susmitha
-
తనను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది: మెగాస్టార్ ట్వీట్ వైరల్
నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన వెబ్ సిరీస్ పరువు. జూన్ 14న ఓటీటీకి వచ్చేసిన ఈ సిరీస్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విష్ణు ప్రసాద్ లగ్గిశెట్టి, సుస్మిత కొణిదెల నిర్మించారు. ప్రస్తుతం జీ5లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌పై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర ట్వీట్ చేశారు.పరువు సీజన్-2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మెగాస్టార్ ట్వీట్ చేశారు. ఓ చక్కటి ప్లాన్‌తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై ఎమ్మెల్యే గారి పాట్లు. చివరకి ఈ జంట తప్పించుకుందా లేదా అనే విషయంపై చాలా ఎగ్జైటింగ్‌గా ఉందన్నారు. తెలుగు ఓటీటీలో అద్భుతమైన కంటెంట్ అందించిన సుష్మిత కొణిదెలను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. నా సోదరుడు నాగబాబు అద్బుతంగా నటించారని చిరంజీవి కొనియాడారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, మిత్ తివారి కీలక పాత్రలు పోషించారు.Congratulations #Paruvu team on the huge success👏. Proud of you @sushkonidela for creating this groundbreaking Telugu OTT content and my dear brother @NagaBabuOffl for a brilliant performance. ఒక చక్కటి plan తో చందు బాడీ మాయం చేసి, ఆ జంట పడే తిప్పలు, అదే విషయమై MLA గారి…— Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2024 -
ఆకలికి అలవాటుకి తేడా ఉంది ...ఇదో మైండ్‌గేమ్!
‘నా దేహం నా ఇష్టం. నాకు ఇష్టమైనవి తింటాను’... అనుకోవడంలో ఇతరులకు ఎటువంటి అభ్యంతరమూ ఉండాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో గౌరవంగా జీవించాలంటే మనం తినే ఆహారం ఆరోగ్యకరంగా ఉండాలి. వినడానికి విచిత్రంగా ఉన్నా సరే ఇది నిజం. ప్రతి ఒక్కరూ ‘పోషకాహారం తీసుకోవాలి, దేహానికి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. దానికి తగినట్లు వ్యాయామం చేయాలి’... దైనందిన జీవితం ఇలా క్రమబద్ధంగా ఉన్న వ్యక్తి ఆలోచనలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రవర్తన కూడా గౌరవపూర్వకంగా ఉంటుంది. స్థూలంగా చెప్పినా సూక్ష్మంగా చెప్పినా, విషయం ఏమిటంటే... ఆరోగ్యకరమైన దేహం ఆరోగ్యకరంగా ఆలోచిస్తుంది. మానసిక ఆరోగ్యంలో అపసవ్యతలు తలెత్తాయంటే అవి కేవలం మానసికం మాత్రమే కాదు, అసలైన సమస్య దేహంలోనే ఉంటుంది. దేహానికి అందుతున్న ఆహారంలోనే ఉంటుంది... అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితా గుప్తా ‘‘సమాజంలో మంచి వ్యక్తిగా చలామణి కావాలంటే మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యం. మానసిక ఆరోగ్యం మీద మన అలవాట్లు తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. మనకు తెలియకుండా చేసే పోరపాటు ఏమిటంటే ‘ఆకలి– అలవాటు’ మధ్య తేడా గుర్తించకపో వడం. ఆకలి లేకపో యినా అలవాటుగా తినడం, ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్నుంచి తప్పించుకోవడానికి ఆహారాన్ని ఆశ్రయించడం అనే దురలవాటు ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇటీవల ఎక్కువైంది. దైనందిన జీవితంలో ఒత్తిడి