florida state university
-
కాళ్లలో మొత్తం పరాన్నజీవులే
వాషింగ్టన్: కాళ్ల నుంచి నడుము దాకా నొప్పితో బాధపడు తూ ఆస్పత్రిలో చేరిన రోగికి సిటీ స్కాన్ చేసి ఆ రిపోర్ట్ చూశాక అవాక్కవడం వైద్యుల వంతయింది. అమెరికాలో ని యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా హెల్త్ జాక్సన్విల్లే వైద్యకళా శాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు అంశాలపై ప్రజలకు ఆన్లైన్లో అవగాహన కల్పించే ఒక వైద్యుడి ద్వారా ఈ విషయం వెల్లడైంది. రోగికి తీసిన సీటీ స్కాన్ రిపోర్ట్‌లను చూపిస్తూ పరాన్న జీవులతో ఇబ్బందిపడ్డ ఆ రోగి వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా డాక్టర్ శామ్ ఘలీ వెల్లడించారు. ‘‘అత్యవసర చికిత్స నిమిత్తం ఆగస్ట్ 25వ తేదీన ఆ రోగిని మా ఎమర్జెన్సీ రూమ్‌లో చేర్పించారు. వెంటనే నేను సీటీ స్కాన్ తీ యించా. ఆ సీటీ స్కాన్ రిపోర్ట్చూశాక నాకు నోట మా టరాలేదు. కాళ్లలో ఎక్కడపడితే అక్కడ పరాన్నజీవులు తిష్టవే శాయి. సరిగా ఉడకని పంది మాంసం తినడం వల్ల రోగి శరీరంలోకి పంది నులిపురుగులు ప్రవేశించి రెండు కాళ్ల కండరాలను మొత్తం ఆక్రమించేశాయి. ఈ విషమ పరిస్థితిని టేనియా సోలియం లేదా సిస్టీసెర్కోసిస్గా వ్యవహరిస్తారు. ఏమిటీ సిస్టీసెర్కోసిస్?సరిగా ఉడకని, పచ్చి పంది మాసం తినడం వల్ల ఆ మాంసంలోని నులిపురుగులు మానవ శరీరంలోకి ప్రవేశిస్తాయి. దాని లార్వాలు మెదడు, కండరాల్లో కి చొరబడితే ఆరోగ్య పరిస్థితి మరింత దారుణంగా తయార వుతుంది. చర్మం కింద గడ్డలు, తలనొప్పితోపాటు ఇన్ఫెక్షన్ మెదడు, వెన్నుపూస దాకా చేరితే మూర్ఛ వ్యాధి రావొచ్చు. కలుషిత ఆహారం, కలుషిత నీరు, అశుభ్రమైన చేతులు, మనిషి మలం ద్వారా కూడా ఈ నులిపురుగులు వ్యాపి స్తాయి. ఉడికీఉడకని పంది మాంసం ద్వారా లార్వాలు మనిషి పేగుల్లోకి, అక్కడి నుంచి రక్తంలో కలుస్తాయి. రక్తంతోపాటు శరీరమంతా తిరుగుతూ ఎక్కడపడితే అక్కడ లార్వాలు తిష్టవేస్తాయి. తొలి దశలోనే సిస్టీ సెర్కోసిస్ను గుర్తిస్తే నివారణ చాలా సులభం. ఆల స్యం చేస్తే మాత్రం మరణం ఖాయం. ప్రపంచవ్యాప్తంగా ఏటా 5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడుతు న్నారు. అయితే కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వ్యాధి ముదిరి ఏటా 50,000 మంది చనిపో తున్నారు. ‘‘యాంటీ–పారాసైట్ థెరపీ, స్టెరాయిడ్ లు, న్యూరోసిస్టీసెర్కోసిస్ కోసం యాంటీ–ఎపిలె ప్టిక్స్, సర్జరీ ద్వారా ఈ వ్యాధికి చికిత్స చేసుకోవచ్చు. తొలి దశలో సీటీ స్కాన్ చేయిస్తే స్కానింగ్‌లో తెల్ల బియ్యంలాగా ఇవి కనిపిస్తాయి. దాంతో వీటిని గుర్తించవచ్చు. ఇన్ఫెక్షన్ సోకిన 5–12 వారాల్లోగా అవి నులిపురుగులుగా మారతాయి. అప్పుడు సమస్య మరింత జఠిలమవుతుంది. అందుకే తినేటప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోండి’. -
జాబిల్లిపై పచ్చదనం!
