గణితం పేరు వింటే గజగజ
వాషింగ్టన్:
ప్రతిభ విషయంలో విద్యార్థులతో పోలిస్తే ఏమాత్రం తక్కువ కాకపోయినప్పటికీ కొంతమంది విద్యార్థినులు తమ కెరీర్‌లో సైన్సుకే ఎందుకు ప్రాధాన్యమిస్తారో తెలుసా? గణితానికి సంబంధించిన నైపుణ్యం విషయంలో వారికి వారిపై విశ్వాసం లేకపోవడమే. ఈ విషయాన్ని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన లారా పెరెజ్ ఫెల్కెనర్ వెల్లడించారు. ‘ఈ విషయంలో విద్యార్థినులు, విద్యార్థుల శక్తిసామర్థ్యాల మధ్య తేడాను గుర్తించేందుకుగాను నిరంతరంగా పరీక్షలు నిర్వహించాం. ఇందులో విద్యార్థినులకంటే విద్యార్థులే ఎక్కువ మార్కులు సాధించారు. విద్యార్థులదే పైచేయిగా ఉంది.’ అని లారా పెరెజ్ చెప్పారు.
వాస్తవానికి విద్యార్థినులు ప్రతిభావంతులే అయినప్పటికీ గణితానికి సంబంధించిన నైపుణ్యం విషయంలో వారిపై వారికి నమ్మకం అంతంతే. ఈ పరీక్షల్లో బాలికలంటే బాలురే 27 శాతం మేర ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులను ఇందుకోసం ఎన్నుకున్నాం. అనేక ప్రశ్నలు ఇచ్చాం. అత్యంత కష్టమైన ప్రశ్నలు వచ్చాయని విద్యార్థినులు భావించారు. వారిపై వారికున్న విశ్వాసస్థాయి...ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం అనంతరం సైన్సు తీసుకోవాలా? లేక మేథమేటిక్స్ ఎంచుకోవాలా? అనేదానిపై ఒక నిర్ణయానికి వచ్చేలా చేస్తుంది’ అని పేర్కొన్నారు.