bhadram
-
ఉపాసనపై టాలీవుడ్ కమెడియన్ ప్రశంసలు.. ఎందుకంటే?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలతో సంబంధం లేకపోయినా చెర్రీ భార్యగా, వ్యాపారవేత్తగా ఎప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఈ నెల 20న తన పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్ స్పెషల్‌గా విష్ చేశారు. 'క్లీంకార మమ్మీ' అంటూ కొత్త పేరుతో బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు.అయితే తాజాగా నటుడు, కమెడియన్ భద్రం.. ఉపాసనకు ప్రత్యేకంగా బర్త్ డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా ఉపాసనపై ప్రశంసలు కురిపించారు. ఆమె మంచి మనసున్న వ్యక్తి అని కొనియాడారు. కుటుంబ సభ్యులు, సపోర్టింగ్ స్టాఫ్ కొరకు లాఫ్టెడ్ థెరపీ కోసం ప్రత్యేకంగా ఓ సెషన్ నిర్వహించమని అడిగినప్పుడు మీకు ఫ్యామిలీ పట్ల ఉన్న ప్రేమాభిమానాలు, కేరింగ్ అర్థమైందన్నారు. మీ ఫ్యామిలీతో పాటు మీ చుట్టూ ఉన్న వారి పట్ల అంతే కేరింగ్‌గా ఉంటూ.. వారు కూడా బాగుండాలని కోరుకున్నారని తెలిపారు. ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు భద్రం తన ట్విటర్లో పోస్ట్ చేశారు. Happy Happy Birthday @upasanakonidela Ma'am pic.twitter.com/2jQksINIpx— భద్రం (@BhadramDr) July 20, 2024 -
పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుకి కారణాలు వివరించిన కమెడియన్ డా.భద్రం
-
డాక్టర్ అయ్యాకే యాక్టర్ అయ్యాడు 'భద్రమ్"
నవ్వడం ఒక భోగం... నవ్వలేకపోవడం ఒక రోగం అనే మాట నిజమేనంటాడు ప్రముఖ నటుడు, కమెడియన్ భద్రం. సహజమైన హాస్యానికి మాత్రమే కాదు స్వచ్ఛమైన మనస్సుకు కూడా కేరాఫ్ అడ్రస్ భద్రమ్. చాలా మంది నటులు డాక్టర్అవ్వాలకుని యాక్టర్ అయ్యాను అంటారు. కానీ తను మాత్రం డాక్టర్ అయ్యాకేయాక్టర్ అయ్యాడు. శారీరక రుగ్మతలకు తన వైద్యంతోనూ, మానసిక సమస్యలకు తన హాస్యంతోనూ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో శారీరక, మానసిక ధృఢత్వాన్ని పెంచడానికి యోగా అత్యుత్తమమార్గం అంటున్న ఆయన ఆన్లైన్ వేదికగా లాఫర్ యోగాను పరిచయం చేస్తున్నారు. సాక్షి, సిటీబ్యూరో :తను తెరపైన కనిపిస్తే చాలు నవ్వుల పువ్వులు పూయిస్తాడు. గోదావరి యాసతో, స్వచ్ఛమైన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తాడు. ప్రతిరోజూ పండగే, పూరీజగన్నాథ్ జ్యోతిలక్ష్మీ, నానీ భలేభలే మగాడివోయ్, శర్వానంద్ మహానుభావుడు, శతమానంభవతి, వరుణ్‌తేజ్ మిçస్ట్టర్, ఒక్క అమ్మాయి తప్ప తదితర సినిమాల్లో కమెడియన్‌గా, నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హాస్యంలోనూ విభిన్న శైలితో తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. అయితే తెర వెనుక కూడా ఆసక్తికరమైన విధులే నిర్వర్తిస్తున్నాడు. ఎర్గనామిక్స్ స్పెషలిస్ట్... తనొక డాక్టర్ (ఫిజియోథెరపిస్ట్)... ఎర్గనామిక్స్లో స్పెషలిస్ట్ డాక్టర్. ధీర్ఘకాలికంగా కూర్చొని జాబ్ చేసే వారికి (సాఫ్ట్వేర్స్, అకౌంటెంట్స్, సిస్టమ్ ఆపరేటర్స్..)కు వచ్చే ఆరోగ్య సమస్యలకు ట్రీట్మెంట్ చేస్తుంటాడు. ఇందులో భాగంగా భద్రమ్ గూగుల్, ఇన్ఫోసిస్ లాంటి ప్రముఖ సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా పని చేశాడు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ఎర్గానామిక్స్ ట్రైనింగ్, వర్క్‌షాప్‌లను నిర్వహించాడు. ఇలా భిన్నమైన రెండు రంగాల్లో అటు శారీరకంగా ఇటు మానసికంగా సాంత్వన చేకూర్చడం తన అదృష్టంగా భావిస్తున్నానంటూన్నాడు భద్రమ్. వృత్తిపరంగా డాక్టర్‌గా,ప్రవృత్తిలో యాక్టర్‌గా ముందుకు సాగడం తనకు రెండు కళ్లలాంటివని అంటున్నాడు. ఆన్లైన్ వేదికగా లాఫర్ యోగా... మనిషికి ఆరోగ్యకరమైన జీవనం ఎంత అవసరమో ప్రస్తుత పరిస్థితులు వివరిస్తున్నాయి. చేతులు దాటాక ఆరోగ్య నియమాలు పాటించడం కన్నా ముందు నుంచే తగు జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం అని పరిస్థితులు నిరూపిస్తున్నాయి.. అందుకే ప్రతీఒక్కరికీ శారీరక, మానసిక ఆరోగ్యం పై అవగాహన కల్పించడమే సంకల్పంగా, ఆన్లైన్ వేదికగా లాఫర్ యోగాతో వస్తున్నాడు యోగా, స్ట్రెస్ థెరపిస్ట్ భద్రమ్. యోగాతో వచ్చే ఫలితాలు అందరికీ అందాలని, యోగాపై అవగాహన పెంచడమే తన ప్రయత్నమంటున్నాడు. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, శారీరక రుగ్మతలకు, బీపి, డయాబెటీస్, థైరాయిడ్, కీళ్లనొప్పులు, నిద్రలేమిలాంటి వాటికి యోగా మంచి ప్రత్యామ్నాయమని, ఈ కరోనా యుగంలో యోగా ఒక ఆరోగ్య సంరక్షణ అని అంటున్నాడు ఈ డాక్టర్. కొన్ని అనారోగ్య సమస్యలకు మెడిసిన్స్, మంచి ఆహరం ఎంత ముఖ్యమో యోగా కూడా అంతే అవసరం అంటున్నాడు. దీని కోసం థెరప్యుటిక్ యోగా ఎంతో ఉపకరిస్తుందని, ఇందులోని ప్రాణా యామం, ఆసనాలు, ముద్రలు స్వస్థతని కలిగిస్తాయని, రోగ నిరోధక శక్తిని పెంచుతాయంటున్నాడు. దీని పైన అవగాహన కోసం అందరికీ యోగా... అందరికీ ఆరోగ్యం... అనే 3 రోజుల ఆన్లైన్ కోర్స్‌ని నిర్వహిస్తున్నానన్నారు. అందరికి ఏదో రూపంలో ఇలా సేవ చేసుకోవడం ఆత్మ సంతృప్తిని ఇస్తుందని అంటున్నాడు ఈ డాక్టర్ కం యాక్టర్....! -
డాక్టర్ టు యాక్టర్
డాక్టర్ అవ్వబోయి యాక్టర్ అయ్యానని చాలా మంది అంటుంటారు. కానీ నిజంగానే ఓ డాక్టర్ యాక్టర్‌గా మారితే.. అందులోనూ కమేడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తే.. గొప్ప విషయమే కదా. ‘అల్లుడు గారు మామూలుగా లేరండీ..’, ‘అల్లుడు గారికి సరసం బాగా ఎక్కువండీ బాబూ..’ అంటూ మహానుభావుడు సినిమాలో జిడ్డేశ్ పాత్రలో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న హాస్యనటుడు భద్రం. డాక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, వృత్తిని కొనసాగిస్తూ ప్రవృత్తిలోనూ దూసుకుపోతున్న భద్రం... ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... రాజమండ్రిలో పుట్టి పెరిగాను. నాన్న గిరి యుగంధర్ నాయుడు కొన్ని చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్‌గా చేశారు. ఆ కోవలోనే నాకూ సినిమాలపై ఆసక్తి ఏర్పడింది. అయితే నాన్న సలహా మేరకు కెరీర్లో స్థిరపడాలని బెంగుళూర్లో ఫిజియోథెర పీ పూర్తి చేశాను. ఎర్గొనోమిక్స్ డాక్టర్‌గా హైదరాబాద్‌లో ప్రస్థానం ప్రారంభించాను. సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వృత్తిరీత్యా వచ్చే సమస్యలు పరిష్కరిస్తూ ఫిజియోథెరపీ చేసేవాడిని. ‘పూరి’ పిలుపు... మలుపు డాక్టర్‌గా రాణిస్తున్న తరుణంలో నా సన్నిహితుడి సలహా మేరకు నా ప్రతిభతో ‘లవ్ పెయిన్’ పేరుతో ఓ చిన్న వీడియో తీశాను. ఇది చాలామంది దర్శకులకు నచ్చింది. దర్శకుడు సుధీర్‌వర్మ సన్నిహితుడు ఫణి సహకారంతో ‘మ్యాంగో’ కంపెనీకి చేరువయ్యాను. ‘పెళ్లితో జరభద్రం’ పేరుతో షార్ట్‌ఫిల్మ్ తీశాం. ఇదే నా లైఫ్‌కి టర్నింగ్ పాయింట్‌గా మారింది. ఈ వీడియో చూసిన దర్శకుడు పూరి జగన్నాథ్ తన ఫేస్బుక్లో దీనిని పోస్ట్ చేసి.. ‘ఇలాంటి టాలెంటెడ్ పీపుల్ పరిశ్రమకు అవసరం. నన్ను కలవండి’ అని రాశారు. ఇది నా జీవితంలో మర్చిపోలేని సంఘటన. ‘జ్యోతిలక్ష్మి’తో స్టార్ట్.. పూరి జగన్నా«థ్ గారు చెప్పినట్టే ‘జ్యోతిలక్ష్మి’ చిత్రంలో బ్రోకర్ భద్రం పాత్రతో అవకాశమిచ్చారు. ఈ పాత్రకు మంచి స్పందన వచ్చింది. నేను చేసిన ‘పెళ్లితో జరభ్రదం’ షార్ట్‌ఫిల్మ్ వైరల్ అయి, దర్శకుడు మారుతి దగ్గర నుంచి పిలుపు వచ్చింది. ‘భలేభలే మగాడివోయ్’ చిత్రంలో ఆయన అవకాశమిచ్చారు. అలాగే దర్శకుడు సతీష్ వేగేశ్న ‘శతమానం భవతి’ చిత్రంలో గుర్తుండిపోయే పాత్ర ఇచ్చారు. అలా లోఫర్, ఎక్కడికిపోతావు చిన్నవాడా, ప్రేమమ్, పండగచేస్కో, డిక్టేటర్, వైశాఖం, గల్ఫ్ తదితర చిత్రాలతో సుమారు 50 సినిమాల్లో నటించాను. ‘జిడ్డేశ్’.. హిట్ ‘భలేభలే మగాడివోయ్’ తర్వాత నాకో టర్నింగ్ క్యారెక్టర్ ఇస్తానన్న డైరెక్టర్ మారుతి... ‘మహానుభావు డు’లో నాజర్‌కు సహాయకు డిగా జిడ్డేశ్ పాత్ర ఇచ్చారు. ఈ క్యారెక్టర్‌తో ప్రేక్షకుల కు మరింత దగ్గరయ్యా ను. నిర్మాత సి.కళ్యాణ్.. నా ప్రతిభను గుర్తించి ఆయన తెరకెక్కిస్తున్న రెండు చిత్రాల్లో అవకాశమిచ్చారు. దేవుడిచ్చిన వరం.. డాక్టర్‌గా వైద్యం అందిస్తూ, హాస్య నటుడిగా అందరినీ నవ్విస్తున్నాను. ఇది నాకు దేవుడిచ్చిన గొప్ప వరం. డాక్టర్‌గా, యాక్టర్‌గా జీవితం సాఫీగా సాగుతోంది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూతుర్ని పెళ్లి చేసుకున్నాను. అలనాటి హాస్యనటుడు అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం, అలీ నాకు స్ఫూర్తి. -
జెండా ఆవిష్కరిస్తూ కుప్పకూలిన హెడ్మాస్టర్
కథలాపూర్: కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం గంభీపూర్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే నావెల్టీ పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు భద్రం జెండా ఆవిష్కరిస్తూ కుప్పకూలి మృతి చెందారు. మంగళవారం ఉదయం నేతల చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి జెండాను ఆవిష్కరించబోతున్న క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలారు. ఆటోలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే ఆయన మృతిచెందారు. మృతుడు కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. -
పూరిని ఇంప్రెస్ చేసిన షార్ట్ ఫిలిమ్
-
భద్రంకు పూరి జగన్నాథ్ ఆఫర్
అవకాశం ఎప్పుడు ఎలా తలుపు తడుతుందో చెప్పలేం. మంచి అవకాశాలు అరుదుగా వస్తాయి. ఇప్పుడు అలాంటి ఛాన్సే భద్రం అనే యువకుడికి వచ్చింది. ఏకంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనకు తానుగా ఆఫర్ ఇచ్చారు. ఇంతకీ ఈ అవకాశం ఎలా వచ్చిందంటే... 'పెళ్లితో జర భద్రం' అంటూ ఆ యువకుడు ఒక షార్ట్ ఫిల్మ్ రూపొందించాడు. పెళ్లైన తర్వాత జీవితం ఎలావుందో ఇందులో ఏకరువు పెట్టాడు. భార్యా బాధితుడిగా తన హావభావాలతో బాధను వెళ్లబోసుకున్నారు. పెళ్లి మాత్రం చేసుకోవద్దంటూ హితవు చెప్పాడు. అక్కడితో ఆగకుండా ఈ షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ లో పెట్టాడు. పూరి జగన్నాథ్ ఈ వీడియోను చూడడమే కాకుండా తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. నీలాంటి నటుడు నాకు కావాలంటూ సందేశం పంపారు. తనను కలవాలని లేకుంటే వివరాలు పంపాలని భద్రంకు ఫేస్బుక్ మెసేస్ పెట్టారు. వర్థమాన నటుడికి పూరి జగన్నాథ్ అవకాశం ఇవ్వడాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల.. భద్రంకు అభినందనలు తెలిపారు. -
హత్యలు చేస్తోందెవరు?
