
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురిగా సుస్మిత కొణిదెల అభిమానులకు తెలుసు. టాలీవుడ్‌లో కాస్ట్యూమ్స్ డిజైనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిరంజీవి ఖైదీ నంబర్ 150, రంగస్థలం, సైరా నరసింహ రెడ్డి మూవీకి ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించింది. తక్కువ సినిమాలకే పని చేసినా టాలీవుడ్‌లో మంచి కాస్ట్యూమ్ డిజైనర్‌గా పేరు గడించింది.
తాజాగా ఇవాళ చిరంజీవి పెద్దకూతురు, మెగా డాటర్ సుస్మిత కొణిదెల బర్త్ డే కావడంతో పలువురు ఇండస్ట్రీ తారలు విషెస్ చెబుతున్నారు. మెగా కోడళ్లు ఉపాసన, లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్ డే విషెస్ చెబుతూ తమ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఫోటోలు షేర్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు మెగా డాటర్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment