Apricot fruit
-
రైతు బ్రాండ్.. ఈ నేరేడు జ్యూస్!
నేరేడు పండ్లు జూన్–జూలై మధ్య ఏడాదికి ఒక్క నెల రోజులు మాత్రమే వస్తాయి. చెట్లపై 90% పండిన నేరేడు కాయలను వ్యాపారులు కొని నగరాలు, పట్టణాలకు తీసుకెళ్లి విక్రయిస్తూ ఉంటారు. ఒక్క రోజు కోయక΄ోయినా పండ్లు 100% పండి΄ోతాయి. రవాణాకు పనికిరావు కాబట్టి వ్యాపారులు కొనరు. మరో రోజు కోయక΄ోతే రాలి మట్టిపాలవుతాయి. 100% పండిన పండ్లను వృథా కాకుండా ఇంటిపట్టునే జ్యూస్‌గా మార్చితే పండ్ల వృథాను అరికట్టినట్లవుతుంది. జ్యూస్ అమ్మకం ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుందని ఆశించిన రైతు మారుతీ ప్రసాద్. 8 ఏళ్లు కష్టపడి నేరేడు జ్యూస్ తయారీకి అవసరమైన ప్రత్యేక టెక్నాలజీని విజయవంతంగా రూపొందించుకున్నారు.అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం ఉద్దేహాళ్ గ్రామానికి చెందిన రైతు, మాజీ సర్పంచ్ పి. మారుతీ ప్రసాద్ ఇంటర్ వరకు చదువుకున్నారు. దానిమ్మ, ద్రాక్ష తదితర పంటల సాగుతో నష్టాల పాలైన నేపథ్యంలో వ్రేదావతి ఒడ్డున 4 ఎకరాల చౌడు భూమిని 15 ఏళ్ల క్రితం కొన్నారు. ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఆర్డీటీ సహకారంతో రెండెకరాల్లో 150 అల్లనేరేడు మొక్కలు 2009లో నాటారు. కాలక్రమంలో నేరేడు తోటల విస్తీర్ణం ఆ ్రపాంతంలో 400 ఎకరాలకు పెరిగి, మార్కెటింగ్ సమస్య వచ్చిపడింది.8 ఏళ్ల ప్రయోగాలు ఫలించిన వేళ..జూన్–జూలై మధ్య కేవలం నెల రోజుల్లోనే నేరేడు పండ్లన్నీ మార్కెట్లోకి వస్తాయి. వీటిని నిల్వ చేసుకొని నెమ్మదిగా అమ్ముకునే మౌలిక సదుపాయాలు రైతులకు లేవు. పూర్తిగా పండిన నేరేడు పండ్లతో జ్యూస్ తయారు చేయటం ద్వారా మార్కెటింగ్ సమస్యను అధిగమించవచ్చని మారుతీప్రసాద్ భావించారు. మైసూర్‌లోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిఎఫ్టిఆర్ఐ) శాస్త్రవేత్తలను 8 ఏళ్ల క్రితం సంప్రదించారు. అయితే, వారు సూచించిన ్రపాసెసింగ్ పద్ధతి నేరేడుకు సరిపడలేదు. అయినా, ఆయన తన ప్రయత్నాలు మానలేదు.‘మామిడి నుంచి నేరేడు వరకు అన్ని రకాల పండ్ల రసాల తయారీకి వారి వద్ద ఒకటే ్రపాసెసింగ్ పద్ధతి ఉంది. సగం రసం, సగం పంచదార, ప్రిజర్వేటివ్‌లు తదితరాలు కలిపి జ్యూస్ తయారు చేయాలని వారు సూచించారు. అవేమీ కలపకుండా నేరేడు జ్యూస్ తయారు చేయాలన్నది నా ప్రయత్నం. ఈ క్రమంలో నేరేడు ్రపాసెసింగ్ పద్ధతి, నిల్వ పద్ధతి, బాట్లింగ్ పద్ధతితో పాటు యంత్రాలను నా అవసరాలకు తగినట్లు ఏయే మార్పులు చేసుకోవాలి అనేది స్వీయఅనుభవం ద్వారా తెలుసుకున్నాను. ఏవీ కలపకుండా కేవలం నేరేడు జ్యూస్ తయారు చేసి, ఏడాది పాటు నిల్వ ఉంచటంలో ఎట్టకేలకు విజయం సాధించాను..’ అని మారుతీప్రసాద్ ‘సాక్షి సాగుబడి’తో సంతోషంగా చె΄్పారు.నేరేడు గింజల పొడి8 ఏళ్ల స్వయంకృషి ఫలితమిది..గత ఏడాది సీజన్లో 5 టన్నుల నేరేడు జ్యూస్ తయారు చేసి విక్రయించాను. ఈ ఏడాది పదెకరాల తోటలో పండ్లను అదనంగా కొనుగోలు చేసి, 22 టన్నుల జ్యూస్ తయారు చేశా. జ్యూస్‌ను అన్నివిధాలా సంతృప్తికరమైన రీతిలో ఆరోగ్యదాయకంగా ఉత్పత్తి చేస్తున్నా. సిఎఫ్టిఆర్ఐ తోడ్పాటు తీసుకున్నా. వ్యయ ప్రయాసలకోర్చి 8 ఏళ్లుగా ఎన్నో ప్రయోగాలు చేసి ఎట్టకేలకు విజయం సాధించా. నాకు అవసరమైన విధంగా తగిన మార్పులు చేర్పులతో ప్రత్యేక ్రపాసెసింగ్ పద్ధతిని, ప్రత్యేక యంత్రాలను రూపొందించుకున్నా. పంచదార, రసాయనాలు, ప్రిజర్వేటివ్‌లు ఇతరత్రా ఏమీ కలపకుండా స్వచ్ఛమైన నేరేడు రసాన్ని ప్రజలకు అందిస్తున్నా. గర్భవతులు మాత్రం నేరేడు జ్యూస్ తాగకూడదు. ఇతరులు నీటిలో కలిపి తాగితే మంచిది. ఎందుకైనా మంచిది వైద్యుల సలహా మేరకు వాడమని కొనే వారికి సూచిస్తున్నా. – పి. మారుతీ ప్రసాద్ (97018 66028), ఉద్దేహాళ్, బొమ్మనహాళ్ మండలం, అనంతపురం జిల్లా2.5 కేజీలకు లీటరు జ్యూస్..తన ఇంటి దగ్గరే ్రపాసెసింగ్ యూనిట్‌ను ఆయన ఏర్పాటు చేసుకున్నారు. తన రెండెకరాల్లో నేరేడు పండ్లతో పాటు మరో 10 ఎకరాల తోటలో పండ్లను కొని జ్యూస్ తయారు చేస్తున్నారు. రెండున్నర కేజీల నేరేడు పండ్లతో లీటరు జ్యూస్ తయారు చేస్తున్నారు. మొదట్లో గింజలు తీసేసి గుజ్జుతో మాత్రమే జ్యూస్ తయారు చేశారు. గత ఏడాది నుంచి ప్రత్యేకంగా గింజతో పాటు మొత్తం పండ్లతో కూడా రెండు రకాలుగా జ్యూస్ తయారు చేస్తున్నారు. 200 ఎం.ఎల్. బాటిల్స్ లో ΄్యాక్ చేసి అమ్ముతున్నారు. గుజ్జు జ్యూస్ కన్నా ఇది కొంచెం వగరుగా ఉన్నా, మార్కెట్లో క్లిక్ అయ్యింది.హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి దూర్రపాంతాల నుంచి కూడా చాలా మంది షుగర్ వ్యాధిగ్రస్తులు నేరుగా కొనుగోలు చేస్తూ, సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ జ్యూస్ తమకు బాగా ఉపయోగపడుతోందని షుగర్ పేషెంట్లు చెప్పటం మారుతీ ప్రసాద్‌కు కొండంత ధైర్యాన్నిచ్చింది. అందుకే ఈ ఏడాది ఎక్కువగా గింజలతో కూడిన జ్యూస్‌ను తయారు చేశారు. ఈ జ్యూస్‌ను నాణ్యతా పరీక్షల కోసం సిఎఫ్టిఆర్ఐకి పంపానన్నారు. గుజ్జుతో జ్యూస్ చేసిన తర్వాత మిగిలే గింజలను కూడా ఎండబెట్టి, ΄÷డి చేసి అమ్ముతున్నారు. ఈ ΄÷డిని గోరువెచ్చ నీటితో కలుపుకొని తాగొచ్చు. నీటితో మరిగించి టీ డికాక్షన్ చేసుకొని తాగొచ్చని ఆయన చెబుతున్నారు. ఒక ఉద్యాన యూనివర్సిటీ లేదా పరిశోధనా కేంద్రం చేయాల్సిన పరిశోధనను సడలని పట్టుదలతో కొనసాగించి విజయం సాధించినను రైతు మారుతీప్రసాద్ అసలు సిసలైన రైతు శాస్త్రవేత్త. – కె. వంశీనాథ్‌రెడ్డి, సాక్షి, బొమ్మనహాళ్, అనంతపురం జిల్లా -
Health Tips: ఈ పండ్ల గింజల్లో ‘సైనైడ్’.. పొరపాటున కూడా తినకండి! ఒకవేళ..
