Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement

సినిమా పోల్

Advertisement

ఫొటోలు

A to Z

Advertisement

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

Tollywood actresses Social Media Updates viral In instagram1
పొట్టి గౌనులో సుప్రీత హోయలు.. బ్లూ శారీలో అనసూయ అందాలు!

పొట్టి గౌనులో సురేఖవాణి కూతురు సుప్రీత హోయలు..కామాఖ్య ఆలయంలో సంయుక్త మీనన్ పూజలు..ఫ్యాషన్‌ షోలో మెరిసిన అత్తారింటికి దారేది హీరోయిన్..బ్లూ శారీలో అనసూయ బ్యూటీఫుల్‌ లుక్స్..రాబిన్‌హుడ్‌ హీరోయిన్ శ్రీలీల క్యూట్ పిక్స్.. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Bandaru Sheshayani Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Anaga Anaga Kathala Song Out From Tribanadhari Barbarik2
హృదయాలను హత్తుకునేలా ‘‘అనగా అనగా కథలా’ పాట

సత్య రాజ్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న భారీ చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’. ఈ మూవీకి దర్శకుడు మోహన్ శ్రీవత్స. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, క్రాంతి కిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన పాటలు, గ్లింప్స్, టీజర్‌‌లు అంచనాల్ని పెంచేశాయి. ఇక తాజాగా మరో ఫీల్ గుడ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.అనగా అనగా కథలా అంటూ సాగే ఈ పాటను టీకేఆర్ కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో బుధవారం నాడు కాలేజ్ చైర్మన్ తీగల కృష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ పాటను కార్తిక్ ఆలపించారు. ఇంఫ్యూజన్ బ్యాండ్ అందించిన హృద్యమైన బాణీ ఎంతో వినసొంపుగా ఉంది. ఇక సనరే రాసిన సాహిత్యంతో తాతయ్య అనే ఎమోషన్, మనవరాలితో తాతయ్యకు ఉండే అనుబంధాన్ని చక్కగా వివరించారు.పాటను రిలీజ్ సందర్భంగా సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘టీకేఆర్ కాలేజ్‌లోని విద్యార్థుల ఉత్సాహం, ఎనర్జీ చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇలా పద్నాలుగు వేల మంది విద్యార్థుల సమక్షంలో పాటను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. మా పాటను విడుదల చేసిన తీగల కృష్ణారెడ్డి గారికి.. ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన హరనాథ్ రెడ్డి గారికి, అమర్ నాథ్ రెడ్డి గారికి థాంక్స్. త్రిబాణధారి బార్భరిక్ చిత్రంలోని 'అనగా అనగా కథలా' పాటను రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రం త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ .. ‘నా మొదటి హీరో సత్య రాజ్ గారు అవ్వడం నా అదృష్టం. 170 చిత్రాల్లో హీరోగా చేసిన సత్య రాజ్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రంలోని పాటను ఈ కాలేజీలో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. పాటను విడుదల చేసేందుకు సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి థాంక్స్. మా చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది’ అని అన్నారు.

