జెండా ఆవిష్కరిస్తూ కుప్పకూలిన హెడ్మాస్టర్
Published Tue, Jan 26 2016 12:43 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM
కథలాపూర్: కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం గంభీపూర్‌లో గణతంత్ర వేడుకల సందర్భంగా విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే నావెల్టీ పబ్లిక్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు భద్రం జెండా ఆవిష్కరిస్తూ కుప్పకూలి మృతి చెందారు. మంగళవారం ఉదయం నేతల చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి జెండాను ఆవిష్కరించబోతున్న క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలారు. ఆటోలో ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేయగా, అప్పటికే ఆయన మృతిచెందారు. మృతుడు కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.
Advertisement
Advertisement