
భోళా శంకర్ సినిమాను పూర్తి చేసుకున్న చిరంజీవి టూర్‌కు చెక్కేశాడు.

సతీమణి సురేఖతో కలిసి విమానంలో వెకేషన్‌కు బయల్దేరిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నాడు. క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.

ఇది చూసిన అభిమానులు.. మా దిష్టే తగిలేలా ఉంది బాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే చిరంజీవి.. 'భోళా శంకర్’ సినిమాలోని తన పాత్ర డబ్బింగ్‌ని పూర్తి చేశాడు.

ఈ విషయాన్ని చిరంజీవి తనే వెల్లడిస్తూ.. ‘‘భోళా శంకర్’ రూపుదిద్దుకున్న తీరు చాలా ఆనందంగా ఉంది.

ఈ ఫైర్ మాస్ ఎంటర్‌టైనర్ కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మీ క్యాలెండర్‌లను మార్క్ చేసుకోండి. థియేటర్స్‌లో కలుద్దాం’’ అంటూ డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో వదిలాడు.

ఈ సినిమా ఆగస్టు 11న థియేటర్లలోకి రానుంది.

ఈ చిత్రంలో కీర్తీ సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు.

మహతి స్వరసాగర్ సంగీతమందించాడు.

వెకేషన్ నుంచి తిరిగొచ్చాక గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రంలో నటించనున్నట్లు మెగాస్టార్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.

ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని చెప్పుకొచ్చాడు.