Dear Uma Movie Release Date Out3
‘డియర్ ఉమ’ వచ్చేస్తోంది

ప్రస్తుతం ప్రేక్షకులు సాధారణ ఫార్మాట్‌లో వచ్చే చిత్రాల కంటే విభిన్న కంటెంట్, కొత్త కాన్సెప్ట్‌లతో రూపొందిన సినిమాలను చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. అందుకే, వినూత్నమైన కథాంశంతో ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘డియర్ ఉమ’ (Dear Uma) చిత్రం తెరకెక్కింది. తెలుగమ్మాయి సుమయ రెడ్డి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించడమే కాకుండా, నిర్మాతగా, రచయితగా కూడా వ్యవహరించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. బహుముఖ ప్రతిభ కలిగిన సుమయ రెడ్డి, సుమ చిత్ర ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంలో సుమయ రెడ్డి, పృథ్వీ అంబర్ జంటగా నటించారు.నిర్మాణ బాధ్యతలను సుమయ రెడ్డి నిర్వహించగా, నగేష్ లైన్ ప్రొడ్యూసర్‌గా, నితిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. సాయి రాజేష్ మహాదేవ్ ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే, మాటలు రాసి, దర్శకత్వం వహించారు. అనేక విజయవంతమైన చిత్రాలకు అద్భుతమైన విజువల్స్ అందించిన రాజ్ తోట సినిమాటోగ్రాఫర్‌గా, బ్లాక్‌బస్టర్ చిత్రాలకు సంగీతం సమకూర్చిన రదన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.ఇప్పటివరకూ ‘డియర్ ఉమ’ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను గణనీయంగా పెంచాయి. వీటిని బట్టి చూస్తే, ఇది ఒక ఫీల్‌గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది. ఈ ప్రేమకథను ఆస్వాదించే సమయం ఆసన్నమైంది. ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.ఈ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీ అందమైన సందేశంతో పాటు అధిక సాంకేతిక ప్రమాణాలతో రూపొందింది. లవ్, ఫ్యామిలీ, యాక్షన్ డ్రామా వంటి అంశాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా తయారైంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 18న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.

Keerthy Suresh Ready To Glamour Show In Film4
నితిన్‌తో లిప్‌లాక్‌ చేయలేనన్న నటి..ఇప్పుడేమో గ్లామర్‌ షోకి సై!

నటీనటులు ట్రెండ్‌కు తగ్గట్లు మారాలి. అప్పుడే వరుస అవకాశాలు వస్తాయి. అలా కాదని పరిమితులు విధిస్తే అక్కడే ఆగిపోతారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకుంది కీర్తి సురేశ్‌ (Keerthy Suresh). ఒకప్పుడు స్కిన్ షోకి దూరంగా ఉన్న కీర్తి..ఇప్పుడు గ్లామర్‌ గేట్లు ఎత్తేసింది. ఎక్స్‌ఫోజింగ్‌కి తాను కూడా రెడీ అంటోంది. సర్కార్‌ వారి పాట సినిమాతోనే తనలోని గ్లామర్‌ యాంగిల్‌ని పరిచయం చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వచ్చాయి.బాలీవుడ్‌ నుంచి కూడా పిలుపొచ్చింది. ఆమె నటించిన తొలి హిందీ సినిమా 'బేబీ జాన్'లో రొమాంటిక్ సన్నివేశాలు బాగానే ఉన్నాయి. ఆ సీన్లకు ఎస్‌ చెప్పడంతోనే కీర్తికి ఆ చాన్స్‌ వచ్చిందట. అయితే ఇంతకంటే తక్కువ రొమాన్స్‌ ఉన్న పాత్రలను సైతం ఒకప్పుడు కీర్తి రిజెక్ట్‌ చేసిందట.లిప్‌లాక్‌ సీన్‌ ఉందని నితిన్‌ ‘మ్యాస్ట్రో’ని వదులుకుందట. ఈ చిత్రంలో మొదటగా హీరోయిన్‌గా కీర్తినే అనుకున్నారు. కథ మొత్తం విని లిప్‌లాక్‌ సీన్‌ ఉందని, అలాంటి సన్నివేశాల్లో నటించలేనని చెప్పిందట. ఇది నాలుగేళ్ల కిందటి మాట. అదే ఇప్పుడు అయితే కీర్తి లిప్‌లాక్‌ సీన్‌కి నో చెప్పేది కాదేమో. అప్పుడే ఇలాంటి సీన్లకు రెడీ అని చెబితే..ఆమె ఖాతాలో చాలా సినిమాలు చేరేవి. రెమ్యునరేషన్‌ కూడా బాగానే పెరిగేది. ఏది ఏమైనా మహానటిలో మార్పు వచ్చింది. పోటీ ప్రపంచంలోనే కొనసాగాలంటే స్కిన్‌ షో చేయాల్సిందేనని రియలైజ్‌ అయినట్లు ఉంది. ఇప్పుడైనా వరుస అవకాశాలు వచ్చి మళ్లీ బిజియెస్ట్‌ హీరోయిన్‌గా మారుతుందేమో చూడాలి.

RJ Mahvash describes her perfect Person in new Reel dating rumours with chahal5
'అతనే నా భర్త కూడా'.. ఆర్జే మహ్‌వశ్‌ వీడియో వైరల్!

ప్రముఖ యూట్యూబర్, ఆర్జే మహ్‌వశ్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి మొదలైన చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. టీమిండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌తో దుబాయ్ స్టేడియంలో మెరవడంతో ఒక్కసారిగా వీరిద్దరిపై చర్చ మొదలైంది. ఈ జంట డేటింగ్‌ ఉన్నారంటూ పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆర్జే మహ్‌వశ్‌ వార్తల్లో నిలిచింది. ఇటీవల లక్నోలోని ఓ హోటల్‌లో స్విమ్మింగ్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే చాహల్ ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసమే తాను అక్కడికి వెళ్లిందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.తనపై వస్తున్న డేటింగ్ వార్తల నేపథ్యంలో తాజాగా ఆర్జే మహ్‌వశ్‌ షేర్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఆమె పోస్ట్ చేసిన రీల్‌లో తన జీవితంలో రాబోయే వ్యక్తి గురించి ప్రస్తావించింది. నా లైఫ్‌లోకి వచ్చిన వ్యక్తే నా ఫ్రెండ్‌, బెస్ట్ ఫ్రెండ్‌, బాయ్‌ ఫ్రెండ్‌తో పాటు తనే నా భర్త కూడా అవుతాడు.. అంతేకాదు నేను అతని చుట్టూ తిరుగుతానంటూ మాట్లాడింది. అయితే ఈ వీడియోకు క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ లైక్‌ కొట్టాడు. దీంతో మీ జీవితంలో యుజ్వేంద్ర చాహల్ రాబోతున్నారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే చాహల్‌కు తన భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఐపీఎల్‌ లీగ్‌తో బిజీగా ఉన్నారు. పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ఆడుతున్నారు. ఇటీవల లక్నోలో జరిగిన మ్యాచ్‌ కోసం ఆర్జే మహ్‌వశ్ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆర్జే వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెట్టడంతో వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మరోసారి నెట్టింట వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Mahvash (@rj.mahvash)

Allu Arjun and sneha reddy Special Birthday Wishes To Allu Ayan6
ఐకాన్ స్టార్‌ వారసుడి బర్త్‌ డే.. బన్నీ దంపతుల స్పెషల్ విషెస్!

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ తన కుమారుడికి ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇవాళ అల్లు అయాన్ పుట్టినరోజు కావడంతో ట్విటర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్‌ డే చిన్ని బాబు అని ముద్దుగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సైతం అయాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.అయాన్ బర్త్‌ డే సందర్భంగా అల్లు అర్జున్‌ సతీమణి స్నేహరెడ్డి ప్రత్యేకంగా వీడియోను షేర్ చేసింది. అయాన్‌తో సంతోషంగా ఉన్న క్షణాలను వీడియో రూపంలో పంచుకుంది. నువ్వు మా జీవితంలో భాగమైనందుకు మేము చాలా గర్వపడుతున్నాము అంటూ స్నేహా రెడ్డి పోస్ట్ చేసింది. ఇక బన్నీ సినిమాల విషయానికొస్తే గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. పుష్పకు సీక్వెల్‌గా సుకుమార్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఏకంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లతో ఇండియన్‌ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్‌ మరోసారి అభిమానులను మెప్పించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) Many many happy returns of the day to the love of my life … Happy Birthday my Chinni Babu #AlluAyaan 😘😘😘 pic.twitter.com/1r6fn7xXdc— Allu Arjun (@alluarjun) April 3, 2025

Hebah Patel Talk About Odela 2 Movie7
తమన్నాలా నేనెప్పుడు చేయలేదు: హెబ్బా పటేల్‌

‘ఓదెల రైల్వే స్టేషన్ లాక్ డౌన్ టైం లో చేసిన సినిమా. కరోనా కారణంగా షూటింగులన్నీ ఆగిపోయాయి. మళ్లీ ఎప్పుడు మొదలవుతాయో కూడా తెలియని సమయంలో సంపత్ నంది గారు అండ్ టీం ధైర్యంగా ముందుకు వచ్చి ఓదెల చేయడం జరిగింది. నిజానికి ఆ సమయంలో దీనికి సీక్వెల్ అవుతుందని నేను అనుకోలేదు. సినిమా చాలా మంచి విజయాన్ని అందుకుంది. మేము ఊహించిన దాని కంటే గొప్ప విజయం దక్కింది. సినిమా చూసిన ప్రేక్షకులంతా చాలా బావుందని మెచ్చుకున్నారు. అయితే అప్పుడు కూడా ఈ సినిమాకి సీక్వెల్ ఈ స్థాయిలో ఉంటుందని, ఇంత గ్రాండ్ స్కేల్లో సీక్వెల్ వస్తుందని నేను ఊహించలేదు’ అని హెబ్బా పటేల్‌(Hebah Patel) అన్నారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఓదెల 2’. హెబ్బా పటేల్‌, వశిష్ట సింహా కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా హెబ్బా పటేల్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇢ ఓదెల 2 (Odela 2 Movie) సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓదెల కంటే ఓదెల2 చాలా పెద్ద సినిమా. చాలా అద్భుతమైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఆడియన్స్ కి గ్రేట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది.⇢ ఇందులో తమన్నా గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. తను నా సిస్టర్ క్యారెక్టర్ లో కనిపిస్తారు. అయితే సినిమాలో ఎక్కువ శాతం నేను జైల్ ఎపిసోడ్స్ లో కనిపిస్తాను. ఫస్ట్ పార్ట్ లో నా క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ చూపించిందో ఈ సెకండ్ పార్ట్ లో కూడా అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ⇢ తమన్నా గారు ప్రతి క్యారెక్టర్ ని చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఒక క్యారెక్టర్ కోసం ఆమె ప్రిపేర్ అయ్యే విధానం నాకు చాలా నచ్చింది. ఓదెల2 కోసం చాలా అద్భుతంగా ప్రిపేర్ అయ్యారు. నిజానికి ఓదెల సినిమా చేస్తున్నప్పుడు నా క్యారెక్టర్ గురించి నేను ముందుగా ఏం ప్రిపేర్ కాలేదు. తమన్నా గారిలా హోంవర్క్ నేనెప్పుడూ చేయలేదు. ఫ్యూచర్లో అలాంటి హోంవర్క్ చేయాలని నేర్చుకున్నాను.⇢ సంపత్ గారు విజనరీ ఫిలిం మేకర్. ఆయన ఫస్ట్ ఓదెల కథలో నా క్యారెక్టర్ చెప్పినప్పుడు నాకే షాకింగ్ అనిపించింది. అంత పర్ఫార్మెన్స్ బేస్డ్ క్యారెక్టర్ నేను చేయగలనా? అనిపించింది. అయితే సంపత్ గారు ప్రయత్నించమని చెప్పారు. ఆయన నాపై అలాంటి నమ్మకాన్ని ఉంచడం చాలా ఆనందంగా అనిపించింది. ఆయన నమ్మకం నాకు మరింత కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సంపత్ గారు చాలా నైస్, కైండ్ పర్సన్. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.⇢ కుమారి 21ఎఫ్ సినిమా నాకు ఒక ఫేమ్ తీసుకొచ్చింది. ఓదెల సినిమా యాక్టర్ గా నాకు ఒక క్రెడిబిలిటీ ఇచ్చింది. నేను అన్ని రకాల పాత్రలు చేయగలనని నమ్మకాన్ని కల్పించింది. ఒక నటిగా ఓదెల నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.⇢ అజినీస్ మ్యూజిక్ ఈ సినిమాకి బిగ్ ఎసెట్. ఆయన మ్యూజిక్ తో సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. బ్యాగ్రౌండ్ స్కోరు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్ కి కావాల్సిన పర్ఫెక్ట్ మ్యూజిక్ ఇచ్చారు. ⇢ ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు పూర్తయింది. ఈ ప్రయాణం ఆనందంగానే ఉంది. అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. అయితే ఒక నటిగా నేను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాను. సక్సెస్ ఫెయిల్యూర్ ఏది ఫైనల్ కాదు. పనిచేసుకుంటూ వెళ్లడమే మన చేతిలో ఉంది. ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నాను. మరో 10 ఏళ్లు నటిగా ప్రయాణిస్తానని నమ్మకం ఉంది.⇢ ఇప్పటివరకు చాలా జోనర్స్ సినిమాలు ట్రై చేశాను. ఒక ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్ కామెడీ ఎంటర్టైనర్ చేయాలనుంది. ప్రస్తుతం తెలుగులో ఓ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీగా అవుతున్నాయి. ఒక కన్నడ సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ మంత్ స్టార్ట్ కాబోతుంది.

Actress Hansika Motwani Files quash Petition of FIR by sister in law8
హైకోర్టును ఆశ్రయించిన హీరోయిన్ హన్సిక.. ఎందుకంటే?

హీరోయిన్ హన్సిక మోత్వానీ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టి వేయాలంటూ బాంబే హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆమె సోదరుడి భార్య, నటి ముస్కాన్ నాన్సీ జేమ్స్‌కు నోటీసులు జారీ చేసింది. మార్చి 24న హన్సిక పిటిషన్ వేయగా.. ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను జులై 3కు వాయిదా వేసింది. కాగా.. ఇప్పటికే ఈ కేసులో హన్సిక మోత్వానీకి ముంబై సెషన్స్ కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.కాగా.. గతంలో హన్సికతో పాటు ఆమె తల్లిపై సోదరుడి భార్య ముస్కాన్ నాన్సీ జేమ్స్ గృహ హింస కేసు పెట్టారు. 2020లో హన్సిక సోదరుడు ప్రశాంత్ మోత్వానీ.. బుల్లితెర నటి ముస్కాన్‌ నాన్సీ జేమ్స్‌ను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత విభేదాలు రావడంతో 2022లోనే విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ సమయంలోనే తనను వేధింపులకు గురి చేశారంటూ హన్సికతో పాటు సోదరుడు ప్రశాంత్, ఆమె తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే తమపై నమోదైన కేసును కొట్టి వేయాలంటూ హన్సిక బాంబే హైకోర్ట్‌ను ఆశ్రయించింది.

Hero Naveen Chandra Talk About 28 Degree Celsius Movie9
​ఓటీటీ ఆఫర్స్‌ రాలేదు..ఇది అది మార్చు అని ఇబ్బంది పెట్టారు: నవీన్‌ చంద్ర

ఏ హీరోకైనా సక్సెస్, ఒక మార్కెట్ ఉండాలి. లేకుంటా ఆయన సినిమాల రిలీజ్ లకు ఇబ్బందులు తప్పవు. ఆరేళ్ల క్రితం నా సినిమాలు సరిగా ఆడకపోవడం వల్ల అప్పుడు నటించిన ‘28°C’ మూవీకి బిజినెస్‌ జరగలేదు. ప్పటికి థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇంతగా లేవు. ఇది లవ్ అండ్ థ్రిల్లర్ కాబట్టి సినిమా ఎవరికి చూపించినా కొన్ని ఛేంజెస్ చెప్పేవారు. సినిమాలో అది మార్చు ఇది మార్చు అని డైరెక్టర్ గారిని చాలా ఇబ్బంది పెట్టారు. ఓటీటీల్లో కూడా సరైన ఆఫర్స్ రాలేదు.పొలిమేర సక్సెస్ తర్వాత ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి గారు "28°C" సినిమా చూసి ఇంత మంచి ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాను ఎందుకు రిలీజ్ చేయలేదు, నేను రిలీజ్ చేస్తా అని ముందుకొచ్చారు. "28°C" థియేటర్ లోనే కాదు రేపు టీవీ, ఓటీటీ ఏ వేదిక మీద రిలీజైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు యంగ్‌ హీరో నవీన్‌ చంద్ర అన్నారు. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా "28°C". ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్. "28°C" చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. నవీన్ చంద్ర సరసన షాలినీ వడ్నికట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెల 4న థియేటర్స్‌లో విడుదల ​కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో నవీన్‌చంద్ర మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..→ ఆరేళ్ల కిందట ఈ మూవీ జర్నీ బిగిన్ అయ్యింది. ఒకరోజు రెస్టారెంట్ లో ఉండగా డా. అనిల్ విశ్వనాథ్ కలిసి తన దగ్గర స్టోరీ ఉందని చెప్పారు. రెండ్రోజుల తర్వాత కథ విన్నాను. చాలా యూనిక్ గా అనిపించింది. 28 డిగ్రీల టెంపరేచర్ లో తన జీవిత భాగస్వామిని కాపాడుకునే వ్యక్తి కథ ఇది. ఈ క్రమంలో ఆ జంట చేసిన ఎమోషనల్ జర్నీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆసక్తికరంగా సాగుతుంది. వినగానే ఈ కథ కొత్తగా ఉందని అనిపించింది. అప్పటికి నాపై అందాల రాక్షసి మూవీ ఎఫెక్ట్ చాలా ఉండేది. ఆ మూవీ తర్వాత కొన్ని వేరే జానర్ మూవీస్ చేసినా లవ్ స్టోరీ మూవీస్ లో ఎక్కువ ఆఫర్స్ వచ్చేవి. "28°C" సినిమాను బిగిన్ చేశాం. ఆ మూవీలో నేను తప్ప మిగతా అంతా కొత్త వాళ్లే. ఫస్ట్ డే షూటింగ్ తర్వాత డైరెక్టర్ అనిల్ మూవీని బాగా తెరకెక్కించగలడనే నమ్మకం ఏర్పడింది.→ "28°C" సినిమా రెండు ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి వైజాగ్, రెండోది జార్జియా. ఫస్ట్ అమెరికా అనుకున్నాం కానీ ఆ టైమ్ లో విదేశీ ఆర్టిస్టులకు ఎంట్రీ కష్టంగా ఉండేది. జార్జియా వెళ్లినప్పుడు కూడా రెండుసార్లు రిజెక్ట్ అయి వెనక్కి వచ్చాం. ఆ తర్వాత లోకల్ గా ఈ వార్త బాగా ప్రచారం కావడంతో మళ్లీ చిత్రీకరణకు పర్మిషన్ ఇచ్చారు.→ మన కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సమస్య ఉంటే మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. అప్పుడు కష్టం కూడా ఇష్టంగా మారుతుంది. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అయిన కార్తీక్, అంజలి ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారు. వాళ్లిద్దరు డాక్టర్స్ గా సెటిల్ అవుతారు. అయితే అంజలికి అనారోగ్య సమస్య వల్ల ఆమెను 28 డిగ్రీ టెంపరేచర్ లోనే చూసుకోవాలి. ఇలా నిజంగా ఎవరికీ జరగదు. పుస్తకాల్లో ఉన్న ఒక థియరీని తీసుకుని దాన్ని సినిమాటిక్ గా మలిచారు మా డైరక్టర్. డాక్టర్ కాబట్టి అనిల్ విశ్వనాథ్ సినిమాలో మెడికల్ టర్మ్స్ చాలా డీటెయిల్డ్ గా రాశారు.→ కోవిడ్ తర్వాత థ్రిల్లర్స్, యాక్షన్ మూవీస్ ఎక్కువయ్యాయి. మూవీస్ లో హింస పెరిగింది. సొసైటీలో కూడా హింస పెరిగింది. ఎక్కడ చూసినా క్రైమ్ న్యూస్ వింటూనే ఉన్నాం. సినిమాల్లోనూ అలాంటి క్రైమ్స్ చూసేందుకు ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నేను హీరోగా చేసే సినిమాలకు ప్రొడక్షన్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారా లేదా అని చూసుకుంటున్నాను. క్యారెక్టర్స్ చేస్తే అది లైఫ్ లీడ్ చేయడానికి, కొంత డబ్బు సంపాదించడానికి, నా క్రాఫ్ట్ ను కెరీర్ ను లైఫ్ ను బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తున్నా.→ అరవింద సమేత వీర రాఘవలో నేను చేసిన క్యారెక్టర్ కు చాలా మంచి పేరొచ్చింది. నా కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఇప్పుడు అదే బ్యానర్ లో రవితేజ హీరోగా నటిస్తున్న మాస్ జాతర చిత్రంలో ఓ సరికొత్త క్యారెక్టర్ లో నన్ను చూస్తారు. గేమ్ ఛేంజర్ లో ఉండిపోవడం వల్ల సూర్య రెట్రో మూవీలో మెయిన్ విలన్ గా నటించే అవకాశం మిస్ అయ్యింది. ఇప్పుడు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ లో షో టైమ్ తో పాటు 11 అనే మరో మూవీ ఉంది. నాకు బాగా పేరు తెచ్చిన ఇన్ స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ సీజన్ 2 రాబోతోంది.

G V Prakash Kumar Starrer Latest Movie Kingston Ott Release Date out10
'సంక్రాంతికి వస్తున్నాం' బాటలో జీవీ ప్రకాశ్ సినిమా.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

కోలీవుడ్‌ జీవీ ప్రకాశ్‌ కుమార్‌ హీరోగా నటించిన చిత్రం 'కింగ్‌స్టన్'. కమల్‌ ప్రకాశ్‌ దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ గతనెల 7వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది.తాజాగా ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. అయితే ఈ మూవీ ఓకేసారి ఓటీటీతో పాటు టీవీల్లోనూ ప్రసారం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాంతి సూపర్‌ హిట్‌గా నిలిచిన టాలీవుడ్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం మూవీ తరహాలో ఓకేసారి రెండు ఓటీటీతో పాటు బుల్లితెరపై ప్రసారం చేయనున్నారు. ఏప్రిల్ 13వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కింగ్‌స్టన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే టీవీల్లో కేవలం జీ తమిళం ఛానెల్లో మాత్రమే ప్రసారం కానుంది.కాగా.. కింగ్‌స్టన్‌ చిత్రాన్ని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమాలో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.(ఇది చదవండి: 'ఒకడి అత్యాశే ఊరిని మొత్తం నాశనం చేసింది'.. ఆసక్తిగా ట్రైలర్‌)అసలు కింగ్‌స్టన్‌ కథేంటంటే..కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్‌స్టన్‌ సినిమా చూడాల్సిందే.The sea calls. He answers! 🌊 🧟 #Kingston Arrives on 13th April! ⛵India's First Marine Fantasy Blockbuster #Kingston Premiering on OTT & TV on April 13th 12pm!#KingstonFromApril13thOnZEE5@gvprakash @storyteller_kp @ZeeStudiosSouth @ParallelUniPic @divyabarti2801… pic.twitter.com/QRPHkXcy6W— ZEE5 Tamil (@ZEE5Tamil) April 3, 2025

Advertisement
Advertisement