చందురిడిపై ఏరువాక సాగే రోజులు దగ్గరపడుతున్నాయి. పోషకాలు లేని చందమామ మృత్తికలో మొక్కలు పెరగవన్న అంచనాలను పటాపంచలు చేసే ప్రయోగాన్ని అమెరికా సైంటిస్టులు నిర్వహించారు. దీంతో భవిష్యత్‌లో చంద్రునిపై నివాసానికి ప్రధాన అడ్డంకి తొలగినట్లేనని భావిస్తున్నారు. వాషింగ్టన్: జాబిల్లిపై ప్రయోగాల్లో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో మొదటిసారిగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు పెంచి చూపించారు. దీంతో చంద్రుడిపై వ్యవసాయం చేయడం సాధ్యమేనన్న విశ్వాసం కలిగిందని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. మొదటిసారి ప్రయోగాత్మకంగా ఆఫ్రికా, యురేషియాల్లో లభించే ఆవాలు, కాలీఫ్లవర్ జాతికి చెందిన అరబిడోప్సిస్ థాలియానా మొక్కల్ని చంద్ర మృత్తికలో పెంచారు. ఈ మొక్కలకి సహజంగా చాలా త్వరగా పెరిగే గుణం ఉంటుందని వాటిని ఎంపిక చేసుకున్నట్టుగా నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. వీరి అధ్యయనం వివరాలను జర్నల్ కమ్యూనికషన్స్ బయాలజీ ప్రచురించింది. మొక్కల్ని ఇలా పెంచారు.. మొక్కలు పెంచాలంటే పోషకాలతో కూడిన మట్టి, సూర్యరశ్మి, నీళ్లు, బ్యాక్టీరియా వంటివెన్నో ఉండాలి.చంద్రుడి నుంచి అపోలో మిషన్ 11, 12, 17 సమయంలో మట్టిని తీసుకువచ్చి 50 ఏళ్లకుపైగా అయింది. ఈ మట్టిలో మొక్కల్ని పెంచాలంటే అత్యంత కష్టమైన విషయమే. చంద్రుడిపై మట్టికి, భూమిపై లభించే మట్టి మధ్య చాలా తేడాలుంటాయి. ముఖ్యంగా చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో పోషక విలువలు కాగడా వేసి చూసినా కనిపించవు. సహజసిద్ధంగా మట్టిలో ఎరువులుగా పని చేసే కీటకాలు, బ్యాక్టీరియా, తేమ ఉండవు. అందుకే ఇందులో మొక్కలు పెంచడాన్ని ఒక సవాల్ తీసుకున్నారు. అతి చిన్న కుండీలను తీసుకొని చంద్రుడి మట్టి ఒక్కో గ్రాము వేశారు. అందులో నీళ్లు పోసి విత్తనాలు నాటారు. వాటిని ఒక గదిలో టెర్రారియమ్ బాక్సుల్లో ఉంచారు. ప్రతీ రోజూ వాటిలో పోషకాలు వేస్తూ వచ్చారు. రెండు రోజుల్లోనే ఆ విత్తనాలు మొలకెత్తడంతో శాస్త్రవేత్తలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆరు రోజుల్లో అవి ఎదిగి పచ్చగా కంటికి ఆహ్లాదాన్నిచ్చాయని హార్టీకల్చర్ శాస్త్రవేత్త అన్నా లిసా పాల్ చెప్పారు. ఎలా పెరిగాయి? చంద్రుడిపై వ్యవసాయానికి వీలు కుదురుతుందా ? భవిష్యత్‌లో చంద్రుడిపై పరిశోధనల కోసం మరిన్ని రోజులు వ్యోమగాములు గడపాలంటే వారికి కావల్సిన పంటలు అక్కడ పండించుకోవడం సాధ్యమేనా? అన్న దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఇందులో చంద్రుడి మట్టిలో వ్యవసాయం సాధ్యమేనని తేలింది. అయితే ఈ మొక్కలు భూమిపై పెరిగినంత బలంగా, ఏపుగా పెరగలేదు. విత్తనాలు వేసిన 20 రోజుల తర్వాత ఆ మొక్కల జన్యుక్రమాన్ని విశ్లేషించే ఆర్ఎన్ఏ పరీక్షలు చేశారు. ఆ మొక్కలు కాస్త ఒత్తిడి మధ్య పెరిగినట్టు ఆ పరీక్షల్లో తేలింది. అలాగే ఎక్కువ వయసున్న చంద్ర మృత్తికలో కన్నా తక్కువ వయసున్న చంద్ర మృత్తికలో మొక్కలు తక్కువ ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఏదైతేనేం, చంద్రుడి మట్టిలో విత్తనాలు వేస్తే మొలకెత్తడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ పరిశోధన భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి బాటలు వేస్తుందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
డైనోసార్లకు చుట్టాలు చీమలు..వాటర్ ప్రూఫ్ కూడా!
‘చీమంత బలం నీది .. నువ్వేం చేస్తావ్ రా నన్ను’ అంటూ చీమను తక్కువ చేసి మాట్లాడుతుంటారు కానీ చీమకున్నంత బలం, చీమకున్నంత ఓర్పు, నేర్పు, కలుపుగోలుతనం.. అబ్బో చాలా వాటిల్లో మనుషులను మించి ముందున్నాయి. వీటికి సంబంధించి అవాక్కయ్యే నిజాలు కూడా చాలానే ఉన్నాయి. ఆ ‘చాలా’ ఏంటో తెలుసుకుందామా! డైనోసార్లకు చుట్టాలు చీమలు నిజం. హార్వర్డ్, ఫ్లోరిడా స్టేట్ వర్సిటీల పరిశోధనలో ఇది తేలింది. 130 మిలియన్ సంవత్సరాల కిందటి నుంచే చీమలు ఉన్నాయంట. డైనోసార్లు అంతరించినా ఇవి మాత్రం గడ్డు పరిస్థితులను తట్టుకొని నిలబడ్డాయంట. చీమలు.. రైతులు ఏంటి.. నిజమా! అని అనుకొనే ఉంటారు. మనుషులు కాకుండా ఇంకే జీవులైనా ఇతర జీవులను పెంచి పోషిస్తున్నాయంటే అవి చీమలే. ఆహారం, ఇతర ఉత్పత్తుల కోసం ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లను మనుషులు పెంచుతున్నట్టే.. చీమలు కూడా కొన్ని రకాల నల్లులను పెంచి పోషిస్తాయి. ఇతర జీవుల నుంచి రక్షణ కల్పిస్తాయి. వానాకాలంలో ఇబ్బంది పడకుండా వాటి ఇళ్లల్లో చోటిస్తాయి. బదులుగా ఆ నల్లుల నుంచి తేనెను తీసుకుంటాయి. అలాగే ఆహారానికి, నివాసానికి