surekha
-
విమానంలో వివాహ వేడుక.. మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి తన వివాహా వార్షికోత్సవాన్ని చాలా సింపుల్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. విమానంలో తన సన్నిహితులు, స్నేహితులతో కలిసి జరుపుకున్నారు. ఫ్టైట్‌లో దుబాయ్ వెళ్తూ తమ పెళ్లి రోజును సెలబ్రేట్ చేసుకున్నామని మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఈ వేడుకల్లో అక్కినేని నాగార్జున, అమల దంపతులు కూడా ఉన్నారు. తాజాగా చిరు తమ పెళ్లి రోజు వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. చిరంజీవి తన ట్వీట్లో రాస్తూ..' ప్రియమైన స్నేహితులతో కలిసి విమానంలో మా వివాహ వార్షికోత్సవాన్ని చాలా జరుపుకుంటున్నాం. సురేఖ లాంటి డ్రీమ్ లైఫ్ పార్ట్నర్ దొరకడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఆమె నా బలం, నా యాంకర్ కూడా. ప్రపంచంలోని అద్భుతమైన నాకు తెలియని వాటిని నావిగేట్ చేయడానికి ఎల్లప్పుడూ సహాయం చేస్తుంది. తను నా పక్కన ఉంటే సౌకర్యంతో పాటు అద్భుతమైన ప్రేరణ కూడా. ఈ సందర్భంగా నా సోల్‌మేట్ సురేఖకు ధన్యవాదాలు. నీ పట్ల నాకున్న ప్రేమ, అభిమానాన్ని తెలియజేయడానికి ఇలాంటివీ మరిన్నీ సందర్భాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు, అభిమానులు, కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బింబిసార్ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు. Celebrating our wedding anniversary on a flight with some very dear friends en route Dubai ! 🎉I always feel I am very fortunate to have found a dream life partner in Surekha. She is my strength, my anchor and the wind beneath my wings. Always helps me navigate through the… pic.twitter.com/h4gvNuW1YY— Chiranjeevi Konidela (@KChiruTweets) February 20, 2025 -
చరణ్ అన్న మాటతో చాలా సంతోషంగా ఫీలయ్యా: బిగ్‌బాస్ రన్నరప్ గౌతమ్
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-8 గ్రాండ్‌గా ముగిసింది. ఈ సీజన్ విజేతగా నిఖిల్ ట్రోఫితో పాటు ప్రైజ్‌మనీ సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సీజన్ రన్నరప్‌గా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గౌతమ్ నిలిచాడు. చాలా వరకు ఆడియన్స్ గౌతమ్ గెలుస్తాడని ముందే ఊహించారు. కానీ అనూహ్యంగా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ గ్రాండ్ ఫినాలేకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై విజేతకు ట్రోఫీని అందజేశారు.(ఇది చదవండి: షో అయిపోగానే కావ్య దగ్గర వాలిపోతానన్న నిఖిల్.. ఇప్పుడేమో!)అయితే గ్రాండ్ ఫినాలేలో రామ్ చరణ్ అన్నను కలవడం సంతోషంగా ఉందని గౌతమ్ అన్నారు. అమ్మ నీకు చాలా పెద్ద ఫ్యాన్ అని రామ్ చరణ్ నాతో అన్నాడని తెలిపాడు. ప్రతి రోజు బిగ్‌బాస్ చూసి నాకు నీ గురించి చెబుతూ ఉంటుందని చరణ్ అన్న చెప్పాడు. నేనే విన్నర్ అవుతానని సురేఖ అమ్మగారు చెప్పారని చరణ్ అన్న నాతో అన్నారు. నువ్వు ఏం ఫీలవ్వకు.. నీకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారని చరణ్ అన్న చెప్పడం నా జీవితంలో గర్వించదగిన సందర్భమని గౌతమ్ వెల్లడించారు. నేను గెలవలేదని ఫీలవుతుంటే.. నువ్వు కచ్చితంగా నిలబడతావ్.. అంటూ చరణ్ అన్న నాకు ధైర్యం చెప్పాడని గౌతమ్ ఎమోషనల్ అయ్యారు. -
మేనల్లుడిని చూసి కన్నీరు పెట్టుకున్న సురేఖ..
-
అల్లు అర్జున్ను కలిసి ఎమోషనల్ అయిన సురేఖ
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ తన అన్న అల్లు అరవింద్ ఇంటికి వెళ్లారు. తన మేనల్లుడు అయిన అల్లు అర్జున్ను ఆమె కలిశారు. బన్నీని చూసిన వెంటనే హత్తుకుని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే చిరంజీవి, సురేఖ ఇద్దరూ బన్నీ ఇంటికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. బెయిల్ ద్వారా అల్లు అర్జున్ ఇంటికి రావడంతో తన మేనల్లుడి కోసం సురేఖ మరోసారి అక్కడకు వచ్చారు.పుష్ప–2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, చంచల్‌గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు, సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా.. రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో నిన్న రాత్రంతా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం బన్నీ బయటకు వచ్చారు. టాలీవుడ్‌కు చెందిన సినీ ప్రముఖులు చాలామంది అల్లు అర్జున్ ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ, కొరటాల శివ, సుకుమార్, శ్రీకాంత్, దిల్ రాజు, ఆర్ నారాయణమూర్తి, రానా, నాగచైతన్య, వంశీ పైడిపల్లి,హరీష్ శంకర్ వంటి స్టార్స్ ఉన్నారు. View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonliine_) -
అల్లు అర్జున్‌ని హత్తుకుని సుకుమార్ ఎమోషనల్
జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అల్లు అర్జున్.. ఇంటికొచ్చేశాడు. మీడియాతో మాట్లాడుతూ తనకు మద్దతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఈ క్రమంలోనే బన్నీని కలిసేందుకు సినీ ప్రముఖులు అతడి ఇంటికి వస్తున్నారు. మిగతా వాళ్ల సంగతేమో గానీ దర్శకుడు సుకుమార్ మాత్రం బన్నీని హత్తుకుని ఎమోషనల్ అయిపోయాడు.(ఇదీ చదవండి: కావాలనే జైల్లో ఉంచారు.. పోలీసులపై కేసు పెడతాం: బన్నీ లాయర్)ఇంటికొచ్చి బన్నీని కలిసిన వాళ్లలో చిరంజీవి భార్య సురేఖతో పాటు నిర్మాతలు నవీన్ యెర్నేని, దిల్ రాజు ఉన్నారు. అలానే హీరో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, రానా, నాగచైతన్య, శ్రీకాంత్, సీనియర్ దర్శకుడు రాఘవేంద్ర రావు, యంగ్ డైరెక్టర్స్ హరీశ్ శంకర్, వశిష్ఠ తదితరులు ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.రీసెంట్గా 'పుష్ప 2'తో బ్లాక్ బస్టర్ అందుకున్న సుకుమార్ మాత్రం బన్నీని ఇంట్లో కలిసిన తర్వాత కన్నీళ్లు పెట్టుకున్న ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. కూర్చుని వీళ్లిద్దరూ చాలాసేపు మాట్లాడుకున్నారు. ఇకపోతే సంధ్య థియేటర్ దగ్గర మహిళా మృతి చెందిన కేసులో తొలుత బన్నీని అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు.. 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. (ఇదీ చదవండి: ఇంటికొచ్చేసిన అల్లు అర్జున్.. మీడియాతో ఏమన్నాడంటే?)#Sukumar sir " We Love You " ♥️🥺@alluarjun #WeStandWithAlluArjun pic.twitter.com/aq4S8cvitj— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) December 14, 2024 -
ధీరజ్, సురేఖలకు నిరాశ
ట్లాక్స్కాలా (మెక్సికో): ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్స్‌లో భారత స్టార్ ప్లేయర్లు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మదేవర ధీరజ్, వెన్నం జ్యోతి సురేఖ నిరాశపరిచారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోని టాప్–8 ప్లేయర్లకు వరల్డ్‌కప్ ఫైనల్స్ టోర్నీలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. పారిస్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డ ధీరజ్ పురుషుల రికర్వ్ విభాగంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే (క్వార్టర్ ఫైనల్) ఓడిపోయాడు. మరోవైపు మహిళల కాంపౌండ్ విభాగంలో జ్యోతి సురేఖ కూడా ఆడిన తొలి మ్యాచ్‌లోనే (క్వార్టర్ ఫైనల్) పరాజయం పాలైంది. పురుషుల కాంపౌండ్ విభాగంలో భారత ప్లేయర్ ప్రథమేశ్ కాంస్య పతక మ్యాచ్‌లో ఓడిపోయి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్రీ మార్టా పాస్ (ఎస్తోనియా)తో జరిగిన మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 145–147 పాయింట్ల తేడాతో ఓడిపోయింది. ప్రథమేశ్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన ప్రియాంశ్‌పై 147–146తో గెలిచాడు. సెమీఫైనల్లో ప్రథమేశ్ డెన్మార్క్ ప్లేయర్ మథియాస్ ఫులర్టన్ చేతిలో ఓటమి చవిచూశాడు. కాంస్య పతక మ్యాచ్‌లో ప్రథమేశ్ 146–150తో మైక్ ష్లాసెర్ (నెదర్లాండ్స్) చేతిలో ఓడిపోయాడు. రికర్వ్ క్వార్టర్ ఫైనల్లో ధీరజ్ 4–6 (28–28, 29–26, 28–28, 26–30, 28–29)తో లీ వూ సియోక్ (దక్షిణ కొరియా) చేతిలో ఓటమి చవిచూశాడు. -
రామ్‌చరణ్ బర్త్‌డే.. 500 మందికి సురేఖ అన్నదానం (ఫోటోలు)
-
చరణ్ బర్త్‌డే.. కోడలితో కలిసి సురేఖ ఏం చేశారంటే?
ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్లు.. రామ్‌చరణ్ ఎంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినా తన తల్లి సురేఖకు మాత్రం పిల్లవాడే! నేడు (మార్చి 27) చరణ్ పుట్టినరోజు. కుమారుడి బర్త్‌డే అంటే పేరెంట్స్‌కు ఎంత ఆనందమో! ఆ సంతోషాన్ని నలుగురికి పంచాలనుకున్నారు సురేఖ. అన్నింటిలోకెల్లా గొప్పదైన అన్నదానాన్ని ఆశ్రయించారు. ఆలోచన వచ్చిందే తడవు.. ఒకరోజు ముందే అన్నదానం నిర్వహించారు. "చినజీయర్ స్వామి ఆశీస్సులతో అపోలో ఆవరణలోని ఆలయ పుష్కరోత్సవాల్లో 500 మందికి అన్నదానం చేశాం" అంటూ అత్తమ్మాస్ కిచెన్ ఇన్స్టాగ్రామ్ పేజీలో వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా గత నెలలో ఉపాసన సాయంతో సురేఖ అత్తమ్మాస్ కిచెన్ పేరిట ఫుడ్ బిజినెస్ ప్రారంభించారు. సురేఖ బర్త్‌డే రోజే ఈ వ్యాపారాన్ని లాంచ్ చేశారు. కమ్మటి ఇంటి వంటను అందరికీ అందజేయడమే దీని ఉద్దేశమని సురేఖ పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Athamma`s Kitchen (@athammaskitchen) చదవండి: తెలుగు హీరోయిన్ను పెళ్లాడిన సిద్దార్థ్.. ఇద్దరికీ రెండోదే! -
Upasana Konidela Photos: కొణిదెలవారి కోడలు ఉపాసన.. ప్రత్యేక క్షణాలు (ఫొటోలు)
-
అత్తమ్మపై మెగా కోడలు ప్రశంసలు.. ఎందుకంటే?
మెగా కోడలు ఉపాసన గురించి పరిచయం అక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో సంబంధం లేనప్పటికీ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా బాగానే గుర్తింపు తెచ్చుకుంది. అపోలో ఆస్పత్రి ద్వారా మహిళల గతేడాది ఈ జంటకు కూతురు జన్మించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఓ ఇంటర్వూలోనే మరో ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే రెండో బిడ్డను కనేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఇవాళ అంతర్జాతీయ మహిళ దినోత్సవం కావడంతో ప్రత్యేకంగా విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది. అదేంటో చూసేద్దాం. తాజాగా మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉపాసన కొణిదెల ట్వీట్ చేసింది. అత్తమ్మ, చిరంజీవి భార్య సురేఖపై ప్రశంసలు కురిపించింది. ఈ మహిళ దినోత్సవం రోజున 60 ఏళ్లలో మా అత్తమ్మ ఎంటర్‌ప్రెన్యూరర్‌గా రాణిస్తోంది. మనదేశంలో చాలామంది అత్తమ్మలు, అమ్మలు బిజినెస్‌లో రాణిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు తమకు ఇష్టమైన వృత్తిలో సాధించిన విజయాలను ఈ రోజు సెలబ్రేట్ చేసుకోవాలంటూ ఉపాసన పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా..ఇటీవల ఉపాసన నాలెడ్జి సిటీలోని టి–హబ్‌లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి.. ఆమే నాకు స్ఫూర్తి అని చెప్పారు. ప్రస్తుత కాలంలో ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. This Women’s Day my mother-in-law is making her debut as an entrepreneur in her 60’s 🙌 Imagine how rich our country would be if more athammas & amma’s became entrepreneurs!! Let’s celebrate more women joining the workforce & following their passion https://t.co/WhQ2JmjsaG pic.twitter.com/05tz4UPBfE — Upasana Konidela (@upasanakonidela) March 8, 2024 -
International Womens Day 2024: ఆహారంలోనే ఆరోగ్యం.. మూడుతరాల కోడళ్ల ముచ్చట్లు
ఒక మహిళ శక్తిమంతురాలు... అని చెప్పడానికి ఒక నిదర్శనం ఆమె కుటుంబాన్ని నిర్వహించే తీరు. శక్తిమంతురాలైన మహిళ తన ఇంట్లో వ్యక్తుల మధ్య ఉండాల్సిన కుటుంబ బంధాలను చక్కగా నిర్వహించగలుగుతుంది. ఏ ఇంట్లో అయినా బంధాలు, బాంధవ్యాల నిర్వహణ బాధ్యత మహిళ భుజాల మీదనే ఉంటుంది. మగవాళ్లు పని ఒత్తిడిలో క్షణికావేశానికి లోనైనప్పుడు ఆ పరిస్థితిని చక్కదిద్దగలిగింది మహిళ మాత్రమే. ఆ మహిళ ఆ మగవ్యక్తికి తల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఇంటి కోడలు కావచ్చు. ఒక ఇంట్లో తల్లి, కోడలు, కొత్తతరం కోడలు అందరూ అనుబంధాలకు విలువ ఇచ్చేవారైతే ఆ కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందో ఈ ఫొటో చెప్తోంది. ఉపాసన, సురేఖ, అంజనాదేవి... కొణిదెల ఇంటి మూడు తరాల కోడళ్లు. తమ ఇంటి రుచుల అనుబంధాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో పంచుకున్నారు. పిల్లలు తింటేనే నాకు బలం నాకు వంట చేయడం చాలా ఇష్టం. అయితే పెద్దగా ఓపికలేదిప్పుడు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు ‘ఏమైనా వండి పంపించమంటావా’ అని అడుగుతాను. మొన్నొక రోజు చరణ్ ‘నాయనమ్మా రొయ్యల పలావు చేస్తావా’ అన్నాడు. రేపు ఎలా ఉంటుందో, చేయగలనా లేదా అని ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. రొయ్యల పలావు వండి, చరణ్ తిని బాగుందన్న తర్వాత నెమ్మదించాను. ప్రతిదీ రుచిగా ఉండాలనుకుంటాను. హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత కూడా మంచి కాఫీ కోసం నెల్లూరు, నిర్మలా కేఫ్ నుంచి కాఫీ పొడి తెప్పించుకునేదాన్ని. పిల్లలందరికీ చక్కగా వండి పెట్టడమే నాకు సంతోషం, అదే నా బలం. – అంజనాదేవి మా కోడలు నన్ను మార్చేసింది గత ఏడాది మహిళాదినోత్సవానికి – ఈ మహిళా దినోత్సవానికి మధ్య నా జీవితం ఓ కీలకమైన మలుపు తీసుకుంది. గృహిణిగా ఉన్న నన్ను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది ఉపాసన. ‘అత్తమ్మాస్ కిచెన్’ ప్రారంభానికి మూలం కోసం నాలుగు దశాబ్దాల వెనక్కి వెళ్లాలి. మా పెళ్లయిన కొత్తలో చిరంజీవి షూటింగ్ కోసం పారిస్ వెళ్లినప్పుడు నేనూ వెళ్లాను. 47 రోజులు అక్కడ ఆయన మీట్, సాస్‌లు తినలేక ఇబ్బంది పడ్డారు. బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఇంటి భోజనాన్ని ఎంజాయ్ చేయడం కోసం నేను కనుక్కున్న ఫార్ములానే ఈ ప్రీ కుక్డ్ ఫుడ్. అలాగే ఉపాసన ఆస్కార్ అవార్డు వేడుకలకు వెళ్లినప్పుడు తను ప్రెగ్నెంట్. భోజనం సరిగా తింటుందో లేదోనని ఇదే ఫార్ములా ఇన్స్టంట్ మిక్స్‌లు చేసిచ్చాను. తను చాలా సంతోషపడింది. ఇండియా వచ్చిన తరవాత తన ఆలోచన నాతో చెప్పింది. ఎంటర్ప్రెన్యూర్ అనే మాటే అప్పుడు నాకు అర్థం కాని విషయం. అయితే వంట వరకు నా పర్యవేక్షణలో జరుగుతుంది. ప్రభుత్వ అనుమతులు, మార్కెటింగ్ వంటివన్నీ ఉపాసన చూసుకుంటుంది. ఈ సందర్భంగా అరవై దాటిన మహిళలకు నేను చెప్పే మాట ఒక్కటే. యాభై దాటే వరకు మన ఆరోగ్యం గురించి పెద్దగా పట్టించుకున్నా పట్టించుకోక పోయినా గడిచిపోతుంది. అరవైలలోకి వస్తున్నారంటే దేహం మీద దృష్టి పెట్టాలి. రోజుకో గంట సమయం వ్యాయామం కోసం కేటాయించాలి. ఎన్నాళ్లు బతుకుతామనేది కాదు, బతికినన్నాళ్లూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మా ఉపాసన మాటలను విన్న తర్వాత నాకు తెలిసిందేమిటంటే... ఈ తరం మహిళలు ముఖ్యంగా గృహిణులు తమకంటూ ఓ గుర్తింపును కోరుకుంటారు. అలాగని అందరికీ పెద్ద పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించే వెసులుబాటు ఉండదు. ఆర్థిక సౌలభ్యం లేదని దిగులు చెందవద్దు. ఇంట్లోనే చేయగలిగే పచ్చళ్లు, హోమ్ఫుడ్తో చిన్నస్థాయిలో మొదలుపెట్టండి. మీ కృషితో మీ కుటీర పరిశ్రమను విస్తరించండి. మీకంటూ గుర్తింపు దానంతట అదే వస్తుంది. – సురేఖ అత్తమ్మ నా రోల్‌మోడల్ మీకు తెలుసా... అత్తమ్మ వెయిట్ లిఫ్టర్! రోజూ ఎక్సర్సైజ్లో భాగంగా వెయిట్ లిఫ్ట్ చేస్తారు. ఆమె ప్రతి విషయంలో ఎంత నిదానంగా, ఎంత జాగ్రత్తగా ఉంటారో, మాట్లాడే ముందు ఎంత ఆలోచిస్తారో... అన్నీ నాకు గొప్పగా అనిపిస్తాయి. ప్రీ కుక్డ్ ఫుడ్ ఫార్ములా తెలిసి ఎంత ఎగ్జయిట్ అయ్యానో చెప్పలేను. ట్రావెల్ చేసే వాళ్లకు ఎంత బాగా ఉపయోగపడుతుందో కదా, దీనిని అందరికీ పంచుదామన్నాను. ఇప్పటికే మార్కెట్లో ఉప్మా, పులిహోర వంటి మిక్స్‌లు ఉన్నప్పటికీ వాటిలో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి. అలా క్రృతిమ ప్రిజర్వేటివ్స్ ఏమీ లేకుండా చేసిన మా అత్తమ్మ రెసిపీలను విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకురావాలనేదే నా ప్రయత్నం. ఇప్పుడు ఉప్మా, పులిహోర, రసం, పొంగల్ నాలుగు ఉత్పత్తులతో మార్కెట్లోకి వచ్చాం. మరో మూడు ప్రయోగాల దశ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మా పాపకు అందిస్తున్న చిరుధాన్యాలు, పప్పులతో ఇన్స్టంట్ ఫుడ్ పౌడర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకువస్తాం. ఈ ఐడియాకి అత్తమ్మ గారింట్లో ఆశ్చర్యపోయారు. కానీ మా పుట్టింట్లో మహిళలందరూ ఎంటర్ప్రెన్యూర్లే కావడంతో వాళ్లు విన్న వెంటనే సంతోషంగా స్వాగతించారు. హెల్త్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిని ఫుడ్ ఇండస్ట్రీలోకి రావడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆహారంలోనే ఆరోగ్యం ఉంది. – ఉపాసన ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి; ఫోటో: నోముల రాజేశ్‌రెడ్డి -
మా అత్తమ్మే నాకు స్ఫూర్తి : రాంచరణ్ సతీమణి ఉపాసన
రాయదుర్గం(హైదరాబాద్): మహిళలు కుటుంబాన్ని చాలా ప్రభావితం చేస్తారని, కుటుంబ మనుగడలో వీరి పాత్ర కీలకమని హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన అన్నారు. నాలెడ్జి సిటీలోని టి–హబ్‌లో ట్రంఫ్ ఆఫ్ టాలెంట్ హౌజ్ ఆఫ్ మేకప్ ఆధ్వర్యంలో వివిధ రంగాలలో రాణించిన మహిళలకు విమెన్ ఆఫ్ ఇంపాక్ట్ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘మా అత్తమ్మ ఎంతో ప్రేమగల వ్యక్తి..ఆమే నాకు స్ఫూర్తి’ అని చెప్పారు. ప్రధానంగా నేడు ధైర్యంగా, ధృఢంగా ఉండే మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపేందుకే ఈ అవార్డుల కార్యక్రమానికి వచ్చానన్నారు. ఎలికో లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ వనితా దాట్ల మహిళలు అన్ని రంగాల్లో రాణించడం ఎంతో అవసరమన్నారు. కార్యక్రమంలో టి–హబ్ సీఈఓ ఎంశ్రీనివాసరావు, హెచ్ఎస్బీసీ ఎండీ మమతా మాదిరెడ్డి, పూర్వవిద్యార్థుల సంఘం కో¸ûండర్ ఆదితి ఆర్య కోటక్, శిల్పారెడ్డి ప్రసంగించారు. -
మెగా కోడళ్ల నయా బిజినెస్!
మెగాస్టార్ చిరంజీవి సతీమణి పుట్టినరోజు నేడు.. ఈ సందర్భంగా చిరు తనదైన స్టైల్లొ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తాజాగా మెగా కోడలు ఉపాసన కూడా తన అత్తగారికి ప్రత్యేకంగా విషెష్ చెప్పారు. ఈ క్రమంలో ఒక వీడియోను ఆమె షేర్ చేశారు. అత్తాకోడళ్ల అనుబంధాన్ని ఉపాసన సరికొత్తగా నిర్వచిస్తున్నారు. అత్తమ్మ వంటకాలను రుచిని అందరికీ తెలిసేలా ఉపాసన చేస్తున్నారు. తన అత్తగారైన సురేఖ కొణిదెల వంటలను అందరికీ రుచి చూపించేలా అత్తమ్మ కిచెన్ పేరుతో ఫుడ్ బిజినెస్‌ను ప్రారంభించారు ఉపాసన. సురేఖ కొణిదెల పుట్టినరోజు సందర్భంగా వీటిని ప్రారంభించి.. అసలు సిసలైన అత్తా కోడళ్ల బంధాన్ని చాటి చెప్పారు. అత్తాకోడళ్ల మధ్య ఉండాల్సిన పరస్పర గౌరవం, సహకారానికి సరైన నిర్వచనం ఇస్తున్నారు. చిరంజీవి తనుకున్న బిజీ షెడ్యూల్స్‌లోనూ రుచికరమైన భోజనం తినేలా ఎన్నో రకాల వంటకాలను సురేఖ కొణిదెల గారు సిద్ధం చేస్తుండేవారు. కొణిదెల వంటకాలను "అత్తమ్మ కిచెన్" ద్వారా అందరితో పంచుకోవాలని ఉపాసన లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇంటి నుండి దూరంగా ఉన్న వ్యక్తులకు ఇంటి భోజనం మిస్ అవుతున్న ఫీలింగ్ రానివ్వకుండా ఈ ‘అత్తమ్మ కిచెన్’ ప్రొడక్ట్స్‌లు వారి కడుపులను నింపుతుంది. ఉపాసన కొణిదెల తన వ్యవస్థాపక నైపుణ్యాలను ఉపయోగించుకుని, ఈ వెంచర్‌ను రూపొందించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ వినూత్న వ్యాపార విధానంతో అత్తగారితో ఉపాసనకున్న అనుబంధం, ఆమెతో పంచుకునే లోతైన బంధం, గౌరవాలను కూడా ప్రకటించేలా ఉంది. సంప్రదాయం, ప్రేమకు చిహ్నంగా "అత్తమ్మ కిచెన్"ని నిలబెట్టాలని ఉపాసన కాంక్షిస్తున్నారు. వ్యవస్థాపక ప్రపంచంలో కుటుంబ బంధాలు, సంప్రదాయాలను కాపాడేందుకు ఉపాసన, సురేఖ కొణిదెల చేస్తున్న ప్రయత్నాలను ప్రతీకగా "అత్తమ్మ కిచెన్" నిలుస్తుంది. సురేఖ కొణిదెల పుట్టినరోజున వారు ఈ వెంచర్‌కు ప్రారంభించారు. ఇంట్లో వండిన ఈ భోజనాన్ని, ఒక్కో వంటకం రుచిని అనుభవించమని అందరినీ ఆహ్వానిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో (athammaskitchen.com) అందుబాటులో ఉన్నాయి. ఉప్మా,పొంగల్,పులిహార,రసం వంటి ఉత్పత్తులు ప్రస్తుతం విక్రయిస్తున్నారు. ఈ నాలుగు ప్యాకెట్ల ధర రూ. 1,099 ఉంది. ఆన్లైన్లో డబ్బు చెల్లించి వాటిని పొందవచ్చు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తమ ఆహార ఉత్పత్తులు అందుతాయిని వారు తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం మెగాస్టార్ సతీమణి చేసిన రెసిపీని మీరు ఆస్వాదించండి. అత్తమ్మాస్ కిచెన్ గురించి ఏం చెప్పారంటే సురేఖ కొణిదెల పుట్టినరోజున ప్రారంభించారు. ఉపాసన కొణిదెల నేతృత్వంలోని "అత్తమ్మ కిచెన్" ప్రొడక్ట్స్‌లో, కొణిదెల ఇంటి సంప్రదాయ వంటకాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ వెంచర్ వారి ప్రత్యేకమైన వంటకాలకు నిదర్శనంగా నిలుస్తుంది. ఇంట్లో వండిన ఆహారాన్ని తినాలనుకునే వారికి ప్రియమైన పేరుగా మారాలనే లక్ష్యంతో ఉంది. ఈ ప్రొడక్ట్స్ కోసం దిగువ లింక్‌లను అనుసరించండి: వెబ్సైట్: www.athammaskitchen.com వాట్సప్:http://api.whatsapp.com/send?phone=919866589955&text=Hi ట్విట్టర్:https://twitter.com/athammaskitchen ఇన్ స్టాగ్రాం: https://www.instagram.com/athammaskitchen ఫేస్ బుక్: https://www.facebook.com/people/Athammas-Kitchen View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
భార్య సురేఖ కోసం ‘చిరు’ కవిత.. మెగాస్టార్ పోస్ట్ వైరల్
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. తన సినిమా అప్డేట్స్తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటాడు. తన కుటుంబంలో ఏదైన సంతోషకరమైన వార్త ఉన్నా కూడా దాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటాడు. అప్పుడప్పుడు తనలో దాగి ఉన్న కవిని కూడా సోషల్ వీడియా వేదికగా బయటకు తీస్తుంటాడు. గతంలో ఆకాశం గురించి అద్భతమైన కవితను అందరిని ఆశ్చర్యపరిచాడు చిరంజీవి. ఇక తాజాగా తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఓ ‘చిరు’కవిత రాసి శుభాకాంక్షలు తెలిపాడు. నేడు(ఫిబ్రవరి 18) సురేఖ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ.. ‘నా జీవన రేఖ..నా సౌభాగ్య రేఖ..నా భాగస్వామి సురేఖ !’అంటూ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. మంచి ప్రాసతో కూడిన ఈ కవితకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. చిరంజీవి ప్రస్తుతం యూఎస్ ట్రిప్‌లో ఉన్నాడు. సురేఖ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమే ఈ ట్రిప్ వేసినట్లు తెలుస్తోంది. సురేఖ-చిరుల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) -
త్వరలోనే మళ్లీ కలుస్తా.. మెగాస్టార్ పోస్ట్ వైరల్!
భోళాశంకర్ తర్వాత మెగాస్టార్ నటిస్తోన్న చిత్రం విశ్వంభర. ఈ సినిమాకు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. చిరంజీవి సరసన త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీ యూవీ క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. అయితే ఈ సినిమా కోసమే మెగాస్టార్ తీవ్రమైన కసరత్తులు చేశారు. జిమ్‌లో కష్టపడుతున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. చిరంజీవి దీంట్లో భీమవరం దొరబాబుగా కనిపించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. 2025 సంక్రాంతికి విశ్వంభర విడుదల కానుంది. అయితే ఇవాళ వాలెంటైన్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. అంతే కాకుండా తన భార్య సురేఖతో కలిసి హాలిడే ట్రిప్‌కు యూఎస్ఏ వెళ్తున్నట్లు వెల్లడించారు. మళ్లీ త్వరలోనే విశ్వంభర షూట్లో కలుస్తానంటూ ట్వీట్ చేశారు. ఇది చూసిన మెగా ఫ్యాన్స్ చిరు దంపతులకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Off to USA for a short holiday with my better half Surekha. Will resume shoot of #Vishwambhara as soon as I get back! See you all soon! And of course Happy Valentines Day to All 💝 !! pic.twitter.com/zAAZVHjjFG — Chiranjeevi Konidela (@KChiruTweets) February 14, 2024 -
తండ్రి అయిన ‘బిగ్‌బాస్’ అర్జున్.. ఏం పేరు పెట్టారంటే..?
బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ అర్జున్ అంబటి తండ్రి అయ్యాడు. అర్జున్ భార్య సురేఖ ఈ రోజు (జనవరి 9) పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అర్జున్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన కూతురుకి ఆర్ఖా అని నామకరణం చేశాడు. కూతురు పుట్టినా, కొడుకు పుట్టినా ఈ పేరునే పెట్టుకుంటానని బిగ్‌బాస్ హౌస్‌లోనే చెప్పాడు అర్జున్. తన పేరులోని ఆర్.. సురేఖ పేరులో నుంచి ఖ తీసుకొని అర్ఖా అని పేరు ఫిక్స్ చేసినట్లు ఓ వీకెండ్ ఎపిసోడ్లో చెప్పాడు. అయితే తనకు మాత్రం కూతురు పుట్టాలనే ఉందని చెప్పాడు. అనుకున్నట్లే అర్జున్‌కి కూతురే పుట్టింది. దీంతో అర్జున్ ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. అర్జున్-సురేఖ దంపతులకు సినీ ప్రముఖులతో పాటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, పలు సీరియళ్లలో హీరోగా నటించిన అర్జున్.. బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొని తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. షో ప్రారంభమైన ఐదు వారాల తర్వాత అర్జున్ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు త్వరగానే ఎలిమినేట్ అయ్యారు. కానీ అర్జున్ మాత్రం చివరి వరకు ఉన్నాడు. ఫినాలే రోజు టాప్ 6 ప్లేస్‌లో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం బుల్లితెరపై షోలు, సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. త్వరలోనే ఓ సినిమాలో హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Nagarjuna Reddy Ambati (@ambati_arjun) -
ఒకప్పుడు ముగ్గురూ మిత్రులే.. ఇప్పుడు ముగ్గురూ ప్రత్యర్థులు!
'రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు.. శాశ్వత మిత్రులూ ఉండరు. ఈ నానుడికి ఆ నియోజకవర్గం నిలువెత్తు సాక్ష్యంగా మారింది. ఇప్పుడు అక్కడ పోటీ చేస్తున్న ముగ్గురు నేతలు ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండేవారు. తాజా ఎన్నికల్లో మూడు పార్టీల తరపున ఆ ముగ్గురే పోటీ చేస్తున్నారు. త్రిముఖ పోరు తీవ్రస్థాయిలో జరుగుతున్న ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ నాయకులు ఎవరు?' అసెంబ్లీ ఎన్నికల కాలంలో తెలంగాణ పాలిటిక్స్ హాట్ హాట్‌గా సాగుతున్నాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులూ.. శాశ్వత శత్రువులూ ఉండరని అంటారు. నిన్న మిత్రులుగా ఉన్న వారు ఇప్పుడు ప్రత్యర్ధులుగా మారి ఉండొచ్చు. ప్రత్యర్ధులు ఏకతాటిపైకి వచ్చి ఉండొచ్చు. ఇప్పటి తరం నాయకులు ఒకే పార్టీని పట్టుకుని వేలాడటంలేదు. పొద్దున టిక్కెట్ రాలేదంటే సాయంత్రానికి కండువా మార్చేస్తున్నారు. సాయంత్రం టికెట్ ఇస్తానంటే ఉదయానికి పార్టీ మార్చేస్తున్నారు. జెండాలు, రంగులు మార్చేయడం చాలా ఈజీగా మారిపోయింది. రాజకీయ కమిట్మెంట్, కేడర్ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉండడం ఒకప్పటి మాట. ఇప్పుడంతా అధికారం, పదవి ముఖ్యం అన్నట్లుగా పార్టీలు మార్చేస్తున్నారు. గులాబీ పార్టీలో కొనసాగి.. ఇప్పుడు చెరోదారి! హైదరాబాద్ తర్వాత అతిపెద్ద నగరమైన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రాజకీయాలు చిత్ర విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. వరంగల్ తూర్పులో బీఆర్ఎస్ నుంచి సిటింగ్ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి కొండా సురేఖ, బీజేపీ నుంచి ఎర్రబెల్లి ప్రదీప్ రావు బరిలో ఉన్నారు. 2014లో ఈ ముగ్గురు నాయకులు గులాబీ పార్టీలో కొనసాగారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పరకాల ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి 2018 వరకు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తర్వాత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి మళ్ళీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. బీఆర్ఎస్ తరపున వరంగల్ నగరంలో కార్పొరేటర్‌గా గెలిచిన నన్నపునేని నరేందర్‌ను మేయర్ పదవి వరించింది. గత ఎన్నికల్లో నరేందర్ వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. కారు దిగి కమలం గూటికి.. 2014 ఎన్నికలకు ముందు తెలంగాణ సాధన సమితిలో సాగిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యేగా కొండా సురేఖ, కార్పొరేటర్ గా నరేందర్ ఎన్నికల్లో గెలిచేందుకు తన వంతు సహకారం అందించారు. 2018లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రదీప్ రావును ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ ఆయన ఆశలపై గులాబీ పార్టీ అధిష్టానం నీళ్ళు చల్లింది. నన్నపునేని నరేందర్‌కు టికెట్ ఇవ్వడంతో ప్రదీప్‌రావు నిరుత్సాహం చెందారు. నీకు మంచి గుర్తింపు ఇస్తామని పార్టీ నాయకత్వం హామీ ఇవ్వడంతో అప్పుడు ఎన్నికల్లో తప్పుకున్నారు. ఆ తర్వాత పార్టీలో గుర్తింపు లేకపోవడం, ఎలాంటి పదవులు రాకపోవడంతో.. కొన్ని నెలల క్రితం కారు దిగి కమలం గూటికి చేరారు ఎర్రబెల్లి ప్రదీప్ రావు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధిగా కొండ సురేఖ, బీజెపి అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు, బీఆర్ఎస్ అభ్యర్థిగా నన్నపునేని నరేందర్ బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల వరకు వీరంతా ఒకే పార్టీలో పనిచేసి.. ఒకే స్టేజి పైన కూర్చున్నారు. ఇప్పుడు నన్నపునేని గులాబీ నీడనే ఉండగా.. కొండా సురేఖ, ప్రదీప్‌రావు జెండాలు మార్చారు. ఒకే నియోజకవర్గంలో ముగ్గురూ ప్రత్యర్థులుగా మారి పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ముగ్గురూ మిత్రులే.. ఇప్పుడు ముగ్గురూ ప్రత్యర్థులు. మరి వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో చూడాలి. ఇవి చదవండి: 'హస్తం'లో.. చివరి నిమిషం వరకు.. వీడని నామినేషన్ల గందరగోళం! -
Chiranjeevi And Surekha Photos: అర్ధాంగితో చిరంజీవి అమెరికా ట్రిప్ (ఫోటోలు)
-
శ్రీశైలం మల్లీఖార్జున స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ సతీమణి సురేఖ
-
శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న మెగాస్టార్ సతీమణి సురేఖ
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు నేడు. మహాశివరాత్రి రోజే ఆమె బర్త్‌డే రావడం విశేషం. ఫిబ్రవరి 18న ఆమె బర్త్‌డే, శివరాత్రిని పురస్కరించుకుని ఇవాళ శ్రీశైలం మల్లిఖార్జున స్వామిని ఆమె దర్శించుకున్నారు. ఆమెతో పాటు పెద్ద కూతురు సుస్మిత కొణిదెల కూడా ఉన్నారు. తల్లి సురేఖతో మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్న వీడియోను సుష్మిత తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక, చిరు దంపతుల పెద్ద కుమార్తె సుష్మిత కాస్టూమ్ డిజైనర్ అనే విషయం తెలిసిందే. తండ్రి చిత్రాలకు ఆమె కాస్టూమ్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. -
వదినగా మీరున్నందుకు చాలా సంతోషం: బండ్ల గణేశ్
టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. మెగా ఫ్యామిలీ పట్ల ఆయనకు ప్రత్యేక అభిమానం ఉంది. తాజాగా ఇవాళ చిరంజీవి సతీమణి సురేఖ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు బండ్ల గణేశ్. ఈ మేరకు తన ట్విటర్లో చిరంజీవి దంపతుల ఫోటోను షేర్ చేశారు. బండ్ల గణేశ్ తన ట్విటర్లో రాస్తూ..'సీతాదేవి అంత ఓర్పు. భూదేవంత గొప్పతనం. లక్ష్మీదేవి లాంటి నవ్వు. రాముడి లాంటి భర్తకు అర్ధాంగిగా.. వజ్రం లాంటి బిడ్డకు తల్లిగా.. ఎందరో లక్ష్మణులకు వదినగా మీరుండటం మాకెంతో సంతోషం. ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరున్ని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు' అంటూ సురేఖ , చిరంజీవి దంపతులు ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. సీతాదేవి అంత ఓర్పు భూదేవంత గొప్పతనం లక్ష్మీదేవి లాంటి నవ్వు రాముడి లాంటి భర్తకు అర్ధాంగిగా, వజ్రంలాంటి బిడ్డకు తల్లిగా, ఎందరో లక్ష్మణులకు వదినగా మీరుండటం మాకెంతో సంతోషం.. ఇలాంటి జన్మదినాలు మీరు ఎన్నో జరుపుకోవాలని ఆ పరమేశ్వరున్ని మనసారా కోరుకుంటూ.. @KChiruTweets pic.twitter.com/OWf6Gw69KY — BANDLA GANESH. (@ganeshbandla) February 18, 2023 -
కలెక్టర్ సంబంధం కాదని చిరంజీవినే పెళ్లాడిన సురేఖ!
కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి.. అన్న మాటను మెగాస్టార్ చిరంజీవి తు.చ. తప్పకుండా పాటించాడు. కష్టపడి నటుడైతే సరిపోదు, స్టార్ హీరోగా ఎదిగి ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకోవాలి అనుకున్నాడు. స్టార్ హీరో ఏంటి? ఏకంగా మెగాస్టార్‌గా ఎదిగాడు. ఇండస్ట్రీ పెద్దను కాదంటూనే చిత్రపరిశ్రమలోని బరువులను, బాధ్యతలను తన భుజాన వేసుకుని మోస్తుంటాడీ గ్యాంగ్ లీడర్. లెక్కలేనన్ని సాయాలు చేసి మనసున్న మారాజుగానూ పేరు తెచ్చుకున్నాడు. ఈ రోజు చిరు పుట్టినరోజు కావడంతో మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్లో సంబరాలు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే చిరంజీవి పెళ్లి స్టోరీ కోసం ఆరా తీస్తున్నారు అభిమానులు. మరి వారిది ప్రేమ పెళ్లా? పెద్దలు కుదిర్చిన వివాహమా? చదివేద్దాం.. చిరంజీవి ఓసారి తన స్నేహితుడు బి.సత్యనారాయణను అతడి పెదనాన్నగారింట్లో దింపేశాడు. వాళ్ల పెదనాన్న ఎవరో కాదు అల్లు రామలింగయ్యగారు. అప్పటికే చిరు ఆయనతో కలిసి మూడు సినిమాల్లో నటించడంతో ఇంట్లోకి వెళ్లాడు. కానీ, అప్పుడు రామలింగయ్యగారు లేరు, అయితే తన స్నేహితుడు కాఫీ తాగి వెళ్దువు అన్నాడు. లోపల కాఫీ పెట్టింది సురేఖ. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోలేదప్పుడు. కానీ చిరంజీవి వెళ్లాక ఆ అబ్బాయి ఎవరు? అని సురేఖ ఆరా తీయగా మనవూరి పాండవులులో నటించాడని చెప్పాడు బి.నారాయణ. తర్వాత అల్లు అరవింద్ తన గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. అయితే అల్లు రామలింగయ్యగారికేమో వాళ్లమ్మాయిని కలెక్టర్కిచ్చి పెళ్లి చెయ్యాలనుండేదట. దాంతో కలెక్టర్‌కు ఇవ్వాలా? లేదా చిరంజీవికి ఇచ్చి పెళ్లి జరిపించాలా? అని అల్లు ఫ్యామిలీ ఆలోచనలో పడింది. సురేఖ ఎవరిని ఓకే అంటే వారితోనే పెళ్లి జరిపేద్దామని డిసైడయ్యారట. కానీ చిరంజీవి ఆంజయనేయభక్తుడు, చెడు అలవాట్లు లేవు, బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడతాడు అని చాలామంది మంచి సర్టిఫికెట్ ఇవ్వడం, దీనికి తోడు మేకప్‌మెన్ జయకృష్ణ అల్లు రామలింగయ్యగారిని దగ్గరుండి కన్విన్స్ చేయడంతో తన పెళ్లికి మొదటి అడుగు పడిందని చిరంజీవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సుమారు పది మంది నిర్మాతల దగ్గర చిరంజీవి గురించి తెలుసుకున్నాకే అతడికి సురేఖను ఇచ్చి చేయడానికి ఓకే అన్నాడట. కానీ అప్పుడే పెళ్లేంటని చిరంజీవి తటపటాయించినా ఆయన తండ్రి మాత్రం బలవంతంగా అతడిని పెళ్లిచూపులకు తీసుకెళ్లారు. మరోవైపు ‘మన వూరి పాండవులు’ చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు’. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుంటే బాగుంటుంది అనుకుందట సురేఖ. అలా తొలిసారి కలిసినప్పుడు చూసుకోకపోయినా ఇద్దరికీ ముడిపడింది. ఫిబ్రవరిలో బ్రహ్మాండమైన ముహూర్తాలుండటంతో లగ్నపత్రిక రాసేశారు. అలా చిరంజీవి- సురేఖల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. ఈ ఆదర్శ దంపతులకు రామ్‌చరణ్‌తో పాటు శ్రీజ, సుష్మిత అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చదవండి: వన్ అండ్ ఓన్లీ 'మెగాస్టార్' చిరంజీవి ‘మెగాస్టార్’ అంటే ఓ బ్రాండ్.. మరి ఈ బిరుదు ఎలా వచ్చిందో తెలుసా? -
ఘనంగా కొణిదెల హీరో పవన్ తేజ్ యాంకర్ మేఘన నిశ్చితార్థం (ఫోటోలు)
-
హీరోయిన్‌తో కొణిదెల హీరో నిశ్చితార్థం, ఫొటోలు వైరల్
కొణిదెల హీరో పవన్ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి, యాంకర్ మేఘన మెడలో మూడుముళ్లు వేయనున్నాడు. బుధవారం ఇరుకుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ వేడుకకు చిరంజీవి సతీమణి సురేఖ, నటుడు సాయిధరమ్ తేజ్ సహా తదితరులు హాజరయ్యారు. తన ఎంగేజ్మెంట్ ఫొటోను పవన్‌తేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'నేను ఆమెను ప్రేమిస్తున్నాను, నాకు ప్రేమ అంటే ఏంటో ఆమె వల్లే తెలిసింది. మా ఇద్దరి ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని' రాసుకొచ్చాడు. అటు మేఘన కూడా.. 'నా ప్రేమను కనుగొన్నాను, అతడితో నిశ్చితార్థం కూడా జరిగింది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతోంది, కానీ నా చేతులు బరువెక్కుతున్నాయి. ఇక నా జీవితం అంతా నీకే సొంతం' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. కాగా పవన్ తేజ్‌కు.. మెగాస్టార్ చిరంజీవి బాబాయ్ అవుతాడు. ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాతో హీరోగా ఆకట్టుకున్నాడు పవన్. ఇందులో హీరోయిన్గా మేఘన నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడ్డట్లు తెలుస్తోంది. వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపడంతో త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. కాగా పవన్ తేజ నటుడిగా రాణించేందుకు ప్రయత్నిస్తుండగా మేఘన బుల్లితెర షో యాంకర్‌గా అలరిస్తోంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) View this post on Instagram A post shared by Megganna (@m_y_megganna) View this post on Instagram A post shared by Pavan Tej Konidela (@pavantej_konidela) View this post on Instagram A post shared by Pavan Tej Konidela (@pavantej_konidela) చదవండి: తాప్సీ మూవీని నిషేధించి, గుణపాఠం చెప్దామంటున్న నెటిజన్లు ఘనంగా ప్రముఖ సీరియల్ నటి సీమంతం, ఫొటోలు వైరల్ -
భార్యతో విదేశాలకు చిరంజీవి టూర్.. నెల తర్వాత ఇంటికి..
చిరంజీవి బ్యాక్ టు హోమ్. గత నెల 3న తన సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి విదేశాలకు విహార యాత్రకు వెళ్లారు. నెల రోజుల హాలిడే తర్వాత శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. వెకేషన్లో ఫుల్‌గా రిలాక్స్ అయిన చిరంజీవి ఇక షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. ప్రస్తుతం మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’, బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’, మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఈ మూడు సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనడానికి ప్లాన్ చేసుకున్నారు. ‘గాడ్ ఫాదర్’లోని ఓ సాంగ్ సీక్వెన్స్, ‘బోళా శంకర్’ షూట్, ‘వాల్తేరు వీరయ్య’ ఫారిన్ షెడ్యూల్లో చిరంజీవి పాల్గొంటారట. ఇక ఈ రెండు సినిమాలే కాక.. చిరంజీవి హీరోగా ‘ఛలో’, ‘భీష్మ’ చిత్రాల ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. చదవండి: చిరంజీవితో ఏ గొడవ లేదు.. వారే దూరం పెంచుతున్నారు: జీవిత ఆ సినిమా నా కంటే వెంకటేశ్ చేస్తేనే బాగుండేది : చిరంజీవి var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4311451212.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
హాలీడే మూడ్‌లో చిరంజీవి.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్ కామెంట్
వరుస సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరంజీవి.. ‘ఆచార్య’ విడుదల తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చాడు. భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘కరోనా పాండమిక్ తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా’ అంటూ సురేఖతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. చిరంజీవి పోస్ట్‌పై ఆయన కూతురు శ్రీజతో పాటు కోడలు ఊపాసన కూడా స్పందించారు. ‘ఎంజాయ్ అమ్మ అండ్ డాడీ, ఐలవ్ యూ సో మచ్’అని శ్రీజ, ‘హ్యాపీ టైమ్ అత్తయ్య, మామయ్య’ అని ఉపాసన కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ మేకింగ్ లో భోళాశంకర్, మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ , బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిల్లో గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చెల్లెళ్లకు చిరంజీవి కోట్ల ఆస్తులు గిఫ్ట్!
మెగాస్టార్ చిరంజీవి మనసు ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది సాయం చేశారాయన. అయితే తను ఒక హీరోగా, మంచి వ్యక్తిగా నిలదొక్కుకోవడానికి భార్య సురేఖనే కారణం అంటారాయన. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సురేఖ గొప్పతనాన్ని వివరిస్తూ ఉప్పొంగిపోయారు చిరు. 'కోకాపేటలో నాకు కొన్ని ఎకరాల స్థలం ఉంది. అక్కడ ఒక ఫామ్‌హౌస్ కట్టుకుని పొలం పనులు చేసుకుందామనుకున్నా. ఇప్పుడా భూమి ధర కోట్లు పలుకుతోంది. విషయమేంటంటే.. నా చెల్లెళ్లకు ఇళ్లు కట్టించాను, వారి బిడ్డల భవిష్యత్తు చూసుకున్నాను. వాళ్లు కూడా మంచి స్థాయికి ఎదిగారు. ఇప్పుడు వారికి ఏమీ చూసుకోనవసరం లేనంత స్థితిలో ఉన్నారు.' 'కానీ సురేఖ.. ఎలాగో మన దగ్గరున్న భూమి ధర రేటు పెరిగింది కదా, అందులో కొంత మీ చెల్లెళ్లకు ఇస్తే బాగుంటుంది అని చెప్పింది. ఏ మహిళ కూడా ఆడపడుచులకు అంత ఆస్తి ఇవ్వాలనుకోదు, కానీ సురేఖ.. ఆ భూమి నా చెల్లెళ్లకు ఇస్తే భవిష్యత్తులో వారికి ఆసరాగా ఉంటుందని భావించింది. మంచి సలహా ఇచ్చావని మెచ్చుకున్నాను, ఆ తర్వాత పనిలో పడి మర్చిపోయాను. రక్షా బంధన్‌కు కొన్ని రోజుల ముందు మరోసారి ఆమె ఈ విషయాన్ని గుర్తు చేసింది. ఆ రెండెకరాలు రాఖీ పండగ రోజు బహుమతిగా ఇవ్వండి అని చెప్పి అన్ని పనులు తనే పూర్తి చేసింది. పండగ రోజు రాఖీ కట్టినప్పుడు స్థలం డాక్యుమెంట్లు చెల్లెళ్లకు ఇవ్వడంతో వారు షాక్ తిన్నారు' అంటూ సురేఖ గొప్పతనాన్ని చెప్పుకొచ్చారు చిరంజీవి. -
మెగా ఫ్యాన్స్‌కు షాక్, అది ఫేక్ అట!
మెగాస్టార్ చిరంజీవి సతీమణి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తల్లి సురేఖ కొణిదెల రీసెంట్గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిందంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సురేఖ కొణిదేల పేరుతో ట్విటర్ ఖాతా దర్శనమిచ్చింది. అంతేకాదు తన తొలిపోస్ట్ తనయుడి గురించే షేర్ చేయడంలో మెగా ఫ్యాన్స్ సంతోషం మరింత రెట్టింపు అయ్యింది. దీంతో వరసగా మెగా ప్యాన్స్, నెటిజన్లు ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టారు. చదవండి: సాయి పల్లవి యాడ్ రిజెక్ట్ చేయడంపై స్పందించిన సుకుమార్ ఈ క్రమంలో కొద్ది గంట్లోనే ఈ ఫ్రొఫైల్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 2 వేలు దాటింది. ఇదిలా ఉంటే. ఇప్పుడు వారందరికి షాకిస్తూ ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. చూస్తుంటే ఇది తన నిజమైన ఖాతా కాదని తెలింది. ఎందుకంటే ఈ ఫ్రొఫైల్‌ను మెగా కుటుంబంలోని ఏ ఒక్కరూ ఫాలో కావడం లేదు. అంతేకాదు సురేఖ కొణిదెల ఇంటి పేరులో స్పెల్లింగ్ మిస్టెక్ కూడా ఉంది. చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ ఇది మెగా ఫ్యాన్ పని అని, ఎవరో సురేఖ పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి.. తల్లికొడుకుల ఫొటోను షేర్ చేసిన అభిమానం చాటుకున్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై మెగా కుటుంబం ఎలా స్పందిస్తుందో చూడాలి. కాగా ‘నా సూపర్ స్టైలిష్ కొడుకుతో నా మొదటి పోస్ట్‌తో ట్విటర్లో చేరినందుకు సంతోషంగా ఉంది’అంటూ ఈ పోస్ట్‌ను షేర్ చేయండంతో ఇది నిజమైన అకౌంట్ అనుకుని అంతా భ్రమపడ్డారు. ఇదిలా ఉంటే గతంలో కూడా సోషల్ మీడియాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి పేరుతో కూడా ఫేక్ అకౌంట్ దర్శమించిన సంగతి తెలిసిందే. Happy To Join On Twitter My First Post With Super Stylish Son @AlwaysRamCharan #RamCharan #RamCharan𓃵 #RRR. pic.twitter.com/BviB9PnvGP — Surekha Konidala (@SurekhaKonidala) February 26, 2022 -
సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి భార్య.. ఫస్ట్ పోస్ట్ ఎంటంటే?
Surekha Konidela Opened An Account In Twitter: సోషల్ మీడియాలో అనేకమంది తారలు యాక్టివ్‌గా ఉంటారు. తమకు సంబంధించిన మూవీ అప్డేట్స్, సరదా సన్నివేశాలు, మోస్ట్ మెమొరబుల్ థింగ్స్‌ను అభిమానులతో పంచుకుంటారు. నెటిజన్లు, ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ఒక మంచి ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియా. ఇటీవల ప్రతీ ఒక్కరూ సామాజిక మాధ్యమాల్లో ఖాతాలు తెరుస్తున్నారు. ఇటీవలే బాలీవుడ్ నిర్మాత, అతిలోక సుందరి శ్రీదేవి భర్త బోనీ కపూర్ ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. ట్విటర్లో అడుగుపెట్టిన సురేఖ కొణిదెల తన ఫస్ట్ పోస్ట్‌ను షేర్ చేశారు. రామ్ చరణ్‌తో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. నా సూపర్ స్టైలిష్ కొడుకుతో నా మొదటి పోస్ట్‌తో ట్విటర్లో చేరినందుకు సంతోషంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25న విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే చిరంజీవి ఆచార్య ఏప్రిల్ 29న రిలీజ్ కానుండగా గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. Happy To Join On Twitter My First Post With Super Stylish Son @AlwaysRamCharan #RamCharan #RamCharan𓃵 #RRR. pic.twitter.com/BviB9PnvGP — Surekha Konidala (@SurekhaKonidala) February 26, 2022 -
చిరిగిన బట్టలతో తాళి కట్టిన చిరంజీవి.. ఎందుకంటే
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్లో అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. స్వయంకృషితో ఒక్కో మెట్టూ ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు.1978లో పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తనదైన నటన, డ్యాన్సు స్టెప్పులతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. కెరీర్లో ఎదుగుతున్న సమయంలో ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం జరిగింది. అయితే అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరుకి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటని అల్లు రామలింగయ్య వద్ద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారట. అయినా ఇవేం పట్టించుకోని ఆయన చిరంజీవి కష్టపడే తత్వాన్ని గుర్తించి ఎప్పటికైనా అతడు స్టార్ హీరో అవుతాడని నమ్మకంతో చెప్పేవారట. ఆ దిశగా చిరును ఎంతగానో ప్రోత్సహించేవారట. ఇక ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి నాటి సంగతులను గుర్తుచేసుకున్న చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'పెళ్లి సమయానికి తాతయ్య ప్రేమ లీలలు అనే సినిమా చేస్తున్నా. అందులో నూతన్ ప్రసాద్‌కు నాకూ కొన్ని కీలక సీన్లు ఉన్నాయి. అప్పటికి ఆయన ఫుల్ బిజీ ఆర్టిస్టు కావడంతో ఆయన డేట్స్ కోసం పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమోనని అనుకున్నాం. కానీ నిర్మాత షూటింగ్‌ని వాయిదా వేసి మా పెళ్లికి గ్యాప్ ఇచ్చారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చొనేటప్పటికి నా చొక్కా చిరిగిపోయింది. అది చూసి సురేఖ వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా అని అడిగింది. ఏం బట్టలు చిరిగితే తాళి కట్టలేనా అని చెప్పి అలాగే కట్టేశాను' అంటూ ఆనాటి ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. -
శ్రీ గోదారంగనాథుల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న చిరంజీవి దంపతులు
ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండగ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రెటీలు ఏపీకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలకృష్ణ ప్రకాశం జిల్లాలోని కారంచేడులో తన సోదరి పూరందేశ్వరి ఇంట్లో బంధువులతో కలిసి సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇక నిన్న(శుక్రవారం) మెగాస్టార్ చిరంజీవి కృష్ణా జిల్లా డోకిపర్రుకి మెగాస్టార్ సతీసమేతంగా వచ్చారు. భోగి సందర్భంగా డోకిపర్రులోని ప్రముఖ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన శ్రీ గోదారంగనాథుల కల్యాణ వేడుకల్లో చిరు ఆయన భార్య సురేఖ దంపతులు పాల్గొన్నారు. ఆలయ వర్గాలు, వేదపండితులు చిరంజీవి దంపతులకు స్వాగతం పలికారు. వేదపండితులు, దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్తలు పి.పి.రెడ్డి, కృష్ణారెడ్డి, యంపి.వల్లభనేని బాలశౌరి పూర్ణకుంభంతో చిరు దంపతులకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ముద్రించిన కొత్త సంవత్సరపు క్యాలెండర్, డైరీలను చిరంజీవి ఆవిష్కరించారు. ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గోదాదేవి కళ్యాణ ఉత్సవంలో పాల్గొనడం తన అదృష్టమని, తెలుగు ప్రజలు సుఖ శాంతులతో ఉండాలని కోరుతూ.. సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కళ్యాణం అనంత్సరం చిరంజీవి,సురేఖ దంపతులు డోకిపర్రు గ్రామంలో బస చేశారు. ఈ రోజు ఉదయం (శనివారం) ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ కు చేరుకున్నారు. -
క్రికెట్ దిగ్గజంతో చిరంజీవి దంపతుల సెల్ఫీ
Chiranjeevi Meets Kapil Dev: ప్రముఖ హీరో చిరంజీవి, ప్రఖ్యాత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ హైదరాబాద్‌లోని ఓ హోటల్లో కలుసుకున్నారు. ఈ సందర్భంగా తాము కలిసి దిగిన ఫోటోలను ఆదివారం సోషల్ మీడియాలో షేర్ చేశారు చిరంజీవి. ‘‘చాలాకాలం తర్వాత నా మిత్రుడు కపిల్‌దేవ్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది.. పాత జ్ఞాపకాలను ఓసారి గుర్తుచేసుకున్నాం’’ అన్నారు చిరంజీవి. Wonderful meeting my old friend @therealkapildev after a long time. The exquisite #FalaknumaPalace setting made it even more special. Travelled back in time at multiple levels & Fondly recalled old memories.He is very much the #HaryanaHurricane who won us our #FirstWorldCup pic.twitter.com/Y4Ezfhp65j — Chiranjeevi Konidela (@KChiruTweets) August 29, 2021 -
'చిన్నారి పెళ్లికూతురు' బామ్మ చేసిన మొదటి ఉద్యోగం ఇదే..
ఆమె నానమ్మగా వేసిన ‘బాలికా వధు’ 2248 ఎపిసోడ్స్‌తో దేశంలోనే సుదీర్ఘంగా సాగిన టీవీ సీరియల్‌గా రికార్డు స్థాపించింది. మొన్నటి ‘బధాయి హో’ సినిమాలో 50 ఏళ్ల కోడలు గర్భం దాలిస్తే ఆ కోడలిని అత్తగారి పాత్రలో ఆమె అక్కున చేర్చుకున్న తీరు అద్భుతం. సురేఖ సిక్రి (75) అంటే నాటక, టీవీ, సినిమా రంగంలో ఒక విశిష్టమైన పేరు. ఒక పరంపరకు ప్రతినిధి. సిక్రి శుక్రవారం కన్ను మూసింది. ఆమెకు నివాళి. దూరదర్శన్‌లో విఖ్యాతమైన ‘తమస్’ సీరియల్లో ఒక దృశ్యం. ఒక వృద్ధ సిక్కు జంట నిలువ నీడ లేక ఒక ఇంటి తలుపు తడుతుంది. ఆ సిక్కు జంటకు ఇల్లు లేదు. దారి లేదు. గమ్యం లేదు. దేశంలో దారుణమైన అల్లర్లు జరుగుతున్నాయి. ఎవరు ఎవరిని హత మారుస్తున్నారో తెలియదు. పోనీ ఎందుకు హతమారుస్తున్నారో తెలియదు. మనిషి కళ్లేలు ఉన్నంత వరకే మనిషి. వదిలితే మృగం. ఆ వృద్ధజంటను గడప దగ్గర చూసిన ‘రాజో’ అనే ముస్లిం మహిళ పాత్రలో ఉన్న సురేఖ సిక్రి ‘మా ఇంట్లో చోటు లేదు వెళ్లండి’ అంటుంది. వాళ్లు నిరాశతో తిరిగి వెళ్లిపోతుంటే తమాయించుకోలేక ‘ఆశపడి వచ్చారు ఆ పై గదిలో దాక్కోండి’ అని చోటు ఇస్తుంది. అన్నం పెడుతుంది. ‘నా మొగుడికి దేవుడంటే భయం ఉంది. మిమ్మల్ని ఏమి అనడు. కాని నా కొడుకు సంగతి చెప్పలేను’ అని తాపత్రయ పడుతుంది. కొడుకు వస్తాడు. ఈ సిక్కు జంటను చూసి మండిపడతాడు. వాళ్లను వెళ్లగొట్టడానికి ప్రయత్నిస్తాడు. కాని ఒక హృదయమున్న స్త్రీ, సిక్రి, ఊరుకుంటుందా? బెబ్బులిలా తిరగబడుతుంది. ఆ ముసలి జంట పక్షాన నిలుస్తుంది. ఆ సన్నివేశంలో సురేఖా సిక్రి నటన చూడాలి. అలాంటి ఇలాంటి నటన కాదు. 2018లో వచ్చిన సూపర్‌హిట్ సినిమా ‘బధాయి హో’లో సురేఖ సిక్రి చివరి రోజులలో ఉన్న వృద్ధురాలు. ఇంటి పెద్ద. కొడుకు, కోడలు, వయసొచ్చిన మనవలు... అలాంటి టైమ్‌లో, 50 ఏళ్ల వయసులో కోడలు గర్భం దాల్చిందన్న వార్త ఆమెకు తెలుస్తుంది. ఇదేమి చోద్యం? ఈ వయసు లో. కొడుకును తిట్టిపోస్తుంది. కోడల్ని గదిలో వేసి తాళం పెడుతుంది. అయ్యో.. ఏమి ఖర్మరా అని బాధ పడుతుంది. కాని తల్లి గర్భం దాల్చిందని నామోషీ ఫీలైన పెద్ద కొడుకు ఆమెకు దూరంగా ఉంటున్నాడన్న విషయం తెలుసుకుని, ఒక సహజమైన సహజాతమైన విషయానికి కోడలు మాటలు పడుతోందని సాటి స్త్రీగా అర్థం చేసుకొని తానే మొదట ఆ గర్భాన్ని అంగీకరించి ఆహ్వానిస్తుంది. మన ఇళ్లల్లో కనిపించే వృద్ధుల మనస్తత్వాన్ని, రూపాన్ని, స్వభావాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తుంది సురేఖ సిక్రి ఆ పాత్రలో. ఏళ్ల తరబడి ‘కలర్స్ టీవీ’లో ఆ తర్వాత డబ్బింగ్ ద్వారా ప్రాంతీయ భాషలలో ప్రసారమైన ‘బాలికా వధు’లో ఆమె నానమ్మ పాత్రలో నటించింది. ఆమె ఆ కథలో ఎంత సేపటికి తన మనవడి పక్షం. అందుకని ఆ మనవణ్ణి చేసుకున్న చిన్నారిని అదలిస్తుంది. బెదిరిస్తుంది. దారికి తేవడానికి చూస్తుంది. కాని కథ గడిచే కొద్దీ మనవడు సరైన వాడు కాదని గ్రహించి చిన్నారి పెళ్లి కూతురుకు పెద్ద సపోర్ట్‌గా మారుతుంది. అంతేకాదు ఆ పెళ్లి కూతురు తన మనవణ్ణి వదిలి మరో కుర్రాణ్ణి పెళ్లి చేసుకోవడానికి కూడా సహకరిస్తుంది. సురేఖ సిక్రి పాత్రలు ఇలాంటి పాత్రల వల్ల ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. సురేఖ సిక్రీ ఒక కాలంలో వచ్చిన ఉత్తమ నటులు నసీరుద్దిన్ షా, ఓం పురి, రఘువీర్ యాదవ్... వీళ్ల సమకాలికురాలు. అలిగర్లో తల్లి టీచర్‌గా పని చేయడం వల్ల అలిగర్ యూనివర్సిటీలో చదువుకుంది. అక్కడే ఉర్దూ కవిత్వం అంటే ఆమెకు ప్రేమ ఏర్పడింది. ఆ తర్వాత ఢిల్లీ ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’లో మూడేళ్ల నటనలో కోర్సు చేసి అక్కడి రెపట్రీలో నాటకాలు వేస్తూ వేయిస్తూ 15 సంవత్సరాలు గడిపింది. ఆ తర్వాత ముంబై వచ్చి సినిమాల్లో పని చేసింది. ‘సలీమ్ లంగ్డే పే మత్ రో’, ‘మమ్నో’, ‘నసీమ్’, ‘సర్దారీ బేగమ్’, ‘మిస్టర్ అండ్ మిసెస్’ అయ్యర్ వంటి సినిమాల్లో ఆమె మంచి పాత్రలు పోషించింది. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు పొందింది. ‘ఆమె నాటకాలు వేస్తుంటే తొంగి తొంగి చూసి ఆమెలా నటించాలని ఎన్.ఎస్.డిలో నేను అనుకునేదాన్ని’ అని నటి నీనా గుప్తా అంది. వీరిద్దరూ కలిసి ‘బధాయీ హో’లో నటించారు. తెలుగులో ‘ఉయ్యాల జంపాల’ సినిమా హీరోయిన్గా నటించిన అవికా గోర్ ‘బాలికా వధు’లో చిన్నారి పెళ్లికూతురిగా నటించింది. ‘నా నట జీవితం అటువంటి శిఖరంతో మొదలుకావడం నా అదృష్టం’ అని అవికా గోర్ అంది. సురేఖ సిక్రికి నటుడు నసీరుద్దిన్ షాకు బంధుత్వం ఉంది. సిక్రి సవతి చెల్లెలు పర్వీన్ మురాద్‌ను నసీరుద్దిన్ మొదటి వివాహం చేసుకున్నాడు. వీళ్లిద్దరికి షీబా షా అనే కుమార్తె ఉంది. షీబా షా సురేఖ సిక్రితో కలిసి నటించింది. ‘ఒక మంచి నటికి రెండులైన్ల డైలాగ్ ఉన్న పాత్ర దొరికినా ఆ రెండులైన్లను ఎంత బాగా చెప్పొచ్చు.. ఆ లైన్ల వెనుక కథ ఏమిటి... ఆ లైన్లకు ఎలా న్యాయం చేయాలి... ఇవి ఆలోచించి నటించినట్టయితే తప్పక ఆత్మతృప్తి పొందవచ్చు’ అంటుంది సురేఖ సిక్రి. కవిత్వం మీద తన అభిమానాన్ని ఉర్దూ స్టూడియో, హిందీ స్టూడియోలలో గొప్ప గొప్ప కవుల కవిత్వాన్ని చదివి రికార్డు చేసి ఆమె మనకు కానుకగా ఇచ్చింది. భారతీయ నటనా రంగం చూసిన ఒక ఉత్తమ కవిత సురేఖ సిక్రి. ‘బధాయీ హో’లో... ‘తమస్’ సీరియల్లో... ‘బాలికా వధు’ సీరియల్లో... -
