
నేరేడుతో ప్రయోజనాలెన్నో..
రోజూ గుప్పెడు నేరేడు పళ్లు తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నేరేడు తినడం వల్ల రక్తపోటు అదుపు కావడమే కాకుండా, ధమనులు బిరుసెక్కకుండా ఉంటాయని అంటున్నారు. తరచుగా నేరేడు పళ్లు తినేవారిలో రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.
మెనోపాజ్ దశలో రక్తపోటును ఎదుర్కొనే మహిళలకు నేరేడు పళ్లు మరింత మేలు చేస్తాయని వారు వివరిస్తున్నారు. నేరేడు పళ్ల పొడిని తీసుకున్నా, ఇవే రకమైన ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. నేరేడు పళ్లలోని నైట్రిక్ ఆక్సైడ్ ప్రభావం వల్ల రక్తపోటు తగ్గుతుందని వివరిస్తున్నారు.