Are These Seeds Poisonous: కొన్ని రకాల పండ్ల గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలను తింటే శరీరానికి ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. అయితే కొన్ని పండ్ల విత్తనాలను పొరపాటునో లేదంటే కావాలనో తరచూ తింటే.. అవి ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆపిల్ రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెబుతుంటారు. ఆపిల్ మంచిదే అయినా.. ఆపిల్ గింజలు మాత్రం మన ఆరోగ్యానికి ఏ మాత్రం మంచివి కావు. ఎందుంటే వీటిలో ఉండే అమిగ్డాలన్.. సైనైడ్‌ను విడుదల చేస్తుంది. ఇది కడుపులోకి వెళ్లి విరేచనాలు, వికారం, కడుపు తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. నిజానికి సైనైడ్ మరణానికి కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఆపిల్ గింజల్లో ఇది తక్కువ స్థాయిలోనే ఉంటుంది. చెర్రీ మన శరీరానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలను అందిస్తాయి చెర్రీ పండ్లు. కానీ చెర్రీ గింజల్లో హానికరమైన సైనైడ్ సమ్మేళనం ఉంటుంది. వీటిని ఎక్కువ మొత్తంలో తినడం వల్ల ఆపిల్ తినడం వల్ల కలిగే నష్టాలే కలుగుతాయి. ఆప్రికాట్ ఆప్రికాట్ విత్తనాలలో విషపదార్థాలైన అమిగ్డాలన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు ఉంటాయి. ఆప్రికాట్ విత్తనాలను తినడం వల్ల శరీరం బలహీనపడటమే కాదు.. ప్రాణాల మీదికి వస్తుంది. ఈ విత్తనాలు ఒక వ్యక్తిని కోమాలోకి తీసుకెళతాయి. పీచ్ పీచ్ విత్తనాల్లో అమిగ్డాలిన్, సైనోజెనిక్ గ్లైకోసైడ్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆప్రికాట్ విత్తనాల మాదిరిగానే లక్షణాలు కనిపిస్తాయి. దీనిని తినడం వల్ల పొత్తికడుపు నొప్పి, నెర్వస్ నెస్ సమస్య ఎక్కువగా ఉంటుంది. పియర్ విత్తనాల్లో ప్రాణాంతకమైన సైనైడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి వికారం, విరేచనాలు, పొత్తికడుపు నొప్పిని కలిగిస్తుంది. అలాగే చెమట, అలసట వంటి సమస్యలు కూడా వస్తాయి. ఇది కోమాకు కూడా దారితీస్తుంది. ఇంకా బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముందు చెప్పినట్లుగా ఒకటీ రెండు సార్లు పొరపాటున అదీ ఒకటో రెండో గింజలు తింటే పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ.. తరచూ తింటే మాత్రం ప్రమాదం బారిన పడినట్లే పరిశోధకులు అంటున్నారు. చదవండి: Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. Mental Health: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? ఆ మూడింటిపై నియంత్రణ లేకపోతే! అంతే ఇక.. -
రాముడు మెచ్చిన ఆ పండు గురించి తెలుసా..?