విల్లా ఫేం అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా రమేశ్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘తెగిడి’. ఈ చిత్రం ‘భద్రమ్’ పేరుతో ఈ నెల 21న తెలుగులో విడుదల కానుంది. శ్రేయాస్ మీడియా, పుష్యమి ఫిలిమ్ మేకర్స్ కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. తమిళనాట గొప్ప విజయం సాధించిన సినిమా ఇదని రామకృష్ణారెడ్డి చెప్పారు. ‘‘వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు? అనే ఉత్కంఠ భరిత కథాంశంతో ఈ చిత్రం రూపొందింది’’ అని శ్రేయాస్ శ్రీను తెలిపారు. ఇంకా సహ నిర్మాత డి.ఉమాదేవి, ఎస్కేఎన్లతోపాటు మల్టీ డైమన్షన్ వాసు, టి.ఆర్.సత్యనారాయణ, దశరథరామిరెడ్ది తదితరులు మాట్లాడారు. -
ఉత్కంఠ రేపే భద్రమ్
‘‘వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఒకటే ఉత్కంఠ. క్లైమాక్స్ దాకా కారణం అర్థం కాదు. ఊహించని మిస్టరీ. అందుకే కథకు తగ్గట్టు ‘భద్రమ్’ అని టైటిల్ పెట్టాం. కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్పడమే ఈ టైటిల్‌కి అర్థం’’ అని నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ అన్నారు. అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా రమేష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘తేగిడి’. ఈ చిత్రాన్ని ‘భద్రమ్’ పేరుతో పుష్యమి ఫిలింమేకర్స్ బి.శ్రీనివాసరెడ్డితో కలిసి శ్రేయాస్ శ్రీను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ -‘‘సాంకేతికంగా సినిమా ఉన్నంతంగా ఉంటుంది. ప్రసన్న నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం’’ అన్నారు. -
ఉత్కంఠ రేపే భద్రమ్
‘‘వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేస్తున్నారు? ఒకటే ఉత్కంఠ. క్లైమాక్స్ దాకా కారణం అర్థం కాదు. ఊహించని మిస్టరీ. అందుకే కథకు తగ్గట్టు ‘భద్రమ్’ అని టైటిల్ పెట్టాం. కేర్‌ఫుల్‌గా ఉండమని చెప్పడమే ఈ టైటిల్‌కి అర్థం’’ అని నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ అన్నారు. అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా రమేష్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం ‘తేగిడి’. ఈ చిత్రాన్ని ‘భద్రమ్’ పేరుతో పుష్యమి ఫిలింమేకర్స్ బి.శ్రీనివాసరెడ్డితో కలిసి శ్రేయాస్ శ్రీను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రేయాస్ శ్రీను మాట్లాడుతూ -‘‘సాంకేతికంగా సినిమా ఉన్నంతంగా ఉంటుంది. ప్రసన్న నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణం’’ అన్నారు. -
ఉత్కంఠను రేకెత్తించే భద్రమ్
అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా రమేష్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘తేగడి’. ఈ చిత్రం ‘భద్రమ్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. బి.రామకృష్ణారెడ్డితో కలిసి శ్రేయాస్ శ్రీను, ఎస్కేఎన్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నివాస్ ప్రసన్న స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. గోిపీచంద్ మలినేని, సుధీర్‌బాబు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని మారుతికి అందించారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన సందీప్‌కిషన్, డా.దశరథరామిరెడ్డి, ‘డార్లింగ్’స్వామి, అభిరామ్, రాహుల్, శ్రావ్య, తుమ్మలపల్లి రామసత్యనారాయణ సినిమా విజయం సాధించాలని ఆకాక్షించారు. తమని నమ్మి ‘తేగడి’ అనువాద హక్కులు అందించిన చిత్ర నిర్మాత సీవీఆనంద్కి కృతజ్ఞతలని, ఆద్యంతం ఉత్కంఠగా సాగే థ్రిల్లర్ చిత్రమిదని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: బి.సుధారెడ్డి.