-
వామ్మో... ఆపిల్ స్టోరా...
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఐ హోస్టేజ్’ (iHostage)ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఉన్నవి రెండుపాత్రలు... వాటికి అనుసంధానంగా అడపా దడపా వచ్చే మరో డజనుపాత్రలు. కథ మొత్తం ఆ రెండుపాత్రల మధ్యే. అయినా ప్రేక్షకుడిని క్షణం కూడా కన్నార్పనీయకుండా కట్టిపడేసే విథంగా థ్రిల్లర్ జోనర్‌తో సినిమా నడపడం డచ్ దర్శకుడైన బాబీ బోర్మెన్స్కి మాత్రమే చెల్లింది. అదే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఐ హోస్టేజ్ సినిమా. ఆపిల్ స్టోర్... ఐ ఫోన్ నుండి ఐ ప్యాడ్ల వరకు ప్రతి దానికి ఆపిల్ స్టోరే కదా... ఈ సినిమాకి మూలం అదే. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాలలో ఆపిల్ స్టోర్లు ఘనంగా దాదాపు 5 ఫ్లోర్లు పైనే విశాలంగా పెద్ద భవంతిలో ఉంటాయి.అది కూడా నగరానికి మధ్యలోనే ఉంటాయి. కథా పరంగా ఆమ్స్టర్డామ్ నగరం మధ్యలోని ఓ ఆపిల్ స్టోర్ బోలెడంత మంది కస్టమర్లతో కళకళలాడుతుంటుంది. అప్పుడు ఆ స్టోర్‌లోకి కూరగాయల సంచితో ఓ వ్యక్తి వచ్చి తన దగ్గర ఉన్న తుపాకీ తీసి అందరినీ హడలుగొట్టి, ఓ వ్యక్తిని బందీగా తీసుకుంటాడు. అంతేకాదు తన దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరించి, తనకు మిలియన్ల డబ్బుతోపాటు అక్కడ నుండి తప్పించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయమని అధికారులకు ఫోన్లో చెప్తాడు. ఇక సినిమా మొత్తం దాదాపుగా ఆ ఇద్దరి మధ్యే నడుస్తుంది.సినిమా ఆ ఇద్దరి మీదే నడిచినా మంచి స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నారు దర్శకుడు. సినిమా చివర్లో బందీగా తీసుకున్న వ్యక్తితో తను బయటపడగలిగాడా? లేదా? తాను డిమాండ్ చేసిన డబ్బులు అందుకున్నాడా? లేదా అనేది తెలుసుకోవాలంటే మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఐ హోస్టేజ్ సినిమాని చూసేయండి. ఈ సినిమా ద్వారా మానసికంగా ప్రేక్షకుడికి భయాన్ని పూర్తిగా పరిచయం చేశారు దర్శకుడు.అది కూడా చిన్నపాటి ఘర్షణ లేకుండా, ఒక్క బుల్లెట్ పేలకుండా... మరీ ముఖ్యంగా ఎటువంటి పేలుళ్లు జరగకుండా సైకలాజికల్‌గా సినిమాని తీసుకువెళ్లారు. సినిమా చూసిన తరువాత మాత్రం వామ్మో... ఆపిల్ స్టోరా ఇంక వెళ్లొద్దు బాబు అని కనీసం పది మందిలో సగమైనా అనుకుంటారు. మరి... మీరు కూడా ఆలస్యం కాకుండా ఈ సినిమా చూసేయండి. అయితే ఆపిల్ స్టోర్‌కి మాత్రం వెళ్లడం మానకండి. – హరికృష్ణ ఇంటూరు -
ప్యాషన్‌తో నిర్మించిన పేషన్ హిట్టవ్వాలి: దర్శకుడు శేఖర్ కమ్ముల
‘‘కొత్త ఫ్లేవర్‌తో వచ్చిన సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తారు. ఈ ‘పేషన్’ సినిమాను కూడా అంతే అద్భుతంగా ఆదరిస్తారని నమ్ముతున్నాను. ఈ సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు దర్శకుడు శేఖర్ కమ్ముల. సుధీష్, అంకిత హీరో, హీరోయిన్లుగా అరవింద్ జాషువా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పేషన్’. నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ – ‘‘ఆనంద్’ సినిమా నుంచే నాకు అరవింద్ జాషువా పరిచయం. తనలో మంచి స్టోరీ టెల్లింగ్ క్రియేటర్ ఉన్నాడని అప్పుడే అనిపించింది. తను రాసిన పేషన్ నవలను చదివా. చాలా బాగుంది. ఇక అరవింద్ రూపొందించిన ఈ ‘పేషన్’ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. కొత్త నిర్మాతలు ప్యాషన్‌తో ఈ మూవీ తీశారు’’ అన్నారు.‘‘శేఖర్ కమ్ములగారి బ్లెస్సింగ్స్ లేకపోతే ఈ మూవీ అయ్యేది కాదు. ‘పేషన్’ విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్. ‘‘శేఖర్ కమ్ములగారికి నేను ఏకలవ్య శిష్ణుడ్ని. ఈ జనరేషన్‌కి కనెక్ట్ అయ్యే కథతో ‘పేషన్’ తీశాం. త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని అన్నారు అరవింద్ జాషువా. -
డేట్ ఫిక్స్ చేయండి..అసెంబ్లీకి రండి: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రజతోత్సవ సభ పేరుతో ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై ఆక్రోశంతో విషం కక్కారని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధ్వజమెత్తారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అద్భుతాలు జరిగినట్టు, ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమీ జరగనట్టు ఆయన మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఏం జరిగిందో..కాంగ్రెస్ టైంలో ఏం జరిగిందో చర్చించేందుకు సిద్ధం కావాలని చాలెంజ్ చేశారు. ‘మీరు డేట్ ఫిక్స్ చేయండి. అసెంబ్లీకి రండి. మీరే సరి్టఫికెట్ ఇచ్చిన మీ బచ్చాగాళ్లతో మాట్లాడేది లేదు. మీరు రండి. మీ పాలనలో అద్భుతాలు, మీరు చేసిన ఘనకార్యాలను ప్రజలకు వివరిద్దాం. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం గురించి కూడా మాట్లాడదాం. డేట్ మీరే చెప్పండి. చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం’ అని పొంగులేటి వ్యాఖ్యానించారు. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌లోని సీఎం రేవంత్‌రెడ్డి నివాసం వద్ద మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి పొంగులేటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలు తనను గద్దె దింపారనే ఆక్రోశంతో కేసీఆర్ మాట్లాడారని విమర్శించారు. కడుపునిండా కాంగ్రెస్ పార్టీపై విషం పెట్టుకొని మమ్మల్ని విలన్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు విలన్ అయ్యిందో రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాటకు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు విలన్ అయ్యిందా? హైదరాబాద్‌తో కూడిన తెలంగాణను ఏర్పాటు చేసినందుకు విలన్ అయ్యిందా అని ప్రశ్నించారు. రజతోత్సవ సభలో తన హయాంలో జరిగిన మంచి పనులను చెప్పుకోవచ్చు.. అదేవిధంగా లోపాలను కూడా మాట్లాడి ఉంటే ఎవరూ అభ్యంతరం చెప్పరన్నారు. రైతుల గుదిబండగా మారిన ధరణి పోర్టల్ గురించి, కుప్పకూలిన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆ సభలో కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అసలు కేసీఆర్ పెట్టిన ఏ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీసేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. తామేదో బీఆర్ఎస్ సభను అడ్డుకునేందుకు ప్రయత్నం చేశామని చెబుతుంటే నవ్వు వస్తుందన్నారు. కేసీఆర్ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ సభలకు బస్సులు ఇవ్వలేదని, టూవీలర్లు కూడా రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని, కానీ తాము ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించామని, వారు ఎన్ని బస్సులకు డబ్బులు కడితే అన్ని బస్సులు ఇచ్చామని తెలిపారు. నిజంగా కాంగ్రెస్ అడ్డుకొని ఉంటే బీఆర్ఎస్ సభ జరిగేదా అని నిలదీశారు. తామేదో వర్సిటీ భూములు అమ్మినట్టు కేసీఆర్ చెప్పారని, ఏ యూనివర్సిటీ భూముల అమ్మామో ప్రజలకు చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును తనకు కావాల్సిన వారికి లీజుకు ఇచ్చుకుంది.. వైన్ షాపుల టెండర్లు ముగియక ముందే డబ్బులు వసూలు చేసుకుంది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తాము కమీషన్లు తీసుకున్నామని కేసీఆర్ అంటున్నారని, ఎక్కడ తీసుకున్నామో చూపించాలని డిమాండ్ చేశారు. ఏ కమీషన్లు తీసుకోకుండానే దేశంలోనే అత్యంత ధనిక ప్రాంతీయ పార్టీగా బీఆర్ఎస్ ఎలా ఎదిగిందని, రూ.1,500 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చబోమని కేసీఆర్ ప్రగల్భాలు పలుకుతున్నారని, ఆయన కూలిస్తే కూలిపోవడానికి ప్రభుత్వమేమైనా బొమ్మరిల్లా అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టి ధనిక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన నాయకుడు... ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేయడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కేసీఆర్ లేదన్నారు. తెలంగాణ వచ్చాక దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చేయలేదని, ఇప్పుడైనా ఆ పార్టీ శాసనసభ పక్ష పదవిని దళితుడికి ఇస్తారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీకి ఇవ్వగలరా అని వ్యాఖ్యానించారు. వీటన్నింటిపై మాట్లాడేందుకు కేసీఆర్ డేట్‌ఫిక్స్ చేస్తే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించేందుకు సిద్ధం కావాలని మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ నేతలను సవాల్ చేశారు. అధికారం పోయినా గర్వం పోలేదు: మంత్రి జూపల్లి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రజలు ఉద్యోగం ఊడగొట్టినా కేసీఆర్‌కు గర్వం పోలేదని.. చింత చచ్చినా పులుపు చావనట్టు ఆయన మాట్లాడుతున్నారన్నారు. ఒక్కో గ్రామానికి రూ. 3 లక్షలు ఖర్చు చేసి ఈ సభ నిర్వహించారని, ఆ డబ్బులు ఎక్కడివని నిలదీశారు. తాము కూడా రాజకీయాల్లోనే ఉన్నామని, తమకు ఏమీ తెలియదని అనుకోవడం పొరపాటని అన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తానని కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని, అసలు ఆయన ఉద్యోగం ఎందుకు ఊడిందో..ప్రజలు ఎందుకు ఓడించారో ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకోవాలని హితవు పలికారు. ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం కాంగ్రెస్ పార్టీని విలన్ అంటూ కేసీఆర్ మాట్లాడిన మాటలను వెంటనే ఉపసంహరించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీనే లేకుంటే కేసీఆర్ మూడు చెరువుల నీళ్లు తాగినా, వంద మంది కేసీఆర్‌లు వచ్చినా తెలంగాణ వచ్చేది కాదని చెప్పారు. ఎల్కతుర్తి సభకు జనం రాకపోతే అదేదో తాము అడ్డుకున్నట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అగ్గిపెట్టి రాజకీయానికి బలైన ఉద్యమకారులు, అమరవీరులకు ఆ సభలో ఎందుకు నివాళులరి్పంచలేదని మంత్రి పొన్నం ప్రశ్నించారు. నియంత మాట్లాడినట్టుంది: మంత్రి సీతక్క మంత్రి సీతక్క మాట్లాడుతూ ఒక నియంత అధికారాన్ని కోల్పోయిన తర్వాత మాట్లాడినట్టు కేసీఆర్ ప్రసంగం ఉందని చెప్పారు. అధికారం పోయాక కుటుంబం, ఆస్తులు చీలికలు,పీలికలు అయ్యాయన్న ఆవేదనతో ఆయన మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బిడ్డ మంచి కార్లలో తిరగొచ్చు గానీ.. పేద మహిళలు ఆర్టీసీ బస్సుల్లో తిరగవద్దా అని ప్రశ్నించారు. కేసీఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరూ ఉపయోగించుకోలేదని చెప్పారు. వారు అధికారంలో ఉన్నప్పుడు ధర్నా చౌక్ తీసేశారని, ఇప్పుడు మళ్లీ తాము ధర్నాచౌక్ తెరిస్తే సిగ్గు లేకుండా అక్కడకు వచ్చి ధర్నాలు చేస్తున్నారన్నారు. అసెంబ్లీలో సొల్లు కబుర్లు మాట్లాడుతున్నారని చట్టసభను అవమానించిన కేసీఆర్‌కు అసెంబ్లీకి వచ్చే అర్హత ఉందా అని ప్రశ్నించారు. -
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్!
వాళ్ల మధ్య వేలెందుకు పెట్టార్సార్! -
ఊరంతా తెలిసిన సీక్రెట్...
హర్షిత్ రెడ్డి, సి. మల్గిరెడ్డి, శ్రియ కొంఠం, చరణ్ పెరి, షాలినీ కొండేపూడి, గవిరెడ్డి శ్రీనివాస్, శ్రావణి ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘శుభం’. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మించిన తొలి చిత్రం ఇది. అలాగే ఈ సినిమాలో ఓ కీలకపాత్రలోనూ నటించారు సమంత. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.‘ఆ సీరియల్ టీవీలో వస్తున్నంత సేపు నా పెళ్ళాం చాలా తేడాగా ప్రవర్తించింది రా.., ఇంత జరుగుతుంటే ఊళ్లో ఒక్కడన్నా బయటకు వచ్చి చెప్పాడ్రా... అసలు ఒరేయ్... ఊరంతా తెలిసిన సీక్రెట్ రా ఇది... మొత్తం మగవాళ్ళ పరువంతా డేంజర్లో పడింది’ అనే సంభాషణలు ‘శుభం’ ట్రైలర్లో ఉన్నాయి. ఓ ఊర్లో మహిళలందరూ టీవీలో ఓ సీరియల్ చూసి, వింత వింతగా ప్రవర్తిస్తుంటారు. దెయ్యం పట్టినట్టుగా మహిళలు ప్రవర్తిస్తుంటే.. వారి నుంచి తప్పించుకునేందుకు ఊర్లో పురుషులంతా అష్టకష్టాలు పడుతుంటారు. అప్పుడు ఓ మాతాజీలా సమంత వస్తారు. ఆ నెక్ట్స్ ఏం జరిగింది? అనే కథాంశంతో ‘శుభం’ సినిమా రూపొందిందని విడుదలైన ట్రైలర్ స్పష్టం చేస్తోంది. -
కోర్ట్ తర్వాత సారంగపాణి జాతకం నాకో వరం: ప్రియదర్శి
‘‘కోర్ట్’ తర్వాత ‘సారంగపాణి జాతకం’ చిత్రం నాకు ఓ వరంలా దొరికింది. ఇలాంటి చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. శనివారం ‘సారంగపాణి జాతకం’ సినిమా సెలబ్రిటీ షో వేశాం. సెలబ్రిటీలు, ఆడియన్స్ సినిమాను ఎంజాయ్ చేశారు’’ అని ప్రియదర్శి అన్నారు. ప్రియదర్శి, రూపా కొడవయూర్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ అయింది. ఆదివారం జరిగిన ఈ సినిమా ‘ఫన్’టాస్టిక్ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ– ‘‘నేను అనుకున్నదాని కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ప్రియదర్శి నటించాడు. శివలెంక కృష్ణప్రసాద్గారితో నేను ‘సమ్మోహనం, జెంటిల్‌మ్యాన్’ సినిమాలు చేశాను. ఇప్పుడు ‘సారంగపాణి జాతకం’ సినిమా చేశాం. ఈ మూడూ ప్రేక్షకులు పది కాలాలపాటు గుర్తుపెట్టుకునే చిత్రాలు’’ అని తెలిపారు.‘‘మేం ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన ఈ సినిమాను అందరూ చూసి, ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘దర్శికి మంచి జడ్జ్మెంట్ ఉంది. అప్పట్లో ఆమిర్ ఖాన్‌గారికి ఇలాంటి జడ్జ్మెంట్ ఉండేది. ఇంద్రగంటిగారితో పనిచేస్తే చాలు... రిజల్ట్‌తో అవసరం లేదు’’ అని చెప్పారు ‘వెన్నెల’ కిశోర్. ‘‘దర్శి ఆల్‌రౌండర్ నటుడు’’ అన్నారు అవసరాల శ్రీనివాస్. ఇంకా నటుడు వైవా హర్ష, కెమెరామేన్ పీజీ విందా మాట్లాడారు. -
త్రీడీలో జగదేక వీరుడు అతిలోక సుందరి
చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం 1990 మే 9న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను 35 ఏళ్ల తర్వాత రీ–రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. మే 9న ఈ చిత్రం రీ రిలీజ్‌కు సిద్ధమైంది. అది కూడా 2డీతో పాటు 3డీ వెర్షన్లోనూ విడుదల కానుంది. ‘‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ చిత్రం అప్పట్లోనే విజువల్ వండర్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు త్రీడీ వెర్షన్‌తో ఆడియన్స్‌కు సరికొత్త అనుభూతినివ్వబోతోంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఇళయరాజా. -
నాని నా అంచనాలను మించిపోయాడు: దర్శకుడు రాజమౌళి
‘‘నాని ఏ సినిమా చేసినా హిట్ అని తెలిసిపోతుంటుంది. కానీ తన దగ్గర్నుంచి ఇంకా కావాలని ఓ ఫంక్షన్లో అన్నాను. అయితే నా అంచనాలను మించి నాని చాలా ముందుకెళ్లిపోయాడు. కానీ నానీ... మేం ఇంకా కోరుకుంటూనే ఉంటాం. నువ్వు ఇంకా ముందుకు వెళ్లు’’ అని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. నాని హీరోగా నటించిన చిత్రం ‘హిట్ 3: థర్డ్ కేస్’. ఈ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్ . శైలేష్ కొలను దర్శకత్వంలో నాని, ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు రాజమౌళి, అతిథులుగా ‘హిట్ 1’లో హీరోగా నటించిన అడివి శేష్, ‘హిట్ 2’లో హీరోగా నటించిన విశ్వక్ సేన్ హాజరయ్యారు. ఈ వేదికపై దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ – ‘‘అ!, హిట్ 1, హిట్ 2, కోర్ట్’... ఆల్ సక్సెస్. వంద శాతం సక్సెస్ అయిన నిర్మాత ప్రశాంతి. ఇండస్ట్రీలో హిట్ మిషన్ అని పిలుచుకుంటుంటాం. ఇప్పుడు ‘హిట్ 3’ సక్సెస్ అవుతుందని నా గట్టి నమ్మకం. ఓ ఫ్రాంచైజీని స్టార్ట్ చేసినప్పుడు అది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. కానీ ‘హిట్ ఫస్ట్ కేస్, సెకండ్ కేస్... చాలా కేస్లు ఉండొచ్చు. శైలేష్ ఏడు సినిమాలే అనుకుని ఉండొచ్చు. కానీ ఈ ఫ్రాంచైజీ ఎప్పటికీ ఉంటుందని అనుకుంటున్నాను. ‘హిట్ 3’ ప్రమోషనల్ కంటెంట్ చూశాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అనే వైబ్‌ని క్రియేట్ చేసింది. మే1 థియేటర్స్‌లో... అబ్ కీ బార్ అర్జున్ సర్కార్. హిట్ ది థర్డ్ కేస్’’ అని రాజమౌళి అన్నారు.కాగా.. ఈ వేదికపై ‘‘మీరు తీయబోతున్నటు వంటి ‘మహాభారతం’ సినిమాలో నానీగారి క్యారెక్టర్ ఫిక్స్ అయిందని విన్నాం... నిజమేనా’’ అని యాంకర్ సుమ అడిగితే ‘‘నాని ఉంటాడన్నది మాత్రం ఫిక్స్’’ అని రాజమౌళి చెప్పారు. నాని మాట్లాడుతూ– ‘‘నా ప్రతి కొత్త సినిమాకు మార్నింగ్ షోకి ప్రసాద్ ఐమ్యాక్స్‌కి వెళతాను. వెళ్లే ముందే రాజమౌళిగారి ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తున్నారా? అని చెక్ చేసుకుని, థియేటర్లో వాళ్ల రియాక్షన్ చూస్తుండేవాడిని. సినిమా అయిపోయాక వల్లీగారు, రమగారిని టాక్ అడిగేవాడిని. ప్రేమగా హగ్ ఇచ్చి వెళ్లిపోయారంటే నచ్చలేదని అర్థం. ‘చాలా బాగుంది. కారు ఎక్కిన వెంటనే నీకు మెసేజ్ చేస్తాం’ అంటే సినిమా బాగుందని అర్థం. అయితే ఈ మధ్య థియేటర్‌కి వెళ్లకపోవడంతో కాస్త బ్రేక్ వచ్చింది.ఈసారి ‘హిట్ 3’ సినిమా చూసి, ఆయన (రాజమౌళి) నాకు ఆ మార్నింగ్ షో ఎనర్జీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాజమౌళిగారు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. ఒక థ్రిల్లర్, ఒక మాస్ కమర్షియల్ ఫిల్మ్ కలిస్తే అది ‘హిట్ 3’. మే 1న ఆడియన్స్ కు ఒక అమేజింగ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ను నానిప్రామిస్ చేస్తున్నాడు’’ అన్నారు. ‘హిట్ 3’ సక్సెస్ అవ్వాలనే ఆకాంక్షను అడివి శేష్, విశ్వక్ సేన్ వ్యక్తం చేశారు. శైలేష్ కొలను, శ్రీనిధీ శెట్టి, కోమలీ ప్రసాద్ తదితరులు మాట్లాడారు. -
‘ఫూలే’ను ఎందుకు ఆపాలని చూశారు?
మొదటిసారి మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే మీద ఒక హిందీ సినిమా వచ్చింది. దాన్ని ప్రఖ్యాత సినిమా డైరెక్టర్ అనంత్ మహాదేవన్ తీశారు. ప్రతీక్ గాంధీ, పత్రలేఖా పాల్ అనే ఇద్దరు యాక్టర్లు ఫూలే, సావిత్రిగా నటించారు. ఆ సినిమా నిజానికి ఫూలే 198వ జయంతి అయిన 2025 ఏప్రిల్11న విడుదల కావలసి ఉంది. కానీ దేశంలోని కొన్ని బ్రాహ్మణ సంఘాలు సినిమా విడుదలను వ్యతిరేకించి ‘సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్’ (సీబీఎఫ్సీ)కి ఎన్నో ఫిర్యాదులు పంపారు. సీబీఎఫ్సీ అతివేగంగా స్పందించి, విడుదల కావాల్సిన సినిమాను ఆపేసి కొన్ని మార్పులు సూచించింది. ఎన్నో ఇబ్బందుల అనంతరం చివరికి ఏప్రిల్ 25న సినిమా విడుదలయ్యింది.‘ఫూలే’ సినిమా ఊహాజనిత కథపై ఆధారపడి తీసింది కాదు. ఫూలే, సావిత్రిపై రాసిన ఇంగ్లిష్, మరాఠీ, హిందీ భాషల్లోని చాలా జీవిత చరిత్రలపై ఆధారపడి తీసింది. కానీ సీబీఎఫ్సీ బలమైన చారిత్రక ఆధారాలతో సినిమాలో పెట్టిన ఘటనలను, కొన్ని పేర్లను తొలగించాలని సూచించింది. ముఖ్యంగా ఫూలే కాలంలో కూడా దళితులు గ్రామ వీధుల్లోకి వస్తే మూతికి ముంత, నడుముకు తాటాకు కట్టుకోవలసి ఉండింది. ఈ ఘోరమైన అంటరానితనాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలించిన బ్రాహ్మణ రాజులైన పీష్వాలు కఠినంగా అమలుచేశారు.ఫూలే స్వయంగా చదువు చెప్పి సావిత్రీబాయిని దేశంలోనే మొదటి మహిళా టీచర్ని చేశాక, పుణె పట్టణ సమీపంలోని దళితవాడలో ఆడపిల్లలకు స్కూలు పెట్టారు. ఏ కులానికి చెందిన అమ్మాయిలైనా వచ్చి చదువుకోవచ్చని ప్రకటించారు. సావిత్రీబాయితోపాటు చదువుకున్న ముస్లిం స్త్రీ ఫాతిమా షేక్ ఆమెకు అండగా ఉండేది. సావిత్రీబాయి ఈ దేశం మొత్తం చరిత్రలో భర్త సహాయంతో చదువుకొని టీచరై, ఆడపిల్లలకు బడి పెట్టిన మొదటి మహిళ. ఫూలే దంపతులు బ్రాహ్మణులతో తగువు పెట్టుకోలేదు. కొట్టినా, తిట్టినా ఈ దేశ రైతాంగ జీవితాన్ని, కూలీల జీవితాన్ని, వృత్తిపనివారి జీవితాన్ని, ముఖ్యంగా స్త్రీ సమాజ జీవితాన్ని మార్చిన ఏకైక ఆదర్శ భార్యాభర్తల జంట అది. ఆ జంట అహింసకు మారుపేరు.ఈ సినిమాలో పీష్వాల కాలం నాటి ఘోర అంటరానితనం, మనుషులను జంతుప్రాయంగా చూసిన పీష్వా రాజ్య న్యాయ వ్యవస్థను ఈనాటి సమాజానికి చెప్పకుండా, సినిమా రూపంలో చూపించకుండా ఎందుకుండాలి? చుట్టూ బ్రిటిష్ పరిపాలన ఉన్నా, పీష్వా రాజులు పుష్యమిత్రశుంగుని క్రూరాతిక్రూరమైన వర్ణధర్మ రాజ్యాన్ని నడిపింది చరిత్ర కదా! మొత్తం రైతాంగాన్ని – అంటే ఇవాళ పై శూద్ర కులంగా ఉన్న మరాఠాలు, కుంబీలు (ఫూలే కులస్థులు) సైతం చదువు నేర్చుకునే హక్కు లేని కట్టుబానిసలు కదా! అందుకే ‘గులాంగిరీ’ పుస్తకంలో ఫూలే వ్యవసాయ ఉత్పత్తిదారులను బానిసత్వం నుండి విముక్తి చెయ్యకుండా దేశం అభివృద్ధి కావడం అసంభవం అని రాశారు.ఆనాటి శూద్ర బానిసలకు తాము బానిసలమనే సోయి కూడా లేదు. ఈ వ్యవస్థ వ్యవసాయ ఉత్పత్తిని పెంచలేదు. ఉన్న పంటలో అదిరించి, బెదిరించి, స్వర్గం–నరకం సిద్ధాంతం చెప్పినవాళ్లు మాత్రమే కాస్త మంచి తిండి తిన్నారు. వీళ్ళకు ఆనాడు జాతీయ భావం లేదు. కుల భావం మాత్రమే ఉంది. జాతీయ భావన సమానత్వంతో ముడిపడి ఉంది.ఈ దేశంలో అన్ని కులాల వారికి జాతీయ భావాన్ని నేర్పిన మొట్టమొదటి దైవసమాన జంట ఫూలే–సావిత్రీబాయి. వారిని మించిన జంట ఈ భూమి మీద ఆనాటికి పుట్టలేదు. ఈనాటికీ వెతికినా దొరికే స్థితి లేదు. పిల్లలు లేని ఈ జంట... విధవలుగా జీవిస్తున్న ఇద్దరు (బ్రాహ్మణ, ఇతర కులాలకు చెందిన) స్త్రీలను... ఇంట్లో పెట్టుకొని, ఒక బ్రాహ్మణ విధవకు పుట్టిన యశ్వంత రావును పెంచుకొని, మొదటి డాక్టరును చేశారు. ఆనాటి వరకు బ్రాహ్మణ పురుషులు కూడా అలోపతి మెడిసిన్ చదవడం లేదు. సముద్రాలు దాటడం లేదు. ఈ దంపతులను ఈనాటి బ్రాహ్మణులైనా, ఏ కులస్థులైనా ఎలా చూడాలి? ఈ భూమి మీద నడిచిన దేవ–దేవతా దంపతులుగా చూడాలి కదా! వారి జీవిత చరిత్ర చిత్రీకరణను వ్యతిరేకించడమేమిటి?సావిత్రీబాయి ఈ దేశ మొదటి మహిళా టీచరయ్యారు నిజమే. ఆమెపై ఆనాటి సంప్రదాయ యువకులు పేడ కొట్టింది నిజమే. కొంతమంది బ్రాహ్మణులు ఆ దంపతులకు మద్దతిచ్చిందీ నిజమే. సీబీఎఫ్సీ పేడకొట్టే సీను సినిమాలో తీసెయ్యాలని ఎలా అన్నది? ఈ సీబీఎఫ్సీలో ఒక్క శూద్ర వ్యక్తిగానీ, దళిత వ్యక్తిగానీ లేకుండా ఎలా చేశారు బీసీ ప్రధానమంత్రి? ఈ సీబీఎఫ్సీ కశ్మీర్ మీద, గుజరాత్ మీద, కేరళ మీద ముస్లింలపై సినిమా తీసినప్పుడు వాళ్ళు ట్రైలర్లు చూసి ఎన్ని అభ్యంతరాలు పెట్టినా ఒక్క సీన్‌గానీ, ఒక్క పదంగానీ కట్ చెయ్యలేదు. ఇప్పుడు సీబీఎఫ్సీ అధ్యక్షుడు ప్రసూన్ జోషీ ఈ దేశ జాతీయతను ఏం చెయ్యదలచుకున్నారు?ఆ సినిమాలు ప్రధానమంత్రి చూశారు. పొగిడారు. మరి ‘ఫూలే’ సినిమాను ప్రధానమంత్రి చూస్తారా? ఒక బీసీగా ప్రధానమంత్రి అయి, ముఖ్యంగా శూద్ర బీసీల ఓట్లతో గెలిచి ఫూలే వ్యతిరేకులను సమర్థిస్తారా అనేది చాలా ముఖ్యమైన అంశం.ఈ సినిమా భారతదేశపు సినిమా ఇండస్ట్రీలో ఒక కొత్త మలుపు. మన సంఘ సంస్కర్తల జీవిత చరిత్రలు పుస్త కాలుగా వచ్చాయి. కానీ వారిపై పెద్ద డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు సినిమాలు తీసే ప్రయత్నం చెయ్యలేదు. అందులో ముఖ్యంగా ప్రపంచ ఆధునిక చరిత్రలో ఎక్కడా లేని ఒక ఫూలే జంట లాంటి జంట మీద సినిమా తీయడం, వారి జీవితాలను ఇంటింటికీ ఆదర్శవంతం చేయడం నిజానికి జాతీయ లక్షణాలు కలిగిన సినిమా ఇండస్ట్రీకి ఉండాలి. కానీ అదెక్కడా కనిపించలేదు. ఈ సినిమాతో అది మొదలయింది.ఒక సినిమా మంచిదా, కాదా అనేది అది ఎన్ని కోట్లు సంపాదిస్తుంది అనే మార్కెట్ విలువను బట్టి ఈ రోజుల్లో, మార్కెట్లో కూడా ఈ సినిమా విలువను పెంచాల్సి ఉంది. ప్రభుత్వాలు ఈ సినిమాకు పన్ను తగ్గిస్తాయా, మాఫీ చేస్తాయా అనేది అంత ముఖ్యం కాదు. ఎంతమంది ముఖ్యమంత్రులు, మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సినిమాను చూస్తారు అనేది ముఖ్యం. అమెరికాలో రేసిజాన్ని అంతం చేసిన ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ 1865లో ‘అవర్ అమెరికన్ కజిన్’ డ్రామాను థియేటర్లో చూస్తూ హత్యకు గురయ్యారు. మంచిని నేర్చుకోవడానికి ఆయన చూపిన శ్రద్ధ అది. ఈ సమాజం సమానత్వం వైపు పయనిస్తేనే ప్రజాస్వామ్యం బతికి ఉంటుంది. లేకపోతే ఫూలేలు నేర్పిన శ్రమ గౌరవ పాఠాలు ఇసుక దిబ్బల మీద రాసిన రాతలయ్యే ప్రమాదముంది.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెఫర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక విశ్లేషకుడు -
మలబారు యాత్ర
వైకోం మహమ్మద్ బషీర్ తమ ఇంటిముందున్న వంగమామిడి చెట్టుకింద కూర్చుని రాసేవారట. ఆ చెట్టు గాలిని పీల్చే ‘మా తాతకో ఏనుగుండేది’, ‘చిన్ననాటి నేస్తం’, ‘గోడలు’ లాంటి ఆయన రచనలు ఊపిరి పోసుకున్నాయి. బషీర్ అభిమానులకు ఆ చెట్టును చూడటం గొప్ప సంతోషం. అంతేనా? ఆయన విన్న గ్రామ్‌ఫోన్ రికార్డు, ఆయన సేదతీరిన ఆరాం కుర్చీ కూడా ప్రత్యేకమే. బషీర్‌ను ఆయన జన్మించిన బేపూర్‌ను బట్టి బేపూర్ సుల్తాన్ అంటారు. ఆయన వస్తువులు, ఆయన జీవితాన్ని తెలియజెప్పే విశేషాలతో ఆ ఊళ్లో కేరళ ప్రభుత్వం ఒక మెమోరియల్ నిర్మిస్తోంది. బషీర్ క్లాసిక్ అయిన ‘ప్రేమలేఖనం’ నవలలో దంపతులు తమ చిన్నారికి పెట్టుకున్న ఆకాశమిఠాయి పేరునే ఈ స్మారక కేంద్రానికి ఉంచారు. ఒక రచయితకు మెమోరియల్ నిర్మించడం దానికదే విశేషమే అయినా, నిత్య సాహిత్య రాష్ట్రమైన కేరళ తన సాహిత్య స్పృహను మరో స్థాయికి తీసుకెళ్లింది. రచయితల మెమోరియల్స్‌ను కలుపుతూ దేశంలోనే తొట్టతొలి సాహిత్య యాత్రకు శ్రీకారం చుడుతోంది. ‘మలబార్ లిటెరరీ టూరిజం సర్క్యూట్’ పేరుతో ఈ యాత్ర కోళికోడ్, మలప్పురం, పాలక్కాడ్ జిల్లాలను కవర్ చేస్తుంది. మలయాళ సాహిత్యంలో ప్రాచీన కవిత్రయంలో ఒకరిగా పిలిచే, ఆధునిక మలయాళ సాహిత్య పితామహుడిగానూ కొలిచే 16వ శతాబ్దపు కవి, భాషావేత్త తుంచాత్తు రామానుజన్ ఎలుత్తాచ్చన్ గ్రామమైన తుంజన్ పరంబు మలబారు ప్రాంతంలోనే ఉంది. విజయదశమి రోజున చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల అక్షరాభ్యాసం కోసం ఈ గ్రామాన్ని దర్శించుకుంటారు. ఈ మలబారు ప్రాంతంలోనే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఎం.టి.వాసుదేవన్ నాయర్; రచయిత, కార్టూనిస్ట్ ఒ.వి.విజయన్; ప్రఖ్యాత యాత్రాసాహిత్య కర్త ఎస్.కె.పొట్టెక్కాట్; మరో కవి, జ్ఞానపీఠ గ్రహీత అఖితం అచ్యుతన్ నంబూద్రి లాంటివారి స్మారక కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇవి భిన్న దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటన్నింటినీ అభిమానులు కలయదిరిగేలా, రచయితల పుస్తకంలో ప్రాణం పోసుకున్న ప్రాంతాలను ప్రత్యక్షంగా అనుభవించేలా, మానవ ఉద్వేగాలన్నీ కాగితాల్లోకి ఎలా బదిలీ అయ్యాయో తెలుసుకునేలా కేరళ పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 2021లోనే ఈ ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయింపులు జరపగా, ఈ సంవత్సరం మధ్యకల్లా దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. కోళికోడ్‌ను యునెస్కో భారతదేశ తొట్టతొలి సాహిత్య నగరంగా గుర్తించిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ వల్ల ఆ నగర ఘనత మరింతగా ఇనుమడిస్తుంది.లండన్‌లోని షేక్స్పియర్ స్మారక కేంద్రాన్ని ఏటా పాతిక లక్షల మంది సందర్శిస్తారు. యూకేలో భిన్న లిటెరరీ సర్క్యూట్స్, వాటికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి. దక్షిణ అమెరికాలోని కొలంబియాలో మ్యూజియంగా మార్చిన గాబ్రియేల్ గార్సియా మార్క్వేజ్ ఇల్లు, ఆయన చదివిన పాఠశాల, ఆయన వెళ్లిన గ్రంథాలయం... ఇలా ఆయన ‘వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్’కు ప్రేరణగా నిలిచిన అన్ని ప్రదేశాలను కలుపుతూ ప్రయాణించవచ్చు. ప్రముఖ మలయాళ సాహిత్యకారులకు కూడా జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు ఉంది. వీళ్ల రచనలు భిన్న భారతీయ భాషలతో పాటు, ఆంగ్లం, ఇతర ప్రపంచ భాషల్లోకి అనువాదమయ్యాయి. దానికి తగ్గ ఉత్సాహం, ప్రోత్సాహం అక్కడ ఉన్నాయి. అందుకే సందర్శకులు భిన్న ప్రాంతాల నుంచి వచ్చే అవకాశం ఉంది. మరి తెలుగు రచయితల పరిస్థితి ఏమిటి? ముందు తెలుగు రచయితలను తెలుగువాళ్లకు పరిచయం చేయడమే పెద్ద సవాలు కావొచ్చు.వైజాగ్ వైపు వెళ్లే కొందరు సాహిత్యాభిమానులు ప్రత్యేకించి భీమిలి వెళ్లొస్తారు చలం ఇంటి కోసం. విజయనగరం వైపు పోయేవాళ్లు గురజాడ గృహాన్ని దర్శించవచ్చు. అదే విశాఖపట్నానితో ముడిపడిన శ్రీశ్రీ, రావిశాస్త్రిలను ముడేస్తూ, అటుగా శ్రీకాకుళంలోని కథానిలయంతో కరచాలనం చేసేలా ఉత్తరాంధ్ర సాహితీయానం చేయగలిగితే ఎలా ఉంటుంది? పోతన, దాశరథి, కాళోజీ లాంటి వాళ్లను తలుచుకోగలిగే వరంగల్ సాహిత్య టూర్ ఎందుకు ఉండకూడదు? రచయితలను ప్రాంతాల వారీగానో, జిల్లాల వారీగానో అనుసంధానం చేసే సాహిత్య టూర్లను ఆశించడం తెలుగు నేల మీద మరీ అత్యాశా? కానీ ఎంతమంది రచయితలకు మెమోరియల్స్ ఉన్నాయి? కనీసం విగ్రహాలైనా ఉన్నాయా? కువెంపు విమానాశ్రయం (శివమొగ్గ) అని కన్నడవాళ్లు పెట్టుకున్నట్టుగా తెలుగు నేల మీద అలా ఒక రచయితకు గౌరవం దక్కుతుందా? ప్రాచీన ప్రపంచంలో ఈజిప్టులోని అలెగ్జాండ్రియా లైబ్రరీ ఒక జ్ఞానధామం. క్రీ.పూ. మూడో శతాబ్దానికి చెందిన ఇది ఆ కాలపు గొప్ప పండితులందరికీ నిత్య సందర్శనా స్థలం. అమెజాన్ కంపెనీ తన వర్చువల్ అసిస్టెంట్‌ను ప్రారంభించినప్పుడు దాని పేరును అలెగ్జాండ్రియాకు నివాళిగా ఎన్నుకుంది. అట్లా ‘అలెక్సా’ చాలామంది జీవితాలకు చేరువైంది. సాహిత్యంతో పరిచయం లేదనుకునేవాళ్లు కూడా దాని ఫలాలను ఇంకో రూపంలో అనుభవిస్తూనే ఉంటారు. ‘పోషణ, ఆవాసం, సాహచర్యం తర్వాత ఈ ప్రపంచంలో మనకు అత్యంతగా కావాల్సింది కథలు’ అంటాడు ఫిలిప్ పుల్మాన్. ‘రచయితలో కన్నీళ్లు లేకపోతే పాఠకుడిలో కన్నీళ్లు లేవు. రచయితలో ఆశ్చర్యం లేకపోతే పాఠకుడిలో ఆశ్చర్యం లేదు’ అంటాడు రాబర్ట్ ఫ్రాస్ట్. రచయితలో ఉన్నదే పాఠకుడికి అందుతుంది. రచయితలో ఉన్నదంతా కూడా పాఠకుడికి బదిలీ అవుతుంది. సాహిత్యం అనేది మన అంతరాత్మలను వెలిగించే అదృశ్య దివ్వె. అందుకే సాహిత్య సృష్టికర్తలను తలుచుకునే ఏ ప్రయత్నం అయినా ప్రాధాన్యత కలిగినదే, దానికోసం తీసుకునే ఏ చొరవైనా విలువైనదే! -
పాక్‌కు ఏది సరిపోయే శిక్ష?
పహల్గామ్లో 26 మంది పౌరులను కాల్చి చంపిన భయంకర ఉగ్రదాడి తర్వాత భారత్ లో పాకిస్తాన్ పై ఆగ్రహం పెరుగుతోంది. భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) కటువైన ప్రకటన విడుదల చేసింది. దాడి చేయడంలో ఉగ్రవాదులు ప్రదర్శించిన క్రూరత్వాన్ని చూస్తే ఆ ఆగ్రహం ఆశ్చర్యం కలిగించదు. పాక్ మీడియా వ్యాఖ్యాతలు ఇస్లామాబాద్‌ను ఇరికించడానికి భారతదేశమే ఈ దాడిని నిర్వహించిందని దారుణమైన ఆరోపణ చేస్తున్నారు. స్పష్టంగా, వారు ఘోరమైన పరిణామాన్ని ఆశిస్తున్నారు.భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన కావలసిన అన్ని అంచనాలను తీర్చింది. న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తాన్ హైకమిషన్ లోని ఛార్జ్ డి’అఫైర్ సహా 14 మంది సిబ్బంది ఇంకా మిగిలి ఉన్నప్పటికీ, పాక్ సైనిక సలహాదారులు, ఇతర సహాయక సిబ్బందిని భారత్ విడిచి వెళ్ళమని ఆదేశించారు. ఇది పాక్ సైనిక సంస్థపై పూర్తిగా నిందను మోపుతుంది. అటారీ చెక్‌పోస్ట్ మూసివేయడం, మిగిలిన వీసా ప్రోటోకాల్స్‌ని నిలిపివేయడం కూడా ఊహించినదే. పాక్‌పై తీవ్రమైన ప్రభావం కలిగించడానికి భారత్ కఠిన నిర్ణయాలు తీసుకోవడం ఆశ్చర్యం కలిగించలేదు. గత సంవత్సరం చివర్లో, సింధునదీ జలాల ఒప్పందంపై తిరిగి చర్చలు జరిగే వరకు సింధునదీ జలాల కమిషన్ సమావేశాలను నిర్వహించడానికి కూడా భారత్ నిరాకరించింది.కేవలం నిలిపేసింది!భారత్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆలస్యం చేయడానికి పాకిస్తాన్ అతి స్వల్ప కారణాలను చూపుతూ సింధు జలాల ఒప్పందాన్ని ఉపయోగించుకుంటోంది. ఒప్పందంలో ఇరు దేశాల కమిషనర్లు సహా మూడు అంచెల వివాద యంత్రాంగం ఉంది. అది విఫలమైనప్పుడు, 1960లో ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన ప్రపంచ బ్యాంకు ఒక తటస్థ నిపుణుడిని నియమిస్తుంది. అది కూడా పని చేయకపోతే, మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయవచ్చు. 1970లలో, భారతదేశం సలాల్ (జమ్ము–కశ్మీర్) ఆనకట్ట ఎత్తును తగ్గించి, దాని అవుట్లెట్లను తెరిచి వేయవలసి వచ్చింది. దీనివలన ఆనకట్ట ఉపయోగం తగ్గి భారీగా బురద చేరి, కోతకు గురైంది. మరొక సందర్భంలో, బాగ్లిహార్ ఆనకట్ట (జమ్ము–కశ్మీర్) 14 ఏళ్ల ఆలస్యాన్ని ఎదుర్కొంది. కిషన్‌గంగా ప్రాజెక్టు మరింత ఇబ్బందులకు గురైంది. ప్రపంచ బ్యాంక్ నియమించిన తటస్థ నిపుణుడు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడే పాక్ మధ్యవర్తిత్వ స్థాయికి వెళ్లింది. ప్రపంచంలోనే అత్యంత నీటి కొరత ఉన్న దేశాలలో పాకిస్తాన్ 15వది. భారతదేశం ప్రస్తుతం జలాల ఒప్పందాన్ని కేవలం ‘నిలిపివేసింది’. సరిహద్దుకు అవతలి వైపు ఉన్న బాధ్యతాయుతమైన మనుషులు ఈ స్వల్పభేదాన్ని అర్థం చేసుకోవాలి.అయితే, ఇవేవీ భారతదేశ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చలేవు. భద్రతా కేబినెట్ కమిటీ ప్రకటన ‘ఇటీవల తహవ్వుర్ రానాను వెనక్కి రప్పించినట్లే, ఉగ్రవాద చర్యలకు పాల్పడిన లేదా వాటిని సాధ్యం చేయడానికి కుట్ర పన్నిన వారిని వెంబడించడంలో భారతదేశం అవిశ్రాంతంగా ఉంటుంది’ అని పేర్కొంది. ఉగ్రదాడి తర్వాత ప్రధాని బిహార్‌లో ఉద్దేశపూర్వకంగానే ఇంగ్లీషులో మాట్లాడుతూ, ‘భారతదేశం ప్రతి ఉగ్రవాదినీ, వారికి మద్దతు ఇచ్చేవారినీ గుర్తించి, వెంబడించి, శిక్షిస్తుంది. మేము వారిని భూమ్మీద ఎక్కడున్నా దొరికించుకుంటాం’ అన్నారు. ఉగ్రవాదాన్ని శిక్షించే చర్యలు దీర్ఘకాలంపాటు కొనసాగుతాయని ఈ ప్రకటన సూచిస్తుంది.ఎలా దాడి చేయొచ్చు?కాబట్టి, ఇప్పుడు ఇక్కడ ఏమి సాధ్యమవుతుంది అంటే కచ్చితంగానే బాలకోట్ తరహా దాడి సాధ్యం కాదు. ఈసారి, పాక్ సైన్యం పూర్తి అప్రమత్తంగా ఉంది. స్పష్టమైన ప్రత్యామ్నాయం ఏమిటంటే, నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలను గుర్తించే లక్ష్యంతో భారత భూభాగం నుంచే 290 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగించడం. అది భారత్ తనదని చెప్పుకొంటున్న ప్రాంతం కాబట్టి ఇది సాంకేతికంగా పాకిస్తాన్‌పై దాడి కాదు. మరింత కావాల్సిన లక్ష్యం లష్కర్–ఎ–తొయిబా కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న మురిద్కే. ఇది లాహోర్‌కు దగ్గరగా, భారత సరిహద్దు నుండి దాదాపు 30 కి.మీ. దూరంలో ఉంది. సాయుధ డ్రోన్ లను ఉపయోగించి కూడా దీనిపై దాడి చేయవచ్చు. దీని వలన కచ్చితత్వంతోపాటు ఎటువంటి ఆనుషంగిక నష్టం ఉండదు.కానీ ఏదైనా సరే, ఎంత సమర్థనీయమైనా సరే, అది యుద్ధ చర్యే. పాకిస్తాన్ సైన్యం ప్రతీకారం తీర్చుకుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలకోట్ తరువాత, అది జాగ్రత్తగా దాడి చేసింది. పెద్దగా నష్టం కలిగించకుండా ప్రతిస్పందనను నమోదు చేసింది. దానికి ప్రధానంగా అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ బాజ్వా కారణం. ఆయన దేశ సొంత ప్రయోజనం కోసం పాక్ అంతటా భారతదేశానికి వాణిజ్యాన్ని ప్రతిపాదించిన వాస్తవికవాది. కానీ, యుద్ధం, దాని అన్ని తీవ్రతరమైన అవకాశాలను దృష్టిలో ఉంచుకుంటే ప్రస్తుత చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ వివేకవంతమైన వ్యూహకర్త కాదు. భారతదేశం ఈ యుద్ధాన్ని భరించగలదు. అయినప్పటికీ ముఖ్యంగా ఆయుధాల కోసం దిగుమతులపై ఆధారపడి ఉన్నప్పుడు ఇది అత్యంత వ్యర్థమైన ఖర్చు.ముక్కలుగా కత్తిరిస్తే!భారత్ యుద్ధాన్ని కాకుండా, ఆర్థిక వృద్ధిని కోరుకుంటోంది. పాక్ నిజంగా యుద్ధాన్ని భరించలేదు. పైగా అంతర్జాతీయ ద్రవ్య నిధి అటువంటి ఖర్చులను దయతో చూస్తుందా లేదా అనేది విషయం కాదు... వాస్తవం ఏమిటంటే, ఆ దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు సంక్షోభంలో ఉన్నాయి. ఇది జెట్ ఇంధనం విషయంలో తీవ్రమైన కొరతకు దారితీస్తుంది. గత తొమ్మిది నెలల్లో ఆరు ప్రధాన శుద్ధి కర్మాగారాలలో ఏవీ చమురు పంపిణీ చేయలేదు. కనీస జ్ఞానం ఉన్న ఏ దేశమైనా, కీలకమైన ఇంధనాన్ని దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితుల్లో యుద్ధం ప్రారంభించదు. అయినా భారత్‌ను పాక్ యుద్ధంలోకి లాగాలని కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. దానికి పోయేది ఏమీ లేదు. అందుకే తక్కువ ‘ఆడంబర’ ప్రత్యామ్నాయం ఏమిటంటే, ఎల్ఓసి అంతటా ఫిరంగి కాల్పులు జరపడం. కానీ మన వైపు పౌరులకు కూడా నష్టాలు ఉంటాయి. పైగా ఈ మొత్తం విన్యాస ప్రయోజనమే ప్రశ్నార్థకం అవుతుంది. ఏమైనప్పటికీ ఉగ్రవాదులు చొరబడతారు. ఏమైనా పాక్ కోరుకుంటున్న దిశలో ఇండియా కొట్టుకుపోకుండా జాగ్రత్త వహించాలి. బదులుగా, చాలా నైపుణ్యంతో పాక్‌ని శిక్షించడాన్ని ఎంచుకోవాలి.చాలా కాలంగా, పాకిస్తాన్ రెండు వైపులా ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడాన్ని అందరూ గుర్తించారు. పాకిస్తాన్ ను మోకరిల్లేలా చేసేవరకు సంబంధిత దేశాలు ఆంక్షలు విధించాలని డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ముఖ్యంగా ఆంక్షలనేవి పాక్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోవాలి. ఇకపై పాక్ సైన్యాధికారులు సౌకర్యవంతమైన విదేశాల పర్యటనలు చేయకుండా చూడాలి. అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి వచ్చే అన్ని బాహ్య నిధులకు అడ్డుకట్ట వేయాలి.అవును, చాలా దేశాలు పాక్‌ను శిక్షించే కార్యక్రమంలో చేరవు. ఉగ్రవాదాన్ని ఎంత ఇష్టపడకపోయినా, పాక్‌ని శిక్షించని దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటుంది. అందుకే పాక్ కోరుకోని విధంగా, దీర్ఘకాలంగా అణచివేతకు గురైన బలూచ్‌లు, పష్తూన్లకు బహిరంగ మద్దతు ప్రకటించే సమయం ఇదే కావచ్చు. ఇది పాక్ రహస్య వ్యూహాల అనుకరణ కాకూడదు. ఇది ప్రపంచాన్ని ముందుకు రావాలని పిలుపునిచ్చే బహిరంగ మద్దతుగా ఉండాలి. ఇక జరిగింది చాలు, పాక్‌కు దాని స్థాయేమిటో తెలియజెప్పాలి.తారా కార్థా వ్యాసకర్త డైరెక్టర్ (పరిశోధన), సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్(‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
కృనాల్ ఆల్‌రౌండ్ షో.. ఢిల్లీపై ప్రతీకారం తీర్చుకున్న ఆర్సీబీ
ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్బుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లి తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో విజయతీరాలకు చేర్చారు. కృనాల్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 పరుగులు చేయగా.. విరాట్ 46 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.ఆఖరిలో టిమ్ డేవిడ్(5 బంతుల్లో 19) మెరుపులు మెరిపించాడు. ఈ విజయంతో చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ చేతిలో ఎదురైన పరాభావానికి ఆర్సీబీ బదులు తీర్చుకుంది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టగా.. చమీరా ఓ వికెట్ సాధించాడు. మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది.ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టబ్స్(34),ఫాఫ్ డుప్లెసిస్(22), అభిషేక్ పోరెల్(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్ రెండు, దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో అగ్రస్దానికి చేరుకుంది. -
జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా
ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఈ విజయంలో ముంబై స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాది కీలక పాత్ర. 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. తన పేస్ బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు.బుమ్రా తన బౌలింగ్‌లో కోటాలో కేవలం 22 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా జస్ప్రీత్ రికార్డులకెక్కాడు. ముంబై ఇండియన్స్ తరపున ఇప్పటివరకు 139 మ్యాచ్‌లు ఆడిన బుమ్రా.. 174 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు ముంబై ఇండియన్స్ బౌలింగ్ కోచ్ లసిత్ మలింగ రికార్డు పేరిట ఉండేది. మలింగ 122 మ్యాచ్ ల్లో 170 వికెట్లు తీశాడు. ఇప్పుడు తాజా మ్యాచ్‌తో మలింగ రికార్డును బుమ్ బుమ్రా బ్రేక్ చేశాడు. అయితే ఐపీఎల్‌తో పాటు ఛాంపియన్స్ లీగ్ కూడా కలిపితే ముంబై తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా మలింగ కొనసాగుతున్నాడు. ఈ శ్రీలంక దిగ్గజం రెండు లీగ్‌లు కలిపి ముంబై తరపున 195 వికెట్లు పడగొట్టాడు. మలింగ తర్వాతి స్దానంలో బుమ్రా(177) ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 216 పరుగుల భారీ లక్ష్య చేధనలో లక్నో చతకలపడింది. 20 ఓవర్లో 61 పరుగులకు ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా..ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించాడు. -
మా వాళ్లు కరెక్ట్‌గా లేకే అధికారంలోకి రాలేదు: రాజాసింగ్
హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ వాళ్లు కరెక్ట్ గా లేకే అధికారంలోకి రాలేదని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. అయితే వచ్చే ఎన్నికల్లో వచ్చేది మాత్రం కచ్చితంగా బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు. ఎల్కతుర్తి సభలో కేసీఆర్ ప్రసంగించిన అనంతరం అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా స్పందించింది. దీనిలో భాగంగా మాట్లాడిన రాజాసింగ్.. ‘ సభలో కేసీఆర్ ఆడిన ప్రతి మాట అబద్ధం. పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయిలు ఇచ్చింది. తెలంగాణ అభివృద్ధి కేంద్ర నిధులతోనే జరిగింది. కేసీఆర్ ఫాంహౌస్ లో మంచిగా ఉన్నారు. మీరు అక్కడ ఉంటేనే మంచిది.కేసీఆర్ రాష్ట్రాన్ని మత్తుగా మార్చారు. తెలంగాణ అంటే బార్ అండ్ రెస్టారెంట్ గా మార్చారు. తెలంగాణ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కారుతోనే జరుగుతుంది’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సర్కార్‌కు కేసీఆర్ వార్నింగ్ -
తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా?: కేసీఆర్‌కు మంత్రుల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ మనసంతా విషాన్ని నింపుకొని ప్రసంగించారంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. ఎల్కతుర్తిలో కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర అప్పుల అంశాన్ని కేసీఆర్ ఎందుకు ప్రస్తావించలేదంటూ పొంగులేటి ప్రశ్నించారు. కాంగ్రెస్‌ను కేసీఆర్ విలన్లా చూపిస్తూ మాట్లాడారు. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనా?. కేసీఆర్ మంచి సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. అభివృద్ధి, సంక్షేమాన్ని సమంగా ముందుకు తీసుకెళ్తున్నాం’’ అని పొంగులేటి చెప్పుకొచ్చారు.‘‘కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో అసెంబ్లీకి ఎప్పుడూ రాలేదు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కాళ్లు మొక్కిన విషయం గుర్తుకు లేదా?. దొరపాలన చేసింది మీరు కాదా?. బీఆర్ఎస్కు రెండుసార్లు అధికారం ఇస్తే ఏం చేశారో ప్రజలకు తెలుసు. కేసీఆర్ కావాలనే కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. కేసీఆర్ వల్ల ధనిక తెలంగాణ.. అప్పుల రాష్ట్రంగా మారింది. వరి వస్తే ఉరి అన్నది మీరు కాదా?. సర్పంచ్‌లకు బకాయిలు పెట్టింది మీరు కాదా?’’ అంటూ పొంగులేటి ప్రశ్నాస్త్రాలు సంధించారు.‘‘అధికారం కోసం కేసీఆర్ పగటి కలలు కంటున్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. కేసీఆర్ పదేళ్లలో కలిపి లక్ష ఇళ్లు కూడా ఇవ్వలేదు. మేం నాలుగున్నర లక్షల ఇళ్లు కట్టిస్తున్నాం.’’ అని పొంగులేటి పేర్కొన్నారు.మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసీఆర్‌కు ఉందా? మంత్రి సీతక్కఒక నియంత అధికారని కోల్పోయి మాట్లాడినట్లు ఉంది కేసీఆర్ స్పీచ్. నీ కుటుంబంలో చీలికలు, పేలికలు పెరుగుతున్నాయన్న బాధ కేసీఆర్‌లో కనిపించింది. పది నెలల్లో 59,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాం. మీరెంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ బిడ్డ మంచి మంచి కార్లలో తిరుగుతుంది. మా పేద ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో తిరగకూడదా?. కేసీఆర్ అంత దరిద్రంగా పోలీసులను ఎవరు వాడుకోలేదు. 60 వేల కోట్ల కరెంట్ బిల్లుల బకాయిలను పెట్టి వెళ్లిపోయావు. ధర్నా చౌక్‌లలో కేసీఆర్ ధర్నాలు కూడా చేయనీయలేదు. కేసీఆర్ సభ దగ్గర రైతుల కాలువలను పూడ్చి సభ నిర్వహించారు. అసెంబ్లీని సొల్లు కబురు అని కేసీఆర్ అవమానించారు. మళ్లీ అసెంబ్లీకి వచ్చే అర్హత కేసీఆర్‌కు ఉందా?. అసెంబ్లీ సొల్లు కబురు అయితే నీ కొడుకు, నీ అల్లుడ్ని అసెంబ్లీకి ఎందుకు పంపిస్తున్నావు?‘విలన్’ వ్యాఖ్యలు కేసీఆర్ ఉపసంహరించుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్కాంగ్రెస్ విలన్ అంటూ చేసిన కేసీఆర్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. సోనియా గాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేరన్న విషయం కేసీఆర్‌కు తెలుసు. కేసీఆర్ సభకు జనం రాకపోతే పోలీసుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద నేపం నెట్టడం సరైనది కాదు. అగ్గిపెట్ట రాజకీయానికి ప్రాణాలర్పించిన తెలంగాణ వాళ్లకు కనీసం నీవాళ్లు అర్పించారా?. కేసీఆర్ సభకు జనం రాకపోవడం వల్లే... అర్థగంటసేపు ఆయన ప్రాంగణానికి వచ్చి కూడా వేదిక పైకి రాలేదు. -
IPL 2025: ఇదేమి ఆట బ్రో.. పంత్ నీవు ఇక మారవా? ఫ్యాన్స్ ఫైర్
ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంత్ దారుణ ప్రదర్శన కనబరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్.. చెత్త షాట్ ఆడి తన వికెట్‌ను కోల్పోయాడు. రెండు బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.ముంబై స్పిన్నర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడి తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన పంత్.. 12.22 సగటుతో కేవలం 110 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఖరీదైన ఆటగాడిగా నిలిచిన పంత్ ఆట తీరును లక్నో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియాలో పంత్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఐపీఎల్ చరిత్రలో ఇంత చెత్త ప్రదర్శనను చూడలేదంటూ నెటిజన్లు పోస్ట్‌లు చేస్తున్నారు. పంత్ నీవు ఇక మారవా? అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కాగా ఐపీఎల్-2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో కొనుగోలు చేసింది. కానీ ధరక తగ్గ న్యాయం పంత్ చేయలేకపోతున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే..ముంబై ఇండియన్స్ చేతిలో 54 పరుగుల తేడాతో లక్నో ఓటమి పాలైంది. 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లు పడగొట్టగా..ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు.Rishabh Pant, absolute garbage performance. If you have any shame, return the 27 crore.#MIvsLSG #MIvLSG pic.twitter.com/JEeboJpQWJ— Chintan (@CricketChintan) April 27, 2025 -
ఫ్రీ వైఫై వినియోగం.. ప్రభుత్వం హెచ్చరిక
ఉచితంగా వస్తుందంటే.. ఎవరు మాత్రం కాదంటారు. అయితే ఫ్రీ వైఫై మాత్రం వద్దనే చెప్పాలంటూ.. ప్రభుత్వం హెచ్చరించింది. ఇంతకీ ప్రభుత్వం ఎందుకిలా అంటోంది?, కారణాలు ఏమిటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.విమానాశ్రయాలు, కాఫీ షాపులు మొదలైన పబ్లిక్ ప్రదేశాల్లో ఫ్రీ వైఫై సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఇలాంటివి కనెక్ట్ చేసుకోవడం ఏ మాత్రం భద్రం కాదని ప్రభుత్వం వెల్లడించింది. స్కామర్లు, హ్యాకర్లు అమాయక ప్రజలను ట్రాప్ చేయడానికి ఏర్పాటు చేసిన ఓ ఉచ్చు కూడా కావచ్చని స్పష్టం చేసింది.ఫ్రీ వైఫై ఉపయోగించుకోవడం వల్ల.. ప్రైవేట్ డేటా, ఆర్థిక సమాచారానికి సంబంధించిన విషయాలు మోసగాళ్ల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇటువంటి మోసాలను అరికట్టడానికి.. డిజిటల్ భద్రతా అవగాహనను మరింత పెంచడానికి CERT-In తన 'జాగ్రూక్త దివాస్' చొరవ కింద, పబ్లిక్ Wi-Fi నెట్‌వర్క్‌ల ద్వారా లావాదేవీలు చేయకుండా పౌరులను హెచ్చరించింది.ఇదీ చదవండి: రూ.60 లక్షల ఆదాయం.. అన్నీ సమస్యలే: పోస్ట్ వైరల్సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న సమయంలో.. మోసాలు కూడా ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఏదైనా తెలియని లైక్స్ మీద లేదా అటాచ్మెంట్ల మీద ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు. ఏవైనా ఖాతాలకు స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌లను ఫిక్స్ చేసుకోవడం మంచిది. ఎప్పటికపుడు జాగ్రత్తగా ఉండాలని CERT-In పేర్కొంది. -
వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి.. నాకు బాధేస్తోంది: కోటి
గత కొన్నిరోజులుగా 'పాడుతా తీయగా' షో వివాదం నడుస్తోంది. ప్రవస్తి ఆరాధ్య అనే సింగర్.. జడ్జిలైన కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై షాకింగ్ ఆరోపణలు చేసింది. తనని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని చెప్పుకొచ్చింది. దీనిపై పలువురు సింగర్స్ తమ తమ అభిప్రాయలు వ్యక్తం చేశారు. గీతాకృష్ణ అనే దర్శకుడు కీరవాణిపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆయన్ని ఇక ఆపమని చెబుతూ సంగీత దర్శకుడు కోటి ఓ వీడియో రిలీజ్ చేశారు.'గీతాకృష్ణ.. మీరు నా ఫేవరెట్ డైరెక్టర్. అప్పట్లో కొత్త రకమైన ఆలోచనలతో సినిమాలు చేశారు. కె.విశ్వనాథ్ దగ్గర శిష్యరికం కూడా చేశారు.కానీ ఈ మధ్య మీకు కొంచెం మ్యాటర్ ఎక్కువవుతోంది. కీరవాణి, చంద్రబోస్, సునీత గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. మనందరం ఓ ఫ్యామిలీ. ఇక్కడ తప్పేం జరిగిపోలేదు. తప్పు జరిగిందా లేదా అనేది మీడియా చూసుకుంటుంది'(ఇదీ చదవండి: మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు) 'కానీ ఇలా వ్యక్తిగతంగా మనుషులపై కామెంట్స్ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే ఆలోచించండి. ప్రతి దానిలో చిన్న అవాంతరాలు వస్తుంటాయి. నేను చేసిన వాటిలోనూ వచ్చాయి. అక్కడితో మర్చిపోతారు. వాళ్లు వాళ్లు హ్యాపీగా ఉంటారు. దీనికి ఇంత రచ్చ అవసరం లేదు. దయచేసి వాళ్ల గురించి ఇలా మాట్లాడకండి. నాకు బాధేస్తోంది''ప్లీజ్.. ఇక ఈ విషయంలో ఏదీ మాట్లాడకండి. నాకు బాధగా ఉంది. ఇంకా ఏం చెప్తారో, ఏం వినాల్సి వస్తుందోనని నాకు భయమేస్తోంది' అని కోటి చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) -
‘దక్షిణ భారతంలో కూడా అధికారంలోకి వస్తాం’
విజయవాడ: దక్షిణ భారతదేశంలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. డా. బీఆర్. అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. దీనికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు మాట్లాడిన కిషన్ రెడ్డి.. ‘దక్షిణ భారతదేశంలో కూడా అధికారంలో కి వస్తాం. తమిళనాడు, తెలంగాణలో బిజెపి ప్రభుత్వాలు వస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నారు.అంబేద్కర్ ఉత్సవాలని ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో ప్రతిస్టాత్మకం గా నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ జయంతి అనేది ఏప్రిల్ 14వ తేదీనే కాకుండా 10 రోజుల పాటు దేశ వ్యాప్తంగా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. అంబేద్కర్ దళిత సామాజిక వర్గంలో జన్మించి అనేక ఒడిదుడుకులు ఎదురుకున్నారు. విద్యార్థి దశ నుంచి ఎన్నో అవమానాలకి గురయ్యారు.ఒక మేధావిగా ఆయన ఎదిగి అనేక పోరాటాలు చేశారు. బడుగు బలహీన వర్గాల్లో చైతన్యం నింపారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో అంబేద్కర్ కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ ఎంపీ గా పోటి చేస్తే ఓడించాలని నెహ్రూ విస్తృతంగా ప్రచారం చేసారు. కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పి కొట్టి పార్లమెంట్ కి పంపించేలా మేధావులు కీలక పాత్ర వహించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా కాంగ్రెస్ వ్యవహరించింది. రాజకీయ స్వలాభం కోసం ఆనాడు కాంగ్రెస్ పాలన ఉండేది. అడుగడుగునా అంబేద్కర్ ని అవమానపరిచేలా కాంగ్రెస్ చేసింది. అంబేద్కర్ ఒక మేధావి అయినప్పడికి అనేక రకాలుగా కాంగ్రెస్ అవమానపరిచింది. మొదటి సారి ప్రధానిగా మోదీ ఎన్నిక అయినప్పుడు అంబేద్కర్ కి నివాళులు అర్పించి పార్లమెంట్ లోకి అడుగుపెట్టారు. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తి తోనే బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుంది. రాజ్యాంగాన్ని మరింత శక్తీవంతంగా ఉంచాలని మోదీ ప్రభుత్వం పని చేస్తుంది. రాజ్యాంగానికి గౌరవం ఉండేలా మోదీ ప్రభుత్వం ఉంటుంది. అంబేద్కర్ అంతిమ సంస్కారం చేసిన స్థలాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాం. అంబేద్కర్ ఉన్న ప్రదేశాలని పంచ తీర్థ పేరుతో నిర్మాణం చేపట్టాం. పార్లమెంట్ లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టి గౌరవించిన ఘనత ప్రధాని మోదీది. దేశానికి సేవ చేసిన అంబేద్కర్ కి కాంగ్రెస్ భారతరత్న ఇవ్వకుండా అవమానపరిచింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ కి భారత్ రత్న ఇచ్చింది. అంబేద్కర్ సిద్ధాంతం, స్ఫూర్తి తో ప్రధాని మోదీ పని చేస్తున్నారు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
'డ్రాగన్'తో హిట్.. క్రేజీ ఛాన్స్ కొట్టేసిన కాయదు
కొన్నిసార్లు ఒక్క సినిమాతో హీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. అలా కొన్నిరోజుల క్రితం రిలీజైన 'డ్రాగన్'తో కాయదు లోహర్ స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగులో ఓ ఆఫర్ దక్కించుకున్న ఈమె ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది. (ఇదీ చదవండి: మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు) అసోంకు చెందిన కాయదు లోహర్.. 'అల్లూరి' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తమిళంలో ప్రయత్నించగా.. ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్'లో అవకాశమొచ్చింది. ఇదే మూవీతో కాయదుకు మంచి క్రేజ్ కూడా వచ్చింది.ఈ క్రమంలోనే తెలుగులో విశ్వక్ సేన్-అనుదీప్ కాంబోలో తీస్తున్న 'ఫంకీ'లో కాయదు హీరోయిన్ గా సెలెక్ట్ కాగా.. ఇప్పుడు తమిళ హీరో శింబు సరసన నటించే అవకాశం కూడా దక్కింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీస్ కూడా హిట్ అయితే ఇండస్ట్రీలో కాయదు లైఫ్ సెట్ అయిపోయినట్లే!(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) -
బుమ్ బుమ్ బుమ్రా.. లక్నోను చిత్తు చేసిన ముంబై
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇది ముంబైకి వరుసగా ఐదో విజయం కావడం గమనార్హం.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరితో పాటు నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.బుమ్ బుమ్ బుమ్రా..అనంతరం 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చేరిగాడు. నాలుగు వికెట్లు పడగొట్టి లక్నోను దెబ్బ తీశాడు. బుమ్రాతో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో రెండో స్దానానికి చేరుకుంది.చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా -
Festival: జనాల్లోకి దూసుకొచ్చిన కారు.. 9 మంది దుర్మరణం
ఒట్టవా: ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్న ఫెస్టివల్ కాస్తా ఉన్నపళంగా విషాదంగా మారిపోయింది. కెనడాలోని వాంకోవర్ సిటిలో లపూ లపూ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో కారు దూసుకొచ్చింది. ఇందులో 9 మంది దుర్మరణ పాలయ్యారు. కెనడా స్థానిక కాలమాన ప్రకారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ఫిలిపినో కమ్యూనిటీకి చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరై లపూ లపూ ఫెస్టివల్ వేడుకను చేసుకుంటుంగా ఈ దారుణం సంభవించింది. అయితే ఈ ఘటనలో 9 మంది వరకూ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. భారీ సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనకు కారణమైన కారు డ్రైవర్ ను పోలీసులో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు కెనడా పోలీసులు. అయితే దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీధుల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలకు సంబంధించిన వీడియోలు ఆవేదన భరితంగా ఉన్నాయి. Initial reports of several killed and over a dozen injured, after an SUV plowed into a closed-off street filled with people celebrating the Lapu Lapu Festival in Vancouver, Canada. pic.twitter.com/cLQQPfOMCq— OSINTdefender (@sentdefender) April 27, 2025 -
కాంగ్రెస్ సర్కార్‌కు కేసీఆర్ వార్నింగ్
సాక్షి, వరంగల్: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయ్యిందని.. ఏడాదిన్నర పాలనలో ఏం చేశారంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిలదీశారు. సంచులు నింపుడు.. మోయడంలోనే కాంగ్రెస్ పాస్ అయ్యిందంటూ మండిపడ్డారు. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టానని.. 25 ఏళ్లనాడు గులాబీ జెండా ఎగరేశాం.. ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం.. అందరూ అశ్చరపోయేలా పదేళ్లపాటు తెలంగాణను పాలించామని కేసీఆర్ అన్నారు. తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే‘‘తెలంగాణ ఉద్యమం నుంచి వెనక్కిపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా. ఆనాడు పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్ వాళ్లు.. పెదవులు మూశారు. బీఆర్ఎస్ నేతలు పదవులను త్యాగం చేశారు. ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే. ప్రజలు ప్రాణం పోసి ఊపిరి ఊదితే అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించాం. బలవంతంగా ఆనాడు తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్సే. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం. నేను ఆమరణ దీక్షకు దిగితే కాంగ్రెస్ దిగవచ్చి తెలంగాణపై ప్రకటన చేసింది’’ అని కేసీఆర్ గుర్తు చేశారు.డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు..‘‘పదేళ్ల పాలనలో తెలంగాణను అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపాం. తెలంగాణ అంటే ఒక్కప్పుడు వెనకబడిన ప్రాంతం. మన పాలనలో రూ.90 వేలు ఉన్న తలసరి ఆదాయం మూడున్నర లక్షలకు పెంచుకున్నాం. మూడేళ్లలో కాళేశ్వరం కట్టుకున్నాం. పడావు భూములను పంటపొలాలుగా మార్చుకున్నాం. పంజాబ్‌ను తలదన్నే పంటలను పండించుకున్నాం. రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం. గోల్మాల్ చేయడంలో అబద్ధాలను చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినవారు లేరు. మాట్లాడితే కేసీఆర్‌పై నిందులు వేస్తున్నారు. ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని.. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు’’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు.ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు..‘‘కల్యాణ లక్ష్మికి కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తున్నారు.. మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామన్నారు. పెన్షన్లు పెంచుతామన్నారు.. స్కూటీలు కొనిస్తామన్నారు.. జాబ్ కార్డులు ఇస్తామన్నారు.. ఇచ్చారా?. ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన.. ఎన్ని హామీలైనా అమలు చేసి చూపిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ల అందరిపైనా ఒట్లు వేశారు. మహిళలే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దని అంటున్నారు. ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు. మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు.. అప్పు పుట్టడం లేదని.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు.. పరిపాలన చేయడం రాక రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు. తెలంగాణను నంబర్‌వన్ స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు. హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు’’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేవారు.ఇక నుంచి నేను కూడా ఊరుకోను..యూనివర్శిటీ భూములను ఎవరైనా అమ్ముతారా?. కేసీఆర్ కిట్స్‌ను ఎందుకు బంద్ చేశారు? ఎవరైనా వాటిని ఆపుతారా?. ఇవాళ హైదరాబాద్ యూనివర్శిటీ రేపు ఉస్మానియా యూనివర్శిటీ అమ్మేస్తారు. వైఎస్సార్ తెచ్చిన ఆరోగ్యశ్రీని కొనసాగించాలని చెప్పాను. ఆరోగ్యశ్రీ పథకం మంచిది.. కొనసాగించాలని నేను సీఎం అయ్యాక చెప్పాను. ఇప్పుడున్న సీఎం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామంటున్నారు. ఇక నుంచి నేను కూడా ఊరుకోను. ఎక్కడ ఎవరు బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టినా న్యాయస్థానాల్లో పోరాడదాం. కమీషన్లు అడుతున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు. ఈ సోది కబుర్లు వినడానికి నేను అసెంబ్లీకి రావాలా?’’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలి..ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలి. మావోయిస్టులతో చర్చలు జరపాలి. మావోయిస్టులను ఏరిపారేస్తామనడం సరికాదు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. బీఆర్ఎస్ శ్రేణులు ధైర్యంగా ఉండాలి. తెలంగాణను మళ్లీ అద్భుతంగా చేసుకుందాం. ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన మాకు లేదు. కాంగ్రెస్ సంగతేంటో ప్రజలే తేలుస్తారు. పోలీసులు ఎందుకు అత్యుత్సాహం చేస్తున్నారు. పోలీసులు డైరీల్లో రాసుకోండి. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ రాకుండా ఎవరు కూడా ఆపలేరు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు?. మీ డ్యూటీ మీరు చేయండి’’ అంటూ కేసీఆర్ హెచ్చరించారు. -
మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మన దేశానికి చెందిన 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో అప్పటికే ఇక్కడికి టూర్ కోసం వచ్చినవాళ్లు, త్వరలో వెళ్దామని అనుకున్నవాళ్లు వెనకడుగు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ ప్రముఖ నటుడు పహల్గామ్ వెళ్లారు.బాలీవుడ్ సీనియర్ నటుడు అతుల్ కులకర్ణి.. ఆదివారం పహల్గామ్ వెళ్లారు. అందరూ కశ్మీర్ తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు. తాను ధైర్యంగా వచ్చానని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఇన్ స్టాలో ఫొటో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి) 'ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ భయం కంటే ధైర్యం ఎక్కువ. ఇది హిందుస్థాన్ గడ్డ. ఇక్కడ ద్వేషాన్ని ప్రేమ ఓడిస్తుంది. కశ్మీర్ పోదాం పదండి. సింధు, జీలం నదుల్ని సందర్శిద్దాం పదండి. నేను వచ్చాను. మీరు కూడా రండి' అని అతుల్ కులకర్ణి చెప్పుకొచ్చారు.జయం మనదేరా, ఆంధ్రావాలా, చంటి, గౌరీ, లీలా మహల్ సెంటర్, పంజా, ద ఘాజీ, మజిలీ, వైల్డ్ డాగ్ తదితర తెలుగు సినిమాల్లో ఈయన నటించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్, ఒరియా, మరాఠీ భాషల్లో తీసిన పలు చిత్రాల్లోనూ ఈయన నటించడం విశేషం.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) View this post on Instagram A post shared by Atul Kulkarni (@atulkulkarni_official) -
IPL 2025: చరిత్ర సృష్టించిన సూర్యకుమార్.. తొలి భారత ప్లేయర్‌గా
ఐపీఎల్లో టీమిండియా టీ20 కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 4,000 పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత ప్లేయర్‌గా సూర్యకుమార్ రికార్డులకెక్కాడు.ఐపీఎల్-2025లో ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద సూర్య ఈ ఫీట్ సాధించాడు. సూర్య ఈ మైలు రాయిని కేవలం 2714 బంతుల్లోనే అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సురేష్ రైనా పేరిట ఉండేది.రైనా 2,881 బంతుల్లో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్‌లో రైనాను సూర్య అధిగమించాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన జాబితాలో సూర్య మూడో స్దానంలో నిలిచాడు. తొలి స్దానంలో వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం క్రిస్ గేల్(2653 బంతులు) ఉండగా.. రెండో స్దానంలో ఏబీ డివిలియర్స్(2658) ఉన్నాడు. అదేవిధంగా సూర్య మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు.ఐపీఎల్లో వరుసగా 25 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రాబిన్ ఉతప్ప సరసన సూర్య నిలిచాడు. ఉతప్ప ఐపీఎల్లో వరుసగా 10 సార్లు 25 ప్లస్ పరుగులు చేయగా.. సూర్య కూడా సరిగ్గా వరుసగా 10 సార్లు 25 ప్లస్ రన్స్ చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్య కేవలం 26 బంతుల్లోనే 54 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సూర్య.. 427 పరుగులతో లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు. అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు. -
రూ.60 లక్షల ఆదాయం: అన్నీ సమస్యలే..
అభివృద్ధి చెందుతున్న భారతదేశంలోని ప్రధాన నగరాల్లో.. నివాసం చాలా కష్టతరమని గతంలో కొంతమంది పేర్కొన్నారు. ఇప్పుడు రూ. 60 లక్షల వార్షిక ఆదాయం వచ్చే కుటుంబానికి చెందిన బెంగళూరు వ్యక్తి దేశంలో నివసించడం చాలా ఖరీదైనదిగా అయిపోయిందని అన్నారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరిన్ని వివరాలు ఇక్కడ ఈ కథనంలో చూసేద్దాం..నేను హోరేమావు (బెంగళూరు)లో నివసిస్తున్నాను. మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఆఫీసుకు చేరుకోవడానికి మూడు కిలోమీటర్లు ప్రయాణించాలి.. ఈ ప్రయాణం నాకు సుమారు 40 నిమిషాలు పడుతుంది. ఆఫీసుకు చేరుకునే సమయానికి నీరసించిపోతాను. ప్రతి రోడ్డులోనూ అడ్డంకులు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయో?, ప్రాజెక్టులు ప్రారంభమవుతాయి కానీ ఎప్పటికీ పూర్తి కావు. జవాబుదారీతనం ఎక్కడ ఉందని అన్నారు.బెంగళూరు రోడ్డు పన్ను దేశంలోనే అత్యధికంగా ఉంది. ఢిల్లీలో చెల్లించే దానికంటే నేను రూ. 2.25 లక్షలు ఎక్కువగా రోడ్డు పన్ను చెల్లించాను. దానికి ప్రతిఫలంగా నాకు ఏమి లభిస్తుంది? రోడ్లకు క్రేటర్లు, ట్రాఫిక్ కష్టాలు, నిరంతర నిర్మాణాలు. ఇది పూర్తిగా పగటిపూట జరుగుతున్న దోపిడీ. మనం భారీగా చెల్లిస్తున్నాము, దీని ప్రతిఫలం శూన్యం.కెనడా, జర్మనీ వంటి దేశాలలో..మన ఆదాయంలో 30-40% పన్నుల రూపంలోకి వెళుతుంది. ప్రతిదానిపై GST కూడా. ఇవన్నీ చెల్లించినా మనకు ఏమీ లభించదు. ఉచిత ఆరోగ్య సంరక్షణ లేదు, మంచి విద్య లేదు, మంచి నీరు కూడా లేదు. ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ ఆసుపత్రులకు మనం విడిగా చెల్లించాలి. నీటి ట్యాంకర్లకు అదనం. 30-40% పన్ను చెల్లిస్తూ.. ఇంకా నీరు కొనాల్సిన పరిస్థితి ఉంది. కెనడా లేదా జర్మనీ వంటి దేశాలలో, నేను ఇదే పన్ను చెల్లిస్తే.. ఉచిత ఆరోగ్య సంరక్షణ, మంచి విద్య, మంచి మౌలిక సదుపాయాలు లభిస్తాయి.జీవన నాణ్యత కూడా విచారకరంగా ఉంది. ప్రతిచోటా దుమ్ము, శబ్దం.. వీటివల్ల ఒత్తిడి, కోపం. ప్రశాంతంగా నడవలేము, స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేము. సాయంత్రం 7 గంటల తర్వాత నా భార్యను ఒంటరిగా బయటకు పంపడం సురక్షితం కాదు. దాదాపు ప్రతి ప్రభుత్వ శాఖ అవినీతిమయమైంది. లంచం ఇవ్వకపోతే పని జరగదు.పరిస్థితులు మెరుగుపడతాయా..ప్రతిదీ చాలా ఖరీదైనదిగా మారుతోంది. ఈ సంవత్సరం అద్దె 10% పెరుగుతోంది. స్కూల్ ఫీజులు అంతకు మించే ఉన్నాయి. మా ఇంటి ఆదాయం కంటే ఖర్చులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. నేను నిజంగా ఈ దేశానికి తోడ్పడాలనుకుంటున్నాను. ఇక్కడే ఉండి ఏదైనా చేయాలనుకుంటున్నాను. కానీ ఈ వ్యవస్థ ఏ మాత్రం బాగాలేదు. మనం పన్ను చెల్లించే ప్రతి రూపాయి రాజకీయ నాయకుల ఖజానా నింపడానికి వెళుతుందనే అభిప్రాయం నాకు ఏర్పడింది.నేను నిజాయితీగా అడుగుతున్నాను. ఇక్కడ పరిస్థితులు మెరుగుపడతాయని కొంత ఆశ పెట్టుకోవచ్చా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడు.ఇదీ చదవండి: టైటానిక్ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికిందిదీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. మీకు వేరే ఆప్షన్ ఉంటే.. వేరే దేశంలో సెటిల్ అవ్వండి. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు ఎప్పటికీ మారవని ఒకరు అన్నారు. ఇవన్నీ మారవు.. మనం ఎప్పటికీ అంతం కాని లూప్‌లో జీవిస్తున్నామని మరొకరు అన్నారు. ఇలా ఎవరికీ తోచిన రీతిలో వారు స్పందిస్తున్నారు. -
‘మీ భార్య పాకిస్తాన్ జీతం తీసుకోవట్లేదా?’
దిస్పూర్: అస్సాం రాష్ట్రంలో అక్రమ బొగ్గు మైనింగ్ కు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేల్(ఈడీ) దాడులు చేస్తున్న వేళ.. ఆ రాష్ట్ర సీఎం హిమాంత బిశ్వా, కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్‌ల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇది రాష్ట్ర అంశాలను వదిలి వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది.అక్రమ బొగ్గు మైనింగ్ మీ కనుసన్నల్లోనే..‘అస్సాం బొగ్గు మైనింగ్ లో ఈడీ రూ. 1.58 కోట్లు సీజ్ చేసింది. తప్పుడు పత్రాలతో 1200 టన్నుల అక్రమ బొగ్గు మైనింగ్ ప్రతీరోజూ జరుగుతుంది. ఇదంతా సీఎం హిమాంత బిశ్వా కనుసన్నల్లోనే జరుగుతుంది’ అని ఎక్స్ లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ.మీ పిల్లలకు భారత పౌరసత్వం లేదు.. ఎందుకు?‘ ఏం మాట్లాడుతున్నావ్ గొగోయ్. మీ భార్య ఎలిజిబెత్ కోల్ బర్న్ గొగోయ్ పాకిస్తాన్ ఎన్జీవో సంస్థ నుంచి శాలరీ తీసుకోవడం నిజం కాదా.. మీ పిల్లలకు భారత పౌరసత్వం కూడా లేదు’ అంటూ మండిపడ్డారు సీఎం హిమాంత బిశ్వా శర్మ.దేనికైనా రెడీదీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ తన భార్య పాకిస్తాన్ నుంచి జీతం తీసుకుంటుందని, పిల్లలకు భారత పౌరసత్వం లేదనే వ్యాఖ్యలపై తాను బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఇలా ఇరువురి నేతల మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం నడుస్తోంది. ⸻Questions for the Hon’ble Member of Parliament from the Congress Party:1.Did you visit Pakistan for a continuous period of 15 days? If so, could you kindly clarify the purpose of your visit?https://t.co/a83u47Zq6L it true that your wife continues to receive a salary from a…— Himanta Biswa Sarma (@himantabiswa) April 27, 2025 Questions for the Hon’ble Chief Minister of Assam1) Will you resign if you fail to prove your allegations of me and my wife being agents of an enemy country ?2) Will you take questions on your own children and wife ?3) Will the state police arrest those linked to coal mafia… https://t.co/KEhs4h9M1R— Gaurav Gogoi (@GauravGogoiAsm) April 27, 2025 -
IPL 2025 DC vs RCB: ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ..
IPL 2025 RCB vs DC Live Updates: ఢిల్లీని చిత్తు చేసిన ఆర్సీబీ..ఐపీఎల్-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో అద్బుత విజయాన్ని అందుకుంది. ఈ మెగా టోర్నీలో బాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 163 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో చేధించింది.26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీని కృనాల్ పాండ్యా, విరాట్ కోహ్లి తమ అద్బుత ఇన్నింగ్స్‌లతో విజయతీరాలకు చేర్చారు. కృనాల్ 46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 73 పరుగులు చేయగా.. విరాట్ 46 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేశాడు.ఆఖరిలో టిమ్ డేవిడ్(5 బంతుల్లో 19) మెరుపులు మెరిపించాడు. విరాట్ కోహ్లి ఔట్..విరాట్ కోహ్లి(51) రూపంలో ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. చమీరా బౌలింగ్‌లో కోహ్లి ఔటయ్యాడు. ఆర్సీబీ విజయానికి 12 బంతుల్లో 17 పరుగులు కావాలి.విజయం దిశగా ఆర్సీబీ..16 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి 24 బంతుల్లో 38 పరుగులు కావాలి. క్రీజులో కోహ్లి(49), కృనాల్ పాండ్యా(56) ఉన్నారు.తిరిగి పుంజుకున్న ఆర్సీబీ..ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ తిరిగి పుంజుకుంది. విరాట్ కోహ్లి(28), కృనాల్ పాండ్యా(17) ఆర్సీబీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 11 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.అక్షర్ ఆన్ ఫైర్.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన అక్షర్ పటేల్ బౌలింగ్‌లో జాకబ్ బెతల్(12), పడిక్కల్(0) ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ రెండు వికెట్ల నష్టానికి 26 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లి(8), పాటిదార్(1) ఉన్నారు.రాణించిన ఢిల్లీ బ్యాటర్లు.. ఆర్సీబీ టార్గెట్ ఎంతంటే?అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్నమ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లు కాస్త తడబడ్డారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కేఎల్ రాహుల్(41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. స్టబ్స్(34),ఫాఫ్ డుప్లెసిస్(22), అభిషేక్ పోరెల్(28) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. హాజిల్‌వుడ్ రెండు, దయాల్, పాండ్యా తలా వికెట్ సాధించారు.ఢిల్లీ నాలుగో వికెట్ డౌన్..ఢిల్లీ క్యాపిటల్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన అక్షర్ పటేల్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(34), స్టబ్స్(3) ఉన్నారు.ఢిల్లీ మూడో వికెట్ డౌన్..ఫాఫ్ డుప్లెసిస్ రూపంలో ఢిల్లీ మూడో వికెట్ కోల్పోయింది. 22 పరుగులు చేసిన డుప్లెసిస్.. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 13 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ మూడు వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్(26), అక్షర్ పటేల్(15) ఉన్నారు.9 ఓవర్లకు ఢిల్లీ స్కోర్: 69/29 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. క్రీజులో డుప్లెసిస్(21), కేఎల్ రాహుల్(14) ఉన్నారు.ఢిల్లీ రెండో వికెట్ డౌన్..45 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ రెండో వికెట్ కోల్పోయింది. 4 పరుగులు చేసిన కరుణ్ నాయర్.. యశ్‌దయాల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.ఢిల్లీ తొలి వికెట్ డౌన్..అభిషేక్ పోరెల్ రూపంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన పోరెల్.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 4 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. దూకుడుగా ఆడుతున్న ఢిల్లీ..టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ దూకుడుగా ఆడుతోంది. మూడు ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. క్రీజులో అభిషేక్ పోరెల్(28), ఫాఫ్ డుప్లెసిస్(4) ఉన్నారు.ఐపీఎల్-2025లో కీలక పోరుకు రంగం సిద్దమైంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు ఆర్సీబీ స్టార్ ప్లేయర్ ఫిల్ సాల్ట్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో జాకబ్ బెతల్ జట్టులోకి వచ్చాడు. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి ఫాఫ్ డుప్లెసిస్ తిరిగొచ్చాడు.తుది జట్లుఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, దుష్మంత చమీరా, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లి, జాకబ్ బెథెల్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాల్ -
అక్కాచెల్లిలా సితార-నమ్రత.. చిన్న పాపతో శ్రీలీల
శేఖర్ మాస్టర్ తో అనసూయ ఫన్నీ పోజులుసితారకు అక్కలా అనిపిస్తున్న తల్లి నమ్రతపట్టుచీరలో ముచ్చటైన నవ్వుతో మీనాక్షి చౌదరిబంధువుల పాపతో శ్రీలీల ముద్దు మురిపెంచీరలో తెగ సిగ్గుపడిపోతున్న పూజా హెగ్డేజలకన్య తరహా డ్రస్సులో రకుల్ ప్రీత్ అందాల జాతరటామ్ బాయ్ లా మారిపోయిన రష్మిక మందన్నా View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ketika (@ketikasharma) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by HT City Showstoppers (@htcityshowstoppers) View this post on Instagram A post shared by Dhanashree Verma (@dhanashree9) View this post on Instagram A post shared by Aishwarya Rajesh (@aishwaryarajessh) View this post on Instagram A post shared by Megha Akash (@meghaakash) View this post on Instagram A post shared by Simran Choudhary (@simranchoudhary) View this post on Instagram A post shared by Hariprriya Simha (@iamhariprriya) -
సీఎం రేవంత్‌తో శాంతి చర్చల కమిటీ నేతల సమావేశం
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ తో వారు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ తో బేటీ అయిన వారిలో జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గా ప్రసాద్, జంపన్న, రవిచందర్ లు ఉన్నారు. మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులపై కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని సీఎం రేవంత్ ను వారు కోరారు. ఈ మేరకు సీఎం రేవంత్ కు వినతి పత్రం అందజేశారు శాంతి చర్చల కమిటీ నేతలు.మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాందీనిపై సీఎం రేవంత్ వారితో మాట్లాడుతూ.. ‘నక్సలిజాన్ని మా ప్రభుత్వం సామాజిక కోణంలో మాత్రమే చూస్తుంది తప్ప శాంతి భద్రతల అంశంగా పరిగణించదు. గతంలో నక్సలైట్ల తో చర్చలు జరిపిన అనుభవం సీనియర్ నేత జానారెడ్డికి ఉంది.ఈ అంశంపై సీనియర్ నేత జానారెడ్డి సలహాలు , సూచనలు తీసుకుంటాం. మంత్రులతో చర్చించి ఒక నిర్ణయాన్ని తీసుకుంటాం’ అని తెలిపారు.కాగా, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగుతోంది. ఐదో రోజు కూంబింగ్‌లో భాగంగా మావోయిస్టులకు భారీ షాక్ తగిలింది. భద్రతా బలగాల ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్‌వైపు భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు తెలుస్తోంది.గత కొంతకాలం నుంచి మావోయిస్టుల, కేంద్ర ప్రభుత్వం మధ్య శాంతి చర్చలు జరగాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపి మావోయిస్టులో శాంతి చర్చలు జరపాలని ఏఐటీయూసీ కోరుతోంది. కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టులు శాంతి చర్చలు జరుపుకోవాలని భేషరతుగా ఎదురు కాల్పులు విరమించుకోవాలనేది శాంతి చర్చల కమిటీ నేతల విన్నపం. అయితే తాజాగా మావోయిస్టులు.. ఈ మేరకు లేఖ రాశారు. తమతో శాంతి చర్చలు జరపడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. అయితే ఈ లేఖ రాసిన మరుసటి రోజు భారీ సంఖ్యలో మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందారు. -
తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కొత్త సీఎస్‌గా రామకృష్ణారావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్నారు. ఈ నెలాఖరుతో ప్రస్తుత సీఎస్ శాంతికుమారి పదవీకాలం ముగియనుంది. ఈ నెల 30న ఆమె రిటైర్ కానున్నారు. ప్రస్తుత సీఎస్ పదవీకాలం పొడిగిస్తారని చర్చ సాగింది.. కానీ ప్రభుత్వం.. కొత్త సీఎస్‌గా రామకృష్ణారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తెలంగాణలో భారీగా ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.ఫైనాన్స్ కమిషన్ సెక్రటరీగా స్మితా సబర్వాల్గుడ్ గవర్నెన్స్ వైస్ ఛైర్మన్‌గా శశాంక్ గోయల్మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ సెకట్రరీగా టీకే శ్రీదేవిజీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆర్వి కర్ణన్యాదగిరిగుట్ట ఈవోగా ఎస్.వెంకట్రావుపరిశ్రమలు, పెట్టుబడుల సెల్ సీఈవోగా జయష్ రంజన్ప్యూచర్ సిటీ కమిషనర్‌గా శశాంకకార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా దాన కిషోర్జెన్కో సీఎండీగా హరీష్హెల్త్ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణపరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్యకార్యదర్శిగా సంజయ్ కుమార్పట్టణాభివృద్ధి కార్యదర్శిగా ఇలంబర్తిరాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సెక్రటరీ, సీఈవోగా నిఖిలసెర్ప్ అదనపు సీఈవోగా పి. కాత్యాయనీదేవిఇండస్ట్రీ, ఇన్వెస్టిమెంట్ సెల్ అదనపు సీఈవోగా ఈవీ నర్సింహారెడ్డిజీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‌గా హేమంత్‌సహదేవ్ రావుటీజీఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఫణీంద్రారెడ్డిపంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ జాయింట్ కమిషనర్‌గా కధిరవన్హైదరాబాద్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా విద్యాసాగర్హెచ్ఎండీఏ సెక్రటరీగా ఉపేందర్ రెడ్డి -
'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి
బాహుబలి 2 సినిమా చూశారా? అందులో కుంతల రాజ్యానికి అనుష్క అలియాస్ దేవసేన యువరాణిగా ఉంటుంది. ఆమెకు వదినగా చేసిన నటి కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఆమెనే ఆశ్రిత వేమగంటి. చూస్తే వయసు మళ్లినట్లు కనిపిస్తుంది కానీ ఈ మూవీ చేసేటప్పటికీ ఆమెకు 27 ఏళ్లే. స్వయానా ఆమెనే ఈ విషయాన్ని బయటపెట్టింది. ఇంతకీ ఏం చెప్పిందంటే?'బాహుబలి సినిమా చేసేటప్పటికి నా వయసు 27 ఏళ్లే. కానీ కాస్త పెద్దదానిలా చూపించారు. దీంతో ఇప్పటికీ ఎవరైనా నన్ను కలిస్తే మీరు బయట చాలా యంగ్ గా ఉన్నారని అంటుంటారు. అవును ఇదే నేను అని వాళ్లతో చెబుతుంటాను. చాలామంది నన్ను స్క్రీన్ పై చూసి నాది పెద్ద వయసు అనుకున్నారు. ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడేసుకుంటున్నారు'(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) 'ఇలా కాస్త ప్లస్ సైజులో ఉండటం వల్ల నాకు నచ్చిన పాత్రలు దాదాపు నేను చేయలేను. ఎందుకంటే ప్లస్ సైజులో ఉంటే గౌరవప్రదమైన రోల్స్ కోసం మాత్రమే తీసుకుంటారు. సదరు దర్శకులకు నా నిజమైన వయసు గురించి చెప్తే.. పాత్రకు వయసు ఎక్కువున్నా సరే చాలా పవర్ ఫుల్ అదీ ఇదీ అని చెప్పి నన్ను కన్విన్స్ చేసేందుకు ప్రయత్నిస్తారు' అని ఆశ్రిత చెప్పుకొచ్చింది.స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఈమె.. బాహుబలి 2 సినిమాతో నటిగా కెరీర్ ప్రారంభించింది. తర్వాత మహర్షి, MCA, క్రాక్, డియర్ కామ్రేడ్, యాత్ర, యానిమల్ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం చిరంజీవి 'విశ్వంభర'లో కీలక పాత్ర చేస్తోంది.(ఇదీ చదవండి: సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్) -
సీఎం సార్.. మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’
బెంగళూరు: పాకిస్తాన్‌తో యుద్ధం చేయాల్సిన అవసరం ఇప్పుడు లేదని. భారత్ శాంతిప్రియ దేశం. కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడానికి దేశ అంతర్గత భద్రత, ఇంటెలిజెన్స్ శాఖల వైఫల్యమే కారణమని సిద్దరామయ్య ఆరోపించారు. వేలాది మంది పర్యాటకులు సంచరించే స్థలంలో వారికి తగిన భద్రతను కల్పించాల్సిందన్నారు. ఆ భద్రత లేనందునే ఈ ఘోరం జరిగిందన్నారు. భద్రత ఉందనుకొని ప్రజలు కశ్మీరుకు వెళ్లి మృత్యువాత పడ్డారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా పోయిన ప్రాణాలను వెనక్కు తెచ్చివ్వగలరా అని ప్రధాని మోదీని విమర్శించారు. సిద్ధరామయ్య.మీరు నిజంగా ‘పాకిస్తాన్ రత్న’దీనిపై కర్ణాటక బీజేపీ తీవ్రంగా మండిపడింది. పాకిస్తాన్ లో , పాకిస్తాన్ బోర్డర్ లో సిద్ధరామయ్య పేరు మారుమ్రోగుతోంది. ‘ మీరు పాకిస్తాన్ రత్న’ కర్ణాటక బీజేపీ ధ్వజమెత్తింది. మన దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గురించి ప్రస్తావించిన బీజేపీ చీఫ్ బీవై విజయేంద్రన్... పాకిస్తాన్ కు అనుకూలంగా సింధు జల ఒప్పందంపై సంతకం చేసినప్పుడు పాకిస్తాన్ చాలా సంతోషం ఉంది. కాబట్టే అప్పుడు రావల్పిండి వీధ/ల్లో నెహ్రూను ఓపెన్ జీప్ లో తీసుకెళ్లారు. పాకిస్తాన్ లో ఓపెన్ జీప్ లో తిప్పబడే భారత దేశ తదుపరి రాజకీయ నేత మీరు అవుతారా సిద్ధరామయ్య అవుతారా? అని ప్రశ్నించారు బీజేపీ చీఫ్‌ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అంటూ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యురప్ప విమర్శించారు. ‘ మనదేశం అంతా ఒక్కటిగా ఉండాల్సిన సమయంలో ఈ తరహ మాటాలేమిటి.. అసలు వాస్తవ పరిస్థితులు ఏమిటో అర్ధం చేసుకోవాలి. మీకు సీఎంగా ఇచ్చే ఫేర్ వెల్ పార్టీ కాదు ఇది. మీ వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమే. మీరు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని డిమాండ్ చేశారు యడ్యురప్ప. -
INDw Vs SLw: శ్రీలంకను చిత్తు చేసిన టీమిండియా..
శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఆదివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 39 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ దిగిన శ్రీలంక 38.1 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఇండియన్ స్పిన్నర్ స్నేహ్ రాణా మూడు వికెట్లు పడగొట్టి లంక పతనాన్ని శాసించింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, నల్లపు రెడ్డి చరణి తలా రెండు వికెట్లు సాధించారు. లంక బ్యాటర్లలో హసనీ పెరీరా(30) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కవిషా దిల్హారి(25), సంజీవనీ(22) రాణించారు. కెప్టెన్ ఆతపట్టు(7)తో సహా మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అనంతరం 148 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 29.4 ఓవర్లలో చేధించింది.భారత బ్యాటర్లలో ప్రతీక రావల్(50 నాటౌట్) హాఫ్ సెంచరీతో మెరవగా.. మంధాన(43), డియోల్(48 నాటౌట్) రాణించారు. శ్రీలంక బౌలర్లలో రణవీర ఒక్క వికెట్ సాధించారు. టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 29న కొలంబో వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.చదవండి: IPL 2025: ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ -
టైటానిక్ మృత్యుంజయుడు రాసిన లేఖ.. రూ.3 కోట్లు పలికింది
టైటానిక్ షిప్ మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు ఒక ప్రయాణికుడు (కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ) రాసిన లేఖ యూకేలో జరిగిన వేలంలో రికార్డు స్థాయిలో.. సుమారు రూ. 3.4 కోట్లకు అమ్ముడైంది. విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ నిర్వహించిన వేలంలో దీనిని విక్రయించారు.టైటానిక్ ఒక మంచుకొండను ఢీకొని ఉత్తర అట్లాంటిక్ మంచు నీటిలో మునిగిపోవడానికి కొన్ని రోజుల ముందు 'కల్నల్ ఆర్చిబాల్డ్ గ్రేసీ' రాసిన ఈ లేఖ.. 1912 ఏప్రిల్ 10న సౌతాంప్టన్ నుంచి రాసినట్లు తెలుస్తోంది. ఇందులో "ఇది మంచి షిప్, కానీ నేను దీనిపై తీర్పు చెప్పే ముందు నా ప్రయాణాలు ముగిసే వరకు వేచి ఉండాలి" అని ఉంది.1912 ఏప్రిల్ 15 తెల్లవారుజామున టైటానిక్ ఒక మంచుకొండను ఢీకొని మునిగిపోయిన తరువాత సుమారు 1500 మందికి పైగా మరణించారు. అయితే ఈ ప్రమాదంలో బతికి బయటపడిన అతి తక్కువ మందిలో గ్రేసీ ఒకరు. 1913లో ఈయన మరణించిన తరువాత.. ప్రచురించబడిన తన 'ది ట్రూత్ ఎబౌట్ ది టైటానిక్' పుస్తకంలో తాను తప్పించుకున్న విషయాన్ని వివరించాడు.ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ సమయంలో కాలేయ వ్యాధి: ఇప్పుడు ఓ కంపెనీ అధినేత్రి..ఆ పుస్తకంలో.. ఓడ మునిగిపోయిన తర్వాత, మంచు నీటిలో బోల్తా పడిన లైఫ్ బోట్‌ను ఎక్కి తాను ఎలా బయటపడ్డాడో వివరించాడు. మొదట లైఫ్ బోట్ చేరుకున్న వారిలో సగానికి పైగా అలసట లేదా చలి కారణంగా మరణించారని ఆయన రాశారు.కల్నల్ గ్రేసీ ఆ విపత్తు నుంచి బయటపడినప్పటికీ, అతితక్కువ ఉష్ణోగ్రత కారణంగా.. గాయాల వల్ల ఆరోగ్యం పాడైంది. ఆ తరువాత డయాబెటిస్ సమస్యలతో.. డిసెంబర్ 1912లో మరణించారు. అయితే ఆయన మరణానంతరం ఈ లేఖ భారీ మొత్తానికి అమ్ముడైంది. -
ఇల్లు తుడిచిన హీరో.. ఎవరో తెలుసా?
సండే వచ్చిందంటే ఎవరైనా సరే విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు. లేదా జాలీగా ఎక్కడికైనా వెళ్లి రావాలనుకుంటారు. కుదిరితే పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. కానీ ఇక్కడ కనిపిస్తున్న హీరో మాత్రం తన ఇల్లు తుడిచే పనిలో పడ్డాడు. తమిళ హీరో రవి మోహన్ (Ravi Mohan) ఇంటిని శుభ్రం చేస్తున్న వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో యాడ్ చేశాడు. శుభ్రంగా ఒకటికి రెండుసార్లు ఫ్లోర్ తుడుస్తున్నాడు. 'సొంతంగా ఇంటిని శుభ్రం చేసుకోవడమే ఈరోజు నా పని. జయం సినిమాతో హిట్అదేంటోకానీ ఈ పని చేస్తుంటే నాకు సంతోషంగా అనిపిస్తోంది' అని రాసుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు మీరు గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు. రవి మోహన్.. బావ బావమరిది, పల్నాటి పౌరుషం వంటి తెలుగు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. జయం (తెలుగు జయం రీమక్) అనే తమిళ సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈయన పేరు జయం రవిగా స్థిరపడిపోయింది. తమిళంలో హీరోగా..దాస్, ఇదయ తిరుదన్, దీపావళి, పెరణ్మనై, ఎంగేయుమ్ కాదల్, ఆది భగవాన్, రోమియో జూలియట్, మిరుథన్, బోగన్, టిక్ టిక్ టిక్, భూమి, పొన్నియన్ సెల్వన్, బ్రదర్, భూలోహం, కాదలిక్క నేరమిళ్లై వంటి పలు సినిమాలు చేశాడు. ప్రస్తుతం అతడి చేతిలో కరాటే బాబు, పరాశక్తి, జీని, తని ఒరువన్ చిత్రాలున్నాయి.విడాకులు?ఇదిలా ఉంటే రవి.. నిర్మాత సుజాత విజయకుమార్ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఆరవ్, అయాన్ అని ఇద్దరు కుమారులు సంతానం. రవి- ఆర్తి గతేడాది విడిపోయారు. విడాకులకు సైతం దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు కొన్నేళ్లుగా జయం రవిగా స్థిరపడిపోయిన ఆయన.. తనను రవి అని మాత్రమే పిలవాలని కోరాడు.చదవండి: నన్ను పెళ్లి చేసుకుంటావా? స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు -
‘హిట్’ డైరెక్టర్‌తో నాగార్జున కొత్త సినిమా
‘నా సామిరంగ’ సినిమా తర్వాత నాగార్జున హీరోగా నటించనున్న చిత్రంపై ఇప్పటివరకూ ఎలాంటి స్పష్టత లేదు. గత ఏడాది సంక్రాంతికి (జనవరి 14) విడుదలైన ‘నా సామిరంగ’ చిత్రం హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం నాగార్జున హీరోగా ఏ సినిమానూ సెట్స్‌లో లేదు కానీ, రజనీకాంత్ ‘కూలీ’ చిత్రంతో పాటు ధనుష్‌తో కలిసి ‘కుబేర’ సినిమాలో నటిస్తున్నారు. కాగా సోలో హీరోగా చేసేందుకు పలువురు దర్శకులు చెప్పిన కథలు విన్నప్పటికీ అధికారికంగా ఎవరికీ పచ్చజెండా ఊపలేదు ఆయన. ఇదిలా ఉంటే... ‘హిట్, హిట్ 2, సైంధవ్’ తదితర చిత్రాల ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయనున్నారనే టాక్ తాజాగా తెరపైకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుందని భోగట్టా. గతంలో నాగార్జునకి వినిపించిన ఓ కథకి మరిన్ని మార్పులూ చేర్పులూ చేసి, తాజాగా ఫైనల్ స్క్రిప్ట్‌ని వినిపించారట శైలేష్. ఈ కథ నాగార్జునకి నచ్చడంతో ఓకే చెప్పారట. బీహార్ రాష్ట్రంలో జరిగిన ఓ హత్య ఘటన నేపథ్యంలో ఈ కథ సాగుతుందని టాక్. నాగార్జున పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండేలా శైలేష్ స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి... నాగార్జున సోలో హీరోగా తెరకెక్కనున్న చిత్రానికి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి. ఇక నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ మే 1న విడుదల కానుంది. -
ముంబై ఓపెనర్ విధ్వంసం.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
ఐపీఎల్-2025లో వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ రికెల్టన్ విధ్వంసం సృష్టించాడు. రికెల్టన్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే లక్నో బౌలర్లపై విరుచుకుపడ్దాడు. ఈ దక్షిణాఫ్రికా బ్యాటర్ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల వర్షం కురిపించాడు.ఈ క్రమంలో రికెల్టన్ కేవలం 25 బంతుల్లోనే తన రెండో ఐపీఎల్ హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 32 బంతులు ఎదుర్కొన్న రికెల్టన్.. 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అద్బుతమైన హాఫ్ సెంచరీతో మెరిసిన రికెల్టన్ ఓ రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరపున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికెల్టన్ రికార్డులకెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు తిలక్ వర్మ పేరిట ఉండేది. ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో వర్మ కేవలం 26 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌తో వర్మను రికెల్టన్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది. ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.చదవండి: టీమిండియాపై సంచలన శతకం సాధించిన ఆటగాడిపై నిషేధం -
ఎనీటైమ్.. ఎనీవేర్..: ఇండియన్ నేవీ
న్యూఢిల్లీ: ఎనీటైమ్(ఎప్పుడైనా).. ఎనీవేర్(ఎక్కడైనా).. ఎనీహౌ(ఏమైనా సరే) సందేశం పంపింది ఇండియన్ నేవీ. పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై కఠినమైన ఆంక్షలకు సిద్ధమైన భారత్.. ఆ మేరకు చర్యలను వేగవంతం చేసింది. అయితే పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత ఆర్మీని రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఎల్ఓసీ(నియంత్రణ రేఖ) వెంబడి పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ఈ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొడుతూ పాకిస్తాన్ దుశ్చర్యలపై ఓ కన్నేసి ఉంచింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ ఇంకా ఏమైనా హద్దు మీరితే గట్టిగానే బదులివ్వడానికి భారత్ సిద్ధమైంది. దీనిలో భాగంగా భారత యుద్ధనౌకలు అరేబియా సముద్రంలో సైనిక విన్యాసాలను ఆరంభించాయి. ఏ క్షణంలోనైనా పాకిస్తాన్ నుంచి ముప్పు పొంచి ఉందన్న క్రమంలో నేవీ సిద్ధమైంది. లాంగ్ రేంజ్ కచ్చితమైన దాడులకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు నేవీ స్నష్టం చేసింది. దేశ ప్రయోజనాలను కాపాడటానికి తాము యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇండియన్ నేవీ.. పాకిస్తాన్ కు హెచ్చరికలు పంపింది. ఎనీటైమ్.. ఎనీవేర్.. ఎనీహౌ అంటూ నేవీ తన ‘ ఎక్స్’ ద్వారా ఒక మెస్సేజ్ ను పంపింది.గత మంగళవారం(ఏప్రిల్ 22వ తేదీ) పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో టూరిస్టులు 26మంది వరకూ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ సహకారంతోనే ఉగ్రదాడులు జరుగుతున్నాయని పసిగట్టిన భారత్.. అందుకు అనుగుణంగా స్ట్రాంగ్ మెస్సేజ్ పంపింది. సింధూ జలాలను నిలిపివేతతో పాటు పాకిస్తాన్ జాతీయులు దేశం నుంచి విడిచి వెళ్లిపోవాలని ఆంక్షలు విధించింది. #IndianNavy Ships undertook successful multiple anti-ship firings to revalidate and demonstrate readiness of platforms, systems and crew for long range precision offensive strike.#IndianNavy stands #CombatReady #Credible and #FutureReady in safeguarding the nation’s maritime… pic.twitter.com/NWwSITBzKK— SpokespersonNavy (@indiannavy) April 27, 2025 -
పహల్గాం దాడి.. చెట్టుపై కూర్చుని కెమెరాలో బంధించి..
శ్రీనగర్: అందాల కశ్మీరంలోని పహల్గాం బైసారన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు.. ఈ దారుణానికి 26 మంది పర్యాటకులు బలయ్యారు. అయితే, బైసరన్‌కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్‌ను చిత్రీకరించే ఓ స్థానిక వీడియో గ్రాఫర్ ఈ దాడికి సంబంధించి అత్యంత కీలక సాక్షిగా నిలిచాడు. ఈ దాడి మొత్తాన్ని అతడు కెమెరాలో బంధించగా, కీలక ఆధారమైన ఓ వీడియో ఇప్పుడు ఎన్ఐఏ చేతికి చిక్కింది.ఈ స్థానిక వీడియో గ్రాఫర్ కాల్పులు ప్రారంభమైనప్పుడు తన ప్రాణ రక్షణ కోసం పరిగెత్తి, బుల్లెట్ల నుంచి తప్పించుకోవడానికి ఒక చెట్టుపైకి ఎక్కాడు. దాడి జరిగిన సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కొని ఘటన మొత్తాన్ని చిత్రీకరించాడు. ఆ వీడియోల ఆధారంగా జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) దర్యాప్తు చేస్తోంది.వీడియో గ్రాఫర్ విచారించిన ఎన్ఐఏ అధికారులు.. ఆయన వద్ద నుంచి ఆధారాలు సేకరించారు. ఉగ్రవాదులు రెండు గ్రూపులుగా విడిపోయి లోయలో వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులు జరిపినట్లు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు. ముందగా ఇద్దరు ఉగ్రవాదులు.. పర్యాటకులను ముస్లిం మతాచారాన్ని పాటించమంటూ బెదిరించారు. అనంతరం నలుగురిని కర్కశంగా కాల్చి చంపారు.ఘటనా స్థలంలో ఏకే-47, ఎం4 రైఫిల్ ఖాళీ తూటాలను గుర్తించారు. ఉగ్రవాదులు స్థానికుల నుంచి రెండు సెల్ఫోన్లు కూడా లాక్కునట్లు దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వాటిని ట్రాక్ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వీటి ఆధారంగా ఉగ్రవాదుల ప్రస్తుత లొకేషన్లు కూడా కనుగొనే అవకాశం ఉంది. అయితే, దాడి తర్వాత నుంచి స్విచ్ఛాఫ్ అయినట్లు అధికారులు గుర్తించారు. -
సమంత పెట్ డాగ్ తో శోభిత.. చైతూ పోస్ట్ వైరల్
నాగచైతన్య-సమంత బంధం ముగిసిన అధ్యయం. కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ నాలుగేళ్లకే విడిపోయారు. ఇది జరిగి చాన్నాళ్లు గడిచినా అప్పుడప్పుడు వీళ్ల గురించి మాట్లాడుకునే సందర్భం వస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా చైతూ పెట్టిన ఓ పోస్ట్ మరోసారి చర్చకు కారణమైందని చెప్పొచ్చు.సమంత నుంచి విడిపోయిన తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న నాగ చైతన్య.. గతేడాది మరోసారి పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ శోభితతో కొత్త జీవితం ప్రారంభించాడు. ప్రస్తుతం వీళ్లిద్దరూ ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. సరే అసలు విషయానికొస్తే సోషల్ మీడియాలో అంతంత మాత్రంగానే యాక్టివ్ గా ఉండే చైతూ చాన్నాళ్ల తర్వాత ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) సమంతతో కలిసున్న టైంలో హాష్ అనే ఫ్రెంచ్ బుల్ డాగ్ ని పెంచుకున్నారు. ఇప్పుడది చైతూ దగ్గరే ఉంది. తాజాగా చైతన్య.. ఆదివారం ఇలా గడిచింది అని ఓ పోస్ట్ పెట్టాడు. ఇందులో తన కారుని రిపేర్ చేసుకోవడంతో పాటు శోభిత- పెట్ డాగ్ హాష్ కలిసున్న ఫొటోని కూడా షేర్ చేశాడు.అయితే దీన్ని సీరియస్ గా తీసుకున్న సమంత ఫ్యాన్స్.. చిత్రవిచిత్రమైన కామెంట్స్ పెడుతున్నారు. సామ్ పెంచుకున్న కుక్క.. శోభితతో ఏం చేస్తోందని ఒకరంటే.. 'శుభం' ట్రైలర్ రిలీజైందని, రేపు సమంత పుట్టినరోజు కావడంతో కావాలనే చైతూ ఈ పోస్ట్ పెట్టాడని మరికొందరు అంటున్నారు. సమంత లానే హాష్ కూడా ఒంటరిది అయిపోయిందని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) -
ప్రపంచంలోని 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు: లేటెస్ట్ రిపోర్ట్
భారత ఆర్ధిక వ్యవస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఇండియా.. జర్మనీ, జపాన్‌లను అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు.భారతదేశం ప్రపంచానికి విద్యా కేంద్రంగా మారగలదని, మిగతావన్నీ పక్కన పెడితే మన దేశంలోని ప్రజాస్వామ్యమే మనకు అతిపెద్ద ప్రయోజనమని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం తన అభిప్రాయాన్ని ఇటీవలే వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో ఐదవ అతిపెద్దది. వచ్చే ఏడాది చివరి నాటికి మనం నాల్గవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉండబోతున్నాము. ఆ తర్వాత ఏడాది మూడవ అతిపెద్దదిగా ఉంటామని ఆయన వివరించారు.ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ GDPకి గణనీయంగా దోహదపడతాయి. అంతే కాకుండా అంతర్జాతీయ వాణిజ్యం, ఆర్థిక విధానాలపై కూడా బలమైన ప్రభావాన్ని చూపుతాయి. వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్ నివేదిక ప్రకారం.. టాప్ 10 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు ఇలా..➤యునైటెడ్ స్టేట్స్ (యూఎస్): 30.507 ట్రిలియన్ డాలర్లు➤చైనా: 19.231 ట్రిలియన్ డాలర్లు➤జర్మనీ: 4.744 ట్రిలియన్ డాలర్లు➤భారతదేశం: 4.187 ట్రిలియన్ డాలర్లు➤జపాన్: 4.186 ట్రిలియన్ డాలర్లు➤యునైటెడ్ కింగ్డమ్ (యూకే): 3.839 ట్రిలియన్ డాలర్లు➤ఫ్రాన్స్: 3.211 ట్రిలియన్ డాలర్లు➤ఇటలీ: 2.422 ట్రిలియన్ డాలర్లు➤కెనడా: 2.225 ట్రిలియన్ డాలర్లు➤బ్రెజిల్: 2.125 ట్రిలియన్ డాలర్లు -
నన్ను పెళ్లి చేసుకుంటావా? స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన దర్శకుడు..
యంగ్ డైరెక్టర్ అబిశన్ జీవింత్ తెరకెక్కించిన చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ (Tourist Family). శశికుమార్, సిమ్రాన్ ప్రధాన పాత్రలు పోషించగా యోగి బాబు, ఎమ్మెస్ భాస్కర్, మిథున్ జే, రమేశ్ తిలక్ తదితరులు నటించారు. ఈ మూవీ మే 1న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో అబిశన్ (Abishan Jeevinth) తన స్నేహితురాలికి ప్రపోజ్ చేశాడు.నీ వల్లే..ముందుగా స్టేజీ ఎక్కిన అబిశన్.. తన సినిమా గురించి చెప్తూ, అందులో నటించిన యాక్టర్స్‌కు, సంగీతాన్ని అందించిన షాన్ రోల్డన్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ వెంటనే తన స్నేహితురాలు అఖిల ఎలంగోవన్‌కు సైతం థాంక్స్ చెప్పాడు. అబిశన్ మాట్లాడుతూ.. అఖిల.. నీకు నేను చిన్నప్పటి నుంచి తెలుసు. పదో తరగతి నుంచి మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. మా అమ్మతో పాటు నీవల్లే జీవితంలో మంచి వ్యక్తిగా ఎదిగాను. ఐ లవ్యూ సోమచ్ అని ప్రశ్నించాడు. దర్శకుడి మాటలతో కంటతడిఇప్పుడు నిన్నో విషయం అడగాలనుకుంటున్నాను. అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రశ్నించాడు. అక్కడే ఉన్న అఖిల అతడి మాటలు విని భావోద్వేగానికి లోనైంది. సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. అఖిల అతడి ప్రపోజల్‌కు ఒప్పుకోవమ్మా.. సినిమా ప్రపోజల్ కన్నా ఇదే బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు. Beautiful Proposal by The Director of #TouristFamily on Stage ❤️pic.twitter.com/cG3qvN3fF1— Christopher Kanagaraj (@Chrissuccess) April 27, 2025 చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి -
‘పేషన్’ విజయం సాధించాలి: శేఖర్ కమ్ముల
యంగ్ టాలెంట్ సుధీస్, అంకిత హీరో హీరోయిన్లుగా అరవింద్ జాషువా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇంటెన్స్ ఎమోషనల్ లవ్ స్టోరీ ‘పేషన్’. REDANT క్రియేషన్ బ్యానర్‌పై నరసింహా యేలే, ఉమేష్ చిక్కు, రాజీవ్ సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను క్రియేటివ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.., అరవింద్ జాషువా రాసిన ‘పేషన్’ నవల చదివాను, అది చాలా అథెంటిక్‌గా ఉంది. ఈ చిత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్. అరవింద్‌లో స్టోరీ టెల్లింగ్, రైటింగ్ స్కిల్స్ అద్భుతం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను అన్నారు.అరవింద్ జాషువా మాట్లాడుతూ, ఫ్యాషన్ కాలేజీలో సామాన్యుడి అనుభవాల నుంచి స్ఫూర్తి పొందిన కథ ఇది. శేఖర్ కమ్ముల నా గురువు, ఆయన స్ఫూర్తితోనే ఈ సినిమా తీశాను. నిర్మాతలు, సాంకేతిక బృందం అద్భుతంగా సహకరించారు. ఈ జనరేషన్‌కు కనెక్ట్ అయ్యే కథతో సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది అన్నారు.ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, శేఖర్ కమ్ముల సపోర్ట్‌కు ధన్యవాదాలు తెలిపారు. ఛాయా పబ్లికేషన్స్ ప్రచురించిన నవల స్ఫూర్తితో ఈ సినిమా రూపొందిందని చెప్పారు. సినిమా గొప్ప విజయం సాధించాలని టీమ్ ఆకాంక్షిస్తోంది. -
టెన్షన్ వద్దు పెన్షన్ కావాలి
పాత పింఛను పథకం పునరుద్ధరణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తామని.. ఆలిండియా న్యూ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్(ఏఐఎన్ పిఎస్ఎఫ్)జాతీయ ప్రధాన కార్యదర్శి మాచన రఘునందన్ స్పష్టం చేశారు. ఏఐఎన్ పిఎస్ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా "మాచన" ను నియమించినట్టు..జాతీయ అధ్యక్షులు మంజీత్ సింగ్ పటేల్ ఫోన్ ద్వారా తెలియపరిచారని రఘునందన్ చెప్పారు.ఈ సందర్భంగా.. ఆదివారం హైదరాబాద్ లో రఘునందన్ మాట్లాడుతూ..దేశ వ్యాప్తంగా కోటి మంది కి పైగా ఉద్యోగులు కొత్త పెన్షన్ పథకం లో ఉన్నారని రఘునందన్ చెప్పారు.2004 సెప్టెంబర్ 1 నుంచి ఉమ్మడి అంధ్ర ప్రదేశ్ లో భాగస్వామ్య పింఛను పథకం అమలు ప్రారంభం అయ్యిందని,ఉద్యోగం అంటేనే ఒక సామాజిక భద్రత కాగా.. సి పి ఎస్ లో ఉన్న ఉద్యోగి కి అర్ధిక భద్రత తో పాటు సామాజిక భద్రత కూడా ఉండదని రఘునందన్ అవేదన వ్యక్తం చేశారు.ప్రమాద వశాత్తు ఎవరైనా సిపిఎస్ ఉద్యోగికి అవాంఛనీయ సంఘటనకు గురైతే కనీసం లక్ష రూపాయలు కూడా వారి ఖాతా లో ఉండవని, అటువంటపుడు పెన్షన్ రాని ప్రభుత్వ ఉద్యోగం కన్నా ప్రైవేటు ఉద్యోగమే మిన్న అన్న భావన ను కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారని రఘునందన్ అభిప్రాయపడ్డారు. వచ్చే నెల ఉత్తర ప్రదేశ్ లో జరిగే జోనల్ సమావేశానికి తనను ఆహ్వానించారని "మాచన" తెలిపారు. -
తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్సే: కేసీఆర్
కేసీఆర్ ప్రసంగం:👉ఒక్కడిగా బయల్దేరి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టాను👉25 ఏళ్లనాడు గులాబీ జెండా ఎగరేశాం👉ఉద్యమంతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం👉అందరూ అశ్చరపోయేలా పదేళ్లపాటు తెలంగాణను పాలించాం👉తెలంగాణ ఉద్యమం నుంచి వెనక్కిపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపమని చెప్పా👉ఆనాడు పదవుల కోసం టీడీపీ, కాంగ్రెస్ వాళ్లు.. పెదవులు మూశారు👉బీఆర్ఎస్ నేతలు పదవులను త్యాగం చేశారు👉ఆనాడైనా ఈనాడైనా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్👉ప్రజలు ప్రాణం పోసి ఊపిరి ఊదితే అద్భుతమైన ఉద్యమాన్ని నిర్మించాం👉బలవంతంగా ఆనాడు తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేసింది కాంగ్రెస్సేకాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణను సాధించుకున్నాం..👉నేను ఆమరణ దీక్షకు దిగితే కాంగ్రెస్ దిగవచ్చి తెలంగాణపై ప్రకటన చేసింది👉పదేళ్ల పాలనలో తెలంగాణను అనేక రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపాం👉తెలంగాణ అంటే ఒక్కప్పుడు వెనకబడిన ప్రాంతం👉మన పాలనలో రూ.90 వేలు ఉన్న తలసరి ఆదాయం మూడున్నర లక్షలకు పెంచుకున్నాం👉మూడేళ్లలో కాళేశ్వరం కట్టుకున్నాం👉పడావు భూములను పంటపొలాలుగా మార్చుకున్నాం👉పంజాబ్‌ను తలదన్నే పంటలను పండించుకున్నాం👉రైతాంగాన్ని కడుపులో పెట్టి చూసుకున్నాం👉కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ఏం చేశారు?👉గోల్మాల్ చేయడంలో అబద్ధాలను చెప్పడంలో కాంగ్రెస్‌ను మించినవారు లేరు👉మాట్లాడితే కేసీఆర్‌పై నిందులు వేస్తున్నారు👉ఇక్కడ ఉన్నవాళ్లు చాలరని.. ఢిల్లీ నుంచి గాంధీలు వచ్చి డ్యాన్స్‌లు చేసి హామీలు ఇచ్చారు👉కల్యాణ లక్ష్మికి కేసీఆర్ లక్ష రూపాయలే ఇస్తున్నారు.. మేము వస్తే తులం బంగారం కూడా ఇస్తామన్నారు👉పెన్షన్లు పెంచుతామన్నారు.. స్కూటీలు కొనిస్తామన్నారు.. జాబ్ కార్డులు ఇస్తామన్నారు.. ఇచ్చారా?👉ఇప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన.. ఎన్ని హామీలైనా అమలు చేసి చూపిస్తామన్నారు👉లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్న దేవుళ్ల అందరిపైనా ఒట్లు వేశారు.👉మహిళలే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం వద్దని అంటున్నారు👉ఆశపడి.. కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోసపోయారు👉మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు.. అప్పు పుట్టడం లేదని.. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు👉తెలంగాణ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశారు.. పరిపాలన చేయడం రాక రాష్ట్రాన్ని ఆగమాగం చేశారు👉తెలంగాణను నంబర్‌వన్ స్థానంలో నిలబెడితే.. ఇప్పుడు 14వ స్థానానికి తీసుకెళ్లిపోయారు👉హైడ్రా పేరు చెప్పి పేదల ఇళ్లు కూలగొడుతున్నారుపహల్గామ్ మృతులకు నివాళులర్పించిన కేసీఆర్👉ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరైన కేసీఆర్👉పహల్గాం మృతులకు సంతాపం👉మౌనం పాటించి సంతాపం తెలిపిన సభ👉పహల్గామ్ మృతులకు నివాళులర్పించిన కేసీఆర్ఎల్కతుర్తికి చేరుకున్న కేసీఆర్👉కాసేపట్లో సభా ప్రాంగణానికి కేసీఆర్‌సభ ఏర్పాట్లు ఇలా..👉కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ👉బీఆర్ఎస్ కటౌట్లు,ఫ్లెక్సీలతో వరంగల్ ఎల్కతుర్తి గులాబీమయం👉సభా స్థలి విస్తీర్ణం: 1,213 ఎకరాలు👉మహాసభ ప్రాంగణం: 154 ఎకరాలు👉 ప్రధాన వేదికపై సీటింగ్: 500 మందికి 👉వాహనాల పార్కింగ్ : 1,059 ఎకరాలు 👉సభికుల కోసం సిద్ధం చేసిన వాటర్ బాటిళ్లు: 10.80 లక్షలు👉మజ్జిగ ప్యాకెట్లు: 16 లక్షలు 👉సభావేదిక చుట్టూ అంబులెన్స్‌లు: ఆరు రూట్లు, 20 అంబులెన్స్‌లు👉మెడికల్ క్యాంపు: సభావేదిక చుట్టూ 12 ట్రాఫిక్, పార్కింగ్ నిర్వహణ కోసం: 2,500 మంది వలంటీర్లు మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం👉ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్డు చౌరస్తా వద్ద భారీగా ట్రాఫిక్ జాం👉వరంగల్ ఎల్కతుర్తిలో మాజీ సీఎం కేసీఆర్ సభ ఉన్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జాం👉ఎక్కడ కనిపించని ట్రాఫిక్ పోలీసులు.👉రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం👉ఇబ్బందులు పడుతున్న వాహనదారులు.👉తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1,200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు రెండుమూడు రోజుల ముందునుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి.👉14 ఏండ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పారీ్టగా ప్రస్థానం సాగించిన బీఆర్ఎస్.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.👉సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి కాంగ్రెస్ పారీ్టయే విలన్‌గా ఉందని ఈ సభలో కేసీఆర్ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశముంది. కేవలం 15 నెలల పాలనలోనే ప్రజల ముందు ఇంతగా పతనమైన ప్రభుత్వాన్ని చూడలేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్లీ ఛిన్నాభిన్నమైందని ఇటీవల పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో ఇవే అంశాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశముంది.👉అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో అధికారం కోల్పోయిన కేసీఆర్.. కొద్ది రోజుల తర్వాత నివాసంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. సుమారు రెండు నెలల చికిత్స, విరామం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న ప్రతిపక్ష నేతగా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మార్చి 12న కరీంనగర్లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు.👉2024 మార్చి 31న తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్ 5 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నుంచి రెండు రోజుల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో పార్టీ అంతర్గత సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా బహిరంగ సభలకు, క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న కేసీఆర్.. తిరిగి రజతోత్సవ సభ ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించే భవిష్యత్ కార్యాచరణపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది.👉రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ఏర్పాట్లు చేయగా, సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాలు కేటాయించారు. వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభికుల కోసం 10.80 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎండవేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలందించేందుకు సభావేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.👉సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తోపాటు సుమారు 500 మందివరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్ హెలికాప్టర్లో వస్తారని పారీ్టవర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు కేసీఆర్ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్ సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు. -
AP: కాంగ్రెస్ నేత దారుణ హత్య
అనంతపురం: జిల్లాలోని గుంతకల్లులో కాంగ్రెస్ నేత చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణహత్యకు గురయ్యారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మీ నారాయణను కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. కాంగ్రెస్ లక్ష్మీనారాయణ కారును టిప్పర్ తో ఢీకొట్టారు దుండగులు. ఆపై లక్ష్మీ నారాయణపై వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేశారు. ఈ దాడిలో లక్ష్మీ నారాయణ కుమారుడు వినోద్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. -
G 20 Review: అమెరికన్ ప్రెసిడెంటా.. మజాకా..
ఓటీటీలో ఇది చూడొచ్చు అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం జీ 20 ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా దర్శకుని ఊహ అనేది ప్రేక్షకుల ఊహకందకపోతే అప్పుడు ఆ సినిమా పండుతుంది. ముఖ్యంగా హాలీవుడ్ దర్శకుల ఆలోచనలే వేరు. ఏది అసాధ్యమో, ఏదైతే జరగదు అని ప్రేక్షకులు అనుకుంటారో దాన్నే సినిమాలో చూపిస్తుంటారు హాలీవుడ్ డైరెక్టర్స్. హాలీవుడ్ దర్శకుడు పాట్రిసియా రీగెన్ తీసిన ‘జీ 20’ సినిమా ఆ కోవలోకి చెందినదే. ఒక్కసారి ఊహించండి... ప్రపంచంలోనే ఉత్తమోత్తమ సురక్షితమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు అనే విషయం మనకు తెలుసు. మరి... ఆ అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తిని తన కుటుంబంతో పాటు బందీలుగా తీసుకుని ప్రపంచాన్ని శాసిద్దా మనకున్న విలన్‌ను అమెరికా ప్రెసిడెంట్ ఎలా ఎదుర్కొన్నారో ఈ ‘జీ 20’లో చూడవచ్చు. అది కూడా అమెరికన్ ప్రెసిడెంట్‌ను, అతని కుటుంబాన్ని బందీలుగా చేసుకోవడం కూడా చిన్న వేదిక మీదైతే కాదు, దాదాపు అరడజను దేశాధినేతలతో పాటు జీ 20 శిఖరాగ్ర సమావేశంలో హై సెక్యూరిటీ నడుమ ఉండగా అమెరికన్ ప్రెసిడెంట్‌తో పాటు అక్కడున్న మిగతా దేశాధినేతలందరినీ బందీలుగా చేసుకుంటాడు విలన్. ఇక్కడ ఈ సినిమా దర్శకుడు ఇంకా వినూత్నంగా ఆలోచించాడు. బందీలుగా ఉన్న తన కుటుంబాన్ని, ఇతర దేశాధినేతలను కూడా విలన్‌తో పోరాడి విడిపించే బాధ్యత ప్రెసిడెంట్ మీదే పెట్టాడు సదరు సినిమా డైరెక్టర్. ‘జీ 20’ సినిమా మంచి ఉత్కంఠతతో ప్రారంభమై, ఆద్యంతం ప్రేక్షకుడిని ఉర్రూతలూగిస్తుంది. ముఖ్యంగా అమెరికన్ ప్రెసిడెంట్ పోరాట సన్నివేశాలు సినిమాకే హైలెట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాలో అమెరికన్ ప్రెసిడెంట్ కుంగ్ ఫూ ఫైటర్, గన్ షూటర్, అలాగే హెలికాప్టర్ రైడర్ కూడా. ఇక మరో పెద్ద ట్విస్ట్ ఏంటంటే సదరు అమెరికన్ ప్రెసిడెంట్ ఈ సినిమాలో ఓ లేడీ. ఈ పాత్రలో డేనియల్ సట్టన్ సూపర్‌గా నటించారు. పైన చెప్పుకున్నట్టు ఓ లేడీ అమెరికన్ ప్రెసిడెంట్ తన కుటుంబంతో పాటు ఇతర దేశాధినేతలను సూపర్ ఫైటింగ్ స్కిల్స్‌తో సేవ్ చేయడమనేది మామూలు కాన్సె΄్టా... ఆలోచించండి. దటీజ్ ‘జీ 20’. ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ కూడా లభ్యమవుతోంది. అయితే మీ పిల్లలను ఈ సినిమాకి దూరంగా ఉంచి మీరు మాత్రం వాచ్ ఇట్ ఫర్ వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
అలాంటి బ్యాంక్ అకౌంట్స్ వెంటనే క్లోజ్ చేసుకోండి
సాధారణంగా చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. అయితే.. అందులో ఒకటి లేదా రెండు మాత్రమే ఉపయోగిస్తుంటారు. మిగిలినవన్నీ వృధా అన్న మాట. ఇలా వదిలేయడం వల్ల.. కొన్ని నష్టాలు భరించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి నష్టాలేమిటో తెలుసుకుందాం..బ్యాంక్ చార్జీలుఒక బ్యాంకులో అకౌంట్ ఉందంటే.. అందులో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ చేయాల్సిందే. ఒకవేళా మినిమమ్ బ్యాలెన్స్ లేకుండా ఉంటే.. వాటిపై బ్యాంక్ చార్జీలు వసూలు చేస్తుంది. కొన్ని సార్లు మైనస్ బ్యాలెన్స్‌లోకి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ తరువాత లావాదేవీలు చేయాలంటే.. ముందు మైనస్ బ్యాలెన్స్ క్లియర్ చేయాల్సిందే.డబ్బు వృధాబ్యాంక్ అకౌంట్ ఉపయోగించకుండా.. అలాగే వదిలేస్తే అందులో ఉన్న మినిమమ్ బ్యాలెన్స్ వంటివి వృధా అవుతాయి. మీకు ఓ ఐదు అకౌంట్స్ ఉన్నాయనుకుంటే.. అందులో మీరు కేవలం ఒకదాన్ని మాత్రం వాడుతూ.. మిగిలినవి ఉపయోగించకుండా వదిలేస్తే అందులో ఉన్న డబ్బు వృధా అయినట్టే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్కువ అకౌంట్స్ మెయింటెన్సన్ చేయకుండా ఉండటమే ఉత్తమం.ఇదీ చదవండి: ధర ఎక్కువైనా అస్సలు తగ్గని జనం.. ఒకేరోజు 52 కార్ల డెలివరీమోసాలకు అవకాశంటెక్నాలజీ పెరుగుతున్న సమయంలో మోసాలు ఎక్కువవుతున్నాయి. మీరు ఉపయోగించకుండా ఉంటే.. అలాంటి అకౌంట్లను కొందరు సైబర్ నేరగాళ్లు ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇవి మిమ్మల్ని చిక్కుల్లో పడేసే అవకాశం ఉంది. కాబట్టి బ్యాంక్ అకౌంట్ వృధాగా ఉన్నా.. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. లేదా క్లోజ్ చేసుకోవడం మంచిది.సిబిల్ స్కోరుపై ప్రభావంబ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా లేకుంటే.. మైనస్ బ్యాలెన్స్‌లోకి వెళ్ళిపోతుంది. అంటే దీనర్థం మీరు బ్యాంకుకు అప్పు ఉన్నారన్నమాట. ఇది మీ క్రెడిట్ స్కోర్ మీద ప్రభావం చూపిస్తుంది. దీంతో సిబల్ స్కోర్ తగ్గిపోతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. యాక్టివ్‌గా ఉన్న అకౌంట్స్ కాకుండా.. మిగిలినవన్నీ వెంటనే క్లోజ్ చేసుకోవాలి. -
జీవితమంతా వాళ్లకు సారీ చెబుతూనే ఉంటా: శ్రుతి హాసన్
కమల్ హాసన్ కూతురిగా శ్రుతి హాసన్ అందరికీ తెలుసు. కెరీర్ ప్రారంభంలో ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకున్న ఈమె.. క్రమంగా సినిమాలతో హిట్ కొడుతూ సక్సెస్ ఫుల్ అనిపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన కెరీర్, లవ్ బ్రేకప్స్ గురించి మాట్లాడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) 'నాకు ఎంతో ఇష్టమైన వాళ్లని కొన్నిసార్లు బాధపెట్టాను. అనుకోకుండా అది జరిగినప్పటికీ.. అలా చేసి ఉండకూడదని ఇప్పటికీ అనుకుంటూ ఉంటాను. జీవితమంతా వాళ్లకు సారీ చెబుతూనే ఉంటా. ప్రతి ఒక్కరి జీవితంలో బ్రేకప్ లవ్ స్టోరీ ఉంటుంది. మాజీ భాగస్వామి వల్ల ఎన్నో విషయాలు తెలుసుకుంటాం.నాకు అలాంటి బ్రేకప్ స్టోరీలు ఉన్నాయి''బ్రేకప్స్ గురించి నేను ఎక్కువ ఆలోచించను. నా లవ్ స్టోరీస్ గురించి చాలామంది ఏవేవో మాట్లాడుతుంటారు. ఇతడు ఎన్నో బాయ్ ఫ్రెండ్? అని అడుగుతూ ఉంటారు. వారి దృష్టిలో అది కేవలం నంబర్ మాత్రమే. నా వరకు వస్తే నేను అన్నిసార్లు ప్రేమలో విఫలమవుతున్నానని అర్థం. ఇప్పటికీ నాకు సరైన ప్రేమ దొరకలేదు' అని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: వాళ్ల విడాకులు.. నేను చాలా బాధపడ్డాను: శ్రుతిహాసన్) 'కెరీర్ ప్రారంభంలో తెలుగులో నా రెండు సినిమాలు ఫెయిలయ్యాయి. నన్ను చాలా మాటలు అన్నారు. కానీ హీరో సిద్ధార్థ్ ని మాత్రం ఏం అనలేదు. నాకు గబ్బర్ సింగ్ మూవీతో సక్సెస్ వచ్చింది. ఎక్కువ సినిమాలు చేయట్లేదని చాలామంది అంటుంటారు. కానీ నా మనసుకు నచ్చిన మూవీస్ చేస్తున్నానని వాళ్లకు తెలీదు' అని శ్రుతి తనపై వచ్చిన విమర్శలకు సమాధానమిచ్చింది.మొన్నటివరకు శంతను హజరికా అనే ఆర్టిస్టుతో ప్రేమలో ఉన్న శ్రుతి హాసన్.. అంతకు ముందు ఓ విదేశీయుడితో చెట్టాపట్టాలేసుకుని కనిపించింది. కెరీర్ ప్రారంభంలో మాత్రం ఒకరిద్దరు హీరోలతో ఈమె రిలేషన్ షిప్ మెంటైన్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. ప్రస్తుతానికైతే ఈమె ఎవరితోనూ ప్రేమలో లేదు!(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) -
Visakha: జంట హత్యల కేసులో ఏం జరిగింది..?
విశాఖ: నగరంలోని చోటు చేసుకున్న జంట హత్యల కేసు పోలీసులకు కాస్త తలనొప్పిగా మారింది. దోపీడీ దొంగలు పనై ఉంటుందని తొలుత భావించిన పోలీసులకు ఆ అనావాళ్లు ఏవీ కనిపించడం లేదు. హత్యకు గురైన యోగేంద్ర(66), లక్ష్మీ(58) ఇంట్లో ఎటువంటి చోరీ జరగలేదని గుర్తించారు పోలీసులు. వారికి సంబంధించిన బంగారం ఆభరణాల్లో కొన్నింటిని ఇంట్లోనే గుర్తించారు. అయితే పాత కక్ష్యల కారణంగానే హత్య చేశారని భావిస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి నలుగురు అనుమానితులను పోలీసులు గుర్తించారు.ఆనవాళ్లు లేకుండా జాగ్రత్త పడ్డారు..ఈ జంట హత్యల కేసులో దుండగులు ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు వదలకుండా.. అత్యంత పకడ్బందీగా నేరానికి పాల్పడటంతో కేసు ఛేదన పోలీసులకు సవాల్‌గా మారింది. ఉన్నతాధికారులు సైతం రంగంలోకి దిగి కేసు దర్యాప్తును అన్ని కోణాల్లోనూ నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. హత్యకు గురైన యోగేంద్రబాబు, ఆయన భార్య లక్ష్మి సుమారు 40 ఏళ్లుగా గాజువాకకు సమీపంలోని రాజీవ్‌నగర్ ప్రాంతంలోనే నివాసం ఉంటున్నారుయోగేంద్రబాబు నావల్ డాక్‌యార్డ్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. స్థానిక గ్లోరియా(ఎయిడెడ్) పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలిగా పనిచేసి రిటైర్ అయిన లక్ష్మి స్థానికంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. వారికి ఎవరితోనూ ఎలాంటి శత్రుత్వం లేదని స్థానికులు చెబుతున్నారు. వారి ఇద్దరు పిల్లలు శృతి, సుజన్ వివాహాలు చేసుకుని అమెరికాలో స్థిరపడటంతో.. ఇంట్లో వీరిద్దరు మాత్రమే ఉంటున్నారు. ఎవరితోనూ గొడవలు లేని వీరిని ఇంత దారుణంగా ఎవరు, ఎందుకు హత్య చేశారన్నది అంతుపట్టని ప్రశ్నగా మారింది.హత్య కోసం అదను చూసుకున్నారా?హత్యకు గురైన దంపతులు గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరిగి వచ్చారు. అక్కడ గ్లోరియా పాఠశాల అడ్మిన్‌కు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు సమాచారం. పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్న దాని ప్రకారం గురువారం రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో ఈ హత్య జరిగి ఉండవచ్చు. అదే సమయంలో రాజీవ్‌నగర్‌లో గ్రామదేవత పండగ జరుగుతుండటంతో ఆ పరిసరాలు కాస్త సందడిగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే దుండగులు తమ పని కానిచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో అదను చూసుకుని కాపు కాసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఇంటికి బంధువులు వస్తే కానీ తెలియలేదు..శుక్రవారం రాత్రి వరకు ఈ దారుణం వెలుగులోకి రాలేదు. మృతుల బంధువుల కుమార్తె వారిని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు, ఇంటికి తాళం వేసి ఉండటం, లోపల ఫోన్ మోగుతుండటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దీంతో ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు వచ్చి తలుపులు తెరవగా ఈ ఘోరం వెలుగుచూసింది. ఘటన జరిగిన సమయంలో పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం, వీధి లైట్లు వెలగకపోవడం వంటివి దర్యాప్తునకు ఆటంకాలు కలిగిస్తున్నాయి. వారి పిల్లలు అమెరికా నుంచి వచ్చిన తర్వాతే ఇంట్లో ఏయే వస్తువులు, ఎంత నగదు, బంగారం పోయిందనే వివరాలు కచ్చితంగా తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
‘జత్వానీ కౌంటర్ కేసు ఒక దుష్ట సంప్రదాయానికి రోల్ మోడల్’
సాక్షి, తాడేపల్లి: కాదంబరీ జత్వానీతో కూటమి ప్రభుత్వం పెట్టించిన తప్పుడు కౌంటర్ కేసు దేశంలో ఒక దుష్ట సంప్రదాయానికే రోల్‌మోడల్‌గా మిగిలిపోతుందని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అధికార దుర్వినియోగానికి ఈ కేసు పరాకాష్టగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానాల్లో మేజిస్ట్రేట్ ముందు ఏనాడు పోలీసులపై ఫిర్యాదు చేయని జత్వానీతో ఏడు నెలల తరువాత కూటమి ప్రభుత్వం కావాలనే పిలిపించి తప్పుడు ఫిర్యాదు చేయించిందని, దేశంలోనే ఇటువంటి కౌంటర్ కేసు ఇదే మొదటిదని అన్నారు.ఇంకా ఆయనేమన్నారంటే..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే ఇటు పోలీస్ వ్యవస్థలో, అటు న్యాయ ప్రక్రియ విషయంలో వింత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముంబైకి చెందిన కాదంబరీ జత్వానీ సినీనటి. దేశ వ్యాప్తంగా ఆమెపై కేసులు ఉన్నాయి. ఏపీలో కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తితో సంబంధం ఏర్పాటు చేసుకుని, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, హనీ ట్రాప్‌తో రూ.కోటికి పైగా బ్యాంక్‌ల ద్వారా తన ఖాతాలకు జమ చేయించుకున్నారని పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది.దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బ్లాక్ మెయిలింగ్‌కు లొంగకపోవడంతో కుక్కల విద్యాసాగర్ ఆస్థిని కాజేసేందుకు దొంగ సంతకాలతో డాక్యుమెంట్లను సృష్టించి ఇతరులకు అమ్మేందుకు రూ.5 లక్షలు అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు తేలింది. కొనుగోలు చేసిన వ్యక్తులు దీనిపై కుక్కల విద్యాసాగర్‌తో క్రాస్ చెక్ చేసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.చట్టప్రకారమే జత్వానీ అరెస్ట్కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదుపై పోలీసులు చట్టప్రకారం దర్యాప్తు జరిపి, ఇందులో ముద్దాయి కాదంబరీని అరెస్ట్ చేసేందుకు విజయవాడ న్యాయస్థానంలో పిటీషన్ వేసి, సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. అనంతరం ముంబై జూహూ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి, స్థానిక పోలీసుల సహకారంతో ముద్దాయిని, ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, అంథేరీ కోర్ట్‌లో హాజరుపరిచారు. అక్కడి న్యాయస్థానం సంతృప్తి చెందిన తరువాత విజయవాడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తరువాత ఈ కేసుకు సంబంధించిన ఫేక్ డాక్యుమెంట్లు, సిమ్ కార్డ్, సెల్ఫోన్లను మద్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.అనంతరం మొత్తం ఆధారాలతో ముద్దాయిలను కోర్ట్‌లో హాజరుపరిచారు. దీనిపై కోర్ట్ వారిని రిమాండ్‌కు పంపారు. అనంతరం పోలీసులు తదుపరి విచారణ కోసం పోలీస్ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై అయిదు రోజుల పోలీస్ కస్టడీకి జత్వానీతో పాటు ఆమె తల్లిదండ్రులను అప్పగించారు. కస్టడీలో కూడా వారు అనేక విషయాలను వెల్లడించారు. తరువాత ముద్దాయిలు వేసుకున్న రెండు బెయిల్ పిటీషన్లు కూడా డిస్మిస్ అయ్యాయి. 2024 ఏప్రిల్ 24న ముద్దాయిలు వేసుకున్న కండీషన్ బెయిల్ మంజూరయ్యింది.23 రోజుల తరువాత మోడిఫికేషన్ జరిగి బెయిల్ కండీషన్లను రిలాక్స్ చేశారు. ముంబైలో అరెస్ట్ చేసిన నాటి నుంచి విజయవాడ కోర్ట్‌కు తీసుకువచ్చిప్పడు, పోలీస్ కస్టడీలో విచారణ విషయలో ఎక్కడా పోలీస్ అధికారులపై ఆమె ఫిర్యాదు చేయలేదు. నాతో పోలీస్ అధికారులు చట్టప్రకారమే వ్యవహరించారని, ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని మేజిస్ట్రేట్ ముందు చెప్పారు. అలాగే ఎలాంటి ఫిర్యాదు కూడా చేయలేదు. పోలీస్ కస్టడీలో అడ్వకేట్ సమక్షంలోనే పోలీసులు విచారణ జరిపారు. మద్యవర్తులు, అడ్వకేట్ సమక్షంలో పోలీస్ కస్టడీలో జరిగిన విచారణలో జత్వానీ అంగీకరించిన అన్ని విషయాలను మధ్యవర్తులు రాసిన తరువాత దానిపై సంతకం చేసేందుకు ఆమె నిరాకరించారు. మద్యవర్తులు మాత్రం సంతకాలు చేశారు. దీనిని బట్టి ఆమెను ఎక్కడా పోలీసులు నిర్భందం, వత్తిడి చేయలేదు. పోలీసులు సమర్పించిన నివేదికలోనూ ఆమె సంతకం చేసేందుకు నిరాకరించారనే రాసి, కోర్ట్‌లో సమర్పించారు.కుట్రపూరితంగా జత్వానీతో తప్పుడు ఫిర్యాదు చేయించారువిజయవాడ, ముంబై కోర్ట్‌ల్లో తనపై పోలీసులు ఒత్తిడి తెచ్చారని, తప్పుడు కేసు పెట్టారని జత్వాని ఎటువంటి ఆరోపణలు చేయలేదు. దర్యాప్తు ప్రక్రియ ముందుకు సాగుతున్న తరుణంలో ఆగస్టు 2024 అంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత టీవీ5 కి జత్వానీ ఇచ్చిన ఇంటర్వూలో నాపైన తప్పుడు కేసులు పెట్టాయంటూ ఆరోపణలు చేశారు. ఈ ఇంటర్వూ తరువాత ఆన్లైన్ ద్వారా పోలీస్ అధికారులు ఒక ఫిర్యాదు తెప్పించుకున్నారు. దానిని ఎల్లో మీడియాలో ప్రముఖంగా ప్రచురించారు. జత్వానీపై అప్పటి పోలీస్ అధికారులు దురుసుగా ప్రవర్తించి, తప్పుడు కేసులు పెట్టారంటూ కథనాలు రాశారు.ఎల్లో మీడియా వార్తల ఆధారంగా సిటీ పోలీస్ కమిషనర్ ఒక విచారణాధికారిని నియమించారు. తరువాత 2024 సెప్టెంబర్ 5న జత్వానీ విజయవాడకు వచ్చి నగర పోలీస్ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. తరువాత కొందరి స్టేట్మెంట్లను కూడా పోలీసులు తీసుకున్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాకముందే జత్వానీ కేసులో కొందరు పోలీస్ అధికారులు సీఐ నుంచి సూపర్ వైజర్ స్థాయిలో ఉన్న డీజీపీ స్థాయి అధికారి సీతారామాంజనేయులు వరకు కేసులు పెట్టారు. కుక్కల విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 13న ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అంతకు ముందే విచారణాధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ పోలీస్ అధికారులను సస్పెండ్ చేశారు.ఒక కేసులో నేరం చేశారన్న అభియోగాల నేపథ్యంలో చట్టప్రకారం అరెస్ట్ అయి ప్రధాన నిందితురాలుగా ఉన్న కాందబరీ జత్వానీ తనపై ఉన్న కేసుల దర్యాప్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుండగానే, ఇంకా చార్జ్‌షీట్ కూడా దాఖలు కాని సందర్భంలో, కోర్ట్‌లో ఉన్న కేసులో ఆ ప్రక్రియను నీరుగార్చేలా కేసును డైవర్ట్ చేసి, ఆ కేసులో ఫిర్యాదు ఇచ్చిన కుక్కల విద్యాసాగర్, ఆ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులపైన కౌంటర్ కేసులు పెట్టారు. ఇది దేశ చరిత్రలో ఎక్కడా ఇలా జరగలేదు. కేసు అండ్ కౌంటర్ కేసులంటే ఇరు వర్గాల మధ్య ఘర్షన జరిగిన్పపుడు ఇరు పక్షాలు కేసులు పెట్టుకుంటాయి.జత్వానీకి కూటమి సర్కార్ రాచమర్యాదలుజత్వానీ కేసులో ఏడు నెలల తరువాత ప్రభుత్వం మారగానే కూటమి ప్రభుత్వంలోని కొందరు వ్యక్తులు జత్వానీని విలాసవంతమైన హోటల్లో పెట్టి, ఆమెకు రాచమర్యాదలు చేసి, ప్రోటోకాల్ దర్శనాలు చేయిం, ఆమెతో తప్పుడు ఫిర్యాదులు తీసుకుని కేసు పెట్టారు. ఇది చట్ట ప్రకారం తప్పు. ఇది సెక్షన్ 195 సీఆర్పీసీ ప్రకారం ఆ న్యాయస్థానంలో ఏదైనా తప్పుడు కేసు పెట్టారని, తప్పుడ డాక్యుమెంట్లు చూపించారని, దర్యాప్తులో ఒక వర్గంకు అనుకూలంగా చేశారనే విషయాలు ఉంటే ఏ కోర్టులో ఆ వ్యవహారంలో జరుగుతుందో ఆ కోర్ట్ కొన్ని ఆదేశాలు ఇవ్వవచ్చు. దానిపై దర్యాప్తు చేయమని, బాధ్యులైన వారిని అరెస్ట్ చేయాలని, డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకోవాలని కోర్ట్ మాత్రమే ఆదేశాలు ఇచ్చే అధికారం ఉంది. కానీ ఈ కౌంటర్ కేసు ఏడు నెలల తరువాత పోలీస్ అధికారులపై కక్ష తీర్చుకోవడానికి ఇలా తప్పుడు కేసు పెట్టారు.చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని, పెద్ద ఎత్తున అల్లర్లు జరగాలని చంద్రబాబు సంకల్పించిన సమయంలో అప్పటి అధికారులు రాజమండ్రి జైలు వరకు ఎటువంటి అల్లర్లు జరగకుండా పకడ్భందీగా బందోబస్త్ నిర్వహించారనే కక్షతోనే వారిపై ఇలా తప్పుడు కేసులు పెట్టించారు. అలాగే సిట్ దర్యాప్తులో స్కిల్ డెవలప్మెంట్ ఇతర స్కాంలపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా కొన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. సిట్‌లోని అధికారులపై కక్ష తీర్చుకునేందుకు ఇలాంటి తప్పుడు కేసులు బనాయించారు. అలాగే సిట్‌కు సలహాదారుగా ఉన్న అడ్వకేట్ ఐ.వెంకటేశ్వర్లుపై కూడా కేసు పెట్టడం చాలా దురదృష్టకరం. ఇలాంటి సందర్భంలో ఈ కేసు చట్టం ముందు నిలబడదని తెలిసి, తాత్కాలికంగా అధికారులను వేధించేందుకు జత్వానీ వ్యవహారాన్ని ప్రభుత్వం వాడుకుంటోంది.పోలీస్ అధికారుల మనోస్థైర్యం దెబ్బతీశారుకూటమి సర్కార్ వల్ల కక్షసాధింపులు ఎదుర్కొంటున్న అధికారులు తమ సుదీర్ఘ కెరీర్లో ఒక్క చిన్న మచ్చ కూడా లేదు. వారికి అనేక అవార్డులు, మెడల్స్, ప్రభుత్వాల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవస్థలను పతనం చేసేందుకు ఎంతకైనా దిగజారుతోంది. వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. ఇదే పద్దతి వచ్చే ప్రభుత్వం కూడా అమలు చేస్తే ఏమవుతుంది? సోషల్ మీడియా, పలు తప్పుడు కేసుల్లో పోలీసులు తమపైన బలవంతంగా స్టేట్మెంట్లు తీసుకున్నారని ముద్దాయిలు ఎదురు కేసులు పెట్టే అవకాశం ఉంది. బలవంతంగా మాతో సాక్షాలు చెప్పించారంటూ పోలీసులపై సాక్షులు కేసులు పెట్టే అవకాశం ఉంది.ఒక దుష్ట సంప్రదాయంకు ఆజ్యం పోస్తున్నారు. పోలీసులు కూడా ఆలోచించాలి. పై అధికారుల ఒత్తిడితో ఇలా తప్పుడు కేసులు పెడుతున్నారు. వచ్చే ప్రభుత్వం కూడా ఇలాగే చేస్తే, దాని పరిణామాలు ఎలా ఉంటాయి? గూగూల్ టేక్ అవుట్స్, ఫోన్ రోమింగ్ సమాచారం, ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు ఇలా ప్రతి అంశాన్నీ పరిగణలోకి తీసుకుని ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నట్లుగానే వచ్చే ప్రభుత్వం చేస్తే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పటికే అనేక మంది పోలీస్ అధికారులకు జీతాలు చెల్లించకుండా, రీజనల్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తోంది. పోలీస్ అధికారుల సంఘాలు కూడా దీనిపై స్పందించాలి. రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గి ఏదో ఒక రకంగా తప్పుడు కేసులు పెట్టి, అధికారులను సంతృప్తి పరిచామంటూ చేతులు దులుపుకుంటే, భవిష్యత్తులో న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా కేసుల్లో పోలీస్ అధికారులు గతంలో అరెస్ట్ చేసిన ముద్దాయిలతో ఎదురు కేసులు పెట్టిస్తున్నారు.మద్యంపైనా ఇదే తరహా కౌంటర్ కేసులుతెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మద్యంలో జరిగిన అక్రమాలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. చంద్రబాబు దీనిలో ముద్దాయిగా ఉన్నారు. ఈ కేసులో వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారనే కక్షతోనే బేవరేజెస్ కార్పోరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు పలువురు అధికారులపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం లిక్కర్ స్కాం అంటూ కౌంటర్ కేసులు పెట్టింది. ప్రభుత్వమే మద్యంను విక్రయించిన నేపథ్యంలో స్కాం అనే దానికే అర్థం లేదు. అలాంటిది రాజకీయంగా వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుని లిక్కర్ స్కాం అంటూ కేసులు పెట్టారు.అధికారులను దీనిలో భాగస్వాములు చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాల్లో మద్యం కేసుల్లో ఏ అధికారి ఎవరి ఇంటికి వెడుతున్నారు, ఏ డిస్టిలరీ యజమానితో మాట్లాడారు, ఎవరితో ఏ రకంగా ఫిర్యాదులు చేయిస్తున్నారో అందరికీ తెలుసు. భవిష్యత్తులో వీటిపై పోలీసులు న్యాయస్థానాల ముందు ఇబ్బందులను ఎదుర్కొంటారు. పోలీసులు చట్ట ప్రకారం, న్యాయ ప్రక్రియ ప్రకారం పనిచేయాలి. రాజకీయ విశ్వాసం కోసం కాకుండ ప్రజల విశ్వాసం కోసం పనిచేయాలి. -
విచారణకు రాలేను.. ఈడీకి మహేశ్‌బాబు లేఖ
సాక్షి, హైదరాబాద్: సాయిసూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీల మనీలాండరింగ్ కేసులో విచారణకు రాలేనంటూ మహేశ్ బాబు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి లేఖ రాశాడు. షూటింగ్ కారణంగా రేపు (ఏప్రిల్ 28) ఈడీ ఎదుట హాజరు కాలేనని తెలిపాడు. విచారణ కోసం మరో తారీఖును ఫిక్స్ చేయాలని కోరాడు.ఎందుకీ విచారణ?సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థలు.. రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో సాయితులసి ఎన్క్లేవ్, షణ్ముఖ నివాస్ పేరుతో వెంచర్లు వేశాయి. సాయిసూర్య డెవలపర్స్ ఒక్కో ప్లాట్‌కు రూ.3.25 కోట్ల చొప్పున కొనుగోలుదారులతో ఒప్పందాలు చేసుకుని, అడ్వాన్స్‌గా రూ.1.45 కోట్ల చొప్పున వసూలు చేసింది. నెలలు గడుస్తున్నా ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో బాధితులు గత నవంబర్‌లో సైబరాబాద్ ఈవోడబ్ల్యూకు ఫిర్యాదు చేశారు.రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలు11 కేసులు నమోదు చేసిన పోలీసులు సాయిసూర్య డెవలపర్స్ ప్రొప్రైటర్ కె. సతీష్‌చంద్ర గుప్తా, భాగ్యనగర్ ప్రాపర్టీస్ ప్రమోటర్ నరేంద్ర సురానాను నవంబర్లోనే అరెస్ట్ చేశారు. ఒకరికి విక్రయించిన ప్లాట్‌ను మరికొందరి పేర్లపై రిజిస్టర్ చేసి వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీలైన సాయిసూర్య డెవలపర్స్, భాగ్యనగర్ ప్రాపర్టీస్ సంస్థల్లో ఏప్రిల్ 16న ఈడీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలను గుర్తించింది. రూ.74.5 లక్షలు నగదు సీజ్ చేసింది. ప్రచారకర్తగా మహేశ్ ఉన్నందువల్లే..సాయిసూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా ఉన్న మహేశ్‌బాబుకు రూ.5.9 కోట్లు చెల్లించినట్లు ఆధారాలు సేకరించింది. దీనిపై మరింత సమాచారం సేకరించేందుకు ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావాలని మహేశ్‌బాబుకు ఈడీ నోటీసులు పంపింది. విచారణకు వచ్చే సమయంలో పాన్‌కార్డ్, బ్యాంక్ అకౌంట్లకు సంబంధించిన పాస్‌బుక్స్‌ను తీసుకురావాలని సూచించింది. కానీ రాజమౌళి సినిమాతో (#SSMB29) బిజీగా ఉండటంతో మహేశ్ విచారణకు రాలేనని తాజాగా లేఖ రాశాడు.చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి: దర్శకుడు -
IPL 2025: ధోని ఇంకో సీజన్ కూడా ఆడతాడు..!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో కొనసాగుతుంది. ఈ సీజన్లో సీఎస్కే అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నప్పటికీ.. అది ఆచరణలో సాధ్యం కాకపోవచ్చు. ఆ జట్టు తదుపరి ఆడబోయే ఐదు మ్యాచ్‌ల్లో భారీ తేడాతో గెలవాలి. అయినా సీఎస్కే భవితవ్యం ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడి ఉంటుంది.ఈ సీజన్లో సీఎస్కే దుస్థితికి జట్టు ఎంపికే ప్రధాన కారణమన్నది బహిరంగ రహస్యం. మెగా వేలంలో సీఎస్కే యాజమాన్యం రాహుల్ త్రిపాఠి, దీపక్ హుడా, విజయ్ శంకర్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ఔట్ డేటెడ్ ఆటగాళ్లను ఎంపిక చేసుకుని మూల్యం చెల్లించుకుంది. జట్టులో ఒక్క విధ్వంసకర బ్యాటర్ ఉండేలా కూడా జాగ్రత్త పడలేదు. బౌలింగ్ విభాగంలో పర్వాలేదనినపిస్తున్నా ప్రతి మ్యాచ్‌లో వారిని నుంచే ఆశించడం అత్యాశ అవుతుంది.ఈ సీజన్లో సీఎస్కే పేలవ ప్రదర్శనల నేపథ్యంలో ఆ జట్టు తాతాల్కిక సారధి ఎంఎస్ ధోని భవితవ్యంపై కూడా మరోసారి చర్చ మొదలైంది. ధోని కాస్తో కూస్తో ఫామ్‌లో ఉన్నప్పుడే హుందాగా తప్పుకుని ఉంటే బాగుండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. వయసు మీద పడటంతో ధోని తన పాత్రకు అస్సలు న్యాయం చేయలేకపోతున్నాడని విశ్లేషకులు వాదిస్తున్నారు.ఐపీఎల్లో సీఎస్కే మరియు ధోని భవితవ్యంపై చిన్న తలా సురేశ్ రైనా స్పందించాడు. జతిన్ సప్రుతో చాట్‌లో మాట్లాడుతూ.. ధోని కనీసం ఇంకో సీజన్ ఆడతారని విశ్వాసం వ్యక్తం చేశాడు. సీఎస్కే వచ్చే సీజన్లో మెరుగైన ప్రణాళికతో ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ధోని తన బ్రాండ్ మరియు అభిమానుల కోసమే క్రికెట్ ఆడుతున్నాడని అన్నాడు. 43 ఏళ్ల వయసులోనూ బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌తో పాటు కెప్టెన్సీ బాధ్యతలు కూడా మోస్తూ సీఎస్కే కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్నాడని తెలిపాడు. ధోని ఒక్కడే అన్ని బాధ్యతలను మోస్తుంటే మిగతా పది మంది ఆటగాళ్ళు ఏం చేస్తున్నారని ప్రశ్నించాడు.జట్టు ఎంపికలో ధోనిదే తది నిర్ణయం అన్న ప్రచారాన్ని కొట్టి పారేశాడు. పలానా ఆటగాడితో కొనసాగాలా వద్దా అన్న దానిపై మాత్రం ధోనికి కాల్ రావచ్చని తెలిపాడు. తనకు తెలిసి జట్టు ఎంపిక ప్రక్రియలో ధోని ఎప్పుడూ పాల్గొనలేదని స్పష్టం చేశాడు. ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని సీఎస్కే కోర్ గ్రూప్ పర్యవేక్షిస్తుందని తెలిపాడు. ఒకవేళ కోర్ గ్రూప్ ధోనిని తన అభిప్రాయాన్ని వెల్లడించమని అడిగినా అతను నలుగురైదుగురు ఆటగాళ్ల పేర్లను సూచించి ఉండవచ్చని తెలిపాడు. -
‘తల్లికి వందనం అమలు ఎప్పుడు చంద్రబాబూ?’
సాక్షి, తాడేపల్లి: విద్యతోనే పేదరికంను నిర్మూలించాలన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో చూసిన ఘనత వైఎస్ జగన్‌ది అయితే, విద్యను పేదలకు దూరం చేస్తున్న దుర్మార్గం చంద్రబాబుదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించిన చంద్రబాబు దానిని అమలు చేయడానికి ఖజానా ఖాళీ అంటూ వంకలు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పసిపిల్లల చదువులపైనా చంద్రబాబు కర్కశత్వం చూపుతున్నారని, విద్యార్ధుల ఉసురుపోసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..ఏపీలో కూటమి ప్రభుత్వం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోరుకున్న రాజ్యాంగ స్పూర్తికి తిలోదకాలు ఇస్తోంది. పేదల స్థితిగతులు మార్చాల్సిన కూటమి ప్రభుత్వం దానికి భిన్నంగా పనిచేస్తోంది. సామాజిక రుగ్మతలు పోవాలంటే చదువే ప్రామాణికమని ఆనాడు బీఆర్ అంబేద్కర్ చెప్పారు. విద్యతోనే పేదల తలరాతలు మారుతాయని వైయస్ జగన్ నమ్మి, తన పాలనలో దానిని ఆచరణలోకి తీసుకువచ్చారు. సామాజిక మార్పు కోసం విద్యకు పెద్దపీట వేశారు.వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రతి తల్లి ఖాతాలో రూ.15వేలను జమ చేయడం ద్వారా రాష్ట్రంలో గొప్ప సంస్కరణలకు ఆద్యుడు అయ్యారు. నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకానికి పేరు మార్చి తల్లికి వందనం అని ప్రకటించారు. ఏ కుటుంబంలో అయినా ఎంతమంది పిల్లలు బడికి వెళ్ళేవారు ఉంటే ప్రతి ఒక్కరికీ రూ.15 వేల చొప్పున ఆ పిల్లల తల్లికి ఇస్తామని ఎన్నికలకు ముందు కూటమి పార్టీలు గొప్పగా ప్రచారం చేసుకున్నాయి.ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో చంద్రబాబు బహిరంగసభల్లో ఏం మాట్లాడారో కూడా ఈ మీడియా సమావేశంలో ప్రజలు గమనించేందుకు వీలుగా ప్రదర్శిస్తున్నాం. అలాగే ప్రస్తుత మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు ప్రతి ఇంటికి వెళ్ళి 'నీకు పదిహేను... నీకు పదిహేను వేలు అంటూ' అందరినీ నమ్మించారు. దానికి సంబంధించిన వీడియోను కూడా ప్రజలు చూసేందుకు గానూ ప్రదర్శిస్తున్నాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత తల్లికి వందనం కింద ఇస్తామన్న సొమ్ము ఏమయ్యిందని ప్రశ్నిస్తున్నాం. సీఎం చంద్రబాబు చదువులమ్మ తల్లిని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారు.వాయిదాల రూపంలో ఇస్తారా..కూటమి ప్రభుత్వం మిగిలిన అన్ని హామీలతో పాటు తల్లికివందనంను కూడా గాలికి వదిలేసింది. దీనిపై మేం బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తుంటే, ఖజానా ఖాళీ అయ్యిందని చంద్రబాబు వంకలు వెతుకుతున్నాడు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ తల్లికివందనం కింద ఇచ్చే రూ.15వేలను కూడా వాయిదాల రూపంలో ఇస్తానని మాట మార్చారు. మేం అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేస్తుంటే... 'అమ్మ ఒడి-నాన్న బుడ్డీ' అంటూ కూటమి పార్టీలు అత్యంత హేయంగా విమర్శించారు. ఇప్పుడు కూటమి పాలనలో మంచినీళ్ళు దొరకడం లేదు, కానీ మద్యం మాత్రం ఏరులై పారుతోంది. విద్యపట్ల, విద్యార్ధుల తల్లులకు ఇచ్చే అమ్మ ఒడి పట్ల చంద్రబాబుకు ఉన్న చిన్నచూపుకు గతంలో ఆయన చేసిన విమర్శలే నిదర్శనం.విద్యారంగానికి పెద్దపీట వేసిన వైఎస్ జగన్‘‘డబ్బు లేక పిల్లలు విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైయస్ జగన్ అమ్మ ఒడి కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా నాలుగేళ్ల పాటు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేశారు. అయిదో ఏడాది కూడా 2024 జూన్ నాటికి ఇవ్వడానికి అన్ని సిద్దం చేసి ఎన్నికలకు వచ్చారు. జగన్ ప్రభుత్వంలో 83 లక్షల మంది పిల్లలకు 44,48,865 మంది తల్లుల ఖాతాలకు రూ. 26,౦67 కోట్లు జమ చేశారు. 57 నెలల్లో విద్య కోసం ఆనాడు వైఎస్ జగన్ జగనన్న విద్యాకానుక కోసం రూ.3366 కోట్లు, జగనన్న గోరుముద్ద కోసం రూ.4417 కోట్లు, మాబడి నాడు-నేడు రెండు దశలకు కలిపి రూ. 13000 కోట్లు, వైఎస్సార్ సంపూర్ణ పోషణ కోసం రూ.6688 కోట్లు, ఆడపిల్లల నాప్కిన్ల కోసం రూ.32 కోట్లు, విద్యార్ధులకు బైజూన్ కంటెంట్ ట్యాబ్‌ల కోసం రూ.1300 కోట్లు..విద్యాదీవెన కోసం 12610, వసతి దీవెన కోసం రూ.5392 కోట్లు, విదేశీ విద్యాదీవెన కోసం రూ.107 కోట్లు ఇలా వివిధ పథకాల కోసం మొత్తం దాదాపు 72,919 కోట్లు ఖర్చు చేశారు. ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ చదువుల కోసం, విద్యాప్రమాణాలను పెంచడం కోసం ఇలా ఖర్చు చేయలేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి అక్కచెల్లెమ్మల పిల్లలకు మేనమామగా వారి విద్యకు అండగా నిలుస్తానని ఆనాడు వైఎస్ జగన్ ముందుకు వచ్చారు. కానీ నేడు ఆ పరిస్థితిని చంద్రబాబు పూర్తిగా మార్చేశారు. తల్లికి వందనంపై రోజుకో మాట చెబుతూ, విద్యార్ధులను వారి తల్లులను ఏమార్చేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ఎండగడతాం. ఇచ్చిన మాట ప్రకారం తక్షణం తల్లికి వందనం కింద విద్యార్ధులకు చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మేరుగు నాగార్జున స్పష్టం చేశారు. -
LSG Vs MI: లక్నోపై ముంబై ఇండియన్స్ ఘన విజయం
LSG vs MI Live Updates: ముంబై ఘన విజయంవాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 పరగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. 216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్లతో చెలరేగాడు.అతడితో పాటు ట్రెంట్ బౌల్ట్ మూడు, విల్ జాక్స్ రెండు, బాష్ ఓ వికెట్ సాధించారు. లక్నో బ్యాటర్లలో ఆయూష్ బదోని(35) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిచెల్ మార్ష్(34) పర్వాలేదన్పించాడు. బుమ్ బుమ్ బుమ్రా.. ఒకే ఓవర్లో మూడు వికెట్లుజస్ప్రీత్ బుమ్రా తన పేస్ బౌలింగ్‌తో లక్నో బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 16వ ఓవర్ వేసిన బుమ్రా ఏకంగా మూడు వికెట్లు పడగొట్టాడు. 18 ఓవర్లు ముగిసే సరికి లక్నో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.బదోని ఔట్..అయూష్ బదోని రూపంలో లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన బదోని.. బౌల్ట్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులో డేవిడ్ మిల్లర్(24), సమద్(1) ఉన్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.లక్నో నాలుగో వికెట్ డౌన్..మిచెల్ మార్ష్(34) రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. ట్రెంట్ బౌలింగ్‌లో మార్ష్ ఔటయ్యాడు. క్రీజులోకి డేవిడ్ మిల్లర్ వచ్చాడు. లక్నో విజయానికి 42 బంతుల్లో 93 పరుగులు కావాలి.ఒకే ఓవర్లో రెండు వికెట్లు డౌన్..లక్నో సూపర్ జెయింట్స్ 7వ ఓవర్లో రెండు కీలక వికెట్లను కోల్పోయింది. 7 ఓవర్ వేసిన విల్ జాక్స్ బౌలింగ్‌లో తొలి బంతికి పూరన్(27) ఔట్ కాగా.. మూడో బంతికి రిషబ్ పంత్(24) పెవిలియన్ చేరాడు. 8 ఓవర్లు ముగిసే సరికి లక్నో మూడు వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది.లక్నో తొలి వికెట్ డౌన్..216 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. 9 పరుగులు చేసిన ఐడైన్ మార్క్రమ్.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 4 ఓవర్లు ముగిసే సరికి లక్నో వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. క్రీజులో పూరన్(6), మార్ష్(13) ఉన్నారు.సూర్య, రికెల్టన్ హాఫ్ సెంచరీలు.. లక్నో టార్గెట్ ఎంతంటే?వాంఖడే స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీ స్కోర్ చేసింది.ముంబై బ్యాటర్లలో రికెల్టన్(58), సూర్యకుమార్ యాదవ్(54) హాఫ్ సెంచరీలతో మెరవగా.. నమన్ ధీర్(25), జాక్స్(29), బాష్(20) రాణించారు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్, అవేష్ ఖాన్ తలా రెండు వికెట్లు సాధించారు. వీరితో పాటు ప్రిన్స్ యాదవ్, దిగ్వేష్, బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.ముంబై ఐదో వికెట్ డౌన్157 పరుగుల వద్ద ముంబై ఇండియన్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా.. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 17 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 174/5ముంబై నాలుగో వికెట్ డౌన్తిలక్ వర్మ రూపంలో ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 5 పరుగులు చేసిన తిలక్.. రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 15 ఓవర్లకు ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్ యాదవ్(44), హార్దిక్ పాండ్యా(5) ఉన్నారు.ముంబై ఇండియన్స్ మూడో వికెట్ డౌన్..విల్ జాక్స్ రూపంలో ముంబై మూడో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జాక్స్.. ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 12 ఓవర్లు ముగిసే సరికి ముంబై ఇండియన్స్ 3 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. క్రీజలో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(15) ఉన్నారు.ముంబై ఇండియన్స్ రెండో వికెట్ డౌన్..ర్యాన్ రికెల్టన్ రూపంలో ముంబై ఇండియన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 58 పరుగులు చేసిన రికెల్టన్.. దిగ్వేష్ రతి బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. 11 ఓవర్లకు ముంబై ఇండియన్స్ స్కోర్: 115/26 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబై ఇండియన్స్ పవర్ ప్లేలో అదరగొట్టింది. తొలి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 66 పరుగులు చేసింది. రికెల్టన్ (24 బంతుల్లో 49; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) జోరు మీద ఉన్నాడు. అతనికి జతగా విల్ జాక్స్ (3) క్రీజ్‌లో ఉన్నాడు. వరుసగా 2 సిక్సర్లు బాది ఔటైన రోహిత్ శర్మటాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు మూడో ఓవర్లోనే షాక్ తగిలింది. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో వరుసగా 2 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ (12) అదే ఓవర్లో ఔటయ్యాడు. 3 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్ 33/1గా ఉంది. రికెల్టన్ (19), జాక్స్ క్రీజ్‌లో ఉన్నారు.టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నోఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌తో లక్నో స్పీడ్ గన్ మయాంక్ యాదవ్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. శార్దూల్ ఠాకూర్ స్థానంలో మయాంక్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు ముంబై ఇండియన్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది. సాంట్నర్ స్థానంలో కర్ణ్ శర్మ.. విజ్ఞేశ్ పుథుర్ స్థానంలో కార్బిన్ బాష్ తుది జట్టులోకి వచ్చారు.తుది జట్లు..ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ర్యాన్ రికెల్టన్(w), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), నమన్ ధీర్, కార్బిన్ బాష్, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మలక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(w/c), అబ్దుల్ సమద్, ఆయుష్ బడోని, దిగ్వేష్ సింగ్ రాఠీ, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్ -
చిరంజీవి స్ఫూర్తితోనే ప్రారంభించా.. అంతా తెలుగు వారి సహకారమే: సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మూవీలో బుట్టబొమ్మ పూజా హేగ్డే హీరోయిన్గా నటించింది. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వస్తోన్న ఈ సినిమా మే 1న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ హైదరాబాద్సో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన సూర్య ఆసక్తికర కామెంట్స్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితోనే తాను అగరం పౌండేషన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.హైదరాబాద్‌లోని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ చూసి తాను స్ఫూర్తి పొందినట్లు సూర్య వివరించారు. మెగాస్టార్‌ను ఆదర్శంగా తీసుకుని చెన్నైలో అగరం ఫౌండేషన్‌ను ప్రారంభించినట్లు సూర్య వెల్లడించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌ను సందర్శించిన తర్వాత తాను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.సూర్య మాట్లాడుతూ.. 'ఇదంతా ఇక్కడే మొదలైంది. ఇక్కడ ఒకరోజు చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌కి వెళ్లాను. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. " అన్నారు. ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు. అగరం ఫౌండేషన్‌ను ప్రారంభించేందుకు మీరు నాకు శక్తిని, ధైర్యాన్ని అందించారు. మీ వల్ల ఎనిమిది వేల మందికి పైగా గ్రాడ్యుయేట్లు అయ్యారు. మీ అందరి సహకారం వల్లే ఇది సాధ్యమైంది. తన ఫౌండేషన్ కోసం తెలుగు వారి నుంచి పెద్ద మొత్తంలో విరాళాలు వస్తున్నాయి. ఐదేళ్ల క్రితం అగరం ఫౌండేషన్ కోసం నిధుల సేకరణ కోసం యుఎస్‌లో ఉన్నా. అక్కడ ఉన్న తమిళ విద్యార్థుల కోసం తెలుగు మాట్లాడే వారి నుంచే ఎక్కువ నిధులు వచ్చాయి. తెలుగు ప్రజలు చాలా దయగల హృదయం ఉన్న వ్యక్తులు. వారు ఇప్పటికీ తమిళ విద్యార్థుల చదువుకు మద్దతు ఇస్తున్నారు. ఈ విషయంలో మీపట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నా' అని అన్నారు. కాగా.. ఈ సినిమా నాని నటించిన హిట్-3 మూవీతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడనుంది. -
పాకిస్థాన్ నుంచి ఆపరేట్.. విశాఖలో లోన్ యాప్ ముఠా అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో లోన్ యాప్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ లోన్ యాప్.. పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలను పోలీసులు గుర్తించారు.ఈ ముఠా లోన్ యాప్‌ల ద్వారా ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడితో సహా 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోన్ యాప్‌లో రూ. 2 వేల రూపాయలు అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. నరేంద్ర భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు.. బంధువులకు పంపించారు. దీంతో అవమాన భారంతో పెళ్లయిన 40 రోజులకే నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు.పాకిస్థాన్ కేంద్రంగా ఈ ముఠా నడుస్తున్నట్టు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. సుమారు భారత్ నుంచి 9 వేల మంది బాధితులు ఈ ముఠా చేతిలో మోసపోయినట్టు గుర్తించిన పోలీసులు.. 18 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, 54 సిమ్‌లు, రూ.60 లక్షల రూపాయల నగదును ఫ్రిజ్ చేశారు. -
యంగ్ హీరోయిన్ కి అనుకోని సమస్య.. పోస్ట్ వైరల్
చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేస్తున్న అమ్మాయి అనికా సురేంద్రన్. స్వతహాగా మలయాళీ అయినప్పటికీ తమిళంలోనూ వరస చిత్రాలు చేస్తోంది. తాజాగా 'జాబిలమ్మ నీకు అంత కోపమా' అనే మూవీతో తెలుగు ప్రేక్షకుల్ని కూడా పలకరించింది.సరే అసలు విషయానికొస్తే ఈమెకు గత రెండు నెలల నుంచి ఓ చిన్న సమస్య ఇబ్బంది పెడుతుందట. ఇన్ స్టాలో తన రీల్స్ కి మ్యూజిక్ జోడిద్దామంటే కుదరట్లేదని చెబుతూ ఫన్నీగా పెట్టిన ఫేస్ ఫొటోని పోస్ట్ చేసింది. తన మిగతా అకౌంట్లకు ఈ ఫీచర్ వర్క్ అవుతుందని కానీ తన అఫీషియల్ అకౌంట్ కి మాత్రం రెండు నెలలుగా అవ్వట్లేదని చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: కీరవాణికి చిన్నపిల్లలే కావాలి.. అతడిపై పోక్సో కేసు పెట్టాలి: దర్శకుడు)సరేలే అని బిజినెస్ అకౌంట్ నుంచి క్రియేటర్ అకౌంట్ గా మార్చినప్పటికీ.. మ్యూజిక్ జోడించే ఫీచర్ మాత్రం కావట్లేదని అనికా చెప్పుకొచ్చింది. ఈ విషయంలో తనకు ఎవరైనా కాస్త చేయండని రిక్వెస్ట్ చేసింది. 2010లో బాలనటిగా కెరీర్ ప్రారంభించిన అనిక.. తెలుగులోనూ నాగార్జున 'ద ఘోస్ట్'లో చైల్డ్ ఆర్టిస్టుగా, 'బుట్టబొమ్మ'లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం ఓ తమిళ మూవీలో నటిస్తోంది.(ఇదీ చదవండి: పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన జింఖానా మూవీ డైరెక్టర్) -
స్నానానికి సిగ్నల్ సిస్టమ్.. కొలతల కొళాయి: సరికొత్త గ్యాడ్జెట్స్
అసలే వేసవి కాలం, నీటి కష్టాలు చాలానే ఉంటాయి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే.. పట్టణ ప్రాంతాల్లో వాటర్ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి నీటిని పొదుపుగా వాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికోసం కొన్ని ప్రత్యేకమైన పరికరాలు అందుబాటులోకి వచ్చేశాయి. వీటి గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో..వాటర్ పెబుల్కచ్చితమైన కొలతతో స్నానం చేస్తే చాలా నీటిని ఆదా చేసిన వారమవుతాం. అయితే, అంత కచ్చితంగా కొలత ప్రకారం స్నానం చేయడం సులువుగా సాధ్యం కాదు. అందుకే, రూపొందించారు ఈ ‘వాటర్ పెబుల్’. చూడ్డానికి చిన్న గుండ్రటి బిళ్లలా కనిపిస్తుంది. కాని, ఈ పెబుల్ మిమ్మల్ని కేవలం నాలుగు నిమిషాల్లో మాత్రమే స్నానం చేసేలా ట్రైన్ చేయగలదు.సమయం మించిపోయే కొద్దే ట్రాఫిక్ సిగ్నల్స్ మాదిరి ఎరుపు, నారింజ, ఆకుపచ్చ లైట్లతో హెచ్చరికలు చేస్తుంది. ఎరుపు రంగు లైట్ చూపిస్తే, స్నానం వెంటనే పూర్తి చేయమని అర్థం. నారింజ అయితే సగం స్నానం పూర్తి చేశారని అర్థం. ఆకుపచ్చ అయితే, సమయం ఇంకా ఉందని అర్థం. ఇలా ఎంతో సులభంగా అందరూ అర్థం చేసుకునేలా ఉండే దీని ధర 14 డాలర్లు (రూ. 1,119) మాత్రమే!కొలతల కొళాయి మంచినీటి కొళాయి మనకు ఎంత అవసరమో అంతే నీటిని, కొలిచి ఇస్తే బాగుంటుంది కదూ! అచ్చం ఇలాగే ఈ ‘మెజర్ఫిల్ టచ్ కిచెన్ టాప్’ పనిచేస్తుంది. చాలా రకాల వంటకాలు కచ్చితమైన నీటి కొలతతోనే వండాలి. వంటగదికి ఇది బాగా ఉపయోగపడుతుంది. వంద మిల్లీ లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు కచ్చితమైన నీటి పరిమాణాన్ని ఇది అందించగలదు. అవసరమైన మేర కొలతను సర్దుబాటు చేసుకునే వీలుంది. ఇక ఇందులోని టచ్ ఫంక్షనాలిటీ సాయంతో సులభంగా ఆన్, ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ట్యాప్ ఆఫ్ చేయటం మర్చిపోతే, ఐదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్‌గా ట్యాప్ ఆఫ్ అయిపోతుంది. ధర రూ. 359 డాలర్లు (రూ. 30,741).ఇదీ చదవండి: కొత్త ఏటీఎమ్.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్..తడిపొడి విడివిడి..వేసవి వచ్చిదంటే చాలామంది వాటర్ రైడ్స్, స్విమ్మింగ్ ఇలా వివిధ రకాల జలక్రీడలతో కాలక్షేపం చేయడానికి Ðð ళ్తుంటారు. అయితే, చెమట, తడి దుస్తుల కారణంగా లగేజీ మొత్తం దుర్వాసన వస్తుంది. ఇలా కాకుండా ఈ వెట్ అండ్ డ్రై సపరేషన్ బ్యాగ్‌తో తడి దుస్తులను, పొడి దుస్తులను వేర్వేరుగా ఉంచితే, దుర్వాసన రాకుండా ఇది అరికడుతుంది. ఇది అత్యుత్తమ వాటర్ ప్రూఫ్ లైనింగ్, వాటర్ ప్రూఫ్ జిప్పర్తో వస్తుంది. జిమ్, లాండ్రీ బ్యాగ్‌లా కూడా దీనిని ఉపయోగించుకోవచ్చు. స్మాల్, మీడియం, లార్జ్ ఇలా వివిధ సైజుల్లో లభిస్తుంది. ధర వివిధ తయారీ కంపెనీలు, పరిమాణాలను బట్టి ఉంటుంది. -
75 ఏళ్లుగా చెక్కుచెదరని పెంకుటిల్లు..!
ధాన్యాగారంగా మిద్దెలు.. చంటిబిడ్డ ఊయలకు దూలాల సహకారం.. ఉమ్మడి కుటుంబాలకు చిరునామాలు ఈ పెంకుటిల్లు. 75 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఠివీగా నిలబడ్డాయి. అందానికి అందం.. ఆహ్లాదం పంచుతున్న ఈ ఇళ్లు నవతరాన్ని పాతకాలం నాటి రోజుల్లోకి తీసుకెళ్తున్నాయి. తాతలు కట్టించిన ఈ పెంకుటిళ్లపై మమకారంతో వారసులు ఆధునిక సొబగులు అద్దుతున్నారు. బోధన్: పల్లెల్లో అనాదిగా వ్యవసాయమే ముఖ్య జీ వనాధారమైన ధనిక, మధ్యతరగతి రైతు కుటుంబాలు తమ అవసరాలకనుగుణంగా మట్టి గోడల తో పెంకుటిళ్లను విశాలంగా నిర్మించారు. పాడి పశువులు, ధన ధాన్యాలు పదిలపర్చుకునేలా అపురూప ఆకృతులతో మట్టి, టేకు కర్రలు ఉపయోగించి కట్టుకున్న ఇళ్లు ఏళ్లు గడిచినా చెక్కుచెదరకుండా దర్శనమిస్తున్నాయి. తాతలు కట్టించిన పెంకుటిళ్లపై మమకారంతో వారసత్వ సంపదగా గుర్తించి వాటికి రూ. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేపట్టి ఆధునికతను జోడిస్తున్నారు. ఈ పెంకుటిల్లు వయస్సు 75 ఏళ్లు సాలూర మండల కేంద్రంలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన దివంగత ములిగే వీరన్న కట్టించిన ఇళ్లు ఇది. 75 ఏళ్ల క్రితం పాండ్రి మట్టి (తెల్లమట్టి),పై కప్పు, టేకు కర్రలు, కుమ్మరి పెంకు, దూలాలు, వాసాలు ఉపయోగించి పటిష్టంగా నిర్మించారు. 3 ఫీట్ల వెడల్పాటి మట్టి గోడలు, 15 ఫీట్ల ఎత్తుతో రెండస్తుల ఇల్లు నిర్మించి దశాబ్దాలపాటు అందులోనే నివసించారు. ములిగే æ వీరన్న మనుమడు ములిగే జయరాం రెండేళ్ల క్రితం పైమొదటి అంతస్తును తొలగించి మరమ్మతులు చేయించారు. పైకప్పు కుమ్మరి పెంకుకు బదులు బెంగుళూర్ పెంకుని అమర్చారు. మట్టి గోడలకు సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయించి, రంగులద్ది అందంగా తీర్చిదిద్దాడు. ఇంటిలోపల, ముందు భాగంలో ఆహ్లాదకర వాతావరణం కోసం పూలు, పండ్ల మొక్కలు పెంచారు. నాటి మట్టిగోడల పెంకుటిల్లు ప్రస్తుతం అందమైన పొదరిల్లులా దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది. తాత కట్టించిన ఇంటిపై మమకారంతో సౌకర్యవంతంగా మార్చుకొని కుటుంబసభ్యులతో కలిసి జయరాం నివసిస్తున్నాడు. మట్టి గోడలు వేడిని గ్రహించి, ఇళ్లు వేడిగా మారకుండా నిరోధిస్తాయని, దీంతో ఇళ్లంతా చల్లదనంతో ఉంటుందని జయరాం అంటున్నారు. శీతాకాలంలో వెచ్చదనం, వేసవి కాలంలో ఎండలు దంచి కొడుతున్నా చల్లదనాన్ని పంచుతోందని చెబుతున్నారు. ఈ ఇళ్లంటే ఎంతో ఇష్టం మా తాత కట్టిన ఇళ్లంటే మాకెంతో ఇష్టం. ఆ రోజుల్లోనే డూప్లెక్స్ ను మరిపించేలా క ట్టించారు. మా పిల్లల కు సైతం ఈ ఇళ్లంటే ఎంతో మక్కువ. అప్పుడప్పుడు మరమ్మతులు చేయిస్తూ ఇక్కడే నివసిస్తున్నాం. – బండారు హన్మాండ్లు సేట్ ఎండకాలం చల్లగా... చలికాలం వెచ్చగా.. రుద్రూర్: ప్రస్తుత ఎండలతో ఏసీ లేదా కూలర్ లేనిదే ఇంట్లో ఉండలేని పరిస్థితి ఉంది. కానీ పాతకాలంలో మట్టితో కట్టిన ఇళ్లు చల్లదనాన్ని పంచుతున్నాయి. పొతంగల్ మండల కేంద్రంలో 75 ఏళ్ల క్రితం బండారు అరుణ్ సేట్ తండ్రి విఠల్ సేట్ నిర్మించిన ఇళ్లు పాత కాలంనాటి వైభవానికి అద్దం పడుతోంది. అప్పట్లో మట్టి, డంగు సున్నం, టేకు కర్రలతో ఈ ఇళ్లు నిర్మించారు. మధ్యలో ఖాళీగా ఉంచి నాలుగు వైపులా రెండతస్తులతో డూప్లెక్స్‌ను మైమరించేలా తీర్చిదిద్దారు. -
ఏఐ జాబ్ మార్కెట్ బూమ్.. టాప్ 10 స్కిల్స్ ఇవే..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగ మార్కెట్ అనూహ్యమైన వృద్ధిని సాధిస్తోంది. యునైటెడ్ స్టేట్స్లో 2024లో ఏఐ జాబ్ పోస్టింగ్‌లలో 20% పెరుగుదల నమోదైందని లైట్కాస్ట్ నిర్వహించిన 2025 AI ఇండెక్స్ రిపోర్ట్ తెలిపింది. 109 బిలియన్ డాలర్ల ప్రైవేట్ పెట్టుబడులతో ఊపందుకున్న ఈ మార్కెట్, ప్రత్యేక ఏఐ నైపుణ్యాల డిమాండ్‌ను పెంచుతూ ఉద్యోగ రంగాన్ని పునర్నిర్మిస్తోంది.పైథాన్ అత్యంత డిమాండ్ ఉన్న నైపుణ్యంగా నిలిచింది. గత సంవత్సరం దాదాపు 200,000 ఉద్యోగ పోస్టింగ్‌లలో ఈ నైపుణ్యాన్ని అడిగారు. రిపోర్ట్ ప్రకారం.. పైథాన్, ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌తోపాటు అధిక డిమాండ్ ఉన్న టాప్ 10 ఏఐ ఉద్యోగ నైపుణ్యాలు ఇవే..👉పైథాన్ (199,213 పోస్టింగ్‌లు, 2012-2014తో పోలిస్తే 527% వృద్ధి)👉కంప్యూటర్ సైన్స్ (193,341 పోస్టింగ్‌లు, 131% వృద్ధి)👉డేటా అనాలిసిస్ (128,938 పోస్టింగ్‌లు, 208% వృద్ధి)👉SQL (119,441 పోస్టింగ్‌లు, 133% వృద్ధి)👉డేటా సైన్స్ (110,620 పోస్టింగ్‌లు, 833% వృద్ధి)👉ఆటోమేషన్ (102,210 పోస్టింగ్‌లు, 361% వృద్ధి)👉ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ (101,127 పోస్టింగ్‌లు, 87% వృద్ధి)👉అమెజాన్ వెబ్ సర్వీసెస్ (100,881 పోస్టింగ్‌లు, 1,778% వృద్ధి)👉అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్‌లు, 334% వృద్ధి)👉స్కేలబిలిటీ (86,990 పోస్టింగ్‌లు, 337% వృద్ధి)కింగ్ ‘పైథాన్’పైథాన్ బహుముఖ ప్రజ్ఞ, విస్తృత లైబ్రరీలు దీనిని ఏఐ అభివృద్ధిలో కీలకమైన అంశంగా మార్చాయని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో డేటా సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఎమిలీ చెన్ అన్నారు. "మెషిన్ లెర్నింగ్ నుండి ఆటోమేషన్ వరకు, పైథాన్ అనివార్యం" ఆమె తెలిపారు.డేటా సైన్స్ (833% వృద్ధి), అమెజాన్ వెబ్ సర్వీసెస్ (1,778% వృద్ధి) వంటి నైపుణ్యాలు అత్యధిక వృద్ధిని సాధించాయి, ఇవి సంక్లిష్ట డేటాసెట్ల నుండి సమాచారాన్ని సంగ్రహించే, స్కేలబుల్ ఏఐ సిస్టమ్‌లను నిర్మించే నైపుణ్యాల అవసరాన్ని సూచిస్తున్నాయి. అజైల్ మెథడాలజీ (88,141 పోస్టింగ్‌లు) సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఇటరేటివ్ విధానాలకు ఉన్న ప్రాధాన్యతను హైలైట్ చేస్తుంది.ఈ డిమాండ్ విస్తరణ టెక్ దిగ్గజ కంపెనీల నుండి స్టార్టప్‌ల వరకు వివిధ రంగాలలో అవకాశాలను సృష్టిస్తోంది. "కంపెనీలు AIని సమగ్రపరచడానికి పోటీపడుతున్నాయి, దీనికి నైపుణ్యం కలిగిన నిపుణులు అవసరం," అని సిలికాన్ వ్యాలీలో టెక్ రిక్రూటర్ మార్క్ రివెరా అన్నారు. అయితే, ఈ వేగవంతమైన వృద్ధి నైపుణ్యాల అంతరాన్ని గురించి ఆందోళనలను లేవనెత్తింది. కొందరు నిపుణులు విద్యా సంస్థలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా కరికులమ్‌ను సవరించాలని సూచిస్తున్నారు.ఏఐ రంగం విస్తరిస్తున్న నేపథ్యంలో డిమాండ్ ఉన్న ఈ స్కిల్స్‌లో నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థులు ఏఐ జాబ్ బూమ్‌ను సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వారికి పైథాన్, డేటా సైన్స్‌లో నైపుణ్యం సాధించడం ఏఐలో లాభదాయకమైన కెరీర్‌కు కీలకంగా మారవచ్చు. -
మీరెలాంటి వ్యక్తో చిటికెలో చెప్పే ట్రిక్..! ఆ పప్పులుడకవిక..
ప్రతి ఒక్కరి ప్రవర్తన భిన్నంగా ఉంటుంది. అందరితో కలిసిపోయి, ఆడుతూ పాడుతూ చిన్నపిల్లల్లా జీవితం గడపాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ రియాల్టీలో అది సాధ్యం కాదు. ఇవన్నీ ఆలోచనలకే పరిమితం అవుతాయి. జీవితానుభవం వేరేలా ఉంటుంది. అందుకే మనసుకి - ఆలోచనలకి అస్సలు పొత్తు కుదరదు. మీకు తెలుసా..? మన ప్రవర్తన, ఇతరులతో సంభాషించే విధానం, మన మాటలు, మన హావభావాలు ఇవన్నీ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయట. అవును.. వీటిని బట్టి ఎదురి వారి మనసును ఇట్టే చదివేయొచ్చు. అలాగే శరీర ఆకారాలు, కళ్ళ రంగు, జుట్టు పొడవు.. ఇలా ఒక్కటేమిటి నఖశిఖ పర్యాంతం వరకు మన వ్యక్తిత్వం ఇట్టే చెప్పేస్తాయ్..అలాగే ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల ద్వారా కూడా ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని పరీక్షించొచ్చని మానసిక నిపుణులు అంటున్నారు. అలాంటి ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అయితే అందులో మీరు మొదట ఏం చూస్తారనే దాన్ని బట్టి మీ వ్యక్తిత్వాన్ని ఇట్టే చెప్పొచ్చు. అంతేనా.. ఈ ఫొటోలో మొదట మీరు ఏం చూస్తారో దానిని బట్టి.. మీరు ఇంట్రావర్ట్ లేదా ఎక్స్ట్రావర్ట్ అనే విషయం కూడా తేలిపోతుంది. ఇంతకీ ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్ అంటే ఏమిటో అనే విషయాన్ని ముందుగా తెలుసుకుందాం..! పదిమందిలో ఉన్నా అంటీముట్టనట్టుగా, ఇబ్బందిగా ఫీల్ అవడాన్నే ఇంట్రావర్ట్ అంటారు. అదే ఒంటరిగా ఉన్నా తనచుట్టూ నలుగురు పోగయ్యేలా చేసేవారు ఎక్స్ట్రావర్ట్స్. ఇదీ తేడా. సరే ఈ కింది ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రంలో మీరు ఫస్ట్ ఏం చూశారో నిజాయితీగా చెప్పేయాలి మరీ.. View this post on Instagram A post shared by Recovery Trauma Ltd ♥️♥️♥️ (@recoverytraumaltd) ఈ చిత్రంలో మీరు మొదట పెదవులు, చెట్టు, చెట్టు వేర్లు ఏది ఫస్ట్ చూశారు? ఒక వేళ మీరు చూసింది చెట్టు అయితే.. మీరు ఖచ్చితంగా ఎక్స్ట్రావర్ట్. మీరు ఇతరులతో సులభంగా కలిసిపోతారు. బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇట్టే చక్కబెట్టేస్తారు. అందరితో చాలా మర్యాదగా ప్రవర్తిస్తారు. ఈ లక్షణాలే మిమ్మల్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. కానీ ఇలాంటి వారు ఎక్స్ట్రావర్ట్ అయినప్పటికీ వీరి మనసును చదవడం మాత్రం అంతసులువుకాదు. చాలా టఫ్.అదే ఈ చిత్రంలో మొదట వేర్లు చూసినట్లైతే.. మీరు ఇంట్రావర్ట్. చాలా సౌమ్యంగా, చిన్న విషయానికే హడలేత్తిపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ వీరిలో దృఢ సంకల్పం, మొండి పట్టుదల దండిగా ఉంటుంది. వీరి సంకోచ స్వభావం వల్ల తొలుత వీరిని అందరూ పక్కనపెట్టినా.. వీరి సామర్ధ్యాన్ని అర్ధం చేసుకుంటే జీవితంలో ఎప్పటికీ వదిలిపెట్టరు.పై రెండూకాకుండా ఈ చిత్రంలో మీరు మొదట పెదవులు చూసినట్లైతే.. మీరు చాలా ప్రశాంతమైన వ్యక్తి అని అర్థం. ప్రకృతి సౌందర్యాన్ని, సరళతను ఆస్వాదించే ప్రశాంతమైన, స్థిరమైన వ్యక్తిత్వం కలిగిన వారు. ఇలాంటి వారు ఎదుటి వారి డ్రామాలను అస్సలు సహించలేరు. ఎల్లప్పుడూ ప్రశాంతమైన, సమతుల్య జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు. స్ట్రెస్‌కి అంత సులువుగా ప్రభావితం కాలేరు. భావోద్వేగ స్థిరత్వం కలిగి ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు.మన చుట్టూ ఉండేవారిలో ఇంట్రావర్ట్, ఎక్స్ట్రావర్ట్లేకాదు యాంబీవర్ట్ కూడా ఉంటారనే విషయం చాలా మందికి తెలియదు. ముందు రెండింటిలోని లక్షణాలన్నీ కలగలిపి బాగా ఒంట పట్టించుకున్న వారే యాంబీవర్ట్ వ్యక్తులు. అంటే అంతర్ముఖుడిలా మూతి ముడుచుకొని ఉన్నా.. సమయం వచ్చినప్పుడు బహిర్ముఖుడిలా చెలరేగిపోవడమే యాంబీవర్ట్స్ స్టైల్..!(చదవండి: వాట్ ఏ డేరింగ్..! చెట్టుపైన డ్యాన్స్ అదుర్స్..! కానీ..) -
IPL 2025: ముంబై ఇండియన్స్‌తో కీలక మ్యాచ్‌కు ముందు లక్నో టీమ్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్ 2025లో ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం కీలకమైన మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబై సొంత మైదానమైన వాంఖడేలో ఈ మ్యాచ్ జరుగనుంది. ప్లే ఆఫ్స్ రేసులో ఇరు జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకంగా పరిగణించడుతుంది.ఈ మ్యాచ్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులకు శుభవార్త తెలిసింది. గాయం కారణంగా ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లకు దూరంగా ఉన్న స్పీడ్ గన్ మయాంక్ యాదవ్.. నేటి మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడని సమాచారం. మయాంక్ రీఎంట్రీపై ఎల్ఎస్జీ మేనేజ్మెంట్ సోషల్‌మీడియా వేదికగా హింట్ ఇచ్చింది. వీడియోను రిలీజ్ చేస్తూ ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో ఓ భయంకరమైన శైలిని చూస్తారని సందేశాన్ని ఇచ్చింది.Kal dikhega tabadtod andaz 👊💥 pic.twitter.com/xl0YU6vhY2— Lucknow Super Giants (@LucknowIPL) April 26, 2025మయాంక్ రాకతో ఎల్ఎస్జీ పేస్ విభాగం మరింత పటిష్టమవుతుంది. ఇప్పటికే ఆ జట్టు పేస్ విభాగం ఆవేశ్ ఖాన్, శార్దూల్ ఠాకూర్, ఆకాశ్‌దీప్‌లతో స్ట్రాంగ్‌గా ఉంది. మయాంక్ జట్టులో చేరితే మరో పేసర్ ప్రిన్స్ యాదవ్‌పై వేటు పడే అవకాశం ఉంది. వెన్ను గాయం కారణంగా మయాంక్ ఈ సీజన్ తొలి అర్ద భాగానికి దూరంగా ఉన్నాడు. రాజస్థాన్, ఢిల్లీ మ్యాచ్‌లకు ఇంపాక్ట్ ప్లేయర్ల జాబితాలో ఉన్నప్పటికీ బౌలింగ్ చేసే అవకాశం రాలేదు.మయాంక్ గత ఐపీఎల్ సీజన్లో 150 కిమీ పైగా వేగంతో బంతులు సంధించి వెలుగులోకి వచ్చాడు. గత సీజన్ ప్రదర్శనల కారణంగా మయాంక్ టీమిండియాలో సైతం చోటు దక్కించుకున్నాడు. భారత జట్టుకు ఆడుతూ సత్తా చాటిన మయాంక్.. గతేడాది అక్టోబర్‌లో బంగ్లాదేశతో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను వెన్ను మరియు కాలి బొటన వేలు సమస్యలతో బాధపడుతూ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత కీలక తరుణంలో మయాంక్ రీఎంట్రీ లక్నో టీమ్‌కు కొండంత బలాన్ని ఇస్తుంది. మయాంక్ తన స్పీడ్‌తో ఫలితాలను తారుమారు చేయగలడు. ఇదిలా ఉంటే, ఈ సీజన్లో లక్నో, ముంబై ఇండియన్స్ తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 4న జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబైపై లక్నో 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ఓపెనర్లు మిచెల్ మార్ష్ (60), మార్క్రమ్ (53) అర్ద సెంచరీలతో రాణించగా.. బదోని (30), మిల్లర్ (27) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. హార్దిక్ పాండ్యా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.అనంతరం ఛేదనలో ముంబై గెలుపు దరిదాపుల్లోకి వచ్చి ఓటమిపాలైంది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులకే పరిమితమైంది. దిగ్వేశ్ రాఠీ (4-0-21-1) ముంబైని ఇబ్బంది పెట్టాడు. నమన్ ధీర్ (46), సూర్యకుమార్ యాదవ్ (67) ముంబైని గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. ఆఖర్లో హార్దిక్ తిలక్ వర్మను రిటైర్డ్ ఔట్‌గా పెవిలియన్‌కు పంపాడు. అతని స్థానంలో వచ్చిన సాంట్నర్ ప్రభావం చూపలేకపోయాడు. ఆఖరి ఓవర్లో హార్దిక్ ఓవరాక్షన్ చేసి తిలక్‌కు బదులుగా వచ్చిన సాంట్నర్‌కు స్ట్రయిక్ ఇవ్వలేదు. చివరి ఓవర్‌ను ఆవేశ్ ఖాన్ అద్బుతంగా బౌలింగ్ చేశాడు. -
భారత్‌పై దాడి కోసం 130 అణు బాంబులు.. పాక్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రైల్వే మంత్రి హనీఫ్ అబ్బాసీ బహిరంగంగా బెదిరింపులకు దిగాడు. భారత్‌పై దాడి చేసేందుకు పాకిస్తాన్ 130కి పైగా అణు ఆయుధాలతో పాటు ఘోరి, షాహీన్, ఘజ్నవి మిసైళ్ళను సిద్ధం చేసినట్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. రాక్షసత్వానికి పరాకాష్ఠగా నిలిచిన పహల్గాం ఉగ్రదాడిపై రగిలిపోతున్న భారత్ తన చర్యల ద్వారా దాయాదిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సింధూ నదీ జలాల నిలిపివేత, పాకిస్తాన్ జాతీయుల వీసాలు రద్దు, ఇతర వాణిజ్య సంబంధాలను నిలిపివేసింది. దీంతో ఏం చేయాలో పాలుపోక దీనంగా చూస్తోంది.ఈ క్రమంలో హనీఫ్ అబ్బాసీ భారత్‌ను కవ్వించే ప్రయత్నం చేశారు. భారత్ ఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపివేస్తే యుద్ధానికి సిద్దంగా ఉండాలని హెచ్చరించారు. యుద్ధం చేసేందుకు తాము సన్నంద్ధంగా ఉన్నామని, దేశ వ్యాప్తంగా అణు ఆయుధాల్ని సిద్ధం చేశామన్నారు. ఆ అణు ఆయుధాలు ప్రదర్శన కోసం కాదని, భారత్‌పై దాడి చేసేందుకేనని చెప్పారు. "Pakistan's nuclear missiles are not for decoration. They have been made for India," threatens Railway Minister Muhammad Hanif Abbasi pic.twitter.com/UqCCRmpXx6— Shashank Mattoo (@MattooShashank) April 27, 2025 స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నీటి సరఫరాను ఆపితే మనతో యుద్ధం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉండాలి. మన వద్ద ఉన్న సైనిక పరికరాలు, మిసైళ్ళు ప్రదర్శన కోసం కాదు. మన అణు ఆయుధాలు ఎక్కడ ఉన్నాయో ఎవరికీ తెలియదు. నేను మళ్లీ చెబుతున్నాను, ఈ బాలిస్టిక్ మిసైళ్ళు, అవన్నీ భారత్‌పై దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అంతకుముందు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ దేశం గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషించిందని ఒప్పుకున్నారు. దాని ఫలితమే ఈ దుర్భర పరిస్థితులకు కారణమని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. -
వాట్ ఏ డేరింగ్..! నిటారు చెట్టుపైన డ్యాన్స్..!
ఎన్నో రకాల డేరింగ్ డ్యాన్స్‌లు చూసుంటారు. ఒంటి కాలితో..కాళ్లే లేకపోయిన వాళ్లు చేసిన సాహసోపేతమైన నృత్యాలు తిలకించాం గానీ. ఇలాంటి డ్యాన్స్ మాత్రం చేసే ఛాన్సే లేదు. ఎవ్వరికి రానీ ఆలోచన అని చెప్పొచ్చు. ఏకంగా ఓ పెద్ద చెట్టు..చిటారు కొమ్మపై నుంచి డ్యాన్స్ అంటే మాటలు కాదుకదా..!. చెబుతుంటేనే వణుకొస్తోంది. మరి చూస్తే.. చెమటలు పట్టేయడం ఖాయం..!. అలాంటి సాహసమే చేసింది ఇక్కడొక అమ్మాయి. కాశ్మీరీ మహిళ నాగ్వంసీ ఏకంగా నిటారుగా వంపుతో ఉన్న చెట్టుపై బ్యాలెన్స్ చేస్తూ డ్యాన్స్ చేసింది. 2012 చిత్రం ఇషాక్జాదేలోని హిట్ బాలీవుడ్ పాట "जहालालालाला" కు లయబద్ధంగా డ్యాన్స్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఆ డేరింగ్ డ్యాన్స్ అందర్నీ ఆకర్షించడమే గాక ఆందోళన రేకెత్తించేలా ఉంది. అయితే నెటిజన్లు మాత్రం సిస్టర్ నెక్స్ట్ ఈఫిల్ టవర్‌పై ట్రై చేయండని ఒకరూ, ఆమెను చూసి మరణమే భయపడుతుందని మరొకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by usha (@ushanagvanshi31) (చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
సరిహద్దుల్లో టెన్షన్.. విధ్వంసక క్షిపణి పరీక్ష చేపట్టిన భారత్
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. భారత సరిహద్దుల్లో పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది.వివరాల ప్రకారం.. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత నౌకాదళం సిద్ధమవుతోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. సముద్ర జలాల్లో ఎప్పుడైనా.. ఎక్కడైనా భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధమని ప్రకటించింది. ఈ మేరకు క్షిపణి పరీక్షలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే, మూడు రోజుల క్రితమే భారత్ ఇదే సముద్రంలో మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (ఎంఆర్-ఎస్ఏఎం)తో సీ స్కిమ్మింగ్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ఐఎన్ఎస్ సూరత్ తొలిసారి గగనతలంలో వస్తున్న లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించింది. ఈ మేరకు నౌకాదళం వీడియోను విడుదల చేసింది. సీ స్కిమ్మింగ్ టార్గెట్‌ను కచ్చితమైన సమన్వయంతో విజయవంతంగా ఛేదించినట్లు వెల్లడించింది. సముద్ర మార్గంలో రాడార్లను తప్పించుకోవడానికి నీటిపై అతి తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లు, క్షిపణులు వంటి వాటిని సీ స్కిమ్మింగ్ టార్గెట్లుగా పేర్కొంటారు.#IndianNavy Ships undertook successful multiple anti-ship firings to revalidate and demonstrate readiness of platforms, systems and crew for long range precision offensive strike.#IndianNavy stands #CombatReady #Credible and #FutureReady in safeguarding the nation’s maritime… pic.twitter.com/NWwSITBzKK— SpokespersonNavy (@indiannavy) April 27, 2025 -
ఐటమ్ సాంగ్స్‌లో స్టార్ హీరోయిన్లు.. అత్యధిక రెమ్యునరేషన్ ఎవరికంటే..?
పాటలు నృత్యాలు. అలాగే డ్యాన్స్ నంబర్లు 30వ దశకంలో టాకీల రోజుల నుంచే భారతీయ చలనచిత్రంలో భాగమయ్యాయి . వ్యాంప్ కేరెక్టర్లకు పరిమిమైన వారు మాత్రమే కాకుండా ఏకంగా హీరోయిన్లు ఈ తరహా నృత్యాలు చేయడం మొదలు పెట్టిన దగ్గర నుంచి వీటిని కాస్త హుందాగా ఐటెమ్/స్పెషల్ సాంగ్స్ లేదా ప్రత్యేక నృత్యాలుగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ ఐటెం సాంగ్(Item Song)లు సినిమాల విజయాలకు చాలా కీలకమైనవిగా మారాయి. దాంతో పాటే ఈ తరహా నృత్యాల కోసం డ్యాన్సర్లు, హీరోయిన్లు వసూలు చేసే రెమ్యూనరేషన్ కూడా ఆకాశాన్ని అంటింది.బాలీవుడ్‌కి చెందిన నోరా ఫతేహి వంటి ప్రముఖ డ్యాన్సర్లు ఒక్కో పాటకు 2 కోట్ల రూపాయల చొప్పున, సన్నీ లియోన్ కూడా అంతే మొత్తంలో వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గబ్బర్ సింగ్‌లో కెవ్వు కేక అంటూ కేక పెట్టించిన మలైకా అరోరా పాటకు రూ. 50 లక్షల నుంచి 1కోటి వరకు వసూలు చేస్తూ ఇప్పుడు కాస్త వెనకడుగులో ఉంది.ప్రముఖ నటీమణులు ఈ డ్యాన్స్ నంబర్లకు వసూలు చేస్తున్న మొత్తాలు వారి డ్యాన్స్ సామర్థ్యాల కంటే చాలా ఎక్కువ అనేది వాస్తవం. అయితే డ్యాన్స్ ప్రతిభ కన్నా తమ స్టార్ పవర్‌ను వీరు ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఎక్కువ మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నారు. కరీనా కపూర్ ఐటెం సాంగ్ చేసేటప్పుడు రూ. 1.5 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసేదట. , కత్రినా కైఫ్ ఒక్కో పాటకు 2 కోట్ల రూపాయలకు పైగా అందుకుందట. ఈ తరహా పాటలకు పేరొంది అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రతి పాటకు రూ. 3 కోట్లు తీసుకుంటుంది. దబిడి దిబిడి భామ ఊర్వశి రౌతాలా కూడా అంతే మొత్తం అడిగేది..ఇప్పుడు మరింత ఎక్కువ డిమాండ్ చేస్తోంది. సినీ పండితుల సమాచారం ప్రకారం, తమన్నా భాటియా, జాన్వీ కపూర్, పూజా హెగ్డే, తాప్సీ పన్ను వంటి వారు ఇప్పుడు ఐటమ్ నెంబర్స్‌లో డిమాండ్‌లో ఉన్నారు.ఈ కోవలో నిన్నా మొన్నటి దాకా అత్యధిక పారితోషికం అందుకున్న రికార్డ్ నటి సమంత పేరిట ఉంది. ఆమె పుష్ప ది రైజ్‌లో ఊ అంటావా పాట కోసం అత్యధిక మొత్తం వసూలు చేసినట్లు సమాచారం. ఒక సినిమాలో ఒక్క ఐటమ్ సాంగ్ చేయడం ద్వారా ఆ సినిమా మొత్తం కనిపించిన హీరోయిన్ కన్నా ఎక్కువ మొత్తం అందుకుందీమె. పుష్పలో హీరోయిన్గా నటించిన రష్మిక మందన్న మొత్తం సినిమాకి కేవలం రూ. 2 కోట్లు మాత్రమే తీసుకుంటే. అయితే ఊ అంటావా పాట కోసం సమంత రూ. 5 కోట్ల పారితోషికాన్ని రాబట్టిందట.ఇటీవలి కాలంలో తమన్నా ఐటమ్ ట్రెండ్స్‌లోకి అనూహ్యంగా దూసుకొచ్చింది. తెలుగులో స్వింగ్ జర స్వింగ్ జర అంటూ జూనియర్ ఎన్టీయార్ పక్కన మెలికలు తిరిగిన ఈ మిల్కీ బ్యూటీ అలా మొదట్లో రూ.కోటిలోపే తీసుకుంటూ అప్పుడప్పుడు ఐటమ్‌గాళ్ గా కనిపించినా...ఇప్పుడు స్పెషల్ సాంగ్ అంటే తానే గుర్తొచ్చేంతగా ఎదిగిపోయింది. దీనికి వరుసగా ఆమె ఐటమ్ సాంగ్స్ హిట్ కావడమే కారణం. రూ.3కోట్లు తీసుకుని జైలర్ లో ‘నువ్వు కావాలయ్యా..దా’ పాటలో ఊపేసిన తమన్నా సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్ వీడియోలకు బోలెడంత ఫీడ్ అందించింది. ఆ తర్వాత బాలీవుడ్ సినిమా స్త్రీ 2 ఆమెని మరింత అందనంత ఎత్తుకి తీసుకెళ్లింది. ఆ సినిమాలోని ఆజ్‌కి రాత్... పాట ఉత్తరాది ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవడంతో తాజాగా రైడ్ 2లో చేసిన ఐటమ్ సాంగ్ కోసం రూ.5కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఐటమ్ సాంగ్స్ చేసే హీరోయిన్లలో తమన్నా భాటియా అత్యధిక మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్‌గా నిలిచింది. -
బంగారం భారీగా పడిపోతుంది!
ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ తారాస్థాయికి చేరాయి. భారత్‌లో అయితే 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.లక్ష దాటి తర్వాత కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందుతున్న వారికి ఉపశమనం కలిగించే వార్తొకటి వచ్చింది. వచ్చే 12 నెలల్లో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉందని కజకిస్థాన్ గోల్డ్ మైనింగ్ సంస్థ సాలిడ్ కోర్ రిసోర్సెస్ పీఎల్సీ సీఈఓ చెబుతున్నారు.12 నెలల్లో బంగారం ధరలు (ఒక ఔన్స్) 2,500 డాలర్లకు చేరుకుంటుందని సాలిడ్ కోర్ రిసోర్సెస్ సీఈఓ 'విటాలీ నేసిస్' రాయిటర్స్‌తో చెప్పారు. అయితే 1,800 - 1,900 డాలర్ల స్థాయికి చేసే అవకాశం లేదు. సాధారణంగా బంగారంపై ఓ స్థాయి వరకు ప్రతిస్పందన ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది (ధరలు పెరగడం) ఓవర్ రియాక్షన్' అని కజకిస్థాన్ రెండో అతిపెద్ద గోల్డ్ మైనర్ సాలిడ్‌కోర్ నేసిస్ అంటున్నారు.ఎంతకు తగ్గొచ్చు? నేసిస్ చెబుతున్నదాని ప్రకారం.. ఒక ఔన్స్ అంటే 28.3495 గ్రాముల బంగారం ధర 2,500 డాలర్లకు తగ్గుతుంది. అంటే 10 గ్రాముల ధర దాదాపు రూ. 75,000 లకు దిగొస్తుంది. సాంప్రదాయకంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు వ్యతిరేకంగా రక్షణ కవచంగా భావించే బంగారం ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 26 శాతం పెరిగింది. ఎందుకంటే యూఎస్ సుంకాలు మాంద్యం భయాలను రేకెత్తించాయి. ఈ క్రమంలో గత మంగళవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం రికార్డు స్థాయిలో 3,500.05 డాలర్లను తాకింది.👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!ప్రస్తుతం ధరలు ఇలా..అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఏప్రిల్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..తెలుగు రాష్ట్రాల్లో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020చెన్నైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!ఢిల్లీలో.. - 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,310- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,170ముంబైలో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020బెంగళూరులో..- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి) -
ఈ ఆదివారం పసందైన స్నాక్స్ ట్రై చేయండిలా..!
బనానా– మీల్మేకర్ పకోడాకావలసినవి: అరటికాయ– 1 (తొక్క తీసి, ఉడికించి, చల్లారాక గుజ్జులా చేసుకోవాలి) మీల్మేకర్– 1 కప్పు (పదిహేను నిమిషాల పాటు వేడి నీళ్లలో నానబెట్టి, తురుము కోవాలి), బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి– అరకప్పు చొప్పున, శనగపిండి, ఉల్లిపాయ తరుగు– పావుకప్పు చొప్పున, పచ్చిమిర్చి ముక్కలు– 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం– 1 టీ స్పూన్ చొప్పున, పసుపు– చిటికెడు, నిమ్మరసం– 2 టీ స్పూన్లు, నీళ్లు, నూనె– సరిపడా, ఉప్పు– తగినంతతయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని, అందులో మీల్ మేకర్ తురుము, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, అరటికాయ గుజ్జు, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, అర టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తురుము అన్ని వేసుకుని సరిపడా నీళ్లుతో ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న బౌల్లో శనగపిండి, అర టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు వేసుకుని.. కొన్ని నీళ్లతో పలచగా కలుపుకుని, అందులో కొద్ది కొద్దిగా అరటికాయ మిశ్రమాన్ని ముంచి, శనగపిండి మిశ్రమాన్ని బాగా పట్టించి, కాగుతున్న నూనెలో పకోడాలు వేసుకోవాలి. దోరగా వేగాక, వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.గుజరాతీ ఖండ్వీ..కావలసినవి: శనగపిండి, పెరుగు– ఒక కప్పు చొప్పున, పసుపు– పావు టీ స్పూన్, ఉప్పు– తగినంత, నీళ్లు– సరిపడా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్– ఒక టీ స్పూన్, నూనె– 2 టేబుల్ స్పూన్లుఆవాలు, నువ్వులు– ఒక టీ స్పూన్ చొప్పున కరివేపాకు– కొద్దిగా, కొత్తిమీర తరుగు, కొబ్బరి తురుము– గార్నిష్ కోసంతయారీ: ఒక గిన్నెలో శనగపిండి, పెరుగు, పసుపు, ఉప్పు, అల్లం–పచ్చిమిర్చి పేస్ట్ వేసి, ఉండలు లేకుండా సరిపడా నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని కళాయిలోకి వడకట్టి తీసుకుని చిన్న మంట మీద పెట్టి గరిటెతో తిప్పుతూ ఉండాలి. బాగా దగ్గరపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మూడు నాలుగు ప్లేట్లు తీసుకుని వెనుక భాగంలో నూనె రాసి, వాటి మీద ఈ మిశ్రమాన్ని వేడివేడిగా ఉన్నప్పుడే పలుచగా పూయాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని, గుండ్రగా చుట్టుకోవాలి. అనంతరం ఆవాలు, నువ్వులు, కొత్తిమీర తురుము, కరివేపాకు వంటివన్నీ నూనెలో తాళింపు వేసుకుని, పచ్చి కొబ్బరి తురుముతో కలిసి.. గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు.కొరియన్ యాక్గ్వా స్వీట్కావలసినవి: గోధుమ పిండి– 2 కప్పులు (జల్లెడ పట్టుకోవాలి), తేనె, నువ్వుల నూనె– ఒక కప్పు చొప్పున, సోజు లేదా వోడ్కా– ఒక టేబుల్ స్పూన్ (కుకీలను మరింత మెత్తగా ఉండటానికి కొరియన్స్∙వాడతారు), అల్లం పొడి – ఒక టీ స్పూన్, నూనె– సరిపడా, తేనె, నీళ్లు– ఒక కప్పుపైనే, నిమ్మరసం– 1 టేబుల్ స్పూన్, నట్స్ లేదా నువ్వులు– కొన్ని (నేతిలో వేయించాలి, గార్నిష్ కోసం)తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో గోధుమ పిండి, నువ్వుల నూనె, ఒక టీ స్పూన్ తేనె, సోజు లేదా వోడ్కా, అల్లం పొడి వేసుకుని, ఉండలు కాకుండా బాగా కలుపుకోవాలి. అనంతరం సరిపడా నీళ్ల పోసి చపాతీ ముద్దలా చేసుకుని, అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ ముద్దను అర అంగుళం మందంతో చపాతీలా ఒత్తుకుని, నచ్చిన మోడల్ కుకీ కట్టర్ సాయంతో కట్ చేసుకుని, వాటిని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఈలోపు ఒక పాత్రలో తేనె, నీళ్లు పోసుకుని చిన్న మంట మీద మరిగించాలి. ఆ మిశ్రమం కాస్త చిక్కబడిన తర్వాత నిమ్మరసం వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అనంతరం వేయించిన కుకీస్‌ను వేడివేడిగా ఉన్నప్పుడే ఈ తేనె సిరప్‌లో వేసుకుని నానబెట్టుకోవాలి. అనంతరం ప్లేట్లో పెట్టుకుని నట్స్ లేదా నువ్వులతో గార్నిష్ చేసుకోవచ్చు. (చదవండి: ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు సాధారణమైనవేనా..? ఆఫీస్ వర్క్ చేయొచ్చా..?) -
IPL 2025: సీఎస్కేపై గెలుపు.. సేద తీరడానికి మాల్దీవ్స్‌కు వెళ్లిన సన్‌రైజర్స్ టీమ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో గతేడాది రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్.. ఆతర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడింది (లక్నో, ఢిల్లీ, కేకేఆర్,గుజరాత్). తర్వాత పంజాబ్‌పై సంచలన విజయం సాధించి (246 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి).. ముంబై ఇండియన్స్ చేతుల్లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడింది.తాజాగా సీఎస్కేను వారి సొంత ఇలాకాలో ఓడించి, సీజన్లో మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ సీజన్లో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిందే. ఇకపై వారు ఆడాల్సిన ఐదు మ్యాచ్‌ల్లో గెలిచినా ప్లే ఆఫ్స్‌కు చేరతారన్న గ్యారెంటీ లేదు. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను మే 2న (గుజరాత్‌తో) ఆడనుంది. ఆతర్వాత మే 5న ఢిల్లీతో, మే 10న కేకేఆర్‌తో, మే 13న ఆర్సీబీతో, మే 18న లక్నోతో తలపడనుంది.Sun, sea, and a team retreat for our Risers in the Maldives! 🏖️✈️ pic.twitter.com/CyE0MvZHy3— SunRisers Hyderabad (@SunRisers) April 26, 2025అత్యంత కీలకమైన మ్యాచ్‌లకు ముందు వారం రోజుల విరామం లభించడంతో సన్‌రైజర్స్ యాజమాన్యం తమ ఆటగాళ్లను రీ ఫ్రెష్మెంట్ కోసం మల్దీవ్స్‌కు పంపింది. మాల్దీవ్స్‌లో ఆరెంజ్ ఆర్మీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. తమ ఆటగాళ్లు మాల్దీవ్స్‌లో సేద తీరుతున్న దృశ్యాలను సన్‌రైజర్స్ తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఏం పొడిచారని లీగ్ మధ్యలో సేద తీరడానికి వెళ్లారని కొందరంటుంటే.. సన్‌రైజర్స్ అభిమానులేమో కీలక మ్యాచ్‌లకు ముందు తమ ఆటగాళ్లకు ఈ మినీ వేకేషన్ అవసరమేనని సమర్దిస్తున్నారు.కాగా, ఈ సీజన్ ప్రారంభానికి ముందు సన్‌రైజర్స్‌పై భారీ అంచనాలు ఉండేవి. అందుకు తగ్గట్టుగానే తొలి మ్యాచ్‌లో ఆ జట్టు రాజస్థాన్ రాయల్స్‌పై 286 పరుగుల రికార్డు స్కోర్ సాధించి విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ సూపర్ సెంచరీతో మెరిశాడు. ఆ మ్యాచ్ తర్వాత మళ్లీ గెలవడానికి సన్‌రైజర్స్‌కు ఐదు మ్యాచ్‌ల సమయం పట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో సన్‌రైజర్స్ రెండో విజయం సాధించింది. తాజాగా సన్‌రైజర్స్ సీఎస్కేపై గెలిచినా అది వారిపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగా లేదు. సీఎస్కే నిర్దేశించిన 155 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆ జట్టు ఆపసోపాలు పడింది. -
ఇది ఫేక్ న్యూస్ కాదయ్యా! రియల్ న్యూస్!!
-
మార్చి రిపోర్ట్: నిండా మునిగిన నిర్మాతలు.. 15 సినిమాల్లో ఒక్కటే హిట్టు!
మలయాళ సినిమా (Mollywood)కు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. వరుసగా బాక్సాఫీస్ ఫెయిల్యూర్స్ నిర్మాతలను ఊపిరాడకుండా చేస్తున్నాయి. కేవలం ఒకటీరెండు చిత్రాలు మాత్రమే నిర్మాతలను గండం గట్టెక్కిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో లాభాల పంటకు బదులుగా నష్టాలు తెచ్చిపెట్టిన సినిమాలు మార్చిలోనూ అదే వైఖరిని కొనసాగించాయి.15 సినిమాల్లో ఒక్కటే హిట్టుకేరళ చలనచిత్ర నిర్మాతల మండలి.. మార్చి బాక్సాఫీస్ రిపోర్ట్ (Mollywood: March Box Office Report)ను రిలీజ్ చేసింది. ఈ నివేదిక ప్రకారం.. మార్చిలో 15 చిత్రాలు విడుదలవగా ఒక్కటి మినహా మిగతావన్నీ ఫ్లాప్స్‌గా నిలిచాయి. ఈ సినిమాలన్నింటి బడ్జెట్ రూ.194 కోట్లు కాగా కేవలం రూ.25.88 కోట్ల షేర్ మాత్రమే తిరిగొచ్చింది. పెద్ద, చిన్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఎల్ 2 : ఎంపురాన్ ఒక్కటే సూపర్ హిట్ సాధించింది. రూ.4 కోట్లతో తెరకెక్కించిన ఔసెప్పింటె ఓసియతు మూవీ కేవలం రూ.45 లక్షలు రాబట్టడం గమనార్హం.> రూ.2.70 కోట్లతో నిర్మితమైన పరివార్ సినిమాకు రూ.26 లక్షలు వచ్చాయి.> రూ.3.65 కోట్లు పెట్టి తీసిన వడక్కన్ మూవీ కేవలం రూ.20 లక్షలే తిరిగి రాబట్టింది.> రూ.70 లక్షలతో నిర్మితమైన డసెట్టంటె సైకిల్ చిత్రం అతి కష్టమ్మీద రూ.8 లక్షలు వసూలు చేసింది.కాపాడింది ఈ ఒక్కటే..మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఎల్ 2: ఎంపురాన్. ఈ మూవీకి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించడంతో పాటు కీలక పాత్రలో నటించాడు. లూసిఫర్ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. రూ.175 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది.చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి -
క్షణాల్లో మేకప్ వేసుకోవచ్చు..!
సాధారణంగా మేకప్ ప్రక్రియ సమయంతో కూడిన పని. తీరా క్రీమ్స్, పౌండేషన్స్ ఇలా ఒక దాని తర్వాత ఒకటి అప్లై చేసుకున్నాక, ఆ మేకప్ కాస్త ఎక్కువైనా, తక్కువైనా సరి చేసుకోవడం ఇంకాస్త పెద్ద పని. అలాంటి సమస్యలను దూరం చేస్తుంది ఈ పరికరం. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించిన ఈ వినూత్న పరికరాలు ఇప్పుడు నిజంగానే వినియోగంలోకి వచ్చేశాయి. కేవలం కొన్ని క్షణాల్లోనే ఈ పరికరాలు ముఖాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నాయి.చిత్రంలోని ‘టెంప్ట్ యూ 2.0’ ఎయిర్ బ్రష్ మేకప్ సిస్టమ్‌లో ఎయిర్ కంప్రెసర్, ఎయిర్ బ్రష్ ఉంటాయి. కంప్రెసర్ గాలిని ఉత్పత్తి చేస్తుంది. ఎయిర్ బ్రష్‌తో మేకప్ లిక్విడ్స్‌ను సన్నని పొరగా చర్మంపై స్ప్రే చేస్తుంది. ఎయిర్‌పాడ్‌లో మేకప్ లిక్విడ్ నింపుకోవాలి. కంప్రెసర్ గాలితో అప్లై చేసుకునే మేకప్, చర్మంపై సమానంగా పడుతుంది.ఈ మెషిన్‌తో మేకప్ వేసుకుంటే తక్కువ కాస్మెటిక్స్‌తో ఎక్కువ కవరేజ్ ఉంటుంది. ఇది మేకప్‌ని వేగంగా వేయడంతో పాటు, ఎక్కువ సమయం చెక్కుచెదరకుండా ఉంచుతుంది. ఇది ఇంట్లోను, సెలూన్స్లోను ఎక్కడైనా వాడుకునేందుకు అనుకూలమైనదే! ఈ ‘టెంప్ట్ యూ’ ఎయిర్‌బ్రష్ మేకప్ సిస్టమ్, సాంప్రదాయ మేకప్ పద్ధతులకు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. రెప్పల సోయగంఅందమైన మోముకి వాలు కనులు మరింత సొగసునిస్తాయి. అందుకే చాలా మంది ఆర్టిఫిషియల్ ఐలాష్లను అతికించుకుంటూ మురిసిపోతుంటారు. ఇప్పుడు అలాంటి అవసరం లేదంటోంది బ్యూటీ ప్రపంచం. కనురెప్పల వెంట్రుకలు శాశ్వతంగా పొడవుగా పెరిగేందుకు ‘ఐలాష్ ట్రాన్స్‌ప్లాంట్’ అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది నిపుణులతో మాత్రమే చేయించుకోవలసిన శస్త్రచికిత్స పద్ధతి. ఈ చికిత్సలో తల వెనుక భాగం నుంచి వెంట్రుక కుదుళ్లను తీసి, కనురెప్పల మీద అమర్చుతారు. ఆ తర్వాత ఈ వెంట్రుకలు సహజంగా పెరుగుతాయి, రాలుతాయి. కాబట్టి వాటిని క్రమం తప్పకుండా కత్తిరించుకోవాల్సి ఉంటుంది. ఇది ఇతర తాత్కాలిక పద్ధతుల కంటే ఎక్కువ కాలం నిలుస్తుంది. (చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
అయ్యో దేవుడా..ఏమిటీ ఘోరం
కొన్ని క్షణాలకు ముందు పక్కనే భర్త.. ఆడుకుంటూ బిడ్డలు.. సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబంపై విధి చిన్నచూపు చూసింది.నీళ్లలో ఆడుకుంటున్న చిన్నారులు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయతి్నంచిన భర్త కళ్ల ముందు కడతేరిపోవడంతో ఆ తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. సరదాలతో నిండిన ఆ కుటుంబంలో ఇప్పుడు ఆమె ఒక్కతే మిగిలింది. ఇక ఒంటరిగానే బతకాలి. చిన్నారులు దేవుడితో సమానం అంటారు. ఆ దేవునికి అభం శుభం తెలియని పసిబిడ్డలపై జాలి కూడా కలగలేదేమో. వారితోపాటు తండ్రిని తీసుకెళ్లిపోయిన విషాద ఘటన మాటల్లో చెప్పలేనిది. బిడ్డల్లారా అప్పుడే నూరేళ్లు నిండాయా..దేవుడా ఏమిటీ ఘోరం అంటూ స్థానికుల కంటతడి పెట్టించిన విషాదకర ఘటన ఇది.ములకలచెరువు: బట్టలు ఉతికేందుకు చెరువు వద్దకు వెళ్తున్న తల్లిని చూసి అమ్మా మేము వస్తామంటూ ఇద్దరు పిల్లలు వెంట వెళ్లారు. వీళ్లతో పాటు పొరుగింటి చిన్నారి కూడా వెళ్లింది. వీరు ముగ్గురు చెరువు నీటిలో ఆడుకుంటూ మునిగిపోతుంటే చూసిన తండ్రి కాపాడేందుకు నీళ్లలోకి దిగి మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా ములకలచెరువు సమీపంలోని పెద్దచెరువులో శనివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే... జగనన్న కాలనీలో ఈశ్వరమ్మ(34), మల్లే‹Ù(38) నివాసం ఉంటున్నారు. వీరికి లావణ్య(12) నందకిషోర్(09) సంతానం. వీరి ఇంటి పక్కనే నందిత(11) అనే బాలిక ఉంటోంది. వీరు ముగ్గురు సమీపంలోని పెద్దచెరువు వద్దకు వెళ్లారు. బట్టలు ఉతుక్కుంటున్న ఈశ్వరమ్మ, మల్లే‹Ùలు పిల్లలు ఆడుకుంటున్నారని వారి పనిలో నిమగ్నమయ్యారు. చెరువు కుంటలో ఆడుకుంటూ పిల్లలు మునిగిపోయారు. వీరి అరుపులు వినిపించకపోవడంతో పిల్లల కోసం మల్లేష్ కుంటలోకి దూకాడు.వారిని కాపాడే ప్రయత్నంలో అతను కూడా నీటిలో మునిగిపోయాడు. ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో ములకలచెరువులో విషాద ఛాయలు అలుముకున్నాయి. కళ్లేదుటే పిల్లలు, భర్త మునిగి చనిపోతుంటే వారిని కాపాడేవారి కోసం ఈశ్వరమ్మ గట్టిగా కేకలు వేసింది.అయితే సమీపంలో ఎవ్వరూ లేకపోవడంతో పక్కనే ఉన్న రాజీవ్నగర్లోకి పరుగెత్తుకెళ్లి స్థానికులకు విషయం చెప్పింది. వెంటనే స్థానికులు చెరువు వద్దకు పరుగుతీసి కాపాడేందుకు ప్రయతి్నంచారు. అప్పటికే జరగకూడని ఘోరం జరిగిపోయింది. ఒంటరిగా మిగిలి... ఈశ్వరమ్మ, మల్లేష్ కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పిల్లలు లావణ్య ఆరోతరగతి, నందకిషోర్ ఐదోతరగతి చదువుతున్నారు. రోజూ పాఠశాలకు వెళ్లే పిల్లలు సెలవులు కావడంతో బట్టలు ఉతికేందుకు వెళ్లిన తల్లి వెంట వచ్చారు. చెరువులో నీటిని చూసి మురిసిపోయిన చిన్నారులు ఆడుకుంటూ మడుగులో పడి ఊపిరాడక చనిపోయారు. కాపాడేందుకు వెళ్లిన మల్లేష్ సైతం మునిగి చనిపోయాడు. భర్త పిల్లలు దూరం కావడంతో ఈశ్వరమ్మ ఒంటరిగా మిగిలిపోయింది. కళ్లెదుటే భర్త పిల్లలు చనిపోవడంతో అమె బోరున విలపించడం చూసి చూపరులు కంటతడిపెట్టారు.తోడుగా వెళ్లి... జగనన్న కాలనీలో ఉంటున్న మల్లే‹Ù, ఈశ్వరమ్మ ఇంటి పక్కనే మంజుల, వెంకటరమణలు ఉంటున్నారు. వీరికి నందిత అనే కుమార్తె ఉంది. ఇరుగు పొరుగు కావడంతో సఖ్యతతో ఉండేవారు.ముగ్గురు చిన్నారులు కలిసి ఆడుకునేవారు. శనివారం లావణ్య, నందకిషోర్ ఈశ్వరమ్మ వెంట వెళుతుండగా నేను వస్తానని నందిత వెళ్లింది. చెరువులో ఆడుకుంటూ ముగ్గురు మునిగి చనిపోయారు. ఒక్కగానొక్క కుమారై మృతి చెందడంతో అయ్యో దేవుడా మేమేం పాపం చేశాం అంటూ మంజుల, వెంకటరమణలు బోరున విలపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
RAPO 22: మోహన్‌లాల్ కాదు...ఉపేంద్ర?
రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో ఉపేంద్ర ఓ లీడ్ రోల్ చేయనున్నారా? అంటే అవుననే సమాధానమే ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. రామ్ హీరోగా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ ఫేమ్ పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (ప్రచారంలో ఉన్న టైటిల్) అనే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సాగర్ పాత్రలో రామ్, మహాలక్ష్మి పాత్రలో భాగ్య శ్రీ బోర్సే కనిపిస్తారు. కాగా.. ఈ సినిమాలోని ఓ కీలక పాత్ర కోసం మేకర్స్ మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్‌ను అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల కుదరకపోవడంతో, కన్నడ స్టార్ ఉపేంద్రను సంప్రదించారట. ఈ పాత్ర చేసేందుకు ఉపేంద్ర సుముఖంగా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఉపేంద్ర చేయనున్నది సినిమా హీరో క్యారెక్టర్ అని సమాచారం. మరి... రామ్ సినిమాలో సినిమా హీరోగా ఉపేంద్ర నటిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 15న రామ్ బర్త్ డేకి ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ సినిమా గురించిన అప్డేట్ రావొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
పెరిగిపోతున్న ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు
వైఎస్ఆర్ జిల్లా : కడపలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పీఏ వాహిద్ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. ఉద్యోగాల పేరుతో ఒంటరి మహిళలను మోసం చేస్తున్న ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. గతంలో డబ్బులు, ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ వాహిద్ పలువురు యువతుల్ని మోసం చేశాడు. ఉద్యోగాల కోసం ఎమ్మెల్యే మాధవిరెడ్డి కార్యాలయానికి వెళితే.. బాధుతుల్ని తమ చెల్లెళ్లుగా పరిచయం చేసేవాడు. ఇలా గత ఏడాది డిసెంబర్లో ఓ యువతికి డబ్బులు, ఉద్యోగం ఎరగా చూపించాడు వాహిద్. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. తీరా పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం అడిగితే మోహం చాటేసినట్లు తెలుస్తోంది. తాజాగా పీఏ వాహిద్ మాటలకు మోసపోయామని గుర్తించిన ఓ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పీఏ వాహిద్ అంగబలం, ఆర్ధిక బలం ముందు బాధితులకు న్యాయం జరగలేదు. పైగా, న్యాయం చేయాలని కోరినందుకు తన కుటుంబంపై దాడి చేశాడని మహిళ ఆరోపిస్తోంది.బాధిత మహిళ తమ గోడువెళ్ల బోసుకునేందుకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వెళ్లారు. తాను వాహిద్ మాటలు నమ్మి మోసపోయామని,న్యాయం చేయాలని కోరారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి సైతం పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
భారతీయుడి రక్తం మరిగిపోతుంది.. వారికి ఊహించని శిక్ష ఖాయం: మోదీ
సాక్షి, ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో పహల్గాం దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన.. వారు ఊహించని శిక్ష పడుతుందని హెచ్చరించారు. అలాగే, కశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే ఉగ్రవాద సూత్రదారులు దాడులు చేశారని మోదీ ఆరోపించారు.ప్రధాని మోదీ ఈరోజు మన్ కీ బాత్‌లో మాట్లాడుతూ..‘కశ్మీర్‌ను నాశనం చేసేందుకే ఉగ్రవాదుల దాడి జరిగింది. కశ్మీర్లో అభివృద్ధి వేగం పెరిగింది, టూరిస్టులు సంఖ్య పెరిగి ఆదాయం వృద్ధి చెందింది. దీన్ని ఓర్వలేక దాడులు చేస్తున్నారు. ఈ దాడి ఘటన తర్వాత ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుంది. ప్రపంచం భారతదేశం పక్షాన నిలుస్తోంది. ప్రపంచం మొత్తం 140 కోట్ల భారతీయులతో కలిసి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మా పోరాటానికి మద్దతుగా ఉంది.Our Hon PM Thiru @narendramodi avl, in the 121st episode of Mann Ki Baat, reaffirmed that the victims of the Pahalgam terrorist attack will definitely get justice and the perpetrators & conspirators of this terrorist attack will face the harshest response! pic.twitter.com/ISq01DYpS5— K.Annamalai (@annamalai_k) April 27, 2025బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తున్నాను. ఈ దాడి సూత్రధారులకు కఠినమైన, వారు ఊహించని శిక్ష పడుతుంది. భారత్‌లోని ప్రజల ఆగ్రహం ప్రపంచం మొత్తంలో ప్రతిఫలిస్తోంది. ప్రపంచ నాయకులు ఫోన్ చేసి, లేఖలు రాసి, సందేశాలు పంపి తమ సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడిని గట్టిగా ఖండించారు. మనం సంకల్పాన్ని బలపర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు మన సంకల్పాన్ని బలోపేతం చేయాలి.దేశం ఇప్పుడు ఏకతాటిపై మాట్లాడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో ఏకతా శక్తి అవసరం. ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న శక్తులు కశ్మీర్‌ను మళ్లీ నాశనం చేయాలనుకుంటున్నాయి. దేశం ఐకమత్యమే మన విజయానికి ఆధారం. పహల్గాంలో జరిగిన దాడి ఉగ్రవాదుల మూర్ఖత్వాన్ని, నిస్సహాయతను చూపిస్తుంది. 22 ఏప్రిల్ పహల్గాం ఉగ్రదాడి ప్రతీ భారతీయుడి మనసును కలచివేసింది. ప్రతీ రాష్ట్రం, ప్రతీ భాషకు చెందిన వారు బాధిత కుటుంబాల కష్టాన్ని తలచుకుంటున్నారు. ప్రతీ భారతీయుడి గుండె ఉగ్ర దాడి దృశ్యాలను చూసి రగులుతోంది అంటూ చెప్పుకొచ్చారు. -
IPL 2025: విరాట్ 30కి పైగా స్కోర్ చేశాడా, ఆర్సీబీ గెలిచినట్లే..!
ఐపీఎల్లో ఇవాళ (ఏప్రిల్ 27) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కాబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఆర్సీబీని ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగనుంది. ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకునే విషయంలో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ, ఆర్సీబీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించగా.. ఆర్సీబీ తొమ్మిదింట ఆరు గెలిచి అదే 12 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. ఇరు జట్ల రన్రేట్లు కూడా దగ్గరగా ఉన్నాయి. ఢిల్లీ 0.657 రన్‌రేట్‌తో ఆర్సీబీ (0.482) కంటే కాస్త మెరుగ్గా ఉంది.ఇరు జట్లు ఈ సీజన్లో తలపడటం ఇది రెండో సారి. ఏప్రిల్ 10న ఆర్సీబీ ఇలాకా చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ (93 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఢిల్లీని ఒంటిచేత్తో గెలిపించాడు. మ్యాచ్ అనంతరం 'ఇది నా అడ్డా' అంటూ రాహుల్ చేసుకున్న సెలబ్రేషన్స్ సోషల్‌మీడియాలో వైరలయ్యాయి.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ బౌలర్లలో విప్రాజ్ నిగమ్ (4-0-18-2), కుల్దీప్ యాదవ్ (4-0-17-2), ముకేశ్ కుమార్ (3-1-26-1), మోహిత్ శర్మ (2-0-10-1) అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీని కట్టడి చేశారు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో సాల్ట్ (37), కోహ్లి (22), రజత్ పాటిదార్ (25), కృనాల్ పాండ్యా (18), టిమ్ డేవిడ్ (37 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేశారు. ఆఖర్లో డేవిడ్ చెలరేగడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఢిల్లీ కూడా తొలుత తడబడింది. ఆ జట్టు 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రాహుల్, స్టబ్స్ (38 నాటౌట్) ఢిల్లీని ఆదుకుని విజయతీరాలకు చేర్చారు. ఆర్సీబీ బౌలర్లలో భువీ 2, యశ్ దయాల్, సుయాశ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో ఎదురైన పరాభవానికి ఆర్సీబీ నేటి మ్యాచ్‌లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. ఈ సీజన్లో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి. ఆర్సీబీ ప్రత్యర్థుల సొంత మైదానల్లో అపజయమనేదే లేకుండా దూసుకుపోతుంది. నేటి మ్యాచ్ ఢిల్లీ హోం గ్రౌండ్లో కావడంతో ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తప్పక గెలుస్తుందని అంతా అనుకుంటున్నారు.ఈ సీజన్లో ఆర్సీబీ విజయాల్లో ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషిస్తున్నాడు. విరాట్ 30కి పైగా స్కోర్ చేసిన ప్రతి మ్యాచ్‌లో ఆర్సీబీ గెలిచింది. విరాట్ విఫలమైన మూడు మ్యాచ్‌ల్లో (గుజరాత్‌పై 7, ఢిల్లీపై 22, పంజాబ్‌పై 1) ఆర్సీబీ ఓడింది. ఈ లెక్కన చూస్తే నేడు ఢిల్లీతో జరుగబోయే మ్యాచ్‌లో విరాట్ 30కి పైగా స్కోర్ చేస్తే ఆర్సీబీ గెలవడం ఖాయమని సెంటిమెంట్లు చెబుతున్నాయి. ఈ సీజన్లో విరాట్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 5 హాఫ్ సెంచరీల సాయంతో 392 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. -
ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రముఖ బుల్లితెర నటి.. వీడియో వైరల్!
ప్రముఖ బుల్లితెర నటి షిరీన్ మీర్జా తన ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం తాను గర్భంతో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ విషయాన్ని తన భర్తతో కలిసి ఓ వీడియో ద్వారా పంచుకుంది. తల్లిదండ్రులుగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కాగా.. ఈ బుల్లితెర భామ యే హై మొహబ్బతీన్ బాలీవుడ్లో ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించింది.తాజాగా షేర్ చేసిన వీడియోలో బేబీ బంప్‌తో కనిపించింది. కాగా.. ఆమె హసన్ సర్తాజ్ అనే వ్యక్తిని పెళ్లాడింది. 2021లో ఆమె స్వస్థలమైన జైపూర్‌లో వివాహం చేసుకుంది. షిరీన్ మీర్జా ప్రెగ్నెన్సీ ప్రకటనతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంటకు శ్రేయోభిలాషులు, సన్నిహితులు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. బాలీవుడ్లో యే హై చాహతీన్, బహుత్ ప్యార్ కర్తే హై, యే కహా ఆగయా హమ్, ధర్మక్షేత్ర్ లాంటి సీరియల్స్‌లో నటించింది. View this post on Instagram A post shared by Mirzashireen (@shireenmirza) -
75 వసంతాల ‘పల్లెటూరి పిల్ల’.. తెలుగు తెరపై చెరగని ముద్ర!
జయాపజయాల స్థాయితో సంబంధం లేకుండాకొన్ని సినిమాలకు చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.వాటికి ఉండే అనేకానేక ఇతర విశేషాల తాలూకు ఘనత అది. కాలం గడిచిన కొద్దీ చిత్ర కథ, కథనాల కన్నా ఆ విశేషాల వల్ల సదరు సినిమా మైలురాయిగా మిగిలిపోతుంది. ఈ ఏప్రిల్ 27తో సరిగ్గా 75 వసంతాలు(ప్లాటినమ్ జూబ్లీ) నిండిన ‘పల్లెటూరి పిల్ల’ అలాంటిదే.అప్పట్లో ఘన విజయం సాధించి, 7 కేంద్రాల్లో నేరుగా శతదినోత్సవం జరుపుకొన్న ఈ సినిమా ప్రత్యేకతలు పుష్కలం. ఆనాటి ‘పల్లెటూరి పిల్ల’ చిత్రం చెరిగిపోని తన ముద్రలను ఈనాటికీ గుర్తు చేస్తూనే ఉంది.ఎన్టీఆర్ అసలు మొదటి సినిమా ఇదే! నటుడిగా మొదలై ప్రజానేతగా ఎదిగిన ఎన్టీ రామారావు తొలి సినిమా అనగానే ‘మన దేశం’ (1949) అనుకుంటాం కానీ, అసలు ఆయన నటుడిగా తొలిసారిగా ఎంపికైనదీ, తొట్టతొలిసారిగా కెమెరా ముందు నిల్చున్నదీ ఈ ‘పల్లెటూరి పిల్ల’తోనే! అయితే, రిలీజులో మొదట ‘మన దేశం’ వస్తే, రెండోది ‘షావుకారు’, మూడోది ‘పల్లెటూరి పిల్ల’ అయ్యాయి. నిజానికి, ఎన్టీఆర్‌ను ఈ ‘పల్లెటూరి పిల్ల’ దర్శక – నిర్మాత బి.ఏ. సుబ్బారావు వద్దకు తీసుకువెళ్ళింది కూడా ‘మన దేశం’ దర్శకుడు ఎల్వీ ప్రసాదే! అందగాడు, స్ఫురద్రూపి అయిన ఎన్టీఆర్‌ను చూస్తూనే, తన తొలి సినిమా హీరో ఇతనే అని సుబ్బారావు తేల్చేశారు. అయితే, తొలి సినిమా రూపొందిస్తూ, తొలిసారి కెమెరా ముందుకు వస్తున్న నటుణ్ణి హీరోగా పెట్టడం భారమేనంటూ ప్రసాద్, ఈలోగా తన సినిమాలో ఒక సహాయక పాత్ర ఇస్తానన్నారు. అదే – ఎన్టీఆర్ తొలిసారి తెరపై కనిపించిన ‘మన దేశం’లోని పోలీస్ ఇన్స్పెక్టర్ పాత్ర అన్న మాట!తెలుగు సినిమా పరిశ్రమ పురోగతిలో ఇవాళ్టికీ ధ్రువతారలుగా చెప్పుకొనే ఎన్టీఆర్ – ఏయన్నార్ అనే ఇద్దరు అగ్రనటులు కలసి తొలిసారిగా నటించిన చిత్రం కూడా ‘పల్లెటూరి పిల్లే’. అప్పటి దాకా మీర్జాపురం రాజా వారి ‘శోభనాచల’ సంస్థలో ప్రొడక్షన్ నుంచి డైరెక్షన్ దాకా వివిధ శాఖల్లో, స్థాయుల్లో పనిచేస్తున్న బి.ఏ. సుబ్బారావు ఆసక్తి కొద్దీ, ఆ సంస్థ అండదండలతో దర్శకుడిగా, నిర్మాతగా మారిందీ ఈ సినిమాతోనే. 1948 మొదట్లోనే షూటింగ్ ఆరంభమైనా, ఆర్థిక ఇబ్బందులతో చిత్రనిర్మాణం విపరీతంగా జాప్యమైంది. ఆఖరికి మళ్ళీ రాజా వారి చేయూతతోనే 1950 మొదట్లో సినిమా పూర్తి చేశారు. అందుకే, ‘బి.ఏ. సుబ్బారావు, శోభనాచల పిక్చర్స్ జాయింట్ ప్రొడక్షన్’ అంటూ నిర్మాణసంస్థగా రెండు పేర్లూ వేశారు. ఎట్టకేలకు నాటి ప్రసిద్ధ పంపిణీ సంస్థ పూర్ణా పిక్చర్స్ ద్వారా విడుదల చేయించారు.గాంధీ ఆశయం చూపే జానపదం జానపద చిత్రాలకే డబ్బు వస్తుందనీ, సాంఘికాలు సహా తక్కినవి ఏవి తీసినా ఆర్థికంగా నష్టం వస్తుందనీ తెలుగు చిత్రసీమలో భావిస్తున్న రోజులవి. నిర్మాతలంతా జానపదాల వైపు, మంత్రతంత్రాల కాకమ్మకథల వైపు పరుగులు తీస్తున్న కాలమది. అలాంటి వాతావరణంలో అనారోగ్యకరమైన అంశాలను ప్రేక్షకుల మీద రుద్దకుండా, అభ్యుదయానికి దోహదం చేస్తూనే విజయవంతమయ్యే ఫోక్లోర్ సినిమా తీయడం సాధ్యమేనని ‘పల్లెటూరి పిల్ల’ ఋజువు చేసింది. కత్తులూ కటార్లూ వాడినా, మాయలూ మంత్రాలూ లేని ఈ జానపదం మన తెలుగు ప్రాంతాల్లో ప్రభువుల పక్షాన పాలన చేసిన పాలెగాళ్ళ సంస్కృతిని తెరపై చూపింది. గ్రామాలను కాపు కాయాల్సిన వాళ్ళు కొన్నిసార్లు నిరంకుశంగా, పల్లెల్ని దోచుకు తినే వైనానికి విలన్ కంపన దొర (నటుడు ఏ.వి. సుబ్బారావు) పాత్ర ప్రతిరూపం. అయితే, ఈ చిత్రానికి మూలం మాత్రం 18వ శతాబ్దిలోకెల్లా ప్రాచుర్యం పొందిన నాటకాల్లో రెండోదైన షెరిడాన్ ఆంగ్ల రచన ‘పిజారో’. అధికారం, అత్యాశ, నమ్మకద్రోహం లాంటి ఎన్నో మిళితమైన విషాదాంత డ్రామా ఇది. దాన్ని ఆధారంగా తీసుకొని, తాపీ ధర్మారావు, ఆదినారాయణరావు, సదాశివబ్రహ్మం, చిత్రపు నారాయణమూర్తి, బి.ఏ. సుబ్బారావు... ఇలా అందరూ కలసి మన నేటివిటీకి తగ్గట్టుగా వండిన వంటకం ‘పల్లెటూరి పిల్ల’. మూడు ముక్కల్లో చెప్పాలంటే, ఒక గ్రామాన్ని స్వాధీనం చేసుకోవడానికి కంపన దొర అనే ముఠా నేత ప్రయత్నాలను గ్రామస్థులంతా ఏకమై ప్రతిఘటించడమే కథా వస్తువు. దుర్మార్గుడైన ముఠా నేతకు చివరలో హృదయ పరివర్తన కలుగుతుంది. ‘‘జీవితకాలమంతా గాంధీజీ కలవరించిన గ్రామ పునర్నిర్మాణమును ప్రత్యక్షంగా నిరూపించే మహత్తర చిత్రము’’ అంటూ అప్పట్లో ప్రచారం చేశారు.కంపన దొర అనుచరుడిగా ఉండి, పల్లెటూరి పిల్ల (అంజలీదేవి) దెబ్బతో మనిషిగా మారి, గ్రామం కోసం పోరాడే హీరో పాత్ర ఎన్టీఆర్‌ది. సదరు పల్లెటూరి పిల్లకు వరసైన వాడైనా, హీరో హీరోయిన్ల సాన్నిహిత్యం చూసి, తన ప్రేమను వదులుకొని పక్కకు తప్పుకొని, ఆఖరులో వారి కోసం, ప్రజాక్షేమం కోసం ప్రాణమే త్యాగం చేసి మహాత్ముడిగా నిలిచే కీలక పాత్ర ఏయన్నార్‌ది. తాపీ ధర్మారావు రాసిన మాటలు, ‘శాంత వంటి పిల్ల లేదోయి...’ లాంటి పాటలు అప్పట్లో జనానికి పట్టాయి.ఇటు ఎన్టీఆర్... అటు ఎమ్జీఆర్! ఇవాళ ఇంతగా చెప్పుకుంటున్న ఈ ‘పల్లెటూరి పిల్ల’ నిర్మాణమే కాదు, రిలీజ్ కూడా ఆలస్యమే. రకరకాల రిలీజ్ తేదీలు మారింది. ఆఖరి క్షణంలోనూ 1950 ఏప్రిల్ 20 నుంచి ఎందుకనో ఓ వారం వాయిదా వేశారు. ఆఖరికి ఏప్రిల్ 27న మద్రాసు సహా తెలుగు నాట అంతటా జనం ముందుకొచ్చింది. ఎన్టీఆర్ హీరోగా చేసిన తొలి చిత్రమిదే అయినా, ఆయన హీరోగా తర్వాత మొదలైన విజయా వారి ‘షావుకారు’ జనం ముందుకొచ్చి, సక్సెస్‌ఫుల్‌గా 3 వారాలవుతున్న వేళ ఈ ‘పల్లెటూరి పిల్ల’ విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ నాటికే ఒకపక్క విజయా వారి ‘పాతాళభైరవి’ షూటింగ్ జోరుగా సాగుతోంది. మరోపక్క వాహినీ వారి ఆణిముత్యం ‘మల్లీశ్వరి’ కొంత పూర్తయింది. రిలీజుకు ముందే ఆ ఏడాది తమిళ ఉగాది నాడు ఉదయం మద్రాసులోని ‘మినర్వా’ థియేటర్లో ఈ ‘పల్లెటూరి పిల్ల’ ప్రివ్యూ వేశారు. గమ్మత్తేమిటంటే, ఒక పక్కన ఎన్టీఆర్ సినిమా చూపిస్తుంటే, అదే రోజున అదే సమయంలో ‘సాగర్’ టాకీస్‌లో ఎమ్జీఆర్ కొత్త తమిళ చిత్రం ‘మరుదనాడ్ ఇళవరసి’ ప్రెస్షో వేయడం. (ఆ తమిళ చిత్రం మిగిలిన కేంద్రాల కన్నా 12 రోజులు ఆలస్యంగా ఆ రోజే మద్రాస్‌లో రిలీజైంది). యాదృచ్ఛికమే అయినా ఆ రెండు చిత్రాల ప్రివ్యూలు జరిగిన సరిగ్గా ఆ ఉగాది నాటి రాత్రే 8.47 గంటలకు తిరువణ్ణామలైలో భగవాన్ రమణ మహర్షి సమాధిగతులయ్యారు. హీరోగా ఎన్టీఆర్‌కు అదే తొలి సినిమా కానీ, ఎమ్జీఆర్‌కు మాత్రం అప్పటికే హీరోగా కొంత పేరుంది. ఇటు ఎన్టీఆర్ తెలుగు సినిమా, అటు ఎమ్జీఆర్ తమిళ సినిమా... రెండూ జానపదాలే. రెండూ హిట్టే. కాలగతిలో ఇద్దరూ ఆయా భాషల చిత్రసీమలకు మకుటం లేని మహారాజులయ్యారు. ఆపైన పార్టీలు పెట్టి, జనరంజక పాలకులూ అయ్యారు.ఆఖరు దాకా... ఆనాటి మంచితనం! రిలీజులో ఆలస్యమైనా, హీరోగా ఎన్టీఆర్‌కు తొలి రోజులైనా, ‘పల్లెటూరి పిల్ల’ హిట్టయింది. హీరోగా ఎన్టీఆర్, దర్శక – నిర్మాతగా సుబ్బారావు స్థిరపడ్డారు. మూడు దశాబ్దాల పైగా ఇద్దరూ ఎవరికి వారు వెండితెరపై వెలిగారు. ‘రాజు –పేద’, ‘చెంచులక్ష్మి’, ‘భీష్మ’, ‘రాణీ రత్నప్రభ’, ‘మోహినీ భస్మాసుర’ లాంటి అనేక చిత్రాలను సుబ్బారావు స్వీయ నిర్మాణంలో రూపొందించారు. తెరపై తొలి అవకాశమిచ్చారన్న కృతజ్ఞతతో ఎన్టీఆర్ ‘సతీ సావిత్రి’, ‘మావారి మంచితనం’ వరకు సుబ్బారావుతో సినిమాలు చేస్తూనే వచ్చారు. కుమారులు హరికృష్ణ – బాలకృష్ణలు తొలిసారిగా కలిసి నటించిన ‘రామ్ – రహీమ్’ (1974)కు కూడా సుబ్బారావే డైరెక్టర్. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయనను ప్రత్యేకంగా హైదరాబాద్ పిలిపించి, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎఫ్డీసీ)లో రాష్ట్ర ప్రభుత్వ న్యూస్‌రీల్స్ రూపకల్పన బాధ్యతలు అప్పగించడం విశేషం.దిలీప్ కుమార్‌కు ఫ్లాపు... అమితాబ్‌కు హిట్టు! ఎన్టీఆర్ – బి.ఏ. సుబ్బారావుల తొలి ప్రయత్నం ‘పల్లెటూరి పిల్ల’ 1990ల దాకా రీరిలీజ్ అవుతూ, అభిమానుల్ని అలరించింది. తొలి రిలీజప్పుడే ఈ సినిమా తమిళంలో ‘గ్రామ పెణ్’గా అనువాదమైంది. (తమిళంలో అనువాదమైన తొలి తెలుగు సినిమా ఏయన్నార్ ‘కీలుగుర్రం’ అయితే, రెండో తెలుగు సినిమా ఎన్టీఆర్ ‘పల్లెటూరి పిల్ల’). తరువాత కొన్నేళ్ళకు ప్రసిద్ధ నిర్మాత ‘జెమినీ’ వాసన్ ఇదే కథను దేవానంద్, దిలీప్‌కుమార్‌లతో హిందీలో ‘ఇన్సానియత్’ (1955) పేరిట రీమేక్ చేశారు. హిందీ చలనచిత్ర చరిత్రలో ఆ అగ్రతారలిద్దరూ కలసి నటించిన ఏకైక సినిమా అది. హాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా జిప్పీ అనే చింపాజీని రప్పించి, ఈ హిందీ వెర్షన్లో నటింపజేయడం విశేషం. హీరోల కన్నా ఈ హాలీవుడ్ చింపాజీకి ఇచ్చిన పారితోషికం, చేసిన ఖర్చే ఎక్కువ. జెమినీ వారి హిందీ హిట్స్ ‘చంద్రలేఖ’ వగైరాలతో పోలిక లేదు కానీ, పబ్లిసిటీ ప్రభంజనంలో ‘ఇన్సానియత్’ సో సో అనిపించుకుంది. చిత్ర మేమంటే, వీటన్నిటికీ మూలమైన ‘పిజారో’ నాటక ఇతివృత్తం స్ఫూర్తితో రకరకాల మార్పులతో తర్వాత అనేక భాషల్లో సినిమాలొచ్చాయి. జాగ్రత్తగా గమనిస్తే, చిరస్మరణీయ బాక్సాఫీస్ సూపర్‌హిట్ ‘షోలే’కు కూడా ఇదే ప్రేరణ. త్యాగంలో దిలీప్ కుమార్ పాత్రకూ, అమితాబ్ పాత్రకూ పోలికలు కనిపిస్తాయి. ఆ క్యారెక్టరైజేషన్ దిలీప్‌కు ఫ్లాపైతే, అమితాబ్‌కు సూపర్ హిట్.ఏయన్నార్ అలా వచ్చారు! ‘పల్లెటూరి పిల్ల’ రూపకల్పన ప్రస్థానం ఆది నుంచి అనేక మలుపులు తిరిగింది. కాకినాడలో ప్రసిద్ధ ‘యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్’ నాటకాల రోజుల నుంచి బి.ఏ. సుబ్బారావుకు సుపరిచితులైన అంజలీదేవి, ఆదినారాయణరావులు చిత్ర హీరోయిన్, సంగీత దర్శకులుగా ఓకే. మొదట ఎన్టీఆర్‌తో పాటు ఉండే మరో హీరో పాత్రకు ఈలపాట రఘురామయ్యను అనుకున్నారు. రఘురామయ్యతో కొద్దిగా షూటింగ్ కూడా చేశాక, చిత్రనిర్మాణం విపరీతంగా ఆలస్యమైంది. ఆఖరికి ఆ పాత్ర ఏయన్నార్‌కు దక్కింది. అప్పటికే, ‘బాలరాజు’ (1948 ఫిబ్రవరి 26) వచ్చేసింది. శోభనాచల వారి ‘కీలుగుర్రం’ (రిలీజ్ 1949 ఫిబ్రవరి 19) పట్టాలెక్కింది. అలా హీరోగా పేరు తెచ్చుకున్న ఏయన్నార్ ఈ చిత్రంలో హీరోయిన్ లేకుండా, ఆఖరికి ప్రాణాలు కూడా వదులుకొనే త్యాగమయ పాత్రకు ఒప్పుకోవడం విశేషమే. స్టార్డమ్ ఇంతగా ప్రబలని ఆ రోజుల్లో రంగస్థల, సినీ నటీనటులకు తాము పోషించే పాత్ర తాలూకు ప్రాధాన్యమే తప్ప, ఇమేజ్ పట్టింపులు ఉండేవి కాదనడానికి ఇది పెద్ద ఉదాహరణ. ఏయన్నార్ రాకతో, అంతకు ముందు రఘురామయ్యతో తీసిన సీన్లను రీషూట్ చేశారు. మానిన గాయాల మధురస్మృతులుఈ ‘పల్లెటూరి పిల్ల’తో మొదలైన ఎన్టీఆర్, ఏయన్నార్ల టాప్ స్టార్ కాంబినేషన్ మాత్రం మరెక్కడా లేని విధంగా మొత్తం 15 చిత్రాల్లో కొనసాగింది. ఈ చిత్రంలోనే ఏయన్నార్ మీదకు వచ్చే ఎద్దుతో ΄పోరాడే సీన్లో రియలిస్టిక్‌గా నటించినప్పుడు ఎన్టీఆర్ కుడి చేతి ఎముక విరిగింది. అలా ఆ తొలి చిత్రం నుంచి సినీ కెరీర్లో మొత్తం 7 సందర్భాల్లో వివిధ సినిమాల షూటింగుల్లో అదే చేతికి దెబ్బ తగిలి, ఎన్టీఆర్‌కు ఫ్రాక్చరైంది. అలా జరిగినప్పుడల్లా ఆయన పుత్తూరు రాజుల కట్టువైద్యాన్ని ఆశ్రయించి, ఆరోగ్యవంతులయ్యారు. తొలిచిత్రం ‘పల్లెటూరి పిల్ల’ ఫైట్ సీన్లోనే ఆస్ట్రేలియన్ ఎద్దు కొమ్ము విసిరినప్పుడు గాయమై, ఎన్టీఆర్ ఎడమ కన్ను కింద చిన్న గాటు పడింది. ముఖం మీద ఆ చిరుగాటు మచ్చ కెరీర్‌కు అవరోధమవుతుందని అందరూ భావించారు కానీ, అవేవీ ఎన్టీఆర్ ప్రస్థానానికి అడ్డు కాలేదు. ఆ చిరుగాటునే ‘కొండవీటి సింహం’ (1981)లో ఎన్టీఆర్ వేసిన ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ పాత్రకు తగ్గట్టుగా మేకప్‌లో పెద్దదిగా చేసి, ఎఫెక్టివ్‌గా వాడుకోవడం విశేషం. తొలి సినిమా ‘పల్లెటూరి పిల్ల’ ఇచ్చిన గుర్తులు ఎన్టీఆర్కే కాదు... సినీ ప్రియులకూ ఇవాళ్టికీ ఇలా మిగిలాయి.– రెంటాల జయదేవ -
నిరాశపరిచిన ఎస్బీఐ కార్డ్
న్యూఢిల్లీ: ఎస్బీఐ కార్డ్ (క్రెడిట్ కార్డు సేవల్లోని) గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి (2025 జనవరి–మార్చి) రూ.534 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో లాభం రూ.662 కోట్లతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గిపోయింది. క్రెడిట్ కార్డులపై రుణ ఎగవేతలు పెరగడం లాభాలకు గండికొట్టింది. మొత్తం ఆదాయం మాత్రం ఇదే కాలంలో రూ.4,475 కోట్ల నుంచి రూ.4,832 కోట్లకు వృద్ధి చెందింది. వడ్డీ ఆదాయం రూ.2,415 కోట్లకు మెరుగుపడింది.క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.2,139 కోట్లుగా ఉంది. స్థూల నిరర్థక రుణాలు (వసూలు కాని/ఎన్పీఏలు) మొత్తం రుణాల్లో 3.08 శాతంగా ఉన్నాయి. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇవి 2.76 శాతమే. నికర ఎన్పీఏలు గమనించినా.. 0.99 శాతం నుంచి 1.46 శాతానికి పెరిగాయి. నష్టాలు/మొండి బకాయిలకు కేటాయింపులు క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.944 కోట్లుగా ఉంటే, సమీక్షా కాలంలో రూ.1,245 కోట్లకు పెరిగిపోయాయి.ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ కార్డ్ రూ.1,916 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. 2023–24లో నమోదైన రూ.2,408 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.17,484 కోట్ల నుంచి రూ.18,637 కోట్లకు వృద్ధి చెందింది. బ్యాలన్స్ షీట్ విలువ రూ.58,171 కోట్ల నుంచి రూ.65,546 కోట్లకు పెరిగింది. ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ షేరు ధర ఒక శాతానికి పైగా లాభపడి రూ.927 వద్ద ముగిసింది. -
ట్రైలర్: సీరియల్స్ చూస్తున్నంతసేపు దెయ్యంగా.. కాపాడనున్న సమంత!
హీరోహీరోయిన్లు ఇప్పుడు నిర్మాతగానూ సక్సెస్ చూస్తున్నారు. నాని ఇటీవలే నిర్మాతగా కోర్టు మూవీతో విజయం అందుకున్నాడు. తాజాగా హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) కూడా ప్రొడ్యూసర్‌గా సత్తా చూపించేందుకు సిద్ధమైంది. ఆమె కొత్తగా ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్‌ను స్థాపించింది. ఈ బ్యానర్లో శుభం అనే సినిమా తెరకెక్కింది. కొత్తవారితో కలిసి చేసిన ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రెగుల దర్శకత్వం వహించాడు.సీరియల్స్ చూస్తున్నంతసేపు ఒంట్లో దెయ్యంఆదివారం (ఏప్రిల్ 27) నాడు ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇందులో ఆడవాళ్లు సీరియల్స్‌కు బానిసైపోతారు. ఏం చేస్తున్నా సరే సీరియల్ టైం అవగానే టీవీ ముందు కూర్చుంటారు. వాళ్లను డిస్టర్బ్ చేశారంటే వాళ్ల పని అధోగతే! సీరియల్స్ చూస్తున్నప్పుడు వారి శరీరంలోకి ఓ దెయ్యం వచ్చినట్లే ప్రవర్తిస్తున్నారు. దీంతో మగవాళ్లు చివర్లో ఓ మాతను కలుస్తారు. ఇక్కడ మాత స్థానంలో ఉన్నది మరెవరో కాదు సమంత. ఊర్లో ఉన్న మగవాళ్లందరినీ కాపాడమని వాళ్లు ఆమె శరణు కోరతారు.మే 9న రిలీజ్మరి సమంత ఏం చేసింది? వాళ్లను కాపాడిందా? లేదా? అన్నది తెలియాలంటే మే 9న ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే! ఈ విచిత్రమైన కథను చచ్చినట్లు చూడాల్సిందే అని ట్రైలర్లోనే నొక్కి చెప్పారు. ఏదేమైనా ఈ మూవీలో సమంతను చూసి అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తున్న సామ్‌ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చదవండి: పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి -
‘బాబూ.. సూపర్ సిక్స్‌కు డబ్బుల్లేవ్.. లక్ష కోట్ల అమరావతి!’
సాక్షి, అనంతపురం: ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అంటూ అమరావతిలో మళ్లీ శంకుస్థాపనలు హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘అమరావతి పునర్ నిర్మాణం పేరుతో చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ఓవైపు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు.. మరోవైపు లక్ష కోట్ల రాజధాని ఎలా?. ఏపీలోని సహజ వనరులను తాకట్టు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కింది. సూపర్ సిక్స్ హామీల అమలులో చంద్రబాబు సర్కార్ ఘోరంగా విఫలమైంది. చంద్రబాబు 11 మాసాల పాలన విశ్వాసం ఘాతుకానికి నిదర్శనం. మెగా డీఎస్సీపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి సంతకం నేటికీ అమలు కాలేదు. అమ్మ ఒడి లేదు.. రైతు భరోసా పథకం సాయం లేదు. రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ ఉందా అన్న అనుమానం కలుగుతోంది. రైతుల ఆత్మహత్యలు చంద్రబాబుకు పట్టావా?. అమరావతి పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఏపీ అభివృద్ధి పై ప్రధాన మంత్రి స్పష్టత ఇవ్వాలి. పునర్విభజన చట్టం హామీలను అమలు చేయాలి. పోలవరం ఎత్తు తగ్గింపు తగదు. చంద్రబాబు పాలనలో 99 రూపాయలకే మద్యం దొరుకుతోంది. చంద్రబాబు అస్మదీయులకు 99పైసలకే విశాఖలో ఎకరం భూమి దొరుకుతోంది అని ఎద్దేవా చేశారు. -
టీమిండియాపై సంచలన శతకం సాధించిన ఆటగాడిపై నిషేధం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియాపై సంచలన శతకం సాధించి వార్తల్లో నిలిచిన బంగ్లాదేశ్ మిడిలార్డర్ బ్యాటర్ తౌహిద్ హృదోయ్ నిషేధానికి గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్-2025లో ఓ మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్పందించినందుకు అతడిపై నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ (8 డీమెరిట్ పాయింట్లతో పాటు) విధించబడింది. దీంతో హృదోయ్ ఈ సీజన్లో అబాహీనీ జట్టుతో జరిగే కీలక మ్యాచ్‌తో పాటు వచ్చే సీజన్లో తొలి మూడు మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. హృదోయ్ ఢాకా ప్రీమియర్ లీగ్‌లో (DPL) మొహమ్మదెన్ ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఘాజీ గ్రూప్‌తో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటైన తర్వాత అంపైర్ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.24 ఏళ్ల హృదోయ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండగా హృదోయ్ సూపర్ సెంచరీతో (118 బంతుల్లో 100; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకున్నాడు. జాకిర్ అలీతో (68) కలిసి ఆరో వికెట్‌కు 154 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. తద్వారా బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. అనంతరం భారత్ సులువగా లక్ష్యాన్ని ఛేదించినా హృదోయ్ ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. శుభ్‌మన్ గిల్ సూపర్ సెంచరీ (101 నాటౌట్) చేసి భారత్‌ను గెలిపించాడు. రోహిత్ శర్మ (41), కేఎల్ రాహుల్ (41 నాటౌట్) కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆ టోర్నీలో భారత్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమివ్వగా, భద్రతా కారణాల దృష్ట్యా భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడింది. -
ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే మార్పులు సాధారణమైనవేనా..?
నాకిప్పుడు ఐదవనెల. కొత్తగా ఏవైనా వ్యాక్సిన్స్ ప్రెగ్నెన్సీలో ఇస్తున్నారా? ఉంటే చెప్పండి? – జాగృతి, కర్నూలు. గర్భవతులందరూ తప్పనిసరిగా టీటీ ఇంజెక్షన్, ఫ్లూ, కోరింతదగ్గు టీకాలు తీసుకోవాలి. ఇవి అన్ని ఆసుపత్రుల్లోనూ రొటీన్‌గా నెలలను బట్టి ఇస్తారు. వీటికి ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీ బ్లడ్ గ్రూప్ నెగటివ్ గ్రూప్ అయి, మీ భర్తది పాజిటివ్ గ్రూప్ ఉంటే కనుక, రీసస్ యాంటీ–డీ వ్యాక్సినేషన్ అనేది ప్రత్యేకంగా తీసుకోవాలి. ఇది డాక్టర్ కొన్ని పరీక్షలు చేసిన తర్వాత ఏడవ నెలలో సూచిస్తారు. ఇప్పుడు ఫ్లూ సీజన్ ఉన్నందున ఇనాక్టి్టవేటెడ్ ఫ్లూ వ్యాక్సిన్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ కొన్ని ఆసుపత్రుల్లో మాత్రమే ఇస్తున్నారు. మీరు డాక్టర్‌ను సంప్రదించి తీసుకోండి. ఫ్లూ వచ్చిన వారికి ప్రెగ్నెన్సీలో సమస్యలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే, టీబీ రోగనిరోధక శక్తి ఆ సమయంలో చాలా బలహీనంగా ఉంటుంది. న్యూమోనియా, బ్రాంకైటిస్ లాంటివి వస్తే తీవ్రమైన ప్రభావాలు తల్లీ బిడ్డలపై ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఈ సమస్యలు తక్కువ. కోరింత దగ్గు, ధనుర్వాతం వ్యాక్సిన్లు ఐదవనెల నుంచి ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ల వలన శరీరంలో యాంటీ బాడీస్ ఉత్పత్తి అయి పుట్టబోయే బిడ్డకు లంగ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. వీటిని ఎనిమిదవ నెలలోపు తీసుకోవాలి.నేను ఏడునెలల గర్భవతిని. ఇంట్లో ఆఫీస్ వర్క్ చెయ్యవద్దని అంటున్నారు. ఒత్తిడి ఎక్కువ ఉంటే ఏ సమస్యలు వస్తాయి? – మమత, హైదరాబాద్. ఏడవనెల అంటే బేబీ ఎదుగుదల వచ్చే సమయం. కానీ, తల్లికి ఏదైనా ఒత్తిడి, టెన్షన్స్ ఉంటే అవి చెడు ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా డాక్టర్ చెప్పేది పాటిస్తూ, జాబ్ చేస్తూ, ఒత్తిడి తక్కువ ఉంటే ఏ సమస్యలు ఉండవు. కానీ, ముందుగానే కొంచెం టెన్షన్లో ఉన్నవాళ్లు, ఉద్యోగ సంబంధిత టార్గెట్స్ రీచ్ కాలేనప్పుడు టెన్షన్స్ ఎక్కువ పడేవారికి బేబీ ఎదుగుదలపై కొంత ప్రభావం పడుతుంది. బేబీ మెదడు, నరాల ఎదుగుదలలో కొన్ని మార్పులు వస్తాయి అని కొన్ని పరిశోధనల్లో తేలింది. శారీరక ఆరోగ్యంలో బీపీ పెరగటం, ఒత్తిడి వలన ప్రెగ్నెన్సీలో ఉండే నీరసం, నిద్రపట్టకపోవడం లేదు అనేవి ఇంకా ఎక్కువగా అనిపిస్తాయి. ఒత్తిడితో ఎక్కువ తినటం లేదా తక్కువ తినడం, రోగనిరోధక శక్తి తక్కువ అవటం, ఇన్ఫెక్షన్స్ వలన నెలలు నిండకుండానే ప్రసవం, ఉమ్మనీరు కారిపోవడం లాంటివి ఉంటాయి. మానసికంగా కూడా మూడ్ స్వింగ్స్, ఆందోళన లాంటివి ఒత్తిడితో ఎక్కువ అవుతాయి. తల్లి ఒత్తిడి వలన బేబీ నర్వస్ సిస్టమ్ ఎఫెక్ట్ కావచ్చు. బేబీకి బుద్ధిమాంద్యం ఏర్పడవచ్చు. బేబీ ఎదుగుదల తక్కువ ఉండటం, పుట్టిన బిడ్డకు అంగవైకల్యం, బిడ్డ బరువు తక్కువ ఉండటం, నెలలు నిండకుండానే కాన్పు జరగచ్చు. ఒత్తిడి ఎక్కువ ఉన్న వారిలో హార్మోన్ల మార్పులు ఎక్కువ ఉంటాయి. ఒకసారి డాక్టర్ని సంప్రదించి ఒకసారి ఒత్తిడి తక్కువ అవడానికి డైట్, వ్యాయామం ఏవి చెయ్యాలి అని తెలుసుకోండి. నాకిప్పడు ఎనిమిదవ నెల. ఈ నెలలో శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి. అవి సాధారణ మార్పులా లేదా ఏదైనా సమస్యా అని ఎలా గుర్తించాలి? – కీర్తి, నల్గొండ. చివరి రెండు నెలల్లో శరీరంలో ప్రెగ్నెన్సీలో హార్మోన్ల వలన చాలా మార్పులు వస్తాయి. నొప్పి, కాళ్లు, ముఖ కండరాల్లో వాపు రావచ్చు. ఆందోళన కూడా పెరుగుతుంది. బేబీ కదలికలు కూడా ఎక్కువ అవుతాయి. అప్పుడప్పుడు పొట్ట అంతా చాలా గట్టిగా అయి, వదులుగా అవుతుంది. నొప్పి ఉండదు. వీటిని బ్రాక్ట్సన్ హిక్స్ కంట్రాక్షన్స్ అంటాం. రొమ్ముల్లో కూడా నొప్పిగా అనిపిస్తుంది. కొందరికి వాటరీ మిల్క్లాగా వస్తుంది. ఒకవేళ మీకు కాంట్రాక్షన్స్ నొప్పిగా అనిపిస్తున్నా, ఎక్కువసార్లు వస్తున్నా, బ్లీడింగ్ ఉన్నా, అకస్మాత్తుగా బేబీ యాక్టీవిటీ తగ్గినా, సడన్‌గా బరువు పెరిగినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బేబీ ఎదుగుదల కూడా ఈ చివరి రెండు నెలల్లోనే బాగుంటుంది. బేబీ ఎముకలు పూర్తిగా ఫామ్ అవుతాయి. బేబీ కళ్లను తెరిచి చూస్తుంది. ఐరన్, కాల్షియం వంటి మినరల్స్‌ను నిల్వ చేసుకుంటుంది. మీకు తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు డాక్టర్ ఇంటర్నల్ ఎగ్జామ్ చేసి, బేబీకి పెల్విస్ సరిపోతుందా అని చెక్ చేసి, నార్మల్ వెజైనల్ డెలివరీకి ప్లాన్ చేస్తారు. ఈ రెండు నెలలు మీరు ప్రీనేటల్ విటమిన్స్ తీసుకోవాలి. పెల్విస్ ఫ్లోర్ లేదా కెగెల్ వ్యాయామం చెయ్యాలి. హై ఫ్రూట్, హై ఫ్లోర్, తక్కువ కొవ్వు ఉండే డైట్ తీసుకోవాలి. రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తీసుకోవాలి. పళ్లు, చిగుళ్లు ఆరోగ్యంగా చూసుకోవాలి. నీళ్లు ఎక్కువ తాగాలి.డాక్టర్ భావన కాసు, గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ (చదవండి: మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..!) -
పహల్గామ్ బాధితులకు సులువుగా బీమా క్లయిమ్
పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు బీమా చెల్లింపులు సులభతరం చేసేందుకు దేశంలోని అతిపెద్ద జీవిత బీమా సంస్థల్లో ఒకటైన హెచ్డీఎఫ్సీ లైఫ్ ముందుకు వచ్చింది. ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పాలసీదారుల కుటుంబ సభ్యులు / నామినీల క్లెయిమ్ సమర్పణ కోసం సరళీకృత ప్రక్రియను ప్రకటించింది.ఈ ఉగ్రదాడిలో చనిపోయినవారికి హెచ్డీఎఫ్సీ లైఫ్‌లో బీమా పాలసీ ఉన్నట్లయితే వారి నామినీ / చట్టపరమైన వారసులు డెత్ క్లెయిమ్ సమర్పించవచ్చు. ఇందుకోసం ఉగ్రవాద దాడి కారణంగా సంభవించిన పాలసీదారు మరణానికి రుజువును స్థానిక ప్రభుత్వం, పోలీసు, ఆసుపత్రి లేదా సంబంధిత అధికారుల నుండి సమర్పించాలి.డెత్ క్లెయిమ్ కోసం నామినీలు కాల్ సెంటర్ నంబర్ 022-68446530, service@hdfclife.com అనే ఈమెయిల్ ద్వారా హెచ్డీఎఫ్సీ లైఫ్‌ను సంప్రదించవచ్చు. లేదా ఏదైనా బ్రాంచ్ కార్యాలయాలను సందర్శించవచ్చు. బాధిత కుటుంబాలకు క్షేత్రస్థాయిలో సహాయ, సహకారాలు అందించడానికి అన్ని ప్రదేశాలలోనూ కంపెనీ స్థానిక బ్రాంచ్ సిబ్బంది అందుబాటులో ఉంటారని హెచ్డీఎఫ్సీ లైఫ్ తెలిపింది.ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని హెచ్డీఎఫ్సీ లైఫ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సమీర్ యోగీశ్వర్ తెలిపారు. బాధితులకు జరిగిన నష్టాన్ని ఏదీ భర్తీ చేయలేనప్పటికీ, ఈ సరళీకృత ప్రక్రియ ద్వారా క్లెయిమ్ సమర్పణకు ప్రయాసలను మాత్రం తగ్గించగలమని ఆయన పేర్కొన్నారు. -
మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులకు అస్వస్థత
గుంటూరు,సాక్షి: మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యం కోసం పీఎస్ఆర్ ఆంజనేయులును హుటాహుటీన జీజీహెచ్‌కి తరలించారు. ప్రస్తుతం పీఎస్ఆర్ ఆంజనేయులు రిమాండ్‌లో ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పని చేసిన ఉన్నతాధికారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపునకు దిగుతోంది. ఈ క్రమంలో.. ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయుల్ని(PSR Anjaneyulu) అరెస్ట్ చేసింది. ముంబై నటి కాదంబరీ జెత్వానీ కేసుకుగానూ ఏపీ సీఐడీ ఆయన్ని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. -
పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన జింఖానా మూవీ డైరెక్టర్..!
ప్రముఖ డైరెక్టర్ ఖలీద్ రెహమాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన అల్లప్పుజా జింఖానా మూవీ దర్శకుడైన ఖలీద్ నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆయనతో పాటు మరో డైరెక్టర్ అష్రఫ్ హంజా కూడా ఉన్నారు. కొచ్చిలోని ఓ ఫ్లాట్‌లో వీరిద్దరితో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదల చేశారు. ఆ ఫ్లాట్ మలయాళ సినిమాటోగ్రాఫర్ సమీర్ తాహిర్‌కు చెందినదని సమాచారం. వీరి నుంచి 1.6 గ్రాముల హైబ్రిడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.డ్రగ్స్ కేసులో మలయాళ సినీ దర్శకులు అరెస్ట్ అలప్పుజ జింఖానా మూవీకి దర్శకత్వం వహించారు. అంతేకాకుండా మలయాళంలో పలు సినిమాలను ఆయన తెరకెక్కించారు. మరో డైరెక్టర్ అష్రఫ్ తమాషా, భీమన్నంటే వాజి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. తాజాగా వీరిద్దరు గంజాయి కేసులో అరెస్ట్ కావడంతో మాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.షైన్ టామ్ చాకో డ్రగ్స్ కేసు..కొద్ది రోజుల క్రితమే మలయాళ నటుడు షైన్ టామ్ చాకోపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అతనిపై మలయాళ ఇప్పటికే సినీ పెద్దలకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఓ హోటల్లో రైడ్ చేయడం పోలీసుల నుంచి టామ్ చాకో తప్పించుకున్నారు. ఏప్రిల్ 21న చాకోను అరెస్టు చేయగా.. వెంటనే స్టేషన్ బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా.. టామ్ చాకో తెలుగులో దసరా మూవీతో ఫేమస్ అయ్యారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీలోనూ కనిపించారు. -
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ ‘జీలం ఝలక్’ ఇచ్చింది. మున్ముందు సినిమా ఎలా ఉంటుందో తెలిపేలా ఓ ట్రైలర్ చూపించింది. పాకిస్థాన్ అధికార వర్గాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ శనివారం హఠాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేసింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) రాజధాని ముజఫరాబాద్ వద్ద ఒక్కసారిగా నదిలో నీటి మట్టం పెరిగి వరద పోటెత్తింది.నది పొంగి పొర్లుతుండటంతో హతియన్ బాలా వద్ద ‘నీటి అత్యయిక పరిస్థితి’ (ఎమర్జెన్సీ) ప్రకటించారు. హతియన్ బాలా ప్రాంతం ముజాఫరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో జీలం ఒడ్డున ఉంటుంది. నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ స్థానిక మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఘరీ దుపట్టా, మజ్హాయ్ వంటి జీలం నది ఒడ్డు ప్రాంతాల గ్రామాల్లో నివసించే ప్రజలు అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో భీతి చెందారు. Flood alert in PoK's Muzaffarabad as Jhelum River water levels surge. Locals allege India released water w/o informing Pak. auth. Sharp rise in water from Chakothi to Muzaffarabad sparks flood fears. Pak. claims India's move aims to suspend IWT post-Pahalgam attack. #Pakistan pic.twitter.com/Y9v4HwJQUD— Epic Pravin (@EpicPravin) April 27, 2025మన కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని చకోతీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని,1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కాగా, భారత్ చర్య అంతర్జాతీయ నిబంధనలను, జల ఒప్పందాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పాక్ ఆరోపించింది. ఈ ఘటనపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం విశేషం!. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.Major Flooding in Jhelum: #Pakistan Declares EmergencyAfter stopping the water, now India releases excess water in the Jhelum River, allegedly without warning.Muzafrabad in Pok flooded.This is just a glimpse!#PakistanBehindPahalgam pic.twitter.com/QdIjf1v2oj— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) April 26, 2025అయితే కరువు... లేకపోతే వరద!పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు విడనాడే వరకు ఒప్పందం అమలు సస్పెన్షన్‌లో ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో భారత్, పాక్ నడుమ సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్‌లో 90% సేద్యం సింధు జలాలపై ఆధారపడుతుంది. హైడ్రలాజికల్ డేటాను ఎప్పటికప్పుడు సరైన సమయంలో పాకిస్తాన్‌కు అందజేయాలనేది ఈ ఒప్పందంలో మన దేశం నెరవేర్చాల్సిన ఓ కీలక బాధ్యత. వరద హెచ్చరికలను ముందుగానే తెలియజేయడం, నీటి వినియోగ వివరాలు, హిమనీనదాలు (గ్లేసియర్స్) కరిగే తీరుతెన్నుల సమాచారాన్ని పొరుగుదేశంతో పంచుకోవడం భారత్ విధి. ఒప్పందం అమలును భారత్ తాజాగా నిలిపివేయడంతో ఇప్పుడిక ఈ బాధ్యతలకు బ్రేక్ పడింది. సింధు నది, దాని ఉపనదుల్లో ఏయే సమయాల్లో ఏమేరకు నీటి నిల్వలున్నాయనే సమాచారాన్ని భారత్ ఇవ్వకపోతే పాక్ పరిస్థితి... నీరు లేక నేల ఎండిపోయి... ‘పడితే కరువు బారిన పడటం లేదంటే వరద ముంచెత్తడం’ అన్నట్టు తయారవుతుంది. Floods in Muzaffarabad, POK today after India released waterpic.twitter.com/vF4ClKxVgW— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2025ఇక, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే రద్దు చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. నదీ జలాలను మళ్లించినా, అడ్డుకున్నా దీనిని ‘యుద్ధ చర్య’గా భావిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జీలం నదిలో వరదలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముజఫరాబాద్‌లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ఆపరేషన్స్ డైరెక్టర్ ముజఫర్ రాజా స్పందిస్తూ.. భారత ఆక్రమిత కాశ్మీర్‌లోని ఒక ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినట్లు ధృవీకరించారు. విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట యొక్క స్పిల్‌వేలు తెరవబడ్డాయి, ఫలితంగా ఒక మోస్తరు వరద పరిస్థితి ఏర్పడింది అని ఆయన అన్నారు, స్థానిక నివాసితులు తమ భద్రత కోసం నదికి దూరంగా ఉండాలని కోరారు.-జమ్ముల శ్రీకాంత్.BREAKING🇮🇳🇵🇰 Local sources report that flooding in the Jhelum River, located in northern India and eastern Pakistan, occurred after India released water without prior notification. pic.twitter.com/vD4VPlsyr5— The Global Beacon (@globalbeaconn) April 26, 2025 -
పక్షులను చల్లగా కాపాడుకుందాం!