గుండె బద్దలైపోయింది.. ఇది నమ్మలేకపోతున్నాను :నటి
చిన్నారి పెళ్లికూతుర(బాలికా వధు)ఫేమ్ సురేఖ సిఖ్రి మృతిపై సీనియర్ నటి నీనా గుప్తా స్పందించారు. సిఖ్రి ఇక లేరన్న విషయం తెలిసి గుండె బద్దలైపోయింది. ఇది నమ్మలేకపోతున్నాను. ఆమెతో బధాయి హో అనే సినిమాలో కలిసి నటించాను. షూటింగ్ బ్రేక్‌లో చాలా విషయాలు మాట్లాడుకునేవాళ్లం. స్పాట్లో రెగ్యులర్‌గా కలిసే తినేవాళ్లం. ఆమె వ్యక్తిత్వం చాలా గొప్పది. సిఖ్రి మరణవార్త జీర్ణించుకోవడానికి చాలా కష్టంగా ఉంది అంటూ నీనా గుప్తా ఎమోషనల్ అయ్యారు. 2018లో వచ్చిన బధాయి చిత్రం ఘన విజయం సాధించింది. ఈ మూవీలో సురేఖ సిఖ్రి నీనా గుప్తాకు అత్తగా నటించారు. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) గుండెపోటుతో శుక్రవారం మరణించిన సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి ఈ ఉదయం తుదిశ్వాస విడిచింది. 'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు సంపాదించుకుంది. -
విషాదం: 'చిన్నారి పెళ్లికూతురు' ఫేం సురేఖ సిఖ్రి మృతి
ముంబై : బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సిఖ్రి మరణించిందని ఆమె మేనేజర్ మీడియాకు వివరించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి.. శుక్రవారం తుదిశ్వాస విడిచింది. 'కిస్సా కుర్సి కా' చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్ అవార్డులు సంపాదించుకుంది. బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు)సీరియల్ ద్వారా ఎంతో పాపులర్ అయిన సిఖ్రి తెలుగు వారికి కూడా బాగా దగ్గరైంది. బామ్మగా సిఖ్రి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 2018లో షూటింగ్ సమయంలో బాత్రూంలో జారిపడటంతో సురేఖ సిఖ్రికు బ్రెయిన్ స్ర్టోక్ వచ్చింది. కోలుకుంటున్న సమయంలోనే రెండేళ్ల తర్వాత మరోసారి బ్రెయిన్ స్ర్టోక్ రావడంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. అప్పటినుంచి నటనకు కాస్త బ్రేక్ ఇచ్చిన సురేఖ సిఖ్రి చివరిసారిగా ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్ అనే చిత్రంలో నటించింది. -
భార్య సురేఖతో కలిసి రక్తదానం చేసిన చిరంజీవి
అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదంటారు. సమయానికి రక్తం అందించడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడొచ్చు. కానీ ప్రస్తుతం కరోనా కాలంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతూ రక్తదానానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో సోమవారం World Blood Donor Day సందర్భంగా భార్య సురేఖతో కలిసి మెగాస్టార్ చిరంజీవి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా 'రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడుతున్న సోదర, సోదరీమణులను అభినందిస్తున్నాను. చిన్న పనితో ఎంతో మంది విలువైన ప్రాణాలను కాపాడుతుండటం, ఏ సంబంధం లేని వారికి రక్తం ఇచ్చి వారితో ఓ రక్త సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అనేది గొప్ప అదృష్టం' అని చిరు ట్వీట్ చేశారు. గతంలో కరోనా మొదటి వేవ్‌లోనూ చిరంజీవి స్వయంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన సంగతి తెలిసిందే. On this #WorldBloodDonorsDay congratulating all Blood Donors & particularly my #BloodBrothers & Sisters who help save lives. It's a great fortune that we can save precious lives thru such simple actions & form a bond for life wid fellow humans,through blood #DonateBloodSaveLives pic.twitter.com/ufTgxlDPEG — Chiranjeevi Konidela (@KChiruTweets) June 14, 2021 చదవండి : ఆట సందీప్‌కు వాయిస్ మెసేజ్ పంపిన మెగాస్టార్ చిరంజీవి గుర్తుపట్టరాని విధంగా మారిపోయిన హీరోయిన్ మీనాక్షి -
గుండెపోటుతో నటి సురేఖ మృతి
బెంగళూరు : ప్రముఖ శాండల్‌వుడ్ నటి సురేఖ (66) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. టీవీ చూస్తుండగా రాత్రి 9.30 నిమిషాలకు ఆమెకు గుండెపోటు వచ్చిందని కుటుంబ వర్గాలు తెలిపాయి. దీంతో వెంటనే ఆమెను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. సురేఖ అంత్యక్రియలు బెంగళూరులోని ఆదివారం బనశంకరి శ్మశానవాటికలో జరిగాయి. ఇక నటుడు రాజ్‌కుమార్‌తో కలిసి త్రిమూర్తి, ఒలావు గెలువు, గిరి కాన్యే, సాక్షత్క వంటి పలు సినిమాల్లో నటించింది. భరతనాట్యంలో శిక్షణ తీసుకొని దేశ, విదేశాల్లో పలు నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. ముఖ్యంగా మహిళా ప్రాధాన్యమున్న పాత్రలు పోషించి శాండల్‌వుడ్‌లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇప్పటివరకు ఆమె కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించింది. చదవండి : నటుడు అటల్ బిహారి పండా ఇక లేరు -
అమ్మ పుట్టినరోజు.. రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్
మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గురువారం(ఫిబ్రవరి18) పుట్టినరోజు జరుపుకున్నారు ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. తల్లి పుట్టిన రోజును పురస్కరించుకొని మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు ప్రత్యేక శుభాంకాంక్షలు తెలిపారు చిరంజీవి, సురేఖల ముద్దుల తనయుడు రామ్ చరణ్ తాజాగా తన సోషల్ మీడియాలో తల్లితో దిగిన ఫొటో షేర్ చేస్తూ బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశాడు. ‘నీ అమితమైన ప్రేమకు కృతజ్ఞతలు. అమ్మ నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు ’అని ట్వీట్ చేశాడు. అలాగే ఇన్‌స్టాలో నా మొదటి ప్రేమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు, లవ్ యూ అమ్మ అంటూ పోస్టు చేశాడు. చరణ్ చేసిన ట్వీట్ నెటిజన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తల్లి,కొడుకులు దిగినఫోటోను చూసి మెగా అభిమానులు సంబరపడుతున్నారు. మరోవైపు చరణ్ స్నేహితుడు, హీరో రానా కూడా సురేఖకు బర్త్‌డే విషెస్ తెలిపాడు. హ్యపీ బర్త్‌డే సురేఖ ఆంటీ అని పేర్కొన్నాడు. ఇక సినిమాల విషయానికొస్తే చిరంజీవి-రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య చిత్రానికి సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా మ్యాట్నీ మూవీస్ - కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి - చరణ్ కలిసి నిర్మిస్తున్నారు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాతో పాటు ఆచార్య చిత్రంతో రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. అదే విధంగా త్వరలో శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇటీవల ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే. చదవండి: రామ్ చరణ్ రికార్డులను తుడిచిపెట్టిన ‘ఉప్పెన’.. Thank you for ur unconditional love. Happy birthday Amma!! 🥳❤️ pic.twitter.com/43tqclcT7c — Ram Charan (@AlwaysRamCharan) February 18, 2021 View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) View this post on Instagram A post shared by Ram Charan (@alwaysramcharan) -
మెగాస్టార్ ఇంట్లో బిగ్‌బాస్ తురుమ్‌ఖాన్ సందడి
తనదైన ప్రదర్శనతో బిగ్‌బాస్ షోలో సయ్యద్ సోహేల్ సందడి చేశాడు. విజేత కన్నా అత్యధిక పాపులారిటీ సొంత చేసుకున్న ఈ తురుమ్‌ఖాన్ ఇప్పుడు తనను ప్రోత్సహించిన వారిని కలిసి కృతజ్ఞతలు చెబుతున్నాడు. మొన్న బిగ్‌బాస్ వ్యాఖ్యాత కింగ్ నాగార్జునను కలిశాడు. ఇప్పుడు తాజాగా శుక్రవారం మెగాస్టార్ చిరంజీవిని కలిశాడు. చిరు నివాసానికి వెళ్లి సోహేల్ పుష్పగుచ్ఛం అందించాడు. చిరు కుటుంబంలో ఓ సభ్యుడిగా కలిసిపోయి సందడి చేశాడు. బిగ్‌బాస్ షో ఆఖరి రోజు మొత్తం సోహేల్ చుట్టే కథ నడిచింది. సోహేల్‌కు చిరంజీవి తన భార్య సురేఖతో బిర్యానీ వండించి తీసుకొచ్చాడు. దీంతోపాటు సోహేల్ అనాథాశ్రమానికి చేస్తానన్న సహాయం వద్దు.. తాను చేస్తానని ప్రకటించాడు. సోహెల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అతిథిగా వస్తానని బిగ్‌బాస్ ఫైనల్లో చిరు ప్రకటించాడు. ఈ అనుకోని వరాలకు సోహేల్ ఉబ్బితబ్బిబై ఏడ్చేశాడు. అలాంటి సోహేల్ ఇప్పుడు తనను ప్రోత్సహించిన చిరును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవితో పాటు తనకోసం బిర్యానీ వండి పంపిన చిరు భార్య సురేఖ, చిరంజీవి తల్లి అంజనాదేవిని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఓ కుటుంబసభ్యుడి మాదిరి చిరు ఇంట్లో సోహెల్ గడిపాడు. సోహెల్ హీరోగా ఓ సినిమా రూపుదిద్దుకుంటుంది. జార్జిరెడ్డి ఫేమ్ నిర్మాతలు ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చిరంజీవి హాజరయ్యే అవకాశం ఉంది. -
విశ్వనాథ్‌గారిని కలవాలనిపించింది: చిరంజీవి
కళాతపస్వి కె. విశ్వనాథ్ ని చిరంజీవి గురువులా భావిస్తారు. దీపావళి పండగ సందర్భంగా సతీమణి సురేఖతో కలసి గురువు ఇంటికి వెళ్లారు చిరంజీవి. విశ్వనాథ్ దంపతులు చిరు దంపతులను ఆశీర్వదించారు. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శుభలేఖ, ఆపద్భాంధవుడు, స్వయంకృషి’ వంటి సినిమాలు చిరంజీవి కెరీర్లో మైలురాయిలా నిలిచాయి. గురు–శిష్యులిద్దరూ తమ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల విశేషాలను, ఆ సినిమాల సమయంలో ఏర్పడిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ‘‘విశ్వనాథ్‌గారిని కలవాలనిపించి ఆయన ఇంటికి వచ్చాను. నాకు ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టిన చిత్రాలు తీశారాయన. ఈ దీపావళి సందర్భంగా ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు చిరంజీవి. -
ఆ సినిమా కోసమే ఆ లుక్!
‘చరణ్, నేను కలసి నటించాలన్నది నా భార్య సురేఖ కోరిక. ‘ఆచార్య’తో అది నెరవేరుతోంది’ అన్నారు చిరంజీవి. ఇటీవల ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఆయన తన తదుపరి సినిమాలకు సంబంధించిన పలు విశేషాలు పంచుకున్నారు. ఆ వివరాలు ఈ విధంగా... ‘‘ఆచార్య’ సినిమాలో నాకు, చరణ్‌కి కలసి నటించే అవకాశం లభించింది. మళ్లీ ఇలాంటి కథ దొరుకుతుందో లేదో అని ఆ పాత్రలో చరణ్ నటిస్తే బావుంటుంది అనుకున్నాం. ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నాడు. అందుకని ‘ఆచార్య’ కోసం రాజమౌళిని రిక్వెస్ట్ చేసి చరణ్ డేట్స్ అడ్జెస్ట్ చేశాం. ‘ఆచార్య’ వచ్చే ఏప్రిల్‌కి పూర్తవుతుంది. ఆ తర్వాత వీవీ వినాయక్ దర్శకత్వంలో ‘లూసిఫర్’ (మలయాళం) రీమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ (తమిళం) రీమేక్‌లో నటిస్తాను. ఈ మధ్య ట్రై చేసిన గుండు లుక్ ‘వేదాళం’ కోసమే. కానీ ఆ లుక్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఇక నుంచి ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకులు ఎప్పటిలానే థియేటర్స్‌కు వస్తారనుకుంటున్నాను’’ అని అన్నారు చిరంజీవి. -
తాను, నేను ఏమీ మారలేదు : చిరు
సాక్షి, హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. కొంచెం ఆలస్యంగా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టినా.. చాలా యాక్టివ్‌గా ఉంటున్నాడు. తనకు సబంధించిన పలు విషయాలను అభిమానులతో పంచుకుంటున్నాడు. అంతే కాదు సమాజంలో జరిగే సంఘటనపై కూడా తనదైన శైలీలో స్పందిస్తున్నాడు. తాజాగా తన భార్య సురేఖతో ఉన్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంటూ ‘కాలం మారినా.. దేశం మారినా.. సురేఖ, తాను మాత్రం ఏమీ మారలేదు’ అని చిరంజీవి పేర్కోన్నాడు. (చదవండి : ఒకేసారి ఆ మార్క్‌ను అందుకున్న చిరు, చరణ్) 1990లో అమెరికా వెళ్లినపుడు అక్కడ వంట చేస్తున్న ఫొటోను, ప్రస్తుతం సొంతింట్లో వంట చేస్తున్న ఫొటోను చిరంజీవి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేశారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ రెండు ఫోటోల్లోనూ ఇద్దరు ఒకే రంగు దుస్తులు ధరించి, ఒకే స్టైల్లో నిల్చుని ఉన్నారు. 1990 ఫొటోకు `జాయ్‌ఫుల్ హాలీడే ఇన్ అమెరికా` అని క్యాప్షన్ ఇవ్వగా.. 2020 ఫొటోకు `జైల్ఫుల్ హాలీడే ఇన్ కరోనా` అని క్యాప్షన్ ఇచ్చి అలా ప్రాసతో అదరగొట్టాడు. ఇక చిరంజీవి, సురేఖల ఫోటోలు చూసి మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
లవ్ యూ అమ్మ: రామ్ చరణ్
మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన తల్లికి సోషల్ మీడియా వేదికగా బర్త్డ్ విషెస్ తెలిపారు. ‘నా మొదటి ప్రేమకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. లవ్ యూ అమ్మ’ అంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ తల్లితో దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అదేవిధంగా ఉపాసన కొణిదెల కూడా తన అత్తకు ఇన్స్టాగ్రామ్ వేదికగా బర్త్‌డే విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే అత్తమ్మ. లవ్ యూ’అని పేర్కొంటు అత్త సురేఖ, భర్త రామ్ చరణ్‌తో దిగిన ఫోటోను మెగా అభిమానులతో పంచుకున్నారు. ఇక తన బర్త్‌డే వేడుకలను ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా సింపుల్‌గా తన కుటుంబ సభ్యులతో చేసుకోవడం ఇష్టమని సురేఖ పలు ఇంటర్వ్యూల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో బిజిగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి తెరకెక్కుతున్న ఈ భారీ మల్టీస్టారర్ చిత్రంలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం ముందుగా అనుకున్న ప్రకారం జులైలో విడుదల కావాల్సినప్పటికీ పలు కారణాలతో వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో పాటు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిరంజీవి సినిమాకు రామ్‌చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ పవర్ఫుల్ పాత్ర కూడా ఈ మెగా పవర్‌స్టార్ పోషిస్తున్నట్లు సమాచారం. View this post on Instagram Happy birthday to my first love!! Love you Mom!! 😍🥳 A post shared by Ram Charan (@alwaysramcharan) on Feb 17, 2020 at 11:39pm PST View this post on Instagram Happy birthday Athama. ❤️❤️❤️ Love u. A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) on Feb 17, 2020 at 11:46pm PST చదవండి: చూపులు కలవని శుభవేళ మణిశర్మ, తమన్.. ఇప్పుడు అనిరుద్? నాది చాలా బోరింగ్ లైఫ్! -
చూపులు కలవని శుభవేళ
అమ్మాయి కాఫీ ఇచ్చింది. అబ్బాయి కాఫీ తాగాడు. కాఫీ ఇస్తున్నప్పుడు.. అమ్మాయి అబ్బాయిని చూళ్లేదు! కాఫీ తాగుతున్నప్పుడైనా.. అబ్బాయి అమ్మాయిని చూళ్లేదు! ఇంకేం కలుస్తాయి చూపులు! చూపులు కలవలేదు కానీ... కాఫీ కలుపుతున్నప్పుడు అమృత ఘడియలేవో ఉన్నట్లున్నాయి. నలభై ఏళ్లయింది చిరంజీవి, సురేఖల పెళ్లయి. కలవని ఆ కాఫీ చూపులే.. వీళ్ల పెళ్లికి శుభలేఖలు. ► మీ ‘శుభలేఖ రాసుకున్న ఎదలో..’ పాట సూపర్ హిట్. మరి.. రియల్ లైఫ్‌లో శుభలేఖ రాసుకున్న విశేషాల గురించి? చిరంజీవి: నాకు నేనుగా బలి పశువును అయిన రోజు గురించేగా (నవ్వుతూ). ఓ సాయంత్రం నేను చైౖన్నై కోడంబాకం బ్రిడ్జ్ మీద నా కారులో వెళుతుంటే, నా బి.కామ్ క్లాస్మేట్ సత్యనారాయణ కనిపించాడు. ఇక్కడ ఉన్నావేంటి? అని అడిగితే, మా పెదనాన్నగారింటికి వచ్చాను అన్నాడు. నా కారులో దింపేస్తాను రమ్మన్నాను. వాళ్ల పెదనాన్న ఎవరో కాదు... అల్లు రామలింగయ్యగారు. అప్పటికే నేను నటించిన ఓ మూడు సినిమాలు విడుదలయ్యాయి. ‘రామలింగయ్యగారు నీతో పాటు ‘మనవూరి పాండవులు’లో యాక్ట్ చేశారుగా.. ఇంట్లోకి రా’ అన్నాడు. అయితే రామలింగయ్యగారు లేరు. కాఫీ తాగి వెళుదువు గాని అన్నాడు. అదే నేను లాక్ అయిన మొదటి స్టెప్. ► ఎలా లాక్ అయ్యారు? చిరంజీవి: ఆ కాఫీ పెట్టింది సురేఖ. తను నన్ను చూళ్లేదు, నేను తనని చూళ్లేదు (భార్యని చూస్తూ.. ‘ఆ కాఫీలో ఏం వశీకరణ మంత్రం కలిపావు’). ఆ తర్వాత ఆ అబ్బాయి ఎవరు? అని తను అతన్ని అడిగితే ‘మా క్లాస్మేట్. ‘మనవూరి పాండవులు’ లో నటించాడు’ అని చెప్పాడు. ‘వాళ్లు ఏమిట్లట. మనిట్లేనట’ (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ) అంది. తర్వాత అల్లు అరవింద్ గారు, ఇతర కుటుంబ సభ్యులు నా గురించి డిస్కషన్ మొదలుపెట్టారు. అల్లు రామలింగయ్యగారికేమో వాళ్లమ్మాయిని ఓ ఐ.ఏ.ఎస్ ఆఫీసర్‌కిచ్చి చెయ్యాలనుండేది. కానీ, ఎందుకు ప్రయత్నం చేయకూడదని అరవింద్‌గారు నా గురించి ఎంక్వయిరీ ప్రారంభించారు. ‘తను ఆంజనేయస్వామి భక్తుడు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, బాగా చదువుకున్నాడు, చాలా కష్టపడతాడు. అతని చేతిలో మంచి సినిమాలు కూడా ఉన్నాయి’ అని నా గురించి గుడ్ సర్టిఫికెట్ ఇచ్చాడు నా ఫ్రెండ్. నాకు ఇప్పుడు పెళ్లేంటి? అన్నాను నేను. మేకప్‌మేన్ జయకృష్ణ ‘మన వూరి పాండవులు’ నిర్మాత. రామలింగయ్యగారి ఫ్యామిలీకి చాలా దగ్గరివారు. ఆయన రామలింగయ్యగారిని కన్విన్స్ చేశారు. ఓకే అనడానికి ముందు ఓ పదిమంది నిర్మాతలను నా గురించి అడిగి సలహా తీసుకున్నారట రామలింగయ్యగారు. అందరూ నా గురించి మంచి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. దాంతో నన్ను లాగి బుట్టలో పడేశారు. నాది పెళ్లి వయసు కాదని కరాఖండీగా చెప్పాను. కానీ, జయకృష్ణగారు మా నాన్నగారితో ‘అబ్బాయి వేరే ఆకర్షణలకి లోనవుతాడేమో’ అని చెప్పారేమో నాన్న భయపడిపోయి ‘నేను అబ్బాయిని ఒప్పిస్తా’ అన్నారు. పెళ్లి చూపులకు రానన్నాను. బలవంతంగా తీసుకెళ్లారు. ► సురేఖగారూ.. మీ నాన్న చెప్పారని మీరు చిరంజీవిగారిని పెళ్లి చేసుకున్నారా? సురేఖ: ‘మన వూరి పాండవులు’ చూసి ‘ఈ కళ్లబ్బాయి ఎవరో బావున్నాడు’ అనుకున్నాను. కళ్లు పెద్దగా, గుండ్రంగా ఉంటాయి కదా. మా అమ్మ యాక్టర్‌ను చేసుకుంది. నేనూ యాక్టర్‌ను చేసుకుం టే బాగుంటుందనుకున్నా. అందుకే సరే అన్నాను. ► మీ ‘అందరివాడు’ సినిమాలో పెళ్లిచూపుల సీన్ చాలా బావుంటుంది. మీ పెళ్లి చూపుల సీన్? చిరంజీవి: మమ్మల్ని మాట్లాడుకోమని పెద్దవాళ్లందరూ బయటకు వెళ్లారు. తను బీఏ చదువుకుందని తెలిసినా ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని ఏం చదువుకున్నారు? అని అడిగాను. ఆ తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. అంతకుముందు నాకు అమ్మాయిలతో పెద్దగా పరిచయాలు కూడా లేవు. సురేఖ పొందిక చూసి ‘ఈ అమ్మాయినే చేసుకోవాలి’ అనుకున్నాను. మా అమ్మకి కూడా తను నచ్చింది. నాన్నగారైతే ‘ఏం కళరా ఆ అమ్మాయిది. పెళ్లి చేసుకో’ అన్నారు. సురేఖ: మామయ్యగారు చనిపోయేంతవరకు నన్నెప్పుడూ పేరు పెట్టి పిలవలేదు. ‘అమ్మా’ అనేవారు. నన్ను ఒక్క మాట కూడా పడనిచ్చేవారు కాదు. అంత బాగా చూసేవారు. ► అవునూ... మీ పెళ్లి చూపులకు, పెళ్లికి ఎంత గ్యాప్ వచ్చింది? సురేఖ: మూడు నెలలు. ► ఆ మూడు నెలల్లో కలుసుకున్నారా? ఫోన్లు మాట్లాడుకోవడం? చిరంజీవి: పెళ్లి కాకముందు మాట్లాడటం, తిరగటం తప్పని మనసులో పడిపోయింది. తనదీ అలాంటి ఫీలింగే. అయితే ఒకసారి మాట్లాడాలనిపించింది. అప్పుడు ల్యాండ్ ఫోన్లే కదా. ఫోన్ చేస్తే తనే తీసింది. ‘హలో.. నేను చిరంజీవి’ అన్నాను. ‘నేను సురేఖనండీ. ఫోన్ ఎవరికివ్వమంటారు’ అంది. అంతే... నాతో కనీసం రెండు మాటలు కూడా మాట్లాడకుండా ఎవరికివ్వమంటారు అందని నా అహం దెబ్బతింది. ‘మీ అన్నయ్య ఉన్నాడా’ అన్నాను. ‘లేరండీ’ అంది. ‘వచ్చాక నేను ఫోన్ చేశానని చెప్పు’ అని పెట్టేశాను. సురేఖ: అప్పుడప్పుడూ అన్నయ్యతో పెళ్లి తేదీ గురించి మాట్లాడేవాళ్లు. అందుకని అన్నయ్యతో మాట్లాడటం కోసమే ఫోన్ చేశారనుకున్నాను. నా గురించి చేశారనుకోలేదు (నవ్వుతూ). ► సరే.. హనీమూన్ విశేషాలు? చిరంజీవి: హనీమూన్ పక్కన పెట్టండి. పెళ్లికే టైమ్ దొరకలేదు. పెళ్లికి ఫిబ్రవరిలో మంచి ముహూర్తాలున్నాయంటే సరే అనుకున్నాం. అప్పుడు ‘తాతయ్య ప్రేమ లీలలు’ అనే సినిమా చేస్తున్నాను. ఆ చిత్రానికి యం.ఎస్ రెడ్డిగారు నిర్మాత. అందులో నూతన్‌ప్రసాద్ కాంబినేషన్లో నా సీన్లు ఉన్నాయి. ‘ఆయన చాలా బిజీ ఆర్టిస్ట్, డేట్స్ దొరకవు.. మీరు మే నెలలో పెళ్లి చేసుకోండి’ అని రెడ్డిగారు అన్నారు. ‘మీరు ఓకే అంటే ఫిబ్రవరిలో, లేదంటే తర్వాత చేసుకుంటాను’ అన్నాను. అరవింద్ ఏమో ‘ఓ మూడు రోజులు ఇవ్వండి’ అని పట్టుబట్టాడు. నా సినిమా టైమ్‌లో మా హీరో పెళ్లి చేసుకున్నాడులే అనుకొని ఏ నిర్మాత అయినా ఆనందంగా ఒప్పుకుంటారు. కానీ, రెడ్డిగారు ఒప్పుకోలేదు. అప్పుడు అల్లు అరవింద్ ‘మీ డేట్లు మళ్లీ మీకు ఇప్పిస్తాను. కాంబినేషన్ గురించి మీకేం భయం లేదు. నేనూ ఇండస్ట్రీలోనే ఉన్నాను కదా. మేం చిరంజీవిని తీసుకెళ్లిపోతున్నాం’ అన్నారు. అలా అనుకున్న ముహూర్తానికే పెళ్లయింది. ► మరి పెళ్లి బట్టల షాపింగ్‌కి టైమ్ దొరికిందా? చిరంజీవి: పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు చొక్కా చిరిగిపోయింది. సురేఖ మార్చుకోమంటే ‘ఏం.. బట్టలు చిరిగితే తాళి కట్టలేనా’ అని, అలాగే కట్టేశాను. అయితే అప్పటికే నాకు ఏడెనిమిది పెళ్లిళ్లు చేసుకున్న అనుభవం ఉంది (ఇద్దరూ పెద్దగా నవ్వుతూ). అంటే సినిమాల్లో.. ► పెళ్లయ్యే నాటికే మీకు వంట వచ్చా? సురేఖ: రాదండీ. ఒకరోజు ఉప్మా చేస్తే ఉండలు, ఉండలుగా వచ్చింది. అప్పుడు ఆయనే ఉప్మా చేయడం నేర్పించారు. ఆయన మేనత్త, అమ్మమ్మ మాతోనే ఉండేవారు. వాళ్లు వండేవారు. ► భర్త మేనత్త, అమ్మమ్మ, అమ్మానాన్న, తమ్ముళ్లు (నాగబాబు, పవన్ కల్యాణ్) ఇంతమందితో ఉండాలంటే ప్రైవసీ ఉండదేమో అనిపించిందా? సురేఖ: మా ఇంట్లో ఎప్పుడూ చుట్టాలుండేవారు. అదే సందడి ఈ ఇంట్లోనూ ఉండేది. లేకపోతే ఒంటరితనం అనిపించేది. ఈయన ఉండేవారు కాదు. అందరూ కలిసి ఉండటంతో నాకు సెక్యూరిటీ ఉండేది. వాళ్లే వంటలు చేసి, నాకు, ఆయనకి, అందరికీ పెట్టేవారు. పిల్లలందరూ ఉండటంతో బావుండేది. చిరంజీవి: సురేఖ తమ్ముడు ఉండేవారు. అతను చనిపోయారు. నా తమ్ముళ్లిద్దరిదీ వాళ్ల తమ్ముడి వయసు. వీళ్ల మీద సురేఖకు ఆ ఎఫెక్షన్ ఉండటానికి కారణం అదే. మనం ఎలా ఉంటే అవతలివాళ్లు మనతో అలా ఉంటారు. సురేఖ అందరితో బాగుంటుంది. సురేఖ: వాళ్లు కూడా చాలా బాగుంటారు. ఏ రిలేషనయినా రెండువైపులా ఉండాలి. ఈయన లేకపోయినా కల్యాణ్ (పవన్ కల్యాణ్) ఎప్పుడూ పిల్లలతో ఉండేవాడు. బాగా సరదాగా ఉండేవాడు. అందుకే కల్యాణ్ పిల్లలతోపాటు పెరిగాడు, పిల్లలు కల్యాణ్‌తో పాటు పెరిగారు అంటాం. కల్యాణ్‌తో పాటు, వీళ్ల చెల్లెలు మాతోపాటు ఉండి చదువుకుంది. ► త్రీ షిఫ్ట్స్ చేస్తూ షూటింగ్స్‌తో చిరంజీవిగారు బిజీగా ఉండేవారట. పెళ్లయిన కొత్తలో ఆ బిజీని ఎలా తీసుకున్నారు? సురేఖ: నాన్నగారిని చూస్తూ పెరిగాను కదా. నైట్ షూటింగ్‌లని ఆయన లేటుగా రావటం అన్నీ తెలుసు. మా పెళ్లయిన కొత్తల్లో ఈయన పొద్దున్నే షూటింగ్‌కి వెళ్లి సాయంత్రం 6 గంటలకు వచ్చేవారు. మళ్లీ ఫ్రెష్ అయి నైట్ షూటింగ్‌కి వెళ్లేవారు. ‘పున్నమినాగు’ షూటింగ్ జరుగుతోంది అప్పుడు. నా లైఫ్ అంతా ఇలానే ఉంటుందని ప్రిపేర్ అయిపోయాను కాబట్టి ఏమీ అనిపించలేదు. ► ప్యారిస్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు మీ పేరు బదులు ‘జయ’ అని జయప్రదగారి పేరుతో మిమ్మల్ని పిలిచారట? సురేఖ: ఓ రోజు కాదు, రోజూ జరిగేది. నెల రోజులు జయప్రదతో షూటింగ్ చేస్తే ఆ నెల రోజులూ జయ, జయ అని పిలిచేవారు. మా పెళ్లయిన కొత్తల్లో అప్పటికి నన్ను సురేఖా అని పిలవడానికి అలవాటుపడలేదు. అందుకని ఒక్కోసారి జయ అని పిలిచేవారు. ‘ఏమండీ.. నేను రేఖ’ అనేదాన్ని. ‘ఓ.. సారీ, సారీ రేఖ’ అనేవారు. చిరంజీవి: సురేఖలో ఉండే ఆ స్పోర్టివ్‌నెస్ పరాకాష్ట అని చెప్పాలి. మరో గమ్మల్తైన విషయం చెబుతా. మా పెళ్లైన రెండు నెలలకి ప్యారిస్ వెళ్లాం. హోటల్లో రూమ్ తీసుకున్నాం. దానికోసం రిసెప్షన్లో ఫామ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇవ్వాలి కదా. అక్కడ అన్నీ ఫిల్ చేస్తూ భార్య అనే చోట ఆగిపోయాను. వెంటనే పేరు గుర్తు రాలేదు (నవ్వులు). ‘సురేఖ’ అని చెప్పి.. ‘అల్లు అని రాసేరు, కొణిదెల అని రాయండి’ అంది. ► మీరు ఎంతోమంది హీరోయిన్లతో నటించారు. వాళ్లతో సురేఖగారు ఎలా ఉంటారు? చిరంజీవి: సురేఖ వెరీ ఫ్రెండ్లీ. సుహాసిని, సుమలత, విజయశాంతి, రాధ, రాధిక.. అందరితో ఓ ఫ్యామిలీలా ఉంటుంది. మొన్న నవంబర్‌లో మా 80స్ క్లబ్ (1980లకు చెందిన నటీనటులు) రీయూనియన్ పార్టీ మా ఇంట్లోనే జరిగింది. అన్నీ తనే ఎరేంజ్ చేసింది. వాళ్లందరూ ‘ఇంత ఎరేంజ్ చేశారు, మీరూ పార్టీలో ఉండండి’ అంటే ‘మీరంతా ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి’ అంది. సురేఖ: ఎరేంజ్ చేశాం కదా అని ఫ్రెండ్స్ మధ్యలో దూరిపోకూడదు (నవ్వుతూ). ► జనరల్‌గా చిరంజీవిగారి బర్త్‌డే అంటే ఫ్యాన్స్ మరచిపోనివ్వరు. మరి.. మ్యారేజ్ డే, మీ బర్త్‌డేని ఆయన గుర్తుపెట్టుకుంటారా? చిరంజీవి: గుర్తుండేది కాదు, గుర్తు లేకనే ఈ సంవత్సరం ఫైట్ సీక్వెన్స్ కోసం పోలవరం వెళ్లడానికి రెడీ అయ్యాను. ఈ 18న సురేఖ పుట్టినరోజు. 20న మా పెళ్లిరోజు. అది గుర్తు లేక 16 నుండి పోలవరంలో షూటింగ్ ప్లాన్ చేసుకున్నాం. మా అబ్బాయికి (రామ్‌చరణ్) గుర్తుకొచ్చింది. వాళ్లమ్మ దగ్గరికెళ్లి ‘18 నీ పుట్టినరోజు, 20 మీ పెళ్లిరోజు, డాడీ షూటింగ్‌కి ఎలా ఒప్పుకున్నారు?’ అంటే, ‘పోనీలే డాడీకి గుర్తులేదేమో’ అందట. ‘లేదమ్మా, అది మన షూటింగే కదా, వాళ్లతో మాట్లాడి మారుస్తాను’ అని మార్చేశాడు. సురేఖ: మా మ్యారేజ్ డే అయినా, నా బర్త్‌డే అయినా హడావిడి ఏమీ ఉండదు. ► గిఫ్ట్‌లు ఇస్తుంటారా? సురేఖ: రెండేళ్ల క్రితం నా బర్త్‌డేకి వాచ్ ఇచ్చారు. కరెక్ట్‌గా రాత్రి 12 గంటలకు నన్ను నిద్ర లేపి మరీ ఇచ్చారు. ఆ గిఫ్ట్ నాకివ్వటం కోసం ఎంత కష్టపడ్డారో తర్వాత తెలిసి ఆనందపడ్డాను. చిరంజీవి: ఆ బ్రాండ్ వాచ్ ఇక్కడ దొరకలేదు. బెంగళూర్‌లో ఉంది. ఆ కంపెనీవాళ్లను అడిగితే, ‘మీరు మా ప్రివిలేజ్డ్ కస్టమర్’ అని ఫ్లయిట్‌కి వచ్చి ఇచ్చి వెళ్లారు. ► కలిసి షాపింగ్స్‌కి వెళతారా? చిరంజీవి: షాపింగ్ అంటే ఇద్దరికీ ఇష్టం. ఇక్కడ కష్టం కాబట్టి విదేశాలు వెళ్లినప్పుడు బాగా తిరుగుతాం. లండన్ వెళితే ఓ అపార్ట్మెంట్ అద్దెకి తీసుకుని కొన్ని వారాల పాటు అక్కడే ఉంటాం. నాకు, తనకి కుకింగ్ అంటే సరదా. కుక్ చేసుకుని షాపింగ్‌కి వెళ్లిపోతాం. ► పండగలు బాగా చేస్తుంటారని విన్నాం. ప్లానింగ్ అంతా సురేఖ గారిదేనా? చిరంజీవి: నాగబాబు, పవన్‌కల్యాణ్, అల్లు అరవింద్ ఫ్యామిలీ... ఇలా అన్ని క్లోజ్ ఫ్యామిలీలు మొన్న దీపావళి పండగకి కలిశాం. దాదాపు మేమే ఓ వందమంది దాకా ఉంటాం. అందరికీ తనే మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్‌కే చిన్న పిల్లల దగ్గరనుండి, పెద్దవాళ్లదాకా అందరూ తూచా తప్పకుండా హాజరవుతారు. సంక్రాంతి పండగను మూడు రోజులు చాలా ఘనంగా చేసింది. అప్పుడు పంక్తి భోజనాలు పెట్టి, పెద్ద భోగి మంట ఏర్పాటు చేయించింది. పండగ అనేది వంకే తప్ప, అందరూ కలవాలనుకుంటుంది. అందుకే అందరితోనూ తనకు మంచి బాండింగ్ ఉంటుంది. సురేఖ: ఈయన మొదట్నుంచి వాళ్ల పిల్లలు, వీళ్ల పిల్లలు అని కాదు.. అందరి పిల్లలతో బాగుంటారు. చిన్నప్పుడు అందరి పిల్లలు ఓ పదిహేనుమంది దాకా అయ్యేవారు. అందరినీ షూటింగ్‌లకు తీసుకెళ్లేవారు. మాల్దీవ్స్ వెళ్లినా, స్విస్ వెళ్లినా హాలిడే ఉందంటే చాలు.. అల్లు వెంకటేశ్, బన్నీ, శిరీష్ ఇలా అందరి పిల్లల్ని ఫారిన్ తీసుకెళ్లేవారు. చిరంజీవి: పిల్లలందరికీ వండర్ఫుల్ మెమొరీస్ నాతోనే ఉంటాయి. నేనెన్ని చేసినా దాన్ని ఆర్గనైజ్ చేసి, మేనేజ్ చేసేవాళ్లు కావాలి. అది సురేఖ చేస్తుంది. ► పండగలవీ శ్రద్ధగా చేస్తున్నారంటే పూజలు బాగా చేస్తారా? సురేఖ: మరీ అంత ఎక్కువ కాదు. రోజూ మామూలుగా చేస్తా. స్పెషల్ అకేషన్ అంటే కచ్చితంగా బాగా చేస్తాను. మనం చేస్తుంటేనే పిల్లలు కూడా ఫాలో అవుతారు. మన నెక్ట్స్ జనరేషన్‌కు తెలుస్తుంది. మనం వదిలేస్తే వాళ్లూ వదిలేస్తారు. మా సుస్మిత, శ్రీజ పెళ్లి చేసుకుని వెళ్లిపాయినా ఇక్కడ పూజలు చేసినట్లే అత్తగారింట్లో చేస్తారు. ► మనవళ్లు, మనవరాళ్ల గురించి ? సురేఖ: అదొక లవ్లీ లైఫ్. ఈయనకి అప్పట్లో తీరిక లేక మా పిల్లల ఎదుగుదలను చూడలేదు. ఇప్పుడు చిన్నపిల్లలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. అందరికీ ఆయనంటే పిచ్చి ఇష్టం. వాళ్లతో ఆయన ఎన్ని ఆటలు ఆడతారో చెప్పలేం. ► మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుంటాయా? చిరంజీవి: ఎందుకు జరగవు? తిట్టుకుంటానే ఉంటాం సురేఖ: అలా జరగబట్టే ఇంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాం. ఎప్పుడూ స్వీట్ స్వీట్‌గా ఉంటే బోర్. ► ఇద్దరిలో ఎవరు సీరియస్? ఎవరు కామెడీ? చిరంజీవి: నేను కామెడీగా ఉండను. అలాగని పెద్ద సీరియస్‌గా కూడా ఉండను. కామెడీ అంటే సురేఖనే ఎక్కువ. ఆమె పంచ్‌లను తట్టుకోవటం చాలా కష్టం. ఒక్కోసారి ఆ పంచ్‌లకు గుక్క తిప్పుకోలేం. ► ఫైనల్లీ.. మళ్లీ జన్మంటూ ఉంటే మీరే కపుల్‌గా ఉండాలనుకుంటున్నారా? చిరంజీవి: నేను ఆ మద్రాస్ కోడంబాకం బ్రిడ్జి మీదకి మాత్రం వెళ్లను (పెద్దగా నవ్వుతూ). ఐయామ్ జస్ట్ కిడింగ్. డెఫ్నెట్లీ మేమే ఉండాలనుకుంటున్నాం. సురేఖ: అంతే... ► మీరు కట్టుకునే చీరలు బాగుంటాయి. మీవారు కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? సురేఖ: థ్యాంక్యూ. నాకు అప్డేటెడ్గా ఉండటం ఇష్టం. దానికి కారణం చిరంజీవిగారే. ఆయనకు ఫ్యాషన్ గురించి, కలర్స్ గురించి చాలా అవగాహన ఉంది. ఇంకో విషయం ఏంటంటే.. ఆయన చీర చూడగానే రేటు చెప్పేస్తారు. అది ఏ చీర అయినా కానివ్వండి.. బట్టల గురించి అంత ఐడియా ఉంది. నేను కట్టే చీరలు బాగుంటాయని అందరూ అంటుంటే బాగానే ఉంటుంది. కానీ అదే విషయాన్ని ఆయన నోటి నుంచి వింటే ఆ ఆనందమే వేరు. అంతేకదా.. మనం శ్రద్ధగా డ్రెస్ చేసుకున్నప్పుడు భర్త నుంచి ఓ చిన్ని కాంప్లిమెంట్ వస్తే ఆ ఫీలింగే స్పెషల్. ఆ విషయంలో ఆయన హండ్రెడ్ పర్సంట్ బెస్ట్. అన్నీ పట్టించుకుంటారు. కాంప్లిమెంట్స్ ఇస్తారు. ► సో.. మీ కళ్లబ్బాయి పక్కా ఫ్యామిలీ మ్యాన్ అన్నమాట? సురేఖ: డౌట్ ఏముంది? హండ్రడ్ పర్సంట్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. ► 30 ఏళ్లు నటించి ఓ పదేళ్లు పాలిటిక్స్‌కి దగ్గరగా ఉండటంవల్ల సినిమాలకు దూరమయ్యారు. ఆ గ్యాప్ గురించి? సురేఖ: అప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండేవారు కాదు. మాకూ అలానే ఉండేది. ఆయనకి మేకప్ వేసుకోగానే హుషారు వస్తుంది. చిరంజీవి: పనులన్నీ ముగించుకుని ఇంటికొచ్చాక కూడా మరుసటి రోజు ఏం మాట్లాడాలి? అనేదాని చుట్టూనే ఆలోచనలు ఉండేవి. ‘సినిమాలు చేయడం మొదలుపెట్టాక మళ్లీ మిమ్మల్ని మా మనిషిలా చూస్తున్నాం’ అంటున్నారు. సురేఖ: ఇప్పుడు ఫుల్ హుషారు. ఉదయం 9కి వెళ్లాలంటే ముందే రెడీ అయి కూర్చుంటారు. షూటింగ్ ఉంటే.. హీ ఈజ్ ఫుల్ యాక్టివ్. చిరంజీవి: ‘సైరా’ సినిమాకి 4.30కి లేచి వర్కవుట్ చేసుకొని 5.30గంటలకల్లా రెడీ అయ్యి 6 గంటలకు లొకేషన్‌కి వెళ్లి 7 గంటలకల్లా మేకప్‌తో రెడీగా ఉండేవాణ్ణి. ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న సినిమా షూటింగ్ షార్ప్ 7కల్లా స్టార్ట్ చేస్తున్నాం. జనవరి 2న షూటింగ్ స్టార్ట్ చేశాం. అప్పుడే ఓ సాంగ్, మూడు ఫైట్స్ కంప్లీట్ అయ్యాయి. ► మీ పెళ్లప్పటికే చిరంజీవిగారు కెరీర్‌వైజ్‌గా మంచి ఫామ్‌లోకొచ్చారు.. ఆ బిజీని ఎలా తీసుకునేవారు? సురేఖ: ఆయన కనబడటమే అపురూపంగా ఉండేది. ఎప్పుడూ షూటింగ్‌లతో దూరం, దూరంగా ఉండటంతో కళ్లారా ఎప్పుడు చూస్తానా అనిపించేది. చిరంజీవి: నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడే అవకాశాలు మొదలయ్యాయి. ఆల్బమ్ పట్టుకుని అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి రాలేదు. అందుకే పెళ్లినాటికే ఫామ్‌లో ఉన్నా. అప్పుడేమో నేను కనబడితే రేఖకి అపురూపం. మనవరాళ్లు వచ్చాక ఎఫెక్షన్ తగ్గింది. పలకరిస్తే ‘ఆ వస్తున్నా’ అంటుంది. వచ్చి చూడదు. అందుకేనేమో లేటు వయసులో చాలామంది సెకండ్ కోసం చూస్తుంటారు (కొంటెగా నవ్వుతూ). అయినా నేనా ధైర్యం చేయలేను. ► చిరంజీవిగారు, చరణ్ కలిసి ఫుల్ లెంగ్త్ సినిమా చేయాలని ఉందా? సురేఖ: ఇద్దరినీ ఓ సినిమాలో చూడాలని ఉంది. ‘ఖైదీ నంబర్–150’లో ‘అమ్మడూ లెట్స్ డూ కుమ్ముడు’ పాట మధ్యలో చరణ్ వచ్చి డ్యాన్స్ చేస్తాడు. వాళ్లిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఈయన్ని చూడాలా, చరణ్‌ని చూడాలా అనుకున్నాను. ఆ తర్వాత ఇంట్లో ఆ సినిమా చూస్తూ ఒకసారి ఈయన్ని, మళ్లీ ఆ పాట పెట్టుకుని ఒకసారి చరణ్‌ని చూశాను. ► నటుడిగా చిరంజీవిగారు రిస్కీ ఫైట్స్ చేస్తుంటారు. మీకెలా అనిపిస్తుంది? సురేఖ: లొకేషన్లో ఏం చేసేవారో తెలిసేది కాదు కానీ, చేసొచ్చిన తర్వాత చెబుతుంటే ‘బాబోయ్’ అనిపించేది. ఎప్పుడో పొద్దున వెళితే సాయంత్రానికి వచ్చేవారు. అలా కాకుండా ఏ పదకొండింటికో ఆయన ఇంటికి వచ్చేస్తున్నారు అని ఎవరైనా చెబితే మాత్రం, ఏదో దెబ్బతగిలే ఉంటుందనుకునేదాన్ని. అలాగే ఫైట్ సీన్స్ అంటే మధ్యలో లొకేషన్ నుంచి ఫోన్ రాకూడదని కోరుకుంటా. ఫోన్ వస్తే ఆయనకు ఏదైనా దెబ్బ తగలిందని చెబుతారేమోనని భయం. ఇప్పుడు ఫర్వాలేదు కానీ అప్పట్లో ఇంత కంఫర్టబుల్ షూస్ కానీ, సేఫ్టీ ప్రికాషన్స్ కానీ లేవు కదా. ఈయనేమో డూప్ కూడా వద్దంటారు. – డి.జి. భవాని -
యాదాద్రిలో చిరంజీవి సతీమణి పూజలు
సాక్షి, యాదాద్రి: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అక్టోబర్ 2వ తేదీన చిరంజీవి నటించిన ‘సైరా’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా పెద్ద హిట్ కావాలని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సురేఖకు...ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కాగా చిరంజీవి హీరోగా తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా, రామ్ చరణ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సినిమా సెన్సార్ కూడా పూర్తయింది. చదవండి: నా జీవితంలో ఇదొక అద్భుతమైన రోజు : చిరంజీవి -
లవ్ యు అమ్మా
ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి లేటెస్ట్గా రామ్‌చరణ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి పోస్ట్‌ను తన తల్లి సురేఖకు అంకితం చేశారు చరణ్. సోమవారం ఇన్‌స్టా ఎంట్రీ ఇచ్చిన చరణ్ శుక్రవారం నా మొదటి పోస్ట్‌ను షేర్ చేస్తాను అని ప్రకటించారు. మొదటి పోస్ట్ దేనికి సంబంధించి ఉంటుందా? అని ఫ్యాన్స్ అందరూ ఊహాగానాలు మొదలెట్టేశారు. ‘ఆర్ఆర్ఆర్’ అప్డేట్ అని కొందరు, ‘సైరా’ అప్డేట్ అని మరికొందరు ఊహించారు. కానీ తన తల్లితో దిగిన రెండు ఫొటోలను అప్లోడ్ చేశారు. ‘‘కొన్ని విషయాలు ఎప్పటికీ మారవు. నా తొలి ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌ను మా అమ్మకు అంకితం చేస్తున్నాను. అమ్మా.. లవ్ యు’’ అని క్యాప్షన్ చేశారు చరణ్. ఇక సినిమాల విషయానికి వస్తే రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ మరో హీరో అనే సంగతి తెలిసిందే. -
చిరు బ్రేక్
కొంతకాలంగా ‘సైరా: నరసింహారెడ్డి’ సినిమాతో బిజీ బిజీగా ఉన్న చిరంజీవి కాస్త విరామం కోసం తన సతీమణి సురేఖతో కలిసి జపాన్ రాజధాని టోక్యో వెళ్లారు. ఈ సందర్భంలోనిదే ఇక్కడున్న ఫొటో. ఈ ఫొటోను చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్‌చరణ్ నిర్మాతగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. దసరాకు విడుదల చేయాలనకుంటున్నారట. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తారు. -
అంతుపట్టని పరకాల తీర్పు
సాక్షి, పరకాల రూరల్: పోరాటాల గడ్డగా పేరుగాంచిన పరకాల నియోజకవర్గం సంచలనాలకు కేంద్ర బిందువు. నియోజకవర్గ ప్రజల తీర్పు ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. పరకాలలో గెలుపోటములను అంచనా వేయడం కష్టం. ఇక్కడి నుంచి ఇద్దరు మాత్రమే రెండోసారి విజయం సాధించారు. మిగతావారు ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు. 1952లో పరకాల నియోజకవర్గంగా ఏర్పడిన తర్వాత 15 సార్లు ఎన్నికలు జరుగగా ఇద్దరికి మాత్రమే రెండోసారి గెలుపు వరించింది. జిల్లా నుంచి తొలి మహిళ మంత్రిని అందించిన ఘనత పరకాలకే దక్కింది. ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురికి రాష్ట్రమంత్రి వర్గంలో అవకాశం దక్కింది.1952లో జనరల్ సీటుగా ఉన్న పరకాల ఆ తరువాత ఎస్సీకి రిజర్వుడ్ అయింది. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన తరువాత మళ్లీ జనరల్ సీటుగా మారింది. పోరుగడ్డగా ఉన్న పరకాల గతంలో భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి, చిట్యాల, మొగుళ్లపల్లితోపాటు రేగొండ మండలంలోని తొమ్మిది గ్రామాలు మినహా మిగితా మండలం ఈ నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో అప్పటి శాయంపేట నియోజవర్గంలోని ఆత్మకూరు, గీసుకొండ, వర్ధన్నపేట నియోజకవర్గంలోని సంగెంతో పరకాల నియోజకవర్గం ఏర్పాటుచేశారు. 1952 నుంచి 72 వరకు జనరల్‌గా, 1978 నుంచి 2004 వరకు ఎస్సీలకు కేటాయించగా 2009 నుంచి జనరల్ స్థానంగా కొనసాగుతుంది. 15 సార్లు ఎన్నికలు జరిగితే పీడీఎఫ్ ఒక్కసారి, కాంగ్రెస్ ఆరు సార్లు, బీజేపీ మూడు సార్లు, టీఆర్ఎస్ రెండు సార్లు, టీడీపీ రెండు సార్లు, సీపీఐ ఒక్కసారి గెలుపొందాయి. తొలి మహిళా మంత్రి సురేఖ... పరకాల నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన కొండా సురేఖ దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఆరు నెలల పాటు పనిచేశారు. హ్యాట్రిక్ విజయం సాధించిన అనంతరం వైఎస్సార్ మంత్రివర్గంలో చోటు లభించడంతో సురేఖ జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా రికార్డు సాధించారు. ఇదే నియోజకవర్గం నుంచి 1983లో గెలిచిన బొచ్చు సమ్మయ్య కోట్ల విజయభాస్కర్‌రెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 1972లో గెలిచిన పి ధర్మారెడ్డి అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగల్రావు మంత్రివర్గంలో పనిచేశారు. పరకాల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలలో ముగ్గురు మంత్రి పదవులు చేజిక్కించుకున్నారు. సమ్మయ్య, జయపాల్‌కు రెండోసారి అవకాశం... 1952లో ఏర్పడిన పరకాల నియోజకవర్గంలో నాటినుంచి నేటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే రెండుసార్లు గెలిచే అవకాశం దక్కింది. మొదట్లో జనరల్ స్థానంలో ఉన్న పరకాల 1978లో ఎస్సీ రిజర్వుడ్ అయింది. దాంతో 78లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బొచ్చు సమ్మయ్య గెలుపొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించి మంత్రి పదవి పొందారు. 1985లో బీజేపీ నుంచి ఒంటేరు జయపాల్ గెలుపొందగా 1989లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి విజయం వరించింది. అప్పటి నుంచి పొత్తులతో సీట్లు తారుమారుతూ వచ్చాయి. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి ఒక్కొక్కరు ఒకేసారి ప్రాతినిథ్యం వహించగా సమ్మయ్య, జయపాల్ మాత్రం రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పరకాలకు మహిళా ఎమ్మెల్యేలు ఇద్దరే... నియోజకవర్గ ఆవిర్భావం నుంచి జరిగిన ఎన్నికల్లో ఇద్దరు మహిళలకు అవకాశం దక్కింది. తెలంగాణ ఉద్యమ ఫలితంగా అనూహ్యంగా టీఆర్ఎస్ తరపున అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న బండారి శారారాణి 34వేల 597 ఓట్ల మెజార్టీతో గెలుపొంది రికార్డు సష్టించారు. ఆ తర్వాత ఆ పార్టీ అధిష్టానానికే వ్యతిరేక గళం వినిపించారు. 2009లో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మంత్రి అయ్యారు. తిరుగులేని నేతగా ఎదిగిన జంగన్న.. పరకాల పట్టణానికి చెందిన బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డికి పరకాల అసెంబ్లీ సీటు ఎదురులేని నేతను చేసింది. 1967లో జనసంఘ్ నుంచి దీపం గుర్తుతో గెలుపొందిన జంగారెడ్డి సంచలనం సృష్టించారు. ఆ తదుపరి శాయంపేట నుంచి రెండు సార్లు విజయం సాధించారు. హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి మాజీ ప్రధాని పీవీ నర్సింహరావును ఓడించి చరిత్ర సష్టించారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ రెండుస్థానాల్లో గెలువగా అందులో ఒకటి జంగారెడ్డిదే కావడం విశేషం. -
సురేఖ–అభిషేక్ జంటకు రజతం
సామ్సన్ (టర్కీ): ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించింది. శనివారం జరిగిన ఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) ద్వయం 152–159తో యాసిమ్ బోస్టాన్–దెమిర్ ఎల్మాగాక్లి (టర్కీ) జోడీ చేతిలో ఓడిపోయింది. ఈ సీజన్లో జరిగిన నాలుగు వరల్డ్ కప్ టోర్నీలలో కాంస్యాలు సాధించినందుకు సురేఖ–అభిషేక్ ద్వయం సీజన్ ముగింపు టోర్నీకి అర్హత సాధించింది. మరోవైపు పురుషుల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో అభిషేక్ వర్మ కాంస్య పతకాన్ని సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 149–147తో కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా)పై విజయం సాధించాడు. -
వివాహిత ఆత్మహత్య
గూడూరు రూరల్: గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో నివాసం ఉంటున్న అల్లూరు సురేఖ(32) అనే వివాహిత గురువారం రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు శుక్రవారం ఉదయం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఏరియా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల మేరకు మనుబోలు మండలం చెర్లోపల్లికి చెందిన అల్లూరు సుబ్బయ్య, సురేఖలకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి స్వరూప, వినయ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవనోపాధి కోసం గత ఐదేళ్లుగా చెన్నూరులో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలోనే భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇటీవల మనుబోలు పోలీస్‌స్టేషన్‌లో కూడా భర్తపై సురేఖ ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు సర్దిచెప్పి పంపారు. మద్యానికి బానిసైన సుబ్బయ్య తమ కుమార్తెను తరచూ వేధిస్తుండేవాడని తల్లి సుశీలమ్మ కన్నీటిపర్యంతమైంది. భర్తే చంపి ఉంటాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ ఎం.బాబి తెలిపారు. -
బ్రదర్స్ ఇన్ బియర్డ్.. అన్నదమ్ముల అనుబంధం
మెగాస్టార్ చిరంజీవి 63వ జన్మదిన వేడుకలు బుధవారం కుటుంబ సభ్యుల మధ్య జరిగాయి. అన్నయ్యకు శుభాకాంక్షలు తెలియజేయడానికి తమ్ముడు పవన్ కల్యాణ్ తన సతీమణి అన్నా లెజెనోవా, కుమార్తె పొలెనా, కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్లతో కలిసి చిరంజీవి స్వగృహానికి వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘బ్రదర్స్ ఇన్ బియర్డ్ (గడ్డం).. ఇంట్లో నాన్నగారి బర్త్‌డే లంచ్‌కి బాబాయ్ వచ్చారు. అన్నదమ్ముల అనుబంధం’’అని పేర్కొన్నారు. ‘‘మోస్ట్ గార్జియస్ అండ్ కైండెస్ట్ మామయ్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మా ఫ్యామిలీకి మామయ్యే బలం అండ్ మేజర్ ఇన్స్పిరేషన్’’ అని రామ్‌చరణ్ సతీమణి ఉపాసన పేర్కొన్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ, కుమారుడు అయాన్, కుమార్తె అర్హా, అల్లు శిరీష్.. ఇలా కుటుంబ సభ్యుల మధ్య బర్త్‌డే వేడుక జరిగింది. భార్య సురేఖ, కుమార్తె శ్రీజ, అల్లుడు కల్యాణ్ దేవ్, మనవరాలు నివృతితో కలిసి చిరు దిగిన ఫొటో ఓ హైలైట్. అలాగే విదేశాల్లో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని హైదరాబాద్ చేరుకున్న కళాబంధు టి. సుబ్బరామిరెడ్డిని పరామర్శించారు చిరంజీవి. సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉంది. చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇది’’ అన్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే మంగళవారం రాత్రి ఫ్యాన్స్ సమక్షంలో చిరంజీవి బర్త్ డే వేడుకలు హైదరాబాద్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో నటుడు సునీల్‌కి పద్మశ్రీ అల్లు రామలింగయ్య అవార్డును ప్రదానం చేశారు. నిర్మాత అల్లు అరవింద్, నటులు నాగబాబు, రామ్‌చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్ పాల్గొని ప్రసంగించారు. -
ప్రతి దానికీ పితాని ఇబ్బంది పెట్టారు
-
దళితురాలిననే వివక్ష
పశ్చిమగోదావరి ,ఏలూరు (మెట్రో) : ‘దళిత మహిళను కాబట్టే నాకు తీవ్ర అన్యాయం చేశారు. ప్రజలచే ఎన్నుకోబడినా మంత్రి పితాని అధికారంతో ఏ పనులూ చేయలేకపోయా, అవమానం భరించలేక, అడుగడుగునా మంత్రి పితాని అడ్డుపడటంతోనే ఎంపీపీ పదవికి రాజీనామా చేస్తున్నాను’ ఇవి అధికార పార్టీకి చెందిన పెనుగొండ మండల ఎంపీపీ సురేఖ వ్యాఖ్యలు. తెలుగుదేశంలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతూనే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా పెనుగొండ మండల ఎంపీపీ పదవి వివాదం రాజీనామా వరకు వెళ్లింది. పెనుగొండ ఎంపీపీగా ఎప్పటి నుండో పార్టీని అంటిపెట్టుకుని ఉండే సురేఖకు పార్టీ నాయకులు పగ్గాలు అందించారు. అయితే చివరి నిమిషంలోటీడీపీలో చేరిన పితాని సత్యనారాయణ ఎమ్మెల్యేగా విజయం సాధించి అనంతరం మంత్రి పదవి చేపట్టారు. ఇక్కడ వరకూ బాగానే ఉన్నప్పటికీ సురేఖ పితాని వర్గం కాకపోవడంతో మరో వ్యక్తిని ఎంపీపీగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో సురేఖ ఎంపీపీగా రెండున్నరేళ్లు, పితాని వర్గం వ్యక్తి మరో రెండున్నరేళ్లు ఎంపీపీగా కొనసాగుతారనే అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. దీంతో రెండున్నరేళ్ల అనంతరం సురేఖను రాజీనామా చేయించి పితాని వర్గం వ్యక్తికి ఎంపీపీ పదవి అప్పగించాలని ఒత్తిడి తీసుకొచ్చారు. సురేఖ వినకుండా నాలుగు సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ఇక చేసేది లేక మంత్రి పితాని సురేఖపై అవిశ్వాసం అస్త్రం ప్రయోగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సురేఖ నేరుగా జిల్లా కేంద్రానికి చేరుకుని జిల్లా పరిషత్ సీఈఓ నాగార్జునాసాగర్‌కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయాన్ని జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి, రాష్ట్ర నాయకులు కళా వెంకట్రావుకు, అయ్యన్నపాత్రుడుకి చెప్పానని, అయినా మంత్రి మాటకే పెద్దపీట వేసి తన మాటను ఏమాత్రం పట్టించుకోలేదని సురేఖ వాపోయారు. ఈ నాలుగు సంవత్సరాల కాలంలో దళితురాలిని, మంత్రి పితాని వర్గం మనిషి కాకపోవడంతో అధికారులెవరూ తనకు సహకరించలేదని ఆమె తెలిపారు. నాలుగు సంవత్సరాల పాటు అడుగడునా మంత్రి అడ్డుతగులుతూనే ఉన్నారని ఆమె వాపోయారు. ప్రొటోకాల్ ప్రకారం వడలి పశుశుల ఆసుపత్రి నిర్మాణంలో శిలాఫలకంపై పేరు వేయకపోవడంతో ఆందోళన చేసి పేరు వేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందనీ, పెన్షన్లు ఇవ్వాలన్నా దళిత మహిళనని పితాని తనమాటను చెల్లుబాటు కానీయలేదని సురేఖ పేర్కొన్నారు. నాయకులెవరూ సహాయం చేయకున్నా టీడీపీలోనే కొనసాగుతానని ఆమె ఈ సందర్భంగా చెప్పారు. -
అధిష్టానంతో మాట్లాడాకే రాజీనామా చేస్తా
పెనుగొండ: ఎంపీపీ పదవికి తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని, అయితే అధిష్టానానికి ఇక్కడి పరిస్థితిని వివరించాకే చేస్తానని పెనుగొండ ఎంపీపీ పల్లి జూలీ సురేఖ స్పష్టం చేశారు. సోమవారం ఆమె విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల ముందు ఎటువంటి ఒప్పందం లేకపోయినా, ఒప్పంద ఉల్లంఘన అంటూ ఆరోపణలు చేయడం అన్యాయమన్నారు. అయినా రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు వివరించారు. ఈ మేరకు ముందే సిద్ధం చేసుకున్న రాజీనామా లేఖను విలేకర్లకు చూపించారు. ఈ నెల 25వ తేదీ అనంతరం రాజీనామా లేఖను అందచేస్తానని వివరించారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో ఎన్నికల ముందు జరిగిన, ఎన్నికల అనంతరం జరిగిన సంఘటనలు వివరిస్తాననితెలిపారు. తన వాణి అధిష్టానం వద్ద వివరించిన అనంతరం రాజీనామా చేస్తానని తెలిపారు. ఎన్నికల ముందు తనను ఓడించడానికి కొందరు ప్రయత్నం చేసినా ప్రజల అండతో గెలిచానన్నారు. ఎన్నికల అనంతరం అవాంతరాలు కూడా సృష్టించారన్నారు. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ, పార్టీ పటిష్టతకు కృషి చేశానని తెలిపారు. 2న అవిశ్వాస తీర్మానం ఆగస్టు 2వ తేదీన అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీన 18 మంది ఎంపీటీసీలు, ఓ కోఆప్షన్ సభ్యుడు అవిశ్వాస తీర్మానాన్ని కొవ్వూరు ఆర్డీవో వైఎస్‌వీకేజీఎస్‌ఎల్ సత్యనారాయణకు అందించారు. ఎంపీపీ పదవికి రాజీనామాపై ఇరువర్గాల మధ్య ఏడాది కాలంగా రగడ జరుగుతోంది. ఎంపీపీని అయిదేళ్లలో రెండు భాగాలు పంచుకోవాలని నిర్ణయించుకొని మొదటి రెండున్నర సంవత్సరాలు పల్లి జూలీ సురేఖకు, రెండవ భాగంలోని రెండున్నర సంవత్సరాలు చీకట్ల భారతికి కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఒప్పందం ప్రకారం జనవరి 5వ తేదీ 2017 సంవత్సరం నాటికి పల్లి జూలీ సురేఖకు పదవీ కాలం ముగిసింది. అయితే, ఎన్నికల ముందు ఎటువంటి ఒప్పందం లేదని, ఎన్నికల అనంతరం బలవంతంగా ఒప్పందం చేశారని ఆరోపిస్తూ పల్లి జూలీ సురేఖ రాజీనామా చేయడానికి ససేమీరా అనడంతో వివాదం ఏర్పడింది. దీంతో ఎంపీటీసీలు అందరూ సమావేశమై అవిశ్వాస తీర్మానం నోటీసును ఆర్డీవోకు అందించారు. ఈ నేపథ్యంలో ఎంపీపీ పల్లి జూలీ సురేఖ రాజీనామా చేస్తానంటూ ప్రకటించడం విశేషం. రాజీనామాకు దారి తీసిన సంఘటనలు, అవిశ్వాస తీర్మానం వెనుక ఉన్న రాజకీయాలను అధిష్టానానికి వివరించిన తరువాతే రాజీనామా చేస్తానని సురేఖ చెప్పడం కొస మెరుపు. -
ఎంపీపీ సురేఖపై అవిశ్వాస తీర్మానం
పశ్చిమగోదావరి, పెనుగొండ : పెనుగొండ ఎంపీపీ పల్లి జూలీ సురేఖపై ఎంపీటీసీ సభ్యులు అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సన్నద్ధమయ్యారు. ఈ మేరకు ఆర్డీఓ ఫార్మాట్లో మండలంలోని 18 మంది ఎంపీటీసీలు, ఓ కోఆప్షన్ సభ్యుడు అవిశ్వాస తీర్మానాన్ని కొవ్వూరు ఆర్డీఓ వైఎస్‌వీకేజీఎస్‌ఎల్ సత్యనారాయణకు గురువారం అందించారు. ఎంపీపీ పదవికి రాజీనామాపై ఇరువర్గాల మధ్య ఏడాది కాలంగా రగడ జరుగుతోంది. ఎంపీపీ పదవిని అయిదేళ్లలో రెండు భాగాలుగా ఇద్దరు పంచుకోవాలని మొదట్లో నిర్ణయించుకున్నారు. మొదటి రెండున్నర సంవత్సరాలు పల్లి జూలీ సురేఖకు, రెండవ భాగంలోని రెండున్నర సంవత్సరాలు చీకట్ల భారతికి కేటాయించాలని అనుకున్నారు. ఒప్పందం ప్రకారం జనవరి 5వ తేదీ 2017 నాటికి పల్లి జూలీ సురేఖకు పదవీ కాలం ముగిసింది. అయితేఎన్నికల ముందు ఎటువంటి ఒప్పందం లేదని, ఎన్నికల అనంతరం బలవంతంగా ఒప్పందం చేశారని ఆరోపిస్తూ పల్లి జూలీ సురేఖ రాజీనామా చేయడానికి ససేమిరా అనడంతో వివాదం ఏర్పడింది. టీడీపీ నాయకులు ఎంత ప్రయత్నించినా ఆమె రాజీనామా చేయలేదు. దీంతో మండల పరిషత్‌లోని నిబంధనల ప్రకారం నాలుగేళ్లు దాటితే గాని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం లేకపోవడంతో ఇప్పటి వరకూ వేచి చూశారు. జూలై 4తో నాలుగేళ్లు ముగిసిన తరుణంలో ఎంపీటీసీలు అందరూ సమావేశమై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టడానికి నిర్ణయించారు. తొలుత అధికార టీడీపీ పక్ష ఎంపీటీసీలతో పాటు, బీజేపీ, వైఎస్సార్ సీపీ ఎంపీటీసీల నుంచి సంతకాలు సేకరించారు. అయితే ఆర్డీఓ నేరుగా కొవ్వూరులోనే సంతకాలు పెట్టాలని సూచించడంతో అవిశ్వాస తీర్మానంపై అందుబాటులో ఉన్న 18 మంది ఎంపీటీసీలు గురువారం కొవ్వూరు వెళ్లి ఆర్డీఓకు సంతకాలు చేసిన లేఖను అందించినట్లు తెలిసింది. 15 రోజులలో నోటీసులు జారీ చేసి సమావేశం ఏర్పాటు చేస్తానని ఆర్డీఓ ఎంపీటీసీలకు హామీ ఇవ్వడంతో వారు వెనుతిరిగారు. ఎంపీటీసీల నందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంలో పెనుగొండ, ఆచంట ఏఎంసీ చైర్మన్లు సానబోయిన గోపాలకృష్ణ, ఉప్పలపాటి సురేష్ బాబు, జడ్పీటీసీ రొంగల రవికుమార్, టీడీపీ మండల అధ్యక్షుడు వెలిచేటి బాబూ రాజేంద్ర ప్రసాద్‌లు గట్టి కృషి చేశారని అంటున్నారు. అవిశ్వాస తీర్మానం కారణంగా తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన విభేదాలు ముందుముందు ఏ పరిణామాలకు దారితీస్తాయోనని పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. -
జ్యోతి సురేఖ–అభిషేక్ జంటకు కాంస్యం
సాల్ట్ లేక్ సిటీ (అమెరికా): ఈ ఏడాది తన అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తూ ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన ఖాతాలో నాలుగో పతకాన్ని జమ చేసుకుంది. ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–3 టోర్నీలో జ్యోతి సురేఖ కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కే చెందిన అభిషేక్ వర్మతో కలిసి కాంస్య పతకం సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ ద్వయం 147–140తో జేమీ వ్యాన్ నట్టా–క్రిస్ స్కాఫ్ (అమెరికా) జోడీపై గెలుపొందింది. మరోవైపు పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ రజతం సంపాదించాడు. ఫైనల్లో అభిషేక్ 123–140తో స్టీఫెన్ హాన్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ ఏడాది సురేఖ షాంఘై, అంటాల్యా ప్రపంచకప్‌లలో రెండు కాంస్యాలు, ఒక రజతం సాధించింది. -
సురేఖ జంటకు కాంస్యం
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నమెంట్లో భారత్‌కు ఏకైక కాంస్య పతకం లభించింది. కాంపౌండ్ మిక్స్డ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ జోడీ మూడో స్థానంలో నిలిచింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో సురేఖ–అభిషేక్ ద్వయం 154–148తో యాసిమ్ బోస్టాన్–దెమిర్ ఎల్మాగాక్లి (టర్కీ) జోడీపై విజయం సాధించింది. మరోవైపు కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో భారత జట్లకు నిరాశ ఎదురైంది. కాంస్య పతక మ్యాచ్‌ల్లో జ్యోతి సురేఖ, మధుమిత, ముస్కాన్‌లతో కూడిన భారత మహిళల జట్టు 221–223తో నెదర్లాండ్స్ చేతిలో... అభిషేక్ వర్మ, చిన్నరాజు శ్రీధర్, రజత్ చౌహాన్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 232–234తో ఫ్రాన్స్ జట్టు చేతిలో ఓడిపోయాయి. -
జ్యోతి సురేఖకు మరో పతకం
ఢాకా (బంగ్లాదేశ్): ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు అమ్మాయి వెన్నం జ్యోతిసురేఖ స్వర్ణంతో మెరిసింది. గురువారం జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ సభ్యురాలిగా ఉన్న భారత బృందం విజేతగా నిలిచింది. దీంతో జ్యోతి సురేఖ ఖాతాలో మూడో పతకం చేరింది. కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కాంస్యాన్ని సాధించిన సురేఖ మిక్స్డ్ కాంపౌండ్ ఈవెంట్లో రజతాన్ని గెలుచుకుంది. ఫైనల్లో జ్యోతి సురేఖ, పర్వీనా, త్రిషాలతో కూడిన భారత జట్టు 230–227తో కొరియాపై గెలుపొందింది. ఈ పోరులో సురేఖ నిర్ణీత 80 పాయింట్లకు గానూ 80 స్కోరు చేయడం విశేషం. అంతకుముందు సెమీఫైనల్లో భారత్ 228–213తో బంగ్లాదేశ్‌పై, క్వార్టర్స్‌లో 233–222తో హాంకాంగ్ జట్టుపై విజయం సాధించింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యాన్ని సాధించింది. -
సురేఖకు ప్రధాని అభినందన
‘అర్జున అవార్డు’కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసింది. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన మోదీ... భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పార్లమెంట్ సభ్యులు గోకరాజు గంగరాజు, మురళీమోహన్, ‘శాప్’ చైర్మన్ పీఆర్ మోహన్ తదితరులు సురేఖ వెంట ఉన్నారు. -
అన్నాచెల్లికి అంతర్జాతీయ గుర్తింపు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ‘అనంత’ నగరానికి చెందిన వర్షిత్‌కుమార్, హారిక షటిల్లో సత్తా చాటి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. షటిల్ క్రీడా ప్రపంచంలోకి అడుగిడిన రెండేళ్లలోనే అంతర్జాతీయ ఆటలో పాల్గొని ఔరా అనిపించారు. టేబుల్‌టెన్నిస్‌లో జాతీయస్థాయి క్రీడాకారుడిగా గుర్తింపు సాధించిన వాళ్ల మేనమామ శ్రీధర్‌బాబే వారికి రోల్ మోడల్. ప్రారంభం కానున్న విద్యా సంవత్సరంలో వర్షిత్‌కుమార్ 9వ తరగతికి, హారిక 5వ తరగతికి వెళ్లనున్నారు. ఒలంపిక్సే లక్ష్యంగా వర్షిత్ 2014లో స్థానిక ఇండోర్ స్టేడియంలో కోచ్ జీవన్‌కుమార్ వద్ద షటిల్ పాఠాలు నేర్చుకున్న వర్షిత్ తన మొదటి టోర్నీలోనే రెండవ స్థానంలో నిలిచాడు. అండర్ - 13 స్కూల్ గేమ్స్‌లో డబుల్స్ విన్నర్‌గా ఒకసారి, సింగల్స్ రన్నర్‌గా రెండుసార్లు నిలిచాడు. రూరల్ చాంపియన్‌షిప్‌లో మూడవ స్థానంలో నిలిచి జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌కు ఎదిగాడు. అందులో మూడవ స్థానం సాధించి జాతీయస్థాయి టోర్నీకి ఎంపికయ్యాడు. హర్యానాలో నిర్వహించిన జాతీయస్థాయి టోర్నీలో వెండి పతకం తెచ్చాడు. దీంతో ఇండో - నేపాల్ అంతర్జాతీయ టోర్నీలో పాల్గొనే వచ్చింది. అక్కడ బంగారు పతకం సాధించాడు. వర్షిత్ భారతదేశం తరపున ఒలంపిక్స్‌లో రాణించాలనేది తల్లిదండ్రుల ఆకాంక్ష. దానిని నెరవేర్చేందుకు శ్రమిస్తున్నాడు. రెండింటా రాణిస్తున్న హారిక సోదరునితో కలిసి ఇండోర్ స్టేడియంలోనే షటిల్ నేర్చుకున్న హారిక చదువులోనూ దిట్ట. ఇంటర్నేషనల్ మ్యా«థ్స్ ఒలంపియాడ్లో బంగారు పతకం సాధించింది. జిల్లాస్థాయి టోర్నీలో 2015లో విన్నర్‌గాను, 2016లో రన్నర్‌గానూ నిలిచింది. రాష్ట్రస్థాయి పోటీల్లో మూడవ, రెండవ స్థానాల్లో నిలిచింది. జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో జాతీయస్థాయి టోర్నీలో రెండవ స్థానం సాధించి, యూత్ రూరల్ గేమ్స్ జాతీయస్థాయి టోర్నీలో బంగారు పతకం తెచ్చింది. అంతర్జాతీయ స్థాయి ఇండో - నేపాల్ టోర్నీలోనూ బంగారు పతకం సాధించింది. గత నెలలో నిర్వహించిన జోన్ - 1 గ్రిగ్స్‌లో డబుల్స్ విన్నర్‌గా నిలిచింది. క్రీడలతోపాటు చదువులోనూ రాణిస్తూ రెండింటా సత్తా చాటుతోంది. కుటుంబ నేపథ్యం తండ్రి గణేష్‌కుమార్‌ది వ్యాపారం. తల్లి సురేఖ వైద్యశాఖలో పని చేస్తున్నారు. పిల్లలిద్దరూ ఆటల్లో రాణించడం వారికి చాలా ఆనందాన్నిస్తోంది. సింధు స్ఫూర్తితో ఒలంపిక్స్ లక్ష్యంగా బాబును, చదువులో రాణించే విధంగా పాపను ముందుకు తీసుకెళ్తున్నారు. కోచ్ జీవన్‌కుమార్ సహకారం వల్లే తమ పిల్లలు ఈ స్థాయికి వచ్చారని చెబుతున్న గణేష్, సురేఖ వారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. -
పెనుగొండ ఎంపీపీ సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
పెనుగొండ : పెనుగొండ ఎంపీపీ పల్లి జూలీ సురేఖను టీడీపీ నుంచి బహిష్కరిస్తూ ఎంపీపీ పదవిపై ఏర్పడిన వివాదానికి తెరవేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. జూలి సురేఖను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఇన్చార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రకటిస్తారని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆదివారం ప్రకటించారు. పెనుగొండ మండల పరిషత్‌లో ఎంపీపీ వివాదం టీడీపీకి తలనొప్పిగా మారింది. ఎన్నికల సమయంలో జరిగిన ఒప్పందం ప్రకారం ఎంపీపీగా తొలుత పల్లి జూలీ సురేఖకు రెండున్నర సంవత్సరాలు, అనంతరం చీకట్ల భారతి కొనసాగేవిధంగా అంగీకరించారు. రెండున్నరేళ్లు పూరై్తనా తాను రాజీనామా చేసేది లేదంటూ సురేఖ తేల్చిచెప్పడంతో టీడీపీలో వివాదం రాజుకుంది. కొందరు నేతలు సురేఖకు మద్దతు ప్రకటిస్తున్నారన్న అనుమానాలు ఉండడంతో ఎంపీటీసీలతో చర్చించారు. టీడీపీకి చెందిన 17 మంది ఎంపీటీసీలు ఏకతాటిపైకి రావడంతో జిల్లా నాయకత్వానికి ఎంపీపీ వివాదాన్ని తెలియచెప్పారు. ఎమ్మెల్యే పితాని ఆధ్వర్యంలో మండలానికి చెందిన కొందరు నాయకులు ఎంపీపీ వివాదాన్ని నారా లోకేష్‌కు వివరించడంతో జిల్లా ఇ¯ŒSచార్జి మంత్రి అయ్యన్నపాత్రుడు ఎంపీపీతో చర్చించి నిర్ణయం తీసుకోమని ఆదేశించినట్టు తెలిసింది. దీనిపై శనివారం ఏలూరులో జరిగిన సమావేశంలో చర్చించినా ఎటువంటి ఫలితం లేకపోవడంతో చివరకు ఎంపీపీని సస్పెండ్ చేయడానికి నిర్ణయించారు. వైస్ ఎంపీపీగా చీకట్ల భారతి కాగా ఎంపీపీగా ఆఖరి రెండున్నర సంవత్సరాలు కొనసాగాల్సిన చీకట్ల భారతిని వైస్ ఎంపీపీగా ఎంపిక చేయడానికి నిర్ణయించారు. ఒప్పందం ప్రకారం దేవ ఎంపీటీసీ మన్నే శ్రీహరి విశ్వేశ్వరరావు పెండ్లికొడుకు వైస్ ఎంపీపీగా ఎన్నిక కావాల్సి ఉన్నా భారతికి అన్యాయం జరిగిందన్న కారణంతో పాటు ఎంపీపీకి చెక్ పెట్టేందుకు ఆమెను ఎంపిక చేశారు. ఇదిలా టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్టు తనకు ఎటువంటి సమాచారం అందలేదని పల్లి జూలీసురేఖ చెప్పారు. -
మైనర్లుగా అదృశ్యం..మేజర్లుగా ప్రత్యక్ష్యం
►పిల్లల ఆచూకీ కోసం సీఐడీని ఆశ్రయించిన తల్లి ►ఇంట్లో మార్పు వచ్చేంత వరకూ వెళ్ళేది లేదన్న కూతుళ్ళు ►పదేళ్లుగా అనాథాశ్రమంలో ఆశ్రయం మారేడుపల్లి: అదృశ్యమైన తన కూతుళ్ళ ఆచూకీ కనుక్కోవాలంటూ ఓ తల్లి ప్రిన్సిపాల్ సెక్రటరీ, సీఐడి, నార్త్ జోన్ డిసిపి ని ఆశ్రయించడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారు ఓ స్వచ్చంద సంస్థ లో ఆశ్రయం పొందుతున్నట్లు గుర్తించి, తల్లికి అప్పజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తల్లి ప్రవర్తనలో మార్పు వస్తే తప్ప, తాము వేళ్ళేది లేదంటూ సదరు కుమార్తెలు భీష్మించుకున్నారు. మారేడుపల్లి సీఐ ఉమమాహేశ్వర్ రావు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. అల్వాల్ లోతుకుంటకు చెందిన లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు. చిన్నతనంలోనే భర్త మరణించడంతో ఇళ్లలో పాచి పని చేసుకుంటూ జీవనం సాగించేది. మధ్యానికి బానిసైన లక్ష్మి తన కుమార్తెలు సురేఖ ,జ్యోతి ల ను చిత్రహింసలకు గురిచేస్తుండటంతో 2008లో వారు ఇంటినుంచి పారిపోయి మారేడుపల్లిలో ఉంటున్న పెద్ద నాన్న రాములును ఆశ్రయించారు. దీంతో అక్కడికి వెళ్లిన లక్ష్మి తన బిడ్డలను అప్పగించాలని గొడవపడటంతో బిడ్డలను తల్లికి అప్పగించారు. అయితే తల్లితో వెళ్ళడం ఇష్టంలేని వారు అందుకు నిరాకరించడంతో పికెట్ బస్తీ వాసులు వారిని చేరదీసి స్థానిక నాయకురాలు దమయంతి సహకారంతో మహెంద్రహిల్స్ లోని ‘జాయ్ ఫర్ చిల్డ్రన్’ స్వచ్చంద సంస్థకు అప్పగించారు. నిర్వాహకురాలు డాక్టర్ జ్యోతి వారి కి విద్యాబుద్దులు నేర్పించింది. ప్రస్తుతం సురేఖ ( 21 ) యం. యల్. టి చదువుతుండగా, జ్యోతి (20) డిగ్రీ చదువుతోంది. పిల్లల ఆచూకి కోసం సీఐడి కి ఫిర్యాదు చేసిన తల్లి గత ఏడాది నవంబర్‌లో తన పిల్లల ఆచూకీ తెలియడం లేదని, వారి పెద్ద నాన్న రాములు తన బిడ్డలతో అనైతికమైన పనులు చేయిస్తున్నాడని లక్ష్మి ప్రిన్సిపల్ సెక్రటరీకి, సీఐడీ విభాగానికి , పోలీస్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన మారేడుపల్లి పోలీసులు పెద్దనాన్న రాములు, అతని భార్య గంగమ్మ ను విచారించగా, 2008 లో తన దగ్గర కు వచ్చిన పిల్లలను అప్పుడే తల్లి కి అప్పజెప్పినట్లు తెలిపారు. దయమణి ద్వారా పిల్లలు ఉంటున్న స్వచ్చంద సంస్థ ఆశ్రమాన్ని గుర్తించిన పోలీసులు, పిల్లలను వారి తల్లి కి అప్పగించేందుకు ప్రయత్నించారు. అయితే వారు తమ తల్లి వద్దకు వెళ్ళెది లేదని , చిన్నతనం నుంచి ఆశ్రమంలోనే పెరిగామని, అక్కడే ఉంటామని తెల్చి చెప్పారు. పోలీసులు వారిని కోర్టులో హాజరు పరిచారు. మేజర్లయినందున వారి సొంత నిర్ణయం తీసుకోవచ్చన్న కోర్టు, పిల్లల ఇష్ట ప్రకారం వారు కోరుకున్న చోటుకి చేర్చాలని ఆదేశించింది. దీంతో వారిని స్టేట్ హోం కు తరలించారు. -
ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్: సురేఖ, సుస్మిత
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శనివారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దకుమార్తె సుస్మిత ఇవాళ ఉదయం ఫిల్మ్‌నగర్ దేవస్థానంలోని ఆంజనేయస్వామికి పూజలు జరిపించారు. 'ఫ్యాన్స్ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రతి సంవత్సరం ఆయన బాగుండాలని పూజలు చేస్తున్నారు. అందరూ బాగుండాలి. మా కుటుంబం ప్రతి అభిమానికి రుణపడి ఉంటాం' అని చిరంజీవి సతీమణి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. చిరు కుమార్తె సుస్మిత మాట్లాడుతూ...ఫ్యాన్స్ డాడీ బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. వారిందరికీ థ్యాంక్స్ అంటూ తెలిపింది. -
కమీషన్ పేరుతో దగా
సుమారు రూ.10 కోట్లు కాజేసిన దంపతులు బంజారాహిల్స్: లక్ష రూపాయలు ఇవ్వండి... నెలకు 10 శాతం కమీషన్ ఇస్తాం.. కావాలంటే మీ డబ్బు మధ్యలోనే వాపస్ తీసుకోవచ్చు.. ఇలా మాయమాటలు చెప్పి.. అమాయకుల నుంచి పెట్టుబడి పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న కేటుగాడిని బంజారాహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... ఒంగోలు నగరం బండ్లమిట్టకు చెందిన కానుగుల శ్రీనివాసరావు, సురేఖ దంపతులు గతకొంత కాలంగా జూబ్లీహిల్స్ రోడ్ నెం.71లోని నవ నిర్మాణ్‌నగర్‌లో ఓ ఖరీదైన ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని గ్రీన్వాల్ట్ గ్లోబల్ పేరుతో కార్యాలయం తెరిచారు. తమ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూజిలాండ్‌లో ఉందని, ఆంధ్రప్రదేశ్ శాఖకు తాను మేనేజర్‌నని శ్రీనివాసరావు స్థానికులను నమ్మించాడు. తమ సంస్థలో పెట్టుబడి పెడితే నెలకు 10 శాతం కమీషన్లు ఇస్తామని చెప్పి లక్షలాది రూపాయలు తీసుకున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివాసం ఉండే ఎస్కే మస్తాన్ కమీషన్‌కు ఆశ పడి తనతో పాటు బంధువులు, మిత్రులతో రూ. 53 లక్షలు కట్టించాడు. మూడు నెలల పాటు సక్రమంగానే కమీషన్లు ఇచ్చిన శ్రీనివాసరావు ఆ తర్వాత ముఖం చాటేశాడు. గట్టిగా అడిగేసరికి 2014 ఆగస్టు 3వ తేదీ రాత్రి బిచాణా ఎత్తేశాడు. బాధితులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలో దిగిన పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకోగా.. భార్య సురేఖ పరారీలో ఉంది. నిందితుడిపై ఐపీసీ సెక్షన్లు 420, 506 కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా, వీరి చేతిలో మోసపోయిన బాధితుల సంఖ్య భారీగానే ఉండవచ్చని పోలీసులకు అందిన ఫిర్యాదులు ద్వారా తెలుస్తోంది. కూకట్‌పల్లికి చెందిన ఎం.మురళీకృష్ణ, చిక్కడపల్లికి చెందిన ఆదిత్య మోహన్, మెహిదీపట్నంకు చెందిన సూర్యప్రకాశ్, సురేందర్‌రాజు, శ్రీనివాస్, శంకర్ తదితరులు కూడా ‘గ్రీన్వాల్ట్ గ్లోబల్’లో భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి మోసపోయామని ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదులపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు. నిందితుడు సుమారుగా 150 మంది నుంచి రూ. 10 కోట్ల వరకు వసూలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
సురేఖకు కేఎల్‌యూ అభినందన