కావాల్సిన మంచి ప్రాంతమెక్కడుందో తెలుసుకోవడానికి తమ తోటి చీమలందరి నుంచి సలహాలను తీసుకొని మరీ చీమలు ముందుకెళ్తాయి. పాఠాలు నేర్పించగలవు మనుషులు, జంతువుల్లా చీమలు కూడా తమ తోటి చీమలకు పాఠాలు చెప్పగలవు. నేర్పించగలవు. చాలా జంతువులు తమ తోటి జంతువులను అనుసరించి కావాల్సినవి నేర్చుకుంటుంటాయి. కానీ చీమలు కాస్త వేరు. కొన్ని రకాల రసాయనాలను బయటకు విడుదల చేసి పక్క చీమలకు కొన్ని రకాల విషయాలు నేర్పిస్తుంటాయి. ఉదాహరణకు కొత్త ప్రాంతానికి, ఇంటికి గనుక చీమలు వెళ్తే పక్క చీమలు ఆ ప్రాంతాన్ని గుర్తుంచుకోవడానికి వీలుగా రసాయనాలు వదులుతుంటాయి. ప్రతి కొంత దూరానికి ఇలా చేస్తుంటాయి. మిగతా చీమలు ఆ వాసన పసిగట్టి ముందుకెళ్తుంటాయి. చీమలు ఒకే వరుసలో వెళ్లడానికి ప్రధాన కారణమిదే. చీమలు పనికెక్కాయంటే పక్కా మరి. ఇవి వాటర్ ప్రూఫ్ చీమలు నీటిలో ఈదగలవు. అలాగని బటర్‌ఫ్లై స్టైల్లో ఈతకొడతాయని కాదు. వాటిస్థాయిలో నీటిపై తేలుతూ వెళ్తుంటాయి. ఒకవేళ నీటి అడుగుకు వెళ్లినా కూడా బతకగలవు. ఎలాగా..? అంటే వాటికి ఊపిరితిత్తులుండవు మరి. వాటి శరీరంపై ఉండే రంధ్రాలతో ఆక్సిజన్ పీల్చుకోవడం, కార్బన్‌డై ఆౖMð్సడ్‌ను వదలడం చేస్తుంటాయి. రంధ్రాలు చిన్న చిన్న గొట్టాలకు కలిపి ఉంటాయి. వీటి నుంచి శరీరంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కాబట్టి చీమలు నీటి అడుగుకు వెళ్లినా 24 గంటల్లోపు నీళ్లు ఆవిరైతే అవి మళ్లీ బతికేయగలవు. కొన్ని శరీర భాగాలు పోయినా కొన్ని చీమలు జీవిస్తాయి. కొన్ని తిండి, నీళ్లు లేకున్నా వారాల తరబడి బతికేస్తాయి. చీమలకు చెవులు కూడా ఉండవు. అలాగని వినలేవని కాదు. వైబ్రేషన్స్ ద్వారా ఇవి వినగలుగుతాయి. రెండు పొట్టల జీవులు చీమలకు రెండు పొట్టలుంటాయి. అలాగని ఇవేం అత్యాశపరులేం కాదు. ఒక పొట్టలో తమకు కావాల్సిన ఆహారం పెట్టుకుంటాయి. మరో పొట్టలో వేరే చీమలకు కావాల్సిన ఆహారం నిల్వ చేసుకుంటాయి. కొన్ని చీమలు తమ గూడు వదిలి ఆహారం కోసం వెళ్లినప్పుడు తమ ప్రాంతానికి కాపలాగా ఉంటాయి. ఇలా బయటకు వెళ్లిన చీమలు కాపలాగా ఉండే చీమలకు ఆ రెండో పొట్టలో తిండి దాచుకొని తీసుకొస్తాయి. చాలా.. అంటే చాలానే.. ప్రపంచంలో చీమల జనాభా ఎంతనుకుంటున్నారు. చాలానే ఉంటుంది. చాలా అనే పదం వాడినా తక్కువేనేమో. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతి మనిషికి సరాసరి 10 లక్షల చీమలున్నాయి. చీమల్లో దాదాపు 10 వేల రకాలు ఉన్నాయి. బలంలో బాహుబలులు చీమలు బలంలో బాహుబలులు. వీటి శరీర బరువుకు దాదాపు 10 నుంచి 50 రెట్ల వరకు బరువును మోసుకెళ్లగలవు. చీమల పరిమాణంతో, బలంతో పోల్చితే ప్రపంచంలో అత్యంత బలమైన జీవులివే. ఆసియా జాతికి చెందిన చీమలైతే తమ బరువుకు దాదాపు 100 రెట్లు బరువును తీసుకెళ్లగలవు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ రిపోర్టు ప్రకారం.. చీమలు చిన్నగా ఉంటాయి కాబట్టి వాటి కండరాల్లో విభజన ఎక్కువుంటుంది. దాని వల్ల మిగతా జీవులతో పోల్చితే ఎక్కువ బలాన్ని ప్రయోగించగలవు. -
ఒక్క సెకనులో ‘కరోనా’ ఫలితం
న్యూఢిల్లీ: కరోనా నిర్థారణ పరీక్షలు ఇకపై క్షణాల్లోనే నిర్వహించే పద్దతిని అమెరికాలోని ఫ్లోరియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. బయో సెన్సార్ల సాయంతో క్షణాల్లోనే మన శరీరంలో కరోనా వైరస్ ఉన్నది లేనిది తెలిసిపోతుంది. రక్త పరీక్షలు చేసే తరహాలోనే ఇందులో కూడా స్ట్రిప్ ఉంటుంది. దానిలో లాలా జలం తీసుకుంటే .... బయో సెన్సార్లు ఆ లాలాజలాన్ని పాలిమర్ చైన్ రియాక్షన్ పద్దతిలో క్షణాల్లోనే పరీక్షిస్తాయి. శరీరంలో కరోనా వైరస్ ఆనవాళ్లు సెన్సార్లు గుర్తించినట్టయితే వెంటనే ఆ సమాచారం తెలియ జేస్తుంది. పరీక్ష ముగిసిన తర్వాత స్ట్రిప్‌ను మారిస్తే సరిపోతుంది. బయో సెన్సార్‌ను మళ్లీ ఉపయోగించుకునే వీలుంటుంది. తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో వేగంగా కరోనా నిర్థారణ పరీక్షలు జరిపే వీలుంటుంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న కరోనా పరీక్షా విధానాల్లో ఆర్టీ పీసీఆర్ పద్దతికే కచ్చితత్వం ఎక్కువ. అయితే ఆర్టీ పీసీఆర్ పరీక్షల్లో ఫలితాలు రావడానికి గంటలు, కొన్ని సార్లు రోజుల కొద్ది సమయం పడుతుంది. అదే బయో సెన్సార్లు ఉపయోగించనట్టయితే సమయం ఎంతో ఆదా అవుతుంది. తక్కువ ఖర్చుతోనే చేయోచ్చు. ఈ బయో సెన్సార్ స్ట్రిప్ పద్దతికి సంబంధించిన సమాచారం జర్నల్ ఆఫ్ వాక్యూమ్ సైన్స్ , టెక్నాలజీలో ప్రచురితమైంది. రాబోయే రోజుల్లో రోగ నిర్థారణ పరీక్షల్లో బయో సెన్సార్లు కీలకం కానున్నాయంటూ సైంటిస్టులు చెబుతున్నారు. -
భర్తలు ఎట్రాక్టివ్‌గా ఉంటే.. భార్యలు ఏం చేస్తారంటే..!
న్యూయర్క్: భర్తలు అందంగా ఆకర్షణీయంగా ఉంటే భార్యలు ఎలా ఫీలవుతారనే దాని పై చేసిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకు చెందిన పరిశోధకులు ఇటీవల డల్లాస్ ఏరియాలో ఉండే కొత్తగా పెళ్లయిన 113 జంటలపై సర్వే చేపట్టారు. ఇందుకోసం నాలుగు నెలల క్రితమే పెళ్లైనా 20 ఏళ్ల వారిని ఎంపిక చేసుకున్నారు. వీరికి పలు ప్రశ్నలు ఇచ్చి సమాధానాలు రాబట్టారు. ఈ సమాధానాలు విశ్లేషించిన ప్రముఖులు అంతిమంగా ఏ నిర్ణయానికి వచ్చారంటే.. తమ కంటే అందంగా, ఆకర్షణీయంగా కనిపించే భర్తలున్న యువతులు కాస్త ఇబ్బందిగా ఫీలవుతున్నారట. అందంగా కనిపించడానికి వీళ్లు తిండి విషయంలో కఠినంగా ఉంటున్నారట. అంతేకాదు అవసరమైన ఆహారం తీసుకోకుండా డైటింగ్ చేస్తూ మరింత అనారోగ్యంగా తయారవుతున్నారని తేలింది. దీని కారణంగా ఒత్తిడి, ఆందోళన, జీవితంపై విరక్తి వంటి మానసిక జబ్బులను కొనితెచ్చుకుంటున్నారట. అయితే అందంగా ఉండే యువతులు మాత్రం ఇందుకు మినహాయింపు అని స్పష్టమైంది. ఈ పరిశోధనలో పురుషులు మాత్రం అలాంటివి పట్టించుకోరనే విషయం తేలింది. భర్తలు మాత్రం భార్య తన కన్నా అందంగా ఉందా, మామూలుగా ఉందా, తక్కువ అందంగా ఉందా అన్న విషయాలను పెద్దగా పట్టించుకోరని కూడా పరిశోధనలో రుజువైంది. -
గణితం పేరు వింటే గజగజ
వాషింగ్టన్: ప్రతిభ విషయంలో విద్యార్థులతో పోలిస్తే ఏమాత్రం తక్కువ కాకపోయినప్పటికీ కొంతమంది విద్యార్థినులు తమ కెరీర్లో సైన్సుకే ఎందుకు ప్రాధాన్యమిస్తారో తెలుసా? గణితానికి సంబంధించిన నైపుణ్యం విషయంలో వారికి వారిపై విశ్వాసం లేకపోవడమే. ఈ విషయాన్ని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన లారా పెరెజ్ ఫెల్కెనర్ వెల్లడించారు. ‘ఈ విషయంలో విద్యార్థినులు, విద్యార్థుల శక్తిసామర్థ్యాల మధ్య తేడాను గుర్తించేందుకుగాను నిరంతరంగా పరీక్షలు నిర్వహించాం. ఇందులో విద్యార్థినులకంటే విద్యార్థులే ఎక్కువ మార్కులు సాధించారు. విద్యార్థులదే పైచేయిగా ఉంది.’ అని లారా పెరెజ్ చెప్పారు. వాస్తవానికి విద్యార్థినులు ప్రతిభావంతులే అయినప్పటికీ గణితానికి సంబంధించిన నైపుణ్యం విషయంలో వారిపై వారికి నమ్మకం అంతంతే. ఈ పరీక్షల్లో బాలికలంటే బాలురే 27 శాతం మేర ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినీవిద్యార్థులను ఇందుకోసం ఎన్నుకున్నాం. అనేక ప్రశ్నలు ఇచ్చాం. అత్యంత కష్టమైన ప్రశ్నలు వచ్చాయని విద్యార్థినులు భావించారు. వారిపై వారికున్న విశ్వాసస్థాయి...ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసం అనంతరం సైన్సు తీసుకోవాలా? లేక మేథమేటిక్స్ ఎంచుకోవాలా? అనేదానిపై ఒక నిర్ణయానికి వచ్చేలా చేస్తుంది’ అని పేర్కొన్నారు. -
నేరేడుతో ప్రయోజనాలెన్నో..
రోజూ గుప్పెడు నేరేడు పళ్లు తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నేరేడు తినడం వల్ల రక్తపోటు అదుపు కావడమే కాకుండా, ధమనులు బిరుసెక్కకుండా ఉంటాయని అంటున్నారు. తరచుగా నేరేడు పళ్లు తినేవారిలో రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. మెనోపాజ్ దశలో రక్తపోటును ఎదుర్కొనే మహిళలకు నేరేడు పళ్లు మరింత మేలు చేస్తాయని వారు వివరిస్తున్నారు. నేరేడు పళ్ల పొడిని తీసుకున్నా, ఇవే రకమైన ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. నేరేడు పళ్లలోని నైట్రిక్ ఆక్సైడ్ ప్రభావం వల్ల రక్తపోటు తగ్గుతుందని వివరిస్తున్నారు.