ్’ అంది. నాన్నని అడిగితే ‘ఐ యామ్ బిజీ’ అన్నాడు. ఏం చేయాలో పాలుపోలేదు లీనాకు. వెంటనే నెట్లోకి వెళ్లి పోలీస్ డిపార్ట్మెంట్ ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసింది. తన సమస్యను అందులో పోస్ట్ చేసింది. తర్వాత ఏం జరిగి ఉంటుంది? పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సమాధానం వచ్చేసింది! ‘ఫస్ట్.. బ్రాకెట్లో ఉన్న వాటిని కలుపు. కలపగా వచ్చిన మొత్తాన్ని 15తో గుణించు’ అని మెసేజ్ ఇచ్చారు ఓహియో స్టేట్ పోలీసులు. లీనా డ్రేపర్ ఆనందానికి హద్దుల్లేవు. ‘అది మా జ్యురిస్‌డిక్షన్‌లోకి రాదు’ అని తరచు మన పోలీసులు అంటుంటారు. అలాగైతే లీనా డ్రేపర్ అడిగిన హెల్ప్ అమెరికాలోని 50 రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్ల పరిధిలోకి రాదు. అయినా లీనాకు సమాధానం వచ్చింది. సహాయం చేసే ఉత్సాహం ఉంటే పరిథులు, పరిమితులు అడ్డొస్తాయా! -
మ్యాథ్స్ ఇష్టపడితే దూసుకుపోతారు!
బెర్లిన్: గణితాన్ని ఎక్కువగా ఇష్టపడటంతోపాటు మంచి మార్కులు సాధించిన విద్యార్థులు విద్యారంగంలో ఉన్న స్థానాలను పొందుతారని ఒక సర్వేలో తేలింది. గణితాన్ని నేర్చుకోవడంలో అనుకూల భావాలు కలిగిఉండడం, విజయం సాధించడమనేవి ఒకదానికొకటి అవినాభావ సంబంధాలు కలిగి ఉంటాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే విద్యార్థులు చదివే విధానం, మేథో వికాసం అనేవి ఆనందం, ఆందోళన, విసుగుదల లాంటి భావోద్వేగ స్పందనల ద్వారా ప్రభావితమవుతాయని కనుగొన్నారు. విజయ సాధనలో పాఠశాల స్థాయిలో విద్యార్థుల భావోద్వేగాలు ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనే అంశంపై జర్మనీలోని లుడ్విగ్ మాక్సిమిలియన్స్ విశ్వవిద్యాలయాని(ఎల్‌ఎమ్‌యూ)కి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు. ‘‘విద్యార్థులకు ఎక్కువ తెలివితేటలు కలిగి, మంచి గ్రేడ్లు, మార్కులు సాధించినప్పటికీ.. గణితాన్ని ఎక్కువగా ఇష్టపడి చదివినవారే గొప్ప లక్ష్యాలను సాధించగలరు’’అని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎల్‌ఎమ్‌యూ ప్రొఫెసర్ రెయిన్హార్డ్ పెక్రుమ్ పేర్కొన్నారు. అదే సమయంలో కోపం, ఆందోళన, సిగ్గు, విసుగు, నిరాశ కలిగిన విద్యార్థులు వారి లక్ష్యాలను సాధించుకోవడంలో వెనకబడతారని వెల్లడించారు.