ఎక్కువైంది, జిహ్వను సంతృప్తిపరుచుకోవడానికి జంక్‌ఫుడ్ మీదకు మనసు మళ్లడం అనేది కూడా మన జీవనశైలిలో భాగమైపో యింది. నిజానికి మన మెదడు మనతో గేమ్ ఆడుతుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని తెలిసినప్పటికీ మనసు జంక్‌ఫుడ్ మీదకు మళ్లిస్తుంది. ఇదెలాగంటే... రేపటి నుంచి వ్యాయామం మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకుని అలారం పెట్టుకుంటాం. అలారం మోగినప్పుడు ఆపేసి మళ్లీ నిద్రపో తాం. మన జీవనశైలికి అనుగుణంగా మన మెదడులో మ్యాపింగ్ జరిగిపోయి.......ఉంటుంది. దాని నుంచి బయటపడడానికి మెదడు ఇష్టపడదు. ఆ కంఫర్ట్ జోన్ నుంచి మనల్ని కూడా బయటకు రానివ్వదు. అలాంటప్పుడు మనం మెదడు మాటను పెడచెవిన పెట్టడమే పరిష్కారం. మనల్ని మనం దురలవాట్ల నుంచి బయటేసుకోవాలంటే ఆ ప్రయత్నంలో మనల్ని వెనక్కి లాగే మెదడు చెప్పే మాటను వినకూడదు. ఆహారం– మానసిక అనారోగ్యం! మనం అలవాటుగా నిత్యం జంక్‌ఫుడ్‌తో పోట్టను నింపేస్తుంటే దేహం శక్తిహీనమవుతూ ఉంటుంది. అలసటతోపాటు ప్రతిదానికీ చిరాకు, ఆందోళన, ఆవేశపడడం వంటి లక్షణాలు తోడవుతాయి. మెదడు నుంచి నాడీ వ్యవస్థ ద్వారా దేహభాగాలకు అందాల్సిన సంకేతాల్లో అపసవ్యతలు తలెత్తుతాయి. ఒక విషయానికి సక్రమంగా ప్రతిస్పందించాల్సిన సందర్భంలో విపరీతంగా స్పందించడం వంటి మార్పులు కనిపిస్తాయి. మానవ సంబంధాలు దెబ్బతింటాయి. మానసిక సమస్యలు తీవ్రరూపం దాల్చినప్పుడు మాత్రమే మానసిక వైద్యుని సంప్రదిస్తుంటాం. ప్రతి ఒక్కరిలో సమస్య అంతటి స్థాయి తీవ్రతకు దారితీయదు. కానీ మధ్యస్థ దశ ఎక్కువమందిలో కనిపిస్తుంటుంది. ఈ సమస్యకు వైద్యం... మనం మంచి ఆహారం తీసుకోవడమే. బ్రెయిన్ మనతో ఆడుకుంటుంది, మనం బ్రెయిన్‌ని మన అధీనంలో ఉంచుకోగలగాలి. అదే దేహానికి–మెదడుకు సమగ్రమైన ఆరోగ్యం. మనం ఏమి తింటున్నామో దానిని బట్టే మనం ఏమిటో చెప్పవచ్చు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకువెళ్లగలిగితే సమాజం ఎదుర్కొంటున్న అనేక మానసిక రుగ్మతలను నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బంధాలతో అందమైన సమాజాన్ని నిర్మించడానికి నా వంతుగా చేస్తున్న ప్రయత్నమే ఇది’’ అన్నారు హెల్త్ సైకాలజిస్ట్ సుస్మితాగుప్తా – వాకా మంజులారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధి వార్థక్యం పోంచి ఉంటుంది బాడీ–మైండ్‌ని కలిపి ఒక యూనిట్‌గా పరిగణించాలి. ఒకటి ప్రమాదంలో పడితే రెండవది కూడా ప్రమాదంలో పడుతుంది. దేహం సమతుల ఆరోగ్యంతో ఉన్నప్పుడే మెదడు కూడా సంపూర్ణారోగ్యంతో ఉంటుంది. దేహానికి సంతులిత ఆహారం అందనప్పుడు తలెత్తే సమస్యలు మానసిక అపసవ్యతలు మాత్రమే కాదు వార్ధక్యం కూడా. త్వరగా వయసు మీద పడుతున్న వారిలో దేహానికి పో షకాహారం తగిన మోతాదులో అందకపో వడంతోపాటు చిన్న చిన్న మానసిక రుగ్మతలతో సతమతమైన నేపథ్యం కనిపించి తీరుతుంది. ఇది అంతర్జాతీయంగా నిర్వహించిన అధ్యయనం. జంక్‌ఫుడ్ కారణంగా ఎదురయ్యే సమస్య స్థూలకాయం మాత్రమే కాదు మానసిక అనారోగ్యాలు కూడా. దేహం లోపల ఇన్ఫ్లమేటరీ కండిషన్‌కు దారి తీస్తుంది. అది దేహం వార్థక్యం బారిన పడడానికి తొలి దశ. – సుస్మితా గుప్తా,హెల్త్ సైకాలజిస్ట్, ద క్యూర్ స్పేస్ -
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్.. గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్!
హోలీ వేడుకల్లో మెగా డాటర్స్ సందడి.. అలాంటి లుక్‌లో కనిపించిన టబు... అయోధ్య బాలరామున్ని దర్శించుకున్న అనన్య నాగళ్ల... గ్రీన్ శారీలో మిస్టర్ ప్రెగ్నెంట్ హీరోయిన్ హోయలు.. హోలీ వేడుకల్లో సందడి చేసిన మంచులక్ష్మి.. ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ పోజులు.. వేసవిలో చిల్ అవుతోన్న లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ View this post on Instagram A post shared by Varun Tej Konidela (@varunkonidela7) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Roopa Koduvayur (@roopakoduvayur_9) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Tabu (@tabutiful) View this post on Instagram A post shared by Sushmita (@sushmitakonidela) -
మెగా డాటర్‌కు స్పెషల్ విషెస్.. లావణ్య త్రిపాఠి, ఉపాసన పోస్ట్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురిగా సుస్మిత కొణిదెల అభిమానులకు తెలుసు. టాలీవుడ్లో కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహ రెడ్డి మూవీకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించింది. తక్కువ సినిమాలకే పని చేసినా టాలీవుడ్లో మంచి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు గడించింది. తాజాగా ఇవాళ చిరంజీవి పెద్దకూతురు, మెగా డాటర్ సుస్మిత కొణిదెల బర్త్ డే కావడంతో పలువురు ఇండస్ట్రీ తారలు విషెస్ చెబుతున్నారు. మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్ డే విషెస్ చెబుతూ తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటోలు షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మెగా డాటర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. -
మీరే నాకు ఎప్పటికీ ఆదర్శం: మెగాస్టార్ కూతురు ప్రశంసలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారం లభించింది. 75వ గణతంత్రం దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చిరంజీవికి పద్మ విభూషణ్ ప్రకటించింది. తెలుగు సినీ చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత ఈ ఘనత అందుకున్న నటుడిగా మెగాస్టార్ నిలిచారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు చిరంజీవికి అభినందనలు తెలిపారు. మెగా కోడలు ఉపాసన సైతం మామయ్యకు కంగ్రాంట్స్ చెబుతూ ట్వీట్ చేసింది. తాజాగా మెగాస్టార్ పెద్దకూతురు సుస్మిత శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేసింది. నాన్న మీరు ఒక స్ఫూర్తి, గౌరవం, ఆశీర్వాదం కూడా. పద్మవిభూషణ్ వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా అభినందనలు. అలాదే ఈ ఏడాదిలో పద్మ అవార్డులు దక్కించుకున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేసింది. Dad, you are an Inspiration, an honour and a blessing. #PadmaVibhushan Heartiest congratulations to all the Padma awards this year. @KChiruTweets pic.twitter.com/jT17b8hdZd — Sushmita Konidela (@sushkonidela) January 28, 2024 -
నిద్రలోనే కార్డియాక్ అరెస్ట్.. బాలింత కన్నుమూత
