15 ఏళ్ల క్రితం 2 ఎకరాల్లో 150 నేరేడు మొక్కలు నాటిన రైతు
మార్కెటింగ్ సమస్యను అధిగమించే కృషిలో నేరేడు జ్యూస్ ఉత్పత్తిపై దృష్టి
8 ఏళ్లు పరిశోధించి నేరేడు జ్యూస్ టెక్నాలజీని రూ΄÷ందించుకున్న రైతు మారుతీప్రసాద్
మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆదరణతో పుంజుకున్న ఆన్‌లైన్ అమ్మకాలు
నేరేడు తోటలో మారుతీప్రసాద్, (ఇన్‌సెట్) ఆయన తయారు చేసిన నేరేడు జ్యూస్ సీసాలు
నేరేడు పండ్లు జూన్–జూలై మధ్య ఏడాదికి ఒక్క నెల రోజులు మాత్రమే వస్తాయి. చెట్లపై 90% పండిన నేరేడు కాయలను వ్యాపారులు కొని నగరాలు, పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ ఉంటారు. ఒక్క రోజు కోయక΄ోయినా పండ్లు 100% పండి΄ోతాయి. రవాణాకు పనికిరావు కాబట్టి వ్యాపారులు కొనరు. మరో రోజు కోయక΄ోతే రాలి మట్టిపాలవుతాయి. 100% పండిన పండ్లను వృథా కాకుండా ఇంటిపట్టునే జ్యూస్‌గా మార్చితే పండ్ల వృథాను అరికట్టినట్లవుతుంది. జ్యూస్ అమ్మకం ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుందని ఆశించిన రైతు మారుతీ ప్రసాద్. 8 ఏళ్లు కష్టపడి నేరేడు జ్యూస్ తయారీకి అవసరమైన ప్రత్యేక టెక్నాలజీని విజయవంతంగా రూపొందించుకున్నారు.
అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ పి. మారుతీ ప్రసాద్ ఇంటర్ వరకు చదువుకున్నారు. దానిమ్మ, ద్రాక్ష తదితర పంటల సాగుతో నష్టాల పాలైన నేపథ్యంలో వ్రేదావతి ఒడ్డున 4 ఎకరాల చౌడు భూమిని 15 ఏళ్ల క్రితం కొన్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆర్‌డీటీ సహకారంతో రెండెకరాల్లో 150 అల్లనేరేడు మొక్కలు 2009లో నాటారు. కాలక్రమంలో నేరేడు తోటల విస్తీర్ణం ఆ ్రపాంతంలో 400 ఎకరాలకు పెరిగి, మార్కెటింగ్ సమస్య వచ్చిపడింది.
8 ఏళ్ల ప్రయోగాలు ఫలించిన వేళ..
జూన్–జూలై మధ్య కేవలం నెల రోజుల్లోనే నేరేడు పండ్లన్నీ మార్కెట్‌లోకి వస్తాయి. వీటిని నిల్వ చేసుకొని నెమ్మదిగా అమ్ముకునే మౌలిక సదుపాయాలు రైతులకు లేవు. పూర్తిగా పండిన నేరేడు పండ్లతో జ్యూస్ తయారు చేయటం ద్వారా మార్కెటింగ్ సమస్యను అధిగమించవచ్చని మారుతీప్రసాద్ భావించారు. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిఎఫ్‌టిఆర్‌ఐ) శాస్త్రవేత్తలను 8 ఏళ్ల క్రితం సంప్రదించారు. అయితే, వారు సూచించిన ్రపాసెసింగ్ పద్ధతి నేరేడుకు సరిపడలేదు. అయినా, ఆయన తన ప్రయత్నాలు మానలేదు.
‘మామిడి నుంచి నేరేడు వరకు అన్ని రకాల పండ్ల రసాల తయారీకి వారి వద్ద ఒకటే ్రపాసెసింగ్ పద్ధతి ఉంది. సగం రసం, సగం పంచదార, ప్రిజర్వేటివ్‌లు తదితరాలు కలిపి జ్యూస్ తయారు చేయాలని వారు సూచించారు. అవేమీ కలపకుండా నేరేడు జ్యూస్ తయారు చేయాలన్నది నా ప్రయత్నం. ఈ క్రమంలో నేరేడు ్రపాసెసింగ్ పద్ధతి, నిల్వ పద్ధతి, బాట్లింగ్ పద్ధతితో పాటు యంత్రాలను నా అవసరాలకు తగినట్లు ఏయే మార్పులు చేసుకోవాలి అనేది స్వీయఅనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఏవీ కలపకుండా కేవలం నేరేడు జ్యూస్ తయారు చేసి, ఏడాది పాటు నిల్వ ఉంచటంలో ఎట్టకేలకు విజయం సాధించాను..’ అని మారుతీప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చె΄్పారు.
నేరేడు గింజల పొడి
8 ఏళ్ల స్వయంకృషి ఫలితమిది..
గత ఏడాది సీజన్‌లో 5 టన్నుల నేరేడు జ్యూస్ తయారు చేసి విక్రయించాను. ఈ ఏడాది పదెకరాల తోటలో పండ్లను అదనంగా కొనుగోలు చేసి, 22 టన్నుల జ్యూస్ తయారు చేశా. జ్యూస్‌ను అన్నివిధాలా సంతృప్తికరమైన రీతిలో ఆరోగ్యదాయకంగా ఉత్పత్తి చేస్తున్నా. సిఎఫ్‌టిఆర్‌ఐ తోడ్పాటు తీసుకున్నా. వ్యయ ప్రయాసలకోర్చి 8 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేసి ఎట్టకేలకు విజయం సాధించా. నాకు అవసరమైన విధంగా తగిన మార్పులు చేర్పులతో ప్రత్యేక ్రపాసెసింగ్ పద్ధతిని, ప్రత్యేక యంత్రాలను రూపొందించుకున్నా. పంచదార, రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు ఇతరత్రా ఏమీ కలపకుండా స్వచ్ఛమైన నేరేడు రసాన్ని ప్రజలకు అందిస్తున్నా. గర్భవతులు మాత్రం నేరేడు జ్యూస్ తాగకూడదు. ఇతరులు నీటిలో కలిపి తాగితే మంచిది. ఎందుకైనా మంచిది వైద్యుల సలహా మేరకు వాడమని కొనే వారికి సూచిస్తున్నా. – పి. మారుతీ ప్రసాద్ (97018 66028), ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం, అనంతపురం జిల్లా
2.5 కేజీలకు లీటరు జ్యూస్..
తన ఇంటి దగ్గరే ్రపాసెసింగ్ యూనిట్‌ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. తన రెండెకరాల్లో నేరేడు పండ్లతో పాటు మరో 10 ఎకరాల తోటలో పండ్లను కొని జ్యూస్ తయారు చేస్తున్నారు. రెండున్నర కేజీల నేరేడు పండ్లతో లీటరు జ్యూస్ తయారు చేస్తున్నారు. మొదట్లో గింజలు తీసేసి గుజ్జుతో మాత్రమే జ్యూస్ తయారు చేశారు. గత ఏడాది నుంచి ప్రత్యేకంగా గింజతో పాటు మొత్తం పండ్లతో కూడా రెండు రకాలుగా జ్యూస్ తయారు చేస్తున్నారు. 200 ఎం.ఎల్. బాటిల్స్ లో ΄్యాక్ చేసి అమ్ముతున్నారు. గుజ్జు జ్యూస్ కన్నా ఇది కొంచెం వగరుగా ఉన్నా, మార్కెట్‌లో క్లిక్ అయ్యింది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి దూర్రపాంతాల నుంచి కూడా చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు నేరుగా కొనుగోలు చేస్తూ, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ జ్యూస్ తమకు బాగా ఉపయోగపడుతోందని షుగర్ పేషెంట్లు చెప్పటం మారుతీ ప్రసాద్‌కు కొండంత ధైర్యాన్నిచ్చింది. అందుకే ఈ ఏడాది ఎక్కువగా గింజలతో కూడిన జ్యూస్‌ను తయారు చేశారు. ఈ జ్యూస్‌ను నాణ్యతా పరీక్షల కోసం సిఎఫ్‌టిఆర్‌ఐకి పంపానన్నారు. గుజ్జుతో జ్యూస్ చేసిన తర్వాత మిగిలే గింజలను కూడా ఎండబెట్టి, ΄÷డి చేసి అమ్ముతున్నారు. ఈ ΄÷డిని గోరువెచ్చ నీటితో కలుపుకొని తాగొచ్చు. నీటితో మరిగించి టీ డికాక్షన్ చేసుకొని తాగొచ్చని ఆయన చెబుతున్నారు. ఒక ఉద్యాన యూనివర్సిటీ లేదా పరిశోధనా కేంద్రం చేయాల్సిన పరిశోధనను సడలని పట్టుదలతో కొనసాగించి విజయం సాధించినను రైతు మారుతీప్రసాద్ అసలు సిసలైన రైతు శాస్త్రవేత్త. – కె. వంశీనాథ్‌రెడ్డి, సాక్షి, బొమ్మనహాళ్, అనంతపురం జిల్లా
Comments
Please login to add a commentAdd a comment