కడప కోటిరెడ్డి సర్కిల్: నల్లగా నిగనిగ మెరుస్తూ వగరు, తీపి, పులుపు మేళవింపు రుచులతో ఉండే నేరేడు పండ్ల అమ్మకాలు నగరంలో జోరందుకున్నాయి. మార్కెట్లో కాలానుగుణంగా వచ్చే పండ్లు రుచితోపాటు ఆరోగ్యాన్నిస్తాయి. అలాంటి వాటిలో అల్లనేరేడు ఒకటి. జూన్ నెల ఆరంభంలో అల్లనేరేడు పంట చేతి కొస్తుంది. ఈ సీజన్లో విరివిగా దొరికే ఈ పండ్లను రుచి చూడని వారంటూ ఉండరు. అందుకే మార్కెట్లో కనబడగానే వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. మార్కెట్లో ఇప్పుడు అల్లనేరేడు పండ్లు విరివిగా అమ్ముడవుతున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లి తదితర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి నేరేడు పండ్లు దిగుమతి చేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి రావడంతో పండ్ల వ్యాపారులు వీటిని కిలో రూ. 100 నుంచి రూ.200 అమ్ముతున్నారు. రాముడు మెచ్చిన పండు రామాయణంలో శ్రీరాముడు 14ఏళ్లు వనవాసం చేసినప్పుడు ఎక్కువ భాగం ఈ పండ్లను తిని కాలం గడిపారని పెద్దలు చెబుతారు. అందుకనే భారత దేశంలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర ప్రాంతాల్లో దీనిని దేవతాఫలంగా భావిస్తారు. ఆయుర్వేదంలో ఈపండును అపర సంజీవని పిలుస్తారు. ఈ పండులో విటమిన్ ఏ, సీ పుష్కలంగా ఉంటాయి. నేరేడు పండు మాత్రమే కాక ఆకులు, గింజలు, చెట్లు బెరడు ఔషధ తయారీలో వాడుతారు. ఈ నేరేడు చెట్టు కాయల నుంచి వెనిగర్‌ను తయారు చేస్తారు. జ్ఞాపకశక్తి మెరుగు పరచుకోవాలంటే నేరేడు పండు తినమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మధుమేహం, నోటిపూత, చిగుళ్ళ వ్యాధులు, దంతక్షయం, మూత్రంలో మంట తదితర సమస్యలకు నేరేడు పండ్లు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. అపర సంజీవని నేరేడు పండులోని అనేక సుగుణాలు అన్ని వయస్సుల వారికి ఉపయోగకారిగా పని చేస్తాయి. యాంటి ఆక్సిడెంట్లు విరివిగా లభించడంతో వీటిని తినడం వల్ల శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటికి పోతాయి. ఇవి ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది. కిడ్ని రాళ్లతో బాధపడే వారు. నిత్యం నేరేడు పండ్లు తినడం వలన రాళ్లు కరిగి మూత్రం ద్వారా బయటికి వస్తాయి. అందుకే దీని ఔషధాల గనిగా పేర్కొంటారు. –డాక్టర్ రామాంజులరెడ్డి, గుండె వైద్య నిపుణులు, కడప చదవండి: ఆదివారమొస్తే చాలు.. అసలు ఆ కథేంటి..? కొద్ది గంటల్లో పెళ్లి.. అంతలోనే ఊహించని ట్విస్ట్ -
నేరేడుతో ప్రయోజనాలెన్నో..
రోజూ గుప్పెడు నేరేడు పళ్లు తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నేరేడు తినడం వల్ల రక్తపోటు అదుపు కావడమే కాకుండా, ధమనులు బిరుసెక్కకుండా ఉంటాయని అంటున్నారు. తరచుగా నేరేడు పళ్లు తినేవారిలో రక్తపోటు అదుపులో ఉండటంతో పాటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీకి చెందిన న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు. మెనోపాజ్ దశలో రక్తపోటును ఎదుర్కొనే మహిళలకు నేరేడు పళ్లు మరింత మేలు చేస్తాయని వారు వివరిస్తున్నారు. నేరేడు పళ్ల పొడిని తీసుకున్నా, ఇవే రకమైన ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు. నేరేడు పళ్లలోని నైట్రిక్ ఆక్సైడ్ ప్రభావం వల్ల రక్తపోటు తగ్గుతుందని వివరిస్తున్నారు.