అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్‌ | Avakaya Pachadi Upasana Konidela shares video in twitter | Sakshi
Sakshi News home page

అత్తగారు, ఆవకాయ పచ్చడి : ఉపాసన కొణిదెల వీడియో వైరల్‌

Published Thu, May 1 2025 3:29 PM | Last Updated on Thu, May 1 2025 3:48 PM

Avakaya Pachadi Upasana Konidela shares video in twitter

టాలీవుడ్‌ స్టార్‌ హీరో  రాంచరణ్‌  భార్య, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల ఒక  ఆసక్తికరమైన వీడియోను ఎక్స్‌ (ట్విటర్‌) లో షేర్‌ చేశారు. తన అత్తగారు మెగాస్టార్ చిరంజీవి అర్ధాంగి కొణిదెల సురేఖతో కలిసి కొత్త అవకాయ పచ్చడి పట్టారు.  దీనికి సంబంధించిన వీడియోను  అభిమానులతో పంచుకున్నారు. 

వేసవి కాలం వచ్చిందంటే.. ఆవకాయ సీజన్‌ స్టార్ట్‌ అవుతుంది. ఈ నేపథ్యంలోనే అత్తా కోడళ్లు ఆవకాయ బిజినెస్‌ బిజీగా అయిపోయారు. అందులో భాగంగా మామిడి కాయలతో కొత్త ఆవకాయ పచ్చడి కలిపారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను మెగా కోడలు ఉపాసన సోషల్ మీడియాలో పంచుకున్నారు. చక్కగా అవకాయ కలిపి జాడిలో పెట్టి, దానిని అమ్మవారికి  నైవేద్యంగా సమర్పించారు.  దీంతో  ఈ ఏడాది వ్యాపారం మూడు పూవులు, ఆరు కాయలుగా సాగిపోవాలని కోరుకున్నట్టున్నారు అంటూ నెటిజన్లు వ్యాఖ్యానించారు. ఇంకా స్వామి కార్యం స్వకార్యం రెండూ ఒక్కసారే , తెలివైన కోడలు ఉపాసన, ఇది అత్తా కోడళ్ళ అనుబంధం, అది ఆవకాయ పచ్చడైనా..మన సాంప్రదాయం అయినా అని ఒకరు, అత్తమ్మ వంటలు ప్రమోట్ చేస్తున్న కోడలు అంటూ  మరో  యూజర్‌ కామెంట్‌ చేయడం విశేషం.

 ‘‘సురేఖ గారు నా ప్రియమైన అత్తమ్మ - ఈ సీజన్ కొత్త ఆవకాయ పచ్చడితో మమ్మల్ని ఆకట్టుకున్నారు. ఆమెకు, ఫుడ్‌  అంటే పోషకాహారం మాత్రమే కాదు , సంస్కృతి & వారసత్వాన్ని కాపాడుకునే   వేడుక అంటూ ఉపాసన ట్వీట్‌ చేశారు.  అత్తమ్మాస్ కిచెన్ పేరిట ఆహార ఉత్పత్తుల వ్యాపారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement