
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా చెర్రీ భార్యగా, వ్యాపారవేత్తగా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ నెల 20న తన పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ స్పెషల్‌గా విష్ చేశారు. 'క్లీంకార మమ్మీ' అంటూ కొత్త పేరుతో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.
అయితే తాజాగా నటుడు, కమెడియన్ భద్రం.. ఉపాసనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసనపై ప్రశంసలు కురిపించారు. ఆమె మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. కుటుంబ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ కొరకు లాఫ్టెడ్ థెరపీ కోసం ప్రత్యేకంగా ఓ సెషన్ నిర్వహించమని అడిగినప్పుడు మీకు ఫ్యామిలీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, కేరింగ్ అర్థమైందన్నారు. మీ ఫ్యామిలీతో పాటు మీ చుట్టూ ఉన్న వారి పట్ల అంతే కేరింగ్‌గా ఉంటూ.. వారు కూడా బాగుండాలని కోరుకున్నారని తెలిపారు. ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు భద్రం తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
Happy Happy Birthday @upasanakonidela Ma'am pic.twitter.com/2jQksINIpx
— భద్రం (@BhadramDr) July 20, 2024
Comments
Please login to add a commentAdd a comment