
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికి తెలిసిందే. తన సినిమా అప్‌డేట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటాడు. తన కుటుంబంలో ఏదైన సంతోషకరమైన వార్త ఉన్నా కూడా దాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంటాడు. అప్పుడప్పుడు తనలో దాగి ఉన్న కవిని కూడా సోషల్ వీడియా వేదికగా బయటకు తీస్తుంటాడు. గతంలో ఆకాశం గురించి అద్భతమైన కవితను అందరిని ఆశ్చర్యపరిచాడు చిరంజీవి. ఇక తాజాగా తన భార్య పుట్టిన రోజు సందర్భంగా ఓ ‘చిరు’కవిత రాసి శుభాకాంక్షలు తెలిపాడు.
నేడు(ఫిబ్రవరి 18) సురేఖ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేస్తూ.. ‘నా జీవన రేఖ..నా సౌభాగ్య రేఖ..నా భాగస్వామి సురేఖ !’అంటూ ఆమెకు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. మంచి ప్రాసతో కూడిన ఈ కవితకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. చిరంజీవి ప్రస్తుతం యూఎస్ ట్రిప్‌లో ఉన్నాడు. సురేఖ బర్త్‌డే సెలబ్రేషన్స్ కోసమే ఈ ట్రిప్ వేసినట్లు తెలుస్తోంది. సురేఖ-చిరుల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment