ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్: సురేఖ, సుస్మిత
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శనివారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దకుమార్తె సుస్మిత ఇవాళ ఉదయం ఫిల్మ్‌నగర్ దేవస్థానంలోని ఆంజనేయస్వామికి పూజలు జరిపించారు.
'ఫ్యాన్స్ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రతి సంవత్సరం ఆయన బాగుండాలని పూజలు చేస్తున్నారు. అందరూ బాగుండాలి. మా కుటుంబం ప్రతి అభిమానికి రుణపడి ఉంటాం' అని చిరంజీవి సతీమణి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. చిరు కుమార్తె సుస్మిత మాట్లాడుతూ...ఫ్యాన్స్ డాడీ బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. వారిందరికీ థ్యాంక్స్ అంటూ తెలిపింది.