వేసవి కాలం పక్షులకు కష్టకాలం. అధిక వేడి పక్షులకు ప్రమాదకరంగా మారుతుంది. డీౖహెడ్రేషన్, వడదెబ్బ బారిన పడకుండా పక్షులను రక్షించడానికి... నీరు, నీడ, గాలి ప్రసరణకు ప్రాముఖ్యత ఇవ్వాలి. కొన్ని జాగ్రత్తలు...పక్షులకు అన్నివేళలా శుభ్రమైన మంచినీరు అందుబాటులో పెట్టాలి ∙ వేర్వేరు ప్రదేశాలలో వాటర్ బౌల్స్ పెట్టాలి ∙ చల్లగా, ఫ్రెష్‌గా ఉండడానికి వాటర్ బౌల్స్‌లో ఐస్ క్యూబ్స్ వేయవచ్చు చల్లని, సౌకర్యవంతమైన స్థలంలో పక్షులు ఉండేలా చూడాలి అవసరమైతే కూలింగ్ మ్యాట్స్ ఉపయోగించవచ్చు పక్షులపై ఒక నిమిషం లేదా అర నిమిషం నీటిని స్ప్రే చేయాలి పక్షులకు సమీపంలో తడి టవల్స్ ఏర్పాటు చేయాలి వేగంగా శ్వాస తీసుకోవడం, ఉక్కిరిబిక్కిరి కావడం, బద్దకంగా కనిపించడం, తినడానికి ఆసక్తి చూపించకపోవడం...మొదలైనవి పక్షులకు సంబంధించి ఓవర్ హీటింగ్ లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే తక్షణ జాగ్రత్తలు తీసుకోవాలి (చదవండి: మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..!)ఆహారం విషయానికి వస్తే.... నీటి శాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ, దోసకాయలాంటివి అందించవచ్చు ఉత్తర్‌ప్రదేశ్‌లోని కొన్ని జిల్లాలలో వందలాది గ్రామాల్లో యానిమల్ యాక్టివిస్ట్‌లు వేసవి వేడి నుంచి పక్షులను కాపాడానికి ‘బర్డ్ రెస్టారెంట్స్’ ఏర్పాటు చేశారు. పక్షులకు చల్లని నీడను ఇచ్చేలా నీరు, ఆహార పదార్థాలతో చెట్టు కొమ్మలపై ఈ రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. (చదవండి: మూగజీవాల పట్ల ఆదరణ చూపండి) -
భారీ సెంచరీతో కదంతొక్కిన స్టార్ క్రికెటర్ కొడుకు
ఆఫ్ఘనిస్తాన్ ఆల్‌టైమ్ గ్రేట్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ కొడుకు హసన్ ఐసాఖిల్ స్వదేశంలో జరుగుతున్న ఓ ఇంటర్ రీజియన్ టోర్నీలో (మెర్వైస్ నికా రీజినల్ 3-డే ట్రోఫీ) భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఈ టోర్నీలో అమో రీజియన్‌కు ఆడతున్న 18 ఏళ్ల హసన్.. బాంద్-ఎ-అమీర్‌తో జరిగిన మ్యాచ్‌లో 235 బంతుల్లో 143 పరుగులు (సెకెండ్ ఇన్నింగ్స్) చేసి ఔటయ్యాడు. ఈ ఫార్మాట్లో హసన్‌కు ఇది తొలి సెంచరీ.ఈ మ్యాచ్‌లో హసన్ కష్టాల్లో ఉన్న తన జట్టును గట్టెక్కించి భారీ స్కోర్ చేయడానికి దోహదపడ్డాడు. అంతకుముందు కమాల్ ఖాన్ (105), సెదిఖుల్లా పచా (77) కూడా సత్తా చాటడంతో అమో రీజియన్ తొలి ఇన్నింగ్స్‌లో 350 పరుగులు చేసింది.అనంతరం బాంద్-ఎ-అమీర్ జట్టు ఓపెనర్ హరూన్ ఖాన్ (109) సెంచరీతో ఆదుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగులు చేయగలిగింది. అమో బౌలర్లలో సఖీ 4 వికెట్లు తీశాడు. 76 పరుగుల తొలి ఇన్నింగ్స్ లీడ్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అమో టీమ్.. హసన్ సెంచరీతో సత్తా చాటడంతో 235 పరుగులు చేసి, ప్రత్యర్థి ముందు 312 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 45 బంతుల్లో 150 పరుగులుహసన్ గతేడాది తొలిసారి వార్తల్లో నిలిచాడు. కాబుల్ ప్రీమియర్ లీగ్ 2024లో 45 బంతుల్లో 150 పరుగులు చేసి రాత్రికిరాత్రి హీరో అయిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో హసన్ రికార్డు స్థాయిలో 19 సిక్సర్లు కొట్టాడు. హసన్ గతేడాది అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడుతున్న హసన్ తండ్రి నబీ కొడుకుతో పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ముచ్చట పడుతున్నాడు. -
పిలిస్తే రానన్నానా? అంతేలే.. హర్టయిన రామజోగయ్య శాస్త్రి
కోర్ట్ సినిమాలో న్యాయవాదిగా సీరియస్ పాత్రలో మెప్పించిన ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ఇప్పుడు నవ్వించే పనిలో పడ్డాడు. అతడు ప్రధాన పాత్రలో నటించిన సారంగపాణి జాతకం (Sarangapani Jathakam Movie) ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.హర్టయిన రామజోగయ్య శాస్త్రిఈ క్రమంలో చిత్రయూనిట్ సెలబ్రిటీల కోసం స్పెషల్ షో వేశారు. డైరెక్టర్లు హరీశ్ శంకర్, కోన వెంకట్, నందినీ రెడ్డి, సింగర్ సమీరా భరద్వాజ్ సహా పలువురు తారలు ఈ షోకు హాజరయ్యారు. ఈ వీడియోను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అది చూసి ప్రముఖ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి హర్టయ్యారు.పిలిస్తే రానన్నానా?'నన్ను మర్చిపోయారుగా.. పిలిస్తే రానన్నానా? అంతేలే.. సరేలే, కానివ్వండి' అంటూ సారంగపాణి జాతకం నిర్మాత కృష్ణవేల్ను ట్యాగ్ చేశారు. మరి దీనిపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి! సారంగపాణి జాతకం సినిమా విషయానికి వస్తే.. ఇందులో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ జంటగా నటించారు. ఆదిత్య 369 ఫేమ్ శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించారు. ఎన్నో హిట్ సాంగ్స్ రాసిన రామజోగయ్య శాస్త్రి.. సారంగపాణి జాతకంలో థీమ్ సాంగ్, చిత్రగుప్త పాటలకు సాహిత్యం అందించాడు.యాక్టర్ కాలేవ్!సారంగపాణి జాతకం మూవీలో ప్రియదర్శి.. జాతకాలను నమ్మే వ్యక్తిగా కనిపిస్తాడు. అయితే నిజ జీవితంలో అతడు జాతకం చూపించుకున్నప్పుడు అసలు నటుడయ్యే యోగమే లేదని చెప్పారట! అయినా అవేమీ నమ్మకుండా తనపై నమ్మకంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. బలగం, మల్లేశం, కోర్ట్ వంటి చిత్రాలతో మంచి నటుడిగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం ఇతడు ‘ప్రేమంటే, మిత్ర మండలి’ సినిమాలు చేస్తున్నాడు. నన్ను మరిచిపోయారుగా పిలిస్తే రానన్నానా @krishnasivalenk అంతేలే..సరేలే..కానీండిలే https://t.co/cIa1WrftKo— RamajogaiahSastry (@ramjowrites) April 26, 2025 చదవండి: పాక్‌పై మనం దాడి చేయాల్సిన పనే లేదు.. వాళ్లే తిరగబడతారు: -
మైక్ మహారాజా! యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్..
విషయమేదైనా ఆకట్టుకనే ప్రచారం ఆతని సొంతం హాస్యం, చతురోక్తులతో ఆకట్టుకునే స్వరం యాడ్ ఏజెన్సీలను తలదన్నే డిమాండ్ మైక్‌సెట్ బిగించడంతో ప్రారంభమై నో డేట్స్ ప్లీజ్ అనే స్థాయికి ఎదిగిన నూకరాజుపుట్టిన ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. దానిని గుర్తించి వ్యక్తపరచినపుడే ఆ కళకు సార్థకత. ఇదిగో ఈ పిఠాపురానికి చెందిన నూకరాజు ప్రావీణ్యం అలాంటిదే. శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు మైక్సెట్లు బిగించడంతో ప్రారంభమైన అతని ప్రస్థానం నేడు నో డేట్స్ ప్లీజ్ అనే వరకు వెళ్లిందంటే అతనిలోని ప్రతిభను ఏ మేరకు సానబట్టారో. అతని గొంతు వినపడిందంటే చాలు ఏదో ముఖ్యమైన సమాచారమేనని ఇళ్లలో ఏ మూలనున్నా ఓ చెవు అతడు చెప్పే మాటపై వేస్తున్నారంటే ఆ మాటకున్న విలువ అంతటిదని చెప్పడం అతిశయోక్తి కాదు. మహాశయులకు విజ్ఞప్తి అంటూ ప్రారంభించే నూకరాజు ధాన్యం కొనుగోళ్లు.. జాతరల కార్యక్రమ వివరాలు.. రాజకీయ సభల వివరాలు, ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించి పాంప్లేట్లలోని సమాచారం.. ఇలా ఒకటేమిటి అన్నీ ప్రతి మనిషికి చెవినిల్లు కట్టుకుని మరీ చెప్తుంటాడు. కరోనా కష్టకాలంలో అయితే అతని సేవలు అంతా ఇంతా కాదు.. ఆరోగ్య భద్రతపై అతను చేసిన ప్రచారం స్థానికంగా ఎంతో మేలు చేసింది. చిన్న సైకిల్‌పై మైక్ సరంజామా అంతా కట్టుకుని అతను చేసే ప్రచారం పేరున్న యాడ్ ఏజెన్సీలు సైతం చేయలేవంటారు స్థానికులు. కారణం లేకపోలేదు. అతని స్టైలే అతని ప్రచారానికి ప్రధాన ఆకర్షణ. కేవలం పాంప్లేట్ లేదా పోస్టర్లో ఉన్న అంశాన్ని చెప్తూ వెళ్లిపోతుంటే ఇంతలా చెప్పుకోవడం ఎందుకూ.. అక్కడే ఉంషమ్మత్తు అంతా.. అతని మాటలో మహత్తు అది. హాస్యం, చతురత, విషయానుకూలంగా హాస్యోక్తులు జోడించి చెప్పడం అతని ప్రత్యేకత. మరి 50 ఏళ్ల ప్రస్థానమది. ఊరికే వస్తుందా ఆ పరిణితి. మైక్ అతని ఇంటి పేరుగా స్థిరపడిపోయేంతగా. మైక్‌తో అనుబంధం నిరుపేద కుటుంబంలో పుట్టిన మొల్లేటి నూకరాజు మండలంలోని విరవ గ్రామానికి చెందినవాడు. చిన్నప్పటి నుంచి మైక్ సెట్లు అంటే ఇష్టం. ఐదో తరగతి వరకు మాత్రమే చదువుకున్న అతడు 20 ఏళ్ల వయసులో మైక్సెట్లు బిగించే పనిలో చేరాడు. అన్ని రకాల శుభకార్యాలకు, సభలు, సమావేశాలకు వెళ్లి మైక్ సెట్లు వేసే వాడు. ఆ క్రమంలోనే సరదాగా మైక్‌లో చతురోక్తులు వేస్తూ అందరిని అలరించేవాడు. ఇది చూసిన ప్రతి ఒక్కరు సభలు, సమావేశాల్లో ఆయనతో ముందుగా మాట్లాడించేవారు. ఇలా మైక్ ఎనౌన్సర్‌గా మంచి పేరు సంపాదించాడు. ఏదైనా విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఉపయోగించే దండోరాలకు బదులు మైక్ సెట్లు వినియోగం వచ్చాక రిక్షాలో మైక్ ప్రచారాలు ప్రారంభమయ్యాయి. ఎన్ని వచ్చినా నూకరాజుకు మాత్రం ఆ సైకిలే ప్రచార వాహనం.నా జీవితం మైక్‌కే అంకితం మైక్ అనేది నా జీవితంలో భాగమైపోయింది. అది లేని రోజంటూ లేదు. రోజంతా ఊరంతా తిరిగి ప్రచారం చేసి ఇంటికి వచ్చాక కూడా దానిని మరుసటి రోజుకు సిద్ధం చేయడం తప్ప వేరే పని తెలీదు నాకు. మైక్‌లో ప్రచారం చేసే వాయిస్ కూడా నేనే చెబుతాను. ఐదో తరగతి మాత్రమే చదివినా చదవడం రాయడం బాగానే వచ్చు. విషయం చెబితే దానికి తగ్గట్టుగా వాయిస్ రికార్డు చేసి ప్రచారం చేస్తుంటాను. గతంలో మైక్‌లో మాట్లాడుతూ ప్రచారం చేసే వాడిని. ఇప్పటికీ సైకిల్ తొక్కగలుగుతున్నానంటే ప్రజల నుంచి వస్తున్న ప్రోత్సాహం అభిమానం మాత్రమే. ఇదే పనితో కుటుంబాన్ని పోషించుకుంటు పిల్లలకు పెళ్లిళ్లు చేశాను. ఇప్పుడు నాజీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నాను. – మైక్ నూకరాజు, విరవ, పిఠాపురం మండలం గిరాకీ అంతా ఇంతా కాదు మైక్ ప్రచారాల కోసం ప్రయత్నించే వారు ఆయన కోసం వారాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఏదైనా కార్యక్రమానికి అతని ప్రచారం కావాలంటే నెల రోజులు ముందుగానే బుక్ చేసుకోవలసిన స్థాయి అతనిది. 74 ఏళ్ల వయసులో ఇప్పటికీ సైకిల్ పైనే తిరుగుతు మైక్‌తో ప్రచారం చేస్తున్న అతనిని అందరూ ఇంట్లో వ్యక్తిగా ఆప్యాయంగా పలకరిస్తుంటారు.(చదవండి: చల్లచల్లగా వేడితాక'కుండ'..!) -
కర్రెగుట్టలో మావోయిస్టుల గుహ.. 1000 మంది ఉండేలా నీటి సౌకర్యం..
సాక్షి, చర్ల: తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ మధ్య ఆపరేషన్ కర్రె గుట్టల్లో భాగంగా భద్రతా బలగాలు కీలక ముందడుగు వేశాయి. ఐదు రోజుల సెర్చ్ ఆపరేషన్‌లో తాజాగా మావోయిస్టుల కీలక స్థావరమైన బంకర్‌ను బలగాలు గుర్తించాయి. ఈ గుహ గురించి కీలక విషయాలను వెల్లడించాయి.వివరాల ప్రకారం.. కర్రెగుట్టలో మావోయిస్టుల బంకర్(గుహ)ను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇక, ఆ గుహలో దాదాపు 1000 మంది సురక్షితంగా ఉండేలా ప్రదేశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. గుహలో నీటి సౌకర్యం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు.. అక్కడి నుంచి మకాం మార్చినట్టు సమాచారం. మరోవైపు.. కర్రె గుట్టలో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదరవుతున్నాయి. తాజాగా బంకర్(గుహ)కు సంబంధించి వీడియోలను భద్రతా బలగాలు విడుదల చేశాయి.ఇదిలా ఉండగా.. కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు కూంబింగ్ కొనసాగించాయి. సాయంత్రం 4 గంటలు కాగానే చీకటి పడటం.. 5 అడుగుల దూరంలో మనిషి కూడా కనిపించనంత దట్టమైన అడవి ఉండటంతో ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు తమకు అత్యంత సురక్షితంగా భావిస్తారు. ఇలాంటి చోట ఆపరేషన్ బలగాలకు కత్తిమీద సాముగా మారింది. గల్గం అడవుల్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి ఒక డీఆర్జీ జవాన్‌కు గాయాలు కాగా బీజాపుర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దును కేంద్రంగా చేసుకొని ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి మొదలుకొని భీమారంపాడు, కస్తూరిపాడు, చినఉట్లపల్లి, పెదఉట్లపల్లి, పూజారికాంకేర్, గుంజపర్తి, నంబి, ఎలిమిడి, నడిపల్లి, గల్గంలో ప్రధానంగా ఆపరేషన్ కొనసాగుతోంది. రుద్రారం వరకు 90 కి.మీ. పొడవున ఉన్న కర్రెగుట్టలను తమ అధీనంలోకి తెచ్చుకునేందుకు వేల సంఖ్యలో బలగాలు జల్లెడ పడుతూ కొండలపైకి చేరుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అతి కష్టం మీద శనివారం సాయంత్రం కొంతమేరకు ఎక్కగలిగిన బలగాలు మావోయిస్టులు తలదాచుకున్నట్లు భావిస్తున్న సొరంగాన్ని గుర్తించాయి. ఇప్పటి వరకు ముగ్గురు మహిళా మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను, పెద్దఎత్తున పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. -
పహల్గాం ఉగ్రదాడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు.. 19 మంది అరెస్ట్
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి సానుభూతి పరుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా,పహల్గాం ఉగ్రదాడిపై నోరుపారేసుకున్న సుమారు 19 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ 19మంది అస్సాం,మేఘాలయా,త్రిపురకు చెందిన వారేనని పోలీసులు వెల్లడించారు.పహల్గాం ఉగ్రదాడి తర్వాత కేంద్రం సోషల్ మీడియాపై దృష్టిసారించింది. పహల్గాం ఉగ్రదాడికి మద్దుతు పలికేలా మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది.ఈ తరుణంలో పహల్గాం దాడికి మద్దతు పలికేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో పాటు, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ స్లోగన్‌ను వినిపించిన అస్సాం, మేఘాలయా, త్రిపురకు చెందిన మొత్తం 19మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 19 మందిలో 14 మంది అస్సాంకు చెందిన వారేనని పోలీసులు గుర్తించారు. Assam | A woman named Dadhichi Dimple alias Dimple Baruah from Golaghat district of Assam was detained by the Crime Branch from Guwahati for making controversial and anti-national comments on the #PahalgamTerrorAttack.At least 19 people have been arrested in Assam, Meghalaya,… pic.twitter.com/MgJp6TehmC— OTV (@otvnews) April 27, 2025వారిపై కఠిన చర్యలు తప్పవ్అయితే, ఈ అరెస్టులు,సోషల్ మీడియా పోస్టులపై అస్సాం సీఎం హేమంత్ బిశ్వశర్మ బహిరంగంగా హెచ్చరికలు జారీ చేశారు. పహల్గాం ఉగ్రదాడి లేదంటే దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. అవసరమైతే, వారిపై జాతీయ భద్రతా చట్టంలోని నిబంధనలను విధిస్తామన్నారు. భారత్,పాకిస్తాన్ మధ్య ఎటువంటి సారూప్యతలు లేవు. రెండు దేశాలు శత్రు దేశాలు. మనం అలాగే ఉండాలి’ అని సీఎం హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు. -
చల్లచల్లగా వేడితాక'కుండ'..!
వేసవి ముదురుతోంది. తెలంగాణ హైదరాబాద్ నగరంలో సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. చల్లని నీటిని అందించడానికి ఫ్రిడ్జ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజమైన చల్లదనం కోసం నగరవాసులు మళ్లీ మట్టి కుండలనే ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యాన్ని అందించే మట్టి ప్రత్యేకతను గుర్తించినవారు ఇప్పుడు నగరంలోని మార్కెట్లతో పాటు ఆన్లైన్ వేదికల నుంచి, ఆర్గానిక్ బజార్ల నుంచి కుండలను కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో దాహార్తిని తగ్గించుకోవాలంటే కుండలోని నీటితోనే సాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు. బంకమట్టిలోని ఖనిజాలు ఎంజైమాటిక్ కార్యకలాపాలకు మద్దతునిస్తాయి. పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. మట్టిలోని ఖనిజాలు నీటి రుచిని కొద్దిమోతాదులో పెంచుతాయి. తద్వారా అధిక పరిమాణంలో నీరు తాగడానికి దోహదం చేస్తుంది. తద్వారా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది. ఈ మట్టి నీళ్లలోని ఆల్కలీన్ స్వభావం శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి, రోగనిరోధక వ్యవస్థకు ఊతమిస్తుంది. అలాగే ప్లాస్టిక్ లేదా మెటల్ కంటైనర్లతో పోలిస్తే, మట్టికుండలో నీరు రసాయనాల రహితం. కుండలో నిల్వవున్న నీటికి కాలపరిమితి కూడా ఉండదు. మట్టికుండలు బయోడీగ్రేడబుల్ అంటే పునరి్వనియోగానికి వీలైనవి. ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల తాత్కాలికంగా దాహం తీరినట్టు అనిపించినా, ఆ తర్వాత శరీరానికి హానినే కలిగిస్తుందని వైద్యులు గత కొంత కాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మట్టి కుండలకు డిమాండ్ పెరిగింది. సహజంగానే మట్టికి చల్లబరిచే గుణం ఉంటుంది. మట్టి కుండలు సహజంగా ఆవిరి ద్వారా నీటిని చల్లబరుస్తాయి. వాటిని వేడి వాతావరణానికి అనువైనవిగా తయారు చేస్తాయి. అలా నీటిని చల్లబరచడం, సహజమైన శీతలీకరణ, మెరుగైన జీవక్రియ, మెరుగైన జీర్ణక్రియతో పాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటితోపాటు మట్టికుండల్లో నీరుటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది పర్యావరణానికీ మేలు చేస్తుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలోనూ, వడదెబ్బను నివారించడంలోనూ సహాయపడుతుంది. కడుపులో ఉత్పత్తయ్యే ఆమ్లతను తగ్గించే సామర్థ్యం ఈ నీటికి ఉండటం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలకు నివారణగా పనిచేస్తుంది. చేతికుండలకు కేరాఫ్ ఆదిలాబాద్.. నగరంలో ఆదిలాబాద్ కుండలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆదిలాబాద్ ప్రాంతం మట్టికళలో ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడి మట్టి అత్యంత మెత్తగా, మరిన్ని అధిక ఫిల్టర్ గుణాలు కలిగి ఉంటుందని సమాచారం. అంతేకాక ఆదిలాబాద్ కుండలు మిగతా ప్రాంతాల కుండలకంటే గాఢతతో ఉండి, ఎక్కువ రోజుల పాటు నీటిని చల్లగా ఉంచగలుగుతాయి. అలాగే వాటిపై ప్రత్యేకమైన చేతి పనితో ఆకర్షణీయమైన డిజైన్లు కూడా జతచేస్తూ అక్కడి కళాకారులు వాటిని సంపూర్ణంగా సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్నారు. వేసవిలో టూర్లు ఎక్కువ వెళ్లే వాళ్లు ఉంటారు కాబట్టి వారి కోసం.. బయట ప్రయాణాలకు అనువైన చిన్న పరిమాణంలో క్లే వాటర్ బాటిల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆకట్టుకునే వెరైటీలెన్నో.. ప్రస్తుతం మార్కెట్లో గడ్డ కుండలు, జైపూర్ కుండలు, పెయింటెడ్ డిజైన్ కుండలు, ఆదిలాబాద్ మట్టి కుండలు వంటి అనేక రకాలు లభిస్తున్నాయి. చిన్న పరిమాణం గల సాధారణ కుండలు నుంచి పెద్ద డిజైనర్ కుండలు వరకూ ఎన్నో రకాలు వినియోగదారులను ఆకట్టుకునేలా కొలువుదీరాయి. చిన్న చిన్నవి రూ.100 నుంచి ధరల్లో ఉంటే మధ్యస్థాయి మోడళ్లు రూ.250–400 మధ్య ఉన్నాయి. ఇంకా పెద్ద డెకరేటివ్ కుండలు రూ.600 నుంచి రూ.1200 వరకూ ధరక్లూ లభిస్తున్నాయి. ప్రత్యేక హ్యాండీ క్రాఫ్ట్ కుండలు, ప్రత్యేక డిజైన్లతో రూపొందించినవాటి కోసం రూ.1500 ఆపైన కూడా నగరవాసులు వెచి్చస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని లామకాన్, సికింద్రాబాద్‌లోని సాక్రడ్ స్పేస్, వంటి చోట్ల నిర్వహించే ఆర్గానిక్ సంతల్లో గచ్చిబౌలిలోని పలు ఆర్గానిక్ బజార్లలో కుండలు ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ కుండలు పూర్తి స్థాయిలో హ్యాండ్ మేడ్, రసాయన రహిత మట్టి ఉపయోగించి తయారవుతాయని, అందుకే వీటితో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు. ఆన్లైన్లో.. మట్టి వాసన.. ఏళ్లనాటి మట్టి వాసనకు మళ్లీ మంచి రోజులు వచ్చాయనడానికి నిదర్శనంగా ఆన్లైన్లో పలు వెబ్సైట్లు నిలుస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, కాంప్లాంట్ మార్కెట్లు, సహజశ్రీ, ఆర్గానిక్ ఇండియా వంటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా నగరవాసులు మట్టి కుండలు కొనుగోలు చేస్తున్నారు.. ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించే వెబ్సైట్లలో లభించే ప్రత్యేకమైన ‘ఎకో ఫ్రెండ్లీ వాటర్ పాట్స్‘కి మంచి ఆదరణ ఉంది. ఎర్తెన్ ఫైన్ క్రాఫ్ట్స్ విలేజ్ డెకార్, కావేరీ డెల్టా ప్రాంతం నుంచి హ్యాండీ క్రాఫ్ట్ చేసిన మట్టికుండలు, క్లే కుకింగ్వేర్ సైతం అందించే జిష్తా, కుకింగ్ పాన్లు, కర్రీ పాన్లు, వాటర్ డిస్పెన్సర్లు తదితర మట్టి ఉత్పత్తులు అందించే మడ్ కార్ట్ వంటివి ఆన్లైన్ విపణిలో మట్టికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. (చదవండి: చిన్నారులకు వచ్చే సాధారణ డెంటల్ సమస్యలకు చెక్‌పెడదాం ఇలా..!) -
ఇంట్లోని రూ.3.20 కోట్ల నగదు, బంగారం తీసుకెళ్లిన భార్య
పంజగుట్ట (హైదరాబాద్): ఓ న్యాయవాది ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదు ఎత్తుకెళ్లిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్‌ను పంజగుట్ట పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ద్వారకాపురి కాలనీలో నివాసం ఉండే పురుషోత్తంరెడ్డి హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఇతనికి భార్గవితో 2007లో కులాంతర వివాహం జరిగింది. భార్గవి సికింద్రాబాద్ కోర్టులో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ)గా విధులు నిర్వహిస్తోంది. భార్యాభర్తలకు తరచూ గొడవలు జరగడంతో పలుమార్లు భార్గవి పురుషోత్తంరెడ్డిపై గృహహింస, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టింది. ఈ క్రమంలో పురుషోత్తంరెడ్డి ఇంట్లో ఉన్న రూ.3.20 కోట్ల నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్న భార్గవి ఆమెకు పాతపరిచయం ఉన్న సంగారెడ్డి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరవింద్ కిరణ్ ఇటికి వెళ్లి అక్కడే ఉంటోంది. గత నెల 30న ఇంట్లో నగదు, బంగారం కనిపించకపోవడంతో పురుషోత్తంరెడ్డి ఆరాతీశాడు. భార్గవి అల్వాల్‌లోని అరవింద్ కిరణ్ ఇంట్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వెళ్లి డబ్బుల విషయమై ఆరాతీస్తే తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. దీంతో పురుషోత్తంరెడ్డి పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అరవింద్ కిరణ్, భార్గవిని అదుపులోకి తీసుకున్నారు. -
టాలీవుడ్ సినిమా రివ్యూలు.. డైరెక్టర్ త్రినాథరావు ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. తన సినిమాకు రివ్యూలు రాయరని అనుకున్నానని అన్నారు. చౌర్యపాఠం మూవీకి చాలామంది బాగానే రాశారని తెలిపారు. అందరూ కూడా మేచ్యూర్‌డ్‌గానే రాసినందుకు చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇటీవల టాలీవుడ్లో రివ్యూలపై హీరో నాని సైతం మాట్లాడిన సంగతి తెలిసిందే. అంతకుముందు నిర్మాత సూర్యదేవర నాగవంశీ సైతం మూవీ రివ్యూలపై చాలా సందర్భాల్లో మాట్లాడారు. గత కొద్దికాలంగా రివ్యూలపై టాలీవుడ్లో పెద్దఎత్తున చర్చ జరుగుతన్న వేళ త్రినాథరావు చేసిన కామెంట్స్ ఆసక్తిగా మారాయి.కాగా.. ఇంద్రరామ్, పాయల్ రాధాకృష్ణ జంటగా నటించిన తాజా చిత్రం చౌర్యపాఠం(Chaurya Paatam Movie). ఈ సినిమాకు నిఖిల్ గొల్లమారి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ నక్కిన త్రినాథరావు, చూడామణి సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఏప్రిల్ 25న థియేటర్లలో విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో త్రినాథరావు రివ్యూలపై స్పందించారు. -
IPL 2025 MI Vs LSG: చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్న రోహిత్ శర్మ
ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్లో చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉన్నాడు. ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 27) మధ్యాహ్నం లక్నోతో జరుగబోయే మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ మరో 5 సిక్సర్లు బాదితే ఐపీఎల్లో 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం రోహిత్ ఖాతాలో 295 సిక్సర్లు (265 మ్యాచ్‌ల్లో) ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు క్రిస్ గేల్ ఒక్కడే 300 సిక్సర్లు మార్కును తాకాడు. గేల్ 142 మ్యాచ్‌ల్లో 357 సిక్సర్లు బాదాడు. గేల్, రోహిత్ తర్వాత ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉంది. విరాట్ 261 మ్యాచ్‌ల్లో 285 సిక్సర్లు కొట్టాడు.ఐపీఎల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాటర్లుక్రిస్ గేల్- 357రోహిత్ శర్మ- 295విరాట్ కోహ్లి- 285ఎంఎస్ ధోని- 260ఏబీ డివిలియర్స్- 251ఓవరాల్‌గా టీ20 క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు కూడా క్రిస్ గేల్ పేరిటే ఉంది. గేల్ ఈ ఫార్మాట్లో 1056 సిక్సర్లు బాదాడు. ప్రపంచంలో గేల్ మినహా ఏ క్రికెటర్ 1000 సిక్సర్ల మార్కును తాకలేదు. గేల్ తర్వాత కీరన్ పోలార్డ్ రెండో స్థానంలో ఉన్నాడు. పోలీ తన టీ20 కెరీర్లో 908 సిక్సర్లు బాదాడు. గేల్, పోలీ తర్వాత రసెల్ (737), పూరన్ (630) అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఉన్నారు. పొట్టి క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-4 బ్యాటర్లు విండీస్ ఆటగాళ్లే కావడం విశేషం. ఈ జాబితాలో టీమిండియా స్టార్ రోహిత్ శర్మ ఏడో స్థానంలో, విరాట్ కోహ్లి 20వ స్థానంలో ఉన్నారు. రోహిత్ తన టీ20 కెరీర్లో 540 సిక్సర్లు బాదగా.. విరాట్ 429 సిక్సర్లు కొట్టాడు.టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-10 ఆటగాళ్లుక్రిస్ గేల్- 1056కీరన్ పోలార్డ్- 908ఆండ్రీ రసెల్- 737నికోలస్ పూరన్- 630కొలిన్ మున్రో- 557అలెక్స్ హేల్స్- 552రోహిత్ శర్మ- 540గ్లెన్ మ్యాక్స్‌వెల్- 530జోస్ బట్లర్- 528డేవిడ్ మిల్లర్- 505ఇదిలా ఉంటే, ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా ఇవాళ మధ్యాహ్నం ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరే క్రమంలో నేటి మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారింది. ప్రస్తుతం ముంబై, లక్నో తలో 10 పాయింట్లు (9 మ్యాచ్‌లు) సాధించి పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి. గుజరాత్ (12), ఢిల్లీ (12), ఆర్సీబీ (12), పంజాబ్ (11) టాప్-4లో ఉన్నాయి. -
కూటమి ఎమ్మెల్యేకు షాక్.. అందరిలో నిలదీసిన మహిళ
సాక్షి, శ్రీకాకుళం: ఏపీలో కూటమి ఎమ్మెల్యేకు బిగ్ షాక్ తగిలింది. పల్లెనిద్రలో పాల్గొన్న ఎమ్మెల్యేను ఓ మహిళ ప్రశ్నించారు. ఐదేళ్ల తర్వాత ఓట్ల కోసం మాత్రమే ఎమ్మెల్యే వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, సదరు ఎమ్మెల్యే ఖంగుతిన్నారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమం కోసం ఎమ్మెల్యే కూన రవికుమార్ అక్కడికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో స్థానికురాలు రేవతి.. ఎమ్మెల్యే రవికుమార్‌ను నిలదీసింది. కూటమి పాలనను ఎండగట్టింది. ఈ సందర్బంగా బొమ్మాళి రేవతి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రతీ మహిళకు 15 వందల రూపాయలు ఇస్తానని చంద్రబాబు చెప్పాడు. గెలిచాక ఎందుకు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ హామీ ఏమైంది అంటూ ఎమ్మెల్యే కూన రవికుమార్ ప్రశ్నించింది. అలాగే, కొళాయిల్లో మంచినీరు రావడం లేదు. ఈ విషయమై అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల తర్వాత ఓట్ల కోసం మాత్రమే మీరు వస్తున్నారు. అంతేకానీ, పేదల కోసం మీ ప్రభుత్వం ఏమీ చేయలేదు. అయితే, కొద్దిరోజుల క్రితం ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
చిన్నారుల నోటి ఆరోగ్యం కోసం..!
పిల్లలు ఎదుగుతూ ఉండే సమయంలో అన్ని ఎముకలతోపాటు ముఖానికి సంబంధించిన ఎముకలూ, దవడ ఎముకల్లోనూ మార్పులు వస్తుంటాయి. దాంతో చిన్నారుల్లో ఈ ఎదుగుదలకు సంబంధించిన కొన్ని సమస్యలు కనిపించవచ్చు. అలాగే చిన్నపిల్లలు చాక్లెట్లు, స్వీట్స్, జంక్‌ఫుడ్ వంటివి ఇష్టంగా తింటుంటారు. వేసవిలో కూల్‌డ్రింక్స్ తాగుతుంటారు. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. పిల్లల్లో వచ్చే కొన్ని సాధారణ డెంటల్ సమస్యలూ, వాటికి పరిష్కారాల కోసం ఈ కథనం. ఎముకలు పెరుగుతున్న కొద్దీ వచ్చే మార్పులు స్వాభావికమైనవి. అయితే ఎదిగే వయసులో ఉన్న కొందరు చిన్నారులు అలవాటుగా తమ వేలిని నోట్లో పెట్టుకుని థంబ్ సకింగ్ చేస్తుంటారు. ఇది నివారించాల్సిన విషయమే అయినప్పటికీ... పిల్లల సైకలాజికల్ ఎదుగుదల దృష్టితో చూస్తే వారి ఈ అలవాటును బలవంతంగా మాన్పకూడదనీ, క్రమంగా మాన్పించాలని నిపుణులు పేర్కొంటుంటారు. ఇలా ఎముకల పెరుగుదలతో వచ్చే మార్పులతోనూ, నోట్లో వేలుపెట్టుకునే అలవాటు వల్లా పలువరస షేప్ మారవచ్చు. కొన్ని సాధారణ దంతసమస్యలివి... పిప్పిపళ్లు చిగుర్ల సమస్యలు పాలపళ్లు సరైన సమయంలో ఊడకపోవడం ఎత్తుపళ్లు, ఎగుడుదిగుడు పళ్లు, పళ్ల మధ్య సందులతో సమస్యలు ముఖానికి దెబ్బలు తగలడం వల్ల వచ్చే సమస్యలు. పిప్పిపళ్లు...దాదాపు 80 శాతానికిపైగా పిల్లల్లో పిప్పిపళ్లు, చిగుర్ల జబ్బులు కనిపిస్తుంటాయి. తీపి పదార్థాల ముక్కలు నోటిలోనే ఉండిపోవడంతో పెరిగిపోయిన బాక్టీరియాతోపాటు వారు సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల ఆ పెరిగిన బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో నోటిలోనే ఉండిపోవడం, అవి విడుదల చేసే హానికర రసాయనాల వల్ల పళ్లలో రంధ్రాలు ఏర్పడి పిప్పిపళ్లు రావచ్చు. రంధ్రాల పరిమాణం పెరుగుతున్న కొద్దీ ఆహార వ్యర్థాలు అక్కడ ఎక్కువగా ఇరుక్కుపోవడం, దాంతో రంధ్రం మరింతగా పెరగడంతోపాటు ఇన్ఫెక్షన్స్ వచ్చి నొప్పిరావచ్చు. ఇలాంటి పిప్పిపళ్ల కారణంగా చిన్నారులు ఆహారం నమలడానికి ఇబ్బందిపడతారు. అన్నం తినడాన్ని అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. తమకు వచ్చే నొప్పిని తల్లిదండ్రులకు సరిగా చెప్పలేక ఇలా అన్నం తినడానికి నిరాకరిస్తుంటారు. దాంతో ఎదుగుదల కూడా ఎంతో కొంత ప్రభావితం కావచ్చు. చికిత్స...పిప్పిపళ్లకు సరైన సమయంలో చికిత్స చేయించక΄ోతే ఇన్ఫెక్షన్ పంటి ఎముక వరకు చేరి, పాల పళ్లతోపాటు తర్వాత రావాల్సిన శాశ్వతదంతాలూ పాడయ్యే ముప్పు పొంచి ఉంటుంది. ఇలాంటి పిల్లలను దంతవైద్యులకు చూపించినప్పుడు వారు పంటిలోని రంధ్రాలను పూడ్చివేయడం, ఇన్ఫెక్షన్ను తగ్గించడానికి తగిన యాంటీబయాటిక్స్ ఇవ్వడం వంటి చికిత్సలు చేస్తారు. చిగుర్ల జబ్బులు... చిన్నారులకు బ్రషింగ్ నైపుణ్యాలు అంతగా తెలియక΄ోవడంతో పళ్లలో చిక్కుకున్న ఆహారపదార్థాలను సరిగా శుభ్రం చేసుకోక΄ోవడం కారణంగా పిప్పిపళ్ల తోపాటు చిగుర్ల సమస్యలు వచ్చే ముప్పూ ఉంటుంది. దీనికో కారణముంది. నోట్లో విపరీతంగా పెరిగి΄ోయిన బ్యాక్టీరియా, ఆహారపదార్థాలతో కలిసి ప్లాక్, క్యాలికులస్ అని పిలిచే మురికి సున్నితమైన చిగుర్ల చివర్లలోకి చేరుతుంది. ఈ మురికి కారణంగా చిగుర్లలో వాపు, కొందరిలో చిగుర్ల నుంచి రక్తస్రావం కావడం, నోటి దుర్వాసన వంటి సమస్యలు కూడా రావచ్చు. చిన్నవయసులోనే చిగుర్ల జబ్బు వస్తే పిల్లలు జీవితకాలం దృఢమైన పళ్లు లేక ఇబ్బంది పడవలసి రావచ్చు. చికిత్స...జింజివైటిస్ వంటి సమస్యలకు తగిన యాంటీబయాటిక్స్ వాడటతోపాటు చిగుర్లకు వచ్చే సమస్యను బట్టి దంతవైద్యులు పలురకాల చికిత్సలు అందిస్తారు. ఎత్తుపళ్లు, ఎగుడుదిగుడు పళ్లు / వంకరపళ్ల వంటి సమస్యలు... ఎత్తుపళ్లు అన్నది పిల్లలను ఆత్మన్యూనతకు గురిచేసే సమస్య. మొదట్లో ఇది నివారించదగిన సమస్యే అయినప్పటికీ, తల్లిదండ్రుల అవగాహనాలోపం, మరికొందరిలో వారి నిర్లక్ష్యం వల్ల ఇది తీవ్రమవుతుంది. ఎత్తుపళ్లు / ఎగుడుదిగుడు పళ్లు / వంకర పళ్లకు కారణాలు... ఎత్తుపళ్లు చాలావరకు వంశపారంపర్యంగా వస్తుంటాయి. తల్లిదండ్రుల్లో ఒకరికిగానీ లేదా ఇద్దరికీ ఎత్తుపళ్లు ఉంటే పిల్లల్లోనూ వచ్చే అవకాశాలు 70 శాతానికి పైమాటే. పిల్లలకు ఎత్తుపళ్లు, ఎగుడుదిగుడు / వంకరపళ్లు, పళ్లమధ్య సందులు రాకుండా చేసే చికిత్సలు సైతం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. నోట్లో వేలుపెట్టుకోవడం, పెదవులు కొరకడం, నాలుకతో పళ్లను ముందుకు తోస్తూ ఉండటం, నోటితోనే గాలిపీల్చడం వంటి అంశాలూ ఎత్తుపళ్లకు కారణమవుతుంటాయి. ఎదుగుతున్న చిన్నారుల దవడ ఎముకలు మైనంలా ఒత్తిడి పడుతున్న దిశకు వంగి΄ోతుంటాయి. ఈ కారణం వల్లనే ఇక్కడ పేర్కొన్న దురలవాట్లు ఉన్న పిల్లల్లో దవడ ఎముకల షేపు మారి΄ోయి పళ్లు ఎత్తుగా రావచ్చు. పాలపళ్లు సమయానికి ఊడిపోకపోయినా, పిప్పిపళ్లను ముందే తీసేయాల్సి వచ్చినా ఎత్తుపళ్లు లేదా ఎత్తు పళ్లు, ఎగుడుదిగుడు పళ్లు రావడానికి ఈ అంశాలు కూడా ఒక కారణం. ఎదిగే వయసులోనే ఎత్తుపళ్లను, ఎగుడుదిగుడు దంతాలనూ, సరిచేయడం, పళ్ల మధ్యన ఉండే సందులు చక్కదిద్దడం చాలా సులువు. చికిత్స ఫలితాలు కూడా దాదాపు నూరు శాతం ఉంటాయి. ఎదిగే వయసులో వచ్చే ‘గ్రోత్ స్పర్’ అనేది చికిత్సకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చికిత్స త్వరగా, సమర్థంగా జరిగేందుకు ఈ గ్రోత్ స్పర్ అంశం సహాయపడుతుంది. ఎత్తుపళ్ల సమస్య రెండు రకాలుగా ఉండవచ్చు... కేవలం పళ్లు మాత్రమే ఎత్తుగా ఉండటంపళ్లతోపాటు దవడ ఎముకలు కూడా ఎత్తుగా ఉండటం. పిల్లలు నవ్వినప్పుడు చిగుర్లు ఎక్కువగా కనిపించడం, నిద్రపోతున్నప్పుడూ పెదవులు తెరచుకునే ఉండటం, పెదవులు ముందుకు వచ్చినట్లుగా కనపడటం వంటివి ఎముక కూడా ఎత్తు పెరిగిందని చెప్పడానికి గుర్తులు. చికిత్స...ఎదిగే వయసులో ఎత్తుగా ఉన్నట్లు గుర్తిస్తే... ఎలాంటి శస్త్రచికిత్సలూ లేకుండానే పళ్లు, దవడలను ప్రత్యేకమైన క్లిప్స్‌తో సరిచేయవచ్చు. అయితే... ఎదిగిన పిల్లల్లో దవడ ఎముకలు ఎత్తుగా ఉంటే సర్జరీ చేయాల్సి రావచ్చు. పళ్లు ఎత్తుగా ఉన్నా, పళ్ల మధ్య సందులు ఉన్నా, వంకర టింకరగా ఉన్నా, ఎగుడుదిగుడుగా ఉన్నా క్లిప్పులతో వాటిని సరిచేయవచ్చు. అయితే పిల్లలకు అమర్చాల్సిన క్లిప్పులు అందరిలో ఒకేలా ఉండవు. వ్యక్తిగతమైన పరీక్షల తర్వాతే వారికి సరి΄ోయేవాటిని నిర్ణయించాల్సి ఉంటుంది. పాలపళ్లు సరైన టైమ్‌లో ఊడకపోవడం... సాధారణంగా పాలపళ్లలోని ప్రతి పన్నూ ఓ నిర్దిష్ట సమయం తర్వాత ఊడుతుంది. శాశ్వత దంతం తయారై బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడే పాలపన్ను ఊడుతుంది. ఊడిన 3 నుంచి 4 నెలల్లో శాశ్వత దంతం వచ్చేస్తుంది. ఏ కారణం వల్లనైనా పాలపన్ను ఊడక΄ోతే, దానికి ముందువై΄ో, వెనకవైపు నుంచో శాశ్వత దంతం వస్తుంది. (కొన్నిసార్లు పాలపన్ను ఊడకపోవడం వల్ల శాశ్వత దంతం బయటకు రాలేక చిగురులోనే చిక్కుకుపోవచ్చు కూడా). దాంతో రెండు వరసల్లో పళ్లు కనపడతాయి. అందుకే ఆరేళ్లు దాటిన పిల్లలను దంతనిపుణులకు తరచూ చూపిస్తూ పాలపళ్లు సరైన సమయంలోనే పడిపోతున్నాయా లేదా అని పరీక్ష చేయిస్తూ ఉండాలి. అవసరాన్ని బట్టి వారి పర్యవేక్షణలో చికిత్స చేయించాలి. పరీక్షలు : ఎక్స్–రే సహాయంతో పాలపళ్లు, శాశ్వత దంతాలను, శాశ్వతదంతాలను చిక్కుకు΄ోయిన తీరును దంతవైద్యులు తెలుసుకోగలరు. ముఖానికి దెబ్బలు తగలడం వల్ల... ఎదిగే పిల్లలు ఆటలాడుతుంటారు. పైగా ఇవి సెలవురోజులు కావడం ఆడుకోవడం మరింత ఎక్కువ. ఆటల్లో పరుగెత్తుతూ పడి΄ోవడం, దెబ్బలు తగలడం, క్రికెట్ బంతి లేదా ఇతర బంతుల వంటివి తగలడం, పిల్లలు ΄ోట్లాడుకోవడం వంటి చర్యలతో ముఖానికి దెబ్బలు తగలడం, పళ్లు విరగడం / వంగి΄ోవడం, దెబ్బలు తీవ్రమైనవైతే పెదవులు చీలడం, ముక్కు వంకర కావడం కూడా జరగవచ్చు. ఇలా దెబ్బలు తగిలినప్పుడు వెంటనే చికిత్స చేయించాలి. నిర్లక్ష్యం చేస్తే పలువరస షేపు మారడం, పళ్లపై గుర్తులు ఏర్పడి అలాగే ఉండి΄ోవడం జరగవచ్చు. అందుకే పన్ను విరిగినా, ఊడినా వెంటనే ఆ ముక్కను పాలలో లేదా మంచినీళ్లలో ఉంచి దంతవైద్యులను కలవాలి. వేసవి సెలవులు దంతవైద్యం చేయించడానికి అనువైన సమయం. ఈ సమయంలో స్కూళ్లకు సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లల చదువులు వృథా కాకుండానే చికిత్స చేయించవచ్చు. పైగా చికిత్స తర్వాత వారు ఇంటిపట్టునే ఉంటారు కాబట్టి టైముకు మందులు ఇవ్వడానికి, తగిన జాగ్రత్తలు తీసుకోడానికి, పిల్లలకు తగినంత విశ్రాంతి ఇవ్వడానికి సెలవులన్నవి సరైన సమయం. కాబట్టి తల్లిదండ్రులు ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, పంటి సమస్యలున్న పిల్లలకు తగిన వైద్యసహాయం అందించవచ్చు. (చదవండి: మిలమిల మెరిసే నక్షత్రాలు స్పష్టంగా కనిపించే ప్రాంతం అది..! ) ∙ -
'నా హైట్‌తో సమస్య.. నాతో ఎవరూ మాట్లాడేవాళ్లు కాదు'.. మీనాక్షి చౌదరి
గత ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’.. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇలా వరుస సంక్రాంతి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి, వచ్చే ఏడాది కూడా సంక్రాంతికి వచ్చి, హ్యాట్రిక్ హిట్‌తో అలరిస్తానంటున్న నటి మీనాక్షి చౌదరీ చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం.. ఇంకేందుకు ఆలస్యం చదివేయండి.పెద్ద పెద్ద స్టార్స్‌తో చేసిన సినిమాలు కొంత నిరాశపరచిన మాట నిజమే! కొందరు వాటి ఫ్లాప్స్కి నన్ను బాధ్యురాలిని చేస్తూ కామెంట్స్ చేశారు. ఫ్లాప్‌కి బాధపడను, ఎందుకంటే మన పని మాత్రమే మనల్ని ముందుకి తీసుకెళ్తుంది. తెలుగులో నా ఫస్ట్ పిక్చర్ ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ వర్కవుట్ కాకపోయినా.. ఖిలాడీ సినిమాలో ఛాన్స్ రావడానికి అదే కారణం!లక్కీ భాస్కర్ సినిమాతో నా లక్ మారిందని చాలామంది అంటున్నారు. ఆ సినిమా నాకు బాగా నచ్చింది. కానీ.. ఇక ముందు పిల్లల తల్లి పాత్ర వస్తే నో చెప్పేస్తాను. నేను పంజాబీ అమ్మాయిని. మా నాన్న బీఆర్ చౌదరి ఆర్మీలో కర్నల్. ఆయన క్రమశిక్షణకి చాలా ప్రాధాన్యం ఇచ్చేవారు. నన్ను తరచు తిడుతుండే వారు. ఇప్పుడు షూటింగ్‌కి అందరి కన్నా ముందు వచ్చి కూర్చోవడానికి ఆయనే కారణం. నువ్వు కొంచెం లేట్‌గా రావచ్చు కదా అంటారు యూనిట్ వాళ్లు. ∙చిన్నప్పుడు నేను చాలా ఇంట్రావర్ట్‌ని. కాలేజీలోకి వచ్చేటప్పటికే, నా ఎత్తు 6.2. దీంతో, అమ్మాయిలు కూడా నాతో కలిసి నడవటానికి, మాట్లాడటానికి ఇష్టపడే వాళ్లు కాదు. రకరకాల కామెంట్స్ చేసేవారు. చాలా బాధగా అనిపించేది. మా నాన్నకి చెప్పినా నీ సమస్యలు నువ్వే సాల్వ్ చేసుకోవాలి అనే వారు. బుక్స్ విపరీతంగా చదివేదాన్ని. అవే నా ఫ్రెండ్స్. అందాల పోటీల్లో, స్పోర్ట్స్ కాంపిటీషన్లో పాల్గొనడానికి నలుగురు కలుస్తారనేదే కారణం. నేను బ్యాడ్మింటన్, స్విమ్మింగ్‌లో ఛాంపియన్ని. మయాన్మార్లో జరిగిన అందాల పోటీల్లో నేను ఫస్ట్ రన్నర్‌గా వచ్చాను. ఈ మధ్య మయాన్మార్ లో భూకంపం వచ్చినప్పుడు నా మనసు కలచివేసినట్లయింది.∙సీనియర్ హీరోలతో నటించడంలో నాకెలాంటి ప్రాబ్లెమ్స్ లేవు. అదో జోనర్‌గా భావిస్తాను. వెంకటేష్‌గారితో సంక్రాంతికి వస్తున్నాం చేయడం చాలా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిగారితో విశ్వంభర చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. నా మీద రూమర్స్ వచ్చినప్పుడు కోపం వస్తుంది. నేను సోషల్ మీడియాలో ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఏదన్నా ఉంటే నేనే అనౌన్స్ చేస్తాను. పంజాబీ అమ్మాయిని అయినప్పటికీ.. సౌత్ ఇండియన్ కల్చర్ బాగా నచ్చుతుంది. చీరలు కట్టుకోవడం చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. నేను డెంటిస్ట్‌ని. ఎవరిని అయినా ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు వెంటనే వాళ్ల దంతాలనే గమనిస్తుంటాను. నిజానికి డెంటిస్ట్‌గా ప్రాక్టీసు మొదలు పెట్టాను. కాని, హీరోయిన్గా బిజీ కావడంతో సాధ్యపడలేదని అంటోంది మీనాక్షి చౌదరి. -
హెచ్‌పీ నుంచి 9 కొత్త ఏఐ ల్యాప్‌టాప్‌లు
న్యూఢిల్లీ: కృత్రిమ మేథకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంప్యూటర్స్ తయారీ దిగ్గజం హెచ్‌పీ తాజాగా తొమ్మిది ల్యాప్‌టాప్ మోడల్స్‌ను ఆవిష్కరించింది. వీటి ధర రూ. 78,999 (16 అంగుళాల హెచ్‌పీ ఆమ్నిబుక్5 నుంచి రూ. 1.86 లక్షల వరకు (హెచ్‌పీ ఆమ్నిబుక్ అల్ట్రా 14 అంగుళాలు) ఉంటుంది.మరోవైపు, భారత్‌లో తమ ఉత్పత్తుల తయారీని 2031 నాటికి రెట్టింపు చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. దీనితో భారత్‌లో విక్రయించే ప్రతి మూడు హెచ్‌పీ పీసీల్లో ఒకటి ఇక్కడ తయారు చేసినదే ఉంటుందని సంస్థ భారత విభాగం సీనియర్ డైరెక్టర్ వినీత్ గెహానీ తెలిపారు.2025లో భారత్‌లో తాము విక్రయించే మొత్తం పీసీల్లో 13 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసినవే ఉంటాయని వివరించారు. 2024లో దేశీ పీసీ మార్కెట్లో 30.1 శాతం వాటాతో హెచ్‌పీ అగ్రస్థానంలో నిల్చింది. కంపెనీ తమ ల్యాప్‌టాప్‌ల కోసం ఎలక్ట్రానిక్స్ తయారీ సర్వీసుల కంపెనీలు డిక్సన్, వీవీడీఎన్తో జట్టు కట్టింది. -
బాబు మార్క్ పాలన.. సీఎం బంధువుకు దక్కలేదని టెండర్ రద్దు
సాక్షి, అమరావతి: అస్మదీయులకు కాంట్రాక్ట్‌లు కట్టబెట్టి కమీషన్ల రూపంలో పెద్దఎత్తున ప్రజాధనాన్ని దండుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు. కనీస అనుభవం, అర్హతలేని సంస్థలకు రూ.వేల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌లను అడ్డగోలుగా కట్టబెడుతున్నారు. ప్రభుత్వ పెద్దల బంధువులు, సన్నిహితులు, కమీషన్లు ముట్టజెప్తే కంపెనీలకు కాంట్రాక్ట్ దక్కని పరిస్థితుల్లో ఏకంగా టెండర్లనే రద్దు చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో శానిటేషన్ టెండర్లలో ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొంది.చంద్రబాబు హయాంలో చక్రం తిప్పిన సంస్థ2014–19 మధ్య అధికార బలంతో సీఎం బంధువు దేవదాయ, వైద్య శాఖల్లో పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్ట్‌లు దక్కించుకున్నారు. పనులు సక్రమంగా చేయకపోయినప్పటికీ సీఎం బంధువు కావడంతో అధికారులు సైతం నోరెత్తకుండా అడ్డగోలుగా బిల్లులు చేశారు. గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం బంధువు కంపెనీ తెరపైకి వచ్చింది. ఇప్పుడు కూడా దేవదాయ, వైద్య శాఖల్లో కాంట్రాక్ట్‌లపై సీఎం బంధువు కన్నేశారు. కొద్దినెలల క్రితం ఏపీ ఎంఎస్ఐడీసీ ఆస్పత్రుల్లో పారిశుధ్య నిర్వహణ పనుల కోసం టెండర్లు పిలవగా.. బిడ్ దాఖలు చేయడంతో పాటు, సీఎంవో నుంచి ఉన్నతాధికారులకు సదరు కంపెనీ సిఫార్సు చేయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. అయితే, పరిశీలన దశలోనే బిడ్ అనర్హతకు గురైంది. దీనికి తోడు వివిధ మార్గాల్లో ప్రభుత్వ పెద్దలతో డీల్ కుదుర్చుకున్న సంస్థలకు పనులు దక్కే అవకాశం లేకుండా పోయింది. దీంతో కోర్టు కేసులు, వివాదాలు, ఇతర కారణాలను బూచిగా చూపి మొత్తం టెండర్‌నే ప్రభుత్వం రద్దు చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కుట్ర బట్టబయలుడీఎంఈ, ఏపీవీవీపీ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, శానిటేషన్, పెస్ట్ కంట్రోల్ నిర్వహణకు ఒకేసారి టెండర్లు పిలిచారు. కాగా, ఒక్క శానిటేషన్ టెండర్లనే ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి సెక్యూరిటీ, పెస్ట్ కంట్రోల్ టెండర్ల ప్రక్రియలోనూ అనేక అవకతవకలు చోటుచేసుకున్నాయి. సెక్యూరిటీ విభాగంలో ఒక సంస్థ టెండర్ నిబంధనలకు విరుద్ధంగా తక్కువకు ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేసింది. నిర్దేశిత నిబంధనలకు విరుద్ధంగా ఫైనాన్షియల్ బిడ్ దాఖలు చేస్తే రద్దు చేస్తామని టెండర్ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.అయినప్పటికీ ఈ సంస్థ బిడ్‌ను ప్రభుత్వం తిరస్కరించలేదు. కోర్టు కేసులు, బ్లాక్ లిస్ట్ అయిన కంపెనీలు టెండర్లలో పాల్గొన్నాయని, వారికి పనులు కట్టబెట్టకుండా చూడాలని కోర్టులో కేసులు దాఖలయ్యాయి. టెండర్ల ప్రక్రియ కొనసాగుతుండగానే పెస్ట్ కంట్రోల్ విభాగంలో సాయి సెక్యూరిటీ అనే సంస్థపై చీటింగ్ కేసు నమోదైంది. కాగా, ఆయా సంస్థలన్నీ అమాత్యుడు, ఇతర ప్రభుత్వ పెద్దలకు కమీషన్లు ముట్టజెప్పేలా డీల్ కుదుర్చుకోవడంతో ఈ పనుల వరకూ కాంట్రాక్టర్ల ఎంపిక ముగించేశారు. కుంటి సాకులతో ఒక్క శానిటేషన్ టెండర్లను రద్దు చేయడంతో ప్రభుత్వ పెద్దల కుట్ర బట్టబయలైంది. -
వేసవిలో చిన్నారులకు ఎలాంటి ఫుడ్ ఇవ్వాలంటే..!
వేసవిలో పిల్లలకు ఆహారం ఇవ్వాలంటే రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది వేసవి వేడిమి. రెండోది సెలవుల్లో వాళ్ల ఆటలు. నగరాల్లోని పిల్లలు ఎండల్లో పెద్దగా ఆడే అవకాశం లేకపోయినా పట్టణాల్లో, పల్లెల్లోని పిల్లలు ఇలా ఎండ వేడిమిలో ఆడటం మామూలే. అలాగే పెద్ద నగరాల్లోంచి సెలవులకు పల్లెలకు వచ్చే పిల్లల సంఖ్య తగ్గినప్పటికీ... కొంతమంది ఇప్పటికీ ఇలా వచ్చేవారు లేకపోలేదు. ఇలా వేసవిలోని వేడిమిని తట్టుకుంటూ... ఎక్కువ సమయం ఆటలకు ఇచ్చుకుంటూ ఉండేందుకు అవసరమైన శక్తిని సమకూరుస్తూ ఉండటానికి చిన్నారులకు ఎలాంటి ఆహారం ఇవ్వాలో తెలిపే కథనం. అధిక శక్తికోసం పాల ఉత్పత్తులు... పిల్లలకు తాజా లస్సీ, తాజా మజ్జిగ, ఫ్లేవర్డ్ మిల్క్, ఫ్రూట్ మిల్క్ షేక్‌లు (మ్యాంగో మిల్క్ షేక్) వంటివి ఇవ్వడం వల్ల ఒకపక్క అవి ద్రవాహారాలుగా వారు కోల్పోయే నీరు లవణాలను భర్తి చేయడం తోపాటు ప్రొటీన్లనూ అందజేస్తాయి. ఎదిగే వయసులో ఎముకల బలం కోసం క్యాల్షియమ్‌ను ఇస్తాయి. తాజా పండ్లు... పిల్లలకు తాజా పండ్లు తినిపించడం ఎప్పుడూ మంచిదే. కాకపోతే పండ్ల రసాలకు బదులు వీలైనంతగా పండ్లను కొరికి తినేలా చూడాలి. ద్రవాలను భర్తీ చేయడం కోసం, వేసవి ఉపశమనం కోసం అప్పుడప్పుడూ చల్లగా ఉండే తాజా పండ్ల రసాలనూ ఇవ్వవచ్చుగానీ... వీలైనంత వరకు వాటిలో చక్కెర కలపకపోవడం మంచిది. జంక్‌ఫుడ్ వద్దు... బర్గర్లు, పిజ్జాలు, చిప్స్ వంటి వాటి కోసం వాళ్లు మారాం చేస్తున్నప్పటికీ ఆరోగ్యానికి అవి హానికరమంటూ వాళ్లను సముదాయించడం మంచిది. ఆ వయసు పిల్లలను సమాధానపరచడం కష్టం కాబట్టి వాటిలో పనీర్, తాజాకూరగాయలు పుష్కలంగా నింపి ఇవ్వడం మంచిది. అయితే వాటిల్లో చీజ్ ఎక్కువగా ఉన్నవాటిని తినిపించడం అంతగా మంచిది కాదు. మరీ మారాం చేస్తుంటే గ్రిల్డ్ వెజిటబుల్స్‌ను పనీర్‌తో కలిపి ఇవ్వవచ్చు. ఐస్‌క్రీముల విషయంలో... వేసవిలో ఐస్‌క్రీములు అడగని పిల్లలు ఉండరు. ఇంట్లో తయారు చేసిన ఐస్‌క్రీమ్‌లు, ఫ్రూట్ కస్టర్డ్స్, పుడింగ్స్, స్మూతీస్ వంటివి పిల్లలకి పెట్టవచ్చు. ఇవి ఆరోగ్యకరమే. ఇక కూల్‌డ్రింక్స్ కోసమూ డిమాండ్ ఎక్కువగానే ఉండవచ్చుగానీ వాటిని ఇవ్వడం అంతమంచిది కాదని గుర్తుంచుకోండి. (చదవండి: మిలమిల మెరిసే నక్షత్రాలు స్పష్టంగా కనిపించే ప్రాంతం అది..! ) -
బాబు ‘ఛార్లెస్ శోభరాజ్’.. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు
సాక్షి,విజయవాడ: టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై మాజీ ఎంపీ కేశినేని నాని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.కేశినేని నానిపై కేసు నమోదు చేయండి అంటూ వచ్చిన ఓ పత్రికా కథనాన్ని కేశినేని నాని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో తనని అరెస్ట్ చేయండి అంటూ వచ్చిన కథనంపై స్పందించారు. ‘బాబు ‘ఛార్లెస్ శోభరాజ్’ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు’ అని వ్యాఖ్యానించారు. బాబు "చార్లెస్ శోభ రాజ్ "నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ,పెట్టించినా నువ్వు చేసే అవినీతి ,అక్రమాలు ,దందాలు దోపిడీ ,మోసాలు బయట పెట్టకుండా వుండే ప్రసక్తే లేదు . pic.twitter.com/ER4CR2jpBF— Kesineni Nani (@kesineni_nani) April 27, 2025 నా పోరాటం ఆగదుఅంతకుముందు.. టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని.. కేశినేని నానిపై రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఆ మేరకు చిన్ని.. కేశినేని నానికి లీగల్ నోటీసు పంపించారు. ఆ లీగల్ నోటీస్‌పై సోషల్ మీడియా వేదికగా కేశినేని నాని కౌంటర్ ఇచ్చారు. వంద కోట్లు కాదు.. లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదంటూ కేశినేని నాని తేల్చి చెప్పారు.నువ్వు 100 కోట్లకు కాదు లక్ష కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారి పై నా పోరాటం ఆగదు I have just received a legal notice from Kesineni Sivanath (Chinni), the sitting MP from Vijayawada, demanding Rs. 100 Crores for defamation — all because I raised legitimate… pic.twitter.com/AJdH7CKkoz— Kesineni Nani (@kesineni_nani) April 25, 2025 -
IPL 2025, KKR VS PBKS: చరిత్ర సృష్టించిన ప్రభ్‌సిమ్రన్ సింగ్
పంజాబ్ కింగ్స్ ఓపెనింగ్ బ్యాటర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి పంజాబ్ కింగ్స్ అన్ క్యాప్డ్ ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (ఏప్రిల్ 26) కేకేఆర్‌తో జరిగిన రద్దైన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. కెరీర్ ప్రారంభం నుంచి (2019) పంజాబ్ కింగ్స్‌కే ఆడుతున్న ప్రభ్‌సిమ్రన్ ఇప్పటివరకు 43 మ్యాచ్‌లు ఆడి 151.88 స్ట్రయిక్‌రేట్‌తో 1048 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ ఉన్నాయి. ఓవరాల్‌గా పంజాబ్ కింగ్స్ తరఫున 1000 పరుగులు పూర్తి చేసిన 10వ ఆటగాడిగా ప్రభ్‌సిమ్రన్ నిలిచాడు. ఈ ఫ్రాంచైజీ తరఫున యువరాజ్ సింగ్, శిఖర్ ధవన్‌కు కూడా 1000 పరుగుల మార్కును తాకలేదు. పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ 2018-2021 మధ్యలో 55 మ్యాచ్‌లు ఆడి 2548 పరుగులు చేశాడు.పంజాబ్ కింగ్స్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..కేఎల్ రాహుల్- 2548షాన్ మార్ష్- 2477డేవిడ్ మిల్లర్- 1974మయాంక్ అగర్వాల్- 1513మ్యాక్స్‌వెల్- 1431క్రిస్ గేల్- 1339సాహా- 1190మనన్ వోహ్రా- 1106మన్దీప్ సింగ్- 1073ప్రభ్‌సిమ్రన్ సింగ్- 1048కుమార సంగక్కర- 1009కాగా, నిన్న కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీకి చేరువలో (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) ఔటైన ప్రభ్‌సిమ్రన్ తన జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సీజన్లో ప్రభ్‌సిమ్రన్ ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీ సాయంతో 292 పరుగులు చేశాడు.నిన్నటి మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రన్ సహా ప్రియాంశ్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ 25, జోస్ ఇంగ్లిస్ 11 (నాటౌట్) చేయగా.. మ్యాక్స్‌వెల్ (7) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. జన్సెన్ 7 బంతులు ఆడి కేవలం 3 పరుగులే చేసి ఔటయ్యాడు. కేకేఆర్ బౌలర్లలో వైభ్వ్ అరోరా 2 వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి, రసెల్ తలో వికెట్ పడగొట్టారు. అనంతరం కేకేఆర్ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్ తర్వాత వర్షం మొదలైంది. వరుణుడు ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. వర్షం ప్రారంభమయ్యే సమయానికి కేకేఆర్ స్కోర్ 7/0గా (ఒక ఓవర్లో) ఉంది. ఈ మ్యాచ్‌లో లభించిన పాయింట్‌తో పంజాబ్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. గుజరాత్, ఢిల్లీ, ఆర్సీబీ టాప్-3లో ఉన్నాయి. -
నక్షత్రాలు చూడటానికి బెస్ట్ ప్లేస్ ..!
చీకటివేళ, మిలమిల మెరిసే నక్షత్రాల నింగిని చూస్తుంటే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఆ అబ్బురమైన అనుభూతి, మనసుపై చెరగని ముద్ర వేయాలంటే, అమెరికాలోని ఉటా రాష్ట్రం వెళ్లాల్సిందే! అక్కడి సెడార్ బ్రేక్స్ నేషనల్ మాన్యుమెంట్ సమీపంలో రాత్రిపూట సేద తీరాలి. నక్షత్రాలను చూడటానికి అదో అద్భుతమైన ప్రదేశం అంటారు ప్రకృతి ప్రేమికులు. ఇక్కడ సహజసిద్ధమైన అందాలను చూడటానికి రెండు కళ్లు చాలవట! ఇక్కడి లోతైన లోయలో సున్నపురాతి గుట్టలు కాలాన్ని బట్టి, నేలలో ఉండే ఖనిజాన్ని బట్టి రంగురంగులుగా మెరుస్తాయి. ఈ సెడార్ బ్రేక్స్ ప్రత్యేకమైన భౌగోళిక లక్షణాలతో ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మొదట్లో ఒక సరస్సు అని, నీరు ఎండిపోయాక అడుగున పేరుకున్న అవక్షేపాల రూపమే ప్రస్తుతం మనకు కనిపించే శిలలని చెబుతున్నారు. ఇది సుమారు ఆరు కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని అంచనా. ఈ ప్రాంతాన్ని 1933లో జాతీయ వారసత్వ చిహ్నంగా గుర్తించిన నాటి నుంచి, ఈ అద్భుతమైన సహజ సౌందర్యాన్ని పరిరక్షిస్తున్నారు. ఇక్కడ హైకింగ్, ఫొటోగ్రఫీ, నక్షత్రాల పరిశీలన వంటి కాలక్షేపాలను ఆస్వాదించవచ్చు. (చదవండి: వేసవి అంటే సెలవులేనా?) -
పాక్‌పై మనం దాడి చేయాల్సిన పనే లేదు.. వాళ్లే తిరగబడతారు: విజయ్ దేవరకొండ
కశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మాట్లాడారు. ఆ ఘటనను తలచుకుంటేనే చాలా బాధగా ఉందన్నారు. ఎవరైతే వారి ఆప్తులను కోల్పోయారో వారి బాధ తీవ్రత ఎంత అనేది అర్థం చేసుకోలగను అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరై దేవరకొండ పహల్గామ్ దాడి బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..'కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నా. మేమంతా మీకు అండగా ఉంటాం. మీ బాధను దగ్గరుండి పంచుకోలేకపోయినా.. మేమూ దాన్ని అనుభవిస్తున్నాం. కశ్మీర్లో జరుగుతున్న ఇలాంటి దారుణాలకు కారణం కేవలం చదువు లేకపోవడమే. వాళ్లందరికీ చదువు చెప్పించి బ్రెయిన్‌వాష్ కాకుండా చూడాలి . ఇలాంటి చర్యల వల్ల ఏం సాధిస్తారో నాకైతే తెలియదు. కశ్మీర్ ఎప్పటికీ ఇండియాదే.. కశ్మీరీలు కూడా మనవాళ్లే. రెండేళ్ల క్రితమే అక్కడ ఖుషీ సినిమా షూటింగ్‌కు కూడా వెళ్లా. పాకిస్థాన్‌లో నీళ్లు, కరెంట్ లేక ఇబ్బందులు పడుతుంటే.. ఇక్కడకు వచ్చి ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావటం లేదు. పాకిస్థాన్‌పై మనం దాడి చేయాల్సిన అవసరం లేదు. వాళ్లకే విరక్తి వచ్చి ఆ దేశ ప్రజలే అక్కడి ప్రభుత్వంపై దాడి చేస్తారు. వాళ్లు బుద్ధి లేకుండా చేసే పనులే ఇవన్నీ. ఇలాంటి సమయంలో మనమంతా ఒక్కటిగా కలిసి ఉండాలి. మనం జీవితంలో ముందుకెళ్లాలంటే చదువు ఒక్కటే మార్గం. మనం, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నప్పుడే దేశం కూడా ముందుకు వెళ్తుంది' అని అన్నారు.అనంతరం సూర్య గురించి మాట్లాడుతూ..' నాకు పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న అగరం ఫౌండేషన్ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను' అని అన్నారు.కాగా.. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రెట్రో. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. -
కుందనపు బొమ్మ నటి మేఘా ఆకాశ్ ఇష్టపడే ఆభరణాలు ఇవే..!
‘బొమ్మోలె ఉందిరా పోరీ..’ అంటూ చీర కట్టినా, జీన్స్ వేసినా అచ్చం కుందనపు బొమ్మలాగే ఉంటుంది నటి మేఘా ఆకాశ్. ఇప్పుడు ఆ రెండింటి కలయికలోనూ అద్భుతంగా ట్రెడిషన్ విత్ కాంటెంపరరీ లుక్ ట్రై చేసింది. ఆ ఫ్యాషన్ వివరాలే ఇక్కడ చూద్దాం.. వెండి వెలుగులుఆభరణాల విలువల పోటీలో బంగారం తర్వాతి స్థానమే వెండిది అయినా, మగువ అందాన్ని పెంచడంలో మాత్రం ఈ ఆభరణాలు తగ్గేదేలే అంటూ పోటీ పడతాయి. ఎందుకంటే, వెండి ఆభరణాలను ధరిస్తే వచ్చే లుక్కే వేరు. తక్కువ ధరలో లభించడంతో వీటికి అభిమానులు కూడా ఎక్కువే. సాధారణంగా వెండిని కాళ్ల పట్టీలు, కంకణాలు, మెట్టెలు వంటి ఆభరణాలకే ఉపయోగించేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టు వెండిని కూడా మెడలో హారాలు, చెవి పోగులకు, వివిధ ఆభరణాల రూపంలోకి మార్చేస్తున్నారు. అయితే, ధగధగ మెరిసే వెండి వస్తువుల మాదిరి కాకుండా ఈ వెండి ఆభరణాల రంగు కాస్త డల్‌గా ఉన్నా, ఇవి స్టయిలిష్ అండ్ బ్రైట్ లుక్‌ను తెప్పిస్తున్నాయి. వీటని మెయింటైనెన్స్ కూడా పెద్ద కష్టమైన పని కాకపోవడంతో ప్రతి ఒక్కరూ కాంట్రాస్ట్ లుక్ కోసం వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. అలాంటి లుక్ కోసమే నటి మేఘా ఆకాశ్ కూడా ఈ సిల్వర్ జ్యూలరీని ఎంచుకున్నారు చూడండి. ఇక్కడ మేఘా జ్యూలరీ.. బ్రాండ్: ఆమ్రపాలీ జ్యూలరీ చౌకర్ ధర: రూ. 5,800నెక్ పీస్ ధర: రూ. 41,612, ఉంగరం ధర: రూ. 3,399. ఇక మేఘాకి లిప్‌స్టిక్ ఎక్కువ ఇష్టం ఉండదట. అందుకే, తన బ్యాగులో ఎప్పుడూ చాలా రకాల లిప్ బామ్స్ ఉంటాయని చెబుతోంది. (చదవండి: పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..) -
ఈ ‘ప్రపంచ కుబేరుడు’ ఒకప్పుడు క్లీనర్.. అంతేనా.. ఎన్నో ట్విస్ట్‌లు!
ఎలాన్ మస్క్ జీవితం మూడు దేశాలతో ముడివడి ఉంది. దక్షిణాఫ్రికా–కెనడా–అమెరికా. ఈ మూడు దేశాల పౌరసత్వాలు అతడికి ఉన్నాయి. ఎలాన్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. తండ్రిది దక్షిణాఫ్రికా, తల్లిది కెనడా. ఆమె మోడల్. ఆయన కెమికల్ ఇంజినీర్. ఎలాన్‌కు 8 ఏళ్ల వయసప్పుడే తల్లీ తండ్రి విడిపోయారు. అంతటి కుటుంబ కల్లోలంలోనూ తన జీవిత నావను జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి.. నేడు అమెరికాను పాలిస్తున్న ఆ దేశ అధ్యక్షుడికే చేదోడు అయ్యేంతగా ఎదిగారు ఎలాన్. ఆయన జీవితంలోని ప్రతి దశా కీర్తి కిరీటాన్ని ధరించినదే.పన్నెండేళ్లకే తొలి బిజినెస్ ఎలాన్‌కి చిన్నప్పట్నుంచీ సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టం. 12 ఏళ్ల వయసులోనే ‘బ్లాస్టర్’ అనే వీడియో గేమ్‌ను సొంతంగా కనిపెట్టి, ఆ గేమ్ సాఫ్ట్‌వేర్‌ను ఒక పత్రికకు 500 డాలర్లకు అమ్మేశాడు. అదే అతడి మొదటి బిజినెస్. ప్రాణాంతక హైడ్రోజన్ బాంబులను మోసుకెళ్లే గ్రహాంతర రవాణా నౌకను అంతరిక్ష పైలట్ ధ్వంసం చేసే ఆట ‘బ్లాస్టర్’.ఫీజు కోసం క్లీనింగ్ పనికాలేజ్లో ఎలాన్ సబ్జెక్టులు ఫిజిక్స్, ఎకనామిక్స్. స్టాన్ఫోర్డ్, పెన్సిల్వేనియా యూనివర్సిటీల్లో చదివారు. కష్టపడి పని చేసి తన కాలేజ్ ఫీజు తనే కట్టుకున్నారు. ఎన్ని పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి ఫీజులు కట్టినా కాలేజ్ చదువు పూర్తయ్యే నాటికి లక్ష డాలర్లు అప్పు మిగిలే ఉంది. అది తీర్చటానికి గంటకు 18 డాలర్ల వేతనంతో కలపకోసే మిల్లులో క్లీనర్ పనితో సహా అనేక పనులు చేశారు ఎలాన్.ఒక కంపెనీతో ఆగిపోలేదు!ఎలాన్ 24 ఏళ్ల వయసులో తన తొలి కంపెనీ ‘జిప్2’ని ప్రారంభించారు. వార్తాపత్రికలకు ఆన్లైన్ సిటీ గైడ్ సాఫ్ట్‌వేర్‌ను సమకూరుస్తుంది జిప్2. తర్వాత నాలుగేళ్లకు 1999లో కంపాక్ కంపెనీ జిప్2ను 307 మిలియన్ డాలర్లకు కొనేసింది. ఎలాన్ తన ఇంకో కంపెనీ ఎక్స్.కామ్‌ను 2000లో కాన్ఫినిటీ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో విలీనం చేశారు. తర్వాతి ఏడాదికే అది ‘పేపాల్’ అనే ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది.పేపాల్‌ను 2002లో ఈబే 1.5 బిలియన్ డాలర్లకు కొనుక్కుంది. అదే ఏడాది ఎలాన్ వ్యోమనౌకల తయారీ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ను స్థాపించారు. అంతరిక్ష రవాణా సేవల్ని కూడా ఆ కంపెనీ అందిస్తోంది. అంతరిక్షయాన వ్యయాన్ని తగ్గించటం, ఏదో ఒక నాటికి అంగారక గ్రహంపై భూగోళ వాసుల కాలనీని ఏర్పాటు చేయటం స్పేస్ఎక్స్ లక్ష్యం. ప్రఖ్యాతి గాంచిన టెస్లా, ఓపెన్ ఏఐ, ‘ది బోరింగ్ కంపెనీ’, ఎక్స్ కార్పొరేషన్, ‘థడ్’ (వ్యంగ్య వార్తల మీడియా కంపెనీ)లు కూడా ఒంటి చేత్తో ఎలాన్ నెలకొల్పినవే.ఐరన్ మ్యాన్ 2లో చిన్న పాత్రఎలాన్ దగ్గర ఇంత డబ్బుంది, అంత డబ్బుంది అని చెప్పడం కంటే తేలికైన మార్గం అతడిని ఒక్క మాటలో ‘ప్రపంచ కుబేరుడు’ అనేయటం! 2025 ఏప్రిల్ మొదటి వారం నాటికి అతడి గరిష్ఠ సంపద సుమారు 433 బిలియన్ డాలర్లు. ఇంకో 567 బిలియన్ డాలర్లను పోగేయగలిగితే ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అవుతారు ఎలాన్. డబ్బు, ధనం, సంపద.. ఇవన్నీ అలా ఉంచండి. అంతకంటే ఆసక్తికరమైన విషయాలు అతడి జీవితంలో ఉన్నాయి. 2008 నాటి ‘ఐరన్ మ్యాన్’ సినిమాలో ‘టోనీ స్టార్క్’ పాత్రకు ఎలాన్ మస్క్ ఇన్స్పిరేషన్! ఆ తర్వాత 2010లో వచ్చిన ‘ఐరన్ మ్యాన్ 2’ లో మస్క్ చిన్న పాత్ర వేశారు కూడా.తిట్లనూ తేలిగ్గా తీసుకుంటారు!ఎలాన్ దగ్గర ఎంత సంపద ఉందో అంత సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉంది. విమర్శల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. తను అనుకుంటే ఏదైనా జరిగి తీరాల్సిందే అనే నైజం కూడా ఆయనలో ఉంది. ఇందుకు చిన్న ఉదాహరణ... కాలిఫోర్నియాలోని అలమీడా కౌంటీలో ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉంది. కరోనా లాక్డౌన్ వల్ల అది ఆగిపోయింది. ‘‘ఇంకెంత కాలం ఈ లాక్డౌన్’’ అని లాక్ డౌన్ పూర్తి కాకుండానే ఫ్యాక్టరీని తెరవబోయారు ఎలాన్.కౌంటీ అధికారులు ‘నో’ అన్నారు. మీరిలా అడ్డుకుంటే ఫ్యాక్టరీని కాలిఫోర్నియా నుంచి వేరే చోటికి మార్చేస్తా అని ఎలాన్ బెదిరించారు. కేసు కూడా వేస్తానన్నారు. ఆయన అలా బెదిరించడం కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు లోరేనా గాన్జెలజ్ కు కోపం తెప్పించింది. ‘‘చెత్త మొహం ఎలాన్ మస్క్. వెళ్లిపో’’ అని ట్వీట్ చేశారు. అందుకు మస్క్ కోపం తెచ్చుకోలేదు. ‘మెసేజ్ రిసీవ్డ్’ అని రిప్లయ్ ట్వీట్ ఇచ్చారు. కోపాలు వస్తుంటాయి. తగ్గడం తెలిస్తే నవ్వులూ పూస్తాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్ -
ఆస్తి కోసం.. కన్న కొడుకే కాలయముడై..!
పూసపాటిరేగ( విజయనగరం జిల్లా): కడుపున పుట్టిన కొడుకే ఆస్తికోసం తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో గుద్దించి హతమార్చిన ఘటన విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలస గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాండ్రింకి అప్పలనాయుడు (55), పాండ్రింకి జయమ్మ (53)కు రాజశేఖర్, రాధ ఇద్దరు పిల్లలు. కుమార్తె రాధను ఆనందపురం మండలం నేలతేరుకు చెందిన వ్యక్తితో వివాహం చేశారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం తరువాత ఆమె మృతిచెందింది. తమకు ఉన్న 80 సెంట్లు పొలంలో వివాహ సమయంలో 20 సెంట్లు భూమిని రాధ పేరిట తల్లిదండ్రులు రిజిస్ట్రేషన్ చేశారు. దీనిపై కుమారుడు రాజశేఖర్ తల్లిదండ్రులపై కక్ష పెంచుకున్నాడు. భూమి విషయమై వారితో కొంత కాలంగా గొడవపడుతున్నాడు. తల్లిదండ్రుల నుంచి విడిపోయి తన భార్య, కుమార్తెతో కలిసి వేరుగా నివసిస్తున్నాడు. సొంతంగా ట్రాక్టర్ నడుపుతున్నాడు. వ్యసనపరుడు కావడంతో అప్పుల పాలయ్యాడు. ఈ క్రమంలో గ్రామానికి సమీపంలోని నడుపూరి కల్లాల వద్ద రాధకు ఇచ్చిన భూమిని విక్రయించేందుకు సిద్ధపడ్డాడు. ఇందులో భాగంగా జేసీబీ, ట్రాక్టర్ సాయంతో చదునుచేసే పనులను సాయంత్రం చేపట్టాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లి కుమారుడిని ప్రశ్నించారు. ఈ క్రమంలో వారిపై ఆగ్రహంతో ఊగిపోతూ ట్రాక్టర్‌తో ఢీకొట్టి హతమార్చాడు. వారు మృతి చెందినట్టు నిర్ధారణ అయ్యాక అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. భోగాపురం రూరల్ సీఐ జి.రామకృష్ణ, ఎస్ఐ ఐ.దుర్గాప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నారు. -
కొడుకులారా.. కొరివైనా పెట్టరా?
మానకొండూర్(కరీంనగర్ జిల్లా): కొడుకులు పుట్టారని సంబరపడితే.. కొరివి పెట్టకుండా కొట్టుకుంటున్నారు. కని, పెంచి, ప్రయోజకులను చేస్తే అనాథ శవంగా అంత్యక్రియలు జరపకుండా శవజాగరణ చేయించారు. దీంతో వృద్ధుడి మృతదేహం మూడ్రోజులు జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉండగా.. శనివారం పోలీసులు, గ్రామస్తుల జోక్యంతో అంత్యక్రియలు పూర్తిచేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వన్నారం గ్రామానికి చెందిన జంగిలి కొమురయ్య (74), రాజకొమురవ్వ దంపతులకు ఇద్దరు కొడుకులు జంగిలి ఓదెలు, జంగిలి రవి, ఇద్దరు కూతుళ్లు సంతానం. రాజకొమురవ్వ కొంతకాలం కిందటే చనిపోయింది. ఓదెలు, రవి మధ్య చాలా రోజులుగా భూ తగాదాలు జరుగుతున్నాయి. ఈనెల 24న ఇంటి వద్ద జంగిలి కొమురయ్య చనిపోయాడు. అంత్యక్రియలు నిర్వహించాల్సిన కొడుకులిద్దరూ.. తన తండ్రి మృతిపై అనుమానం ఉందని, ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పోలీసులు మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి భద్రపరిచారు. శనివారం బ్లూకోల్ట్స్ సిబ్బంది వెంకట్రామయ్య ఫిర్యాదుతో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. పెద్ద కొడుకు తలకొరివి పెట్టాడు. కొమురయ్యది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మానకొండూర్ సీఐ బి.సంజీవ్ తెలిపారు. -
బంజారాహిల్స్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత
బంజారాహిల్స్(హైదరాబాద్): నైజీరియా నుంచి డ్రగ్స్‌ను కొనుగోలుచేస్తూ గోవాతో పాటు ముంబయ్, హైదరాబాద్‌లలో విక్రయిస్తున్న అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్‌తో పాటు సహకరించిన మరో వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు.. గోవాకు చెందిన లివియో జోసఫ్ అల్మిడా అలియాస్ ప్యూషా (41) గోవాకు తరచూ పర్యాటకులుగా వచ్చే నైజీరియన్లతో ఎనిమిదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చని, నైజీరియా నుంచి తాము దిగుమతి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. అలా నైజీరియా నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ విక్రయిస్తున్న జోసఫ్ కదలికలపై నగర పోలీసులు దృష్టిసారించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్–2లోని కమలాపురికాలనీ ప్రాంతంలో జోసఫ్ ఓ వ్యక్తికి కొకైన్ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన నుంచి 11 గ్రాములు ఎండీఎంఏ, 10 గ్రాముల కొకైన్, రూ.1.97 లక్షల నగదు, ఒక బైక్, మూడు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. గోవా నుంచి మూడు రోజుల క్రితం జోసఫ్ హైదరాబాద్‌కు రాగా ఇక్కడ ఓ వ్యక్తి ఆశ్రయమిస్తున్నట్లుగా గుర్తించారు. బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ఇందిరానగర్‌లో నివసించే ఉబలంక శంకర్ (48) అనే వ్యక్తి షెల్టర్ ఇవ్వడమే కాకుండా బైక్ కూడా సమకూర్చి తన ఇంట్లోనే ఆశ్రయమిచ్చాడు. ఆయనను కూడా బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో కూడా జోసఫ్ హైదరాబాద్‌లోనే డ్రగ్స్ విక్రయిస్తుండగా అప్పుడు కూడా వీరిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిద్దరూ కలిసి హైదరాబాద్‌లో పలువురికి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. నగరంలో ప్రతి నెలా రెండు సార్లు సంజయ్, లోకేష్ సతీష్‌వర్మ, అమిత్, సిద్దార్ధ, రుద్రరాజు తదితర కస్టమర్లకు విక్రయిస్తున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. హైదరాబాద్‌కు వచ్చినప్పడల్లా పాత కేసులో భాగంగా కోర్టుకు హాజరవుతూ వచ్చేటప్పుడే గోవా నుంచి డ్రగ్స్ తీసుకువస్తూ తెలిసిన కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. గోవా నుంచి హైదరాబాద్‌కు రావడానికి బస్సులోనే వస్తుంటాడని, బస్సులో అయితే ఎలాంటి చెకింగ్లు ఉండవన్న ఉద్దేశ్యంతో తన మాజీ భార్యతో టికెట్ బుక్ చేయిస్తుంటాడని తేలింది. -
ED: ఈడీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం
ముంబై: దక్షిణ ముంబైలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బాలార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) కార్యాలయం ఖైసర్ ఏ హిందు భవనంలో ఆదివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.ఈ భారీ అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది 12 ఫైరింజన్లతో మంటల్ని ఆర్పే ప్రయత్నం చేశాయి. ఆదివారం తెల్లవారు జామన ఈడీ ఆఫీస్‌లో ప్రమాదం జరగడంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. #WATCH | Maharashtra | Firefighting continues at Kaiser-I-Hind building, which houses Mumbai's ED office in Ballard Pier.The fire broke out at around 2:30 am. 12 fire engines rushed to the spot. The cause of the fire is not clear yet: Mumbai Fire Department pic.twitter.com/YtT8QaITM8— ANI (@ANI) April 27, 2025పీటీఐ కథనం ప్రకారం.. కారింభోయ్ రోడ్డుపై ఉన్న గ్రాండ్ హోటల్ సమీపంలోని కైసర్ ఐ హింద్ అనే భవనంలో ఆదివారం ఉదయం 2:31 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగినట్లు ఫైర్ బ్రిగేడ్‌కు సమాచారం అందింది.అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్ బ్రిగేడ్ బృందాలు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మొదట మామూలు మంటగా కనిపించినా, ఉదయం 3:30 గంటల సమయంలో మంటలు తీవ్రంగా మారడంతో దాన్ని లెవల్-2 (భారీ అగ్ని ప్రమాదం) గుర్తించారు. ఇక ఈ భవనంలోని నాలుగు,ఐదు అంతస్తులలో అగ్ని ప్రమాదం జరిగినట్లు మున్సిపల్ అధికారి తెలిపారు. ఘటన స్థలానికి 12 ఫైరింజన్లు, ఆరు జంబో వాటర్ ట్యాంకర్లు, ఒక ఎరియల్ వాటర్ టవర్ టెండర్, ఒక బ్రెతింగ్ అపారాటస్ వాన్, రెస్క్యూ వాన్, క్విక్ రెస్పాన్స్ వాహనం, అలాగే అంబులెన్స్ సైతం అందుబాటులో ఉంచారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు తెలిపారు. -
పండ్లు, కూరగాయలతో ఆరోగ్యమే కాదు..ఇంటి అలంకరణలోనూ అదుర్స్..
వేసవిలో పండ్లు, కూరగాయల జ్యూస్‌ల వాడకం సహజంగానే ఎక్కువ. ఆరోగ్యం గురించే కాదు, వీటిని ఇంటి అలంకరణలోనూ వాడచ్చు. సహజమైన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. కాబట్టి కృత్రిమమైన పండ్లు, కూరగాయలు, వనమూలికలతో ఇంటిని అలంకరించవచ్చు. ఇంటి వాతావరణం చల్లగా, సహజత్వానికి దగ్గరగా ఫామ్‌హౌస్ వాతావరణాన్ని సృష్టించాలనుకున్నా, సమృద్ధిగా పంటల థీమ్‌ను సృష్టించాలనుకున్నా, వనమూలికల ఉపయోగాలు తెలుసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకోవాలన్నా, ఫ్రూట్ అండ్ వెజిటబుల్ డెకర్ ఈ సీజన్‌కి సరైన ఎంపిక అవుతుంది.కిచెన్ డెకర్గిన్నెల్లో, వంటగది కౌంటర్‌టాప్ లేదా డైనింగ్ టేబుల్‌పై పండ్లబుట్ట ఉంచి, వాటిలో కృత్రిమ పండ్లు, కూరగాయలను ప్రదర్శించవచ్చు. ఆర్టిఫిషియల్ పండ్లు, కూరగాయలు, మూలికలు, పువ్వులు లేదా పచ్చదనంతో సెంటర్ టేబుల్‌పైన సెంటర్ పీస్‌ను క్రియేట్ చేయండి. మరింత అందంగా కనిపించడానికి ఓ వెదురు బుట్ట లేదా జాడీ ఉంచండి. ఫామ్‌హౌస్ శైలిపట్టణవాసులు ఇటీవల ఫామ్ హౌస్‌లను బాగా ఇష్టపడుతున్నారు. అందుకని, ఫామ్‌హౌస్ అలంకరణను మన ఇంట్లోకి తీసుకురావచ్చు. వెదురు లేదా తీగలతో అల్లిన బుట్టలు, జ్యూట్ బ్యాగుల్లో మీకు నచ్చిన చెర్రీ, బెర్రీ, నిమ్మ, ఆరెంజ్, అరటి, మామిడి.. వంటి కృత్రిమ పండ్లు, కూరగాయలు, మూలికలను చేర్చండి. హెర్బల్ గార్డెన్కృత్రిమ మూలికలతో ఇండోర్ హెర్బల్ గార్డెన్‌ను సృష్టించవచ్చు. తాజా అనుభూతి కోసం వంటగదిలో కుండలు లేదా వేలాడే బుట్టలనూ ఉంచవచ్చు. నిమ్మ, నారింజ చెట్లు వంటి కృత్రిమ పండ్ల చెట్లను పెద్ద కుండలలో ఉంచి ప్రదర్శించవచ్చు. ఎన్.ఆర్(చదవండి: వేసవి అంటే సెలవులేనా?) -
భారత్‌తో పెట్టుకుంటే అంతే సంగతి.. పాకిస్తాన్లో ఔషధ ఎమర్జెన్సీ!
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు దేశాల ప్రజలు తమ స్వదేశాలకు చేరుకుంటున్నారు. ఇక, ఉగ్రదాడి కారణంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం సైతం దెబ్బతింది. ఈ క్రమంలోనే సింధూ నదీ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడంతో రెచ్చిపోయిన పాక్ ఆవేశంతో భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకుంది. దీంతో, అసలుకే ఎసరు వచ్చే పరిస్థితిని తెచ్చుకుంది.భారత్‌తో వాణిజ్య బంధాన్ని తెంచుకున్న పాకిస్తాన్‌కు ఔషధాల పరంగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఔషధ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. తాజాగా ఔషధాల నిల్వల్ని సాధ్యమైనంతగా పెంచుకోవాలని సంబంధిత విభాగాలకు పాక్ వైద్య, ఆరోగ్యశాఖ సూచించింది. ప్రస్తుతం భారత్ నుంచి పాకిస్థాన్.. 30-40 శాతం ఔషధ ముడి సరకు, ఔషధంలో వాడే ప్రధాన పదార్థం, చికిత్స ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఔషధ రంగంపై నిషేధం ప్రభావం గురించి అధికారిక నోటిఫికేషన్ లేనప్పటికీ ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధమయ్యాయని పాకిస్థాన్ ఔషధ నియంత్రణ సంస్థ (డీఆర్ఏపీ) శనివారం వెల్లడించింది.అనంతరం, డీఆర్ఏపీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. చైనా, రష్యా, ఐరోపా దేశాల నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు . రేబిస్ టీకా, పాము కాటు మందు, క్యాన్సర్ చికిత్సలకు అవసరమైన ఔషధాలను, మోనోక్లోనల్ యాంటీబాడీస్ తదితరాలను అత్యవసరంగా నిల్వ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించామని వివరించారు. తగు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. అయితే, ఔషధాల ఎమర్జెన్సీ నేపథ్యంలో పాకిస్తాన్లో బ్లాక్ మార్కెట్ దందా పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నట్టు సమాచారం. దీనిపై తగు చర్యలు తీసుకునేందు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. భారత ఫార్మానే పాక్‌కు కీలకం..ప్రస్తుతం, పాకిస్తాన్ తన ఔషధ ముడి పదార్థాలలో భారత్‌పై ఆధారపడుతోంది. వీటిలో యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (API), వివిధ అధునాతన చికిత్సా ఉత్పత్తులు ఉన్నాయి. ముఖ్యంగా, క్యాన్సర్ నిరోధక చికిత్సలు, జీవ ఉత్పత్తులు, వ్యాక్సిన్లు, సెరా, యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ మరియు యాంటీ-స్నేక్ వెనమ్‌ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఇక, చాలా వరకు భారత్ చెందిన మందులు.. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, దుబాయ్, తూర్పు సరిహద్దు మీదుగా పాకిస్తాన్లోకి అక్రమంగా రవాణా చేయబడుతున్నాయి. బ్లాక్ మార్కెట్ నుంచి మందులు తరలిస్తున్నారు.🚨 Crisis Brews in Pakistan's HealthcareAfter suspending trade with India over the Pahalgam attack fallout, Pakistan faces a looming pharmaceutical shortage.Authorities scramble to secure vital drug supplies from China, Russia, and Europe, as 30%-40% of raw materials were… pic.twitter.com/Gz9HCEiLXt— Instant News 247 (@instant_news247) April 26, 2025భారత్‌తో పెట్టుకుంటే పాతళానికి పాక్..ఇదిలా ఉండగా.. పాకిస్తాన్ స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ.. దివాళా అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చిరకాల మిత్రదేశం చైనా పుణ్యమా అని కొద్దిగా కోలుకుంటోంది. కానీ, ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి స్థితిలో భారత్‌తో స్వల్పకాల యుద్ధం చేసినా పాక్ ఆర్థిక వ్యవస్థ నిండా మునగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 50 ఏళ్ల కిందట పాకిస్థాన్.. దక్షిణాసియాలో ధనిక దేశం. స్వాతంత్య్రం వచ్చాక ఆ దేశం మంచి ఆర్థిక వృద్ధిని కనబరచింది. ముఖ్యంగా 1960, 1970లలో ధనిక దేశంగా వెలుగొందింది. బలమైన ఆర్థిక నిర్వహణ, భారీగా విదేశీ సాయం, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై దృష్టి వంటి అంశాలు బాగా కలిసొచ్చాయి.అనంతర కాలంలో.. దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం వంటి చేయడంతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. అందుకే.. నేడు దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో పాక్ ఒకటిగా మారింది. కోవిడ్ మహమ్మారితో కుదేలైన పాక్ ఆ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. పాక్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే.. టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి వస్తోందని.. అందువల్ల టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయానా పాక్ ప్రణాళిక శాఖ మంత్రి అహ్సాన్ ఇక్బాల్ కోరారు. దీంతో, ఎంతటి దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. దీనికితోడు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం వల్ల పాక్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌తో సైనిక ఘర్షణ, యుద్ధం వంటి పరిస్థితులు వస్తే.. అది పాకిస్తాన్‌ను మరింత దెబ్బతీస్తుంది. -
పాతికేళ్లుగా కేసీఆర్ వెంటే ఉన్నా..