బిడ్డ పుట్టడంతో ఆ ఇంట ఆనందం వెల్లివిరిసింది. కానీ, ఆ ఆనందం ఐదురోజులకే ఆవిరైంది. బిడ్డకు చనుబాలు బట్టిన ఆ బాలింత నిద్రలోనే శాశ్వత నిద్రలోకి జారుకుంది. ఆ పసికందుకు శాశ్వతంగా దూరమైంది. వరంగల్: వరంగల్ సీకేఎం ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో శుక్రవారం ఉదయం తెల్లవారుజామున గుండెపోటుతో బాలింత మృతి చెందింది. కుటుంబసభ్యులు, వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బుస్స సుష్మిత (25) మొదటి కాన్పు ప్రసూతి వైద్యసేవల కోసం సీకేఎం హాస్పిటల్లో ఈనెల 13 చేరింది. ఆదే రోజు సిజేరియన్ ద్వారా మగశిశువుకు జన్మనిచ్చింది. శిశువు అనారోగ్యంగా ఉండడంతో నవజాత శిశువుల వార్డులోని ఇంక్యుబేటర్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నారు. తల్లి సుష్మితను ఐసీయూనుంచి 18న ప్రత్యేక వార్డుకు మార్చారు. శుక్రవారం ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో సుష్మిత వెళ్లి శిశువుకు పాలు పట్టించి వచ్చి నిద్రపోయింది. తిరిగి రెండు గంటల అనంతరం బాబుకు పాలుపట్టాలని తల్లి నిద్రలేపే ప్రయత్నం చేయగా కదలకపోవడంతో వైద్యులను సంప్రదించారు. డ్యూటీ వైద్యులు వెంటనే పరీక్షించి సీపీఆర్ నిర్వహించినప్పటికీ ఫలితం లేకపోయింది. నిద్రలో కార్డియాక్ అరెస్ట్ కావడంతో సుష్మిత మృతి చెందినట్లు సీకేఎం సూపరింటెండెంట్ డాక్టర్ నిర్మలకుమారి తెలిపారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
సుస్మితా సేన్ 'తాలి'.. ఆసక్తిగా ట్రైలర్
బాలీవుడ్ సీనియర్ నటి సుస్మితాసేన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన వెబ్ సిరీస్ 'తాలి'. ఈ చిత్రంలో సుస్మితాసేన్ ట్రాన్స్‌జెండర్‌గా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఈనెల 15 నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం భాషల్లోనూ రానుంది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన ట్రైలర్ అభిమానులలో మరింత ఆసక్తి పెంచింది. ఈ సిరీస్‌లో సుస్మిత.. ట్రాన్స్‌జెండర్ శ్రీగౌరీ సావంత్ పాత్రలో కనిపించనుంది. దేశంలోని ట్రాన్స్‌జెండర్స్ హక్కుల కోసం ఆమె ఎలా పోరాడిందో ఈ సిరీస్‌లో ప్రధానంగా చూపించనున్నారు. ట్రాన్స్‌జెండర్ పాత్రలో సుస్మితాసేన్ హావభావాలు ప్రేక్షకులను కట్టి పడేసేలా ఉన్నాయి. ఈ సందర్భంగా సుస్మితా సేన్ మాట్లాడుతూ..' ఈ కథ వినిగానే మరో ఆలోచన లేకుండా ఒప్పుకున్నా. కానీ ట్రాన్స్‌జెండర్ పాత్ర కోసం రెడీ కావడానికి దాదాపు ఆరున్నర నెలల సమయం పట్టింది. ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నప్పుడు పరిశోధన కూడా అవసరం. ట్రాన్స్‌జెండర్ హక్కుల కోసం పోరాటం చేసిన శ్రీగౌరి సావంత్ గొప్ప వ్యక్తి. ఆమె నాకు ఎంతో కనెక్ట్ అయ్యారు. ఆమెతో కలిసి కొన్ని రోజులు ఉండటం నాకు దక్కిన అదృష్టం.'అని అన్నారు. అయితే తన కథను సిరీస్‌గా తీయడం పట్ల శ్రీగౌరి కూడా సంతోషం వ్యక్తం చేశారు. -
నిర్మాతగా సుష్మిత
‘రంగస్థలం, సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితా కొణిదెల నిర్మాతగా మారారు. భర్త విష్ణుప్రసాద్‌తో కలసి ఆమె ‘గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. విష్ణు ప్రసాద్, సుష్మితాలతో కలిసి జీ5 సంస్థ ఓ వెబ్ సిరీస్‌ని నిర్మించనుంది. ఈ ప్రాజెక్ట్‌కి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో ప్రకాష్ రాజ్, సంపత్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సుష్మితా కొణిదెల మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామాగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. హైదరాబాద్‌లోని ఓ పోలీస్, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుల కథల ఆధారంగా ఈ సిరీస్ ఉంటుంది. మా గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలో నిర్మిస్తున్న తొలి వెబ్ సిరీస్ కోసం ఓటీటీ వేదిక ‘జీ5’తో అసోసియేట్ కావడం చాలా సంతోషంగా ఉంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సిరీస్ షూటింగ్ జరుగుతోంది’’ అన్నారు. -
భార్య గర్భిణి అని కూడా చూడకుండా..
కర్నూలు ,ఆళ్లగడ్డ: కట్టుకున్నోడే కాలయముడయ్యాడు. భార్య నిండు గర్భిణి అని కూడా చూడకుండా అతి కిరాతకంగా హత్య చేశాడు. పెళ్లయిన ఏడాదిలోపే ఈ దారుణానికి ఒడిగట్టాడు. శనివారం రాత్రి ఆళ్లగడ్డ పట్టణ శివారులో ఈ ఘటన జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన మేరకు వివరాలు.. బనగానపల్లె పట్టణానికి చెందిన సుంకన్న, లక్ష్మీదేవి దంపతుల కూతురు సుస్మిత (19). ఈ యువతి చిన్నతనంలోనే తల్లి మృతి చెందడంతో తండ్రి ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన మస్తానమ్మను రెండో పెళ్లి చేసుకున్నాడు. మారు తల్లి ఇంటికి వచ్చినప్పటి నుంచి సుస్మితను నానా ఇబ్బందులు పెట్టేది. భరించలేక ఆమె పిన్నమ్మ, తాతల దగ్గర ఉంటూ ఇంటర్ పూర్తి చేసింది. తర్వాత మస్తానమ్మ.. భర్తపై ఒత్తిడి చేసి సుస్మితను తన తమ్ముడు ప్రతాప్‌తో పెళ్లి జరిపించింది. చెడు ప్రవర్తన గల మారుతల్లి సుస్మితను కూడా ఆ వైపునకు మలిపేందుకు ప్రయత్నించేది. అందుకు అంగీకరించని ఆ యువతి వారితో కలిసి ఇంట్లో ఉండటం ఇష్టం లేక వేరే కాపురం పెడదామని భర్త ప్రతాప్‌కు వేడుకునేది. దీనిని జీర్ణించుకోలేని మారుతల్లి, అత్తామామలు సుస్మిత గురించి ప్రతాప్‌కు చెడుగా చెప్పేవారు. దీంతో సైకోగా మారిన అతను భార్యను హింసించేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి భార్యకు మాయమాటలు చెప్పి తన సొంత ఆటోలో ఎక్కించుకుని నల్లగట్ల –బత్తలూరు మార్గంలోని హైవే వద్దకు తీసుకుపోయాడు. అక్కడ అతి కిరాతకంగా భార్య చేతులు కట్టి నరాలు కోసి పక్కనున్న నీటి కుంటలో పడేసి పారిపోయాడు. ఆదివారం నిందితుడే తమ బంధువులకు పోను చేసి హత్య విషయం చెప్పడంతో వారు అక్కడికి వెళ్లి మృత దేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారమిచ్చారు. వెనువెంటనే వారు ఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బంధువులు ఫిర్యాదు మేరకు హతురాలి భర్త ప్రతాప్, బావ భాస్కర్, మారుతల్లి మస్తానమ్మ, అత్తామామలు లక్ష్మీదేవి, వీరయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రూరల్ ఎస్ఐ రమేష్‌కుమార్ తెలిపారు. -
ప్రేమ విఫలమై హిజ్రా ఆత్మహత్య
చెన్నై,అన్నానగర్: ఈరోడ్ సమీపంలో మంగళవారం ప్రేమ ఓటమి వల్ల హిజ్రా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈరోడ్ సమీపం మూలప్పాలైయమ్ వినాయకుడి ఆలయ వీధికి చెందిన మురుగేషన్ అనే సుస్మితా (22) హిజ్రా. ఈమె తన అమ్మ చిన్నపొన్నుతో నివసిస్తూ వచ్చింది. సుస్మితాకి, ఈరోడ్ వీరప్పన్ చత్రమ్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడితో పరిచయం ఏర్పడింది. తరువాత సుస్మితా ఆ యువకుడిని ప్రేమిస్తూ వచ్చింది. అనంతరం సుస్మితా, ఆ యువకుడి వద్ద తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసింది. కానీ ఆ యువకుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇందువల్ల సుస్మితా కొన్ని రోజులుగా మనస్తాపంతో బాధపడుతోంది. ఈ స్థితిలో మంగళవారం ఎవరు ఇంట్లో లేని సమయంలో సుస్మితా ఫ్యాన్‌కి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీన్నిచూసి దిగ్భ్రాంతి చెందిన ఆమె తల్లి, స్థానికుల సహాయంతో రక్షించి చికిత్స కోసం ఈ రోడ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్క డ పరిశోధన చేసిన డాక్టర్లు అప్పటికే సుస్మితా మృతి చెందినట్లుగా ధ్రువీకరించారు. -
‘సైరా’ సుస్మిత
-
‘సైరా’ సుస్మిత
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘సైరా’ నరసింహారెడ్డిలో వినియోగించిన ఆభరణాలను శనివారం పార్క్ హయాత్‌లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సైరాకు స్టైలిస్ట్, డిజైనర్‌గా పనిచేసిన చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె రూపొందించిన ఆభరణాల డిజైన్లను అనుసరించి మంగత్రాయ్ సంస్థ జ్యువెల్లరీని రూపొందించి అందించింది. వీటినే చిరంజీవి, నయనతారలు ధరించినట్లు సుస్మిత తెలిపారు. ఫ్యాషన్ సూత్ర సంప్రదాయం, ఆధునికత మేళించిన దుస్తులు, ఆభరణాలతో పాటు పలురకాల మహిళా ఉత్పత్తులతో ఏర్పాటు చేసి ‘సూత్ర ఫ్యాషన్ ఎగ్జిబిషన్’ తాజ్‌కృష్ణా హోటల్లో ప్రారంభమైంది. వర్థమాన నటి సలోనిజోషి (ఫలక్‌నుమా దాస్ ఫేమ్) ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ప్రారంభించింది. పండగల సీజన్ పురస్కరించుకుని వైవిధ్యమైన కలెక్షన్స్ అందుబాటులో ఉంచామని, ఎగ్జిబిషన్ ఈ ఆదివారంతో ముగుస్తుందని నిర్వాహకుడు ఉమేష్ మద్వాన్ తెలిపారు. భాగ్యనగరంలో ఆస్ట్రేలియా అందం మిస్ వరల్డ్ ఆస్ట్రేలియా టైలాకానన్ నగరంలో సందడి చేశారు. యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోషియేషన్ (వైఈఏ) ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రాడిసన్ హోటల్లో ‘టిప్స్ ఆన్ హెల్త్ నూట్రిషన్ అండ్ ఫిట్నెస్’ అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టైలా.... ఫిట్నెస్, న్యూట్రిషన్‌పై పలు సలహాలు ఇచ్చారు. -
గ్యాంగ్ వార్
సుదీప్, సందీప్, రాజు, సుస్మిత ముఖ్య తారలుగా ఆర్.ఎస్. సురేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆగ్రహం’. ఎస్ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ముంబైలో ఆవిష్కరించారు. ఆర్.ఎస్. సురేశ్ మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే గ్యాంగ్‌స్టర్ కథాంశమిది. ఇందులోని 5 ఫైట్స్ చాలా బాగుంటాయి. ‘ఆఫీసర్, సర్కార్ 3’ చిత్రాల సంగీత దర్శకుడు రవిశంకర్ అందించిన ఆర్ఆర్ మా సినిమాకి ప్రధాన ఆకర్షణ’’ అన్నారు. ‘‘పూర్తి యాక్షన్ అంశాలున్న చిత్రమిది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్‌గా నిర్మించాం. జూలైలో సినిమా విడుదల చేయనున్నాం’’ అన్నారు సందీప్ చెరుకూరి. మూర్తి ఆడారి, సంగీత దర్శకుడు రవి శంకర్ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. రామకృష్ణ. -
రాజకీయ నేపథ్యంలో...
సుదీప్, సందీప్, రాజు, సుస్మిత ముఖ్య తారలుగా ఆర్.ఎస్. సురేష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆగ్రహం’. ఎస్ఎస్ చెరుకూరి క్రియేషన్స్ పతాకంపై సందీప్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. ఆర్.ఎస్.సురేష్ మాట్లాడుతూ– ‘‘రాజకీయ నేపథ్యంలో రెండు గ్యాంగ్‌ల మధ్య జరిగే కథాంశమిది. ‘ఆఫీసర్, సర్కార్ 3’ చిత్రాలకు సంగీతం అందించిన రవిశంకర్ ఆర్.ఆర్ స్వరాలు మా సినిమాకి ప్రధాన ఆకర్షణ. యాక్షన్ సన్నివేశాలు మరో హైలైట్’’ అన్నారు. ‘‘పూర్తి స్థాయి యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అడారి మూర్తి నేతృత్వంలో ఈ చిత్రాన్ని చాలా ఫాస్ట్‌గా తెరకెక్కించాం. ఏప్రిల్ నెలాఖరులో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు సందీప్ చెరుకూరి. ఈ చిత్రానికి కెమెరా: ఎస్. రామకృష్ణ. -
వరకట్న దాహానికి అబల బలి
ప్రొద్దుటూరు క్రైం : ఒక్కగానొక్క కుమార్తె.. పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగింది.. ప్రభుత్వ ఉద్యోగమంటే వెంటనే అతనికి ఇచ్చి పెళ్లి చేశారు.. అయితే డబ్బు వ్యామోహంతో భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. ఈ వేధింపులను భరించలేక ఆమె ఉరి వేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ప్రొద్దుటూరులోని మిట్టమడివీధికి చెందిన పగిడికాల్వ సుస్మిత (23) శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎర్రగుంట్ల మండలం కదిరివారిపల్లెకు చెందిన క్రిష్టఫర్, మిలకమ్మ దంపతులకు కుమార్తె సుస్మిత, కుమారుడు సందీప్ ఉన్నారు. ఆమెకు 9 నెలల క్రితం ప్రొద్దుటూరులోని సేల్స్‌ట్యాక్స్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్న సునీల్‌తో వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు రూ.6 లక్షల నగదు, 10 తులాల బంగారు కట్నకానుకలుగా ఇచ్చారు. కొన్ని రోజులపాటు అతను భార్యను బాగా చూసుకున్నాడు. తర్వాత మద్యానికి బానిసై వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో పలుమార్లు ఆమె తల్లిదండ్రులకు చెప్పి బాధ పడేది. ‘ఎలాగోలా సర్దుకొని పోమ్మా’ అని వారు చెప్పేవారు. వారం రోజుల క్రితం బంధువుల వివాహం ఉండటంతో సుస్మిత ఎర్రగుంట్లకు వచ్చిందని, అదే చివరి చూపు అవుతుందనుకోలేదని తల్లిదండ్రులు రోదించారు. తెల్లవారుజామున ఫోన్ వచ్చింది శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరి వేసుకున్న సుస్మితను కుటుంబ సభ్యులు వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పారు. కాగా తెల్లవారుజామున 4.30 గంటలకు సునీల్ ఫోన్ చేసి ‘మీ కుమార్తె చనిపోయింది.. వెంటనే రావాలి’ అని అత్తామామలకు సమాచారం అందించాడు. దీంతో తల్లిదండ్రులతోపాటు బంధువులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు వచ్చారు. విగత జీవిగా పడి ఉన్న కుమార్తెను చూసి వారు బోరున విలపించారు. ‘పెళ్లై ఏడాదైనా కాలేదు.. అప్పుడే నూరేళ్లు నిండాయా తల్లీ’ అంటూ తల్లి రోదించింది. తమ కుమార్తెను భర్తే చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తన బిడ్డ బంగారు, డబ్బును కాజేశారని, ఉన్న ఆస్తిని కూడా బంధువులకు రాయించే ప్రయత్నం చేస్తుంటే సుస్మిత అడ్డు చెప్పిందని ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వారు వివరించారు. డీఎస్పీ విచారణ సుస్మిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మైదుకూరు డీఎస్పీ బీఆర్ శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐ వెంకటశివారెడ్డి జిల్లా ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని సందర్శించారు. ఈ సంఘటన ఎలా జరిగిందని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. తల్లి మిలకమ్మ ఫిర్యాదు మేరకు సుస్మిత భర్త సునీల్, అత్త, ఆడపడచుపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు -
రక్షణ కల్పించాలని ప్రేమ జంట వినతి
పశ్చిమ గోదావరి, వీరవాసరం: తమకు రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట ఆదివారం వీరవాసరం పోలీసులకు వినతిపత్రాన్ని అందచేశారు. వీరవాసరం మండలం రాయకుదురు గ్రామానికి చెందిన మట్టా నవీన్‌కుమార్ అదే గ్రామానికి చెందిన పిట్టా సుస్మిత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. శనివారం భీమవరం శివారు చిన రంగని పాలెంలో రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం వీరవాసరం పోలీస్ స్టేషన్‌కు వచ్చి సుస్మిత కుటుంబ సభ్యుల నుంచి వేధింపులు ఉన్నాయని, వారి నుంచి మాకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాల కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి వివాదాలు పెట్టుకోవద్దని నచ్చచెబుతామని ఎస్సై ఎన్.శ్రీనివాసరావు తెలిపారు. -
ప్రపంచం తలకిందులైనా!
ప్రపంచాన్ని చూపించేదే అమ్మ. ప్రపంచాన్ని కొత్తగా చూపించేది సుస్మితా అమ్మ. పెంచుకున్న ఆలీషాతో సుస్మిత ఇలా యోగా చేసింది. గర్భంలో నుంచి పుట్టక పోయినా, పెంచుకున్న బిడ్డ ఇంత పెద్దదైనా చూశారా గర్భానికి ఎంత దగ్గరగా హత్తుకుని యోగా చూసిందో. పిల్లల్ని కంటేనే కాదు తల్లులు అయ్యేది. పిల్లను అంటుకుని ఉంటేనే సుస్మిత అమ్మలాంటి అమ్మలం అవుతాం. సమాజం తలకిందులు థింక్ చేసినా ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోవచ్చు. తలకిందులుగా తపస్సు చేసినా ఇలాంటి తల్లిప్రేమ దొరకడం కష్టమే. -
ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్: సురేఖ, సుస్మిత
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శనివారం హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిరంజీవి సతీమణి సురేఖ, పెద్దకుమార్తె సుస్మిత ఇవాళ ఉదయం ఫిల్మ్‌నగర్ దేవస్థానంలోని ఆంజనేయస్వామికి పూజలు జరిపించారు. 'ఫ్యాన్స్ అందరికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్రతి సంవత్సరం ఆయన బాగుండాలని పూజలు చేస్తున్నారు. అందరూ బాగుండాలి. మా కుటుంబం ప్రతి అభిమానికి రుణపడి ఉంటాం' అని చిరంజీవి సతీమణి సురేఖ కృతజ్ఞతలు తెలిపారు. చిరు కుమార్తె సుస్మిత మాట్లాడుతూ...ఫ్యాన్స్ డాడీ బర్త్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరుపుకున్నారు. చాలా సంతోషంగా అనిపించింది. వారిందరికీ థ్యాంక్స్ అంటూ తెలిపింది.