సాక్షి, హైదరాబాద్: ఆసియా కప్ ఆర్చరీ పోటీల్లో స్వర్ణం, రెండు రజతాలు సాధించిన తమ విద్యార్థి జ్యోతి సురేఖను కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ (కేఎల్‌యూ) అభినందించింది. గుంటూరులోని కేఎల్ యూనివర్సిటీలో సీఎస్ఈ ద్వితీయ సంవత్సరం విద్యార్థిగా ఉన్న జ్యోతి సురేఖ గత రెం డేళ్ల కాలంలో అంతర్జాతీయస్థాయిలో 9 పతకాలు సాధించడం గర్వకారణంగా ఉందని కేఎల్‌యూ అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ తెలిపారు. తమ యూనివర్సిటీలో విద్య అభ్యసించేందుకు జ్యోతి సురేఖకు పూర్తి ఫీజును మినహాయించామని ఈ సందర్భంగా సత్యనారాయణ వివరించారు. -
చక్రి మృతిపై ముదురుతున్న వివాదం
‘విషం’ చిమ్ముకుంటున్న చక్రి కుటుంబసభ్యులు విచారణ ఎలా జరపాలో తెలియక తలలు పట్టుకుంటున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతిపై నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. చక్రి కుటుంబసభ్యులు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. తాజాగా తన కోడలు శ్రావణి, ఆమె తల్లిదండ్రులు సురేఖ, మధుసూదన్‌రావు, సోదరుడు భరద్వాజ్ కలిసి విష ప్రయోగం చేసి తన కొడుకును చంపేశారని ఆరోపిస్తూ చక్రి తల్లి విద్యావతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం శ్రావణి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భర్త మరణం విష ప్రయోగం వల్లే జరిగిందని, అత్త విద్యావతితో పాటు ఆడపడుచులు వారి భర్తలు, మరిది మహిత్ కారకులంటూ తొమ్మిది మందిపై ఆరోపణలు చేశారు. ఈ మేరకు చక్రి కుటుంబ సభ్యులపై క్రిమినల్ కేసు నమోదైంది. ఇది జరిగి 24 గంటలు గడవకముందే చక్రి తల్లి... శ్రావణిపై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయడం కలకలం రే పింది. మృతి చెందిన రోజు కోడలు శ్రావణి ఫోన్ చేసి చక్రిని తానే చంపానని చెప్పిందని చక్రి తల్లి విద్యావతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. చక్రి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని విద్యావతితోపాటు చక్రి తమ్ముడు మహిత్ కోరారు. తనపై కేసు లేకుండా చేసుకోవడానికి ముందస్తుగా తమను నేరస్తులుగా చిత్రీకరించేందుకు పోలీస్ స్టేషన్ లో శ్రావణి ఫిర్యాదు చేసిందని వారు వెల్లడించారు. దర్యాప్తు కష్టమేనంటున్న పోలీసులు చక్రి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో విచారణ ఎలా చేయాలో తెలియక జూబ్లీహిల్స్ పోలీసులు తల పట్టుకుంటున్నారు. చక్రి మృతి చెంది నేటికి 29 రోజులు గడిచాయి. ఇప్పటి వరకూ అతని మరణంపై ఎవరికీ ఎలాంటి అనుమానాలు కలగలేదు. చక్రిపై నిజంగా విష ప్రయోగం జరిగిందా లేక ఆస్తుల పంపకంలో తలెత్తిన వివాదాలతో పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారా అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకూ చక్రి మరణం సహజమా లేక హత్యా అనే విషయం తేల్చేందుకు ఇప్పుడు పోలీసుల వద్ద ఎలాంటి ఆయుధం లేదు. అతని బౌతికకాయానికి పంజాగుట్ట శ్మశాన వాటికలో గత నెల 15న దహన సంస్కారాలు కూడా జరిగాయి. వాస్తవానికి చక్రి మృతదేహానికి పోస్టుమార్టం జరగలేదు. ఖననం చేసినా మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించే అవకాశం ఉండేది. మరోపక్క చక్రి చనిపోయిన సమయంలో ఆయన్ని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు అతన్ని పరీక్షించి ఆసుపత్రికి రాకముందే చనిపోయాడని ధ్రువీకరించారు. కనీసం అక్కడ చికిత్స చేసినా రిపోర్టుల ద్వారా విష ప్రయోగం జరిగిందా లేదా అనేది తెలిసేది. ఇప్పుడా అవకాశం కూడా లేదు. దీంతో ఈ కేసు దర్యాప్తు కష్టమేనని పోలీసులు భావిస్తున్నారు. -
పాదగయలో చిరంజీవి భార్య
పిఠాపురం : ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి భార్య సురేఖ తదితరులు బుధవారం పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. వారికి ఈఓ చందక దారబాబు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారు శ్రీకుక్కుటేశ్వరస్వామిని, శ్రీపురుహూతికాఅమ్మవారిని, శ్రీరాజరాజేశ్వరీదేవిని, దత్తాత్రేయస్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సురేఖ తదితరులు ద్రాక్షారామలో భీమేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు. ఈ బృందంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వంగా గీత, ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరరావు భార్య తదితరులున్నారు. -
వరంగల్ టీఆర్ఎస్లో స్తబ్దత
సురేఖకు వ్యతిరేకంగా మెజారిటీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, నామినేటెడ్ భర్తీ తర్వాత కొత్త సమీకరణలు సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా నిలిచిన వరంగల్ జిల్లాలో మంత్రివర్గ విస్తరణలో అనుకోని స్తబ్దత నెలకొంది. నిన్నటి వరకు పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ ఉండగా, సీనియర్ నేత ములుగు ఎమ్మెల్యే అజ్మీరా చందులాల్ మంగళవారం మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో పదవి వచ్చినవారు, ఆశించి భంగపడిన వారు గుంభనంగానే ఉంటున్నారు. చందులాల్ 1989లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. చందులాల్‌కు రాజకీయంగా మొదటి నుంచీ వివాదరహితుడిగా పేరుంది. ఎలాంటి పదవి వచ్చినా తన నియోజకవర్గానికే పరిమితమవుతాడనే అభిప్రాయ మూ ఉంది. చందులాల్‌కు మంత్రి పదవి విషయంలో జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయానికే కట్టుబడతామని చెప్పినట్లు తెలిసింది. టీఆర్ఎస్కు చెందిన గిరిజన ఎమ్మెల్యేల్లో సీనియర్ కావడం, రాజకీయంగా కేసీఆర్ సమకాలికుడు కావడం మంత్రి పదవి వచ్చే విషయంలో చందులాల్‌కు అనుకూల అంశాలు పని చేశాయి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రి పదవిపై చివరికి వరకు ఆశలు పెట్టుకున్నారు. మహిళా ఎమ్మెల్యే కోటాలో అయినా ఆమెకు కేబినెట్ బెర్త్ దక్కుతుందని భావించారు. జిల్లాలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు సురేఖకు పదవి అంశంలో సీఎం కేసీఆర్ వద్ద వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎమ్మె ల్యే సురేఖ భర్త కొండా మురళీధర్‌రావుకు త్వరలో ఎన్నికలు జరగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం కల్పిస్తారని కేసీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. టీఆర్ఎస్లో చేరే సమయంలో సురేఖకు మంత్రి పదవిపై కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ‘కొండా’ వర్గీయు లు చెబుతున్నారు. జిల్లా నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, డిప్యూటీ సీఎంగా ఉన్న టి. రాజయ్య గానీ, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి న చందులాల్ గానీ ఇతర నియోజకవర్గాల్లో జో క్యం చేసుకోరనే పేరుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్లో రాజకీయంగా గ్రూపులు, వర్గాలకు ఇప్పటికిప్పుడు ఆస్కారం కనిపించడం లేదు. ఎమ్మె ల్సీ, నామినేటెడ్ పదవుల పంపకాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. ఓరుగల్లుకు ప్రాధాన్యం.. తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో వరంగల్ జిల్లాకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కింది. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య డిప్యూటీ సీఎం ఉన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే మధుసూదనచారి తొలి శాసనసభ స్పీకర్‌గా ఉన్నారు. జిల్లాకు చెందిన ఇద్దరు రిటై ర్డ్ ఐఏఎస్ అధికారులు బి.రామచంద్రుడు ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధి పదవి, బి.వి. పాపారావుకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవులు దక్కాయి. చందులాల్‌కు మంత్రి పదవి దక్కింది. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్కు సహాయ మంత్రి హోదా కలిగిన పార్లమెంట్ కార్యదర్శి పదవి వచ్చింది. -
తరగతులు పది.. టీచర్లు ముగ్గురే!
ఘట్కేసర్ టౌన్: ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతామని చెబుతున్న అధికారులు, ప్ర జాప్రతినిధుల మాటలు నీటిమూటలవుతున్నాయి. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించక పోవడంతో పేదల చదువుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. పాఠాలు బోధించేవారు లే క విద్యార్థులు టీసీలను తీసుకొని ఇతర పాఠశాలల్లోకి వెళ్తున్నారు. అయినా విద్యాధికారుల్లో చలనం రావడం లేదు. ఒకే భవనంలో బోధన... ఘట్కేసర్ పట్టణం బాలాజీనగర్‌లోని ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను 2012లో ఉన్నత పాఠశాలగా అప్‌గ్రేడ్ చేసినా ఒకే భవనంలో విద్యను బోధిస్తున్నారు. ప్రాథమిక పాఠశాలలో 46 మంది, ఉన్నత పాఠశాలలో 34మంది కలిపి మొత్తం 80 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పదో తరగతిలో 9 మంది విద్యార్థులున్నారు. ఈడబ్ల్యూఎస్ కాలనీ ప్రాథమిక పాఠశాల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయురాలు సురేఖ ప్రస్తుతం ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. హైస్కూలుగా ప్రమోట్ చేసినా ప్రైమరీ, హైస్కూల్ తరగతులు ఒకే భవనంలో నిర్వహించడంతో విద్యార్థులు, టీచర్లకు అగమ్యగోచరంగా ఉంది. ప్రాథమిక పాఠశాల రెగ్యులర్ టీచర్‌గా ఒకరు పనిచేస్తుండగా మూడు రోజుల క్రితం నారపల్లి నుంచి ఒక టీచర్ డిప్యూటేషన్‌పై వచ్చారు. ఇలా మొత్తం పది తరగతులకు ముగ్గురే టీచర్లు ఉన్నారు. అన్ని తరగతులకు వీరే బోధిం చడం సాధ్యం కాక విద్యార్థుల చదువు ముందుకు సాగడం లేదు. అనివార్య పరిస్థితుల్లో టీచర్లు రాకుంటే అంతే సంగతులు. ఉర్దూ మీడియం స్కూల్‌ను 2012లో అప్‌గ్రేడ్ చేసిన సర్కారు ఉపాధ్యాయులను మాత్రం ఇప్పటికీ కేటాయించలేదు. ఉర్దూ మీ డియం పాఠశాల కావడంతో ఐదో తరగతి ఉత్తీర్ణులు కాగానే విద్యార్థులు ఆరో తరగతికి ఆంగ్ల మాధ్యమం పాఠశాలలకు వెళ్తుండడంతో వారి సంఖ్య కూడా తగ్గుతోంది. -
నిజంగా... నా భార్యకు థ్యాంక్స్ చెప్పాలి
మనోగతం ఒక రోజు మా చెల్లెలు వినయ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ‘అన్నయ్యా...నాకు అమ్మనూ, నిన్నూ చూడాలనిపిస్తోంది. రేపు బయలుదేరి వస్తున్నాను’ అని ఫోన్ పెట్టేసింది. చెల్లి పెళ్లయి ఏడాది దాటింది. బెంగుళూరులో మకాం. నాన్న చిన్నప్పుడే చనిపోయారు. దాంతో వినయకు అన్నీ నేనే. రాత్రి నా గదిలో కూర్చుని ఏవో అత్తింటి విషయాలు చెబుతోంది. ‘మొన్నే పండక్కి వచ్చి వెళ్లారు కదా వినయా! మళ్లీ ఇప్పుడు ఇంత సడెన్‌గా...అదీ ఏ కారణం లేకుండా....’ అని నా మాటలు పూర్తికాకుండానే... ‘ఏం రాకూడదా అన్నయ్యా?’ అంది కోపంగా. వెంటనే వాళ్ల వదిన ‘అదేంటి వినయా? ఇది నీ ఇల్లు. నువ్వు ఎప్పుడైనా రావొచ్చు, వెళ్ళొచ్చు. నీ భర్త విషయంలో ఏదైనా ఇబ్బంది పడుతున్నావేమోనని ఆయన భయం’ అంది. ‘నెలరోజుల నుంచి ఆయన ప్రవర్తన, మాటలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఆఫీసు నుంచి ఓ గంట ఆలస్యమైతే చాలు... ఎక్కడికెళ్లావు, ఎందుకు ఆలస్యం... అంటూ తిడుతున్నారు. ఒకరోజు నేను షాపింగ్‌కి వెళ్లి వచ్చేసరికి ఓ రెండు గంటలు ఆలస్యమైంది. అంతే! ఎవరితో తిరగడానికి వెళ్లావు...అన్నారు. ఆ మాట విన్నాక నాకు ఆయన మీద అసహ్యం పుట్టింది’ అంది చిరాగ్గా మొహం పెట్టి. పడుకునే ముందు సురేఖతో ‘వినయ అంత బాధపడుతుంటే ఓదార్చాల్సింది పోయి పట్టీపట్టన్నట్లు ప్రవర్తించడం నాకు నచ్చలేదు’ అన్నాను. ‘ప్రపంచంలో ఇలాంటి కష్టం మీ ఒక్క చెల్లెలికే వచ్చినట్టు ఫీలవడం చూస్తుంటే నాకు నవ్వొస్తోందండి’ అంది. వెంటనే నాకు పెళ్లయిన కొత్తలో రోజులు గుర్తొచ్చాయి. సురేఖ అప్పట్లో టీచర్‌గా పనిచేసేది. ఒకరోజు సాయంత్రం బాగా ఆలస్యంగా వచ్చింది. ఆ రోజు ఎవరో తోటి ఉపాధ్యాయురాలు పదవీ విరమణ వేడుకేదో ఉంటే ఆలస్యమైంది. విషయం తెలుసుకోకుండా నేను సురేఖతో నోటికొచ్చినట్టు మాట్లాడాను. ‘అడ్డమైన తిరుగుళ్ల కోసం ఉద్యోగమైతే వెంటనే ఉద్యోగం మానేయ్’ అని నేనన్న మాటలకు సురేఖ వెంటనే ఉద్యోగం మానేసింది. నాకు బాగా గుర్తు ఓ నాలుగురోజులు అన్నం తినలేదు తను. పదిరోజులవరకూ నాతో మాట్లాడలేదు. తర్వాత ఇంట్లో ఆర్థికంగా ఇబ్బందులు మొదలవడంతో మళ్లీ ఉద్యోగంలో చేరింది. ఈ రోజు నా చెల్లెలు ఏడవడం, సురేఖ నవ్వడం...ఏదీ తప్పు కాదని మనసులో అనుకుంటూ నిద్రపోయాను. మర్నాడు పొద్దున వంటింట్లో సురేఖ, వినయకు కౌన్సెలింగ్ ఇస్తోంది. ‘వాళ్లు మనని అంతకంటే పెద్దమాట ఏమనగలరు? ఈసారి అలాంటి మాటలన్నప్పుడు భోరుమంటూ ఏడవకుండా చిన్నగా నవ్వి ఊరుకో. కొన్ని విషయాల్లో లెక్కచేయకపోవడమే పెద్ద శిక్ష. దెబ్బకు దార్లోకి వస్తారు’ అని సురేఖ చెబుతున్న మాటలు నా చెవిన పడ్డాయి. నిజంగా సురేఖకు థ్యాంక్స్ చెప్పాలనిపించింది. ఎక్కడ ‘మీ అన్నయ్యా అలాంటి వాడే’ అని చెబుతుందోనని భయపడ్డాను. ఆరోజు వినయ మొహంలో ఏదో తెలియని ధైర్యం కనిపించింది. - కె. ఆనంద్‌సాయి, విశాఖపట్నం -
స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?
నేను ఇప్పుడు ఏడో నెల గర్భవతిని. డాక్టర్లు స్కాన్ చేయించమని చెప్పారు. అయితే ఇంతకు ముపును కూడా ఐదోనెలలో ఒకసారి స్కానింగ్ అయ్యింది. ఇలా తరచూ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించడం బేబీకి మంచిదేనా? తెలియజేయండి. - సురేఖ, హైదరాబాద్ గర్భవతులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. సాధారణంగా గర్భధారణ మొత్తం వ్యవధిని... మొదటి మూడు నెలలను మొదటి ట్రైమిస్టర్‌గా, రెండో మూడు నెలల కాలాన్ని రెండో ట్రైమిస్టర్‌గా, ఆఖరి మూడు నెలల కాలాన్ని మూడో ట్రైమిస్టర్‌గా విభజిస్తారు. ఒక్కో ట్రైమిస్టర్ ఒక్కోసారి చొప్పున కనీసం మూడు స్కానింగ్‌లైనా తీయించి చూడటం తల్లికీ, బిడ్డకూ మేలు చేసేందుకే. మొదటి ట్రైమిస్టర్లో అంటే 14 వారాల లోపు చేసే స్కానింగ్‌లో గర్భాన్ని నిర్ధారణ చేయడంతో పాటు లోపల ఎంతమంది బిడ్డలు ఉన్నారు (అంటే కవలలా లేక ఒకే బిడ్డా) అన్న విషయాలు తెలుస్తాయి. దాంతో పాటు బిడ్డ సైజ్, దాన్ని బట్టి ప్రవసం అయ్యే తేదీని కూడా ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. ఈ దశలో చేసే స్కానింగ్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం వచ్చే అవకాశాలను దాదాపు 50 శాతం నుంచి 60 శాతం వరకు అంచనా వేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల కొంతవరకు డౌన్ సిండ్రోమ్ వంటి రుగ్మతలనూ అంచనా వేసే అవకాశమూ ఉంది. ఇక రెండో ట్రైమిస్టర్లో అంటే... 20 వారాల సమయంలో చేసే స్కాన్‌ను ‘టిఫా’ స్కాన్ లేదా ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటరు. అంటే ప్రత్యేకంగా బిడ్డలోని ప్రతి అవయవం నిర్దిష్టంగా ఎలా ఉందో టార్గెట్ చేసి చూస్తారు కాబట్టి దీన్ని ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం కలిగే అవకాశాలను 80 శాతం వరకు కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. అందుకే మొదటి ట్రైమిస్టర్లో స్కాన్ చేయించకపోయినా... 18 నుంచి 20 వారాల సమయంలో తప్పకుండా స్కానింగ్ చేయించాలి. ఇక మూడో ట్రైమిస్టర్లో అంటే 34వ వారంలో పొట్టలో బేబీ పొజిషన్‌ను చూస్తారు. ఆ సమయంలో తీసే స్కాన్‌లో బిడ్డ తలకిందులుగా ఉంటే సాధారణ ప్రవసం అవుతుందన్నమాట. ఒకవేళ ఎదురుకాళ్లతో కనిపిస్తే అప్పుడు శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీసేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా భారతీయ ప్రమాణాలలో పుట్టినప్పుడు బిడ్డ బరువు 2.5 కిలోల నుంచి 2.8 కిలోల వరకు ఉంటుంది. బిడ్డ పెద్దదిగా ఉందా లేక చిన్నదిగా ఉందా అన్న విషయంతో పాటు ఉమ్మనీరు ఎలా ఉంది అన్న విషయం కూడా స్కాన్‌లో తెలుస్తుంది. దీన్ని బట్టి ఒకవేళ ఉమ్మనీరు తగ్గితే దానికి కారణాలు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు మాయ (ప్లాసెంటా) తీరుతెన్నులు కూడా తెలుస్తాయి. ఉదాహరణకు గర్భాశయముఖద్వారానికి (సెర్విక్స్‌కు) దగ్గరగా మాయ ఉండటాన్ని ప్లాసెంటా ప్రివియా అంటారు. నిజానికి ప్రసవంలో బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మాయ బయటకు రావాలి. కానీ ఒకవేళ ముందే మాయ బయటకు వస్తే అప్పుడు తల్లికి తీవ్రమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఇది బిడ్డకూ, తల్లికీ ప్రమాదకరమైన పరిస్థితే. అందుకే స్కానింగ్ ద్వారా ప్రసవం అయ్యే తీరును అంచనా వేసి, దానికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో కేవలం శబ్దతరంగాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌లో లాగా ప్రమాదకరమైన రేడియేషన్ తరంగాలను ఉపయోగించరు. ఈ శబ్దతరంగాలు ఎంత ప్రమాదరహితమైనవంటే... అవసరాన్ని బట్టి ఒక్కోసారి రోజూ డాప్లర్ స్కానింగ్ చేయించాల్సి రావచ్చు. అప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగించవని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నిరభ్యంతరంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే పుట్టబోయే బిడ్డ... ఆడా, మగా అని మాత్రం అడగవద్దు. అది మాత్రమే అభ్యంతరకరం. డాక్టర్ సుశీల వావిలాల ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
కాంగ్రెస్ విషపు కౌగిలిలో కొండా సురేఖ: అంబటి
-
డిసెంబర్ 9 ప్రకటనకు కట్టుబడి ఉండాలి: కొండా