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో అభివృద్ధిని పరుగులు పెట్టించి, పేద ప్రజలకు సంక్షేమాన్ని పంచిన కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని టీఆర్ఎస్ (బీఆర్ఎస్) వ్యవస్థాపక సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ జోస్యం చెప్పారు. బీఆర్ఎస్పార్టీ పాతికేళ్ల పండుగ సందర్భంగా శనివారం ఆయన ‘సాక్షి’తో తన ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు. ⇒ ప్రజలు ఒక్కసారి చేసే పొరపాటుతో కాంగ్రెస్‌ను ఐదేళ్లు భరించాల్సిన పరిస్థితి నెలకొం ది. దీంతో తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక కేసిఆర్ అని, బీఆర్ఎస్ రజతోత్సవ సభ ద్వారా మరోసారి రుజువు కానుంది. ⇒రెండున్నర దశాబ్ధాల రాజకీయ ప్రస్థానంలో పదవుల కంటే తెలంగాణ రాష్ట్ర సాధన కల సంతృప్తి ఇచి్చంది. హైదరాబాద్ పాతబస్తీ నుంచి పాతికేళ్లుగా కేసీఆర్ వెన్నంటే నడుస్తున్నా, టీఆర్ఎస్ పార్టీ అవిర్భావం కంటే ముందు పత్రికలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం రాబోతున్నట్లు చదివి వెంటనే ఆయన ఇంటికి వెళ్లి కలిశా..⇒హైదరాబాదీ ముస్లిం – తెలంగాణ ఉద్యమంలో ఎలా కలిసివస్తావని పలువురు ప్రశి్నంచారు. అప్పుడు నేను విద్యార్ధి దశలోనే 1969 తెలంగాణ ఉద్యమ్యంలో కీలక పాత్ర పోషించా. ఆ తర్వాత ఉద్యమం చల్లారడం కుటుంబ వ్యాపారంలో నిమగ్నమయ్యా. ⇒తెలంగాణ వస్తే ఆంధ్ర పాలకుల పెత్తనం పోయి మా నీళ్లు. మా విద్యుత్, మా ఉద్యోగాలు మాకు వర్తిస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశా. అప్పుడు నన్ను పై ఫ్లోర్‌కు తీసుకేళ్లి నా పేరు అడిగి మహమూద్ భాయి.. మాతో జత కలవండి ...కోట్లాది తెలంగాణ సాధిద్దామని చెప్పి భరోసా ఇచ్చాÆరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పిలుపు.. ⇒ ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక తండ్రిగా కేసీఆర్ ను గౌరవిస్తూ వ్యూహాలకు అనుగుణంగా పనిచేస్తూ వస్తున్నా. పార్టీ ఆవిర్భావం నుంచి తన నివాసంలోని అఫీస్‌లో కేసీఆర్‌కు ప్రత్యేక చాంబర్, కుర్చీ ఉందని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పారీ్టలో జీవిత కాలం రెండో సభ్యత్వం నాదే.. ⇒ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తుంటే తన తల్లి, సతీమణి మినహా బంధువులు, మిత్రులు, తోటి వ్యాపారులందరూ ఉద్యమం పేరుతో తూటాలు, లాఠీ దెబ్బలు ఎందుకు తింటావు... ప్రశాంతంగా వ్యాపారం చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. ⇒ కానీ, తెలంగాణ సాధన కల లక్ష్యంతో ముందుకు సాగితే.. ప్రత్యేక రాష్ట్ర సాకారంతో పాటు ఊహించని విధంగా డిప్యూటీ సీఎం,హోం మంత్రి లాంటి కీలక పదవులు నిర్వహించే భాగ్యం కలిగింది. తెలంగాణ ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఎక్కడికి బయలుదేరినా.. ఆయన చేతికి ఇమామ్–ఎ–జామీన్ కడుతున్నా.⇒ఒక సారి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1000 కార్ల ర్యాలీ బయలు దేరినప్పడు తాను జ్వరంతో ఇమామ్–ఏ జామిన్ కట్టడం మర్చిపోగా.. మహమూద్ భాయి దట్టీ తేలేదా అని అడిగి చాంద్రాయణ గుట్ట వద్ద అరగంట సేపు ర్యాలీ నిలిపి వేశారు .దట్టి తీసుకొచ్చి కట్టి తర్వాత ర్యాలీ ముందుకు సాగిందని గుర్తు చేసుకున్నారు. -
భారీ అగ్ని ప్రమాదం.. 300 గుడిసెలు దగ్ధం
హయత్‌నగర్: అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరులోని వివాదాస్పద స్థలంలోని గుడిసెల్లో శనివారం అగ్ని ప్రమాదం జరిగి సుమారు 300 పైగా గుడిసెలు అగ్ని ఆహుతయ్యాయి. మంటలు ఎగిసి పడుతూ విస్తరిస్తుండడంతో బాధితులు గుడిసెల నుంచి బయటికి పరుగులు తీశారు. ఐదు అగ్ని మాపక వాహనాలతో మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఎలా జరిగిందంటే. ? కుంట్లూరు సర్వేనెంబర్ 214 నుంచి 224 వరకు ఉన్న సుమారు 100 ఎకరాలు భూమిపై కొంత కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ భూమి తమకు చెందుతుందని ప్రైవేటు వ్యక్తులు వాదిస్తుండగా ఇది భూదాన భూమి అని సీపీఐ నాయకులు వాదిస్తున్నారు. ఈ వివాదం కోర్టులో కొనసాగుతుండగా సీపీఐ ఆధ్వర్యంలో రెండేళ్ళ క్రితం వేలాది మంది పేదలు ఇక్కడ గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. కోర్టు వివాదం ఉన్న భూమిలోని గుడిసెలలో అగ్రి ప్రమాదం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా తగలబెట్టారా... ప్రమాద వశాత్తు జరిగిందా... అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీసీపీ ప్రవీణ్‌కుమార్, సీఐ నాగరాజుగౌడ్, ట్రాఫిక్ సీఐలు శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు సందర్శించారు.ఈ ప్రమాదంపై అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. గుడిసెలు తగులబడి సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకుంటామన్నారు. నివేదికను జిల్లా కలెక్టర్‌కు పంపుతామన్నారు. -
ఎట్టకేలకు.. నగరాన్ని వీడిన ఓ పాకిస్థానీ
సాక్షి,హైదరాబాద్: పాకిస్థాన్ నుంచి షార్ట్ టర్మ్ వీసాపై (ఎస్టీవీ) నగరానికి వచ్చిన నలుగురు పౌరుల్లో ఒకరు శనివారం వెళ్లిపోయారు. సిటీ పోలీసులు నోటీసులు జారీ చేయడంతో విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు. మిగిలిన ముగ్గురూ ఆదివారం వెళ్లిపోయే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర దేశంలో ఉన్న పాకిస్థానీయుల వీసాలు రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతానికి ఎస్టీవీ కేటగిరీకి చెందిన వారిని ఆదివారం లోపు పంపాలంటూ కేంద్రం ఆదేశించింది. దీంతో నగర పోలీసులు శనివారం ఆ నలుగురికీ నోటీసులు జారీ చేశారు. వీరిలో ఓ పురుషుడు, ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. పురుషుడు, ఓ మహిళ వేర్వేరుగా సిటీకి రాగా... తన చిన్నారితో మరో మహిళ వచ్చారు. శనివారం పురుషుడు శంషాబాద్ విమానాశ్రయం నుంచి విమానంలో దుబాయ్ వెళ్లిపోయాడు. నగరంలో ఉన్న 199 మంది పాకిస్థానీల్లో ఈ నలుగురే ఎస్టీవీతో వచ్చారు. సైబరాబాద్‌లో ఉంటున్న 11 మంది లాంగ్ టర్మ్ వీసా (ఎల్టీవీ)తోనే ఉంటుండటంతో వారికి ప్రస్తుతం నోటీసులు జారీ చేసే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారు. ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన అన్నదమ్ముల్ని వివాహం చేసుకున్న అక్కాచెల్లెళ్లు లాంగ్ టర్మ్ వీసాపై ఉంటున్నారు. వీరి వీసా గడువు సెపె్టంబర్ వరకు ఉండటంతో పాటు కేటగిరీ వేరు కావడంతో వీరిని పంపే ఆస్కారం లేదని తెలుస్తోంది. ఇక్కడి యువకుడు దుబాయ్‌లో ఉండగా అతడిని ప్రేమ వివాహం చేసుకున్న మరో పాకిస్థానీ ప్రస్తుతం భర్తతో కలిసి వాసవీ కాలనీలో నివసిస్తున్నారు. ఈమె లాంగ్‌టర్మ్ వీసా గడువు గతంలోనే ముగిసిపోయింది. భర్తతో కలిసి జీవిస్తున్న తనకు వీసా పొడిగించకపోవడాన్ని సవాల్ చేస్తూ ఈ మహిళ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉండటంతో ఆమె విషయంలోనూ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నిఘా విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం కేంద్రం నుంచి కేవలం షార్ట్ టర్మ్ వీసాలు ఉన్న వారికే నోటీసులు జారీ చేయాలనే ఆదేశాలు ఉన్నాయి. లాంగ్‌టర్మ్ వీసాలు ఉన్న వారికి సంబంధించి ఎలాంటి స్పష్టత లేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి వచ్చే తదుపరి ఆదేశాలను బట్టి వీరిపై నిర్ణయం తీసుకుంటాం’ అని అన్నారు. -
రూ. 10,000 కోట్లు దాటేసిన డీఎస్ గ్రూప్
న్యూఢిల్లీ: దేశీ ఎఫ్ఎంసీజీ కంపెనీ ధరమ్‌పాల్ సత్యపాల్(డీఎస్) గ్రూప్ నాలుగేళ్లలో ఆదాయాన్ని రెట్టింపునకు పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకు వీలుగా మొత్తం రూ. 3,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. తద్వారా శత వసంతాలు పూర్తి చేసుకోనున్న 2029కల్లా రూ. 20,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.దీనిలో భాగంగా ఆతిథ్యం, ఆహారం, పానీయాల విభాగాలలో ఇతర సంస్థలను కొనుగోలుచేసే అవకాశాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా కార్యకలాపాలను వేగంగా విస్తరించే వ్యూహాలపై దృష్టిపెట్టినట్లు వివరించారు. గతంలో నమిలే పొగాకు ఉత్పత్తులతో ప్రసిద్ధమైన కంపెనీ వీటిని టర్నోవర్‌లో 10 శాతానికంటే తక్కువకు పరిమితం చేసినట్లు తెలియజేశారు.మార్చితో ముగిసిన గతేడాది(2024–25) సాధించిన రూ. 10,000 కోట్ల ఆదాయంలో వీటి వాటా 10 శాతంకంటే తక్కువేనని, అయితే ఈ విభాగం నుంచి పూర్తిగా వైదొలగబోమని స్పష్టం చేశారు. ఆహారం, పానీయాల నుంచి 42 శాతం సమకూరినట్లు వెల్లడించారు. -
ఆల్‌ఫ్రీ ఊరు
అనగనగనగా ఒక ఊరు. ఆ ఊరిలోకి వెళ్లి ఉంటామంటే చాలు. మీకు కావాల్సిన ఇంటిని, కావాల్సిన రీతిలో ప్రభుత్వమే కట్టి ఇస్తుంది. అది కూడా ఉచితంగా.. అర్జెంటుగా ఏదైనా ఇల్లు కొనుక్కోవడానికి కూడా అవసరమైన డబ్బు కూడా ఇస్తుంది. అది కూడా అంతా ఇంతా కాదు, దాదాపు రూ. 94 లక్షలు. నిజం, ఉత్తర ఇటలీలోని ట్రెంటినో ప్రాంత గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి లక్ష యూరోలు (సుమారు రూ. 94 లక్షలు) ఇవ్వనున్నట్లు అక్కడి ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఎందుకంటే, అక్కడి గ్రామాల్లోని ప్రజలు పట్టణాలకు వెళ్లిపోతుండటంతో, ప్రస్తుతం అక్కడ అన్నీ పాడుబడిన ఇళ్లే కనిపిస్తున్నాయి తప్ప, జనాలెవరూ లేరు. దీంతో, ఇప్పుడు ఆ గ్రామాలన్నీ జనాభా తగ్గి.. ఆర్థికంగా, సామాజికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇలా దాదాపు 33 గ్రామాలు ఉన్నాయి. అందుకే, ఈ సమస్యను పరిష్కరించడానికి ఇటలీ ప్రభుత్వం ఆ గ్రామాల్లో స్థిరపడాలనుకునే వారికి ఈ నజరానా ఇస్తోంది. అయితే ఈ డబ్బును వారు కేవలం, అక్కడ ఉండే ఇల్లు కొనుక్కోవడానికి లేదా మరమ్మతులకు మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వ్యాపారం, వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఈ డబ్బును ఉపయోగించవచ్చు. అయితే, 45 ఏళ్ల లోపు ఉన్న ఇటలీవాసులతోపాటు విదేశాల్లో ఉన్న ఇటాలియన్లకు మాత్రమే దీనికి అర్హులు. -
డిజిటల్ కామర్స్‌కు నియంత్రణ సంస్థ ఉండాలి
న్యూఢిల్లీ: పోటీ సంస్థలను దెబ్బతీసే విధమైన ధరలు నిర్ణయిస్తున్నాయని, భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయని, గిగ్ వర్కర్ల శ్రమ దోపిడీ చేస్తున్నాయని ఈ–కామర్స్, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాంలపై ఆరోపణలున్న నేపథ్యంలో వాటిని పర్యవేక్షించేందుకు స్వతంత్ర డిజిటల్ కామర్స్ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ కేంద్రాన్ని కోరింది.వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం కింద నేషనల్ ఈ–కామర్స్ పాలసీ, ఈ–కామర్స్ నిబంధనలను సత్వరం ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది. ఆన్లైన్లో కొనుగోళ్లు చేయడం లగ్జరీగానే పరిగణించవచ్చు కాబట్టి ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారా విక్రయించే ఉత్పత్తులపై ప్రస్తుత జీఎస్టీ నిబంధన ప్రకారం ’లగ్జరీ ట్యాక్స్’ విధించాలని సీఏఐటీ పేర్కొంది.లాభదాయకత లేకపోవడంతో గత రెండు, మూడేళ్లలో 10 లక్షల పైగా కిరాణా దుకాణాలు మూతబడ్డాయని ఆలిండియా కన్జూమర్ ప్రోడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ ఫెడరేషన్ (ఏఐసీపీడీఎఫ్) నేషనల్ ప్రెసిడెంట్ ధైర్యశీల్ పాటిల్ తెలిపారు. ఈ వ్యవధిలో కొత్తగా ప్రారంభమైన స్టోర్లతో పోలిస్తే మూతబడినవే ఎక్కువని వివరించారు. -
మరో ఉగ్రవాది ఇంటిని బాంబు పెట్టి లేపేశారు
జమ్మూ: పహల్గాం ఉగ్ర దాడితో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న భారత్ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదల ఏరివేతే లక్ష్యంగా కార్యకలాపాల్ని ముమ్మరం చేస్తోంది ఇందులో భాగంగా అనుమానిత ఉగ్రవాదుల స్థావరాల్ని గుర్తించి, బాంబులతో నేలమట్టం చేస్తోంది. శనివారం పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వా ఇంటిని భద్రతా బలగాలు బాంబులతో ధ్వంసం చేశాయి. గత మంగళవారం (ఏప్రిల్22న) పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ దాడికి పాల్పడ్డ ముష్కరులు, వారి మద్దతు దారుల్ని గుర్తించే పనిలో పడ్డాయి భారత భద్రతా బలగాలు. పనిలో పనిగా ఉగ్రవాదుల ఇళ్లను, స్థావరాల్ని గుర్తిస్తున్నాయి. ఈ తరుణంలో 48 గంటల నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న కీలక ఆపరేషన్‌లో భారత భద్రతా బలగాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురు ఉగ్రవాదులు, వారికి ఆశ్రయం కల్పించిన వారి స్థావరాల్ని గుర్తించాయి. #BREAKING: House of Lashkar-e-Taiba terrorist Farooq Ahmed Tadwa destroyed. Tadwa a resident of Narikoot Kalaroos, Kupwara (North Kashmir) is, now in Pakistan and works with the Pakistan Army to target innocent civilians in Kashmir. pic.twitter.com/O5v4Xnrio5— Tejinder Singh Sodhi (@TejinderSsodhi) April 26, 2025 పీవోకేలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వాశనివారం సముద్రమట్టానికి 5,300 మీటర్ల ఎత్తులో ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతమైన కుప్వారా జిల్లా కలరూస్ ప్రాంతాన్ని భద్రతాబలగాలు జల్లెడ పట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాది ఫరూఖ్ అహ్మద్ తడ్వా ఇంటిని గుర్తించాయి. బాంబులతో ధ్వంసం చేశాయి. 60 ప్రాంతాల్లో దాడులు అటూ శ్రీనగర్‌లోనూ ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శనివారం శ్రీనగర్‌లో ఏకకాలంలో 60కి పైగా ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ విభాగ అధికార ప్రతినిధులు వెల్లడించారు. తాము జరిపిన దాడుల్లో వెపన్స్ సీజ్ చేయడం,కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోవడం, డిజిటల్ డివైజ్‌ల గుర్తింపు, దేశ భద్రతకు విఘూతం కలిగించేందుకు వినియోగించే వస్తువుల్ని, వాటి ఆధారాల్ని సేకరించినట్లు చెప్పారు. అలాంటి వారిని ఉపేక్షించబోంఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ పోలీసులు ఉగ్రవాదానికి మద్దతిచ్చే అన్నీ వ్యవస్థల్ని గుర్తించి వాటిని నిర్విర్యం చేస్తున్నాం. ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వారికి, దేశ భద్రతకు విఘూతం కలిగించే ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని హెచ్చరించారు. -
వేసవి అంటే సెలవులేనా?
వేసవి కాలం వచ్చిందంటే చాలామంది టీనేజర్లు మెల్లగా మధ్యాహ్నం లేచి, తాపీగా రీల్స్ చూసుకుంటూ, సాయం కాలం క్రికెట్ ఆడుతూ కాలం గడిపేస్తుంటారు. కాని, కాస్తంత మనసు పెడితే ఈ వేసవిని మీ మైండ్‌సెట్‌ను మార్చుకునే అద్భుత అవకాశంగా మలచుకోవచ్చు. మెరుగైన ఫోకస్, స్పష్టమైన లక్ష్యాలు, కొత్త స్కిల్స్, నిజమైన ఆత్మవిశ్వాసం గల మీ బెస్ట్ వెర్షన్‌గా మారవచ్చు. అందుకోసం ‘ఎస్.టి.ఏ.ఆర్’ను ఫాలో అయితే సరి.సిట్యుయేషన్ వేసవి సెలవుల వాస్తవంవేసవి అనేది తెల్లవారుఝాము వరకు నెట్‌ఫ్లిక్స్ చూస్తూ, మధ్యాహ్నం వరకు నిద్రపోయే టైమ్ మాత్రమే కాదు. మీ జీవితాన్ని మార్చుకునే టర్నింగ్ పాయింట్ కూడా! వేసవి అంటే మూడు అద్భుతమైన అవకాశాలు:రీచార్జ్: ఎనర్జీ లెవల్స్‌ని తిరిగి రీచార్జ్ చేసుకునే అవకాశంరిఫ్లెక్ట్: మీ అభిరుచులు, ఆలోచనలు గురించి అర్థం చేసుకునే అవకాశంరీ ఇన్వెంట్: మీరు కొత్తగా రూపుదిద్దుకునే అవకాశంథాట్ నిన్ను నీవు తెలుసుకోవడంఈ వయస్సులో మీ మనస్సు ఐడెంటిటీ కోసం వెతుకుతుంది. ‘నేనెవరు?’, ‘ఏం చేస్తే నా జీవితానికి అర్థం వస్తుంది?’ అన్న ప్రశ్నలు రోజూ మనసులో తిరుగుతుంటాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకునేందుకు ఈ వేసవిని ఉపయోగించుకోండి. అందుకోసం ఐదు విషయాల్లో క్లారిటీ తెచ్చుకోవాలి.ప్యాషన్స్: నాకు నిజంగా ఏది ఇష్టం? ఫియర్స్: నన్ను వెనక్కి లాగుతున్న భయాలు ఏవి?స్ట్రెంగ్త్స్: నా మానసిక బలాలేంటి?హ్యాబిట్స్: నేను రోజూ చేసే పనులు నన్ను ముందుకు నడిపిస్తున్నాయా? నాశనం చేస్తున్నాయా?విజన్: వచ్చే రెండు మూడేళ్లలో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను?యాక్షన్ ఐదు వారాల చాలెంజ్ఈ వేసవిలో వారానికో చాలెంజ్ చొప్పున ఐదు వారాలు ఐదు చాలెంజŒ లు స్వీకరించండి. ఇవేవీ స్కూల్లో, కాలేజీలో కనిపించేవి కావు, బోధించేవీ కావు. కానీ మీ జీవితాన్ని సంతోషమయం చేస్తాయి. మొదటివారం డిజిటల్ డీటాక్స్. అంటే స్క్రీన్ టైమ్‌ను రోజుకు మూడు గంటలకే పరిమితం చేయడం. నిద్రకు గంట ముందు, నిద్రలేచాక గంటపాటు స్మార్ట్‌ఫోన్ ముట్టుకోకుండా ఉండటం. రోజూ 15 నిమిషాలు డీప్ బ్రీతింగ్ లేదా ధ్యానం ప్రాక్టీస్ చేయడం. దీనివల్ల మీ మెదడులో డోపమైన్ బ్యాలెన్స్ అవుతుంది. క్లారిటీ, మోటివేషన్ పెరుగుతుంది. రెండో వారం మీకు నచ్చిన సబ్జెక్ట్ లేదా హాబీని ఎంచుకుని, రోజుకో రెండు గంటలపాటు దానిపై పనిచేయండి. ఇలా డీప్ వర్క్ చేయడం వల్ల మీ ఫోకస్, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. మూడోవారం రాత్రి నిద్రకు ముందు పదినిమిషాలు డైరీ రాయండి. ఈరోజు హైలైట్స్ ఏమిటి? నన్ను ఏది ఇన్స్పైర్ చేసింది? రేపు ఏం మెరుగుపరచుకోవాలి? ఇలా రాయడం వల్ల మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌ని పెంచుతుంది.నాలుగోవారం ఐదు బేసిక్ లైఫ్ స్కిల్స్ నేర్చుకునేందుకు ఉపయోగించండి. మనీ మేనేజ్మెంట్కనీసం రెండు మూడు వంటలు నేర్చుకోవడంఒక లోకల్ ట్రిప్ ప్లాన్ చేయడంప్రాథమిక చికిత్స నేర్చుకోవడంమీకు నచ్చిన సబ్జెక్ట్‌పై మూడు నిమిషాలు మాట్లాడటంఐదోవారం కనెక్షన్ వీక్. ఒక రోజంతా కంప్లయింట్ చేయకుండా గడపండి. కుటుంబ సభ్యులతో సరదాగా మాట్లాడండి. మీ అవ్వాతాతలతో కూర్చుని మాట్లాడండి, వాళ్లు చెప్పేది వినండి. అలాగే దగ్గరలో ఉన్న పిల్లలకు మీకు తెలిసింది నేర్పించండి. ఇలా చేయడం మీ బంధాలను బలపరచడమే కాకుండా, మీకు నిజమైన ఆనందాన్నిస్తుంది.రిజల్ట్ కొత్త నువ్వుఈ వ్యాసంలో చెప్పినవన్నీ పాటిస్తే ఈ వేసవి ముగిసేసరికి నీ గురించి నీకు స్పష్టత వస్తుంది. చిన్న చిన్న లక్ష్యాలు పూర్తి చేయడం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది. మెదడులో డోపమైన్ వ్యసనం తగ్గి, ఫోకస్ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో బంధం బలపడుతుంది. నిన్ను నువ్వే మెచ్చుకునేలా మారిపోతావు. ఆల్ ది బెస్ట్!సైకాలజిస్ట్ విశేష్ www.psyvisesh.com(చదవండి: సివిల్స్‌లో సక్సెస్ కాలేదు.. కానీ బిజినెస్‌లో ఇవాళ ఆ ఇద్దరూ..!) -
కాలి నడకన తిరుమలకు కేజీఎఫ్ బ్యూటీ, నాని.. వీడియో వైరల్
నాని, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన చిత్రం హిట్-3. ఈ మూవీ హిట్ సిరీస్ డైరెక్టర్ శైలేశ్ కొలను దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మేడే సందర్భంగా 1వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే మూవీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవ సమయంలో స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.కాగా.. అంతకుముందు కాలి నడకన శ్రీవారి మెట్లు ఎక్కి తిరుమలకు చేరుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దర్శన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కాగా.. ఈ చిత్రంలో నాని అర్జున్ సర్కార్ పాత్రలో అభిమానులను మెప్పించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ చూస్తే ఫుల్ వయోలెన్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. Exclusive visuals of @NameisNani , @SrinidhiShetty7 reaching at Tirumala Tirupati Devasthanam on foot #HIT3 #NaturalStarNani pic.twitter.com/eqztW8zfit— Telugu Film Producers Council (@tfpcin) April 26, 2025 -
ఈ వారం కథ: సమయానికి తగు..
‘నేను ఆఫీసుకి వెళుతున్నా. మన పుత్రరత్నం స్టేడియం నుంచి రాగానే, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి రవీంద్ర వాళ్ళ ఆఫీస్ ఇంటర్వ్యూ గుర్తు చేసి పంపండి’ ఆఫీస్‌కు వెళుతూ భర్తతో చెప్పింది భార్గవి. అప్పుడు సమయం ఉదయం ఎనిమిదిన్నర అవుతోంది.‘సర్లే, పంపిస్తాను’ చెప్పాడు భర్త శ్యామలరావు.‘ఈరోజు ఒక్కరోజు ప్రాక్టీస్ లేకపోయినా ఏమీ కాదు అంటున్నా, త్వరగానే వస్తా అంటూ వెళ్ళాడు. ఇది రవీంద్ర రిఫరెన్స్ తో వచ్చిన అవకాశం. పోగొట్టుకుంటే నాకు నామర్దా. మరోసారి ఎవరినీ అడగలేం కూడా’ చెప్పుల్లో కాళ్ళు పెడుతూ అన్నది భార్గవి.‘నువ్వేం టెన్షన్ పడకు. నే పంపిస్తాగా వాడిని. నువ్వు ఎక్కువ అలోచిస్తావు అనవసరంగా’ చదువుతున్న పేపర్ మడిచి అన్నాడు శ్యామలరావు.‘నేనా ఎక్కువ ఆలోచించేది?’ అన్నట్లు భర్త వైపు ఒక చూపు చూసి ఇంటి గేట్ వైపు నడిచింది భార్గవి. చాలాసార్లు ఆమె కళ్లే మాట్లాడతాయి.శ్యామలరావు ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో పనిచేసి సంవత్సరం క్రితం ఉద్యోగ విరమణ పొందాడు. వచ్చే ఏడాది భార్గవి కూడా తను చేసే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం నుంచి బయటపడి విశ్రాంత జీవితపు సుఖాన్ని పొందబోతోంది. వాళ్ళకి ఇద్దరు పిల్లలు– మొదటి సంతానం ఆడపిల్ల ధన, ఏడేళ్ల తర్వాత పుట్టిన మగపిల్లాడు సంతోష్! ధన తొంభై దశకం మొదట్లో పుట్టడంతో ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ల నీడ పడక ముందే బిట్స్ పిలానీలో చదువు, మంచి ఉద్యగం, తదుపరి పెళ్లి అన్నీ నల్లేరు మీది నడకగా సాగినాయి. ఇప్పుడు కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది.సంతోష్ చదువు డిగ్రీ కాలేజ్ స్థాయికి రాకుండానే ఆండ్రాయిడ్ ఫోన్ చేతికి రావడం, సోషల్ మీడియా వానమబ్బులా కమ్మేయడం జరిగిపోయాయి. అతని ఆలోచనలు, భావాలు పాతతరం మూసకొట్టుడు విద్యార్థిలాగా కాక, ప్రత్యేక మార్గం వైపు వెళ్లసాగాయి. అందుకే అతను ఇంజనీరింగ్ డిగ్రీ వైపు కాకుండా తన చదువును క్రియేటివ్ ఆర్ట్స్ వైపు సాగించాడు. ఫోటోగ్రఫీ, ఎడిటింగ్, యానిమేషన్ రంగాలలో చదువును సాగిస్తూ, వ్యక్తిత్వ వికాస రంగంలోనూ, అదనంగా బ్యాడ్మింటన్ ఆటలోనూ ప్రావీణ్యం పొందసాగాడు. స్నేహితులు, వాళ్ళతోనే ఎక్కువ సమయం గడిపే కొడుకును చూసి భార్గవి, అతని భవిష్యత్తు గురించి చింత పడసాగింది. తనయుడిలోని చురుకుతనం, స్నేహ గుణం, బాధ్యతాయుత ప్రవర్తన చూసిన శ్యామలరావు అతని గురించి దిగులు లేకపోగా గర్వపడతాడు. తనకో సుందర సౌఖ్య ప్రపంచాన్ని సంతోష్ ఏర్పరచుకోగలడని శ్యామలరావు విశ్వాసం.మరో అరగంటకి సంతోష్ ఇంటికి వచ్చాడు. వస్తూనే శ్యామలరావు భార్గవి చెప్పమన్నది అంతా ఆమె చెప్పినట్టే చెప్పాడు. చెప్పి, ‘ఈ ఇంటర్వ్యూ సంగతి ఏమవుతుందో ఏమో కానీ, అమ్మ దాన్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది’ అన్నాడు.‘అటెండ్ అవగానే వచ్చేస్తాయా ఉద్యోగాలు? ఆమె ఇప్పించిన చా¯Œ ్సతో ఉద్యోగం తెచ్చుకోకపోతే నేనొక పనికిమాలిన వాడినని, అసమర్థుడినని ప్రూవ్ అయినట్టా? నా ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండా ఇది ఏర్పాటు చేసింది. నిజానికి ఆ కంపెనీ మంచిదే. వాళ్ళు తీసుకునేది అకడమిక్ రికార్డ్స్ కూడా చూసి. నేను ఆ కోవలో లేను. నాదంతా ఎక్స్ట్రా వ్యాపకాలే! అమ్మ ఇది తెలుసుకోవడం లేదు’ అన్నాడు సంతోష్. మధ్యలో ధన కల్పించుకొని ‘నువ్వు ముందు ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకో, నచ్చకపోతే చెయ్యడం మానెయ్. అప్పుడు ఎవరికీ ఇబ్బంది ఉండదు’ చెప్పింది.‘నువ్వు ఎప్పుడైనా నన్ను సపోర్ట్ చేశావటే! నీకూ నాకూ మధ్య ఒక జనరేషన్ తేడా ఉంది తెలుసుకొని మాట్లాడు’ అక్కని దెప్పాడు సంతోష్.‘అది నిజమే కాని, నువ్వు ఒక రోడ్ మ్యాప్ లేకుండా, నాలుగింటిలో వేళ్ళు పెడుతుంటే ఏమనుకోవాలి?’ సంతోష్‌ను నిలదీసింది ధన.‘ఇప్పుడు ఇంటర్వ్యూకు వెళ్ళేముందు ఈ వాదనలొద్దు’ ఇద్దరికీ అడ్డువచ్చాడు శ్యామలరావు.‘నాన్నా! అమ్మతో ఇబ్బంది ఏంటో తెలుసా? తాను పెర్ఫెక్ట్ పేరెంట్ అనిపించుకోవాలని. కాని, నాకు అన్నీ టైమ్ టేబుల్ గీసుకొని చేస్తుండే పర్ఫెక్ట్ చైల్డ్ అన్పించుకోవాలని మాత్రం లేదు. ఇది అమ్మకి అర్థం కావడం లేదు. మీ ఆలోచనలతో నేను బతకను. నా ఆలోచనలతోనే నేను బతకాలి. కష్టమైనా నష్టమైనా నేనే దానికి బాధ్యుడిని’ చేతిలోని కప్పు బద్దలు కొట్టినట్టు డైనింగ్ బల్లమీద పెడుతూ చెప్పాడు సంతోష్. చెప్పడమే కాకుండా చివాలున లేచి తన రూంలోకి వెళ్ళి తలుపు వేసేశాడు.మరో గంటకి బయటకు వచ్చి ఇంటర్వ్యూకి వెళుతున్నట్టు శ్యామలరావుకి చెప్పి వెళ్ళాడు.∙∙ అది హై టెక్ సిటీ– గచ్చిబౌలిలకు వెళ్ళే మార్గం. ఉదయం ఆఫీసులు మొదలయ్యే వేళల్లో రోడ్లన్నీ ఒకవైపు కిక్కిరిసి పోతాయి. పెరిగిన వాహన రద్దీని క్రమబద్ధీకరించే ప్రయత్నాలలో భాగంగా కట్టే ఫ్లై–ఓవర్లలో ఒకటి ఆ మార్గంలో కూడా కడుతున్నారు. కట్టేటప్పుడు దారంతా పరుచుకుపోయిన సామాన్లతో ఆ దారిన పోయే వాహనాలకు అటు వెళ్ళడమే నరకప్రాయం. అది తప్పించుకోవడానికి అడ్డదారులు పడుతుంటారు వాహనదారులు. ఆ అడ్డదారుల్లో రద్దీని క్రమబద్ధీకరించేందుకు ట్రాఫిక్ పోలీసులు ఉండరు. ఆ దారులు ప్రతివాడి ఇష్టారాజ్యం. ఇంటర్వ్యూకి ఆలస్యం అవకూడదని సంతోష్ అటువంటి అడ్డదారినే ఎంచుకున్నాడు. అది మట్టి రోడ్డు దారి. ఆ దారి మధ్యలో ఒకచోట పైనుండి రైలు వెళ్ళే వంతెన ఒకటి వస్తుంది. ఆ దారంతా, మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న పెద్ద రోడ్డును కలిసే వరకూ, చాలా సన్నగా, అడ్డంగా మూడు కార్లు పట్టేంత స్థలం కలిగి ఉంటుంది. ముందురోజు రాత్రి వర్షం పడడంతో అక్కడక్కడా నీటి మడుగులు ఏర్పడ్డాయి. రైలు వంతెన కొద్ది దూరంలో ఉందనగా ట్రాఫిక్ జామ్ అయి ఉంది. వంతెనకు అటూ ఇటూ వాహనాలు నిలిచి ఉన్నాయి. అక్కడకు వచ్చిన సంతోష్ ముందుకు వెళ్ళలేకపోయాడు. ఐదు నిమిషాలలో సర్దుకుంటుందిలే అని తన మోటార్ సైకిల్ ఇంజన్ ఆపాడు. చూస్తుండగానే తన వెనక చాలా బండ్లు వచ్చి చేరినయ్. ఐదు నిముషాలు గడిచినా ఎక్కడి బండ్లు అక్కడే ఆగిపోయి ఉన్నాయి. అసహనపు మానవులు కొంతమంది హారన్లు మోగిస్తున్నారు అదేపనిగా! తను ఇప్పుడు వెనక్కి కూడా వెళ్ళలేక పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడయ్యాడు.సంతోష్ మొబైల్ తీసి టైమ్ చూశాడు– ఇంకా ఇరవై నిముషాలే ఉంది తన ఇంటర్వ్యూకి. బండ్లు అస్తవ్యస్తంగా ఇరుక్కుండి పోయాయి. ఆ మార్గం ఎంచుకున్నందుకు తనను తాను తిట్టుకున్నాడు.∙∙ వాహన రద్దీని అంచనా వేయకుండా అదే మార్గం ఎంచుకు వచ్చిన చంద్రకాంత్ కారు వెనక సీటులో అసహనంగా కదులుతున్నాడు ఇరుక్కుపోయిన వాహనాలను తిట్టుకుంటూ. చంద్రకాంత్ ఒక ఐటీ కంపెనీ యజమాని. అతను గచ్చిబౌలిలో ఉన్న ఒక నక్షత్ర హోటల్‌కి వెళ్లి అక్కడి నుంచి ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకొని విమానాశ్రయం వెళ్ళాలి. ఆ వ్యక్తులు చంద్రకాంత్ కంపెనీలో పెట్టుబడులు పెట్టడానికి ముందు జరిపే పరిశీలనలు చెయ్యడానికి వచ్చారు ముంబై నుంచి. వారిని విమానాశ్రయానికి సమయానికి చేర్చలేకపోతే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా పావుగంటలో తను హోటల్ చేరాలి.ఒక వరుస పాటించకుండా కొన్ని కార్లు పక్క నుంచి ముందుకు వెళ్ళి అడ్డంగా ఆగిపోతూ ట్రాఫిక్ నియంత్రణను మరింత జటిలం చేస్తున్నాయి. కొంచెం సందు దొరికిన వైపు ద్విచక్ర వాహనాలు దూరిపోతున్నాయి. చంద్రకాంత్ డ్రైవర్ని ‘వేరే దారి లేదా’ అని అడిగాడు అనాలోచితంగా. అది తనక్కూడా తెలుసు వేరే దారి లేదని. డ్రైవర్ నుంచి కూడా అదే సమాధానం. చంద్రకాంత్ కారు దిగి చూశాడు. ముందు వైపు కంటే వెనకవైపు భారీగా ఆగినయ్ వాహనాలు. అంటే తను ముందుకే వెళ్ళాలి తప్ప, వెనక్కి తిరిగి అస్సలు వెళ్ళలేడు. చంద్రకాంత్ మనసులో అలజడి మొదలైంది– ఇప్పుడు ఎలా బయటపడడం అన్నదాని గురించి.ఇంతలో తన కారు వెనక నుంచి ఒక యువకుడు నోటిలో వేళ్ళు పెట్టి ఈల వేసుకుంటూ వాహనాల మధ్యగా ముందుకు నడవ సాగాడు. మధ్యలో జనాన్ని ఉద్దేశించి పెద్దగా అంటున్నాడు ‘ప్లీజ్ రండి. ట్రాఫిక్ క్లియర్ చేద్దాం! అందరం అట్లా కూర్చుని ఉంటే ఇవాళంతా ఇక్కడే ఉంటాం. మనలో కొందరు వెహికల్స్ వదిలి రండి’– అలా అంటూ చంద్రకాంత్‌ను దాటుతూ, అతను ‘సార్! ప్లీజ్ రండి సార్!’ అంటూ పిలిచాడు. చంద్రకాంత్ తన డ్రైవర్ని ఆ యువకుడి సహాయానికి పంపి, తను స్టీరింగ్ ముందు కూర్చున్నాడు. చూస్తుండగానే, తమ స్కూటర్ రోడ్డు పక్కన పార్క్ చేసి ఇద్దరు యువతులు ఆ యువకుడికి సహాయంగా ఉండడానికి వచ్చారు. యువతులను చూసి మరో ముగ్గురు ముందుకొచ్చారు. అతను విజిల్ వేస్తూ వాళ్ళకి సూచనలు ఇవ్వసాగాడు. అతణ్ణి అనుసరిస్తూ మిగిలిన వాళ్ళు ముందుగా అడ్డదిడ్డంగా ముందుకొచ్చిన ద్విచక్ర వాహనదారులకు చోటు కల్పించసాగారు. ఇంకొకళ్ళు వెళ్లి, వెనకవున్న వాళ్ళు సందు చేసుకొని ముందుకు రాకుండా ఆపసాగారు. ఆ యువకుడు తొందర పడుతున్న వాళ్ళని ఓపిక పట్టమని బతిమిలాడుతున్నాడు. ఇదంతా చూస్తున్న చంద్రకాంత్ ముచ్చటపడి తన మొబైల్ ఫోన్లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించసాగాడు.ద్విచక్ర వాహనాల తర్వాత దారికి అడ్డుపడుతున్న బండ్లను నియంత్రించసాగారు. అందులో భాగంగా ముందుగా గచ్చిబౌలి వైపు వెళ్లే బండ్లను వదలసాగారు. దానికి ఆ యువకుడు చెప్పిన కారణం– ఆఫీసులకు, ఎయిర్‌పోర్టుకు, హాస్పిటల్లకు వెళ్ళవల్సిన వాళ్లు అటే వెళ్ళాలి గనక. అందుకోసం రెండోవైపు వాళ్లకు అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళని ముందుకు రాకుండా ఆపగలిగాడు అతను. అతని సమయస్ఫూర్తికి చంద్రకాంత్ సంతోషపడ్డాడు, ఎందుకంటే తను వెళ్లాల్సిన హోటల్ కూడా అటే ఉండడంతో.మరికొద్ది సేపటికి చంద్రకాంత్ కారు మెల్లగా ముందుకు సాగడానికి వీలు కలిగింది. చంద్రకాంత్ వంతెన దాటుతూ ఆ యువకుడిని దగ్గరకు పిలిచి అతను చేస్తున్న సహాయానికి ధన్యవాదాలు తెలిపి ‘మే ఐ హావ్ యువర్ నంబర్ ప్లీజ్’ అన్నాడు. అతను చంద్రకాంత్‌ను అడిగి మొబైల్ తీసుకొని ముందుకు సాగుతున్న కారుతో నడుస్తూ తన వివరాలు నింపి ఇచ్చాడు. వంతెన దాటుతూనే డ్రైవర్ రావడంతో చంద్రకాంత్ తిరిగి అతనికి స్టీరింగ్ ఇచ్చి తను వెనక సీటులోకి మారాడు. చంద్రకాంత్ మనసుకు మెల్లగా ప్రశాంతత చేకూరింది. మేఘావృతమైన ఆకాశం ఒక్కసారిగా వర్షించసాగింది.వర్షం కూడా తగ్గి వాహనాలు సాఫీగా ముందుకు సాగుతూండడంతో సంతోష్ తన మోటర్ సైకిల్ ఎక్కి టైం చూశాడు. అప్పటికే తను గంట ఆలస్యంగా ఉన్నాడు. అక్కడి నుంచి మరో పదిహేను నిముషాలు ఇంటర్వ్యూ జరిగే ఆఫీస్ చేరడానికి, ఏ సమస్యా లేకపోతే. కానీ అలా జరగలేదు, మార్గమధ్యంలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ రెండూ తన సమయాన్ని మరికొంత మింగేయడం వల్ల! ఆఫీసు చేరి కనుక్కుంటే, అప్పటికే గ్రూప్ డిస్కషన్ ప్రక్రియ ముగియడంతో తనకు అవకాశం లేదని చెప్పడంతో వెనుదిరిగాడు.ట్రాఫిక్ జామ్ నుంచి బయటపడిన చంద్రకాంత్ హోటల్‌కి వెళ్లి, అక్కడి నుంచి ఆ ఇద్దరు వ్యక్తులను విమానాశ్రయంలో సకాలంలో దింపేవరకు కుదుటపడలేకపోయాడు. తర్వాత తిరిగి వస్తూ మొబైల్లో ట్రాఫిక్ జామ్ సమయంలో తను తీసిన వీడియో చూడసాగాడు. ఆ యువకుడు సమయానికి ముందుకు వచ్చి రద్దీని సడలించక పోయుంటే? ఆ వ్యక్తులకు ఇచ్చిన మాట ప్రకారం వెళ్ళలేకపోతే తన గురించి, తన కంపెనీ గురించి ఎంత చెడ్డ అభిప్రాయం కలిగేది? అది ఆలోచిస్తూనే చంద్రకాంత్‌కి పరంపరగా తప్పిపోయిన ముప్పు తాలూకు సంఘటనలు తారాడినయ్! వెంటనే చంద్రకాంత్ తను తీసిన వీడియోను, వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్‌లలో – ‘సాంఘిక బాధ్యత! ఆపద్బాంధవుడు’ శీర్షికతో పోస్ట్ చేశాడు. ఆ వెంటనే ఆ యువకుడి నంబర్‌కి ఫోన్ చేశాడు. ఫోన్ ఒక రింగ్ రాగానే కాల్ కట్ అయ్యింది. మళ్ళీ చేశాడు, ఈసారి రింగ్ వెళ్ళలేదు. బహుశా తీరుబడిగా లేడేమో అనుకుని, ‘వీలయితే తిరిగి కాల్ చెయ్యండి’ అని సందేశం పంపాడు.∙∙ సూర్యుడికి వీడ్కోలు చెప్పి చీకటి దుప్పటి కప్పుకుంటున్న సంధ్యలో, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే కూతురు ధనని అడిగింది భార్గవి ‘సంతోష్ వచ్చాడా? ఉన్నాడా?’‘మధ్యాహ్నం వచ్చి లంచ్ చేసి బయటకెళ్ళాడు. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోయి ఇంటర్వ్యూ మిస్ అయ్యానని చెప్పాడు’ చెప్పేటప్పుడు తల్లి ముఖంలో మారుతున్న రంగులు ధన దృష్టిని దాటిపోలేదు. ‘2019లో బ్రేక్ కావాలి అని పీజీ చదవడం పక్కన పెట్టాడు. తర్వాత రెండేళ్ళు కరోనా అన్నింటినీ, అందరినీ పక్కన పడేసింది, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు పక్కన పడేస్తున్నారు వీడిని’ అంటూ భార్గవి తన గదిలోకి విసురుగా వెళ్లి తలుపు వేసుకుంది.మరికాసేపట్లో బయటి నుంచి వచ్చిన శ్యామలరావు భార్గవి ఉన్న తమ గది మూసి ఉండడంతో కూతురు ధన గదిలోకి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ కూర్చున్నాడు. సంతోష్ ఇంటర్వ్యూ అటెండ్ అవలేకపోయిన సంగతి వాళ్ళ మాటల్లోని ప్రధాన అంశంగా మారింది కాసేపటికి. ‘వీడు మెయిన్ రోడ్లో వెళ్లి ఉన్నా బాగుండేది. షార్ట్ కట్ అంటూ అటుపోయి ట్రాఫిక్ జామ్ వల్ల అసలుకే మోసం తెచ్చుకున్నాడు. నేను వాడిని పల్లెత్తు మాట అననని భార్గవికి ముందే కోపం. ఇవాళ జరిగిన దానికి వాడినెలా సమర్థించగలను?’ నిట్టూర్చాడు శ్యామలరావు.‘మీరెందుకు మధ్యలో మాట్లాడడం? వాడే చెప్పుకుంటాడు అమ్మకు’ ధన తండ్రికి ఉపశమనం కలిగించే సలహా ఇచ్చింది.ఇంట్లో ఏర్పడుతున్న అసౌకర్య సందర్భాలు ఎలా, ఎంత త్వరగా ముగుస్తాయా అని శ్యామలరావు ఆలోచించసాగాడు. మొబైల్లో ఏదో సందేశం వచ్చిన శబ్దం రావడంతో తెరిచి చూశాడు శ్యామలరావు. తమ పరివారం గ్రూప్‌లో సంతోష్ పెట్టిన సందేశం– ‘నాకు ఉద్యోగం వచ్చిందోచ్! వివరాలు ఇంటికొచ్చాక!’ధన, భార్గవి కూడా ఆ సందేశం చూశారు. భార్గవి గదిలో నుంచి బయటకు వస్తూ,‘వీడు ఇంటర్వ్యూకే వెళ్ళలేదు, ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుంది?’ అంటూ ధన, శ్యామలరావు ఉన్న గదిలోకి వచ్చింది.‘విందాం వాడి నోటి నుండే’ అంది ధన.మరో పావుగంట తర్వాత చేతిలో ఐస్‌క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్‌తో ఇంటికి వచ్చిన సంతోష్ దాన్ని భార్గవి చేతికిస్తూ్త, ‘అమ్మా! నీకు ఇష్టమైన ఫ్లేవర్. నీ కోరిక తీరినందుకు’ అన్నాడు.‘ఎక్కడ ఉద్యోగం? ఏ కంపెనీ?’ అడిగింది ధన.‘అమ్మా వాళ్ళ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ కంపెనీలోనే’ సంతోష్ సమాధానం.‘ఇంటర్వ్యూ మిస్ అయ్యావుగా? ఆసక్తిగా ప్రశ్నించాడు శ్యామలరావు. భార్గవి మాత్రం పెదవి విప్పక – నేను వినడానికే ఉన్నాను – అన్నట్లు నిలబడి ఉంది.సంతోష్ చెప్పిన వివరం– నాకు మధ్యాహ్నం ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు ఒక కాల్ వచ్చింది. నేను తీయలేదు. తర్వాత నేనే చేశాను. అది మీ ఫ్రెండ్ కొడుకు రవీంద్ర వాళ్ళ సీఈవో నంబర్. ఇంటర్వ్యూకి ఎందుకు రాలేదు అని అడిగారు. ట్రాఫిక్ జామ్ గురించీ, తర్వాత వచ్చిన వర్షం గురించి చెప్పాను. ‘దగ్గర్లో ఉన్న కాఫీ షాప్‌కి వస్తే అక్కడ ఇంటర్వ్యూ చేస్తాను రాగలరా? ఇది మీకు మరో అవకాశం, మీరు ట్రాఫిక్ జామ్‌లో ఉండిపోయారు గనక, అందులో మీ తప్పు ఏమీ లేదని నేను నమ్మడం వలన!‘ అన్నాడు ఆయన. ఎగిరి గంతేసి సరే అన్నాను. సాయంత్రం ఆరు గంటలకు మీటింగ్ నిర్ణయించారు. నేను ఐదు నిమిషాల ముందే వెళ్లి ఒక పక్కన వేచి వున్నాను. మరో రెండు నిముషాలకి సూట్ వేసుకున్న ఒకాయన నా దగ్గరకు వచ్చి, చెయ్యి కలిపి నన్ను పేరుపెట్టి పిలుస్తూ రవీంద్ర వాళ్ళ కంపెనీ సీఈవోగా పరిచయం చేసుకున్నాడు. ఎక్కడో చూసినట్లు అంపించినా గుర్తురాక, ‘నా పేరు మీకెలా తెలుసు?’ అన్నాను ఆశ్చర్యంగా.‘మీ అప్లికేషన్లో ఉందిగా’ అంటూ కోటు జేబులోంచి నా అప్లికేషన్ తీసి చూపిస్తూ, ఒక టేబుల్ వైపు నడిచాడు. ఆయన వెనకాలే నేను వెళ్లి కూర్చున్నాను. ఆయన చెప్పాడు, ‘పొద్దున అదే ట్రాఫిక్ జామ్‌లో నేను కూడా ఇరుక్కుపోయా! చాలా అర్జెంట్ పనిమీద వెళుతున్నాను. ఆ రద్దీలో దేవుడు పంపినట్టు సమయానికి మీరు వచ్చి చొరవ తీసుకొని ట్రాఫిక్‌ను నియంత్రించి ఉండకపోతే, నా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం నేను చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయి ఉండేవాడిని. మీ సాంఘిక బాధ్యతా ప్రవృత్తి నన్ను ముగ్ధుణ్ణి చేసింది. నా పేరు చంద్రకాంత్. మీ నంబర్ నా ఫోన్లో మీరే ఫీడ్ చేశారు. అప్పుడు సూట్లో లేను. అందుకేనేమో ఇప్పుడు గుర్తుపట్టలేక పోయారు. సంతోష్, మిమ్మల్ని మా కంపెనీలో సామాజిక బాధ్యతా విభాగానికి అధిపతిగా నియమిస్తున్నా! మీకు ఇష్టమైతే రేపే జాయిన్ అవ్వచ్చు. ఇంకొక మాట, నేను షూట్ చేసి పోస్ట్ చేసిన మీ ట్రాఫిక్ కంట్రోల్ ఇనీషియేటివ్ వీడియో వైరల్ అయ్యింది. వేలలో లైక్స్ వచ్చాయి. మిమ్మల్ని మా ఉద్యోగిగా చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది’.చెప్పడం ముగించిన సంతోష్‌ని శ్యామలరావు, భార్గవి, ధన ముగ్గురూ చుట్టేసి ఆ సమయాన్ని ఒక ఫొటోగా ఘనీభవించారు! -
శ్మశాన వాటికనూ వదలని జనసేన నేత.. తిరగబడిన స్థానికులు
సాక్షి, ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో కూటమి నాయకుల దౌర్జన్యానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. పట్టణంలోని ఎల్సీకేపురంలో దశాబ్దాలుగా ఉన్న శ్మశాన వాటికకు నకిలీ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసి కబ్జా చేసేందుకు జనసేన నాయకుడు తొండమాల రవి యత్నించడం కలకలం రేపింది. వివరాల ప్రకారం.. ధర్మవరం పట్టణంలోని ఎల్సీకేపురంలో సర్వే నంబర్ 649లో భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాల కోసం 30 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో రెండు ఎకరాలకుపైగా మిగులు భూమి ఉండటంతో 2002లో ప్రభుత్వం శ్మశాన వాటికకు కేటాయించింది. అప్పటి నుంచి శివారు ప్రాంత కాలనీ ప్రజలు శ్మశాన వాటికగా ఉపయోగించుకుంటున్నారు. అయితే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ స్థలంపై జనసేన నాయకుడు తొండమాల రవి కన్ను పడింది. ఈ రెండు ఎకరాల స్థలాన్ని తన బినామీల పేరిట అక్రమ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆపై ఆక్రమించుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో శనివారం జేసీబీలతో స్థలాన్ని చదును చేసేందుకు వెళ్లడంతో స్థానికులు అవాక్కయ్యారు. ఇది శ్మశాన వాటిక స్థలమని, ఎందుకు చదును చేస్తున్నారని ప్రశ్నించారు. తమ స్థలం అంటూ జనసేన నాయకుడు రవి చెప్పడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జేసీబీలను తీసుకెళ్లాలని భీష్మించారు. చదును పనులను అడ్డుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అనంతరం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో జనసేన నేత రవిపై స్థానికులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శ్మశాన వాటికను కాపాడాలని కోరారు. -
పద్మ–పిప్పలాదుల చరిత్ర
పద్నాలుగో మనువు ఇంద్రసావర్ణి. అతడి వంశంలో జన్మించిన అనరణ్యుడు చక్రవర్తిగా ఎదిగాడు. అతడు సప్తద్వీపాలను పరిపాలిస్తుండేవాడు. గొప్ప శివభక్తుడైన అనరణ్యుడు భృగుమహర్షిని బ్రహ్మగా చేసుకుని, వంద యజ్ఞాలను విజయవంతంగా పూర్తి చేసి, ఇంద్రపదవికి అర్హత పొందాడు. అయినా, స్వార్థరహితుడు కావడంతో ఇంద్రపదవిని తిరస్కరించాడు. అనరణ్యుడికి వందమంది కొడుకులు, పద్మ అనే ఒకే ఒక కూతురు కలిగారు. చక్రవర్తి దంపతులకు కొడుకులపై కంటే కూతురుపైనే ప్రేమ ఎక్కువ. పద్మకు యుక్తవయసు వచ్చింది. ఆమెకు వివాహం చేయాలని సంకల్పించి అనరణ్యుడు రాజులందరికీ స్వయంవరం కోసం ఆహ్వానపత్రాలు పంపాడు. ఇదిలా ఉంటే, లోకసంచారం చేస్తున్న పిప్పలాద మహర్షి ఒకనాడు ఒక గంధర్వుడు స్త్రీలతో జలక్రీడలు ఆడుతుండగా చూశాడు. ఆ దృశ్యం చూడటంతో పిప్పలాదుడికి వివాహం చేసుకోవాలనే కోరిక పుట్టింది. అప్పటి నుంచి తపస్సు మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. ఒకనాడు యథాప్రకారం పుష్పభద్రా నదిలో స్నానం చేస్తున్న పద్మను చూశాడు. ఆమె అందచందాలకు ఆకర్షితుడై, అక్కడే ఉన్న ఆమె చెలికత్తెలను వివరాలు అడిగి తెలుసుకున్నాడు. ఆమె అనరణ్య చక్రవర్తి కుమార్తె అని, త్వరలోనే ఆమెకు స్వయంవరం జరగబోతోందని చెలికత్తెలు చెప్పారు. పిప్పలాదుడు నేరుగా అనరణ్యుడి రాజసభకు వెళ్లాడు. అనరణ్యుడు అతడికి అతిథి మర్యాదలు చేశాడు. ‘రాజా! నీ కుమార్తె పద్మను నేను మోహించాను. నాకు ఆమెనిచ్చి వివాహం జరిపించు. లేకుంటే, నీ ఐశ్వర్యాన్ని క్షణంలో భస్మం చేస్తాను’ అన్నాడు. పిప్పలాదుడి కోరిక విని రాజసభలో ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. వారంతా అతడి తేజస్సు చూసి భయభ్రాంతులయ్యారు.వృద్ధుడైన పిప్పలాదుడికి సుకుమారి అయినా రాకుమార్తెను ఇవ్వడం ఇష్టంలేక రాజకుటుంబంలోని స్త్రీలందరూ రోదించడం ప్రారంభించారు. విపత్కరమైన ఈ పరిస్థితిలో ఏంచేయాలో అనరణ్యుడికి ఏమీ తోచలేదు. వెంటనే అతడు రాజగురువును, రాజపురోహితుడిని సంప్రదించాడు. ‘ఈ విపత్కర స్థితిలో ఆచరించదగిన ధర్మమేమిటో మీరే చెప్పండి’ అని వారిని అడిగాడు.‘ఒక్కరి కారణంగా సర్వనాశనం జరిగే పరిస్థితి తలెత్తినప్పుడు, ఆ ఒక్కరినీ త్యాగం చేసి, సర్వాన్నీ కాపాడుకోవాలి. ఇదే వేదధర్మం’ అని వారు చెప్పారు. రాజగురువు, రాజపురోహితుడు ఇచ్చిన సలహాపై అనరణ్యుడు తన కూతురు పద్మను పిప్పలాదుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం తర్వాత పిప్పలాదుడు తనతో పాటే పద్మను అరణ్యంలోని ఆశ్రమానికి తీసుకువెళ్లాడు. ఆమె ఆశ్రమవాసంలో ఉంటూ, భర్తను భక్తిశ్రద్ధలతో సేవించుకోసాగింది. భర్త మనసెరిగి ప్రవర్తించసాగేది. అలా పద్మా పిప్పలాదుల దాంపత్యం అన్యోన్యంగా కొనసాగేది. ఒకనాడు పద్మ నదిలో స్నానం చేసి, నీళ్లకడవ నెత్తిన పెట్టుకుని, ఆశ్రమానికి తిరిగి వస్తోంది. ఆమెను పరీక్షించదలచిన ధర్ముడు రాజవేషంలో ఆమెకు దారిలో ఎదురయ్యాడు. నానాలంకార భూషితుడై, నవయవ్వనంతో మెరిసిపోతున్న ధర్ముడు అపరమన్మథుడిలా ఉన్నాడు. ధర్ముడు పద్మను అడ్డగించి, ‘ఓ సుందరీ! నువ్వెవరివి? నీ తల్లిదండ్రులెవరు? నీ సౌందర్యానికి నేను దాసుడిని. నిన్ను పెళ్లాడాలనుకుంటున్నా’ అన్నాడు.పద్మ అతడి ప్రశ్నలకు ముక్తసరిగా బదులిచ్చి, ‘నాకు పెళ్లయింది. నా భర్త పిప్పలాద మహర్షి’ అని చెప్పింది.‘ఓహో! ఆ తలనెరిసి, శరీరం ముడుతలు పడిన వృద్ధుడేనా నీ భర్త! నిండుజాబిలిలాంటి అందగత్తెవు నీవెక్కడ? పండుకోతిలాంటి వృద్ధుడు ఆ పిప్పలాదుడెక్కడ? నీ సౌందర్యం రాజపూజితం. నీవంటి సౌందర్యరాశి నాలాంటి రాజులకే తగును గాని, ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే మునిముచ్చులకు కాదు. నువ్వు నాతో రా! స్వర్గసౌఖ్యాలను అనుభవించవచ్చు’ అంటూ ఆమె చేయి పట్టుకోబోయాడు.పద్మకు సహనం నశించింది. ‘ఓరీ పాపాత్ముడా! దూరంగా ఉండు. పరస్త్రీని కామంతో చూసిన నువ్వు తప్పక నశిస్తావు. తపోధనుడైన నా భర్త పిప్పలాడుదెక్కడ? కామాతురుడవై, ఉచితానుచిత జ్ఞానంలేని నువ్వెక్కడ? కాలగతిలో నీకు క్షయం తప్పదు’ అని శపించింది.ఆమె శాపానికి ధర్ముడు గడగడలాడాడు. రాజవేషాన్ని విడిచి, నిజరూపంలో దర్శనమిచ్చాడు. ‘తల్లీ! నేను ధర్మదేవుడిని. గురువులకు గురువును. ఈశ్వర ప్రేరేపితుడనై, ఈ చిలిపి పని చేశాను. నాకు తగిన శాస్తి చేశావు. తల్లీ! నా శాపవిమోచనాన్ని కూడా నువ్వే అనుగ్రహించు’ అని అభ్యర్థించాడు.పశ్చాత్తాపం చెందిన పద్మ, ‘ధర్ముడా! పతివ్రతా శాపం ఫలించి తీరుతుంది. ధర్మం క్షయించిన నాడు లోకాలన్నీ క్షోభిస్తాయి. అందువల్ల నేనొక వ్యవస్థను నిర్ణయిస్తున్నాను. కృతయుగంలో నువ్వు నిండు చంద్రుడిలా పరిపూర్ణంగా ఉంటావు. ఆ తర్వాత త్రేతా, ద్వాపర, కలి యుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున క్షీణిస్తూ ఉంటావు. కలియుగాంతం నాటికి అమావాస్య చంద్రుడిలా పూర్తిగా అదృశ్యమైపోతావు. కలియుగాంతం తర్వాత తిరిగి ఆరోహణ క్రమంలో వచ్చే ద్వాపర, త్రేతా, కృతయుగాలలో ఒక్కొక్క పాదం చొప్పున వృద్ధి చెందుతూ పరిపూర్ణ స్థితిని పొందుతావు. ఇక నేను నా భర్త దగ్గరకు వెళతాను’ అని పలికింది.అప్పుడు ధర్ముడు ‘ఓ పతివ్రతా శిరోమణీ! నీకు మంగళమగుగాక. నీ భర్త పిప్పలాదుడికి నిత్యయవ్వనం సిద్ధిస్తుంది. అతడు చిరంజీవిగా వర్ధిల్లుతాడు. నీకు సర్వసౌఖ్యాలు కలుగుతాయి’ అని దీవించి అదృశ్యమయ్యాడు.∙సాంఖ్యాయన -
ప్రభుత్వ సంస్థగా ‘వొడా’?.. కేంద్రమంత్రి స్పష్టత
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ వొడాఫోన్ ఐడియా (వీఐఎల్)లో వాటాలను మరింతగా పెంచుకుని, దాన్ని ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే యోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. ప్రస్తుతమున్న 48.99 శాతం వాటాలకే ప్రభుత్వం పరిమితమవుతుందని తెలిపారు. కేంద్రం తన వంతు తోడ్పాటు అందించినందున ఇకపై పనితీరును మెరుగుపర్చుకోవాల్సిన బాధ్యత వొడాఫోన్ ఐడియాదేనని ఆయన తెలిపారు.వొడాఫోన్ ఐడియా బకాయిలకు బదులుగా ప్రభుత్వం వాటాలు తీసుకోవడం వల్ల స్వల్పకాలిక ఊరట లభించినప్పటికీ కంపెనీ నిలదొక్కుకోవాలంటే యూజర్ల బేస్ స్థిరంగా ఉండటం, టారిఫ్‌లను పెంచడం, దీర్ఘకాలిక రుణాల సమీకరణ మొదలైనవి కీలకాంశాలుగా ఉంటాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి గట్టెక్కినా, భవిష్యత్తులో బాకీల చెల్లింపుల విషయంలో కంపెనీ సవాళ్లు ఎదుర్కొనవచ్చని భావిస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ రంగంలోకి దిగి మద్దతునిస్తుందా అనే సందేహాన్ని మంత్రి నివృత్తి చేశారు. మరోవైపు, బ్యాంక్ రుణాల చెల్లింపులో ఎంటీఎన్ఎల్ డిఫాల్ట్ కావడంపై స్పందిస్తూ కంపెనీకి గణనీయంగా స్థలాలు ఉన్నాయని, వాటిని నగదీకరణ చేయడం ద్వారా రుణాలను తీర్చేసే అవకాశం ఉందన్నారు. -
తీరంలో తూటా.. సీటీలో బాంబు
కర్ణాటకలోని తీర ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు అనుసరించే పద్ధతే ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాదులకు కలిసొచ్చింది. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని ఏ–1 మిర్చి సెంటర్, 107 బస్టాప్‌ల్లో విధ్వంసం సృష్టించడానికి తయారు చేసిన బాంబులకు చేపల వేటే ఆధారమైంది. ఈ కేసుల్లో ఆరుగురిలో ఐదుగురికి ఇటీవల హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే! కర్ణాటక తీరంలో చేపల వేటకు, హైదరాబాద్‌లో జరిగిన బాంబు పేలుళ్లకు మధ్య సంబంధం ఏంటి..?దేశంలోని తొమ్మిది రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారడంతో ఐఎం సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ 2009లో పాకిస్తాన్ వెళ్లిపోయాడు. అప్పటి వరకు ఎక్కడ పేలుళ్ల పాల్పడాలన్నా అవసరమైన బాంబుల తయారీకి కావలసిన అమోనియం నైట్రేట్‌ను అతడే సమీకరించే వాడు. పాకిస్తాన్‌కు మకాం మార్చాక దీన్ని సమీకరించే బాధ్యతల్ని భత్కల్‌లోని తన ఇంటి సమీపంలో నివసించే హోమియో డాక్టర్ అఫాఖీకి అప్పగించాడు.అఫాఖీ 2005లో పాకిస్తాన్‌లోని కరాచీకి చెందిన అర్సాలా అబీర్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అందువల్ల అఫాఖీ పాకిస్తాన్‌కు రాకపోకలు సాగించేవాడు. అక్కడి బంధువులతో తరచు ఫోన్లో మాట్లాడేవాడు. ఈ కారణంగా తాను ఫోనులో మాట్లాడినా, పాకిస్తాన్‌కు వచ్చినప్పుడు కలిసినా పోలీసులు, నిఘా వర్గాలు అనుమానించరనే ఉద్దేశంతోనే అఫాఖీని రియాజ్ భత్కల్ ఎంచుకున్నాడు. 2009, 2011ల్లో పాకిస్తాన్ వెళ్లిన అఫాఖీ నేరుగా రియాజ్‌ను కలిసి వచ్చాడు. 2010 నుంచి పేలుడు పదార్థం సరఫరా బృందం నాయకుడిగా మారాడు.రియాజ్ భత్కల్ నుంచి కోడ్‌వర్డ్స్ రూపంలో ఈ–మెయిల్ ద్వారా అందే ఆదేశాల మేరకు అఫాఖీ పని చేశాడు. బాంబుల తయారీ కోసం పేలుడు పదార్థాల సమీకరణకు అనేక మార్గాలు అన్వేషించాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వలలతో పాటు ‘మీన్ తూటా’లను వినియోగిస్తుంటారు. అమోనియం నైట్రేట్ స్లర్రీ (ముద్దలా ఉండే పదార్థం) ప్యాకెట్లో డిటోనేటర్ ఏర్పాటు చేసి దానికి చిన్న ఫ్యూజ్ వైరు జత చేస్తారు. ఈ వైరును వెలిగించి నీటిలో తడవకుండా చిన్న కుండలో పెడతారు. ఈ కుండకు తక్కువ బరువు కట్టి వేటాడటానికి వాడుతున్న పడవకు కాస్త దూరంగా సముద్రంలో పడేస్తారు. అమోనియం నైట్రేట్ స్లర్రీ పేలుడు ధాటికి ఆ ప్రాంతంలో ఉన్న చేపలన్నీ చనిపోయి పైకి తేలతాయి. ఇలా చేపల వేట వారికి తేలికవుతుంది. కేవలం మత్స్యకారులే కాకుండా సముద్రంలో విహారయాత్రలకు వచ్చే యువకులు కూడా సరదా కోసం మీన్ తూటాలను వాడి చేపలు పడుతుంటారు. దీనిపై నిషేధం ఉన్నా, అప్పట్లో కర్ణాటక అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం అఫాఖీకి కలిసొచ్చింది. ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని కొన్ని ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతుడటంతో నిర్మాణరంగంలో బ్లాస్టింగ్స్ కోసం వినియోగించే అమోనియం నైట్రేట్ స్లర్రీ విక్రయానికి అక్కడి వారు పలువురు లైసెన్సులు పొందారు. ప్రభుత్వ నిఘా, ఆడిట్ పక్కాగా లేకపోవడంతో ఆ వ్యాపారులే అక్రమంగా మత్స్యకారులకు ‘మీన్ తూటా’లు అమ్మేశారు. ఈ లోటుపాట్లను అధ్యయనం చేసిన అఫాఖీ పేలుడు పదార్థం సమీకరణకు మత్స్యకారుల మార్గాన్ని ఎంచుకున్నాడు. మైనార్టీల అభివృద్ధి కోసమంటూ కర్ణాటకలో పని చేస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థలోనూ అఫాఖీ చురుకుగా వ్యవహరించే వాడు. ఇదే సంస్థలో సభ్యుడిగా ఉన్న స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్‌పై ఇతడి కన్నుపడింది. చలాకీగా ఉండే సద్దాంకు మాయమాటలతో ఎరవేసిన అఫాఖీ ‘మీన్ తూటా’ల కొనుగోలుకు వినియోగించుకున్నాడు. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లాలని చెబుతూ ఉడిపి, రత్నగిరిల నుంచి మీన్ తూటాలు తెప్పించేవాడు. వాటిని పేలుళ్లు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించే ఉగ్రవాదులు బాంబులు తయారు చేసి పేల్చారు. అఫాఖీ ఈ మీన్ తూటాలను తనతో ఏడాదికి ఒకటి రెండుసార్లే తెప్పిస్తుండటంతో సద్దాంకు అనుమానం రాలేదు. ఇలా తీసుకువచ్చిన స్లర్రీని కొన్ని రోజులు దాచి ఉంచడానికి కర్ణాటకలోని భత్కల్‌లో ఉన్న మదీనా కాలనీలో దారుల్ ఖాయర్ పేరుతో ఉన్న ఇంటిని అఫాఖీ వినియోగించాడు. అమోనియం నైట్రేట్ స్లర్రీ దుర్వినియోగం కాకుండా దాని ఉత్పత్తిలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తయారు చేసిన నాటి నుంచి గరిష్ఠంగా ఆరు నెలల్లోపు మాత్రమే అది సమర్థంగా పని చేస్తుంది. ఆ తరవాత పెద్దగా ప్రభావం చూపదు. అఫాఖీ మాడ్యుల్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం (2010 ఏప్రిల్ 17), పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్లలో (2012 ఆగస్టు 1) నాటి పేలుళ్లకు సరఫరా చేసిన స్లర్రీ ఎక్స్పైరీ డేట్ దాటేసింది. ఈ నేపథ్యంలో ఆ రెండు చోట్లా పేలుడు తీవ్రత తక్కువగా ఉండి ప్రాణనష్టం జరగలేదు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) 2015 జనవరి 8న అఫాఖీతో పాటు అతడి అనుచరులను అరెస్టు చేసింది. 2024 డిసెంబర్ 16న బెంగళూరులోని ఎన్ఐఏ స్పెషల్ కోర్టు వీరికి దోషులుగా తేల్చింది. ‘మీన్ తూటా’లు పేలింది ఇక్కడే... 2010 ఫిబ్రవరి 13: పుణేలోని జర్మన్ బేకరీలో పేలుడు. ఇక్కడ 17 మంది మృతిచెందగా 60 మంది క్షతగాత్రులయ్యారు. 2010 ఏప్రిల్ 17: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రెండు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనలో 15 మంది క్షతగాత్రులయ్యారు. 2011 జూలై 13: ముంబైలోని దాదర్, జవేరీ బజార్, ఓపెరా హౌస్‌ల వద్ద మూడు పేలుళ్ళు. ఇందులో 21 మంది చనిపోగా 131 మంది క్షతగాత్రులయ్యారు. 2012 ఆగస్టు 1: పుణేలోని జంగ్లీ మహరాజ్ రోడ్లో నాలుగు బాంబు పేలుళ్ళు. ఈ ఘటనల్లో పలువురు గాయపడ్డారు. 2013 ఫిబ్రవరి 21: హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చ్ సెంటర్ వద్ద జంట పేలుళ్ళు. వీటిలో 18 మంది చనిపోగా, 119 మంది గాయపడ్డారు. -
సుఖనిద్రకు ‘స్లీప్ డైవోర్స్’.. భారతీయ భార్యాభర్తలపై సర్వే ఇలా..
సాక్షి, స్పెషల్ డెస్క్: ‘‘నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే / అండనే బంటు నిద్ర అదియునొకటే..’ అని రాశారు అన్నమయ్య. రాజు పోయే నిద్ర, బంటు పోయే నిద్ర... రెండూ ఒక్కటే , నిద్రలో తేడాలు ఉండవు అని అర్థం. రాజు, బంటు వేర్వేరుగా ఎవరి నిద్రలో వారు ఉంటారు కనుక తేడాలు ఉండకపోవచ్చు కానీ, ఒకే పరుపుపై పవళించే భార్యా భర్తల నిద్రల్లో మాత్రం తేడాలు ఉంటాయి. ఇద్దరిలో ఒకరు గురక పెడుతుంటే రెండో వారి నిద్ర పాడవుతుంది. ఏసీ ఎక్కువ తక్కువలు ఇద్దరిలో ఒకరి నిద్రను కబళిస్తాయి. ఫ్యాను స్పీడు, పరుపు గట్టితనం ఇద్దరికీ ఒకే రకంగా అనుకూలంగా లేకుంటే ఇద్దరిలో ఒకరికి నిద్ర కరువవుతుంది. ఇద్దరిలో ఒకరు తెల్లవార్లూ నిద్రలో భంగిమలు మారుస్తుంటే రెండో వారికి కలత నిద్రే మిగులుతుంది.నయా ట్రెండ్... స్లీప్ డైవోర్స్‘‘ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరగదు’’ అనే మాట... కలిసి పడుకునే భార్యాభర్తల విషయంలో మాత్రం నిజం కాదు. నిద్ర పోవటానికి అన్నీ సౌఖ్యంగా ఉన్నప్పటికీ.. ఒకరి సౌఖ్యం ఇంకొకరికి అసౌకర్యం కావచ్చు. నిద్ర సుఖమెరగదు అనే మాట అర్థం లేనిదవచ్చు. అప్పుడిక ఎవరికి వారుగా, వేర్వేరు పడకలపై నిద్రించటమే.. సుఖనిద్రకు మార్గం. ఇలా వేర్వేరుగా పడుకోవటాన్నే ‘స్లీప్ డైవోర్స్’ అంటున్నారు!కాపురాలను నిలబెడుతుందిభారతీయ దంపతులలో 78 శాతం మంది ‘స్లీప్ డైవోర్స్’కు మొగ్గు చూపుతున్నారని ‘రెస్‌మెడ్’ గ్లోబల్ స్లీప్ తాజా సర్వే వెల్లడించింది. ఆ సర్వే ప్రకారం ప్రపంచంలోనే ఇది అత్యధిక శాతం. తర్వాతి రెండు స్థానాల్లో చైనా (67 శాతం), దక్షిణ కొరియా (65 శాతం) ఉన్నాయి. నిద్రలో గురకపెడుతున్న జీవిత భాగస్వామి నుండి విడాకులు కావాలని కోర్టును ఆశ్రయిస్తున్న వారికి సైతం, మొదట ఈ ‘స్లీప్ డైవోర్స్’ను సూచించి కాపురాలను నిలబెడుతున్నారు లైఫ్ కోచ్‌లు, సైకో థెరపిస్టులు, ఆధునిక కౌన్సెలర్లు. అంటే.. విడాకులను నివారించటం కోసం ‘నిద్ర విడాకులి్న’ తీసుకోవటం! బాగుంది కదా. కళకళలాడుతూ నిద్ర లేస్తారునిద్ర ఎంత పెద్ద సమస్యో నిద్రాభంగాన్ని అనుభవించేవారికి గానీ తెలియదు. నిద్రలేమి అలసటను కలిగిస్తుంది. క్రమంగా నిరాశ, నిస్పృహల్లోకి నెట్టేస్తుంది. చివరికి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. దంపతుల మధ్య సాన్నిహిత్యం కూడా తగ్గుముఖం పడుతుంది. అందుకే నిద్రకు ముఖం వాచిన దంపతుల కంటే, కంటి నిండా నిద్రపోయే దంపతులు కళకళలాడుతూ ఉంటారని పరిశోధకులు చెబుతున్నారు. కలిసి ఉండేందుకే విడిపోవటంఎంత భార్యాభర్తలైనా, ఏ ఇద్దరు మనుషుల శరీర స్వభావాలు, వారి సమయా సమయాలు ఒకటి కాదు కనుక... ఒకే మంచంపై ఇబ్బందిగా, ఇరుకుగా అనిపించినప్పుడు వేర్వేరు గదుల్లో, లేదా వేర్వేరు పడకలపై నిద్రించటమే మంచిదని వైద్య పరిశోధకులు చెబుతున్నారు. స్లీప్ డైవోర్స్ నిద్ర నాణ్యతను మెరుగు పరుస్తుంది. నిద్రకు అంతరాయాలను తొలగిస్తుంది. మనసుకు, మెదడుకు ప్రశాంతనిస్తుంది. ఎవరికి కావలసి విధంగా వారు గది వాతావరణాన్ని, గదిలోని వెలుతురును అమర్చుకోవటం వల్ల తేలిగ్గా నిద్రపట్టి, దీర్ఘనిద్రలోకి జారి, శరీరానికి సత్తువ లభిస్తుంది.చిన్న చిన్న సమస్యలూ ఉన్నాయి!స్లీప్ డైవోర్స్‌తో చక్కగా నిద్ర పట్టి రీచార్జ్ అవుతున్నప్పటికీ, ఇలా వేరుగా పడుకోవటం అన్నది మానసికమైన ఎడబాటుకు దారి తీసే ప్రమాదం లేకపోలేదని మనో వైజ్ఞానిక నిపుణులు అంటున్నారు. పిల్లలు ఉన్న దంపతులకు ఇంకో సమస్య ఎదురౌతుంది. తల్లిదండ్రులు నిద్ర కోసం విడి విడిగా పడుకుంటున్నారని వారు అనుకోరు. ఒకరంటే ఒకరికి ఇష్టం లేదా ఏంటి అని ఊహించుకుంటారు! ఏకాంతంగా ఉండేందుకు దొరికే ఆ కొద్ది గంటల్లో భార్యభర్తలు తమ నిద్రకోసం ఒకరికొకరు దూరంగా ఉండటం వల్ల వారి మధ్య సంభాషణ కూడా తగ్గిపోతుంది. తద్వారా ఆరోగ్యకరమైన, సంతృప్తికరమైన దాంపత్య అనుబంధానికి అవరోధం ఏర్పడుతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా కాస్త జాగ్రత్త పడితే చాలు. ఏమైనా, నిద్రలేమి ముందు మిగతావన్నీ చిన్న విషయాలు కనుక నిరభ్యంతరంగా ‘స్లీప్ డైవోర్స్’ను పాటించవచ్చనీ, పాటిస్తూనే ఒకరి అవసరాలను ఒకరు కనిపెట్టుకుంటూ కుటుంబ జీవనాన్ని సాఫీగా కొనసాగింవచ్చునని థెరపిస్టులు అభయం ఇస్తున్నారు. -
యువ కథ: నాన్నతో ఒక రోజు..
‘‘నాన్నా ఎలా ఉన్నావు?’’ సుందర్ తన బ్యాగుతో గుమ్మంలో అడుగుపెట్టాడు.ఇంట్లో తీరిగ్గా కూర్చుని పేపర్ చదువుతున్న సుబ్బారావు ఆ గొంతు విని తలెత్తి చూశాడు. ‘‘అరె సుందరం.. ఇదేనా రావడం?’’ అంటూ పేపర్ పక్కన పెట్టి లేచి బ్యాగు అందుకున్నాడు సుబ్బారావు. ‘‘శాంతా.. చూడు సుందరం వచ్చాడు’’ అని లోపలే ఉన్న శాంతకి చెప్పాడు సుబ్బారావు.‘‘నాన్నా సుందరం ఏంటి! సుందర్ అని పిలవచ్చు కదా!’’ సుందర్ చిన్నగా చిరాకు పడ్డాడు. ‘‘హహ! అలాగేరా.. సుందరం మా నాన్నగారి పేరు. అందుకే పిలిచినప్పుడల్లా నాన్నని పిలుస్తున్నట్టు అనిపిస్తుందిరా..’’ నవ్వుతూ చెప్పాడు సుబ్బారావు. ‘‘అలాగేలే.. అలానే పిలువు నాన్నా నాకేం సమస్య లేదు!’’ అన్నాడు సుందర్.‘‘వస్తున్నానని కనీసం ఫోన్ కూడా చేయలేదు!’’ వంటగదిలోంచి వస్తూ అడిగింది శాంత. ‘‘అదేం లేదమ్మా, పాలకొల్లులో మన సురేష్‌గాడి పెళ్లి నిన్న. వచ్చేదాకా అస్సలు వదల్లేదు. అందుకే హుటాహుటిన రెండు రోజులు సెలవు పెట్టి హైదరాబాద్ నుంచి వచ్చేశాను!’’ అని చెబుతూ లోపలికి వెళ్ళి నీరసంగా కూర్చున్నాడు సుందర్.‘‘శాంతా వాడు బాగా అలిసిపోయినట్లు ఉన్నాడు. తినడానికి ఏమైనా ఉంటే పెట్టు. నేనిప్పుడే అలా బయటికి వెళ్లి వస్తాను..’’ అంటూ గొడుగు తీసుకుని వర్షంలో బయలుదేరాడు సుబ్బారావు.సుందర్ హైదరాబాద్ లోని ‘ఇన్ఫినిటీ’ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పాలకొల్లు వదిలి వెళ్లి ఇప్పటికి ఏడేళ్ళు అయ్యింది. పండగలకో, పబ్బాలకో ఏ సంవత్సరానికో ఒకసారి వచ్చి నాలుగు రోజులు కూడా గడపకుండా హడావిడిగా మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు.‘‘ఏం బాబూ ఆ పులస ఎంతకిస్తావ్?’’ అంటూ వర్షంలో ఆ ఊరి చెరువు దగ్గర చేపలు పడుతున్న మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి బేరం ఆడుతున్నాడు సుబ్బారావు.‘‘ఎంతో కొంత ఇచ్చి పట్టుకెళ్ళండి.. మీ దగ్గర డబ్బులు ఎటు పోతాయి!’’ అంటూ మంచి పులస చేపని సంచిలో వేసి ఇచ్చాడు వీరయ్య. వీరయ్య అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఇచ్చి పట్టుకొని ఇంటికి వచ్చేశాడు సుబ్బారావు.వర్షం ఓ మాదిరిగా చిన్నగా కురుస్తోంది. పట్టుకొచ్చిన చేపని శాంతకి ఇచ్చి, ‘‘ఇది వాడికి చాలా ఇష్టం మంచిగా పులుసు చెయ్ వాడికి మళ్ళీ అక్కడ దొరకదు’’ అని చెప్పి బయట వరండాలోకి వెళ్లి కూర్చున్నాడు.ఇంటికి వచ్చినా సుందర్‌కి తీరిక లేదు. కంపెనీ నుంచి ఏవేవో ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఇంక లాభం లేదని ఫోన్ పక్కన పడేసి, గదిలోంచి బయటికి వచ్చాడు సుందర్. ‘‘అమ్మా! నాన్నెక్కడ? సాయంత్రం నుంచి కనబడలేదు’’ అని శాంతని అడిగాడు. ‘‘బయట వరండాలో ఉన్నాడేమో చూడు..’’ అంటూ చేపల పులుసు పెడుతూ చెప్పింది శాంత.వరండాలో తీరిగ్గా పడక్కుర్చీలో కాళ్ళు చాపి పాత పుస్తకమేదో చదువుతూ కూర్చున్నాడు సుబ్బారావు. ఆ పడక్కుర్చీ చూడగానే ఎన్నో జ్ఞాపకాలు, మధురానుభూతులు గుర్తొచ్చాయి సుందర్‌కి. ‘‘నాన్నా’’ అంటూసుబ్బారావు దగ్గరికెళ్ళి కూర్చున్నాడు. సుబ్బారావు వెంటనే చేతిలో ఉన్న పుస్తకం మూసి కళ్ళజోడు తీస్తూ ‘‘కూర్చోరా’’ అని ప్రేమగా అన్నాడు.ఆ పుస్తకం తీసుకుని ‘‘ఎన్ని రోజులైంది నాన్నా ఈ పుస్తకం చూసి.. చిన్నప్పుడు బాగా చదివేవాణ్ణి. ‘బారిస్టర్ పార్వతీశం’ నిజంగానే ఉన్నాడేమో అనేంతలా కలలు కనేవాడిని!’’ అంటూ ఆప్యాయంగా పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ చెప్పాడు సుందర్.‘‘ఈ కుర్చీకి, నాకు విడదీయలేని సంబంధం ఉంది. చిన్నప్పుడు ఇక్కడే రాత్రి అమ్మ అన్నం తినిపించాక, తాతయ్య ఈ కుర్చీలో కూర్చొని ఆ ఆకాశాన్ని, నిండు జాబిలిని చూపిస్తూ మంచి మంచి కథలు, చెప్పేవాడు. నేను, కౌసల్య, శీనుగాడు గాల్లో తేలిపోతున్నట్టుగా వినేవాళ్ళం. అప్పుడే చాలా బావుండేది నాన్నా.. పెరిగే కొద్దీ జీవితం ఇంకా భారంగా, బాధగా ఉంది.’’ అంటూ బాధగా చెప్పాడు సుందర్.ఒక్కసారిగా తన పాత జ్ఞాపకాలన్నీ కళ్ళ ముందుకి వచ్చాయి సుబ్బారావుకి. ఇరవై ఏళ్ల ముందు జీవితం చాలా బావుండేది. సుబ్బారావు అదే ఊళ్ళో పోస్ట్‌మన్‌గా చేసేవాడు. అప్పట్లో ఉత్తరాలు, మనీ ఆర్డర్లు బాగానే వచ్చేవి. పని కూడా చాలా ఎక్కువే ఉండేది. కాలం గడిచేకొద్దీ కొద్దిరోజుల్లోనే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. సెల్ ఫోన్ల నుంచి కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు అన్నీ వచ్చేశాయి. ఈ–మెయిల్ వంటివి వచ్చాక పరిస్థితి మారిపోయింది. గవర్నమెంట్ లెటర్స్ తప్ప అసలు ఇంకే ఉత్తరాలు రావడం లేదు. ఒకప్పుడు సంచి నిండా ఉత్తరాలు ఉండేవి. ఊరంతా తన పాత సైకిల్‌పై తిరిగి సాయంత్రంలోగా అన్నీ చేర్చేవాడు. ఉత్తరం తీసుకున్నవారి మొహంలో ఆనందం, ఉల్లాసం మనసుకి ఎంతో తృప్తినిచ్చేది. అలా ఉత్తరాలు, మనీ ఆర్డర్లు అన్నీ ఆగిపోయాయి. ఉద్యోగం ఉంది గాని, చేయడానికి పనేలేదు. రోజంతా ఆఫీసులోనే ఖాళీగా ఉండేవాడు సుబ్బారావు. జాలేసింది, చాలా బాధేసింది. కొద్దిరోజుల్లోనే పోస్ట్‌మన్ ఉద్యోగానికి ఇంకా మూడేళ్లు టైమ్ ఉన్న వెంటనే రిటైర్మెంట్ తీసుకున్నాడు సుబ్బారావు.‘‘నిజంగా ఆ రోజులే చాలా బావుండేవిరా..’’ అంటూ గోడకు తగిలించిన పాత ఉత్తరాల సంచి వైపు చూసి కంటతడి పెట్టుకున్నాడు సుబ్బారావు. ‘‘అమ్మమ్మ, తాతయ్యతో కలిసి ఇరవైమందితో ఇల్లు కళకళలాడేది. వాళ్ళు చనిపోగానే ఎవరికి వాళ్ళు గొడవలతో, ఆస్తుల విభజనలో, మనస్పర్థలతో చివరికి ఇప్పుడు మీరిద్దరూ అంతే! ఊర్లో మనదే పాత మండువా ఇల్లు నాన్నా.. ఇది ఇలానే ఉండాలి ఎన్ని సంవత్సరాలైనా..’’ అంటూ బాల్య జ్ఞాపకాల్ని తలచుకున్నాడు సుందర్.‘‘అసలు ఇప్పుడు పోస్ట్‌మన్ గురించి కనీసం పుస్తకాల్లో అయిన చెబుతున్నారా.. కనీసం మేము అనేవాళ్ళం ఉండేవాళ్ళం అని కూడా తెలియనంతగా అభివృద్ధి చెందింది ప్రపంచం!’’ అంటూ కళ్ళజోడు తీసి కళ్లు తుడుచుకున్నాడు సుబ్బారావు. ‘‘నిజమే నాన్నా! అసలు ఆగకుండా పరుగెడుతూనే ఉంది ప్రపంచం. మన కోసమో, మన ఆనందం కోసమో కూడా ఆగకుండా పరుగులు తీస్తోంది.’’ అన్నాడు సుందర్.వీళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా పక్కనే ఉండి వింటూ తను కూడా ఆ పాత రోజులను తలచుకొని బాధపడింది శాంత. ‘భోజనానికి లేవండి’ అని పిలిచింది. ఆమె పిలుపుతో జ్ఞాపకాల్లోంచి బయటికి వచ్చి తండ్రీ కొడుకులిద్దరూ భోజనానికి కూర్చున్నారు.ఆ రాత్రి టీవీకి, ఫోన్లకి దూరంగా ఉండి పాత జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ ముగ్గురూ భోంచేశారు. ‘అదేంటో ఊరికి వచ్చిన తరువాత మన సొంత ఇంట్లో, సొంత గదిలో పట్టినంత నిద్ర ఆ అద్దెకొంపల్లో, నగరపు వాతావరణంలో అస్సలు పట్టదు. పల్లెటూర్లో పుట్టడం కూడా ఒక అదృష్టమే!’ అనుకుంటూ ఆ రాత్రి ఉన్న బాధలన్నీ మర్చిపోయి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు సుందర్.తెల్లవారుజామునే అలారం పెట్టే శబ్దాలతో కాకుండా కోడి కూతతో నిద్రలేచి, సిటీకి వెళ్లడానికి సిద్ధమయ్యాడు సుందర్. అమ్మానాన్నలను మనసారా హత్తుకొని బయటికి నడిచాడు.తెలీకుండానే సంవత్సరం గడిచిపోయింది. సుందరం ఇంటికి వచ్చి కూడా ఏడాది అయింది. ఒక సాయంత్రం వేళ సుబ్బారావు, శాంత ఇద్దరూ నిశ్శబ్దంగా వరండాలో కూర్చున్నారు. సుబ్బారావు ఆ పాత సైకిల్ని చూస్తూ గతంలోకి వెళ్ళిపోయాడు.‘‘అదేంటండీ అలా చూస్తున్నారు?’’ శాంత అడిగింది.‘‘ఏం లేదు శాంతా.. ఈ సైకిల్‌తో నాకున్న అనుబంధం గుర్తొచ్చింది. ఊరంతా తిరుగుతూ ఉత్తరాలు పంచేవాణ్ణి. ఆ రోజుల్లో మనుషుల మధ్య అనుబంధాలు ఎంత గాఢంగా ఉండేవో కదా! ఇప్పుడు అంతా యాంత్రికమైపోయింది’’ సుబ్బారావు నిట్టూర్చాడు.‘‘అవునండీ.. రోజులు మారిపోయాయి. మనుషులూ మారిపోయారు. మన సుందర్ కూడా ఎంత మారిపోయాడో!’’ శాంత బాధగా అంది.‘‘అవును శాంతా.. డబ్బు సంపాదించాలనే తపనలో మనుషులు తమ మూలాల్ని, బంధాల్నిమరచిపోతున్నారు. కాని, సుందర్‌కి తన తప్పు తెలిసొచ్చింది. మళ్ళీ మన దగ్గరకు వస్తాడనే నమ్మకం నాకుంది’’ సుబ్బారావు ఆశగా అన్నాడు.‘‘మీ నోట బంగారం అండీ’’ శాంత కళ్ళల్లో ఆనందం మెరిసింది.సాయంత్రం ఆరు అయింది. సుబ్బారావు, శాంత ఇద్దరూ వరండాలో కూర్చున్నారు.అప్పుడే సుందర్ కారు ఇంటి ముందు ఆగింది. సుబ్బారావు, శాంత ఆశ్చర్యంగా చూస్తుండగానే సుందర్ కారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు.‘‘నాన్నా.. అమ్మా.. నన్ను క్షమించండి. నా తప్పు నాకు తెలిసొచ్చింది. ఇకపై మిమ్మల్ని వదిలి ఎక్కడికీ వెళ్ళను. మీతోనే ఉంటాను’’ సుందర్ కన్నీళ్ళు తుడుచుకుంటూ అన్నాడు.సుబ్బారావు, శాంత ఆనందంతో సుందర్‌ని హత్తుకున్నారు. ఆ క్షణం వాళ్ళ ముగ్గురి కళ్ళల్లోనూ ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ రాత్రి వాళ్ళు ముగ్గురూ కలిసి పాత జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ సంతోషంగా గడిపారు.మర్నాడు ఉదయం సుందర్ తన సామాన్లు సర్దుకుని తల్లిదండ్రులతో కలిసి పాలకొల్లులోనే ఉండిపోయాడు. అక్కడే కొత్త జీవితం ప్రారంభించాడు. ఆ పాత మండువా ఇల్లు మళ్ళీ కళకళలాడింది. -
పాక్‌ను వీడుతున్న భారతీయులు.. ఎంత మంది వచ్చారంటే?
లాహోర్: పహల్గాం ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారతీయులు.. పాకిస్తాన్ నుంచి స్వదేశం చేరుకుంటున్నారు. మూడు రోజుల్లో 450 మందికి పైగా భారతీయులు పాక్‌ను వీడారు. వాఘా సరి హద్దు గుండా వారంతా భారత్‌కు చేరుకున్నారు. శనివారం పాక్‌ను వీడిన వారిలో పీఎస్ఎల్ (పాకిస్తాన్ సూపర్ లీగ్) 2025 ప్రసార సంస్థలో భాగమైన 23 మంది భారతీయులు ఉన్నారని పాక్ అధికారులు తెలిపారు. శుక్రవారం 300 మంది, గురువారం 100 మంది భారతీయులు ఇదే మార్గంలో స్వదేశానికి తిరిగి వెళ్లారని వెల్లడించారు. ఇక 200 మంది పాకిస్తానీయులు భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారని పేర్కొన్నారు. పాకిస్తాన్లో దీర్ఘకాలిక వీసాలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ), ‘రిటర్న్ టు ఇండియా’ స్టాంపులు ఉన్నవారు సరిహద్దు దాటడానికి అధికారులు నిరాకరించారు.మరోవైపు సిక్కు కుటుంబాలతో సహా కొందరు భారత సంతతి కి చెందిన విదేశీయులను భారత ఇమ్మిగ్రేషన్, భద్రతా అధికారులు పాకిస్తాన్లోకి ప్రవేశించ కుండా అడ్డుకున్నారు. లాహోర్‌కు 80 కిలోమీ టర్ల దూరంలోని నాన్కానా సాహిబ్‌లో నివసి స్తున్న భారత సంతతికి చెందిన కెనడియన్ సిక్కు కుటుంబం వాఘా సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించడాన్ని అడ్డుకున్నారు. దుబాయ్ మీదుగా విమాన మార్గం గుండా ప్రయాణించాలని సూచించారు.అటారీ–వాఘా సరిహద్దు మూసివేత.. ఆగిపోయిన బ్యాండ్, బాజా, బరాత్..!భారత్, పాకిస్తాన్ల మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు.. సరిహద్దుల మూసివేత సామాన్యులకు ఎన్నో అవస్థలు తెచ్చిపెట్టాయి. రాజస్తాన్‌లోని బర్మేర్‌కు చెందిన షైతాన్ సింగ్ అనే యువకుడికి పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన కేసర్ కన్వర్‌తో నాలుగేళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. వరుడికి, అతడి కుటుంబీలకు వీసా దొరక్క పెళ్లి ఇప్పటిదాకా జరగలేదు. ఫిబ్రవరి 28న వీసాలు మంజూరయ్యాయి. ఈ నెల 30వ తేదీన సింధ్ ప్రావిన్స్‌లోని అమర్‌కోట్‌లో వధువు ఇంట్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఇందుకోసం సరిహద్దులకు రెండువైపులా ఉన్న కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంతలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో బుధవారం అట్టారీ–వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. విషయం తెలియని షైతాన్ సింగ్ కుటుంబం ఊరేగింపుగా అటారీ–వాఘా బోర్డర్ పాయింట్‌కు చేరుకుంది. అక్కడ ఆర్మీ అధికారులు అసలు విషయం చెప్పడంతో అంతా షాకయ్యారు.‘ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఇలా జరిగింది’అంటూ షైతాన్ సింగ్ ఆవేదన చెందారు. ‘మమ్మల్ని ఆహ్వానించేందుకు బోర్డర్ పోస్ట్ వద్దకు చేరుకున్న మా బంధువులు చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు’అని అతడి సోదరుడు చెప్పారు. ఉగ్రదాడుల కారణంగా తమ బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని అతడు పేర్కొన్నాడు. అయితే, ఈ కుటుంబానికి మరో చిన్న ఆశ మిగులుంది. అదేంటంటే, వీరి వీసాల గడువు మే 12వ తేదీ వరకు ఉండటం. అప్పటికల్లా తిరిగి సరిహద్దులు తెరుచుకుంటాయని, పెళ్లి జరుగుతుందని ఆశతో వీరున్నారు. కాగా, భారత, పాకిస్తాన్ సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉంటున్న సోధా రాజ్పుట్ వర్గం ప్రజల మధ్య వివాహ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. -
నాట్యవేదం జీవననాదం
సర్వ శాస్త్ర సంపన్నంసర్వ శిల్ప ప్రవర్తకంనాట్యాఖ్యం పంచమం వేదంసేతిహాసం కరోమ్యహమ్పంచమవేదంగా పరిగణించదగిన సమస్త శిల్ప శాస్త్రేతిహాసాల సమాహారమైన నాట్యశాస్త్రాన్ని భరతముని మనకు అందించాడు. ఆరు లలితకళలలో నాట్యం ఒకటైనా, నాట్యకళకు మిగిలిన కళలు లేకుండా నాట్యం పరిపూర్ణం కాదు. మిగిలిన కళలన్నీ నాట్యానికి హంగులు సమకూర్చేవే! నాట్యం సమాహార కళ. సహస్రాబ్దాల కిందటే నాట్యానికి శాస్త్రబద్ధత ఏర్పడినా, నాట్యం పండిత పామర జనరంజకమైన కళ. ఆబాల గోపాలాన్నీ అలరించే అద్భుతమైన కళ.ఏప్రిల్ 29 అంతర్జాతీయ నాట్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.సంగీతం మాదిరిగానే నాట్యం కూడా విశ్వజనీనమైన కళ. వివిధ నాగరికతలలో ఆయా ప్రాంతాలకు తగినట్లుగా రూపుదిద్దుకున్న నాట్యకళ కాలానుగుణంగా అనేక మార్పులకు లోనైంది. నాట్యకళ పుట్టు పూర్వోత్తరాల గురించి ఇదమిత్థంగా చెప్పడం సాధ్యం కాదు గాని, నాట్యం తొలిసారిగా శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నది మాత్రం మన భారతదేశంలోనే! దాదాపు రెండువేల ఏళ్ల కిందటే భరతముని సంస్కృతంలో ‘నాట్యశాస్త్రం’ రచించాడు. నాట్యకళకు సంబంధించి ప్రపంచంలో ఇదే తొలి శాస్త్రీయ గ్రంథం. రెండువేల ఏళ్ల కిందటే నాట్యం శాస్త్రీయ రూపాన్ని సంతరించుకున్నదంటే, నాట్యం ఉనికి అంతకు చాలా ముందు నుంచే ఉండవచ్చని ఊహించవచ్చు. మన పురాణాలలో నాట్య ప్రస్తావన కనిపిస్తుంది. పరమశివుడిని నాట్యానికి ఆదిదేవుడిగా పరిగణిస్తారు. శివుడిని నటరాజ రూపంలో కూడా ఆరాధిస్తారు. శివతాండవంతో పాటు కాళీయమర్దనం చేసిన తాండవకృష్ణుడి లీలావినోదం మన పురాణాల్లో ఉంది. అజ్ఞాతవాస కాలంలో బృహన్నలగా మారిన అర్జునుడు నాట్యాచార్యుడిగా విరాటరాజు కూతురు ఉత్తరకు నాట్యం నేర్పించిన ఉదంతం మహాభారతంలో ఉంది. మన పురాణాల ప్రకారం స్వర్గలోకంలోని అప్సరసలందరూ నర్తకీమణులే! నాట్యకళ ప్రాచీనతకు మన పురాణేతిహాసాలే సాక్ష్యాలు. కాలగతిలో జరిగిన అనేక పరిణామాలకు భారతదేశంలోని శాస్త్రీయనృత్యం రకరకాలుగా రూపాంతరాలు చెందింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విలక్షణమైన శాస్త్రీయనృత్యంగా పరిణామం చెందింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ మన దేశంలోని ఎనిమిది రకాల నాట్యశైలులను శాస్త్రీయ నృత్యాలుగా గుర్తించింది. ఈ ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యాలలో అనేక మంది కళాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. ఇప్పటికీ ఎందరో యువతరం కళాకారులు ఈ శాస్త్రీయ నృత్యాలలో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనలు చేస్తూ, నాట్యకళలో భారతదేశ ఖ్యాతిని చాటి చెబుతున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎనిమిది రకాల శాస్త్రీయ నృత్యరీతులు, వాటి కథా కమామిషు తెలుసుకుందాం..భరతనాట్యంభరతముని రచించిన నాట్యశాస్త్రం ఆధారంగా రూపొందించిన ప్రాచీన నాట్యశైలి భరతనాట్యం. ఇది తమిళనాడులో పుట్టింది. కణ్ణగి విషాదగాథపై రచించిన తమిళ పౌరాణిక గ్రంథాలు ‘సిలప్పటిగారం’లోను, ‘మణిమేగలై’లోను భరతనాట్య ప్రస్తావన కనిపిస్తుంది. ఈ గ్రంథం క్రీస్తుశకం రెండోశతాబ్ది నాటిది. ఆ తర్వాతి కాలంలో దక్షిణాదిలో వెలసిన వివిధ దేవాలయాల గోడలు, స్తంభాలపై ఉన్న నాట్యభంగిమలు భరతనాట్య నృత్యభంగిమలకు నిదర్శనంగా నిలుస్తాయి. నటరాజ రూపంలోని శివుడి 108 భంగిమలనే భరతనాట్యంలో ‘కారణ’భంగిమలుగా పరిగణిస్తారు. రాచరికాలు కొనసాగిన కాలంలో వివిధ రాజ్యాలలో భరతనాట్యానికి రాజాదరణ ఉండేది. ఆనాటి కాలంలో దేవాలయ సంప్రదాయాలలో భాగంగా దేవదాసీలు భరతనాట్య పరంపరను కొనసాగించారు. బ్రిటిష్ పరిపాలన మొదలయ్యాక మన దేశంలోని శాస్త్రీయ నృత్యరీతులకు గడ్డుకాలం మొదలైంది. ఒక దశలో బ్రిటిష్ ప్రభుత్వం దేవాలయాల్లో దేవదాసీల నాట్య ప్రదర్శనలను నిషేధించింది. ఆదరణ కరవై, దారుణమైన గడ్డు పరిస్థితులు తలెత్తినా, ఎందరో నాట్య కళాకారులు ఈ పరంపర అంతరించిపోకుండా కాపాడగలిగారు. వారి కృషి ఫలితంగానే, ఈనాడు భారతీయ శాస్త్రీయ నృత్యాలు అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందగలుగుతున్నాయి. దేవాలయాల్లో నాట్య ప్రదర్శనల నిషేధం తర్వాత ఇరవయ్యో శతాబ్ది తొలిరోజుల్లోనే నాట్య కళాకారులు రంగస్థల ప్రదర్శనలు ఇవ్వడం మొదలైంది. అప్పట్లో రుక్మిణీదేవి అరండేల్, తంజావూరు బాలసరస్వతి వంటి కళాకారిణులు భరతనాట్యంలో అగ్రగాములుగా రాణించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మన శాస్త్రీయ నృత్యరీతులకు పునరుజ్జీవం మొదలైంది. ఆరితేరిన గురువుల ఆధ్వర్యంలో నాట్య శిక్షణ కేంద్రాలు ప్రారంభయ్యాయి. క్రమంగా దేశ విదేశాల్లోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో కూడా భారతీయ శాస్త్రీయ నృత్యానికి చోటు దక్కింది. చైనాకు చెందిన ఝాంగ్ జున్ 1950లలోనే భరతనాట్యాన్ని చైనాకు పరిచయం చేశారు. చైనాలో ఆమె చేసిన ప్రదర్శన అక్కడివారిని అబ్బురపరచింది. యామినీ కృష్ణమూర్తి, మల్లికా సారాభాయ్, పద్మా సుబ్రహ్మణ్యం, అలమేల్ వల్లి వంటి కళాకారులు భరతనాట్యం ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు. నర్తకీమణులైన వైజయంతిమాల, హేమమాలిని వంటి సినీతారల వల్ల భరతనాట్యానికి జనాదరణ మరింతగా పెరిగింది. పలువురు విదేశీ విద్యార్థులు కూడా భరతనాట్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటున్నారు. వారిలో కొందరు ప్రదర్శనల్లోనూ రాణిస్తున్నారు.కూచిపూడిమన తెలుగునేల మీద పుట్టిన శాస్త్రీయ నృత్యరీతి కూచిపూడి. కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఈ నృత్యశైలి రూపుదిద్దుకోవడంతో దీనికి ఆ పేరు వచ్చింది. క్రీస్తుశకం పదో శతాబ్ది నాటికే కూచిపూడి నృత్యం ఉన్నట్లు రాగిరేకుల శాసనాల ద్వారా తెలుస్తోంది. ద్వైత సన్యాసి నరహరి తీర్థుల శిష్యులలో ఒకరైన సిద్ధేంద్ర యోగి పదిహేడో శతాబ్దిలో ఆధునిక కూచిపూడి నృత్యశైలికి పూర్తిస్థాయిలో రూపకల్పన చేశారు. వైష్ణవ సంప్రదాయ ప్రభావం వల్ల కూచిపూడి నృత్యంలో కృష్ణుడి లీలావిలాసాలే ప్రధానాంశాలు. కృష్ణలీలల నృత్యాభినయం తంజావూరు ప్రాంతంలో ‘భాగవత మేళా’గా పేరుపొందింది. కూచిపూడి నృత్య కళాకారులు తెలుగునేల మీద భాగవతులుగా, తమిళనాడులో భాగవతార్‌లుగా పేరుపొందారు. నారాయణ తీర్థులు రచించిన కృష్ణలీలా తరంగిణిని కూచిపూడి భాగవతులు విరివిగా ప్రదర్శించేవారు. అప్పట్లో కళింగరాజ్యం మొదలుకొని తంజావూరు రాజ్యం వరకు వీరికి గొప్ప ఆదరణ ఉండేది. బ్రిటిష్ కాలంలో మిగిలిన నృత్యరీతుల మాదిరిగానే కూచిపూడి కూడా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అయినా, వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, వెంపటి వెంకటనారాయణ శాస్త్రి, వెంపటి చిన వెంకటరామయ్య శాస్త్రి వంటి వారు కూచిపూడి సంప్రదాయం కొడిగట్టిపోకుండా కాపాడారు. స్వాతంత్య్రానంతరం ఇంద్రాణి రహమాన్, యామినీ కృష్ణమూర్తి, శోభా నాయుడు వంటివారు విదేశాల్లో ప్రదర్శనలు చేసి, కూచిపూడి ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చారు. వారి ప్రభావంతో పలువురు విదేశీ విద్యార్థులు కూడా కూచిపూడి నృత్యం పట్ల ఆకర్షితులై నేర్చుకోవడం, ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు.ఒడిస్సీఒడిశాలో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి ఒడిస్సీ. కళింగ రాజ్యంలో క్రీస్తుశకం ఆరో శతాబ్ది నుంచి తొమ్మిదో శతాబ్ది మధ్య కాలంలో ఒడిస్సీ నృత్యశైలి ప్రత్యేకమైన శాస్త్రీయ నృత్యంగా రూపుదిద్దుకుంది. ఒడిస్సీ నృత్య ప్రస్తావన ఆనాటి జైన, బౌద్ధ గ్రంథాలలో కూడా కనిపిస్తుంది. పూరీ, కోణార్క తదితర దేవాలయాల రాతి గోడలు, స్తంభాలపై కనిపించే నాట్య భంగిమలు ఒడిస్సీ నృత్యశైలి ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తాయి. పదిహేడో శతాబ్ది వరకు ఒడిస్సీ నృత్యానికి రాజాదరణ బాగా ఉండేది. పద్నాలుగో శతాబ్దిలో ఖుర్దా రాజు ఒడిస్సీ నృత్యంలో ‘గొటిపువొ’ సంప్రదాయాన్ని బాగా ప్రోత్సహించారు. గురుకులంలో పరంపరాగతంగా నృత్యశిక్షణ పొందే బాలురను ‘గొటిపువొ’ అంటారు. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులు ఎదురైనా, ఎందరో కవులు, పండితులు, నర్తకులు ఒడిస్సీ నృత్య సంప్రదాయం కనుమరుగు కాకుండా కాపాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ‘కవిచంద్ర’ కాళీచరణ్ పట్నాయక్ వంటి కవి పండితులు, కేలూచరణ్ మహాపాత్రో, పంకజ్చరణ్ దాస్, సంజుక్తా పాణిగ్రాహి, సోనాల్ మాన్సింగ్ తదితరులు ఒడిస్సీ నృత్యానికి పునరుజ్జీవం కల్పించి, అంతర్జాతీయ గుర్తింపు దక్కేందుకు దోహదపడ్డారు. కథాకళికేరళకు చెందిన శాస్త్రీయ నృత్యశైలి కథాకళి. ‘అట్టకథ’ సాహిత్య రూపంలోని నృత్యరూపకాలను కథాకళి కళాకారులు ప్రదర్శిస్తారు. ఇతర శాస్త్రీయ నృత్యరీతులతో పోల్చుకుంటే కథాకళి నర్తకుల వేషధారణ చాలా విభిన్నంగా ఉంటుంది. ‘కుటియాట్టం’, ‘కృష్ణన్ అట్టం’ అనే ప్రాచీన సంస్కృత నాటక ప్రదర్శన ప్రక్రియల నుంచి పదహారో శతాబ్ది నాటికి కథాకళి ప్రత్యేక నృత్యశైలిగా రూపు దిద్దుకుంది. రసాభినయానికి అన్ని శాస్త్రీయ నృత్యరీతుల్లోనూ ప్రాధాన్యం ఉన్నా, ముద్రలు, భంగిమలు వంటి అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఉంటుంది. కథాకళిలో మాత్రం నవరసాభినయానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కేరళ ప్రాంతంలోని ట్రావెన్కోర్, పాలక్కాడ్ సంస్థానాలు కథాకళి నృత్యాన్ని బాగా ఆదరించాయి. కథాకళి నృత్యంలో గురుకుల పరంపరలో శిష్యులను తయారు చేసే పద్ధతి పంతొమ్మిదో శతాబ్ది వరకు సాగింది. స్వాతంత్య్రానంతరం కథాకళి కళాకారులు ఒకవైపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూనే, మరోవైపు ఆధునికతను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందారు. కాలమండలం గోపి, కోట్టక్కల్ శివరామన్ వంటి కళాకారులు కథాకళి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారు.మణిపురిఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో పుట్టిన శాస్త్రీయ నృత్యశైలి మణిపురి. దీనినే ‘మణిపురి రాసలీల’ అని, ‘జాగోయి రాస్’ అని కూడా అంటారు. మణిపురి నృత్యానికి మూలాలు ప్రాచీన మైతేయి నాగరికతలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పద్దెనిమిదో శతాబ్దికి చెందిన మైతేయి రాజు చింగ్ థాంగ్ ఖోంబా ప్రస్తుతం ఉన్న మణిపురి నృత్యశైలికి నియమ నిబంధనలను రూపొందించారు. మణిపూర్ రాజ్యాన్ని పరిపాలించిన ఆయన ‘రాజర్షి భాగ్యచంద్ర’గా పేరుపొందారు. మణిపురి నృత్యంలో ఎక్కువగా కృష్ణ లీలలను, భాగవత గాథలను ప్రదర్శిస్తారు. జానపద మూలాల నుంచి రూపొందిన అరుదైన శాస్త్రీయ నృత్యశైలిగా మణిపురి నృత్యానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం 1891లో మణిపూర్ రాజ్యాన్ని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాక మణిపురి నృత్యానికి వైభవం సన్నగిల్లింది. అప్పట్లో ‘విశ్వకవి’ రవీంద్రనాథ్ టాగోర్ మణిపురి నృత్యానికి పునరుజ్జీవం కల్పించేందుకు ఎనలేని కృషి చేశారు. రాజ్‌కుమార్ సింఘజిత్ సింగ్, దర్శనా ఝావేరీ, కళావతీ దేవి, బింబావతి దేవి, నిర్మలా మెహతా వంటి నర్తకులు మణిపురి నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం తీసుకొచ్చారు.సాత్త్రియాఈశాన్య భారతదేశానికి చెందిన మరో శాస్త్రీయ నృత్యశైలి సాత్త్రియా. అసోంలోని సంప్రదాయ ‘అంకియా నాట’ అనే ఏకాంకిల ప్రదర్శనలో భాగంగా ‘భావన’ పేరుతో నృత్యాలను ప్రదర్శించేవారు. ‘అంకియా నాట’ ప్రక్రియను పదిహేనో శతాబ్దికి చెందిన కవి పండితుడు, సంగీతకారుడు, నర్తకుడు అయిన శంకరదేవ్ రూపొందించారు. కాలక్రమేణా ‘సత్త్ర’ అనే వైష్ణవ మఠాలలో ‘అంకియా నాట’ ఏకాంకిలను పూర్తిగాను, ఒక్కోసారి ‘భావన’ నృత్యాన్ని విడిగాను ప్రదర్శించేవారు. కొంతకాలానికి ఈ ప్రక్రియ నుంచి నృత్యం విడివడి ప్రత్యేక శైలిగా రూపొందింది. ‘సత్త్ర’లలో ప్రదర్శించడం వల్ల ఈ నృత్యశైలికి ‘సాత్త్రియా’ అనే పేరు వచ్చింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ 2000 సంవత్సరంలో ‘సాత్త్రియా’ను శాస్త్రీయ నృత్యంగా గుర్తించింది. అప్పటి నుంచి సాత్త్రియా నృత్యానికి ప్రాచుర్యం మొదలైంది. శరోది సైకియా, ఇందిరా బోరా, అనితా శర్మ, అన్వేషా మహంతా తదితరులు సాత్త్రియా నృత్యానికి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు తీసుకొచ్చారు.మోహినీయాట్టంకేరళలో పుట్టిన మరో శాస్త్రీయ నృత్యశైలి మోహినీయాట్టం. క్షీరసాగర మథనం జరిగినప్పుడు అమృతం పంచిపెట్టడానికి శ్రీమహావిష్ణువు దాల్చిన మోహినీ అవతారం నుంచి మోహినీయాట్టం నృత్యానికి ఆ పేరువచ్చింది. కేరళలోనే రూపొందించిన కథాకళి అభినయ ప్రధానమైన నృత్యశైలి అయితే, మోహినీయాట్టం లాస్య ప్రధానమైనది. ఇదివరకు ఎక్కువగా మహిళలే మోహినీయాట్టం నృత్యాన్ని ప్రదర్శించేవారు. ఇటీవలి కాలంలో పురుషులు కూడా దీనిని నేర్చుకుని, ప్రదర్శిస్తున్నారు. వైష్ణవ సంప్రదాయంలోని పురాణగాథలకు సంబంధించిన గీతాలకు అనుగుణంగా ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తారు. క్రీస్తుశకం పన్నెండో శతాబ్ది నుంచి పద్దెనిమిదో శతాబ్ది వరకు అనేక పరిణామాలకు లోనై ఈ నృత్యం ప్రత్యేక శైలిగా ఆవిర్భవించింది. పద్దెనిమిదో శతాబ్ది నాటి నృత్యశాస్త్ర గ్రంథం ‘బలరామ భారతం’ ఈ నృత్యాన్ని ‘మోహినీ నటనం’గా అభివర్ణించింది. స్వాతంత్య్రానికి ముందు ట్రావెన్కోర్ సంస్థానాధీశులు కథాకళితో పాటు మోహినీయాట్టం నృత్యాన్ని కూడా సమాదరించారు. స్వాతంత్య్రానంతరం మోహినీయాట్టం అంతర్జాతీయ వేదికలపైకి కూడా చేరుకుంది. సునందా నాయర్, కళామండలం కల్యాణకుట్టి అమ్మ, గోపికా వర్మ, జయప్రభా మేనన్, పల్లవి కృష్ణన్ వంటి నర్తకులు మోహినీయాట్టం నృత్యానికి దేశ దేశాల్లో ప్రాచుర్యం కల్పించారు.ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాస్త్రీయ, జానపద నృత్యరీతులు ఉన్నాయి. కాలానుగుణంగా మరెన్నో అధునాతన నృత్యశైలులు పుట్టుకొస్తున్నాయి. సంగీతంలాగానే నృత్యం కూడా సహజ భావోద్వేగాలతో ముడిపడిన కళ. వయోభేదం లేకుండా పిల్లలు, పెద్దలు ఆస్వాదించే కళ. నాట్యవేదం ఆబాల గోపాలానికీ జీవననాదం.కథక్ఉత్తరాదిలో ప్రజాదరణ పొందిన శాస్త్రీయనృత్య శైలి కథక్. కథక్ సహా వేర్వేరు శాస్త్రీయ నృత్యరీతులన్నిటికీ భరతుడి నాట్యశాస్త్రమే ప్రామాణిక గ్రంథం. ఉత్తరాదిలో భక్తి ఉద్యమం మొదలైన తొలినాళ్లలో– సుమారు క్రీస్తుశకం పద్నాలుగో శతాబ్ది కాలంలో వారణాసిలో కథక్ ప్రత్యేక నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. భక్తి ఉద్యమ ప్రభావం కారణంగా కథక్ నృత్యంలో రాధాకృష్ణుల లీలా వినోదాలు, భాగవత గాథలు ప్రధాన ప్రదర్శనాంశాలుగా కనిపిస్తాయి. తొలినాళ్లలో ఆలయాలకు పరిమితమైన కథక్ నృత్యానికి మొఘల్ కాలంలో రాజాదరణ లభించింది. కథక్ నర్తకులకు రాజ దర్బారులో నాట్య ప్రదర్శనలు చేసే అవకాశం లభించింది. భారతీయ సంప్రదాయ పద్ధతికి తోడుగా పర్షియన్ శైలిని కలుపుకొని కథక్ ఒక విలక్షణ శాస్త్రీయ నృత్యశైలిగా రూపుదిద్దుకుంది. బ్రిటిష్ కాలంలో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా, స్వాతంత్య్రానంతరం పునరుజ్జీవం పొందింది. బ్రిటిష్ కాలంలో నిరాదరణకు గురైన సంప్రదాయ కళలను ప్రోత్సహించే లక్ష్యంతో అప్పటి ప్రభుత్వం 1956తో ఖైరాగఢ్‌లో ఇందిరా కళా సంగీత విశ్వ విద్యాలయం ప్రారంభిం చింది. ఇందులో కథక్ నృత్యానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. కథక్ డిగ్రీ కోర్సుకు సిలబస్‌ను ప్రఖ్యాత నర్తకుడు పురు దధీచ్ రూపొందించారు. స్వాతంత్య్రానంతరం ఎందరో కళాకారులు కథక్ నృత్యానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు. బిర్జూ మహారాజ్, సితారా దేవి, గోపీకృష్ణ వంటి ఎందరో నర్తకుల కృషి ఫలితంగా కథక్ నృత్యం దేశ విదేశాలకు పాకింది. -
టాలీవుడ్ డైరెక్టర్‌తో సూర్య సినిమా.. అధికారిక ప్రకటన వచ్చేసింది!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ హాజరయ్యారు.ఈ ఈవెంట్లో హీరో సూర్య ఫ్యాన్స్‌కు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన వచ్చే మూవీని టాలీవుడ్ డైరెక్టర్‌తోనే తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్యనే స్వయంగా ప్రకటించారు. దీంతో సూర్య టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.సూర్య గజిని సినిమా వచ్చినప్పుడు నా ఇంజినీరింగ్ పూర్తయిందని దర్శకుడు వెంకీ అట్లూరి తెలిపారు. ఆ సినిమాను థియేటర్లో చూసి ఒక సినిమా ఇలా కూడా ఉంటుందా అనిపించిందన్నారు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ చూసినప్పుడు.. లవ్, ఫెయిల్యూర్, క్రమశిక్షణ నేర్పిన సినిమా సార్ అది అని వెంకీ అన్నారు. #Suriya46 💥💥@Suriya_offl - #VenkyAtluri - @Vamsi84 - @SitharaEnts ❤️🔥❤️🔥 🎥 pic.twitter.com/CD7XEkRz6h— Sithara Entertainments (@SitharaEnts) April 26, 2025 -
తండ్రికి బైక్‌ను బహుమతిగా ఇవ్వాలని బయలుదేరి..
మునగాల(సూర్యాపేట జిల్లా): సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. భీమవరం మండలం తుందుర్రు గ్రామానికి చెందిన చేడె జనార్దన్ కుమార్తె యశస్విని (24) మూడేళ్లుగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోంది.తన తండ్రికి బహుమతిగా ఇవ్వాలనుకుని యశస్విని బుల్లెట్ వాహనాన్ని కొనుగోలు చేసి శుక్రవారం రాత్రి తన సహ ఉద్యోగి బడ్డుకొండ అచ్యుత్‌కుమార్‌తో కలిసి అదే బుల్లెట్‌పై తమ స్వగ్రామమైన తుందుర్రుకు బయలుదేరింది. బుల్లెట్ బైక్‌ను అచ్యుత్‌కుమార్ నడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆకుపాముల శివారులోకి రాగానే హైవేపై పడిఉన్న గేదె కళేబరాన్ని ఢీకొట్టారు. దీంతో యశస్విని బుల్లెట్‌పై నుంచి ఎగిరి రోడ్డుపై పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే లారీ అతివేగంతో వచ్చి రహదారిపై పడిఉన్న యశస్విని మీదుగా వెళ్లింది. దీంతో యశస్విని తల, మెడభాగం ఛిద్రమై అక్కడికక్కడే మృతిచెందింది. అచ్యుత్‌కుమార్ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న మునగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని యశస్విని మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం మృతురాలి కుటుంబ సభ్యులు మునగాలకు చేరుకున్నారు. మృతురాలి బాబాయ్ చేడె సురేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. యశస్విని మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఆ సినిమాని నేను తిరస్కరించలేదు
‘‘తెలుగులో నా తొలి సినిమా ‘హిట్ 3: ది థర్డ్ కేస్’. ఈ సినిమాలో మృదుల అనే పాత్ర చేశాను. ముందు నా క్యారెక్టర్‌కు ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో డబ్బింగ్ చెప్పించారు. కానీ నేనే డబ్బింగ్ చెబితే బాగుంటుందని భావించి, దర్శకుడు శైలేష్గారిని రిక్వెస్ట్ చేస్తే, సరే అన్నారు. అలా నా తొలి తెలుగు సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పాను’’ అని శ్రీనిధీ శెట్టి అన్నారు. నాని హీరోగా నటించిన ‘హిట్ 3: ది థర్డ్ కేస్’ చిత్రంలో శ్రీనిధీ శెట్టి హీరోయిన్గా నటించారు. శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీనిధీ శెట్టి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘హిట్ 3: ది థర్డ్ కేస్’లో స్వతంత్ర భావాలు ఉన్న అమ్మాయి మృదులగా నటించాను. అర్జున్ సర్కార్ (సినిమాలో నాని క్యారెక్టర్ పాత్ర)కు పూర్తి భిన్నమైన మనస్తత్వం మృదులది. సినిమాలో అర్జున్ ఎవరి మాటన్నా వింటాడంటే అది మృదల మాటే. ‘హిట్ 3’లాంటి క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ చిత్రాల్లో హీరోయిన్ పాత్రకు స్కోప్ తక్కువ ఉండొచ్చనుకుంటారు. కానీ ఈ మూవీలో మృదుల పాత్రకు ఇంపార్టెన్స్ ఉంది. ఇక నా కెరీర్లో ఇప్పటివరకు యాక్షన్ చిత్రాలే ఉన్నాయి. ‘కేజీఎఫ్’ సినిమాలో ఉన్న డైలాగ్ మాదిరి... ‘ఐ డోంట్ లైక్ వయొలెన్స్... బట్ వయొలెన్స్ లైక్స్ మీ’ (నవ్వుతూ) అన్నట్లు నాకు యాక్షన్ సినిమాలు వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ మూవీ చేస్తున్నాను’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘హిందీ ‘రామాయణ’ సినిమాలోని సీత పాత్రకు ఆడిషన్ ఇచ్చాను. అప్పటికే ఈ పాత్ర కోసం మేకర్స్ ఆలియా భట్, సాయిపల్లవిలను కూడా సంప్రదించారు. సాయిపల్లవి ఫైనలైజ్ అయ్యారు. అంతేకానీ... నేను ఆ సినిమాను రిజెక్ట్ చేయలేదు. కానీ నేను రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అంత పెద్ద సినిమాను నేనెందుకు తిరస్కరిస్తాను’’ అన్నారు. -
తవ్వకం ఆరంభం
కొత్త సినిమా కోసం సరికొత్తగా మారిపోయారు నాగచైతన్య. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా ఓ మిథికల్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘ఎన్సీ (నాగచైతన్య) 24–ది ఎక్స్కవేషన్ బిగిన్స్’ (తవ్వకం ఆరంభం) అంటూ ఈ సినిమాకు చెందిన స్పెషల్ వీడియోను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రీప్రొడక్షన్ వర్క్స్, సెట్ వర్క్స్, రిహార్శల్స్, సాంకేతికమైన పనుల ప్రీ వర్క్స్ వంటి విజువల్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ‘‘ఈ సినిమా కోసం నాగచైతన్య శారీరకంగా, మానసికంగా కొత్తగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు. అద్భుతమైన కథ, అత్యున్నత స్థాయి నిర్మాణ విలువలతో ఈ సినిమా నాగచైతన్య కెరీర్లో ఓ మైలురాయిలా ఉంటుంది’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అజనీష్ బి. లోక్‌నాథ్, కెమేరా: నీల్ డి. కున్హా. -
నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేరింది
‘‘నేను యాక్టర్ కావాలనుకున్నప్పుడు సూర్య అన్నని కలవాలనుకునేవాణ్ణి. ‘గజినీ’ సినిమా చూసి.. ఆ బాడీ ఏంటి? డ్యాన్స్ ఏంటి? నటన ఏంటి? ఏం చేస్తే ఇవన్నీ వస్తాయో తెలుసుకునేందుకు ఆయన్ని కలవాలని చాలాసార్లు అనిపించేది. కలవాలనే కోరిక ఉన్నా కలవలేకపోయాను. నా ఇరవయ్యేళ్ల ఆకాంక్ష నెరవేర్చిన ఈ మూమెంట్, ఈ ‘రెట్రో’ సినిమా నా జీవితంలో మరపురాని అనుభూతి’’ అని హీరో విజయ్ దేవరకొండ చెప్పారు. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘రెట్రో’. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. జ్యోతిక, సూర్య నిర్మించిన ఈ సినిమా మే 1న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగులో సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ రిలీజ్ చేస్తోంది. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘రెట్రో’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘కశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో తమ కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న వారందరికీ ఒక మాట చెబుతున్నాను.. మేమంతా మీకు అండగా ఉంటాం. నా లైఫ్‌లో ఒక సినిమాటిక్ మెమొరీ అంటే ‘చంచల...’ (సూర్య నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా) పాట వచ్చినప్పుడు... ఆ రోజు నాకు కలిగిన అనుభూతిని ఈరోజు వరకు మరచిపోలేదు. ఇప్పటికీ ఆ పాటని వింటూ నా బాల్యంలోకి వెళుతుంటాను. నాకు ‘పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి’ సినిమాలతో కొంచెం డబ్బు చూసినప్పటి నుంచి చదువుకునేవారి కోసం ఏదైనా చేయాలనే కోరిక ఉండి.. చిన్నగా ట్రై చేశాను. కానీ, పదిహేనేళ్లుగా సూర్య అన్న ‘అగరం ఫౌండేషన్’ ద్వారా వేలమంది చదువుకి ఆర్థిక చేయూతనిస్తూ, ఉద్యోగాలు ఇప్పిస్తుండటం చాలా గొప్ప. ఆయన స్ఫూర్తితో ఈ ఏడాది నేను కూడా విద్యార్థులతో ఓ కమ్యూనిటీ ఏర్పరచి వారికి చేయూతనిస్తాం. ఇక కశ్మీర్ మనదే.. కశ్మీరీయులు మనవారే. ఇండియా.. పాకిస్తాన్ మీద దాడి చేయాల్సిన పనే లేదు. ఈ దాడులు ఇలానే కొనసాగితే పాకిస్తాన్ వాళ్లకే విరక్తి వచ్చి వారి ప్రభుత్వంపై దాడి చేస్తారు. ఇక ‘రెట్రో’ సినిమాని నేను థియేటర్లో చూస్తాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను’’ అన్నారు. సూర్య మాట్లాడుతూ–‘‘కశ్మీర్ ఉగ్రవాదుల దాడిలోప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకుశాంతి చేకూరాలి. ఇలాంటి సంఘటన మళ్లీ ఎప్పుడూ జరగకూడదు. ‘రెట్రో’లో లవ్, కామెడీ, యాక్షన్, ఇంటెన్సిటీ.. అన్నీ ఉంటాయి. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది. నాగవంశీగారిది లక్కీ హ్యాండ్ అంటుంటారు. నా తదుపరి చిత్రాన్ని నాగవంశీగారి నిర్మాణంలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్నాను. మే 1న విడుదలవుతున్న నాని ‘హిట్–3’ కూడా విజయం సాధించాలి. విజయ్ ‘కింగ్ డమ్’ సినిమా కూడా సక్సెస్ కావాలి. ‘అగరం ఫౌండేషన్’ గురించి విజయ్ మాట్లాడాడు.. అయితే చిరంజీవిగారి బ్లడ్ బ్యాంక్ నా సేవా కార్యక్రమాలకు స్ఫూర్తి అని చెప్పవచ్చు. మా ‘అగరం ఫౌండేషన్’కి ఎందరో తెలుగువారు అండగా ఉన్నారు’’ అన్నారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ–‘‘రెట్రో’ సినిమాని తెలుగులో పంపిణీ చేసే అవకాశం ఇచ్చిన సూర్య సర్కి థ్యాంక్స్. ఈ సినిమాతో మీకు ఇక్కడ బ్లాక్ బస్టర్ ఇస్తామనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ వేడుకలో ‘రెట్రో’ చిత్ర సహ నిర్మాత కార్తికేయన్ సంతానం, డైరెక్టర్ వెంకీ అట్లూరి, పాటల రచయిత కాసర్ల శ్యాం, నటుడు కరుణాకరన్ మాట్లాడారు. -
60 ఏళ్లు.. సగర్వంగా మన ‘ఆంగ్రూ’
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) 60 ఏళ్ల పండుగకు ముస్తాబయ్యింది. ఈ నెల 29, 30 తేదీల్లో ఈ ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ 60 ఏళ్ల సాధించిన పురోగతిపై ప్రత్యేక కథనం..సాక్షి, అమరావతి: స్వాతంత్ర్యానంతరం రెండో జాతీయ విద్యా కమిషన్ సిఫార్సు మేరకు రాష్ట్రానికో వ్యవసాయ విశ్వ విద్యాలయం ప్రాతిపదికన ఏర్పాటైన తొలి యూనివర్సిటీ ఇది. ఈ వర్సిటీ పరిధిలో ప్రస్తుతం ఏడు ప్రభుత్వ వ్యవసాయ, 6 అనుబంధ, 2 ఫుడ్ సైన్స్, 2 అగ్రి ఇంజనీరింగ్, ఒక కమ్యూనిటీ సైన్స్, 19 ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్, 62 ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తున్నారు. అరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో వర్సిటీ ఎన్నో విజయాలు సాధించింది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.. రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త రకాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాలు అభివృద్ధి చేయడమే కాకుండా, సన్న రకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి వినియోగంలో వర్సిటీ రకాలు తమ ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాయి. కీర్తి కిరీటంలో ఆణిముత్యాలు.. » దేశంలో మూడో వంతు ప్రజలు ఆహారంగా తింటున్న వరి రకాలను అభివృద్ధి చేసిన ఘనత ఆంగ్రూకు దక్కుతుంది. దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు..తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పది మందిలో తొమ్మిది మంది తినే ఆహార గింజలను వర్సిటీ సృష్టించింది. » 60 ఏళ్లలో 503 వంగడాలను వర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిలో ప్రధానంగా చిరుధాన్యాలు, ధాన్యాలు 217, అపరాలు 84, నూనె గింజలు 56, వాణిజ్య పంటలు 89, ఉద్యాన పంటలు 54లతో పాటు రెండు పశుగ్రాస, ఒకటి బయో డీజిల్ పంటలకు సంబంధించిన వంగడాలున్నాయి. దేశంలోని 4.60 కోట్ల హెక్టార్ల వరి విస్తీర్ణంలో 1.40 కోట్ల హెక్టార్లలో వర్సిటీ రకాలే సాగవుతున్నాయి. » ఏపీలో వర్సిటీ వరి రకాలు 87 శాతం, నువ్వుల రకాలు 87.50 శాతం, వేరుశనగ రకాలు 95 శాతం, కందుల రకాలు 72 శాతం, చెరుకు రకాలు 62 శాతం, పప్పు ధాన్యాలు 36 శాతం విస్తీర్ణంలో సాగవుతున్నాయి. » వర్సిటీ అభివృద్ధి చేసిన వరి రకాలు ఏపీలో 74 శాతం, జాతీయ స్థాయిలో 25 శాతం విస్తీర్ణంలో సాగవడమే కాకుండా, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, ఉగాండా, ఇథియోఫియా, కెన్యా వంటి దేశాల్లో కూడా సాగవుతున్నాయి. » 15 రాష్ట్రాలతో పాటు 150కు పైగా ప్రైవేటు విత్తన కంపెనీలకు బ్రీడర్ విత్తనాలను ఇస్తున్న ఏకైక వర్సిటీ కూడా ఇదే. » వర్సిటీ అభివృద్ధి చేసిన రకాలతో జాతీయ స్థాయిలో రూ.62,317 కోట్ల ఆదాయాన్ని రైతులు ఆర్జిస్తుండగా, ఏపీలో వర్సిటీ వరి రకాల ద్వారా రూ.20,243 కోట్లు, అపరాల ద్వారా రూ.2,113 కోట్లు, నూనె గింజల ద్వారా రూ.2,862 కోట్లు కలిపి మొత్తం రూ.25 వేల కోట్లకు పైగా ఆదాయాన్ని రైతులు ఆర్జిస్తున్నారు. » ఎగుమతుల్లో సింహ భాగమైన బాస్మతేతర బియ్యంలో మూడోవంతు ఆంగ్రూ అభివృద్ధి చేసిన రకాలే. వీటి ద్వారా ఏటా 8–10 వేల కోట్ల విదేశీ మారక ద్రవ్య ఆర్జన జరుగుతోంది.జగన్ హయాం.. స్వర్ణ్ణయుగంవైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో వర్సిటీ అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిచింది. అత్యాధునిక సౌకర్యాలు. అధునాతన భవనాలు సమకూర్చడంతో విస్తృత పరిశోధనలతో దూసుకెళ్లింది. డీజీసీఏ ఆమోదించిన డ్రోన్ శిక్షణ కేంద్రాన్ని గుంటూరు లాంలోని అప్సరా సెంటర్లో ప్రారంభించారు. పురుగు, తెగులు మందుల పిచికారికి ఆంగ్రూ పుష్పక్–1, విత్తనాలు, ఎరువుల పిచికారికి పుష్పక్ –2 డ్రోన్స్‌ను అభివృద్ధి చేశారు. 10 పంటల్లో పిచికారీ చేసి సత్ఫలితాలను సాధించారు. జాతీయ స్థాయిలో డ్రోన్ పైలెట్ శిక్షణ కోసం డీజీసీఏ సర్టిఫికేషన్ పొందిన తొలి వర్సిటీగా నిలిచింది. ఐసీఏఆర్ ర్యాంకింగ్స్‌లో 2022–23లో జాతీయ స్థాయిలో వర్సిటీ ఏడవ స్థానంలో నిలవగా, పీజీ అడ్మిషన్స్లో రెండో స్థానంలో నిలిచింది. అన్ని ఇనిస్టిట్యూట్స్లలో 11వ స్థానంలో నిలిచింది. అగ్రిప్రెన్యూర్షిప్ ఓరియంటేషన్, ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ (సంకల్ప, 2021)లో 55 ఇంక్యుబేట్లు ఎంపికయ్యాయి. ఆర్ఎఆర్ఎస్– తిరుపతిలో అభివృద్ధి చేసిన మల్టీ టాస్క్ టూల్ బార్, నాప్సాక్ వీడర్లు వినూత్న వ్యవసాయ యంత్రాలుగా ఎంపికయ్యాయి. 2020లో రెండో అత్యధిక సంఖ్యలో ఐసీఏఆర్ పీజీ స్కాలర్షిప్లను పొందిన వర్సిటీగా ఐసీఏఆర్ నుంచి జాతీయ అవార్డు దక్కింది. గిరిజన వ్యవసాయ వ్యవస్థల్లో అత్యుత్తమ పరిశోధన కోసం ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అవార్డు–2020 వరించింది. వ్యవసాయ పరిశోధన, విద్యారంగ కేటగిరిలో 2022లో స్కాచ్ సిల్వర్,, స్కాచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డు సర్టిఫికెట్సహా ఎన్నో అవార్డులు వర్సిటీకి దక్కాయి. అలాంటి యూనివర్సిటీ 2024–25లో వ్యవసాయ వర్సిటీల్లో 26వ స్థానానికి, ఓవర్ ఆల్గా 151వ స్థానానికి దిగజారిపోయింది. ఎంతో గర్వంగా ఉందిఈ 60 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఆంగ్రూ ఎన్నో విజయాలను సాధించింది. జాతీయ స్థాయిలో 40 శాతం మంది రైతులు ఆంగ్రూ రకాలు సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతి రైతు వర్సిటీ రకాలపైనే ఆదారపడి వ్యవసాయం చేస్తున్నారు. ప్రతి ఏటా వరితో పాటు ఇతర పంటల్లో కూడా పెద్ద సంఖ్యలో కొత్త వంగడాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. ఆంగ్రూ 60 ఏళ్లు పండుగ వేళ వీసీగా ఉండడం గర్వంగా ఉంది. – డాక్టర్ శారదా జయలక్ష్మి దేవి, వైస్ చాన్సలర్ -
కిడ్‌ఫ్లూయెన్సర్... కిం కర్తవ్యం
యూ ట్యూబ్‌లో కిడ్ఫ్లూయెన్సర్ల వైరల్ వీడియోలు ప్రవాహంలా కనిపిస్తాయి. క్యాచీ కంటెంట్‌తో లక్షల్లో వ్యూస్ సాధిస్తున్నారు. లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉన్నారు. మన దేశంలో క్లిడ్ఫ్లూయెన్సర్ల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. అయితే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.తెర వెనుక కథ గురించి చర్చ మొదలైంది. షూటింగ్‌ల కోసం వారు తరచుగా స్కూల్‌కు వెళ్లకుండా ఎక్కువ సెలవులు పెడుతున్నారా? సరిగా తింటున్నారా? తగినంత నిద్ర ఉంటోందా? కంటెంట్‌కు సంబంధించి ఒత్తిడికి గురవుతున్నారా? అందరు పిల్లల్లా సాధారణ జీవితాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారా... ఇలాంటి సందేహాలు ఎన్నో ఉన్నాయి.బాగా చదివే పిల్లలు కూడా ‘కిడ్‌ఫ్లూయెన్సర్’ ట్యాగ్‌లైన్ పుణ్యమా అని చదువులో వెనకబడి పోతున్నారు. ‘నేను చాలా సాధించాను. నేను చాలా గ్రేట్’ అనే భావన పెరిగిపోతుంది. ‘యాభై ఏళ్ల క్రితం అకాడమిక్ ఎక్స్‌లెన్స్ గోల్డ్ స్టాండర్డ్, ముప్పై ఏళ్ల క్రితం ఆటలు ఉండేవి. ఇప్పుడు క్రియేటివిటీ, డ్యాన్స్, మ్యూజిక్, విజువల్ కంటెంట్. ఒక్క వైరల్ వీడియో చాలు పిల్లలకు రాత్రికి రాత్రి స్టార్డమ్ తీసుకురావడానికి. ఈ తక్షణ పాపులారిటీ వల్లే పిల్లలు, తల్లిదండ్రులు వైరల్ కంటెంట్‌పై దృష్టి పెడుతున్నారు’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ డా.మేఘా పుష్కర్ణ. -
డీఎస్సీ వెబ్సైట్లో మార్పులు
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ–2025 దరఖాస్తు ప్రక్రియలో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పాఠశాల విద్యాశాఖ తొలగించింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెన్త్, ఇంటర్ మార్కుల పర్సంటేజీ సీలింగ్ తొలగించింది. డీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై శుక్రవారం ‘మెగా అగచాట్ల డీఎస్సీ’ పేరుతో సాక్షి పత్రికలో వచ్చిన కథనంపై విద్యాశాఖ స్పందించింది. సాంకేతిక సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో జనరల్ అభ్యర్థులు 50 శాతం, రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులు 45% మార్కులు తప్పనిసరి చేసింది. ఎస్జీటీ పోస్టులకు ఇంటర్లో 50, 45 శాతం మార్కులు నిర్ణయించింది. అయితే, ఈ మార్కుల శాతం కనీస అర్హతలైన ఎస్‌ఏలకు పదో తరగతి, ఇంటర్లోను అనుసరించడంతో అంతకంటే తక్కువ మార్కులు వచి్చన అభ్యర్థుల దరఖాస్తు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. అలాగే, బీఎస్సీలో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్‌కు అర్హత కల్పించారు. అయితే, వెబ్సైట్లో కంప్యూటర్ సైన్స్ ఆప్షన్ లేకపోవడంతో వారం రోజులుగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. దీంతోపాటు ఓపెన్ స్కూలింగ్‌లో పది, ఇంటర్ పూర్తిచేసిన వారికీ ఆప్షన్ లేకపోవడంతో అభ్యర్థుల్లో కంగారు మొదలైంది. ఈ సమస్యలపై కథనం రావడంతో అధికారులు పరిష్కరించారు. వీటితోపాటు అరబిక్ లాంగ్వేజ్ ఆప్షన్‌ను ఇంటర్, డిగ్రీ కోర్సులకు ఎంపిక చేసుకునేలా ఆన్లైన్లో మార్పులు చేశారు. డిగ్రీలో 35 మార్కులకూ అప్లోడ్పై ఆశ్చర్యం ఎస్జీటీ రాసేవారికి ఇంటర్లో జనరల్ అభ్యర్థులు 50 శాతం, రిజర్వుడు అభ్యర్థులకు 45 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు డిగ్రీలో 50, 45 శాతం, పీజీటీలకు పోస్టు గ్రాడ్యుయేషన్‌లో 55, 50 శాతంగా మార్కుల సీలింగ్ పెట్టారు. దీంతో డిగ్రీ సీలింగ్ మార్కులు కంటే తక్కువ ఉంటే దరఖాస్తు ప్రక్రియలో ఎర్రర్ చూపించేది. కానీ, శనివారం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఆయా పోస్టులకు 35 శాతం మార్కులు ఉన్నా దరఖాస్తు ప్రక్రియ కొనసాగడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
నిరీక్షణ ఫలించింది...
కొన్ని సంవత్సరాల నుంచి భర్తతో కలిసి మన దేశంలో ఉంటున్న క్రిస్టెన్ ఫిషర్ అనే అమెరికన్ భారత్‌లో తన అనుభవాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. దిల్లీలో ఉంటున్న ఫిషర్ దంపతులు నిషా అనే దివ్యాంగురాలైన బాలికను దత్తత తీసుకోవాలనుకున్నారు. అయితే దత్తత ప్రక్రియ సుదీర్ఘంగా కొనసాగింది.‘2023లో అక్టోబర్‌లో దత్తత కోసం దరఖాస్తు చేసుకోగా, 2024లో నిషాకు దగ్గరయ్యాం. 2025 ఏప్రిల్ నాటికి దత్తత పూర్తయింది. ఇప్పుడు నిషా మా అందమైన కుమార్తె’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసింది ఫిషర్.‘కౌంటింగ్ డౌన్ ది డేస్ అన్టిల్...’ ట్యాగ్‌లైన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో తాను దత్తత తీసుకున్న పాప కనిపిస్తుంది. మరో వీడియోలో చిన్నారి నిషాకు సంబంధించిన ఎమోషనల్ గ్లింప్స్‌ను షేర్ చేసింది. దివ్యాంగురాలు అనే కారణంతో నిషాను చిన్న వయసులోనే తల్లిదండ్రులు వదిలేశారు. రెండు సంవత్సరాలు అనాథాశ్రమంలో పెరిగింది నిషా. ‘స్పెషల్ నీడ్స్ చైల్డ్‌ను దత్తత తీసుకోవాలనుకోవడానికి కారణం...వారికి కొత్త జీవితం ఇవ్వాలనుకోవడం’ అంటుంది క్రిస్టెన్ ఫిషర్. -
కశ్మీరుకు కాదు కోనసీమకు..
మలికిపురం: గోదావరి తరగలపై.. బోట్ల మీద లాహిరి లాహిరిలో అంటూ షికారు చేస్తే.. ఆ హాయి చెప్పలేనిది. ఈ అనుభూతిని పొందేందుకు కోనసీమకు వస్తున్నాం అంటున్నారు పర్యాటకులు. వేలాదిమంది రాకపోకలతో వేసవి సీజన్ గోదావరి జిల్లాలలో టూరిస్ట్ కేంద్రాలు, చుట్టుపక్కల పట్టణాల్లో హోటళ్లకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతుంది. ఈసారి కూడా అలానే కాస్త ఎక్కువగా ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అఖండ గోదావరి తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద మూడు ప్రధాన పాయలుగా చీలి.. పల్లెల మీదుగా.. పచ్చని పొలాల మధ్య ప్రవహిస్తూ.. కోనసీమ జిల్లాలో సాగర సంగమం చేసే ప్రదేశాలను కనులారా వీక్షించాలని భావిస్తున్నారు. సెలవులు ప్రారంభం కావడంతో ప్రకృతి ప్రేమికులు పొలోమంటూ బృందాలుగా సిద్ధమవుతున్నారు. దిండి.. ఆతిథ్యం దండి.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని వశిష్ట నదీ తీరంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏర్పాటు చేసిన ప్రముఖ పర్యాటక కేంద్రం దిండి. ఇక్కడ కేరళను తలదన్నేలా ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వేసవి వచ్చిందంటే చక్కటి విడిది కేంద్రంగా మారుతుంది. కార్పొరేట్ హోటళ్లను తలదన్నే రీతిలో విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక్కడ టూరిజం శాఖ అన్ని సౌకర్యాలు కల్పించింది. హరిత కోకోనట్ కంట్రీ రిసార్ట్స్, సరోవర్ పోర్టికో వంటి గ్రూప్ హోటల్స్‌లో ఏసీ గదులు, ఏసీ సూట్లు అందుబాటులో ఉన్నాయి. గోదావరిలో కొత్త జంటలు ఏకాంతంగా విహరించేందుకు ఒక్కొక్కటి రూ.కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన రెండు భారీ హౌస్ బోట్లు సిద్ధంగా ఉన్నాయి. ఇంకా గ్రూప్ ఫంక్షన్లు ఏర్పాటు చేసుకునేందుకు ఫాంటూన్ బోటు ఉంది. నదిలో దూసుకెళ్లేందుకు స్పీడ్ బోట్, జెట్ స్కీ ఆత్రేయ బోట్లు అందుబాటులో ఉన్నాయి. గత 15 ఏళ్లలో రాష్ట్రం, దేశం నలుమూలల నుంచి వేలాదిమంది దిండిని సందర్శించారు. నాడు వైఎస్ వేసిన బీజం.. నేడు యువతకు ఉపాధి 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దిండి టూరిజానికి బీజం వేశారు. అది ఇప్పుడు వట వృక్షం మాదిరిగా ఎదిగింది. అప్పట్లో రూ.4 కోట్లతో రిసార్ట్ నిర్మించి, నాలుగు బోట్లు పెట్టించారు. తర్వాతరూ.10 కోట్లతో అభివృద్ధి చేశారు. ప్రస్తుతం రూ.వందల కోట్లతో ప్రైవేటు టూరిజం ప్రాజెక్టులు వచ్చాయి. ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. గదులు, వసతులు సరిపోకపోవడంతో ప్రస్తుతం మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసేలా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. టూరిజం కేంద్రాలున్న గ్రామాల్లో, గోదావరి, సముద్ర తీర సమీపాన చిన్న హౌస్‌లు నిర్మించుకునేందుకు బ్యాంకు రుణం ఇచ్చేందుకు, లోకల్ మేడ్ ఫుడ్ వ్యాపారాలు పెట్టుకుని ఆదాయం పొందేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధ్యాత్మిక పర్యాటకం టూర్‌కు వచ్చినవారు ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించుకుంటున్నారు. పర్యాటకుల రద్దీతో హోటల్స్, రిసార్ట్స్ నిర్వాహకులు నూరు శాతం ఆక్యుపెన్సీ పొందుతున్నారు. వేసవిలో దిండి చుట్టుపక్కల ప్రభుత్వ, ప్రైవేటు టూరిజం ద్వారా రూ.20 కోట్లపైగా టర్నోవర్ జరుగుతుందని అనధికారిక అంచనా. దిండికి దారి... దిండి పర్యాటక కేంద్రం కోనసీమ–పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య మలికిపురం మండలం వశిష్ట గోదావరి తీరంలో ఉంది. హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులు పాలకొల్లు రైల్వే స్టేషన్లో దిగి ఆటోలు, ప్రైవేటు వాహనాల్లో రావచ్చు. పాలకొల్లు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి రాజోలు వచ్చే బస్సులు ఎక్కి దిండిలో దిగవచ్చు. రాజమహేంద్రవరం మీదుగా వచ్చేవారు రాజోలు చేరుకుని, అక్కడినుంచి పాలకొల్లు వెళ్లే బస్సు ఎక్కి దిండిలో దిగవచ్చు. దిండి పాలకొల్లు నుంచి 15 కిలోమీటర్లు, రాజోలు నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖ నుంచి వచ్చే పర్యాటకులు కాకినాడ, అమలాపురం, రాజోలు మీదుగా దిండికి చేరుకోవచ్చును. ప్రత్యేక ఆటోలు కూడా ఉన్నాయి. రిసార్ట్స్‌లో గదుల రేట్ల వివరాలు ఏసీ స్టాండర్డ్ రూమ్ : రూ.2800 (24 గంటలు) ఏసీ డీలక్స్ రూమ్: రూ.3,884 (24 గంటలు) రిసెప్షన్ నంబరు : 98487 80524 హౌస్ బోట్ల రేట్ల వివరాలు24 గంటల ప్యాకేజీ: రూ.15 వేలు (ఉదయం 10 నుంచి మర్నాడు ఉదయం 9 వరకు) 12 గంటల ప్యాకేజీ: రూ.12 వేలు (ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకు) » బోటులో రెండు గదులు, అటాచ్డ్ బాత్రూములు, డైనింగ్ హాలు ఉంటాయి. రెండు జంటలు నలుగురు పిల్లలతో ఒకేసారి విహరించవచ్చు. » ఫాంటూన్ బోటు, ఆత్రేయ బోట్లలో ట్రిప్‌ల వారీగా రూ.80 పైగా టికెట్ ధరలు ఉంటాయి. ఫాంటూన్ బోటులో గంటకు రూ.2,500 ఉంటుంది. » లగ్జరీ బోటు: నదిలో పలువురు పర్యాటకులు గ్రూపుల వారీగా అలా ట్రిప్‌నకు వెళ్లి రావచ్చు. ఒక్కొక్కరికీ టికెట్ రూ.150. స్పీడ్ బోటు: ఇది కూడా నదిలో మూడు కిలోమీటర్ల దూరం ఒకేసారి ముగ్గురిని మూడు నిమిషాల్లో తిప్పి తీసుకొస్తుంది. ట్రిప్‌నకు రూ.350. » పిల్లలు, పెద్దలు జలకాలాడేందుకు స్విమ్మింగ్ పూల్ ఉంది. » ఆకలేస్తే కోనసీమ వంటకాలు ఆరగించేందుకు రెస్టారెంట్లు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు: దిండికి దాదాపు 60 కిలోమీటర్ల పరిధిలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం దిండి నుంచి 18 కిలోమీటర్లు. అంతర్వేదిలో గోదావరి నదీ సాగర సంగమం, బీచ్, సముద్ర తీరంలోని బ్రిటీష్ కాలం నాటి నౌకా దిక్సూచి లైట్ హౌస్‌లు పర్యాటకులకు కనువిందు చేస్తాయి. ఇంకా అయినవిల్లి, అప్పనపల్లి, వాడపల్లి, ద్రాక్షరామ, పిఠాపురం, సామర్లకోట, మందపల్లి పుణ్యక్షేత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఆహో అనేలా హోటళ్లు.. ఆన్లైన్ విధానం రావడంతో పాలకొల్లు, నర్సాపురం, రాజమహేంద్రవరం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు రైల్వే స్టేషన్ల నుంచి, రాజమహేంద్రవరం, గన్నవరం విమానాశ్రయాల నుంచి దిండి చుట్టుపక్కల విహార కేంద్రాల్లో హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు. అంతర్వేది సాగర సంగమం, లొల్ల లాకులు, కోరంగి అడవుల్లో పచ్చటి అందాలను వీక్షిస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. కేరళకు దీటుగా.. దిండి టూరిజం కేంద్రం ద్వారా కోనసీమ, గోదావరి జిల్లాల టూరిజం కేరళకు దీటుగా ఎదిగింది. పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రకృతి ప్రేమికులతో పాటు టెంపుల్ టూరిజం కూడా అభివృద్ధి చెందింది. వేసవిలో ఆక్యుపెన్సీ గణనీయంగా ఉంటుంది. తదనుగుణంగా ఏర్పాట్లు చేశాం. – కె.మురళీధర్, ఏపీ టూరిజం మేనేజర్ -
సోలార్ సఖి
రైల్లో తొలిసారి ప్రయాణించిన ఆ మహిళలు.... ‘రైలు ప్రయాణం ఇంత బాగుంటుందా!’ అని సంబరపడి పోయారు. ఆ తరువాత మరో ప్రయాణం మొదలు పెట్టారు.అయితే అది రైలు ప్రయాణం కాదు. తమ జీవితాలను మార్చివేసిన ప్రయాణం. చిన్న చదువులు చదువుకున్న ఎంతో మంది గ్రామీణ మహిళలు సోలార్ ఇంజినీర్లుగా, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా రాణిస్తున్నారు...రాజస్థాన్‌లో నిశ్ఛలగఢ్కు చెందిన తవ్రీదేవి ఎన్నో సంవత్సరాలు విద్యుత్ సౌకర్యం లేని ఇంట్లోనే గడిపింది. అయిదవ తరగతి తరువాత తల్లిదండ్రులు చదువు మాన్పించడంతో ఇంటి పనులు చేసేది. గొర్రెలు మేపేది. ఇల్లే ప్రపంచంగా బతుకుతున్న తవ్రీదేవి జీవితాన్ని ‘సోలార్ పవర్’ మార్చి వేసింది. హర్మదా(జైపూర్)లో ఐదు నెలల సోలార్ ఇంజినీరింగ్ శిక్షణ కార్యక్రమం ఆమె జీవితాన్ని కొత్త దారిలోకి తీసుకువెళ్లింది.సోలార్ ఇంజినీరింగ్ శిక్షణ కోసం సిద్ధం అయినప్పుడు.. ‘ఎందుకులే’ అన్నారు తల్లిదండ్రులు. వారిని బలవంతంగా ఒప్పించాల్సి వచ్చింది, ‘మా కమ్యూనిటీలోని మహిళలు ఎప్పుడూ ముసుగు లేకుండా ఒంటరిగా బయటకు వెళ్లలేదు. నేను ఎప్పుడూ పట్టణ ప్రాంతానికి ఒంటరిగా వెళ్లలేదు’ అంటుంది తవ్రీదేవి.కిషన్‌గడ్‌కు వెళ్లడం...తన తొలి రైలు ప్రయాణం! ‘అది పూర్తిగా కొత్త అనుభవం. ప్రయాణంలోని ఆనందం తెలిసొచ్చింది’ అంటుంది తవ్రీదేవి. శిక్షణలో సోలార్ ఇన్స్టలేషన్, ఫీల్డ్‌వర్క్‌కు అవసరమైన నైపుణ్యాలు సంపాదించింది. ఆ తరువాత స్వగ్రామానికి తిరిగివచ్చింది. ‘మేము చాలా సంవత్సరాలు చీకటిలో జీవించాము. అందుకే మా జీవితాల్లో వెలుగు తీసుకురావాలనుకున్నాను’ అంటుంది తవ్రీదేవి.సోలార్ ఇంజినీర్‌గా కొత్త జీవితాన్నిప్రారంభించిన తవ్రీదేవి తన గ్రామానికి విద్యుత్ వెలుగులు తీసుకువచ్చింది. భారత రాష్ట్రపతి నుండి ‘ఆది సేవా గౌరవ్ సమ్మాన్’ అవార్డ్ అందుకుంది. ఇది కేవలం తవ్రీదేవి విజయగాథ మాత్రమే కాదు... జార్ఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, నాగాలాండ్‌తో సహా పదిరాష్ట్రాలలో మూడువేల మందికి పైగా గ్రామీణ మహిళా సోలార్ ఇంజినీర్ల విజయగాథ.తమ గ్రామాల్లో సోలార్ ΄్యానెళ్లను ఒంటిచేత్తో మరమ్మతు చేసే వీరు పారిశ్రామికవేత్తలుగా కూడా ఎదిగారు. ఈ మార్పుకు కారణం హర్ష్ తివారీ నేతృత్వంలోని ఈఎంపీఐ ఇంటర్నేషనల్. ఈ సంస్థ శిక్షణ కార్యక్రమాల ద్వారా గ్రామీణ ప్రాంత మహిళలు సోల్డరింగ్, వైరింగ్, బ్యాటరీ సెటప్, ఫాల్ట్ ఫైండింగ్, ఇన్స్టలేషన్లలోప్రావీణ్యం సాధించారు. గ్రామీణ మహిళలకు సాంకేతిక నైపుణ్యం, ఆర్థికస్వాతంత్య్రం లక్ష్యంగా ఈఎంపీఐ ఇంటర్నేషనల్ పనిచేస్తోంది.శిక్షణ అనంతరం మహిళలు తమ గ్రామాల్లో సోలార్ సొల్యూషన్స్ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. మరమ్మతులు, ఫస్ట్‌లెవల్ చెకప్‌లు నిర్వహించేందుకు వీలుగా చిన్న ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తారు. గ్రామస్థాయి ఇంధన మౌలిక సదుపాయాలు సజావుగా సాగేలా చూస్తారు. శిక్షణ పూర్తయిన తరువాత క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మహిళా సోలార్ ఇంజినీర్లను ‘సోలార్ సఖీ’ అని పిలుస్తారు.‘వ్యవసాయంతో పాటు చిన్న తరహా పరిశ్రమలలో సౌరశక్తితో నడిచే పరికరాలకు డిమాండ్ పెరుగుతుంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈఎంపీఐ ఇంటర్నేషనల్ సోలార్ సఖీలకు శిక్షణ ఇస్తోంది. జీవనోపాధి కల్పిస్తుంది. టెక్నికల్ ట్రైనింగ్‌తోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, కస్టమర్ ఎంగేజ్మెంట్లో కూడా శిక్షణ ఇస్తాం. గ్రామాల్లో సోలార్ సెటప్లలో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే సోలార్ సఖులు పరిష్కారం చూపుతున్నారు’ అంటున్నాడు హర్ష్ తివారీ. -
కాలుష్యకాసారంగా కృష్ణా నది
మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్కు సమీపంలో జన్మించి, ఒంపు సొంపులతో బిరబిరా సాగుతూ కృష్ణా జిల్లా హంసలదీవి వరకు పరుగులిడే కృష్ణా నది తెలుగు రాష్ట్రాలకు జీవనాధారం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సాగు, తాగునీటి కోసం అధికంగా ఆధారపడేది కృష్ణా జలాలపైనే. నిత్యం నీరు పారే ఈ జీవ నది మానవ తప్పిదాల కారణంగా ఇప్పడు కాలుష్యకాసారంగా మారింది. ఒకప్పుడు నేరుగా తాగేంత స్వచ్ఛంగా ఉన్న కృష్ణా నది నీరు ఇప్పుడు శుద్ధి చేయనిదే తాగకూడని దశకు చేరాయి. ఈ నది జలాల్లో క్షార స్వభావం, బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ), ప్రమాదకర బ్యాక్టీరియా (ఫీకల్ కోలిఫారమ్), ఘన వ్యర్థాలు అధికంగా ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (ఏపీపీసీబీ) గత నెల (మార్చి)లో నిర్వహించిన పరీక్షల్లో వెల్లడైంది. కృష్ణా నీటిని శుద్ధి చేయకుండా తాగడం శ్రేయస్కరం కాదని నిపుణులు చెబుతున్నారు. శుద్ధి చేయకుండా తాగితే డయేరియా, చర్మ వ్యాధుల, ఇతర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ నది పరీవాహక ప్రాంతంలో నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో మురుగునీటిని యథేచ్ఛగా వదిలేయడం, పారిశ్రామిక వ్యర్థాలను విడిచిపెట్టడం, అనేక ప్రాంతాల్లో నదినే డంపింగ్ యార్డ్‌గా మార్చేయడం వల్ల జలాలు కలుషితమవుతున్నాయి. అడవులను నరికివేయడం, గనులను ఇష్టారాజ్యంగా తవ్వడం వల్ల కూడా నది కలుషితమవుతోంది. పర్యవసానంగా కృష్ణా జలాలు నేరుగా తాగడానికి పనికి రాకుండా పోతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి, అమరావతి ప్రమాదకర బ్యాక్టీరియా కృష్ణా జలాల నాణ్యతపై ఏపీపీసీబీ ప్రతి నెలా పరీక్షలు చేస్తోంది. ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షల్లో కృష్ణా జలాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. పీహెచ్ 7 శాతం లోపు ఉంటే ఆమ్ల స్వభావం.. 7 శాతం కంటే ఎక్కువ ఉంటే క్షార స్వభావం ఉన్నట్లు లెక్క. పీహెచ్ 7 ఉంటే స్వచ్ఛమైన నీరుగా లెక్క. కానీ.. కృష్ణా జలాల్లో పీహెచ్ 7 శాతం కంటే ఎక్కువగా ఉంది. అంటే జలాల్లో క్షార స్వభావం ఎక్కువ ఉన్నట్లు స్పష్టమవుతోంది. నీటిలో కరిగిన ఆక్సిజన్ (డీవో), బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (బీవోడీ) కూడా మోతాదుకు మించి ఉన్నట్లు వెల్లడైంది. తాగే నీటిలో అత్యంత ప్రమాదకరమైన ఫీకల్ కోలీఫామ్ బ్యాక్టీరియా వంద మిల్లీ లీటర్లకు ఒక్కటి కూడా ఉండకూడదు. కానీ.. కృష్ణా జలాల్లో వంద మిల్లీ లీటర్లకు 11 నుంచి 58 వరకూ ఈ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది.నీటిలో ఘనవ్యర్థాలు వంద మీల్లీ లీటర్లకు 500 మిల్లీ గ్రాముల వరకూ ఉండవచ్చు. కానీ.. కృష్ణా నీటిలో ఘన వ్యర్థాలు అంతకంటే ఎక్కువ ఉన్నట్లు వెల్లడైంది. మురుగు నీటిని, పారిశ్రామిక వ్యర్థ జలాలను శుద్ధి చేయడం, వ్యర్థాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా కృష్ణా నదిని స్వచ్ఛంగా మార్చవచ్చునని నిపుణులు చెబుతున్నారు. బీఐఎస్ ప్రమాణాల మేరకు తాగు నీటికి కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిర్దేశించిన ప్రమాణాలు1. పీహెచ్ 6.5 నుంచి 8.5 శాతం లోపు ఉండొచ్చు 2. డీవో (డిజాల్‌్వడ్ ఆక్సిజన్) లీటర్ నీటికి 6 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ ఉండాలి 3. బీవోడీ (బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్) లీటర్ నీటికి 2 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు 4. టోటల్ కోలీఫామ్ (టీసీ– బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్ల నీటికి 50 లోపు ఉండొచ్చు 5. ఫీకల్ కోలీఫామ్ (ఎఫ్‌సీ– ప్రమాదకర బ్యాక్టీరియా) 100 మిల్లీలీటర్లకు నీటికి ఒక్కటి కూడా ఉండకూదు 6. టీడీఎస్ (టోటల్ డిజాల్‌్వడ్ సాలిడ్స్) లీటర్ నీటికి 500 మిల్లీగ్రాముల లోపు ఉండొచ్చు -
‘సిట్’ చిలకమ్మ.. కట్టుకథలు
సాక్షి, అమరావతి: టీడీపీ వీరవిధేయ సిట్ కట్టుకథలు అంతూ పొంతూ లేకుండా సాగుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు దర్యాప్తు నివేదికల పేరిట అవాస్తవాలు, అభూతకల్పనలతో కనికట్టు చేసేందుకు బరితెగిస్తోంది. ఆ కేసులో అక్రమంగా అరెస్టు చేస్తున్నవారి వాంగ్మూలాల పేరిట న్యాయస్థానానికి సమర్పిస్తున్న రిమాండ్ రిపోర్టులే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేస్తున్నాయి. మొన్న రాజ్ కేసిరెడ్డి.. నిన్న చాణక్య.. నేడు శ్రీధర్ రెడ్డి.. ఈ ముగ్గురి రిమాండ్ రిపోర్టులు పరిశీలిస్తే ప్రభుత్వ కుతంత్రం బయటపడుతోంది. అంతా కనికట్టే! వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జరగని కుంభకోణాన్ని జరిగినట్టుగా చూపించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు తెగబడుతోంది. దీనికోసం టీడీపీ వీరవిధేయ అధికారులతో కూడిన సిట్ ద్వారా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు పన్నాగాలు పన్నుతోంది. ఈ కేసులో న్యాయస్థానానికి సమర్పించిన వరుసగా మూడో రిమాండ్ రిపోర్ట్ కూడా సిట్ కుయుక్తులను బయటపెట్టింది. ఈ కేసులో ఆరో నిందితుడిగా శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసి న్యాయస్థానంలో శనివారం హాజరు పరుస్తూ సిట్ రిమాండ్ రిపోర్టు సమర్పిoచింది. అంతకుముందు రాజ్ కేసిరెడ్డి, చాణక్య రిమాండు రిపోర్టుల్లో పేర్కొన్న అవాస్తవ ఆరోపణలు, కల్పిత అభియోగాలనే శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులోనూ సిట్ పునరుద్ఘాటించింది. వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ్‌రెడ్డి తదితరుల పేర్లను ప్రస్తావిస్తూ అవాస్తవాలను వండి వార్చింది. పైగా అవన్నీ కూడా శ్రీధర్‌రెడ్డి తమ విచారణలో వెల్లడించారని సిట్ పేర్కొనడం గమనార్హం. కానీ ఆ వాంగ్మూలంపై సంతకం చేసేందుకు శ్రీధర్ రెడ్డి నిరాకరించారని ఆ నివేదికలో పేర్కొంది. మధ్యవర్తుల సమక్షంలో తాము వాంగ్మూలాన్ని నమోదు చేశామని తెలిపింది. అంటే ఈ కేసులో కుట్ర క్రమం అంటూ సిట్ వివరించిన విషయాలేవీ వాస్తవం కాదని స్పష్టమైంది. వాటిని శ్రీధర్‌రెడ్డి చెప్పనే లేదని.. అందుకే ఆయన సంతకం చేసేందుకు నిరాకరించారన్నది బయటపడింది. ప్రభుత్వ పెద్దల కుట్రను అమలు చేస్తూ సిట్ అధికారులే అవాస్తవాలు, అభూతకల్పలను వాంగ్మూలంగా నమోదు చేసేశారని స్పష్టమైంది. ఇదే కేసులో రాజ్ కేసిరెడ్డి, చాణక్య కూడా చెప్పని విషయాలను చెప్పినట్టుగా సిట్ ఏకపక్షంగా వారి పేరిట వాంగ్మూలంగా నమోదు చేసింది. కానీ తాము సంతకాలు చేయలేదనే విషయాన్ని వారే న్యాయస్థానం దృష్టికి తీసుకువెళితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందనే సిట్ అధికారులు ఆ విషయాన్ని రిమాండ్ రిపోర్టులో తప్పనిసరై వెల్లడించారు. ఇంత బరి తెగింపా..! ఇంత నిర్భీతిగా అబద్ధపు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలతో సిట్ దర్యాప్తు పేరుతో అటు న్యాయస్థానాలను ఇటు ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు అధికారులు యత్నిస్తుండటం విస్మయపరుస్తోంది. ఆ అబద్ధపు వాంగ్మూలాలను టీడీపీ అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేయడమే సిట్ లక్ష్యమన్నది తేటతెల్లమవుతోంది. ఈ కేసు పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తుంది కేవలం రెడ్ బుక్ కక్ష సాధింపు కుట్రేనన్నది స్పష్టమవుతోంది. -
కొత్త నాయకత్వం కావాలి: రాహుల్ గాంధీ
సాక్షి, హైదరాబాద్: సంప్రదాయ పాత తరం రాజకీయాలకు కాలం చెల్లిందని.. అందుకే భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా కొత్త రాజకీయ నాయకత్వం రావాలని.. దాన్ని తయారు చేసుకోవాల్సిన అవసరం ఉందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. అందుకు భారత్ సమ్మిట్–2025 వేదిక కావాలని ఆకాంక్షించారు. రెండు రోజుల భారత్ సమ్మిట్–2025 అంతర్జాతీయ సదస్సు ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం జరిగిన ప్లీనరీకి ముఖ్యఅతిథిగా రాహుల్‌గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత పార్టీలన్నీ విధానాలను మార్చుకుంటున్నాయని చెప్పారు. భారత్ జోడో యాత్ర చేపట్టేందుకు దారితీసిన పరిస్థితులతోపాటు యాత్రకు ముందు, ఆ తర్వాత తనలో రాజకీయంగా వచ్చిన మార్పుల గురించి వివరించారు. దేశంలోని పాలకపక్షం ద్వేషం, కోపాలను విస్తరింపజేయాలనే ఆలోచనతోనే ముందుకెళ్తోందని రాహుల్ విమర్శించారు. కానీ కాంగ్రెస్ పార్టీ దృష్టి కోణం మాత్రం ప్రేమ, ఆప్యాయతలేనని స్పష్టం చేశారు.దేశ ప్రజల్ని కలిసేందుకే భారత్ జోడో యాత్ర చేపట్టా‘ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పార్టీలు మౌలిక విధానాలను మార్చుకుంటున్నాయి. పదేళ్ల క్రితం నాటి ఆలోచనలు ఇప్పుడు పనిచేయవు. ఒక్కమాటలో చెప్పాలంటే పాత తరం రాజకీయం చనిపోయింది. ఇప్పుడు కొత్త రకం రాజకీయాలు రావాలి. ఇది ప్రపంచ రాజకీయాలకు ఒక సవాల్ లాంటిది. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ ఓ వలయంలో చిక్కు కొని ఒంటరైంది. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయా లనే ఆలోచనలో భాగంగా మా అవకాశాలన్నింటినీ నిర్వీర్యం చేశారు. అప్పుడు ఏం చేయాలని ఆలోచించా. అందుకే దేశం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడక ద్వారా ప్రజలను కలవాలనే నిర్ణయంతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4 వేల కి.మీ. పాదయాత్ర చేశా. ఈ పాదయాత్రలో ఓపిక, ప్రేమ గురించి నేర్చుకున్నా. రాజకీయ నాయకులకు ఈ రెండు లక్షణాలు ఉండాలి. ప్రజలు ఏం చెబుతు న్నారన్నది ఓపికగా వినగలగాలి. ప్రజలపట్ల ప్రేమ, ఆప్యాయతలను చూపించగలగాలి. విధానాల రూపంలో ప్రజలతో పరోక్షంగా కలిసి ఉండటం కంటే వారిపట్ల ప్రేమ బంధం ఏర్పరచుకోగలగాలి’ అని రాహుల్ గాంధీ చెప్పారు. -
రైతుకు ‘సేవలు’ దూరం!
సాక్షి, అమరావతి: విత్తు నుంచి విక్రయం వరకు రైతులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన రైతు సేవా కేంద్రాల (పూర్వపు ఆర్బీకేలు) స్ఫూర్తిని దెబ్బతీసేలా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. క్రమబద్ధీకరణ పేరిట రైతు సేవా కేంద్రాలతో (ఆర్ఎస్కే) పాటు సిబ్బందిని కూడా కుదించేస్తున్న ప్రభుత్వం, వాటి నిర్వహణను సైతం పూర్తిగా గాలికొదిలేసింది. పీ4, కుల గణన, పింఛన్ల పంపిణీ వంటి తమకు సంబంధం లేని అడ్డమైన సర్వేల కారణంగా తీవ్రమైన పని ఒత్తిడితో సిబ్బంది పనిచేయాల్సి వస్తోంది. పక్కదారి పడుతున్న నిధులు..గడచిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఎస్కేల నిర్వహణకు రూ.35.05 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.19 కోట్లు విడుదల చేశారు. దీనిలో రూ.10.52 కోట్లు అద్దెలకే పోవడం గమనార్హం. సిబ్బందికి చివరికి కష్టమే మిగులుతోంది. మంజూరు చేసిన నిధులు గతంలో నేరుగా ప్రతి ఆర్ఎస్కే అకౌంట్లో పడేవి. ఇప్పుడు సబ్ డివిజన్ అధికారుల ఖాతాకు జమ చేస్తున్నారు. ఈ నిధులు వారు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులతో పాటు తమకు రావాల్సిన బకాయిల కోసం అడిగితే ‘వస్తాయిలే..ఇస్తాం లే..’ అంటూ సిబ్బందిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా ఒత్తిడి తీసుకొస్తే అడ్డమైన పనులు అప్పగిస్తూ పని ఒత్తిడి పెంచుతూ వేధింపులకు గురిచేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. మరొక వైపు పాడిపంటలు మ్యాగజైన్ కోసం కూడా లక్ష్యాలను నిర్ధేశిస్తుండడంతో వాటి చందాల కోసం కూడా తమ జేబులకే చిల్లుపడుతోందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నాడు పారదర్శకంసచివాలయాలకు అనుబంధంగా గ్రామ స్థాయిలో 10,778 రైతు సేవా కేంద్రాల్లో 15,667 మంది సిబ్బంది సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అద్దెలతో పాటు ఇంటర్నెట్, విద్యుత్ బిల్లులకు క్రమం తప్పకుండా నిధులు విడుదల చేసేవారు. గతేడాది ఏప్రిల్ నాటికి అద్దెల రూపంలో రూ.33 కోట్లు, స్టేషనరీ కోసం రూ.3 కోట్లు, విద్యుత్ బిల్లుల కోసం రూ.12 కోట్లు చెల్లించారు. అంతేకాదు విద్యుత్ బిల్లులకు అవసరమైన బడ్జెట్‌ను విద్యుత్ శాఖకు కేటాయించేలా ఉత్తర్వులిచ్చారు. హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్ సదుపాయాన్ని సమకూర్చేందుకు రూ.23 కోట్లు ఖర్చు చేసారు. మరొక వైపు మట్టినమూనాలు, ఈ పంట నమోదు, ధాన్యం కొనుగోలు, ఎరువుల అమ్మకాలు, పంట కోత ప్రయోగాలు ఇలా ప్రతీ పనికి నిర్ధేశించిన ప్రోత్సాహకాలను ఎప్పటికప్పుడు నేరుగా వారి ఖాతాలకే జమ చేసేవారు.నేడు లోపభూయిష్టం..రైతు భరోసా కేంద్రాలు– ఆర్బీకేల పేరును రైతు సేవా కేంద్రాలుగా (ఆర్ఎస్కే) మార్చేందుకు చూపిన ఉత్సాహం వాటి నిర్వహణపై కూటమి ప్రభుత్వం చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే..» ప్రతిరోజూ ఆర్ఎస్కేలను శుభ్రం చేసేందుకు, నీటి వసతి కల్పించేందుకు స్టేషనరీకి, ఇంటర్నెట్ చార్జీలు, మైనర్ రిపేర్లు తదితర ఖర్చుల కోసం ప్రతీ నెలా రూ.2,000 చెల్లించేవారు. »ఇవి కాకుండా వ్యక్తిగతంగా సిబ్బందికి ఒక్కో మట్టి నమూనాకు రూ.50, టన్ను యూరియాకు రూ.50, డీఏపీ, ఇతర ఎరువులకు రూ. 100 చొప్పున చెల్లించేవారు. » దీనితోపాటు ఒక్కొక్క పంట కోత ప్రయోగానికి రూ.150 చొప్పున ఇచ్చేవారు. » ఆర్ఎస్కే పరిధిలో ప్రతీ సీజన్లో నాలుగు పంటకోత ప్రయోగాలు జరుగుతుంటాయి. పొలంబడుల నిర్వహణకు రూ.20,514 ఖర్చు అయ్యేది. ధాన్యం కొనుగోలు నిర్వహణ ఖర్చు నిమిత్తం ఒక్కొక్క క్లస్టర్‌కు సుమారు రూ.5 వేలకు పైగా చెల్లించేవారు. » కానీ గడిచిన సీజన్‌కు సంబంధించి ఏ ఉద్యోగికి పైసా కూడా జమ కాలేదు. కేంద్ర నిధులతో చేపట్టే సామూహిక ఎలుకల నివారణకు ఉపయోగించే గ్లౌవ్స్, కత్తెర, ప్యాకింగ్ మెటీరియల్‌కే కాదు చివరికి బ్యానర్ తయారీకి కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదంటున్నారు.»కేవలం ఆర్ఎస్కేల నిర్వహణ కోసం ప్రతీ నెలా సగటున రూ.2,500 నుంచి రూ.3వేల వరకు తమ జీతాల నుంచి ఖర్చు చేయాల్సి వస్తోందని సిబ్బంది వాపోతున్నారు. » ఇక ఆర్ఎస్కేల్లో ఎక్కడా ఇంటర్నెట్ సేవలు లేనే లేవు. ఏపీ ఫైబర్ నెట్ కనెక్షన్లు అలంకార ప్రాయంగా మారిపోయాయి. » కరెంట్ బిల్లుల చెల్లింపులు పూర్తిగా మరిచి పోయారు. 25–30 శాతం ఆర్ఎస్కేలు అంధకారంలో ఉన్నాయని సమాచారం. విద్యుత్ బకాయిల బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. -
భారత్ వృద్ధికి క్రూడాయిల్ దన్ను
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్నప్పటికీ తగ్గిన క్రూడాయిల్ రేట్లతో దేశీయంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు నెమ్మదించడం, దేశీయంగా వినియోగం పెరగడం లాంటి దేశ వృద్ధికి సానుకూలంగా దోహదపడనున్నాయి. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండొచ్చని కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఒక నివేదికలో పేర్కొంది. ఎగుమతుల క్షీణత, గ్లోబల్ మందగమనం, ముడిచమురు ధరల తగ్గుదల, అంతర్జాతీయంగా ఉత్పత్తి సామర్థ్యాలు పెరిగిపోవడం వంటి అంశాలు భారత వృద్ధిపై ప్రభావం చూపనున్నాయని వివరించింది. సముచిత ఆర్థిక, ద్రవ్య విధానాలతో రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లోపునకు కట్టడి చేస్తూ, 2026 ఆర్థిక సంవత్సరంలోను, అలాగే మధ్యకాలికంగాను భారత్ 6.5 శాతం వృద్ధి రేటు నమోదు చేయొచ్చని ఈవై ఇండియా చీఫ్ పాలసీ అడ్వైజర్ డీకే శ్రీవాస్తవ చెప్పారు. ‘అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు బ్యారెల్‌కు 60–65 డాలర్ల శ్రేణిలో ఉండొచ్చని, ఇది భారత్‌కు సానుకూలంగా పరిణమించగలదని అంచనా వేస్తున్నాం‘ అని వివరించారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు అంచనా వేసిన 6.2–6.7 శాతం వృద్ధి రేటు శ్రేణిలోనే ఈవై అంచనాలు ఉండటం గమనార్హం. టారిఫ్‌ల యుద్ధం, అమెరికా వాణిజ్య విధానంపై అనిశ్చితి నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధిరేటు 6.2 శాతం ఉంటుందని ఐఎంఎఫ్, 6.3 శాతం ఉంటుందని వరల్డ్ బ్యాంక్ పేర్కొన్నాయి. ఇక ఆర్బీఐ, ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ 6.5 శాతంగా ఉంటుందని, ఓఈసీడీ, ఫిచ్ రేటింగ్స్ 6.4 శాతానికి పరిమితమవుతుందని అంచనా వేశాయి. నివేదికలో మరిన్ని విశేషాలు.. → అధిక టారిఫ్‌లు, అంతర్జాతీయంగా బలహీన డిమాండ్ కారణంగా ఎగుమతులు నెమ్మదించవచ్చు. అయితే, స్థూల దేశీయోత్పత్తిపై ప్రభావం ఒక మోస్తరుగానే ఉండొచ్చు. → గ్లోబల్ మందగమనంతో ప్రపంచవ్యాప్తంగా వృద్ధి నెమ్మదించినా, పటిష్టమైన ఆర్థిక, ద్రవ్య విధానాల వల్ల భారత్ కాస్త మెరుగైన స్థితిలో ఉండొచ్చు. → ప్రధాన ఎగుమతి దేశాల్లో ఉత్పత్తి సామర్థ్యాలు పెరగడం వల్ల డంపింగ్ రిస్కులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భారత్ యాంటీ–డంపింగ్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. → గ్లోబల్ అవాంతరాలపై భారత్ వ్యూహాత్మకంగా స్పందించాల్సి ఉంటుంది. వృద్ధికి ఊతమిచ్చే ఆర్థిక విధానాలు, ఉదార ద్రవ్య విధానాల ద్వారా భారత్ ఈ పరిస్థితుల నుంచి పటిష్టంగా బైటపడొచ్చు. → స్వల్పకాలికంగా అమెరికా నుంచి కొంత క్రూడాయిల్ దిగుమతులను పెంచుకోవడం ద్వారా ఆ దేశంతో వాణిజ్య లోటును భర్తీ చేసుకోవడంతో పాటు ప్రతీకార టారిఫ్ రేట్లను కూడా తగ్గిస్తే భారత్‌కు శ్రేయస్కరంగా ఉంటుంది. → 2025 సెపె్టంబర్–అక్టోబర్ నాటికి సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే అమెరికాతో వాణిజ్యంలో కాస్త స్థిరత్వం వస్తుంది. → స్వల్పకాలికం నుంచి దీర్ఘకాలిక దృష్టికోణంలో చూస్తే భూ, కార్మిక చట్టాల్లో సంస్కరణలు వేగవంతం చేయాలి. విద్య, ఏఐ.. జెన్‌ఏఐలాంటి కొత్త నైపుణ్యాల్లో శిక్షణపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల స్కీము పరిధిని విస్తరించాలి. -
ప్రత్యక్ష పన్నులపై రిఫండ్ ఎఫెక్ట్
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో రిఫండ్లు జారీ చేయడంతో గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నిర్దేశించుకున్న లక్ష్యం స్థాయిలో వసూలు కాలేదు. 2024–25లో నికరంగా రూ. 22.37 లక్షల కోట్లు టార్గెట్‌గా పెట్టుకోగా నికరంగా రూ. 22.26 లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇది అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 13.57 శాతం అధికమే అయినప్పటికీ నిర్దేశిత లక్ష్యానికి మాత్రం చేరలేదు. గతేడాది జూలై నాటి బడ్జెట్లో రూ. 22,07,000 కోట్ల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు నిర్దేశించుకోగా, దాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ. 22,37,000 కోట్లకు సవరించారు. సాధారణంగా కార్పొరేట్ ట్యాక్సులు, సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ), నాన్–కార్పొరేట్ ట్యాక్సులు (గతంలో వ్యక్తిగత ఆదాయ పన్ను) మొదలైనవి ప్రత్యక్ష పన్నుల పరిధిలోకి వస్తాయి. వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) మొదలైన వర్గాలు కట్టే పన్నులు నాన్–కార్పొరేట్ ట్యాక్సుల పరిధిలోకి వస్తాయి. స్థూల వసూళ్లు 16 శాతం అప్.. అధికారిక డేటా ప్రకారం మార్చి 31తో ముగిసిన 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు (రిఫండ్లకు ముందు) 15.59 శాతం పెరిగి రూ. 27.02 లక్షల కోట్లకు చేరాయి. అంతక్రితం 2023–24 ఆర్థిక సంవత్సరంలో ఇవి రూ. 23.37 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇక, రిఫండ్ల జారీ తర్వాత నికర ప్రత్యక్ష పన్నుల వసూళ్ల ప్రొవిజనల్ గణాంకాలు రూ. 22.26 లక్షల కోట్లుగా నమోదైయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ. 19.60 లక్షల కోట్లతో పోలిస్తే 13.57 శాతం పెరిగాయి. – ఇవన్నీ ప్రొవిజనల్ గణాంకాలు మాత్రమే. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది దశ రీకన్సిలియేషన్, సర్దుబాట్లు జరుగుతున్నందున నికర వసూళ్లు మరికాస్త పెరగొచ్చని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు.. → ఎస్టీటీ నుంచి రెవెన్యూ రూ.34,192 కోట్ల నుంచి రూ. 53,296 కోట్లకు పెరిగింది. → ప్రొవిజనల్ నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు, జులై బడ్జెట్ లక్ష్యంతో పోలిస్తే (రూ. 22.07 లక్షల కోట్లు) 100.78 శాతం పెరగ్గా, ఫిబ్రవరిలో సవరించిన అంచనాలతో పోలిస్తే (రూ. 22.37 లక్షల కోట్లు) 99.51 శాతం పెరిగాయి. → 2024–25లో ట్యాక్స్ డిపార్ట్మెంట్ అత్యధిక స్థాయిలో రూ. 4,76,743 కోట్లు రిఫండ్ జారీ చేసింది. 2023–24లో నమోదైన రూ. 3,78,255 కోట్లతో పోలిస్తే ఇది 26.04 శాతం అధికం. → రికార్డు స్థాయిలో రూ. 4.76 లక్షల కోట్లు రిఫండ్లు జారీ చేసినప్పటికీ స్థూల ప్రత్యక్ష పన్నుల వసూళ్లు బడ్జెట్లో నిర్దేశించుకున్న రూ. 22.37 లక్షల కోట్ల స్థాయిని మించి నమోదైనట్లు అధికారులు తెలిపారు. సిసలైన క్లెయిమ్‌లను పారదర్శమైన, సముచితమైన విధంగా తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటామని ట్యాక్స్‌పేయర్లకు ఇచ్చిన హామీకి డిపార్టుమెంట్ కట్టుబడి ఉండటం ఇందుకు కారణమని వివరించారు. → సమీక్షాకాలంలో నికర కార్పొరేట్ ట్యాక్సుల వసూళ్లు (ప్రొవిజనల్) 8.30 శాతం పెరిగి రూ. 9,86,719 కోట్లకు చేరాయి. స్థూల కార్పొరేట్ వసూళ్లు 12.41 శాతం వృద్ధితో రూ. 12,72,516 కోట్లుగా నమోదయ్యాయి. -
శూన్యత నుంచి సునామీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995కు అటూ ఇటుగా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వ పాలన తెలంగాణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. వర్షాభావ పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, విద్యుత్ కోతలు ప్రజల జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశాయి. విద్యుత్ సంస్కరణల పేరిట చంద్రబాబు కరెంటు చార్జీలు పెంచడం, అసెంబ్లీ ముట్టడికి వచ్చిన వారిపై జరిగిన ‘బషీర్‌బాగ్ కాల్పులు’ఘటనలో ముగ్గురు మరణించడం నాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును తీవ్రంగా కలిచివేసింది. విద్యుత్ చార్జీల పెంపుతో తెలంగాణ రైతులు ఎదుర్కొనే దయనీయతను వివరిస్తూ 2000 సంవత్సరంలో చంద్రబాబుకు కేసీఆర్ బహిరంగలేఖ రాశారు. ఈ నేపథ్యంలో నుంచే తెలంగాణకు స్వీయ అస్థిత్వం కలిగిన రాజకీయ పార్టీ అవసరమనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ తీరాన ఉన్న ‘జలదృశ్యం’సాక్షిగా 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఆవిర్భవించింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి, సిద్దిపేట శాసన సభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఏకకాలంలో కేసీఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేంత వరకు విశ్రమించేది లేదని..మధ్యలో విరమిస్తే తనను రాళ్లతో కొట్టి చంపమని కేసీఆర్ పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 2001 మే, 17న కరీంనగర్లో సింహగర్జన పేరిట నిర్వహించిన సభకు భారీ స్పందన లభించింది. సిద్దిపేట ఉపఎన్నికతో బరిలోకి కేసీఆర్ రాజీనామాతో 2001 సెపె్టంబర్ 22న సిద్దిపేట అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. తొలిసారిగా టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన కేసీఆర్ 58,712 మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు టీఆర్ఎస్ ఏర్పడిన కొద్ది నెలల్లోనే 2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 85 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకొని కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. పార్టీ ఏర్పడిన మూడు నెలల్లోనే 25 శాతం ఓటు బ్యాంకును సాధించింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకున్న టీఆర్ఎస్.. ఆ ఎన్నికల్లో 26 ఎమ్మెల్యే, ఐదు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించింది. తర్వాతి కాలంలో టీఆర్ఎస్కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడిన యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేబినెట్ మంత్రిగా, ఆలె నరేంద్ర సహాయమంత్రిగా చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ చేరింది. రాజీనామాల పర్వం.. తెలంగాణపై కాంగ్రెస్ నాని్చవేత ధోరణిని నిరసిస్తూ 2005 జూలైలో రాష్ట్ర కేబినెట్, 2006 ఆగస్టు 22న కేంద్ర కేబినెట్ నుంచి టీఆర్ఎస్ మంత్రులు వైదొలిగారు. 2006 సెపె్టంబర్ 12న కరీంనగర్ ఎంపీ పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. అదే ఏడాది డిసెంబర్ 4న జరిగిన ఉపఎన్నికలో కేసీఆర్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్‌రెడ్డిపై 2.01లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2008 మార్చి 3న టీఆర్ఎస్కు చెందిన ఐదుగురు ఎంపీలు, 16 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే ఉప ఎన్నికలో కేసీఆర్‌తో సహా ఇద్దరు ఎంపీలు, ఏడుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రమే ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో 2009 ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు నేతృత్వంలోని మహాకూటమితో టీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుంది. కేసీఆర్ సచ్చుడో... తెలంగాణ వచ్చుడో..: ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 సెపె్టంబర్ 2న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించగా, రోశయ్య సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తూ 2009 అక్టోబర్ 9న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణలో ఆందోళనలకు దారితీసింది. ఈ ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన కేసీఆర్ ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు’పరిష్కారం అని నినదించారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో ’అంటూ 2009 నవంబర్ 29 నుంచి సిద్దిపేటలో ఆమరణ దీక్ష చేపడుతున్నట్టు ప్రకటించారు. 11 రోజుల పాటు కేసీఆర్ నిరాహార దీక్ష కొనసాగడంతో తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు డిసెంబర్ 9వ తేదీ అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై వెనక్కి తగ్గిన కేంద్రం సంప్రదింపుల పేరిట 2009 డిసెంబర్ 23న మరో ప్రకటన చేసింది. దీంతో సరికొత్త వ్యూహానికి పదును పెడుతూ కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా అన్ని పార్టీలను ఏకతాటిపైకి తెస్తూ జేఏసీని ప్రతిపాదించారు. స్వరాష్ట్ర కల సాకారం.. తొలిసారి అధికారం..: సుదీర్ఘ ఉద్యమ ఫలితంగా 2014 ఫిబ్రవరి 17న లోక్‌సభలో, 20న రాజ్యసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందింది. 2014 జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ మనుగడలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో 2014 ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తొలిసారిగా ఒంటరిగా పోటీ చేసింది. 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసి 11 చోట్ల గెలుపొంది లోకసభలో ఎనిమిదో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 119 అసెంబ్లీ స్థానాలకుగాను 63 చోట్ల గెలుపొంది సొంత బలంతో తెలంగాణ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా 2014, జూన్ 2న ప్రమాణ స్వీకారం చేశారు. ఫక్తు రాజకీయ పార్టీగా టీఆర్ఎస్..: రాష్ట్ర సాధన లక్ష్యంగా అవతరించిన టీఆర్ఎస్ ఫక్తు రాజకీయ పార్టీగా వ్యవహరిస్తుందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో ప్రకటించారు. రాజకీయ పునరేకీరణ పేరిట 2014–18 మధ్యకాలంలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలను ప్రోత్సహించారు. బీఆర్ఎస్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత రాజకీయ పునరేకీకరణ పేరిట ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంది. అధికార పీఠం నుంచి ప్రతిపక్ష స్థానానికి..: జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ కోసం పార్టీ పేరును మార్చుకొని పొరుగు రాష్ట్రాల్లో అడుగు పెట్టేందుకు సన్నాహాలు చేసుకున్న బీఆర్ఎస్కు 2023 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఆ ఎన్నికల్లో 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించడంతో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. పార్టీ అ«ధ్యక్షుడు కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో అసెంబ్లీలో అడుగు పెట్టారు. పార్టీ ఆవిర్భవించిన 25 ఏళ్లలో బీఆర్ఎస్కు తొలిసారిగా లోక్‌సభ ప్రాతినిథ్యం లేకుండా పోయింది. 2014లో 11, 2019లో 9 సీట్లలో గెలుపొంది లోక్‌సభలో ఎనిమిదో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్.. 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన 17 స్థానాల్లో ఒక్కటి కూడా గెలుచుకోలేక పోయింది. ఫిరాయింపులతో ఉక్కిరిబిక్కిరి..: అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి వెళ్లారు. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కడియం శ్రీహరి వంటి నేతలు కూడా హస్తం గూటికి వెళ్లారు. పార్టీలో సెక్రటరీ జనరల్ పదవిలో ఉన్న రాజ్యసభ సభ్యుడు కేకే ఎంపీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. పలువురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంను ఆశ్రయించింది. దానిపై విచారణ జరుగుతోంది. -
తెలంగాణ జాతి సర్వం 'కేసీఆర్'
‘ప్రారంభించిన లక్ష్యాన్ని అందుకునే అవకాశం అతి కొద్దిమందికే దక్కుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతంగా ముగించిన అరుదైన నాయకుడు. కేంద్ర మంత్రిగా ఏ శాఖ కేటాయించాలని అడిగినప్పుడు ‘‘నా లక్ష్యం మీకు తెలుసు. నాకు తెలంగాణ రాష్ట్రం కావాలి. ఏ శాఖ ఇచ్చినా నాకు అంగీకారమే’అంటూ వ్యక్తిగత అవకాశాల కంటే తెలంగాణ సాధనకు ప్రాధాన్యం ఇచ్చిన నాయకుడు’అంటూ దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథ ‘ది కొయలేషన్ ఇయర్స్ 1996–2012’లో తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం బీఆర్ఎస్) వ్యవస్థాపకుడు కేసీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా పదవీ త్యాగాల పునాదుల మీద పార్టీని ప్రారంభించిన ఉద్యమ నాయకుడు. ఎత్తుపల్లాలు ఎదురైనా, ఎత్తిన జెండా దించకుండా ముందుకు సాగిన నాయకుడు. బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఉద్యమ నేతగా, ప్రభుత్వ సారథిగా, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ స్ఫూర్తిమంత ప్రయాణం సాగిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపనతో తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని ప్రారంభించి 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత గమ్యాన్ని ముద్దాడారు. ‘నీళ్లు.. నిధులు.. నియామకాలు’ఎజెండాగా ఆయన ఎక్కని కొండ లేదు.. మొక్కని బండలేదు.పక్కా రోడ్ మ్యాప్‌తో ఉద్యమంలోకి.. కేసీఆర్ పక్కా రోడ్‌మ్యాప్ రూపొందించుకున్న తర్వాతే తెలంగాణ ఉద్యమంలో అడుగు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుకు మునుపు ఆయన లోతుగా విషయ పరిజ్ఞానం పెంచుకునేందుకు కసరత్తు చేశారు. 1969 ఉద్యమం నేరి్పన పాఠాల నుంచి ‘శాంతియుత మార్గంలోనే తెలంగాణ’అనే నిర్ణయం తీసుకున్నారు. రక్తం చుక్క చిందించకుండా తెలంగాణ సాధిస్తానని, ఉద్యమం వీడితే రాళ్లతో కొట్టండి అని పిలుపునివ్వడం ద్వారా తన నిబద్ధతను చాటే ప్రయత్నం చేశారు. ఉప ఎన్నికలు.. రాజీనామా అ్రస్తాలు లక్ష్య సాధనకు పదవులకు రాజీనామా, ఉప ఎన్నికలను అస్త్రంగా వాడిన నేత దేశ చరిత్రలో బహుశా కేసీఆర్ ఒక్కరేనేమో. భావజాల వ్యాప్తి, లక్ష్య సాధనకు ఉప ఎన్నికలతో ప్రయోగాలు చేశారు. ఉప ఎన్నికల అస్త్రం 2008లో విఫలమైనా, 2010లో ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాలపై కేసీఆర్ పట్టును పెంచాయి. 2012లో పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం ద్వారా జరిగిన ఉప ఎన్నికలు కేంద్రంపై తెలంగాణ ఇవ్వాల్సిన అనివార్యతను సృష్టించాయి. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో డిపాజిట్లను కోల్పోగా కాంగ్రెస్ కూడా నాలుగు చోట్ల డిపాజిట్ గల్లంతు అయ్యింది. అనునిత్యం ప్రజాక్షేత్రంలోనే.. టీఆర్ఎస్ ఏర్పాటు ద్వారా అనునిత్యం క్షేత్ర స్థాయిలోనే ఉండేలా కేసీఆర్ కార్యాచరణ కొనసాగింది. తెలంగాణ భావజాల వ్యాప్తికి వరుస బహిరంగ సభలు, నాగార్జునసాగర్ నీళ్లు, చేనేత కార్మికుల కోసం బిక్షాటన, విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం సభ, పాలమూరు వలస కూలీల సమస్యపై పాదయాత్ర, జల సాధన సభ, సిద్దిపేట నుంచి సైకిల్ ర్యాలీ, ఫ్లోరైడ్ సమస్యపై పాదయాత్ర వంటి కార్యక్రమాలతో తొలి రెండేళ్లు కేసీఆర్ అనునిత్యం ప్రజాక్షేత్రంలో ఉండేలా చూసుకున్నారు. ఉద్యమానికి కీలక మలుపు అవసరమైన ప్రతీ సందర్భంలోనూ భారీ బహిరంగ సభలు నిర్వహించడం కేసీఆర్ శైలిగా మారిపోయింది. ఉద్యమ సమయంలోనే ‘దళితాభివృద్ది’ తెలంగాణ రాష్ట్రంలో దళితుల అభివృద్ధికి అవసరమైన రోడ్‌మ్యాప్‌ను 2003లోనే సిద్ధం చేశారు. 2003 అక్టోబర్ 17న హైదరాబాద్ గ్రీన్ పార్కు హోటల్లో దళిత స్వయం సమృద్ధి సమావేశం నిర్వహించారు. అదే ఏడాది అక్టోబర్ 18, 19 తేదీల్లో టీఆర్ఎస్ ఎస్టీ, ఎస్సీ, బీసీ పాలసీలను విడుదల చేశారు. ఈ పాలసీలను ప్రజలకు వివరించేందుకు అక్టోబర్ 22న మేడారంలో పల్లెబాటను కేసీఆర్ ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రారంభించిన పథకాల్లో ఈ పాలసీలు మూలాధారంగా నిలిచాయి. నేషనల్ ఫ్రంట్ కన్వినర్‌గా కేసీఆర్ జాతీయ రాజకీయాలపై కేసీఆర్ తన ఆలోచన, మక్కువను ఉద్యమ సమయం నుంచే వివిధ రూపాల్లో బయటపెడుతూ వచ్చారు. ఓ వైపు క్షేత్ర స్థాయిలో తన కొత్త పార్టీని బలోపేతం చేస్తూనే మరోవైపు ఢిల్లీ రాజకీయాలను ప్రభావితం చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న నాయకులు, పార్టీలకు ఒకే తాటి మీదకు తెచ్చి 2003 సెపె్టంబర్ 9న ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. కొత్త రాష్ట్రాల నేషనల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి దానికి కేసీఆర్ కన్వీనర్‌గా కొనసాగారు. 2008 ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రతికూల ఫలితాలు ఎదురైనా అధిగమిస్తూ ఢిల్లీలో ‘థర్డ్ ఫ్రంట్’ఏర్పాటు దిశగా చర్చలు జరిపారు. 2008 జూలై 18 నుంచి 23 వరకు అజిత్ సింగ్, మాయావతి, దేవెగౌడ్ తదితరులతో చర్చలు జరిపారు. 2022లో బీఆర్ఎస్ స్థాపనకు ముందూ కేసీఆర్ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ ఫ్రంట్ కోసం కేసీఆర్ ఇవే తరహా ప్రయత్నాలు చేయడం గమనార్హం. ఎన్నికల పొత్తులు.. ఎత్తులు టీఆర్ఎస్ ఆవిర్భంచిన కొద్ది నెలల్లోనే వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి 25 శాతం ఓటు బ్యాంకు సాధించిన కేసీఆర్.. 2004 సాధారణ ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోవాల్సిన అనివార్యతను కాంగ్రెస్‌కు సృష్టించారు. 2009 సాధారణ ఎన్నికల నాటికి తెలంగాణ ఏర్పాటు పట్ల విముఖంగా ఉన్న టీడీపీ, సీపీఐ, సీపీఎంతో కూడిన ‘మహా కూటమి’తోనూ కేసీఆర్ వ్యూహాత్మకంగా> ఎన్నికల అవగాహన కుదుర్చుకున్నారు. 2004లో కాంగ్రెస్ టీఆర్ఎస్కు లాభం చేకూర్చగా, 2009 ఎన్నికల్లో టీడీపీ కలిసి పోటీ చేయడం కలిసి రాలేదు. రాష్ట్ర అవతరణ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లోనూ కేసీఆర్ ఒంటరిగా బరిలోకి దిగారు. ఉద్యమ కాలం నుంచే రాజకీయ పునరేకీకరణ..: పార్టీని బలోపేతం చేయడం, ఎదుటి పార్టీలను బలహీన పరచడం లక్ష్యంగా కేసీఆర్ ఉద్యమ కాలం నుంచే రాజకీయ పునరేకీరణ వ్యూహానికి పదును పెడుతూ వచ్చారు. పార్టీ ఆవిర్భావ సమయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న రేగులపాటి పాపారావు (టీడీపీ), రావుల రవీంద్రనాథ్‌రెడ్డి (బీజేపీ), ఆలె నరేంద్ర (ఎంపీ బీజేపీ) కేసీఆర్‌తో కలిసి నడిచారు. 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష ఘట్టం తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ టి.రాజయ్య, టీడీపీ నుంచి జోగు రామన్న, గంప గోవర్దన్ టీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎంపీలు డాక్టర్ వివేక్, మందా జగన్నాథం, పలువురు మాజీ ఎంపీలు టీఆర్ఎస్లో చేరారు. ఇదే కోవలో 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు 2014–23 మధ్యకాలంలో టీడీపీ, కాంగ్రెస్ లక్ష్యంగా కేసీఆర్ పునరేకీకరణ కొనసాగించారు. ఉద్యమ రూపాలుగా కళలు.. పండుగలు..: రాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక కోణాన్ని కూడా ఆవిష్కరించి ఉద్యమ రూపం ఇచ్చిన నేత కేసీఆర్. జానపద పాటలు, నృత్యాలు, ఒగ్గు కథలు, గొల్ల సుద్దులు, బుర్ర కథలు, యక్షగానాలు, బతుకమ్మలు, బోనాలు తెలంగాణ ఉద్యమానికి ఆలంబనగా నిలిచాయి. ధూంధాం, వంటావార్పు, సడక్ బంధ్, రైలు రోకో, సాగర హారం, మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, తదితరాలు కొత్త ఉద్యమ రూపాలను ఆవిష్కరించాయి. స్వరాష్ట్ర ఆకాంక్ష ప్రతీక ‘తెలంగాణ తల్లి’..: తెలుగుతల్లి అస్థిత్వాన్ని ‘ఎవరి తల్లి.. ఎక్కడి తల్లి’అని ప్రశ్నించడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే ‘తెలంగాణ తల్లి’అనే భావనకు కేసీఆర్ పురుడు పోశారు. జేఏసీ.. వినూత్న ఆలోచన..: ఎన్నికల్లో పొత్తులతో ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, టీడీపీలను తెలంగాణవాదంతో కట్టిపడేసిన కేసీఆర్ తర్వాతి కాలంలో ఈ వ్యూహాన్ని మరింత విస్తృతం చేశారు. 2009 డిసెంబర్ 9 నాటి ప్రకటనపై కేంద్రం వెనక్కి తగ్గిన నేపథ్యంలో అన్ని పార్టీలు, శక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు ‘జాయింట్ యాక్షన్ కమిటీ’అనే ఎత్తుగడను తెరమీదకు తెచ్చారు. 2009 డిసెంబర్ 23న నాటి కాంగ్రెస్ కీలక నేత జానారెడ్డి నివాసంలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ‘జేఏసీ’ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ చైర్మన్‌గా కళింగ ఫంక్షన్ హాల్లో తొలి భేటీ నిర్వహించారు. తర్వాతి కాలంలో ఈ జేఏసీ నుంచి కాంగ్రెస్, టీడీపీ వైదొలిగినా బీజేపీ, ఇతర పక్షాలు చివరి వరకూ కొనసాగాయి. విభిన్న భావజాలాలు కలిగిన పార్టీలు, సంస్థలు, ఉద్యోగసంఘాలు జేఏసీ వేదికగా పనిచేశాయి. కలానికి పదును పెట్టిన కేసీఆర్..: రాష్ట్ర సాధన ఉద్యమంలో టీఆర్ఎస్ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో తెలంగాణ కళలు, సాహిత్యాన్ని ఆయుధంగా మార్చిన వైనం కూడా కేసీఆర్‌లో చూడొచ్చు. అవసరమైన సందర్భంలో తాను కలం చేతబట్టి పాటలు రాసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ‘సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని.. అనుకుంటే వచ్చేదా దేశానికి స్వాతంత్య్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది.. ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రమొచ్చి తీరుతుంది’అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యమ నేపథ్యంలో వచ్చిన జై బోలో తెలంగాణ సినిమాలో ‘గారడీ చేస్తుండ్రు.. గజిబిజి చేస్తుండ్రు’అంటూ తెలంగాణ వ్యతిరేకుల తీరును ఎండగట్టారు. చెప్పినదీ.. చెప్పనిదీ చేయడమే..!..: ప్రత్యేక రాష్ట్రం నేపథ్యంలో ఏర్పడిన ప్రభుత్వాధినేతగా తాను చెప్పినదీ చెప్పనిదీ కూడా చేసి చూపడం ద్వారా కేసీఆర్ తన వినూత్న శైలిని చాటుకుంటూ వస్తున్నారు. 2014 జూన్ 2 నుంచి 2018 సెప్టెంబర్ 6 వరకు 51 నెలల పాటు సాగిన పాలనలో వినూత్న నిర్ణయాలతో విమర్శలు, ప్రశంసలు పొందిన సందర్భాలు అనేకం. బీపీఎల్ ఆదాయ పరిమితి, ఆసరా పెన్షన్ల పెంపు, బీడీ కార్మికులకు భృతి వంటి సంక్షేమ పథకాలతో పాటు ‘కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్’వంటి వినూత్న పథకాలతో ప్రజల్లోకి వెళ్లారు.2014–18 వరకు ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్ల ప్రస్థానంలో సుమారు 500 సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి ఆచరణలో చూపిన నేత కేసీఆర్. ఎన్నికల మేనిఫెస్టోలో లేని దళితబంధు, చేప పిల్లల పంపిణీ వంటి పథకాలు లెక్కకు మిక్కిలి. తెలంగాణ అత్మను అర్థం చేసుకున్న నేతగా పేరొందిన కేసీఆర్ వ్యవసాయం, నీటిపారుదల, ఐటీ, పరిశ్రమలు, విద్య ఇలా ప్రతీ రంగంపైనా తనదైన ముద్ర వేశారు. ప్రతిపక్ష నేతగా మరో ప్రస్థానం..: నాలుగు దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో ఉంటూ ఉద్యమ నేతగా, ప్రభుత్వాధిపతిగా పనిచేసిన కేసీఆర్ 2023 నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటమితో ప్రతిపక్ష నాయకుడి పాత్రలోకి మారిపోయారు. ఎర్రవల్లి నివాసం నుంచే పార్టీ యంత్రాంగాన్ని నడుపడంలోనూ విలక్షణ శైలిని చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరును ఎండగట్టడంలో పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ పాలక పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. -
యువతకు ఉపాధి అవకాశాలు పైపైకి
న్యూఢిల్లీ: దేశ యువతకు ఉపాధి అవకాశాలు ప్రతిఏటా పెరిగేలా తమ ప్రభుత్వం విధానపర నిర్ణయాలు అమలుచేస్తోందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. 15వ విడత రోజ్‌గార్ మేళలో భాగంగా శనివారం దేశవ్యాప్తంగా వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా ఉద్యోగాలు పొందిన 51,000 మందికి నియామక పత్రాలను మోదీ వర్చువల్‌గా అందజేసి ప్రసంగించారు. ‘‘అత్యంత వేగంగా వృద్ధిచెందుతున్న ఆర్థికవ్యవస్థల్లో భారత్ కొనసాగుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ సైతం స్పష్టంచేసింది. దేశంలోని ప్రతి రంగంలోనూ ఉపాధి అవకాశాలు ఏటికేడు పెరుగుతూనే ఉంటాయి. ఆటోమొబైల్, ఫుట్‌వేర్ పరిశ్రమల్లో ఉత్పత్తి, ఎగుమతులు నూతన రికార్డులను నెలకొల్పాయి. ఈ రంగాలు నూతన ఉద్యోగాల కల్పన మరింత ఎక్కువైంది’’అని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పోలిస్తే ప్రస్తుతం ఎంతో మార్పులొచ్చాయని చెప్పారు. ‘‘2014 ఏడాది ముందువరకు నదీజలాల ద్వారా సరకు రవాణా 1.8 కోట్ల టన్నులు ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 15.5 కోట్ల టన్నులకు పెరిగింది. నదీజల మార్గాలు గతంలో ఐదు ఉంటే ఇప్పుడవి 110కి పెరిగాయి. గతంలో 2,700 కిలోమీటర్ల పొడవునా రాకపోకలు జరిగేవి. ఇప్పుడు నదీజలాల్లో 5,000 కిలోమీటర్ల పొడవునా రాకపోకలు జరుగుతున్నాయి. ప్రతి రంగంలో మహిళల ప్రాతినిధ్యం పెరిగింది. ఈ ఏడాది యూపీఎస్సీ తుది ఫలితాల్లోనూ టాప్–5 ర్యాంకర్లలో ముగ్గురు మహిళలే. త్వరలో ముంబైలో జరగబోయే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్(వేవ్స్) భారతీయ యువత తమ డిజిటల్ నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించేందుకు ఒక చక్కటి అవకాశం’’అని మోదీ అన్నారు. -
అటారీ–వాఘా సరిహద్దు మూసివేత..
రాజస్తాన్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి..భారత్, పాకిస్తాన్ల మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు.. సరిహద్దుల మూసివేత సామాన్యులకు ఎన్నో అవ స్థలు తెచ్చిపెట్టాయి. రాజస్తాన్‌లోని బర్మేర్‌కు చెందిన షైతాన్ సింగ్ అనే యువకుడికి పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన కేసర్ కన్వర్‌తో నాలుగేళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. వరుడికి, అతడి కుటుంబీలకు వీసా దొరక్క పెళ్లి ఇప్పటిదాకా జరగలేదు. ఫిబ్రవరి 28న వీసాలు మంజూరయ్యాయి. ఈ నెల 30వ తేదీన సింధ్ ప్రావిన్స్‌లోని అమర్‌కోట్‌లో వధువు ఇంట్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఇందుకోసం సరిహద్దులకు రెండువైపులా ఉన్న కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంతలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో బుధవారం అట్టారీ–వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. విషయం తెలియని షైతాన్ సింగ్ కుటుంబం ఊరేగింపుగా అటారీ–వాఘా బోర్డర్ పాయింట్‌కు చేరుకుంది. అక్కడ ఆర్మీ అధికారులు అసలు విషయం చెప్పడంతో అంతా షాకయ్యారు. ‘ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఇలా జరిగింది’అంటూ షైతాన్ సింగ్ ఆవేదన చెందారు. ‘మమ్మల్ని ఆహ్వానించేందుకు బోర్డర్ పోస్ట్ వద్దకు చేరుకున్న మా బంధువులు చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు’అని అతడి సోదరుడు చెప్పారు. ఉగ్రదాడుల కారణంగా తమ బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని అతడు పేర్కొన్నాడు. అయితే, ఈ కుటుంబానికి మరో చిన్న ఆశ మిగులుంది. అదేంటంటే, వీరి వీసాల గడువు మే 12వ తేదీ వరకు ఉండటం. అప్పటికల్లా తిరిగి సరిహద్దులు తెరుచుకుంటాయని, పెళ్లి జరుగుతుందని ఆశతో వీరున్నారు. కాగా, భారత, పాకిస్తాన్ సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉంటున్న సోధా రాజ్పుట్ వర్గం ప్రజల మధ్య వివాహ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. -
సోషల్ మీడియా పోస్టులపై నిఘా
సాక్షి, హైదరాబాద్: సోషల్ మీడియాతో మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంటోంది. ఇటీవల కొందరు వ్యక్తులు విద్వేషాలు వెళ్లగక్కేందుకు సోషల్ మీడియా యాప్‌లను అ్రస్తాలుగా మార్చుకుంటున్నారు. ఎదుటి వారిని రెచ్చగొట్టేలా పెట్టే అసభ్యకర పోస్టింగులకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. కశ్మీర్లో ఉగ్రదాడితో దేశంలో ఏర్పడిన సున్నితమైన పరిస్థితుల నేపథ్యంలో ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా మరో వర్గం వ్యాఖ్యలు, ఫొటోలు, వీడియోలు పోస్టు చేయడం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించడంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఫేస్బుక్, ఎక్స్, ఇన్‌స్ట్రాగామ్, యూ ట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో అనవసర ఉద్రిక్తతలకు దారి తీసే పోస్టులు ఏవైనా ఉన్నాయా? అని పోలీసులు నింతరం ఆరా తీస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్‌ను మరింత అప్రమత్తం చేసినట్టు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక కేంద్రంతోపాటు అన్ని జిల్లాల్లోని సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ మరింత యాక్టివ్ అయినట్టు తెలిపారు. నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి మార్ఫింగ్ ఫొటోలు, అత్యంత హేయమైన అసభ్యకర పదజాలంతో సోషల్‌మీడియాలో పోస్టింగ్స్ పెట్టే వారికి చెక్ పెడుతున్నారు. అలాంటి పోస్టులను వెంటనే తొలగించడంతోపాటు అవి ఎక్కడి నుంచి, ఎవరు పెడుతున్నారన్నది కూడా ఆరా తీస్తున్నారు. కీలక ఆధారాలు లభించిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) పోలీసులు దీనిపై నిరంతరం నిఘా పెడుతున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిఘా కోసం బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఇంటిగ్రేటెడ్ సోషల్ మీడియా సరై్వలెన్స్ వింగ్, సోషల్ మీడియా యాక్షన్ స్క్వాడ్ (స్మాష్)తో నిరంతరం మానిటరింగ్ చేస్తున్నారు. -
కిన్నెరసాని.. చూసొద్దాం రండి..
పాల్వంచ రూరల్: వేసవి సెలవులు వచ్చాయి. చిన్నారులు, పెద్దలు, మహిళలు వెళ్లేందుకు కిన్నెరసాని ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనాన్ని పంచే అడవులు, స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే చెట్లు.. చెంగుచెంగున ఎగిరే వన్యప్రాణులు, గలగలా పారే సెలయేర్లు.. పక్షుల కిలకిలారావాలకు కిన్నెరసాని డీర్‌పార్కు చిరునామాగా నిలుస్తోంది. అడుగడుగునా ఆహ్లాదాన్ని పంచే జీవ వైవిధ్యం గల అటవీ అందాలతో మినీ ఊటీగా మారుతోంది కిన్నెరసాని పర్యాటక ప్రాంతం. కొండకోనలు, పచ్చని చెట్లు, జలాశయం, వన్యప్రాణులతో చూడచక్కని ప్రకృతి అందాలకు నిలయమైన కిన్నెరసానిలో పర్యాటకులను ఆకట్టుకునేలా పచ్చని పొదరిళ్లు, ఎత్తయిన కొండలు, గుట్టలు, జలాశయం, చూడచక్కని ద్వీపాలు కనిపిస్తాయి. పర్యాటకుల ఊహకు ఏమాత్రం తగ్గని రీతిలో ఇక్కడి ప్రకృతి సోయగాలు ప్రతీ ఒక్కరిని అలరిస్తాయి. ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు.పర్యాటకులను ఆకర్షించేలా కాటేజీలు..భద్రాద్రి కొత్తగూడెం జిలê్ల పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో నీతి ఆయోగ్ పథకం కింద రూ.3.24 కోట్లు, ఎకో టూరిజం అభివృద్ధి కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7.53 కోట్లు మంజూరు చేశాయి. ఆయా నిధులతో కిన్నెరసానిలో తొమ్మిది కాటేజీలు, అద్దాలమేడ నిర్మాణం చేపడుతున్నారు. కిన్నెరసాని రిజర్వాయర్‌లో పర్యాటకుల కోసం బోటు షికారు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు డీర్‌పార్క్‌లోని చుక్కల జింకలు, జలాశయం అందాలను చూసి.. మరోసారి రావడానికి ఉత్సాహం చూపుతుంటారు.అద్దాలమేడకు ఎంతో ప్రాముఖ్యంకిన్నెరసాని పర్యాటక ప్రాంతంలో ఒకప్పుడు అద్దాలమేడకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. 1978లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అద్దాలమేడతో పాటు పలు కాటేజీలు నిర్మించారు. అయితే ఆ తర్వాత అద్దాలమేడను మావోయిస్టులు ధ్వంసం చేయడంతో కళావిహీనంగా తయారైంది. కాగా, కిన్నెరసానిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా అద్దాలమేడ పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రూ,10.77 కోట్లు ఖర్చు చేశారు. శిథిలావస్థకు చేరిన అద్దాలమేడతో పాటు కాటేజీలను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మించారు. రిజర్వాయర్ చుట్టూ ఎత్తయిన గుట్టపై రెండంతస్తుల్లో 9 కాటేజీలు, అద్దాల మేడ, ఫుడ్ కోర్టు నిర్మించారు. కిన్నెరసానికి ఎలా చేరుకోవాలంటే..ఖమ్మం నుంచి భద్రాద్రి జిల్లా పాల్వంచకు 90 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పట్టణానికి చేరుకున్నాక అంబేడ్కర్ సెంటర్ నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే కిన్నెరసాని ప్రాజెక్టు వస్తుంది. అక్కడ ప్రకృతి అందాలతో నిండిన జలాశయం, జింకల పార్కు ఉంటాయి. కిన్నెరసానికి సమీపంలోని మందెరకలపాడు సమీప అటవీ ప్రాంతంలో జలపాతం ఉంది. ఇక్కడ నుంచి తిరిగి భద్రాచలం వెళ్లే మార్గంలో పెద్దమ్మతల్లి ఆలయం ఉంది. కాగా, కిన్నెరసాని చేరడానికి బస్ సౌకర్యం లేక ఆటోలను ఆశ్రయించాల్సిందే. వేసవి సెలవుల్లోనైనా బస్సు సౌకర్యం కల్పిస్తే కిన్నెరసానికి పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇక వరంగల్ జిల్లా లక్నవరంలో ఏర్పాటు చేసినట్లుగా కిన్నెరసానిలో కూడా నీళ్ల మధ్య వంతెన నిర్మించి, ప్రత్యేక హోటళ్లు, వసతి గృహాలను నిర్మిస్తే పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవచ్చు. -
ముగిసిన ఇరాన్, అమెరికా మూడో దఫా చర్చలు
మస్కట్ (ఒమన్): యురేనియం శుద్ధి కార్యక్రమం వేగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఇరాన్‌తో అమెరికా చేపట్టిన మూడో దఫా పరోక్ష చర్చలు శనివారం ఒమన్‌లో ముగిశా యి. అయితే ఈ చర్చల్లో ఎలాంటి సానుకూల ఫలితాలు వచ్చాయి అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. చర్చల తర్వాత అమెరికా తరఫున అధ్యక్షుడు ట్రంప్ పశ్చిమాసియా రాయబారి స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీలు ఒమన్ నుంచి తమ స్వదేశాలకు పయనమయ్యారని విశ్వస నీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘పరస్పర గౌరవం, హామీలకు కట్టుబడేలా ఒప్పందం కుదర్చుకునేందుకు రెండు దేశాలు ఆసక్తి కనబర్చాయి. కీలక ప్రతిపాదనలు, సాంకేతిక అభ్యంతరాలు, తదితరాలపై మరోదఫా చర్చలు జరుపుతాం. వచ్చే వారం సైతం సంప్రతింపుల ప్రక్రియ కొనసాగుతుంది. మళ్లీ అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతుంది. మే మూడో తేదీన తదుపరి భేటీ ఉంటుంది’’అని ఒమన్ విదేశాంగ మంత్రి బదర్ అల్ బుసైదీ ప్రకటించారు. గతంలో మస్కట్, రోమ్‌లో ఇలా పరోక్ష చర్చలు జరిగాయి. గతంలో మాదిరే ఈసారి చర్చల్లో సైతం ఒమన్ విదేశాంగ మంత్రి బుసైదీ మధ్యవర్తిగా ఉన్న విషయం విదితమే. చర్చలకు ముందు విట్కాఫ్ రష్యాలో ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. చర్చలు మొదలైన సమయంలోనే దక్షిణ ఇరాన్లో రజేయీ నౌకాశ్రయంలో శనివారం పేలుళ్లు సంభవించడం గమనార్హం. అర్ధశతాబ్ద శత్రుత్వాన్ని పక్కనబెట్టిమరీ ఇరాన్‌పై కఠిన ఆంక్షలను సడలిస్తామని, అందుకు ప్రతిగా అణ్వాయుధంలో ఉపయోగించే యురేనియం శుద్ధి వేగాన్ని తగ్గించాలని అమెరికా డిమాండ్ చేయడం తెల్సిందే. తమ డిమాండ్లను ఒప్పుకోకుంటే దాడులతో తెగబడతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. అయితే అందుకు దీటుగా బదులిస్తామని ఇరాన్ ప్రతిస్పందించడం విదితమే. -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.వృషభం...ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దికుని ముందుకు సాగుతారు. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. నీలం, ఆకుపచ్చ రంగులు. అంగారక స్తోత్రాలు పఠించండి.మిథునం....ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. బంధువులు మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నలుపు రంగులు. . దేవీఖడ్గమాల పఠించండి.కర్కాటకం...పట్టుదల, ధైర్యంతో సమస్యలను అధిగమిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆరోగ్యసమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అందరిలోఉద్యోగాలలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, తెలుపు రంగులు. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.సింహం..కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒక అంగీకారానికి వస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పసుపు, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కన్య....వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వివాహాది వేడుకల నిర్వహణకు సమాయత్తమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు మరింత లాభించి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతోకలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.తుల.....ప్రముఖులు పరిచయమవుతారు. ఆర్థిక విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వాహనయోగం. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. గులాబీ, నీలం రంగులు. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.వృశ్చికం...మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వృథా ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత పసుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.ధనుస్సు...ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. బంధువులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. అయినా ధైర్యంగా ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు కొంత ఫలిస్తాయి. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. . సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.మకరం...ముఖ్యమైన పనులు చక్కదిద్దుతారు. ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వివాహాది వేడుకలపై దృష్టి సారిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. దత్తాత్రేయుని ఆరాధించండి.కుంభం...ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. కుటుంబసభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. వాహన, గృహయోగాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. . దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి.మీనం...ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. కొత్త రుణాలు కోసం యత్నాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. బంధువులు, మిత్రులు మీపై ఒత్తిడులు పెంచుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు. గృహం కొనుగోలు, నిర్మాణాలలో ఆటంకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కక డీలాపడతారు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శు¿¶ వార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబీ, ఆకుపచ్చ రంగులు.. ఆంజనేయ దండకం పఠించండి. -
కొత్త కొలువుల జోరు
న్యూఢిల్లీ: దేశంలోని వ్యవస్థాపక రంగంలో ఉద్యోగ కల్పన జోరుమీద ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం రికార్డు స్థాయిలో కోటీ 45 లక్షల కొత్త కొలువులు సృష్టించింది. దేశంలో పటిష్ట ఆర్థిక వృద్ధి అంచనాల నేపథ్యంలో పలు సంస్థల్లో నియామకాలు భారీగా జరుగుతున్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) గణాంకాల ప్రకారం 2022–23 ఆర్థిక సంవత్సరంలో కోటీ 38 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన జరిగింది.సగటున నెలకు 12 లక్షల ఉద్యోగాలు 2024–25 ఆర్థిక సంవత్సరంలో సగటున నెలకు 12 లక్షల కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి వచ్చాయి. ఆ ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో మొత్తంగా సృష్టించిన కొత్త కొలువుల సంఖ్య 1,32,25,401. చివరి నెల సగటను కూడా కలుపుకుంటే కోటీ 45 లక్షల కొత్త నియామకాలు జరిగాయి. ఇది 2022–23తో పోల్చితే 7 లక్షలు అధికం. 6.4 శాతం ఆర్థిక వృద్ధి రేటు ప్రభుత్వ అంచనాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఆర్థిక వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంది. 2025–26లోనూ దాదాపు ఇదే స్థాయిలో వృద్ధి రేటు నమోదయ్యే అవకాశముందని భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థలో పటిష్ట వృద్ధి కారణంగా కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఉద్యోగులు తమ జీతాలను నగదు చెల్లింపులకు బదులు బ్యాంక్ ఖాతాలో జమచేయాలని డిమాండ్ చేసే ట్రెండ్ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు. దీని కారణంగానే వ్యవస్థాపక రంగంలో కొత్త ఉద్యోగాల పెరుగుదల ఈపీఎఫ్‌వో డేటాలో భారీగా నమోదువుతున్నట్లు చెబుతున్నారు. కొత్త కంపెనీలు తక్కువే దేశంలో కొత్తగా ఏర్పాటైన సంస్థల సంఖ్య ఈ ఏడాది తక్కువగానే ఉంది. 2018–19 ఆర్థిక సంవత్సరం నుంచి చూస్తే ఈపీఎఫ్ఓలో నమోదైన కొత్త సంస్థల సంఖ్య 2024–25లో కనిష్టంగా ఉంది. 2024–25 ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో మొత్తం 45,860 కొత్త సంస్థలు ఈపీఎఫ్ఓలో రిజిస్టర్ అయ్యాయి. అంటే సగటున నెలకు 4,169 సంస్థలు. ఇంత తక్కువ సంఖ్యలో సంస్థలు ఈపీఎఫ్‌వోలో చేరడానికి కారణం ప్రభుత్వ పరంగా ప్రోత్సాహకాలు లేకపోవడమేనని పేర్కొంటున్నారు. 2024 జూలైలో ప్రకటించిన ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (ఈఎల్ఐ) అమల్లోకి వస్తే పరిస్థితి మారుతుందని చెబుతున్నారు. -
నన్ను ఇక్కడే ఉండనివ్వండి
‘నేను పాకిస్తాన్ కుమార్తెను, కానీ ఇప్పుడు నేను భారతదేశ కోడలిని. నాకు పాకిస్తాన్‌కు వెళ్లడం ఇష్టం లేదు. నన్ను ఇక్కడే ఉండనివ్వండి. నన్ను భారతదేశంలో ఉండడానికి అనుమతివ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగిలకు విజ్ఞప్తి చేస్తున్నాను’ఇది పాకిస్తాన్ పౌరురాలైన... ప్రస్తుతం యూపీలో ఉంటున్న సీమా హైదర్ చేసిన విజ్ఞప్తి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను కేంద్రం రద్దు చేసిన విషయం తెలిసిందే. తనను కూడా పంపించేస్తారేమోనన్న ఆందోళనతో సీమ చేసిన వీడియో విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఎవరీ సీమా హైదర్. పాకిస్తాన్ పౌరురాలు యూపీ కోడలు ఎలా అయ్యింది? సీమా హైదర్... పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌కు చెందిన మహిళ. 2019లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండగా ఆమెకు యూపీకి చెందిన సచిన్ మీనాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే.. అప్పటికే సీమాకు పెళ్లయ్యింది. భర్త గులాం హైదర్‌తో ఆమెకు నలుగురు పిల్లలు కూడా. అయితే సచిన్ మీద ప్రేమతో.. నలుగురు పిల్లలను తీసుకుని ఆమె భారత్‌కు వచ్చేసింది. నేపాల్ మీదుగా సరిహద్దు నుంచి అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించింది. యూపీలోని సచిన్‌ను పెళ్లి చేసుకుంది. గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని రబుపుర ప్రాంతంలో నివసిస్తోంది. వీరి విషయం 2023 జూలైలో బయటకు వచ్చింది. అక్రమంగా ప్రవేశించినందుకు సీమాను, ఆశ్రయం కల్పించినందుకు సచిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత ఇద్దరూ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆమె కేసును ఏటీఎస్ విచారిస్తోంది. పహల్గాం ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విష యం తెలిసిందే. నిబంధనల ప్రకారం సీమా సైతం భారత్‌ను వీడి వెళ్లాలి. కాని తాను పాక్‌కు వెళ్లనని, ఇక్కడే ఉంటానని, అందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీమా విజ్ఞప్తి చేస్తోంది. తానిప్పుడు సీమా హైదర్‌ను కాదని, సీమా మీనానని, సచిన్‌ను పెళ్లి చేసుకున్నా తరువాత హిందూ మతాన్ని స్వీకరించానని చెబుతోంది. అయితే ఆమె భారత్‌లో నివసించడానికి అర్హురాలని ఆమె తరపు న్యాయవాది ఏపీ సింగ్ సైతం వాదిస్తున్నారు. సచిన్ మీనాతో పెళ్లి తరువాత ఆ దంపతులకు కూతురు పుట్టింది. ఆ చిన్నారి ఇప్పుడు భారతీయురాలు. అంతర్జాతీయ న్యాయస్థానం, సంరక్షణ చట్టాల ప్రకారం చిన్నారి సంరక్షణ బాధ్యత తల్లిది. తల్లి సీమా మీనా భారత్‌ను వీడితే.. చిన్నారిని కూడా వెంట తీసుకెళ్లాల్సి వస్తుంది. భారతీయ పౌరురాలిని పాక్‌కు ఎలా పంపిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ పౌరులందరూ దేశం విడిచి వెళ్లాలనే ఆదేశం నుంచి ఆమెకు మినహాయింపు ఉంటుందని ఆయన భావిస్తున్నారు. సీమ కేసు భిన్నమైనదని, ఈ విషయమై రాష్ట్రపతి దగ్గర పిటిషన్ కూడా ఉందని ఆయన వాదిస్తున్నారు. అంతేకాదు.. బెయిల్‌పై ఉన్న సీమను అత్తమామల ఇల్లు తప్ప రబుపురా దాటరాదని జెవార్ కోర్టు ఆదేశాలు కూడా ఉన్నందున.. వీసా రద్దు ఉత్తర్వులు ఆమెకు వర్తించవని చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కొను‘గోడు’ పట్టదా?
సాక్షి ప్రతినిధి, ఖమ్మం/సాక్షి నెట్వర్క్ : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. ఓవైపు కొనుగోళ్లు జరగక, మరోవైపు వాన భయం, ఇంకోవైపు అసౌకర్యాలు వెరసి రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కంటిమీద కును కు లేకుండా పోయింది. అయినా వీరి గోడు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఖమ్మం జిల్లాలో యాసంగిలో పండించిన సన్న ధాన్యాన్ని కొనుగోలు కేంద్రా ల్లో అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు షాక్ తగులు తోంది. ధాన్యం తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కాంటాలు పెట్టడానికి ముందుకు రావడం లేదు. దీంతో రైతులకు పడిగాపులు తప్ప డం లేదు. క్వింటాకు 5 కేజీల వరకు తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామని మిల్లర్లు తెగేసి చెబుతున్నారు. రైతులు ఈ షరతుకు ఒప్పుకోకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు కాంటాలు వేయడం లేదు. ధాన్యం అమ్ముకునేందుకు వీల్లేక, అకాల వర్షాలకు తడుస్తుండటంతో రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. ఏడు చేపల కథ.. చేపా..చేపా ఎందుకు ఎండలేదంటే.. గడ్డి మోపు అడ్డమొచ్చిందన్న చందంగా ఉంది కొనుగోలు కేంద్రాల తీరు. కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు ధాన్యం కాంటా వేయడం లేదు. ఎందుకు వేయడం లేదంటే లారీలు వస్తేనే కాంటా వేస్తామంటున్నారు. లారీలు ఎందుకు సరఫరా చేయడం లేదని సప్లయర్స్‌ను అడిగితే లోడింగ్, అన్లోడింగ్ వెంటనే చేస్తేనే లారీలు పెడతామంటున్నారు. అన్లోడింగ్ వెంటనే చేయమని మిల్లర్లను అడిగితే క్వింటాకు 5 కేజీల తరుగు తీస్తేనే దిగుమతి చేసుకుంటామంటున్నారు. ఇలా ఒకదానికి ఒకటి లింక్ పెట్టి రైతులతో ఆడుకుంటున్నారు. ప్రైవేట్ వ్యాపారుల వైపే.. కొనుగోలు కేంద్రాల్లో ఎదుర్కొంటున్న సమస్యలతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటా రూ.2,100 కు కొనుగోలు చేస్తుండగా, ఆ మొత్తానికే విక్రయిస్తున్నారు. తద్వారా అటు మద్దతు ధర, ఇటు బోనస్ కోల్పోతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో వేచి ఉండే ఓపిక లేక అమ్ముకుంటున్నారు. అసౌకర్యాల నడుమ.. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో పది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే ఏ కేంద్రంలోనూ రైతులకు సౌకర్యాలు లేవు. » ఓ టెంట్ ఏర్పాటు చేశారు. ఈ టెంట్ కింద ధాన్యం కొనుగోలు చేసే వీఓ గ్రూప్ సభ్యులు, ఐకేపీ సీసీలు రెండు మూడు కుర్చీలు వేసుకొని కూర్చుంటున్నారు. » ధాన్యం అమ్ముకోవడానికి వచ్చిన రైతులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. ధాన్యం మీద కప్పుకోవడానికి రైతులే రూ.10 వేలు విలువ చేసే పట్టాలు కొనుగోలు చేస్తున్నారు. ఐకేపీ నుంచి ఎలాంటి టార్పాలిన్లు ఇవ్వడం లేదు. » రైతులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయకపోవడంతో వారే క్యాన్లు వెంట తెచ్చుకుంటున్నారు. » ధాన్యం తూర్పార పట్టడానికి మాత్రం ఓ ఫ్యాన్ ఏర్పాటు చేస్తున్నారు. దానిని నడిపించడానికి ట్రాక్టర్‌ను రైతులే తెచ్చుకోవాలి. » కొనుగోలు చేసిన తర్వాత లారీలోకి ఎక్కించి మిల్లుకు తరలించడానికి వారం పట్టినా, పది రోజులైనా ధాన్యం జాగ్రత్త బాధ్యతలు రైతులవే. ఒకవేళ వాన పడితే ఇబ్బందే. » కొణిజర్ల మండల రైతులు సాగు చేసిన యాసంగి పంటను ముదిగొండ మండలంలోని ఓ రైస్ మిల్లు కు, సత్తుపల్లి శివారులోని మరో రైస్ మిల్లుకు కేటాయించారు. సత్తుపల్లి మిల్లర్ తమ వద్ద బాయిలర్ రిపేర్‌కు వచి్చందని కొనుగోలు నిలిపేశాడు. » ముదిగొండ సమీపంలోని రైస్ మిల్లు యజమాని నేరుగా రైతులతో మాట్లాడుకొని ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువగా ఇస్తానంటే లారీ దిగుమతి చేసుకుంటున్నాడు. లేదంటే అంతే. ప్రస్తుతం నాలుగు రోజులుగా మల్లుపల్లికి చెందిన ఓ లారీ ఆ మిల్లు వద్దే ఉంది. » నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేటలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గ్రామ శివారులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 30 వేల బస్తాల ధాన్యం తూకం వేసి రైస్‌మిల్లులకు తరలించారు. మరో 10 వేల బస్తాలు తూకం వేయాల్సి ఉంది. నాలుగైదు రోజుల క్రితం తూకం వేసిన 1,800 బస్తాలు వరకు కొనుగోలు కేంద్రంలో ఉన్నాయి. లారీల కొరత వల్ల ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతోంది. » సిద్దిపేట అర్బన్ మండలం బక్రిచెప్యాల గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కాంటా నిలిచిపోయినట్టు రైతులు పేర్కొన్నారు. » యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో సేదతీరడానికి నీడ లేక పోవడంతో ఇబ్బంది పడుతున్నారు. కేంద్రం నిర్వాహకులు టార్పాలిన్ కవర్లతో వేసిన గుడిసె.. మంచినీటి డ్రమ్ములు పెట్టడానికి రికార్డులు రాసుకోవడానికి మాత్రమే సరిపోతుంది. రైతులు, కూలీలు సమీపంలో కంపచెట్ల కింద చాలీచాలని నీడన అలసట తీర్చుకుంటున్నారు. ఎండలోనే మగ్గుతున్నాం.. వారం రోజుల క్రితం మార్కెట్లో వడ్లు పోశాను. టెంట్ లేకపోవడం, దగ్గరలో చెట్లు లేకపోవడం వల్ల మాతోపాటు కూలీలు ఎండలోనే మగ్గుతున్నారు. గాలి దుమారానికి గుడిసె దెబ్బతిన్నది. ప్రభుత్వం రైతుల సౌలభ్యం కోసం టెంట్ ఏర్పాటు చేయాలి. – నడిగోటి భిక్షం, రైతు కక్కిరేణి, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం... నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని చెరుపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు తాగునీటికి ఇబ్బందులకు గురవుతున్నారు. కేంద్రంలో నీటిని డ్రమ్ముల్లో పోస్తుండడంతో ఎండకు వేడెక్కుతున్నాయి. – లొడంగి చంద్రయ్య, రైతు,దాచారం, నల్లగొండ జిల్లా తరుగు తీస్తామంటున్నారు.. నాలుగెకరాల్లో వరిసాగు చేస్తే 250 బస్తాల దిగుబడి వచ్చింది. 12 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చా. ఇప్పటి వరకు కాంటాలు వేయలేదు. క్వింటాకు 3 నుంచి 5 కిలోల తరుగు అడుగుతుంటే ఒప్పుకోలేదు. తరుగు ఇవ్వడం కన్నా..ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకోవడం మంచిది. కొనుగోలు కేంద్రాల వద్ద ఎండ, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నాం. – నాగండ్ల ఉపేందర్, జల్లేపల్లి, తిరుమలాయపాలెం మండలం, ఖమ్మంజిల్లా కనీస సౌకర్యాలు కరువు కొనుగోలు కేంద్రంలో రైతుల కోసం చిన్న టెంటు ఏర్పాటు చేశారు. అది కూలిపోయింది. ఎండ సమయంలో ఇబ్బంది పడుతున్నాం. చెట్ల నీడన సేదతీరుతున్నాం. ఇక్కడ కనీసం తాగునీటి సౌకర్యం కూడా లేదు. – శంకర్ పుప్పాల, రైతు, జానకంపేట, ఎడపల్లి మండలం, నిజామాబాద్ జిల్లా ఎండకు ఎండుతున్నాం.. వానకు తడుస్తున్నాం.. ధాన్యం తీసుకొచ్చి 5 రోజు లు అవుతోంది. కొద్దిపాటి వ ర్షానికి ధాన్యం తడి సింది. ధా న్యాన్ని ఆరబెట్టుకోవడం కో సం రోజంతా ఇక్కడే ఉండా ల్సి వస్తోంది. దీంతో ఇక్కడ నీడ సౌకర్యం లేక తాగు నీరు లేక ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నా. గన్నీ సంచులు లేక ధాన్యం ఆగిపోయింది. – ఖాతా మాధవరెడ్డి, రైతు, బక్రిచెప్యాల -
‘ప్రైవేట్’కు ఇచ్చే అధికారం కలెక్టర్‌కు లేదు
సాక్షి, హైదరాబాద్: భూముల వర్గీకరణ, రెవెన్యూ రికార్డుల్లో ఎంట్రీలకు సంబంధించిన వివాదాల్లో జోక్యం చేసుకుని, ఉత్తర్వులు జారీ చేసే అధికారం కలెక్టర్‌కు ఉండదని హైకోర్టు తేల్చిచెప్పింది. సివిల్ కోర్టులకు మాత్రమే అలాంటి అధికారం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మారుస్తూ కలెక్టర్ కొత్తగా సర్వే నంబర్ కేటాయించడం చట్టవిరుద్ధమని చెప్పింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్, మోకిల గ్రామాల మధ్య ఉన్న 40.12 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అని తేల్చుతూ సర్వే శాఖ, తహసీల్దార్ 2014లోనే ఉత్తర్వులు జారీ చేసినా, జిల్లా కలెక్టర్ దాన్ని ప్రైవేటు వ్యక్తుల పేర్లపై రికార్డుల్లోకి చేర్చుతూ ప్రొసీడింగ్స్ ఇవ్వడాన్ని తప్పుబట్టింది.వెంటనే ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం కొండకల్ సర్వే నంబర్ 398/ఏ, 400/ఏ, 402/ఏ, 402/ఏ1/1 లోని 2.14 ఎకరాల భూమిని 2008లో చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, తన పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని కృష్ణరామ్ భూపాల్ అనే వ్యక్తి కబ్జా చేసి తమకు దారి ఇవ్వడం లేదంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన శైలజ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆక్రమించిన 20.12 ఎకరాల ప్రభుత్వ భూమి ‘బిలా దాఖలా’(ఎవరికీ చెందనిది, ఏ సర్వే నంబర్లో లేనిది) కేటగిరీ కిందకు వస్తుందన్నారు. ఈ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ 2022, 2023లో కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను కొట్టివేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ భూ వివాదంపై 2014లో పిటిషన్ వేశామన్నారు. అప్పుడు సర్వే చేసిన అధికారులు 40.12 ఎకరాలు బిలాదాఖలా భూమిగా (ప్రభుత్వ భూమిగా) తేల్చారన్నారు. అందులో 20.12 ఎకరాలు ఆక్రమణల్లో ఉందని తహసీల్దార్ కౌంటర్ కూడా వేశారని చెప్పారు. ఇదిలా ఉండగా, ఆ భూమిని పట్టా భూమిగా పేర్కొంటూ విలేజ్ మ్యాప్‌ను మార్చాలని 2022లో కలెక్టర్ సర్వే శాఖకు ప్రొసీడింగ్స్ ఇచ్చారని నివేదించారు. 2023లో కొత్త సర్వే నంబర్లతో ప్రైవేటు వ్యక్తుల పేర్లను రికార్డుల్లో చేర్చారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. సదరు భూములపై ఎలాంటి లావాదేవీలు నిర్వహించడం, భూమిని ఇతరుల పేరు మీదకు మార్చడం చేయొద్దని పిటిషనర్‌ను ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 21కు వాయిదా వేశారు. -
రజతోత్సవ రణన్నినాదం
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’ పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారని అంచనా. సాక్షి, హైదరాబాద్/సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)గా ప్రస్థానం ప్రారంభించి, బీఆర్ఎస్గా మారి నేడు 25వ ఏట అడుగు పెడుతున్న భారత రాష్ట్ర సమితి.. వరంగల్ శివారులోని ఎల్కతుర్తిలో ‘రజతోత్సవ సభ’పేరిట ఆదివారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు హాజరయ్యే ఈ సభను విజయవంతం చేసేందుకు సుమారు నెల రోజులుగా బీఆర్ఎస్ యంత్రాంగం మొత్తం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సభకు దాదాపు 10 లక్షల మంది వస్తారన్న అంచనాతో 1,200 ఎకరాల్లో విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు రెండుమూడు రోజుల ముందునుంచే ఎల్కతుర్తికి ప్రయాణం ప్రారంభించాయి. దేశం దృష్టిని ఆకర్షించేలా.. 14 ఏండ్లు ఉద్యమ పార్టీగా, తొమ్మిదిన్నరేళ్లు అధికార పార్టీగా ప్రస్థానం సాగించిన బీఆర్ఎస్.. ఏడాదిన్నరగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. 2023 నవంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు, 2024 ఏప్రిల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ తొలిసారి నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తం దేశం దృష్టిని ఆకర్షించేలా సభ ఉంటుందని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. సుమారు ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్న కేసీఆర్.. ‘రజతోత్సవ సభ’లో చేసే ప్రసంగంపై ఆసక్తి నెలకొంది. తెలంగాణ చరిత్రలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీయే విలన్‌గా ఉందని ఈ సభలో కేసీఆర్ మరోసారి బలంగా ప్రస్తావించే అవకాశముంది. కేవలం 15 నెలల పాలనలోనే ప్రజల ముందు ఇంతగా పతనమైన ప్రభుత్వాన్ని చూడలేదని పార్టీ అంతర్గత సమావేశాల్లో కేసీఆర్ చెప్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ మళ్లీ ఛిన్నాభిన్నమైందని ఇటీవల పలు సందర్భాల్లో విమర్శలు గుప్పించారు. రజతోత్సవ సభలో ఇవే అంశాలను మరింత బలంగా, తనదైన శైలిలో ప్రజలకు వివరించే అవకాశముంది. ఏడాది తర్వాత తిరిగి ప్రజాక్షేత్రంలోకి.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో అధికారం కోల్పోయిన కేసీఆర్.. కొద్ది రోజుల తర్వాత నివాసంలో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చేరారు. సుమారు రెండు నెలల చికిత్స, విరామం తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలను ప్రారంభించారు. ఫిబ్రవరి 13న ప్రతిపక్ష నేతగా కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షించాలంటూ నల్లగొండలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. మార్చి 12న కరీంనగర్లో మాజీ ఎంపీ వినోద్‌కుమార్ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ ప్రసంగించారు. 2024 మార్చి 31న తెలంగాణ భవన్లో పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్ 5 నుంచి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం బస్సు యాత్ర చేశారు. ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం నుంచి రెండు రోజుల పాటు నిషేధం కూడా ఎదుర్కొన్నారు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఒక్క సీటులోనూ విజయం సాధించలేకపోయింది. దీంతో పార్టీ అంతర్గత సమావేశాలు, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల మొదటి రోజు మాత్రమే హాజరవుతూ వస్తున్నారు. సుమారు ఏడాది కాలంగా బహిరంగ సభలకు, క్షేత్ర స్థాయి పర్యటనలకు దూరంగా ఉన్న కేసీఆర్.. తిరిగి రజతోత్సవ సభ ద్వారా ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రకటించే భవిష్యత్ కార్యాచరణపై అటు పార్టీలోనూ, ఇటు ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. విద్యుత్ వెలుగుల్లో సభా ప్రాంగణం అట్టహాసంగా ఏర్పాట్లు రజతోత్సవ సభ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. ఎల్కతుర్తి, చింతలపల్లి, దామెర, కొత్తపల్లి, గోపాల్పూర్, బావుపేట తదితర గ్రామాల రైతుల నుంచి సేకరించిన 1,213 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో 154 ఎకరాల్లో మహాసభ ఏర్పాట్లు చేయగా, సభకు హాజరయ్యే ప్రజలను తరలించే వాహనాల పార్కింగ్ కోసం 1,059 ఎకరాలు కేటాయించారు. వేసవి ప్రతాపం తీవ్రంగా ఉండటంతో సభికుల కోసం 10.80 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేశారు. ఎండవేడిమికి ఎవరికైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సేవలందించేందుకు సభావేదిక చుట్టూ 12 వైద్య శిబిరాలు, 20 అంబులెన్స్‌లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. సభా వేదికపై 500 మంది.. సభా వేదికను భారీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్‌తోపాటు సుమారు 500 మందివరకు వేదికపై ఆసీనులయ్యే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాల ట్రాఫిక్ నియంత్రణ కోసం 2,500 మంది వలంటీర్లకు శిక్షణ ఇచ్చి నియమించారు. 1,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. ఈ సభకు కేసీఆర్ హెలికాప్టర్లో వస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సభా వేదికకు 500 మీటర్ల దూరంలో ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు కేసీఆర్ చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఆయన వేదికపైకి చేరుకుంటారని చెబుతున్నారు. కేసీఆర్ సుమారు గంటకుపైగా ప్రసంగించే అవకాశం ఉందన్నారు.సభ ఏర్పాట్లు ఇలా⇒ సభా స్థలి విస్తీర్ణం: 1,213 ఎకరాలు ⇒ బీఆర్ఎస్ అంచనా ప్రకారం సభకు హాజరయ్యే ప్రజలు: సుమారు 10 లక్షలు ⇒ మహాసభ ప్రాంగణం: 154 ఎకరాలు ⇒ ప్రధాన వేదికపై సీటింగ్: 500 మందికి ⇒ సభా సమయం: సాయంత్రం 5 గంటల నుంచి 6.30 గంటల వరకు. ⇒ వాహనాల పార్కింగ్ : 1,059 ఎకరాలు ⇒ సభికుల కోసం సిద్ధం చేసిన వాటర్ బాటిళ్లు: 10.80 లక్షలు ⇒ మజ్జిగ ప్యాకెట్లు: 16 లక్షలు ⇒ సభావేదిక చుట్టూ అంబులెన్స్‌లు: ఆరు రూట్లు, 20 అంబులెన్స్‌లు ⇒ మెడికల్ క్యాంపు: సభావేదిక చుట్టూ 12 ⇒ ట్రాఫిక్, పార్కింగ్ నిర్వహణ కోసం: 2,500 మంది వలంటీర్లు -
మే 5న తెలంగాణకు నితిన్ గడ్కరీ
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో దాదాపు రూ.6,280 కోట్ల వ్య యంతో నిర్మించిన 285 కిలోమీటర్ల మేర జాతీయ రహదా రులను మే 5వ తేదీన కేంద్ర రోడ్లు, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిష న్‌రెడ్డి సంయుక్తంగా జాతికి అంకితం చేయనున్నారు. ఈ పర్య టనలో మొదట ఆదిలాబాద్ జిల్లాలో, ఆ తర్వాత హైద రాబాద్ నుంచి.. రెండు వేర్వేరు చోట్ల నుంచి జాతీయ రహ దారులకు సంబంధించిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగనున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణలో దాదాపు రూ.6, 280 కోట్ల ఖర్చుతో 285 కి.మీ. మేర జాతీయ రహ దారులకు సంబంధించిన పలు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. వీటితో పాటు రూ.961 కోట్లతో 51 కి.మీ. మేర చేపట్టనున్న రెండు జాతీయ రహదారుల ప్రాజెక్టు పనులకు నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. కాగా, హైదరాబాద్ నార్త్‌లో గ్రీన్ ఫీల్డ్ రీజనల్ ఎక్స్‌ప్రెస్ హైవే (రీజనల్ రింగ్ రోడ్ – ఉత్తర భాగం) ప్రాజెక్టు కు సంబంధించి పబ్లిక్–ప్రైవేటు పార్ట్నర్షిప్ అప్రెయిజల్ కమిటీ (పీపీపీఏసీ), కేబినెట్ అను మతులు త్వరితగతిన ఇచ్చేలా చర్య లు తీసుకోవాలని, ఆర్థికపరమైన అంశాలపై త్రైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాలని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. ఈ ప్రాజెక్టుకు రూ.18,772 కోట్లు ఖర్చు కావొచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. అలాగే హైదరా బాద్ రీజనల్ రింగ్ రోడ్డు (సౌత్) నిర్మాణ వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.. ఈ ప్రాజెక్టును జాతీయ రహ దారిగా ప్రకటించేందుకు కూడా కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణా నికి మొత్తం రూ.13 వేల కోట్లు ఖర్చు కానుండగా.. భూసేకర ణలో 50 శాతం ఖర్చుగా రూ.2,230 కోట్లు భరించేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ అంగీకరించింది. -
భారత్ భద్రతకు ‘ఇస్రో’ భరోసా..!
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశ భద్రత అవసరాల కోసం రాబోయే మూడేళ్లలో 150 ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతోంది. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఒకేసారి నాలుగు రాకెట్లు అనుసంధానానికి వీలుంది. అలాగే తమిళనాడులోని కులశేఖరపట్నంలో నిర్మాణంలో ఉన్న ప్రయోగ కేంద్రాన్ని కూడా ఈ ఏడాదిలోపు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీటి ద్వారా త్వరతిగతిన ఉగప్రహ ప్రయోగానికి అవకాశం లభిస్తోంది. కమ్యూనికేషన్ ఉపగ్రహాలకు ప్రాధాన్యత ఇంటర్నెట్ విస్తరణ నేపథ్యంలో నెట్వర్క్ కెపాసిటీ పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం కమ్యూనికేషన్ ఉపగ్రహాలను అధిక సంఖ్యలో ప్రయోగించాలనే ప్రణాళిక రూపొందించారు. భారతదేశానికి దాదాపు 7,500 కిలోమీటర్ల మేర తీరరేఖ ఉండటంతో, తీరప్రాంతాల్లో నిఘా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 55 ఉపగ్రహాలు అవసరాలను తీర్చలేకపోవడంతో, కొత్త ఉపగ్రహాల కోసం ఇస్రో భారీ ప్రణాళికను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తున్న నేపథ్యంలో, 150 ఉపగ్రహాల భద్రతకు సంబంధించి కమ్యూనికేషన్, రిమోట్ సెన్సింగ్ అవసరాల కోసం ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు వేగంగా పనిచేస్తున్నారు. అంతేకాదు, కేంద్రం చేపట్టిన సంస్కరణల వల్ల అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ రూపకల్పన, ప్రయోగాల్లో ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని కూడా పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. మే నుంచి బిజీబిజీ.. ఇస్రో మే నెల నుంచి వరుసగా నాలుగు ముఖ్యమైన ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ముందుగా మే మొదటి వారంలో జీఎస్ఎల్వీ–ఎఫ్16 ప్రయోగాన్ని నిర్వహించిన అనంతరం, మిగిలిన మూడు ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే, మొదటి ప్రయోగ వేదికపై పీఎస్ఎల్వీ–సీ61 రాకెట్ ప్రయోగానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.రెండో ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న మొదటి అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో జీఎస్ఎల్వీ–ఎఫ్16 ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. రెండవ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో గగన్‌యాన్–1 ప్రయోగానికి ఎల్వీఎం3–జీ1 రాకెట్ సిద్ధమవుతోంది. సాలిడ్స్టేజ్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో ఎల్వీఎం3–ఎం5 రాకెట్ అనుసంధానం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.జీ–20 అవసరాలపై దృష్టి జీ–20 దేశాల అవసరాల మేరకు వాతావరణ మార్పులపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక ఉపగ్రహాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో 50 శాతం వ్యయాన్ని భారత్, మిగతా 50 శాతం వ్యయాన్ని జీ–20 దేశాలు భరించనున్నాయి. అంతరిక్ష యాత్ర లక్ష్యం ఇక మానవ సహిత అంతరిక్ష యాత్రకు కూడా ఇస్రో సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా చంద్రయాన్– 4 మిషన్ ప్రయోగానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అంగారక గ్రహంపై మరింత లోతుగా అధ్యయనం చేయడానికి మంగళ్యాన్–2 మిషన్, అలాగే శుక్రగ్రహ ఉపరితలం, వాతావరణంపై అధ్యయనం చేయడానికి శుక్రయాన్ మిషన్ కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
ప్రతీకార పోరు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఆరంభంలో పరాజయాలు ఎదురైనా... ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో గెలుపు బాట పట్టిన ముంబై మరో విజయంతో ‘ప్లే ఆఫ్స్’ వైపు మరో అడుగు ముందుకు వేయాలని భావిస్తోంది. మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా మంచి టచ్‌లో ఉంది. అయితే ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకున్న హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై జట్టు గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి మంచి జోరు మీద ఉంది. ఓవరాల్‌గా రెండు జట్లు 9 మ్యాచ్‌లాడి 5 విజయాలు, 4 పరాజయాలతో 10 పాయింట్లతో ఉన్నాయి. అయితే ఇరు జట్లు గెలిచిన ఐదు మ్యాచ్‌ల్లోనూ... వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవడం... సమష్టి కృషికి నిదర్శనం. ముంబై తరఫున అశ్వని కుమార్, కరణ్ శర్మ, విల్ జాక్స్, రోహిత్ శర్మ, ట్రెంట్ బౌల్ట్ ఈ అవార్డు దక్కించుకోగా... లక్నో సూపర్ జెయింట్స్ తరఫున శార్దుల్ ఠాకూర్, దిగ్వేశ్ రాఠీ, నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్, అవేశ్ ఖాన్ గెలుచుకున్నారు. ఈ సీజన్లో ఇరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో లక్నో విజయం సాధించింది. లక్నో 203 పరుగులు చేయగా... లక్ష్యఛేదనలో ముంబై 191 పరుగులకే పరిమితమైంది. ఈ పోరులోనే భారీ షాట్లు ఆడలేక తిలక్ వర్మ రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మరి రెండో మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి. జోరు సాగిస్తేనే... హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావడంతో... ముంబై కష్టాలు తీరిపోయాయి. సీజన్ ఆరంభంలో పరాజయాలతో సతమతమైన ముంబై.. ఇప్పుడు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. రోహిత్ దంచికొడుతూ శుభారంభాలు అందిస్తుండగా... మిడిలార్డర్లో సూర్యకుమార్ తన విలువ చాటుకుంటున్నాడు. రికెల్టన్, విల్ జాక్స్ కూడా మంచి టచ్‌లో ఉండగా... తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్ రూపంలో ముంబైకి మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. వీరంతా కలిసి కట్టుగా కదంతొక్కితే భారీ స్కోరు చేయడం పెద్ద కష్టం కాదు. సొంతగడ్డపై మ్యాచ్ జరగనుండడం ముంబైకి కలిసి రానుంది. ఇక బౌలింగ్‌లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చహర్ పేస్ భారం మోయనుండగా... విగ్నేశ్, సాంట్నర్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. టాపార్డర్‌పైనే భారం... లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్లో ఐదు విజయాలు సాధించిందంటే... వారి టాప్–3 ఆటగాళ్లు రాణించడమే దానికి ప్రధాన కారణం. మిచెల్ మార్ష్, మార్క్రమ్, పూరన్ ఈ ముగ్గురూ దంచికొడుతుండటంతో... లక్నో భారీ స్కోర్లు చేస్తోంది. ముఖ్యంగా పూరన్ ఈ సీజన్లో 200 పైగా స్ట్రయిక్‌రేట్‌తో 377 పరుగులు చేశాడు. మార్క్రమ్, మార్ష్ కూడా ధాటిగా ఆడుతున్నారు. కెప్టెన్ రిషబ్ పంత్ ఫామ్ ఆ జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. ఈ సీజన్లో లయ దొరకబుచ్చుకోలేకపోతున్న పంత్ 9 మ్యాచ్‌ల్లో 106 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఆయుశ్ బదోనీ, అబ్దుల్ సమద్ ఫర్వాలేదనిపిస్తుండగా... డేవిడ్ మిల్లర్ రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో శార్దుల్, అవేశ్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠీ కీలకం కానున్నారు.తుది జట్లు (అంచనా) ముంబై ఇండియన్స్: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), రికెల్టన్, రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్, తిలక్ వర్మ, నమన్ ధీర్, సాంట్నర్, దీపక్ చహర్, బౌల్ట్, బుమ్రా, విగ్నేశ్. లక్నో సూపర్ జెయింట్స్: పంత్ (కెప్టెన్), మార్క్రమ్, మార్ష్, పూరన్, బదోనీ, మిల్లర్, సమద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, దిగ్వేశ్ రాఠీ, అవేశ్ ఖాన్, ప్రిన్స్ యాదవ్. -
రూ.9 వేల కోట్ల అప్పు కోసం 'సర్వం తాకట్టు'
అప్పుల కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం బరితెగించింది. రూ.9 వేల కోట్ల అప్పు కోసం 436 గనుల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను ప్రైవేట్ వారికి సర్వ హక్కులతో తాకట్టు పెడుతోంది. ఇదివరకెన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్‌ను ప్రైవేట్ వారికి అప్పగిస్తోంది. అంటే ప్రభుత్వంతో సంబంధం లేకుండానే ఈ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధులను వారే డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇలా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసి ఉండదు.తద్వారా ఆ గనులపై పెత్తనం అంతా అప్పు ఇచ్చిన వారిదే ఉంటుంది. పైగా ఆ గనుల్లో ఏం జరిగినా.. ఎన్ని అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నా కూడా ప్రశ్నించ కూడదట! కొత్తగా వచ్చే ప్రభుత్వం కూడా ఈ ఒప్పందాన్ని రద్దు చేయకూడదట! ఈ గనులను తమ ఇష్టం వచ్చిన వాళ్లకు అప్పగించేలా ఘనత వహించిన విజనరీ చంద్రబాబు ప్రభుత్వం సదరు అప్పు ఇచ్చిన వారికి హక్కులు కట్టబెట్టింది. ఏమిటీ పరిణామం.. ఎందుకీ బరితెగింపు.. ఇందులో లోగుట్టేంటి.. అంటూ వివిధ రంగాల నిపుణులు విస్తుపోతున్నారు. ఒక ప్రభుత్వం ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఇంతకు మించిన కేస్ స్టడీ మరొకటి అక్కర్లేదంటున్నారు. 436 గనులపై కల్పించిన హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ సవరించడం, రద్దు చేయడం కుదరదని స్పష్టం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందంలోని భాగంసాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అప్పుల కోసం ప్రైవేటు కంపెనీకి రూ.1.91 లక్షల కోట్ల ఖనిజ సంపదపై సర్వ హక్కులు ధారపోయడం విస్తుగొలుపుతోంది. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ద్వారా బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్ల రుణాన్ని సమీకరించడం కోసం 436 చిన్న తరహా గనులపై ప్రైవేట్‌కు పెత్తనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియలో ఎవరూ ప్రశ్నించలేని లీజు, మైనింగ్ హక్కులను ప్రభుత్వం.. ప్రైవేట్ వారికి ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ గనుల్లో అక్రమ మైనింగ్ జరిగినా, పర్యావరణ ఉల్లంఘనలు చోటుచేసుకున్నా ప్రశ్నించడానికి వీల్లేని విధంగా రక్షణ కల్పించడం కలకలం రేపుతోంది. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే భవిష్యత్తులో ఏవైనా తేడాలు వచ్చినా కూడా లీజు హక్కులను రద్దు చేసే అవకాశం ఉండదు. కనీసం అందులో మార్పులు చేయడానికి, సవరించడానికి సైతం ఆస్కారం ఉండదు. ఒకవేళ ప్రభుత్వం మారినా, తర్వాత వచ్చే ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని మార్చకూడదని ఒప్పందంలో స్పష్టం చేశారు. ఏదైనా కారణాలతో బాండ్లకు సంబంధించిన మొత్తాన్ని చెల్లించలేకపోతే డిబెంచర్ ట్రస్టీ (పైవేటు కంపెనీ) ఆ ఖనిజాలపై మైనింగ్ హక్కులను వేరే వారికి బదిలీ చేసే హక్కు సైతం కట్టబెట్టారు. కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం ఇన్ని వెసులుబాట్లు, రాయితీలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని నిపుణులు చెబుతున్నారు. వివాదాలు వచ్చినా నిస్సహాయతే! ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టినప్పుడు దానికి ప్రభుత్వమే జవాబుదారీగా ఉండాలి. భవిష్యత్తులో ఈ ఒప్పందంలో ఏమైనా ఇబ్బందులు, వివాదాలు వస్తే తర్వాత ప్రభుత్వం దానిపై ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిని కల్పించడం చట్ట విరుద్ధమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేటాయించిన లీజులపై గనుల శాఖకు పూర్తి అధికారాలు ఉంటాయి. మైనింగ్ నిబంధనలు ఉల్లంఘించినా, నిబంధనలు పాటించకపోయినా.. ఏ సమయంలోనైనా లీజు రద్దు చేసే అధికారం గనుల శాఖకు ఉంటుంది. కానీ ఈ ఒప్పందంలో అటువంటి ఆస్కారం లేకుండా చేశారు. ఆ గనుల తవ్వకాల్లో నష్టాలు వచ్చినా ప్రభుత్వమే భరించక తప్పదు. ఏ గనుల్లో అయినా అనుకున్నంత ఆదాయం రాకపోతే అంతే విలువైన వేరే గనుల్ని మళ్లీ ఏపీఎండీసీకి ఇవ్వాల్సి ఉంటుంది. నిజానికి పారదర్శకమైన బిడ్డింగ్ ప్రక్రియ లేకుండా మైనింగ్ లీజులు, మైనింగ్ హక్కులను ఎవరికీ కేటాయించకూడదు. ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎండీసీకి గనుల కేటాయింపునకు సంబంధించి ఒక ప్రక్రియ ఉంటుంది. దాని ప్రకారమే ఆ లీజులు కేటాయించాలి. కానీ ఇక్కడ అవేమీ పాటించకుండా ప్రజలకు సంబంధించిన లక్షల కోట్ల రూపాయల విలువైన ఖనిజ సంపదను కేవలం రూ.9 వేల కోట్ల అప్పు కోసం చంద్రబాబు తనఖా పెడుతున్నారంటే ఆయన ఎంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సహజ వనరులను ప్రజల మేలు కోసం కేటాయించాలని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది. పోటీ బిడ్డింగ్ లేకుండా, ప్రభుత్వ ఆస్తులను రుణం కోసం తాకట్టు పెట్టడం చట్టపరమైన నిబంధనలను సైతం ఉల్లంఘించడమేనని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా రాష్ట్రానికి ఖనిజ ఆదాయం ఏమీ మిగిలే అవకాశం ఉండదు. కానీ బాండ్ హోల్డర్లు మాత్రం లాభాలు గడిస్తారు. డీఎస్ఆర్ఏ ద్వారా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వారికి హక్కులా? మరోవైపు ఇదే ఒప్పందంలో బాండ్లు కొనుగోలు చేసిన వారికి నేరుగా రాష్ట్ర ఖజానాను అప్పగించేందుకు సైతం రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం ద్వారా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. అప్పులు చెల్లించేందుకు డీఎస్ఆర్ఏ (డెబిట్ సర్వీస్ రిజర్వ్ ఎకౌంట్) తెరుస్తోంది. ఏపీఎండీసీకి వచ్చే ఆదాయాన్ని డీఎస్ఆర్ఏ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని చెబుతోంది. ఒకవేళ డీఆర్‌ఎస్‌ఏ ఖాతాలో నిధుల లభ్యత లేకపోతే.. ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధుల నుంచి తీసుకునే అధికారాన్ని బాండ్లు కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తులకు ఇస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ఖజానాపై ప్రైవేటు వ్యక్తులకు ఇలా హక్కులు ఇవ్వలేదని ఆర్ధిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీఎండీసీ భవిష్యత్ ఆదాయంపై అప్పులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చుకుంది. కేవలం 11 నెలల్లోనే బడ్జెట్ లోపల.. బడ్జెట్ బయట రూ.1,54,865 కోట్ల అప్పు చేసి రికార్డు సృష్టించింది. తాజాగా గురువారం ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ (నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్) బాండ్లు జారీ చేసి రూ.9 వేల కోట్ల నిధుల సమీకరణకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాండ్లకు ఆర్ధిక భద్రత కల్పిస్తూ 436 గనులను కేటాయించి ఆ గనులను తాకట్టు పెట్టింది. తద్వారా ఆ గనుల నుంచి భవిష్యత్‌లో వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టిందని అర్థం. ఆ గనుల ద్వారా వచ్చే ఆదాయంతో బాండ్లు కొనుగోలు చేసిన వారికి అప్పును చెల్లిస్తామని చెప్పింది. ఒకవేళ గనుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గితే.. ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు కొత్త గనులు కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంటే.. ఏపీఎండీసీకి భవిష్యత్‌లో వచ్చే ఆదాయంపైనా అప్పులు చేస్తోందన్నది స్పష్టమవుతోంది. సంపద సృష్టితో అద్భుతాలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ పని చేయలేకపోగా ఉన్న సంపదను కూడా అడ్డగోలుగా తాకట్టు పెడుతున్నారని అధికార వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బాండ్ల జారీకి సంబంధించి నియమించబడిన డిబెంచర్ ట్రస్టీ లేదా ట్రస్టీ తరఫున వ్యవహరించే ఏ ఇతర వ్యక్తికైనా 436 గనులపై సర్వ హక్కులు కల్పిస్తున్నట్లు పేర్కొన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పుట్టకే ఎన్సీడీ బాండ్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అప్పులు చేయడంలో రికార్డు సృష్టించింది. ఇక రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు çసుముఖత వ్యక్తం చేయక పోవడంతో బడ్జెట్ బయట ఏపీఎండీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేసి, రూ.9 వేల కోట్లను సమీకరించడానికి పూనుకుంది. ఇంత పెద్ద ఎత్తున నిధులు సమీకరించాలంటే ఏపీఎండీసీకి మంచి రేటింగ్ అవసరం అవుతుంది. ఇందుకోసం ముంబయికి చెందిన ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థను ప్రభుత్వం సంప్రదించింది. ఏపీఎండీసీ ఆస్తులు, ఆదాయం, అప్పులపై అధ్యయనం చేసిన ఆ సంస్థ ‘సీఈ’ రేటింగ్ ఇచ్చింది. అంటే.. డీఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు లేకపోతే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే నిధులను నేరుగా బాండ్లు కొనుగోలు చేసిన వారి ఖాతాలో జమ చేసేందుకు అంగీరించడం. అందువల్లే ఏపీఎండీసీకి ‘సీఈ’ రేటింగ్ ఇచ్చిందని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.రాజ్యాంగ ఉల్లంఘనే ఏపీఎండీసీ జారీ చేసే బాండ్లు కొనుగోలు చేసిన వారికి తిరిగి (అప్పు) చెల్లించేందుకు డీఎస్ఆర్ఏ ఖాతాను రాష్ట్ర ప్రభుత్వం తెరుస్తుంది. ఆ సంస్థకు వచ్చే ఆదాయాన్ని ఆ ఖాతాలో జమ చేసి.. బాండ్లు కొనుగోలు చేసిన వారికి చెల్లింపులు చేస్తామని స్పష్టం చేస్తోంది. ఆరు నెలలకు సంబంధించిన అప్పు, వడ్డీ చెల్లింపులకు సంబంధించిన మొత్తం డీఎస్ఆర్ఏ ఖాతాలో ముందుగానే నిల్వ ఉంచాలి. ఒకవేళ ఈ ఖాతాలో నిల్వ తక్కువగా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండానే ఆర్బీఐ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నేరుగా డీఎస్ఆర్ఏ ఖాతాలో నిధులు జమ చేస్తారు. అంటే.. కన్సాలిడేటెడ్ ఫండ్‌పై ప్రైవేటు వ్యక్తులకు అధికారం ఇవ్వడమేనని ఆర్ధిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది రాజ్యాంగాన్ని నిలువునా ఉల్లంఘించడమేనని తేల్చి చెబుతున్నారు. సాధారణంగా ఆర్బీఐ నుంచి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ), వేజ్ అండ్ మీన్స్ (చేబదులు) ద్వారా తీసుకునే అప్పును రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా చెల్లించడంలో విఫలమైతే.. వాటిని వడ్డీతో సహా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఆర్బీఐ మినహాయించుకుటుంది. కానీ ఇలా ప్రైవేటు వారికి పెత్తనం ఇవ్వడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇది ప్రమాదకర ప్రయోగమని నొక్కి చెబుతున్నారు. ఇలాగైతే భవిష్యత్తులో ఇబ్బందులే⇒ గనుల తాకట్టుపై అధికార వర్గాల్లో తీవ్ర ఆందోళన ⇒ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ ఒత్తిడి వల్లే ఇలా.. ⇒ ఏమాత్రం అడ్డుచెప్పని గనుల శాఖ కార్యదర్శి ⇒ ఇది ఏమాత్రం చిన్న విషయం కాదు ⇒ అన్ని శాఖల్లోనూ ఇలా చేయాలనే ఒత్తిడి రావచ్చుబాండ్ల జారీ ద్వారా రూ.9 వేల కోట్లను సమీకరించేందుకు ఏపీఎండీసీకి అనుమతిచ్చే విషయంలో ఐఏఎస్ అధికారి అయిన ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ (ఆర్ధిక శాఖ) పీయూష్ కుమార్, మరో ఐఏఎస్ అధికారి అయిన గనుల శాఖ కార్యదర్శి కమ్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తీరు అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. పీయూష్ కుమార్ తీవ్రంగా ఒత్తిడి తేవడం వల్లే ఈ వ్యవహారం ముందుకు కదిలినట్లు చర్చ జరుగుతోంది. తమకు మంచి పోస్టింగ్‌లు ఇచ్చింది కాబట్టి ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలాడిస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉత్తర్వులు ఇవ్వడం ఏమిటని ఐఏఎస్ అధికారులు చర్చించుకుంటున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బాండ్ హోల్డర్లకు సర్వ హక్కులు కల్పించడం, ఈ క్రమంలో ఏపీఎండీసీ, గనుల శాఖ ప్రయోజనాలు, స్ఫూర్తికే విఘాతం కలిగేలా వ్యవహరించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బాండ్ల కోసం ఏకంగా కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులు నేరుగా ప్రైవేటు వ్యక్తులు తీసుకునేందుకు ఉత్తర్వులివ్వడం చిన్న విషయం కాదని అధికారులు చెబుతున్నారు. ఇందుకోసం ఇచ్చిన ఉత్తర్వులు, ఒప్పందాలను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయకూడదని, భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం కూడా వీటిని మార్చకూడదనే రీతిలో ఉత్తర్వులివ్వడం సరికాదని సీనియర్ ఐఏఎస్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీన్ని చూపి.. మిగతా అధికారులు సైతం ఇలాగే చేయాలని ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేస్తారని, అప్పుడు అందరూ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఒక ఐఏఎస్ అధికారి అన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా నిబంధనలు, రాజ్యాంగ నియమాలను మరచిపోకూడదని.. వాటి విషయంలో రాజీ పడితే తర్వాత భారీ మూల్యం చెల్లించుకోవాల్సివుంటుందని తెలిపారు. సర్వీస్ రూల్స్‌ను ఉల్లంఘించి మరీ పొలిటికల్ బాస్ చెప్పారని పనిచేస్తే, మునుముందు ఆందోళన తప్పదని చెబుతున్నారు. తాము ఇచ్చిన ఉత్తర్వులు న్యాయస్థానాల్లోనూ నిలబడే విధంగా ఉండాలని, రాజ్యాంగ ఉల్లంఘన అని తెలిసినా ఉత్తర్వులు ఇవ్వడం న్యాయస్థానాల్లో నిలబడవని చెబుతున్నారు. అదే జరిగితే సర్వీసులో మాయని మచ్చగా మిగిలి పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రంప్, జెలెన్స్కీ ఏకాంత చర్చలు
కీవ్: పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వాటికన్ సిటీకి వెళ్లిన అమెరికా అధ్యక్షుడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అక్కడే భేటీ అయ్యారు. అంత్యక్రియల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందుగా వీరిద్దరూ సెయింట్ పీటర్స్ బసిలికాలో 15 నిమిషాలు మాట్లాడుకున్నారు. ప్రైవేట్‌గా సమావేశమైన ఇద్దరు నేతల మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్‌హౌస్ కూడా తెలిపింది. ఇతర వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొంది. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా అత్యున్నత స్థాయి సమావేశం త్వరలోనే జరగనుందని అంతకుముందు రోమ్ చేరుకున్న ట్రంప్ తన సొంత ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ‘పుతిన్, జెలెన్స్కీ ఒప్పందానికి అతి సమీపంలో ఉన్నారు. యుద్ధం ముగింపునకు రావాలంటే వీరి సమావేశం జరగాలి. చాలా ముఖ్యమైన అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. ఇప్పుడే ఈ రక్తపాతాన్ని ఆపాలి. క్రూరమైన, అర్థరహితమైన ఈ యుద్ధానికి ముగింపు పలుకుతాం’అని శుక్రవారం ఒక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. క్రిమియా రష్యాతోనే ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్ శుక్రవారం మాస్కోలో పుతిన్‌తో సమావేశమవడం తెల్సిందే. వాటికన్లో ట్రంప్‌తో భేటీ అనంతరం జెలెన్స్కీ సైతం సోషల్ మీడియాలో స్పందించారు. ‘ఒక్కో అంశాన్ని సవివరంగా చర్చించాం. వీటిపై సానుకూల ఫలితాలను ఆశిస్తున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడుకోవడం, సంపూర్ణ, బేషరతు కాల్పుల విరమణ, మళ్లీ యుద్ధం రాకుండా నివారించే విశ్వసనీయమైన, శాశ్వత శాంతి మాకు కావాలి’అని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో అత్యంత కీలకమైన సమావేశాలు జరగనున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరుగనున్న భేటీపై ఆయన సూచనప్రాయంగా తెలిపారు. ఇది చారిత్రాత్మకంగా మారే అవకాశం ఉందన్నారు. అయితే, భేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించేలా రష్యాపై తక్షణమే ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. శనివారం మరోసారి చర్చలు కొనసాగించాలని ట్రంప్, జెలెన్స్కీ నిర్ణయించుకున్నారని ఉక్రెయిన్ అధ్యక్షభవనం ప్రతినిధి సెర్హి నికిఫొరోవ్ అంతకుముందు వెల్లడించారు. కానీ, పోప్ అంత్యక్రియలు ముగిసిన వెంటనే ట్రంప్ నేరుగా రోమ్ విమానాశ్రయం చేరుకుని, ఎయిర్ ఫోర్స్ విమానంలో అమెరికాకు బయలుదేరారు. దీంతో, రెండో సమావేశానికి అవకాశం లేకుండా పోయింది. -
RCB Vs DC: కోహ్లి X రాహుల్
న్యూఢిల్లీ: భారత ప్రధాన బ్యాటర్లు... ఆ్రస్టేలియా ప్రధాన పేసర్ల మధ్య పోరులా అభివర్ణిస్తున్న మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 18వ సీజన్లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో రాయల్ చెలంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ సాధించలేకపోయిన ఈ రెండు జట్లు... తాజా సీజన్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. కెపె్టన్లు కాకపోయినా... బెంగళూరు బ్యాటింగ్ భారాన్ని విరాట్ కోహ్లి మోస్తుండగా... ఢిల్లీ క్యాపిటల్స్‌కు కేఎల్ రాహుల్ వెన్నెముకగా నిలుస్తున్నాడు. సాధికారికంగా ఆడుతున్న ఈ ఇద్దరి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది. ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాహుల్ రాణించడంతో ఢిల్లీ సునాయాసంగా విజయం సాధించింది. స్వతహాగా కర్ణాటకకు చెందిన రాహుల్... ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ‘ఇది నా అడ్డా’ అన్న తరహాలో సంబరాలు జరుపుకొని వార్తల్లో నిలిచాడు. మరి ఢిల్లీకి చెందిన విరాట్ కోహ్లి ఆదివారం తన సొంత నగరంలో జరగనున్న పోరులో దీనికి సమాధానం చెప్తాడా చూడాలి. ఢిల్లీ స్టేడియంలో విరాట్‌కు మంచి రికార్డు ఉంది. ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్‌లాడిన కోహ్లి అందులో 5 అర్ధ శతకాలు సాధించి ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక బౌలింగ్‌లోనూ ఇరు జట్ల ఆసీస్ పేసర్ల మధ్య పోటీ కనిపిస్తోంది. ఢిల్లీ ప్రధాన పేసర్ స్టార్క్ మంచి జోష్‌లో ఉండగా... బెంగళూరు తరఫున హాజల్‌వుడ్ మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆసక్తికర పోరు ఖాయమే! డుప్లెసిస్ రాకతో... ఇప్పటి వరకు ఐపీఎల్ ట్రోఫీ చేజిక్కించుకోలేకపోయిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు... ఈ సీజన్లో అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తోంది. అక్షర్ పటేల్ సారథ్యంలో ముందుకు సాగుతున్న క్యాపిటల్స్... 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక అగ్రస్థానంలో ఉంది. గాయం కారణంగా జట్టుకు దూరమైన ఫాఫ్ డుప్లెసిస్ తిరిగి అందుబాటులోకి రావడం ఆ జట్టు బలాన్ని మరింత పెంచుతోంది. ఓపెనర్ అభిషేక్ పొరెల్ మంచి ఫామ్‌లో ఉండగా... కరుణ్ నాయర్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటున్నాడు. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, స్టబ్స్, అశుతోష్ శర్మతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది.స్టార్క్‌తో కలిసి ముకేశ్ కుమార్ పేస్ భారం పంచుకోనుండగా... కుల్దీప్ యాదవ్, విప్రాజ్ నిగమ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు. జోరు సాగేనా..! అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం ఆడుతున్న తొలి ఐపీఎల్లో విరాట్ దంచికొడుతున్నాడు. బరిలోకి దిగితే చివరి వరకు నిలవాలనే కసితో ముందుకు సాగుతున్నాడు. 65.33 సగటుతో అతడు పరుగులు రాబట్టాడు. ఈ సీజన్లో ప్రత్యర్థుల మైదానాల్లో ఆడిన అన్నీ మ్యాచ్‌ల్లోనూ గెలిచిన బెంగళూరు అదే కొనసాగించాలనుకుంటోంది. కోహ్లితో పాటు మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా మంచి టచ్‌లో ఉండగా... మిడిలార్డర్లో దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటీదార్, జితేశ్ శర్మ కీలకం కానున్నారు. టిమ్ డేవిడ్, రోమారియో షెఫర్డ్ ఫినిషర్ల బాధ్యతలు మోస్తున్నారు. భువనేశ్వర్ కుమార్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్ పేస్ భారం మోస్తుండగా... సుయాశ్ శర్మ, కృనాల్ పాండ్యా స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు. ఈ సీజన్లో 16 వికెట్లు తీసిన హాజల్‌వుడ్‌పై భారీ అంచనాలున్నాయి. తుది జట్లు (అంచనా) ఢిల్లీ క్యాపిటల్స్: అక్షర్ పటేల్ (కెప్టెన్), అభిషేక్ పొరెల్, డుప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, స్టార్క్, కుల్దీప్, ముకేశ్ కుమార్, చమీరా. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: రజత్ పాటీదార్ (కెప్టెన్), కోహ్లి, సాల్ట్, పడిక్కల్, జితేశ్ శర్మ, షెఫర్డ్, డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, హాజల్‌వుడ్, యశ్ దయాళ్, సుయాశ్ శర్మ. -
కోచింగ్‌లో కొత్త ‘కీర్తి’
క్రీడల్లో అటు పురుషుల, ఇటు మహిళల విభాగాల్లో గొప్ప విజయాలు అందుకున్న స్టార్లను మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అయితే అదే శిక్షణకు వచ్చేసరికి మాత్రం పురుషులే పెద్ద సంఖ్యలో కనిపిస్తారు. క్రీడాంశం ఏదైనా కోచింగ్‌లో మహిళల సంఖ్య చాలా తక్కువ. అందులోనూ పురుష క్రీడాకారులకు మహిళలు కోచింగ్ ఇవ్వడం మరీ అరుదు. అయితే 32 ఏళ్ల కీర్తి తివారి ఇప్పుడు కోచింగ్‌లో తన ప్రత్యేకతను చాటుతోంది. ఇంకా ప్లేయర్ వయసులోనే ఉంటూ ఒక ప్లేయర్‌గానే కనిపించే ఆమె శిక్షణను చూస్తే ఎంత సాధికారికంగా కీర్తికి పట్టు ఉందో అర్థమవుతుంది. తనదైన శైలిలో ఆమె ఈతరం విజేతలను తయారు చేస్తోంది. ప్లేయర్‌నుంచి కోచింగ్ వైపు... కీర్తి స్వయంగా రన్నర్. 400 మీటర్ల పరుగులో పాల్గొన్న అథ్లెట్. కానీ అక్కడ పెట్టిన పరుగు ఫలితమివ్వకపోవడంతో కోచ్ పాత్ర పోషించేందుకు సిద్ధమైంది. వ్యాయామ విద్యలో మాస్టర్స్ డిగ్రీ చేసిన కీర్తి తదనంతరం పాటియాలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ (ఎన్ఐఎస్)లో కోచింగ్ డిప్లొమా పూర్తి చేసింది. 2019లో లక్నోలో తన శిక్షణను మొదలుపెట్టిన ఆమె ఫెడరేషన్ కప్‌లో ఓ విజేతను తయారు చేసింది. ఈ సీనియర్ జాతీయ ఈవెంట్లో పి. డేవిడ్ పురుషుల లాంగ్‌జంప్‌లో విజేతగా నిలువడంతో ఇప్పుడు కీర్తి పేరు తెరపైకి వచ్చిం ది. ఆమె నా కోచ్... కీర్తి ఫిజిక్‌ను చూసిన వారికి ఆమె ఓ అథ్లెట్‌గానే కనిపిస్తుంది. పురుషుల లాంగ్‌జంప్ పోటీ జరుగుతుంటే మహిళా అథ్లెట్‌కు ఏం పని అని అక్కడున్నవారు అనుకుంటుండగా... బరిలో ఉన్న డేవిడ్ కల్పించుకొని ఆమె నా కోచ్ అని చెప్పాల్సి వచ్చిం ది. ఎందుకంటే చాలామంది కోచ్‌లు మలివయసువారే ఉంటారు. యువకులెవరూ కోచ్‌లుగా ఉండరు. కానీ మూడు పదుల వయస్సున్న కీర్తిని సహజంగానే క్రీడాకారిణిగా భావించారంతా! అయితే ఈ యువ కోచ్ తన శిష్యుణ్ని తీర్చిదిద్దిన తీరు, విజేతగా మలచిన వైనం అందరిని ఆకట్టుకుంటోంది. పురుష ప్రపంచంలో ఆమె ఒంటరి పయనం విదేశాల సంగతి పక్కనబెడితే భారత్‌లాంటి దేశాల్లో అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఏ ఆటలో ఆసక్తి వుంటే తీసుకెళ్లేది పురుష కోచ్ వద్దకే. దిగ్గజ షట్లర్లు సైనా, సింధు తదితరులంతా పుల్లెల గోపీచంద్ శిక్షణలోనే ప్రపంచ బ్యాడ్మింటన్‌లో వెలిగారు. ఇలాంటి పురుష ప్రపంచంలో కీర్తి తన కోచింగ్ ప్రతిభతో పౌరుషాన్ని చాటింది. అకాడమీలో తాను ఒక ఒంటరనే ఫీలింగ్ ఉన్నా... తర్వాత అలవాటుపడింది. ఆటలో పడింది. కోచింగ్‌లోనే మమేకమైంది. దీంతో ఒంటరి పయనంలో ఆమె కనిపించేందుకు ఒక్కరే కావొచ్చు. కానీ కోచ్ పాత్ర తోడు–నీడ కావడంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేసింది. కష్టమైనా... కోచింగే ఇష్టం మహిళా కోచ్‌కు ఎదురయ్యే సవాళ్లు మామూలుగా వుండవు. పురుషాధిక్య సమాజంలో ఈ సవాళ్లతోనే సహవాసం చేయాల్సి ఉంటుంది. కుటుంబంతో దూరమయ్యే పరిస్థితి పురుషులకు సులువు... కానీ అమ్మాయిల పరిస్థితి చాలా భిన్నం. అందుకేనేమో చాలామంది మహిళలు కోచింగ్ వైపు వచ్చినప్పటికీ నిలదొక్కుకునే ముందే అస్త్రసన్యాసం చేస్తారు. తిరుగుటపా కట్టేస్తారు. కానీ కీర్తి మాత్రం ఎన్ని కష్టాలెదురైనా... తనకెంతో ఇష్టమైన కోచింగ్‌ను వదిలిపెట్టలేదు. కొన్నాళ్లుగా డేవిడ్ ప్రదర్శనకు మెరుగులు దిద్దుతున్న ఆమె చివరకు ఫెడరెషన్ కప్‌లో ఆశించిన ఫలితాన్ని సాధించింది. ఇంత చేసినా కూడా కొందరు ఈ మాత్రం ప్రదర్శనతో ఒలింపిక్స్‌కు తీసుకెళ్తావా అని గేలి చేసినవారూ ఉన్నారు. దానికి ఆమె సమాధానం... అవును ఒలింపియన్‌ను తయారు చేయడమే తన లక్ష్యమని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేది. -
భారత్, పాక్‌లది వెయ్యేళ్ల పోరు!
న్యూయార్క్: భారత్, పాక్ తమ ఉద్రిక్తతలను అంతర్గతంగానే పరిష్కరించుకుంటాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వెలిబుచ్చారు. పోప్ అంత్యక్రియల నిమిత్తం వాటికన్ వెళ్తూ శుక్రవారం ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ క్రమంలో హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత్, పాక్‌కు ఇది కొత్తేమీ కాదు. కశ్మీర్ కోసం ఇరుదేశాల మధ్య వెయ్యేళ్లకు పైగా పోరు నడుస్తోంది. బహుశా 1,500 ఏళ్లుగా అనుకుంటా’’అని చెప్పుకొచ్చారు. అంతేగాక పహల్గాం ఉగ్ర దాడిలో 30 మందికి పైగా పర్యాటకులు మరణించారంటూ సంఖ్యను కూడా తప్పుగానే చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలను నెటిజన్లు ఒక రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. కశీ్మర్ ఘర్షణల గురించి ట్రంప్‌కు తెలిసినంతగా బహుశా ఇంకెవరికీ తెలియదేమో అంటూ ఒకరు వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ‘‘అవునా! నేనింకా పాకిస్తాన్ 1947లో పురుడు పోసుకుందనే అపోహలో ఉన్నా’’అని మరొకరు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. -
భారత్ X శ్రీలంక
కొలంబో: మహిళల ముక్కోణపు వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఆదివారం జరగనున్న తొలి పోరులో ఆతిథ్య శ్రీలంకతో భారత జట్టు తలపడుతోంది. భారత్, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా పాల్గొంటున్న ఈ టోర్నీలో మ్యాచ్‌లన్నీ ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో... ఈ టోర్నీలో యువ ఆటగాళ్ల సామర్థ్యాన్ని పరీక్షించాలని భారత్ భావిస్తోంది. ముక్కోణపు టోర్నీ మొదటి మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా చూస్తోంది. కెపె్టన్ హర్మన్‌ప్రీత్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మతో భారత బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఓపెనర్ షఫాలీ వర్మను సెలెక్టర్లు ఈ సిరీస్‌కు కూడా పరిగణనలోకి తీసుకోలేదు.గత రెండు సిరీస్‌ల్లోనూ చక్కటి విజయాలు సాధించిన టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో ముక్కోణపు టోర్నీకి సిద్ధమైంది. వెస్టిండీస్, ఐర్లాండ్‌పై సిరీస్‌లు గెలిచిన టీమిండియా వరుసగా ఆరు వన్డేలు నెగ్గి శ్రీలంకలో అడుగుపెట్టింది. కాశ్వి గౌతమ్ అరంగేట్రం! బ్యాటింగ్‌లో బలంగా ఉన్న టీమిండియాకు పేస్ బౌలింగ్‌లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రెగ్యులర్ బౌలర్లు రేణుక సింగ్, పూజ వస్త్రకర్, టిటాస్ సాధు గాయాలతో సతమతమవుతుండటంతో... యంగ్ ప్లేయర్లపై అధిక భారం పడనుంది. అండర్–19 మహిళల ప్రపంచకప్‌లో సత్తాచాటిన కాశ్వి గౌతమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేయడం ఖాయమే. ఇటీవల మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన కాశ్వి 9 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టింది. హైదరాబాద్ మీడియం పేసర్ అరుంధతి రెడ్డి, కాశ్వి తుది జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయమే. మీడియం పేస్ ఆల్‌రౌండర్ అమన్‌జ్యోత్ కౌర్ కూడా అందుబాటులో ఉంది. అయితే శ్రీలంక పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యమే ఎక్కువ. ఆ కోణంలోనూ భారత్ మెరుగ్గా ఉంది. సీనియర్ ఆఫ్ స్పిన్నర్ దీప్తి శర్మ, స్నేహ్ రాణాతో పాటు డబ్ల్యూపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆకట్టుకున్న శ్రీచరణి జట్టులో ఉన్నారు. మరోవైపు శ్రీలంక జట్టు కెపె్టన్ చమరి ఆటపట్టుపై అధికంగా ఆధారపడుతోంది. -
‘ఈడెన్’ను ముంచెత్తిన వాన
కోల్‌కతా: ఈ మ్యాచ్ గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే ‘మెరుపులు... చినుకులు... రద్దు!’ పంజాబ్ ఓపెనర్ల బౌండరీతో మొదలైన ఈ మ్యాచ్ బ్యాటింగ్ వండర్‌గా సాగింది. మైదానంలో జోష్ తెచ్చింది. ప్రేక్షకుల్ని బాగా అలరించింది. కానీ ఇదంతా ఒక ఇన్నింగ్స్ వరకే పరిమితమైంది. కోల్‌కతా లక్ష్యఛేదన మొదలయ్యాక ఒకటే ఓవర్‌కు ఆట ముగించాల్సి వచ్చింది. వానొచ్చి మైదానంతో పాటు అంతకు ముందరి పరుగుల వరదను ముంచెత్తింది. భారీ వర్షంతో చాలా సేపు నిరీక్షించినా ఆట కొనసాగే పరిస్థితి లేకపోవడంతో అంపైర్లు చివరకు మ్యాచ్‌ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. శనివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (49 బంతుల్లో 83; 6 ఫోర్లు, 6 సిక్స్‌లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 69; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు.వీరిద్దరు తొలి వికెట్‌కు 72 బంతుల్లో 120 పరుగులు జోడించారు. ఆ తర్వాత వర్షంతో ఆట నిలిచే సమయానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక ఓవర్లో వికెట్ నష్టపోకుండా 7 పరుగులు చేసింది. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ మ్యాచ్ రద్దు కావడం ఇదే మొదటిసారి! 120 దాకా జోరే జోరు! ఫోర్‌తో మొదలైన పంజాబ్ స్కోరు తర్వాత జోరందుకుంది. ఓపెనర్లు ప్రియాన్ష్, ప్రభ్‌సిమ్రన్‌ల క్రమంగా హోరెత్తించడంతో మైదానం పరుగుల పండగ చేసుకుంది. ఇద్దరు ఫోర్లు, సిక్స్‌లను అలవోకగా దంచేయడంతో స్కోరుబోర్డు దూసుకెళ్లింది. 4.3 ఓవర్లలో కింగ్స్ 50 స్కోరును దాటింది. హర్షిత్ పదో ఓవర్లో ప్రియాన్ష్ వరుసగా 4, 6, 4 బాదాడంతో 27 బంతుల్లోనే అతని ఫిఫ్టీ పూర్తయ్యింది. తర్వాత నరైన్ 11వ ఓవర్‌ను ఇద్దరు కలిసి చితగ్గొట్టారు. ప్రియాన్ష్ ఓ సిక్స్ కొడితే... ప్రభ్‌సిమ్రన్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో 22 పరుగులొచ్చాయి. ఈ ఓవర్లోనే జట్టు స్కోరు వంద దాటింది. ఎట్టకేలకు 12వ ఓవర్లో రసెల్ ఓపెనింగ్ జోడీకి చెక్ పెట్టాడు. ప్రియాన్ష్ భారీ షాట్‌కు యత్నించి వైభవ్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత 38 బంతుల్లో ప్రభ్‌సిమ్రన్ అర్ధ సెంచరీ పూర్తయింది. సకారియా వేసిన 13వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ వరుసగా 4, 4, 6 కొట్టడంతో మొత్తం 18 పరుగులు వచ్చాయి. వరుణ్ వేసిన 14వ ఓవర్‌ను పూర్తిగా ఆడిన ప్రభ్‌సిమ్రన్ 4, 0, 4, 6, 4, 1లతో 19 పరుగుల్ని పిండుకున్నాడు. దీంతో ఈ రెండు ఓవర్లలోనే 37 పరుగులు రావడంతో 121/1 స్కోరు కాస్తా 158/1గా ఎగబాకింది. 15వ ఓవర్లో ప్రభ్‌సిమ్రన్ అవుట్ కావడంతోనే స్కోరు, జోరు అన్నీ తగ్గాయి. మ్యాక్స్‌వెల్ (7), మార్కో యాన్సెన్ (3) నిరాశపరచగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 26 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) పెద్దగా మెరిపించలేకపోయాడు. దీంతో ఆఖరి 6 ఓవర్లలో పంజాబ్ 43 పరుగులే చేయగలిగింది. ఈడెన్ గార్డెన్స్‌లో ఏ మ్యాచ్ జరిగినా గంట మోగించే ఆట ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే పహల్గాంలో ఉగ్ర ఘాతుకానికి నివాళిగా ఈ సారి గంట మోగించకుండా నల్ల రిబ్బన్లతో ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలోకి దిగారు. మ్యాచ్ ఆరంభానికి ముందు బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) పహల్గాంలో అసువులు బాసిన పర్యాటకులకు నివాళులు అర్పించింది. స్కోరు వివరాలు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: ప్రియాన్ష్ (సి) వైభవ్ (బి) రసెల్ 69; ప్రభ్‌సిమ్రన్ (సి) పావెల్ (బి) వైభవ్ 83; శ్రేయస్ నాటౌట్ 25; మ్యాక్స్‌వెల్ (బి) వరుణ్ 7; యాన్సెన్ (సి) వెంకటేశ్ (బి) వైభవ్ 3; ఇన్‌గ్లిస్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–120, 2–160, 3–172, 4–184. బౌలింగ్: వైభవ్ అరోరా 4–0–34–2, చేతన్ సకారియా 3–0–39–0, హర్షిత్ రాణా 2–0–27–0, వరుణ్ చక్రవర్తి 4–0–39–1, సునీల్ నరైన్ 4–0–35–0, రసెల్ 3–0–27–1. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: గుర్బాజ్ నాటౌట్ 1; నరైన్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (1 ఓవర్లో వికెట్ కోల్పోకుండా) 7. బౌలింగ్: యాన్సెన్ 1–0–6–0. మాల్దీవుల్లో సన్‌రైజర్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్‌ల ఒత్తిడికి దూరంగా కాస్త విరామం తీసుకున్నారు. తర్వాతి మ్యాచ్‌కు వారం రోజుల వ్యవధి ఉండటంతో సరదాగా గడిపేందుకు ఆటగాళ్లంతా శనివారం మాల్దీవులకు వెళ్లారు. చెన్నైలో సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో విజయం సాధించిన తర్వాత అక్కడినుంచే టీమ్ సభ్యులు మాల్దీవులకు చేరుకున్నారు. సన్‌రైజర్స్ తమ తర్వాతి పోరులో శుక్రవారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది. ఈ సీజన్లో ఆడిన 9 మ్యాచ్‌లలో 3 గెలిచి 6 ఓడిన టీమ్... మిగిలిన ఐదు మ్యాచ్‌లూ గెలిస్తేనే ‘ప్లే ఆఫ్స్’ చేరేందుకు అవకాశం ఉంటుంది. ఐపీఎల్లో నేడుముంబై X లక్నో వేదిక: ముంబైమధ్యాహ్నం 3: 30 గంటల నుంచి ఢిల్లీ X బెంగళూరువేదిక: ఢిల్లీ రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
ప్రజా పోప్‌కు అశ్రునయనాలతో తుది వీడ్కోలు
వాటికన్ సిటీ: నిరుపేదలు, అణగారిన వర్గాలకు ఆపన్నహస్తం అందించిన మానవతామూర్తి, విశ్వవ్యాప్తంగా కోట్లాది మంది క్యాథలిక్‌ల అత్యున్నత మతాధికారి పోప్ ఫ్రాన్సిస్‌కు ప్రపంచాధినేతలు, లక్షలాది మంది అభిమానులు నేరుగా వందల కోట్ల మంది క్రైస్తవులు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల్లో చూస్తూ తుది వీడ్కోలు పలికారు. అభిమానులు, ఆప్తులు శోకతప్త హృదయాలతో వీడ్కోలు పలికాక తాను సదా స్మరించే మేరీమాత చిత్రపటం ఉన్న సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి భూగర్బంలో 88 ఏళ్ల పోప్ శాశ్వత విశ్రాంతి తీసుకున్నారు. శనివారం వాటికన్ సిటీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ అంతిమయాత్ర కొనసాగింది. పోప్ కోరిక మేరకు వాటికన్ శివారులోని రోమ్ పరిధిలోని సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చిలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. అత్యంత నిరాడంబరంగా ఈ కడసారి క్రతువు కొనసాగింది. ఆయన కోరిక మేరకు పోప్ సమాధి మీద లాటిన్ పదమైన ‘ఫ్రాన్సిస్క్యూస్’అనే పదాన్ని చెక్కారు. శ్వాససంబంధ వ్యాధి ముదిరి చివరకు బ్రెయిన్‌స్టోక్, గుండె వైఫల్యంతో ఈ నెల 21వ తేదీన పోప్ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.బరువైన హృదయాలతో బారులు తీరిన జనం అంతకుముందు సెయింట్ పీటర్స్ బాసిలికా చర్చిలో పోప్ ముఖంపై వాటికన్ మాస్టర్ ఆఫ్ సెరిమనీస్ ఆర్చ్‌బిషప్ డియాగో గియోవన్నీ రవెల్లీ దవళవర్ణ పట్టు వ్రస్తాన్ని కప్పారు. తర్వాత జింక్ పూత పూసిన శవపేటిక మూతను పెట్టి సీల్‌వేశారు. తర్వాత పోప్ పార్థివదేహాన్ని భద్రంగా ఉంచిన శవపేటికను చర్చి సహాయకులు సెయింట్ పీటర్స్ స్వే్కర్ భారీ బహిరంగ ప్రదేశానికి తీసుకొచ్చారు. అక్కడే ప్రపంచ దేశాల అధినేతలు, పలు రాజ్యాల రాజులు, పాలకులు, అంతర్జాతీయ సంస్థల అధినేతలు, ప్రతినిధులు దాదాపు 2,50,000 మంది పోప్ అభిమానులు ఆయనకు చివరిసారిగా ఘన నివాళులర్పించారు. అక్కడ ఉన్నవారిలో చాలా మంది కన్నీరుమున్నీరుగా విలపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులు, భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్, బ్రిటన్ యువరాజు విలియం, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయేల్ మేక్రాన్ దంపతులు, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, అమెరికా మాజీ అధ్యక్షుడు బైడెన్ దంపతులు, ఇరాన్ సాంస్కృతిక శాఖ మంత్రి సయ్యద్ అబ్బాస్ సలేహ్ షరియతా, ఇటలీ మహిళా ప్రధాని జార్జియా మెలోనీ, స్లోవేకియా అధ్యక్షుడు పీటర్, ఐర్లాండ్ అధ్యక్షుడు హిగ్గిన్స్సహా 160 మంది వీవీఐపీలు ఈ కార్యక్రమంలో పాల్గొని పోప్‌కు అంజలి ఘటించారు. భారత్ తరఫున ముర్ముతోపాటు కేంద్రమంత్రి కిరెణ్ రిజిజు, సహాయ మంత్రి జార్జ్ కురియన్, గోవా డెప్యూటీ స్పీకర్ జాషువా డిసౌజాలు హాజరయ్యారు. పోటెత్తిన లక్షలాది మంది పోప్ అభిమానులు, క్రైస్తవులతో సెయింట్ పీటర్స్ స్క్వేర్ కిక్కిరిసిపోయింది. తోపులాట ఘటనలు జరక్కుండా అధికారులు నగరవ్యాప్తంగా భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటుచేసి మొత్తం అంత్యక్రియల కార్యక్రమాన్ని చివరిదాకా ప్రత్యక్ష ప్రసారాలుచేశారు. సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద అధినేతలు నివాళులర్పించాక శవపేటికను ప్రత్యేకవాహనంలోకి ఎక్కించాక అంతిమయాత్ర మొదలైంది. నగరంలో దారి పొడవునా వీధుల్లో లక్షలాది మంది జనం బారులు తీరి ప్రియతమ పోప్‌కు ‘‘పాపా ఫ్రాన్సిస్కో’’అని నినాదాలు చేస్తూ తుది వీడ్కోలు పలికారు. పోప్‌గా బాధ్యతలు చేపట్టాక ఈ 12 ఏళ్ల కాలంలో పోప్చేసిన మంచి పనులను గుర్తుచేసుకున్నారు. అంత్యక్రియలు మొత్తం 91 ఏళ్ల కార్డినల్ జియోవన్నీ బటిస్టా రే మార్గదర్శకత్వంలో నిర్వహించారు. వేలాది మంది ఇటలీ పోలీసుల పహారా మధ్య ఈ అంతిమయాత్ర ముందుకు సాగింది. గగనతల రక్షణ కోసం హెలికాప్టర్లను వినియోగించారు. స్వాగతం పలికిన ఖైదీలు, ట్రాన్స్జెండర్లు ఈ అంతిమయాత్రలో స్థానికులతోపాటు ప్రపంచదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది జనం రహదారికి ఇరువైపులా నిలబడి కడసారి తమ పోప్‌ను చూసుకోగా శవపేటికను తీసు కొచ్చిన వాహనశ్రేణి ఎట్టకేలకు సెయింట్ మేరీ మేజర్ బాసిలికా చర్చి ప్రాంగణానికి చేరుకుంది. అక్కడే వేచి ఉన్న ఖైదీలు, లింగమారి్పడి వ్యక్తులు, నిరాశ్రయులు, శరణార్థులు, వలసదారులు స్విస్ గార్డ్స్ బలగాల నుంచి పోప్ అంతిమయాత్ర బాధ్యతలను తీసుకున్నారు. పోప్ మొదట్నుంచీ అణగారిన వర్గాలతోపాటు సమాజంలో వివక్షను ఎదుర్కొంటున్న ఖైదీ లు, ట్రాన్స్జెండర్లు, నిరాశ్రయులు, శరణార్థుల అభ్యున్నతి కోసం పాటుపడటం తెల్సిందే. చర్చి అంతర్భాగంలోని భూగర్భంలో శవపేటికను ఉంచే కార్యక్రమంలో ప్రధానంగా ఖైదీ లు, వలసదారులే పాల్గొన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కార్డినళ్లు, పోప్ అత్యంత సన్నిహితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమ కవరేజీకి మీడియాను అనుమతించలేదు. వాటికన్ సిటీలో కాకుండా వేరే చోట పోప్‌ను ఖననం చేయడం గత వందేళ్ల చరిత్రలో ఇదే తొలిసారి. -
Indus Waters Treaty: సస్పెన్షన్ సాధ్యమే
పూర్తిస్థాయి యుద్ధాలు. కార్గిల్ వంటి దురాక్రమణలు. మరెన్నో లెక్కలేనన్ని దుశ్చర్యలు. గత 75 ఏళ్లలో భారత్‌పై పాకిస్తాన్ మతిలేని ఉన్మాద చర్యలు అన్నీ ఇన్నీ కావు. అయినా సామాన్య పాకిస్తానీలను దృష్టిలో పెట్టుకుని సింధూ జల ఒప్పందాన్ని భారత్ ఎప్పుడూ గౌరవిస్తూనే వచ్చింది. ఆర్థికంగానే గాక అన్నివిధాలా పతనావస్థకు చేరినా దాయాదికి ఇక బుద్ధి రాబోదని పహల్గాం దాడితో తేలిపోయింది. దాంతో ఓపిక నశించి పాక్‌కు శాశ్వతంగా బుద్ధి చెప్పే చర్యల్లో భాగంగా సింధూ ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. ఏకపక్షంగా అలా చేసే అధికారం భారత్‌కు లేదంటూ పాక్ గగ్గోలు పెడుతోంది. ఇది తమపై యుద్ధ ప్రకటనేనంటూ ఆక్రోశిస్తోంది. అయితే అంతర్జాతీయ చట్టాల మేరకు భారత్ చర్య సబబేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం మానుకోని పక్షంలో సింధూ ఒప్పందానికి నూకలు చెల్లుతాయంటూ పాక్‌ను భారత్ ఎన్నోసార్లు హెచ్చరించింది. సస్పెన్షన్‌కు సంబంధించి ఒప్పందంలో స్పష్టమైన నిబంధనలేవీ లేవు. పైగా అందులోని ఆర్టికల్ 12 ప్రకారం ఒప్పందానికి సవరణలు, ఇరుదేశాల ఆమోదంతో పూర్తిగా రద్దు మాత్రమే సాధ్యం. అలాంటప్పుడు సస్పెన్షన్ నిర్ణయాన్ని ఏ ప్రాతిపదికన తీసుకున్నారన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. 1969 వియన్నా కన్వెన్షన్, ఇతర అంతర్జాతీయ న్యాయ ఒప్పందాల ప్రకారం అలా చేసేందుకు వీలుందని సీనియర్ అడ్వకేట్ నీరజ్ కిషన్ కౌల్ స్పష్టం చేశారు. ‘పరిస్థితుల్లో మౌలిక మార్పులు’చోటుచేసుకున్న సందర్భాల్లో వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 62 ప్రకారం ఒప్పందాన్ని పూర్తిగా తిరస్కరించడం కూడా సాధ్యమేనని మాజీ సింధూ జల కమిషనర్ పి.కె.సక్సేనా వివరించారు. ఈ విషయంలో ఇంకా మరెన్నో చర్యలు తీసుకునే అవకాశం కూడా భారత్‌కు ఉందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆర్టికల్ 62 ఏమంటోంది...? ఒప్పందం కుదుర్చుకున్న నాటితో పోలిస్తే అనంతర కాలంలో పరిస్థితుల్లో తలెత్తే మౌలిక మార్పులకు సంబంధించిన నియమ నిబంధనలను వియన్నా కన్వెన్షన్‌లోని ఆర్టికల్ 62లో పేర్కొంటుంది. అవి ఒప్పంద సమయంలో ఊహించనివై, ఆ మార్పుల ప్రభావం వల్ల ఒప్పంద బాధ్యతలను నెరవేర్చలేని పరిస్థితులు తలెత్తితే ఒప్పందాన్ని సస్పెండ్ చేయవచ్చని అది చెబుతోంది. కనుక ఈ విషయంలో పాక్ చేసేదేమీ ఉండబోదని కౌల్ అన్నారు. ‘‘చివరికి అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టినా లాభముండదు. నిరంతర ఉగ్ర దాడులు, ఫలితంగా భౌతిక, ఆర్థిక భద్రతకు, దేశ సార్వభౌమత్వానికి తలెత్తుతున్న ముప్పు ఒప్పంద పరిస్థితుల్లో మౌలిక మార్పులకు దారి తీసిందని భారత్ వాదించవచ్చు. సింధూ ఒప్పందం కుదిరిందే ఇరు దేశాల నడుమ స్నేహం, సద్భావనల స్ఫూర్తికి కార్యరూపమిచ్చేందుకు! పాక్ చర్యల నేపథ్యంలో ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి’’అని వివరించారు. పర్యావరణ సవాళ్లు, ఉగ్ర దాడుల నేపథ్యంలో ఒప్పందాన్ని సమీక్షించి మార్చుకోవాల్సిన అవసరముందని కొన్నేళ్లుగా భారత్ చెబుతోందని గుర్తు చేశారు. ఇవన్నీ చేయొచ్చు... → ఒప్పందం సస్పెన్షన్ వల్ల సింధూ బేసిన్ నదుల నీటి ప్రవాహ నెలవారీ డేటాను భారత్ ఇకపై పాక్‌తో పంచుకోవాల్సిన అవసరం లేదు. → నీటి ప్రవాహాల ఉమ్మడి తనిఖీకి పాక్ అధికారులకు భారత్‌లోకి ప్రవేశం నిరాకరించవచ్చు. → నీటి ప్రవాహాలను నియంత్రించడం వంటి కఠిన చర్యలకు కూడా తీసుకోవచ్చు. → సింధూతో పాటు జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లె జ్ నదుల ప్రవాహాలను కాల్వల వంటివాటిలోకి మళ్లించవచ్చు. వాటిపై డ్యాముల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా మరింత నీటిని నిల్వ చేయవచ్చు. ఇలాంటి చర్యలతో పాక్‌లోకి వాటి ప్రవాహాన్ని నిరోధించవచ్చు. → సింధూ బేసిన్‌కు సంబంధించి భారత్, పాక్ నడుమ పలు అంతర్జాతీయ వేదికలపై న్యాయపోరాటం సాగుతోంది. జీలం ఉపనది కిషన్‌గంగపై నిర్మిస్తున్న జల విద్యుత్కేంద్రం వంటివి వీటిలో ఉన్నాయి. ఆ వివాదాలన్నింటి నుంచీ ఇప్పుడు భారత్ ఏకపక్షంగా వైదొలగవచ్చు కూడా. → వేసవి దృష్ట్యా సింధూ బేసిన్‌లోని నదీ ప్రవాహాలను భారత్ ఇప్పుడు ఏమాత్రం నియంత్రించినా తాగు, సాగునీరుతో పాటు జల విద్యుత్ తదితరాల కోసం పాక్ అల్లాడటం ఖాయమే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
...కన్నబిడ్డలా పోషించి ఎంతో పెద్ద చేశాం!
...కన్నబిడ్డలా పోషించి ఎంతో పెద్ద చేశాం! -
తహవ్వుర్ రానా (26/11 సూత్రధారి) రాయని డైరీ
‘‘రేపటితో నీ రిమాండ్ ముగుస్తుంది...’’ అన్నాడు నా లాయర్. ‘‘తర్వాత ఏం జరుగుతుంది?’’ అని నేను నా లాయర్ని అడగలేదు. నా తరఫున వాదించటానికి భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన లాయర్ అతడు. ‘ఢిల్లీ లీగల్ సర్వీసెస్ అథారిటీ’ నుంచి వచ్చాడు. గవర్నమెంట్ డబ్బులిచ్చి నడిపిస్తున్న లీగల్ అథారిటీ నుంచి, గవర్నమెంటే ఏర్పాటు చేస్తే నా కోసం వచ్చిన లాయర్‌ను నేను అడిగేది ఏముంటుంది? అతని పేరేమో పీయూష్ సచ్దేవ!‘ఏమైనా తిన్నావా?’ అంటాడు!‘ఏమైనా అన్నారా?’ అంటాడు! ‘ఆరోగ్యం ఎలా ఉంది?’ అంటాడు. ‘ఇక ఉండేదా మరి?!’ అంటాడు.ఈ నాలుగే... రోజు మార్చి రోజు అతడు నన్ను అడిగే ప్రశ్నలు. ఊరికే వస్తుంటాడు, పోతుంటాడు. ‘ధైర్యంగా ఉండు, న్యాయం గెలుస్తుంది..’ అంటాడు! నేనడిగానా ‘నాక్కాస్త ధైర్యమివ్వు’ అని, నేనడిగానా ‘న్యాయాన్ని గెలిపించు’ అని!!ఒకరోజు వచ్చాడు. ‘‘నువ్వు మందులేమీ వేసుకోవటం లేదనీ, కనుక నువ్వు చెప్పుకుం టున్నట్లుగా నీకు 33 అనారోగ్యాలేమీ లేవనీ, అందుచేత నీ ఇంటరాగేషన్ టైమ్‌ను తగ్గించే అవసరం లేదనీ వాళ్లు వాదించబోతున్నట్లు తెలిసింది...’’ అన్నాడు! ‘‘నువ్వూ, వాళ్లూ నా గురించి ఏదైనా వాదించుకోండి. అది నాకు సంబంధం లేని విషయం. నాకైతే ఒక ఖురాన్, ఒక పెన్ను, కొన్ని తెల్ల కాగితాలు తెప్పించు...’’ అన్నాను. తెప్పించాక, ‘‘ఇవన్నీ ఎందుకు?!’’ అని అడిగాడు.‘‘పవిత్ర ఖురాన్ గ్రంథం నా డాక్టర్. ఆ డాక్టర్ నాకు ప్రిస్క్రిప్షన్ రాయటానికి ఈ పెన్ను, ఈ తెల్ల కాగితాలు. ప్రవక్త సూక్తులే నేను వేసుకునే మందులు...’’ అని చెప్పాను.తర్వాతి విజిట్‌లో ... ‘‘నా కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించగలవా?!’’ అని అడిగాను.‘‘కష్టం కావచ్చు’’ అన్నాడు. ‘‘ఎందుకు కష్టం కావచ్చు?!’ అన్నాను. ‘‘మీ ‘కుటుంబ సభ్యులు’ ఒకరు పాకిస్తాన్ లో 78 ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఇంకొకరు లాహోర్, రావల్పిండి వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నప్పటికీ వారు జైల్లో ఉన్నారని పాకిస్తాన్ అంటోంది కనుక జైల్లోంచి మాట్లాడటం కుదరదు. మీ మిగతా కుటుంబ సభ్యులు పాకిస్తాన్‌లోని కోట్ లఖ్‌పట్ జైల్లో వెంటిలేటర్ మీద ఒకరు, అమెరికా జైల్లో ఒకరు, ముంబై ఆర్థర్ రోడ్ జైల్లో ఒకరు ఉన్నారు. కాబట్టి వారందరితో ఫోన్లో మాట్లాడించటం కష్టం’’ అన్నాడు నా లాయర్! నా చేతిలో కనుక ఒక గన్ ఉండి ఉంటే అక్కడికక్కడ... అది ఎన్.ఐ.ఎ జైలు అని, నేను పోలీస్ రిమాండ్‌లో ఉన్నానని కూడా చూడ కుండా రూఫ్ టాప్ మీదకు బులెట్‌ని పేల్చి అతడి భయాన్ని కళ్లజూసేవాడిని!‘‘నేను మాట్లాడతానంటున్నది నా కుటుంబ సభ్యులతో మిలార్డ్...’’ అన్నాను నా లాయర్‌తో, కోపంగా. ‘‘కానీ అవతలి వైపు వాళ్లు ఇలాగే వాదిస్తారు మిస్టర్ తహవ్వూర్. అయినా మన ప్రయత్నం మనం చేద్దాం...’’ అన్నాడు. రెండు రోజుల తర్వాత వచ్చి – ‘‘మీరు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి జడ్జి గారు ‘నాట్ అలౌడ్’ అనేశారు...’’ అని చెప్పాడు.అతడు అటు వెళ్లగానే, ఎన్.ఐ.ఎ. ఆఫీసర్ వచ్చి కూర్చున్నాడు. ‘‘నువ్వు 26ని వదిలి పెట్టటం లేదా? లేక 26 నిన్ను వదిలిపెట్టటం లేదా?’’ లేక... నువ్వూ, 26 కలిపి ఈ దేశాన్ని వదిలిపెట్టటం లేదా?’’ అన్నాడు!నాకర్థమైంది! నా రిమాండ్ రేపే ముగిసి, మళ్లీ రేపే మొదలు కాబోతోంది. ‘‘చెప్పు... మొన్న పహల్గామ్లో 26 మందిని చంపిన టెర్రర్ ఎటాక్ వెనుక నీతో పాటు ఎవరెవరు ఉన్నారు?’’ అని ఫ్రెష్‌గా ఇంటరాగేషన్ మొదలుపెట్టాడు ఎన్.ఐ.ఎ. ఆఫీసర్!! -
ఈ రాశి వారికి పట్టుదల పెరుగుతుంది.. అనుకున్నది సాధిస్తారు
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం తిథి: అమావాస్య రా.1.23 వరకు తదుపరి వైశాఖ శుద్ధ పాడ్యమినక్షత్రం: అశ్విని రా.1.08 వరకు, తదుపరి భరణివర్జ్యం: రా.9.25 నుండి 10.55 వరకుదుర్ముహూర్తం: సా.4.33 నుండి 5.23 వరకుఅమృత ఘడియలు: సా.6.23 నుండి 7.54 వరకుసూర్యోదయం : 5.40సూర్యాస్తమయం : 6.13రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకుయమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు మేషం.... పట్టుదల పెరుగుతుంది. అనుకున్నది సాధిస్తారు. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విచిత్ర సంఘటనలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.వృషభం... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.మిథునం... ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.కర్కాటకం... శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.సింహం.... సన్నిహితులతో మాటపట్టింపులు. ధనవ్యయం. స్వల్ప అనారోగ్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.కన్య... పనుల్లో ప్రతిబంధకాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్యసమస్యలు. శ్రమ తప్పదు. వ్యాపారాల విస్తరణ వాయిదా. ఉద్యోగ మార్పులు.తుల... వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రగతిదాయకంగా ఉంటాయి.వృశ్చికం... సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.«ధనుస్సు.. ప్రయాణాలలో ఆటంకాలు. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.మకరం.... చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. వ్యయప్రయాసలు. బంధువులతో మనస్పర్థలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉండవచ్చు.కుంభం... కొత్త పనులు ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి. దైవదర్శనాలు.మీనం... వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. -
పార్టీ స్థాపనకు ఏడాది ముందు...
టీఆర్ఎస్ ఆవిర్భవించే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ లక్ష్య శుద్ధితో విజయం సాధించాలని కేసీఆర్ పార్టీని స్థాపించారు. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్ రెండు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాలు. వీరికి ధన బలంతో పాటు ప్రసార మాధ్యమాల తోడు ఉంది. ఒక్క అంశం అనుకూలంగా లేని, చుట్టూ గాఢాంధకారం అలుముకున్న ప్రతికూల పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సాహసోపేతం. ఈ సాహసం ఒక్క కేసీఆర్‌కే చెల్లు.విస్తృత చర్చలు– సంతృప్తికర వివరణలుతెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపనకు ఒక సంవత్సరం ముందు నుండే సన్నాహాలు, చర్చలు ప్రారంభమయ్యాయి. పార్టీ పేరు, జెండా, కండువా 2000 లోనే నిర్ణయమైనాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన నాటి పరిస్థితుల సమీక్ష జరిగింది. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను, తనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మల్చుకొని కేవలం 9 మాసాల కాలంలోనే ఎన్టీయార్ అధికారం చేపట్టిన విషయం ప్రస్తావనకొచ్చింది.పార్టీ పెట్టాలనుకునే విషయం తెలిసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష దీపాన్ని ఆరిపోకుండా అప్పటివరకు కాపాడుతున్న సంఘాలు... తెలంగాణ జన సభ, తెలంగాణ మహా సభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్ యూనియన్, తెలంగాణ లాయర్స్ అసోసియేషన్, తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్, తెలంగాణ స్టడీ ఫోరం, సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం, తెలంగాణ జన పరిషత్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ జన సంఘటనలకు చెందిన కొందరు వచ్చి చర్చించడం, తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం జరిగింది. మరికొందరిని కేసీఆరే స్వయంగా ఆహ్వానించి చర్చించారు. తెలంగాణలోని ప్రముఖుల వివరాలను సేకరించి, సందర్భానుసారంగా వారితోనూ కేసీఆర్ చర్చలు జరిపారు. వారిలో దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, వైస్ ఛాన్స్లర్లు నవనీత రావు, ఆర్వీయార్ చంద్రశేఖర్ రావు, జయశంకర్, జస్టిస్ సీతారాం రెడ్డి, గౌరవ నిఖిలేశ్వర్, ‘ప్రెస్ అకాడమీ’ పొత్తూరి వెంకటేశ్వరరావు, జస్టిస్ భాస్కర్ రావు, ప్రొఫెసర్లు మధుసూదన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కోదండరాం రెడ్డి, సింహాద్రి, బియ్యాల జనార్ధన రావు, కంచె ఐలయ్య, కేశవరావు జాదవ్, జల సాధన సమితి దుశర్ల సత్యనారాయణ, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ ప్రభాకర్, ప్రజ్ఞా మ్యాగజైన్ కెప్టెన్ పాండురంగ రెడ్డి తదితరులున్నారు. వీరిలో చాలామందితో సంప్రదింపులు జరిపి, వారి సూచనలు స్వీకరించారు.తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, కవులు, కళాకారులతో చర్చలు సాగిస్తూనే, మరొవైపు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తన వద్దకు వచ్చేవారి సందేహాలన్నిటికీ సవివరమైన, సంతృప్తికరమైన వివరణ ఇచ్చి, అప్పటివరకు అపనమ్మకం ఉన్నవారిలో సంపూర్ణ విశ్వాసం పెంచేవారు. వివిధ పార్టీలలో పనిచేసే నాయకులు ఎవరికి వారుగా కేసీఆర్‌ను కలిసి, చర్చించి, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాత కలిసి పనిచేయడానికి సంసిద్ధత చెప్పేవారు. ఇటువంటి వారిలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు, దేశిని చిన్న మల్లయ్య, నాయిని నర్సింహారెడ్డి లాంటి పెద్దలు ఉన్నారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీకాంతరావు ‘తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనా? ఎలా సాధ్యమవుతుంది?’ అని సంశయం వ్యక్తం చేయగా, కేసీఆర్ ఇచ్చిన సుదీర్ఘ వివరణ అనంతరం, ‘తెలంగాణ సిద్ధించిందనే భావన మీ జవాబుతో నాకు కలిగింది. ఇక నుండి ఎప్పుడు ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేయను, వివరణ కోరను. తెలంగాణ సాకారం అయ్యేంత వరకు మీతోనే నా పయనం’ అని ఉద్విగ్నుడయ్యారు. స్టేట్ ఫైట్– స్ట్రీట్ ఫైట్ కాదు!వివిధ రాజకీయ పార్టీల నాయకుల, కార్యకర్తల తాకిడి రోజురోజుకు పెరుగుతూ రేయింబవళ్ళు చర్చోపచర్చలు సాగేవి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే చర్చలు మధ్యరాత్రి వరకు జరిగేవి. కొన్ని సందర్భాల్లో తెల్లవారు వరకు ఈ చర్చలు జరిగేవి. ఒకరిద్దరు ఉన్నా, పది మంది ఉన్నా, వందలాది మందిలో ఉన్నా కేసీఆర్ నాలుగైదు గంటలు నిరాఘాటంగా తెలంగాణ ఉద్యమం సాగించే క్రమాన్ని సోదాహరణలతో సహా వివరించేవారు. వారు లేవనెత్తిన సంశయాలకు సంతృప్తికర సమాధానం ఇచ్చి, వచ్చిన వారిలో అత్యధికులను ఉద్యమ కార్యోన్ముఖులను చేసేవారు. ఒకట్రెండు సందర్భాల్లో ఉద్యమం ఆవేశభరితంగా, ఆందోళన పథంలో సాగాలని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయగా... ఇది స్టేట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ కాదనీ; లక్ష్యం సాధించే వరకు సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావాలనీ; పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి భావవ్యాప్తిని సాగించి, ప్రజలను సమీకరించి, శక్తిగా మలిచి, ఎన్నికల్లో గెలిచి, గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గంలోనే రాష్ట్రం సాధించాలనీ; ఒక ప్రాంతానికి న్యాయం జరగాలని చేసే ఈ ప్రయత్నంలో ఇంకొక ప్రాంతం వారికి ఇబ్బందులు కలిగించడం వాంఛనీయం కాదనీ; తాను శాంతియుత పంథాలో మాత్రమే పయనిస్తాననీ కరాఖండిగా చెప్పేవారు. ఈ విధానం నచ్చని కొందరు మళ్ళీ వచ్చేవారు కాదు. సంకీర్ణాల్లో ఒక్క ఓటైనా విలువే!2000వ సంవత్సరంలో తెరాస పార్టీని స్థాపించవలెననే చర్చలు సాగుతున్న తరుణంలో దేశ రాజకీయ చిత్రపటం అనుకూలంగా ఉందా లేదా అనే సమీక్ష కూడా జరిగింది. కారణం గతంలోని చేదు అనుభవం. అయితే 1969 – 71 నాటి రాజకీయ పరిస్థితులకు పూర్తి భిన్నమైన పరిస్థితులు అప్పుడు నెలకొన్నాయి. ఒకప్పుడు ఇందిరా గాంధీ భారీ మెజారిటీతో ఏక పార్టీ పాలన సాగింది. తదనంతరం కొన్ని దశాబ్దాలు తక్కువ మెజారిటీతో ఏక పార్టీ పాలన, అటుపిమ్మట సంకీర్ణ ప్రభుత్వాల కాలం సాగుతోంది. సంకీర్ణ యుగం రాష్ట్రం సాధించుకోవడానికి అనువైనదిగా తేలింది. 1999వ సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షను కోల్పోయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభలో ఒక సభ్యుడి ఓటు కూడా అత్యంత కీలకంగా మారిన ఈ పరిణామం ప్రస్తావనకు వచ్చింది. అంటే సంకీర్ణాల యుగంలో మూడు, నాలుగు లోక్‌సభ స్థానాలతో కూడా జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించవచ్చని తేలింది. 1971 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజా సమితిని 14 స్థానాల్లో పదింట గెలిపించారు. టీఆర్ఎస్ చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉద్యమాన్ని నడిపి ప్రజా విశ్వాసాన్ని పొందగలిగితే, కచ్చితంగా లోక్‌సభకు చెప్పుకోదగిన సంఖ్యకు ప్రతినిధులను తెలంగాణ ప్రజలు తప్పక గెలిపిస్తారనే నమ్మకం కలిగింది. 10 మంది లోక్‌సభ సభ్యులున్నప్పటికీ 1971లో తెలంగాణ రాష్ట్రం సాధించబడక పోవడానికి బలమైన కారణం లోక్‌సభలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని సంఖ్యా బలం ఉండటమే. నాడు అధికార బలంతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజా సమితి సభ్యులను విలీనపర్చుకుంది. కానీ దానికి భిన్నంగా నేడు సంకీర్ణాలే శరణ్యం కాబట్టి పార్లమెంట్లో కనీస ప్రాతినిధ్యంతో ఒత్తిడి ద్వారా రాష్ట్రాన్ని సాధించవచ్చని నమ్మకం కుదిరింది. తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనని సంపూర్ణ విశ్వాసం కలిగిన కేసీఆర్... శాసన సభ్యత్వానికి, డిప్యుటీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ప్రజలను ఆలోచింపజేసి, ఆశలు రేకెత్తించి విశ్వాస బీజాలు నాటారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ సహకారంతో జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్ 27న పార్టీ జెండా ఎగురవేయబడింది. పదవీ త్యాగంతో పార్టీ స్థాపించారు, ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రం సాధించారు. వ్యాసకర్త బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేతసిరికొండ మధుసూదనాచారి (బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా) -
ఇండియా, దట్ ఈజ్ భారత్!
ఎట్టకేలకు పాకిస్తాన్ తన ముసుగును తొలగించింది. ఉగ్రవాద ముఠాలను పాలుపోసి పెంచి పెద్దచేసింది తామేనని అధికారికంగా అంగీకరించినట్లయింది. పాకిస్తాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ రెండు రోజుల క్రితం ‘స్కైన్యూస్’ ప్రతినిధితో మాట్లాడుతూ అమెరికా కోసం, పశ్చిమ రాజ్యాల కోసం తామీ ‘చెత్తపని’ని చేయవలసి వచ్చిందని అంగీకరించారు. అయితే పహల్గామ్ ఉగ్రదాడి వెనుక తమ హస్తం లేదని పాత పద్ధతిలోనే బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ బుకాయింపునకు పెద్దగా విలువుండదు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది తామేనని అంగీకరించిన తర్వాత వారి కార్యకలాపాలతో తమకు సంబంధం లేదని వాదిస్తే అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు.భారత్‌పైకి ఉగ్ర ముఠాలను ఉసిగొలిపే అవసరం కూడా పాకిస్తాన్‌కే ఉన్నది. ఇప్పుడదొక విఫల రాజ్యంగా ప్రపంచం ముందు నిలబడి ఉన్నది. ఎన్నడూ రాజకీయ సుస్థిరత లేదు. చెప్పుకోదగిన ఆర్థికాభివృద్ధీ లేదు. తరచుగా మిలిటరీ పాలకుల పెత్తనానికి తలొగ్గే దుఃస్థితి. ప్రజాస్వామ్యం ఒక మేడిపండు చందం. ‘ద్విజాతి’ సిద్ధాంతం అనే విద్వేషపు విత్తనంతో మొలకెత్తిన పాకిస్తాన్ వటవృక్షంగా మారి పిశాచ గణాలకు ఆశ్రయమిస్తున్నది. ముస్లిములు ఒక జాతి, హిందువులు మరొక జాతి అన్నదే ఈ ద్విజాతి సిద్ధాంతం.ఇదొక అసహజమైన భావన. ఒకే ప్రాంతం, ఒకే చరిత్ర, ఉమ్మడి అనుభవాలు, ఆచార వ్యవహారాలు మొదలైన వాటి ప్రాతిపదికపై ఒక జాతిని గుర్తిస్తారు. వీటికి పాలనాపరమైన, చట్టపరమైన అంశాలు కూడా తోడు కావచ్చు. కానీ మతాన్నే జాతిగా భావించే ఆలోచనాధోరణి నుంచి ఇంకా పాకిస్తాన్ బయటపడలేదు. పది రోజుల కిందటి పాకిస్తాన్ ఆర్మీ ఛీఫ్, డిఫ్యాక్టో పాలకుడైన అసీమ్ మునీర్ ఉపన్యాసాన్ని గమనిస్తే సమీప భవిషత్తులో ఆ దేశం ఈ ఆలోచన నుంచి బయటపడే అవకాశం లేదని అర్థమవుతుంది. ప్రవాసీ పాక్ వ్యాపారవేత్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘పాకిస్తాన్ పుట్టుక గురించి మీ పిల్లలకు చెప్పండి, ఆ తర్వాతి తరాలకు కూడా చెప్పండి. ముస్లింలు వేరనీ, హిందువులు వేరనీ చెప్పండి. మన ద్విజాతి సిద్ధాంతం గురించి చెప్పండ’ని సభికులకు ఆయన నూరిపోశారు.కశ్మీర్ సమస్యను ఎప్పటికీ విడిచిపెట్టబోమనీ, అది తమ జీవనాడని కూడా ఆయన రెచ్చగొట్టారు. ఇది జరిగిన వారం రోజులకే పహల్గామ్ దాడి జరగడం గమనార్హం. రెండు ప్రయోజనాల్ని ఆశించి పాకిస్తాన్ పాలకులు ఈ ద్విజాతి విద్వేష భావజాలాన్నీ, కశ్మీర్ అంశాన్నీ జ్వలింపజేస్తున్నారనుకోవాలి. స్వదేశీ పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి వారి భావోద్వేగాలను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొట్టడం మొదటిది. ఇక రెండవది – భారతదేశ ప్రజలను కూడా మత ప్రాతిపదికన విడదీసి, ఈ దేశాన్ని అస్థిరత పాలు చేయాలని భావించడం. భారత ప్రజలు కూడా మత ప్రాతిపదికపై విడిపోయి విద్వేషాలు వెదజల్లుకుంటే పాకిస్తాన్ పన్నిన ఉచ్చులో చిక్కుకున్నట్టే!పాకిస్తాన్ ప్రస్థానానికి భిన్నంగా భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించింది. లౌకిక, ప్రజాస్వామిక రాజ్యంగా అది తనను తాను ఆవిష్కరించుకున్నది. ‘భారతీయులమైన మేము’ అంటూ తన రాజ్యాంగ రచనను ప్రారంభించిందే తప్ప విభజన నామవాచకాలను వాడలేదు. దేశం పేరును ‘హిందూస్థాన్’ అని ప్రకటించాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేసినప్పటికీ రాజ్యాంగ సభలోని సభ్యులెవరూ దాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. ఇండియా లేదా భారత్ అనే పేర్లపైనే సభ్యులు రెండుగా విడిపోయారు. చివరకు ‘ఇండియా, దటీజ్ భారత్’ అనే అంబేడ్కర్ సూచించిన పదబంధాన్ని అందరూ ఆమోదించారు. హెచ్.వి. కామత్ ఒక్కరే తొలుత ‘హింద్’ అనే పేరును ప్రతిపాదించి, ఆయనే ఉపసంహరించుకున్నారు. ఆ రకంగా భారత రాజ్యాంగంలో ‘ఇండియా, దటీజ్ భారత్ షల్ బీ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్’ అనే వాక్యం ఒకటవ అధికరణంగా చేరింది. బహువిధమైన సువిశాల భారతదేశ భిన్నత్వంలో ఏకత్వానికి ఈ మొదటి అధికరణం అద్దంపట్టింది. హిందూయిజం కూడా దాని అంతస్సారంలో భిన్నత్వంలో ఏకత్వమేనని ప్రముఖ తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దాన్నాయన ఒక మతంగా కాకుండా హిందూ జీవన విధానంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఈ జీవన విధానంలో భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన స్రవంతులు కలిసి ప్రయాణిస్తాయి. సహజీవనం చేస్తాయి. భారతీయత కూడా అంతే! కశ్మీరియత్ కూడా అంతే! కశ్మీరీ హిందూ, ముస్లింల మధ్య ఒకప్పటి మత సౌభ్రాతృత్వం, పరస్పర గౌరవం, ఉమ్మడి పండుగలు, ఉత్సవాలు, సూఫీ – భక్తి ఉద్యమాల ప్రభావం, లౌకిక భావాలు కలగలిసిన జీవన విధానమే ‘కశ్మీరియత్’గా భావిస్తారు.కశ్మీరీ యువత స్వతంత్ర భావాలను పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం హైజాక్ చేసిన తర్వాత కూడా, కశ్మీరీ పండితులను ఈ ఉగ్రవాదం లోయ నుంచి తరిమేసిన తర్వాత కూడా, భారత్ సైన్యాలు కశ్మీర్ లోయను ఒక బందీఖానాగా మార్చి పౌరహక్కుల్ని ఉక్కు పాదాలతో తొక్కేసిన తర్వాత కూడా, ఆర్టికల్ 370 రద్దు ద్వారా ఆ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని ఊడబెరికిన తర్వాత కూడా, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసి, కనీస రాష్ట్ర హోదాను లాగేసుకున్న తర్వాత కూడా ‘కశ్మీరియత్’ సజీవంగా నిలిచే ఉందని మొన్నటి దాడి సందర్భంగా జరిగిన పరిణామాలు నిరూపించాయి.ఉగ్రవాద మూకలు అమాయక పర్యాటకుల మీద తుపాకులతో తూటాలు కురిపిస్తుంటే వాళ్లను కాపాడేందుకు చావుకు తెగించి ముష్కర మూకను ప్రతిఘటించి ప్రాణాలు బలిపెట్టిన సయ్యద్ హుస్సేన్ సజీవ కశ్మీరియత్‌కు ప్రతీక. ఆ దాడి నుంచి తప్పించుకున్నవారు తమకు అండగా నిలబడి కాపాడిన కశ్మీరీ ముస్లిం యువత మానవత గురించి కథలు కథలుగా చెబుతున్నారు. ఆ రాష్ట్రానికి పర్యాటకులుగా వెళ్లినవారు ఘటన తర్వాత బిక్కుబిక్కుమంటున్న వేళ వందలాది ముస్లిం గృహస్థులు వారికి తోడుగా నిలబడి ఆశ్రయం కల్పించారనీ, సాదరంగా సాగనంపారనీ కూడా వార్తలొస్తున్నాయి. అయితే, ఆ వార్తలకు ప్రధాన స్రవంతి మీడియాలో రావాల్సిన ప్రాధాన్యం రావడం లేదు. సౌభ్రాతృత్వంతో కూడిన ‘కశ్మీరియత్’కూ, ‘ద్విజాతి’ సిద్ధాంతపు విద్వేషానికీ ఎప్పటికీ సాపత్యం కుదరదు. కాకపోతే భారతీయత ఆ సౌభ్రాతృత్వాన్ని సమాదరించి గౌరవించాలి. భారత ప్రభుత్వం కశ్మీరీల కిచ్చిన హామీలను అమలు చేయాలి. వారి విశ్వాసాన్ని చూరగొనాలి. ఇది జరిగిన నాడు కశ్మీర్ కోసం వెయ్యేళ్ల యుద్ధానికైనా సిద్ధపడతామన్న నాటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో మాటలకు ఇంకో వెయ్యేళ్లు జోడించినా ఫలితముండదు.ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ గళం విప్పుతున్నాయి. భారత్‌కు బాసటగా ఉంటామని ప్రకటిస్తున్నాయి. తాము ఒంటరవుతున్నామని గమనించిన పాకిస్తాన్ ప్రధాని దాడి ఘటనపై విచారణకు సిద్ధమని ప్రకటించారు. ముష్కర మూకను రెచ్చగొట్టింది పాక్ ఆర్మీ చీఫ్. సిసలైన పాక్ పాలకుడు ఆయనే! ఉగ్రవాదులకు మూడు దశాబ్దాలుగా ఆశ్రయమిస్తున్నామని పాక్ రక్షణమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత పాక్ ప్రధాని అమాయకత్వం నటిస్తే ఎవరు నమ్ముతారు? ఈ అనుకూల వాతావరణంలోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌పై కఠిన చర్యలను తీసుకోవడానికి కేంద్రం ఉపక్రమించాలి. అయితే ముందుగా దాడికి దిగిన ముష్కరులకు పాక్‌తో ఉన్న సంబంధాలను ధ్రువీకరించవలసిన అవసరం ఉన్నది.దాడి ఘటనలో ప్రభుత్వపరంగా భద్రతా ఏర్పాట్లలో లోపాలు, నిఘా వైఫల్యాలు స్పష్టంగా వెల్లడయ్యాయి. అవి దాచేస్తే దాగని నిజాలు. కనీసం ఇప్పుడా హంతకులను పట్టుకొని వారితో పాక్ సంబంధాలను రుజువు చేసైనా చేసిన తప్పును దిద్దుకోవలసిన అవసరమున్నది. ఘటన తర్వాత ప్రధాని మోదీ తీవ్రంగానే స్పందించారు. ఇది దేశంపై జరిగిన దాడిగా ప్రకటించారు. వెంటనే కొన్ని చర్యలను ప్రకటించారు. అందులో ముఖ్యమైనది సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడం. నిజానికి ఈ పని ఎప్పుడో చేయాల్సింది. బహుశా అంతర్జాతీయ ఒత్తిడి పర్యవసానంగా నెహ్రూ ఈ ఒప్పందానికి తలూపి ఉంటారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు ఇప్పుడున్నంత పలుకుబడి అప్పుడు లేదు. నెహ్రూకు వ్యక్తిగత పలుకుబడి మాత్రం ఉండేది. ఉగ్రవాదాన్ని అప్పుడింకా ఈ స్థాయిలో ఊహించలేదు. కనుక పాకిస్తాన్‌కూ పశ్చిమ రాజ్యాల మద్దతు ఉండేది.సింధు నదీ జలాల ప్రవాహంలో సగానికి పైగా భారత్‌లో ఉన్న పరివాహక ప్రాంతమే మోసుకెళ్తున్నది. సింధు నది టిబెట్‌లోని కైలాస పర్వతం పాదాల దగ్గర పుట్టి, భారత్‌లోని లద్దాఖ్, పాక్ ఆక్రమిత గిల్గిట్‌లలో 1100 కిలోమీటర్లు ప్రవహించి పాకిస్తాన్లో ప్రవేశిస్తుంది. నదికి కుడివైపు నుంచి పాక్ భూభాగం, పాక్ ఆక్రమిత భూభాగాల ద్వారా అరడజనుకు పైగా ఉపనదులు కలుస్తాయి. అందులో కాబూల్ నది, గిల్గిట్ నది, హూంజా నది, స్వాట్ నది ముఖ్యమైనవి. కానీ భారత్ నుంచి సింధులో ఎడమ వైపుగా కలిసే పంచ నదులే ఆ నదికి ప్రాణం. ఈ ఐదు నదుల్లో జీలం, చీనాబ్ నదులతోపాటు సింధు నది జలాలపై పూర్తి హక్కుల్ని ఈ ఒప్పందం పాక్‌కు కట్టబెట్టింది. సట్లెజ్, రావి, బియాస్ నదీ జలాలపై మాత్రమే భారత్‌కు వినియోగించుకునే హక్కులు దక్కాయి.సింధు నది బేసిన్లో ఈ పంచ నదులకున్న కీలక పాత్రకు రుగ్వేదకాలం నుంచే అంటే మూడున్నర వేల యేళ్ల క్రితం నుంచే గుర్తింపు ఉన్నది. రుగ్వేద ఆర్యులు ఈ బేసిన్‌ను ‘సప్తసింధు’గా పిలిచారు. రుగ్వేద కాలానికి ఇంచుమించు సమాన కాలంలో పర్షియన్ నాగరికతలో ప్రభవించిన ‘అవెస్థా’ గ్రంథం కూడా ఈ లోయను ‘హప్తహెందూ’గా ప్రస్తావించింది. అంటే ఆ ఏడు నదులకు సింధుతో సమాన ప్రాధాన్యతనిచ్చారు. వాటిని 1. సింధు నది, 2. వితస్థా (జీలం), 3. అసిక్ని లేదా చంద్రభాగా (చీనాబ్), 4. పురుష్ణి (రావి), 5. విపాస (బియాస్), 6 శతుద్రి (సట్లెజ్), 7. సరస్వతీ నదులుగా రుగ్వేదం ప్రస్తావించిందని చెబుతారు. ఈ ఏడో నది వేలయేళ్ల క్రితమే ప్రస్తుత రాజస్థాన్ ప్రాంతంలో అంతరించి ఉంటుందని భావిస్తున్నారు.ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటే సింధు బేసిన్లో భారత భూభాగానికి ఉన్న ప్రాధాన్యత అర్థమవుతుంది. న్యాయబద్ధంగా ఈ బేసిన్లో సగటున లభ్యమయ్యే ఎనిమిది వేల టీఎమ్‌సీల్లో (బ్రిటానికా లెక్క) సగం మనకు దక్కాలి. కానీ ఒప్పందం కారణంగా ఇరవై శాతం జలాలపైనే హక్కులున్నాయి. ఆయా ప్రాంతాల నైసర్గిక స్వరూపాలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘బేసిన్లూ లేవు, భేషజాలూ లేవు’ అని గతంలో కేసీఆర్ వ్యాఖ్యానించడం నిజమే. కానీ అది ఒకే దేశంగా ఉన్నప్పటి మాట. రెండు దేశాలుగా విడిపోయిన తర్వాత, ఒక దేశం మీద మరొక దేశం ఉగ్రదాడులు చేస్తున్న నేపథ్యంలో బేసిన్లూ ఉంటాయి. భేషజాలూ ఉంటాయి.కీలకమైన పంచ నదుల ప్రవాహాన్ని భారత్ అడ్డుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ శక్తీ అడ్డుకోకపోవచ్చు. కానీ ఈ చర్య వలన పాక్ పౌరుల ఆహార భద్రతకు కలిగే ముప్పును, పర్యావరణ మార్పుల సంభావ్యతను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాక్ పాలకుల స్పందనను బట్టి ఈ జలాయుధ ప్రయోగ తీవ్రత ఉండవచ్చు. భారతీయులుగా ఈ దేశ ప్రయోజనాల పరిరక్షణ కోసం, దేశ భద్రత కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతునీయడం ప్రజల బాధ్యత. అదే సందర్భంలో ప్రజలను విడగొట్టకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని నిలబెట్టుకోవడం ద్వారా మాత్రమే భారతీయత నిలబడుతుంది. ద్విజాతి సిద్ధాంతం ప్రభావం మన దేశంలో కూడా కొంతమందిపై ఇప్పుడు కనిపిస్తున్నది. ఈ ధోరణి ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ బాటలోనే భారత భవిష్యత్తును దర్శించవలసి వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వమనే భారతీయ జీవన విధానమే కాలపరీక్షకు తట్టుకొని అభివృద్ధికి ఆలంబనగా నిలిచింది. ఇకముందు కూడా అదే మనకు శ్రీరామరక్ష.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
#Glenn Maxwell: మరి ఇంత చెత్త బ్యాటింగా? జట్టు నుంచి తీసేయండి
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఈడెన్‌గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో మాక్స్వెల్ తీవ్ర నిరాశపరిచాడు. గత మ్యాచ్‌కు దూరంగా ఉన్న మాక్సీకి పంజాబ్ మెనెజ్‌మెంట్ తిరిగి తుది జట్టులో చోటు ఇచ్చింది.మార్కస్ స్టోయినిష్ స్ధానంలో జట్టులోకి వచ్చిన మాక్స్వెల్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్స్వెల్.. కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడ్డాడు. మరోసారి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో మాక్సీ పెవిలియన్‌కు చేరాడు. వరుణ్ అద్బుతమైన బంతితో ఈ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో 8 బంతులు ఎదుర్కొన్న మాక్స్వెల్..87.50 స్ట్రైక్ రేటుతో కేవలం 7 పరుగులు మాత్రమే చేశాడు. ఓవరాల్‌గా ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన మాక్స్వెల్.. 8.00 సగటుతో కేవలం 48 పరుగులు చేశాడు. దీంతో మాక్స్‌వెల్‌ను నెటిజన్లు దారుణంగా ట్రోలు చేస్తున్నారు.ఐపీఎల్ చరిత్రలోనే చెత్త ప్లేయర్ అంటూ ఎక్స్‌లో ఫ్యాన్స్ పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్సిమ్రాన్ సింగ్(83) టాప్ స్కోరర్‌గా నిలవగా.. ప్రియాన్ష్ ఆర్య(69), శ్రేయస్ అయ్యర్(25) రాణించారు.చదవండి: IPL 2025: ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్ -
విషాదం.. నలుగుర్ని మింగేసిన మొలకలచెరువు
అన్నమయ్య జిల్లా : జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. ములకల చెరువు పెద్ద చెరువు నలుగుర్ని మింగేసింది. మొలకలచెరువు పెద్దచెరువు వద్ద తల్లిదండ్రులతో కలిసి బట్టలు ఉతకడానికి లావణ్య (12) నందకిషోర్ (10)లు అక్కడికి వచ్చారు. చెరువులో దిగుతుండగా మునిగిపోతున్న సమయంలో చిన్నారులు కేకలు వేశారు. అక్కడే ఉన్న లావణ్య తండ్రి మల్లేష్ చిన్నారులను రక్షించే క్రమంలో మునిగిపోయాడు. చిన్నారులు లావణ్య, నంద కిషోర్ లతో కలిసి పక్కంటి చిన్నారి నందిత(11) కూడా చెరువులో దిగి మునిగిపోయింది. మృతి చెందిన వారిని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను మొలకలచెరువు పోలీసులు వెలికి తీశారు.మృతి దేహాలను చూసి మృతులు కుటుంబాలు కన్నీటి పర్యంతం అవుతున్నాయి. దీంతో గ్రామంలో పూర్తిగా విషాద చాయలు అలుముకున్నాయి. -
‘మత్స్యకారులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: ఇవాళ చంద్రబాబు.. మత్సకారుల సంక్షేమం కోసం ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారని.. ఈ 44 ఏళ్ల కాలంలో వారి సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పాలంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నిలదీశారు. టీడీపీ 44 ఏళ్ల చరిత్రలో ఈ రాష్ట్రంలో ఎన్ని హార్బర్లు కట్టారు?, ఎన్ని పోర్టులు కట్టారు? అంటూ ఆయన ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో మత్సకారుల కష్టాలను చూసి వారి సంక్షేమానికి ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం చేపట్టారన్నారు.‘‘గత ప్రభుత్వంలో చేపట్టిన హార్బర్ల పనులు అన్ని అర్ధాంతరంగా ఆపేశారు. మీరు ఈ రోజు అదే ఫిషింగ్ హార్బర్ ప్రాంతంలో చంద్రబాబు మీటింగ్ పెట్టారు. రివైజ్ డీపీఆర్ పేరుతో అన్ని ఫిషింగ్ హార్బర్ నిర్మాణాలు ఆపేశారు. చంద్రబాబుకు ఎప్పుడూ మత్స్యకారులు అంటే చిన్న చూపే. వైఎస్ జగన్ హయాంలో ప్రతీ జిల్లాకు ఒక హార్బర్ ఉండాలని మొదలు పెట్టి నాలుగు హార్బర్ల నిర్మాణం పూర్తి చేశారు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఎన్ని పోర్టులు కట్టారు?. ఒక్క పోర్టు కూడా కట్టలేదు. వైఎస్ జగన్ హయాంలో నాలుగు పోర్టులు ప్రారంభమయ్యాయి.మత్స్యకార భరోసా 20 వేలు ఇచ్చామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. మరి గత సంవత్సరం మత్స్యకార భరోసా బకాయిల పరిస్థితి ఏంటి?. గత టీడీపీ హయాంలో 4 వేల మత్స్యకార భరోసా ఇస్తే.. వైఎస్ జగన్ పాలనలో రూ.10 వేలు రూపాయలు అందించాం. 2023-24 మధ్యలో మత్స్యకార భరోసా బకాయిలు కూడా చంద్రబాబు ఇవ్వాల్సిందే. ఐదేళ్ల కాలంలో ఇవ్వాల్సిన మత్స్యకార భరోసా 3 ఏళ్లు ఇవ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది...తక్షణమే ఆపేసిన బుడగట్లపాలెం హార్బర్ పనులు ప్రారంభించండి. నువ్వులరేవు హార్బర్ పనులకు అనుమతులు తీసుకురండి. చంద్రబాబుకు పరిపాలన చేతగాక లక్షా యాభై వేల కోట్లు రూపాయలు అప్పు చేశారు. అచ్చెన్నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జిల్లాకు ఒక్క ప్రాజెక్ట్ కూడా తీసుకు రాలేదు. ఉర్సా ట్రస్టు భూములు ఎలా అప్పనంగా ప్రవేట్ కంపెనీలు కట్టబెడతారు?. 6 నెలల క్రితం అమెరికాలో పెట్టిన కంపెనిపై ఎందుకంత ఆసక్తి’’ అంటూ అప్పలరాజు ప్రశ్నించారు. -
ఒకేచోట 15 లక్షల కార్లు: ఇండియాలో సౌత్ కొరియా బ్రాండ్ హవా
సౌత్ కొరియన్ కార్ బ్రాండ్ అయిన 'కియా మోటార్స్'.. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోని తన తయారీ కేంద్రం నుంచి 15 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసి అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.కియా ఇండియా 2019 ఆగస్టు నుంచి దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందుతూ.. ఎప్పటికప్పుడు కొత్త కార్లను లాంచ్ చేస్తూ ఉంది. అతి తక్కువ కాలంలో ఈ ఉత్పత్తి మైలురాయిని చేరుకున్న కార్ల తయారీదారుగా కియా సరికొత్త చరిత్ర సృష్టించింది. అనంతపురం ప్లాంట్ కియా కార్యకలాపాలకు మూలస్తంభంగా ఉంది.కియా ఇండియా అనంతపురం ప్లాంట్‌లో సెల్టోస్, సోనెట్, కారెన్స్, కార్నివాల్, సైరోస్ వంటి కార్లను ఉత్పత్తి చేస్తోంది. కంపెనీ ఈ కార్లను భారతదేశంలో విక్రయించడం మాత్రమే కాకుండా.. ఇక్కడ నుంచి విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తుంది.ఇదీ చదవండి: 2025 హంటర్ 350 బైక్ ఇదే.. ధర ఎంతంటే?ఉత్పత్తి గణాంకాల విషయానికొస్తే.. సెల్టోస్ 7,00,668 యూనిట్ల ఉత్పత్తితో (46.7%) ముందంజలో ఉంది. తరువాత సోనెట్ 5,19,064 యూనిట్లతో (34.6%) రెండవ స్థానంలో ఉంది. కారెన్స్ 2,41,582 యూనిట్లు (16.1%), సైరోస్ & కార్నివాల్ వంటి ఇటీవలి మోడళ్లు వరుసగా 23,036 యూనిట్లు (1.5%) మరియు 16,172 యూనిట్లు (1.1%)గా ఉన్నాయి. -
ఆర్సీబీతో మ్యాచ్.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు గుడ్ న్యూస్
ఐపీఎల్-2025లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్దానానికి దూసుకు వెళ్లాలని ఢిల్లీ భావిస్తోంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. ఫాఫ్ గాయం కారణంగా వరుసగా నాలుగు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఇప్పుడు ఫుల్ ఫిట్నెస్ సాధించడంతో ఆర్సీబీతో మ్యాచ్‌లో డుప్లెసిస్ ఆడనున్నాడు.ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యువ ఓపెనర్ జాక్ ఫ్రెజర్ మెక్‌గర్క్ ధ్రువీకరించాడు. ఆర్సీబీతో మ్యాచ్‌కు ఫాఫ్ డుప్లెసిస్ అందుబాటులో ఉండనున్నాడు. నెట్స్‌లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడని మెక్‌గర్క్ ప్రీ-మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం నెట్స్‌లో డుప్లెసిస్ తీవ్రంగా శ్రమించాడు. దీంతో అతడు తిరిగి రావడం దాదాపు ఖాయమైంది. డుప్లెసిస్ తిరిగి వస్తే కరుణ్ నాయర్‌పై వేటు పడే అవకాశముంది.ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయింగ్ ఎలెవన్(అంచనా): అభిషేక్ పోరెల్, ఫాఫ్ డు ప్లెసిస్, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీర, ముఖేష్ కుమార్ -
ఇదెక్కడి అభిమానం రా బాబు.. ఏకంగా పెళ్లి కార్డుపై మహేశ్
తెలుగు ప్రేక్షకుల అభిమానం గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. చిన్నా పెద్దా అని సంబంధం ఉండదు. మన భాష పరభాష అనేది పట్టించుకోరు. సినిమా నచ్చితే చాలు.. ఆ మూవీని, సదరు హీరోల్ని గుండెల్లో పెట్టేసుకుంటారు. ఇకపోతే తెలుగులోనూ కొందరు స్టార్ హీరోలకు కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్లలో కొందరు అప్పుడప్పుడు చిత్రవిచిత్రమైన పనులు చేస్తుంటారు. కర్నూలుకు చెందిన సాయి చరణ్ అనే కుర్రాడు.. సూపర్ స్టార్ మహేశ్ బాబుకు వీరాభిమానిలా ఉన్నాడు. ఎందుకంటే వచ్చే నెలలో తన పెళ్లి ఉంది. దీనికోసం ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్స్ పంచుతున్నాడు. అందరిలా కాకుండా తన పెళ్లి పత్రికపై దేవుళ్ల ఫొటోలతో పాటు తను ఎంతో అభిమానించే మహేశ్ బాబు పిక్ కూడా ప్రింట్ చేశాడు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!) దీన్ని కొందరు ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇదెక్కడి అభిమానం రా బాబు అని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇదే కాదు గతంలోనూ ఓసారి ఇలానే ఓ అభిమాని.. తన పెళ్లి కార్డుపై మహేశ్ బాబు ఫొటోని ముద్రించాడు. అప్పట్లోనూ దాని గురించి మాట్లాడుకున్నారు.మహేశ్ బాబు సినిమాల విషయాలనికొస్తే.. ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నాడు. 2027లో ఇది రిలీజ్ అవ్వొచ్చని అంటున్నారు. కానీ రాజమౌళితో మూవీ అంటే ఎప్పుడొస్తుందో చెప్పలేం. ప్రస్తుతానికైతే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మే నెలలో ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఉండొచ్చని తెలుస్తోంది.(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) -
రష్యాకు ఆంక్షలతో చుక్కలు చూపిస్తే గానీ..!
వాషింగ్టన్: ఉక్రెయిన్ తో యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆపేలా కనబడే చాయలు ఎక్కడా కనిపించడం లేదు. అప్పుడే శాంతి ఒప్పందం అంటూనే మరొకవైపు ఉక్రెయిన్ పై యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు పుతిన్. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ ల శాంతి ఒప్పందానికి అమెరికా చేస్తున్న ప్రయత్నాలు ఇప్పటివరకూ ఏమీ ఫలించలేదు. తాజాగా ఉక్రెయిన్ తో చర్చలకు సిద్ధమంటూ యూఎస్ కు సందేశం పంపిన పుతిన్ పై ట్రంప్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు.యుద్ధాన్ని ఆపుతామనే చెబుతున్నాడు కానీ ఎక్కడా అది కనిపించడం లేదని పుతిన్ శైలిపై కాస్త అసహనం వ్యక్తం చేశారు ట్రంప్. ట్రంప్ తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ట్రూత్’లో కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. ప్రధానంగా ఇటీవల ఉక్రెయిన్ జనావాసాల్లో రష్యా జరిపిన దాడిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు జనావాసాలు ఉన్న ప్రాంతాల్లో పుతిన్ ఎందుకు దాడి చేశాడో సరైన కారణం లేదన్నాడు. ఇదే గత కొన్ని రోజుల నుంచి కొనసాగుతుందని, దీనివల్ల అనేక మంది అమాయక ప్రజలు చనిపోతున్నారన్నాడు.ఇక పుతిన్ విషయంలో కాస్త భిన్నంగా వ్యవహరించాల్సిందేనని ట్రంప్ తెలిపారు. పుతిన్ వ్యవహారాన్ని భిన్నంగా డీల్ చేయాలి. మాస్కో లక్ష్యంగా అదనపు ఆంక్షలు విధించి కట్టడి చేసే మార్గాన్ని చూస్తున్నాం. అని రాసుకొచ్చారు ట్రంప్.ప్రస్తుతం ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు శుక్రవారం రష్యా నుంచి అమెరికా ఓ సందేశం వెళ్లింది. ఇందులో ఎటువంటి ఆంక్షలు లేకుండా ఉక్రెయిన్ తో చర్చలకు కూర్చుంటామని అమెరికాకు తెలిపినట్లు రష్యా శనివారం స్పష్టం చేసింది. -
లీవ్ ఇండియా పేరుతో నోటీసులు: తెలంగాణ డీజీపీ
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పాకిస్తానీలను పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. ‘సాక్షి’ తో మాట్లాడిన డీజీపీ జితేందర్.. తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు ఉన్నారు. వీరిలో 199 మంది లాంగ్ టర్న్ వీసాలు కలిగి ఉన్నారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారి జోలికి వెళ్లట్లేదు. మిగిలిన 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయి. ఈ షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్న వారిని గుర్తిస్తున్నాము.లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చాము. హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి ఈ నెల 29 వరకు టైం ఉంది. మిగిలిన వారు రేపు తిరిగి వెళ్ళిపోవాలి. ఈ నెల 30 వరకు అటల్ బోర్డర్ నుండి వెళ్ళిపోవచ్చు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్ళిపోని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి కో ఆర్డినేషన్ లో జాయింట్ ఆపరేషన్ చేస్తాము. కర్రెగుట్టలో తెలంగాణా పోలీస్ శాఖ నుండి ఎలాంటి ఆపరేషన్ లేదు. మా బలగాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్న కర్రెగుట్టల వద్ద ఎలాంటి బలగాలు మోహరించలేదు. ములుగులో కూంబింగ్ కి తెలంగాణ పోలీసులకు సంబంధం లేదు’ అని డీజీపీ జితేందర్ తెలిపారు. -
చెల్లికి ఆస్తిలో వాటా.. తల్లిదండ్రులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి..
సాక్షి, విజయనగరం జిల్లా: పూసపాటిరేగ మండలం చల్లవానితోట పంచాయతీ నడుపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి కోసం తల్లిదండ్రులనే కన్న కొడుకు హత్య చేశాడు. తల్లిదండ్రులను కన్నకొడుకు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు. అక్కడిక్కడే తండ్రి అప్పలనాయుడు (60), తల్లి జయమ్మ (58) మృతి చెందాడు. కుమారుడు పాండ్రంగి రాజాశేఖర్ (25) పరారీలో ఉన్నాడు.ఆస్తి తగాదా నేపథ్యంలోనే దాడి చేసినట్టు బంధువులు అంటున్నారు. తల్లిదండ్రులు ఆస్తిలో చెల్లికి వాటా ఇవ్వడంతో రాజశేఖర్ అనే వ్యక్తి వారిపై కక్ష పెంచుకున్నాడు. కొంతకాలంగా ఈ వివాదం నడుస్తోంది. కుమార్తెకు ఇచ్చిన భూమిని చదును చేస్తుండగా తనను అడ్డుకోవడంతో తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగిన రాజశేఖర్.. అనంతరం వారిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపాడు. పూసపాటిరేగ మండలంలో జరిగిన అమానవీయ ఘటనతో మృతుల బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
'లాహోర్‌ను లాక్కుంటే.. అర గంటలో తిరిగిచ్చేస్తారు'
పెహల్గావ్లో మూష్కరమూకల మారణహోమం తర్వాత దాయాది దేశం పాకిస్తాన్‌పై ముప్పేట దాడి జరుగుతోంది. ఉగ్రవాదులతో రాక్షస కాండకు అండగా నిలిచిందన్న అనుమానంతో పొరుగుదేశంతో అన్ని సంబంధాలను భారత్ తెంచుకుంది. సింధూ నది ఒప్పందం నిలిపివేత, పాకిస్థానీయులకు వీసాల రద్దుతో పలు కఠిన చర్యలు చేపట్టింది. అమాయక పర్యాటకులను అకారణంగా పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులను ఊహించని రీతిలో శిక్షిస్తామని భారత్ గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో సొంత దేశంపైనే పాకిస్తానీయులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారని ఎన్డీటీవీ తెలిపింది.పెహల్గావ్ (pahalgam) దాడితో భారత దేశంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్‌కు తన పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. ఇండియాకు దీటుగా బదులిచ్చేందుకు తంటాలు పడుతున్న పొరుగు దేశానికి సొంత పౌరుల నుంచే ట్రోలింగ్ ఎదురవడం తలనొప్పిగా మారుతోంది. షహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో స్వయంగా పాకిస్తానీయులే సెటైర్లు పేలుస్తున్నారు. ఇంటా బయటా సవాళ్లు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ నాయకత్వంపై తమ వ్యతిరేకతను మీమ్స్, వ్యంగ్య చిత్రాల ద్వారా బయటపెడుతున్నారు. తమ ప్రభుత్వం ఎలా విఫలమైందో సోషల్ మీడియా (Social Media) వేదికగా వెల్లడిస్తున్నారు.రాత్రి 9 తర్వాత వార్ వద్దుభారత్ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాకిస్తానీయులు తమ ప్రభుత్వంపైనే వ్యంగ్యాస్త్రాలు ఎక్కుపెట్టారు. తమ కనీస అవసరాలు తీర్చడంలో పాలకులు ఎలా విఫలమయ్యారో ఎత్తిచూపారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న తమ దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇండియాతో యుద్ధం వస్తే తట్టుకోగలదా అని తమను తామే ప్రశ్నించుకున్నారు. ఒకవేళ తమతో యుద్ధం చేయాల్సివస్తే రాత్రి 9 గంటలకు ముగించాలని ఓ పాకిస్తానీయుడు వేడుకున్నాడు. ఎందుకంటే రాత్రి తొమ్మిది తర్వాత గ్యాస్ సరఫరా నిలిచిపోతుందని చావు కబురు చల్లగా చెప్పాడు. "వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారని వారికి తెలియాలి" అంటూ మరో యూజర్ తమ దేశార్థిక దారుణావస్థను బయటపెట్టారు.ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో?పాకిస్తాన్‌పై భారతదేశం బాంబు దాడి చేయబోతోందా అని ఒకరు ప్రశ్నించగా, "భారతీయులు తెలివి తక్కువవారు కాదు" అని మరొకరు సమాధానం ఇచ్చారు. మన బాధల కంటే బాంబు దాడే బెటర్ బ్రో అంటూ ఇంకొకరు స్పందించగా.. ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో అంటూ మరో యూజర్ నిట్టూర్చారు. తమ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ పాకిస్తానీ యూజర్ షేర్ చేసిన మీమ్ ఫన్నీగా ఉంది. పేపర్‌బోర్డ్‌తో తయారు చేసిన ఫైటర్ జెట్ లాంటి నిర్మాణంతో మోటార్‌సైకిల్‌ను నడుపుతున్న వ్యక్తిని చూపించే మీమ్‌ను (Meme) అతను షేర్ చేశాడు.చదవండి: దేనికైనా రెడీ.. పాకిస్తాన్ ప్రధాని సంచలన వ్యాఖ్యలుమా ప్రభుత్వమే చంపుతోంది..సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాకిస్తాన్‌కు నదీ జలాల ప్రవాహాన్ని నిలిపివేస్తామని ఇండియా ఇచ్చిన వార్నింగ్‌పై పాక్ యూజర్లు స్పందిస్తూ.. ఇప్పటికే తమ దేశంలో తీవ్ర నీటి కొరత ఉందని చెప్పుకొచ్చారు. "నీటిని ఆపాలనుకుంటున్నారా? మీకు ఆ అవసరం లేదు. ఇప్పటికే నీళ్లులేక అల్లాడుతున్నాం. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్‌ను తీసుకుంటారా? మీరు అరగంటలోపు దాన్ని మాకే తిరిగి ఇస్తారు'' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. -
నువ్వాదరిని... నేనీదరిని... ఉగ్రవాది విడగొట్టె ఇద్దరినీ..!
భారత్-పాక్ సరిహద్దులో గందరగోళం రాజ్యమేలుతోంది. కశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడితో అమల్లోకొచ్చిన భారత ప్రభుత్వ ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామంతో ఇరు దేశాలకు చెందిన కొందరు దంపతులు చిక్కుల్లో పడ్డారు. కొందరు భారతీయ భర్తలు, పాకిస్థానీ భార్యలు, అలాగే మరికొందరు పాక్ భర్తలు, భారతీయ భార్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత ప్రభుత్వ ఆదేశానుసారం పాక్ జాతీయులందరూ ఇండియాను వదిలి ఈ నెల 27లోగా తమ స్వదేశం వెళ్లిపోవాల్సివుంది. దీంతో పాక్ నుంచి కోడళ్లుగా వచ్చి మెట్టినిల్లు ఇండియాలో ‘అక్రమంగా’ స్థిరపడిన కొందరిలో భయం మొదలైంది. భారత్-పాక్ సరిహద్దుల్లో మరికొందరు రకరకాల కారణాలతో ఆందోళనలు చేపడుతున్నారు. భారతీయ ప్రేమికుడు సచిన్ మీనాను వివాహమాడటానికి 2023లో పాక్ నుంచి నేపాల్ గుండా తన నలుగురు పిల్లలతో కలసి (అంతక్రితమే సింధ్ ప్రావిన్సులో ఈమెకు పెళ్లయింది) అక్రమంగా భారత్ వచ్చిన తన గతేమిటని సీమా హైదర్ నేడు ప్రశ్నిస్తోంది. లెక్కయితే ఇప్పుడు ఆమె కూడా స్వదేశానికి తరలిపోవాలి. ఆమె, సచిన్ ప్రస్తుతం గ్రేటర్ నోయిడా (ఉత్తరప్రదేశ్)లో నివసిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ‘నేను అప్పుడు పాక్ కూతురిని. ఇప్పుడు భారత్ కోడలిని. మీనాతో పెళ్లి అనంతరం నేను హిందూ మతం స్వీకరించాను. నాకు పాక్ వెళ్లాలని లేదు’ అని సీమా అంటోంది. సచిన్ మీనాతో కాపురం చేసి ఆమె ఓ కుమార్తె (పేరు భారతీ మీనా)కు జన్మనిచ్చింది. సీమా ఇక ఎంతమాత్రమూ పాక్ జాతీయురాలు కాదని, సీమా పౌరసత్వం భర్తతో ముడిపడివుంది కనుక భారత ప్రభుత్వ తాజా ఆదేశం ఆమెకు వర్తించదని ఆమె తరఫు న్యాయవాది చెబుతున్నారు. సీమా మాదిరిగా అక్రమ దారుల్లో ఇండియాలో ప్రవేశించిన పాకిస్థానీలు ప్రస్తుతం దేశ బహిష్కరణ (డిపోర్టేషన్) ముప్పు ఎదుర్కొంటున్నారు. ఇక రాజస్థానీ మహిళ బాజిదా ఖాన్ గోడు చూద్దాం. ఆమెకు పాక్ జాతీయుడితో పెళ్లయింది. కొంత సమయం పుట్టినింటి వారితో గడుపుదామని తన ఇద్దరు మైనర్ కుమారులను వెంటబెట్టుకుని ఆమె ఇండియాకు వచ్చింది. పిల్లలిద్దరికి పాక్ పాస్‌పోర్టులు ఉన్నాయి. ఇంకొన్నాళ్లు ఇండియాలోనే ఉందామని బాజిదా ఖాన్ భావించినా ఇక్కడి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 27లోగా ఆమె ఇండియా వీడి పాక్ వెళ్లక తప్పని పరిస్థితి. దీంతో ఆమె పాక్ వెళ్లడానికి శుక్రవారం వాఘా-అటారీ సరిహద్దును చేరుకుంది. అక్కడ ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. పాక్ పాస్‌పోర్టులున్నాయి కనుక ఆమె ఇద్దరు కుమారులు పాక్ భూభాగంలో ప్రవేశించవచ్చని, భారతీయ పాస్‌పోర్ట్ ఉన్నందున బాజిదాకు ఆ అవకాశం లేదని తేలింది. దీంతో ఆమె హతాశురాలైంది. ఐదేళ్ల కొడుకును చంకనెత్తుకుని పాకిస్థాన్‌లోని అత్తారింటికి బయల్దేరి సరిహద్దుకు చేరుకున్న రషీదా ఖాన్ కూడా అదే అనుభవాన్ని చవిచూసింది. ఆమెకు పాక్ జాతీయుడితో వివాహమైంది. పంజాబ్ (ఇండియా)లో ఉన్న తల్లిదండ్రులను చూసేందుకు ఆమె ఇక్కడికొచ్చింది. తిరిగి పాక్ వెళ్లిపోదామని సరిహద్దుకు చేరుకుంటే భారతీయ పాస్‌పోర్ట్ ఉందన్న కారణంతో ఆమెను నిలిపివేశారు. ఆమె కుమారుడికి మాత్రం పాక్ పాస్‌పోర్టు ఉంది. ఓ వితంతువు మరో దీనగాథ చెప్పుకుంది. తాను 20 ఏళ్లుగా పాక్ లో నివసిస్తున్నప్పటికీ ఆ దేశ పౌరసత్వం లేదని, తన ఇద్దరు టీనేజి కుమార్తెలతో కలసి ఇప్పుడు పాక్ వెళ్లడానికి అనుమతించాలని ఆమె అభ్యర్థిస్తోంది. తన వివాహ పత్రాలు, భర్త మరణ ధృవీకరణ పత్రం, పాక్ పౌరసత్వం కోసం సమర్పించిన దరఖాస్తు తాలూకు ఆధారాలు సైతం ఉన్నాయంటూ ఆమె బావురుమంటోంది. పాక్ వెళ్ళేందుకు అనుమతించాలని ఆమె భారత సర్కారును అభ్యర్థిస్తోంది. మరోవైపు బులంద్ షహర్ (ఉత్తరప్రదేశ్)లో కుటుంబాలను కలిగిన నలుగురు మహిళలను భారత ప్రభుత్వం పాక్ కు తిప్పి పంపింది. “మా పిల్లలు, కుటుంబాలు ఇండియాలో ఉన్నాయి. మేం అక్కడికి ఎలా వెళ్లి జీవిస్తాం?” అని వారిలో ఓ మహిళ లబోదిబోమంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పాక్ జాతీయులకు సంబంధించి మెడికల్ వీసాలు ఈ నెల 29 వరకు చెల్లుబాటవుతాయని, ఇతర అన్ని వీసాలు నెల 27 నుంచి రద్దవుతాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. - జమ్ముల శ్రీకాంత్ -
వేర్‌హౌస్ లావాదేవీల్లో.. అప్ అండ్ డౌన్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ పారిశ్రామిక గిడ్డంగుల(వేర్‌హౌస్) విపణిలో భిన్న వాతావరణం ఏర్పడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో నగరంలో 3 లక్షలు చ.అ. లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 2 లక్షల లావాదేవీలతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. ఇక, 2025 క్యూ1లో నగరంలో కొత్తగా 2 లక్షల చ.అ. గిడ్డంగుల స్థలం సరఫరా అయ్యింది. గతేడాది ఇదే కాలంలో సరఫరా అయిన 6 లక్షల చ.అ.లతో పోలిస్తే ఇది 67 శాతం తక్కువ.ఈ ఏడాది క్యూ1లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగుల స్థల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో జరిగిన 78 లక్షల చ.అ. లావాదేవీలతో పోలిస్తే ఇది 15 శాతం అధికం. ఎక్కువగా ఇంజినీరింగ్ కంపెనీలు 25 శాతం, ఈ–కామర్స్ సంస్థలు 21 శాతం స్పేస్‌ను లీజుకు తీసుకున్నాయని కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. అలాగే ఈ క్యూ1లో కొత్తగా 94 లక్షల చ.అ. స్పేస్ సరఫరా అయింది. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 16 శాతం ఎక్కువ. -
'యానిమల్'తో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా.. కానీ ఆ రోజు
అప్పట్లో తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న బబ్లూ పృథ్వీరాజ్.. చాన్నాళ్ల పాటు టాలీవుడ్ కి దూరమైపోయారు. మళ్లీ ఏ క్షణాన 'యానిమల్'లో నటించారో గానీ వరసగా తెలుగు మూవీస్ చేస్తున్నారు. రీసెంట్ టైంలో తండేల్, సంక్రాంతికి వస్తున్నాం, అర్జున్ సన్నాఫ్ వైజయంతి తదితర చిత్రాల్లో నటించారు.(ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీతో స్టార్ హీరోయిన్.. కోటి రూపాయల గిఫ్ట్!) కల్యాణ్ రామ్ హీరోగా నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీలో పృథ్వీకి మంచి రోల్ పడింది. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది గానీ పృథ్వీ క్యారెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతేడాది తనకెదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టాడు.'గతేడాది రిలీజైన ఉత్సవం సినిమాలో నేను కూడా నటించా. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం నాకు కాల్ వచ్చింది. వేరే షూటింగ్స్ లో ఉంటే అనుమతి తీసుకుని ఇక్కడికి వచ్చా. తీరా ఈవెంట్ కి వచ్చి దర్శకనిర్మాతలని పలకరిస్తే నన్ను సరిగా పట్టించుకోలేదు. సరేలే బిజీలో ఉన్నారేమో అని స్టేజీ ముందు సీట్ లో కూర్చున్నాను. వేరే వాళ్లొచ్చిన ప్రతిసారి నన్ను పక్కకు జరిపేశారు. అలా ఆ వరసలో చివరకెళ్లిపోయా'(ఇదీ చదవండి: 70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ) 'యాక్టర్స్ తో పాటు నా పక్కనే కూర్చున్న సాంగ్ రైటర్, మేకప్ ఆర్టిస్టుని కూడా స్టేజీపై పిలిచారు, నన్ను మాత్రం పట్టించుకోలేదు. ఈవెంట్ చివరలో గ్రూప్ ఫొటో రమ్మని పిలిస్తే స్టేజీపైకి వెళ్లా. అతిథిగా వచ్చిన అనిల్ రావిపూడితో మాట్లాడుతుంటే ఆయన్ని లాక్కెళ్లిపోయారు. ఫొటో దిగుతుంటే వెనక్కి వెళ్లి నిలబడమన్నారు. యానిమల్ మూవీతో పెద్ద స్టార్ అయిపోయాననుకున్నా. కానీ ఇక్కడేంటి ఎవరూ పట్టించుకోవట్లేదేంటి అనుకున్నా. ఆ రోజు మాత్రం చాలా బాధపడ్డాను' అని పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.దిలీప్ ప్రకాశ్ అనే కొత్త కుర్రాడిని పరిచయం చేస్తూ తీసిన సినిమా ఉత్సవం. రెజీనా హీరోయిన్. బ్రహ్మానందం, ప్రకాశ్ రాజ్, ప్రియదర్శి, నాజర్, ఆమని, పృథ్వీరాజ్.. ఇలా చాలామంది స్టార్స్ నటించారు. కానీ మూవీ ఫ్లాప్ అయింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి బోల్డ్ మూవీ.. ఏడాది తర్వాత తెలుగులోకి) -
కోబీ బ్రయాంట్ జెర్సీకి రూ. 59 కోట్లు
న్యూయార్క్: అమెరికా బాస్కెట్‌బాల్ దిగ్గజం, దివంగత కోబీ బ్రయాంట్ ఎన్బీఏ అరంగేట్ర మ్యాచ్‌లో వేసుకున్న జెర్సీ రికార్డు ధరకు అమ్ముడైంది. నేషనల్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ (ఎన్బీఏ) తొలి పోరులో బ్రయాంట్ ధరించిన జెర్సీ... శుక్రవారం నిర్వహించిన వేలంలో 70 లక్షల డాలర్ల (రూ. 59 కోట్ల 76 లక్షలు)కు అమ్ముడైంది.ఎన్బీఏ చరిత్రలో గొప్ప ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్న కోబీ... 2020లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. ఆ ఘటనలో బ్రయాంట్ కూతురు గియానాతో పాటు మరో ఏడుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎన్బీఏలో భాగంగా బ్రయాంట్ 1996–97 సీజన్లో లాస్ ఏంజెలిస్ లేకర్స్ తరఫున అరంగేట్రం చేశాడు. 2007–08 సీజన్లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న సందర్భంలో... బ్రయాంట్ సంతకం చేసిన జెర్సీ గతంలో 5.85 మిలియన్ డాలర్ల (రూ. 49 కోట్ల 93 లక్షల)కు అమ్ముడుపోగా... ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది.18 ఏళ్ల వయసులో తొలి మ్యాచ్ ఆడిన కోబీ 8వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగి... ఆరు నిమిషాల పాటు ఆడి ఖాతా తెరువలేకపోయాడు. ‘ఈ జెర్సీ ఓ కుర్రాడి సహజసిద్ధ సామర్థ్యానికి, ఆ తర్వాత దిగ్గజ ప్రస్థానానికి మధ్య వారధి. ఒక లెజెండ్‌కు చెందిన అరుదైన, అసాధారణ వస్తువు’ అని వేలం నిర్వహించిన సోథెబైస్ సంస్థ వెల్లడించింది. ఓవరాల్‌గా క్రీడాకారుల జెర్సీల వేలంలో... బేబ్ రూత్ జెర్సీ (24 మిలియన్ డాలర్లు), మైకేల్ జోర్డాన్ ఎన్బీఏ జెర్సీ (10.1 మిలియన్ డాలర్లు), డీగో మారడోనా అర్జెంటీనా జెర్సీ (9.3 మిలియన్ డాలర్ల) తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. -
ఇలా చేస్తున్నావేంటి మండలి?.. తెలుగు తమ్ముళ్ల ఫైర్
సాక్షి, కృష్ణా జిల్లా: అవనిగడ్డ కూటమిలో విభేదాలు భగ్గుమన్నాయి. జనసేన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తీరుపై అవనిగడ్డ తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మం పాటించడం లేదంటూ మండిపడుతున్నారు. ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబ దోపిడీని టీడీపీ నేతలు బయటపెట్టారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన బుద్ధప్రసాద్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటూ చల్లపల్లిలో జరిగిన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. తమకు కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదంటూ వాపోయారు.మీ వల్ల నేను గెలవలేదని ఎమ్మెల్యే మమ్మల్ని పదే పదే అవమానిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉండి చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోతున్నాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాకు ఇలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేం ఏ చిన్న పనిమీద వెళ్లినా అధికారులు మమ్మల్ని గౌరవించేవారు. మమ్మల్ని అవమానిస్తున్న ఎమ్మెల్యేతో ఎలా కలిసి పనిచేయాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నించారు.ఇసుక, మట్టిని ఎమ్మెల్యే కుటుంబం దోచుకుంటోందని టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ కార్యకర్త ఎవరైనా ట్రక్కు మట్టి సొంత పొలం నుంచి ఇంటికి తోలుకున్నా.. అధికారులను ఉసిగొల్పుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక, మట్టి అక్రమ రవాణా గురించి పోస్టు పెట్టినందుకు కోడూరు మండల తెలుగు యువత నాయకుడిపై కేసు పెట్టించారని.. తక్షణమే అవనిగడ్డ నియోజవర్గానికి టీడీపీ ఇంఛార్జిని నియమించాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
హీరోయిన్లు ఎప్పటికీ ఫ్రెండ్స్ కాలేరన్నది నిజం: సిమ్రాన్
రెండు కొప్పులు ఒకచోట ఇమడవు అంటుంటారు. అది నిజమే అంటోంది హీరోయిన్ సిమ్రాన్ (Simran). ఈమె ఇటీవలే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అతిథి పాత్రలో నటించింది. సినిమా రిలీజయ్యాక జరిగిన ఓ అవార్డు ఫంక్షన్లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. నేను ఆంటీ రోల్స్ చేస్తున్నానని ఓ నటి ఎగతాళి చేసిందని తెలిపింది. పనికిమాలిన డబ్బా పాత్రల్లో నటించడం కంటే అమ్మ, ఆంటీ రోల్స్ చేయడం ఎంతో ఉత్తమం అని స్టేజీపైనే నటికి కౌంటర్ ఇచ్చింది.లైలా? జ్యోతిక? ఎవరన్నారు?లైలా గురించే సిమ్రాన్ ఈ కామెంట్స్ చేసిందన్న ప్రచారం జరిగింది. మరికొందరేమో డబ్బా అన్న పదం వాడిందంటే డబ్బా కార్టెల్ సిరీస్‌లో నటించిన జ్యోతికపై ఈ వ్యాఖ్యలు చేసిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా సిమ్రాన్ ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ఆమె మాటల వల్ల నాకు నిజంగా బాధేసింది. అందుకే నా బాధను చెప్పుకున్నాను. కెరీర్ ఆరంభం నుంచే నేను ఆంటీ పాత్రలు చేస్తున్నాను. ఆంటీ అనే పదం ఇష్టంఆంటీ అనే పదాన్ని అవమానంగా ఫీలవను.. ఇష్టంగానే భావిస్తాను. ఆ పాత్రలు చేయడం తప్పేం కాదు. ఇదంతా జరిగాక నాకో విషయం అర్థమైంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లెప్పుడూ ఫ్రెండ్స్ కాలేరని రుజువైంది. ఫ్రెండ్ అనుకున్నవాళ్లే మనపై అలాంటి కామెంట్లు చేస్తే మనసుకు బాధగా అనిపిస్తుంది. ఆమె తర్వాతిరోజు క్యాజువల్‌గానే మాట్లాడింది. కానీ మా స్నేహం మునుపటిలా మాత్రం కొనసాగదు అని సిమ్రాన్ చెప్పుకొచ్చింది. కానీ తనపై సెటైర్లు వేసిందెవరన్నది మాత్రం సిమ్రాన్ వెల్లడించలేదు.చదవండి: తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు -
పహల్గామ్ హీరో.. మానవత్వంలో ‘ధీరత్వం’
ఏ మనిషికైనా కష్టం వస్తే సాయం చేసే వాళ్లని మానవత్వం ఉన్నవాళ్లుగా పరిగణిస్తాం. పక్కోడికి ఏమైతే మనకేంటి.. అనుకుంటే వారిని స్వార్ధపరులే అనుకుంటాం. మరి మానవత్వంలో ధీరత్వం అంటే ఏమిటి? మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు వారి ప్రాణాలను కూడా తన ప్రాణాలుగానే భావించి తెగువ చూపించి కాపాడితే అది మానవత్వంలో ధీరత్వమే అవుతుంది. ఇక్కడ తనకెందులే అనుకోకుండా ధీరత్వంతో కొంతమంది ప్రాణాల్ని కాపాడాడు ఓ వ్యక్తి. పహల్గామ్ ఉగ్రదాడి నుంచి కొంతమందిని కాపాడి హీరో అయ్యాడు. ఓ వైపు టెర్రరిస్టులు దాడులకు తెగబడిన తరుణంలో ఆ యువకుడు తన ప్రాణాలు తెగించి మరీ వారిని కాపాడాడు.విషయంలోకి వెళితే.. మంగళవారం( ఏప్రిల్ 22వ తేదీ) కశ్మీర్ లోని పహల్గామ్ ఉగ్రదాడితో రక్తసిక్తమైంది. కొంతమంది ఉగ్రవాదులు ఆర్మీ డ్రెస్సులు ధరించి వచ్చి అమాయక టూరిస్టుల ప్రాణాలు తీశారు. ఈ ఘటనలో 26 మంది అసువులు బాసారు. అయితే ఈ క్రమంలోనే కొంతమంది తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడ్డారు. ఇలా సాయం చేయడంలో స్థానికంగా ఉన్న కొందరు సహకరించారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ టూరిస్టులను కాపాడారు. ఇలా టూరిస్టులను కాపాడిన వారిలో పహల్గాగ్ కు చెందిన రాయిస్ అహ్మద్ భట్ ఒకరు. పహల్గామ్ లో పోనీ ఓనర్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న అహ్మద్ భట్.. ఆ క్షణాలను మళ్లీ తలుచుకుంటేనే భయమేస్తుందన్నాడు. ఈ రోజు దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లిన రాయీస్ అహ్మద్ భట్.. ఏఎన్ఐ పలకరించగా అక్కడ జరిగిన దాడి ఉదంతాన్ని చెప్పుకొచ్చాడు.ఆఫీస్ నుంచి అనుకోకుండా బయటకొచ్చి..ఈ టెర్రర్ అటాక్ అనేది మధ్యాహ్నం గం. 2.45ని. ప్రాంతంలో జరిగిందన్నాడు అహ్మద్ భట్. తనకు ఒక ఫోన్ వస్తే కవరేజ్ లేదని బయటకొచ్చిన క్రమంలో కొంతమంది టూరిస్టుల ఆర్తనాదాలు వినిపించాయన్నాడు. తమను రక్షించాలంటూ వారు చేస్తున్న రోదనతో తాను అప్రమత్తమైనట్లు పేర్కొన్నాడు.‘ నేను ఆఫీస్ లో ఉన్నా. నాకు ఒక మెస్సేజ్ వచ్చింది. అది మా జనరల్ ప్రెసిడెంట్ నుంచి వచ్చిన మెస్సేజ్. ఆ మెస్సేజ్ చూసిన తర్వాత నేను తిరిగా కాల్ చేశాను. కానీ మొబైల్ కవరేజ్ సరిగా లేకపోవడంతో నేను ఫోన్ మాట్లాడుకుంటూ బయటకొచ్చా. అప్పుడు ఉగ్రదాడి జరుగుతుందనే విషయం పసిగట్టా. నేను ఆరుగుర్ని నాతో తీసుకుని అక్కడ నుంచి రెండు కిలోమీటర్ల వరకూ ఎత్తుపైకి వెళ్లాం.అక్కడ నుంచి చూస్తుంటే కింద భయానక వాతావరణం కనిపించింది. భయభ్రాంతులతో పరుగెడుతున్న పలువురు కనిపించారు. కేవలం వారి నుంచి రక్షించండి అనే ఆర్తనాదమే వస్తుంది. నీరు.. నీరు అంటూ కేకలు వేస్తూ ప్రాణం కోసం పరుగుపెట్టారు. నేను వారికి సాయం చేయడానికి మేము యత్నించాం. అడవిలో ఉన్న ఒక వాటర్ పైప్ వారికి వాటర్ అందించాం. ఆ తర్వాత వారికి ఒకటే చెప్పా. మీకు సురక్షితమైన జోన్ లో ఉన్నారనే విషయం చెప్పా. వారిని మా టీమ్ సభ్యులకు అప్పగించా. భయపడిన వారిని సురక్షితంగా తీసుకురావడమే మా మొదటి ప్రయత్నంగా భావించాం’ అని చెప్పుకొచ్చాడు.ఆ తర్వాత కూడా పది నుంచి పదిహేనుమంది వరకూ తాను కాపాడినట్లు రాయీస్ భట్ తెలిపాడు. తమ టీమ్ సభ్యులంతా కలిసి చాలా మందిని ప్రాణాలతో కాపాడమన్నాడు. నేను బురదలో చిక్కుకుపోయిన కొంతమందిని తనతో పాటు తీసుకొచ్చానన్నాడు. ఆ తర్వాత వారిని గుర్రాలు ఎక్కించి వెనక్కి పంపించినట్లు పేర్కొన్నాడు.ఎక్కడ చూసినా ఆర్తనాదాలే..తాను తొలిసారి చూసినప్పుడు టూరిస్టులు ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక మృతదేహాన్ని చూశా. ఆ తర్వాత నాలుగైదు మృతదేహాలు కనిపించాయి. అక్కడ ఉన్న కొంతమంది గాయపడ్డ మహిళలు.. తమ భర్తలను రక్షించాలని వేడుకున్నారు. ఏదైతే అది అయ్యిందని మా టీమ్ సభ్యులమంతా గేట్ లోపలికి వెళ్లి ఆపరేషన్ స్టార్ట్ చేశామన్నాడు. ఇలా కొంతమందిని రక్షించామని రాయీస్ అహ్మద్ మీడియాకు తెలిపాడు.